మయన్మార్‌లో భూకంపం | Earthquake in Myanmar | Sakshi
Sakshi News home page

మయన్మార్‌లో భూకంపం

Feb 3 2026 10:28 PM | Updated on Feb 3 2026 11:25 PM

Earthquake in Myanmar

మంగళవారం మయన్మార్‌లోని పలు ప్రాంతాలలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స‍్కేలుపై  6 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు తెలుస్తుంది.రిక్టర్ స్కేలుపై 6.1గా తీవ్రత నమోదైంది. భూకంపం తీవ్రతతతో మయన్మార్‌లోని పలు ప్రాంతాలలో భూమి కంపించడంతో ఆందోళన చెందిన ప్రజలు రోడ్లపైకి పరిగెత్తారు. అయితే దీనివల్ల జరిగిన నష్టం వివరాలను అక్కడి ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఈ భూకంప ప్రభావం తూర్పు, ఈశాన్య ప్రాంతాలపై పడినట్లు తెలుస్తోంది. కోల్‌కతా పరిసర ప్రాంతాలలో భూమికొద్దిగా కదిలినట్లు అధికారులు పేర్కొన్నారు. మరికొద్ది చోట్ల స్వల్ప ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లోనూ భూమి స్వల్పంగా కంపించినట్లు సమాచారం అందుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement