మన చేనేతల వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చీర అయినా, డ్రెస్ అయినా నేతకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న డిజైన్స్ ప్రత్యేకంగా కనువిందు చేస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు నేత చీరలు, డ్రెస్సులు పాతబడినా వాటి డిజైన్స్, జరీ జిలుగులు దూరం చేసుకోవాలనిపించదు. అలాంటప్పుడు వాటిని వివిధ రకాలుగా, తిరిగి వాడుకునేలా ఉపయోగించవచ్చు. మన చేతులతో నచ్చిన చేనేతల డిజైన్స్‌కు సరికొత్త అలంకారం తీసుకురావచ్చు.
పాత చేనేత చీరలపైన ఉండే ఒరిజనల్ జరీ అంచులు, మోటిఫ్స్, నేతలో ఉండే డిజైన్స్ ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని తీసుకొని, లేస్‌తో జత చేసి, కుషన్ కవర్స్‌గా డిజైన్ చేయవచ్చు. పండగ వంటి ప్రత్యేక రోజుల్లో సంప్రదాయం ఉట్టిపడేలా లివింగ్ రూమ్ ఆకర్షణకు వీటిని ఉపయోగించవచ్చు. ఉపయోగించని పాత, చిరిగిన కాటన్ చేనేతలను తీసుకొని బాగున్న క్లాత్‌ను కట్ చేసి, విడిగా పెట్టాలి. వాటన్నింటిని ప్యాచ్ వర్క్ చేసి, క్విల్ట్‌ను రూ పొందించవచ్చు. ఈ క్రియేటివ్ క్విల్ట్ మెత్తగా, ఆకర్షణీయంగా వెలకట్టలేని జ్ఞాపకంగానూ మిమ్మల్ని మరింతగా ఆకట్టుకుంటుంది.
ఇదీ చదవండి:
చేనేత చీరల అంచులను టేబుల్ రన్నర్‌కి ఉపయోగించవచ్చు. సంప్రదాయ మోటిఫ్స్, సెంటర్ డిజైన్స్‌తో టేబుల్‌వేర్‌ని రూపొందించవచ్చు.
- పాత చేనేత చీరలు, దుపట్టాల పల్లూ డిజైన్స్‌తో చిన్న చిన్న అందమైన పాట్లి బ్యాగులు, క్లచ్‌లు, ల్యాప్‌టాప్ బ్యాగులు, పర్సులు రూ పొందించుకోవచ్చు. డ్రెస్‌కు తగిన మ్యాచింగ్ పర్స్ లేదా ΄పాట్లి బ్యాగులు వెంట తీసుకెళ్లడం ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది.
- మీ దగ్గర ఉన్న, వాడని చేనేతల్లోని బాగా ఆకట్టుకునే డిజైన్‌ని తీసుకొని దానిని అందమైన ఫ్రేమ్ వర్క్ చేయవచ్చు. హ్యాండ్లూమ్ డిజైన్ ఫ్రేమ్స్ ఇంటికి జీవకళను తీసుకువస్తాయి.
- పాత చేనేతల నుంచి బాగున్న క్లాత్‌ను వేరు చేసి, టైలర్‌తో ఈ కాలానికి అనుగుణమైన డిజైన్స్ అంటే షర్ట్, స్కర్ట్, జాకెట్, కో–ఆర్డ్ సెట్, దుపట్టా, ప్రత్యేకమైన టాప్.. ఇలా మరోవిధంగా రూ΄÷ందించుకొని ధరించవచ్చు. ప్రత్యేకతను చాటుకోవచ్చు.
- పాత చేనేతలను మరోవిధమైన డ్రెస్ లేదా ఫ్రేమ్స్.. వంటివి డిజైన్ చేసినప్పుడు చిన్న చిన్న క్లాత్ ముక్కలు మిగిలిపోతాయి. ఇలాంటి వాటిని పడేయకుండా నోట్‌బుక్ ఫ్యాబ్రిక్ కవర్లు, సంచులు, బుక్‌మార్క్స్, ఇతర ఉపయోగపడే డిజైన్స్‌ను రూపొందించుకోవచ్చు.
- జీవన విధానంలో సస్టెయినబిలిటీని ఎంతగా ఇముడ్చుకుంటే ప్రకృతి అంతగా మనతో మమేకం అవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ అలంకార వస్తువులను తయారుచేయడంలోనే కాదు, వీటి ద్వారా కొత్త ఆదాయమార్గాలనూ కనిపెట్టవచ్చు. ఇందుకు ఆన్‌లైన్–ఆఫ్‌లైన్ మార్కెట్ మనకు అందుబాటులో ఉంది.


