ఎన్నాళ్లైనా ఎదగని పిల్లి.. పులిలా ఉందేంటి? | Scientists Discover A New Wild Cat Species In Bolivia Forests After More Than 100 Years, Check More Details | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లైనా ఎదగని పిల్లి.. పులిలా ఉందేంటి?

Sep 19 2026 8:16 AM | Updated on Sep 19 2026 9:26 AM

New cat species discovered in Bolivia is incredibly tiny

బొలీవియా: దక్షిణ అమెరికా దేశమైన బొలీవియా అడవుల్లో శాస్త్రవేత్తలు వందేళ్ల తర్వాత ఓ సరికొత్త పిల్లి జాతిని కనుగొన్నారు. దీనికి 'లియోపార్డస్ తిల్కాయో' (తిల్కాయో టైగర్ క్యాట్) అని నామకరణం చేశారు. స్థానికంగా 'టిగ్రినో' అని పిలిచే పదేళ్ల ఈ జీవిని అడవిలో మొదటిసారి చూసినప్పుడు, ఒక సాధారణ పెంపుడు పిల్లి పిల్లగా భావించారు.

అయితే ఏళ్లు గడుస్తున్నా అది ఎదుగుదల లేకుండా చిన్నగానే ఉండటం, ఒంటిపై చిరుతను పోలిన మచ్చలు, గుండ్రటి చెవులు కలిగి ఉండటం పరిశోధకుల దృష్టిని ఆకర్షించింది. లా పాజ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీనిపై ప్రత్యేకంగా డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా, ఇది ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని సరికొత్త టైగర్ క్యాట్ జాతి అని తేలింది.

ఆండీస్ పర్వతాలు, అమెజాన్ బేసిన్ కలిసే యుంగాస్ ప్రాంతంలో జీవించే ఈ అరుదైన జీవి ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు 'కరెంట్ బయాలజీ' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇలాంటి అడవి పిల్లుల సంరక్షణకు, ఇంకా వెలుగుచూడని జీవవైవిధ్యాన్ని గుర్తించడానికి ఈ పరిశోధన ఎంతో కీలకంగా మారనుంది.

ఇదీ చదవండి: మీడియాపై ట్రంప్ ప్రతాపం.. ఆ దిగ్గజ సంస్థలకు నో ఎంట్రీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement