లూసీ చీరలో స్టైలిష్‌గా మృణాల్‌ ఠాకూర్‌..! | Mrunal Thakur Makes A Stylish Airport Appearance In Rs 24,000 Saree | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: లూసీ చీరలో స్టైలిష్‌గా మృణాల్‌ ఠాకూర్‌..!

Sep 22 2026 10:49 AM | Updated on Sep 22 2026 10:55 AM

Mrunal Thakur Makes A Stylish Airport Appearance In Rs 24,000 Saree

బాలీవుడ్‌ నటి మృణాల్‌ ఠాకూర్‌ తన విలక్షణమైన నటనతో అశేష అభిమానులను సంపాదించుకుంది. కుందనపు బొమ్మలా ఉండే మృణాల్‌ తనదైన ఫ్యాషన్‌తో అభిమానులను అలరిస్తుంటుందామె. సందర్భానుసారం కాకుండా విభిన్నంగా ఫ్యాషన్‌ని ఎంచుకుని ఇలా కూడా స్టైలిష్‌గా కనిపించొచ్చు అని చెబుతుంది తన లుక్‌తో. ఈసారి ఏకంగా మృణాల్‌ ఎయిర్‌పోర్ట్‌లో రెగ్యులర్‌ చుడీదార్‌ లేక జీన్స్‌, ఫార్మల్‌ ‍డ్రెస్‌లో కాకుండా సంప్రదాయ ఫ్యాషన్‌తో భలే ట్విస్ట్‌ ఇచ్చింది చూపురలకు. ఆమె ఎయిర్‌పోర్టుకే వచ్చిందా?  లేక మరిచి ఇటు వచ్చిందా అన్నట్లుగా సంప్రదాయ చీరలో మెరిసింది. 

ఆమె ప్రియాంక గుప్తా సమ్మర్‌ కలెక్షన్‌కు చెందిన లూసీ చీరను ఎంచుకుంది. ఆరుగజాల మింట్‌ గ్రీన్‌, ఐవరీ బ్లష్‌ పింక్‌ రంగులు కలియికతో ఉన్న చీరలో ఆకర్షణీయంగా కనిపించింది. ఈ చీర గింగం శైలి చెక్స్‌తో డిజైన్‌ చేశారు. పూల అంచులు, సున్నితమైన లేస్‌ ట్రిమ్‌ ఈ చీరను మరింత అందంగా కనిపించేలా చేశాయ్‌. ఆ చీరలోని సున్నితమైన వివరాలు తోపాటు దానికి జతగా సరిపోయే బ్లౌజ్‌ ఆ అందమైన శారీ రూపాన్ని పూర్తి చేసింది. ఇక ఈ బ్లౌజ్‌ వెనుక ఓపెన్‌ బ్యాక్‌, టై అప్‌ స్ట్రింగ్స్‌ ఉన్నాయి. ఈ డిజైన్‌ ముందు నుంచి చూస్తే..సూక్ష్మంగా, వెనుక నుంచి మొత్తం రూపాన్నే మార్చేస్తోంది. 

ఈ అందమైన శారీ ధర వచ్చేసి అక్షరాలు రూ. 24000/- ఈ చీరకు అనుగుణంగా  డియోర్ రాఫియా లేడీ డియోర్ బ్యాగ్ ఒక విలాసవంతమైన లుక్‌ని అందించింది. చేతితో డిజైన్‌ చేసిన బ్యాగ్‌ ఇది. దీనికి సిగ్నేచర్‌ బ్రాండెడ్‌ చార్మ్స్‌ అలంకరించి ఉన్నాయి. మేకప్‌కి అంతగా ప్రాధాన్యం ఇవ్వకుండా సహజంగా కనిపించేలా కాజల్‌తో అందంగా తీర్చిదిద్దిన కళ్లతో ప్రకాశవంతంగా కనిపించింది. అంతేగాదు మృణాల్‌ ఆభరణాలతో పనిలేదు అని చెప్పేలా స్టన్నింగ్‌ లుక్‌తో కట్టిపడేసింది చూపురులను.

(చదవండి: నీతా అంబానీ ధరించి నెక్లెస్‌లో స్పెషాల్టీ ఇదే..! డిజైనింగ్‌కే మూడున్నర ఏళ్లు..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement