నీళ్లు చల్లడమెందుకు..సూపర్‌మార్కెట్‌కు వెళ్లినప్పుడు కూరగాయలు, ఆకుకూరలపై నీటి తుంపర్లు కనిపిస్తుంటాయి. అవి తాజాగా కనిపించేందుకు మాత్రమే ఇలా చేస్తున్నారని అనుకుంటాం. కానీ దీని వెనుక మరో కారణం కూడా ఉంది. కూరగాయలు కోసిన తర్వాత సమయం గడిచేకొద్దీ వాటిలోని నీరు ఆవిరైపోతుంది.
దాంతో ఆకుకూరలు, కొన్ని కూరగాయలు వాడిపోయినట్లు కనిపిస్తాయి. వాటిపై కొద్దిగా నీటిని చల్లడం వల్ల అవి తేమను కోల్పోకుండా చేసి, తాజాగా ఆకర్షణీయంగా కనిపించేలా చేయవచ్చు. అయితే నీళ్లు చల్లినంత మాత్రాన కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయని కాదు. అధిక తేమ, సరైన నిల్వ లేకపోవడం వల్ల కొన్ని కూరగాయలు త్వరగా పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కూరగాయలు కొనేటప్పుడు కేవలం మెరుపు, తేమ చూసి కాకుండా రంగు, వాసన, గట్టితనం, తాజాదనం కూడా గమనించడం మంచిది.
ఇవీ చదవండి: వ్యాయామం చేస్తే డబ్బులు.. ఉద్యోగులకు కంపెనీ అదిరే ఆఫర్!


