Congress Party
-
కేసీఆర్‌కు కవిత లేఖ.. ఆది శ్రీనివాస్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో ముసలం తారాస్థాయికి చేరుకుందని.. కల్వకుంట్ల కవిత రాసిన లేఖతో లుకలుకలు బయటపడ్డాయంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందంటూ మేం చెబుతున్న మాటలను కవిత సమర్థించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ సిద్దమతున్నారని కవిత చెప్పకనే చెప్పింది. బీజేపీపైన పల్లెతు మాట మాట్లాడకుండా.. కేసీఆర్ వ్యవహరించిన తీరును కవిత కడిగి పారేసింది’’ అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.‘‘భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయి. బీఆర్ఎస్ బలహీనపడటం వల్లనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లు కవిత అంగీకరించారు. కవిత పచ్చి నిజాలు మాట్లాడారు.. ఆ మాటలనే మేం చాలా కాలంగా చెబుతున్నాం. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నియంతృత్వ వైఖరిని కూడా కవిత నిలదీశారు. పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఒక్కరే ప్రసంగించడాన్ని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ వైఖరిని ఆయన కూతురే తప్పుపడుతోంది. ఇక ప్రజలకు వాళ్లేమీ సమాధానం చెబుతారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని కవిత తేల్చి చెప్పింది’’ అని ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.‘‘పార్టీ నాయకులను కలవకుండా ఏకపక్ష పోకడలకు పోతున్నారని ఆమె ధ్వజమెత్తారు. కవిత లేఖ పైన బీఆర్ఎస్ నాయకత్వం స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలి. మా సీఎం రేవంత్ రెడ్డి మీద ఒంటి కాలిపైన లేస్తున్న కేటీఆర్ ముందు తన చెల్లికి సమాధానం చెప్పాలి. కవితకు సమాధానం చెప్పకుండా ఇతర పార్టీలను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు. కల్వకుంట్ల కుటుంబంలో లుకలుకలు ఉన్నాయి. అలిగిన హరీష్ రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ బతిమాలుకున్నాడు...కవిత లేఖతో బీఆర్ఎస్ పార్టీ ఇద్దరికి మాత్రమే పరిమితం అయిందని తేలింది. గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన దోపిడి గురించి కూడా కవిత ప్రశ్నిస్తే బాగుంటుంది. పంపకాలు, పదవుల్లో తేడా వచ్చి కుటుంబంలో లేఖలు రాసుకుంటున్నారు. బీఆర్ఎస్ పని ఇక అయిపోయింది. కేటీఆర్.. ముందు నీ ఇళ్లు సరిదిద్దుకో. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్‌లోనే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యాడు. కేసీఆర్ తీరును ఆయన కూతురే తప్పుపడుతోంది.. ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి.’’ అంటూ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. -
‘సీఎం రేవంత్ పనైపోయింది.. అదొక లొట్టపీసు కేసు’
సాక్షి, తెలంగాణ భవన్: లొట్టపీసు కేసులతో సీఎం రేవంత్ చేసేది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణాలు, ఇతర అంశాలపై మాట్లాడారు. ‘తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బ్యారేజ్‌లో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారు. టైమ్ పాస్ కోసమే కమిషన్ నోటీసులు పంపింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు అందాయో? లేదో? తెలియదు. కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుంది.మిస్ వరల్డ్ ప్లెక్సీలో రేవంత్ రెడ్డి ,బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు ఫొటోలు ఉన్నాయి. వీరిలో ఎవరు మిస్ వరల్డో అర్థం కావడం లేదు. కమిషన్లు దండుకోవడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది.కేసీఆర్ వరంగల్‌కు కదలగానే ఈ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అందుకే కమిషన్ నోటీసుల పేరుతో డైవర్ట్ పాలిటిక్స్ చేసేందుకు సిద్ధమయ్యారు.కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజం నిలకడగా తెలుస్తుంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనైపోయింది. లొట్టపిసు కేసులతో ఏం కాదు. కోటిమంది మహిళలను కోటీశ్వరలను చేస్తామని అంటున్నారు. అవి అలవికాని హామీలు. ప్రతిపక్షంలో ఉంటూ రేవంత్ నిద్ర పట్టకుండా చేస్తున్నాం. ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని నిలదీస్తున్నాం’ అని అన్నారు. జూన్ ,జూలైలో బీఆర్ఎస్ నూతన మెంబర్షిప్ ప్రారంభమవుతుంది. ఆ తరువాత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి కట్టుగా చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్ధేశం చేశారు. -
సీఎం రేవంత్‌రెడ్డిది పర్సంటేజీ పాలన: కేటీఆర్
నల్లగొండ టూటౌన్: ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం కుట్ర పూరితంగా ఇచ్చే నోటీసులకు, విచారణలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. నల్లగొండ పట్టణంలో బుధవారం ఓ వివాహానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని, పర్సంటేజీల పాలన అని విమర్శించారు. కమీషన్లు ఇవ్వనిదే ఈ ప్రభుత్వంలో పనులు కావని స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలే బహిరంగ వేదికలపైనే చెబుతున్నారని అన్నారు. 20 శాతం, 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు రాష్ట్ర సచివాలయంలోనే ధర్నా చేశారని గుర్తుచేశారు. ఈ కమీషన్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కమిషన్ల ఏర్పాటు, నోటీసులు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇది దద్దమ్మ ప్రభుత్వం: ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ విమర్శించారు. ‘ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయి గురువారానికి మూడు నెలలు పూర్తవుతుంది. అందులో చనిపోయినవారి శవాలను కూడా తీసుకురాలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటివరకు విచారణ లేదు. అందుకు కారణమైన సంస్థపై చర్యలు లేవు. కాంగ్రెస్ వచ్చాక వట్టెం పంపుహౌస్ మునిగింది. పెద్దవాగు రెండుసార్లు కొట్టుకుపోయినా చర్యలు లేవు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా ప్రచారం చేస్తున్నా ప్రజలకు వాస్తవాలు తెలుసు. దేశంలో చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద తమకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఎన్ని నోటీసులు ఇచ్చినా న్యాయం, ధర్మమే గెలుస్తుంది. తెలంగాణకు మేలు చేసినవారిని ఆ దేవుడే కాపాడుతాడు. ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీలు అమలు చేసేంతవరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు’అని తేల్చి చెప్పారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
కేసీఆర్‌కు నోటీసులపై కేటీఆర్ రియాక్షన్
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చూపించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని.. అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు(Notices To KCR) జారీ అయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(Kalvakuntla Rama Rao) అన్నారు. పాలన చేతకాక ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని మండిపడ్డారాయన. రేవంత్ సర్కార్(Revanth Sarkar)కు కమీషన్లు తప్ప.. పాలన చేత కాదు. ప్రజాపాలన కాస్త పర్సంటేజీల పాలనగా మారింది. 20 నుంచి 30 శాతం కమీషన్లు, పర్సంటేజీలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వంలో ఏ పని జరగదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా చెపుతున్నారు. తమ అవినీతి కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) నోటీసుల డ్రామా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది. అందులో భాగంగానే ఈ నోటీసులు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ఓ చిల్లర ప్రయత్నం. ఇలా ఎన్నో నోటీసులు ఇచ్చినా దుదీ పించల్లా ఎగిరి పోతాయి. కమిటీల పేరుతో, కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ.. ఆరు గ్యారంటీల(Six Guarantees) అమలును పక్కనపెడదామనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను చూస్తూ ఊరుకోబోం. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి’’ అని కేటీఆర్ అన్నారు. ఇదీ చదవండి: కేసీఆర్ చట్టానికేమైనా అతీతుడా? -
తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు: మల్లు రవి వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయన్నారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదే సమయంలో ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లారు.. కేసీఆర్ చట్టానికి అతీతులా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఎంపీ మల్లు రవి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయి. ముగ్గురు కలిసి ప్రజా ప్రభుత్వం మళ్ళీ రాకుండా కుట్ర చేస్తున్నారు. వీళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజా ప్రభుత్వమే వస్తుంది. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టానికి అతీతులా?. ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళారు. బీహార్‌లో లాలు ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లలేదా?. కేసీఆర్, హరీష్, ఈటల.. కమిషన్ ముందు హాజరు కావాలి. నోటీసులు అందకపోవడానికి మనం ఏమైనా అమెరికాలో ఉన్నామా?. విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ తప్పు చేశారు. ఇప్పుడైనా కాళేశ్వరం కమిషన్‌కు సహకరించాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌పై ఈడీ సంచలన ఆరోపణ
సాక్షి, ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా రూ.142 కోట్లు ఆదాయాన్ని సోనియా, రాహుల్ గాంధీ వాడుకున్నారని తెలిపింది. నిందితులు నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారని పేర్కొంది.నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ అంశంపై ఢిల్లీ ప్రత్యేక కోర్టులో బుధవారం జరిగిన విచారణలో భాగంగా ఈడీ వాదన వినిపించింది. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా రూ.142 కోట్లు ఆదాయాన్ని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వాడుకున్నారని ఈడీ తెలిపింది. AJLకి రూ.50 లక్షలు చెల్లించి యంగ్ ఇండియన్ కంపెనీ రూ.90.25 కోట్లు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సుమన్ దూబే , సామ్ పిట్రోడా నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. సోనియా, రాహుల్ యంగ్ ఇండియన్ కంపెనీలో 76% వాటాను కలిగి ఉన్నారు.నిందితులు నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తి నుండి వచ్చే అద్దె కూడా తీసుకున్నారు. నిందితులు నేరం చేయడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. నవంబర్ 2023లో ఆస్తులను అటాచ్ చేశాం. నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంపాదించినప్పుడు, వారు ఆదాయాన్ని తమ వద్దే ఉంచుకోవడం కూడా మనీలాండరింగ్‌గా పరిగణించాలి. ఈ క్రమంలో వచ్చిన డబ్బులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయి. ప్రాథమికంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేశాం’ అని చెప్పుకొచ్చింది.మరోవైపు.. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాపై ఈడీ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టులో అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోందని జూలైకి విచారణకు వాయిదా వేయాలని కోరారు. సింఘ్వీ అభ్యర్థనను అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వ్యతిరేకించారు.The Rouse Avenue Court began hearing the National Herald money laundering case. Notices were issued to Sonia Gandhi, Rahul Gandhi, Sam Pitroda, and others.Special counsel for ED, Zoheb Hossain submitted that the property derived from any criminal activity is a proceed of crime.…— ANI (@ANI) May 21, 2025ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ అధికారులు గతంలో పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ.. ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఈ కేసులో 2023, నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. -
ఎవరి పనితీరు ఏంటో నివేదికల్లో ఉంది
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మీ ఆలోచనలేంటో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఎమ్మెల్యేలకు ఉన్న ప్రజాసంబంధ అవసరాలు, బాధలు వినేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖిలో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన నాగర్‌కర్నూల్, మెదక్, మల్కాజ్గిరి పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అయితే, గతంలో మాదిరి కాకుండా ఈసారి ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా భేటీ అయినట్టు తెలిసింది. ప్రతీ ఎమ్మెల్యేతో 10–15 నిమిషాలపాటు మాట్లాడిన రేవంత్.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను వినడంతోపాటు వారికి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం... ముఖాముఖి భేటీలో భాగంగా వారి పనితీరు గురించి రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఎవరి పనితీరు ఏంటో తన దగ్గర ఉన్న నివేదికలు చెబుతున్నాయని, ఎవరెవరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో, ఎవరు ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్నారో తనకు తెలుసునని, పనితీరు మార్చుకోవాల్సిన వారు వెంటనే మారితే మంచిదని, లేదంటే తాను కూడా ఏమీ చేయలేనని హెచ్చరించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు వస్తాయని, ఆ నివేదికల ఆధారంగానే పార్టీ ముందుకెళ్తుందని కూడా చెప్పినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ తీర్చే బాధ్యత తనపై ఉందని, ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఎమ్మెల్యేలకు చెప్పారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకురావాలని, కాంగ్రెస్ నుంచి గెలిచిన ప్రతి ఎమ్మెల్యే తనకు సమానమేనని, అందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. నల్లమల డిక్లరేషన్ సహా అన్నింటినీ అమలు చేస్తానని చెప్పారు. ఒక్కసారి గెలవడం గొప్ప కాదని, రెండోసారి, మూడోసారి గెలిచేలా ప్రజలను ఆకట్టుకోవడంలోనే ఎమ్మెల్యేల పనితీరు తెలుస్తుందని, రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు అసలు రాజకీయం ఏంటో అర్థమవుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. సీఎంతో భేటీ అయిన వారిలో వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, గద్వాల ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఉన్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్ అమెరికా పర్యటనలో ఉండటంతో భేటీలో పాల్గొనలేదు. -
‘అఖిలపక్షం వేళ’ అనైక్యత!
దేశం కోసం సమష్టిగా కదలాల్సిన సందర్భాల్లో సైతం కలవలేనంతగా అధికార విపక్షాలు ఎడ మొహం పెడమొహంగా మారాయి. పెహల్గామ్లో గత నెల 22న ఉగ్రవాదులు సాగించిన మారణ కాండ మొదలు మన ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్, ఈ నెల 10న కాల్పుల విరమణ, పాకిస్తాన్ దురాలోచనలూ వగైరా ప్రపంచానికి తెలియజెప్పేందుకు అధికార, విపక్ష ఎంపీలతో ఏర్పాటు చేసిన ఏడు అఖిలపక్ష బృందాల కూర్పు ప్రక్రియ వివాదాస్పదంగా మారటం దీన్ని చాటుతోంది. మన దేశంనుంచి సమష్టి స్వరం వినబడితే దాని ప్రభావం వేరుగా వుంటుంది. పాకిస్తాన్ సైతం ఇదే తరహాలో అఖిలపక్ష ప్రతినిధి బృందాలను పంపటానికి సన్నాహాలు చేసుకుంటున్నది. కనీసం ఇందుకోసమైనా విభేదాలు పక్కనబెట్టి ఒక్కటై నిలబడదామన్న స్పృహ అటూ ఇటూ కరువవుతోంది. ఏ దేశంలోనూ ఇలా వుండదు. అమెరికాలో ప్రపంచ వాణిజ్య కేంద్రం (డబ్ల్యూటీసీ)పై ఉగ్రదాడి మొదలు ఇందుకు ఎన్నయినా ఉదాహరణలివ్వొచ్చు. ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరుతో అమెరికా అఫ్గాన్‌ను వల్లకాడు చేసింది. చివరకు ఒరిగిందేమీ లేదు. అఫ్గాన్‌నుంచి అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. అయినా అక్కడి విపక్షం మౌనంగా ఉండిపోయింది. కానీ ఇక్కడలా కాదు. యూపీఏ హయాంలో ముంబైపై ఉగ్రదాడి, దానికి వెనకాముందూ జరిగిన అనేకానేక ఉదంతాల్లో మన దేశంలో అధికార పక్షంపై విపక్షం విరుచుకుపడటం, యక్షప్రశ్నలు వేసి ఇరుకున పడేసే ప్రయత్నం చేయటం రివాజుగా మారింది. యూపీఏ హయాంలో బీజేపీ విపక్షంలోవుండి ఏం చేసేదో, ఇప్పుడు కాంగ్రెస్ సైతం ఆ పనే చేస్తోంది. పుల్వామా ఉగ్రదాడి సమయంలో మరీ దారుణం. జవాన్ల త్యాగాలూ, వారు దెబ్బకు దెబ్బ తీసిన వైనమూ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో చర్చనీయాంశంగా మారటం ఆశ్చర్యపరిచింది. ఈ ఉదంతాలను బీజేపీ తనకను కూలంగా మలుచుకునే ప్రయత్నం చేయగా, ప్రభుత్వ వైఫల్యంపై విపక్షం చాటింపు వేసింది. అయితే మన దేశంలోనూ ఒకప్పుడు అధికార, విపక్షాలు కలిసికట్టుగా పనిచేసిన ఉదంతాలు లేకపోలేదు. ఇందుకోసం ఎన్నడో 1971 నాటి భారత్–పాక్ యుద్ధం వరకూ పోనవసరం లేదు. 1994లో కశ్మీర్‌పై భారత్ వైఖరిని వివరించటానికి నాటి ప్రధాని పీవీ నరసింహారావు రూపొందించిన అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహించింది అప్పటి విపక్ష నేత అటల్ బిహారీ వాజపేయి! పాతికేళ్ల క్రితం కార్గిల్ యుద్ధ సమయంలో నాటి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమూ, కాంగ్రెస్‌తోసహా విపక్షాలూ దేశభద్రత కోసం కలిసికట్టుగా పనిచేశాయి. కానీ ఇప్పుడెందుకు పరస్పరం తప్పులు వెదుక్కొనే తాపత్రయాన్ని ప్రదర్శిస్తున్నట్టు? దేశంలో తక్షణం వచ్చే ఎన్నికలేమీ లేవు. అయినా పెహల్‌గామ్‌ను రాజకీయంగా వినియోగించుకోవటానికి అటూ ఇటూ పోటీపడుతున్నారు. త్రివిధ దళాల అధికార ప్రతినిధులు చెప్పేవరకూ ఆగకుండా ఇష్టానుసారం ఉన్నవీ లేనివీ ప్రచారం చేసి, విపక్షాలను పాకిస్తాన్ అనుకూలురుగా, దేశద్రోహులుగా చూపటానికి బీజేపీ శ్రేణులూ, సాను భూతిపరులూ చేయని ప్రయత్నం లేదు. తొలి ప్రధాని నెహ్రూ ఉదారంగా పాకిస్తాన్‌కు నదీజలాలు, భారీయెత్తున సొమ్ము కట్టబెట్టారని బీజేపీ నేతలు ఇంకా ఆరోపణలు గుప్పిస్తూనే వున్నారు. ఒకపక్క అఖిలపక్షాన్ని పంపుతూ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? వీటిని ఎలా ఎదుర్కొనాలో తెలియక ఇష్టానుసారం మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు చులకనవుతున్నారు. యుద్ధ విమానాలు ఎన్ని కూలాయి... మనవైపు జరిగిన నష్టమెంత అంటూ రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ఇవి అడగకూడని ప్రశ్నలేమీ కాదు... కానీ అందుకు తగిన వేదికను ఎంచుకోవాలని కూడా ఆయనకు తోచదు. ఇంతకూ అఖిలపక్ష బృందాల కూర్పుపై ఇంత వివాదం ఎందుకొచ్చినట్టు? విపక్షాలను విశ్వా సంలోకి తీసుకుని, వారు పంపిన పేర్లనుంచి ఎంపికచేసే కనీస మర్యాద అధికార పక్షం పాటించివుంటే సమస్య తలెత్తేది కాదు. విపక్షానికి ఆలోచించే శక్తిసామర్థ్యాలు లేవన్నట్టు సర్కారు ప్రవర్తించింది. కాంగ్రెస్ పార్టీ నలుగురు సభ్యుల పేర్లు పంపితే వారిలో ఒక్కరినే ఎంపిక చేసింది. పోనీ సర్కారు ఎంచుకున్నది కూడా సమర్థుల్నే కదా అనే సర్దుబాటు ధోరణి కాంగ్రెస్‌కు లేదు. అసలు ఆ పార్టీ నుంచి వెళ్లిన జాబితాలో సల్మాన్ ఖుర్షీద్, శశిథరూర్, మనీష్ తివారీ తదితరుల పేర్లు ఎందుకు లేకుండా పోయినట్టు? సీనియర్ నేత ఖుర్షీద్‌ను ఎంపిక చేసిన ప్రభుత్వం తీరా ఆయన సీనియారి టీని కాదని జేడీ(యూ) నేత సంజయ్ ఝాకు సారథ్య బాధ్యతలు ఎందుకిచ్చినట్టు? సమష్టి స్వరం వినబడాల్సిన ఈ సమయంలో ఇన్ని లుకలుకలుండటం మంచిదేనా? ఇంత రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ చివరకు ఈ వివాదాన్ని పొడిగించదల్చుకోలేదని చేతులెత్తేసింది. కానీ ఎప్పుడూ వీరంగం వేసే అలవాటున్న తృణమూల్ మాత్రం ప్రభుత్వం ఎంపిక చేసిన సభ్యుణ్ణి తప్పుకోమని చెప్పింది. దాంతో ప్రభుత్వం తగ్గి ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ సూచించిన నేతకు స్థానం కల్పించింది. అఖిలపక్షం పంపటంలోని ఉద్దేశమే సమష్టితత్వాన్ని, ఈ దేశ సంకల్పాన్ని, పాకిస్తాన్ కుయుక్తులను చాటడానికైనప్పుడు సభ్యుల ఎంపిక వివాదాస్పదం కాకుండా ప్రభుత్వం చూడాల్సింది. ఈమధ్య ఆపరేషన్ సిందూర్ మొదలుకొని పార్టీ వైఖరికి భిన్నంగా పలు ప్రకటనలిస్తూ సంచలనం సృష్టిస్తున్న శశిథరూర్‌ను కాంగ్రెస్ ఎంపిక చేయకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన్ను ఏరికోరి ఎంపిక చేయటం కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టడానికేనన్న విషయంలో ఎవరికీ సందేహం అక్కర్లేదు. ఏదేమైనా ఇలాంటి సంక్షోభ సమయాల్లో అవసరమైన సంయమనం, హుందాతనం ఇరువైపులా కనబడకపోవటం దురదృష్టకరం. -
కాంగ్రెస్ మిమ్మల్ని అవమానిస్తోందా?.. ఎంపీ శశి థరూర్ రియాక్షన్ ఇదే
ఢిల్లీ: ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాల్లో ఎండగట్టేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష నేతల్లో కేంద్ర ప్రభుత్వం తనను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సమర్థించుకున్నారు. తాను కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏ రాజకీయ కోణంలో చూడడం లేదు. ఇది దేశానికి సేవ చేయాల్సిన సమయం’ అని స్పష్టం చేశారు.ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ తీరును ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ దేశాల్లో ఎండగట్టడానికి, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో ఏడు బృందాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రతిపాదించిన నాలుగు పేర్లను పక్కనపెట్టి, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్‌ను ఎంపిక చేయడం సంచలనాత్మకంగా మారింది. అంతేకాకుండా ఓ బృందానికి శశి థరూర్ నేతృత్వం వహిస్తారని ప్రకటించడం గమనార్హం. ఈ ఎంపికపై శశిథరూర్ స్పందించారు. ‘మాజీ విదేశాంగ వ్యవహారాల శాఖ అనుభవం కారణంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తాను ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని అడిగారు. కిరణ్ రిజిజు అడిగిన వెంటనే నేను అందుకు అంగీకరించాను. ఇది దేశ సేవకు సంబంధించింది. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఒక పౌరుడిని సహాయం కోరితే ఇంకేం సమాధానం ఇవ్వాలి?అని ప్రశ్నించారు. తాను తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందా? అన్న ప్రశ్నకు ఆ విషయం పార్టీకి, కేంద్రానికి సంబంధించింది. మీరు కాంగ్రెస్‌ను అడగాలి’ అని సూచించారు. పార్టీ మిమ్మల్ని అవమానించిందా? అన్న ప్రశ్నకు.. నన్ను అంత తేలికగా అవమానించలేరు. నా విలువ నాకు తెలుసని సమాధానమిచ్చారు. దేశంపై దాడి జరిగినప్పుడు, అందరం ఒకే స్వరం వినిపించడం, ఐక్యతగా నిలబడటం దేశానికి మంచిది. కేంద్రం ఆయనను దేశ ప్రతినిధిగా ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని పైలట్ పద్ధతిలో భూముల రీసర్వేకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ ప్రోగ్రామ్ (డీఐఎల్ఆర్ఎంపీ) మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రోన్లు లేదా ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో ఈ సర్వే సోమవారం నుంచి నిర్వహించనుంది.ఇందుకోసం ఆయా గ్రామాల్లో 4–5 రోజులుగా భూముల సరిహద్దుల నిర్ధారణ జరుగుతుండగా రేపట్నుంచి సర్వే బృందాలు అక్కడకు వెళ్లనున్నాయి. ముందుగా మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్, జగిత్యాల జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి (కొత్త), ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ గ్రామాల్లోనే సర్వే నిర్వహించాలనుకున్నా ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం సాహెబ్‌నగర్, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామాలను కూడా కలిపారు. ఈ ఐదు గ్రామాల్లో పైలట్ సర్వే నిర్వహించేందుకు మూడు ఏజెన్సీలను ఎంపిక చేశారు. భూముల రీసర్వేను సర్వే, సెటిల్మెంట్ శాఖ పర్యవేక్షించనుంది.గ్రామ పటాలు, కమతాల పటాల తయారీ.. భూముల రీసర్వేకు ప్రస్తుతం ఎంపిక చేసిన ఐదు గ్రామాల పటాలతోపాటు ప్రతి కమతానికి సరిహద్దులు నిర్ధారించి ఆయా కమతాల పటాలు కూడా రూపొందించనున్నారు. ఇందుకోసం ఆ గ్రామంలో ఎంత భూమి ఉంది.. ఎన్ని సర్వే నంబర్లున్నాయనే వివరాల ఆధారంగా సర్వేయర్లను మోహరించి ప్రతి సర్వే, బైసర్వే నంబర్లలోని కమతాలకు విడివిడిగా పటాలను తయారు చేయనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో అందుబాటులో ఉన్న ఛెస్సలా, ఖాస్రా పహాణీ రికార్డులతో వాటిని సరిపోల్చి వివాదాల్లేని కొత్త పటాలను రెవెన్యూ రికార్డుల్లో చేర్చనున్నారు. ఈ గ్రామాల్లో ఎదురయ్యే అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే మార్గదర్శకాలు తయారవుతాయని సర్వే శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ గ్రామానికి నక్ష లేదు! భూముల రీసర్వే కోసం ప్రభుత్వం ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లోని రెండు గ్రామాల స్థితిగతులపై ‘సాక్షి’క్షేత్రస్థాయి సమాచారం సేకరించింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్ గ్రామాల్లో పరిస్థితుల గురించి స్థానిక రెవెన్యూ యంత్రాంగాన్ని అడిగి తెలుసుకుంది. ములుగుమడ గ్రామం తొలుత బ్రిటిష్ పాలన అమలైన నాటి ఆంధ్ర ప్రాంతంలో ఉండేది. అలాగే నిజాం పాలించిన తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుత కంచికర్ల మండలంలో ఉన్న పరిటాల అనే గ్రామం ఉండేది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సరిహద్దుల మార్పుల్లో భాగంగా పరిటాలను గుంటూరు జిల్లాలో చేర్చి ములుగుమడను ఖమ్మం జిల్లాలో చేర్చారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించాక కూడా ములుగుమడ తెలంగాణకే వచ్చింది.అయితే, భూరికార్డుల ప్రక్షాళన జరిగే వరకు ఆ గ్రామంలో భూముల రికార్డులు సెంట్ల రూపంలోనే ఉండేవి. గుంటలు, ఎకరాలుగా ఉండేవి కావు. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత దాన్ని గుంటల్లోకి మార్చారు. కానీ ఆ గ్రామ నక్షను అప్పటి నుంచి ఇప్పటిదాకా తయారు చేయలేదు. దీంతో ములుగుమడ గ్రామానికి అధికారికంగా గ్రామ సరిహద్దులే లేకుండా పోయాయి. ఇప్పుడు ఈ గ్రామాన్ని పైలట్ సర్వే కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. మొదటగా స్థానిక రెవెన్యూ యంత్రాంగం గ్రామ సరిహద్దులను నిర్ధారించింది. ఈ మేరకు గ్రామ నక్షను కూడా తయారు చేయనున్నాయి. ఈ గ్రామంలో మొత్తం 103 సర్వే నంబర్లకు 845 ఎకరాల వరకు భూమి ఉంది.ఈ భూమిలోని ప్రతి కమతాన్ని సర్వే, బైసర్వే నంబర్లవారీగా రీసర్వే నిర్వహించి ఆయా కమతాల హద్దులు నిర్ధారించి పటాలు తయారు చేయనున్నారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్ అనే గ్రామానిక నక్షతోపాటు ఇతర రెవెన్యూ రికార్డులన్నీ ఉన్నాయి. ఈ గ్రామంలోనూ ఇతర గ్రామాలతో సరిహద్దులను గుర్తించారు. ఈ గ్రామంలో 122 సర్వే నంబర్లలో 422 ఎకరాల భూమి ఉంది. సోమవారం నుంచి ఈ భూమిని కమతాల వారీగా సర్వే నిర్వహించి హద్దుల నిర్ధారణ ద్వారా కమతాలవారీగా పటాలు రూపొందించనున్నారు. ఏమవుతుందో... ఏమో? భూముల రీసర్వే విషయంలో రెవెన్యూ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తెలంగాణలో నెలకొన్న భౌగోళిక పరిస్థితులు, రెవెన్యూ రికార్డులను బట్టి సర్వే జరిపితే ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో సమస్యలు వస్తాయని అంటున్నారు. ఈ విషయమై ఓ తహసీల్దార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘ఓ గ్రామంలోని 311 సర్వే నంబర్లో 200 ఎకరాలకు రికార్డు ఉంది. కానీ ఆ సర్వే నంబర్లో 300 ఎకరాల భూమి ఉంది. ఆ మేరకు రైతులకు 300 ఎకరాలకు పాసుపుస్తకాలున్నాయి.కానీ, రెవెన్యూ రికార్డును మార్చలేకపోతున్నాం’అని అన్నారు. మరోవైపు భూకబ్జా ఓ సర్వే నంబర్లో ఉంటే రికార్డు మరో సర్వే నంబర్లో ఉంటుందని.. రాష్ట్రంలోని మొత్తం భూముల్లో 35–40 శాతం భూములకు ఇదే సమస్య వస్తుందన్నారు. రీసర్వేలో ఇదే విషయం తేలితే ఆయా గ్రామాల్లోని రికార్డులు, రైతుల పాసుపుస్తకాలన్నింటినీ మార్చాల్సి వస్తుందని చెప్పారు. రీసర్వే సులభమైనప్పటికీ అనంతరం ఎదురయ్యే సమస్యల పరిష్కారమే పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌పై భారత్ ప్రారంభించిన దౌత్య యుద్ధం కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ తీరును ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ దేశాల్లో ఎండగట్టడానికి, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో ఏడు బృందాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రతిపాదించిన నాలుగు పేర్లను పక్కనపెట్టి, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్‌ను ఎంపిక చేయడం సంచలనాత్మకంగా మారింది. అంతేకాకుండా ఓ బృందానికి శశి థరూర్ నేతృత్వం వహిస్తారని ప్రకటించడం గమనార్హం. కాంగ్రెస్‌కు, థరూర్‌కు మధ్య ఇటీవల దూరం పెరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ పట్ల ఆయన సానుకూలంగా మాట్లాడుతుండడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. ఏడు బృందాలకు సారథ్యం వహించే నేతల పేర్లను కేంద్రం ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మీడియా ఇన్చార్జి జైరామ్ రమేశ్ స్పందించారు. తాము ప్రతిపాదించని వ్యక్తిని ఎంపిక చేయడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు రాహుల్ గాందీతో మాట్లాడారు. విదేశాలకు పంపించే ప్రతినిధి బృందాల్లో నియమించడానికి నలుగురు ఎంపీల పేర్లను ప్రతిపాదించాలని కోరారు. దాంతో రాహుల్ గాంధీ మా పార్టీ నుంచి ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, సయ్యద్ నజీర్ హుస్సేన్, అమరీందర్‌సింగ్ రాజా వారింగ్ పేర్లను ప్రతిపాదిస్తూ కిరణ్ రిజిజుకు లేఖ రాశారు’’అని జైరామ్ రమేశ్ చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్‌కు దూరం! శశి థరూర్ వైఖరి కొన్ని నెలలుగా కాంగ్రెస్ పారీ్టలో చర్చనీయాంశంగా మారుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తు న్నారు. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్య చేసుకోవడం పట్ల బీజేపీని విపక్షాలన్నీ తప్పుపట్టగా, శశి థరూర్ మాత్రం వెనుకేసుకొ చ్చారు. ఆయన లక్ష్మణ రేఖ దాటారని కాంగ్రెస్ నాయకు లు మండిపడ్డారు. కానీ, ఒక భారతీయుడిగా తన సొంత అభిప్రాయాలు వెల్లడించానని, తన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు సంబంధం లేదని థరూ ర్ వివరణ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తో శశి థరూర్ వేదిక పంచుకున్నారు. తమను ఒకే వేదికపై చూసి కొందరికి నిద్ర పట్టదని కూడా ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గొప్ప గౌరవంగా భావిస్తున్నా: థరూర్ అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తనకు కల్పించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చెప్పారు. ‘‘నా సేవలు అవసరమని కేంద్రం భావిస్తే అందుకు సిద్ధంగా ఉన్నా. దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం నా వంతు సేవలు కచ్చితంగా అందిస్తా.. జైహింద్’’అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
‘హరీష్ పై కేటీఆర్‌కు ఎందుకంత ప్రేమో..’
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందంటూ ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని స్పష్టం చేసిన రామచంద్రనాయక్.. ఎప్పుడూ లేని విధంగా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లడమే ఉదాహరణగా చెప్పుకొచ్చారు.‘పార్టీ ప్లీనరీ సమయంలో హరీష్ రావు కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయనకు అంత సీను లేదని చెప్పారు. రెండు గంటలకు పైగా హరీష్ రావుతో చర్చలు జరిపారు. గతంలో ఎప్పుడూ హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లలేదు.హరీష్ రావు ఇంట్లో గతంలో పంక్షన్ జరిగినా కేటీఆర్, ఆయన కుటుంబం దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు సడన్‌గా హరీష్ రావు పైన కేటీఆర్‌కు ఎందుకంత ప్రేమ వచ్చిందో చెప్పాలి. హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. కల్వకుంట్ల కవిత ఇప్పటికే పార్టీ కి వ్యతిరేకంగా బహిరంగంగా విమర్శలు చేస్తున్నాడు. తన మీద దుష్పచారం జరుగుతోందని, దాని వెనుక ఎవరున్నారో తనకు తెలుసునని కవిత అంటోంది. మొత్తంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్యపోరు జరుగుతోంది. రాజకీయ ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్నారు. హరీష్ రావు తో చర్చల మతలబు ఏమిటో ప్రజలకు కేటీఆర్ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.హరీష్‌రావు నివాసానికి కేటీఆర్హరీష్రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు హరీష్‌తో భేటీ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన హరీష్ రావు తండ్రి ఆరోగ్య వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. కోకాపేట హరీష్‌రావు నివాసంలో సమావేశమైన ఇరువురు నేతలు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారంపై సైబర్ సెల్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాను పార్టీ లైన్ దాటనని ఇటీవల హరీష్‌రావు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్‌రావు మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించిన కానీ.. పని చేస్తానని హరీష్‌రావు తెలిపారు. వరంగల్ సభ తర్వాత పార్టీలో హరీష్‌రావు ప్రాముఖ్యత తగ్గిందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మండిపడుతోంది. దీంతో నేరుగా హరీష్ రావుతో మాట్లాడి సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేటీఆర్ సమావేశమైనట్లు సమాచారం. -
‘సీఎంకు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు’
హైదరాబాద్: రాష్ట్రం దివాలా తీసిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి వర్గం అసంతృప్తిగా ఉందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఈ రోజు(శుక్రవారం) మీడియాతో చిట్ చాట్ లో భాగంగా మాట్టాడుతూ.. ‘ సీఎం రేవంత్ కు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు ఉన్నాయి. అందుకే సీఎం కామెంట్స్ ను మంత్రులు ఎవరూ సమర్థించలేదు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రెండుగా చీలిపోయింది. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు బాధపడుతున్నారు. మంత్రి వర్గ విస్తరణను సీఎం రేవంత్ అడ్డుకుంటున్నారు. కొత్తగా వచ్చేవారు సైతం వ్యతిరేకంగా ఉంటారని సీఎం రేవంత్ భావన. అందుకే గందరగోళ నివేదికలు హైకమాండ్ కి పంపి అడ్డుకుంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎక్కడ బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సి వస్తుందోనని జగన్నాటకం ఆడుతున్నారు. రేవంత్ లోపాలు, తప్పిదాలు అన్ని హైకమాండ్ దగ్గర ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే సీఎంను మార్చాలని హైకమాండ్ ఎదురుచూస్తోంది’ అని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
‘సురేఖ వ్యాఖ్యల ఎఫెక్ట్.. రేవంత్ కమీషన్ల సంగతేంటి?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రులు కమీషన్లు తీసుకోకుండా సంతకాలు చేయరు అని మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. దీంతో, ఆమె వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ఏయే మంత్రి ఎంత కమీషన్లు తీసుకున్నారో దర్యాప్తు చేపట్టాలని రేవంత్ సర్కార్‌ను డిమాండ్ చేశారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కొండా సురేఖ మంత్రులు కమిషన్లు తీసుకోవడం కామన్ అనడం బాధాకరం. అంటే రాష్ట్రంలో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని ఒప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇదే డిమాండ్ చేస్తున్నాం. ఏయే శాఖ మంత్రి ఎంత తీసుకున్నారో దర్యాప్తునకు ఆదేశించాలి. మంత్రులు తీసుకున్న కమీషన్లు బయట పెట్టాలి అని వ్యాఖ్యలు చేశారు.రాజకీయాలకు అతీతంగా తిరంగా యాత్ర..ఇదే సమయంలో తిరంగా యాత్రపై మాట్లాడుతూ.. పహల్గాం ఘటనలో 26 మందిని ఉగ్రమూకలు హతమార్చారు. మానవత్వం లేకుండా పిల్లల ముందు తండ్రిని, భార్య ముందు భర్తను పేర్లు అడిగి హతమార్చారు. మానవ సమాజానికే సవాల్ గా మారిన ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్లో 9 ఉగ్రవాద స్థావరాలను పేల్చివేశాం. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేయడం జరిగింది. ఉగ్రవాద చర్యలతో మనదేశం బలవుతూనే ఉంది. జమ్ముకశ్మీర్‌లోనే 46 వేల మందిని ఉగ్రమూకలు బలితీసుకున్నాయి. మన సైనికులు నూతన చరిత్రను ప్రారంభించారు.గతంలో ఉగ్రమూకలు దాడి చేసినప్పుడు.. మరణించినవారి ఫోటో దగ్గర గులాబీ పువ్వు పెట్టడం వరకే పరిమితం అయ్యే వాళ్ళం. 2009లో 40 మందిని ఊచకోత కోశారు. భారత్‌పై దాడి చేస్తే ప్రతీకారం ఎలా ఉంటుందో చూపించాం. ఉగ్రవాదుల శిక్షణ కార్యక్రమాలు, ఉగ్రవాదుల నివాసాలను ధ్వంసం చేశాం. కరడుకట్టిన ఉగ్రవాదులను అంతం చేశాం. పాకిస్తాన్ పిల్ల చేష్టలతో దాడికి ఒడిగట్టింది.. భారత సైన్యం తిప్పికొట్టింది. ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. ఇంకా కొనసాగుతోంది. రక్షణ రంగంలో ప్రతి సైనికుడు రాణించారు. S-400, బ్రహ్మాస్త్రం పనితీరు దేశ ప్రజలు గమనించారు. భారత ఆర్మీకి అన్ని రకాలుగా సమకూర్చడం జరిగింది.ఆర్మీకి అవసరమైన వాటిలో 35 శాతం మనమే సమకూర్చుకున్నాం. మిథానీ, DRDAలో వసతులు మెరుగు పరుస్తున్నాం. ఆర్డినెన్సు ఫ్యాక్టరీలను మరింత సంసిద్ధం చేసుకున్నాం. పాకిస్తాన్‌ను ప్రపంచం ముందు దోషిగా నిలబెడతాం. భారత సైనికులు అనుసరించిన స్ట్రాటజీని ప్రపంచం మొత్తం చూసింది. రాజకీయాలకు అతీతంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆహ్వానిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. -
‘కొండా సురేఖకు నా అభినందనలు’: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఏ పనిచేయరంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘కనీసం ఇప్పటికైనా కొన్ని నిజాలు బయట పెట్టినందుకు మంత్రి కొండా సురేఖకు నా హృదయపూర్వక అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘కమీషన్ సర్కార్’గా మారిపోయింది. ఇది రహస్యమే కాదు. ఓపెన్ సీక్రెట్. అంతేకాదు, ఈ ప్రభుత్వంలో ఫైల్స్‌పై సంతకం చేసేందుకు మంత్రులు, వారి సహచర మంత్రులు 30శాతం కమిషన్ తీసుకుంటున్నారు. ఇదే కమిషన్ల వ్యవహరంలో సచివాలయంలో పలువురు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన విషయం గుర్తుందా? అని ప్రశ్నించారు. ఆ ఘటనే ఈ ప్రభుత్వంలో మంత్రుల కమిషన్ల భాగోతాన్ని బహిర్గతం చేసింది. ఈ సందర్భంగా కొండా సురేఖని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల వివరాల్ని బయటపెట్టాలి. ప్రజల ముందు బహిర్ఘతం చేయాలని అన్నారు. ఇదే అంశంపై రాహుల్ గాంధీ,రేవంత్‌రెడ్డిలు వారి సొంత కేబినెట్ మంత్రి చేసిన ఆరోపణలపై మీరు దర్యాప్తుకు ఆదేశించగలరా?’అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. Many congratulations to Minister Konda Surekha garu for finally speaking some truths!Congress in Telangana runs a “commission sarkaar”, and it's unfortunate this has become an open secret in TelanganaIn this 30% commission government, ministers, according to their own… https://t.co/3dMd2yDfb5— KTR (@KTRBRS) May 16, 2025 -
మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పనిచేయరూ అంటూ ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. వరంగల్‌లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో రూ.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.‘నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైల్స్ వస్తుంటాయి. మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేస్తుంటారు. నేను అలా చేయను.. సమాజ సేవే చేయమంటాను. నాకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పా. స్కూల్ డెవలప్మెంట్ చేయమని కోరా’ అని వ్యాఖ్యానించారు. అయితే, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. నేను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ.. అయితే, తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం కావడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. ‘నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. నేను వరంగల్‌లో చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. ప్రతి ఫైలుకు డబ్బులు తీసుకున్నారో లేదో గత ప్రభుత్వంలోని మంత్రులకు తెలుసు. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారు. నేను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్‌లను కావాలని ట్రోల్ చేస్తున్నారు. మా కేబినెట్ మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని కొందరు కుట్ర చేస్తున్నారు. పని చేస్తున్న మంత్రులపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక్కో మెట్టు ఎక్కి మంత్రినయ్యాను నాపై తప్పుడు ప్రచారాలు చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టను. గత ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా? ఎక్కడికి వస్తారో రండి’ అంటూ సవాల్ విసిరారు. -
ఆపరేషన్ సరే.. పహల్గాం నిందితులు చనిపోయారా?: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్ష కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌తో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. భారత దాడుల్లో మరణించింది ఎవరు?. పహల్గాంలో దాడి చేసిన వారు మృతుల్లో ఒక్కరైనా ఉన్నారా?. సరిహద్దులో ఎందుకు భద్రత లేదు?. పహల్గాం ఘటన జరిగిన తర్వాత వారు ఎలా తప్పించుకున్నారు? అని ప్రశ్నలు సంధించారు.కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోతూర్ మంజునాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్ భారత్‌కు ఎలాంటి ప్రయోజనం అందించలేదు. ఈ ఆపరేషన్‌లో ఏమీ చేయలేదు. కేవలం గొప్పగా చూపించుకోవడానికే ఇదంతా చెబుతున్నారు. ఓ నాలుగు విమానాలు సరిహద్దులు దాటి వెళ్లి.. మళ్లీ తిరిగి వచ్చాయి. అంతే తప్ప ఇంకేమీ జరగలేదు. భారత దాడుల్లో మరణించిన వారు ఎవరు?. పహల్గాంలో దాడి చేసిన వారు మృతుల్లో ఎవరైనా ఉన్నారా?. అధికారులు ఒకటి చెబితే.. టీవీలు మరొకటి చెబుతున్నాయి. మరొకరు ఇంకేదో అంటున్నారు. మనం ఎవరిని నమ్ముతాము? అధికారిక ప్రకటన ఎక్కడ?’ అని ప్రశ్నించారు.అలాగే, భారత్ దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎవరు నిర్ధారించారు?. మన సరిహద్దును దాటిన ఆ ఉగ్రవాదులు ఎవరు? వారి గుర్తింపు ఏంటి? సరిహద్దులో ఎందుకు భద్రత లేదు? వారు ఎలా తప్పించుకున్నారు? ఉగ్రవాద మూలాలు, శాఖలను గుర్తించి వాటిని నిర్మూలించాలి. పహల్గాం ఘటన పూర్తిగా నిఘా వైఫల్యమే. పహల్గాం దాడి బాధితుల కుటుంబాలకు న్యాయం చేయడంలో కేంద్రం విఫలమైంది. పహల్గాం బాధితులకు కేంద్రం పరిహారం ఇచ్చిందా?. కర్ణాటక, పాకిస్తాన్, చైనా లేదా బంగ్లాదేశ్‌లో ఎక్కడైనా పౌరులపై జరిగే దాడులను మేము వ్యతిరేకిస్తాం’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ‘ఆపరేషన్ సిందూర్’లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పారు. పాక్ దాడులు చేస్తే తిరిగి దాడులు చేస్తామని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. భారత్.. నూర్ఖాన్, రఫీకీ, షోర్కోట్, మురిద్, సుక్కోర్, సియాల్కోట్, పసురూర్, చునియన్, సర్గోదా, భోలారీ, జకోబాబాద్‌లో దాడులు చేసింది. దాడికి ముందు.. తర్వాత ఇక్కడినుంచి సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో నష్టం తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జకోబాబాద్‌లోని షాబాజ్ బేస్ చాలావరకు ధ్వంసమై కనిపిస్తోంది. ఇక భారత పదాతి దళం జరిపిన దాడిలో నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనిక స్థావరాలు, ఉగ్ర బంకర్లు నాశనమయ్యాయి. -
ఆ భయంతోనే కులగణనకు మోదీ అంగీకారం
దర్భంగా/పట్నా: దేశంలో అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే కులగణనకు ప్రధాని నరేంద్ర మోదీ అంగీకారం తెలిపారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. కులగణనకు మద్దతుగా ప్రజల తరఫున ప్రతిపక్షాలు గళం విప్పాయని అన్నారు. గురువారం బిహార్ రాష్ట్రం దర్భంగా జిల్లాలోని మిథిలా యూనివర్సిటీ అంబేడ్కర్ హాస్టల్లో ‘శిక్షా న్యాయ్ సంవాద్’లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. దళిత, వెనుకబడిన వర్గాల విద్యార్థులతో సమావేశమయ్యారు. అంతకుముందు యూనివర్సిటీకి చేరుకోకుండా అధికారులు అడ్డంకులు సృష్టించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. యూనివర్సిటీ గేటు వద్ద తన వాహనాన్ని నిలిపివేశారని, దాంతో వాహనం దిగి మరో మార్గంలో నడుచుకుంటూ వచ్చానని రాహుల్ తెలిపారు. ప్రజలు తనకు కొండంత బలం ఇచ్చారని, అందుకే బిహార్ ప్రభుత్వం తనను అడ్డుకోలేకపోయిందని అన్నారు. ఈ ప్రజాబలం ముందు ప్రధాని మోదీ సైతం తలవంచాల్సిందేనని స్పష్టంచేశారు. భారత రాజ్యాంగాన్ని తలతో తాకాలని మోదీకి చెప్పామని, చివరకు ఆయన ఆ పని చేయక తప్పలేదని అన్నారు. దేశమంతటా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశామని, దానికి కూడా ఒప్పుకున్నారని గుర్తుచేశారు. పేదలు, అణగారిన వర్గాల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న భయంతోనే మోదీ ఈ రెండింటికీ అంగీకరించారని రాహుల్ గాంధీ వెల్లడించారు. అంబానీ, అదానీల సేవలో మోదీ సర్కారు తరిస్తోందని మండిపడ్డారు. దేశంలో కేవలం ఐదు శాతం ఉన్న ధనవంతుల బాగు కోసమే మన వ్యవస్థలు పని చేస్తున్నాయని ఆరోపించారు. దళితులు, గిరిజనుల, ఓబీసీలను పట్టించుకొనే దిక్కే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం, కార్పొరేట్ ప్రపంచం, మీడియాలో వారికి స్థానం దక్కడం లేదన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లోనూ రిజర్వేషన్లు మూడు ప్రధాన డిమాండ్లపై యువత ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్దని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినట్లుగానే దేశవ్యాప్తంగా కులగణన పక్కాగా నిర్వహించాలని అన్నారు. ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని తేల్చిచెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద కేటాయించిన నిధులను ఆయా వర్గాల సంక్షేమం కోసం జాప్యం లేకుండా విడుదల చేయాలన్నారు. ఎన్డీయే పాలనలో పెద్దగా ఆశించలేమని.. కేంద్రంలో, రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక యువత సంక్షేమం, అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యాసంస్థల్లో వెనుకబడిన వర్గాల వారి పట్ల వివక్ష కొనసాగుతోందని, మీడియాలో బీసీల ప్రాతినిధ్యం లేదని, ఈ అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలని రాహుల్ గాంధీని ఓ విద్యార్థి కోరారు. ‘ఫూలే’ చిత్రం తిలకించిన రాహుల్ రాహుల్ గాంధీ గురువారం బిహార్ రాజధాని పాట్నాలోని సినిమా హాల్లో హిందీ చిత్రం ‘ఫూలే’ను తిలకించారు. బిహార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సైతం రాహుల్‌తో కలిసి ఈ సినిమా చూశారు. 19వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత సామాజిక ఉద్యమకారుడు, సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల జీవితం ఆధారంగా ఫూలే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. -
‘రైతుల ప్రాణాలంటే తెలంగాణ ప్రభుత్వానికి లెక్కలేదు’
హైదరాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు చనిపోతే రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల ప్రాణాలంటే తెలంగాణ ప్రభుత్వానికి లెక్కలేదని విమర్శించారు. ఈ రోజు(గురువారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ‘40 కేజీల వరి ధాన్యం బస్తా నుంచి 4 కేజీల తరుగు తీస్తున్నారు. 13 లక్షల క్వింటాళ్ల ధాన్యం తరుగు రూపంలో పక్కదారి పడుతుంది. 6 వేల కోట్ల రూపాయల తరుగు రూపంలో రైతుల నుంచే కొట్టేస్తున్నారు. ఇది ఎవరి ఖాతాల్లో చేరుతోంది. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన రైస్ మిల్లు లు ఎన్ని ?, బ్లాక్ లిస్ట్ లో పెట్టిన రైస్ మిల్లులకు మళ్ళీ ఎందుకు ధాన్యం పంపుతున్నారు ? ,గతంలో ధాన్యం తీసుకుని సీఎంఆర్(CMR)ఇవ్వని రైస్ మిల్లులకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ?, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం CBI తో దర్యాప్తు చేయించాలి. బీఆర్ఎస్ పాలనలో సివిల్ సప్లై శాఖలో అవినీతి జరిగిందని ఆరోపించిన రేవంత్, ఉత్తమ్... ఎందుకోసం విచారణ చేయడం లేదు ?’ అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. -
కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలి: బండి సంజయ్
హైదరాబాద్: రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రానికి సహకరించలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అంశానికి సంబంధించి మాట్లాడిన బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుస్నాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైనిక స్కూల్ ను ఏర్పాటు చేయాలని గత నెలలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తికి రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు.రాష్ట్ర ప్రభుత్వం సైనిక స్కూలు ఏర్పాటు కోసం వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో అన్ని పార్టీలు కలిసి రావాలి. ఇక్కడ రాజకీయ పార్టీల వైఖరిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కలిసి రావాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రానికి సహకరించలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలని కోరుతున్నా’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
రాజధాని పేరుతో ఒకే ప్రాంతంలో వేల కోట్లు పెట్టుబడి పెట్టడం బాధాకరం
-
కాంగ్రెస్ సర్కార్‌పై వరుస పోరాటాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంతమొందించే శక్తి బీఆర్ఎస్కు మాత్రమే ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రజలను మోసం చేస్తూ ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్, వాటిని అమలు చేయకుండా తుంగలో తొక్కిందని, ఆ పార్టీ ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఇటీవల పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మంగళవారం రాత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ సభతో కాంగ్రెస్ అంతానికి ఆరంభం షురూ అయిందన్నారు. ఇప్పుడైనా, ఎప్పుడైనా రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు బీఆర్ఎస్సేనని, సభ తర్వాత ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ ఓ పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై అలుపెరగని పోరాటం చేసే ఉత్సాహం ఈ సభ ద్వారా కలిగిందని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఇంత వ్యతి రేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు. అనుభవలేమి, మోసం, అత్యాశ, అందినకాడికి దోచుకోవడం అనే లక్షణాలు పుష్కలంగా ఉన్న రేవంత్ సర్కార్‌తో తెలంగాణ అభివృద్ధి రెండు దశాబ్దాలు వెనక్కి పోయిందన్నారు. ప్రజల్లో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకతకు అనుగుణంగా ఎక్కడికక్కడ పార్టీ కార్యక్రమాలను రూపొందించుకోవాలని చెప్పారు. రైతుల ఆత్మహత్యలు, వారి సమస్యల పరిష్కారంపై రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విస్తృత పోరాటాలు చేస్తుందన్నారు. రైతు భరోసా చెల్లింపులు సక్రమంగా జరగకపోవడం, ధాన్యం కొనుగోళ్లలో చూపిస్తున్న నిర్లక్ష్యం, అకాల వర్షాల తో నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పార్టీ కార్యాచరణ ఉండబోతుందని తెలిపారు. ఇటీవల వెలుగుచూసిన ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై సమగ్ర వ్యూహంతో ప్రజా ఉద్యమాలను ప్రారంభిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. మోసానికి మారుపేరైన కాంగ్రెస్ నైజాన్ని ప్రజాక్షేత్రంలో ఎండ గట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద బహిరంగసభ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీసభగా ఎల్కతుర్తి రజతోత్సవ సభ నిలిచిపోతుందని కేటీఆర్ అన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతీ కార్యకర్త, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. పకడ్బందీ ప్రణాళిక, క్రమశిక్షణ, ప్రజల్లో బీఆర్ఎస్పై ఉన్న అంతులేని అభిమానానికి ఎల్కతుర్తి సభనే నిదర్శనమన్నారు. ఈ బహిరంగ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల దిశ మారిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. పార్టీ 25 సంవత్సరాల సంబురాన్ని వరంగల్ గడ్డపై నిర్వహించే అవకాశం తమకు ఇచ్చినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అన్ని విషయాల్లో తమకు దిశానిర్దేశం చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సభ నిర్వహణలో భాగమైన నేతలతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. -
హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కౌంటర్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లను వదిలేసి అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్ల లెక్కలను విడుదల చేశారు ఉత్తమ్. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. 43. 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ప్రతి విషయంలో తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హరీష్ కు ఉత్తమ్ హితవు పలికారు. ఒకసారి హరీష్ లెక్కలు చూసి మాట్లాడితే మంచిదని సూచించారు.ధాన్యం రాశులు వదిలేసి.. అందాల రాశుల చుట్టూ..సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు యుద్ధం చేస్తుంటే.. రేవంత్ మాత్రం అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ అందాల పోటీల్లో బిజీగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ ధాన్యం రాశులు వదిలేసి అందాల రాశుల చుట్లూ తిరుగుతున్నారని చమత్కరించారు. రైతు సమస్యలపై సమీక్ష చేయడానికి సీఎం రేవంత్‌కు టైమ్ లేదని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని హరీష్ రావు వ్యాఖ్యానించారు.ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ వ్యాఖ్యలకు కౌంటర్ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటరిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ లాగ కాదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇందిరమ్మ ఇండ్ల కోటా ఇస్తామన్నారు పొంగులేటి. ఇక ఏపీలో కలిసిన ప్రజల స్థానికతపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్
కర్నూలు జిల్లా: కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. గుమ్మనూరు నారాయణను ఆలూరు పీఎస్‌కు తరలించారు. ఈరోజు గుమ్మనూరు నారాయణను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో గుమ్మనూరు నారాయణ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే గుమ్మనూరు నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, గత నెలలో గుంతకల్లులో కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణహత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న లక్ష్మీ నారాయణను కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. కాంగ్రెస్ లక్ష్మీనారాయణ కారును టిప్పర్ తో ఢీకొట్టారు దుండగులు. ఆపై లక్ష్మీ నారాయణపై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో లక్ష్మీ నారాయణ కుమారుడు వినోద్‌కు సైతం గాయాలయ్యాయి. -
తెలంగాణలో టెన్షన్.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, మేడ్చల్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మేడ్చల్‌లోని ఈటల ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈటల ఇంటి వద్ద పోలీసులు మోహరించి.. భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.వివరాల ప్రకారం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ను శాడిస్ట్ అంటూ ఈటల వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు ఈరోజు.. ఈటల ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. భారీగా సంఖ్యలో ఈటల ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే భారీ సంఖ్యలో బీజేపీ, బీజేవైఎం శ్రేణులు ఈటల ఇంటికి చేరుకున్నాయి.అనంతరం, బీజేపీ ఎంపీ ఈటల మాట్లాడుతూ..‘కలెక్టరేట్ల ముట్టడి, కార్యాలయాల ముట్టడి చూశాం.. ఇళ్లను ముట్టడిస్తారా?. కుటుంబాలు ఉంటాయి.. ఇళ్లను ముట్టడించడం పద్ధతి కాదు. అనుభవం ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలకు సోయి ఉంటే హైదరాబాద్‌లో ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయిందో చూడాలి. పాలకుడు అనే వాడు ఏదైనా నిర్మించే ప్రయత్నం చేస్తారు.. డిస్‌స్ట్రక్షన్ చేస్తారా?. 50 ఏళ్లుగా మొదటిసారి చూస్తున్నాను. డిస్‌స్ట్రక్షన్ చేస్తున్న మొట్టమొదటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసులకు భయపడేది లేదు.. అధికారం లేనినాడే కొట్లాడిన పార్టీ బీజేపీ. ఎవరు మోసం చేసే వాళ్లు, ఎవరు సంస్కార హీనులో ప్రజలే చెబుతారు. కుక్కలా అరిస్తే ఏం వస్తుంది?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
మోదీ జీ.. ఇలా చేస్తే మంచిది: రాహుల్ గాంధీ లేఖ
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి.పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్ కాదా?. అందుకు పహల్గామ్ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్ కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే కాల్పులు విరమణ అంగీకారం అన్న మూడు గంటల వ్యవధిలోనే పాక్ మళ్లీ దానిని ఉల్లంఘించి భారత్ పై కాల్పులకు దిగింది. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టిన భారత్.. పాకిస్తాన్ దుస్సాహసాన్ని మళ్లీ ప్రపంచం ముందు ఉంచకల్గింది. ఈ పరిస్థితుల నడుమ దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ సిద్ధంగానే ఉందనే సంకేతాలిచ్చింది భారత్.ఇదంతా ఒకటైతే, అసలు ఆపరేషన్ సిందూర్‌తో పాటు పలు అంశాల్ని పార్లమెంట్ లో చర్చించాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఏఐసీసీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ విన్నపాన్ని మోదీ జీ త్వరగా పరిశీలిస్తారని అనుకుంటున్నానని, ఇలా చేయడం మంచిదని రాహుల్ గాంధీ లేఖ ద్వారా తెలిపారు.ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేయండిపాకిస్తాన్ తో యుద్ధంలో భాగంగా ఆపరేషన్ సిందూర్ తదితర అంశాలను పార్లమెంట్ వేదికగా చర్చించాలని కోరుతున్నారు రాహుల్ గాంధీ. ఈ మేరకు ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు.‘ మోదీ జీ.. మీరు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ను నిర్వహించండి. ఈ ప్రత్యేక పార్లమెంట్ సెషన్ లో ఆపరేషన్ సిందూర్ అంశంతో పాటు కాల్పుల విరమణ అంశాన్ని కూడా చర్చిద్దాం. ఈ విషయాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఆ విషయాల గురించి చెప్పడం అత్యంత కీలకంగా భావిస్తున్నాను. కాల్పుల విరణమ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలి. ఈ విషయాలను చర్చించడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి. మన ముందున్న సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడానికి ఇదొక సువర్ణావకాశం అవుతుంది. ఈ మా డిమాండ్ ను త్వరగా పరిశీలిస్తారని విశ్వసిస్తున్నాను’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే కూడా ఇదే విషయాన్ని మోదీకి లేఖ ద్వారా తెలిపినట్లు మరొక కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.LoP Lok Sabha and LoP Rajya Sabha have just written to the PM requesting for a special session of Parliament to be convened immediately. Here are the letters pic.twitter.com/exL6H5aAQy— Jairam Ramesh (@Jairam_Ramesh) May 11, 2025 -
అన్నీ ఒకేసారి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పదవుల జాబితాలన్నీ ఒకేసారి విడుదల అవుతాయని తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ పెద్దల కసరత్తు పూర్తయిందని, వివిధ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలు ఢిల్లీ చేరాయని గాందీభవన్ వర్గాలు అంటున్నాయి. గత గురువారం ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలన్నింటినీ అధిష్టానం పెద్దలకు ఇచ్చి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇక కమిటీల బంతి అధిష్టానం కోర్టుకు చేరిందని, త్వరలోనే అధిష్టానం ఈ కమిటీలకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని తెలుస్తోంది. రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ప్రభుత్వం ఏర్పాటయినప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్థానంలో బి.మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు చేపట్టి కూడా సంవత్సరం దాటిపోయింది. కానీ, ఇంతవరకు అటు టీపీసీసీ కమిటీలను కానీ, ఇటు క్షేత్రస్థాయి పదవులను కానీ భర్తీ చేయలేదు. టీపీసీసీ కార్యవర్గంలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో పాటు కార్యవర్గ సభ్యుల నియామకం చేపట్టలేదు. ఎన్నికల సమయంలోనే నియమించిన ప్రచార కమిటీ కొనసాగుతోంది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ పోస్టు ఖాళీ అయి దాదాపు మూడేళ్లు కావస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షులుగా గతంలో ఎప్పుడో నియమించిన వారే కొనసాగుతున్నారు. బ్లాక్, మండల, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కమిటీలన్నింటినీ నియమించేందుకు పలు దఫాలుగా ఇటు హైదరాబాద్‌లో, అటు ఢిల్లీ పెద్దల సమక్షంలో అనేక సార్లు చర్చలు జరిగాయి. కానీ, కమిటీల ప్రకటన వెలువడలేదు. కమిటీల కసరత్తు పూర్తయిందని, నేడో రేపో ప్రకటిస్తారని అనుకుంటున్న సమయంలోనే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మారారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ రావడంతో కథ మళ్లీ మొదటికొచి్చంది. ఆమె ప్రాతిపదికలు మారిపోవడంతో పార్టీ కమిటీల నియామకానికి మళ్లీ కసరత్తు జరిగింది. ఈ కసరత్తు పూర్తి కావడంతో మూడు రోజుల క్రితమే ప్రతిపాదనలు ఢిల్లీకి చేరాయని సమాచారం. గాందీభవన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి పార్టీ సంస్థాగత కమిటీలతో పాటు రాష్ట్ర పారీ్టలో కీలకమైన రాజకీయ వ్యవహారాల సలహా (పీఏసీ) కమిటీని కూడా పునరి్నయమించనున్నారు. జై బాపూ–జై సంవిధాన్ కమిటీ (ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ)ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు మీడియా సమన్వయం కోసం డెడికేటెడ్ కమిటీని ఏర్పాటు చేస్తారని, ఈ కమిటీకి ఎంపీని ఇన్చార్జిగా నియమిస్తారని తెలుస్తోంది. విష్ణునాథ్ స్థానంలో మరొకరు! మరో పక్క ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శిగా రాష్ట్రానికి కొత్త నేత రానున్నారు. ఇద్దరు కార్యదర్శుల్లో ఒకరైన విష్ణునాథ్ ఇటీవలే కేరళ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. దీంతో ఆయన స్థానంలో మరొక నేతను టీపీసీసీ కమిటీలతో పాటే నియమిస్తారని తెలుస్తోంది. -
‘కగార్’పై జనాంతిక ఆలోచనలు
కొన్ని విషయాలు సున్నితంగా ఉంటాయి. విషయాలు పూర్తి బహిరంగమైనవే. అందు గురించిన చర్చలు హోరాహోరీగా సాగినవే. కానీ పరిస్థితులు ఒక దశ నుంచి ఒకానొక దశకు మారినపుడు అంతా సున్నితం అవు తుంది. ‘ఆపరేషన్ కగార్’ సందర్భంగా ఆపరేషన్ విషయాలు కాదుగానీ నక్సలైట్ల గురించి, నక్సలిజం గురించిన చర్చ సున్నితంగా మారింది. పక్షం రోజులకు పైగా సాగుతున్న కర్రె గుట్టల ఉదంతం, ఎప్పటినుంచో జరుగుతున్న ఆ చర్చకు ఒక తక్షణ లక్షణాన్ని తీసుకు వచ్చింది. ఇది సున్నితం కావటానికి కారణం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన ‘ఆపరేషన్’ను ఒక భీషణ సమరంగా మార్చటం కాదు. అందుకు నేపథ్య పరిస్థితులు ఇదమిత్థంగా ఫలానా అప్పటి నుంచి మొదలయ్యాయని చెప్పలేముగానీ, సుమారు మూడు దశాబ్దాలుగా కావచ్చు. అవి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినాక మాత్రం తీవ్రం కావటం మొదలైంది.ప్రస్తుత ప్రభుత్వం తన నక్సలైట్ వ్యతిరేక చర్యలకు ‘ఆపరేషన్ కగార్’ అనే పేరు పెట్టింది. ‘కగార్’ అనే హిందీ మాటకు నిఘంటు అర్థం ‘అంచు’ లేదా ‘చివరి స్థితి’, ‘చివరి దశ’ అని. రాజకీయ అర్థం ‘అంతిమ దాడి’ అని! ఇది ఇతరుల నిర్వచనం కాదు. నక్సలైట్లను, నక్సలిజాన్ని 2026 మార్చ్ చివరి నాటికి అంతం చేసి తీరగలమని హోంమంత్రి అమిత్ షా పదేపదే ప్రకటిస్తున్నారు. అది సాధ్యమా కాదా అన్నది కాదు ఇక్కడ చేస్తున్న ఆలోచన. ఈ సందర్భాన్ని పురస్క రించుకుని, సుమారు 57 సంవత్సరాలుగా సాగుతున్న నక్సలైట్ ఉద్యమాన్ని పలువురు సమీక్షిస్తుండవచ్చు. అందులో భాగంగా, పైన ప్రస్తావించిన ఇటీవలి మూడు దశాబ్దాల కాలాన్ని కూడా. అంటే నక్సలిజం బలహీనపడుతూ వస్తున్న మూడు దశాబ్దాలను!ఎముకలు మెడలో వేసుకోని కాంగ్రెస్సూటిగా చెప్పుకోవాలంటే, మొదటి సగకాలం బలంగా సాగిన ఉద్యమం, తర్వాత సగకాలం నుంచి బలహీనపడుతూ వస్తున్నది. ఆ బలహీనతలు నాలుగు విధాలు. ఒకటి – సైద్ధాంతికంగా. రెండు – నాయకత్వ పరంగా. మూడు – ఉద్యమ నిర్వహణలో. నాలుగు – జనాదరణ విషయమై! ప్రభుత్వ అణచివేతలు ఎప్పుడూ ఉన్నవే. అణచివేతకు ఆరంభం తెలంగాణ రైతాంగ పోరాట కాలంలోనే జరిగినపుడు నక్స లిజం తర్వాతి కాలంలో అంతకు భిన్నంగా ఉండగల ఆస్కారమే లేదు. పైగా 1948కి 1968కి మధ్యకాలం 20 సంవత్సరాలు మాత్రమే. అప్పటినుంచి మరో 20 ఏండ్లు గడిచేసరికి నక్సలైట్ ఉద్యమ క్షీణతకు అంకురార్పణ జరిగింది. గమనించదగినదేమంటే, ఆ కాలమంతా పాలించింది బీజేపీ కాదు... కాంగ్రెస్. కొన్ని రాష్ట్రాలలో ఇతర పార్టీలు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం రాసుకుని, చట్టాలు చేసుకుని, ప్రణాళికలు రూపొందించుకుని, ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించుకున్నప్పటి నుంచి అన్నీ కపటమైన రీతిలో అరకొరగానే అమలయ్యాయి. అందుకే 1947 నుంచి 20 ఏండ్లయే సరికి నక్సలైట్లు అవతారమెత్తారు. అన్ని మలుపులూ 20–20–20 గానే కనిపిస్తు న్నాయి. అదొక విచిత్రం. ‘ఆపరేషన్ కగార్’ తరహా మాటలను కాంగ్రెస్ ఉపయోగించ లేదు, బీజేపీ ఉపయోగిస్తున్నది. చేతలు అవే, మాటలు వేరు. మాటలు వేరవటానికి మంచి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్‌కు 1885 నుంచి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అందులో సామాజిక సమ్మిళితత్వం, ఉదారవాద మధ్యే మార్గం, కొంత అభ్యుదయ ధోరణి, దేశ వ్యాప్తమైన జాతీయత వంటివి ఉన్నాయి. అవి కాలం గడిచినకొద్దీ బలహీనపడుతూ అనేక అవలక్షణాలు ప్రవేశించినా, కనీసం ఎము కలను మెడలో వేసుకునే ధోరణి ఇంకా రాలేదు. ఆ కారణంగా, నక్సలిజం వెనుక పేదరికం ఉన్నమాట నిజమనీ, అది కేవలం శాంతి భద్రతల సమస్య కాదనీ, పేదల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయ గలమనీ మాటలు, ప్రకటనల రూపంలో చెప్పటం ఎన్నడూ మాన లేదు. అణచివేతలకు సాయుధబలాల ఉపయోగమైతే యథావిధిగా సాగించారు గాని, ‘కగార్’ తరహా ‘అంతిమ దాడి’ అనకుండా జాగ్రత్తపడ్డారు. పౌరహక్కుల సంస్థలను అనేక ఇబ్బందులకు గురిచేసినా, వారికి ‘అర్బన్ నక్సల్స్’ అనే ముద్ర వేయలేదు.నాగరిక, ప్రజాస్వామిక, ఆధునిక సమాజాలలో ఉదారవాద, ప్రగతిశీల భావనల సంప్రదాయం గురించి తెలిసిందే. ముఖ్యంగా రినైజాన్స్, ఫ్రెంచ్ విప్లవం, పారిశ్రామిక విప్లవం, బ్రిటన్‌లో రాజ్యాంగ ఆవిర్భావ కాలాల నుంచి ఉన్నత తరగతులపై, మధ్యతరగతిపై ఈ ప్రభావాలు మొదలయ్యాయి. ఈ వర్గాలు ప్రగతిశీలమైనవేగానీ, వ్యవస్థలో సంస్కరణలను కోరటం మినహా వ్యవస్థలను కూలదోయా లనేవి కావు. ఆ పరిమితులను తెలిసినందువల్లనే ఇక్కడ పౌర హక్కుల సంస్థల పాత్రను కాంగ్రెస్ ప్రభుత్వాలు కనీసం ఒక మేర గౌరవించటం, ఒకోసారి వారిని సంప్రదించటం చేస్తుండేవి. ఆ ధోరణి గత పదేళ్లుగా ఎట్లా మారిందో కనిపిస్తున్నదే. ఇది అంతి మంగా వ్యవస్థకు మేలు చేసేది కాదని ప్రభుత్వం గ్రహించవలసిందే తప్ప ఎవరూ చెప్పగల స్థితి కనిపించటం లేదు.మారిన సమాజ ధోరణులుఉద్యమాలకు ఎగుడు దిగుడులు సహజమేగానీ, నక్సలైట్ ఉద్యమం పైన చెప్పిన నాలుగు బలహీనతలలో దేని నుంచి కూడా నిజమైన అర్థంలో బయటకు రాలేక పోయింది. లేనట్లయితే, వారు కర్రె గుట్టల సందర్భంలో ఈ విధంగా చిక్కుకు పోవటం, చర్చల కోసం పది రోజుల్లో నాలుగుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయటం, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరటం, పౌర హక్కుల సంస్థలను కదలించేందుకు ఇంతగా ప్రయత్నించటం వంటి పరిస్థితులు ఏర్పడేవి కావు. ఇంత జరుగుతున్నా సమాజం నుంచి ఒకప్పటివలె స్పందనలు లేవు. ప్రస్తుత తరాలు వివిధ కారణాల వల్ల మారిపోయాయి. వారి దృష్టి ఇప్పుడు తమ కెరీర్‌పై, ఇతర అంశాలపై ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఒకప్పుడు ఉద్యమానికి పెద్ద బలం. ఇపుడు కొద్ది ప్రాంతాలలోని కొంతమంది ఆదివాసీలు మాత్రం స్థానిక పరి స్థితులనుబట్టి నక్సలైట్లతో కదులుతున్నారు. స్వయంగా ఆదివాసీలైన ప్రజాప్రతినిధులు గతంలో కన్నా ఎక్కువగా స్వప్రయోజనాల కోసం రాజకీయ పార్టీల వెంట ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, వెనుకటి తరాలకు ఉద్యమం పట్ల గురి తప్పి నిరాశ ఏర్పడగా, కొత్త తరాలకు ఒక అగాథం వచ్చి కొత్త ప్రపంచంలో తమ జీవితాలను వెతుక్కుంటున్నారు. ఒకపుడు మధ్యతరగతిలో గణనీయమైన భాగానికి ఆదర్శవాదాలు ఉండేవి. అది సోవియెట్ యూనియన్‌కు, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకు, విప్లవకారులకు, సాహిత్య–కళాకార్యకలాపా లకు పచ్చని కాలం. ఆ తరహా మధ్యతరగతి ఇపుడు పిడికెడుగా మిగిలింది. వామ పక్షాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.నక్సలైట్లకు కొత్త రిక్రూట్మెంట్లు తగ్గటం ఎప్పటినుంచో ఉన్నది. ఎన్కౌంటర్లలో ఒకపుడు ఒకరు చనిపోయినా వార్తలు, ప్రజలలో చర్చలు ఉండేవి. ఇపుడు చాలామంది చనిపోవటం వరుసగా జరిగితే తప్ప వార్తలు, చర్చలు కనిపించటం లేదు. మరొకవైపు సిద్ధాంతాలు, పోరాట పద్ధతులు, సంస్థ నిర్మాణాలు, నాయకత్వాలు ప్రస్తుత ఆధునికమైన, బలమైన ప్రభుత్వ వ్యవస్థలను ఎదుర్కొనగల విధంగా ఉన్నాయనే అభిప్రాయం వారి సానుభూతిపరులలోనైనా ఉందా అన్నది అనుమానమే. పౌరహక్కుల సంఘాల స్పందనలు సైతం స్వీయ సంశయాల మధ్య మందకొడిగానే కనిపిస్తున్నాయి. నక్సలైట్లు, నక్స లిజం భవిష్యత్తు అగమ్యగోచరం కావటానికి వెనుక ఈ పరిస్థితులు, దీర్ఘకాలిక పరిణామాలు అన్నీ ఉన్నాయి.విషయాన్ని జనాంతికంగా చర్చించుకోవటం ఎందుకంటే, ఒక వైపు పేదరికం, పీడన కొనసాగుదల, ధనిక–పేద తారతమ్యాల పెరుగుదల అనే వాస్తవ స్థితి ఎంత కనిపిస్తున్నదో, ఆ పరిస్థితులను మార్చే సంస్కరణల కోసం లేదా కొత్త వ్యవస్థ ఆవిష్కరణ కోసమని చెప్పేవారు విఫలం కావటం కూడా అంత కనిపిస్తున్నది. ఈ విష యాలు ముఖ్యంగా ‘కగార్’ వంటి సందర్భంలో దాపరికం లేకుండా మాట్లాడటం సున్నితమైనదే!టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఇది ప్రజల ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దొరలు, నాయకుల కోసం కాకుండా ప్రజల అవసరాలను తీర్చేలా పనిచేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నూతన భవనాల నిర్మాణానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆపై కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్షించారు. ఏడాదిలోనే రూ.11,482 కోట్లు బీఆర్ఎస్ పాలనలో వైద్య రంగానికి ఏటా సగటున రూ.5,950 కోట్లు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.11,482 కోట్లు వెచ్చించిందని భట్టి వెల్లడించారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ బిల్లులు సైతం తాము చెల్లిస్తూ, పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో ఇప్పటివరకు 90 లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్, బీజేపీ నేతలు చిలువలు పలువలుగా ప్రచారం చేస్తున్నారని, గత పాలకులు రూ.ఏడు లక్షల కోట్ల అప్పు చేసినా ఏనాడూ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదని భట్టి ఎద్దేవా చేశారు.ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి దామోదరరాష్ట్రంలో ప్రతీ 35 కి.మీ.కు ఒకటి చొప్పున మొత్తం 84 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.ప్రపంచ బ్యాంక్ మంజూరు చేసిన రూ.4,100 కోట్ల నిధులలో రూ.37 కోట్లతో వరంగల్‌లో రీజినల్ కేన్సర్ సెంటర్, ఖమ్మంలో ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల ప్రజలు హైదరాబాద్ వెళ్లే పని లేకుండా స్థానికంగానే సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్య, వైద్యానికి సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మెడికల్ కళాశాలలు, అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు అవుతున్నాయన్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా స్థల సేకరణ చేసి ఖమ్మంలో వైద్య కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వం మెడికల్ కళాశాలలను మధ్యలో వదిలేస్తే వాటిని పునఃప్రారంభించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, సీపీ సునీల్‌దత్, రాయల నాగేశ్వరరావు, డాక్టర్ నరేంద్రకుమార్, ఫణీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఉగ్రవాద శిబిరాలపై దాడులు సరైనవే: ఖర్గే
ఢిల్లీ: సైనికులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. భారత్ చేపట్టిన దాడుల నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ కమిటీ బుధవారం అత్యవసరంగా సమావేశం నిర్వహించింది.‘‘పీవోకే నుంచి ఉగ్రవాదులు పనిచేస్తున్నారనేది స్పష్టమైంది. ఉగ్రవాద శిబిరాలపై దాడులు సరైనవే. దేశ రక్షణ విషయంలో మనమంతా కలిసి ఉండాలి. సైనికులు తీసుకునే ప్రతి నిర్ణయానికీ మద్దతిస్తాం’’ అని ఖర్గే పేర్కొన్నారు.పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్' పేరుతో సాహసోపేత నిర్ణయం తీసుకున్న భారత సైనిక దళాలను చూసి తాము గర్విస్తున్నామని ఖర్గే అన్నారు.కాగా, జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మూడు రోజుల ముందే తెలుసునంటూ నిన్న(మంగళవారం) మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పర్యాటకులపై దాడి జరగబోతున్నట్లు మోదీకి ఇంటెలిజెన్స్ రిపోర్టు అందిందని.. అందుకే ఆయన జమ్మూకశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. నిఘా వైఫల్యం వల్లే పహల్గాంలో ఉగ్రదాడి జరిగినట్లు అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, మోదీ సైతం స్వయంగా ఒప్పుకున్నారంటూ ఖర్గే వ్యాఖ్యానించారు. -
పహల్గామ్ ఘటన: ‘మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?’
రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందిందని, . నిఘా వర్గాల సమాచారంతో ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది భద్రతా దళాల నైతిక సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నమంటూ జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన ఆ వాదనకు ఎటువంటి ఆధారం లేదని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై బీజేపీ జార్ఖండ్ చీఫ్ బాబులాల్ మరాండ్ సైతం స్పందించారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితిలు చోటు చేసుకున్న తరుణంలో ఈ తరహా వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. అసలు కాంగ్రెస్ పెద్దలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అంటూ నిలదీశారు. ఉగ్రవాదం, పాకిస్తాన్‌పై పోరాటం కీలక దశలో ఉన్నప్పుడు ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న దాడిగా ఆయన పేర్కొన్నారు.ఉగ్రవాదంపై, పాకిస్తాన్ పై పోరులో దేశం మొత్తం కలిసే ఉందని ఒకవైపు చెబుతూనే, మరొకవైపు ఈ వ్యాఖ్యలు ఏమిటంటూ మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న ఖర్గే ఇలా వ్యాఖ్యానించడం నిజంగా సిగ్గుచేటన్నారు.కాగా, జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు. -
‘పహల్గాం ఉగ్రదాడి గురించి కేంద్రానికి ముందే తెలుసు’.. ఖర్గే సంచలన ఆరోపణలు
రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు.జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు.పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు. Watch: Congress President Shri @kharge addresses the Samvidhan Bachao Rally in Ranchi, Jharkhand. https://t.co/wRfrg2XD99— Congress (@INCIndia) May 6, 2025 -
సీఎం రేవంత్ చేతులెత్తేశారా?.. బండి సంజయ్ కౌంటర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: కుటుంబ పెద్ద చేతులెత్తేస్తే కుటుంబం పరిస్థితేంటి? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిందిపోయి అధైర్యం నింపుతారా? అంటూ నిలదీశారు. రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందని ఎన్నికలకు ముందే తెలుసా కదా?. అప్పుల గురించి తెలిసే హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు.ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ రాసిచ్చారు. రేవంత్ వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు పోయింది’’ అని బండి సంజయ్ మండిపడ్డారు.మంగళవారం.. ఎల్లారెడ్డిపేటలో పర్యటించిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగస్థులు, ఉపాధ్యాయుల పీఆర్సీ, డీఏలకు డబ్బుల్లేవంటున్నాడు సీఎం. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అన్నీ హుళక్కే ఇక. ఓట్లు వేసి గెలిపించారు ఇక మీ కర్మ. మేమైతే ఏం చేయలేమని ముఖ్యమంత్రి క్లియర్ గా చెప్పిండు...కేసీఆర్ అప్పులు చేశాడని చెప్పిన మీరు... తాము వస్తే అంతా బాగుంటుందని మాయమాటలు చెప్పి అధికారంలోకొచ్చారు. రేపట్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం. కేంద్ర మంత్రులు, ప్రధాని వచ్చినప్పుడు సాయం చేస్తున్నారని మాట్లాడే కాంగ్రెస్ నాయకులే.. మళ్లీ ఆ తర్వాత కేంద్రం ఏం చేయడం లేదని రాజకీయాలు చేస్తారు’’ అంటూ బండి సంజయ్ దుయ్యబట్టారు. -
తెలంగాణ సర్కార్ తో సమరానికి సై అంటున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు
-
కులగణన వద్దు? బీజేపీ యూ టర్న్ పై కాంగ్రెస్ రియాక్షన్..
-
జైరాం రమేష్ (కాంగ్రెస్) రాయని డైరీ
అక్బర్ రోడ్డులోని పార్టీ ఆఫీసులో ఖర్గేజీ, నేను, ‘ఇంకా కొందరం’ సమావేశమై ఉన్నాం. నిజానికి, ఆ ‘ఇంకా కొందరం’ అనేవాళ్లలో కొందరింకా రానే లేదు. ఆ రానివాళ్ల కోసం చూడటం మానేసి, ఖర్గేజీ మాట్లాడటం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను నేను. ఖర్గేజీ ఎంతకూ మాట్లాడటం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు కాకముందు ఆయన ఎలాగైతే ఉన్నారో, కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. ఖర్గేజీ వింతగా మెరిసే వజ్రంలా అనిపిస్తారు నాకెందుకో! బహుశా మా ఇద్దరిదీ ఒకే రాష్ట్రం కావటం వల్లనేమో!వజ్రం మాట్లాడదు. ఊరికే మెరుస్తూ ఉంటుంది. మాట్లాడని ‘ఖర్గే’ అనే ఈ కాంగ్రెస్ వజ్రాన్ని చూసి ఏ పార్టీ వాళ్లయినా ఎంతో కొంత నేర్చుకోవలసింది తప్పక ఉంటుందని నాకొక నమ్మకం. ముఖ్యంగా మోదీ... ఖర్గేజీని చూసి మౌనంగా ఎలా ఉండాలో, లేదంటే మితంగా ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి.ప్రధాని ఎంత మితంగా మాట్లాడితే దేశం అంత ప్రశాంతంగా ఉంటుంది. పెద్దాయన చూసుకుంటాడులే అని ప్రజలు ధీమాగా ఉంటారు. పెద్దాయన కూడా మన పొరుగింటి ఆయనలా మాట్లాడేస్తుంటే పాకిస్తాన్‌కు ఏం భయం ఉంటుంది? పాకిస్తాన్‌కు చైనా ఎందుకు సపోర్ట్ చేయకుండా ఉంటుంది?దేశానికి మోదీజీ పెద్దాయన అయితే,కాంగ్రెస్‌కు ఖర్గేజీ పెద్దాయన. రాహుల్ బాబు, ఆయన బావగారు రాబర్ట్ వాద్రా ఎప్పుడైనా మితం తప్పి మాట్లాడినా, ఖర్గేజీ తన మౌనంతో బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. మౌనంతో ఏదైనా బ్యాలెన్స్ అవుతుంది. అతీ బ్యాలెన్స్ అవుతుంది, మితమూ బ్యాలెన్స్ అవుతుంది.‘‘విన్నారా ఖర్గేజీ?’’ అన్నాను, ఆయన్ని నా వైపు తిప్పుకునే ప్రయత్నంగా. ‘‘ఏమిటి వినటం?’’ అన్నట్లు చూశారు. ‘‘డెడ్ లైన్ లు చెప్పకుండా మోదీజీ హెడ్ లైన్లు చెప్పేస్తున్నారు! దెబ్బకు దెబ్బ అంటున్నారు. ఆ దెబ్బ ఎప్పుడో చెప్పటం లేదు. జనాభా లెక్కలతో పాటే కులాల లెక్కలు అంటున్నారు. ఆ జనాభా లెక్కలు ఎప్పుడో చెప్పటం లేదు’’ అన్నాను.‘‘చెప్పవలసినవి ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి’’ అన్నారు రాహుల్ బాబు లోనికి ప్రవేశిస్తూ. ఆ వెనుకే ప్రియాంక. ఖర్గేజీ వారిద్దరి వైపూ చూశారు కానీ మాటలతో ఏమీ స్పందించలేదు. అలాగని మౌనంతోనూ స్పందించలేదు. ప్రియాంక పార్టీ జనరల్ సెక్రెటరీగా ఉండి, మీటింగ్‌కి లేట్‌గా రావటం ఆయనకు నచ్చినట్లు లేదు. ‘‘సారీ ఖర్గేజీ... రేఖాగుప్తా సీఎం అయ్యాక ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది. అక్బర్ రోడ్డులో అయితే మరీ ఘోరం. అందుకే మీటింగ్‌కి లేటైంది’’ అన్నారు ప్రియాంక. రాహుల్ సెల్ ఫోన్ చూసుకుంటూ వచ్చి, దొరికిన కుర్చీలో కూర్చొని, ‘‘చెప్పవలసినవి ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి’’ అని మళ్లీ అన్నారు మోదీ గురించి. ‘‘అవును రాహుల్జీ, దేశంలో కులగణన చేయించాలని మనం డిమాండ్ చేస్తున్నందుకు మోదీ మనల్ని అర్బన్ నక్సలైట్లు అన్నారు. ఇన్నాళ్లకు వాళ్లూ మన దారిలోకి వచ్చి కులగణన అంటున్నారు. మరి వాళ్లెప్పటి నుండి అర్బన్ నక్సలైట్ అయ్యారో’’ అన్నాను. అంతా నవ్వారు. ఖర్గేజీ నవ్వలేదు!‘‘ఇప్పుడైనా... అదే పనిగా కాకుండా, పనిలో పనిగా మాత్రమే కులగణనను చేయిస్తామంటున్నారు’’ అన్నారు రాహుల్. ‘‘అది నిజమే కానీ...’’ అని ఆగారు... ఖర్గేజీ హఠాత్తుగా మౌనం వీడి! అందరం ఖర్గేజీ వైపు చూశాం.‘‘... వాళ్లు చేయాలనుకుంటున్నది జనగణనలో భాగంగా కులగణన కాదు. కులగణనలో భాగంగా జనగణన. నేరుగా కులగణన అంటే రాహుల్‌కి క్రెడిట్దక్కుతుందని జనగణనలో భాగంగా కులగణన అంటున్నారంతే’’ అన్నారు ఖర్గేజీ!!వజ్రం లాంటి మాట!ఆ మాటతో మా మీటింగ్ మొదలైంది. -
కాంగ్రెస్ కుల సర్వేతో బీసీలకు అన్యాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయలేదని, కులాల సర్వే మాత్రమే చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ కులాల సర్వేతో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి.. బీసీలకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. శనివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చట్టం ఆధారంగా జనాభా లెక్కలతోపాటు పక్కాగా కులగణనను చేపట్టనుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ‘బీఆర్ఎస్ నేతల్లో ఒకరు రిటైర్మెంట్లో ఉన్నారు. ఒకరు లీవ్‌లో ఉన్నారు. ఒకరు నడుము విరగ్గొట్టుకొని రెస్ట్‌లో ఉన్నారు (కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లను ఉద్దేశించి)’అని ఎద్దేవా చేశారు. 5న రూ.5 వేల కోట్ల పనులకు ప్రారంబోత్సవాలు ఈ నెల 5న ఆదిలాబాద్, హైదరాబాద్‌లో రూ.5,416 కోట్లతో చేపట్టిన 26 ప్రాజెక్టుల పనులకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారం¿ోత్సవాలు, శంఖుస్థాపనలు చేస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారని వెల్లడించారు. తెలంగాణతో ముడిపడి ఉన్న 5 కారిడార్ల నిర్మాణానికి కేంద్రం లక్ష కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. 2014 వరకు తెలంగాణలో 2,500 కి.మీ జాతీయ రహదారులుంటే, ప్రస్తుతం 5,200 కి.మీలకు పెంచామని వెల్లడించారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించనున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూములను అప్పగిస్తే.. అంత వేగంగా రోడ్ల నిర్మాణం పూర్తిచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల గుండా జాతీయ రహదారులు వెళ్తున్నాయని చెప్పారు. -
రేవంత్ సర్కార్‌కు కిషన్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: కుల గణనపై చర్చకు సిద్ధమంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ సర్కార్ చేసింది కుల గణన కాదని.. కుల సర్వే మాత్రమే చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ సర్వే కూడా తూతూ మంత్రంగా చేశారు. మేము ఎప్పుడు కుల గణనను వ్యతిరేకించలేదు. బీసీలకి న్యాయం జరిగేలా సరైన గణన చేయాలని కోరాం’ అని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.‘‘ముస్లింలను బీసీలలో కలిపి అసలైన బీసీలకు అన్యాయం చేయొద్దని చెప్పాం. దేశంలో స్వాతంత్య్రం వచ్చాక కుల గణన చేస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రధాని మోదీది. 90 శాతం జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనలో మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. దేశంలో ఎన్డీయే హయాంలో రోడ్ల కనెక్టివిటీ బాగా పెరిగింది. తెలంగాణ 33 జిల్లాల్లో 32 జిల్లాల్లో రోడ్ల నిర్మాణం జరిగింది. హైవే రోడ్లకు కనెక్టివిటీ చేయడం జరిగింది. 2014 తెలంగాణలో 2500 కిలో మీటర్ల జాతీయ రహదారులుంటే ఇవాళ 5200 కిలోమీటర్ల జాతీయ రహదారులు పెరిగాయి’’ అని కిషన్‌రెడ్డి వివరించారు.‘‘కేంద్ర ప్రభుత్వం 1 లక్ష 20 కోట్ల నిధులను కేవలం రోడ్ల నిర్మాణంపై ఖర్చు చేస్తోంది. హైదరాబాద్‌కు అన్ని వైపుల అత్యాధునికంగా, అన్ని సౌకర్యాలతో జాతీయ రహదారులు రూపుదిద్దుకుంటున్నాయి. హైదరాబాద్, శ్రీశైలం మధ్య ఫోన్ లైన్ ఎలివేటెడ్ హైవే ప్రతిపాదనలో ఉంది. భూసేకరణ కాకపోవడం వల్ల రహదారుల నిర్మాణం నత్తనడకన జరుగుతున్నాయి. జాతీయ రహదారులకు కావలసిన ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా పనులు పూర్తవుతాయి. 6వేల కోట్ల నిధులతో తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ క్యారిడార్ రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి.5 కారిడార్లకు లక్ష కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో రూ. 5416 కోట్ల రోడ్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్, హైదరాబాద్ రెండు చోట్ల వివిధ జాతీయ రహదారులకు భూమి పూజ చేయనున్నారు. ఆదిలాబాద్‌లో కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద 5 ప్రాజెక్ట్ లు, హైదరాబాద్‌లో బీహెచ్ఈఎల్ వద్ద ఫ్లై ఓవర్, అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభిస్తారు. అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్లో జరిగే సభలో ప్రసంగిస్తారు’’ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు. -
సీఎంవా లేక ఈవెంట్ మేనేజర్ వా .. కాంగ్రెస్ నేత సంచలన కామెంట్స్
-
తెలంగాణలో మొక్కుబడిగా ద్విత్వీయ శ్రేణి నగరాల్లో ఐటీ టవర్లు
-
పాక్‌పై భారత్ దాడికి సాక్ష్యం ఏది?.. కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి తరుణంలో 2016లో పాకిస్తాన్‌పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ విషయమై కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి రుజువు చూపించాలని అడగటం తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతకు మరోసారి బీజేపీ కౌంటరిచ్చింది.వివరాల ప్రకారం.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం తర్వాత పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. దాడి వెనుక ఉన్న వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ హస్తం ఉంటే వారికి తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నాం. కానీ, 2016లో పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించి మాత్రం మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ దాడుల విషయంలో గందరగోళం కనిపిస్తోంది. మన దేశంపై బాంబు వేస్తే మనకు తెలియదా?. పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామని వారు అంటున్నారు. కానీ, అక్కడ ఇలాంటిదేమీ జరగలేదు. ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిపై నేను మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాను. మన దేశ ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి’ అని కామెంట్స్ చేశారు.SICK!Rahul Gandhi's Congress continues to defend Pakistani terror!Now Charanjeet Singh Channi questions our forces.Why is Congress demoralising our forces at this critical time.Congress is taking orders directly from Pakistan!#PehalgamTerroristAttack pic.twitter.com/b2MIexdAQA— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) May 2, 2025ఇక, కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ కౌంటరిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలు మన దేశ సాయుధ దళాల పనితీరును ప్రశ్నిస్తున్నారని ఆరోపించింది. ఆయన వ్యాఖ్యలపై ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ..‘కాంగ్రెస్ మళ్లీ మన దేశ సైన్యాన్ని మరియు వైమానిక దళాన్ని ప్రశ్నించింది. సర్జికల్ స్ట్రైక్ జరిగిందని తాను నమ్మడం లేదని.. తనకు రుజువు కావాలని చన్నీ అన్నారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉందో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. వారు భారత సైన్యం, వైమానిక దళం అబద్ధాలు చెబుతున్నారని, పాకిస్తాన్ నిజం చెబుతోందని పదే పదే ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ స్వయంగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందని చెప్పినప్పటికీ వీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు. సర్జికల్ స్ట్రైక్‌పై మీకు నిజంగా రుజువు కావాలంటే.. రాహుల్ గాంధీతో కలిసి చన్నీ.. పాకిస్తాన్ సందర్శించి దాడి ఎక్కడ జరిగిందో తనిఖీ చేయండి అంటూ కౌంటరిచ్చారు.మరోవైపు.. సదరు కాంగ్రెస్ ఎంపీ చన్నీకి బీజేపీ నుంచి కౌంటర్ రావడంతో ఆయన మాట మార్చారు. తాను సర్జికల్ దాడుల గురించి ఆధారాలు అడగలేదని మాట మార్చారు. అనంతరం, పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తానని ప్రకటించారు. అయితే, ఆయన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. -
తెలంగాణే మార్గదర్శి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో త్వరలో చేపట్టనున్న జనగణనలో కులగణనను చేర్చాలన్న కేంద్ర నిర్ణయం వెనుక కాంగ్రెస్ పార్టీ అద్వితీయ పోరాటం ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పేర్కొంది. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తన భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి చూపించిందని, దేశానికే మార్గదర్శిగా నిలిచిందని కొనియాడింది. తెలంగాణలో అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించి పారదర్శకంగా నిర్వహించిన కులగణన నమూనానే కేంద్రం అనుసరించాలని తీర్మానించింది. దేశంలోని అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ అంశాల్లో న్యాయం చేసేలా జనగణనను ఎప్పట్లోగా పూర్తి చేస్తుందో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేసింది. శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీ అక్బర్ రోడ్డులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాం«దీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కమిటీ సభ్యులు దామోదర రాజనరసింహ, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. ప్రధానంగా కులగణన, పహల్గాం ఉగ్రదాడిపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలి: ఖర్గే రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర మొదలు, మొన్నటి లోక్‌సభ ఎన్నికల వరకు ఇదే అంశాన్ని ముందుపెట్టి కాంగ్రెస్ పార్టీ పోరాడిందని ఖర్గే చెప్పారు. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన పూర్తి చేసి ప్రభుత్వ పథకాల్లో అమలు చేసే ప్రక్రియను సైతం మొదలు పెట్టిందని ప్రశంసించారు. ప్రజల సమస్యలను నిజాయితీగా లేవనెత్తితే, ఎన్డీఏ వంటి మొండి ప్రభుత్వాలు తలవంచాల్సిందేనని రాహుల్‌గాంధీ నిరూపించారని అన్నారు. అయితే కులగణన సమస్యను ఒక మంచి ముగింపు వచ్చేంత వరకు కాంగ్రెస్ నేతలంతా అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. అనంతరం ఇదే అంశంపై చేసిన తీర్మానంలోనూ తెలంగాణ అంశాన్ని సీడబ్ల్యూసీ ప్రస్తావించింది. తెలంగాణ నమూనాను కేంద్రం అనుసరించాలి ‘తెలంగాణలో కులగణనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పాటించిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన అవసరం ఉందని సీడబ్ల్యూసీ భావిస్తోంది. తెలంగాణలో కుల సర్వే రూపకల్పన పూర్తిగా పౌర సమాజం, సామాజికవేత్తలు, నాయకుల క్రియాశీల ప్రమేయంతో.. సంప్రదింపులు, పారదర్శక ప్రక్రియ ద్వారా జరిగింది. ఈ సర్వే పూర్తిగా బ్యూరోక్రాటిక్ విధానంలో కాకుండా ప్రజల పరిశీలన నుంచి వచ్చింది.అందువల్ల జాతీయ స్థాయి కులగణన కోసం తెలంగాణ పాటించిన విధానాన్ని అనుసరించాలని సీడబ్ల్యూసీ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతోంది. కేంద్రం విశ్వసనీయమైన, శాస్త్రీయమైన, భాగస్వామ్య నమూనాను రూపొందించేందుకు వీలుగా మా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం. సంప్రదింపులు, జవాబుదారీతనం సమ్మిళితత్వంతో విలువలను ప్రతిబింబించే చట్రాన్ని రూపొందించడంలో సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం..’అని సీడబ్ల్యూసీ తన తీర్మానంలో పేర్కొంది. జాప్యం వద్దు..పారదర్శకంగా జరగాలి ‘కులగణన ప్రక్రియలో జాప్యం చేయకూడదు. అన్ని రాజకీయ పార్టీలను పూర్తి విశ్వాసంలోకి తీసుకోవాలి. ఈ అంశంపై పార్లమెంట్లో వెంటనే చర్చ జరపాలి. ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులను కేటాయించి, జనాభా లెక్కల ప్రతి దశకు నిర్దిష్టమైన సమయాన్ని ప్రకటించాలి. కులగణన వివరాల నమోదు ప్రక్రియ పూర్తి సమగ్రంగా, పారదర్శకంగా ఉండేలా చూడాలి. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలకు, విద్యా, ఉపాధి అవకాశాలకు ఈ కులగణనే ప్రాతిపదికగా ఉండాలి. కుల గణన సరిగ్గా జరిగి అమలైతే సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది..’అని తీర్మానంలో స్పష్టం చేసింది. పూర్తి పారదర్శకతతో నిర్వహించాం: సీఎం రేవంత్ తెలంగాణలో కులగణన జరిగిన తీరును సీడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు. కచ్చితత్వంతో, పూర్తి పారదర్శకంగా కులగణన నిర్వహించామని తెలిపారు. ‘బీసీల జనాభా గతం కన్నా 6 శాతం మేర పెరిగింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి, దానిని పార్లమెంట్ ఆమోదానికి పంపించాం. విద్య, ఉద్యోగం, ఉపాధి, నిధుల కేటాయింపుల్లో ఓబీసీ, ఆదివాసీ, దళితులు, మైనార్టిలకు ప్రయోజనం చేకూరేలా ఇకపై ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి.కులగణనతో ఆయా వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. మమ్మల్ని చూసే కేంద్రం కూడా కులగణన చేసేందుకు ముందుకొచ్చింది. దీనిపై రాష్ట్రంలోని నిమ్న వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి..’అని సీఎం తెలిపారు. రేవంత్, దామోదరకు అభినందనలు కులగణన ప్రక్రియలో చేసిన శ్రమ, అమలులో చూపిన చొరవపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదరలను సీడబ్ల్యూసీ కీలక నేతలు అభినందించారు. -
మోదీ సభలో కాంగ్రెస్ నేత శశిథరూర్
-
‘శశి థరూర్ నా పక్కన ఉన్నారు.. వారికి నిద్రలేని రాత్రులే’
తిరువనంతపురం: కేరళ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఓడరేవును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ప్రధాని మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.‘‘ఇవాళ శశి థరూర్ ఇక్కడ కూర్చున్నారు. ఈ వేదికపై ఆయన ఉండటం కొందరికి నచ్చదు. కొందరికి ఇది నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుకుంటుంది’’ అంటూ మోదీ చురకలు అంటించారు. కేరళ సీఎం విజయన్ సమక్షంలోనే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా.. గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధానిని.. శశి థరూర్ స్వయంగా వెళ్లి స్వాగతించిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. ‘‘ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ.. సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగా.. నా నియోజకవర్గానికి వచ్చిన మోదీని సాదరంగా స్వాగతించా’’ అంటూ శశి థరూర్ ట్వీట్ కూడా చేశారు.శశిథరూర్ గత కొన్ని నెలలుగా తన సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్న తెలిసిందే. ఇటీవల ఓ కేంద్ర మంత్రితో ఆయన సెల్ఫీ దిగడంతో థరూర్ పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ కూడా ఆయన ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో ఇవాళ ఆయన ప్రధాని మోదీతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.కాగా, భారత సముద్ర వాణిజ్య చరిత్రలో కొత్త చరిత్రను లిఖించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవు.. సముద్ర రవాణాకు కీలకమైన కేంద్రంగా మారనుంది. దేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ ఓడరేవు అయిన విజింజం ఓడరేవు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాంకేతికంగా అధునాతనమైన ట్రాన్స్షిప్మెంట్ ఓడరేవులలో ఒకటిగా నిలిచింది. -
హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని.. కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ మృతి
జైపూర్: కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూశారు. ఈ ఏడాది మార్చి నెలలో తన ఇంటి పూజగదిలో హారతి ఇస్తుండగా అగ్ని ప్రమాదానికి గురైన గిరిజా వ్యాస్ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. The news of the demise of former Union Minister, former Rajasthan Congress President, and senior Congress leader Dr. Girija Vyas ji is deeply saddening.A distinguished intellectual, powerful orator, and capable administrator, she served the nation and the Congress Party with… pic.twitter.com/2fJN88nva7— B M Sandeep (@BMSandeepAICC) May 2, 2025సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్ (Girija Vyas) మార్చి 31న అగ్ని ప్రమాదంలో పడ్డారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లోని తన నివాసంలో పూజ చేసే సమయంలో హారతి (harathi) ఇచ్చే సమయంలో ఆమెకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఉదయపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. మెరుగైన వైద్యం కోసం ఆమెను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌కు తరలించాలని సూచించారు. ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై గిరిజా వ్యాస్ సోదరుడు గోపాల్ శర్మ స్పందించారు. గిరిజా వ్యాస్ ఇంట్లో హారతి ఇచ్చే సమయంలో ప్రమాదవ శాత్తూ కింద నుంచి మంటలు ఆమె దుప్పటాకు అంటుకున్నాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. తాజాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గిరిజా వ్యాస్ కన్నుమూశారు. ఆమె మరణంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 👉 ప్రముఖ కాంగ్రెస్ నేత గిరిజా వ్యాస్ గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక పదవులు నిర్వహించారు.1985 నుండి 1990 వరకు ఎమ్మెల్యేగా, రాజస్థాన్ పర్యాటక మంత్రిగా పనిచేశారు1991లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. 1996, 1999లో ఉదయపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి, 2009లో చిత్తోర్‌గఢ్ నుండి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (NCW) చైర్ పర్సన్‌గా సేవలందించారు. -
హెడ్లైన్ సరే.. డెడ్‌లైన్ ఏదీ: జైరాం రమేశ్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జాతీయ జనగణన, కులగణనకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించాలని గురువారం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎలాంటి కాల పరిమితి లేకుండా కేవలం కులగణన చేస్తామన్న కేంద్ర ప్రకటనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరాం రమేశ్ తప్పుపట్టారు.ఈ సందర్భంగా ‘నిర్దిష్ట గడువు లేకుండా ముఖ్యమైన ప్రకటనలు ఇవ్వడంలో ప్రధాని మోదీ సిద్ధహస్తుడు. కులగణనపై ఆయన హెడ్లైన్ ఇచ్చారు. డెడ్‌లైన్ మాత్రం చెప్పలేదు. కులగణనపై రోడ్‌మ్యాప్ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఆరేళ్లుగా అడుగుతోంది’అని అన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాక్‌పై తీవ్ర చర్యలు తీసుకోవాలనే డిమాండ్ల నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుల గణన నిర్ణయాన్ని ప్రకటించిందని ఆరోపించారు. కులగణనను మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న బీజేపీ, ఆకస్మికంగా నిర్ణయాన్ని మార్చుకోవడం నైతిక, రాజకీయ ఓటమిని చెప్పకనే చెబుతోందన్నారు. ‘జీఎస్టీ, ఆధార్, ఉపాధి హామీ, ఆహార భద్రతా చట్టాలపై యూటర్న్ తీసుకున్న మోదీ ఇప్పుడు కుల గణనపై అతిపెద్ద యూటర్న్ తీసుకున్నారు. ఈ విషయంలో ప్రధానిని మించిన వారు లేరు’అని రమేశ్ వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జన గణనకు తగినంత బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంపైనా ఆయన అనుమానం సంధించారు. కులగణనకు కాంగ్రెస్ మద్దతిస్తుందంటూ ఆయన.. తగు బడ్జెట్ లేకుండా, నిరి్ధష్ట గడువు లేకుండా, సమగ్ర ప్రణాళిక రూపొందించకుండా కేవలం హెడ్‌లైన్‌తో సరిపెట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమేంటన్నారు. రాజ్యాంగ సవరణ చేయాలని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని డిమాండ్ చేస్తోందన్నారు. -
చివరకు కులగణన వైపే మొగ్గు
కులగణన ప్రతిపాదనపై గత కొన్నేళ్లుగా కారాలూ మిరియాలూ నూరుతూ వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎట్టకేలకు తన వైఖరి మార్చుకుంది. వచ్చే జనగణనతోపాటే కులగణన కూడా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ బుధవారం నిర్ణయించటం దేశ చరిత్రలో ఒక కీలకమైన మలుపు. అయితే ఇప్పటికే అయిదేళ్లుగా వాయిదా పడుతూవస్తున్న జనగణన ఎప్పుడు ప్రారంభిస్తారన్న అంశంలో స్పష్టత లేదు. స్వాతంత్య్రానంతరం అణగారిన కులాలు సైతం విద్యావకాశాలను అందుకోవటం, ఉన్నతోద్యోగాలు సాధించటం వంటి పరిణామాల కారణంగా ఆ వర్గాల్లో చైతన్యం పెరిగింది. జనాభా దామాషా ప్రాతిపదికన అవకాశాలు దక్కటం లేదన్న అసంతృప్తి ఎక్కువైంది. అందుకే కులగణన జరపాలన్న డిమాండ్ ముందుకొచ్చింది. దేశంలో దీన్ని మొట్టమొదట స్వాగతించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2021లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కులగణన జరపాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానంచేసి పంపింది. 2024 జనవరిలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వేగవంతంగా, శాస్త్రీయంగా కులగణన నిర్వహించారు. బిహార్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు సైతం కులగణన చేశాయి. అయితే బీజేపీ మొదటినుంచీ ఈ డిమాండును వ్యతిరేకించింది. 2021 జులై 20 నాడు పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన ఆనాటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ‘జనగణనలో ఎప్పటిలా ఎస్సీ, ఎస్టీ వర్గాల జనాభా లెక్కల సేకరణ మినహా ఇతర కులాల లెక్కింపు జరపరాదన్నది కేంద్రప్రభుత్వ విధానపరమైన నిర్ణయం’ అని ప్రకటించారు. బయట ఎక్కడా నేరుగా కులగణనను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ప్రకటనలు చేయకపోయినా, సమాజాన్ని విచ్ఛిన్నం చేయటానికి కాంగ్రెస్ కులాన్ని ఉపయోగించుకుంటున్నదని విమర్శించేవారు. మొన్నటికి మొన్న పహల్గామ్లో ఉగ్రవాదులు నావికాదళ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌ను మతం ఏమిటో కనుక్కుని కాల్చిచంపటాన్ని ప్రస్తావించి ‘వారడిగింది మతం... కులంకాదు’ అని ఛత్తీస్‌గఢ్ బీజేపీ ట్వీట్ చేసింది. అయితే కులగణన చేయటమే సరైందని ఆరెస్సెస్ భావిస్తున్నదని రెండు నెలల క్రితం ఒక ఆంగ్లపత్రిక వెల్లడించినప్పటినుంచీ దీనిపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి.జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా జరిగితే దేశంలో దాదాపు వందేళ్ల తర్వాత ఆ ప్రక్రియ మళ్లీ అమల్లోకొచ్చినట్టవుతుంది. ఆఖరుసారి వలస పాలకుల హయాంలో 1931లో కులాలవారీ జనాభా లెక్కేశారు. అప్పట్లో 4,147 కులాలున్నట్టు తేల్చారు. 1901లో ఈ సంఖ్య 1,646. తర్వాత 1941లో కూడా కొంతవరకూ జనాభా లెక్కల్లో కులాన్ని గణించారుగానీ రెండో ప్రపంచయుద్ధ కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. స్వాతంత్య్రానంతరం ఎస్సీ, ఎస్టీల వివరాలు మాత్రమే సేకరిస్తున్నారు. పీపుల్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు 1992లో జరిపిన ఒక సర్వే ప్రకారం దేశంలో 4,635 కులాలున్నాయి. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కులగణన నిర్వహిస్తామని వాగ్దానం చేశారు. అనంతరం సాంఘికార్థిక సర్వేకింద 2011–12 మధ్య ఆ లెక్కలు తీశారు. కానీ ఆ డేటాను బయటపెట్టలేదు. ఇటీవల జనగణనపై కాంగ్రెస్ పట్టుబట్టడం మొదలైంది. మతంపై ప్రధానంగా కేంద్రీకరించే బీజేపీ ఇందుకు ససేమిరా సమ్మతించబోదని, అందువల్ల ఎన్నికల్లో కులగణన తనకు ప్రధాన ఆయుధంగా మారుతుందని ఆ పార్టీ భావించింది. కానీ బీజేపీ హఠాత్తుగా మనసు మార్చుకోవటంతో కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ నినాదం లేకుండా పోయింది. అణగారిన కులాలు అడిగాయని కాదు... కులం ఒక వాస్తవం అయినప్పుడూ, సమాజంపై దాని ప్రభావం అమితంగా వున్నప్పుడూ ఎవరి సంఖ్య ఎంతో తేల్చటం ప్రభుత్వాల బాధ్యత. ఇన్నాళ్లూ దాన్ని విస్మరించారు. ఇందువల్ల రెండు రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సంక్షేమ ఫలాలు లక్షిత వర్గాలకు సరిగా చేరటం లేదు. ఇప్పటికీ విద్యాగంధం అంటని, ప్రభుత్వ పథకాల సంగతే తెలియని కులాలవారు గణనీయంగావున్నారు. ఫలితంగా బడ్జెట్లలో గర్వంగా ప్రకటించుకునే పథకాలు ఆచరణలో నిరుపయోగం అవుతున్నాయి. ఇక ఇంద్ర సాహ్ని కేసులో రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు నిర్ణయం కోటా పెంపు ప్రయత్నాలకు అవరోధమవుతోంది. సమస్య వుందని ప్రభుత్వాలకు తెలిసినా, కొత్తగా తెరపైకొస్తున్న కులాలకు న్యాయం చేద్దామనుకున్నా అసాధ్యమవుతున్నది. అన్ని రంగాల్లోనూ ఆధిపత్య కులాల హవా కొనసాగుతోంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవటంలో, గాలివాలుకు అనుగుణంగా దూసుకెళ్లటంలో బీజేపీ దరిదాపుల్లోకొచ్చే రాజకీయపక్షం మరొకటి లేదు. వాస్తవానికి గత లోక్‌సభ ఎన్నికల ముందూ... మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భాల్లో కులగణనపై కేంద్రం నిర్ణయం ప్రకటిస్తుందని అందరూ భావించారు. అలాచేస్తే కాంగ్రెస్ డిమాండుకు తలొగ్గినట్టయ్యేది. పహల్గామ్ మారణకాండపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నవేళ కులగణన నిర్ణయం తీసుకోవటంతో అది తన ఘనతేనని కాంగ్రెస్ చెప్పుకునే పరిస్థితి లేకుండాపోయింది. పైగా కేంద్రంలో ఎక్కువకాలం అధికారంలోవున్నా కులగణన జోలికి పోకపోవటం... 2011–12లో ఆ పని చేసినా దాన్ని సామాజికార్థిక సర్వేగా చెప్పటం ఆ పార్టీకి పెద్ద మైనస్. బిహార్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ తీసుకున్నా తాజా నిర్ణయం నిస్సందేహంగా బీజేపీకి ఉపకరిస్తుంది. అయితే దీని వెంబడి రాగల ఇతరేతర డిమాండ్లతో ఆ పార్టీ ఎలా వ్యవహరిస్తుందన్నది చూడాలి. -
‘రాహుల్, కాంగ్రెస్ పార్టీలకు భయపడి మేం నిర్ణయాలు తీసుకోం’
ఢిల్లీ : వచ్చే జనగణనలో కులగణన చేర్చుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రతిపక్ష పార్టీలు రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కుట్రలు, కుతంత్రాలు చేశారని, ముస్లింలందరినీ బీసీల్లో చేర్చారన్నారు కిషన్ రెడ్డి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తమ ఘనతేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు కిషన్ రెడ్డి. తాము రాహుల్ గాంధీకో, కాంగ్రెస్‌కో భయపడి కులగణన నిర్ణయం తీసుకోలేదన్నారు. జనగణనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారంటే..జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.ఈ కులగణన చరిత్రపుటల్లో నిలిచిపోనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత ప్రతిపక్ష పార్టీలు.. రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారు.గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి.. కుట్రలు, కుతంత్రాలు చేశారు.ముస్లింలందరినీ.. బీసీల్లో చేర్చారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి.. ప్రజలను మతం పేరుతో విడగొడుతూ.. మతఘర్షణలు సృష్టించిన కాంగ్రెస్ పార్టీ.. కులాల పేరుతోనూ.. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేసింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలపై, బీసీలపై కపటప్రేమను చూపించడం ఒక్కటే కాదు.. వీలు చిక్కినపుడల్లా విషం కక్కిన సందర్భాలు కూడా చరిత్రలో ఎన్నో ఉన్నాయి.ఎస్సీ అయిన రామ్‌నాథ్ కోవింద్ గారిని, ఎస్టీ అయిన ద్రౌపది ముర్ముగారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినపుడు.. వ్యతిరేకించి తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మాదిగ రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించేందుకు.. మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పూర్తి వివరాలు అందజేసిన తర్వాత.. ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమమైంది.వెనుకబడిన వర్గాలనుంచి వచ్చిన.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కులం పేరుతో దూషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ కూడా.. బీసీలపట్ల మొసలికన్నీరు కార్చుతోంది. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఏనాడూ పనిచేయలేదు.2018లో జాతీయ బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానికే దక్కుతుంది.2019లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకోసం 10% రిజర్వేషన్ ను (EWS) అమల్లోకి తీసుకొచ్చింది.సమాజంలోని అన్ని వర్గాలకు సరైన న్యాయం జరగాలని.. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదంతో చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నాం. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి వారి సాధికారిత కోసం, వారికి ఆత్మగౌరవం కల్పించిన ఘనత మోదీ గారిది.ముస్లిం మహిళలపై ‘ట్రిపుల్ తలాక్’ వంటి అనాగరికమైన విధానాలను రద్దు చేసి..ముస్లిం మహిళలకు హక్కులు, అధికారాన్ని కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానిది.సమాజంలోని ఏ ఒక్క వర్గానికీ.. తమను పట్టించుకోవడం లేదు.. అనే భావన రానీయకుండా మేం పనిచేస్తున్నాం.1881 నుంచి 1931 కులగణన జరిగింది. కానీ స్వాతంత్ర్యానంతరం కులగణన జరగకూడదని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం 1951 నుంచి నేటివరకు ఏనాడూ కులగణన జరగలేదు.మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీ కులగణనకు వ్యతిరేకంగానే ఉంది. నెహ్రూ, మౌలానా ఆజాద్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కులగణన పట్ల బహిరంగంగానే విముఖత వ్యక్తం చేశారు.మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాజీవ్ గాంధీ వ్యతిరేకించారు.6 సెప్టెంబర్, 1990 నాడు.. పార్లమెంటులో రాజీవ్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో బీసీలకంటే ముస్లింలు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నారని, వారికి చేయూత అందించాలని చెప్పారు. బీసీలను పక్కనపెట్టి ముస్లింల హక్కుల గురించి మాట్లాడారు.అంతే తప్ప బీసీలకు న్యాయం చేసే విషయంలో ఒక్క మాట కూడా సానుకూలంగా మాట్లాడలేదు.2010లో నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.. కులగణనపై మంత్రులతో సబ్ కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో, 2010లో బీజేపీ పక్షనేత సుష్మాస్వరాజ్ గారు.. నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారికి లేఖ రాస్తూ.. తమ పార్టీ కులగణనకు అనుకూలంగా ఉన్నామని లేఖ రాశారు.దీనిపై కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పక్కనపెట్టి.. 2011లో జనగణన చేసింది.బీజేపీ మొదట్నుంచీ కులగణనకు సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తోంది. కానీ ఇది రాజకీయ అస్త్రంగా కాకుండా.. సామాజికంగా అన్ని వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడేలా ఉండాలనేది బీజేపీ ఆలోచన.దేశంలో కులగణన జరిగితే.. సామాజిక, ఆర్థిక పరమైన లబ్ధి పేదలకు అందించడంలో ఈ డేటా ఉపయోగపడుతుంది.సంక్షేమపథకాలు, రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేసేందుకు జనగణన డేటా ఉపయుక్తం అవుతుంది.ఇది మా ప్రభుత్వ స్పష్టమైన వైఖరిని ప్రస్ఫుటం చేసింది.కానీ, 2011లో జనగణనతో పాటుగా కులగణన చేయడాన్ని నాటి హోంమంత్రి చిదంబరం.. వ్యతిరేకించారు.బీజేపీ తరపున.. చాలా సందర్భాల్లో అమిత్ షా గారు మాట్లాడుతూ.. జనగణన చేపట్టినపుడు కులగణన చేస్తామని చెప్పారు.గతంలో సుష్మాస్వరాజ్ గారు ఇచ్చిన లేఖ ఆధారంగా.. మా పాలసీ మేరకు.. ఇవాళ మేం జనగణనలో భాగంగా కులగణన చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ, కాంగ్రెస్ అండ్ pvt Ltd కంపెనీలు.. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నాయి. మోదీ సర్కారు తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం.. తమ ఘనత అన్నట్లు రాహుల్ గాంధీ చెప్పుకోవడం సిగ్గుచేటు.రాహుల్ గాంధీకో, కాంగ్రెస్ పార్టీకో భయపడి బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదు.ఎద్దులబండి కింద కుక్క.. మొత్తం బండిని తానే మోస్తున్నానని అనుకుంటుంది.అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా.. తాము చెప్పినట్లే ప్రభుత్వాన్ని నడిపిస్తామని చెప్పుకుంటోంది.ఇది హాస్యాస్పదం.2010లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ కమిట్మెంట్ తో అయితే.. నిర్ణయం తీసుకున్నామో.. దానికి కట్టుబడి ముందుకెళ్తున్నాం.దేశానికి, సమాజానికి ఏ నిర్ణయం వల్ల మేలు జరుగుతుందో ఆలోచించి.. నిర్ణయం తీసుకుంటాం.ఆ నిర్ణయాలు తీసుకునే సత్తా బీజేపీకి, ఎన్డీయేకు, మోదీ గారి నాయకత్వానికి ఉంది.ఆర్టికల్ 370 రద్దు, రామజన్మభూమి, ట్రిపుల్ తలాక్, GST వంటి ఏ నిర్ణయాన్నయినా.. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటాం.మేం చేపట్టబోయే కులగణనలో.. ఎట్టిపరిస్థితుల్లోనూ ముస్లింలను బీసీల్లో చేర్చబోం.మత ప్రాతిపదికన ఎవరినీ బీసీల్లో చేర్చే ప్రసక్తే లేదు. రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానాల తీర్పుకు విరుద్ధంగా బీసీ ముస్లింలు అనే ఆలోచనతో కాంగ్రెస్ ముందుకెళ్లింది. దీన్ని మేం ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం.కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా.. షార్ట్ టర్మ్ లక్ష్యాలతో, ఓటుబ్యాంకు రాజకీయాలు, అధికార దాహంతో తీసుకున్న నిర్ణయాలే తప్ప.. దేశం హితం కోసం, దేశ ప్రజల అభ్యున్నతి గురించి ఆలోచించలేదు.తెలంగాణ, కర్ణాటకల్లో రాష్ట్రాల్లో చేపట్టిన కులగణన కూడా హడావుడిగా.. ఏదో సాధించామని చెప్పుకునే ప్రయత్నం చేశారు తప్ప.. ఇందులో చిత్తశుద్ధి లేదు. ఇది కులగణన కాదు. ఇది కులాలకు సంబంధించిన సర్వే.కులగణన చేయాలంటే.. విధానపరమైన నిర్ణయాలు చాలా తీసుకోవాల్సి ఉంటుంది.50% జనాభాను కూడా చేరుకోకుండా మొత్తం సర్వే పూర్తి చేశామని చెప్పడం హాస్యాస్పదం.శాస్త్రీయమైన పద్ధతిలో ఈ సర్వే జరగలేదు.బీసీల్లోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే.. నిష్పాక్షికమైన, సైంటిఫిక్ పద్ధతిలో కులగణన జరగాలనేదే మోదీ సర్కారు ఆలోచన. దీనికోసమే.. జనగణన వరకు వేచి చూశాం.జనగణన చేస్తున్నప్పుడే.. కులగణన సాధ్యమవుతుంది.ఈసారి నిర్మాణాత్మకంగా జనగణన చేపట్టడం అందులో భాగంగా కులగణన జరపాలనేదే మా ప్రభుత్వ స్పష్టమైన విధానం.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ గారు పదేళ్లలో కులగణన ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు.2010లో రేవంత్ ఏ పార్టీలో ఉన్నారో తెలియదు.అప్పుడే మేం కులగణనకు ఆమోదం తెలిపాము.ప్రతి పదేళ్లకోసారి, దశాబ్దపు మొదటి సంవత్సరంలో కులగణన జరుగుతుంది.బీజేపీ అధికారంలోకి వచ్చాక తొలిసారి జనగణన జరుగుతున్నప్పుడు.. కులగణన కూడా జరుగుతుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టలేదో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి.నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీలు కులగణను వ్యతిరేకించారు.తూతూ మంత్రంగా.. తంతు లాగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకోవడం లేదు.వాస్తవాలకు అనుకూలంగా, శాస్త్రీయమైన పద్ధతిలో కులగణన ఉంటుంది.ఒకసారి పబ్లిష్ చేసి.. లోపాలుంటే.. మరో రెండ్రోజులు సమయం ఇచ్చి.. మీ ఇష్టం వచ్చినట్లు సర్వే చేశారు తప్ప.. ఇందులో శాస్త్రీయత లేదు.ఈ విషయం రాహుల్ గాంధీకి అర్థం కాలేదు.తెలంగాణలో ఉన్న రాంగ్ రోల్ మోడల్ మాకు అవసరం లేదు.మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి.. సమగ్రంగా జనగణ చేస్తాం.కులగణన చేపట్టేందుకు ‘సెన్సెస్ యాక్ట్ 1948’లో సవరణ తీసుకొచ్చి.. ఇందులో ‘కులం’ అనే పదాన్ని ఓ ప్యారామీటర్ గా చేర్చాలి.వచ్చే పార్లమెంటు సమావేశాల్లో.. దీనికి సంబంధించిన సవరణ తీసుకొచ్చాకే.. జనగణనపై ముందుకెళ్తాం.కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడుతున్నారు.తెలుగు ప్రజలు, దేశ ప్రజలు ఈ రెండు పార్టీలను నమ్మడం లేదు.కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏనాడూ బీసీలకు సంబంధించిన అంశాల్లో.. రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో పనిచేయలేదు.42% బీసీ జనాభా ఉన్నప్పటికీ.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను ఎందుకు ఇవ్వలేదు.కులగణను ఏనాడూ బీజేపీ వ్యతిరేకించలేదు.మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓడిపోవడం ఖాయం.2026లో జనగణన మొదలయ్యే అవకాశం ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడే కులగణన ఉంటుంది.రేవంత్ సర్కారు చేసిన సర్వే.. బీసీ వ్యతిరేక సర్వే.బీసీ ముస్లింలని జోడించి చేసిన సర్వేను మేం వ్యతిరేకిస్తున్నాం.హైదరాబాద్ లో 150 కార్పొరేషన్ సీట్లలో.. బీసీలకు రిజర్వ్ చేసిన 50 సీట్లలో.. 30 సీట్లు ముస్లింలే గెలిచారు -
‘జాతీయ కులగణన వ్యతిరేకి కాంగ్రెస్’
హైదరాబాద్: జాతీయ కులగణనకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి అంటూ కేంద్ర హెంశాఖ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కులగణన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం తమ ఘనతే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌కు బండి సంజయ్ చురకలంటించారు. ‘కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో జనాభా లెక్కల్లో కులగణనను చేర్చకపోవడమే నిదర్శనం. కులగణన చేయాలంటూ అన్ని పార్టీలు కోరినా పట్టించుకోని దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్సే. మోదీ సర్కార్ నిర్ణయం కాంగ్రెస్ ఘనతేనని చెప్పడం సిగ్గుచేటు. అదే నిజమైతే డూప్లికేట్ గాంధీల ఏలుబడిలో కులగణన ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి. దేశవ్యాప్త కులగణన మోదీ సర్కార్ ఘనతే. రాష్ట్ర ప్రభుత్వ కులగణన సర్వే అంతా తప్పుల తడకే. కేసీఆర్ సమగ్ర సర్వేకు, రేవంత్ సర్కార్ సర్వేకు పొంతన లేకపోవడమే నిదర్శనం. కేంద్ర కులగణన అత్యంత శాస్త్రీయమైది. కులాల వారీగా జనాభా ఎంతో తేలిపోతోంది. జనాభా ఆధారంగా రిజర్వేషన్లలో న్యాయం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించండి’ అని బండి సంజయ్ కోరారు. -
CM Revanth: BRS సభకు ఎన్ని బస్సులు అడిగితే అన్ని ఇవ్వమని చెప్పాం
-
ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబం: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉండాలని, ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఉత్త విమర్శలు చేస్తూ కాలయాపన చేయడం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం శ్రీమహాత్మ బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.12వ శతాబ్దంలోనే సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసిన విప్లవకారుడు బసవేశ్వరుడు. ఆయన జయంతి రోజున పదోతరగతి ఫలితాలు విడుదల చేసుకోవడం సంతోషం. పరీక్షలు పాసైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. బసవన్న స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తోంది. కుల, మత, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అభ్యుదయవాది బసవన్న. బసవేశ్వర స్ఫూర్తితోనే పంచాయతీ రాజ్ పార్లమెంటరీ వ్యవస్థను మనం తెచ్చుకున్నాం. ప్రతీ మనిషి గౌరవంగా బతికేలా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి. పాలకపక్షం తీసుకునే నిర్ణయాలలో లోపాలను ఎత్తి చూపేందుకే ప్రతిపక్షం అనే వ్యవస్థ ఉంది. మొన్న ఒకాయన(కేసీఆర్‌ను ఉద్దేశించి..) వరంగల్ లో సభ పెట్టి కాంగ్రెస్‌ను విమర్శించిండు. వాళ్లు రజతోత్సవాలు , విజయోత్సవాలు ఏర్పాటు చేసుకుంటే ఆర్టీసీ నుంచి బస్సులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది. వరంగల్ సభలో మేం చేసిన మంచిని అభినందించి ప్రజా సమస్యలను అక్కడ ప్రస్తావించి ఉంటే నిజంగానే ప్రజలు ఆయన్ను అభినందించే వాళ్లు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు?. ఇన్నాళ్లుగా ఆయన ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీతభత్యాలు తీసుకున్నారు.. ఇది ఏ చట్టంలో ఉంది?. ప్రతిపక్ష నాయకుడిగా రూ. 65 లక్షలు, వాహనాలు, పోలీస్ భద్రత తీసుకున్నారు. మరి ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేయకుండా ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారుఫామ్ హౌజ్‌లో పడుకుని ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు?. సంక్షేమ పథకాలు ఆగిపోయాయని ఆయన మాట్లాడిండు. రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వీటిలో ఏది ఆగిపోయింది?. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం.. ఇవేవీ మీకు కనిపించడంలేదా?. మీరు ఏ మత్తులో తూగుతున్నారో మీకే తెలియాలి. కడుపు నిండా విషం పెట్టుకుని విద్వేష పూరితప్రసంగం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు?ప్రజలు విజ్ఞులు.. ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కేసీఆర్‌కు లేదు. పదేళ్లు ప్రజలు మెచ్చే పరిపాలన చేస్తాం. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చ చేద్దాం రండి. ఏ అంశంపైన అయినా సరే చర్చకు సిద్ధం. కాళేశ్వరం, ఉచిత బస్సు, రుణమాఫీ, రైతు బంధు, మేం ఇచ్చిన 60 వేల ఉద్యోగాలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన వీటిలో దేనిపై చర్చ చేద్దాం చెప్పండి.. కేసీఆర్. చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం.కేసీఆర్ మాటల్లో.. కళ్ళల్లో విషం కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ విలన్ ఎలా అవుతుంది?. పదేళ్లు దోచుకున్న మీకు కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు లేదు. ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబం. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్లు కేసీఆర్ వరంగల్ వెళ్లారు. ఆయన వరంగల్ వెళ్లి పాపాలు కడిగేసుకున్నానుకుంటున్నారు.. కానీ అక్కడికి వెళ్లి అబద్ధాలు మాట్లాడి ఇంకో తప్పు చేశారు. వరంగల్ సభలో నా పేరు కూడా పలకలేకపోయారుబసవేశ్వరుడి స్ఫూర్తితో ‘రాష్ట్ర ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’ అనే విధానంతో మా ప్రభుత్వం ముందుకు వెళుతున్నాం. ప్రజలకు మేలు చేయడమే మా పని… ప్రచారం చేయాల్సింది మీరే. మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు’’ అని రేవంత్ అన్నారు. -
బిడ్డా.. మీరెక్కడమ్మా
మహబూబ్‌నగర్: ఆ ఇద్దరు విద్యార్థునులవీ నిరుపేద కుటుంబాలే.. ఒకరి తండ్రేమో కాళ్ల వాపుతో ఐదేళ్లుగా.. మరొకరి తండ్రి రోడ్డు ప్రమాదంలో కాళ్లు కోల్పోయి మూడేళ్లుగా మంచాలకే పరిమితమయ్యారు. దీంతో తాము కష్టపడినా.. తమ పిల్లలైనా బాగుపడాలని భావించిన ఆ తల్లులు కాయాకష్టం చేసి వారిని చదివించుకుంటున్నారు. ఇంతటి కష్టంలోనూ ఆ నిరుపేద కుటుంబాలపై దేవుడు ఏమాత్రం కనికరం లేకుండా మరో పిడుగు వేశాడు. రోడ్డు ప్రమాద రూపంలో ఇద్దరు విద్యార్థులను కబళించి.. తల్లిదండ్రుల ఆశలను, విద్యార్థుల కలలను ఛిద్రం చేశాడు. తీరని గోస.. మాగనూరు మండలంలోని గురువలింగంపల్లి గ్రామానికి చెందిన గోసాయి మారెప్ప, మాణిక్యమ్మల దంపతులకు కుమారుడు రమేష్ గౌరి, మహేశ్వరి ఉన్నారు. అయితే ఐదేళ్ల క్రితం గోసాయి మారెప్ప కాళ్లవాపు వ్యాధితో మచ్చానికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబ పోషణ కోసం కుమారుడు రమేష్ దినసరి కూలి బాటపట్టగా.. తల్లి మాణిక్యమ్మ స్థానికంగా బిచ్చమెత్తుకుంటూ భర్తను చూసుకుంటుంది. కాగా.. ఇద్దరు కూతుళ్లు కష్టపడి చదివి బీఎస్సీ నర్సింగ్ ప్రభుత్వ సీట్లు సాధించారు. గౌరికి వనపర్తి జిల్లాలో సీటు రాగా, మహేశ్వరి (చివరి అమ్మాయి)కి గద్వాల జిల్లాలో ఉచిత సీటు వచ్చింది. దీంతో మహేశ్వరి గద్వాలలో హాస్టల్లో ఉంటూ బీఎస్సీ నర్సింగ్ తృతీయ సంవత్సరం చదువుతుంది. పేదరికంతో ఇబ్బందులు పడుతున్న తన కుటుంబానికి బాసటగా నిలుద్దామని కలలు కన్న ఆ విద్యార్థిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యుఒడికి చేరడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ‘బిడ్డా.. నీవెక్కడమ్మా’ అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులతో కంటతడి పెట్టించింది. మృతిచెందిన కూతురును కళ్లతో చూద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రమేష్ (అన్న)ను తీసుకెళ్లారు. కదిలించిన ప్రమాదం గద్వాల జిల్లాకేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అధికార, రాజకీయ నాయకులను కదిలించింది. ప్రమాదంలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు మృతిచెందడంతో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కుల, విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం రాత్రి జిల్లా ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత విద్యార్థినుల కుటుంబాలని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు రోడ్డు ప్రమాదంపై ప్రత్యేకంగా విచారణ చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ పోలీసులను ఆదేశించారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాల వివరాలు, స్థితిగతులపై ఆరా తీయాలని రెవెన్యూ సిబ్బందికిఉ సూచించారు. మిన్నంటిన రోదనలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దఎత్తున జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి బోరున విలపించడంతో ఆస్పత్రి ఆవరణలో రోదనలు మిన్నంటాయి. మనీష మృతదేహంపై తల్లిదండ్రులు బోయ రాజు, శ్రీదేవి పడి గుండెలు అవిసేలా రోదించారు. ఎన్నో ఆశలతో నర్సింగ్ కోర్సు పూర్తి చేసి ప్రజలకు సేవ చేస్తానని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని విలపించారు. త్వరలో వేసవి సెలవులు వస్తాయని, ఇంటికొస్తానని చెప్పిన మాటలను తండ్రి గుర్తు చేసుకొని కంటతడి పెట్టడం పలువురిని కదిలించింది.తల్లి కష్టమే ఆధారం.. పాన్‌గల్ మండలం రాయినిపల్లి గ్రామానికి చెందిన శ్రీదేవి, రాజుల దంపతులకు కూతురు మనీష, కుమారుడు మనోజుకుమార్ ఉన్నారు. తండ్రి రాజు మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగిపోవడంతో ఎలాంటి పనులు చేయలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యా డు. దీంతో కుటుంబ భారమంతా తల్లి శ్రీదేవిపై పడింది. దీంతో ఆమె స్థానికంగా చిన్నపాటి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ.. మనీషశ్రీని నర్సింగ్ చదివిస్తుంది. మరో ఏడాదిలో చదువు పూర్తి చేసుకొని తమ పేద కు టుంబానికి తోడుగా ఉంటుందనుకున్న తరుణంలో కూతురు అకాల మరణం చెందడంతో కుటు ంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్ర మాదం విషయం తెలియడంతో కుటుంబ సభ్యు లు అందరూ గద్వాలకు బయలుదేరి వెళ్లారు. -
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్
-
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
భద్రాద్రి కొత్తగూడెం,సాక్షి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రోటోకాల్ రగడ అధికార కాంగ్రెస్‌లో చర్చాంశనీయంగా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ కరువైంది. దమ్మపేట మండలం పూసికుంటలో మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పర్యటనలో గిరిజన ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు అవమానం జరిగింది.కోట్లాది రూపాయల పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు ఆహ్వానం అందలేదు. అధికారులు సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యేని పట్టించుకోలేదు. ఆహ్వానం అందకపోయినా కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల సమక్షంలో అధికారుల తీరుపై జారే మండిపడ్డారు. తీవ్ర ఆవేదనతో మాట్లాడారు. ఎమ్మెల్యే చచ్చిపోయాడనుకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శంకుస్థాపన నిలిపివేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..ఎమ్మెల్యే జారె ఆదినారాయణను సముదాయించేందుకు తన కారులోకి తీసుకెళ్లారు. ఎలాగోలా సముదాయించి ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో శంకుస్థాపన చేయించారు. అయినప్పటికీ ఎమ్మెల్యే జారె వర్గీయులు వెనక్కి తగ్గలేదు. అధికారుల నిర్లక్క్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. -
ప్రధాని మోదీపై కాంగ్రెస్ వివాదాస్పద పోస్ట్
-
సెట్ చేయడానికే ఏడాది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అనర్థాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని, రాష్ట్ర ఖజానా అంతా లూటీ చేసింది ఆయనేనని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ రజతోత్సవం పేరుతో ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో ఆయనలో ఉన్న అక్కసునంతా వెళ్లగక్కాడని విమర్శించారు. వాస్తవానికి తాను ముఖ్యమంత్రిని అయిన రోజునే కేసీఆర్ గుండె పగిలిందని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక.. అంతకుముందు పదేళ్లలో కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని సెట్ చేయడానికే ఏడాది కాలం సరిపోయిందని, ఇప్పుడంతా స్ట్రీమ్‌లైన్ (క్రమబద్ధీకరణ) చేస్తున్నామని చెప్పారు. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి నివాసంలో రేవంత్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. బీఆర్ఎస్ సభ, మావోయిస్టుల సమస్య, కేసీఆర్ పాలన, తన పనితీరు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, రాహుల్‌గాందీతో తనకున్న మైత్రి తదితర అంశాలపై మాట్లాడారు. ఎవరో అడుగుతున్నారని అరెస్టులు ఉండవు ‘కేసీఆర్ ప్రసంగంలో పస లేదు. బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభ కంటే నేను గజ్వేల్‌లో పెట్టిన సభే హైలైట్. ఖమ్మంలో జరిగిన రాహుల్‌గాంధీ సభకు బీఆర్ఎస్ హయాంలో కనీసం బస్సులు కూడా ఇవ్వలేదు. కానీ మేం బీఆర్ఎస్ నేతలు అడిగినన్ని బస్సులు ఇచ్చాం. తద్వారా ఆర్టీసీకి ఆదాయం కూడా వచ్చింది. హరీశ్, కేటీఆర్‌లు చిన్నపిల్లలని నేను అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్నే కేసీఆర్ ఎల్కతుర్తి సభలో చెప్పాడు. మరి పిల్లగాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నాడు? కేసీఆర్, మోదీ వారి అవసరాలకు అనుగుణంగా మాట్లా డుతుంటారు. కేసీఆర్ తరహాలో నేను చట్టాన్ని అతిక్రమించి పనిచేయను. ఎవరో అడుగుతున్నా రని అరెస్టులు చేసే పరిస్థితి ఉండదు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడేది లేదు. చట్టప్రకారమే అన్నీ జరుగుతాయి..’ ముఖ్యమంత్రి అన్నారు. ఏ పథకమైనా అర్హులందరికీ లబ్ధి చేకూరాలి ‘కేసీఆర్ తరహాలో లాంచింగ్, క్లోజింగ్ పథకాలు నేను పెట్టలేను. షోపుటప్ స్కీంలు నాతో కాదు. ఒక పథకాన్ని ప్రారంభిస్తే అర్హులందరికీ లబ్ధి కలిగేంతవరకు పనిచేస్తా. రేవంత్‌రెడ్డి చెప్పిందే చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కలిగేలా పనిచేస్తా. ఇప్పటివరకు ప్లానింగ్‌కే సమయం సరిపోయింది. ఇక నుంచి స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. పథకాల గ్రౌండింగ్ చేస్తాం. అయితే ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలను చెప్పుకోవడంలో కూడా మేము వెనుకబడ్డాం. ఏడాదిన్నరలోనే ఎన్నో పథకాలు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఎన్నో పథకాలు తీసుకువచ్చాం. ఇప్పుడు వాటన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేస్తున్నాం. మేము అమలు చేస్తున్న పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవు. బీఆర్ఎస్ తరహాలో మాకు కూడా తెలంగాణ ప్రజలు పదేళ్లు అవకాశం ఇస్తారు. వాస్తవానికి నా పాలన, పథకాల అమలుపై ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే చర్చ జరుగుతోంది..’ అని రేవంత్ చెప్పారు. రాహుల్‌తో మంచి సంబంధాలున్నాయి ‘రాహుల్‌గాంధీతో నా స్నేహం గురించి నాకు తెలిస్తే చాలు. ఎవరో ఏదో చెబితే వినాల్సిన పనిలేదు. ఆయనతో నాకు మంచి సంబంధాలున్నాయి. మా ఇద్దరి గురించి బయటి వారు ఏం మాట్లాడుకుంటున్నారనేది నాకు అవసరం లేదు. ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన రాజకీయ యోధురాలు లేరు. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఆమెది. వేరే ఆప్షన్ లేకే ఆ అధికారుల కొనసాగింపు పాలన అవసరాలను బట్టి అధికారులను వినియోగించుకుంటాం. కొందరు అధికారుల గురించి అన్ని విషయాలు తెలిసినా వేరే ఆప్షన్ లేకపోవడంతో కొనసాగించాల్సి వస్తోంది. కలెక్టర్లను మార్చుకునే వెసులుబాటు ఉంది కనుకనే మారుçస్తున్నాం. సీపీఐ, ఎంఐఎంకు అండగా ఉన్నా.. నేను ఇంకా ఇరవై ఏళ్లు రాజకీయాల్లో ఉంటా. నన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ మర్చిపోను. నన్ను నమ్మిన సీపీఐకి, ఎంఐఎంకు అండగా ఉన్నా. అద్దంకి దయాకర్‌కు పదవి ఇప్పించగలిగా. దయాకర్ ఓపికతో ఉన్న కారణంగానే పదవి వచ్చింది. ఓపికతో ఉంటేనే నాకు కూడా బాధ్యత ఉంటుంది. అవకాశాలు వస్తాయి. అలా కాదని బయటకు వచ్చి స్లీపింగ్ రిమార్కులు చేస్తే నాపై భారం తగ్గించినట్టే అవుతుంది. పదవి ఇవ్వలేని పరిస్థితికి, వారి మాటలకు చెల్లుకు చెల్లు అయినట్టు నేను ఫీల్ అవుతా..’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఎంత చెప్పినా కొందరు ఎమ్మెల్యేలు వినడం లేదు ‘కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో సరిగా పనులు చేసుకోలేకపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వారు హైదరాబాద్ వదిలి వెళ్లలేకపోతున్నారు. మీడియా చుట్టూ తిరిగేందుకే పరిమితం అవుతున్నారు..’ అని సీఎం వ్యాఖ్యానించారు. మావోయిస్టులపై పార్టీ నిర్ణయమే ఫైనల్ ‘ఆపరేషన్ కగార్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. మావోయిస్టుల విషయంలో పార్టీ నిర్ణయమే ఫైనల్. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తాం..’ అని రేవంత్ తెలిపారు. జానా నివాసంలో ‘కగార్’పై చర్చలు లోకాయుక్త, ఉప లోకాయుక్త పదవీ స్వీకార కార్యక్రమానికి సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడి నుంచి నేరుగా మాజీ మంత్రి కె.జానారెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ జానారెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డిలతో సమావేశమయ్యారు. ఆపరేషన్ కగార్ గురించి చర్చించారు. మావోయిస్టుల సమస్యకు సంబంధించి శాంతి చర్చల కమిటీ ఆదివారం తనతో సమావేశం కావడాన్ని, తాను చొరవ తీసుకుని కేంద్రాన్ని శాంతి చర్చలకు ఒప్పించేలా చూడాలని వారు కోరిన విషయాన్ని తెలియజేశారు. గతంలో మావోయిస్టులతో చర్చలు జరిగినప్పుడు జానారెడ్డి హోంమంత్రిగా, కేశవరావు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో.. శాంతి చర్చల కమిటీ ప్రతిపాదనలపై ఏం చేయాలన్న దానిపై వారితో చర్చించారు. అక్కడి నుంచే ఏఐసీసీ సీనియర్ నేతలు దిగ్విజయ్‌సింగ్, చిదంబరంలతో సీఎం మాట్లాడారని సమాచారం. కాగా శాంతి చర్చల కమిటీ ప్రతిపాదనను పార్టీ అధిష్టానానికి పంపాలని సమావేశంలో నిర్ణయించారు. -
పోలీస్ అధికారితో అలా.. సహనం కోల్పోయిన సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఓ పోలీస్ అధికారిపై చెయ్యేత్తి కొట్టబోయారు. అదీ పెద్ద పెద్ద నేతలు పాల్గొన్న ఓ పబ్లిక్ మీటింగ్‌లో. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండగా.. ప్రతిపక్షాలే కాదు సామాన్యులు సైతం మండిపడుతున్నారు.సోమవారం బెలగావిలో సంవిధాన్ బచావో & ధరల వ్యతిరేకల నిరసన ప్రదర్శన జరిగింది. అయితే ఆ సమయంలో బీజేపీకి చెందిన కొందరు అక్కడికి చేరుకుని నల్ల జెండాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఫ్లకార్డులతో నిరసన నినాదాలు చేశారు. దీంతో ఆయన సహనం కోల్పోయారు. ‘‘ఏయ్ ఎవరు మీరు? నోరు మూయండి’’ అంటూ గట్టిగా అరిచారాయన.అయినా కూడా వాళ్లు శాంతించకపోవడంతో.. అక్కడే ఉన్న ఏఎస్పీ నారాయణ్ భరమణిని దగ్గరకు పిలిచారు. ‘‘ఏయ్.. ఎవరు ఇక్కడ ఎస్పీ? ఏం చేస్తున్నావ్? అంటూ చెయ్యేత్తి కొట్టబోయారు. అయితే ఆ అధికారి వెనక్కి వెళ్లగా.. సీఎం కూడా తేరుకుని చెయ్యిని వెనక్కి లాక్కున్నారు. ‘‘ఏం చేస్తున్నారయ్యా మీరంతా? వాళ్లంతా ఇక్కడి దాకా ఎలా రాగలిగారు?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన.#Karnataka Chief Minister #Siddaramaiah lost his temper and raised his hand to slap a senior police officer while he was addressing a Congress rally against the Centre's policies in #Belagavi on Monday.🔗https://t.co/kkeaADaLnu@XpressBengaluru pic.twitter.com/pTntV5QZrN— The New Indian Express (@NewIndianXpress) April 28, 2025ఈ వీడియో కన్నడనాట దుమారం రేపింది. అధికారం శాశ్వతం కాదని.. తమరు ఐదేళ్లు అధికారంలో ఉంటారని.. కానీ ఆ అధికారి 60 ఏళ్లు వచ్చే దాకా డ్యూటీలో ఉంటారంటూ జేడీఎస్ ట్వీట్ చేసింది. ఇక.. బీజేపీ ఆ అధికారికి సీఎం సిద్ధరామయ్య క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది. మరోవైపు.. కొందరు నెటిజన్లు సైతం సిద్ధరామయ్య తీరు తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. -
పార్టీ లైన్ దాటొద్దు.. కాంగ్రెస్ నేతలకు అధిష్టానం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పహల్గాం దాడులపై పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని స్పష్టం చేసింది. తాజాగా కొందరు కాంగ్రెస్ నేతలు దాడులపై చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చేవి ఉన్నాయని పెద్దలు భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నాం 2.30గం. ప్రాంతంలో సైన్యం దుస్తుల్లో వచ్చిన ఐదారుగురు ఉగ్రవాదులు.. పహల్గాం బైసరన్లోయ పిక్నిక్ స్పాట్లో పర్యాటకుల్ని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఒక స్థానికుడితో సహా 25 మంది టూరిస్టులు కన్నుమూశారు. అయితే ఈ దాడిని పార్టీలకతీతంగా రాజకీయ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదమే చోటు చేసుకుంది. పహల్గాం దాడి వెనుక నిఘా వర్గాల వైఫల్యం ఉండొచ్చని, ఏ దేశం కూడా వంద శాతం ఇలా దాడులను పసిగట్టకపోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ శశిథరూర్‌పై తీవ్రంగా స్పందించారు. థరూర్ కాంగ్రెస్‌లో ఉన్నారా? బీజేపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ‘సూపర్ బీజేపీ మ్యాన్’గా మారేందుకు ప్రయత్నిస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే..ఈ పరిణామాలను అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇతర నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఇద్దరు నేతలను మందలించినట్లు కూడా ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. -
చేసిన పనులు చెప్పుకోవడంలో వెనుకబడ్డాం: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదని, చివరి ఆరు నెలల్లోనే వీటిపై కచ్చితంగా చర్చ జరుగుతుందని అన్నారాయన. సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సహా పలు అంశాలపై స్పందించారు.ఎల్కతుర్తి సభలో కేసీఆర్(KCR) తన అక్కసు మొత్తం గక్కారు. కేసీఆర్ స్పీచ్‌లో పస లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిల్లగాళ్లు అని ఆయన అన్నారు. మరి వాళ్లనెందుకు అసెంబ్లీకి పంపిస్తున్నారు?. గతంలో రాహుల్ గాంధీ సభకు బస్సులు ఇవ్వని చరిత్ర వాళ్లది. కానీ, బీఆర్ఎస్ సభకు ఆర్టీసీ బస్సులు కావాలని మమ్మల్ని అడిగారు. ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వమని చెప్పా. ఆర్టీసీకి ఆదాయం వస్తుంటే.. వద్దంటామా?. .. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అనేక పథకాలు తీసుకొచ్చాం. ఇప్పుడు వాటన్నింటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. నేను కమిట్మెంట్తో పనిచేస్తున్నా. అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పా. ఇప్పించా. చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనకపడ్డాం. వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ చెప్పింది చేస్తాడు అని ప్రజల్లో నమ్మకం కలిగేలా చేస్తాం. అంతేగానీ.. కేసీఆర్ మాదిరి లాంచింగ్ క్లోజింగ్ పనులు చేయను. చిట్‌ఛాట్‌లో ఇంకా..ఆపరేషన్ కగార్(Operation Kagar) అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. కగార్‌పై మా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాతే. ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తాం.ప్రపంచంలో ఇందిరా గాంధీకి మించిన యోధురాలు లేరు. ఓ దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరా గాంధీదే. ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారు. నాకు, రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉంది. ఈ విషయంలో ఎవర్ని నమ్మించాల్సిన అవసరం లేదు.కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు ఏ రాష్ట్రంలో అమలు చేయలేదు. చివరి ఆరు నెలలు వీటిపై చర్చ జరుగుతోంది. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నాం. ఉన్నపళంగా తీసేస్తే పాత విషయాలన్నీ తెలిసేదెలా?. ఎమ్మెల్యే అయ్యాక మనోడు.. మందోడు అని ఉండదు. కానీ, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో టైం పాస్ చేస్తున్నారు. ఎమ్మెల్యే లు నియోజకవర్గాల్లో ఉండాలి.. అవసరం అయితేనే హైదరాబాద్ రావాలి -
కాంగ్రెస్ పై కేసీఆర్ పవర్ ఫుల్ పంచ్ లు
-
కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రుల కౌంటర్
-
కాంగ్రెస్ అన్నిట్లోనూ ఫెయిల్: కేసీఆర్
మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం, దగా చేశారు. ఇవాళ అప్పు పుడత లేదని మాట్లాడుతుండ్రు. నా మనసు కాలుతోంది. బాధ పడుతోంది.దుఃఖం వస్తోంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏ మాయ రోగం వచ్చె.. ఏం బీమారి వచ్చె.. ఏమేం చెప్పిరి.. ఎన్నెన్ని చెప్పిరి.. గోల్మాల్ దింపుట్ల,అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్‌ను మించినోళ్లు లేరు. అప్పుడు చెరువుల పూడిక తీసిన బుల్డోజర్లు, ఇప్పుడు ఇళ్లు కూలగొడుతున్నయి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నరు. ఓట్లెప్పుడు వస్తయా అని చూస్తున్నరు.ఎల్కతుర్తి నుంచి సాక్షి ప్రతినిధి: అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా చేసుకుంటే, ఏడాదిన్నర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని, అన్నిట్లోనూ ఫెయిల్ అయ్యిందని భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. మా అంత సిపాయిలు లేరు..కేసీఆర్‌కు మించి ఇస్తాం.. ఆరు చందమామలు తెచ్చి ఇస్తాం.. ఏడు సూర్యుళ్లు పెడతాం అని నమ్మబలికి ఓట్లు వేయించుకుని ప్రజలను దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 420 హామీలిచ్చి ఏమీ చేయలేదని, మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించారని విమర్శించారు. రైతుబంధు లాంటి పథకాలు కావాలని తననెవరూ అడగలేదని, మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము పడగొట్టబోమని, ప్రజలే వీపులు సాపు చేస్తారని వ్యాఖ్యానించారు. ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు కాంగ్రెస్సే నంబర్ వన్ విలన్ అని అన్నారు. కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు ఇక తాను బయటకు వస్తానని ప్రకటించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. బుక్కులు పంచిండ్రు.. బాండ్లు రాసిచ్చిండ్రు హామీలు ఇచ్చుడు కాదు.. పెద్ద పెద్ద బుక్కులు ఊరూరా పంచిండ్రు. సిగ్గు లేకుండా బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు..యేడికెళ్లి ఇస్తారని కాంగ్రెస్ నేతలను అడిగితే.. చేసి చూపిస్తాం.. మాది పెద్ద పార్టీ.. మమ్మల్ని మించిన సిపాయిలు లేరని ఇప్పుడు ఆర్థికమంత్రిగా ఉన్నాయన జబ్బలు చరిచాడు.. ఒకడు మెడలు చరిచాడు. డైలాగులు మీద డైలాగులు కొట్టారు. మధ్యలో ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి.. నాకు కాలు విరిగింది.. అయినా నేను బయల్దేరాను.. దీంతో తెలంగాణలో ఎంత మంది దేవుళ్లు ఉంటే అంతమంది దేవుళ్ల మీద ఒట్లు పెట్టిండ్రు. ఇన్ని మాటలు చెప్పి మోసం చేసిన్రు. ఉచిత బస్సు అని పెడితే జుట్లు పట్టుకుని కొట్టుకునేందుకు పనికి వస్తోంది తప్ప ఉపయోగం లేదు. ఈ ఉచిత బస్సు మాకు అవసరం లేదు అని ఆడబిడ్డలు అంటున్నరు. ఊ అంటే ఆ అంటే అబద్ధాలు చెబుతున్నారు. నమ్మి బోల్తా పడ్డం..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. అప్పుడెంత బాగుండె.. ఇప్పుడెట్లయింది? ‘ఒక ఊరిలో నాట్లు వేసే టైమ్ వస్తే వడ్లు ఓ రైతు అలుకుతున్నడు. మొలకకు అలుకుడు చేస్తం కదా.. పెద్ద మొగోడు అని ఒకర్ని మొలక అలికేందుకు పిలిస్తే.. ఎలుక పిల్లను చూసి ఎల్లెలకల పడ్డడట. అట్లనే మా అంత సిపాయిలు లేరు.. మేం తెచ్చి ఇస్తాం అన్నరు. ఇవాళ మమ్మల్ని నమ్ముతలేరు.. అప్పు పుడుతలేదని మాట్లాడుతుండ్రు. ఎక్కడికెళ్లి తెచ్చి చేయాలని అంటున్నరు. అపారమైన అనుభవం ఉందని అప్పుడు అన్నరు.. ఇప్పుడేమో ఎల్లెలకల పడుతుండ్రు. నా ప్రసంగం టీవీల్లో వినే కోట్లాను కోట్ల మందిని అడుగుతున్నా.. ఇంత మోసం ఉంటదా.. ఇంత దగా ఉంటదా..? ఎంత వరకు ఇది కరెక్ట్..? తెలంగాణను బొందల పడగొట్టిండ్రు.. ఎంత ఘోరమైన ఫలితం చూస్తున్నాం. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి ఎంత బాగుండె. ఇప్పుడెట్లయింది? నా మనసు కాలుతుంది. బాధయితంది. దుఃఖం వస్తోంది. కేసీఆర్ పక్కన పోంగనే ఇంత ఆగమయితదా? ఎందుకు ప్రజల గోస పోసుకుంటున్నరు? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు భూముల ధరలు ఎట్లుండె. కొనేటోళ్లు ఎక్కువుండె. అమ్మేటోళ్లు తక్కువుండే. నేను 24 గంటలు కరెంటు ఇయ్యలేదా? ఇప్పుడు ఎందుకు ఇయ్య శాతనయిత లేదు? మళ్లీ తెల్లందాక కరెంటు పెట్టడానికి పోవాల్నా..? మంచినీళ్లు కూడా ఇయ్య శాతనయితలేదు. కానీ మేం ఇంత సిపాయిలం, అంత సిపాయిలం అంటున్నరు..’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.ఎన్నెన్ని చెప్పిరి.. ఏమన్నా చేసిన్రా? ‘కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏ మాయ రోగం వచ్చె..ఏం బీమారి వచ్చె.. ఏమేం చెప్పిరి.. ఎన్నెన్ని చెప్పిరి.. గోల్మాల్ దింపుట్ల, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్‌ను మించినోళ్లు లేరు. ఇక్కడ ఉన్నోళ్లు చాలరని చెప్పి ఉన్న గాంధీలు, లేని గాం«దీలు, డూప్లికేట్ గాం«దీలు ఢిల్లీకెళ్లి దిగిరి. స్టేజీల మీద డ్యాన్స్‌లు చేసిన్రు. కేసీఆర్ రైతుబంధు కింద ఏం ఇస్తుండు..రూ.10 వేలు ఇస్తుండు.. మేం రూ.15 వేలు ఇస్తమని చెప్పిన్రు. పెన్షన్లు రూ.2 వేలు ఇస్తుండు మేం వస్తే రూ.4 వేలు ఇస్తమని చెప్పిరి. ఇద్దరు ఉంటే కేసీఆర్ ఒక్కరికే ఇస్తుండు.. మేం ముసలిది ముసలోడికి ఇద్దరికీ ఇస్తమనిరి. దివ్యాంగులకు రూ.4 వేలు ఇస్తుండు.. మేం రూ.6 వేలు ఇస్తమన్నరు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తమన్నరు. విద్యార్థులకు ఐదు లక్షల గ్యారంటీ కార్డు ఇస్తమని చెప్పిరి. ఇక ఒకరెనుక ఒకరు ఉరికి.. రూ.2 లక్షల లోన్ తెచ్చుకోండి.. డిసెంబర్ 9న ఒక్క కలం పోటుతో ఖతం చేస్తం అన్నరు. కల్యాణలక్ష్మి కింద కేసీఆర్ లక్షా నూటపదహార్లు ఇస్తున్నడు.. మేం తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పిండ్రు. 420 హామీలు ఇచ్చిన్రు. ఏమన్నా చేసిన్రా .. ఏం చేయలేదు. మాట్లాడితే బీఆర్ఎస్, కేసీఆర్ మీద నిందలు వేస్తున్నారు.తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చారు ‘ఆనాడైనా, ఏనాడైనా, ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు.. ప్రజలు వద్దంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం.. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. 2001 నుంచి గులాబీ పార్టీ పెట్టి విజృంభిస్తే.. నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి.. మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇస్తమని నమ్మబలికిన్రు. మళ్లీ ఎగ్గొట్టే ప్రయత్నం చేసిన్రు. 14 సంవత్సరాలు ఏడిపించిన్రు. జయశంకర్ సార్‌తో కలిసి పార్లమెంట్లో ప్రతిపక్షాలు కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే.. అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన్రు. మళ్లీ వెనక్కి వెళ్లారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావొచ్చు. సాగర హారాలు కావొచ్చు. వంటావార్పులు కావొచ్చు.. అనేక రూపాల్లో విజృంభించి భీకరమైన పోరాటం చేశాం. మూడేళ్ల తర్వాత రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు మళ్లీ తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. వారికి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించిన సుడి గాడుపులు తట్టుకోలేమని తెలంగాణ ఇచ్చిన్రు..’ అని మాజీ సీఎం గుర్తు చేశారు. -
ఓరుగల్లు.. గులాబీ జల్లు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగసభ ఉద్యమకాలం నాటి సభలను గుర్తు చేసింది. భారీగా జనం తరలివచ్చి సభ విజయవంతం కావడం పార్టీలో కొత్త జోష్‌ను నింపింది. భారీ జన సమీకరణ లక్ష్యంగా కేసీఆర్ ఆదేశాల మేరకు జరిగిన ప్రయత్నాలు సఫలం కావడంతో సభా ప్రాంగణమంతా గులాబీమయమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికలో నిరాశ కలిగించే ఫలితాలు ఎదుర్కొన్న బీఆర్ఎస్లో కొత్త ఉత్సాహం నింపేలా సభ సాగింది. సుమారు ఏడాది కాలం తర్వాత ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కేడర్‌లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. ఉద్యమ కాలం నుంచి నేటి దాకాటీఆర్ఎస్ ఏర్పాటుకు ముందు తెలంగాణలో ఉన్న సామా జిక పరిస్థితులను కేసీఆర్ వివరించారు. ఉద్యమ కాలంలో తాను ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఎత్తు పల్లాలను గుర్తు చేశారు. తాను చేపట్టిన ఆమరణ దీక్ష మూలంగా తెలంగాణ ఇవ్వాల్సిన అనివార్యత కాంగ్రెస్‌కు ఏర్పడిన తీరును వివరించారు. ప్రత్యేక రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్ల పాలనలో వ్యవసా యం, విద్యుత్, తాగునీరు, సాగునీరు, విద్య తదితర రంగాల్లో జరిగిన కృషిని గుర్తు చేశారు. రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తాను ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాన్ని కేసీఆర్ పలుమార్లు ప్రస్తావించారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై మెరుపు దాడిఏడాది తర్వాత బహిరంగసభ వేదికగా మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల పేరు ఎత్తకుండా వారి పనితీరుపై విమర్శల దాడి చేశారు. సీఎం రేవంత్ ప్రభుత్వ పాలనావైఫల్యం, అనుభవలేమి, అవినీతిపై విమర్శల దాడి చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల వైఫల్యాన్ని తనదైన శైలిలో సామెతలు, పిట్ట కథలతో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తెచ్చిన తెలంగాణ.. కాంగ్రెస్ పాలనలో ఆగమవుతోందని భావోద్వేగంతో వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన కనిపించింది. వచ్చే రెండున్నర ఏళ్లలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని ప్రస్తావించారు.కేటీఆర్ స్థానాన్ని బలోపేతం చేసేలాసభావేదికను ‘బాహుబలి’గా పార్టీ నేతలు అభివర్ణించగా, సభా మైదానంలో చేసిన ఏర్పాట్లపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కేసీఆర్‌తోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. సభా వేదికపైనా కేటీఆర్ వచ్చిన సందర్భంలో నేతలు ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. పార్టీ రజతోత్సవ సభ వేదికగా కేటీఆర్ స్థానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఏర్పాట్లు జరిగాయని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది.భవిష్యత్ కార్యాచరణపై సంకేతాలుసోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి వేధించడాన్ని కేసీఆర్ ఖండించారు. అదే సమయంలో పార్టీ కేడర్ వెంట నిలుస్తానని, రాబోయే రోజుల్లో పదవులు లభిస్తాయని భరోసా ఇచ్చారు. ఇకపై ప్రజాక్షేత్రంలో చురుగ్గా వ్యవహరిస్తాననే సంకేతాలు ఈ సభ ద్వారా కేసీఆర్ ఇచ్చారు. ఆపరేషన్ కగార్ మినహా బీజేపీకి సంబంధించిన ప్రస్తావన కేసీఆర్ ప్రసంగంలో పెద్దగా కనిపించలేదు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన వరంగల్‌ను రజతోత్సవ సభ నిర్వహణకు ఎంపిక చేసుకున్న బీఆర్ఎస్.. రాష్ట్ర రాజకీయాల్లో తమ స్థానం చెక్కు చెదరలేదనే సంకేతం ఇచ్చేందుకు బలంగా ప్రయత్నించింది. మూడు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలుహసన్పర్తి/వరంగల్‌క్రైం: బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా ట్రాఫిక్‌ను పోలీసులు నియంత్రించలేకపోయారు. అధిక సంఖ్యలో వాహనాలు రోడ్లపై బారులుదీరడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల్ని నిలిపేందుకు మూడుచోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇటు హనుమకొండ నుంచి ఎల్కతుర్తి, దేవన్నపేట–అన్నాసాగరం మార్గంతోపాటు హుజూరాబాద్, సిద్దిపేట ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఎటూ చూసినా మూడు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సభకు వెళుతున్న బస్సుల అడ్డగింత తిరుమలాయపాలెం: ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సులకు బీఆర్ఎస్ స్టిక్కర్లు వేసుకొని రజతోత్సవ సభకు వెళుతుండగా, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం వద్ద ఆర్టీఓ, అధికారులు అడ్డుకున్నారు. లైసెన్స్‌లు రద్దు చేసి, డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య అక్కడకు చేరుకొని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయగా, బస్సులను పంపించారు. ఆ తర్వాత మళ్లీ బస్సులు ఆపుతుండగా, మాజీమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆగి రాష్ట్ర రవాణా శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా సభ: కేసీఆర్తెలంగాణ నలమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చి బీఆర్ఎస్ సభను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా భారీ సభను విజయవంతం చేయడంలో భాగస్వాములైన పార్టీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కిక్కిరిసిన గూడూరు టోల్ప్లాజాబీబీనగర్: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జంట నగరాలు సహా.. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తల వాహనాలు భారీగా తరలి రావడంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. దీంతో గూడూరు టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయి.. వాహనాలు నెమ్మదిగా కదిలాయి. -
డేట్ ఫిక్స్ చేయండి..అసెంబ్లీకి రండి: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రజతోత్సవ సభ పేరుతో ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీపై ఆక్రోశంతో విషం కక్కారని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అద్భుతాలు జరిగినట్టు, ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ జరగనట్టు ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో..కాంగ్రెస్ టైంలో ఏం జరిగిందో చర్చించేందుకు సిద్ధం కావాలని చాలెంజ్ చేశారు. ‘మీరు డేట్ ఫిక్స్ చేయండి. అసెంబ్లీకి రండి. మీరే సరి్టఫికెట్ ఇచ్చిన మీ బచ్చాగాళ్లతో మాట్లాడేది లేదు. మీరు రండి. మీ పాలనలో అద్భుతాలు, మీరు చేసిన ఘనకార్యాలను ప్రజలకు వివరిద్దాం. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి కూడా మాట్లాడదాం. డేట్ మీరే చెప్పండి. చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభ ముగిసిన అనంతరం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వద్ద మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలిసి పొంగులేటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు తనను గద్దె దింపారనే ఆక్రోశంతో కేసీఆర్ మాట్లాడారని విమర్శించారు. కడుపునిండా కాంగ్రెస్ పార్టీపై విషం పెట్టుకొని మమ్మల్ని విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు విలన్ అయ్యిందో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు విలన్ అయ్యిందా? హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఏర్పాటు చేసినందుకు విలన్ అయ్యిందా అని ప్రశ్నించారు. రజతోత్సవ సభలో తన హయాంలో జరిగిన మంచి పనులను చెప్పుకోవచ్చు.. అదేవిధంగా లోపాలను కూడా మాట్లాడి ఉంటే ఎవరూ అభ్యంతరం చెప్పరన్నారు. రైతుల గుదిబండగా మారిన ధరణి పోర్టల్ గురించి, కుప్పకూలిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆ సభలో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అసలు కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తామేదో బీఆర్ఎస్ సభను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశామని చెబుతుంటే నవ్వు వస్తుందన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండగా, కాంగ్రెస్ సభలకు బస్సులు ఇవ్వలేదని, టూవీలర్లు కూడా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ తాము ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించామని, వారు ఎన్ని బస్సులకు డబ్బులు కడితే అన్ని బస్సులు ఇచ్చామని తెలిపారు. నిజంగా కాంగ్రెస్ అడ్డుకొని ఉంటే బీఆర్ఎస్ సభ జరిగేదా అని నిలదీశారు. తామేదో వర్సిటీ భూములు అమ్మినట్టు కేసీఆర్ చెప్పారని, ఏ యూనివర్సిటీ భూముల అమ్మామో ప్రజలకు చెప్పాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును తనకు కావాల్సిన వారికి లీజుకు ఇచ్చుకుంది.. వైన్ షాపుల టెండర్లు ముగియక ముందే డబ్బులు వసూలు చేసుకుంది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. తాము కమీషన్లు తీసుకున్నామని కేసీఆర్ అంటున్నారని, ఎక్కడ తీసుకున్నామో చూపించాలని డిమాండ్ చేశారు. ఏ కమీషన్లు తీసుకోకుండానే దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఎలా ఎదిగిందని, రూ.1,500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోమని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆయన కూలిస్తే కూలిపోవడానికి ప్రభుత్వమేమైనా బొమ్మరిల్లా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన నాయకుడు... ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ లేదన్నారు. తెలంగాణ వచ్చాక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చేయలేదని, ఇప్పుడైనా ఆ పార్టీ శాసనసభ పక్ష పదవిని దళితుడికి ఇస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీకి ఇవ్వగలరా అని వ్యాఖ్యానించారు. వీటన్నింటిపై మాట్లాడేందుకు కేసీఆర్ డేట్‌ఫిక్స్ చేస్తే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించేందుకు సిద్ధం కావాలని మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ నేతలను సవాల్ చేశారు. అధికారం పోయినా గర్వం పోలేదు: మంత్రి జూపల్లి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజలు ఉద్యోగం ఊడగొట్టినా కేసీఆర్‌కు గర్వం పోలేదని.. చింత చచ్చినా పులుపు చావనట్టు ఆయన మాట్లాడుతున్నారన్నారు. ఒక్కో గ్రామానికి రూ. 3 లక్షలు ఖర్చు చేసి ఈ సభ నిర్వహించారని, ఆ డబ్బులు ఎక్కడివని నిలదీశారు. తాము కూడా రాజకీయాల్లోనే ఉన్నామని, తమకు ఏమీ తెలియదని అనుకోవడం పొరపాటని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ పగటి కలలు కంటున్నాడని, అసలు ఆయన ఉద్యోగం ఎందుకు ఊడిందో..ప్రజలు ఎందుకు ఓడించారో ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకోవాలని హితవు పలికారు. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: మంత్రి పొన్నం కాంగ్రెస్ పార్టీని విలన్ అంటూ కేసీఆర్ మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీనే లేకుంటే కేసీఆర్ మూడు చెరువుల నీళ్లు తాగినా, వంద మంది కేసీఆర్‌లు వచ్చినా తెలంగాణ వచ్చేది కాదని చెప్పారు. ఎల్కతుర్తి సభకు జనం రాకపోతే అదేదో తాము అడ్డుకున్నట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అగ్గిపెట్టి రాజకీయానికి బలైన ఉద్యమకారులు, అమరవీరులకు ఆ సభలో ఎందుకు నివాళులరి్పంచలేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు. నియంత మాట్లాడినట్టుంది: మంత్రి సీతక్క మంత్రి సీతక్క మాట్లాడుతూ ఒక నియంత అధికారాన్ని కోల్పోయిన తర్వాత మాట్లాడినట్టు కేసీఆర్ ప్రసంగం ఉందని చెప్పారు. అధికారం పోయాక కుటుంబం, ఆస్తులు చీలికలు,పీలికలు అయ్యాయన్న ఆవేదనతో ఆయన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బిడ్డ మంచి కార్లలో తిరగొచ్చు గానీ.. పేద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో తిరగవద్దా అని ప్రశ్నించారు. కేసీఆర్ అంత దరిద్రంగా పోలీసులను ఎవరూ ఉపయోగించుకోలేదని చెప్పారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చౌక్ తీసేశారని, ఇప్పుడు మళ్లీ తాము ధర్నాచౌక్ తెరిస్తే సిగ్గు లేకుండా అక్కడకు వచ్చి ధర్నాలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో సొల్లు కబుర్లు మాట్లాడుతున్నారని చట్టసభను అవమానించిన కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే అర్హత ఉందా అని ప్రశ్నించారు. -
తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా?: కేసీఆర్‌కు మంత్రుల కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ మనసంతా విషాన్ని నింపుకొని ప్రసంగించారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఎల్కతుర్తిలో కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అప్పుల అంశాన్ని కేసీఆర్ ఎందుకు ప్రస్తావించలేదంటూ పొంగులేటి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను కేసీఆర్ విలన్లా చూపిస్తూ మాట్లాడారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా?. కేసీఆర్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. అభివృద్ధి, సంక్షేమాన్ని సమంగా ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని పొంగులేటి చెప్పుకొచ్చారు.‘‘కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో అసెంబ్లీకి ఎప్పుడూ రాలేదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాళ్లు మొక్కిన విషయం గుర్తుకు లేదా?. దొరపాలన చేసింది మీరు కాదా?. బీఆర్ఎస్కు రెండుసార్లు అధికారం ఇస్తే ఏం చేశారో ప్రజలకు తెలుసు. కేసీఆర్ కావాలనే కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్ వల్ల ధనిక తెలంగాణ.. అప్పుల రాష్ట్రంగా మారింది. వరి వస్తే ఉరి అన్నది మీరు కాదా?. సర్పంచ్‌లకు బకాయిలు పెట్టింది మీరు కాదా?’’ అంటూ పొంగులేటి ప్రశ్నాస్త్రాలు సంధించారు.‘‘అధికారం కోసం కేసీఆర్ పగటి కలలు కంటున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు. కేసీఆర్ పదేళ్లలో కలిపి లక్ష ఇళ్లు కూడా ఇవ్వలేదు. మేం నాలుగున్నర లక్షల ఇళ్లు కట్టిస్తున్నాం.’’ అని పొంగులేటి పేర్కొన్నారు.మళ్లీ అసెంబ్లీకి వచ్చే అర్హత కేసీఆర్‌కు ఉందా? మంత్రి సీతక్కఒక నియంత అధికారని కోల్పోయి మాట్లాడినట్లు ఉంది కేసీఆర్ స్పీచ్. నీ కుటుంబంలో చీలికలు, పేలికలు పెరుగుతున్నాయన్న బాధ కేసీఆర్‌లో కనిపించింది. పది నెలల్లో 59,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం. మీరెంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ బిడ్డ మంచి మంచి కార్లలో తిరుగుతుంది. మా పేద ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో తిరగకూడదా?. కేసీఆర్ అంత దరిద్రంగా పోలీసులను ఎవరు వాడుకోలేదు. 60 వేల కోట్ల కరెంట్ బిల్లుల బకాయిలను పెట్టి వెళ్లిపోయావు. ధర్నా చౌక్‌లలో కేసీఆర్ ధర్నాలు కూడా చేయనీయలేదు. కేసీఆర్ సభ దగ్గర రైతుల కాలువలను పూడ్చి సభ నిర్వహించారు. అసెంబ్లీని సొల్లు కబురు అని కేసీఆర్ అవమానించారు. మళ్లీ అసెంబ్లీకి వచ్చే అర్హత కేసీఆర్‌కు ఉందా?. అసెంబ్లీ సొల్లు కబురు అయితే నీ కొడుకు, నీ అల్లుడ్ని అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నావు?‘విలన్’ వ్యాఖ్యలు కేసీఆర్ ఉపసంహరించుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్కాంగ్రెస్ విలన్ అంటూ చేసిన కేసీఆర్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. సోనియా గాంధీ మినహా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ఇవ్వలేరన్న విషయం కేసీఆర్‌కు తెలుసు. కేసీఆర్ సభకు జనం రాకపోతే పోలీసుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద నేపం నెట్టడం సరైనది కాదు. అగ్గిపెట్ట రాజకీయానికి ప్రాణాలర్పించిన తెలంగాణ వాళ్లకు కనీసం నీవాళ్లు అర్పించారా?. కేసీఆర్ సభకు జనం రాకపోవడం వల్లే... అర్థగంటసేపు ఆయన ప్రాంగణానికి వచ్చి కూడా వేదిక పైకి రాలేదు. -
AP: కాంగ్రెస్ నేత దారుణ హత్య
అనంతపురం: జిల్లాలోని గుంతకల్లులో కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణహత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న లక్ష్మీ నారాయణను కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. కాంగ్రెస్ లక్ష్మీనారాయణ కారును టిప్పర్ తో ఢీకొట్టారు దుండగులు. ఆపై లక్ష్మీ నారాయణపై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో లక్ష్మీ నారాయణ కుమారుడు వినోద్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. -
కేసీఆర్ ను వద్దనుకుని మోసపోయామని జనాలు భావిస్తున్నారు
-
కొత్త నాయకత్వం కావాలి: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ పాత తరం రాజకీయాలకు కాలం చెల్లిందని.. అందుకే భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా కొత్త రాజకీయ నాయకత్వం రావాలని.. దాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. అందుకు భారత్ సమ్మిట్–2025 వేదిక కావాలని ఆకాంక్షించారు. రెండు రోజుల భారత్ సమ్మిట్–2025 అంతర్జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం జరిగిన ప్లీనరీకి ముఖ్యఅతిథిగా రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుత పార్టీలన్నీ విధానాలను మార్చుకుంటున్నాయని చెప్పారు. భారత్ జోడో యాత్ర చేపట్టేందుకు దారితీసిన పరిస్థితులతోపాటు యాత్రకు ముందు, ఆ తర్వాత తనలో రాజకీయంగా వచ్చిన మార్పుల గురించి వివరించారు. దేశంలోని పాలకపక్షం ద్వేషం, కోపాలను విస్తరింపజేయాలనే ఆలోచనతోనే ముందుకెళ్తోందని రాహుల్ విమర్శించారు. కానీ కాంగ్రెస్ పార్టీ దృష్టి కోణం మాత్రం ప్రేమ, ఆప్యాయతలేనని స్పష్టం చేశారు.దేశ ప్రజల్ని కలిసేందుకే భారత్ జోడో యాత్ర చేపట్టా‘ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు మౌలిక విధానాలను మార్చుకుంటున్నాయి. పదేళ్ల క్రితం నాటి ఆలోచనలు ఇప్పుడు పనిచేయవు. ఒక్కమాటలో చెప్పాలంటే పాత తరం రాజకీయం చనిపోయింది. ఇప్పుడు కొత్త రకం రాజకీయాలు రావాలి. ఇది ప్రపంచ రాజకీయాలకు ఒక సవాల్ లాంటిది. కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఓ వలయంలో చిక్కు కొని ఒంటరైంది. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయా లనే ఆలోచనలో భాగంగా మా అవకాశాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. అప్పుడు ఏం చేయాలని ఆలోచించా. అందుకే దేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడక ద్వారా ప్రజలను కలవాలనే నిర్ణయంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4 వేల కి.మీ. పాదయాత్ర చేశా. ఈ పాదయాత్రలో ఓపిక, ప్రేమ గురించి నేర్చుకున్నా. రాజకీయ నాయకులకు ఈ రెండు లక్షణాలు ఉండాలి. ప్రజలు ఏం చెబుతు న్నారన్నది ఓపికగా వినగలగాలి. ప్రజలపట్ల ప్రేమ, ఆప్యాయతలను చూపించగలగాలి. విధానాల రూపంలో ప్రజలతో పరోక్షంగా కలిసి ఉండటం కంటే వారిపట్ల ప్రేమ బంధం ఏర్పరచుకోగలగాలి’ అని రాహుల్ గాంధీ చెప్పారు. -
సీఎం అవ్వాలనే ఆశ నాకు లేదు: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: దేశంలో సకల దరిద్రాలకు కారణం కాంగ్రెస్ పార్టీనేనని.. రాబోయే 30 ఏళ్ల కాలంలో దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలే వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అంటున్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో సాక్షికి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారాయన.2006లో పార్టీలో అడుగుపెట్టినప్పుడు కనీసం మంత్రి కూడా అవుతానని, ఈ స్థాయి గౌరవం లభిస్తుందని ఊహించలేదు. ఈనాటికి సీఎం అవ్వాలనే ఆశ నాకు లేదు. వచ్చే ఎన్నికల్లోనూ మా సీఎం అభ్యర్థి కేసీఆరే. ఆయన మా ట్రంప్ కార్డు. తురుపు ముక్క. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. కాంగ్రెస్ హయాంలో పాడైపోయిన వ్యవస్థను బాగు చేయడమే మా ముందు ఉన్న లక్ష్యం అని స్పష్టం చేశారాయన. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 420 హామీలు ఇచ్చినా ఒక్కటి అమలు చేయలేదు. 15 నెలల పాటనలో సంక్షేమం అమలు చేయలేదు. అధికారం కోసం ఇష్టమున్నట్లు హామీలు ఇచ్చారు. పథకాలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నికృష్టంగా పని చేస్తోంది. నా వరకు నేను ఈ ప్రభుత్వానికి మైనస్ మార్కులు ఇస్తాను. లిక్కర్ విషయంలో మాత్రమే పెరుగుదల కనిపిస్తోంది. కేసీఆర్ సర్కార్‌ది సంక్షేమం.. రేవంత్ సర్కార్‌ది సంక్షోభం అన్నారు.హైడ్రాతో రియల్ ఎస్టేట్ కుదేలు అయ్యింది. తులం బంగారం లేదు.. స్కూటీ లేదు. ఫార్ములా రేసులో ఎలాంటి అవినీతి జరగలేదు. సీఎం పదవి వచ్చాక సమర్థవంతంగా పని చేయొచ్చు కదా. ఫార్ములా ఈ కోసం ఖర్చు చేస్తే తప్పైతే.. అందాల పోటీతో ఖర్చు చేయడం కరెక్టా?. ఫార్ములా ఈ రేసు కోసం చేసిన ఒప్పందాలతో పెట్టుబడులు తెచ్చాం. అందాల పోటీతో ఎంత మందికి ఉపాధి లభిస్తుంది. లైవ్‌లో డిబేట్ పెడితే.. ఎవరిది మోసమో అర్థం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు అని కేటీఆర్ జోస్యం పలికారు.కేసీఆర్ పథకాలను పక్క రాష్ట్రాల్లో కాపీ కొట్టారు. దేశం మొత్తం ఆ పథకాలు అమలు కావాలనే.. పార్టీని దేశ స్థాయిగా విస్తరించాలనుకున్నాం. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా విస్తరించాం. బీఆర్ఎస్ మీదనే మాకు అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితం వచ్చింది. కాబట్టి మళ్లీ పార్టీ పేరు మార్చాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం. బీఆర్ఎస్లో ఎలాంటి కుమ్ములాటలు లేవు. అలాగే.. హరీష్‌రావుతో నాకు ఎలాంటి విబేధాల్లేవ్. మా అందరికి కావాల్సినంత పని ఉంది. ఎజెండా తిరిగి తెలంగాణలో పట్టాలెక్కాలి. రాష్ట్రం కేసీఆర్ నాయకత్వం కోరుకుంటోంది. కేసీఆర్ ఉన్నంతదాకా.. ఆ ప్రస్తావన రాదు.తెలంగాణ వచ్చాక.. మూడు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశాం. త్రిముఖ పోటీ(బీజేపీ+జనసేన+టీడీపీ), కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ ప్రభావం మా మీద ఉండదని అనుకుంటున్నాం. భవిష్యత్తులో ఒంటరిగానే పోటీ చేస్తాం. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది. -
హైదరాబాద్ : ‘భారత్ సమ్మిట్-2025.. విదేశీ ప్రతినిధులకు ఘనస్వాగతం (ఫొటోలు)
-
ఐక్యంగా ఎదుర్కొందాం
శ్రీనగర్: దేశ ప్రజలంతా కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. మనమంతా ఐక్యంగా ఉంటే ఉగ్రవాదం అంతం కావడం ఖాయమని చెప్పారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి, విభజన తీసుకురావాలన్న లక్ష్యంతోనే పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిందని అన్నారు. కలిసి ఉంటున్న సోదరుల మధ్య గొడవలు పెట్టాలన్నదే ముష్కరుల ఉద్దేశమని ఆరోపించారు. ముష్కర మూకల కుట్రలను తిప్పికొట్టడానికి మనమంతా ఒక్కటై చేతులు కలపాలని సూచించారు. ఐక్యమత్యమే మన బలమని ఉద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని శాశ్వతంగా ఓడించడానికి యావత్ దేశం ఐక్యంగా ఉండాలని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ శుక్రవారం జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని సైనిక ఆసుపత్రిని సందర్శించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న పహల్గాం ఉగ్రవాద దాడి బాధితుడిని పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని బాధితుడికి భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చానని అన్నారు. పహల్గాం దాడి అత్యంత దారుణమని చెప్పారు. ఈ ఉగ్రదాడిని జమ్మూకశ్మీర్ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించారని తెలిపారు. ఈ దాడిలో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు తన సానుభూతి ఉంటుందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొనే చర్యలు పూర్తి మద్దతు ఇస్తున్నామని పునరుద్ఘాటించారు. ప్రతిపక్షం మొత్తం ప్రభుత్వానికి అండగా ఉంటుందన్నారు. దేశంలో ఇతర ప్రాంతాల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రజలపై దాడుల జరుగుతుండడం విచారకరమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మన సోదర సోదరీమణులను లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనమంతా ఒక్కటి కావాలని కోరారు. మరోవైపు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోపాటు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై చర్చించారు. అంతకుముందు జమ్మూకశ్మీర్ వ్యాపారులు, విద్యార్థి సంఘాల నాయకులు, పర్యాటక రంగ ప్రతినిధులతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
పాక్‌ను ముక్కలు చేయండి
సాక్షి, హైదరాబాద్: ‘మోదీజీ.. పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను భారత్‌లో కలపండి. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు నాటి ప్రధాని ఇందిరా గాంధీ దీటైన జవాబు ఇచ్చారు. పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేశారు. ప్రధానిగా మీరు ఇప్పుడు తీసుకొనే ఎలాంటి నిర్ణయానికైనా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రవాదులు పర్యాటకులను హతమార్చడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీకి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కఠినంగా వ్యవహరించాలి.. ‘పహల్గాంలో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకూ మద్దతు పలికేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయులంతా ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వబౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రధానిని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.‘ఉగ్రదాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సానుభూతి తెలుపుతున్నాం. ఆ కుటుంబాలకు అందరం అండగా నిలబడి మనోస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాం’అని రేవంత్ అన్నారు. ఇందిరాగాంధీ ఒక్క దెబ్బతో పాకిస్తాన్‌ను పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్‌పేయ్ దుర్గామాతతో పోల్చారని పేర్కొన్నారు. ‘మోదీజీ.. మీరు దుర్గామాత భక్తులు. ఇందిరను ఆదర్శంగా తీసుకొని ఉగ్రవాదులపై దాడులు నిర్వహించాలని కోరారు. కొవ్వొత్తుల ప్రదర్శన...పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మాజీ ఎంపీలు అజహరుద్దీన్, సల్మాన్ ఖుర్షీద్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు విజయశాంతి, సలహాదారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఉగ్ర దాడిలో మరణించిన వారి ఆత్మ శాంతించాలని ప్రారి్థంచారు. భారత్ సమ్మిట్–2025 అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ విచ్చేసిన ప్రతినిధులు సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారంతా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ జెండాలు పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ ముందుకు సాగారు. -
నేడు కశ్మీర్‌కు రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం జమ్ముకశ్మీర్ వెళ్లనున్నారు. పహల్గాం ఉగ్ర దాడి బాధితులను ఆయన పరామర్శించనున్నారు. అనంతనాగ్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న బాధితులతో రాహుల్ మాట్లాడతారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని తిరిగి వచ్చిన రాహుల్ గురువారం సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొన్నారని తెలిపాయి. అనంతరం అఖిల పక్ష సమావేశంలోనూ ఆయన పాలుపంచుకున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం.. మృతులకు ఘన నివాళిఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి ముమ్మాటికీ భావోద్వేగాలను రెచ్చగొట్టే చర్యేనని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటించింది. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు పాకిస్తానే సూత్రధారి. ఈ ఉగ్రవాద చర్య మన గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి హిందువులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంది. ఇటు వంటి తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలను, సీమాంతర ఉగ్రవాదా న్ని సమష్టిగా, దృఢసంకల్పంతో ఎదుర్కోవాలని పునరుద్ఘాటి స్తున్నాం అంటూ సీడబ్ల్యూసీ పేర్కొంది.నిఘా వైఫల్యాలపై విశ్లేషణ అవసరం..ప్రభుత్వ నిఘా వైఫల్యాన్ని ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ ఎత్తి చూపింది. ‘పహల్గాం మూడంచెల భద్రతా వ్యవస్థ కలిగి ఉండే శత్రుదుర్బేధ్యమైన అత్యంత భద్రత కలిగిన ప్రాంతం. కేంద్ర హోం శాఖ పరిధిలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఇంతటి తీవ్ర దాడి చోటుచేసుకుంది. ఈ సమయంలో నిఘా వైఫల్యాలు, భద్రతా లోపాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టాల్సిన అవసరం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎంతో అవస రం. బాధిత కుటుంబాలకు నిజంగా న్యా యం జరిగే ఏకైక మార్గం ఇదే’ అని సీడబ్ల్యూసీ పేర్కొంది. అలాగే, లక్షలాది మంది పాల్గొనే అమర్నాథ్ యాత్రకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. పర్యాటకంపై ఆధారపడ్డ కశ్మీర్ ప్రజల జీవనోపాధిని కాపాడాలి’ అని కేంద్రానికి సూచించింది.రాజకీయ ప్రయోజనాలొద్దు..ప్రజల్లో విభజన బీజాలు నాటేందుకు పహల్గాం దాడిని బీజేపీ అధికారిక, అనుకూల సోషల్ మీడియా వేదికలు వాడుకోవడం దారుణమని సీడబ్ల్యూసీ తెలిపింది. కాగా, పహల్గాం దాడిలో అసువులు బాసిన వారికి నివాళులర్పించేందుకు శుక్రవారం పార్టీ శ్రేణులు అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో క్యాండిల్మార్చ్ నిర్వహిస్తాయని అనంతరం కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. -
ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ నేతృత్వంలో క్యాండిల్ ర్యాలీ
హైదరాబాద్,సాక్షి: జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ర్యాలీ జరగనుంది.కాశ్మీర్ ఉగ్ర దాడిలో మరణించిన వారి ఆత్మ శాంతి చేకూరేలా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ ర్యాలీ నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చింది. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగనుంది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రులు ,ఎమ్మెల్యేలు , భారత్ సమ్మిట్‌కు హాజరయ్యే పలువురు కీలక నేతలు పాల్గొననున్నారు. -
ప్రపంచానికి మోడల్‌గా తెలంగాణను చూపుతాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్‌గా చూపేందుకు రెండు రోజుల భారత్ సమ్మిట్–2025 అంతర్జాతీయ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ఓ గొప్ప కార్యక్రమంగా నిర్వహించనుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా శుక్ర, శనివారాల్లో సదస్సును నిర్వహించనున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి భట్టి గురువారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించేందుకు సుమారు 100 దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు, థింక్ ట్యాంకర్స్ మొత్తంగా 450 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న వేళ భారత్ ఎటువైపు మొగ్గు చూపకుండా అలీన విధానాన్ని ఎంచుకొని ముందుకెళ్లిందని భట్టి గుర్తుచేశారు. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ నిలబడిందని.. అలీన విధానాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుకు తీసుకువెళ్లాయని చెప్పారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దేశాల ప్రతినిధులను వివిధ అంశాలపై చర్చించేందుకు ఆహ్వానించిందని వివరించారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధి, వనరులు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించేందుకు ప్రత్యేక స్లాట్ కేటాయించామని తెలిపారు. ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను నిలిపేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు రానుండటం తెలంగాణకు గర్వకారణమన్నారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ అభివృద్ధిని, ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని ప్రపంచానికి తెలియజేస్తామన్నారు. అనంతరం భారత్ సమ్మిట్ ఏర్పాట్లను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, డిప్యూటి సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ తదితరులు సమీక్షించారు. డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ ఇతివృత్తంతో.. భారత జాతీయ కాంగ్రెస్ 140వ వార్షికోత్సవం, అలీనోద్యమానికి ఆధారమైన 1955 నాటి బండుంగ్ సదస్సు జరిగి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ ఇతివృత్తంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘న్యాయ్’ఆలోచన ఆధారంగా ఇది రూపొందింది. భారతీయ విలువలతో కూడిన న్యాయమైన, ఉదారవాద ప్రపంచ వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో సదస్సు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు తొలిరోజు సదస్సులో స్వాగతోపన్యాసం చేయనుండగా రాహుల్ గాం«దీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక ప్రసంగాలు చేయనున్నారు. అనంతరం ‘హైదరాబాద్ డిక్లరేషన్’ను ప్రకటిస్తారు. సదస్సు ముగింపు సమావేశంలో ప్రియాంక గాంధీ, కె.సి.వేణుగోపాల్ ప్రసంగించనున్నారు. -
ఎన్డీయేకి దగ్గరయ్యేందుకు కేటీఆర్ ప్రయత్నాలు: అద్దంకి దయాకర్
సాక్షి, హైదరాబాద్: ఎన్డీయే కూటమికి దగ్గరయ్యేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆసక్తికర కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. చంద్రబాబు మేము వేరువేరు కాదని కేటీఆర్ అంటున్నాడు. చంద్రబాబుకి కేటీఆర్ వల వేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ డైరెక్షన్లోనే కేటీఆర్ చంద్రబాబు గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి కేటీఆర్ వల వేస్తున్నారు. ఎన్డీయే కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలి. కనీసం కేసీఆర్ కుటుంబం నుండి కాకుండా వేరే వెలమనైనా బీఆర్ఎస్ అధ్యక్షుడిని చేయగలరా?. కేటీఆర్‌కి దమ్ముంటే పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవాలి.అధ్యక్ష పదవి చేపట్టిన రెండు సంవత్సరాలకే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి అధికారంలోకి తెచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?. బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు?. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో, నాన్ వర్కింగ్ ప్రెసిడెంటో ఆయనకే తెలియాలి. 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకా? టీఆర్ఎస్ పార్టీకా?. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టి రెండేళ్లు అయింది. జనతా గ్యారేజ్ సినిమాలో ఓనర్ కొడుకు విలన్. బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అయితే పార్టీ ఓనర్ కొడుకు కేటీఆర్ విలనా?.కమలం పువ్వు కాడికి గులాబీ పువ్వును అంటగడుతున్నారు. చంద్రబాబు, మేము వేరువేరు కాదని కేటీఆర్ అంటున్నాడు. చంద్రబాబుకి మాకు సారూప్యత ఉందని కేటీఆర్ చెబుతున్నారు. హెచ్‌సీయూ విషయంలో బీఆర్ఎస్ హ్యాండిల్స్ నుండి ఫోటోలు ఎందుకు డిలీట్ చేస్తున్నారో చెప్పాలి’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఎంఐఎం గెలుపు లాంఛనమే!
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల చివరి రోజు నుంచి పలు ఊహాగానాలతోపాటు ఉత్కంఠను రేకెత్తించిన హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 4 గంటల వరకు సమయమున్నప్పటికీ, చివరి రెండు గంటల్లో ఎవరూ రాలేదు. మొత్తం 112 మంది ఓటర్లలో.. 88 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, బీజేపీ నుంచి ఎన్.గౌతమ్‌రావు పోటీ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ సభ్యులెవరూ పోలింగ్‌లో పాల్గొనలేదు. పార్టీల వారీగా పోలింగ్‌కు హాజరైన ఓటర్ల సంఖ్యను బట్టి ఎంఐఎం గెలుపు లాంఛనమేనని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. సంఖ్యాబలం లేనప్పటికీ బీజేపీ బరిలో ఉండటంతో ఏం జరగనుందోనన్న ఆసక్తి నెలకొంది. తమ పార్టీలకు గెలిచేంత ఓటర్ల సంఖ్య లేకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయి. చివరి క్షణం వరకూ తమకు ఇతర పార్టీల ఓట్లు పడతాయన్న బీజేపీ, పోలింగ్ అనంతరం సైతం కాంగ్రెస్ ఓట్లు కొన్ని తమకు పడ్డట్లు పేర్కొంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఎంఐఎం తొత్తుగా మారిందని బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాటకాలు బయటపడ్డాయని, ఎంఐఎంకు వాటి మద్దతు ఉన్నట్లు తేటతెల్లమైందన్నారు. కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద దాడికి నిరసనగా బీజేపీకి చెందిన కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి నల్ల దుస్తులతో పోలింగ్‌కు హాజరయ్యారు. మిగతా బీజేపీ ఓటర్లు చేతులకు నల్లరిబ్బన్లు చుట్టుకొని వచ్చారు. -
65 దాటితే 'నో' పదవి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పూర్తి స్థాయిలో ప్రక్షాళన కానుంది. రాష్ట్ర కార్యవర్గం నుంచి జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయిల్లోని అన్ని పార్టీ పదవుల్లో కొత్త వారిని నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం మూడు దశల్లో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయసేకరణ ద్వారా సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. పార్టీ పదవుల నియామకంలో కొన్ని షరతులను కూడా ఖరారు చేసింది. 65 ఏళ్లు దాటినవారికి బ్లాక్, మండల, గ్రామ స్థాయి అధ్యక్ష పదవులు ఇవ్వరాదని, ఆ పదవుల్లో యువకులను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పార్టీ పరిశీలకుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. ఇదీ షెడ్యూల్..: ⇒ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 35 జిల్లా యూనిట్లు ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున 70 మందిని పార్టీ పరిశీల కులుగా నియమించారు. వీరు ఈ నెల 25 నుంచి 30వ తేదీవరకు ఆయా జిల్లాల్లో జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ⇒ బ్లాక్, మండల అధ్యక్ష పదవుల కోసం పేర్లను పీసీసీ ఇచ్చిన ఫార్మాట్లో సేకరించాలి. జిల్లా అధ్యక్ష పదవుల కోసం 5, బ్లాక్ అధ్యక్షుల కోసం 3, మండల అధ్యక్షుల కోసం 5 పేర్లను ప్రతిపాదించాల్సి ఉంటుంది. ⇒ మే 3 నుంచి 10 వరకు మరోమారు సమావేశం నిర్వహించి సంవిధాన్ బచావో సభలను నిర్వహించాలి. మే 4 నుంచి 10 వరకు ఆయా జిల్లాల్లో అసెంబ్లీ/బ్లాక్ స్థాయి నేతల సమావేశం నిర్వహించాలి. బ్లాక్, మండల కమిటీల ఆఫీస్ బేరర్లు, కార్యవర్గం పేర్లను సేకరించాల్సి ఉంటుంది. ⇒ మే 13 నుంచి 20 వరకు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి గ్రామ కమిటీల కోసం పేర్లను సేకరించాలి. గ్రామ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా ఐదు పేర్లను తీసుకోవాల్సి ఉంటుంది. ⇒ మూడు దశల సమావేశాల అనంతరం బ్లాక్, మండల, గ్రామ స్థాయి కమిటీల ప్రతిపాదనలతో కూడిన నివేదికను పీసీసీకి సమర్పించాలి. ⇒ ఈ కమిటీల్లో ఖచ్చితంగా ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పదేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించాలని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఎవరికి ఏ పదవి ఎందుకు ఇవ్వాలనే అంశాలను కూడా నివేదికలో పేర్కొనాలని ఆమె ఆదేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో గుజరాత్ పీసీసీ విధానాన్ని మోడల్‌గా తీసుకోవాల సూచించారు. పరిశీలకుల హోదాలో పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసే బాధ్యతలు చాలా కీలకమైనవని, ఈ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కోరారు.లేటుగా వచ్చినవారు ఇంటికే.. పరిశీలకుల సమావేశానికి ఆలస్యంగా వచ్చినవారిని బాధ్యతల నుంచి తొలగించాలని మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి కొందరు పరిశీలకులు అరగంట ఆలస్యంగా వచ్చారు. మరికొందరు రాలేదు. మొత్తం 70 మంది రావాల్సి ఉండగా, 58 మంది హాజరయ్యారు. దీంతో ఆలస్యంగా వచ్చిన వారు, సమావేశానికి రాని వారిని మీనాక్షి ఆదేశాల మేరకు పరిశీలకుల బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశంలోనే ప్రకటించారు. పరిశీలకులుగా ఆరుగురు మాత్రమే మహిళలను నియమించడంతో ఇంకా మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని మీనాక్షి సూచించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని వినిపించిన ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ‘ఆమె ఏం యాక్షన్ చేస్తుందబ్బా.. ఆమె ఐఏఎస్ అధికారిణి!’ అంటూ వ్యవంగంగా మాట్లాడారు.కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఐఏఎస్ స్మితా సబర్వాల్ సోషల్‌మీడియా రీట్వీట్లను ప్రస్తావించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 13 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికిందని ఆరోపించారు. ఆ చెట్లను నరికి వేసినప్పుడు స్మితా సబర్వాల్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. సోషల్ మీడియా పోస్టులు ఎందుకు పెట్టలేదని పునరుద్ఘాటించారు. స్మితా సబర్వాల్.. అప్పుడు ఏం చేశినవ్? - గజ్జెల కాంతంకేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికేసినప్పుడు జింకలు, వణ్యప్రాణులు వేరే అడవులకు పోతుంటే నువేం చేశినవ్అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండి ఇది కరెక్టు కాదని ఎందుకు ఖండించలేదు?IAS అధికారి స్మితా సబర్వాల్‌పై రెచ్చిపోయిన… pic.twitter.com/FrHZkWO2dA— Telugu Galaxy (@Telugu_Galaxy) April 23, 2025 -
జానారెడ్డి ఎపిసోడ్.. రాజగోపాల్‌రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్లో ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. వారం క్రితం జానారెడ్డిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి రాకుండా మాజీ మంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.అయితే, జానారెడ్డి ఎపిసోడ్‌పై రాజగోపాల్‌రెడ్డి.. బుధవారం స్పందించారు. ‘‘జానారెడ్డి అంటే నాకు గౌరవం. ఆయన మా పార్టీ సీనియర్ నేత. జానారెడ్డి రాసిన లెటర్‌పై ఒక సభలో మాట్లాడాను. మంత్రి పదవి పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా, మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి గట్టి హెచ్చరికలే చేశారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది...మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. -
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘అమ్మానాన్నా.. నన్ను క్షమించండి. నేను ఇల్లు వదిలి వెళ్లిపోతున్నా’.. అంటూ ఒక మహిళా పంచాయతీ కార్యదర్శి లేఖ రాసి అదృశ్యమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. బద్దెనల్లిలో రెండేళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రియాంక.. కాంగ్రెస్ నేతల వేధింపులు భరించలేకపోతున్నానంటూ.. లేఖ రాసి సోమవారం అదృశ్యమైంది. డీపీఓకు రాజీనామా లేఖ వాట్సాప్ ద్వారా పంపినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేత క్రీదాది మల్లేశ్బాబుతోపాటు మరికొందరు పెట్టే బాధల వల్ల మానసిక వేదన భరించలేకపోతున్నానని ఆమె లేఖలో పేర్కొంది. కాగా, తమ కూతురు కనిపించడం లేదని ప్రియాంక తల్లిదండ్రులు సిరిసిల్ల డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె తిరుపతిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూతురి కోసం తల్లిదండ్రులు మంగళవారం తిరుపతికి బయలుదేరారు. -
HYD: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటింగ్‌కు బీఆర్ఎస్ దూరం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 78.57 శాతం పోలింగ్ నమోదైంది. 88 ఓట్లు పోలయ్యాయి. 66 కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ మినహా బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియ్ సభ్యులు పోలింగ్‌లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ నిర్వహించనున్నారుఉదయం 10 గంటల వరకు 50 శాతం ఓట్లు నమోదు అవ్వగా, 45 మంది కార్పొరేటర్లు ఓటు వినియోగించుకున్నారు. ఎక్స్ అఫీషియో హోదాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ AVN రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ కార్పొరేటర్లు ఓటు వేశారు.బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ ప్రకటించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల కోసం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. డ్యూటీలో 250 మంది పోలింగ్ సిబ్బంది.. 250 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేశారు. పోటీలో ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. ఎంఐఎం అభ్యర్దిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలో ఉన్నారు.మొత్తం ఓటర్లు 112. 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. వీరిలో ఎంఐఎంకు 50, బీజేపీకి 24, బీఆర్ఎస్కు 24, కాంగ్రెస్‌కు 14. సరిపడ సంఖ్య బలం లేకున్నా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ. ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటర్లు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆదేశించింది. -
బిహార్ ఎన్నికలు... ఎన్నెన్నో ప్రశ్నలు!
బిహార్ రాష్ట్రం 13 కోట్ల జనాభాకు నెలవు! సుమారు 8 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఆ రాష్ట్రంలో మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిహారీల్లో అభివృద్ధి, ఉపాధి కావాలనీ; వలసలు నియంత్రించాలనే డిమాండ్స్ పెరగడం, కొత్త పార్టీలు పుట్టుకురావడం నేపథ్యంలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్లో బిహార్ రాష్ట్రానికి పెద్ద పీట వేసి అందరికంటే ముందుగానే బీజేపీ అక్కడ ప్రచారం మొదలుపెట్టింది. గత ఎన్నికల వరకు ఎన్డీయే కూటమిలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ)దే పైచేయిగా ఉండేది. కానీ, ఐదేళ్లలో రాజకీయ సమీకరణాలు మారాయి. బీజేపీ అగ్రవర్ణాలపై తన పట్టును కాపాడుకుంటూనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రెండు దశాబ్దాలుగా జేడీ(యూ) ఓటు బ్యాంకుగా ఉన్న ఓబీసీలను, దళితులను తన వైపు తిప్పుకుంది. నితీష్ కుమార్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో, పరిపాలనా సంస్కరణలతో లబ్ధిపొందిన ఈ వర్గాలను ఆకర్షించడం ద్వారా... బీజేపీ తన ‘సామాజిక’ కూటమిని బలోపేతం చేసుకుంది. సామాజిక న్యాయ పోరాటంలో కీలక పాత్ర పోషించిన లోక్ జన్ శక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యవస్థాపకులు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆ పార్టీ తన బలాన్ని కోల్పోయింది. ఆ పార్టీ తమ గుర్తింపును కాపాడుకోవడానికి తీవ్రంగా పోరాడు తున్న క్రమంలో బీజేపీకి సానుకూలంగా మారింది. వివిధ కుల సమూహాలను తనవైపు తిప్పుకోవడానికి బీజేపీ అంతర్గతంగా ప్రత్యేక వ్యూహాలను అనుసరిస్తోంది. పలు సందర్భాల్లో జేడీ(యూ)తో విభేదాలొ చ్చినా రాష్ట్రంలో దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉండటం వల్ల బీజేపీ తన హిందూత్వ భావ జాలాన్ని బిహార్ మట్టిలో జాగ్రత్తగా నిక్షిప్తం చేయగలిగింది. హిందూ సంఘటితం చుట్టే రాజకీయాలు నడు పుతూ మొట్టమొదటిసారి ఈ ఎజెండాతోనే ఎన్నికలు నడిచేలా వ్యూహాలను రచిస్తోంది. బడుగు, బలహీన వర్గాల ఐక్యతను కాపాడాలనే సిద్ధాంతంతో పని చేస్తున్న ‘ఇండియా’ కూటమికి ఇది అతిపెద్ద సవాలుగా మారబోతోంది. రాష్ట్రంలో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉంది. అలాగే ఆ పార్టీ వ్యూహాత్మ కంగా సృష్టిస్తున్న హిందూ కులాల ఐక్యత ఈసారి బిహార్ ఎన్నికలను రసవత్తరంగా మార్చనున్నది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం, బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీ, హిందుస్తానీ ఆవామ్ మోర్చా పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమికి 43.17 శాతం ఓట్లు రాగా; ఆర్జేడీ,కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కూడిన మహాగఠ్‌బంధన్ (ఎంజీబీ) కూటమికి 38.75 శాతం ఓట్లు వచ్చాయి.ఈ ఓట్ల వ్యత్యాసం ఇకముందు కూడా కొనసాగితే ఎన్డీఏ 2025లోనూ సునాయాసంగా విజయం సాధించే అవకాశాలున్నాయి. కానీ 2020 తర్వాత వికాసషీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) మహాVýæఠ్బంధన్లో చేరడం, జేడీ (యూ)లో రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ విలీనం కావడంతో ఈసారి లెక్కలు మారవచ్చు.బిహార్‌లో 18 శాతం ఉన్న ముస్లింలు కీలక పాత్ర పోషిస్తారు. 2020లో ఎంజీబీకి 76 శాతం ముస్లిం ఓట్లు రాగా, ఎన్డీఏకు కేవలం 5 శాతమే వచ్చాయి. యాదవ్– ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే బీజేపీ వైపు ఉన్న బీసీలను, దళితులను తనవైపు తిప్పుకోగలిగితే ఎంజీబీ గెలుపు అవకాశాలు పెరుగుతాయి. అయితే రాష్ట్రంలో పుట్టుకొచ్చిన కొత్త పార్టీలు ఎన్డీఏ–ఎంజీబీ కూటముల గెలుపోటములపై ప్రభావం చూపనున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) జన్ సూరజ్ పార్టీ నుంచి ఎంజీబీకి ముప్పు పొంచి ఉంది. 2024లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలతో పాటు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం ఆయన ఇటు ఎంజీబీ, అటు జేడీ(యూ) ఓట్లను గణనీయంగా చీల్చవచ్చు. ఆయన ఆర్జేడీ, జేడీ(యూ) పార్టీలపైనే విమర్శలతో విరుచుకుపడుతుండటంతో బీజేపీకి పరోక్షంగా మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుల ఆధారిత రాజకీ యాలు కాకుండా అభివృద్ధి తరహా రాజకీయాలు చేస్తా నని పీకే చెప్తున్నారు. లాలూ, నితీష్ల వృద్ధాప్యం, పాశ్వాన్ మరణంతో ఏర్పడిన ఖాళీని తాను భర్తీ చేయా లనుకుంటున్నారు. అయితే 243 నియోజకవర్గాల్లో నిల బెట్టడానికి బలమైన, నమ్మకమైన అభ్యర్థులు ఆయన పార్టీకి లేరు. కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత ఐ.పి. గుప్తా ‘ఇండియన్ ఇంక్విలాబ్ పార్టీ’ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రెండు కులాలపై ఈ పార్టీ ప్రభావం ఉండే అవకాశాలున్నాయి. ఐపీఎస్ అధికారిగా బిహార్‌లో ప్రత్యేక పనితీరు కనబర్చిన మహా రాష్ట్రకు చెందిన శివ్‌దీప్ లాండె ‘హింద్ సేన’ పార్టీ ఏర్పాటు చేశారు. ఒకప్పుడు నితీష్‌కు సన్నిహి తునిగా ఉన్న ఆర్సీపీ సింగ్ ఆయనతో విభేదించి బీజేపీలో చేరారు. అయితే బీజేపీ – జేడీ(యూ) మళ్లీ పొత్తు పెట్టుకో వడంతో ఈయన ‘ఆప్ సబ్కీ ఆవాజ్’ పార్టీని నెలకొల్పారు. కుర్మీ సామాజిక నేత అయిన ఆర్పీ సింగ్ ఆ సామాజిక ఓట్లు చీల్చే అవకా శాలున్నాయి. ఈ చిన్న పార్టీలు చీల్చే ఓట్లు ఎన్డీఏ, మహాగఠ్‌బంధన్ అభ్యర్థుల గెలుపోటములను శాసించ నున్నాయి.ఆర్జేడీ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. బీజేపీకి పెరుగుతున్న ఆకర్షణను అడ్డుకోవడానికి ఆర్జేడీ కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. ఓబీసీలను ఏకం చేయాలనీ, మైనారిటీ ఓట్లను కాపాడుకుంటూనే ఈబీసీలను, దళితులను ఎన్డీయే శిబిరం నుంచి తమ వైపు తిప్పుకోవాలనీ ఎంజీబీ లక్ష్యాలుగా పెట్టుకుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం ఇది. మరో ఏడు నెలల్లో ఎవరు గెలుస్తారో వేచిచూడాల్సిందే!ఆర్. దిలీప్ రెడ్డి వ్యాసకర్త పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
World Earth Day ఎంఎల్సీ విజయశాంతి ఇంట్రస్టింగ్ ట్వీట్
నేడు (ఏప్రిల్ 22) ప్రపంచ ధరిత్రి దినోత్సవం(World Earth Day) సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ(Congress MLC) విజయశాంతి(Vijayashanti) ఆసక్తికర ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ముఖ్యంటా ట్విటర్లో యాక్టివ్‌గా ఉండే ఆమె వరల్డ్ ఎర్త్‌డే సందర్భంగా ప్రకృతిని, ఈ భూమాతను రక్షించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇకనైనా మారదాం వినాశనాన్ని ఆపుదాం అంటూ పిలుపునిచ్చారు. విజయశాంతి ట్వీట్ ఇలా..‘‘ నేను ప్రపంచ ధరిత్రీ దినోత్సవం..అనంతమైన ఈ విశ్వంలో మనిషికి ఆవాసయోగ్యమైన ఏకైక గ్రహం భూమి మాత్రమే. ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగా వినియోగించుకుంటేనే.. మనిషి మనుగడ సాఫీగా సాగుతుంది. ఆ వనరుల్లో దేన్ని దుర్వినియోగం చేసినా.. సమస్త మానవాళి జీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఈ విషయం తెలిసినప్పటికీ.. మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు. పరిశ్రమల పేరుతో.. గాలి, నీటిని కాలుష్యంలో ముంచెత్తుతున్నాడు. సహజ వనరుల్ని అవసరానికి మించి వినియోగిస్తున్నాడు. తన స్వార్థంతో మొత్తం ప్రకృతి స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. ఇంత చేస్తుంటే.. ప్రకృతి ఊరుకుంటుందా..? భూకంపాలు, సునామీలు, వరదలు, కరువులతో హెచ్చరికలు చేస్తూనే ఉంది. కొన్ని సార్లు.. వైరస్ల రూపంలోనూ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో భూమి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేస్తోంది.. ఇకనైనా మారుదాం.. ప్రకృతి వనరుల్ని కాపాడుకుందాం. అందరికీ ప్రపంచ ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ విజయశాంతి ట్వీట్ చేయడం విశేషం. దీంతో ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది. నేడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవంఅనంతమైన ఈ విశ్వంలో మనిషికి ఆవాసయోగ్యమైన ఏకైక గ్రహం... భూమి మాత్రమే. ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగా వినియోగించుకుంటేనే... మనిషి మనుగడ సాఫీగా సాగుతుంది. ఆ వనరుల్లో దేన్ని దుర్వినియోగం చేసినా... సమస్త మానవాళి జీవనం అస్తవ్యస్తం కావాల్సిందే.… pic.twitter.com/GBqbhMYzjQ— VIJAYASHANTHI (@vijayashanthi_m) April 22, 2025 -
‘మా ప్రభుత్వం వచ్చాక మిమ్మల్ని వదిలిపెట్టం’.. పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ పోలీసులు సీఎం రేవంత్‌రెడ్డికి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (nhrc) ఆగ్రహం వ్యక్తం చేసింది. లగచర్లలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయబద్ధంగానే ఉన్నా, భూసేకరణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చట్టప్రకారం లేదని దుయ్యబట్టింది. ఈ మేరకు నివేదికను విడుదల చేసింది.ఎన్హెచ్ఆర్సీ నివేదిక విడుదలతో లగచర్ల బాధితులు హైదరాబాద్ నందినగర్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా, సీఎంగా సిగ్గుపడాలి. లగచర్లలో మహిళలపై దాడి చేశారు. బాధితుల పకక్షాన ఎన్హెచ్ఆర్సీని సంప్రదించాం. పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మళ్లీ సుప్రీం కోర్టుకు వెళతాం. లగచర్లలో ఓవర్ యాక్షన్ చేసిన అధికారులను వదలం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్షిస్తాం’ అని హెచ్చరించారు. -
‘భారత్ సమ్మిట్ చరిత్రలో నిలిచిపోతుంది’
హైదరాబాద్: త్వరలో హైదరాబాద్ వేదికగా నిర్వహించబోయే భారత్ సమ్మిట్ 2025 అనేది చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భారత్ సమ్మిట్ కు సంబంధించి ‘సాక్షి’తో మాట్లాడిన ఆయన.. ‘జాతీయ , అంతర్జాతీయ రాజకీయ, సామాజిక ,ఆర్దిక సమస్యల పై సమ్మిట్ లో చర్చ జరుగుతుంది. వందకు పైగా దేశాల నుంచి 400మందికి పైగా రాజకీయ, ఆర్థిక ,సామాజిక స్థితిగతుల లో నిష్టాతులైన వారు సమ్మిట్ కు హాజరవుతారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ లను ఆహ్వానించాం. రోహిత్ వేముల చట్టం తీసుకువస్తాం. ఈ చట్టం కోసం బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ఓత్తిడి పెరుగుతుంది. హైదరాబాద్ ఇమేజ్ పెరగనుంది. ఖర్గే, సోనియా, రాహుల్ ,ప్రియాంక గాంధీ లతో పాటు కార్పోరేట్ పెద్దలకు ఆహ్వానం. భారత్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. సమ్మిట్ నిర్ణయాలను తెలంగాణలో అమలు చేస్తాం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ ప్రతినిధులకు పరిచయం చేస్తాం’ అని భట్టి విక్రమార్క తెలిపారు.భారత్ ఫౌండేషన్ సహకారంలో ఈ నెల 25, 26వ తేదీల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ ఐసీసీ)లో భారత్ సమ్మిట్ 2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. -
నాకెందుకో... తెలియని ప్రజలకు తెలిసేటట్లు చేస్తున్నామేమోననిపిస్తుంది..!
నాకెందుకో... తెలియని ప్రజలకు తెలిసేటట్లు చేస్తున్నామేమోననిపిస్తుంది..! -
'ఖబడ్దార్ తీన్మార్ మల్లన్న'
హైదరాబాద్,సాక్షి: తీన్మార్ మల్లన్న ఖబడ్దార్. సీఎం రేవంత్‌రెడ్డిపై మరోసారి నోరు జారితే ఊరుకునేది లేదని తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. గత వారం నిర్వహించిన బీసీ చైతన్య సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కుర్చీని లాగేస్తామని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలపై సోమవారం తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ స్పందించారు. సీఎం రేవంత్‌ను విమర్శించే స్థాయి తీర్మార్ మల్లన్నకు లేదన్నారు. దమ్ముంటే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెట్టు సాయి కుమార్ (Mettu Saikumar) ఇంకా ఏమన్నారంటే.. 'తెలంగాణ రాజకీయ వ్యభిచారి ఎవరైనా ఉన్నారంటే అది తీన్మార్ మల్లన్నే. నేను రాజీనామా చేస్తా ఇద్దరం కలిసి పోటీ చేద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల నాయకత్వం పెంపొందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారు. ఎన్నిసార్లు రేవంత్ కాళ్ళు మొక్కావో గుర్తులేదా. అధిష్టానం రాష్ట్ర రాజకీయ నాయకులను ఒప్పించి రేవంత్ నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించారు.స్పీకర్ ఫార్మార్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నీ దమ్ము ఏంటో నిరూపించుకో. ఎన్ని పార్టీలు మారావో గుర్తుందా. బీసీల ముసుగులో చిల్లర పనులు చేస్తూ బిసిలను ఇబ్బందులకు గురి చేయడానికి సిగ్గుండాలి. నీది నా కంటే దిగువ స్థాయి.. సీఎం రేవంత్ రెడ్డితో పోల్చుకునే స్థాయి నీకు లేదు. ఇప్పటికైనా నీ స్థాయికి తగ్గట్లు మాట్లాడటం నేర్చుకో. బీజేపీ నేతలకు గులాంగిరి చేసుకో. ఉదయం బీజేపీ, సాయంత్రం బీఆర్ఎస్ భజన చేసుకో’ అని ధ్వజమెత్తారు.చదవండి: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట -
బీజేపీ వివరణ రాజకీయ వంచన
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తి లక్ష్యంగా పలు వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబే, దినేశ్ శర్మలపై ఆ పార్టీ చర్యలెందుకు తీసుకోలేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. వారి విమర్శలు వ్యక్తిగతమని చెబుతూ దూరంగా ఉండేందుకు ప్రయత్నించడం రాజకీయ వంచనగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు. ‘ఆ ఎంపీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కనీసం షోకాజ్ నోటీసులు ఎందుకివ్వలేదు?’ అని నిలదీశారు. తరచూ వివిధ వర్గాలు, వ్యక్తులు, సంస్థలే లక్ష్యంగా విద్వేష, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నిశికాంత్ దూబే, దినేశ్ శర్మలకు పార్టీతో సంబంధం లేదంటూ దూరంగా ఉండటం కేవలం నష్ట నివారణ చర్య మాత్రమేనన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మౌనంగా ఉండటం తగదని పేర్కొన్నారు. ఒక వేళ ఉపరాష్ట్రపతి అభిప్రాయాలతో పార్టీ ఏకీభవిస్తోందా? అని జేపీ నడ్డాను ప్రశ్నించారు. భారత రాజ్యాంగంపై ఇలా పదే పదే జరుగుతున్న దాడులపై ప్రధాని మౌనంగా ఉండటమంటే వారికి పరోక్షంగా మద్దతు ఇవ్వడమేనని జైరామ్ రమేశ్ అన్నారు. ఇదంతా బీజేపీ రాజకీయ వంచన అని ఆయన అభివర్ణించారు. జార్ఖండ్‌కు చెందిన ఎంపీ నిశికాంత్ దూబే పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన అల్లర్లు, వక్ఫ్ చట్టంపై చేసిన వ్యాఖ్యలు ధిక్కారం కిందికే వస్తాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ‘ఇది కోర్టు ధిక్కారానికి, రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన స్పష్టమైన కేసు. తేలిగ్గా తీసుకోలేం. భారత ప్రధాన న్యాయమూర్తిపై ఈ ఎంపీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. న్యాయవ్యవస్థను బెదిరించడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఇది న్యాయవ్యవస్థపై జరిగిన ప్రత్యక్ష దాడి. స్పీకర్, సుప్రీంకోర్టు ఆ ఎంపీపై చర్య తీసుకోవాలి’ అని వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఎంపీ దూబే శనివారం సుప్రీంకోర్టుపై విమర్శలు చేయడం తెల్సిందే. సుప్రీంకోర్టే చట్టాలు చేస్తుంటే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలను మూసివేసుకోవాల్సిందేనన్నారు. దేశంలో సివిల్ వార్లకు సీజేఐ కారణమని నిందించారు. అదేవిధంగా, రాష్ట్రపతి తన వద్దకు వచ్చిన బిల్లులపై 90 రోజుల్లోగా స్పష్టత ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించిన యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ ఇటీవల.. పార్లమెంట్‌ను, రాష్ట్రపతిని ఎవరూ ఆదేశించలేరంటూ వ్యాఖ్యానించారు. అయితే, వీరి వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని శనివారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. ‘న్యాయవ్యవస్థ, భారత ప్రధాన న్యాయమూర్తిపై ఎంపీలు నిశికాంత్ దూబే, దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇవి వారి వ్యక్తిగతం. పార్టీ వీటితో ఏకీభవించదు. ఇలాంటి వ్యాఖ్యలకు ఎప్పుడూ మద్దతివ్వదు. పూర్తిగా తిరస్కరిస్తుంది’ అని నడ్డా తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. -
అంబేద్కర్‌కు నిజమైన వారుసుడు మోదీయే
పెద్దపల్లి జిల్లా,సాక్షి: పేద ముస్లింలను దోచుకున్న ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ఆయన మీడియాతో మాట్లాడారు. పేద ముస్లింలకు న్యాయం జరగాలనే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టాం. అలాంటి బిల్లును వ్యతిరేకిస్తున్న ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉంది. టైటిల్ డీడ్ లేని భూములను వక్ఫ్ పేరుతో ఆక్రమించుకున్న చరిత్ర ఎంఐఎం పార్టీది. న్యాయస్థానాలపై భారతీయ జనతా పార్టీకి నమ్మకం ఉంది. నిన్న జరిగిన మీటింగుకి ఖర్మ, కర్త, క్రియ రేవంత్ రెడ్డియే..మీటింగు కోసం నిధులు సమకూర్చింది కూడా రేవంత్ రెడ్డియే. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు నాటకాలాడుతున్నాయి. మంచి ఉద్దేశంతో బిల్ తీసుకువస్తే మత కోణంలో ప్రతిపక్షాలు విద్వేశాలు రెచ్చగొడుతున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు నిజమైన వారుసుడు మోదీయే. వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలి. రైతుల విషయాన్ని పక్కన పెట్టి వక్ఫ్ మీటింగు కోసం కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు తాపత్రయ పడుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. -
బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా?.. కేటీఆర్ ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్దే విజయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. 17 నెలల కాలంలో బీఆర్ఎస్ గ్రాఫ్ బాగా పెరిగిందన్నారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికను బాయ్‌కట్ చేస్తున్నామని.. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లను కేటీఆర్ ఆదేశించారు. విప్ ధిక్కరిస్తే పార్టీ నుంచి బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.హెచ్‌సీయూ భూ కుంభకోణం వెనుక బీజేపీ ఎంపీ ఉన్నాడంటూ కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఎంపీలు తెలంగాణకు ఒక్క రూపాయైనా తెచ్చారా? అంటూ ప్రశ్నించారు. హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే.. రేవంత్ ఒక్కమాట కూడా మాట్లాడటం లేదంటూ మండిపడ్డారు. కేసీఆర్ దీక్ష, పోరాటంతోనే తెలంగాణ వచ్చిందన్న.. కేటీఆర్.. బీఆర్ఎస్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందన్నారు.చేసినవి చెప్పుకోనందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్‌సీయూ, హైడ్రా, మూసీ పేరుతో అరాచకాలు సృష్టిస్తోందని విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎంపీలు కాంగ్రెస్‌ను ఒక్క మాట కూడా అనరని.. హెచ్‌సీయూ భూములపై ప్రధాని మోదీ ఎందుకు విచారణ జరిపించడం లేదంటూ కేటీఆర్ ప్రశ్నించారు. -
Dr B R Ambedkarవీళ్ళే ఇలా రాస్తే ఎలా?!
అంబేడ్కర్ జయంతికి కేంద్ర మంత్రులు అంబేడ్కర్‌పై పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఒకరు దీన్ని కాంగ్రెస్ విమర్శకు వాడుకుంటే, మరొకరు అంబేడ్కర్ నోట అబద్ధాలు కుక్కారు. వీటిని ఆదర్శాల పేరుతో భావితరాలకు బోధిస్తారట. ఆర్య దండ యాత్ర సిద్ధాంతాన్ని అంబేడ్కర్ తప్పు పట్టారనీ, సంస్కృతాన్ని అధికార భాషగా ఆమోదించడానికి మద్దతుగా రాజ్యాంగ సభలో సవరణను ప్రవేశపెట్టారనీ. హిందీని తమ భాషగా స్వీకరించడం భారతీయులందరి విధి అని ప్రకటించారనీ ఇలా ఎన్నో అవాస్తవాలను రాశారు వారు. ‘‘ఇండో–ఆర్యులు ఇండియాకు వలస వచ్చి స్వదేశీయులను తరిమేశారు. వలస వాద, బ్రాహ్మణవాద కథనాలు కులాధిపత్య సమర్థనలు. ఆర్యులు సాంస్కృతిక భాషా సమూహం, ప్రత్యేక జాతి కాదు. రుగ్వేదం వంటి ప్రాచీన గ్రంథాల్లోని విభేదాలు సామాజిక అంత ర్గత పోరాటాల ప్రతిబింబాలు. ఆర్య దండయాత్ర సూత్రం ఆర్యేతర శూద్రుల, దళితుల అణచివేత సాధనం.’’ అని రాశారు అంబేడ్కర్. ఆర్య సూత్ర జాతి సంస్కృతుల ఊహలను సవాలు చేశారు. యజుర్, అధర్వణ వేదాల రుషులు శూద్రు లకు తగిన ప్రాధాన్యమిచ్చినట్లు అంబేడ్కర్ అనలేదు. ‘‘శూద్రులు ముందు ఆర్య క్షత్రియుల్లో భాగం. జనశ్రుతి (శూద్రుడు) వైదికజ్ఞాన అభ్యాసం, కవశ ఐలూశ (శూద్రుడు) శ్లోకాల రచన సంగతులు ఈ వేదాల్లో ఉన్నాయి. వేదాలు శూద్రుల జాతి, సామాజిక హీనతను సమర్థించ లేదు. మనుస్మృతి ఆ పని చేసింది. బ్రాహ్మణ, ప్రత్యేకించి ఉపనయన, ఆచారాల విభేదాలతో వారిని నాల్గవ వర్ణానికి దిగజార్చారు. శూద్రుల ఉన్నత స్థాయి తగ్గింపునకు వేదకాలం తర్వాతి బ్రాహ్మణ నీతి ఇది’’ అని అన్నారు. అంబేడ్కర్ శూద్రులతో పోల్చి ఆర్యులను పొగడలేదు. ఆర్య ఉన్నత జాతి సూత్రీ కరణను తిరస్కరించారు. ద్రవిడ, నాగ, దాస తెగలు అనార్యుల్లో భాగమని, వారు ఆర్యు లకు ఏ విధంగానూ తక్కువ కారని అంబేడ్కర్ అభిప్రాయం. అంబేడ్కర్ అధి కార భాషగా సంస్కృతానికి మద్దతివ్వలేదు. సంస్కృతాన్ని ప్రజలు అతి తక్కువగా వాడు తారని, పాలనకు, ప్రజలు ఒకరితోనొకరు మాట్లాడుకోవడానికి సంస్కృతం ఆచరణీయం కాదనేది ఆయన అభిప్రాయం. హిందీని రుద్దడం హిందీయేతర భాషా ప్రాంతాల అణచివేతకుదారి తీయగల అపాయాన్ని జాగ్రత్తగా పరిగణించాలన్నారు. ఆంగ్లంతో పాటు హిందీ భారత ప్రజల లంకె భాషగా ఉండాలని అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణ సభలో వాదించారు. మరిఅంబేడ్కర్ ఆదర్శాలను సంఘ్ సర్కారు ఆచరిస్తుందా? – సంగిరెడ్డి హనుమంత రెడ్డి,ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
‘బంగ్లాదేశ్ తిరుగుబాటుతో తెలంగాణకు సంబంధమేంటి?’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అక్కసు ఎందుకని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. పదేళ్లలో బీఆర్ఎస్ చేయనటువంటి పనులను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మల్లు రవి స్పష్టం చేశారు. ‘తెలంగాణలో ప్రజల తిరుగుబాటుతోనే బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది. పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ కాస్తా బంగారు కేసీఆర్ కుటుంబంగా మారింది. ప్రతిపక్షాలు రాత్రింబవళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయి. బంగ్లాదేశ్ లో ప్రజలు తిరిగిపడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.పదేళ్లలో బిఆర్ఎస్ చేయనటువంటి పనులను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దేశ చరిత్రలో మొదటిసారిగా పేదల కోసం సన్న బియ్యం పంపిణీని ప్రభుత్వం తీసుకొచ్చింది. సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక నిర్ణయం. బంగ్లాదేశ్ తిరుగుబాటుతో తెలంగాణకి ఏం సంబంధం కేటీఆర్. ధరణితో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసింది.16 లక్షలు మంది ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతుల మేలు కోసం భూభారతిని సీఎం రేవంత్, మంత్రులు బృందం తీసుకొచ్చింది. ప్రగతి భవన్ లో ప్రజలు కనపడకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. రేవంత్ హయంలో ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి ప్రజలు వెళ్లేందుకు వీలు కల్పించారు. కాంగ్రెస్ ఏడాదిన్నర లో 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం’ అని మల్లు రవి పేర్కొన్నారు. -
ఖబడ్దార్ రేవంత్.. ‘సీఎం పదవి నుంచి దించేస్తాం’
మహబూబ్‌నగర్,సాక్షి: మహబూబ్ నగర్లో లేఖ కలకలం సృష్టించాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలను హెచ్చరిస్తూ రాసిన లేఖలు మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నారాయణ్‌పేట్ జిల్లా మక్తల్‌లో వెలుగులోకి వచ్చాయి. ఆ లేఖలో ‘మేం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలం. సీఎం రేవంత్‌రెడ్డికి ఇదే మా హెచ్చరిక. ఖబడ్దార్. మీ పలుకుబడి ఉపయోగించి మా ఎమ్మెల్యేకి(మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి) మంత్రి పదవి రాకుండా చేశావో అప్పుడు నీ భరతం పట్టడం ఖాయం. రాష్ట్రంలో పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. మిమ్మల్ని సీఎం పదవి నుంచి దించడం’ అని హెచ్చరిస్తూ లేఖలో రాశారు.ముదిరాజు సామాజిక వర్గం పేరుతో ఆ లేఖలు వెలుగులోకి రావడంపై పోలీసులు రంగంలోకి దిగారు. ఆ లేఖలు ఎవరు రాశారా? అని ఆరా తీస్తున్నారు.ఆ లేఖలపై సమాచారం అందుకున్న ముదిరాజు సంఘం నేతలు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ లేఖలతో తమకు సంబంధం లేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ప్రధానిగారూ.. చిత్తశుద్ధి నిరూపించుకోండి: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: ప్రధాని నరేంద్రమోదీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక విజ్ఞప్తి చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానిగా పర్యావరణంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయమిదన్నారు. ‘‘కంచ గచ్చిబౌలి భూముల(Kancha Gachibowli Land Issue) ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టాలి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి. దీనిపై ప్రధాని వ్యాఖ్యలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాలి. కంచ గచ్చిబౌలి అంశం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రూ.10వేల కోట్ల ఆర్థిక మోసం.దీనిపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో సహా తెలిపాం. ఆర్థిక అవకతవకల అంశాన్ని కేంద్ర సాధికార కమిటీ నిర్ధరించింది. స్వతంత్ర విచారణ చేయాలని సూచించింది. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి’’ అని కేటీఆర్(KTR) కోరారు.ఇటీవల హర్యానాలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి భూములపై కీలక వ్యాఖ్యలు చేశారు. అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉందని విమర్శించారు. ప్రకృతి నాశనం, వన్యప్రాణులకు హాని.. ఇదే కాంగ్రెస్ పాలనని వ్యాఖ్యానించారు. అటవీ సంపదను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను సైతం కాంగ్రెస్ మర్చిపోయిందని మోదీ ఎద్దేవా చేశారు. -
వచ్చే వారం అమెరికాకు రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వచ్చే వారం అమెరికాకు వెళ్లనున్నారు. పర్యటన సందర్భంగా రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపక సిబ్బందితో జరిగే ముఖాముఖిలో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ మీడియా పబ్లిసిటీ విభాగం చీఫ్ పవన్ ఖేరా గురువారం ఈ విషయం తెలిపారు. ఈ నెల 21, 22వ తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుందన్నారు. అదేవిధంగా, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆఫీసు బేరర్లు, సభ్యులతో సమావేశమవుతారు. -
దిక్కుమాలిన సర్కారును పడగొట్టం
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము పడగొట్టడం ఎందుకు.. ఐదేళ్ల తర్వాత ప్రజలే తన్ని తరిమేస్తారు. మా పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. ఈ ప్రభుత్వ పనితీరు బాగా లేదంటూ ప్రజలు ఆక్రోశిస్తున్నారు. ఈ సర్కారును ఎత్తి పడేయమని మమ్మల్ని అడుగుతున్నారు. కొందరు చందాలు వేసుకొనిసర్కారును కూలగొట్టమని అడుగుతున్నారని మాత్రమే మా ఎమ్మెల్యే చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజర్ అనే విషయం ప్రజలకు తెలియాలి. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలి. అలా అయితేనే మరో 20 ఏళ్ల వరకు ఎవరూ కాంగ్రెస్‌కు ఓటు వేయరు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.తెలంగాణభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘రేవంత్‌రెడ్డి చేస్తున్న లుచ్చా పనులకు ప్రజలే బుద్ధి చెబుతారు. అవసరమైతే ప్రజలే రోడ్డు మీదకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. మా పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. వాళ్ల బతుకు అధ్వానంగా ఉంది’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆత్మాభిమానం ఉంటే రాజీనామా చేయాలి‘కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆత్మాభిమానం లేని సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని విమర్శలు వచ్చినా రాజీనామా చేయకుండా దులుపుకొని బతుకుతున్నాడు. ఏడాది క్రితం రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించిన ప్రధాని మోదీ ఇప్పుడు మేల్కొని హెచ్‌సీయూ భూముల్లో కాంగ్రెస్ పర్యావరణ విధ్వంసం చేసిందని ఆరోపించారు.సెంట్రల్ ఎంపవర్ కమిటీ (సీఈసీ) నివేదిక ఇచ్చినా మోదీ ప్రభుత్వం స్పందించి ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు. బీజేపీకి తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో పర్యావరణ విధ్వంసంపై విచారణకు ఆదేశించాలి. లేదా ఆర్బీఐ, సీవీసీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలకు అయినా దర్యాప్తు బాధ్యతలు ఇవ్వాలి’అని కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం అరాచకం‘సీబీఐని గతంలో కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తే.. ప్రస్తుతం బీజేపీ ఈడీని విచ్చలవిడిగా వాడుతోంది. కంచ గచ్చిబౌలి భూములపై రాష్ట్ర ప్రభుత్వం, టీజీఐఐసీ ఉద్దేశాల మీద తమకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. చెరువులను కూడా తాకట్టుపెట్టిన వైనం బయట పెట్టింది. అయినా రేవంత్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు మోదీ ఆరాటపడుతున్నాడు.కేంద్రం స్పందించకుంటే ఈ నెల 27 తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలను కలిసి ఆధారాలు అందజేయడంతోపాటు బీజేపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఆర్థిక దోపిడీ, పర్యావరణ విధ్వంసంపై మోదీ స్పందించకుంటే ఆయనకు వాటా ఉందని అనుకోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో కంటే క్షేత్ర స్థాయిలోనే రేవంత్ ప్రభుత్వంపై ఎక్కువ వ్యతిరేకత ఉంది’అని కేటీఆర్ చెప్పారు. -
‘రేవంత్‌ను నమ్మిన పాపం.. రైతులకు స్మశానమే దిక్కైంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్‌ను నమ్మిన పాపానికి.. రైతులకు స్మశానమే దిక్కయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి రైతులు బతికుండగానే.. ఇలా వల్లకాడుకు చేర్చిన పాపం.. కాంగ్రెస్‌ను వెంటాడటం ఖాయం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..రేవంత్ ను నమ్మిన పాపానికి..రైతులకు స్మశానమే దిక్కయిందిభూముల "అమ్మకాల్లో" బిజీగా ఉన్న సర్కారుధాన్యం "కొనుగోళ్లనే" పూర్తిగా మరిచిపోయింది15 రోజులైనా కొనుగోలు కేంద్రం తెరుచుకోకస్మశానంలో పడుకునే దుస్థితి దుర్మార్గమైనదిఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో..రైతుల మరణమృదంగం మోగుతోంది.చివరికి రైతులు బతికుండగానే.. ఇలా వల్లకాడుకు చేర్చిన పాపం.. కాంగ్రెస్ ను వెంటాడటం ఖాయంజై కిసాన్#CongressFailedTelangana అంటూ ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ ను నమ్మిన పాపానికి..రైతులకు స్మశానమే దిక్కయిందిభూముల "అమ్మకాల్లో" బిజీగా ఉన్న సర్కారుధాన్యం "కొనుగోళ్లనే" పూర్తిగా మరిచిపోయింది15 రోజులైనా కొనుగోలు కేంద్రం తెరుచుకోకస్మశానంలో పడుకునే దుస్థితి దుర్మార్గమైనదిఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో..రైతుల మరణమృదంగం… pic.twitter.com/GnDtWoZOhk— KTR (@KTRBRS) April 17, 2025 -
కూల్చే కుట్ర కేసీఆర్‌దే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ఆలోచన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌దేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి నోటి వెంట వచ్చినవి కేసీఆర్ మనసులోని మాటలేనని ఆరోపించారు. రూ.5–6 వేల కోట్లు ఖర్చు చేసైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన సందర్భంగా ఆ చట్టం తీరుతెన్నులు, రెవెన్యూ శాఖలో చేపడుతున్న సంస్కరణలు, రాష్ట్ర రాజకీయాలపై బుధవారం ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భూభారతి చట్టంపై బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అసలు వారికి ఉరితాడు అయింది ధరణినే. అది గ్రహించకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. వారికి గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు కూడా ఈసారి రావు. 15 నెలలకే ప్రభుత్వాన్ని కూలుస్తామని కొందరి ఆత్మలు మాట్లాడుతున్నాయి. కేసీఆర్ మనసులోని మాటలనే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. రూ.5–6 వేల కోట్లు ఖర్చుపెట్టి అయినా ఎమ్మెల్యేలను కొనాలని అనుకుంటున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు తనకు కావాల్సిన బిల్డర్లకు వేలాది ఎకరాలు కట్టబెట్టారు. ఇప్పుడు వారంతా భయభ్రాంతులకు గురై, ఫామ్‌హౌస్‌కు వెళ్లి మాజీ సీఎంకు మొరపెట్టుకున్న మాటలను ప్రభాకర్‌రెడ్డితో చెప్పించారు. ప్రభుత్వ భూములను చెరపట్టిన వారు ఏడేడు లోకాల ఆవల ఉన్నా వదిలిపెట్టం. ప్రతి ఇంచు భూమిని బరాబర్ తీసుకుని పేదలకిస్తాం. మాజీ సీఎం, ఆయన కొడుకు, అల్లుడు, కూతురు వేసే స్కెచ్‌లు, కుట్రలకు ఎలా చెక్‌పెట్టాలో కాంగ్రెస్ పార్టీ పులులకు తెలుసు. సమయం వచ్చినప్పుడు ఆ పులులు స్పందిస్తాయి’ అని స్పష్టంచేశారు.కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని, కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తెలిపారు. ‘పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు వేస్తారు. మేం మంచిగా పనిచేస్తున్నందుకే కంచ గచ్చిబౌలిపై మోదీ కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. నేటి నుంచే భూ సమస్యల పరిష్కారంరాష్ట్ర ప్రజల కోరిక మేరకే ధరణిని బంగాళాఖాతంలో కలిపేశా మని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. జూన్ 2వ తేదీ నాటికి వ్యవసాయ భూముల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో వీలైనన్ని పరిష్కరిస్తా మని వెల్లడించారు. భూభారతి చట్టం ద్వారా వ్యవసాయ భూముల సమస్యలను పరిష్కరించే పనిని గురువారం నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ‘పైలెట్ ప్రాజెక్టుగా లింగంపేట, నేలకొండపల్లి, మద్దూరు, వెంకటాపూర్ మండలాలను ఎంచుకున్నాం. ఈ మండలాల్లోని అన్ని గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తాం. ఈ సదస్సుల్లో రైతుల నుంచి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తాం. ఈ దరఖాస్తు ఫార్మాట్‌ను ఇప్పటికే క్షేత్రస్థాయికి పంపాం. ప్రతి గ్రామంలో తహసీల్దార్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం పర్యటించి, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సదస్సులు నిర్వహిస్తుంది. స్వీకరించిన దరఖాస్తులను వెంటనే కంప్యూటరైజ్ చేస్తాం. ఈ నెలాఖరుకల్లా ఆ 4 మండలాల్లోని అన్ని గ్రామాల్లో సదస్సులు పూర్తవుతాయి. ఆ 4 మండలాలతోపాటు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు రైతులతో సదస్సులు నిర్వహిస్తారు. అక్కడ కూడా దరఖాస్తులు తీసుకుంటాం. మే మొదటివారంలో 28 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని మోడల్‌గా తీసుకుని, ఆయా మండలాల్లోని అన్ని గ్రామాల్లో సదస్సులు నిర్వహించి, రైతుల సమస్యలను పరిష్కరిస్తాం. జూన్ 2వ తేదీకల్లా అన్ని జిల్లాల్లో వీలైనన్ని ఎక్కువ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం. ఈ సదస్సుల ద్వారా పెండింగ్‌లో ఉన్న 9.6 లక్షల సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం కూడా జరుగుతుంది. ప్రభుత్వ భూములను ఆక్రమించిన పేదలను గుర్తించి వారికి పట్టాలిస్తాం. జూన్ 2న సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఈ పట్టాల పంపిణీ జరుగుతుంది. జూన్ 2 తర్వాత రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది’ అని మంత్రి పొంగులేటి వెల్లడించారు.జీపీఓలు వచ్చాకే సర్వేమ్యాప్లురాష్ట్రంలో గ్రామ పాలనాధికారులను నియమించిన తర్వాతే సర్వే మ్యాప్‌లను అమల్లోకి తెస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ‘రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆ భూమి హద్దులతో కూడిన సర్వేమ్యాప్ కూడా అందించాలన్న నిబంధనను ఇప్పటికిప్పుడు అమల్లోకి తెచ్చే ఉద్దేశం లేదు. రాష్ట్రంలోని 10,956 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలనాధికారులు (జీపీఓ) వస్తారు. 6 వేల మంది లైసెన్సుడ్ సర్వేయర్లు కూడా వస్తారు. ఆ తర్వాత సర్వే మ్యాప్ నిబంధన ప్రారంభమవుతుంది. ఈలోపు రైతులు ఎవరైనా స్వచ్ఛందంగా కోరుకుంటే వారి పాస్‌పుస్తకంలో సర్వే మ్యాప్ ముద్రిస్తాం. కర్ణాటకలో 9 ఏళ్లుగా ఈ సర్వే మ్యాప్ నిబంధన అమలవుతోంది. ఇప్పటివరకు 75 శాతం భూములకు మ్యాప్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలో అంతకంటే తక్కువ సమయంలో ఎక్కువ భూములకు సర్వే మ్యాప్‌లు వస్తాయి. జీపీఓల నియామకం విషయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు. ఏం చేసినా ప్రజల సౌలభ్యం కోసమే. వ్యవస్థ కోసం అందరూ సహకరించాలి. పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు గూగుల్ ఫామ్ ద్వారా ఆప్షన్లు ఇచ్చే గడువును పొడిగిస్తున్నాం’ అని ప్రకటించారు.కొత్త పోర్టల్ తెస్తాంఇప్పుడు తెచ్చిన భూభారతి పోర్టల్ తాత్కాలికమేనని మంత్రి పొంగులేటి తెలిపారు. ‘భూ సమస్యల శాశ్వత పరిష్కారం ఈ పోర్టల్‌తో కాదు. అందుకే శాశ్వత పోర్టల్‌ను తీసుకురాబోతున్నాం. మరో వందేళ్ల పాటు భూభారతి పోర్టల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. త్వరలోనే టెండర్లు పిలుస్తాం. కొత్త పోర్టల్ తయారీకి 7–9 నెలలు పడుతుంది. ఈ ఏడాది చివరికి లేదంటే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి పోర్టల్ అందుబాటులోకి వస్తుంది’ అని తెలిపారు. -
బెదిరింపులు.. మోసం.. వారికి కొత్త కాదు: కవిత
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు.. మోసం కొత్త కాదని.. తెలంగాణ ఇస్తానని చెప్పి 2004లో మోసం చేసిన కాంగ్రెస్... ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేస్తోందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ, ఉచిత బస్సు అంటూ. మహిళల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోంది. ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చి బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు.కళ్యాణలక్ష్మీ పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఒక బస్సు ఇచ్చి.. బంగారాన్ని తుస్సుమనిపించారు. రుణ మాఫీ, రైతు భరోసా 50 శాతం మందికి ఇంకా రానేలేదు. గ్రామగ్రామాన కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలి. బీజేపీ మోసపూరిత విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పసుపు బోర్డును తూతూమంత్రంగా ఏర్పాటు చేశారే కానీ.. చట్టబద్ధత కల్పించలేదు. దాంతో పసుపు బోర్డుకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి డబ్బులు ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. మరి పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి రైతులకు డబ్బులు ఇచ్చారా?’’ అంటూ కవిత ప్రశ్నించారు.రెండు కోట్ల ఉద్యోగాలు, బోర్డుకు చట్టబద్ధత, మనిషికి 15 లక్షలు ఏమయ్యాయని అడిగితే ఎంపీ అర్వింద్ పిచ్చి మాటలు మాట్లాడుతారు. అంతకు మించి ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడిన దాఖలాలు లేవు. రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు.. అయినా కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు 8 రూపాయలు కూడా ఇవ్వలేదు. 8+8 = పెద్ద గుండు సున్నా. తెలంగాణాను కాపాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, గులాబీ జెండానే. రజతోత్సవం గుజాబీ పండుగ మాత్రమే కాదు.. ఇది తెలంగాణ పండుగ. తెలంగాణా ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్’’ అని కవిత చెప్పుకొచ్చారు.‘‘బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఎంపీ అర్వింద్ కలిసిమెలసి ఢిల్లీతో తిరుగుతున్న వార్తను టీవీల్లో చూశాను. సంజయ్ బీజేపీలో చేరారా లేదా కాంగ్రెస్‌లో చేరారా అన్న అనుమానం వచ్చింది. సంజయ్ ఒకసారి సీఎం రేవంత్ రెడ్డితో... మరొకసారి బీజేపీ వాళ్లతో కనిపిస్తారు. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో తెలియక ప్రజల్లో అయోమయం నెలకొంది. జగిత్యాలకు నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే సంజయ్ విఫలం. ఎమ్మెల్యే సంజయ్‌ని గ్రామ గ్రామానా నిలదీయాలి’’ అని కవిత పేర్కొన్నారు. -
ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ చిత్తే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయే విధంగా క్షేత్రస్థాయి పరిస్థితులున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘తొందరపడి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలగొట్టం.సర్కార్‌కు ఇంకా మూడున్నరేళ్లకు పైగా గడువు ఉంది. ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొడితే బీజేపీకి లాభం ఎంటి? ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అందరికీ తెలుసు’అని వ్యాఖ్యానించారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతి నిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... భూముల విక్రయం, అప్పులు చేయడం, మద్యం అమ్మడం ద్వారానే ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని మండిపడ్డారు. కేసులు ఎదుర్కునేందుకూ సిద్ధంహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్ల కూల్చివేత, భూమి చదునుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు ఉల్లంఘనలకు పాల్పడిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. అర్ధరాత్రి ఫ్లడ్‌లైట్లు పెట్టి చెట్లు నరికిన పరిస్థితి గతంలో ఎక్కడా జరగలేదని, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రధాని మోదీ విమర్శిస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అంశంలో ఎవరో ఏఐతో చేసిన నకిలీ ఫొటోలు సోషల్‌మీడియాలో పెట్టారని మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. హెచ్‌సీయూ అంశంపై గతంలో తాను ట్విట్టర్లో పెట్టిన పోస్ట్‌కు కట్టుబడి ఉన్నానని, ఈ విషయంలో కేసులు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఈ భూముల విక్రయం వెనక బీజేపీ ఎంపీ ఉంటే, అతడి పేరు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు అసదుద్దీన్ బిగ్బాస్కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బిగ్‌బాస్ అని, ఆయనే ఈ రెండు పార్టీలను నియంత్రిస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ నెల 19న వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో భూబకాసు రులు నిరసనలు నిర్వహిస్తున్నారని ఎంఐఎం సభను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ముస్లింల ప్రార్థనా మందిరాలకు వక్ఫ్ బోర్డుకు సంబంధం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర కార్పొరేటర్లను కూడా కలిసి ఓట్లు అడుగుతామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన, టీడీపీతో కలిసి పోటీచేసే ఆలోచనే లేదని స్పష్టంచేశారు. ఒంటరిగానే పోటీచేసి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని తెలిపారు. ఇకపై కాంగ్రెస్, బీఆర్ఎస్లతో బీజేపీకి దోస్తీ ఉందని ఎవరైనా అంటే చెప్పుతో కొట్టాలని ప్రజలకు సూచించారు. -
ఈసీ తీరు పూర్తిగా.. అనుమానాస్పదం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు సంస్థ పూర్తిగా తిలోదకాలిస్తోందంటూ ధ్వజమెత్తాయి. ‘‘ఓటింగ్‌కు సంబంధించి పౌరులందరికీ తెలియాల్సిన గణాంకాలను అడిగినా బయటపెట్టడం లేదు. ఎన్నికల ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఈసీ తీరుతో నానాటికీ బలపడుతున్నాయి’’ అంటూ దుయ్యబట్టాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల శాతానికి సంబంధించిన పూర్తి గణాంకాలను బయట పెట్టాల్సిందిగా అవి చిరకాలంగా డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. ఈ విషయమై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్)తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లకు సంబంధించి 17సీ పార్ట్–1 తాలూకు ప్రతులన్నింటినీ వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. దీనిపై తొలుత ఈసీని సంప్రదించాల్సిందిగా గత నెల కోర్టు వారికి సూచించింది. దాంతో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఆహ్వానం ఆ మేరకు మంగళవారం సమావేశం జరిగింది. ఏడీఆర్ ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్, మొయిత్రా తదితరులు భేటీలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను మరోసారి ఈసీ ప్రతినిధుల ముందుంచారు. అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు. ఈసీ తీరుపై పెదవి విరిచారు. తమ డిమాండ్లకు ఎలాంటి సానుకూల స్పందనా రాలేదంటూ ఆక్షేపించారు.సీఈసీ, ఈసీ ఎక్కడ: భూషణ్సీఈసీ గానీ, ఎన్నికల కమిషనర్లు గానీ భేటీలో పాల్గొనకపోవడాన్ని ప్రతినిధులు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఏదో అత్యున్నత న్యాయస్థానం సూచించింది గనుక తప్పలేదన్నట్టుగా వ్యవహరించారు. భేటీకి కేవలం ఈసీ ప్రతినిధులను పంపి సరిపెట్టారు. సంస్థ విశ్వసనీయతకు సంబంధించిన అతి కీలకమైన సమస్య విషయంలో వారి చిత్తశుద్ధి ఏపాటిదో దీన్నిబట్టే తేలిపోతోంది. అయినా సుప్రీంకోర్టుపై గౌరవంతో మా అనుమానాలన్నింటినీ ఈసీ ప్రతినిధుల ముందుంచాం. 2019 లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ శాతానికి సంబంధించిన డేటాలో చాలా అవకతవకలున్నట్టు వారి దృష్టికి తీసుకెళ్లాం. వాటిపై సమాధానాలు కోరాం. ఫాం 17(సీ), 20 వంటివాటిని వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాల్సిందిగా సూచించాం. ఇది ఈసీ విశ్వసనీయతకే పెనుసవాలు అన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరాం. కానీ వారినుంచి సానుకూల స్పందనే లేదు’’ అంటూ ప్రశాంత్ భూషణ్ పెదవి విరిచారు. దీనిపై తమ తదుపరి వాదనలను ఇక సుప్రీంకోర్టు ముందే ఉంచుతామని స్పష్టం చేశారు. ఓటింగ్ సంబంధిత డేటాను ఎన్నికల ఏజెంట్లకు అందించడంలో లేని అభ్యంతరం వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ‘‘ఓటింగ్ విషయంలో తప్పిదాలు, అవకతవకలు జరుగుతున్నాయని, ఈవీఎంల టాంపరింగ్ జరుగుతోందని దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా అనుమానాలున్నాయి. అవి వాస్తవమేనంటూ దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు గళమెత్తుతున్నారు. ఈసీ ప్రవర్తన ఆ అనుమానాలకు మరింతగా బలం చేకూరుస్తోంది’’ అంటూ భూషణ్ దుయ్యబట్టారు.2024లోనూ అవకతవకలు: మొయిత్రా2019లోనే గాక 2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో కూడా ఓటింగ్‌కు సంబంధించి భారీ అవకతవకలు జరిగాయని మొయిత్రా ఆరోపించారు. ‘‘గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు పొంతనే లేదు. సాయంత్రం దాకా ఉన్న పోలింగ్ శాతాలు రాత్రికల్లా అనూహ్యంగా భారీగా పెరిగిపోయాయి. చాలాచోట్ల ఈ పెరుగుదల ఏకంగా 20 శాతం దాకా ఉంది’’ అని గుర్తు చేశారు. ఫలితంగా ప్రస్తుతం ఈసీ విశ్వసనీయత ఎన్నడూ లేనంతగా అడుగంటిందని విమర్శించారు. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈసీ పూర్తిగా అప్రతిష్టపాలైందన్నారు. ‘‘మేం కోరుతున్నది రహస్య వివరాలేమీ కాదు. దేశప్రజలందరికీ వాటిని తెలుసుకునే హక్కుంది. అంతేకాదు, వాటిని తెలుసుకుని తీరాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది’’ అని ఆమె స్పష్టం చేశారు. -
మన పథకాలతో మోదీ ఉక్కిరిబిక్కిరి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘మన ప్రభుత్వానికి మంచి పేరు, సాఫీగా నడిచే విధంగా ఆదాయం రావడం బీఆర్ఎస్, బీజేపీలకు ఇష్టం లేదు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆ రెండు పారీ్టలు కలిసి చేసిన కుట్రలే ఇందుకు నిదర్శనం. మనం కోర్టులో గెలిచి ఆ భూములను తీసుకువచ్చాం. మొత్తం 2,200 ఎకరాల్లో మన ప్రభుత్వం క్లెయిమ్ చేస్తోంది 400 ఎకరాలే. మిగిలిన భూముల జోలికి వెళ్లడం లేదు. ఆ 400 ఎకరాల్లో ఐటీ టవర్స్ నిర్మించే ఆలోచనలో ఉన్నాం. అలా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. ఉద్యోగాలు కూడా వస్తాయి. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా కిషన్‌రెడ్డికి చెప్పాడు. కిషన్‌రెడ్డి అమిత్‌షాకు చెపితే అమిత్‌షా మోదీకి చెప్పాడు. మన పథకాలు ప్రధానిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆయన రంగంలోకి దిగారు. బుల్డోజర్లు, జేసీబీలకు తేడా తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు. అందరూ కలిసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దేశంలో గుజరాత్ మోడల్ పోయింది. తెలంగాణ మోడల్ ప్రచారంలోకి వస్తోంది. ముఖ్యంగా కులగణన గేమ్ ఛేంజర్ అయింది. రేపు జరిగే బిహార్ ఎన్నికల్లో ముఖ్యపాత్ర పోషించబోతోంది. ప్రధాని మోదీకి ఇది రాజకీయంగా మరణశాసనం కాబోతోంది..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పి) సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్లు కుడుతున్న ప్రతిపక్షాలను కట్టడి చేయాలి ‘సన్న బియ్యం, ఎస్సీల వర్గీకరణ, కులగణన, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు లాంటి అద్భుత కార్యక్రమాలతో ముందుకెళుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయి. కళ్లు కుడుతున్న ప్రతిపక్షాలను కట్టడి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మీరు మళ్లీ గెలవాలంటే ఏం కావాలో అడగండి ఎవరైనా సరే పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాలి. నేనైనా, డిప్యూటీ సీఎం భట్టి అయినా పార్టీ చెప్పిన మేరకే పనిచేస్తాం. ప్రభుత్వంతో పాటు పార్టీ బలంగా ఉంటేనే మరోసారి గెలుస్తాం. మీరు రెండోసారి గెలవాలంటే మీ నియోజకవర్గంలో ఏం కావాలో నివేదిక తయారు చేసుకోండి. అవసరమైతే కన్సల్టెంట్‌ను పెట్టుకోండి. మే 1 నుంచి మీకు అందుబాటులో ఉంటా. మీ నివేదికలు నాకివ్వండి. నేను కూడా వెరిఫై చేసుకుని నిధులు కేటాయిస్తా. మీ నియోజకవర్గాలకు వస్తా. పాదయాత్రలా, కార్నర్ మీటింగ్‌లా, బహిరంగ సభలా.. ఏం పెడతారో మీ ఇష్టం. ఈ విషయంలో డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు కార్యాచరణ ఇస్తారు. జూన్ 2 నుంచి జనాల్లోకి వస్తా.. నేను కూడా జూన్ 2 వరకు జనాల్లోకి వస్తా. మన ప్రభుత్వం ఏం చేస్తోందో ప్రజలకు వివరిద్దాం. సన్న బియ్యం పథకంతో ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వస్తోంది. సన్నబియ్యం కాంగ్రెస్ పార్టీ పథకం. ఇది పేటెంట్, మన బ్రాండ్. సన్న బియ్యంతో పాటు ఎస్సీల వర్గీకరణ, కులగణన, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ విషయంలో ఇన్చార్జి మంత్రులు కీలక పాత్ర పోషించాలి. పార్టీ ప్రతిష్టను ఎవరూ దెబ్బతీయొద్దు..’ అని రేవంత్ అన్నారు. భారత్ సమ్మిట్‌కు రాహుల్, ప్రియాంక ‘మంత్రివర్గ విస్తరణను రిజర్వుడ్ ఫర్ జడ్జిమెంట్ తరహాలో అధిష్టానం ఫ్రీజ్ చేసింది. ఎవరేం చెప్పుకోవాలన్నా హైకమాండ్‌కు చెప్పుకోవాలి. భువనగిరి ఎంపీ కిరణ్‌రెడ్డి తను వెళ్లిన చోటల్లా ఒక మంత్రిని ప్రకటిస్తున్నాడు. అది సరైంది కాదు. అద్దంకి దయాకర్ చాలా ఓపికగా వెయిట్ చేశాడు. పార్టీ లైన్లో పనిచేశాడు. అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెలలో నిర్వహించే భారత్ సమ్మిట్‌కు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాం«దీలు వస్తున్నారు. అంతర్జాతీయ ప్రతినిధులు కూడా వస్తారు. పీసీసీ అధ్యక్షుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను మంత్రులకివ్వాలి..’ అని సీఎం చెప్పారు. అవి వారి అస్తిత్వానికే ప్రమాదం: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. సంక్షేమం ఒక ఎత్తయితే ఎస్సీల వర్గీకరణ, బీసీల కులగణన కార్యక్రమాలను గొప్ప గొప్ప నాయకులే చేయలేకపోయినా, తెలంగాణ ప్రభుత్వం ధీరోదాత్తంగా చేసిందని అన్నారు. ఇవి బీఆర్ఎస్, బీజేపీలను కట్టి మూలన పడేస్తాయని, వారి అస్తిత్వానికే ప్రమాదంగా మారనున్నాయని వ్యాఖ్యానించారు. సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు సీఎం చెక్కులు అందజేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్‌లను అభినందించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కూడా హాజరయ్యారు. బెంబేలెత్తించిన లిఫ్ట్ సీఎల్పీ సమావేశం జరిగే రెండో అంతస్తుకు వెళ్లేందుకు గాను సీఎంతో పాటు పలువురు నేతలు లిఫ్ట్ ఎక్కారు. రెండో అంతస్తుకు వెళ్లిన ఆ లిఫ్ట్ అకస్మాత్తుగా మళ్లీ వేగంగా కిందకు వచ్చింది. దీంతో గాభరాపడిన వారంతా మరో లిఫ్ట్‌లో సమావేశ హాలుకు వెళ్లారు. -
‘ఆ టెస్టులు మీరే చేయించుకుంటే మీ అసలు రంగు బయటకొస్తది’
దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రజలు తన వద్ద అన్నమాటలే తాను చెప్పానని అన్నారు. తాను చేసిన దాంట్లో తప్పేముంది.. కావాలంటే తనపై కేసులు పెట్టుకోవాలని సవాల్ చేశారు కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రజలు చందాలు వేసుకుని బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని చూస్తున్నారని మరోసారి ఉద్ఘాటించారు.అవి నా వ్యాఖ్యలు కావు.. ప్రజలు మాటలుతాను ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు తన సొంత మాటలు కావని, రాష్ట్రంలో ఉన్న చాలామంది ప్రజలు తమ వద్దకు వచ్చి అంటున్న మాటలు అని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం మారాలి అని రైతులు.. రియల్టర్లు, పారిశ్రామిక వేత్తలు కోరుకుంటున్నారన్నారు.కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఉన్నాడా?మంత్రి పొంగులేటి తనను కేసీఆర్ ఆత్మ అని అంటున్నారని, కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఎక్కడ ఉండేవాడు అని కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. నేడు పొంగులేటి మంత్రి పదవిలో ఉన్నాడు అంటే.. అది కేసీఆర్ వల్లే అనే విషయం గుర్తించుకోవాలన్నారు. నార్కోటిక్ టెస్ట్ లు చేయడం తనకు కాదు అని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు నార్కోటిక్ టెస్ట్ లు చేయాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కు కౌంటర్ ఇచ్చారు.అలా చేస్తే ఈ ప్రభుత్వం పై వాళ్ల మనసులో ఏముందో తెలుస్తోందన్నారు..ఇక కాంగ్రెస్ వాళ్లకు వాళ్ళ ప్రభుత్వం పై నమ్మకం లేకనే తమ పార్టీ నుండి ఎమ్మెల్యే లను తీసుకేళ్లరని, ఇప్పుడు కాకపోయిన ఇంకొద్ది రోజులు కైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం పక్క అని కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి వ్యాఖ్యానించారు. -
పింక్ బుక్‌లో రాసుకుంటాం.. వాళ్లను క్షమించం: కవిత
కామారెడ్డి జిల్లా: కాంగ్రెస్ తాటాకుచప్పుళ్లకు భయపడేది లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బాన్సువాడలో రజతోత్సవ సన్నాహక సమావేశంలో పింక్ బుక్ పేరిట ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దంటూ కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్‌లో రాసుకుంటాం, బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు. కేసులు పెట్టించే పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదు’’ అంటూ కవిత వ్యాఖ్యానించారు.‘‘బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదు. వాళ్ల తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడేవాళ్లెవరూ లేరు ఇక్కడ. మాట తప్పడమే.. మడమ తిప్పడమే కాంగ్రెస్ నైజం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారెంటీ కార్టులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి పంచి ఓట్లేయించుకున్నారు...ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది. గతంలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి పదేళ్ల పాటు అరిగోస పెట్టింది కాంగ్రెస్. వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలకు కారణం కాంగ్రెస్. ఏడాదిన్నర పాలనలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి. ప్రతీ ఇంటి నుంచి ఒకరు రజతోత్సవ సభకు రావాలి’’ అంటూ కవిత పిలుపునిచ్చారు. -
మంత్రి పదవి కావాలంటే.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్
-
కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీకి తగ్గ గుర్తింపు లేదు: జీవన్ రెడ్డి
-
ప్రభుత్వాన్ని కూలగొడితే బీజేపీకి లాభం ఎంటి?: కిషన్ రెడ్డి
-
కాంగ్రెస్‌లో ట్విస్ట్ : సీనియారిటీకి గుర్తింపు లేకపోతే ఎలా.. జీవన్‌రెడ్డి గుస్సా
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియారిటీకి తగిన గుర్తింపు పార్టీలో లేనప్పుడు తప్పకుండా అసంతృప్తి ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ నియంతృత్వ, అప్రజాస్వామిక విధానాలపై పోరాడిన ఏకైక ఎమ్మెల్సీ తానే అని జీవన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీలో వీహెచ్ తప్ప ప్రస్తుతం నాకంటే అనుభవజ్ఞుడైన నాయకుడు ఎవరున్నారు?. జానారెడ్డి కూడా నాకంటే పార్టీ పరంగా నాలుగేళ్లు జూనియరే. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ నియంతృత్వ, అప్రజాస్వామిక విధానాలపై పోరాడిన ఏకైక ఎమ్మెల్సీని నేనే. శాసనసభ, శాసన మండలిలో.. కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి ఎంత పోరాటమైతే చేశారో అంతకు మించి పోరాటం నేనూ చేశాను.సీనియారిటీకి తగ్గ గుర్తింపు పార్టీలో లేనప్పుడు తప్పకుండా నాకు అసంతృప్తి ఉంటుంది. అది కావాలని కోరుకోవడంలో తప్పేముంది?. సీనియర్ నాయకుడైన ప్రేమ్ సాగర్ రావు అయినా, రాజగోపాల్ రెడ్డి అయినా మంత్రి పదవులు కావాలని కోరుకోవడంలో తప్పేముంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు దారి తీసినట్టు తెలుస్తోంది. -
BRS MLA కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు సీరియస్ గా పరిగణిస్తాం: ఆది
-
రేవంత్ సర్కార్‌ను కూలిస్తే బీజేపీకి ఏం లాభం?: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొడితే బీజేపీకి వచ్చే లాభం ఏంటని ఆయన ప్రశ్నించారు. తొందరపడి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలగొట్టమని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి ఐదేళ్లు సమయం ఉంది. ప్రభుత్వాన్ని కూల గొట్టడానికి గుజరాత్ వ్యాపారులకు పని లేదా? వ్యాపారులు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు.తాజాగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఉద్దేశ్యం మాకు లేదు. దీంతో, బీజేపీకి వచ్చే లాభమేమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. అది అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో గెలుపు బీజేపీదే. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఎటువంటి తొందర లేదు. త్వరలో కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుంది. భూములు అమ్మకం, మద్యం అమ్మకం, అప్పులు తేవడంలో తెలంగాణను నంబర్ వన్‌గా మార్చారు.అర్థరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టీ ఇలా చెట్లు నరికిన ఘటనలు దేశంలో తెలంగాణలో తప్ప ఎక్కడ జరగలేదు. హెచ్‌సీయూలో చెట్లు కొట్టిన AI వీడియో పోస్టుపై కేసు పెడితే పెట్టుకోండి. భావితరాలకు ల్యాండ్ కాపాడాల్సిన బాధ్యత మనపైన ఉంది. భూములు అమ్మకం ద్వారానే ప్రభుత్వం నడపాలని అనుకోవద్దు. రేవంత్ ఏ బ్రాండ్ అనేది వచ్చే ఎన్నికల్లో తేలుతుంది. నేషనలిజమే నా బ్రాండ్. ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ఎస్ఎల్బీసీపై నేషనల్ డ్యాం సెక్యూరిటీ అథారిటీకి ఎలా ఫిర్యాదు చేస్తాం?. సింగరేణి కార్మికులకు ఐటీ పన్నులు మేం అధికారంలోకి వస్తే రియింబర్స్ చేస్తాం. సింగరేణి కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తారు. వాళ్లది వైట్ కాలర్ జాబ్ కాదు.సన్నబియ్యంపై.. ఏ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్ర ప్రజల అవసరానికి అనుగుణంగా ఇస్తాం. కొన్ని రాష్ట్రాల్లో గోధుమలు కూడా సరఫరా చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కోటా కాకుండా ప్రతీ లబ్దిదారుడికి అదనంగా ఐదు కేజీల సన్న బియ్యం ఇచ్చి చూపించాలి. దొడ్డు బియ్యం పైసలతోనే సన్న బియ్యం ఇస్తున్నారు. దీంట్లో కొత్తగా ఏముంది? అని ప్రశ్నించారు.పార్లమెంట్ ఎన్నికలలో తమిళనాడులో నష్టపోయామని.. అక్కడ పొత్తుకు వెళ్లాం. య అధ్యక్షుడిగా నా పేరు ప్రచారంపై అటువంటి ప్రస్తావనే లేదు. దక్షిణాదికి లోక్ సభ సీట్లు తగ్గుతాయనేది గాలి ప్రచారం మాత్రమే. అన్యాయంగా వక్ఫ్ పేరుతో ఆక్రమించిన భూముల కోసమే కొంతమంది ఆందోళనలు చేస్తున్నారు. ఎంఐఎం నేతలు, అక్రమంగా లబ్ది పొందిన వారే ఆందోళనల్లో ఉన్నారు. ఏ ఒక్క సామాన్య, పేద ముస్లిం కూడా ఆందోళన చేయడం లేదు. వక్ఫ్ సవరణ చట్టం మీద భూ బకాసురులు ఉద్యమం చేస్తున్నారు. ముస్లిం ప్రార్థన మందిరాలను, వక్ఫ్‌కు సంబంధం లేదు’ అని అన్నారు. -
‘కొత్త’ వ్యాఖ్యలతో పొలిటికల్ వార్.. కాంగ్రెస్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో విసుగుచెందరని.. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.అధికార దాహంతో బీఆర్ఎస్ కుట్రలు.. మంత్రి పొంగులేటికాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి కూలుస్తామంటున్నారు.. అధికారదాహంతో బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు. భూ భారతి తీసుకొచ్చామని కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆందోళన చెందుతున్నారు. భూ భారతి తీసుకొచ్చాక భూములు కొల్లగొట్టినవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్‌రెడ్డి. కేసీఆర్ సూచన మేరకే ఆయన మాట్లాడారు. కేసీఆర్ అధికారంలోకి ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను పశువుల్లా కొన్నారు. భూ భారతితో పేదవాడికి న్యాయం జరుగుతోంది’’ అని పొంగులేటి చెప్పుకొచ్చారు.కేసు బుక్ చేయాలి.. ఆది శ్రీనివాస్‌కొత్త ప్రభాకర్‌రెడ్డి వాఖ్యలు సీరియస్‌గా పరిగణించాలంటూ ప్రభుత్వ విప్, వేమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. దోచుకున్న డబ్బుతో ప్రభుత్వాన్ని పడగొడతామని మాట్లాడుతున్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి పై కేసు బుక్ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తా. సంక్షేమం ప్రజలకు అందుతుందనే బీఆర్ఎస్ కుట్ర చేస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. -
ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా.. కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్
ఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు బిగ్ షాక్ తగిలింది. హర్యానాలోని శిఖోపూర్ భూ ఒప్పందానికి సంబంధించిన (Haryana land deal case) మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు వాద్రాకు మరోసారి సమన్లు జారీ చేశారు. దీంతో, ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడీ ఆఫీసుకు వెళ్తూ వాద్రా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఈడీ నోటీసులపై..‘నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పగానే మళ్లీ ఈడీ నోటీసులు పంపించారు. ఇది కేవలం రాజకీయ ప్రతీకారం మాత్రమే. నేను ప్రజల తరపున మాట్లాడి, వారి వాదనలు వినిపించినప్పుడల్లా, వారు నన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తారు. ఈ కేసులో ఏమీ లేదు. ఇప్పటికే నాకు 15 సార్లు సమన్లు పంపారు. ప్రతీసారీ 10 గంటలకు పైగా విచారించారు. నేను 23,000 పత్రాలను సమర్పించాను. ఈ కేసులో అన్ని వివరాలు అందించాను. అలాగే, ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాను’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Delhi: Businessman Robert Vadra marches from his residence to the ED office after being summoned in connection with a Gurugram land case, alleges 'political vendetta'.He says, "Whenever I will speak up for people and make them heard, they will try to suppress me... I… pic.twitter.com/mRrRZedq6l— ANI (@ANI) April 15, 2025ఇదిలా ఉండగా.. రాబర్ట్ వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గుర్గావ్లోని శిఖోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అనంతరం ఈ భూమిని సదరు వాద్రా కంపెనీ.. రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్కి రూ.58 కోట్లకు విక్రయించింది. దీంతో, వాద్రా కంపెనీ ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో రాబర్ట్ వాద్రాను విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే ఏప్రిల్ ఎనిమిదో తేదీన మొదటిసారి జారీ చేసిన సమన్లకు వాద్రా స్పందించలేదు. విచారణకు కూడా వెళ్లలేదు. దీంతో, తాజాగా రెండోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. -
రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్!.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు నిజమేనా?
సాక్షి, దుబ్బాక: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో విసుగుచెంది.. ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు అంటూ బాంబు పేల్చారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని.. ఆ ఖర్చును తాము భరిస్తామని అనుకుంటున్నట్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణలో పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యేను కొంటారో కొనండి.. అందుకే అయ్యే ఖర్చును తామే భరిస్తామని అడుగుతున్నారు.మరోవైపు.. బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్‌గా ఉంటే కుదరడం లేదని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. -
అంబేడ్కర్‌కు బీజేపీ–ఆర్ఎస్ఎస్ శత్రువులు: ఖర్గే
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌పై ఎటువంటి అభిమానం లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మోదీ ప్రభుత్వం అంబేడ్కర్ కృషిని ప్రశంసించడం కేవలం మాటలకే పరిమితమన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. వాస్తవానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్లు అంబేడ్కర్‌కు శత్రువులని ధ్వజమెత్తారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందంటూ ప్రధాని మోదీ చేస్తున్న ఆరోపణలపై ఆయన ఈ మేరకు స్పందించారు. 1952 ఎన్నికల్లో తన ఓటమికి కమ్యూనిస్ట్ నేత ఎస్ఏ డాంగే, హిందుత్వ వాది వీడీ సావర్కర్లే కారణమంటూ బీఆర్ అంబేడ్కర్ రాసిన ఒక లేఖను ఈ సందర్భంగా ఖర్గే మీడియాకు చూపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం దక్కేలా డాక్టర్ అంబేడ్కర్ పౌరులకు రాజ్యాంగాన్ని కానుకగా ఇచ్చారని కొనియాడారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ఎస్సీ,ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త కులగణనను వెంటనే చేపట్టాలన్నారు. ప్రభుత్వం పథకాలను అమలు చేసేందుకు ఇప్పటికీ 2011 జనగణనే ఆధారంగా చేసుకుంటోందని తెలిపారు. 2021లో చేపట్టాల్సిన జనగణన ప్రస్తావనను ప్రభుత్వం తేవడం లేదన్నారు. జనగణన, కులగణనను చేపట్టి సమాజంలోని అన్ని వర్గాలకు సమ న్యాయం చేయాలన్నారు. -
రాజ్యాంగ విధ్వంసకారి కాంగ్రెస్: ప్రధాని మోదీ
హిసార్: కాంగ్రెస్ పార్టిపై ప్రధాని మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. రాజ్యాంగ విధ్వంసకారిగా కాంగ్రెస్ మారిపోయిందంటూ ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను రెండో తరగతి పౌరులుగా మార్చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్ల సాధారణ ముస్లింలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఘోరంగా అవమానించిందని మండిపడ్డారు. సోమవారం హరియాణా రాష్ట్రం హిసార్‌లోని మహారాజా అగ్రసేన్ ఎయిర్‌పోర్టులో నూతన టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం హిసార్–అయోధ్య మధ్య తొలి కమర్షియల్ విమానాన్ని ప్రారంభించారు. అలాగే యమునానగర్ జిల్లాలోని దీనబందు చోటూ రామ్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల అల్ట్రా–క్రిటికల్ మోడ్రన్ థర్మన్ పవర్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. రెండుచోట్లా సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రమాదంలో పడ్డప్పుడల్లా రాజ్యాంగాన్ని అణచివేశారని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను విస్మరించిన కాంగ్రెస్ ‘‘దేశంలో నేడు దురదృష్టం ఏమిటో చూడండి. రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వ్యక్తులే నేడు అదే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధికి పాలకులు కృషి చేయాలని రాజ్యాంగం చెబుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయా వర్గాలను విస్మరించాయి. సమాజంలో సమానత్వం రావాలని అంబేడ్కర్ ఆశించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అనే వైరస్‌ను వ్యాప్తి చేసింది. పవిత్రమైన రాజ్యాంగాన్ని కేవలం అధికారం కోసం ఆయుధంగా వాడుకుంది. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో మంచినీరు ఆ పార్టీ నాయకుల స్విమ్మింగ్ పూల్స్‌కు చేరింది కానీ గ్రామాలకు చేరుకోలేదు. స్వాతంత్య్రం వచ్చి70 ఏళ్లు గడిచినా గ్రామాల్లో 16% ఇళ్లకు కూడా కుళాయి నీరు రాలేదు. కాంగ్రెస్ విధానాల వల్ల నష్టపోయింది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు కాదా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు తాగునీరు అందించడంపై దృష్టి పెట్టాం. గత ఏడేళ్లలో 12 కోట్ల కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చాం. దేశంలో ప్రస్తుతం 80% ఇళ్లకు కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. మిగతా ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం తథ్యం. కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహరి్నశలూ శ్రమిస్తున్నాం. హవాయి చెప్పులు ధరించేవారు కూడా విమానాల్లో ప్రయాణించేలా చేయాలన్నదే మా లక్ష్యం. అది ఇప్పుడిప్పుడే సాకారం అవుతోంది. గత పదేళ్లలో కోట్లాది మంది ప్రజలు తొలిసారిగా విమాన ప్రయాణం చేశారు. గతంలో సరైన రైల్వేస్టేషన్లు లేనిచోట కూడా ఇప్పుడు ఎయిర్‌పోర్టులు నిర్మిస్తున్నాం. 2014 కంటే ముందు దేశంలో 74 ఎయిర్‌పోర్టులు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 150కు చేరింది. మన ఎయిర్‌లైన్ సంస్థలు 2,000 కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇచ్చాయి. కొత్త విమానాలతో ఎన్నో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. పరుగు ఆపని అభివృద్ధి, వేగవంతమైన అభివృద్ధి.. ఇదే బీజేపీ ప్రభుత్వాల మంత్రం. పేదలు, గిరిజనులు, మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావాలన్నదే మా ధ్యేయం. మా ప్రతి నిర్ణయం, ప్రతి విధానం అంబేడ్కర్‌కే అంకితం. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ పెద్దపెద్ద మాటలు చెబుతోంది. కానీ, అంబేడ్కర్‌కు, చౌదరి చరణ్‌సింగ్‌కు కాంగ్రెస్ భారతరత్న పురస్కారాలు ఇవ్వలేదన్న సంగతి మనం మర్చిపోవద్దు. అంబేడ్కర్‌కు మరణానంతరం భారతరత్న దక్కిందంటే అందుకు కారణం బీజేపీ. చౌదరి చరణ్‌సింగ్‌కు బీజేపీ ప్రభుత్వమే భారతరత్న ఇచ్చింది. అంబేడ్కర్ జయంతి చాలా ముఖ్యమైన రోజు. ఇది మనందరికీ రెండో దీపావళి. మతం ఆధారంగా రిజర్వేషన్లా? 2013 చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి హడావుడిగా సవరణలు తీసుకొచ్చింది. ఎన్నికల్లో ఓట్ల కోసమే కుతంత్రాలకు పాల్పడింది. రాజ్యాంగాన్ని ధిక్కరించి మరీ వక్ఫ్ చట్టంలో సవరణలు చేశారు. ఇది అంబేడ్కర్‌ను అవమానించడం కాదా? ఓటు బ్యాంకు కోసం ఆరాటపడింది ఎవరు? ముస్లింలపై కాంగ్రెస్‌కు నిజంగా అభిమానం ఉంటే ఆ పార్టీ అధినేతగా ముస్లింను నియమించాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 50 శాతం టికెట్లు ముస్లింలకే ఇవ్వాలి. కానీ, కాంగ్రెస్ ఆ పని చేయదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేడ్కర్ చెప్పారు. రాజ్యాంగం సైతం ఇలాంటి రిజర్వేషన్లపై నిషేధం విధించింది. కానీ, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రభుత్వ టెండర్లలో మతం ఆధారంగా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కొల్లగొడుతున్నారు. లూటీని ఆపడానికే వక్ఫ్చట్టం దేశంలో వక్ఫ్ బోర్డులకు లక్షల ఎకరాల భూములున్నాయి. అవి పేద ముస్లింలకు, మహిళలకు, చిన్నారుల అభివృద్ధి కోసం ఉపయోగపడాలి. ఆ భూములను సక్రమంగా ఉపయోగించుకొని ఉంటే నేడు ముస్లిం యువత టైర్ల పంక్చర్ దుకాణాల్లో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. వక్ఫ్ భూములు కేవలం భూమాఫియాకే ఉపయోగపడుతున్నాయి. పేద ముస్లింలకు ఒరిగిందేమీ లేదు. దళితులు, వెనుకబడివర్గాలు, ఆదివాసీలు, వితంతువులను భూ మాఫియా లూటీ చేసింది. ఈ లూటీని ఆపడానికే వక్ఫ్(సవరణ) చట్టం తీసుకొచ్చాం. ఆదివాసీల భూములు, ఆస్తులను ఇకపై వక్ఫ్ బోర్డు తాకను కూడా తాకలేదు. వక్ఫ్ స్ఫూర్తిని మేము గౌరవిస్తున్నాం. ముస్లిం మహిళలు, పేదలు, చిన్నారుల హక్కులకు ఎప్ప టికీ రక్షణ లభించే ఏర్పాటు చేశాం. ఇదే అసలైన సామాజిక న్యాయం’’’ అని మోదీ ఉద్ఘాటించారు. -
పారదర్శకతే ప్రాణం!
మన ఎన్నికల సంఘం(ఈసీ)కి ఇష్టమున్నా లేకున్నా ఈవీఎంలపై సంశయాలు తరచు తలెత్తుతూనే ఉన్నాయి. ఇక్కడే కాదు... వేరే దేశాల్లో సైతం సందేహాలు వినబడుతూనే వున్నాయి. ఆ మధ్య టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈవీఎంలను హ్యాక్ చేయటం సులభమని, దీన్ని తాను నిరూపించగలనని సవాలు విసిరారు. ఇప్పుడు ఆ వరసలో అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ సైతం నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమక్షంలో కేబినెట్ భేటీలో ఆమె ఈవీఎంల భద్రతా లోపాలపై పలు ఆధారాలు సమర్పించారు. యథావిధిగా దీనిపైనా మన ఈసీ స్పందించింది. ఆమె వ్యాఖ్యలు మన ఈవీఎంలకు వర్తించబోవని మాట్లాడింది. సమస్యంతా అక్కడేవుంది. మన దేశంలో పార్టీలు చేసే ఆరోపణలకు ఆ సంఘం నోరు మెదపదు. ఒక జాతీయ పార్టీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో చేసిన ఆరోపణలకు వెనువెంటనే జవాబివ్వడానికి ఈసీకి తీరిక లేకపోయింది. పార్లమెంటులో ఈవీఎంలపై తీవ్ర దుమారం రేగాక మాత్రమే స్పందించింది. గత ఏడాది నవంబర్ 4న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఆ నెల 23న ఫలితాలు ప్రకటించారు. ఆ తర్వాతనుంచి కాంగ్రెస్, ఎన్సీపీ ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తూనే వచ్చాయి. 95 నియోజక వర్గాల్లో ఈవీఎంలూ, వీవీప్యాట్ స్లిప్‌లూ తనిఖీ చేసి అవి సరిపోలాయో లేదో చెప్పాలని 104 అభ్యర్థనలు వచ్చాయి. వాటిని అంగీకరిస్తే దాదాపు 755 ఈవీఎంల తనిఖీ తప్పనిసరవుతుంది. ఇందులో ఎన్సీపీనుంచి దాఖలైనవే ఎక్కువ. ఇవిగాక న్యాయస్థానాల్లో దాఖలైన ఎన్నికల పిటిషన్లు సరేసరి. హరియాణాలో సైతం ఈవీఎంలపై ఆరుచోట్ల అభ్యర్థనలొచ్చాయి. జమ్మూ కశ్మీర్లో ఒక స్థానం నుంచి ఈ మాదిరి వినతి వచ్చింది. ఆరోపణలొచ్చినప్పుడల్లా ఈసీ ఇచ్చే జవాబు ఒకే విధంగా ఉంటున్నది. మన ఈవీఎంలు సురక్షితమైనవి, జొరబడటానికి అసాధ్యమైనవి అన్నదే దాని వాదన. అలాగే అవి ఇంటర్నెట్‌తోసహా దేనికీ అనుసంధానించి వుండవు కనుక వైఫై, బ్లూటూత్‌ల ద్వారా ఏమార్చటం ఏమాత్రం కుదరదని కూడా చెబుతోంది. అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన సాంకేతిక సదస్సులో కంప్యూటర్ శాస్త్రవేత్త అలెక్స్ హాల్డర్‌మాన్ ఆనవాలు మిగల్చకుండా ఈవీఎంను హ్యాక్ చేయటం, ఫలితాన్ని తారుమారు చేయటం ఎంత సులభమో నిరూపించారు. వీవీ ప్యాట్ యంత్రాలతో అనుసంధానించివున్నా ఈవీఎంల పనితీరు ఎన్ని సంశయాలకు తావిస్తున్నదో వివరించే గణాంకాలు సదస్సులో సమర్పించారు. కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ ఎకార్ట్ ఈవీఎంలో వోటేసిన వెంటనే స్క్రీన్‌పై ఎంపిక చేసుకున్న అభ్యర్థి పేరే కనబడుతున్నా వేరేవారికి వోటు పడటంవంటి ఉదంతాలను వివరించారు. ఇంటర్నెట్తో ఈవీఎంలను అనుసంధానించకపోయినా హ్యాక్ చేయటం సాధ్యమేనన్నారు. ఈవీఎంలలో గుట్టుచప్పుడు కాకుండా రిమోట్ యాక్సిస్ సాఫ్ట్‌వేర్‌ను నిక్షిప్తం చేయటంద్వారా ఇది చేయొచ్చన్నది ఆయన వాదన. అసలు ఈవీఎంల రవాణా, పంపిణీ విధానం లోపభూయిష్టంగా ఉన్నదని సమాచార హక్కు చట్టంకింద అడిగిన ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు వెల్లడించాయి. తన నిర్వహణలో సమర్థవంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని, అందులో సందేహాలకు తావు లేదని ఎన్నికల సంఘం నమ్మటం తప్పేమీకాదు. ఆమాత్రం ఆత్మవిశ్వాసం ఉండటాన్ని ఎత్తిచూపించాల్సిన అవసరం లేదు. కానీ అదే విశ్వాసం అందరిలో కలగటానికి అది చేస్తున్నదేమిటన్నదే ప్రశ్న. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే, ఆ రోజు రాత్రి, ఆ తర్వాత విడుదల చేసే పోలింగ్ శాతం వివరాలు ఆశ్చర్యం కలిగిస్తున్నా, వాటిల్లో ఎందువల్ల వ్యత్యాసం చోటుచేసుకుంటున్నదో సందేహాతీతంగా అది వివరించలేకపోతున్నది. నిరుడు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు కావొచ్చు... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావొచ్చు పోలింగ్ శాతం పెరుగుదలలో తీవ్ర వ్యత్యాసం కనబడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏపీలో పోలింగ్ జరిగిన రాత్రి 8 గంటలకు 68.12 శాతం పోలింగ్ నమోదైందని చెప్పిన ఈసీ మరో నాలుగు రోజులకల్లా దాన్ని 80.66 శాతంగా ప్రకటించింది. నాలుగురోజుల వ్యవధిలో ఈ పెరుగుదల ఏకంగా 12.5 శాతం! సంఖ్యా పరంగా 49 లక్షల వోట్లు పెరిగినట్టు లెక్క! మొదటగా అనుకున్న శాతానికీ, చివరిగా ప్రకటించిన శాతానికీ మధ్య తేడాకు కారణాలేమిటో వివరించే ప్రయత్నం ఈనాటికీ ఈసీ చేయలేదు. మహా రాష్ట్రలోనూ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ముగిశాక 58.2 శాతం పోలింగ్ అని చెప్పి, ఆ తర్వాత దాన్ని 65.02కు పెంచి తీరా కౌంటింగ్ ముందు అది 66.05 శాతం అన్నారు. బ్యాలెట్ విధానంలో ఇలాంటి వ్యత్యాసాలు కనబడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు. లెక్కించేది మనుషులే గనుక పొర బడ్డారని సరిపెట్టుకోవచ్చు. కానీ ఈవీఎంల విధానంలో అలా కాదు. ఎప్పటి కప్పుడు పోలైన వోట్ల సంఖ్య తెలిసిపోతుంది. మరి ఈ తేడాల వెనకున్న మతలబేమిటో ఎందుకు చెప్పరు? ఈవీఎంల చార్జింగ్ అమాంతం పెరిగిపోవటంపైనా అనేక సందేహాలున్నాయి.ప్రశ్నించినప్పుడు మౌనం వహించటమే పెద్దరికమవుతుందని ఈసీ భావిస్తున్నట్టుంది. ప్రజాస్వామ్యానికి కీలకమని భావించే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కరువైతే అది చివరకు ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం పాలు చేస్తుంది. అది ఇప్పటికే ఎంతో కొంత మొదలైంది. అందుకనే బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలన్న డిమాండ్ క్రమేపీ పుంజుకుంటున్నది. ఈవీఎంలు నమ్మదగ్గవి కాదని ప్రపంచంలో ఏమూల ఎవరు చెప్పినా ఇక్కడ భుజాలు తడుముకోవటంవల్ల ప్రయోజనం లేదు. అలాగే పారదర్శకతకు ప్రత్యామ్నాయం కూడా ఉండదు. -
మంత్రివర్గంలో నాకు చోటు కల్పించాలి: ప్రేమ్ సాగర్ రావు
-
అధిష్టానానికి మళ్లీ తలనొప్పిగా మారిన పదవుల పంచాయితీ!
మంచిర్యాల: మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో తనకు మంత్రి పదవి రాకపోతే సహించేదే లేదని తేల్చిచెప్పారు. పదేళ్ల పాటు పార్టీని కాపాడుకుంటే ఇదేనా తమకిచ్చే గౌరవం అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు. వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి, పార్టీలో ఉండి పార్టీని కాపాడుకున్న తమలాంటి వాళ్లకు పదవులు ఇవ్వకపోతే మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. ఇంద్రవెల్లి సభతో పార్టీకి ఊపిరిపోశానని ఆయన చెప్పుకొచ్చారు.వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లంటే..!వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లకి మంత్రి పదవులు ఇస్తారా అని ప్రేమ్ సాగర్ రావు ప్రశ్నించడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించే చేసినవే అంటూ విశ్లేషఖులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఒకానిక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లి అక్కడ చుక్కెదురు కావడంతో తిరికి సొంత గూటికే చేరిన రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి ప్రేమ్ సాగర్ వ్యాఖ్యానించినట్లు విశ్లేషిస్తున్నారు. ఇది కాంగ్రెస్ లో మరింత అలజడి రేపుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో సీనియర్ నేతలు ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం ప్రతిపక్షాల పార్టీలు కౌంటర్లు వేయడానికి ఆస్కారం ఇచ్చినట్లయ్యింది. మంత్రి పదవుల పంచాయితీ మొదటికొచ్చిందా?తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఇప్పటికే కసరత్తు పూర్తయినప్పటికీ తమకు పదవి కావాలంటే తమకు కావాలంటూ నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు. తెలంగాణ క్యాబినెట్ రేసులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్, మల్ రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లు ఉన్నట్లు సమాచారం. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై కాస్త సస్సెన్స్ నెలకింది. కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి తన స్వరాన్ని పెంచారు.తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఎందుకని జానారెడ్డి అన్నట్లు వార్తలు రావడంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకే ఇంట్లో ఇద్దరికి ఎందుకు పదవులు ఉండకూడదని ప్రశ్నించారు. తమ శక్తి సామర్థ్యాలను బట్టే మంత్రి పదవులు ఇవ్వడానికి అధిష్టానం మొగ్గిచూపుతోందని, ఇక్కడ కొంతమంది తమ పలుకుబడితో ఆ పదవిని రాకుండా అడ్డుకునేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కూడా పదవి ఇవ్వకపోతే అమీతుమీ తేల్చుకుంటాననే సంకేతాలు పంపడంతో అధిష్టానానికి మళ్లీ పదవుల పంచాయితీ తలనొప్పి షురూ అయ్యింది. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ పంచాయితీ మళ్లీ మొదటికి రావడంతో అధిష్టానం మరోసారి చర్చలు జరిపే అవకాశాలు కూడా లేకపోలేదు. -
మతవాదులను సంతృప్తి పరిచిన కాంగ్రెస్: ప్రధాని మోదీ
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ హర్యానాలో పలు అభివృద్ది పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ(Prime Minister Modi) కాంగ్రెస్‌పై ఆరోపణల దాడి చేశారు. వక్ఫ్ (సవరణ) చట్టంపై తమ వైఖరి వెల్లడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మతవాదులను సంతృప్తి పరచిందని ప్రధాని మోదీ ఆరోపించారు.ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ మతవాదులను సంతృప్తి పరచిందనడానికి వక్ఫ్ చట్టమే రుజువు అని అన్నారు. లక్షల హెక్టార్ల భూమిని వక్ఫ్ పేరుతో దక్కించుకున్నారని, వీటితో పేద ముస్లింలు ఏనాడూ ప్రయోజనం పొందలేదని మోదీ పేర్కొన్నారు. ఇక్కడ లాభపడింది భూ మాఫియానే అని అన్నారు. ఈ దోపిడీ ఇకపై కొత్త చట్టంతో ఆగిపోతుందని, సవరించిన వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు(Waqf Board) ఏ ఆదివాసీ భూమినీ క్లెయిమ్ చేయలేదని అన్నారు. ఇదే నిజమైన సామాజిక న్యాయమని, దీంతో పేద ముస్లింలు తమ హక్కులను కాపాడుకోగలుగుతారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ దార్శనికతకు ద్రోహం చేసిందని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలను రెండవ తరగతి పౌరులుగా చూస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. డాక్టర్ అంబేద్కర్ పేదలు, వెనుకబడిన వర్గాలకు గౌరవం ఇవ్వాలని కలలు కన్నారని, కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వైరస్‌ను వ్యాప్తి చేసి, అంబేదర్కర్ దార్శనికతకు అడ్డుకట్ట వేసిందని ప్రధాని పేర్కొన్నారు. వారు అంబేద్కర్ జీవించి ఉన్నప్పుడు కూడా అతనిని అవమానించారని, ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారని, ఆయన వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నించారని ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఉమ్మడి పౌర చట్టాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నదని, ఉత్తరాఖండ్(Uttarakhand)లో ఇప్పుడు లౌకిక పౌర కోడ్ అమలులో ఉందని, కాంగ్రెస్ ఇప్పటికీ దానిని వ్యతిరేకిస్తున్నదని ప్రధాని ఆరోపించారు.ప్రధాని వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ అంబేద్కర్ ఆదర్శాలపై తమ పార్టీ ట్రాక్ రికార్డ్‌ను సమర్థించుకుంటూ, బీజేపీ చారిత్రక వంచనకు పాల్పడిందని ఆరోపించారు. ఇలాంటివారు అప్పట్లో బాబా సాహెబ్‌కు శత్రువులని, నేటికీ అలాగే ఉన్నారన్నారు. బాబాసాహెబ్ బౌద్ధమతాన్ని స్వీకరించినప్పుడు ఆయన అంటరానివాడిగా మారారని వారు ఆరోపించారని ఖర్గే పేర్కొన్నారు. నాడు ఆయనను హిందూ మహాసభ వ్యతిరేకించిందని అన్నారు. మహిళా చట్టంలో రిజర్వేషన్ కల్పించి, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలను ఖర్గే గుర్తు చేశారు. ఇది కూడా చదవండి: మూడు దశాబ్ధాల్లో 10 భారీ అగ్నిప్రమాదాలు -
అప్పటి నోటిఫికేషన్లకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ అమలు చరిత్రాత్మకమైనదని చెప్పుకొచ్చారు. ఈరోజు నుంచే ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలవుతాయని స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని నోటిఫికేషన్లు ఎస్సీ రిజర్వేషన్ల అమలుతో విడుదల అవుతాయని తెలిపారు. ఇదే సమయంలో గత ఏడాది ఫస్ట్ ఆగస్టు కు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఈ రిజర్వేషన్లు వర్తించవు అని కార్లిటీ ఇచ్చారు.రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ (SC classification) అమలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో తొలి కాపీనీ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సచివాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రులతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఎస్సీ రిజర్వేషన్లపై ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అమలు అవుతాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు లోబడి ఎస్సీ రిజర్వేషన్లు అమలు అవుతాయి. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల పై అందరికీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాం.ఎస్సీ వర్గీకరణ పూర్తి అయ్యే వరకు నోటిఫికేషన్ ఇవ్వవద్దు అని అనాడు చెప్పాము. రేపు సబ్ కమిటీ ఉన్నతాధికారులతో నోటిఫికేషన్ ప్రక్రియపై భేటీ అవుతాయి. త్వరలోనే అన్ని నోటిఫికేషన్లు ఎస్సీ రిజర్వేషన్ల అమలుతో విడుదల అవుతాయి. 59 ఉప కులాలకు ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయడానికి వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ పని చేసింది. 50వేల వినతులను అక్తర్ కమిషన్ పరిశీలన చేసి ఎస్సీ రిజర్వేషన్లు మూడు కేటగిరీలుగా విభజన చేశారు.గ్రూప్ఏ-1, గ్రూప్బీ-9, గ్రూప్‌సీ-5 శాతంతో అసెంబ్లీలో చట్టం చేశాం. గవర్నర్ ఆమోదం తెలిపారు. మొత్తం ఇండియాలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ. ఇందుకు సంబంధించి జీవీ-33 విడుదల చేశాము. యాక్ట్ 15తో మూడు భాషల్లో విడుదల చేశాం. జీవీ-9ను విడుదల చేశాం. రాబోయే రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్లు ఎంత పెరిగితే ఆ స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేస్తామని వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణలో మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ.. రిజర్వేషన్లు ఇలా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంబేదర్క్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక, ఎస్సీ వర్గీకరణలో భాగంగా ప్రభుత్వం.. 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది.మూడు గ్రూపుల విభజన, రిజర్వేషన్లు ఇలా..గ్రూప్-ఏలో ఉన్న వారికి ఒక్క శాతం రిజర్వేషన్‌గ్రూప్-బీలో ఉన్న వారికి 9 శాతం రిజర్వేషన్‌గ్రూప్-సీలో ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్ ఇవ్వనుంది. మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బడుగులకు రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకుంటాం. యంగ్ ఇండియా స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య అందించే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. రైతులు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేల ఆర్థిక భరోసా ఇస్తున్నాం. పేదల ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం. రైతు, పేద భూమికి హక్కుపై భరోసా ఇస్తూ భూభారతికి శ్రీకారం చూడుతున్నామని అన్నారు. -
ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు
చౌటుప్పల్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కొందరు వ్యక్తులు దుర్మార్గంగా అడ్డుపడుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆదివారం నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన మాట్లాడారు. మహాభారతంలో ధర్మరాజులా ఉండాల్సిన మాజీ మంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకుండా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఇవ్వాలని అధిష్టానానికి జానా లేఖ రాశారని పేర్కొన్నారు. 20 ఏళ్లు మంత్రి పదవులు అనుభవించిన జానాకు ఈ అంశం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. ‘ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వొద్దని కొందరు మాట్లాడుతున్నారు. ఇద్దరికి ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధనకు నా సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి పదవినే త్యాగం చేశారు.నేను సోనియాగాంధీని ఒప్పించి, తెగించి పార్లమెంట్లో పోరాడా. మా ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు 3 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు నల్లగొండలో 11 మందికి 3 మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి?’ అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు.మాట నిలుపుకోవాల్సింది ఎవరు?గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో మంత్రు లు ఇన్‌చార్జీలుగా ఉన్న పార్లమెంట్ స్థానాలైన కరీంనగర్, మహబూబ్‌నగర్, మల్కాజ్గిరి, మెదక్, సికింద్రాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో పార్టీ ఓడిపోయిందని రాజగోపాల్‌రెడ్డి గుర్తుచేశారు. మరి ఇప్పుడు ఆ స్థానాల బాధ్యతలు తీసుకున్న మంత్రులు ఎక్కడికి పోయారని ఆయన నిలదీశారు. తన బలం ఏమిటో తెలిసినందునే ఎంపీ స్థానాన్ని గెలిపించుకొని వస్తానన్న నమ్మకంతో ఎమ్మెల్యే అయిన తనను భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జిగా అధిష్టానం నియమించిందన్నారు. పదవుల కోసం అడుక్కోను.. పాకులాడను..తాను మంత్రి కావాలని జాలితోనో, పైరవీ చేసో అడగట్లేదని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తనకు దమ్ము, ధైర్యం ఉందని.. మంత్రి పదవికి అర్హత, పదవిని సమర్థంగా చేపట్టగలనని నమ్మితేనే మంత్రి పదవి ఇవ్వాలన్నారు. తాను పదవుల కోసం పాకులాడనని, పదవులు కావాలని అడుక్కోనని స్పష్టం చేశారు. ఎవరి దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూడట్లేదని తేల్చిచెప్పారు. ప్రాణం పోయినా నియోజకవర్గ ప్రజలు తలదించుకొనేలా ప్రవర్తించబోనని భావోద్వేగానికి లోనయ్యారు.కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, చండూరు మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలోనూ పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. తన ఓపికను చేతగాని తనంగా చూడొద్దని.. తనకు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 16 నెలలుగా మంత్రి పదవులను ఖాళీగా ఉంచడం సరికాదని అభిప్రాయపడ్డారు. -
జానారెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,యాదాద్రి భువనగిరి జిల్లా: తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటుంది.. జానారెడ్డి అడ్డుకుంటున్నారంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటే కొందరికి చెమటలు పడుతున్నాయని.. ధర్మరాజుగా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడిగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.‘‘ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పా?. పదవి అడుక్కునే పరిస్థితిలో నేను లేను. నాకు చాలా బాధగా ఉంది. నన్ను చూసి అందరూ భయపడుతున్నారు. అన్నదమ్ములకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటి?. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు.. కేపాసిటీ బట్టి వస్తుంది. 30 ఏళ్లు మంత్రి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి, హైదరాబాద్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తొచ్చిందా?’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. -
National Herald Case: రూ. 661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కేసులో రూ. 661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌కు చెందిన ఈ ఆస్తులలో ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్, ముంబైలోని పలు ప్రాంగణాలు, లక్నోలోని ఒక భవనం ఉన్నాయి.ఏజెఎల్, యంగ్ ఇండియన్పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఏజెఎల్ నేషనల్ హెరాల్డ్ న్యూస్ ప్లాట్ఫారం (వార్తాపత్రిక, వెబ్ పోర్టల్)నకు ప్రచురణకర్తగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్‌లో 38 శాతం వాటాలతో అధిక వాటాదారులుగా ఉన్నారు. ఈడీ తన దర్యాప్తులో.. ఉద్దేశపూర్వకంగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ప్రయోజనం చేకూర్చేదిగా పనిచేసిందని ఈడీ ఆరోపించింది. సంస్థ విలువను గణనీయంగా తక్కువగా అంచనా వేసి , రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను ఏజెఎల్ సేకరించిందని ఈడీ గుర్తించింది. రూ. 18 కోట్ల వరకు బోగస్ దానాలు, రూ. 38 కోట్ల వరకు బోగస్ అడ్వాన్స్ అద్దె, రూ. 29 కోట్ల వరకు బోగస్ ప్రకటనల రూపంలో అక్రమంగా రాబడిని సంపాదించుకునేందుకు యంగ్ ఇండియన్ ప్రయత్నించిందని ఈడీ ఆరోపించింది. ఈ నేపధ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏజెఎల్ కేసులో రూ. 661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఏజేఎల్‌కు నోటీసులు జారీ చేసింది.ఇది కూడా చదవండి: సియాచిన్ డే: అత్యంత ఎత్తయిన యుద్ధభూమిలో భారత్ విజయం -
బాండ్ల నిధులు ప్రజా సంక్షేమానికే
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఆ భూముల విలువను రూ.30 వేల కోట్లుగా మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొనడం విడ్డూరమని విమర్శించారు. ప్రజాసంక్షేమం కోసం సెబీ నిబంధనలకు అనుగుణంగా 37 అంతర్జాతీయ సంస్థల నుంచి టీజీఐఐసీ ద్వారా బాండ్ల రూపంలో రూ.9,995 కోట్లు సేకరించాలని నిర్ణయించి ఇప్పటివరకు రూ. 8,476 కోట్లు సేకరించినట్లు తెలిపారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవని సుప్రీంకోర్టు తేల్చాక ఇంకా వివాదం చేయడం ఏమిటన్నారు. రూ.5,200 కోట్ల భూమిని రూ.30,000 కోట్లుగా చూపిస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. సీబీఆర్ఐ అనుబంధంగా ఉన్న ఇన్సాల్వెన్సీ అండ్ బాంక్రప్ట్సీ ఈ భూమి విలువను రూ.23,000 కోట్లుగా నిర్ధారించగా దీన్ని సెబీ, ఆర్బీఐ కూడా ధ్రువీకరించాయని తెలిపారు. టీజీఐఐసీ ద్వారా సేకరించిన నిధులను రైతుభరోసా, రుణమాఫీ, సన్న బియ్యం కొనుగోలు వంటి ప్రజా సంక్షేమ పథకాల కోసమే ఉపయోగించినట్లు శ్రీధర్‌బాబు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10.09% వడ్డీకి నిధులు సేకరించగా కాంగ్రెస్ ప్రభుత్వం 9.35% వడ్డీకే సమకూర్చిందని తెలిపారు. మర్చంట్ బ్యాంకర్ మధ్యవర్తిగా ఉండి ఫండ్స్‌ను జమచేసి బాండ్స్‌ను ఇన్వెస్టర్ వద్దకు తీసుకెళ్తారని, సెబీ నిబంధనల మేరకే మర్చంట్ బ్యాంకర్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకుతో సంబంధం లేదని, ఎల్–1 బిడ్డర్‌గా బ్యాంకర్‌ను ఎంపిక చేసినట్లు చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం 4,600 ఎకరాలు సేకరించినప్పుడు పట్టాదారు పాసుపుస్తకాలతో రిజిస్ట్రేషన్లు చేయించారా? అని ప్రశ్నించారు. రాయదుర్గం, ఖానామెట్, కోకాపేట, నార్సింగి, మోకిలలో వందల కోట్ల విలువైన భూములను అమ్మేశారని, అప్పుడు పర్యావరణం గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. తొమ్మిదేళ్ల క్రితం రాజస్తాన్‌లో మృతిచెందిన జింక పిల్లను హెచ్‌సీయూలో చనిపోయినట్లు, ఏనుగులు అక్కడ సంచరిస్తున్నట్లు ఏఐ ఫొటోలు, వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. -
‘ఒకరు సంచులు మోస్తే.. మరొకరు చెప్పులు మోస్తారు’
హైదరాబాద్: రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రెండు ఢిల్లీ పార్టీల్లో ఒకటి సంచుల పార్టీ అయితే, మరొకటి చెప్పులు మోసే పార్టీ అంటూ ఘాటు విమర్శలు చేశారు కేటీఆర్.గతంలో కేసీఆర్ నాయకత్వంలో ఏప్రిల్, మే నెలల్లో కూడా మానేరు ఓ సజీవధారగా ప్రవహించదన్నారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక చిన్న పర్రె పడితే బద్నాం చేశారని బీజేపీ, కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఎస్ఎల్పీసీలో ఎనిమిది చనిపోతే, సుంకిశాల కూలిపోతే ఎన్డీఎస్ఏ ఎందుకు రాదని ప్రశ్నించారు.భూకంపం వచ్చినా తట్టుకుని నిలబడింది కాళేశ్వరమని, మేడిగడ్డకు ఇప్పటికైనా నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెచ్ సీయూ భూములపై స్వయానా కుదవ పెడితే.. మరో మంత్రేమో ఏం లేదంటారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మీదీ కాని భూమిని తనఖా పెట్టడం తప్పు కాదా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. -
కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ రాజీనామా
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సమక్షంలో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ (ఆర్ఎల్డి)లోకి దిలీప్ చేరారు. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరిన దిలీప్.. ఆ పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో రాజీనామా చేసినట్లు సమాచారం. ఆర్ఎల్డిలోకి చేరిన దిలీప్ కుమార్‌ను ఆ పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర ఇంఛార్జ్‌గా జయంత్ చౌదరి నియమించారు. -
ఇది కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది కాదు!
కాంగ్రెస్ పునర్వైభవం, కాంగ్రెస్ కన్నా దేశానికి ఎక్కువ అవసరమనే ప్రజల ఆకాంక్షని పార్టీ నాయకత్వం గ్రహించినట్టుంది. కానీ, అదెలా జరగాలనే విషయంలో దానికొక స్పష్టత లేదని ఏఐసీసీ 86వ జాతీయ సమావేశాన్ని చూస్తే అర్థమవుతుంది. పాత విషయాల వల్లెవేతే తప్ప... జాతికి నూతన ఆశలు కల్పించే, మిత్రపక్షాలకు కొత్త నమ్మిక ఏర్పరిచే, పార్టీ శ్రేణులకు తాజా ప్రేరణనిచ్చే అంశా లేవీ తీర్మానాల్లోకి రాలేదు. కాలం చెల్లిన అంశాలను వల్లెవేయడం కాకుండా కాలంతో కాలు కదిపితేనే కాంగ్రెస్‌కు మళ్లీ పాత రోజులు వస్తాయని పార్టీ నాయకులు, కార్యకర్తలు బలంగా నమ్ము తున్నారు. ఆ దిశలో నాయకత్వమే చొరవ చూపటం లేదు. జాతిపిత గాంధీజీ ఆశ్రమం నెలకొల్పిన సబర్మతి నదీ తీరంలో జరిగిన రెండు రోజుల కాంగ్రెస్ జాతీయ సదస్సు (Congress National Convention) ‘మరో భేటీ’ లాగ, సాదాసీదాగానే ముగిసింది. కాంగ్రెస్ మహామహుల పుట్టిల్లయి ఉండీ, మూడు దశాబ్దాలుగా అధికారానికి పార్టీ దూరమైన గుజరాత్ (Gujarat) నేల నుంచి గట్టి సందేశం ఇచ్చి ఉండాల్సిందనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. సదస్సు చప్పగా సాగిందని పార్టీ ముఖ్యనేతలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.కాంగ్రెస్ లేని భారత్ (కాంగ్రెస్ ముక్త్ భారత్) నెలకొల్పాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వం ముమ్మరంగా ప్రచారం చేస్తూ, పార్టీ ప్రభుత్వాలను కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితం చేసిన తరుణంలో... ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ మిశ్రమ ఫలితాలు సాధించిన 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్టీ నాయకత్వాన్ని కుంగదీసింది. ముఖ్యంగా హరియాణా, మహారాష్ట్రల్లో గెలిచే పరిస్థితులుండీ బీజేపీ నేతృత్వపు ఎన్డీయే కూటమి చేతిలో ఓటమి తప్పలేదు. జమ్మూ–కశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విపక్ష ‘ఇండియా కూటమి’ నెగ్గినా అక్కడ కాంగ్రెస్ ప్రభావ రహితమైన మైనర్ పార్ట్‌నర్‌గానే ఉంది. కొన్ని చోట్ల జాతీయ పార్టీని, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ శక్తుల్ని, మరికొన్ని చోట్ల జతకట్టిన మతతత్వ శక్తుల్నీ... ఇలా ఆ యా రాష్ట్రాల్లో భిన్నమైన ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్‌కుంది. అందుకే, ప్రస్తుత భేటీ కాంగ్రెస్‌కు ముఖ్యమైనదిగా పార్టీ శ్రేణులు పరిగణించాయి.యువతరాన్ని ఆకట్టుకోవాల్సిందే!ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్‌ను ఎవరు సొంతం చేసుకుంటున్నారు అన్నది ఇవాళ్టి యువతకు పట్టే అంశం కానేకాదు. పటేల్, నెహ్రూల మధ్య, లేని అంతరాల్ని ఎగదోస్తూ ప్రత్యర్థులు రాజేసే రాజకీయ కుంపటి చుట్టూ కాంగ్రెస్ తిరగాల్సిన అవసరమే లేదన్నది సగటు కాంగ్రెస్ కార్యకర్త మనోభావన! భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందనే కాంగ్రెస్ ఘాటైన విమర్శకు 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే ‘పొలిటికల్ డివిడెండ్స్’ లభించాయి. ‘ఇండియా కూటమి’కి 150 స్థానాలు మించి రావని దేశంలోని 16 ప్రముఖ సర్వే సంస్థలు వేసిన అంచనాల్ని తలకిందులు చేస్తూ, 235 స్థానాలు గెలుచుకోవడం ఈ ప్రచార ప్రభావమే! 400 స్థానాలు ఆశించిన బీజేపీ సొంతంగా 240, కూటమికి 293 స్థానాలతోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది. మళ్లీ అదే నినాదాన్ని ఎంత బిగ్గరగా వినిపించినా.... తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయలేదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, అభివృద్ధి లేమి వంటి సమస్యలు ప్రజల నిత్య ఆలోచనల్లో ఉన్నాయి. ఆయా అంశాల్లో ప్రభుత్వం ఎంతగా విఫలమైందో ఎండగట్టే విపక్ష ఎత్తుగడలు యువతను ఆకట్టుకోవడానికి పనికొస్తాయి.‘కులగణన’ ఒక స్థాయి వరకు సానుకూల ఫలితాలిచ్చినా, తదుపరి ప్రతికూలించే ప్రమాదముందనే అభిప్రాయాన్ని పార్టీలోని ఒక వర్గం వ్యక్తం చేస్తోంది. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలనే ప్రజాభిప్రాయం స్వాగతించదగిందనీ, లేకుంటే ప్రాంతీయ శక్తుల ప్రాబల్యం పెరుగుతుందనే భావనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) వ్యక్తం చేసిన విషయం తెలిసిందే! పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ కూడా జరిగిన జాతీయ సదస్సు ఈ విషయంలో ప్రజల దృష్టిని ఆకర్షించలేకపోయిందనే భావన శ్రేణుల్లో ఉంది.ఆశ, ఆకాంక్ష అయితేనే...పార్టీ కీలక తీర్మానానికి మద్దతు పలుకుతూ, సదస్సులో ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ఒక మాటన్నారు: ‘కాంగ్రెస్ అంటే పగ. ప్రతీకారం కాకుండా ప్రజలకు ఒక ఆశ, ఆకాంక్ష అవ్వాలి. కాంగ్రెస్ అంటే కేవలం గత వైభవమే కాకుండా, సానుకూల దృక్పథం కలిగిన ఒక ఆశావహ భవిష్యత్ కావాలి. వ్యతిరేకిస్తూ చేసే విమర్శ మాత్రమే కాకుండా సద్యోచన, నిర్మాణాత్మక సహకారం అందించే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉండాలి.’సదస్సు రెండో రోజు సాంఘిక శాస్త్ర పాఠంలా సాగిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రసంగంలో ప్రధానంగా కాంగ్రెస్ కృషిని, త్యాగాలను ప్రశంసించడంతో పాటు బీజేపీ, ఆరెస్సెస్‌ది విపరీత భావజాలమంటూ విమర్శలు గుప్పించారు. ‘రాహుల్ ఇలా మాట్లాడాలి. కానీ, మాట్లాడరు’ అంటూ సంపాదకుడు హరీశ్ ఖరే ఒక రోజు ముందుగా ‘ద వైర్’ వేదికగా వెలువరించిన ప్రసంగ(వ్యాస)ంలోని ముఖ్యాంశాలను రాహుల్ నిజంగానే ప్రస్తావించలేదు. ‘..మతఛాందసం, వేర్పాటువాదం, నియంతృత్వాలకు వ్యతిరేకంగా నా శక్తి మొత్తాన్ని వెచ్చించి కడదాకా పోరాడుతానని విస్పష్టంగా ప్రకటిస్తున్నాను..’ అనే మాటలతో మొదలై, ‘.. గాంధీ, నెహ్రూ కుటుంబానికి చెందిన వాడినైనందున, మా తండ్రి, నాయనమ్మ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినందున... సహజంగానే నేను ప్రధానమంత్రి పదవికి అర్హుడనైతానని మీలో కొందరు భావిస్తుండవచ్చు. కానీ, నాకా ఆలోచన లేదు. నేను గానీ, మా కుటుంబంలో మరెవరైనా గానీ, ఆ పదవిని ఆశించడం లేదు’ అనే మాటలతో హరీశ్ వ్యాసం సాగుతుంది. ఆయన రాసినట్టుగానే ఇవేవీ రాహుల్ మాట్లాడలేదు.ఈ పద్ధతి సరికాదు!పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేస్తామంటూనే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పార్టీ బలహీనపడే పరిస్థితులను అధినాయకత్వం ఉపేక్షించడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. కొన్నిసార్లు పరోక్షంగా అధిష్ఠానమే ప్రోత్సహిస్తోంది. ఇందుకు తెలంగాణ, కర్ణాటకలో ప్రత్యక్ష ఉదంతాలున్నాయి. తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి మీనాక్షీ నటరాజన్ నేరుగా సచివాలయానికి వెళ్లి, మంత్రివర్గ ఉపసంఘంతో, అధికారులతో భేటీ అయి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) భూవివాదాంశాన్ని సమీక్షించడం పలువురిని విస్మయానికి గురిచేసింది. పార్టీ కార్యాలయమైన గాంధీభవన్‌లో కాకుండా నేరుగా యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థి ప్రతినిధులు, పౌర సంఘాల వారితో ఆమె ముచ్చటించారు. మళ్లీ వచ్చి, ఆ అంశాలను మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ, ఆయా ప్రతినిధులు, వర్గాల వారితో అది చర్చిస్తుందన్న ముఖ్యమంత్రి మాటలు అమలు కాకముందే, ఆమె ఈ ‘హడావిడి’ చర్యలకు పూనుకున్నారు. ఆమె ఏ హోదాతో సచివాలయంలో ఉపసంఘంతో, అధికారులతో భేటీ అయ్యారనే ప్రశ్న సహజంగానే తలెత్తింది. ఇది సదరు మంత్రివర్గాన్ని, ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన పరిస్థితి. ప్రత్యర్థి పార్టీల విమర్శలకూ, సొంత పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికీ కారణమైంది. అంతకు ముందు ఇన్చార్జ్గా ఉన్న దీపాదాస్ మున్షీపై ఒక రకం ఆరోపణలుంటే, గాంధేయవాది, ప్రజాస్వామ్య ప్రేమికురాలు, నిరాడంబరనేత అని పేరున్న మీనాక్షి చొరవను, ఒక అతి చేష్టగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.చదవండి: కన్నీరు కార్చడమే దేశద్రోహమా?ఢిల్లీలో బీసీ ధర్నా రోజు, అప్పటివరకు స్పందించకుండా ఉండి, ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత రాహుల్, సోనియాలు బీసీ నాయకుల్ని కలవటం కూడా తప్పుడు సంకేతాలనిచ్చిందనే భావన పార్టీలో వ్యక్తమవుతోంది. ఇది పార్టీకి అంత మంచిది కాదు.- దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, పీపుల్స్ పల్స్ -
విజయశాంతి ఫ్యామిలీకి బెదిరింపులు.. బజారుకీడుస్తా.. చంపేస్తా అంటూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (Vijayashanti) దంపతులను చంపేస్తానంటూ బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మెయిల్స్, ఎస్ఎంఎస్లు పంపించాడు. దీంతో, విజయశాంతి.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివరాల ప్రకారం.. చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్‌కు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తాను సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని ప్రసాద్‌కు చంద్రకిరణ్ చెప్పుకున్నాడు. దీంతో, తమకు కూడా ప్లస్ అవుతుందనే ఉద్దేశ్యంతో శ్రీనివాస ప్రసాద్.. పనితీరు చూశాక కాంట్రాక్ట్ ఇస్తామని చంద్రకిరణ్‌కు చెప్పాడు. అయితే, కొద్దిరోజుల తర్వాత అనుకున్న స్థాయిలో అతడు పనిచేయకపోవడం.. సరైన ఫలితాలు రాకపోవడంతో అతడితో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే శ్రీనివాస ప్రసాద్ ఆఫీసు నుంచి పంపించేశారు.ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం.. తనకు డబ్బులను ఎప్పుడు చెల్లిస్తారంటూ శ్రీనివాసప్రసాద్‌కు చంద్రకిరణ్ రెడ్డి మెసేజ్ చేశాడు. ఎలాంటి కాంట్రాక్ట్ లేకుండా.. చంద్రకిరణ్ డబ్బులు అడగడంతో శ్రీనివాస్ ప్రసాద్ ఆశ్చర్యపోయారు. దీంతో, తన ఆఫీసుకు వచ్చి.. దీనిపై మాట్లాడాలని శ్రీనివాస్ సూచించారు. కానీ, చంద్రకిరణ్.. ఆఫీసుకు రాకపోగా.. మెయిల్స్, మెసేజ్‌లతో బెదిరింపులకు దిగాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే.. విజయశాంతి, శ్రీనివాస్‌ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అలాగే, వారి కుటుంబాన్ని రోడ్డుకు ఈడుస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో విజయశాంతి దంపతులు.. అతడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.చదవండి: వార్నీ.. ఎయిర్‌పోర్టును కూడా వదలరా? -
Dharmapuri Arvind: ఇచ్చిన ఒక్క హామీ కాంగ్రెస్ పూర్తి చేయలేదు
-
గచ్చిబౌలి భూముల్లో గోల్మాల్.. పదివేల కోట్ల కుంభకోణం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని గచ్చిబౌలి భూముల్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాదాపు రూ.10వేల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందన్నారు. అటవీ భూమిని అమ్మే అధికారం ప్రభుత్వానికి లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘ఆర్థిక నేరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి. గచ్చిబౌలి భూముల్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది. ఓ బీజేపీ ఎంపీ సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కాం చేస్తున్నారు. వాల్టా, ఫారెస్ట్ యాక్ట్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘించింది. రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త గోల్‌మాల్‌కు తెర తీసింది.15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో 3D మంత్రాను పెట్టుకున్నారు. HCUలో పర్యావరణ విధ్వంసం, హననం జరుగుతోంది. ఐఎంజీ కుంభకోణంపై ఆనాడు 2014 వరకు ప్రభుత్వం, తర్వాత బీఆర్ఎస్ కొట్లాడింది. ఈ భూముల వెనుక రూ.10వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారు. HCU చుట్టూ ఉన్న 400 ఎకరాలు అటవీ భూమి ఉంది. అది అటవీ భూమి అని సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు.. అన్ని రాష్ట్రాల హై కోర్టులకు ఇచ్చింది. 1980 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం అటవీ భూమి తాకట్టు పెట్టడానికి అమ్మేందుకు ప్రభుత్వానికి హక్కు ఉండదు.పోడు యాక్ట్ ప్రకారం ఆది అటవీ భూమి అని రేవంత్ రెడ్డికి ముందే తెలుసు. భూమిని అమ్మడానికి ముఖ్యమంత్రి దగ్గరికి బీజేపీ ఎంపీ ఒక ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ బ్రోకర్‌ను తెచ్చారు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సంస్త ద్వారా చట్టాలను, ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కారు. మ్యుటేషన్ కాలేదని ప్రభుత్వమే అంటుంది. TGIIC 400 ఎకరాలకు యజమాని కాదు. కేవలం ఒక GO ఆధారంగా TGIIC యజమాని అని ప్రభుత్వం చెబుతోంది. తనది కానీ భూమిని TGIIC తాకట్టు పెట్టే కుట్ర చేసింది.బ్రోకర్ ద్వారా కుమ్మకై లోన్..400 ఎకరాలకు యాజమాన్య పత్రాలు లేవు.. రిజిస్ట్రేషన్ పత్రాలు లేవు. 26.6.2024 GO-54 ఒక్కటే ఉంది.. తప్ప ఏమీలేదు. 400 ఎకరాలకు కమిషన్ టైటిల్ కూడా లేదు. కంచెలో గజం విలువ 26900 వందలు ఉంది.. 400 ఎకరాలకు 5239 కోట్ల విలువ మాత్రమే. అక్కడ ఎకరాకు 75 కోట్లకు అమ్మడానికి రెవెన్యూ శాఖ GO విడుదల చేసింది. రూ.5239 కోట్ల విలువైన భూమిని 30,000 వేల కోట్లుగా చిత్రీకరించారు. ప్రభుత్వం.. బ్రోకర్ ద్వారా కుమ్మకై బ్యాంకులో లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. రూ.75 కోట్లు అని బ్యాంకుల దగ్గరకు పోయి.. 15కోట్లకు అమ్మే కుట్ర చేశారు. రూ.169 కోట్లు బ్రోకర్‌కు కమీషన్ ఇచ్చారు. కోకాపేటలో భూములను చూపించి 75 కోట్లు ఎకరా అని ప్రభుత్వమే ధర చూపించారు. ఐదు నెలల్లో వ్యాల్యువేషన్ రివైజ్ చేసి 52 కోట్లకు తగ్గించారు. మళ్ళీ మూడోసారి 42 కోట్లకు కుదించారు. రూ.30వేల కోట్లు అని మొదట చెప్పి 16వేల కోట్లకు తగ్గించారు. ఢిల్లీ బ్రోకర్‌కు తనకా పెట్టే ప్రయత్నం చేశారు’ అని విమర్శలు చేశారు.బీకర్ ట్రస్ట్ అండ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సంస్థను ఏ బేసిస్ ప్రకారం ఎంపిక చేశారు?. బీజేపీ ఎంపీ చెప్పారని వడ్డీకి పావుచెరుగా అమ్మే కుట్ర చేశారు. నేను ఉరికే ఆరోపణలు చెయ్యడం లేదు.. దీన్ని వదిలిపెట్టను. RBI గవర్నర్, సెబీ, SFIO, సెంట్రల్ విజిలెన్స్, CBI, మా పార్టీ తరపున ఫిర్యాదు చేయబోతున్నాం. బీజేపీ ఎంపీ పేరు తర్వాత ఎపిసోడ్లో బయటపెడతాం. 10 వేల కోట్లకు ప్రభుత్వానిది కానీ భూమిపై ICICI బ్యాంకు లోన్ ఇచ్చారు.కేంద్రం స్పందించాలి..భూమిని ఫీల్డ్ పై చూడకుండా ICICI బ్యాంక్ ఇచ్చింది. 10వేల కోట్లు ఎక్కడికి పోయాయో ఎవరికి తెలియదు. రైతుభరోసా అన్నారు అది ఇవ్వలేదు. నేను రాసిన లేఖలపై కేంద్రం స్పందించకపోతే ఊరుకోం. ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియకుండా జరిగింది అనుకుంటున్నా. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే విచారణ మొదలు పెట్టాలి. సెబీ, సెంట్రల్ విజిలెన్స్, CBI విచారణ మొదలు పెట్టాలి. భూమిని చూడకుండా 10వేల కోట్లు లోన్ బ్యాంకు ఎలా ఇస్తుంది. HMDA భూములు 60వేల కోట్లు అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకు వెళ్తాం. అవసరం అయితే ప్రధాని కలుస్తాం.. లోక్ సభలో లేవనెత్తుతాం’ అని కామెంట్స్ చేశారు. -
ఇంత కాలం పని చేయకున్నా వైదొలగమనలేదు.. ఇప్పుడే ఎందుకంటున్నారని అడుగుతున్నారు సార్!
ఇంత కాలం పని చేయకున్నా వైదొలగమనలేదు.. ఇప్పుడే ఎందుకంటున్నారని అడుగుతున్నారు సార్! -
మేడమ్ కళ్లు పెద్దవి చేసి చూడండి.. కంగనాకు అదిరిపోయే కౌంటర్
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. బాలీవుడ్ స్టార్, మండి ఎంపీ కంగనా రనౌత్ ఇంటికి సంబంధించి వచ్చిన కరెంట్ బిల్లు విషయంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ క్రమంలో మంత్రి, విద్యుత్ శాఖ అధికారులు.. కంగనాకు కౌంటరిచ్చారు. కంగనా ఇంటికి వచ్చిన బిల్లు లక్ష కాదని రూ.55 వేలు మాత్రమేనని.. గతంలో చెల్లించని బిల్లుల కారణంగా రూ.91,100 గా పూర్తి బిల్లు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. తాజాగా తన ఇంటికి లక్ష రూపాయల బిల్లు వచ్చిందంటూ గోల చేసింది కంగనా. తప్పంతా కాంగ్రెస్ ప్రభుత్వానిదే అంటూ మండిపడ్డారు. మనాలీలో ఉన్న మా ఇంటికి ఈ నెల రూ.లక్ష కరెంట్ బిల్లు వచ్చింది. ఈ మధ్యకాలంలో నేను ఆ ఇంట్లో ఉండటం లేదు. దీంతో ఆ బిల్లు చూసి షాకయ్యా. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఇలాంటి పరిస్థితులు సిగ్గుచేటు. అయినప్పటికీ మనందరికీ ఒక అవకాశం ఉంది. నా సోదరీ సోదరులను నేను కోరేది ఒక్కటే. ఇలాంటి సమస్యలపై మనమంతా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ తోడేళ్ల చెర నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.#WATCH | Shimla, HP | Sandeep Kumar, Managing Director of the Himachal Pradesh State Electricity Board Limited (HPSEBL), says, "BJP MP Kangana Ranaut raised an issue that the electricity board has asked her to pay the electricity bill of Rs 1 lakh of her house. The bill is almost… pic.twitter.com/oBnZPl9OhU— ANI (@ANI) April 10, 2025 దీంతో, రంగంలోని దిగిన విద్యుత్ శాఖ అధికారులు.. బిల్లుపై ఆరా తీశారు. ఎంపీ కంగనా ఆరోపణలపై హిమాచల్ ప్రదేశ్ HPSEBL మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ స్పందించారు. ఈ క్రమంలో కంగనాకు.. 55 వేల రూపాయలు కేవలం ఈ నెల బిల్లు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. కానీ, ఆమె గతంలో చెల్లించని బిల్లులు కూడా కలిపి రూ.91,100గా పూర్తి బిల్లు వచ్చిందని చెప్పారు. చెల్లింపులు సకాలంలో చేసి ఉంటే ఇంత మొత్తంలో బిల్లు వచ్చేది కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా 28 రోజుల్లోనే ఎంపీ కంగనా రనౌత్ దాదాపు 9 వేల యూనిట్ల విద్యుత్ వినియోగించారని.. అందుకే ఒక్క నెల బిల్లు కూడా రూ.55 వేలు వచ్చిందని అన్ని లెక్కలతో సహా చూపించారు. ఇదే సమయంలో తాము కంగనాకు రూ.700 సబ్సిడీ కూడా ఇచ్చినట్లు తెలిపారు. దీంతో, కంగనాకు బిగ్ షాక్ తగిలింది.మరోవైపు.. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడమ్ కరెంట్ బిల్లులు చెల్లించరు. అంతటితో ఆగకుండా ప్రభుత్వాన్నే నిందిస్తారు. ప్రజావేదికలపై గోల చేస్తారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికైనా కళ్లు పెద్దవి చూసి బిల్లును చూడండి అంటూ చురకలు అంటించారు. Mandi, Himachal Pradesh: BJP MP Kangana Ranaut says, "In Himachal Pradesh, the Congress has created such a miserable situation. This month, I received an electricity bill of ₹1 lakh for my house in Manali, where I don’t even stay! Just imagine the condition here..." pic.twitter.com/6AAzvTekrt— IANS (@ians_india) April 8, 2025 -
రేవంత్.. నోరు అదుపులో పెట్టుకో
హైదరాబాద్,సాక్షి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు.గుజరాత్లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన అఖిల భారత కాంగ్రెస కమిటీ సదస్సు ‘న్యాయ్‌పథ్’లో.. బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు చాలా ప్రమాదకమైన వారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు, గాంధీ ఆలోచనలను రాహుల్ గాంధీ ముందుకు తీసుకెళుతుంటే ప్రధాని మోదీ గాడ్సే విధానాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడారు. రేవంత్ మతి స్థిమితం లేకుండా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. రాహుల్ మెప్పు కోసం మాట్లాడారు. రేవంత్ తెలంగాణను రాహుల్ గాంధీ పాదాల వద్ద తాకట్టు పెట్టారు. రాజ్యాంగేతర శక్తి మీనాక్షి నటరాజన్ సెక్రటేరియేట్‌లో అడుగు పెట్టారు. సీఎం లేనప్పుడు అజ్ఞాత వ్యక్తి సెక్రటరియేట్లో రివ్యూ చరిత్రలో లేదు.రేవంత్ నీ స్థాయిని మించి మోదీపై మాట్లాడటం మానుకో. ప్రధాని పదవి కోసం నెహ్రూ దేశాన్ని ముక్కలు చేశారు. దేశ విభజనకు కారణం కాంగ్రెస్. రేవంత్ చరిత్ర మర్చిపోయిన దేశ ప్రజలు మర్చిపోలేదు. హామీలు అమలు చేయకుండా అహ్మదాబాద్‌లో గొప్పలు చెప్తావా?గ్యారంటీలపై చర్చకు సిద్దమా? రాహుల్ గాంధీపై తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. హామీలు అమలు చేయనందుకు ఆయన్ను రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వరు. దమ్ముంటే హెచ్‌సీయూలో రాహుల్ గాంధీ మీటింగ్ పెడతారా? త్వరలో కాంగ్రెస్ ముక్త్ భారత్ రాబోతుంది. రేవంత్ ఇచ్చిన హామీలు నెరవేర్చననే నమ్మకం ఉంటే రాజీనామా చేసి ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?’ అని ప్రశ్నించారు. -
యంగ్ ఇండియా స్కూల్ నా బ్రాండ్: రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసులకు యంగ్ ఇండియా స్కూల్ అత్యంత ముఖ్యమైందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని తెలిపారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది తమ బ్రాండ్ అని అన్నారు. సైనిక్ స్కూల్‌కు ధీటుగా పోలీస్ స్కూల్‌ను తీర్చి దిద్దాలని స్పష్టం చేశారు.రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఆయన యంగ్ ఇండియా పోలీసు స్కూల్‌ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. పోలీసు శాఖపై మాకు స్పష్టమైన ఆలోచన ఉంది. దేశంలో ఉన్న గొప్ప వర్సిటీలు నెహ్రూ స్థాపించినవే. 16 నెలలైనా బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని నన్ను కొందరు అడుగుతున్నారు. యంగ్ ఇండియాలో చదువు, ఉపాధే నా బ్రాండ్. దేశానికే దార్శనికుడు పీవీ నరసింహారావు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని స్థాపించాం. దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉంది. కేజీ టు పీజీ వరకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావు. యంగ్‌ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్‌ను సమకూర్చుకోవాలి. నిధుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి.ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని చెప్పుకుంటున్నారు. రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం అంటే వైఎస్సార్ గుర్తుకువస్తారు. కొందరు ఉద్యమ నేతలం, తెలంగాణ ప్రదాతలమని అనుకుంటున్నారు. యంగ్ ఇండియా స్కూల్ నా బ్రాండ్. ఆనంద్ మహేంద్రను యూనివర్సిటీకి చైర్ పర్సన్ గా నియమించుకున్నాం. ఇవాళ యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచాం. పోలీసు స్కూల్ విషయంలో రాజకీయం లేదు.వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చి.. ప్రీ-స్కూల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
వేడెక్కిన ‘పటేల్’ రాజకీయాలు.. ‘ఉక్కు మనిషి’పై హక్కు ఎవరిది?
న్యూఢిల్లీ: గుజరాత్‌కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు, ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) ఎవరివాడనే దానిపై కాంగ్రెస్-బీజేపీ మధ్య రాజకీయాలు ముసుకుంటున్నాయి. ఇటీవల గుజరాత్లో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశంలో ఆ పార్టీ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ముందడుగు వేసింది. పార్టీ తిరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. పటేల్ వారసత్వాన్ని భారతీయ జనతా పార్టీ తీసేసుకుని, దానిని నెహ్రూ-గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా వాడుకుంటున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.కాంగ్రెస్(Congress) సారధ్యంలో జరిగిన విస్తృత కార్యవర్గ సమావేశంలో (సీడబ్ల్యూసీ) ‘స్వాతంత్ర్య ఉద్యమ సారథి - మా సర్దార్ వల్లభాయ్ పటేల్’ అనే తీర్మానానికి ఆమోద ముద్ర వేసింది. గాంధీ, పటేల్ జన్మస్థలమైన అహ్మదాబాద్‌లో దేశానికి కొత్త దిశానిర్దేశాన్ని అందించేందుకు తమ నాయకత్వం సమావేశమైందని పేర్కొంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు సర్దార్ పటేల్ వారసత్వాన్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయని, అలాగే పటేల్.. జవహర్లాల్ నెహ్రూ మధ్య విభేదాలు ఉన్నాయంటూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఇరువురు నేతలు ఒకే నాణేనికున్న బొమ్మబొరుసులాంటి వారిని, వారి మధ్య గొప్ప అనుబంధం ఉందని కాంగ్రెస్ పేర్కొంది.గుజరాత్లో 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంపై దృష్టి సారించింది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ స్వస్థలం కూడా కావడంతో ఇక్కడ సత్తా నిరూపించుకునేందుకు కాంగ్రెస్ తపత్రయ పడుతోంది. ఇది తమ సొంత గడ్డ అని నిరూపించుకునేలా బీజేపీకి సవాల్ విసరాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు బీజేపీ(BJP) సర్దార్ పటేల్‌ను తమ జాతీయవాద సిద్ధాంతంలో ఒక భాగంగా ఇప్పటికే మలచుకుంది. గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌లోని ఆనంద్‌లోని సర్దార్ పటేల్ యూనివర్సిటీ సందర్శన సందర్భంగా ‘జోధ్‌పూర్, జూనాగఢ్, హైదరాబాద్, లక్షద్వీప్ ఈ రోజు భారతదేశంలో భాగంగా ఉన్నాయంటే, అది సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనేనని, ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని రద్దు చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ కలను నెరవేర్చారు’ అని పేర్కొన్నారు. ఇదేవిధంగా బీజేపీ 2018లో నర్మదా నది తీరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు చెందిన 182 మీటర్ల ఎత్లయిన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని నిర్మించి, పాటీదార్ సమాజాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది.గుజరాత్(Gujarat)లో పాటిదార్ సమాజం రాజకీయంగా ప్రభావవంతంగా ఉంది. 182 సభ్యుల అసెంబ్లీలో 40-50 సీట్లపై పాటీదార్లు తమ ప్రభావం చూపిస్తున్నారు. స్వాతంత్య్రానంతరం చాలా ఏళ్లు గుజరాత్‌ను పాలించిన కాంగ్రెస్, 1995లో అధికారాన్ని కోల్పోయింది. మళ్లీ తిరిగి ప్రాభవాన్ని పొందలేకపోయింది. అయితే ఇప్పుడు సర్దార్ పటేల్ వారసత్వాన్ని తిరిగి స్వీకరించడం ద్వారా, పాటిదార్ ఓట్లను ఆకర్షించి, బీజేపీ ఆధిపత్యాన్ని సవాలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే బీజేపీ ఇప్పటికే పటేల్ వారసత్వాన్ని తమ సొంతం చేసుకున్న తరుణంలో కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతమవుతుందా లేక ఆలస్యమైన చర్యగా మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి.ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ ఆరోపణలపై చైనా ఆగ్రహం -
బ్రిటిషర్ల కంటే బీజేపీ డేంజర్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు చాలా ప్రమాదకరమైన వారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వాళ్లను తరిమి కొట్టినట్లే రాహుల్‌గాంధీ నాయకత్వంలో మనమంతా దేశంలో బీజేపీని ఓడించి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ నేతృత్వంలో ముందుకు తీసుకుని వెళ్తుంటే.. ప్రధానమంత్రి మోదీ మాత్రం దేశ వ్యాప్తంగా గాడ్సే విధానాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సదస్సు ‘న్యాయ్‌పథ్’లో బుధవారం సీఎం ప్రసంగించారు.వల్లభాయ్ పటేల్‌తో హృదయపూర్వక బంధం‘గుజరాత్ ప్రజలతో, వల్లభాయ్ పటేల్ వారసులతో మా తెలంగాణ ప్రజలకు సంబంధం ఉంది. దేశ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు తెలంగాణకు రాలేదు. అప్పుడు మాకు స్వాతంత్య్రం ప్రసాదించిన వల్లభాయ్ పటేల్‌తో మాకు హృదయపూర్వక బంధం ఉంది. వల్లభాయ్ పటేల్ మాకు స్వాతంత్య్రం ఇస్తే.. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని అందించారు. వల్లభాయ్ పటేల్ భూమి నుంచి నేను ఒకటే చెబుతున్నా. మేము బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం..అడ్డుకుంటాం. వారిని ఎవరూ క్షమించరు’ అని రేవంత్ అన్నారు.మోదీ గ్యారంటీ దేశాన్ని విభజించడమే..‘రాహుల్‌గాంధీ తెలంగాణలోని రైతులకు ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 10 నెలల్లోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ అమలు చేసి చూపించింది. మరో హామీ అయిన కులగణనను కూడా పూర్తి చేశాం. కేంద్రం జనగణనతో పాటు కుల గణన చేయాలనే డిమాండ్‌పై లోక్‌సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా రాహుల్‌గాంధీని మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. మరోవైపు ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని గాలికి వదిలేశారు. రెండు కోట్ల మందికి రాకపోయినా మోదీ, అమిత్‌షాలకు మాత్రం పదవులు వచ్చాయి. రైతులు కనీస మద్దతు ధర, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 15 నెలలపాటు ఆందోళన చేసినా మోదీ ప్రభుత్వం కనీసం వారితో చర్చలు కూడా జరపలేదు. మోదీ మణిపూర్‌లో మంటలు రాజేశారు. దేశ మూల వాసుల జీవన హక్కును కాలరాసే ప్రయత్నం చేశారు. మోదీ గ్యారంటీ దేశాన్ని విభజించడమే. కానీ రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో పేరిట 150 రోజులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.బీజేపీ ఓటమికి కంకణబద్ధులై వెళ్లాలిదేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ ఎన్నో ఆందోళనలు చేసినా.. ఆయనపై ఏనాడూ లాఠీ ఎత్తలేదు. కానీ స్వాతంత్య్రం వచ్చిన ఆరునెలల్లోనే గాడ్సేలు తూటాలు పేల్చి ఆయన్ను పొట్టన పెట్టుకున్నారు. గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని అడ్డుకునేందుకు, మోదీ ఆలోచన విధానాన్ని అడ్డుకునేందుకే మనమంతా ఇక్కడ ఏకమయ్యాం. ఇక్కడకు వచ్చిన ప్రతి నాయకుడు, కార్యకర్త రానున్న ఎన్నికల్లో బీజేపీని ప్రతిచోటా ఓడించేలా కంకణబద్ధులై వెళ్లాలి. గాడ్సే భావజాలాన్ని ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీని, బీజేపీని అడ్డుకుని దేశాన్ని రక్షించాల్సిన అవసరం అందరిపైనా ఉంది..’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. -
‘దేశ సమస్యలు తీర్చాలంటే దేశాన్ని ఎక్సరే తీయాలి’.. AICCలో రాహుల్
గాంధీ నగర్ : దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేశ సమస్యలు తీర్చాలంటే దేశాన్ని ఎక్సరే తీయాలని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రెండో రోజు ‘అఖిల భారత కాంగ్రెస్ కమిటీ’ (ఏఐసీసీ) సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. దళితులు,ఆదివాసీలు,పేదల కోసం కాంగ్రెస్ పనిచేస్తోంది. బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ నిత్యం పోరాటం చేస్తుంది. కులగణనతో దేశంలో ఓబీసీల సంఖ్య తేలుతుంది. తెలంగాణలో కులగణన చేపట్టాం. జాతీయ స్థాయిలో జనగణన చేసే వరకు పోరాడుతాం. కుల గణనతో ఏ వర్గం జనాభా ఎంత ఉంటుందో తేలుతుందని వ్యాఖ్యానించారు. LIVE: Nyaypath - AICC Session | Ahmedabad, Gujarat https://t.co/8snXJNmtEM— Rahul Gandhi (@RahulGandhi) April 9, 2025 గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మంగళవారం ప్రారంభమైన ఏఐసీసీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 1,700 మంది ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. తొలిరోజు ఏప్రిల్ 8న విస్తృత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఏప్రిల్ 9న ఏఐసీసీ సభ్యులతో సమావేశం కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ రెండు సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, లోక్‌సభ విపక్షనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల సీఎంలు దీనిలో పాల్గొన్నారు. -
అహ్మదాబాద్ వేదికగా.. ప్రధానిపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
అహ్మదాబాద్ (గుజరాత్): మతాల మధ్య ప్రధాని మోదీ చిచ్చుపెడుతున్నారని.. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వం అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.వచ్చే రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలి. దేశంలో కుల గణన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. బ్రిటీష్ వాళ్లు ఎలా దేశాన్ని లూటీ చేశారో.. బీజేపీ నేతలు కూడా అలానే లూటీ చేస్తున్నారు. బిట్రీష్ వాళ్ల కంటే బీజేపీ వాళ్లే ప్రమాదకరం. బ్రిటీష్ వాళ్లను తరమికొట్టినట్టే బీజేపీని కూడా ఓడగొట్టాలి. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు.’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. -
భారీ సంస్థాగత మార్పులు
అహ్మదాబాద్: పార్టీలో భారీ సంస్థాగత మార్పులను లక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ మేధోమథనానికి సిద్ధమైంది. నేడు జరగబోయే ఏఐసీసీ సమావేశానికి సన్నాహక సమావేశంగా విస్తృతస్థాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీని పార్టీ మంగళవారం అహ్మదాబాద్‌లో నిర్వహించింది. ఈ ఏడాది అక్టోబర్ 31న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ‘ జెండాపట్టుకుని స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపించిన మన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్’ పేరిట సీడబ్ల్యూసీ ఒక తీర్మానాన్ని చేసి ఆమోదించింది.తీర్మానం, సీడబ్ల్యూసీ భేటీ వివరాలను తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలకు అత్యధిక అధికారాలు కట్టబెట్టడం, పార్టీ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారికి 50 శాతానికి మించి ప్రాధాన్యత కల్పించడం వంటి నిర్ణయాలను అమలుచేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ పదవుల్లో 50 శాతానికి పైగా పదవులను మహిళలు, యువతకు కట్టబెట్టాలని పార్టీ యోచిస్తోంది. నేడు అహ్మదాబాద్‌లో సబర్మతీ నదీ తీరంలో సబర్మతీ ఆశ్రమం, కోచ్రబ్ ఆశ్రమాల మధ్యలోని ప్రాంతంలో ఏఐసీసీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ‘‘ న్యాయపథ్: సంకల్ప్, సమర్పణ్, సంఘర్‡్ష’ ఇతివృత్తంతో సమావేశాన్ని చేపట్టనున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్పై ఖర్గే ధ్వజంసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మెమోరియల్ భవంతిలో జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రారంబోపన్యాసం చేస్తూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ సర్దార్ పటేల్ వారసత్వ ఘనతను కాంగ్రెస్ కొనసాగిస్తోంది. ఆయన మన మనసుల్లో ఉన్నారు. మన ఆలోచనల్లో ఉన్నారు. మనం ఆయన ఘన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే పటేల్, నెహ్రూ వంటి జాతీయనేతలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ పక్కా ప్రణాళికతో కుట్ర పన్నుతున్నాయి. నెహ్రూ, పటేల్‌కు మధ్య బేధాభిప్రాయాలు ఉండేవని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నిజానికి వీళ్లద్దరూ మంచి మిత్రులు. వీళ్లు ఒకే నాణేనికి రెండు పార్శా్వలు. పటేల్, నెహ్రూ రోజూ మాట్లాడుకునేవారు. అన్ని అంశాల్లో పటేల్ నుంచి నెహ్రూ సలహాలు, సూచనలు తీసుకునేవారు. నేరుగా మాట్లాడాలనుకున్న ప్రతిసారీ పటేల్ ఇంటికే నెహ్రూ వెళ్లేవారు. పటేల్ సౌకర్యార్థం కొన్ని సార్లు సీడబ్ల్యూసీ భేటీలను పటేల్ వాళ్ల ఇంట్లోనే జరిపారు. పటేల్‌ను భారత ఐక్యతా పితామహుడిగా నెహ్రూ శ్లాఘించారు. ఇవన్నీ చరిత్ర రికార్డుల్లో ఉన్నాయి’’ అని ఖర్గే గుర్తుచేశారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు ‘‘ఆర్ఎస్ఎస్ భావజాలానికి పటేల్ గొప్ప ఆదర్శాలకు పొంతనేలేదు. గతంలో ఆర్ఎస్ఎస్ను పటేల్ నిషేధించారు. అలాంటి సంస్థ ఇప్పుడు పటేల్ తమ వ్యక్తి అన్నట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం. పటేల్‌కు కాంగ్రెస్ సముచిత గౌరవం ఇవ్వలేదని బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో వీసమెత్తయినా వాస్తవం లేదు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి, గత 140 ఏళ్లుగా దేశం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్‌ను అంతమొందించాలని కుట్రచేస్తున్నారు’’ అని ఖర్గే అన్నారు. -
సొమ్మసిల్లి పడిపోయిన కాంగ్రెస్ నేత చిదంబరం
అహ్మదాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సబర్మతి ఆశ్రమంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఉన్నట్లుండి ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. వేడి కారణంగా డీహైడ్రేషన్‌తో ఆయన అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. #WATCH | Ahmedabad, Gujarat: Congress leader P Chidambaram fell unconscious due to heat at Sabarmati Ashram and was taken to a hospital. pic.twitter.com/CeMYLk1C25— ANI (@ANI) April 8, 2025కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అయిన చిదంబరం 79 ఏళ్ల వయసులోనూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. కేంద్రంలోని బీజేపీపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా.. తమిళనాడు రామేశ్వరంలో పాంబన్ వంతెనను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన బడ్జెట్ వ్యాఖ్యలకూ ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘‘ప్రధాని సహా కేంద్రమంత్రులు 2004-14తో పోలిస్తే.. 2014-24 మధ్య కాలంలో తమిళనాడుకు అధికంగా నిధులు ఇచ్చామని పదే పదే చెబుతున్నారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం గతంలో కంటే ఏడు రెట్లు నిధులు పెంచామని ప్రధాని చెప్పారు. ఫస్టియర్ ఎకానమీ విద్యార్థిని అడగండి. ‘ఎకానమీ మ్యాట్రిక్’ ఎప్పుడూ గతేడాది కంటే ఎక్కువగానే ఉంటుందని చెబుతారు. జీడీపీ గతంలో కంటే ఇప్పుడు పెరిగింది. కేంద్ర బడ్జెట్ మొత్తం మునుపటి కంటే పెరుగుతుంది. ప్రభుత్వ మొత్తం ఖర్చూలూ అంతే. మీ వయసు కూడా గతేడాది కంటే పెరిగింది. అంకెల పరంగా ఆ సంఖ్య పెద్దగానే కనిపించి ఉండొచ్చు. కానీ, జీడీపీ పరంగా లేదా మొత్తం వ్యయ నిష్పత్తి పరంగా అది ఎక్కువగా ఉందా?’’ అని ప్రశ్నించారు. -
KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్,సాక్షి: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెట్టనున్నట్లు తెలిపారు.వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే పార్టీ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Celebrations) కోసం బీఆర్ఎస్ (brs) ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు మేరకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని జన సమీకరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు.ఈ తరుణంలో కేటీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ,హెచ్‌సీయూ భూముల వ్యవహారంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండవ తెలుగు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్. అందుకే భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఇది అతిపెద్ద బహిరంగ సభ అవుతుంది. ఈ సారి డిజిటల్ మెంబర్షిప్ ప్రవేశపెడుతున్నాం. అన్ని జిల్లా కార్యాలయాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. సిల్వర్ జూబ్లీ సందర్భంగా నెలకో కార్యక్రమం జిల్లాల్లో నిర్వహిస్తాం.అమెరికా దుందుడుకు నిర్ణయాల వల్ల స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు నష్టపోయారు. మోదీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా మౌనం ఎందుకు?. తర్వాత దెబ్బ తెలంగాణపై పడబోతుంది. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఫార్మా ఎగుమతులు ఉంటాయి. వాటిపై ఎఫెక్ట్ ఉండబోతుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.రాష్ట్రంలో నెగటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు BRS పార్టీ మొదలుపెట్టినవి కాదు. లగచర్ల,మూసీ పునరుజ్జీవనం, హెచ్‌సీయూ విషయంలో బాధితులే మా వద్దకు వచ్చారు. ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ నెహ్రూ జూలాజికల్ పార్క్ నివేదికలోనే అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని చెప్పింది. జంతువుల వ్యధకు కారణమైన వారిపై కచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉంది. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళతాం. HCU విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించింది. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ లాంటి వాళ్లు జింకలను చంపితే జైలుకు వెళ్లారు. మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టారా?ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా. హెచ్‌సీయూలో 400 ఎకరాలు కాదు దాని వెనకాల వేల ఎకరాల భూముల వ్యవహారం ఉంది. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. అన్ని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రేవంత్ రెడ్డిని కాపాడుతుంది బండి సంజయ్’ అని వ్యాఖ్యానించారు. -
తెలంగాణలో ఏడుగురు కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Sukhender Reddy) ప్రమాణ స్వీకారం చేయించారు.ఇటీవల తెలంగాణలో జరిగిన రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన అంజిరెడ్డి, మల్క కొమురయ్య ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ఎమ్మెల్సీలతో మండలి గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy), ఎంపీలు రఘునందన్‌రావు, లక్ష్మణ్ హాజరయ్యారు.అలాగే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలగా (MLA quota MLCs) కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవం ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యంలతో కూడా గుత్తా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇదే సమయంలో నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ (P.R.T.U) అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి (Sripal Reddy) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. -
గచ్చిబౌలి భూములు.. ప్రతివాదులకు హైకోర్టు కీలక ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్బంగా ఈనెల 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ దృష్ట్యా 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు వ్యాజ్యంలో కోరారు. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసు విచారణ దృష్ట్యా 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. -
ఆ రెండింటిపై ఫుల్ ‘ఫోకస్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ, రాజీవ్ యువ వికాసం పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పేదలకు మేలు చేసే ఈ రెండు పథకాలు కంచ గచ్చిబౌలి భూముల వివాదంతో చర్చలో లేకుండా పోయాయని అభిప్రాయపడుతోంది. ఆ రెండు పథకాలపై ఫోకస్ పెంచి ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత 15 నెలల్లో అమలు చేసిన అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రచారం కల్పించేందుకు వీలుగా ఓ కరపత్రాన్ని టీపీసీసీ సిద్ధం చేసింది. ఈ కరపత్రాలను క్షేత్రస్థాయిలో పంపిణీ చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు పార్టీ శ్రేణులు వివరించనున్నాయి. ముఖ్యంగా సన్న బియ్యం, రాజీవ్ యువ వికాసం కార్యక్రమాల గురించి ప్రజలకు ప్రత్యేకంగా వివరించే విధంగా పార్టీ కార్యాచరణ రూపొందుతోందని, దీనిని ఒకట్రెండు రోజుల్లో టీపీసీసీ విడుదల చేయనుందని సమాచారం. భూముల వివాదంతో మరుగున.. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ చేయలేని పేదలకు ఉపయోగపడే రెండు కార్యక్రమాలను కాంగ్రె స్ ప్రభుత్వం చేపట్టినప్పటికీ, కంచ గచ్చిబౌలి భూము ల వ్యవహారంతో అవి మరుగున పడ్డాయనే అభిప్రా యం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 80 శాతం ప్రజలకు అమలయ్యే విధంగా రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినా పెద్దగా ప్రచారం లేకుండా పోయిందనే చర్చజరుగుతోంది. రాజీవ్ యువ వికాసం పరిస్థితి కూడా ఇ దే విధంగా ఉందని అంటున్నారు. పదేళ్లపాటు నిరు ద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు అమలు కాలేదని, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు కూడా నిర్వీర్యమయ్యాయనే ఉద్దేశంతో మళ్లీ గ్రామాల్లోని యువతకు ఉపాధి కల్పించేలా దీనికి రూపకల్పన చేసినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు.లబ్దిదారులతో భోజనాలు.. నిరుద్యోగులకు సాయం టీపీసీసీ కీలక నేత ఒకరు మాట్లాడుతూ ‘కంచ గచ్చిబౌలిభూముల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వాన్ని ఓ వైపు బద్నాం చేస్తూనే మరోవైపు పార్టీకి ప్రయోజనం చేకూర్చే పథకాలు మరుగున పడేలా చేస్తోంది. రాజకీయ రాద్ధాంతం కింద పేదల సంక్షేమం నలిగిపోతోంది..’అని వ్యాఖ్యానించడం కాంగ్రెస్ నేతల్లో ఉన్న అభిప్రాయానికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో సన్న బియ్యంతో కూడిన భోజనాన్ని లబ్ధిదారులతో కలిసి చేసేలా పార్టీలోని అన్ని స్థాయిల నేతలకు దిశానిర్దేశం చేయాలని, మరోవైపు రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు క్షేత్రస్థాయి కేడర్ సహకరించేలా పిలుపునివ్వాలని టీపీసీసీ యోచిస్తుండడం గమనార్హం. -
బీజేపీకి ఒక్క చాన్స్ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కోరారు. ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి బీజేపీకి కూడా అవకాశం ఇస్తే పారదర్శక పాలన ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్స వాన్ని పురస్కరించుకుని ఆదివారం బీజేపీ రాష్ట్ర కా ర్యాలయంలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించా రు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయటం.. భారతదేశ గౌరవాన్ని పెంచటం, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలబెట్టడమే బీజేపీ లక్ష్య మని పేర్కొన్నారు. రైల్వేస్టేషన్లో చాయ్ అమ్ముకున్న సాధారణ వ్యక్తి కుమారుడిని ఈ దేశానికి ప్రధానిని చేసిన ఘనత బీజేపీకే దక్కిందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో మూడు దఫాలుగా అత్యంత సమర్థవంతమైన, పారదర్శక పాలనను బీజేపీ అందిస్తోందని తెలిపారు. బీజేపీవైపు చూస్తున్న తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. అందుకే ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో 77 లక్షల మంది తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లో విజయం అందించారని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మజ్లిస్ ఆగడాలను అరికడతాం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంను పెంచి పోషిస్తున్నాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని గెలిపించేందుకు ఆ రెండు పార్టీలు పోటీపడుతున్నాయ ని ఆరోపించారు. మర్రి చెన్నారెడ్డిని సీఎం పదవి నుంచి దించేందుకు మజ్లిస్ హైదరాబాద్‌లో కల్లోలం సృష్టించిందని, తీగలగుట్ట వద్ద 400 మంది దళితులు, హిందువులపై హత్యాకాండకు ఒడిగట్టిందని ఆరోపించారు. మజ్లిస్ దౌర్జన్యాల వల్ల పాతబస్తీ నుంచి హిందువులు వలస పోతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మజ్లిస్ పార్టీ ఆగడాలను అడ్డుకుంటుందని ప్రకటించారు. 14వ తేదీ వరకు బీజేపీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, పార్టీ కార్యకర్తలు తమ ఇళ్లపై పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 14 నుంచి 22 వరకు అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘ నంగా నిర్వహించాలని సూచించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రికాంగ్రెస్ సర్కార్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపాటు కరీంనగర్ టౌన్: సీఎం రేవంత్‌రెడ్డి రబ్బర్ స్టాంప్‌లా మారారని కేంద్ర హోంశాఖ స హాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చే శారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బండి సంజయ్ మొదట కరీంనగర్‌లోని తన నివాసంలో.. తరువాత పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలతో కలసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సచివాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో సమీక్ష చేయడమేంటని ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరుండాలి? ఎవరు వద్దు అనేదానిపై ముఖ్యమంత్రికి విచక్షణాధికారం ఉంటుందని, తెలంగాణలో పాలన భ్ర ష్టు పట్టిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని మండిపడ్డారు. కాగా, 45 ఏళ్లుగా బీజేపీ అనేక ఒడిదొ డుకులు, అవమానాలను అధిగమించిందన్నారు. 16 రాష్ట్రాల్లో సొంతంగా.. 6 రాష్ట్రాల్లో కూటమి ద్వారా ప్రభుత్వాలను కొనసాగిస్తోందన్నారు. సన్న బియ్యం కోసం కేంద్రం కిలోకు రూ.37 ఖర్చు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం భరించేది కేవలం రూ.10 మాత్రమే అన్నారు. అలాంటప్పుడు రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫొటో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు నుంచి బియ్యం వరకు ప్రతిపైసా కేంద్రమే చెల్లిస్తోందన్నారు. -
హెచ్‌సీయూ వివాదం.. కేటీఆర్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి, హెచ్‌సీయూ రక్షణకు చేతులు కలపాలంటూ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రియులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. హెచ్‌సీయూ భూముల వివాదం నేపథ్యంలో రేవంత్ సర్కార్ తీరును లేఖలో ఎండగట్టారు. 400 ఎకరాల పర్యావరణం ప్రమాదంలో పడింది. 734 జాతుల మొక్కలు, 220 పక్షులు, 15 సరీసృపాలు, 10 క్షీరదాల ఆవాసం నాశనం కాకుండా ఆపుదాం అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.‘‘ప్రభుత్వం ఆర్థిక లాభం కోసం పర్యావరణంపై దాడి చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణం నాశనం చేసే ప్రణాళికలు కొనసాగిస్తోంది. విద్యార్థుల నిరసనకు సలాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు శాంతియుతంగా అడవి రక్షణకు పోరాడుతున్నారు. విద్యార్థులపై అపవాదులు, యూనివర్సిటీని తరలించే బెదిరింపులు ప్రభుత్వ రియల్ ఎస్టేట్ మనస్తత్వానికి నిదర్శనం’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.ఎకో పార్క్ పేరుతో సరికొత్త మోసం. అడవిని కాపాడే బదులు భూమి ఆక్రమణకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. నిరసనలు కొనసాగితే హెచ్‌సీయూని "ఫోర్త్ సిటీ"కి తరలిస్తామని హెచ్చరిక తప్పు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులకు మద్దతుగా నిలవాలి. కంచ గచ్చిబౌలి, యూనివర్సిటీని కాపాడుతామని పార్టీ నుంచి హామీ హామీ ఇస్తున్నాము. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించి, భూమి విక్రయాన్ని రద్దు చేయాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
‘హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడటం కాదు.. అది చేసిన కేసీఆర్ పుణ్యం’
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఉత్తర తెలంగాణకు వర ప్రదాయిని.. హైదరాబాద్‌లో కూర్చొని కాళేశ్వరం కూలిందని చెప్పడం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నచూపు చూస్తున్నది. అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని నిద్ర లేపే ప్రయత్నం చేశాం అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం.. చిన్న కోడూరు మండలం చౌడారం గ్రామం వద్ద బిక్క బండకు వెళ్లే కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా హరీష్‌రావు మాట్లాడుతూ..‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నేడు రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుండి బిక్క బండ గుట్టకు నీళ్ళు విడుదల చేయడం జరిగింది. గత ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో భూసేకరణ కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నచూపు చూస్తున్నది. ఇవ్వాళ ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయి. రంగనాయక సాగర్ లో, కొండపోచమ్మ, మిడ్ మానేరు లో నీళ్ళు ఉన్నాయి. కక్షపూరితంగానే ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కొత్తగా ఒక్క ఎకరం భూ సేకరణ చేయడం లేదు.కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి సిస్టం అంత రెడీ చేశారు. పంపు హౌస్‌లు, రిజర్వాయర్లు, సబ్ స్టేషన్లు, మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ అన్ని రెడీగా ఉన్నాయి. కేవలం భూ సేకరణ చేసి కాలువలు తవ్వి రైతులకు నీళ్లు ఇవ్వాల్సింది ఉంది. కానీ, ఈ సంవత్సరం కాలంలో ఒక్క ఎకరా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూసేకరణ చేయలేదు. చేయకపోవడం వల్ల చాలా చోట్ల కూడా రైతులు సొంత డబ్బులు పెట్టుకొని రైతులే స్వచ్ఛందంగా కాలువలు తవ్వుకొని నీళ్లు తీసుకున్న సందర్భం ఉన్నది.కొండెంగులకుంట, బిక్కబండ రైతులు అందరూ వస్తే.. స్వంత డబ్బులతో మిషన్లు పెట్టి.. స్వంత డబ్బులు పెట్టీ, భూ సేకరణలో నష్ట పోతున్న వారికి డబ్బులు ఇచ్చి కాలువలు తవ్వి నీళ్లు అందిస్తున్నాం. ప్రభుత్వం పనిచేయట్లేదు. ప్రేమతో పని చేయాలి కానీ కక్షతో పని చేస్తున్నది. నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడాను. పిల్ల కాలువలు తవ్వితే రైతులకు ఆయకట్టు పెరుగుతుంది. కనీసం 15, 20 కోట్లు భూసేకరణకు విడుదల చేయండి అని కోరాను.చిన్న కోడూరు మండలం చౌడారం గ్రామం వద్ద బిక్క బండకు వెళ్లే కాలువ కు నీటిని విడుదల చేసిన మాజీ మంత్రి @BRSHarish గారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..- కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నేడు రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుండి బిక్క బండ గుట్టకు నీళ్ళు విడుదల చేయడం జరిగింది.- గత ఏడాదిన్నర… pic.twitter.com/o9z1QQTWWm— Office of Harish Rao (@HarishRaoOffice) April 6, 2025అసెంబ్లీలో కూడా కట్ మోషన్ ఇచ్చి నిరసన తెలపడం జరిగింది. అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని నిద్ర లేపే ప్రయత్నం చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఉత్తర తెలంగాణకు వర ప్రదాయిని. కోకాకోలా ఫ్యాక్టరీ కూడా కాళేశ్వరం నీళ్లు ఉండబట్టి వచ్చింది. రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కుంగిన ఒకటో రెండో పిల్లర్లను మరమ్మతులు చేసి నీళ్ళు ఇవ్వాలని కోరుతున్న. కాంగ్రెస్ వచ్చాక ఖమ్మంలోని పెద్దవాగు, సుంకిశాల, SLBC సొరంగం, వట్టెం ప్రాజెక్టులు కూలిపోయాయి. కాళేశ్వరం అంటే మెగా ప్రాజెక్టు. కాళేశ్వరం ద్వారా సిద్ధిపేట నియోజకవర్గంలో 52 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాం. ఇది కేసీఆర్ చేసిన పుణ్యం. హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం కూలిందని చెప్పడం కాదు. సిద్ధిపేట ఒక్కటే కాదు ఎన్నో నియోజకవర్గాలకు నీళ్ళు అందుతున్నాయి. ఇప్పటికైనా గోబెల్స్ ప్రచారం ఆపి భూ సేకరణ చేసి కాలువలు తవ్వి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
HCU విషయంలో కాంగ్రెస్ ఇంచార్జ్ సూచనలేంటి?: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో రబ్బర్ స్టాంప్ పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన మీద పట్టులేకుండా పోయింది. రాష్ట్ర మంత్రులను ఏఐసీసీ నిర్ణయించడం ఏంటి? అని ప్రశ్నించారు. అలాగే, ఎంఐఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ..‘ఢిల్లీలో వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓటు వేసింది. తెలంగాణాను మజ్లీస్‌కు అంటగట్టడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ యత్నిస్తున్నాయి. మజ్లీస్ కబంధ హస్తాల నుండి తెలంగాణాను కాపాడమే మా లక్ష్యం. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం బీజేపీదే. రేషన్ బియ్యానికి కేంద్రం 37 రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్రం 10 రూపాయలు ఖర్చు చేస్తోంది. తెలంగాణాలో ఇచ్చే రేషన్ బియ్యం మోదీ ఇస్తున్నవే.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము బియ్యానికి పది రూపాయలు ఖర్చు బెడుతున్నామని చెబుతున్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుంది. ముఖ్యమంత్రికి పాలన మీద పట్టు లేకుండా పోయింది. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంపుగా మారాడు. రబ్బర్ స్టాంపు పాలన తెలంగాణాలో కొనసాగుతోంది. రాష్ట్ర మంత్రులను ఏఐసీసీ నిర్ణయించడం ఏంటి?. హెచ్‌సీయూ విషయంలో మంత్రులు ఏం చేయాలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ సూచనలు ఇవ్వడం ఏంటి?. తెలంగాణాలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అవినీతి రహిత రాష్ట్రంగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలన అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.