ఇక మీరు ఫోన్‌ ఎత్తొద్దు.. మీ వాయిస్‌తో ఏఐనే మాట్లాడుతుంది! | AI Call Assistant Answers Phone Calls In Your Voice | Sakshi
Sakshi News home page

ఇక మీరు ఫోన్‌ ఎత్తొద్దు.. మీ వాయిస్‌తో ఏఐనే మాట్లాడుతుంది!

Sep 19 2026 10:35 AM | Updated on Sep 19 2026 10:43 AM

AI Call Assistant Answers Phone Calls In Your Voice

హలో.. ఎవరు మాట్లాడుతున్నారు? అంటూ ఏఐ ఆరా

మీ గొంతుతోనే సమాధానం.. సరికొత్త టెక్నాలజీ

స్పామ్‌ కాల్స్‌కు స్వస్తి.. ముఖ్యమైన కాల్స్‌కు మాత్రమే లైన్‌

గూగుల్‌ నుంచి ట్రూకాలర్‌ వరకు పోటాపోటీ ఫీచర్లు

ఫోన్‌ మోగుతోంది.. మీరు మీటింగ్‌లో ఉన్నారు, బైక్‌ నడుపుతున్నారు, వంట చేస్తున్నారు. లిఫ్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. మీకు బదులు ఏఐనే ‘హలో.. ఎవరు మాట్లాడుతున్నారు?’అంటూ ఆన్సర్‌ చేస్తుంది. అవతలి వ్యక్తి ఎవరో, ఎందుకు కాల్‌ చేశారో లైవ్‌లో టైప్‌ చేసి మీ స్క్రీన్‌పై చూపిస్తుంది. ముఖ్యమైన కాల్‌ అయితేనే మీరు లైన్లోకి వెళ్తారు. లేకపోతే ఏఐనే కట్‌ చేస్తుంది. వినడానికి సినిమాలా ఉంది కదా? కానీ ఇది 100% నిజం. ఈ టెక్నాలజీ ఇప్పుడు ఇండియాలోకి వచ్చేసింది.

ఇది ఎలా పనిచేస్తుందంటే, మీ ఫోన్‌లో కాల్‌ ఫార్వార్డింగ్‌ ఆన్‌చేయగానే మీకు వచ్చే కాల్స్‌ నేరుగా క్లౌడ్‌ సర్వర్‌కు వెళ్తాయి. అక్కడ ఏఐ డిజిటల్‌ రిసెప్షనిస్ట్‌లా పనిచేస్తుంది. అవతలి వ్యక్తితో మాట్లాడి ‘మీ పేరేంటి, ఎందుకు కాల్‌ చేశారు?‘అని ఆరా తీస్తుంది. ఆ సంభాషణ అంతా లైవ్‌ ట్రాన్స్‌ క్రిప్ట్‌ రూపంలో మీ యాప్‌లో కనిపిస్తుంది. మీకు కావాలంటే మధ్యలోనే ‘నేను మాట్లాడతా‘అని జాయిన్‌ కావచ్చు, లేదా ‘తర్వాత చేయండి‘అని ఏఐతోనే చెప్పించవచ్చు.

ఇందులోనే అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఫీచర్‌.. పర్సనల్‌ వాయిస్‌. మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ ఏఐ స్పీచ్‌ టెక్నాలజీతో మీ గొంతును కొన్ని సెకన్లు రికార్డ్‌ చేస్తే చాలు, మీ గొంతుతోనే ఏఐ అవతలి వారికి సమాధానం ఇస్తుంది. అయితే దుర్వినియోగం కాకుండా ఇది ఏఐ వాయిస్‌ అని అవతలి వారికి ముందే చెబుతుంది, వాటర్‌ మార్క్‌ కూడా ఉంటుంది. అచ్చం మీరే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.

స్పామ్‌ కాల్స్‌కు స్వస్తి 
రోజుకు 10–15 స్పామ్, లోన్, జాబ్‌ కాల్స్‌తో విసిగిపోయిన వారికి ఇది పెద్ద రిలీఫ్‌. ఏఐ కాలర్‌ ఉద్దేశాన్ని గ్రహించి స్పామ్‌ అని తేలితే ఆటోమేటిక్‌గా కట్‌ చేస్తుంది, బ్లాక్‌లిస్ట్‌లో వేస్తుంది. ముఖ్యమైన కాల్స్‌ మాత్రమే మీ వరకు వస్తాయి. డెలివరీ బాయ్, ఇంటర్వ్యూ కాల్స్‌ వంటివి మిస్‌ అయ్యే బాధ ఉండదు.

  • గూగుల్‌ నుంచి ట్రూకాలర్‌ వరకు పోటాపోటీ ఫీచర్లు ఈ రేసులో ప్రస్తుతం రెండు పెద్ద ప్లేయర్లు ఉన్నారు.

  • గూగుల్‌ కాల్‌ స్క్రీన్‌:

పిక్సెల్‌ ఫోన్లలో చాలా ఏళ్ల క్రితమే వచ్చిన ఫీచర్‌ ఇది. గూగుల్‌ అసిస్టెంట్‌ ఆన్సర్‌ చేసి స్క్రీన్‌పై లైవ్‌ ట్రాన్స్‌ క్రిప్ట్‌ చూపిస్తుంది. ఆన్‌–డివైస్‌ ఏఐతో పనిచేయడం వల్ల ప్రైవసీకి ఢోకా తక్కువ. పిక్సెల్‌ 9 సిరీస్‌లో స్కామ్‌ డిటెక్షన్‌ కూడా వచ్చింది. 
ట్రూకాలర్‌ అసిస్టెంట్‌: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నది ఇదే. స్వీడన్‌ కంపెనీ ట్రూకాలర్‌ తీసుకొచ్చింది. ఇంగ్లి‹Ù, హిందీ, హింగ్లి‹Ùలో ప్రస్తుతం అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్‌ త్వరలో రానుంది.

జాగ్రత్త తప్పనిసరి..
ఉపయోగం ఉన్నా రిస్క్‌ కూడా ఉంది. మీ కాల్స్‌ అన్నీ థర్డ్‌ పార్టీ సర్వర్‌లోకి వెళ్తాయి. రికార్డింగ్‌లు కొన్ని రోజులు స్టోర్‌ అవుతాయి. వాయిస్‌ క్లోనింగ్‌ టెక్నాలజీని సైబర్‌ నేరగాళ్లు కూడా వాడుతున్నారు. అందుకే ట్రూకాలర్‌ ‘ఏఐ కాల్‌ స్కానర్‌’ఫీచర్‌ తెచ్చింది, అవతలి గొంతు మనిíÙదా, ఏఐదా అని గుర్తిస్తుంది. వాట్సాప్‌లో వచ్చే నకిలీ ‘ఏఐ కాల్‌ ఆన్సర్‌ యాప్‌’లింకులను నమ్మవద్దు. అధికారిక ప్లే స్టోర్‌ నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోండి. యాప్‌ పరి్మషన్‌ సరిగా చూసుకోండని సైబర్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: చిన్న నగరాల్లో ఇళ్ల ధరలకు రెక్కలు.. మెట్రో సిటీలను మించి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement