థాయ్‌లాండ్‌లో విజయం ఎవరిదో? | Three-way battle defines high-stakes Thailand general election 2026 | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్‌లో విజయం ఎవరిదో?

Feb 9 2026 6:26 AM | Updated on Feb 9 2026 11:37 AM

Three-way battle defines high-stakes Thailand general election 2026

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌లో ఆదివారం సాధారణ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కూడా మరికొద్ది గంటల్లోనే వెలువడే అవకాశాలున్నాయి. అయితే, మందగించిన ఆర్థిక వృద్ధి, పెరిగిన జాతీయతావాద సెంటిమెంట్‌ నేపథ్యంలో దేశంలోని 5.3 కోట్ల మంది ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే అంశంలో స్పష్టత లేదు. 

మొత్తం 50 వరకు పారీ్టలు ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ ప్రగతిశీల, ప్రజాకర్షక, రాచరిక పాలనకు మద్దతు పలికే మూడు పారీ్టల మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తోంది.  ఏకైక అతిపెద్ద పారీ్టగా అవతరించే అవకాశం ఏ ఒక్క పార్టీకీ లేదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement