డాలస్‌లో కాదు.. పాక్‌లో ఉన్నట్లుంది!.. అమెరికా నేత ఆవేదన | US Leader Key Comments On Pakistanis Migration IN USA | Sakshi
Sakshi News home page

డాలస్‌లో కాదు.. పాక్‌లో ఉన్నట్లుంది!.. అమెరికా నేత ఆవేదన

Feb 9 2026 7:10 AM | Updated on Feb 9 2026 7:10 AM

US Leader Key Comments On Pakistanis Migration IN USA

న్యూయార్క్‌: అమెరికాలో ముస్లిం వలసల పెరుగుదలపై రిపబ్లికన్‌ పార్టీకి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు బ్రాండెన్‌ గిల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా టెక్సాస్‌ రాష్ట్రంలో పలు ప్రాంతాలు భారీగా ‘ఇస్లామీకరణ’కు గురవుతున్నాయన్నారు. డాలస్‌ నగరంలో ఇస్లామీకరణ స్థానికులను ఆందోళనకు గురి చేస్తోందని తెలిపారు.

‘‘డాలస్‌లోని కొన్ని మాల్స్‌ను సందర్శించండి.. మీరు డాలస్‌లో కాదు, పాకిస్తాన్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది’’ అని శుక్రవారం రియల్‌ అమెరికాస్‌ వాయిస్‌ ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో కూడా పోస్టు చేశారు. ‘‘తరాలుగా ముస్లింల యాజమాన్యంలో ఉన్న భూముల దగ్గర మసీదులు పుట్టుకొస్తున్నాయి. అవి అసలైన అమెరికాను చంపుతున్నాయి. 

స్థానిక సంస్కృతిని మార్చేస్తున్నాయి’’ అన్నారు. ముస్లిం ప్రముఖులతోపాటు పలువురు జర్నలిస్టులు, హక్కుల సంఘాల నేతలు గిల్‌ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన విద్వేషాలను రెచ్చగొడుతూ ముస్లిం సమాజంపై అపోహలు పెంచుతున్నారని మండిపడ్డారు. అమెరికా కాంగ్రెస్‌లో అతి పిన్నవయస్కుడైన గిల్‌ గతంలోనూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌ మేయర్‌ జొహ్రాన్‌ మమ్దానీపై, భారతీయుల వలసపై నోరుపారేసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement