థాయిలాండ్: ఆశ్రమంలో అశ్లీల చిత్రాలు.. నలుగురు సన్యాసుల అరెస్ట్ | Monks arrested in Thailand | Sakshi
Sakshi News home page

థాయిలాండ్: ఆశ్రమంలో అశ్లీల చిత్రాలు.. నలుగురు సన్యాసుల అరెస్ట్

Feb 4 2026 5:08 AM | Updated on Feb 4 2026 5:18 AM

Monks arrested in Thailand

థాయిలాండ్‌లో ఓ బౌద్దసన్యాసుల మఠంలో పోలీసులు దాడులు నిర్వహించగా అశ్లీల చిత్రాలకు సంబంధించిన వీడియోలు ఇతర నిషేదిత వస్తువులు లభించాయి. దీంతో ఆ నలుగురు సన్యాసులను పోలీసులు అరెస్టు చేశారు.

చోన్‌బూరి ప్రావిన్స్‌లోని  ఫ్రోమ్ సాంథోన్ అనే  బౌద్ద సన్యాసుల ఆశ్రమంలో నిషేదిత వస్తువులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఆ ఆశ్రమంపై దాడి చేయగా పలు నిషేదిత వస్తువులు లభించాయి. తనీఖీల్లో తుపాకులు, మాదకద్రవ్యాలు, అశ్లీల చిత్రాల వీడియోలు లభించాయి. దీంతో అంతే కాకుండా వారి వద్ద అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న మహిళల ఫోన్ నెంబర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.    

అరెస్టయిన వారు ఫ్రా సుపాచాయ్, జంతావోంగ్, ఫ్రా విరాట్ ముక్దాసానిత్, ఫ్రా థానావోల్, వీరందరూ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిగా గుర్తించినట్లు తెలిపారు. అయితే ఆశ్రమంలో మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారని గ్రామస్థుల నుంచి ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాలు వాడుతున్న ముగ్గురు సన్యాసులను పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. మరోకరిని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement