పాము–ముంగిసల పోరాటాలు తరచూ కనిపిస్తుంటాయి. కానీ ఓ చిన్న పిల్లి ఏకంగా కింగ్ కోబ్రానే వెనక్కి తగ్గేలా చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పడగ విప్పి దాడికి దిగిన కింగ్ కోబ్రాను పిల్లి చాకచక్యంగా ఎదుర్కొన్న వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.
'ఘర్ కే కలేష్' అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోలో ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కింగ్ కోబ్రా, చిన్న పిల్లి ఎదురెదురుగా నిలుస్తాయి. పిల్లిని గమనించిన వెంటనే కింగ్ కోబ్రా పడగ విప్పి దాడికి సిద్ధమవుతుంది. అయితే సాధారణంగా జరిగేదానికి భిన్నంగా పిల్లి ఏమాత్రం భయపడకుండా పాము ముందే ధైర్యంగా నిలబడుతుంది.
Kalesh b/w Cat and Snake
Cat Survives a Face Off With a Striking Cobra pic.twitter.com/3HAHwcHrLp— Ghar Ke Kalesh (@gharkekalesh) July 21, 2026
ఒక్కసారిగా కోబ్రా కాటు వేయడానికి ముందుకు దూసుకురాగా, పిల్లి మెరుపు వేగంతో తప్పించుకుని వెంటనే తన పంజాతో ఎదురుదాడి చేస్తుంది. పిల్లి చూపిన చురుకుదనం, ధైర్యానికి కింగ్ కోబ్రా కూడా వెనక్కి తగ్గి అక్కడి నుంచి మెల్లగా వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తుంది.
ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోకు 48 వేలకుపైగా వీక్షణలు లభించగా, పిల్లి ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ విభిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు.


