ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చింది. ఈ స్లీపర్ టూరిస్ట్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మంటలు చెలరేగడానికి ముందే కాలిపోతున్న వాసన వస్తోందని పదే పదే హెచ్చిరించినా వినకుండా డ్రైవర్, కండక్టర్ నిర్లక్ష్య ధోరణే ఈ ఘోర విషాదానికి దారి తీసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఢిల్లీ నుండి ఉత్తరప్రదేశ్‌లోని మహోబా వెళ్తున్న ఈ బస్సులో ఏదో కాలుతున్న వాసన వస్తున్నట్టు ప్రయాణీకులు బస్సు డ్రైవర్, కండక్టర్‌కి చెప్పారు. బస్సులో ప్రయాణిస్తున్న సునీల్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏదో కాలుతున్న వాసన వస్తోందని ప్రయాణికులు పదేపదే హెచ్చరించినప్పటికీ వాటిని పట్టించుకోలేదు. అంతేకాకుండా, డ్రైవర్,కండక్టర్ క్యాబిన్‌లో సిగరెట్లు తాగడం కొనసాగించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే, డ్రైవర్ సీటు సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు కేకలు వేస్తూ బస్సును ఆపమని డ్రైవర్‌ను కోరారు. అయితే, డ్రైవర్ , కండక్టర్ తమలో తాము నవ్వుకుంటూ, ప్రయాణికుల విజ్ఞప్తులను తిరస్కరించి, బస్సు ఆపడానికి నిరాకరించారని ఎఫ్‌ఐఆర్ నమోదైంది. "మీరు చచ్చిపోయినా పర్వాలేదు, నేను బస్సు ఆపను" అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. మంటలు చెలరేగిన తర్వాత డ్రైవర్, కండక్టర్ పరారయ్యారు.అనంతరం బస్సు డ్రైవర్, కండక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అంతేకాదు ఈ ఘటన తరువాత మరో షాకింగ్ విషయం కూడా వెలుగు చేసింది. ఆ బస్సుపై పలు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 60కి పైగా చలాన్లు ఉన్నట్లు తేలింది. ఇంకా సుమారు రూ. 1.7 లక్షల జరిమానాలు చెల్లించాల్సి ఉంది.
ఇదీ చదవండి: జస్ట్ ఆరేళ్లు, నాలుగే సెకన్లు : ప్రపంచ రికార్డు బ్రేక్!
Greater Noida, Uttar Pradesh: On yamuna expressway double-decker bus fire, Injured woman says, "...I was going to Mahoba because my mother-in-law had passed away. My husband was with me, but I don't know where he is..." pic.twitter.com/jLmcJ2i4Bg
— IANS (@ians_india) September 24, 2026
కాగా బస్సులోని ఎయిర్ కండిషనింగ్ (AC) సిస్టమ్‌లో పేలుడు సంభవించి, ఇంజిన్ లూబ్రికేటింగ్ ఆయిల్‌కు మంటలు అంటుకోవడం వల్ల ఈ ప్రమాదం వేగంగా వ్యాపించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఈ విషాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.
ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేష్ కుమార్ జైలుకెళ్లాల్సిందే : సంజయ్ రౌత్ ఆగ్రహం


