సాక్షి, హైదరాబాద్: డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిపార్ట్‌మెంట్‌లో నలుగురు అధికారుల తీరు సరిగ్గా లేదన్నారు. ఇదివరకే చాలాసార్లు చెప్పి చూశామన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీజీపీ వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రకంపనలు మెుదలయ్యాయి. సీవీ ఆనంద్ ఏ అధికారులను ఉద్దేశించి ఈ బహిరంగ హెచ్చరికలు చేశారా అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.


