ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాల అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఇండియా కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతకరం వ్యక్తం చేశాయి. అంతేకాకుండా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెండ్ తో ఈ వివాదం తారాస్థాయికి చేరింది.
లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా కేంద్రం గా రాజకీయం వేడెక్కింది. సభలో ఆయన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఆయన వైఖరిపై నిరసన చేపట్టన ప్రతిపక్షాలు నేడు ఆయనకు నోటీసులివ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతరం రాజ్యాంగంలో 94సీ ప్రకారం స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Opposition to move no-confidence motion against Lok Sabha Speaker Om Birla: Sources pic.twitter.com/e8PsUKw2Wp
— ANI (@ANI) February 9, 2026
లోక్ సభలో చైనా విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కఠిన నిర్ణయం తీసుకోలేకపోయారని అంటున్న రాహుల్ ఆరోపించారు. ఆర్మీ జనరల్ నరవానే పుస్తకంలో ఉన్న విషయాలను రాహుల్ లోక్ సభలో ప్రస్తావించడాన్ని స్పీకర్ ఓం బిర్లా , బిజెపి ఎంపీలు అడ్డుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది.
గతంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ దంకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నం చేసిింది కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీనిపై అప్పీలుకు కోర్టు సమయం ఇచ్చినప్పటికీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ సెక్రటేరియేట్ నోటిఫికేషన్ వెలువరించింది. దీంతో కాంగ్రెస్ ఆందోళన చేసింది. స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరమవుతుంది.
#UPDATE | According to Sources, the opposition will move it in the second part of the budget session, as it needs 20 days' notice. The grounds identified for the move include: Lok Sabha LoP not allowed to speak; women MPs named by the Chair; certain Treasury Bench MPs always… https://t.co/GoEY5mpWlR
— ANI (@ANI) February 9, 2026


