తిరుమలలో తెలుగు హీరోయిన్ అద్భుతమైన డ్యాన్స్ | Dimple Hayathi Kuchipudi Dance At TTD Brahmotsavam | Sakshi
Sakshi News home page

Dimple Hayathi: నాదనీరాజనంలో టాలీవుడ్ హీరోయిన్ కూచిపూడి డ్యాన్స్

Sep 22 2026 8:51 PM | Updated on Sep 22 2026 8:54 PM

Dimple Hayathi Kuchipudi Dance At TTD Brahmotsavam

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు దర్శించుకుంటూనే ఉంటారు. అయితే తొలిసారి ఓ హీరోయిన్.. అద్భుతమైన కూచిపూడి నృత్యం చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం జరిగిన నాదనీరాజనంలో హీరోయిన్ డింపుల్ హయాతి నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

విజయవాడకు చెందిన డింపుల్.. గల్ఫ్ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత అభినేత్రి 2, గద్దలకొండ గణేశ్, యురేకా, ఖిలాడీ, రామబాణం, దిల్ మార్, భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీస్ చేసింది. అయితే వీటిలో ఏవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు పెద్దగా పేరు రాలేదు. ప్రస్తుతం శర్వానంద్ 'భోగి'లో కీలక పాత్ర చేస్తుంది. సినీ కెరీర్ పక్కనబెడితే ఈమెలో సంప్రదాయ కూచిపూడి కళాకారిణి ఉందనే సంగతి తిరుమల వేదికగా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement