ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ షోలు రద్దు.. రాహుల్‌ కారణమా? | Comedian Pulkit Mani Cancels UP Shows After Sharing Stage With Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ షోలు రద్దు.. రాహుల్‌ కారణమా?

Sep 22 2026 1:36 PM | Updated on Sep 22 2026 1:36 PM

Comedian Pulkit Mani Cancels UP Shows After Sharing Stage With Rahul Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీతో కలిసి వేదిక పంచుకున్న స్టాండప్‌ కమెడియన్‌ పులకిత్‌ మణి.. ఉత్తరప్రదేశ్‌లో జరగాల్సిన తన షోలను రద్దు చేసుకున్నారు. నోయిడా, లక్నో, కాన్పూర్‌లో నిర్వహించాల్సిన కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు.

ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన ‘ఛాత్రోం కీ గూంజ్‌’ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీతో కలిసి పులకిత్‌ మణి వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నేతలను ప్రస్తావిస్తూ హాస్య వ్యాఖ్యలు, మిమిక్రీ చేశారు. ఆ తర్వాత పులకిత్‌ మణి తన నోయిడా షోను అనుకోని పరిస్థితుల కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు.

అయితే లక్నో, కాన్పూర్‌ షోల విషయంలో మాత్రం ఆయన మరో కారణాన్ని వెల్లడించారు. పదేపదే బెదిరింపులు రావడంతో ఆ రెండు కార్యక్రమాలను కూడా రద్దు చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇండోర్‌ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్‌ కేశవన్‌.. కార్యక్రమంలో చేసిన హాస్య ప్రదర్శనపై విమర్శలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి కూడా రాహుల్‌ గాంధీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. పులకిత్‌ మణి ఉత్తరప్రదేశ్‌లో వరుసగా మూడు షోలను రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

ఇదీ చదవండి: రైల్లో తప్పిపోయి.. చాట్‌జీపీటీ సాయంతో ఇంటికి చేరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement