‘అతడి జోలికి వెళ్లొద్దు’.. ఫిఫాకు ట్రంప్‌ వార్నింగ్‌! | Trump Warning FIFA-Will-Face-Consequences-Try-Replace-Gianni-Infantino | Sakshi
Sakshi News home page

‘అతడి జోలికి వెళ్లొద్దు’.. ఫిఫాకు ట్రంప్‌ వార్నింగ్‌!

Aug 11 2026 11:32 AM | Updated on Aug 11 2026 12:32 PM

Trump Warning FIFA-Will-Face-Consequences-Try-Replace-Gianni-Infantino

Photo Credit: Twitter

ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్య‌క్షుడు గియాని ఇన్ఫాంటినో ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని ఒత్తిళ్లు పెరుగుతున్న నేప‌థ్యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం ఆస‌క్తి క‌లిగిస్తోంది. ఇన్ఫాంటియానోను ప‌దవి నుంచి త‌ప్పించాల‌ని ప్ర‌పంచ ఫుట్‌బాల్ నియంత్ర‌ణ సంస్థ నిర్ణ‌యం తీసుకుంటే అంత‌కంటే పెద్ద పొర‌పాటు ఇంకేమి ఉండ‌ద‌ని త‌న సోష‌ల్ మీడియా ట్రూత్ సోష‌ల్‌లో ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఫిఫా వరల్డ్ కప్ వంటి ప్రపంచ స్థాయి టోర్నమెంట్‌ల వాణిజ్య హక్కులను నిర్వహించేందుకు 20 బిలియన్ డాలర్ల విలువైన ఒక కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని ఫిఫా యోచిస్తోంది. ఇందులో 20 శాతం వాటాను ప్రైవేట్ పెట్టుబడిదారులకు విక్రయించాలని ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో ప్రతిపాదించారు. 

అయితే ఈ ప్రతిపాదనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రణాళికను విరమించుకునేంత వరకు ‘ఫిఫా’ అన్నీ టోర్నమెంట్‌లను బహిష్కరించనున్నట్లు యూరోపియన్‌ సాకర్‌ సంస్థ హెచ్చరించింది.  ఫిఫా అధ్యక్ష పదవి నుంచి కూడా ఇన్ఫాంటినో తప్పుకోవాలనే డిమాండ్లు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ అతడికి మద్దతు పలకడం గమనార్హం.

ఇక ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ట్రూత్‌ సోషల్‌లో ఇలా రాసుకొచ్చారు. "ఏ కారణం చేతనైనా, అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినోను తొలగించాలని ఫీఫా కనీసం ఆలోచించినా అది ఒక ఘోరమైన పొరపాటే అవుతుంది. ఆయన అద్భుతమైన వ్యక్తి. ఇప్పటివరకు నిర్వహించిన ప్రపంచ కప్‌లలోకెల్లా అత్యంత విజయవంతమైన దానిని నాలుగుసార్లు నిర్వహించారు. ఆయన లేకపోయుంటే ఇంత లాభదాయకంగా ఉండేది కాదేమో! ఈ విషయంపై శ్రద్ధ వహించినందుకు ధన్యవాదాలు’’ అని  ట్రంప్ పేర్కొన్నారు.

2016 నుంచి గియాని ఇన్‌ఫాంటినో ఫిఫా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 2019, 2023 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన... వచ్చే ఏడాది మార్చిలో మొరాకో వేదికగా జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో చివరిసారి పోటీ చేయనున్నారు. ‘ఫిఫా’లో మొత్తం 211 సభ్య దేశాలు ఉండగా... యూరప్, దక్షిణామెరికాలోని 90 దేశాలతో పాటు ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్యలోని 46 దేశాలు కూడా ఇన్‌ఫాంటినో ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది.

Read: ఆ ముగ్గురి నుంచి ఫోన్‌కాల్‌.. అందరికీ ఒకటే సమాధానం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement