యుకే ప్రభుత్వం శాశ్వత నివాసం కోసం దరఖాస్తు పరిమితిని పెంచడంపై అక్కటి పార్లమెంటులో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇది అమలైతే అక్కడ వివిధ పనులు నిర్వహిస్తున్న వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
అక్రమ వలసలను నియంత్రించడంలో భాగంగా యూకే ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్రిటన్‌లో పనిచేస్తున్న విదేశీయులు శాశ్వత పౌరసత్వం దరఖాస్తు చేసుకోవడం కోసం ఐదేళ్ల కాల పరిమితిని పదేళ్లకు పెంచేలని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది.
స్కిల్ట్ వర్కర్స్, హెల్త్ అండ్ కేర్ వీసాలపై వారు అక్కడి ఐఎల్‌ఆర్ (శాశ్వత నివాసం) అప్లై చేసుకోవాలంటే ప్రస్తుతం ప్రస్తుతం ఐదేళ్ల వరకూ ఉంది. అయితే దానిని పదేళ్లకు పెంచాలనే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది. దీంతో ఆదేశంలో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశంపై అక్కడి పార్లమెంటులో ఇది వరకే చర్చలు జరిగాయి.
అయితే మీడియం స్కిల్స్ ఉద్యోగాలకు వీసా పరిమితి పెంచడం వల్ల ILRకు అర్హతపొందే వ్యక్తుల సంఖ్య తగ్గుతుందని ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ అక్రమంగా యూకేలో ILRకోసం ప్రయత్నిస్తే వారి వీసా రద్దు చేయడంతో పాటు దేశ బహిష్కరణ చేస్తామని అక్కడి అధికారులు హెచ్చరించారు


