breaking news
-
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విటర్ రివ్యూ
తమిళ స్టార్ హీరో సూర్య.. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీతో కలిసి చేసిన సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. మమిత బైజు హీరోయిన్ కాగా రాధిక, రవీనా టండన్ కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ సంగీతమందించాడు. నేడు(ఆగస్టు 14) తెలుగు, తమిళంలో రిలీజైన ఈ సినిమా గురించి ట్విటర్ టాక్ ఏంటి? ఆడియెన్స్ ఏమంటున్నారు?(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా)45 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడటం అనే కథాంశంతో ఈ సినిమా తీశారు. ఇందులో సూర్య.. ఒలింపిక్ షూటర్ పాత్రలో కనిపించాడు. 20 ఏళ్ల చలాకీ అమ్మాయి పాత్రని మమిత బైజు చేసింది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ పర్లేదనిపించాయి.ఇక సినిమా విషయానికొస్తే కొందరికి బాగా నచ్చేసింది. ఆ మేరకు ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఫస్టాప్ బాగుందని, సెకండాఫ్ తేలిపోయిందని అంటున్నారు. ఇంటర్వెల్ తర్వాత మెలోడ్రామా ఎక్కువైందని, క్లైమాక్స్ ఇంకా బాగా తీసి ఉండొచ్చని రాసుకొస్తున్నారు. ఓవరాల్‌గా డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. మరికొందరు మాత్రం తమకు ఒక్క సీన్ కూడా నచ్చలేదని అంటున్నారు.(ఇదీ చదవండి: 'అగధ' మూవీ రివ్యూ)#VishwanathAndSons – One of the BEST FAMILY ENTERTAINERS in Recent Times…!!This one is a breezy, light hearted family entertainer from #Suriya and Director #VenkyAtluri.The lead performances and writing are the biggest strengths of the film.Don’t expect a #LuckyBhaskar kind…— Rangasthalam (@RangasthalamIN) August 14, 2026Disaster Review for #VishwanathAndSons 💔Weakest Movie from #VenkyAtluri #VishwanathAndSons pic.twitter.com/HUfsTQhJCr— 𝗕𝗵𝗮𝗿𝗮𝗻𝗶🥃🎲 (@Anirudhoff_) August 14, 2026#VishwanathAndSons Review: “A Decent Family Entertainer”👉Rating : 2.75/5Positives:⁰👉#Suriya performance⁰👉#MamithaBaiju & Radhika are well cast⁰👉Venky Atluri’s dialogues work well⁰👉A few good emotional momentsNegatives:⁰👉Uneven 2nd half⁰👉Some subplots don’t work…— PaniPuri (@THEPANIPURI) August 14, 2026🔥 #VishwanathAndSons — OVERALL REVIEW 🔥When the story was leaked and the trailer dropped, I was worried that the film might have nothing more to offer. But the 2nd half has a major surprise that wasn’t revealed in any publicity material! 🔥The director shows two sides of… pic.twitter.com/JizKxv2OBu— Kollywood Wire (@KollywoodWire) August 14, 2026#VishwanathAndSons - VATCHABLE ONES!Good 1st Hlf & Avg 2nd Half.OKayish Feel Good Family Entertainer!— Christopher Kanagaraj (@Chrissuccess) August 14, 2026#VishwanathAndSons First half - Excellent 👌- Took 15 Mins to setup the plot and Conflict !!- Once #MamithaBaiju entered, the film took off and totally entered into the fun mode. Mamitha & her mannerisms was super cute🥰😀 - #Suriya's Screen presence and performance was… pic.twitter.com/A4x9vB0HPn— AmuthaBharathi (@CinemaWithAB) August 14, 2026#VishwanathAndSons A Watchable, Clean Family Entertainer With a Good 1st Half but a Weak 2nd Half!After a slow start, the first half feels refreshing and stays focused on the core plot with a good mix of fun and emotion. Just when you expect that flow to continue, the second…— Venky Reviews (@venkyreviews) August 14, 2026 -
ఓటర్ ఐడీ తొలగింపుపై ప్రకాశ్‌రాజ్ స్పందన ఇదే..!
సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ మరోసారి ఓటరు జాబితా అంశంపై స్పందించారు. కొత్త ఓటరు గుర్తింపు కార్డు కోసం తాను ఫారమ్-6 దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని తాను సోషల్‌మీడియాలో ప్రస్తావించిన కొద్ది గంటల్లోనే అది లక్షలాది మందికి చేరిందని పేర్కొన్నారు.‘నేను నా వృత్తి కారణంగా సెలబ్రిటీని కావొచ్చు. కానీ ముందుగా ఓ పౌరుడిని. ప్రతి పౌరుడితో నాకు సమాన హక్కులు ఉన్నాయి. ఇది ఒక వ్యక్తి గురించి కాదు.. పౌరుల ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటం’ అని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు.ఓటు హక్కు కోసం ప్రజలు క్యూల్లో నిలబడి వేడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించిన ఆయన.. ‘ ఇదేం రాజకీయం? ఇదేం ఎజెండా?’ అంటూ అధికారులను నిలదీశారు.అధికారులు తనకు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని, దానిని సరిదిద్దుతామని చెప్పారని తెలిపారు. దీనికి సంబంధించిన కాల్ రికార్డులు కూడా తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. అధికారులు మీడియా సమావేశం నిర్వహించి, వెబ్‌సైట్‌లోని వివరాలను మార్చారని ఆరోపించారు. అనంతరం తన పాత చిరునామా వద్దకు బీఎల్వోను పంపించి, పొరుగువారితో మాట్లాడిస్తూ నాటకీయ పరిణామాలను సృష్టించారని విమర్శించారు.Fraand … You can’t abuse the DIGNITY of a CITIZEN #justasking pic.twitter.com/GyUvheAHO5— Prakash Raj (@prakashraaj) August 13, 2026 -
కింగ్ కోబ్రానే గడగడలాడించిన పిల్లి..!
పాము–ముంగిసల పోరాటాలు తరచూ కనిపిస్తుంటాయి. కానీ ఓ చిన్న పిల్లి ఏకంగా కింగ్ కోబ్రానే వెనక్కి తగ్గేలా చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పడగ విప్పి దాడికి దిగిన కింగ్ కోబ్రాను పిల్లి చాకచక్యంగా ఎదుర్కొన్న వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.'ఘర్ కే కలేష్' అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోలో ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కింగ్ కోబ్రా, చిన్న పిల్లి ఎదురెదురుగా నిలుస్తాయి. పిల్లిని గమనించిన వెంటనే కింగ్ కోబ్రా పడగ విప్పి దాడికి సిద్ధమవుతుంది. అయితే సాధారణంగా జరిగేదానికి భిన్నంగా పిల్లి ఏమాత్రం భయపడకుండా పాము ముందే ధైర్యంగా నిలబడుతుంది.Kalesh b/w Cat and Snake Cat Survives a Face Off With a Striking Cobra pic.twitter.com/3HAHwcHrLp— Ghar Ke Kalesh (@gharkekalesh) July 21, 2026ఒక్కసారిగా కోబ్రా కాటు వేయడానికి ముందుకు దూసుకురాగా, పిల్లి మెరుపు వేగంతో తప్పించుకుని వెంటనే తన పంజాతో ఎదురుదాడి చేస్తుంది. పిల్లి చూపిన చురుకుదనం, ధైర్యానికి కింగ్ కోబ్రా కూడా వెనక్కి తగ్గి అక్కడి నుంచి మెల్లగా వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తుంది.ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోకు 48 వేలకుపైగా వీక్షణలు లభించగా, పిల్లి ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ విభిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. -
పీవీ సింధుకు వైఎస్ జగన్ అభినందనలు
జపాన్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత షట్లర్, తెలుగుతేజం పీవీ సింధుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు. జగన్ స్పందిస్తూ.. 'జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్‌గా రికార్డులకెక్కి, తన కెరీర్లో మరో కిరీటాన్ని చేర్చుకున్న సింధుకు అభినందనలు. మీ ప్రదర్శన భారతదేశానికి గర్వకారణం. భవిష్యత్తులో సింధు మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా' అని ట్వీట్ చేశారు.జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నీ విజేతగా పీవీ సింధు నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-17, 21-17తో అకానె యమగూచిపై రెండు వరుస గేముల్లో విజయం సాధించింది. కాగా సింధుకు ఇదే తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. సింధుకు ఇదే తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కాగా భారత్ తరఫున జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి క్రీడాకారిణిగా ఆమె రికార్డులకెక్కింది. కొంతకాలంగా సరైన ఫామ్‌లేమితో సతమతమవుతున్న సింధు 19 నెలల తర్వాత ఒక మేజర్ టోర్నీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.Congratulations to PV Sindhu on adding one more crown to her illustrious career by becoming the first Indian woman shuttler to win the Japan Open title. A proud moment for India. Wishing her many more glorious victories ahead.@Pvsindhu1— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2026 -
సమంత మా ఇంటి బంగారం.. ఆడియన్స్ రివ్యూ
టాలీవుడ్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో వచ్చిన సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమా ఇవాళే థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే ప్రీమియర్స్ ప్రదర్శించడంతో ఆడియన్స్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సమంత మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఫస్ట్ హాఫ్ తొలి గంట అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇది మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అదిరిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటంర్వెల్ ట్విస్ట్ క్రేజీగా ఉందంటున్నారు. ఈ సారి సమంత యాక్షన్‌తో అదరగొట్టేసిందని ట్విటర్ వేదికగా ప్రశంసిస్తున్నారు. #MaaIntiBangaaram Premier review from 🇬🇧🇬🇧🇬🇧First half:@Samanthaprabhu2 nailed it 🔥🔥🔥Bgm 🔥🔥🔥Story plot is nice and solid base for second halfSimply a good first half with decent start and ended interval with crazy twist.Waiting for second half @PrathyangiraUS pic.twitter.com/FmkOFHZDtQ— UK X roads (@UKTFI) June 18, 2026 #MAAiNTiBangaaram is a MEE INTLO vallatho happy ga velli chudachu type of film ❤️ An Engaging Entertainer with Goof action blocks and brilliant score 👌 @Samanthaprabhu2 truly deserves the lady Super Star tag. She literally made a Big BANG with this Bangaram 🔥 pic.twitter.com/Pr8nXDQTqn— Dileep Kumar Kandula (@TheLeapKandula) June 18, 2026 #MaaIntiBangaaram | Interval Samantha, Friend Character, Temple Seq, Pre Interval Fyt, Cooking Comedy 👍Its pretty Good so far!— Christopher Kanagaraj (@Chrissuccess) June 18, 2026 #MaaIntiBangaaram review 🇬🇧🇬🇧 is complete family entertainer blended with mass elements.@Samanthaprabhu2 esari mamuluga ledu uthiki aresindi 🔥🔥🔥Pre interval to climax 🔥🔥🔥A good movie I'm theaters after long time.Overall: 3/5 A blockbuster bomma from @rajndk team. pic.twitter.com/AXbiZu6YpR— UK X roads (@UKTFI) June 18, 2026 Unexpected banger 💥 from #samanthaBest film so far from Tollywood in this year 🔥 ⭐️ ⭐️ ⭐️ ⭐️ Summer winner sammmmmmm @Samanthaprabhu2 #maaintibangaaram #samantharuthprabhu #tollywood #telugu #telugufilm #vennelakishore #sreemukhi #london #maaintibangaram pic.twitter.com/kPnvRE4Kts— Jaswanth (@alwayssJaswanth) June 18, 2026 -
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు ట్విట్టర్లో సెకండ్ ప్లేస్
-
సక్సెస్ నేర్పారు.. ఓకే! ‘సంతోషం’పై శిక్షణ ఏది?
ఐఐటీ ఢిల్లీ నుంచి ఐఐఎం బెంగళూరు దాకా, అక్కడి నుంచి ఐఏఎస్ దాకా సాగిన ప్రయాణంలో దివ్య మిట్టల్ ఎన్నో నేర్చారు. ఆ తర్ఫీదులో ఇన్ని నేర్పినా, వృత్తి సవాళ్లను ఎదుర్కొనడం నేర్పించినా ‘మనసును ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలో, ఒంటరితనాన్ని ఎలా తట్టుకోవాలో, ఆనందంగా ఎలా ఉండాలో నేర్పించలేదు’ అంటున్నారామె. ఆమె ‘ఎక్స్’ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఎంతో ఆసక్తికరమైన చర్చను లేవదీశాయి. ‘ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరు నుంచి ఐఏఎస్ వరకు దేశంలో అత్యుత్తమ విద్యను అభ్యసించే అవకాశం నాకు దక్కింది. కఠినమైన పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో, పెద్ద బాధ్యతలను ఎలా భుజాలపై మోయాలో ఆ విద్య నేర్పింది. కానీ అది నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ఎలాగో, ఆనందంగా ఎలా ఉండాలో, ఒంటరితనాన్ని తట్టుకోవడం ఎలాగో మాత్రం ఎప్పుడూ నేర్పలేదు’ అన్నారు దివ్య మిట్టల్. ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ దివ్య మిట్టల్ ‘ఎక్స్’ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు మన విద్యావ్యవస్థలోని లోటుపై లక్షల మందిని ఆలోచింపజేస్తున్నాయి. ‘మన దేశ విద్యావ్యవస్థ ఏం నేర్పుతోంది? దేనికి దూరమవుతోంది?’ అనే అంశంపై విస్తృత చర్చకు అవి దారి తీశాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘మనం విజయం ఎలా సాధించాలో నేర్చుకోవడానికి ఏళ్లకు ఏళ్లు వెచ్చిస్తాం. కానీ సంతోషంగా ఉండటం ఎలాగో నేర్చుకోవడానికి ఒక్క రోజూ కేటాయించం’ అని ఆమె వ్యాఖ్యానించారు.దివ్య మిట్టల్ కామెంట్స్‌కు వందలాది స్పందనలు వచ్చాయి. మన దేశంలోని స్కూళ్లు, కాలేజీలు మార్కులు, ర్యాంకులు, ప్రవేశ పరీక్షలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని, ఆర్థిక అక్షరాస్యత, భావోద్వేగ ఆరోగ్యం, జీవన నైపుణ్యాలను గాలికి వదిలేస్తున్నాయని నెటిజన్లలో చాలామంది అభి్రపాయపడ్డారు.ఇలా అయితే ఎలా!భావోద్వేగ నియంత్రణ గురించి తన పోస్ట్‌లో దివ్య ప్రస్తావించారు. ‘విద్యార్థులు విద్యాసంబంధమైన భావనలు నేర్చుకుంటున్నారు. కానీ దుఃఖం, ఒత్తిడి, వైఫల్యాన్ని ఎదుర్కోవడం గురించి అరుదుగా నేర్చుకుంటున్నారు. మనం పీరియాడిక్ టేబుల్‌ను కంఠస్థం చేశాం. కానీ విరిగిన హృదయం వెనుక ఉన్న రసాయన శాస్త్రాన్ని ఎవరూ వివరించలేదు’ అని పేర్కొన్నారు. భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి బదులు వాటిని అణచివేయమని విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారని, ఇది భవిష్యత్తులో ఒత్తిడిని ఎదుర్కొనే విధానంపై ప్రభావం చూపుతుందని దివ్య మిట్టల్ అన్నారు. ఒత్తిడిని ఎదుర్కోవడంలో చాలామంది విఫలమవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.అవి ఎందుకు నేర్పడం లేదు?తన వైరల్ పోస్ట్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కూడా దివ్య ప్రస్తావించారు. ‘వ్యాసాలు రాయడం, మార్కులు సంపాదించడం నేర్పిస్తాం. కానీ అసౌకర్యంగా అనిపించినప్పుడు దాన్ని ఎలా వ్యక్తపరచాలి, హద్దులు ఎలా ఏర్పరచుకోవాలి, కష్టంగా ఉన్నప్పుడు ‘కాదు’ అని ఎలా చెప్పాలో నేర్పడం లేదు’ అని ఆమె అన్నారు. విమర్శనాత్మక ఆలోచన, ఆర్థిక అక్షరాస్యత ప్రాధాన్యం గురించి కూడా ఆమె నొక్కి చెప్పారు. ‘పాఠశాలలో ఎక్కువ జవాబులు చెప్పేవాడు గెలుస్తాడు. జీవితంలో ఎక్కువ ప్రశ్నలు వేసేవాడు కాలానికి నిలబడతాడు’ అంటున్న దివ్య మిట్టల్ ఆర్థిక అక్షరాస్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ‘గణితం నేర్చుకోవడానికి వెచ్చించిన సమయం, అనుభవం ఆర్థిక ఒత్తిడిని తట్టుకోవడానికి ఉపయోగపడటం లేదు. అప్పులు, ఖర్చు అలవాట్లపై ఆ పాఠాలు ప్రభావం చూపడం లేదు’ అని ఆమె అభి్రపాయపడ్డారు. ‘మన విద్య డబ్బు సంపాదించడంపైనే దృష్టి పెడుతుంది, దాన్ని నిర్వహించడంపై కాదు’ అని ఆమె సూటిగా చెప్పారు.క్షేత్రస్థాయిలో...‘ఒకరకంగా చెప్పాలంటే ప్రతిభను కూడా అదృష్టంగా పిలవొచ్చు. అయితే మన చేతుల్లో ఉన్నదానిపైనే మనం దృష్టి పెట్టాలి. అదే– కఠోర శ్రమ’ అన్నారు దివ్య మిట్టల్. ఈ చర్చ మన దేశంలోని ‘ఎగ్జామ్ కల్చర్’ను కూడా టచ్ చేసింది. దానిలోని మంచి, చెడులను విశ్లేషించింది. దివ్య మిట్టల్ తన పోస్ట్‌లో ఎన్నో ప్రశ్నలు సంధించారు. వాటికి జవాబులు కొందరు మాత్రమే చెప్పేవి కావు. సోషల్ మీడియాకే పరిమితమైనవీ కావు. క్షేత్రస్థాయిలో చర్చ జరగాల్సినవి. నిర్మాణాత్మక పరిష్కారాలు కనుగొని ప్రవేశ పెట్టాల్సినవి. -
చిరంజీవి ఫొటోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి ఫొటోను ఓ వ్యక్తి ‘ఎక్స్’లో చిరంజీవి అభిమానులు ఆందోళన చెందేవిధంగా పెట్టడమే కాకుండా దానిని తొలగించాలని విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యం వహించిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... గచ్చిబౌలిలో నివసించే గూడెపు భాస్కర్సాయి (22) ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న సూరిబాబు అనే వ్యక్తి ‘ఎక్స్’లో చిరంజీవి ఫొటోను ఆయన మరణించినట్లు భావించే విధంగా పోస్ట్ చేశాడు. ఈ విషయం గమనించిన భాస్కర్ సదరు సూరిబాబుకు ఫోన్ చేసి ఆ ఫొటోను, పోస్ట్‌ను తొలగించాల్సిందిగా కోరాడు. ఇందుకు సూరిబాబు నిరాకరించడమే కాకుండా తాను పెట్టిన పోస్ట్‌ను అలాగే కొనసాగించాడు. ఈ ఫొటోను చూసిన వారు తీవ్ర ఆందోళనకు గురికావడమే కాకుండా చిరు అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. చిరంజీవి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈ పోస్ట్ ఉందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ మేరకు సూరిబాబుపై బీఎన్ఎస్ సెక్షన్ 352 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎక్స్‌లో అశ్లీల కంటెంట్ నిషేధం?
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో అశ్లీల కంటెంట్ లేదా అడల్ట్ కంటెంట్ మీద భారత ప్రభుత్వం పరిమితులు విధించినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎక్స్ యూజర్లు సైతం స్పందిస్తున్నారు.భారత ప్రభుత్వం సాధారణంగా అడల్ట్ కంటెంట్ నిషేధంపై చాలా సీరియస్‌గా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇలాంటి కంటెంట్ అందించే చాలా ప్లాట్‌ఫామ్‌ల మీద కఠిన చర్యలు తీసుకుంది. అయితే ఇప్పుడు ఎక్స్‌కు కూడా పరిమితులు విదించిందా? అనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.భారతదేశంలో ఎక్స్‌లో 18+ కంటెంట్ నిషేధంపై మస్క్ కూడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా యూజర్లు దీనికి సంబంధించిన పోస్టులు చేస్తూనే ఉన్నారు. ఆ పోస్టుల ప్రకారం.. అడల్ట్ కంటెంట్ తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.Elon Musk banned 18+ videos in india.Respect @elonmusk 🫡 pic.twitter.com/QXmRa043nx— Let's X OTT GLOBAL (@LetsXOtt) March 3, 2026Elon Musk banned 18+ content?— Tammubaby (@tammubaby) March 3, 2026How can elon musk ban the porn, damn all my bookmarks are now not showing the content 😭😭— Just Chocolate™ (@LovelyFantasyyy) March 3, 2026 -
ఓ తల్లి మూర్ఖత్వంపై సజ్జనార్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చితో కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఫేమ్ అవడం, వ్యూస్ పిచ్చిలో పడిపోయి.. ఏం చేస్తున్నారో తెలియక కొన్ని పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా ఓ మహిళ తన్న బిడ్డల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. బావిపై నిలుచుని ప్రమాదకరంగా వీడియో తీసింది. ఈ వీడియోపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సీపీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా..‘ఇది సోషల్ మీడియా ఉన్మాదానికి పరాకాష్ట!. కన్న బిడ్డలను బావి అంచున నిలబెట్టి రీల్స్ చేయడం సాహసం కాదు.. అది మూర్ఖత్వం. ఆత్మహత్యా సదృశ్యం. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన పెద్దలే వారిని మృత్యువు అంచున నిలబెట్టడం చూస్తుంటే, సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. సోషల్ మీడియా పిచ్చిని ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఇలాంటి ఉన్మాద చర్యలను ప్రోత్సహించకండి అంటూ హెచ్చరించారు. ఇది సోషల్ మీడియా ఉన్మాదానికి పరాకాష్ట!కన్నబిడ్డలను బావి అంచున నిలబెట్టి రీల్స్ చేయడం సాహసం కాదు.. అది మూర్ఖత్వం. ఆత్మహత్యాసదృశ్యం. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన పెద్దలే వారిని మృత్యువు అంచున నిలబెట్టడం చూస్తుంటే, సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. సోషల్ మీడియా పిచ్చిని… pic.twitter.com/azXf7hZcBz— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 6, 2026 -
అధ్వాన్నంగా అమెరికాలో ఆరోగ్యం : ఎండోస్కోపీ కోసం 6 వారాలు
టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆధీనంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లోని ఒక ప్రధాన ఉద్యోగి ట్వీట్ వైరల్‌గా మారింది. అమెరికాలో H1b ఫీజు పెంపుతో, అమెరిలో వైద్యం అందని ద్రాక్ష మారుతోందని అక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిపుణులైన విదేశీ డాక్టర్లు అందుబాటులో లేని కారణంగా మెడికల్ డెసర్ట్లు ఇంకా పెరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆధీనంలోని ఎక్స్ (ట్విటర్) ప్రొడక్షన్ హెడ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.ఎక్స్ ప్రొడక్షన్ హెడ్ నికితా బియర్ తన ఆరోగ్యం గురించి తన ట్వీట్ ద్వారా ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫ్రైడ్ చికెన్ తింటు న్నప్పుడు తనకు గొంతులో గాయమైందని, దీంతో తాను సరిగ్గా మాట్లాడలేక పోతున్నానని లేదా మింగలేకపోతున్నానని చెప్పారు. వైద్యులు ఎండోస్కోపీ చేయించు కోవాలని సలహా ఇచ్చారట. ఇక్కడే అసలు విషయం గురించి చెప్పారు. ముందు నష్టాన్ని అంచనా వేయడానికి చాలా వారాలు వేచి ఉండాలని తనకు సలహా ఇచ్చారని బియర్ పేర్కొన్నారు.ఎండోస్కోపీ పరీక్షకోసం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా , నాలుగు లేదా ఆరు వారాల తరువాతే మాత్రమే అని చెప్పడంతో షాక్ అవడం అతని వంతైంది. బియర్ ఈ అనుభవాన్ని “కాఫ్కా నవల” ను వర్ణిస్తూ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.అమెరికాలో ఆరోగ్య వ్యవస్థ ఇంత దారుణంగా ఉందా అనేచర్చకు దారి తీసింది.అమెరికన్ హెల్త్‌కేర్ వ్యవస్థకు సంబంధించి అనేకమంది విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నిలిచిపోయిన ఉద్యోగ నియామకాలు, నిపుణుల కొరత, బీమా సంబంధిత ఆంక్షలు, అధిక ఖర్చులపై మాట్లాడారు. వీటి కారణంగానే సాధారణ రోగనిర్ధారణ విధానాలకు కూడా చాలా జాప్యం జరుగుతోందని మండిపడ్డారు.హాయిగా ఇండియా ట్రిప్ వేయండి! మరోవైపు బియర్‌ను భారతదేశంలో చికిత్స పొందాలని , అక్కడ ఆసుపత్రులలో రోగనిర్ధారణ పరీక్షలు చాలా తొందరగా అయిపోతాయని చెప్పారు. ఇండియాకు అలా విమానంలో వెళ్ళండి. గంటలోపే టాప్ డాక్టర్ని కన్సల్ట్ చేసి, ఆరు గంటల్లో ఎండోస్కోపీ లాంటివి పూర్తి చేసుకుని మూడు రోజుల్లో తిరిగి వెళ్లిపోవచ్చు అంటూ మరొకరు సూచించారు. సత్వర చికిత్స కోసం బియర్‌ను దక్షిణ కొరియా, దుబాయ్ లేదా థాయ్‌లాండ్‌కు వెళ్లమని కొంతమంది నెటిజన్లు సలహా ఇచ్చారు.(అనంత్ అంబానీ మరో లగ్జరీ వాచ్, అదిరిపోయే డిజైన్, ధర ఎంత?)వ్యవస్థాపకుడు అమన్ గైరోలా కూడా భారతదేశ వైద్య మౌలిక సదుపాయాలను ప్రశంసిస్తూ వ్యాఖ్యానించారు. "ఇక్కడ అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా మహా అయితే 48 గంటలు పడుతుంది. దేశం అందించే సౌకర్యాలను ప్రజలు ఎప్పుడూ గ్రహించరు. ఇక్కడ కూడా ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి కానీ క్రమంగా మెరుగుపడుతోంది" అని ఆయన రాశారు.ఇదీ చదవండి: H-1B వీసా ఫీజు : లక్షలాది అమెరికన్ల ఆరోగ్యం సంక్షోభంలో! -
ది రాజాసాబ్ ట్విటర్ రివ్యూ.. ఫుల్ జోష్‌లో రెబల్ స్టార్ ఫ్యాన్స్..!
ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ది రాజాసాబ్ వచ్చేశాడు. మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ప్రీమియర్స్‌తో ఫ్యాన్స్ ముందుకొచ్చేశాడు. ఏపీలో ది రాజాసాబ్ ప్రీమియర్స్‌తో థియేటర్ల వద్ద సందడి మొదలైంది. ఈ మూవీ అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.ది రాజాసాబ్‌లో ప్రభాస్ నటన అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ఇంట్రడక్షన్ సీన్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సంజయ్ దత్ ఎంట్రీ చాలా భయానకంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఓవరాల్‌గా చూస్తే ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉందని ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.హీరోయిన్ రిద్ది కుమార్ దాదాపు 5 నిమిషాల పాటు కనిపిస్తుందని.. నిధి అగర్వాల్ మొదటి 30 నిమిషాల తర్వాతే ఎంట్రీ ఇచ్చిందని పోస్టులు పెడుతున్నారు. వీరిద్దరి లుక్, నటన అద్భుతంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మాళవిక మోహనన్ ఎంట్రీ ఆలస్యమైనా అద్భుతంగా నటించిందని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్‌లో చివరి 30 నిమిషాల్లో కనిపించిన మాళవిక ఫైట్ సీన్లో అదరగొట్టేసిందని అంటున్నారు.సెకండాఫ్‌లో కూడా అలరించిందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మొసళ్లతో ఫైట్ అదిరిపోయిందని పోస్ట్ చేస్తున్నారు. చివరి 30 నిమిషాలు క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ అని రాసుకొస్తున్నారు. ప్రభాస్ ఫర్మామెన్స్తో అదరగొట్టేశాడని చెబుతున్నారు. చివరి 40 నిమిషాల్లో ఎస్ఎస్ తమన్ బీజీఎం అద్భుతమని అంటున్నారు. Hospital sequence ➡️ crocodile fight ➡️ climax 🔥The last 30 minutes are the SOUL of the film.#Prabhas delivers a performance with par excellence 👌 Trying something different and nailing it.Brilliant writing by @DirectorMaruthi 👌 Truly surprising!@MusicThaman is the…— Suresh PRO (@SureshPRO_) January 8, 2026 #TheRajaSaab – First Half Review— STORY – #RajaSaab is about the hero’s journey in search of his grandfather.— #Prabhas’ performance is good. Each reaction he gives works well.Prabhas’ intro scene is superb.— #RiddhiKumar appears for about 5 minutes so far. Her look is… pic.twitter.com/Mj8iHpZbc9— Movie Tamil (@_MovieTamil) January 8, 2026 Musk changed like ❤️ button to celebrate 🔥🔥🔥 the release of #TheRajaasaab #TheRajaSaab #Prabhas𓃵 @prabhas pic.twitter.com/OmVMnJVyWS— R A J (@dune1411) January 8, 2026 -
అసభ్య కంటెంట్‌ను తక్షణమే తొలగించాలి
న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్ సారథ్యంలోని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో మహిళల అశ్లీల చిత్రాలు ప్రచురితమవ్వడంపై కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. చట్ట వ్యతిరేక, అసభ్యకర కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఎక్స్‌ను ఆదేశించింది. ముఖ్యంగా ఏఐ యాప్ గ్రోక్తో ఇలాంటి కంటెంట్ జనరేట్ చేయడం, ప్రచురించడం వెంటనే ఆపేయడంతోపాటు తీసివేయాల్సిందేనంది. లేకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. భారత్‌లో ఎక్స్ ఆపరేషన్స్ భాధ్యతలు చూసే చీఫ్ కంప్లయెన్స్ అధికారికి శుక్రవారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఈ మేరకు నోటీసు పంపింది. అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించడానికి, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించడానికి 72 గంటల గడువిస్తున్నట్లు పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2020, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు– 2021లోని నిబంధనలను పాటించడం లేదని తమ పరిశీలనలో తేలిందని అందులో పేర్కొంది. ‘చట్టాలను ఉల్లంఘిస్తూ ఇప్పటికే రూపొందించిన, ప్రచురించిన మొత్తం కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఎక్స్‌ను ఆదేశిస్తున్నాం. అదేవిధంగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధారాలను ధ్వంసం చేయరాదని ఈ నెల 2వ తేదీనాటి ఉత్తర్వులో పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో ఎలాంటి నోటీసు లేకుండానే ఎక్స్పైన, బాధ్యులైన అధికారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను పాటించని పక్షంలో లీగల్ ఇమ్యూనిటీ సైతం రద్దవుతుందని పేర్కొంది. యూజర్లు చేసే తప్పులకు కూడా నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎక్స్‌కు తెలిపింది.సోషల్ మీడియాదే బాధ్యతసామాజిక మాధ్యమాల్లో వచ్చే కంటెంట్‌కు సంబంధిత వేదికలే బాధ్యత వహించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇటువంటి కంటెంట్ ప్రసారమయ్యే సామాజిక వేదికలపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతం ఇటీవల సిఫారసు చేసిందన్నారు. ఏఐ యాప్ గ్రోక్ అసభ్యకర దృశ్యాలను జనరేట్ చేస్తోందంటూ వస్తున్న వార్తలపై ఆయన ఈమేరకు స్పందించారు. -
ట్వీట్స్‌తో మోత మోగించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్ మీడియాలో తన హవాను చాటుకున్నారు. ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్లతో టాప్‌లో నిలిచారు. ఎక్స్ లాంచ్ చేసిన కొత్త ఫీచర్ మోస్ట్ లైక్డ్ ప్రకారం ఆయన ట్వీట్లు ఇండియాలో ఎక్కువ లైక్స్ సాధించిన ట్వీట్ల జాబితాలో నిలిచాయి. దేశాల వారీగా ఫీచర్ ప్రధాని గత నెలలో భారతదేశంలో అత్యధికంగా లైక్ చేయబడిన పది ట్వీట్లలో ఎనిమిదింటిని కైవసం చేసుకున్నారు. మరే పొలిటికల్ నేత పేరు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.గత 30 రోజుల్లో వ్యక్తిగత దేశాలలో అత్యధికంగా లైక్ చేయబడిన ట్వీట్లను హైలైట్ చేసే కొత్త ఫీచర్‌ను ఎక్స్ తాజాగా విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా వెలువడిన డేటా ప్రకారం, నరేంద్ర మోదీ హైయ్యస్ట్ ఎంగేజ్మెంట్ కంటెంట్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా లైక్ చేయబడిన టాప్ పది ట్వీట్లలో ఎనిమిదింటిలో పీఎం మోదీ కావడం విశేషం. టాప్ టెన్‌లో మరే ఇతర రాజకీయనాయకుడు లేడు. మిగిలిన రెండు స్థానాల్లో రాజకీయేతర ఖాతాలున్నాయి. The Like Button Has a Clear FavouriteA significant moment in India’s digital journey, as X’s new 'Most-Liked' feature highlights content shared by PM @narendramodi among the nation’s most-liked posts, reflecting strong public engagement. Serving as Prime Minister of India since… pic.twitter.com/XLHXum9kG7— MyGovIndia (@mygovindia) December 19, 2025 దేశ-నిర్దిష్ట ర్యాంకింగ్ వినియోగదారులకు ఎంగేజ్ చేసిన టైం విండోలో అత్యధికంగా లైక్స్ సాధించిన ట్వీట్ల స్నాప్‌షాట్‌ను అందించడానికి ఎక్స్ ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది. అంతర్జాతీయ పర్యటనలు, దౌత్యపరమైన సంభాషణలు, పర్యనటల్లో కొన్ని ముఖ్యమైన అంశాలను షేర్ చేస్తూండటం మోదీని టాప్‌లో నిలబెట్టింది. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భగవద్గీత రష్యన్ భాషా కాపీని మోదీ అందిస్తున్నట్లు చూపించిన పోస్ట్, ఈ నెలలో అత్యధికంగా ఇష్టపడిన ట్వీట్‌గా నిలిచింది. ఈ పోస్ట్‌లో, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తిదాయక గ్రంథంగా గీతను ప్రధాని అభివర్ణించారు. మోదీ అధ్యక్షుడు పుతిన్ న్యూఢిల్లీకి వచ్చినప్పుటి ట్వీట్ రెండో స్థానంలో ఉంది. అయితే వీటిన నిర్దిష్టంగా మోదీ ట్వీట్లకు ఖచ్చితమైన లైక్ కౌంట్లు లేదా రీచ్ వంటి వివరణాత్మక కొలమానాలను ఈ ఫీచర్ వివరించలేదు. -
పర్యాటకులు అమెరికాలో ఎప్పటిదాకా ఉండొచ్చు?
వాషింగ్టన్: ఫలానా తేదీ వరకు అమెరికాలో పర్యటించవచ్చు అంటూ స్వయంగా అమెరికా ప్రభుత్వమే టూరిస్ట్ వీసాను జారీచేసినాసరే ఆ తేదీకంటే ముందే చాలా సందర్భాల్లో స్వదేశానికి వెనుతిరగాల్సి ఉంటుందని ట్రంప్ సర్కార్ కొత్త మెలిక పెట్టింది. వాస్తవానికి ఈ విషయం వీసా సంబంధ నిబంధన పత్రంలో ఉంటుందని తన వితండవాదాన్ని సమర్థించుకునే ప్రయత్నంచేసింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం గురువారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ అంతర్జాతీయ పర్యాటకులకు ముఖ్య గమనిక. అమెరికాలో ఎన్ని రోజుల వరకు పర్యటించవచ్చు అనేది మీకు జారీచేసిన టూరిస్ట్ వీసా మీద పేర్కొన్న గడువు తేదీ నిర్ణయించబోదు. గడువును అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ నిర్ణయిస్తారు. మీరు అమెరికాలో అడుగుపెట్టగానే మీతో ఆయన ఒక ఐ–94 దరఖాస్తును నింపిస్తారు. అందులో మీ చట్టబద్ధ పర్యాటకానికి చివరి తేదీ రాసి ఉంటుంది. ఆ తేదీ ఏంటో తెలుసుకోవాలంటే https:// i94.cbp.dhs.gov/ home వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో మీ టూరిస్ట్ వీసా సంబంధిత వివరాలను సరిచూసుకోండి. ఐ–94 దరఖాస్తులో ‘అడ్మిట్ అన్టిల్ డేట్’ అని ఒక తేదీ రాసి ఉంటుంది. అదే మీ చట్టబద్ధ పర్యటనకు ఆఖరి గడువు తేదీ. టూరిస్ట్‌వీసా గడువు తేదీ, ‘అడ్మిట్ అన్టిల్ డేట్’ తేదీలు ఒకేలా ఉండాలనే నియమం ఏమీలేదు. సాధారణంగా టూరిస్ట్‌వీసా గడువు కంటే ముందుగానే ‘అడ్మిట్ అన్టిల్ డే’ ముగుస్తుంది’’ అని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. -
'ఎక్స్'కు భారీ జరిమానా: ఈయూపై విరుచుకుపడ్డ మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'కు భారీ షాక్ తగిలింది. డిజిటల్ సర్వీసెస్ చట్టం కింద పారదర్శకత & డేటా యాక్సెస్ వంటివి ఉల్లంఘించినందుకు యూరోపియన్ యూనియన్ (EU) ఎక్స్‌కు వ్యతిరేకంగా 120 మిలియన్ యూరోలు జరిమానా విధించింది.యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడంపై ఎలాన్ మస్క్ విరుచుకుపడ్డారు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే, ''ప్రభుత్వాలు తమ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగలిగేలా ఈయూని రద్దు చేసి, సార్వభౌమత్వాన్ని వ్యక్తిగత దేశాలకు తిరిగి ఇవ్వాలని'' మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.The EU should be abolished and sovereignty returned to individual countries, so that governments can better represent their people— Elon Musk (@elonmusk) December 6, 2025ఏమిటీ డిజిటల్ సర్వీసెస్ చట్టండిజిటల్ సర్వీసెస్ చట్టం కింద యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇది (డిజిటల్ సర్వీసెస్ చట్టం) ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించడానికి, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అరికట్టడానికి మాత్రమే కాకుండా 27 సభ్య దేశాలలో పారదర్శకతను మెరుగుపరచడానికి రూపొందించబడిన ఒక విస్తృత చట్టం. ఎక్స్ విధివిధానాలపై రెండేళ్ల దర్యాప్తు తరువాత యూరోపియన్ ఈ జరిమానా విధించింది.యూరోపియన్ యూనియన్ చర్యను మస్క్ వ్యతిరేకించిన తరువాత.. అమెరికా రాజకీయ ప్రముఖులు కూడా ఖండించారు. దీనిని అమెరికన్ టెక్నాలజీ కంపెనీలపై దాడిగా.. అమెరికా ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల పట్ల పెరుగుతున్న శత్రుత్వానికి సంకేతంగా అభివర్ణించారు.ఈ ఘర్షణ మస్క్ & యూరోపియన్ సంస్థల మధ్య పెరుగుతున్న అంతరాన్ని హైలైట్ చేస్తుంది. ఎక్స్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన నియంత్రణ చట్రాలను పదే పదే విమర్శించారు. అయితే ఈయూ సంస్థలు వినియోగదారులను రక్షించడానికి & ప్రజాస్వామ్య ప్రక్రియలను రక్షించడానికి పర్యవేక్షణ అవసరమని వాదిస్తున్నాయి. -
X సేవల్లో అంతరాయం.. కారణం ఇదే!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X)లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు పోస్ట్‌లను చూడలేకపోవడమే కాకుండా, కొత్త ట్వీట్లను కూడా అప్లోడ్ చేయలేకపోయారు. క్లౌడ్‌ఫ్లేర్ అంతరాయం కారణంగా ఈ సమస్య ఏర్పడిందని సమాచారం.క్లౌడ్‌ఫ్లేర్ సేవలను ఉపయోగించే వెబ్సైట్లను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులకు "క్లౌడ్‌ఫ్లేర్ నెట్‌వర్క్‌లో అంతర్గత సర్వర్ లోపం, దయచేసి కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ ప్రయత్నించండి" అనే సందేశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సమస్యను వేలమంది యూజర్లు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెళ్లదీస్తున్నారని డౌన్‌డెటెక్టర్ వెల్లడించింది. ఈ సమస్యపై కంపెనీ స్పందించలేదు.డౌన్‌డిటెక్టర్ ప్రకారం ఈ సమస్య భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.37 గంటలకు మొదలైంది. క్లౌడ్‌ఫ్లేర్ డౌన్ అవ్వడం వల్ల కేవలం ఎక్స్ మాత్రమే కాకుండా.. ఓపెన్ ఏఐ సంస్థల సేవలు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించే పనిలో మా బృందం నిమగ్నమై ఉందని.. క్లౌడ్‌ఫ్లేర్ టీమ్ వెల్లడించింది.ఇదీ చదవండి: ఐదు రోజుల్లో రూ. 5వేలు!.. బంగారం ధరల్లో భారీ మార్పు -
పోలీసు అమరవీరులకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: పోలీసు అమరవీరులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకున్న వైఎస్ జగన్.. దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాన్ని స్మరించుకుందామంటూ ట్వీట్ చేశారు. వారి అంకితభావం, ధైర్యానికి అందరమూ సెల్యూట్ చేద్దాం అంటూ ఎక్స్ వేదికగా ఆయన పిలుపునిచ్చారు.On this Police Commemoration Day, we solemnly remember and pay heartfelt tributes to the brave police warriors who made the ultimate sacrifice in service to the nation. Let us salute their dedication and courage.#PoliceCommemorationDay— YS Jagan Mohan Reddy (@ysjagan) October 21, 2025 -
మావోయిస్టులకు మద్దతిస్తారా?.. బండి సంజయ్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్(bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలను హెచ్చరించారు. దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే తప్పించుకోలేరు.. అంతర్గత భద్రత విషయంలో రాలే లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా..‘రాజకీయ రంగ స్థలంలో ప్రజాస్వామ్యం గురించి వల్లె వేస్తూ.. మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలారా.. ఇదే మా హెచ్చరిక. సాయుధ వర్గాలతో సంబంధాలను తెంచుకోండి. లేనిపక్షంలో మీ గుట్టు బయటపడుతుంది. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో, అమిత్ షా మార్గదర్శకత్వంలో కేంద్ర సంస్థలు మావోయిస్టు నిర్మూలనకే పరిమితం కావడం లేదు. అవినీతి, మాఫియా, ఉగ్రవాద సంబంధాల నెట్‌వర్క్‌ను సైతం వెలికి తీస్తున్నాయి.దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే తప్పించుకోలేరు. కరుణ లేకుండా కఠిన చర్యలు తీసుకోబోతున్నాయి. ఎంత పెద్ద వారైనా సరే అంతర్గత భద్రత విషయంలో రాజీ లేదు. మావోయిస్టుల వైపు నిలబడే వారెవరైనా సరే పడిపోక తప్పదు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే సమయంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా కర్రెగుట్టల నుంచి తెలంగాణ వైపు వెళ్లినట్లు ఆయన అనుచరుడు పోలీసులకు తెలిపినట్లు వచ్చిన వార్త కథనాన్ని కూడా ఇవాళ బండి సంజయ్ పోస్టు చేయడం సంచలనంగా మారింది.Telangana politicians - consider this a warning.Those allegedly supporting armed networks while preaching democracy on stage, cut your links or get exposed.Central agencies won’t stop at Maoist cadres. Under the guidance of Hon’ble PM Shri @narendramodi ji and Hon’ble HM Shri… pic.twitter.com/ucicID1msj— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 19, 2025ఇదిలా ఉండగా.. మావోయిస్టులతో తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయని ఇటీవల సరెండర్ అయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల తెలిపిన విషయం ఇపుడు సంచలనంగా మారింది. అసలు మావోయిస్టులతో సంబంధాలున్న నాయకులు ఎవరా? అని చర్చ మొదలైంది. ఒకవేళ ఈ పేర్లు బహిర్గతమైతే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది.మరోవైపు.. ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, మావోయిస్ట్ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని వెల్లడించారు. మావోయిస్టు గెరిల్లాలు ,కొంతమంది తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య రహస్య కుమ్మక్కు జరిగిందని ఆయన వివరించినట్లు జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. అలాగే హిడ్మా తెలంగాణ వైపు వచ్చారని ఆయన సన్నిహితులు పోలీసులకు వెల్లడించినట్లు మరో కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతున్నాయి. -
చరిత్ర చెరిపేస్తే చెరగదు.. విడదల రజిని ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ‘చరిత్ర చెరిపేస్తే చెరగదు’ అంటూ మెడికల్ కాలేజీల ప్రారంభాలపై మాజీ మంత్రి విడదల రజిని ట్వీట్ చేశారు. ‘‘సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం (15 సెప్టెంబర్ 2023) వైఎస్సార్సీపీ హయాంలో విజయ నగరం, రాజమండ్రి , ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభమైన మహత్తర ఘట్టం. ఇవి కేవలం కాలేజీలు కాదు.. ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రక నిర్ణయం, వైఎస్సార్సీపీ ముద్ర’’ అంటూ విడదల రజిని పోస్ట్ చేశారు.✅ చరిత్ర చెరిపేస్తే చెరగదు!🩺 సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం – 15 సెప్టెంబర్ 2023వైఎస్సార్సీపీ హయాంలోవిజయనగరం, రాజమండ్రి , ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభమైన మహత్తర ఘట్టం!🎓 ఇవి కేవలం కాలేజీలు కాదు…✊ ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసంమాజీ… pic.twitter.com/O51mJb6NcH— Rajini Vidadala (@VidadalaRajini) September 15, 2025 -
Top Twitters: మోడీ తర్వాత మన ఎన్టీఆరే..!
-
వైరల్ వీడియో.. ఈ పక్షిని చూసే విమానం కనిపెట్టారేమో!
సాక్షి, హైదరాబాద్: ఒక చిన్న పక్షి ల్యాండింగ్ అయ్యే విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పక్షి తన గమ్యస్థానానికి చేరే సమయంలో చూపిన నైపుణ్యం ఏరోడైనమిక్స్‌కు పాఠాలు చెబుతోంది. విమానం ల్యాండింగ్‌ను ఈ పక్షిని చూసే కనిపెట్టారేమోననిపిస్తోంది కదూ.. ఈ ఆలోచింపజేసే వీడియో.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.ఓ పక్షి.. గమ్యానికి చేరే చివరి దశలో గాలిలో ఎగురుతూ వచ్చి నీటిలో సురక్షితంగా దిగిన దృశ్యం ఆసక్తి కలిగిస్తోంది. ఆ పక్షి కిందకు దిగే ముందు తన రెక్కలతో వేగాన్ని నియంత్రించుకోవడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. పర్ఫెక్ట్ టచ్‌డౌన్‌తో నీటిపై దిగుతుంది. ప్రకృతి పక్షికి నేర్పించిన గొప్ప ల్యాండింగ్ టెక్నిక్‌ను గమనించండి అంటూ ఓ అందమైన వీడియోను ఆయన షేర్ చేశారు.Sharing this lovely video - please observe the great landing technique taught by nature to a bird with clear application of aerodynamics- Short finals, gears down, thrust reversers activated & Perfect touchdown. Aeroplanes copied it ! pic.twitter.com/TL9u3gwKXF— CV Anand IPS (@CVAnandIPS) September 2, 2025 -
మస్క్ తొలగించిన సీఈవో.. మళ్లీ ‘ప్యారలల్’గా దూసుకొచ్చాడు!
ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ మళ్లీ టెక్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన స్థాపించిన కొత్త ఏఐ స్టార్టప్ ‘ప్యారలల్ వెబ్ సిస్టమ్స్’ ఇటీవలే 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.250 కోట్లు) పెట్టుబడులను సమీకరించింది. ఖోస్లా వెంచర్స్, ఇండెక్స్ వెంచర్స్, ఫస్ట్ రౌండ్ క్యాపిటల్ వంటి ప్రముఖ వెంచర్ క్యాపిటల్స్ ఈ సంస్థలో పెట్టుబడి పెట్టాయి.ఏఐకి బ్రౌజర్ ఇచ్చినట్లే!ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ ఒక క్లౌడ్-బేస్డ్ ఏఐ రీసెర్చ్ ప్లాట్‌ఫారమ్. ఇది ఏఐ మోడల్స్‌కు రియల్ టైమ్ వెబ్ డేటాను యాక్సెస్ చేయగలిగే సామర్థ్యాన్ని కల్పిస్తుంది. సాధారణంగా AIలు ట్రైనింగ్ డేటాపై ఆధారపడతాయి. కానీ లైవ్ వెబ్ సమాచారం చదవడం, నిజమైన సమాచారం గుర్తించడం, సమాధానాలపై విశ్వాస స్థాయిని అంచనా వేయడం వంటివి ప్యారలల్ ప్రత్యేకతలు.మానవుల కంటే మెరుగైన అన్వేషణఈ స్టార్టప్ అభివృద్ధి చేసిన అల్ట్రా8ఎక్స్ (Ultra8x) అనే రీసెర్చ్ ఇంజిన్ 30 నిమిషాల పాటు లోతైన వెబ్ అన్వేషణ చేయగలదు. ఇది ఓపెన్ఏఐ జీపీటీ-5 (OpenAI GPT-5)తో సహా మానవ రీసెర్చర్ల కంటే 10 శాతం మెరుగైన పనితీరును చూపిందని సంస్థ పేర్కొంది. ట్విట్టర్ నుంచి టెక్ రీ-ఎంట్రీ2022లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, సీఈవో పదవిలో ఉన్న పరాగ్ అగర్వాల్‌ను ఎలాన్ మస్క్ తొలగించారు. ఆ తర్వాత పరాగ్ పాలో ఆల్టోలోని కాఫీ షాపుల్లో రీసెర్చ్ పేపర్లు చదువుతూ, కోడ్ రాస్తూ గడిపారు. హెల్త్‌కేర్ ఏఐ స్టార్టప్ ఆలోచించినా, చివరికి ఏఐకి రియల్ టైమ్ వెబ్ డేటాను విశ్వసనీయంగా అందించాలన్న లక్ష్యంపై దృష్టి పెట్టారు.మస్క్‌తో రూ.420 కోట్ల సెవరెన్స్ వివాదంపరాగ్ అగర్వాల్ ఇంకా 50 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.420 కోట్లు) సెవరెన్స్ పేమెంట్ కోసం మస్క్‌తో కోర్టులో పోరాటం చేస్తున్నారు. మస్క్ “ఫర్ కాస్” అనే కారణంతో చెల్లింపును నిలిపివేశాడు. -
జగన్ ప్రెస్‌మీట్.. ఆ ఫొటోలు డిలీట్ చేసిన కలెక్టర్
సాక్షి,వైఎస్సార్: పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్‌లో రిగ్గింగ్ రాజ్యమేలింది. నల్లపురెడ్డిపల్లెలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ గూండాలు యథేచ్చగా దొంగ ఓట్లు గుద్దుకున్నారు. క్యూలో దర్జాగా రకరకాల ఫోజులతో నిలబడి మరీ ఓట్లు వేశారంటూ ఇవాళ మీడియా సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధారాలతో సహా ఆ విషయాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో.. కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఎదురుగానే దొంగ ఓట్లుపడ్డ సంగతిని వైఎస్ జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకు సంబంధిత దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారాయి. అయితే ఫోటోలో ఉన్నది దొంగ ఓటర్లని బహిర్గతం కావడంతో కలెక్టర్ కంగుతిన్నారేమో..! దీంతో అప్పటికే ఆ ఫోటోలను తన ఎక్స్‌లో పోస్ట్ చేసిన జిల్లా కలెక్టర్ వెంటనే వాటిని డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. -
‘సుప్రీంకోర్ట్ ఆఫ్ కర్నాటక’ అకౌంట్ క్రియేట్ చేశాం
బెంగళూరు: సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ‘సుప్రీంకోర్ట్ ఆఫ్ కర్నాటక’పేరుతో ఫేక్ అకౌంట్‌ని ఎటువంటి అడ్డంకులు లేకుండా సులభంగా క్రియే ట్ చేసినట్లు సొలిసిటర్ జనరల్(ఎస్జీ) తుషార్ మెహతా చెప్పారు. ఇలా ఇష్టారాజ్యంగా ప్రమాదకరమైన ధోరణులకు ‘ఎక్స్’సైతం వేదికగా మారిందని తెలిపారు. సామాజిక మాధ్యమ సంస్థ ఎక్స్ కార్పొరేషన్‌తో కేంద్రం విభేదాలు కొనసాగుతున్న వేళ శుక్రవారం కర్నాటక హైకోర్టులో వాదనల సందర్భంగా ఎస్జీ తుషార్ మెహతా దీనిని ఓ ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రజలను సులువుగా మోసం చేసేందుకు సామాజిక మాధ్యమ వేదికలను దుర్వినియోగం చేసేందుకు ఎంతో అవకాశముందని వివరించారు. ‘నేను ఈ అకౌంట్ క్రియేట్ చేశాను. ఎక్స్ ఈ అకౌంట్‌ను ధ్రువీకరించింది కూడా. నేనిక ఇందులో ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు. జనం సైతం సుప్రీంకోర్ట్ ఆఫ్ కర్నాటక ఇలా చెప్పి ఉంటుందనే నమ్ముతారు’అంటూ మెహతా వాదించారు. దుర్వినియోగం తీవ్రతను చూపేందుకు తప్ప, కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి ఈ అకౌంట్‌ను క్రియేట్ చేయలేదని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆన్లైన్లో వచ్చే కంటెంట్‌కు జవాబుదారీతనం లేదనటానికి ఇదో ఉదాహరణ అని వాదించారు. ఫలానా సమాచారాన్ని తొలగించాలంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) కింద ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎక్స్ కార్పొరేషన్ వేసిన పిటిషన్‌పై వాదనల సందర్భంగా కేంద్రం తరఫున తుషార్ మెహతా ఈ లోపాన్ని ఎత్తి చూపారు. అయితే, ఇదే చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం మాత్రమే సంబంధిత కంటెంట్‌ను బ్లాక్ చేయాలని ఆదేశించొచ్చని ఎక్స్ కార్పొరేషన్ వాదించింది. -
సంచలన సైకో ‘ట్విటర్ కిల్లర్’ ఉరితీత
జపాన్‌లో సుమారు మూడేళ్ల తర్వాత మరణశిక్ష అమలు చేశారు. ‘ట్విటర్ కిల్లర్’గా పేరున్న తకహిరో షిరాయిషి(Takahiro Shiraishi)ని శుక్రవారం ఉరి తీసినట్లు ఆ దేశ న్యాయశాఖ అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని.. ఆపై అతికిరాతంగా హత్యాచారం చేయడంతో ఇతనికి ఆ పేరు ముద్రపడింది. సంచలనం సృష్టించిన ఈ సీరియల్ కిల్లర్ ఉదంతంతో.. షాకింగ్ విషయాలే వెలుగు చూశాయి అప్పట్లో.. సామాజిక వేదిక ట్విట్టర్లో పరిచయమైన బాలికలను, మహిళలకు నమ్మించి.. మాయమాటలు చెప్పి తకహిరో షిరాయిషి(Takahiro Shiraishi).. తన అపార్టుమెంట్‌కు రప్పించుకుని లైంగికదాడికి పాల్పడేవాడు. ఆపై డబ్బు, ఇతర విలువైన వస్తువులు లాక్కుని.. అనంతరం చంపేసి వారి తల, మొండెం, కాళ్లు, చేతులు.. శరీర భాగాలన్నీ ముక్కలుగా నరికిపడేసేవాడు.2020లో ఈ సీరియల్ కిల్లర్‌కు టోక్యో కోర్టు మరణశిక్ష విధించింది. తకహిరో షిరాయిషి.. ట్విట్టర్లో ఆత్మహత్యకు సంబంధించిన పోస్టులు పెట్టే యువతనే టార్గెట్‌గా చేసుకునేవాడు. బాధను తనతో పంచుకోమంటూ మాటల కలిపి.. స్నేహం చేసేవాడు. అనంతరం ఇద్దరం కలిసి చనిపోదామంటూ నమ్మకం కలిగించేవాడు. ఆ తరువాత తన ఇంటికి రప్పించి వారిని హతమార్చేవాడు. ఇలా ఏకంగా తొమ్మిది మందిని హత్య చేశాడు. వారిలో 26 ఏళ్ల లోపు ఎనిమిది మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. 🧠 వెనుక కథతకహిరో షిరాయిషి 1990లో జపాన్‌లో జన్మించాడు. అతను "ట్విటర్ కిల్లర్"గా ప్రసిద్ధి చెందాడు. ఎందుకంటే అతను ట్విటర్ వేదికగా ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసి, వారిని తన అపార్ట్‌మెంట్‌కు రప్పించి హత్య చేశాడు కాబట్టి.🧪 హత్యల మోడ్ ఆఫ్ ఆపరేషన్2017 ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య, అతను 15–26 ఏళ్ల వయసున్న 8 మంది యువతులు, ఒక యువకుడిని హతమార్చాడుబాధితులను మాయ చేసి, "ఆత్మహత్యలో సహాయం చేస్తానని" చెప్పి తన ఇంటికి రప్పించేవాడుహత్య చేసిన తర్వాత, శరీర భాగాలను ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లలో దాచేవాడుఅతని అపార్ట్మెంట్లో 9 తలలు, చేతులు, కాళ్ల ఎముకలు లభించాయి⚖️ న్యాయ విచారణ & శిక్ష2020లో కోర్టు అతనికి మరణదండన విధించిందిఅతను మొదట హత్య చేశానని చెప్పినా, తర్వాత ఆ వాదనను తిరస్కరించాడు2025 జూన్ 27న జపాన్‌లో అతనికి ఉరిశిక్ష అమలు చేశారు📌 సామాజిక ప్రభావంఈ కేసు జపాన్ను తీవ్రంగా కుదిపేసింది. సోషల్ మీడియా వేదికలపై భద్రత, ఆత్మహత్యలపై చర్చలు ముమ్మరమయ్యాయి. జపాన్‌లో మరణశిక్షపై ప్రజల మద్దతు ఎక్కువగా ఉండటంతో ఈ తీర్పు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. -
హీరోయిన్ శృతిహాసన్ సోషల్ మీడియా ఖాతా హ్యాక్!
హీరోయిన్ శ్రుతి హాసన్ ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఆమె అకౌంట్ నుంచి బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన సందేశాలు దర్శనమిచ్చాయి. వరుసగా ఆమె ఖాతా నుంచి ఈ సందేశాలు రావడంతో ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. హ్యాకింగ్ గురించి శృతిహాసన్ ఇన్‌స్టా వేదికగా తెలిపింది. దయచేసి ఎవరూ కూడా ఆ మేసేజ్‌లకు స్పందించవద్దని విజ్ఞప్తి చేసింది.శృతి హాసన్ ట్విటర్ ఖాతాలో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు వరుసగా దర్శనమిచ్చాయి. మావెరిక్స్ యజమాని - మార్క్ క్యూబన్ పేరుతో ఈ ట్వీట్స్ పోస్ట్ చేశారు. అయితే శృతి హాసన్ ఖాతా హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2017లోనూ ఆమె ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు. ఆ తర్వాత ఎవరో నా ఖాతాను హ్యాక్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలర్ట్ చేసింది. -
‘ఎక్స్ చాట్’ ప్రారంభించిన మస్క్
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ టూల్స్ అయిన వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్.. వంటి వాటికి పోటీగా ఎక్స్(గతంలో ట్విటర్) కొత్తగా ‘ఎక్స్ చాట్’ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇది తన వినియోగదారులకు అంతరాయం లేని, సురక్షితమైన మెసేజింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ సీఈఓ ఎలాన్‌మస్క్ తెలిపారు.ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, డిసప్పియరింగ్ మెసేజెస్, ఆడియో/ వీడియో కాల్స్ వంటి అధునాతన సామర్థ్యాలను హైలైట్ చేస్తూ మస్క్ ఎక్స్ పోస్ట్‌లో ఈమేరకు ఎక్స్ చాట్ వివరాలు ప్రకటించారు. ఇన్స్టంట్ మెసేజింగ్ స్పేస్‌లో ఇప్పటికే దూసుకుపోతున్న కంపెనీలకు ఎక్స్ చాట్ పోటీదారుగా మారే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: దేశంలోని తొలితరం సంపన్న మహిళలుప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉన్న ఈ అప్డేటెడ్ మెసేజింగ్ ఇంటర్ ఫేస్‌ను పరిమిత సంఖ్యలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ఎక్స్ చాట్‌లో ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్, ఫైల్ షేరింగ్, వాయిస్, వీడియో కాల్స్ వంటి అధునాతన మెసేజింగ్ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. ఈ అప్‌గ్రేడ్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ మల్టీపర్పస్ కమ్యూనికేషన్ హబ్‌గా ఎక్స్‌ను అభివృద్ధి చేయాలనే మస్క్ అంచనాలకు అనుగుణంగా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. -
X Outage: ఎక్స్ సేవల్లో అంతరాయం
ప్రపంచ కుబేరుడు.. టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ఆధీనంలోని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్, ఎక్స్ (ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 5:30 గంటల నుంచి యూజర్లు సమస్యలను నివేదిస్తూనే ఉన్నారు. లాగిన్ అవ్వడంలో, టైమ్‌లైన్‌లను యాక్సెస్ చేయడంలో మాత్రమే కాకుండా ట్వీట్స్ చేయడంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు.ట్రాకింగ్ సర్వీస్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. 2,100 కంటే ఎక్కువ మంది యూజర్లు సమస్యలను నివేదించారు. కంపెనీ ప్రస్తుతానికి ఈ సమస్యకు కారణం ఏమిటనే విషయాన్ని వెల్లడించలేదు.శుక్రవారం కూడా భారతదేశంతో పాటు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎక్స్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. డేటా సెంటర్లో ఏర్పడిన టెక్నికల్ సమస్య కారణంగా.. అంతరాయం ఏర్పడిందని ఎక్స్ ఇంజినీర్లు వెల్లడించారు. అయితే ఈ రోజు అంతరాయం కలగడానికి కారణం ఏమిటనే విషయం తెలియాల్సి ఉంది. -
గంటాతో కూటమికి తలనొప్పులు.. పిలిచి మరీ క్లాస్ పీకిన అధిష్టానం
రాష్ట్రంలో తెలుగుదేశం..కాంగ్రెస్.. ఎవరు అధికారంలో ఉన్నా మంత్రిగా హోదా నిలబెట్టుకునే స్థాయి నాయకుడైన గంటా శ్రీనివాస్‌కు ఇప్పుడు వట్టి ఎమ్మెల్యేగా ఉండడం ఇబ్బందికరంగా మారింది. గతంలో మంత్రి హోదాలో కలెక్టర్లు.పెద్ద పెద్ద అధికారులతో హడావుడి చేసే గంటా ఇప్పుడు భీమిలి వరకే పరిమితం అవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే తన ఉనికిని చాటుకునేందుకు అప్పుడప్పుడూ అత్యుత్సాహం చూపిస్తున్నారు. అయితే ఈ ఓవర్ యాక్షన్‌ని ప్రభుత్వం..పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయన చర్యలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతో చీవాట్లు పెడుతూ.. కాస్త హద్దుల్లో ఉండాలని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.విజయవాడలో మంగళవారం జరిగిన ఓ ముఖ్య సమావేశానికి విశాఖ నుంచి బయల్దేరిన గంటా నేరుగా విజయవాడ వెళ్లాల్సి ఉండగా సదరు విమానం ఆయన్ను ముందుగా హైదరాబాద్ తీసుకెళ్లి..అక్కణ్ణుంచి విజయవాడ డ్రాప్ చేసింది.. ఎందుకూ అంటే విశాఖ నుంచి బెజవాడకు డైరెక్ట్ విమాన సర్వీస్ లేదు.. రద్దు చేశారని తెలిసింది. దీంతో ఉదయం వెళ్లాల్సిన గంటా మధ్యాహ్నానికి విజయవాడ చేరుకున్నారు.దీంతో ఆయన ‘ఆంధ్ర టూ ఆంధ్ర వయా తెలంగాణ’ అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టు మీద టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని లేనిపక్షంలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మన వారే కదా ఆయనకు చెబితే సరిపోయేది కానీ ఇలా ట్విటర్‌లోకి ఎక్కి రచ్చ చేయాలా అని చీవాట్లు పెట్టింది. సీనియర్ ఎమ్మెల్యే అయినా ఇలా బాధ్యత లేకుండా ఉంటే ఎలా అని అడిగింది.ఇదిలా ఉండగా.. వతిలో 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని గంటా వియ్యంకుడు, పురపాలక మంత్రి నారాయణ ప్రకటన చేసిన తరుణంలోనే రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానమే లేదంటూ గంటా శ్రీనివాసరావు ట్విట్టర్లో సెటైర్ వేశారు. అధికార పార్టీ నాయకుడివైన నువ్వు ప్రభుత్వం పరువు తీయడం ఏమిటని అధిష్టానం ప్రశ్నించింది.వాస్తవానికి గంటా శ్రీనివాస్ గతంలో కూడా ప్రభుత్వానికి ఋషికొండ భవనాల తలుపులు తెరిచి హడావుడి చేశారు. ఫోటోలు విడుదల చేశారు. ఆ సందర్భంలో కూడా ఆయనకు పార్టీ నుంచి అక్షింతలు పడ్డాయి. డిప్యూటీ సీఎం పవన్.. ప్రభుత్వంలో నంబర్ టూ అయిన లోకేష్..ఇంకా మంత్రులు ఉండగా కేవలం ఒక ఎమ్మెల్యే అయిన మీరు రుషికొండ భవనాలను చూడడానికి ఎందుకు వెళ్ళారు..మీకు అంత అత్యుత్సాహం ఎందుకు అని అప్పట్లోనే టిడిపి పెద్దలు ప్రశ్నించారు. ఇక ఇప్పుడు కూడా ఈ ట్వీట్ దెబ్బతో చీవాట్లు పడ్డాయి. మొత్తానికి గంటాకు ఈ టర్మ్ బాలేనట్లుంది.::సిమ్మాదిరప్పన్న -
ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలి?.. సలహా కోరిన అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ నటుటు అమితాబ్ బచ్చన్ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సరదా పోస్టులతో అలరిస్తుంటారు. అయితే ట్విటర్ వేదికగా మరోసారి తన ఫ్యాన్స్‌తో ముచ్చటించారు బిగ్ బీ. ఈ సందర్భంగా తన ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలో సలహా ఇవ్వండని కోరారు. ప్రస్తుతం నాకు 49 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారని.. ఆ సంఖ్యను పెంచేందుకు సలహా ఇవ్వమని పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ తమకు నచ్చిన విధంగా అమితాబ్‌కు సలహాలు, సూచనలు ఇచ్చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులతో నింపేస్తున్నారు. మరి వారిచ్చిన సలహాలేవో చూసేద్దాం పదండి.అయితే అమితాబ్ పోస్ట్‌కు పలువురు నెటిజన్స్ స్పందించారు. కొందరైతే మీ సతీమణి జయాబచ్చన్‌తో ఓ వీడియో చేసి పోస్ట్ చేయండని సలహా ఇచ్చారు. మరికొందరేమో కేవలం పెట్రోల్ ధరల గురించి మాట్లాడితే ఒక్కరోజులో మీ సంఖ్యం 50 మిలియన్ల మంది ఫాలోవర్లు దాటిపోవడం గ్యారెంటీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరైతే ఏకంగా నటి రేఖను పెళ్లి చేసుకోవాలని సరదాగా పోస్ట్ చేశాడు. ఒకరేమో జయా బచ్చన్ సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయండని వారికి తోచిన విధంగా కామెంట్స్ పెడుతున్నారు.అయితే చాలా మంది నటి రేఖ పేరు ప్రస్తావించడంపై నెట్టింట చర్చ మొదలైంది. దీనికి కారణం వీరిద్దరు కలిసి గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అమితాబ్- రేఖ.. దో అంజానే, అలాప్, ఖూన్ పసీనా, గంగా కీ సౌగంద్, రామ్ బలరామ్, సిల్సిలా లాంటి చిత్రాల్లో కలిసి పనిచేశారు. వీరి జోడీపై గతంలో చాలా రూమర్స్ కూడా వినిపించాయి. ఆ తర్వాత అలాంటి ప్రచారాలకు చెక్ పెడుతూ ఆయన జయా బచ్చన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే చివరిసారిగా కల్కిలో కనిపించిన అమితాబ్.. ఆ తర్వాత కౌన్ బనేగా కరోడ్‌పతి రియాల్టీ షోకు హోస్ట్‌గా పనిచేశారు.T 5347 - बड़ी कोशिश कर रहे हैं, लेकिन ये 49M followers का नंबर बढ़ ही नहीं रहा है ।कोई उपाय हो तो बताइए !!!— Amitabh Bachchan (@SrBachchan) April 13, 2025 -
మస్క్ కీలక నిర్ణయం.. ఏఐ స్టార్టప్‌కు X అమ్మకం!
టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫారమ్ Xను అమ్మకానికి ఉంచారు. అయితే ఆ కొనుగోలు చేస్తున్న కంపెనీ కూడా ఆయనదే కావడం గమనార్హం. మస్క్ ఆధీనంలోని కంపెనీలలో ఒకటైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ 'ఎక్స్ఏఐ'.. సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌ను సొంతం చేసుకుంది. రెండు కంపెనీలు ఏకీకృతమైనట్లు.. మస్క్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.రెండు సంవత్సరాల క్రితం స్థాపించినప్పటి నుంచి.. xAI వేగంగా ప్రపంచంలోని ప్రముఖ AIలలో ఒకటిగా మారింది. X అనేది సోషల్ మీడియా దిగ్గజం. ఇక్కడ 600 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు. ఇది కూడా ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన కంపెనీలలో ఒకటిగా రూపాంతరం చెందింది. కాగా ఇప్పడు ఈ సంస్థను ఎక్స్ఏఐ సొంతం చేసుకుంది. ఎక్స్ఏఐ, ఎక్స్ భవిష్యత్తులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని మస్క్ పేర్కొన్నారు.ఎక్స్ఏఐ, ఎక్స్ కలయిక ఏఐ సామర్థ్యం పెంపొందించడానికి దోహదపడుతుంది. వినియోపగదారులకు గొప్ప అనుభవాలను అందించడానికి సంస్థ కృషి చేస్తోందని మస్క్ అన్నారు. ఇది ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాకుండా మానవ పురోగతిని కూడా వేగవంతం చేయడానికి ఉపయోగపడే వేదికను నిర్మించడానికి వీలు కల్పిస్తుందని వెల్లడించారు.ఈ కంపెనీలు అన్నీ స్టాక్‌లతో కూడిన ఒప్పందంలో విలీనం చేయబడుతున్నాయి. ఎక్స్ఏఐ విలువ 80 బిలియన్ డాలర్లు కాగా.. ఎక్స్ విలువ 33 బిలియన్ డాలర్లు. రెండు కంపెనీ కలయికతో 113 బిలియన్ డాలర్ల సంస్థ అవతరించింది.ఇదీ చదవండి: పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రంనిజానికి 2022 చివరలో మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన లావాదేవీల్లో అప్పు కూడా ఉందని తెలుస్తోంది. ఆ మరుసటి సంవత్సరమే ఎక్స్ఏఐ ప్రారంభమైంది. ఇప్పుడు ఏఐలో ఆధిపత్యాన్ని చెలాయించడాన్ని ఎలాన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు.@xAI has acquired @X in an all-stock transaction. The combination values xAI at $80 billion and X at $33 billion ($45B less $12B debt). Since its founding two years ago, xAI has rapidly become one of the leading AI labs in the world, building models and data centers at…— Elon Musk (@elonmusk) March 28, 2025 -
ట్విట్టర్ పిట్టకు రూ.30 లక్షలు!
సామాజిక మాధ్యమం ట్విట్టర్ లోగో బ్లూబర్డ్ గుర్తుంది కదా. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆ సంస్థను కొనుగోలు చేశాక ఎక్స్‌గా పేరు మార్చినా ఇంకా అంతా ట్విట్టర్ అనే పిలుస్తారంటే దాని ప్రభావం అర్థం చేసుకోవచ్చు! ట్విట్టర్ కార్యాలయంపై 2012 నుంచి 2023 వరకూ సగర్వంగా వేలాడిన బ్లూ బర్డ్ లోగో తాజా వేలంలో రూ.30లక్షలకు అమ్ముడు పోయింది. 560 పౌండ్ల బరువున్న ఈ లోగోను ఓ అజ్ఞాత వ్యక్తి కొనుగోలు చేశాడు. మస్క్ 2022లో ట్విట్టర్‌ను టేకోవర్ చేయగానే శాన్ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం నుంచి ట్విట్టర్ ఐకానిక్ బ్లూ బర్డ్‌ను తొలగించడం తెలిసిందే. ప్రధాన కార్యాలయాన్ని కూడా టెక్సాస్‌కు మార్చారు. ట్విట్టర్‌కు సంబంధించిన వస్తువులు, ఆఫీస్ ఫర్నిచర్‌తో పాటు లోగోను కూడా 2023 ఆగస్టులో మస్క్ వేలం వేశారు. అప్పుడు దాన్ని దక్కించుకున్న ఆర్ఆర్ సంస్థ తాజాగా తిరిగి వేలం వేసింది. -
‘ట్విటర్ పిట్ట’ వేలం.. భారీ ధర పలికిన లోగో
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్(ప్రస్తుతం ‘ఎక్స్’).. ఈ పేరు వినగానే మొదటి గుర్తుకొచ్చేంది దాని ఫేమస్ బర్డ్ లోగో. అదేనండి ‘ట్విటర్ పిట్ట’. ట్విటర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత దాని పేరును ‘ఎక్స్’గా మార్చి శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం నుంచి పాత బర్డ్ లోగోను తొలగించారు. ఇప్పుడా బర్డ్ లోగోను వేలానికి ఉంచగా భారీ ధర పలికింది.ట్విటర్ బర్డ్ లోగోను ఆర్ఆర్ ఆక్షన్ అనే సంస్థ ద్వారా వేలంలో అమ్మకానికి పెట్టారు. ఈ వేలంలో 34,375 డాలర్లకు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.30 లక్షలు) అజ్ఞాత వ్యక్తి దీన్ని కొనుగోలు చేశారు. 12 అడుగులు 9 అడుగులు (3.7 మీటర్లు 2.7 మీటర్లు) కొలతలు, 560 పౌండ్ల (254 కిలోలు) బరువు ఉన్న ఈ బర్డ్ లోగో 34,375 డాలర్లకు అమ్ముడుపోయిందని ఆర్ఆర్ ఆక్షన్ తెలిపింది. అయితే కొన్నదెవరనేది మాత్రం వెల్లడించలేదు.ట్విటర్‌ను 2022లో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. దీని కోసం ఆయన 44 బిలియన్ డాలర్లు చెల్లించారు. అయితే, కొనుగోలు తర్వాత ప్రకటనలను నిలుపుకోవడంలో ట్విటర్ ఇబ్బందులను ఎదుర్కొంది. దీంతో ఇందులో ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్లతో సహా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను గణనీయంగా వెనక్కితీసుకున్నారు. ట్విటర్‌ను 'ఎవ్రీథింగ్ యాప్'గా మార్చాలన్న లక్ష్యంతో దీన్ని ఆయన ‘ఎక్స్’గా మార్చేశారు.ట్విటర్‌ను ‘ఎక్స్’గా మార్చేసిన తర్వాత పాత లోగోలు, జ్ఞాపికలు, ఆఫీస్ ఫర్నిచర్, కిచెన్వేర్ వంటి పలు వస్తువులను మస్క్ ఇప్పటికే వేలంలో విక్రయించేశారు. ఇలా వేలంలో భారీ ధరలు పలికిన ఇతర టెక్ వస్తువులలో యాపిల్ కంప్యూటర్ సంస్థకు చెందిన పలు వస్తువులు ఉన్నాయి. వీటిలో యాక్సెసరీస్ తో కూడిన యాపిల్ -1 కంప్యూటర్ 3,75,000 డాలర్లు, 1976 లో స్టీవ్ జాబ్స్ సంతకం చేసిన చెక్కు 1,12,054 డాలర్లు, మొదటి తరం 4 జీబీ ఐఫోన్ 87,514 డాలర్లు ధర పలికాయి. -
భారత్‌పై ‘ఎక్స్’ పిటిషన్
బెంగళూరు: చట్ట వ్యతిరేక కంటెంట్, సెన్సార్ షిప్ పేరుతో భారత ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టానికి ముఖ్యంగా సెక్షన్ 79(3)(బీ) విషయంలో 2015 నాటి శ్రేయా సంఘాల్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తోందని, ఆన్లైన్లో భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించింది. జ్యుడీషియల్ ప్రక్రియకు లోబడి కంటెంట్‌ను బ్లాక్ చేయడం లేదా సెక్షన్ 69 ఏ ప్రకారం చట్ట ప్రకారం చర్య తీసుకోవాలన్న నిబంధనలను భారత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పిటిషన్లో పేర్కొంది.కాగా, ప్రభుత్వ నోటిఫికేషన్ లేదా కోర్టు ఉత్తర్వుతో అక్రమ కంటెంట్‌ను ఆన్లైన్ వేదికలు తొలగించడం తప్పనిసరని ఐటీ చట్టంలోని 79(3)(బీ) చెబుతోంది. 36 గంటల్లోగా ఆ విధంగా చేయకుంటే, సంబంధిత వేదికలకు సెక్షన్ 79(1) ప్రకారం రక్షణలను కోల్పోతుంది. ఐపీసీ తదితర చట్టాల ప్రకారం ఆ వేదికలపై చర్యలు తీసుకునే అవకాశమేర్పడుతుంది. అయితే, ఈ నిబంధనను వాడుకుంటూ స్వతంత్రంగా కంటెంట్‌ను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నది ఎక్స్ వాదన.తగు ప్రక్రియను అనుసరించకుండా అధికారులు ఏకపక్షంగా కంటెంట్ సెన్సార్ షిప్ విధిస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తోంది. అదేవిధంగా, సామాజిక మాధ్యమ వేదికలు, పోలీసులు, దర్యాప్తు విభాగాల మధ్య సమన్వయం కోసం హోం శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన సహయోగ్ పోర్టల్‌ను ఎక్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. న్యాయపరమైన సమీక్ష లేకుండానే ఫలానా కంటెంట్‌ను తొలగించాలంటూ ‘సహయోగ్’నేరుగా తమపై ఒత్తిడి చేస్తోందని కూడా ‘ఎక్స్’అంటోంది. -
ఎక్స్‌పై సైబర్ ఎటాక్ ఆ దేశం పనే!
ఎలాన్ మస్క్ (Elon Musk) సారథ్యంలోని ఎక్స్(ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ప్రపంచవ్యాప్తంగా పలుమార్లు డౌన్ అయింది. ఈ విషయాన్ని మస్క్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఎక్స్ సైబర్ దాడిని ఎదుర్కొంటోందని.. హ్యాకర్లను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని ట్వీట్ చేశారు. దీని వెనుక ఒక పెద్ద సమూహం లేదా ఒక దేశం హస్తం ఉండొచ్చు అని మస్క్ తెలిపారు. ఉక్రెయిన్ ప్రాంతంలోని ఐపీ చిరునామాల నుంచి సైబర్ దాడి జరిగిందని అన్నారు. ఈ కారణంగానే రోజంతా అంతరాయం ఏర్పడిందని అన్నారు.డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. ఎక్స్ ప్లాట్‌ఫామ్ రోజంతా మూడు అంతరాయాలను ఎదుర్కొంది. మధ్యాహ్నం 3:00 గంటలకు ఈ అంతరాయాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారతదేశం నుంచి దాదాపు 2000 మంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి 18,000 మంది, యునైటెడ్ కింగ్డమ్ నుంచి 10,000 మంది ఎక్స్ యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయినట్లు స్పష్టం చేసింది. రాత్రి 9 గంటలకు కూడా ఈ అంతరాయాలు కొనసాగాయి.ట్రాకింగ్ వెబ్సైట్ దాదాపు 52 శాతం సమస్యలు వెబ్‌సైట్‌కు సంబంధించినవని, 41 శాతం యాప్‌కు సంబంధించినవని, 8 శాతం సర్వర్ కనెక్షన్ సమస్యలతో సంబంధం కలిగి ఉన్నాయని చూపించింది. ఇప్పుడు కూడా అంతరాయం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఎలాన్ మస్క్ 2022లో 44 బిలియన్ డాలర్లకు (రూ. 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ) Xని కొనుగోలు చేశారు. 2023లో అతని ఫాలోవర్స్ సంఖ్య 200 మిలియన్స్ దాటేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న మొదటి వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు. -
ఎక్స్ డౌన్: గగ్గోలు పెడుతున్న యూజర్లు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నాయకత్వంలో నడుస్తున్న ఎక్స్ (ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది వినియోగదారులు ఈ సోషల్ మీడియా యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయినట్లు వెల్లడించారు.ఆన్లైన్ అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్ నివేదికల ప్రకారం.. భారతదేశం నుంచి దాదాపు 2000 మంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి 18,000 మంది, యునైటెడ్ కింగ్డమ్ నుంచి 10,000 మంది ఎక్స్ యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ అంతరాయంపై కంపెనీ స్పందించలేదు.X Twitter Down, Users Face Outage: Social media platform X has started showing troubles as several users reported it was not working in India which could be because of a technical glitch. pic.twitter.com/mmhRrJP6Oa— Divya 🦋 (@Hiraeth85) March 10, 2025యాప్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు.. చాలా మంది వినియోగదారులకు "ఏదో తప్పు జరిగింది, మళ్లీ లోడ్ చేయడానికి ప్రయత్నించండి" అనే సందేశం వచ్చింది.డౌన్‌డెటెక్టర్ డేటా ప్రకారం 57% మంది వినియోగదారులు X యాప్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నారని, 34% మంది వెబ్సైట్లో సమస్యలు ఉన్నాయని, 9% మంది సర్వర్ సమస్యలను నివేదించారని తేలింది. UKలో, 61% మంది వినియోగదారులు అప్లికేషన్ గురించి, 34% మంది వెబ్సైట్ గురించి, 5% మంది సర్వర్ సమస్యలను ఎదుర్కొన్నారు.𝕏 is down / having connection issues. @grok is also down and unable to complete requests.— Nicky 🇬🇧 (@NickyThomas) March 10, 2025 -
జెలెన్స్కీకి యూరప్ బాసట
న్యూయార్క్: అధ్యక్షుల రగడలో యూరప్‌తో సహా పలు ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి బాసటగా నిలిచాయి. దేశాధినేతలంతా శనివారం ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. వారందరికీ జెలెన్స్కీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు అమెరికా, యూరప్ దేశాల మధ్య పెరుగుతున్న అంతరానికి కూడా ఈ ఉదంతం అద్దం పట్టింది. రష్యా మాత్రం జెలెన్స్కీకి తగిన శాస్తే జరిగిందంటూ ఎద్దేవా చేసింది. ‘‘అంతటి వాగ్యుద్ధంలోనూ ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్ చూపిన సంయమనం అభినందనీయం. జెలెన్స్కీని వాళ్లు కొట్టకపోవడం నిజంగా అద్భుతమే’’ అని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జకరోవా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్, వాన్స్ వైఖరిని అమెరికా మంత్రులు పూర్తిగా సమర్థించుకున్నారు. ఈ మేరకు వారంతా పోటాపోటీగా ప్రకటనలు విడుదల చేశారు. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సెనేటర్ జాక్ రీడ్ తదితరులు మాత్రం ట్రంప్, వాన్స్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. జెలెన్స్కీని కించపరిచేలా వారు వ్యవహరించిన తీరు అమెరికాకే అవమానకరమని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఎంతగా రష్యా వైపు, పుతిన్ వైపు మొగ్గినా అమెరికా ప్రజలు మాత్రం ఎప్పటికీ ఉక్రెయిన్‌కే దన్నుగా నిలుస్తారన్నారు. జెలెన్స్కీతో ట్రంప్, వాన్స్ వ్యవహరించిన తీరు నిజంగా సిగ్గుచేటని రీడ్ మండిపడ్డారు. తమ ప్రవర్తనతో అంతర్జాతీయంగా అమెరికా విశ్వసనీయతనే దెబ్బతీశారని ఆవేదన వెలిబుచ్చారు. దీన్ని ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. ఆత్మగౌరవం ప్రదర్శించారు: ఉర్సులా ఉక్రెయిన్ ప్రజల ధైర్యాన్ని నిలబెట్టేలా జెలెన్స్కీ ఆత్మగౌరవం ప్రదర్శించారంటూ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియన్ కొనియాడారు. ‘‘నిర్భయంగా, ధైర్యంగా, బలంగా ఉండండి. మీరు ఒంటరి కారు. శాశ్వత శాంతి కోసం మేమంతా మీతో కలిసి పని చేస్తాం’’ అని పేర్కొన్నారు. ‘‘రష్యా ఒక దురాక్రమణదారు. ఉక్రెయిన్ బాధితురాలు. మేం ఆ దేశానికి సాయం చేయడం, రష్యాపై ఆంక్షలు విధించడం అస్సలు తప్పు కాదు. అమెరికా, యూరప్ దేశాలు, కెనడా, జపాన్ తదితరాలన్నీ ఇకముందూ ఇదే వైఖరి కొనసాగిస్తాయి’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించే దౌత్య యత్నాలను తిరిగి పట్టాలెక్కించేందుకు తక్షణం ఈయూ–అమెరికా శిఖరాగ్ర భేటీ జరగాలని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌కు, జెలెన్స్కీకి మీకు తామంతా అన్నివేళలా వెన్నుదన్నుగా నిలుస్తామని జర్మనీ కాబోయే చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా అక్రమంగా దండెత్తిందన్నది కాదనలేని వాస్తవమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. లాతి్వయా, ఎస్తోనియా, ఫిన్లండ్, లగ్జెంబర్గ్, పోలండ్, హాలండ్ తదితర దేశాధినేతలు కూడా జెలెన్స్కీకి మద్దతుగా పోస్టులు చేశారు.మూడో ప్రపంచయుద్ధానికి బాటలు... ‘‘అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం ముందుకు సాగలేదు. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నిరంతరం అమెరికా ప్రజల ప్రయోజనాల పరిరక్షణకే పాటుపడతారు. ప్రపంచంలో అమెరికా స్థానాన్ని గౌరవించని వాళ్లు మానుంచి అనుచిత లబ్ధి పొందేందుకు వారెన్నటికీ అనుమతించబోరు. జెలెన్స్కీతో భేటీలో ట్రంప్ మాటతీరే ఇందుకు తాజా నిదర్శనం. యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలని ఉక్రేనియన్లలో ఏకంగా 52 శాతం మంది కోరుతున్నట్టు గత నవంబర్‌లో జరిగిన సర్వే తేల్చింది. రష్యాకు భూభాగాన్ని కోల్పోవడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉండాలి. లేదంటే ట్రంప్ హెచ్చరించినట్టు మూడో ప్రపంచ యుద్ధం తప్పదు. అది ఉక్రెయిన్‌లో మొదలవుతుంది. ఇజ్రాయెల్ మీదుగా ఆసియా దాకా పాకుతుంది. తర్వాత అంతటా విస్తరిస్తుంది’’ – వైట్‌హౌస్ ప్రకటన -
'దయచేసి ఎవరూ కూడా లింక్స్ క్లిక్ చేయొద్దు'.. అభిమానులకు సింగర్ విజ్ఞప్తి
ఇటీవల సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేయడం పరిపాటిగా మారింది. గతంలో పలువురి సినీతారల అకౌంట్స్‌ను హ్యాకింగ్ గురైన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేశారు. ఫిబ్రవరి 13వ తేదీన ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైనట్లు సోషల్ మీడియా వేదికగా సింగర్ వెల్లడించింది. దాదాపు రెండు వారాలైనా తన ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఎవరూ కూడా తన ట్విటర్ ఖాతా నుంచి వచ్చే పోస్టులు, లింక్స్‌ను క్లిక్ చేయొద్దని అభిమానులకు సూచించింది.తన ఇన్‌స్టాలో శ్రేయా ఘోషల్ రాస్తూ..' నా అభిమానులు, స్నేహితులకు ఒక్కటే విజ్ఞప్తి. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి నా ఎక్స్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. దీనిపై ఎక్స్ బృందాన్ని సంప్రదించేందుకు శతవిధాలా ప్రయత్నించా. కానీ ఆటో జనరేటెడ్ రెస్పాన్స్‌ల ద్వారా నాకు ఎలాంటి పరిష్కారం దొరకలేదు. నా ఖాతాను డిలీట్ చేయాలనుకున్నా కూడా యాక్సెస్ చేయలేకపోతున్నా. కనీసం నా ఖాతా లాగిన్ అవ్వడానికి కూడా వీలు లేకుండా పోయింది. దయచేసి నా ఖాతాలో వచ్చే పోస్టులు, లింక్‌లను ఎవరూ కూడా క్లిక్ చేయొద్దు. అదే విధంగా అందులో వచ్చే స్పామ్ మేసేజులు, లింకులను క్లిక్ చేయొద్దు. నా ఖాతా రికవరీ అయిన వెంటనే ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా' అని సింగర్ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) -
ఎలాన్ మస్క్‌ను సూటిగా ప్రశ్నించిన అనుపమ్ ఖేర్.. అసలేం జరిగిందంటే?
ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో క్రేజ్ తెచ్చుకున్న నటుడు అనుపమ్ ఖేర్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారాయన. ఇటీవలే ప్రభాస్ మూవీలోనూ ఛాన్స్ కొట్టేశాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కించబోయే చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బాహుబలి ప్రభాస్‌తో నా 544వ చిత్రం చేయడం ఆనందంగా ఉందని అనుపమ్ ట్వీట్ చేశారు. అయితే తాజాగా అనుపమ్ ఖేర్‌కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఎక్స్ ఖాతా కొంతసేపు లాక్ అయింది. ఈ విషయంపై ఏకంగా ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్‌ను ఆయన ప్రశ్నించారు. దీనిపై ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టారు. తన అకౌంట్ లాక్ అయినట్లు వచ్చిన స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు. మీ అకౌంట్ లాకైంది. ఈ ప్లాట్‌ఫామ్ వేదికగా మీరు పోస్ట్ చేసిన కంటెంట్ విషయమై డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం కింద ఎక్స్‌కు ఒక ఫిర్యాదు వచ్చిందని అందులో రాసి ఉంది.దీనిపై అనుపమ్ తన ట్వీట్లో రాస్తూ.. 'నా ఖాతాను పునరుద్దరించినందుకు థ్యాంక్స్. కానీ నా అకౌంట్ లాక్ కావడం చూసి ఆశ్చర్యపోయాను. నేను 2007 సెప్టెంబర్ నుంచి ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ఉపయోగిస్తున్నా. నాకు ట్విటర్ నియమాలు, కాపీరైట్స్ గురించి బాగా తెలుసు. అందువల్ల నాకు అసంతృప్తిగా అనిపించింది. నేను చేసిన ఏ పోస్ట్ మీ నిబంధనలను ఉల్లంఘించిందో తెలుసుకోవచ్చా? అంటూ' పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Dear X! Even though my account has been restored I was surprised to see it locked. I have been on this platform since September 2007. Have always been mindful of rules of #X (formerly twitter). Or for that matter any social media copyright rules. So found it a little absurd.… pic.twitter.com/tNmhc30vtP— Anupam Kher (@AnupamPKher) February 24, 2025 -
ఎక్స్ యూజర్లకు షాక్!.. భారీగా పెరిగిన ధరలు
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) ఎక్స్ఏఐ కొత్త వర్షన్ 'గ్రోక్ 3'(Grok 3)ని లాంచ్ చేసిన తరువాత.. ఎక్స్ (ట్విటర్) ప్రీమియం+ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు రెండు రెట్లు పెరిగాయి. గత మూడు నెలల్లో సబ్స్క్రిప్షన్ ప్లాన్లను పెంచడం ఇదే రెండో సారి.ఇండియాలో ఇప్పటివరకు.. ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర నెలకు రూ. 1750 మాత్రమే. ధరలు పెరిగిన తరువాత ఇది రూ. 3,470కు చేరింది. వార్షిక ప్లాన్ కూడా రూ. 18,300 నుంచి రూ. 34,340కి పెరిగింది. బేసిక్ ప్లాన్ ధర నెలకు రూ. 244 కాగా.. ప్రీమియం ప్లాన్ ధర రూ. 650గా ఉన్నాయి.గ్రోక్ 3టెస్లా అధినేత మస్క్.. ఎక్స్‌లో ఇంజినీర్ల సమక్షంలో ఏర్పాటు చేసిన లైవ్ స్ట్రీమ్ ప్రజెంటేషన్‌లో కొత్త జనరేటివ్ ఏఐ మోడల్ 'గ్రోక్ 3'ను ఆవిష్కరించారు. గ్రోక్ 3 ఇప్పటివరకు ఉన్న గ్రోక్ 2 కంటే 10 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పని చేస్తుందని పేర్కొన్నారు. గణితం, సైన్స్, కోడింగ్ వంటి వివిధ విభాగాల్లో మార్కెట్లో పోటీదారులుగా ఉన్న ఆల్ఫాబెట్ ఇంక్‌కు చెందిన గూగుల్ జెమిని, డీప్ సీక్- వీ 3 మోడల్, ఆంత్రోపిక్-క్లాడ్, ఓపెన్ఎఐ-జీపీటీ-4ఓ కంటే సమర్థంగా పని చేస్తుందని చెప్పారు.ఇదీ చదవండి: ఎల్ఐసీ కొత్త ప్లాన్: సింగిల్ పేమెంట్.. జీవితాంతం ఆదాయం! -
పేరు మార్చుకుంటే రూ.8,600 కోట్లు ఆఫర్!
ఎక్స్(గతంలో ట్విటర్) సీఈఓ ఎలాన్ మస్క్ వికీపీడియా పేరు మార్చుకుంటే ఏకంగా ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు(రూ.8,600 కోట్లు) ఇస్తానని ఆఫర్ చేశారు. గతంలో ఈమేరకు వికీపీడియా పేరు మార్పునకు సంబంధించి ఒక బిలియన్ డాలర్లు చెల్లిస్తానని చెప్పారు. తాజాగా ఓ నెటిజన్ మస్క్‌ను ‘ఈ ఆఫర్ ఇంకా ఉందా’ అని ప్రశ్నించారు. దాంతో మస్క్ తన ట్విటర్లో స్పందిస్తూ ‘ఆఫర్ ఉంది. రండి.. పేరు మార్చండి’ అంటూ అదే విషయాన్ని మళ్లీ ధ్రువీకరించారు.వివాదం నేపథ్యంవికీపీడియాతో కొనసాగుతున్న వైరంలో భాగంగా మస్క్ ఈ ఆఫర్ ప్రకటించారు. వికీపీడియా ఆర్థిక పద్ధతులు, రాజకీయ పక్షపాతం కారణంగా మస్క్ ఈ విమర్శలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో వికీపీడియాను ‘వేక్పీడియా’ అని సంబోధించిన ఆయన, తన అనుచరులు ఈ వేదికకు విరాళాలు ఇవ్వడం మానేయాలని కోరారు. వికీమీడియా ఫౌండేషన్ తన నిధులను ముఖ్యంగా డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్ క్లూజన్ (డీఈఐ) కార్యక్రమాలకు కేటాయిస్తున్న నేపథ్యంలో మస్క్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది.Offer still stands. Come on, do it … https://t.co/RtRfd8wOI5— Elon Musk (@elonmusk) February 17, 2025మస్క్ వికీపీడియాపై గతంలో చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నారా అని నెటిజన్లు వేసిన ప్రశ్నలకు మస్క్ సూటిగా స్పందించారు. వికీపీడియా పేరు మార్పునకు సంబంధించి ‘ఈ ఆఫర్ ఇప్పటికీ ఉందా?’ అని మస్క్‌ను ట్విటర్లో కోట్ చేస్తూ జాన్స్ మీమ్స్ అనే యూజర్ చేసిన ట్వీట్‌కు సమాధానంగా మస్క్ స్పందించారు. ‘ఆఫర్ ఇంకా ఉంది. రండి, పేరు మార్చండి..’ అని తెలిపారు. వికీపీడియాకు ‘డికిపీడియా’గా పేరు మార్పును ప్రతిపాదించారు.నెటిజన్ల స్పందనమస్క్ ఆఫర్‌కు సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది వికీపీడియా నిధుల నిర్వహణపై మస్క్‌కు ఏం సంబంధం? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు లాభాపేక్ష లేని సంస్థలు తమ వద్ద ఉన్న వనరులను ఎలా నిర్వహిస్తున్నాయనే దానిపై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నట్లు చెబుతున్నారు. మస్క్ విమర్శలు కొనసాగుతున్నప్పటికీ వికీపీడియా నమ్మదగిన, పారదర్శక ప్లాట్‌ఫామ్ అని పేర్కొంటూ సంస్థ వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్ తెలిపారు. అయితే మస్క్ ప్రతిపాదనపై మాత్రం ఏవిధంగానూ స్పందించలేదు. -
వైఎస్సార్సీపీ రీట్వీట్‌తో నీళ్లు నమిలిన నారా లోకేష్
సాక్షి,అమరావతి : రాష్ట్ర అప్పులపై నారా లోకేష్ కాకిలెక్కలు చెప్పారు. కళ్లార్పకుండా అబద్దాలను చెప్పడంలో తండ్రి చంద్రబాబును మించిన తనయుడిగా చెలామణి అవుతున్నారు. నారా లోకేష్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పులను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే అని చూపుతూ ట్వీట్లో పేర్కొన్నారు. విభజన సమయానికి ఏపీ వాటా అప్పుల వడ్డీ రూ.7,488 కోట్లు ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్ర అప్పులు బాగా పెరిగాయి.ఇదే అంశాన్ని వైఎస్సార్సీపీ ఆధారాలతో సహా నిరూపించింది. వైఎస్సార్సీపీ రీట్వీట్‌తో లోకేష్ నీళ్లు నమిలారు. ఆర్థిక విధ్వంసుడు తన తండ్రేనని తేలడంతో కిక్కురుమనకుండా లోకేష్ సైలెంట్ అయ్యారు. ఈ తొమ్మిది నెలల్లోనే లక్షన్నర కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు.. ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. మరి ఆ లక్షన్నర కోట్లకు లెక్కలు చెప్పమంటే చంద్రబాబు,లోకేష్ నోరెత్తకపోవడంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. .@naralokesh.. నీ ట్వీట్ చూస్తుంటే పబ్లిక్ ఫైనాన్స్‌పై నీకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదని అర్థమవుతోంది మార్కెట్ రుణాలపై వడ్డీ చెల్లింపునకే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం అనుకోవడం నీ అవివేకంరాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల్లో 75% మార్కెట్ రుణాలే కాదు..ఇంకా మిగతా వాటిల్లో కూడా చాలా… https://t.co/ZTVFSAL3IP— YSR Congress Party (@YSRCParty) February 17, 2025 -
మస్క్, ఆల్ట్‌మన్ మధ్య ట్వీట్ల యుద్ధం: ఎవ్వరూ తగ్గట్లే!
టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఎక్స్ (ట్విటర్) సంస్థను 2022లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈయన చూపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ 'ఓపెన్ఏఐ' (OpenAI) మీద పడింది. ఈ కంపెనీని కొనుగోలు చేస్తా అంటూ ఆఫర్ కూడా ఇచ్చారు.2024లో రెండుసార్లు OpenAIపై దావా వేసిన మస్క్ ఇప్పుడు.. సంస్థనే కొనుకోలు చేయడానికి సిద్ధమయ్యాయి. 97.4 బిలియన్ డాలర్లకు ( సుమారు రూ. 8.5 లక్షల కోట్లు) కొనుగోలు చేస్తామంటూ.. మస్క్ నేతృత్వంలోని పెట్టుబడిదారుల బృందం ఆఫర్ ఇచ్చింది. దీనిని ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్' (Sam Altman) తిరస్కరించారు.మీ ఆఫర్‌కు ధన్యవాదాలు, మీకు కావాలంటే మేము ఎక్స్(ట్విట్టర్)ని 9.74 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 85వేలకోట్లు) కొనుగోలు చేస్తామని ఆల్ట్‌మన్ ట్వీట్ చేశారు. ఈ పోస్టుపై మస్క్ స్పందిస్తూ.. 'మోసగాడు' అని రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.no thank you but we will buy twitter for $9.74 billion if you want— Sam Altman (@sama) February 10, 2025ఓపెన్ఏఐనవంబర్ 2022లో వచ్చిన ఓపెన్ ఏఐకు చెందిన చాట్‌జీపీటీ (ChatGPT) కేవలం ఆరు నెలల్లోనే అధిక ప్రజాదరణ పొందింది. శామ్ ఆల్ట్‌మన్ 2015లో ఓపెన్ఏఐ ప్రారంభించినప్పుడు.. మస్క్ కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. ఆ తరువాత 2018లో బయటకు వచ్చేసారు. మస్క్ ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన తరువాత.. 2019లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 17 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది.ఇదీ చదవండి: ఇప్పుడు బంగారంపై పెట్టుబడి సురక్షితమేనా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..2024లో మస్క్ ఓపెన్ఏఐ కంపెనీపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో దావా వేశారు. కంపెనీ మొదలుపెట్టినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంగిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇంకా ఆ దావాపై తీర్పు వెలువడలేదు. అంతలోనే మస్క్ కొనుగోలు చేయాలనుకుంటున్న విషయం తెరమీదకు వచ్చింది.Scam Altmanpic.twitter.com/j9EXIqBZ8u— Elon Musk (@elonmusk) February 10, 2025 -
డిప్యూటి సీఎం పవనన్ను ఉద్దేశించి రోజా ట్వీట్
-
బాలీవుడ్ హీరోయిన్‌కు షాకిచ్చిన ట్విటర్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు ట్విటర్ షాకిచ్చింది. కాపీ రైట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ ఆమె ట్విటర్(ఖాతా)ను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని స్వర భాస్కర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. నేను చేసిన ట్వీట్స్‌లో రెండు ఫోటోలు కాపీ రైట్ ఉల్లంఘించినట్లుగా గుర్తించి నా ఖాతాను రద్దు చేశారని తెలిపింది. అయితే తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని అని పోస్ట్ చేసింది. ఇలాంటి నిర్ణయాలు తనకు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపింది. అంతా కాకుండా మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నా అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.అసలేం జరిగిందంటే..ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వర భాస్కర్ పోస్ట్ ఈ ట్విటర్ అకౌంట్(ఎక్స్) సస్పెన్షన్‌కు ప్రధాన కారణం. ఒకటి హిందీ దేవనాగరి లిపిలో "గాంధీ హమ్ శర్మిందా హై, తేరే ఖాతిల్ జిందగీ హై" అనే నినాదం రాసిన ఫోటో కాగా.. మరొకటి తన కుమార్తె జాతీయ జెండా పట్టుకుని ఉండగా.. ఆ పిల్లాడి మొహన్ని కనిపించకుండా హ్యాపీ రిపబ్లిక్ డే ఇండియా అంటూ పోస్ట్ చేసింది. ఈ రెండు పోస్ట్‌లపై ట్విటర్ నిబంధనలు ఉల్లంఘించారంటూ స్వరభాస్కర్ అకౌంట్‌ను సస్పెండ్ చేశారు. కాగా.. స్వర భాస్కర్ విషయానికొస్తే సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2023లో జనవరి 6న వీరి పెళ్లి జరిగింది. మొదట రిజిస్టర్ మ్యారేజ్ ద్వారా భార్యాభర్తలయ్యారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
పేరు మార్చుకున్న మస్క్.. వినడానికే వింతగా ఉంది!
ప్రపంచ కుబేరుడు.. టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) తన పేరును మార్చుకున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్టాపిగ్గా మారింది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు.ఒకవైపు బిజినెస్, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న మస్క్.. తాజాగా తన ఎక్స్ (Twitter) అకౌంట్ పేరును 'కేకియస్ మాక్సిమస్' (Kekius Maximus)గా మార్చుకున్నారు. వినడానికి ఈ పేరు వింతగా ఉన్నప్పటికీ.. దీనికో అర్థం కూడా ఉంది. కేకియస్ అనేది ఓ క్రిప్టో కరెన్సీ టోకెన్. ఇది అనేక బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.ఇలాన్ మస్క్ క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇస్తున్నారనే విషయం అందరికి తెలుసు. ఇందులో భాగంగానే తన ఎక్స్ ఖాతా పేరును.. క్రిప్టో కరెన్సీ అర్థం వచ్చేలా మార్చుకున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. 2023లో కూడా తన ఎక్స్ అకౌంట్ పేరును 'మిస్టర్ ట్వీట్'గా మార్చుకున్నారు.Changed my name to Mr. Tweet, now Twitter won’t let me change it back 🤣— Kekius Maximus (@elonmusk) January 25, 2023సంపదలో మస్క్ కొత్త రికార్డ్ బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. యుఎస్ అధ్యక్ష ఎన్నికల తరువాత ఈయన సంపద గణనీయంగా పెరిగింది. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ స్పేస్ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగిందని సమాచారం.ఇదీ చదవండి: ఇలాన్ మస్క్ బూతు ప్రయోగం2022 వరకు మస్క్ నికర విలువ 200 డాలర్ల కంటే తక్కువ ఉండేది. అయితే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన తరువాత.. ఈయన సంపాదన భారీగా పెరిగింది. తాజాగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది. మొత్తం మీద 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33.20 లక్షల కోట్లు) నికర విలువను అధిగమించిన మొదటి వ్యక్తిగా ఇలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. -
ఎక్స్ యూజర్లకు షాక్!.. భారీగా పెరిగిన ధరలు
ఇలాన్ మస్క్ (Elon Musk) యాజమాన్యంలోని.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (Twitter) తన ప్రీమియం ప్లస్ ధరల పెంపును ప్రకటించింది. డిసెంబర్ 21 నుంచే ప్రపంచంలోనే చాలా దేశాల్లో ప్రీమియం ప్లస్ ధరలను పెంచిన ఎక్స్.. ఇప్పుడు తాజాగా భారత్‌లోనూ పెంచినట్లు వెల్లడించింది.ఇప్పటికే ప్రీమియం ప్లస్ (Premium Plus) ప్లాన్ ఎంచుకున్న వారు మినహా.. మిగిలినవారు కొత్త ధరల ప్రకారమే చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. యునైటెడ్ స్టేట్స్లో.. నెలవారీ ప్రీమియం ప్లస్ రేటు 16 డాలర్ల నుంచి 22 డాలర్లకు పెరిగింది. అదే సమయంలో వార్షిక చందా కూడా 168 డాలర్ల నుంచి 229 డాలర్లకు చేరింది.భారత్‌లోనూ ఈ ప్రీమియం ప్లస్ ధరలు రూ. 1,300 నుంచి రూ. 1,750కి పెరిగింది. అంటే ఈ ధరలు 35 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. యాన్యువల్ సబ్స్క్రైబర్లు కూడా ఇప్పుడు 18,300 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ధరల పెరుగుదలకు ముందు.. యాన్యువల్ సబ్స్క్రైబర్లు రూ. 13,600 మాత్రమే చెల్లించాల్సి ఉండేది.పెరిగిన ఎక్స్ ప్రీమియం ప్లస్ ధరలు దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే ప్రీమియం ప్లస్ ధరలు పెరిగినప్పటికీ.. భారతదేశంలో బేసిక్, స్టాండర్డ్ ప్రీమియం ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఈ ప్లాన్స్ సబ్స్క్రైబర్లు మునుపటి మాదిరిగానే 243 రూపాయలు, 650 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియోప్రస్తుత సబ్స్క్రైబర్ల ధరల నిర్మాణాన్ని కూడా ఎక్స్ స్పష్టం చేసింది. మీ తదుపరి బిల్లింగ్ సైకిల్ 20 జనవరి 2025లోపు ప్రారంభమైతే, మీరు పాత ధరనే చెల్లిస్తే సరిపోతుంది. ఆ తరువాత కొత్త రేటు వర్తిస్తుంది. సర్వీస్‌ల పెంపుదల కారణంగానే ధరల పెంచినట్లు సంస్థ వెల్లడించింది. ప్రీమియం ప్లస్ సబ్స్క్రైబర్లు యాడ్-ఫ్రీ బ్రౌజింగ్‌ను పొందవచ్చు. అంతే కాకుండా గ్రోక్ ఏఐ చాట్‌బాట్, రాడార్ వంటి కొత్త ఫీచర్లకు యాక్సెస్ చేయవచ్చు. -
ఎక్స్‌లో లేఆఫ్, కట్ చేస్తే : వైట్‌హౌస్‌లోకి సగర్వంగా ‘ప్రియాంక’
నా ఉద్యోగం పోయింది అని బాధపడుతూ కూర్చోలేదు ఆమె. కొత్త కరియర్‌ను వెతుక్కుంది. పడిలేచిన కెరటంలా ఒక కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించుకొంది. కట్ చేస్తే వైట్ హౌస్‌లో స్పెషల్ గెస్ట్‌గా అవతరించింది.ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన దీపావళి వేడుకలకు ఆహ్వానం అందుకున్న 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లలో ఒకరిగా నిలిచింది. టెక్కీ-నుంచి ఫుడ్ ఆర్టిస్ట్‌గా పాపులర్ చెఫ్ ప్రియాంక నాయక్ సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం రండి!అమెరికాలోని బోస్టన్ యూనివర్శిటీలో చదువుకున్న భారతీయ సంతతికి చెందిన స్టేటెన్ ద్వీపానికి చెందిన ప్రియాంక నాయక్ ఎక్స్(ట్విటర్)లో పనిచేసింది. లేఆఫ్స్‌లో భాగంగా 2022 లో ఉద్యోగాన్ని కోల్పోయింది. అంతకుముందు దాదాపు పదేళ్ల పాటు వివిధకంపెనీల్లో టెకీగా పని చేసింది. టెక్ ప్రపంచంలోతనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. టెకీగా విజయం సాధించినప్పటికీ, నాయక్ మనసు మాత్రం ఎపుడూ వంటలు చుట్టూ తిరుగుతూ ఉండేది. ఇందలో ఉద్యోగం మీద దెబ్బ పడింది. కానీ ఆమె పట్టుదల మాత్రం చెక్కు చెదరలేదు. వంట చేయడం పట్ల ఆమెకున్న అభిరుచినే పెట్టుబడిగా మల్చుకుంది. సోషల్ మీడియాలో పాకశాస్త్ర బ్లాగ్‌తో ఆమె అవార్డ్ విన్నింగ్ జర్నీ మొదలైంది. ప్రత్యేకమైన తన వంటకాలను నెటిజన్లుతో పంచుకొనేది.సుస్థిరత, పర్యావరణ అనుకూల విధానాలతో శాకాహారి చెఫ్‌గా మంచి ఆదరణను దక్కించుకుంది. క్రిస్సీ టీజెన్ లాంటి టాప్ సెలబ్రిటీలను ఆకర్షించింది. తొలి తరం భారతీయ అమెరికన్‌గా, నాయక్ తన బ్రాండ్‌లో వంట పుస్తక విక్రయాలు, సోషల్ మీడియా స్పాన్సర్షిప్స్, వాషింగ్టన్ పోస్ట్‌లోని ఆమె ప్రత్యేకమైన “ఎకోకిచెన్” కాలమ్ ద్వారా మంచి ఖ్యాతిని సంపాదించింది. అటు ఆర్థికంగా సక్సెస్‌ను అందుకుంది. లక్షల్లో ఆర్జించడంతో పాటు ఇటు పాపులారిటీని కూడా దక్కించుకుంది. (తాతగారి సెన్సేషనల్ విడాకులు : భరణం ఎంతో తెలిస్తే అవాక్కే!)ఈ క్రమంలోనే 2024 అక్టోబర్‌లో నాయక్ వైట్ హౌస్‌లో జరిగిన అతిపెద్ద దీపావళి వేడుకలకు స్పెషల్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లలో తాను కూడా ఉన్నానంటూ తన స్టోరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక.‘‘జీవితంలో ఎన్నో కష్టాలు, వ్యక్తిగతంగా, వృతిపరంగా ఎన్నో అవమానాలు.. తిరస్కరణలు.. కానీ స్వయంకృషితో రచయిత/టీవీహోస్ట్గాఎదిగాను. ఇపుడు ప్రతిష్టాత్మక వైట్‌హౌస్ దీపావళి వేడుకలకు హాజరు.. ఇది చాలా సంతోషంగానూ,గర్వంగానూ ఉంది’’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ప్రియాంక. View this post on Instagram A post shared by Priyanka Naik | Eco Chef & Travel (@chefpriyanka) -
మణిపూర్ హింసకు స్టార్‌లింక్ వినియోగం.. మస్క్ ఏమన్నారంటే?
ఇంఫాల్: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలో అగంతకులు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపై స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు.మణిపూర్‌లో ఇటీవల పెద్దఎత్తున హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా మృతి చెందడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నిరసనలకు దిగారు. 24 గంటల్లోపు హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇంఫాల్‌లో ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లపై కొందరు దుండగులు దాడిచేసి నిప్పుపెట్టారు. ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ అల్లుడి ఇళ్లు సహా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ఆందోళన చేశారు. Acting on specific intelligence, troops of #IndianArmy and #AssamRifles formations under #SpearCorps carried out joint search operations in the hill and valley regions in the districts of Churachandpur, Chandel, Imphal East and Kagpokpi in #Manipur, in close coordination with… pic.twitter.com/kxy7ec5YAE— SpearCorps.IndianArmy (@Spearcorps) December 16, 2024అయితే, ఈ ఆందోళన అనంతరం,భద్రతా బలగాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు కొన్ని ఇంటర్నెట్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. కైరావ్ ఖునౌ అనే ప్రాంతం నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులలో ఇంటర్నెట్ శాటిలైట్ యాంటెన్నా, ఒక ఇంటర్నెట్ శాటిలైట్ రూటర్, 20 మీటర్ల ఎఫ్టీపీ కేబుల్స్ లభ్యమయ్యాయని రాష్ట్ర పోలీసులు ధృవీకరించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పరికరాలలో ఒకదానిపై స్టార్‌లింక్ లోగో ఉన్నట్లు గుర్తించారు. దీంతో సంఘ విద్రోహ శక్తులు స్టార్‌లింక్ శాటిలైట్‌ను వినియోగిస్తున్నారు. స్టార్‌లింక్ అధినేత ఎలాన్ మస్క్ ఈ దుర్వినియోగాన్ని నియంత్రిస్తారని ఆశిస్తున్నాము’అంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై మస్క్ స్పందించారు. ‘ఇది తప్పు. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు భారత్‌లో నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. -
10 రూపాయిల వాటర్ బాటిల్ ఖరీదు వంద రూపాయలా?
ఢిల్లీ: రూ.10 వాటర్ బాటిల్ రూ.100కి అమ్మడం ఏంటి? అని ప్రశ్నిస్తూ ఓ ఐటీ ఉద్యోగి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఐటీ ఉద్యోగి పల్లబ్దే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో రూ.10 వాటర్ బాటిల్‌ను రూ.100కి అమ్ముతున్నట్లు గుర్తించాడు. ఇదే విషయాన్ని ప్రముఖ ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటాను అడిగారు.How is @zomato allowed to sell Rs. 10 water bottles for Rs. 100 at concert venues where no one is allowed to bring their own bottles?@VijayGopal_ pic.twitter.com/clQWDcIb7m— Pallab De (@indyan) December 17, 2024 ‘తాము పాల్గొన్న ఈవెంట్లో వాటర్ బాటిల్స్ నిషేదం.ఈవెంట్ నిర్వహించే వాళ్లే వాటర్ బాటిళ్లనూ అమ్ముతున్నారు. దాహం వేస్తుంది కదా అని రూ.10 వాటర్ బాటిళ్లను రెండింటిని కొనుగోలు చేశా. రూ.20 ఇచ్చా. కానీ సదరు వాటర్ బాటిల్ అమ్మే వ్యక్తి నా నుంచి రూ.200 వసూలు చేశారు.‘ఎవరూ తమ సొంత వాటర్ బాటిళ్లను తీసుకురావడానికి అనుమతించని ఈవెంట్లో రూ.10 వాటర్ బాటిల్‌ను రూ.100కి విక్రయించడానికి జొమాటోకి అనుమతి ఎలా వచ్చింది? అని అడుగుతూ రెండు వాటర్ బాటిళ్ల ఫొటోల్ని ట్వీట్లో జత చేశాడు.పల్లబ్ ట్వీట్‌పై జొమాటో స్పందించింది. తాము, ఆ వాటర్ బాటిల్స్‌ను అమ్మలేదని, టికెటింగ్ పార్ట్నర్గా ఉన్నట్లు తెలిపింది. అయినప్పటికీ కస్టమర్‌కు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. -
మస్క్ హింట్ ఇచ్చారా!.. దిగ్గజాల కథ కంచికేనా?
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ 'ఎక్స్ మెయిల్' పేరుతో ఈమెయిల్ ప్రారభించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక యూజర్ ట్వీట్ చేస్తూ.. ఎక్స్.కామ్ ఈమెయిల్ కలిగి ఉండటం ఒక్కటే, నన్ను జీమెయిల్ ఉపయోగించకుండా ఆపగలదని పేర్కొన్నారు. దీనికి రిప్లై ఇస్తూ.. ఈమెయిల్‌తో సహా మెసేజింగ్ మొత్తం ఎలా పని చేస్తుందో మనం పునరాలోచించాలని మస్క్ అన్నారు.2024 సెప్టెంబర్ నాటికి గ్లోబల్ ఈమెయిల్ మార్కెట్లో.. యాపిల్ మెయిల్ 53.67 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత జీమెయిల్ 30.70 శాతం, అవుట్‌లుక్ 4.38 శాతం, యాహూ మెయిల్ 2.64 శాతం, గూగుల్ ఆండ్రాయిడ్ 1.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇప్పుడు మస్క్ కూడా ఎక్స్.మెయిల్ ప్రారంభించే యోజనలో ఉన్నారు. కాబట్టి ఈ రంగంలో కూడా మస్క్ తన హవా చూపించడానికి సిద్ధమవుతున్నారని స్పష్టమవుతోంది.Interesting. We need to rethink how messaging, including email, works overall. https://t.co/6wZAslJLTc— Elon Musk (@elonmusk) December 15, 2024 -
గర్ల్ ఫ్రెండ్ ముద్దుల కోసం ఎంత పనిచేశాడు... భలే చిట్కా అంటున్న నెటిజన్లు!
విజ్ఞాన, వినోదాల మహాసాగరం సోషల్ మీడియా. ప్రతీ నిత్యం వేల కొద్దీ వీడియోలు ఇన్‌స్టా, ట్విటర్, ఫేస్బుక్ తదితర వేదికల్లో హల్ చల్ చేస్తూనే ఉంటాయి. కొన్ని విజ్ఞానదాయకంగా ఉంటాయి. మరికొన్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఇంకొన్ని వోర్నీ యేశాలో అనేలా ఉంటాయి. తాజాగా ఒక యువ జంట ముద్దుల వీడియో ఒకటి ‘అరే..ఏంటిరా ఇది’’ అని కుర్రకారు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఈ వీడియో ఏకంగా 70 లక్షలకుపైగా వ్యూస్ సాధించింది. గర్ల్ ఫ్రెండ్ ముద్దుల కోసం భలే ట్రిక్ వాడాడుగా అంటున్నారు నెటిజన్లు. అదేంటో మీరూ చూసేయండి!నోట్ : ప్రేమ అనేది వ్యక్తిగత అంశం. ఇది ఫన్నీ వీడియో అని మాత్రం గమనించగలరు. Bro unlocked new technique to get more kiss😭 pic.twitter.com/0CgkECwAsw— Bey (@beyya1202) December 11, 2024 -
దుర్మార్గ పాలనపై పోరాటం: వైఎస్ జగన్
నేను జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలు పెట్టేటప్పటికి గ్రామ, బూత్ కమిటీల నియామకాలు పూర్తి చేద్దాం. ఆ తర్వాత ప్రతి సభ్యుడికీ ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టా, ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్ అకౌంట్లు ఉండాలి. మన గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఆస్పత్రిలో డాక్టర్ ఎందుకు లేడు? పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు? అమ్మఒడి ఏమైంది? ఇలా ప్రతిదీ ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. మనం చంద్రబాబు సహా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తున్నామని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. విప్లవ స్ఫూర్తితో వారి కుట్రలను తిప్పికొట్టాలి. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. దుర్మార్గ పాలన వల్ల ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ప్రజలతో మమేకమవుతూ.. వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీద్దాం.. అరాచక పాలనపై పోరాటం చేద్దాం’ అని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల పార్టీ ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై మార్గ నిర్దేశం చేశారు. ‘మనం కేవలం చంద్రబాబుతో మాత్రమే యుద్ధం చేయడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి చెడిపోయిన వ్యతిరేక మీడియాతో యుద్ధం చేస్తున్నాం. ఇంత మంది కలిసి చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పి కొట్టాలంటే వాళ్ల కంటే మనం బలంగా తయారు కావాలి. అలా జరగాలంటే ప్రతి కార్యకర్త విప్లవ స్ఫూర్తితో పని చేయాలి’ అంటూ దిశా నిర్దేశం చేశారు. ‘మోసంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ప్రజల కోపానికి గురికాక తప్పదు. అప్పుడు వాళ్లు ఎంత దూరంలో పడతారంటే.. టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా రాని రోజులు మనం చూస్తాం’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు ఆరు నెలలు కావస్తోంది. అంతలోనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. తొలిసారిగా చూస్తున్నాం. ఇలాంటి నేప«థ్యంలో మనమంతా కలిసికట్టుగా ఏం చేయాలని ఆలోచన చేసి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. మన ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఇవ్వాళ్టికి కూడా మన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్‌లు ఏ గ్రామానికైనా, ఏ ఇంటికైనా ఈ మంచి చేశామని చెబుతూ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలరు. కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేసిందని మనం సగర్వంగా చెప్పగలం. మామూలుగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో మేనిఫెస్టో అని రంగు, రంగుల కాగితాలు ఇచ్చి.. దాన్ని ఎన్నికలు అయిపోగానే చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి... తొలిసారిగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మనం తూచ తప్పకుండా అమలు చేశాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ... అందులో 99 శాతం వాగ్దానాలు అమలు చేశాం. బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తామో ముందుగానే చెప్పడంతో పాటు సంక్షేమ కేలండర్‌ను విడుదల చేశాం. ఆ మేరకు క్రమం తప్పకుండా ఆ నెలలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశాం. చరిత్రలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే ఇలా జరిగింది. ఆ రకమైన మంచి మనం చేశాం. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు.. పొరపాటున చేయి అటువైపు వెళ్లింది ప్రతి ఇంటికీ మంచి చేసినా కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అందుకు కారణాలు ఏమైనా వాటిని పక్కన పెడితే.. మనకు గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు వస్తే.. ఈ సారి 40 శాతం ఓట్లు వచ్చాయి. జగన్ ప్రతి ఇంటికి పలావు పెట్టాడు.. కానీ చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు కాబట్టి పొరపాటున చేయి అటు వైపు పోయింది. తీరా ఇవ్వాళ చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా లేదు.. అన్న మాట ప్రతి ఇంటిలోనూ వినిపిస్తోంది. ఆ రోజుల్లో మనం ఏ ఇంటికి పోయినా చిక్కటి చిరునవ్వుతో ఆహ్వానించారు. ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి తీవ్రంగా ప్రచారం చేశారు. ఆ ఇంట్లో చిన్న పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు అని, వాళ్ల తల్లులు కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, అంతకన్నా పెద్దవాళ్లు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, ఆ ఇంట్లోంచి ఉద్యోగం చేసే వయస్సున్న పిల్లాడు వస్తే నీకు రూ.36 వేలు అని, ఆ ఇంట్లో రైతు కండువా వేసుకుని బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని చెప్పారు. మనం కుటుంబం మొత్తానికి సహాయం చేస్తుంటే.. టీడీపీ వాళ్లు ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తామని అబద్ధాలు చెబుతున్నారని చాలా మంది నాతో కూడా చెప్పారు. కానీ మనం అలా చేయలేదు. అతి మంచితనం.. అతి నిజాయితీతో మళ్లీ అధికారంలోకి..ఇవ్వాళ్టికీ నా దగ్గరకు వచ్చిన మన ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలు.. మీ దగ్గర అతి మంచితనం, అతి నిజాయితీ.. ఈ రెండూ మనకు సమస్యలు అంటున్నారు. కానీ రేపు మళ్లీ మనం ఈ గుణాలతోనే అధికారంలోకి వస్తాం. ఆరు నెలల కూటమి పాలనలో టీడీపీ కార్యకర్తలు ఏ ఇంటికి గర్వంగా వెళ్లలేని పరిస్థితి. ఏ ఇంటికి వెళ్లినా చిన్న పిల్లలు నా రూ.15 వేలు ఏమైందని.. రైతులు నా రూ.20 వేలు ఏమైందని.. ఉద్యోగం కోసం వెతికే పిల్లలు నా రూ.36 వేలు ఏమయ్యాయని అడిగే పరిస్థితి ఉంది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేటతెల్లం అవుతున్నాయి. మరోవైపు వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్న పరిస్థితులు. ఈ బడులు మాకొద్దు అనే పరిస్థితిలోకి నెట్టేశారు స్కూళ్లలో నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. మన హయాంలో రోజుకొక మెనూతో భోజనం పెట్టే గోరుముద్ద ఉండేది. ఇవ్వాళ అధ్వాన్న పరిస్థితుల్లో మధ్యాహ్న భోజనం ఉంది. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు, టోఫెల్ ఎత్తివేశారు. ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కూడా గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన హయాంలో ఆరో తరగతి నుంచి డిజిటిల్ క్లాస్ రూములు తయారు చేశాం. మన హయాంలో ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ స్కూళ్లతో పోటీ పడతాయా అన్న పరిస్థితి నుంచి.. ఇవాళ పూర్తిగా తిరోగమనంలోకి వెళ్లిపోయాయి. ఇవాళ గవర్నమెంటు బడులు మాకు వద్దు.. అని పేదవాడు అనుకునే పరిస్థితుల్లోకి నెట్టేశారు. అమ్మఒడి గాలికి ఎగిరిపోయింది. విద్యా దీవెన, వసతి దీవెన కూడా ఇవ్వడం లేదు.ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న పిల్లలకు ప్రతి క్వార్టర్ ముగిసిన వెంటనే నాలుగో నెల వెరిఫై చేసి ఐదో నెల ఇచ్చే వాళ్లం. ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ నాలుగు త్రైమాసికాలకు సంబంధించి బకాయిలు పెట్టారు. ఫీజు కట్టకపోతే ఒప్పుకోమని కాలేజీల యాజమాన్యాలు పిల్లలను ఇంటికి పంపిస్తున్నాయి.జిల్లాల్లో పర్యటిస్తా.. అక్కడే నిద్ర చేస్తా..రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి. నా జిల్లాల పర్యటన కార్యక్రమం సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం నుంచి ప్రారంభం అవుతుంది.అక్కడే నిద్ర చేస్తాను. ప్రతి బుధ, గురువారం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు రోజులు అక్కడే ఉంటాను. కార్యకర్తలతో మమేకం అవుతాను. ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం’ పేరుతో ఈ కార్యక్రమం చేపడతాను. పార్టీ గట్టిగా నిలబడాలంటే ఆర్గనైజేషన్ బలంగా ఉండాలి. ప్రతి గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. దీన్ని మరింత బలోపేతం చేయాలి. నా పర్యటనలోగా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలు పూర్తి చేయాలి. విప్లవ స్ఫూర్తితో పని చేసి మనం మరింత బలంగా తయారవ్వాలి. గ్రామ స్థాయిలో కమిటీల నియామకాలు పూర్తయ్యాక ప్రతి సభ్యుడి ట్విటర్ (ఎక్స్), ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్, యూట్యూబ్ తదితర అన్ని అకౌంట్లు ఉండాలి. ఆయా గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఎప్పటికప్పుడు పోస్టులు పెట్టాలి.దయనీయంగా వైద్య రంగంవైద్య రంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు అందించే నెట్వర్క్ ఆస్పత్రులకు మార్చి నుంచి ఇంత వరకు బిల్లుల చెల్లింపు లేదు. మార్చి నుంచి నవంబర్ వరకు లెక్కిస్తే.. ఇప్పటికీ ఇంకా రూ.2,400 కోట్లు బకాయిలు ఉన్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు పేదలు వెళితే వైద్యులు మేం వైద్యం చేయలేమనే పరిస్థితి. 104, 108కు సంబంధించి ఆగస్టు నుంచి బకాయిలు ఇవ్వడం లేదు. నడపలేని పరిస్థితి. కుయ్.. కుయ్.. మంటూ రావాల్సిన అంబులెన్స్‌లు చతికిల పడుతున్నాయి. మన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని 3,350 రోగాలకు పెంచి రూ.25 లక్షల వరకు చికిత్స అందించాం. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉండకూడదని జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆస్పత్రిలో డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలతో మందులు ఇచ్చేలా మార్పులు తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసి, ప్రతి 15 రోజులకొకమారు ఊరికే వచ్చి వైద్యం అందించే పరిస్థితి తీసుకొచ్చాం. ఇవాళ అంతా తిరోగమనం.కుదేలైన వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం కూడా కుదేలైంది. ఆర్బీకేలు స్థాపించి, ఈ–క్రాప్ పెట్టి పారదర్శకంగా ప్రతి రైతుకు ఆర్బీకే ద్వారా ఉచిత పంటల బీమా అందించాం. దళారుల వ్యవస్థ లేకుండా ధాన్యం నేరుగా రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేసే కార్యక్రమం మనం చేస్తే.. ఈ రోజు ఏ రైతుకూ ధాన్యానికి కనీస మద్దతు ధర రావడం లేదు. రూ.200 నుంచి రూ.300 తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఈ–క్రాప్ గాలికెగిరిపోయింది.పారదర్శకత పక్కకు పోయింది. వ్యవసాయం తిరోగమనంలో ఉంది. డోర్ డెలివరీతో ప్రతి ప«థకాన్ని ఇంటికి అందించే పాలన మనదైతే.. ఈ రోజు డోర్ డెలివరీ మాట, మంచి పాలన దేవుడెరుగు.. టీడీపీ కార్యకర్తల చుట్టూ తిరిగితే తప్ప వచ్చే పరిస్థితి లేదు. ఇంత దారుణమైన పరిస్థితులున్నాయి. మళ్లీ పథకాలు ఎలా ఉన్నాయని హలో అని ఫోన్ చేసి అడుగుతామంటున్నారు. అసలు పథకాలుంటే కదా!దోచుకోవడం.. పంచుకోవడం రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. ఇసుక రేట్లు చూస్తే.. మన కన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు. మన హయాం కంటే రెట్టింపు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. మద్యం షాపులు ప్రభుత్వంలో ఉన్నవి తీసేశారు. ప్రతి గ్రామంలో వేలం వేసి రూ.2 లక్షలు, రూ.3 లక్షలకు బెల్టుషాపులు ఇచ్చేస్తున్నారు. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా.. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు. ఏ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, పరిశ్రమ నడవాలన్నా, ఏం జరగాలన్నా ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి, ఆయన కొడుక్కు ఇంత అని దోచుకోవడం, పంచుకోవడం జరుగుతోంది. అందుకే కేవలం ఆరు నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. మనం ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చింది. ఆరు నెలల ప్రభుత్వ పాలన వేగంగా నడిచిపోయింది. జమిలి అంటున్నారు.అందరం చురుగ్గా ప్రజల తరఫున పని చేయాలి. ప్రజల తరఫున గళం వినిపించాలి. మీ అందరినీ నేను ఒక్కటే కోరుతున్నా. ప్రతిఒక్కరూ ప్రజలకు తోడుగా, అండగా ఉండాలి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న ఇలాంటి సమయంలోనే మనం ప్రజలకు అందుబాటులో ఉండాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. -
ట్విటర్ వాడొద్దు.. శివ కార్తికేయన్ లాజికల్ కామెంట్స్
'అమరన్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శివకార్తికేయన్.. ట్విటర్ వాడొద్దని సలహా ఇస్తున్నాడు. దాని వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా ఉందని చెప్పాడు. ఇదేదో ఆషామాషీగా చెప్పకుండా లాజిక్‌తో సహా తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. గోవాలో ప్రస్తుతం ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు)'ఎలన్ మస్క్ నన్ను బ్లాక్ చేసినా సరే ఇది చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సాధారణంగా ఏ సినిమా అయినా సరే ఫెయిల్ అయినప్పుడు సోషల్ మీడియాలో చూసి తప్పొప్పులు తెలుసుకునే వాడిని. అయితే ఇది ఫలితం ఇవ్వడం సంగతి అటుంచితే మరింత నెగిటివిటీ పెంచింది. నేను యాంకర్‌గా పనిచేసినప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి నిజంగా మనుషుల్ని అడిగి ఫీడ్ బ్యాక్ తీసుకునేవాడిని. తద్వారా తప్పుల్ని సరిదిద్దుకునేవాడిని. కానీ ట్విటర్(ఎక్స్)లో అలా సాధ్యం కాదు' అని శివకార్తికేయన్ చెప్పాడు.మూలాలని గుర్తుచేసుకోవడం వల్ల గత రెండేళ్లుగా మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చానని శివకార్తికేయన్ చెప్పాడు. ట్విటర్ (ఎక్స్) గురించి ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ తీసుకున్నా సరే ప్లస్సుల కంటే మైనస్సులే ఎక్కువైపోయాయి. ఫ్యాన్ వార్స్ చేసుకోవడం, అనవసరమైన వీడియోలపై కామెంట్స్ చేసి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు చిక్కుల్లో ఇరుక్కోవడం లాంటివి మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాంగా!(ఇదీ చదవండి: అమ్మాయిలకే 'సెకండ్ హ్యాండ్' లాంటి ట్యాగ్ ఎందుకు?: సమంత) -
టాప్ న్యూస్ యాప్‌గా ఎక్స్: మస్క్
న్యూఢిల్లీ: భారత్‌లోని యాప్ స్టోర్‌లో సామాజిక మాధ్యమం ఎక్స్ (గతంలో ట్విటర్) ప్రస్తుతం టాప్ న్యూస్ యాప్ అని ఎలాన్ మస్క్ తెలిపారు. భారత్‌లో యాపిల్ యాప్‌స్టోర్‌లో ఎక్స్ మొదటి స్థానంలో నిలిచిన న్యూస్ యాప్ అని డోజ్‌డిజైనర్ అనే ఒక వినియోగదారు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన తర్వాత.. భారత్‌లో వార్తల కోసం ప్లాట్‌ఫామ్ నిజంగా నంబర్ వన్ అయిందని బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నారు.మస్క్ 2022 అక్టోబర్‌లో ఎక్స్‌ను (గతంలో ట్విటర్) 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. స్టాటిస్టా (Statista.com) ప్రకారం, దేశం వారీగా అత్యధిక ట్విటర్ యూజర్ల సంఖ్యలో సుమారుగా 25 మిలియన్లకు పైగా వినియోగదారులతో భారత్ మూడవ స్థానంలో ఉంది. మస్క్ ప్రకటన తరువాత అభినందనలు వెల్లువెత్తాయి.𝕏 is now #1 for news in India! https://t.co/beLobq1Dfo— Elon Musk (@elonmusk) November 22, 2024 -
రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోంది: రేవంత్ సర్కారుపై కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అసమర్థ పాలనలో తెలంగాణలో రోజుకు ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలకు బడుగు బలహీన వర్గాలు బలైపోతున్నాయని అన్నారు. రైతులు, ఆటోడ్రైవర్లతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు నిత్యం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్‌లో స్పందిస్తూ..రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోందని, కాంగ్రెసోడి కుట్రలకు బలైపోతున్నదని మండిపడ్డారు. రాజ్యహింసతో రాష్ట్రం నిత్యం తల్లడిల్లుతోందని, గాయాలతో గోడుగోడునా విలపిస్తోందని విమర్శించారు. రైతు రారాజుగా బ్రతికిన తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమాయెనని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధికి చిరునామాగా మారిన రాష్ట్రంలో జీవనోపాధి కరువై బడుగులు బలిపీఠం ఎక్కవట్టెనని ఆయన వాపోయారు. ఇది ఎవడు చేసిన పాపమని, ముమ్మాటికీ మార్పు తీసుకొచ్చిన శాపమేనని పేర్కొన్నారు.రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోంది కాంగ్రెసోడి కుట్రలకు బలైపోతుంది!రాజ్యహింసతో నిత్యం తల్లడిల్లుతోందిగాయాలతో గోడుగోడునా విలపిస్తోంది!రైతు రారాజుగా బ్రతికిన తెలంగాణలో... అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమాయే!ఉపాధికి చిరునామాగా మారిన రాష్ట్రంలో..జీవనోపాధి కరువై బడుగులు… pic.twitter.com/KPHWnAg7PN— KTR (@KTRBRS) November 19, 2024 -
ఎక్స్‌కు బై చెబుతున్న యూజర్లు.. మస్క్ వైఖరి మారిందా?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ట్రంప్ విజయం ఖరారు అయినప్పటి నుంచి క్రమంగా ఇలాన్‌మస్క్ ఆధ్యర్యంలోని ఎక్స్ వినియోగదారులు తగ్గిపోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే అందుకు మస్క్ అవలంభిస్తున్న విధానాలే కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇదే అదనుగా ట్విటర్(ప్రస్తుతం ఎక్స్) సహవ్యవస్థాపకులు జాక్ డోర్సే తయారు చేసిన ‘బ్లూస్కై’ వినియోగదారులు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.డొనాల్డ్ట్రంప్ విజయానికి మస్క్ తీవ్రంగా కృషి చేశారు. రిపబ్లికన్ పార్టీకి తన వంతుగా దాదాపు రూ.900 కోట్లకు పైనే విరాళం అందించారు. ఎన్నికల ప్రచారంలోనూ యాక్టివ్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ తటస్థతపై ప్రశ్నలొస్తున్నాయి. 2022లో ట్విటర్ చేజిక్కించుకున్న సమయంలో మస్క్ మాట్లాడుతూ..‘ప్రజల్లో ట్విటర్(ప్రస్తుతం ఎక్స్)పై విశ్వాసం పెరగాలంటే రాజకీయంగా తటస్థంగా ఉండాలి’ అన్నారు. కానీ, ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో తన వైఖరి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎన్నికల్లో ట్రంప్‌నకు మద్దతుకు ముందు ‘ఈసారి తన పదవీకాలం ముగిసే సమయానికి ట్రంప్‌నకు 82 ఏళ్లు వస్తాయి. దాంతో ఏ కంపెనీకు తాను సీఈఓగా ఉండేందుకు వీలుండదు. తర్వాత అమెరికాకు సారథ్యం వహించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది’ అన్నారు. మస్క్ ఎక్స్‌ను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి అందులో తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతోందనే వాదనలున్నాయి. ద్వేషపూరిత ప్రసంగాలు ప్రసారం జరుగుతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.వారంలో 10 లక్షల వినియోగదారులు ఇదిలాఉండగా, ట్విటర్ సహవ్యవస్థాపకుడు జాక్ డోర్సే స్థాపించిన బ్లూస్కై యాప్‌కు వినియోగదారులు పెరుగుతున్నారు. అమెరికా ఎన్నికల అనంతరం వీరి సంఖ్య మరింత ఎక్కువవుతోంది. ఎన్నికల తర్వాత వారం రోజుల్లోనే ఒక మిలియన్ కంటే ఎక్కువ కొత్త వినియోగదారులను సంపాదించినట్లు కంపెనీ ప్రతినిధి ఎమిలీ లియు తెలిపారు. వీరిలో అధికంగా యునైటెడ్ స్టేట్స్, కెనడా, బ్రిటన్‌కు చెందినవారని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగ ప్రకటనలో వివక్షతతో కూడిన ప్రమాణాలు తొలగింపుబ్లూస్కై అంటే ఏమిటి?జాక్ డోర్సే 2019లో బ్లూస్కైను ప్రారంభించారు. ఇది ఎక్స్, ఫేస్బుక్ మాదిరిగానే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. 2022లో మస్క్ ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దీని ప్రచారాన్ని పెంచారు. ఈ ప్లాట్ఫామ్లో తాజాగా రాపర్ ఫ్లేవర్ ఫ్లావ్, రచయిత జాన్ గ్రీన్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, చస్టెన్ బుట్టిగీగ్, మెహదీ హసన్, మోలీ జోంగ్-ఫాస్ట్ వంటి ప్రముఖులు చేరారు. ప్రస్తుతం ఈ యాప్ 14.7 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. యూఎస్ ఎన్నికల తర్వాత అమెరికా, యూకేలో యాపిల్ స్టోర్ డౌన్లోడ్ చార్ట్‌ల్లో తరచుగా ఇది అగ్రస్థానంలో నిలుస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. -
నాన్నకు ఓటేయని కూతురు!
దొడ్డబళ్లాపురం: చెన్నపట్టణ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సీపీ యోగ్వేశ్వర్కు ఇంట్లోనే సెగ తగిలింది. ఆయన కుమార్తె నిశా ఈ ఎన్నికలో తాను ఓటు వేయలేదు. అందుకు కారణం తన తండ్రి యోగేశ్వర్ పోటీ చేయడమే అంటూ చెప్పారామె.చెన్నపట్టణలో యోగేశ్వర్ తన హక్కులను కాలరాశాడని, కాబట్టి ఎందుకు ఓటు వేస్తానని ప్రశ్నించారు. తాను ఏ పార్టీలో కూడా చేరలేదని, రాజకీయాలతో తనకు సంబంధం లేదన్నారు. యోగేశ్వర్‌తో కుమార్తెకు ముందు నుంచి వివాదాలున్నాయి. తండ్రిపై తరచూ ఆమె విమర్శలు చేస్తూ ఉంటారు. -
విషెస్ చెప్పి విమర్శలపాలైన పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: ప్రజలకు సుద్దులు చెప్పే నేతలు తాము మాత్రం నిబంధనల్ని బేఖాతరు చేస్తూ వ్యవహరిస్తారన్న విమర్శలు నిజమని పాక్ ప్రధాని నిరూపించారు. వేర్పాటువాద శక్తులు విరివిగా ఉపయోగిస్తూ దేశంలో అస్థిరకతకు కారణమవుతున్నారని, అందుకు పరోక్షంగా కారణమైన ‘ఎక్స్’సోషల్ మీడియాపై నిషేధం విధిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. దానిని అమలుచేస్తోంది కూడా. అయితే ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయనాదం చేసిన ట్రంప్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’వేదికను వినియోగించుకోవడం విమర్శలకు తావిచ్చింది. స్వయంగా ప్రభుత్వాధినేతనే సొంత నిర్ణయాలకు విలువ ఇవ్వనప్పుడు ప్రజలేం పట్టించుకుంటారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. -
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం: రేవంత్ సర్కార్‌పై కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం చేస్తోందని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు.‘కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా సర్కార్ ఏం పొడుస్తున్నట్లు? విద్యార్థుల అవస్థలు రేవంత్ రెడ్డి కంటికి కనిపించడం లేదా; నిమ్స్‌లో పేద పిల్లల హాహాకారాలు వినిపించడం లేదా? పది రోజులుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యమై...పేదల పిల్లలు గోడుగోడునా ఏడుస్తుంటే. కనీసం సమీక్ష అయినా నిర్వహించారా?విద్యాశాఖను అంటిపెట్టుకొని 11 నెలల్లో మీరు పీకిందేమిటి.. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులను అవస్థలకు గురి చేస్తిరి.. గురుకులాలకు తాళం పడేలా చేస్తిరి. ప్రాథమిక పాఠశాలలకు శీతాకాలంలోనే ఒంటిపూట పెడితిరి. కాంగ్రెస్ వచ్చింది. సకల జనులను కన్నీళ్లు పెట్టిస్తోంది. మార్పుకు ఓటేసిన ఫలితం.. తెలంగాణను వెంటాడుతోంది పాపం’ అంటూ కేటీఆర్ సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు.కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం...విద్యార్థుల ప్రాణాలతో సర్కార్ చెలగాటం..కేసీఆర్ పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా? వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా సర్కార్ ఏం పొడుస్తున్నట్లు? విద్యార్థుల అవస్థలు రేవంత్ రెడ్డి కంటికి… pic.twitter.com/LzPM7xzouS— KTR (@KTRBRS) November 7, 2024 -
‘ఎక్స్’లో ఉద్యోగాల కోత.. ఇంజినీర్లు ఇంటికి..!
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీల్లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.‘ఎక్స్’ అమలు చేస్తున్న లేఆఫ్‌ల ప్రభావం ప్రధానంగా దాని ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులపై పడిందని సంస్థ వర్గాలు, వర్క్‌ప్లేస్ ఫోరమ్ బ్లైండ్‌లోని పోస్ట్‌లను ఉటంకిస్తూ ‘ది వెర్జ్’ నివేదిక పేర్కొంది. తొలగింపునకు గురైన ఉద్యోగుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదు. కంపెనీ కోసం మీరు చేసేందేంటో ఒక పేజీ సారాంశాన్ని సమర్పించాలని ఉద్యోగులను కోరిన రెండు నెలల తర్వాత లేఆఫ్‌లు వచ్చాయి.దీనిపై మస్క్ కానీ, ‘ఎక్స్’ అధికారులు గానీ ఇంకా వ్యాఖ్యానించలేదు. స్టాక్ గ్రాంట్ల గురించి ఎంతగానో ఎదురుచూస్తున్న సిబ్బందికి ఇటీవల ఎలాన్ మస్క్ ఈమెయిల్ పంపినట్లు వార్తా నివేదికలు వచ్చాయి. ఉద్యోగుల పనితీరు, ప్రభావం ఆధారంగా వారికి స్టాక్ ఆప్షన్స్ కేటాయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే స్టాక్‌ను పొందడానికి కంపెనీకి తాము చేశామో తెలియజేస్తూ నాయకత్వానికి ఒక పేజీ సారాంశాన్ని సమర్పించాలని సిబ్బందిని ఆదేశించిట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పరిస్థితేంటి? కలవరపెడుతున్న గూగుల్ సీఈవో ప్రకటన!ఎలాన్ మస్క్ యాజమాన్యంలో ఎంకెన్ని లేఆఫ్‌లు ఉంటాయోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్ దాదాపు 80 శాతం అంటే 6,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించారు. డైవర్సిటీ, ఇన్‌క్లూషన్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, డిజైన్ వంటి అన్ని విభాగాల్లోనూ లేఆఫ్‌లు అమలు చేశారు. కంటెంట్ మోడరేషన్ టీమ్‌ను కూడా విడిచిపెట్టలేదు. -
అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, వైఎస్సార్ నేతలు హాజరయ్యారు. ఆ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములుతో పాటు ఎందరో త్యాగాలు చేస్తే ఆంధ్రరాష్ట్రం అవతరించిందన్నారు. 2019-24 మధ్య పొట్టిశ్రీ రాములు ఆశయాలకు వైఎస్ జగన్ జీవం పోశారన్నారు. ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను వైఎస్ జగన్ చేసి చూపించారన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమాలు జరగకపోవడం బాధాకరమని దేవినేని అవినాష్ అన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు— YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2024 -
ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో.. ‘ఈ దివ్యమైన దీపాల పండుగ వేళ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా, అదృష్టవంతులుగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ దేవి, శ్రీ గణేషుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నానని అన్నారు. देशवासियों को दीपावली की अनेकानेक शुभकामनाएं। रोशनी के इस दिव्य उत्सव पर मैं हर किसी के स्वस्थ, सुखमय और सौभाग्यपूर्ण जीवन की कामना करता हूं। मां लक्ष्मी और भगवान श्री गणेश की कृपा से सबका कल्याण हो।— Narendra Modi (@narendramodi) October 31, 2024 దీనికిముందు ప్రధాని మోదీ.. ఒక పోస్టులో అయోధ్యలోని నూతన ఆలయంలో రామ్ లల్లాను ప్రతిష్టించిన తర్వాత ఇది మొదటి దీపావళి అని, 500 సంవత్సరాలుగా రామభక్తులు చేసిన లెక్కలేనన్ని త్యాగాలు, తపస్సు తర్వాత ఈ శుభ ఘట్టం వచ్చిందని పేర్కొన్నారు. अलौकिक अयोध्या!मर्यादा पुरुषोत्तम भगवान श्री राम के अपने भव्य मंदिर में विराजने के बाद यह पहली दीपावली है। अयोध्या में श्री राम लला के मंदिर की यह अनुपम छटा हर किसी को अभिभूत करने वाली है। 500 वर्षों के पश्चात यह पावन घड़ी रामभक्तों के अनगिनत बलिदान और अनवरत त्याग-तपस्या के बाद… https://t.co/e0BwDRUnV6— Narendra Modi (@narendramodi) October 30, 2024ఇది కూడా చదవండి: సైనికుల మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు -
నువ్వా! కేసీఆర్ పేరును తుడిచేది?: రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్దం నెలకొంది. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ రేవంత్ చేసిన సంచలన వ్యాఖ్యలకు తాజాగా కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ చెప్పులు మోసిన నాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశాడని తెలిపారు. పదవులు కోసం రేవంత్ పరితపిస్తున్న కాలంలో.. కేసీఆర్ తనకు ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేశాడని గుర్తుచేశారు. ‘నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర కేసీఆర్’ అంటూ ఘాటుగా స్పందించారు.ఈ మేరకు ట్విటర్లో కేటీఆర్.. ‘నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోశాడు. నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేశాడు. నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోశాడు. చిట్టినాయుడు. నువ్వా! KCR పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర కేసీఆర్.’ అని పేర్కొన్నారు.నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోసాడు! నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడు! నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు!నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు…— KTR (@KTRBRS) October 30, 2024కాగా కేసీఆర్‌కు రాజకీయంగా ఉనికి లేకుండా చేస్తామంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఎక్స్పైరీ మెడిసిన్.. ఆయన రాజకీయం ఏడాదిలో ముగుస్తుందని అన్నారు. ప్రజలు కేసీఆర్‌ను మరిచిపోయేలా కేటీఆర్‌ను టార్గెట్ చేశామన్న రేవంత్.. ‘కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్‌ను వాడా. త్వరలో కేటీఆర్ ఉనికి లేకుండా హరీష్‌ను వాడతాను. బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు’ అంటూ పేర్కొన్నారు. -
ఇజ్రాయెల్‌పై ట్వీట్.. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్స్ ఖాతా సస్పెండ్
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. అక్టోబరు 1న తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై బాంబుల, క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఇరాన్లో క్షిపణి తయారీలో వినియోగించే ఘన ఇంధన మిశ్రమాన్ని తయారు చేసే డజనుకుపైగా ప్రదేశాలను ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్‌లోని అణు శక్తి కేంద్రానికి రక్షణగా ఉన్న ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థను కూడా దారుణంగా దెబ్బతీసినట్లు సమాచారం. ఈ దాడులతో టెహ్రాన్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలిసింది.ఇక ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వివాదాస్పద ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమం ద్వారా ఇజ్రాయెల్‌ను బెదిరిస్తూ పోస్టు పెట్టారు. జియోనిస్ట్ పాలకుల (ఇజ్రాయెల్) దుర్మార్గాన్ని తక్కువగా అంచనా వేయకూడదు లేదా అతిశయోక్తి చేయకూడదని అన్నారు. ఇరాన్ శక్తిని ఇజ్రాయెల్‌కు చూపాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన ట్వీట్ చేసిన ఖాతాను ‘ఎక్స్’ సస్పెండ్ చేసింది.‘రెండు రాత్రుల క్రితం జరిగిన ఇజ్రాయెల్ దుష్టపాలన చర్యలను అతిశయోక్తి చేయకూడదు. లేదా తక్కువగా అంచనా వేయకూడదు. ఇజ్రాయెల్ పాలకుల తప్పుడు లెక్కలను భంగం చేయాలి. ఇరాన్ శక్తి, దేశ యువత బలం, సంకల్పం, చొరవను వారికి అర్థం చేయడం చాలా అవసరం’ అని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు వాడటంతో ఆ ఖాతాను ఎక్స్ సస్పెండ్ చేసింది. -
ఇదేమి రాజ్యం బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పంటించి ప్రాణాలు తీసిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని, అరాచక శక్తుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా జగన్ కూటమి ప్రభుత్వాన్ని ఆదివారం కడిగిపారేశారు.ఈ దుర్యోధన దుశ్శాసన.. దుర్వినీతి లోకంలోరాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు. మహిళలు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ? రోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పు అంటించి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం కూడా ఉంది. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిపోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ మీద కక్షకొద్దీ మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రం, ప్రజలమీద చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు.ఇది అన్యాయం కాదా? వైఎస్సార్సీపీ హయాంలో మహిళలు, బాలికల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక ‘దిశ’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనం కాదా? తద్వారా మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసిన మాట వాస్తవం కాదా? ‘దిశ’ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్‌ను ఐదుసార్లు అటూ ఇటూ ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్‌కు, అక్కడ నుంచి దగ్గర్లో ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారు.ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్లు ఫోన్లో చెప్పినా ఘటనాస్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు (చంద్రబాబు) ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా? ‘దిశ’ ప్రారంభం నుంచి 31,607 మంది మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారు చంద్రబాబూ? 1.56 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న ‘దిశ’పై రాజకీయ కక్ష ఎందుకు? దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలను ‘దిశ’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్‌ను పటిష్ట పరిచాం. 18 ‘దిశ’ పోలీస్స్టేషన్లను నెలకొల్పి 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశాం. మా హయాంలో శాంతి భద్రతలపై నేను నిర్వహించిన సమీక్షల్లో ‘దిశ’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు. వీటన్నింటినీ నిర్వీర్యంచేసి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబూ? ఇవాళ మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారత కోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీమ్‌లను ఎత్తివేయడం! ఇసుక, లిక్కర్ లాంటి స్కామ్‌లకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం! పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది. మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను విస్మరించింది. ఇదేమి రాజ్యం చంద్రబాబూ? -
ఆలియా భట్ సినిమా డిజాస్టర్.. డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం జిగ్రా. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ బాలీవుడ్ నిర్మాత భార్య దివ్య ఖోస్లా సైతం తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఫేక్ కలెక్షన్స్ ఎలా ప్రకటిస్తున్నారంటూ మేకర్స్‌ను నిలదీసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాజ్‌కుమార్ రావ్, ట్రిప్తి డిమ్రీ నటించిన విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాతో పోటీపడింది.అయితే జిగ్రా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోలేకపోయింది. మ్మిది రోజుల్లో కేవలం రూ.25.35 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది. సినిమా ఫ్లాఫ్ కావడంతో డైరెక్టర్ వాసన్ బాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ట్విటర్ ఖాతాను ఆయన డిలీట్ చేశారు. ప్రస్తుతం ఆయన అకౌంట్ సెర్చ్ చేస్తే ట్విటర్లో కనిపించడం లేదు. జిగ్రా ఫెయిల్యూర్‌తోనే ఆయన ఈ పని చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ రావడంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.కాగా.. కరణ్ జోహార్ నిర్మాతగా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఆలియా భట్.. రక్షిత అక్క పాత్రలో కనిపించింది. ఆమె సోదరుడిగా బాలీవుడ్ నటుడు వేదాంగ్ నటించాడు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయింది. -
ఇదేం రాజ్యం చంద్రబాబూ.. బద్వేల్ ఘటనపై వైఎస్ జగన్ ఆవేదన
సాక్షి,తాడేపల్లి : బద్వేల్లో కాలేజీ విద్యార్థినిని హత్యాచారం చేసిన ఘటనపై వైఎఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమి రాజ్యం చంద్రబాబు అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బద్వేల్ కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్రంలో సంచలన రేకెత్తించింది. వరుసగా రాష్ట్రంలో అరాచక శక్తుల అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోవడాన్ని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం ప్రతి రోజు ఎక్కడో ఒక చోట హత్యలు,అత్యాచారాలు, వేధింపులు జరుతూనే ఉన్నాయి. బద్వేల్లో కాలేజీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని, ఈ దారుణ ఘటన హేయం, అత్యంత దుర్మార్గమన్నారు. ఈ ఘటన వెనుక ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం ఉందన్నారు. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సింది పోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం @ncbn గారూ? మహిళలకు, బాలికలకు రక్షణకూడా ఇవ్వలేకపోతున్నారు… ఇదేమి రాజ్యం? ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2024 ‘చంద్రబాబు మీరు వైఎస్సార్సీపీమీద కక్షకొద్దీ, మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రంమీద, రాష్ట్ర ప్రజలమీద కక్ష సాధిస్తున్నారు. ఇది అన్యాయం కాదా? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక “దిశ’’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనం కాదా? దీనివల్ల మహిళలు, బాలికల భద్రతను ప్రశ్నార్థకం చేసిన మాట వాస్తవం కాదా? “దిశ’’ యాప్‌లో SOS బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్‌ను 5సార్లు అటూ, ఇటూ ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూంకు, అక్కడినుంచి దగ్గర లోనే ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారు. వారు ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్టు ఫోన్లో చెప్పినా ఘటన స్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా? “దిశ’’ ప్రారంభం మొదలు 31,607 మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారు చంద్రబాబుగారూ? 1.56కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న “దిశ’ ’పై రాజకీయ కక్ష ఎందుకు?దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫొరెన్సిక్ ల్యాబులు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలను “దిశ’’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్‌ను పటిష్ట పరిచాం. 18 “దిశ’’ పోలీస్స్టేషన్లను పెట్టి, 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశాం. మా హయాంలో శాంతిభద్రతలపై నేను చేసిన సమీక్ష సమావేశాలలో “దిశ’’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వాళ్లం. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు.వీటన్నిటినీ నిర్వీర్యం చేసి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబు? మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారతకోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీంలను ఎత్తివేసి, ఇప్పుడు ఇసుక, లిక్కర్ లాంటి స్కాంలకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం లాంటివి చేస్తున్నారు. ఇటు పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది తప్ప మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను పట్టించుకోవడంలేదు. ఇదేమి రాజ్యం చంద్రబాబు?’అంటూ నిలదీశారు వైఎస్ జగన్.AP: మరో ప్రేమోన్మాది ఘాతుకం.. గాయపడిన విద్యార్థిని మృతి -
తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటున్నవ్ స్వామి?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌ను కాపాడుకోవటం చేతకాక, సామాన్యులపైకి బుల్డోజర్స్ పంపి.. భయాన్ని సృష్టింస్తున్నారని మండిపడ్డారు. తీరా చూస్తే హైడ్రా హడావిడీతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయిందన్నారు. హైడ్రా కారణంగా రెండు నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని తెలిపారు.రిజిస్ట్రేషన్లు పడిపోయాయని, ఆదాయం తగ్గిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కొత్తగా ఆదాయం సృష్టించకపోయినా ఫర్వాలేదుగానీ, ఉన్నది ఊడగొడుతున్నారని దుయ్యబట్టారు. సామాన్యులు కొనుగోలు, అమ్మకం లేనిది బూమ్ ఎట్లా వస్తది? ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అసలేం చేద్దామనుకుంటున్నారంటూ ప్రశ్నించారు.పనిమంతుడని పందిరేపిస్తే... పిల్లి తోక తగిలి కూలిందట. గట్లనే ఉంది చీప్ మినిస్టర్ రేవంత్ రెడ్డి తీరు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ ను కాపాడుకోవటం చేతకాక, సామాన్యులపైకి బుల్డోజర్స్ పంపి... భయాన్ని సృష్టించాడు. తీరా చూస్తే, రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయింది.… pic.twitter.com/EwPkTPBOP1— KTR (@KTRBRS) October 7, 2024 -
'ఐఫోన్ 16 ప్రో'పై అసంతృప్తి
ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్ కోసం చాలామంది జనం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే.. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న భారతీయ సంతతికి చెందిన టెక్ ఎగ్జిక్యూటివ్ ఆదిత్య అగర్వాల్ కొత్త ఐఫోన్ కొనుగోలు చేయడం సమయం వృధా అంటూ ట్వీట్ చేశారు.చాలామంది తమ వద్ద పాత ఐఫోన్స్ స్థానంలో కొత్త ఐఫోన్స్ భర్తీ చేస్తున్నారు. పాత ఐఫోన్ నుంచి కొత్త ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వడం సమయం వృధా అంటూ తన ఎక్స్ వేదికగా యాపిల్ ఐఫోన్ 16 ప్రో పట్ల తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈయన ఐఫోన్ 14 ప్రో నుంచి ఐఫోన్ 16 ప్రోకు మారినట్లు వెల్లడించారు. కొత్త ఫోన్ తనను చాలా నిరాశపరిచింది అన్నారు.ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 16 ప్రో మధ్య ఉన్న వ్యత్యాసం చెప్పలేను, అయితే ఏఐ సామర్థ్యాల పరంగా ఐఫోన్ 15, 16 మధ్య ఎక్కడ తేడా ఉందో అర్థం కావడం లేదని అన్నారు. కొత్త ఫోన్ సరిగ్గా సెట్ చేయడానికి తనకు 24 గంటల సమయం పట్టిందని అన్నారు. టెక్ ఎగ్జిక్యూటివ్ చేసిన వ్యాఖ్యలతో కొందరు ఏకీభవించారు. ఇందులో ఒకరు కేవలం యూఎస్బీ-సీ ప్లగ్ కోసం మాత్రమే మారానని చెప్పుకొచ్చారు. మరొకరు కూడా కొత్త ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వడం సమయం వృధానే అంటూ పేర్కొన్నారు.I "upgraded" from the iPhone 14 Pro to the iPhone 16 Pro.I literally cannot tell the difference. It took me 24 hours to set up the new phone properly etc. It just feels like a waste of time.And I do not understand where this "Apple Intelligence" is????— Aditya Agarwal (@adityaag) October 3, 2024ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్ఈ నెలాఖరు నాటికి మరికొన్ని ఫీచర్స్యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేసింది. ఈ ఫోన్లలో కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత కల్పించింది. డిజిటల్ జీవితాలను సులభతరం చేయడానికి సంస్థ లేటెస్ట్ ఫీచర్స్ అందిస్తోంది. ఈ ఫోన్లో కొన్ని ఫీచర్స్ ఈ నెలాఖరు నాటికి వస్తాయని తెలుస్తోంది. -
‘ఎక్స్’లెంట్ ఫాలోయింగ్! అత్యధిక ఫాలోవర్లున్న ప్రముఖులు (ఫొటోలు)
-
ఎక్స్‌లో మస్క్ ఘనత.. ప్రపంచంలో తొలి వ్యక్తిగా రికార్డ్
టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk) ప్రపంచ కుబేరుగా మాత్రమే కాకుండా.. ఎక్స్(ట్విటర్)లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా కూడా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. గురువారం (అక్టోబర్ 03) నాటికి ఎక్స్ ప్లాట్ఫామ్లో 200 మిలియన్ ఫాలోవర్లను చేరుకున్న మొదటి వ్యక్తిగా మస్క్ ఈ ఘనత సాధించారు.మస్క్ తరువాత అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 131.9 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాత స్థానంలో ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (113.2 మిలియన్ల ఫాలోవర్స్) నిలిచారు. జస్టిన్ బీబర్ 110.3 మిలియన్ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో, 108.4 మిలియన్ల ఫాలోవర్లతో రిహన్నా ఐదో స్థానంలో ఉన్నారు.ఇదీ చదవండి: జెఫ్ బెజోస్‌ను వెనక్కు నెట్టిన జుకర్‌బర్గ్!భారత ప్రధాని నరేంద్ర మోదీ 100 మిలియన్ ఫాలోవర్స్ మార్కును దాటారు. కాగా 'ఎక్స్' నెలవారీ యాక్టివ్ యూజర్లు 600 మిలియన్ల కంటే ఎక్కువ, డైలీ యాక్టివ్ యూజర్లు 300 మిలియన్స్ కంటే ఎక్కువని మస్క్ పేర్కొన్నారు. అయితే ఇటీవల ఎక్స్ విలువ భారీగా తగ్గినట్లు సమాచారం. -
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై బాబుకు ఏ భావోద్వేగాలు ఉండవు: విజయసాయిరెడ్డి
సాక్షి, తాడేడేల్లి: కపటం, నయవంచనలను మారుపేరైన చంద్రబాబుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసివేసినా, విక్రయించినా ఏ భావోద్వేగాలు ఉండవని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రి 64 ప్రభుత్వ రంగ సంస్థలను అణాకాణీకి అమ్మేసిన చరిత్ర చంద్రబాబుదని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి స్పందిసతూ.. విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం చేస్తామని "కులమీడియా" లో లీకులు ఇస్తూ కార్మికులను గందరగోళంలోకి నెడ్తున్నారని మండిపడ్డారు. 4,200 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడం చూస్తే చంద్రబాబు కల్లబొల్లి మాయోపాయాలు అర్థమవుతాయని అన్నారు. కాంట్రాక్టు కార్మికులు లేకుండా ఉక్కు ఫ్యాక్టరీ నడవదని, దాన్నో సాకుగా చూపి అమ్మకానికి పెట్టాలన్నది చంద్రబాబు క్షుద్ర ప్రణాళికగా పేర్కొన్నారు.కపటం, నయవంచనలను మారుపేరైన చంద్రబాబుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసివేసినా, విక్రయించినా ఏ భావోద్వేగాలు ఉండవు. ఉమ్మడి ఆంధ్ర సిఎంగా 64 ప్రభుత్వ రంగ సంస్థలను అణాకాణీకి అమ్మేసిన చరిత్ర చంద్రబాబుది. విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం చేస్తామని "కులమీడియా" లో లీకులు ఇస్తూ కార్మికులను…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 28, 2024 -
పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో పవన్.. ప్రకాష్ రాజ్‌పై విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘పవన్ .. నేను చేసిన ట్వీట్ ఏంటి? నా ట్వీట్‌పై మీరు మాట్లాడుతుందంటేంటి. మరోసారి నా ట్వీట్‌ను చదవి అర్థం చేసుకోండి. నేను షూటింగ్ నిమిత్తం విదేశాల్లో వున్నాను 30 తేదీ తరువాత వస్తాను. మీ ప్రతి మాటకు సమాధానం చెపుతాను. మీకు వీలైతే నా ట్వీట్‌ని మళ్లీ చదివి అర్థం చేసుకోండి’ అంటూ వీడియోని విడుదల చేశారు. Dear @PawanKalyan garu..i saw your press meet.. what i have said and what you have misinterpreted is surprising.. im shooting abroad. Will come back to reply your questions.. meanwhile i would appreciate if you can go through my tweet earlier and understand #justasking pic.twitter.com/zP3Z5EfqDa— Prakash Raj (@prakashraaj) September 24, 2024 ట్వీట్లో ప్రకాష్ రాజ్ ఏమన్నారంటేపవన్ కల్యాణ్... మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారణ జరిపి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, జాతీయ స్థాయిలో దీనిపై చర్చించుకునేలా చేస్తున్నారు? ఇప్పటికే మన దేశంలో ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l— Prakash Raj (@prakashraaj) September 20, 2024 ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై పవన్ ఇలా మాట్లాడారుసున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడాలి. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని పవన్ వ్యాఖ్యానించారు.చదవండి: పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే -
ఎక్స్‌లో బ్లాక్ బటన్ తొలగింపు: మస్క్ ట్వీట్ వైరల్
టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk) 'ట్విటర్'ను కొనుగోలు చేసినప్పటి నుంచి అనేక మార్పులు చేస్తూనే ఉన్నారు. ఉద్యోగులను తొలగించడం, బ్రాండ్ లోగో మార్చడం వంటి వాటితో పాటు పేరును కూడా 'ఎక్స్'గా మార్చేశారు. ఇప్పుడు ఎక్స్‌లోని 'బ్లాక్ బటన్' తీసివేస్తున్నట్లుగా ప్రకటించారు.ఎక్స్ ప్రస్తుత బ్లాక్ బటన్‌ను తీసివేయబోతోంది. అంటే అకౌంట్ పబ్లిక్‌గా ఉంటుంది. ఒక వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఏదైనా పోస్ట్ చేస్తే.. బ్లాక్ చేసిన వినియోగదారులకు కూడా కనిపిస్తుంది. అయితే వారు దీనిని లైక్, షేర్, కామెంట్ వంటివి చేయలేరు. కాబట్టి పోస్టును ప్రతి ఒక్కరూ చూడగలరు.బ్లాక్ బటన్ తొలగింపుకు సంబంధించిన పోస్ట్‌కు మస్క్ స్పందిస్తూ.. ''బ్లాక్ ఫంక్షన్ అనేది అకౌంట్ ఎంగేజ్ చేయకుండా బ్లాక్ చేస్తుంది, కానీ పబ్లిక్ పోస్ట్‌లను చూడకుండా నిరోధించదు'' అని అన్నారు.ఇదీ చదవండి: పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..ఎక్స్ ఫ్లాట్‌ఫాంలో అకౌంట్లను బ్లాక్ చేసే ఫీచర్‌కు స్వస్తి పలుకుతున్నట్లు మస్క్ గతంలోనే ప్రకటించారు. ఈ ఆప్షన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని.. ఈ కారణంగానే దీనిని తొలగించనున్నట్లు పేర్కొన్నారు. ఇది ఆన్లైన్ వేధింపులకు గురి చేస్తుందని చాలామంది యూజర్లు వాపోయారు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా పోస్ట్ చేస్తే.. బ్లాక్ చేసిన యూజర్ దానిపై స్పందించడానికి అవకాశం లేదు.High time this happened. The block function will block that account from engaging with, but not block seeing, public post.— Elon Musk (@elonmusk) September 23, 2024 -
తిరుమల లడ్డు వివాదం.. ట్వీట్‌తో అడ్డంగా దొరికిపోయిన నారా లోకేష్
సాక్షి,అమరావతి: ట్వీట్‌తో మంత్రి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. ఏఆర్ డెయిరీ కల్తీ నెయ్యి చంద్రబాబు హయాంలోనే వచ్చిందని ట్వీట్ చేశారు. చంద్రబాబు స్టేట్మెంట్కి విరుద్ధంగా లోకేష్ జులై 6, జులై 12న ఏఆర్ కల్తీ నెయ్యి ట్యాంక్‌లు వచ్చినట్టు ట్వీట్లో పేర్కొన్నారు. టెస్టులకు పంపిన నాలుగు ట్యాంకుల నెయ్యి వాడలేదని లోకేష్ ప్రకటించారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడేసారంటూ సీఎం చంద్రబాబు విష ప్రచారం చేస్తుంటే అసలు ఆ ట్యాంక్‌ల నెయ్యి వాడలేదని నారా లోకేష్ ట్వీట్ చేశారు. చదవండి : చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు -
మత్తు వదలరా-2 ట్విటర్ రివ్యూ.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘మత్తువదలరా 2’. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీకి రీతేష్ రానా దర్శకత్వం వహించారు. పార్ట్-1 హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు పడిపోవడంతో ట్విటర్ వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.(ఇది చదవండి: ‘మత్తు వదలరా 2’ ట్రైలర్: శ్రీసింహా, సత్య కామెడీ అదుర్స్)మత్తు వదలరా-2 ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఉందంటూ ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఫస్ట్ హాఫ్‌లోనే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడం ఖాయమని అంటున్నారు. నాన్‌స్టాప్ కామెడీ ఎంటర్టైనర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. సత్య తన ఫర్మామెన్స్, కామెడీ అదిరిపోయిందని బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమంటున్నారు. అయితే ఇది కేవలం ఆడియన్స్ అభిప్రాయం మాత్రమే. వీటికి సాక్షికి ఎలాంటి బాధ్యత వహించదు. IT’s A BLOCKBUSTER LAUGHING RIOT😂#Mathuvadalara2 pic.twitter.com/EbXyZKXGvL— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 13, 2024 Red Carpet Premiere:#MathuVadalara2 first half!🤣🤣😂Pure #Satya Rampage! Potta Noppochesindi. Really gifted comedian👏👏❤️🔥Non-stop entertainment. Second half Ee range lo Vinte Blockbuster guaranteed#MathuVadalara pic.twitter.com/0Qu8BGjAeD— Ungamma (@ShittyWriters) September 12, 2024 Done with my show, thoroughly enjoyed all references, although it has some lag moments. Satya is spot-on with his comic timing!!while other actors did their part. bhairava's music is lit. Overall a complete laugh riot film:) my rating is 2.75 #Mathuvadalara2Oneman show #Satya pic.twitter.com/kRyZ8Bf5Kn— palnadu tweets (@Nazeershaik1712) September 12, 2024 -
ట్వీట్ చేశాడు.. డిలీట్ కొట్టేశాడు..
-
ట్వీట్ చేశాడు.. డిలీట్ కొట్టేశాడు.. ‘పవన్’ దొరికిపోయాడు!
సాక్షి, విజయవాడ: పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అని మరోసారి రుజువైంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్.. సీఎం చంద్రబాబును పైకెత్తబోయి బోల్తా పడ్డారు. వరదల సమయంలోనూ చంద్రబాబు భజన మానలేదు. వరద సహాయ చర్యలపై ఎక్స్‌లో పెట్టిన ట్వీట్‌తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అవగాహన రాహిత్యం బయటపడింది.సీఎం చంద్రబాబుని పొగిడేందుకు ఫేక్ ఫోటోలను పవన్ పోస్ట్ చేశారు. ఏఐ ఫోటోలను పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్.. విమర్శలు రావడంతో మళ్ళీ ఆ ఫోటో ఎక్స్ నుంచి తీసేశారు. ప్రచారం కోసం టీడీపీ తయారు చేసిన ఫేక్ ఫొటోను పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్ విమర్శల పాలయ్యాడు.వరద బీభత్సంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడ పవన్ కల్యాణ్ తీరిగ్గా స్పందించిన సంగతి తెలిసిందే. విమర్శలు రావడంతో కృష్ణా నదికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన తర్వాత అధికారులతో కలిసి మానిటరింగ్ నిర్వహించారు. వరద సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో తప్పులు కప్పి పుచ్చుకునేందుకు పవన్.. ఆ నెపాన్ని వైఎస్సార్సీపీ, అధికారులపై నెట్టేసే ప్రయత్నం చేశారు. -
రెండేళ్లలో రూ.రెండు లక్షల కోట్ల నష్టం
ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విటర్) విలువ గడిచిన రెండేళ్లలో దాదాపు 72 శాతం తగ్గిపోయినట్లు ‘న్యూయార్క్‌పోస్ట్’ నివేదించింది. ఇలాన్‌మస్క్ అక్టోబర్ 2022లో ఎక్స్‌లో అధిక వాటా కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్వెస్టర్ల గ్రూప్‌నకు సుమారు 24 బిలియన్ డాలర్ల(రూ.2 లక్షల కోట్లు) నష్టం వాటిల్లినట్లు తెలిపింది.2022 అక్టోబర్‌తో పోలిస్తే ఎక్స్ విలువ దాదాపు 72 శాతం తగ్గిపోయింది. ఎక్స్‌లో అధిక వాటాలు కలిగిన ఎనిమిది మంది పెట్టుబడిదారుల ఇన్వెస్ట్మెంట్ మస్క్ పగ్గాలు చేపట్టిన తర్వాత దాదాపు 5 బిలియన్ డాలర్లు(రూ.41 వేలకోట్లు) తగ్గిపోయింది. ఎక్స్‌లో ప్రధానంగా జాక్‌డోర్సె, లారీ ఎల్సిసన్, సైకియా క్యాపిటల్స్ పెట్టుబడులు ఉన్నాయి. మస్క్ తర్వాత అతిపెద్ద పెట్టుబడిదారుగా కింగ్ అల్వీద్ బిన్ తలాల్ నిలిచారు. ఆయన వాటా 1.9 బిలియన్ డాలర్లు(రూ.15 వేలకోట్లు)గా ఉంది.ఇదీ చదవండి: 2.75 లక్షల ఫోన్ నంబర్లకు చెక్భవిష్యత్తులో ఎక్స్ ఆదాయ వనరులు భారీగా పెరుగుతాయని అల్వీద్ బిన్ తలాల్ విశ్వసిస్తున్నట్లు న్యూయార్క్‌పోస్టు తెలిపింది. కొంతకాలంగా ఎక్స్‌లో వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతోంది. సబ్స్క్రిప్షన్ సర్వీస్ ఛార్జీలు విధించడంతో ఎక్కువ మంది వినియోగదారులు ఈప్లాన్లపై ఆసక్తి చూపించడం లేదు. ఎక్స్ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో లేఆఫ్స్ ఇస్తుండడంతో నిర్వహణలో మార్పులు వస్తున్నట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. పలు నియంత్రణ సంస్థల నుంచి ఎక్స్‌కు సమస్యలు ఎదురవుతున్నాయి. -
బ్రెజిల్లో ‘ఎక్స్’పై నిషేధం
సావొ పౌలో: ఎలాన్ మస్క్‌కు చెందిన సామా జిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ను నిషేధించేందుకు బ్రెజిల్ యంత్రాంగం నడుం బిగించింది. శని వారం నుంచి ఇంటర్నెట్తోపాటు మొబైల్ యా ప్ ద్వారా కూడా ‘ఎక్స్’అందుబాటులో లేకుండా పోయింది. బ్రెజిల్లో ‘ఎక్స్’కు న్యాయ ప్రతి నిధిని నియమించాలంటూ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అలెగ్జాండర్ డీ మొరెస్ ఇచ్చిన ఆదేశాలపై నెల రోజులుగా వివాదం నడుస్తోంది. వాక్ స్వా తంత్య్రం, దుష్ప్రచారం, అతివాదులు దుర్విని యోగం చేస్తుండటం వంటి కారణాలపై జడ్జి ‘ఎక్స్’ను తప్పుబట్టారు. నెల రోజులుగా బ్రెజిల్లో ‘ఎక్స్’కు ప్రతినిధంటూ ఎవరూ లేకపోవడమేంటని ప్రశ్నించారు. 24 గంటల్లోగా ప్రతినిధిని నియమించకుంటే దేశంలో ‘ఎక్స్’ను నిషేధిస్తామని జడ్జి బుధవారం రాత్రి అల్టిమేటం జారీ చేశారు. ‘బ్రెజిల్ సార్వభౌమాధికారం, ప్రత్యేకించి న్యాయవ్యవస్థ పట్ల ఏమాత్రం గౌరవం లేనట్లుగా ఎలాన్ మస్క్ వ్యవహ రిస్తున్నారు. తనను తాను అత్యున్నతంగా, దేశాల చట్టాలకు అతీతుడిగా భావించుకుంటున్నారు’అని డీ మోరెస్ శుక్రవారం వెలువరించిన ఉత్తర్వుల్లో తీవ్రంగా వ్యాఖ్యానించారు. ‘నా ఉత్తర్వులను అమలు చేసేదాకా నిషేధం కొనసాగుతుంది. కాదని ఎవరైనా వీపీఎన్ల ద్వారా ‘ఎక్స్’ను వాడుకునేందుకు చూస్తే రోజుకు రూ. 7.47 లక్షల జరిమానా విధిస్తాం’అని ఆయన స్పష్టం చేశారు. ఎలాన్ మస్క్‌కే చెందిన స్టార్‌లింక్ ఆస్తులను స్తంభింపజేయాలని కూడా గత వారం జడ్జి ఆదేశాలిచ్చారు. జరిమానాలు చెల్లించేందుకు ‘ఎక్స్’ఖాతాల్లో చాలినంత డబ్బు లేనందున, ఒకే యాజమాన్యంలోని స్టార్‌లింక్‌పై ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. స్టార్ లింక్‌కు బ్రెజిల్లో 2.50లక్షల మంది ఖాతాదారులు న్నారు. కాగా, శనివారం అర్ధరాత్రిలోగా కోర్టు ఉత్తర్వు లను అమలు చేయాలని టెలి కమ్యూనికేషన్ల నియంత్ర ణ విభాగం అనాటెల్ దేశంలోని టెలికం సంస్థలకు స్ప ష్టం చేసింది. ‘ఎక్స్’కున్న అతిపెద్ద మార్కెట్లలో బ్రెజిల్ ఒకటి. దేశ జనాభాలో ఐదో వంతు, సుమారు 4 కోట్ల మంది దీనిని వాడుతున్నారు. నిషేధం అమలు చేయడంతో వేలాది మంది బ్రెజిల్ యూజర్లు వీపీఎన్ల ద్వారా ఎక్స్‌ను వాడుకునే పనిలో పడ్డారు. ఇటువంటి వారిని గుర్తించి, జరిమానా వసూలు చేయడమెలాగనే ప్రశ్న తాజాగా అధికారులను వేధిస్తోంది.తీవ్రంగా స్పందించిన ఎలాన్ మస్క్బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆదేశాలపై ‘ఎక్స్’యజమాని ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. జడ్జి ముసుగులో కొనసాగుతున్న అత్యంత తీవ్ర నేరగాడు అంటూ డీ మొరెస్పై నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారం కొలిక్కి వచ్చేవరకు తమ స్టార్ లింక్ బ్రెజిల్ వినియోగదారు లకు ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తుందన్నారు. -
బ్రెజిల్లో ‘ఎక్స్’పై నిషేధం
బ్రసీలియా: ఎలాన్ మస్క్ ‘ఎక్స్’(పూర్వపు ట్విట్టర్)పై నిషేధం విధిస్తూ బ్రెజిల్ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. తమ దేశంలో ఎక్స్ సంస్థ చట్టపరమైన ప్రతినిధిని నియమించాలని బ్రెజిల్ ప్రభుత్వం మస్క్‌ను కోరింది. అయితే ఆ ఉత్తర్వులను ఆయన బేఖాతరు చేశారు. దీంతో.. సేవలు నిలిపివేయాలంటూ అక్కడి అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎక్స్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని, దానిని అరికట్టేందుకు ప్రయత్నాలు చేయాలంటూ మస్క్‌ను బ్రెజిల్ ప్రభుత్వం కోరుతూ వస్తోంది. ఆపై ఈ వ్యవహారం నెలల తరబడి న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం న్యాయమూర్తి అలెగ్జాండ్రే డె మోరాయిస్ ఆదేశాలు వెల్లడించారు. 24 గంటల్లోగా ఆ ఆదేశాలను అమలు చేయాలని టెలికమ్యూనికేషన్ ఏజెన్సీని ఆదేశించారాయన. -
తెలంగాణ అధికారిక చిహ్నం మార్పు!.. ఈ వెకిలి పనులేంటి? కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కొత్త చిహ్నాన్ని ఎప్పుడు, ఎవరూ ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా? అని నిలదీశారు. రాష్ట్రలో అసలు ఏం జరుగుతుందో కనీసం మీకైనా తెలుసా అంటూ సీఎస్ శాంతి కుమారిని ప్రశ్నించారు.ఈ మేరకు ఎక్స్‌లో స్పందిస్తూ.. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా? అసలు ఎం జరుగుతోందో కనీసం మీకైనా తెలుసా తెలంగాణ సీఎస్ గారు?. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్లతో ఈ వెకిలి పనులు ఏంటి? కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది. ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా?అసలు ఎం జరుగుతోందో కనీసం మీకైనా తెలుసా @TelanganaCS గారు? తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్ లతో ఈ వెకిలి పనులు ఏంటి ?కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన… pic.twitter.com/Pywlv8Yvt0— KTR (@KTRBRS) August 27, 2024 అసలు ఎం జరుగుతోందో కనీసం మీకైనా తెలుసా @TelanganaCSగారు? తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్ లతో ఈ వెకిలి పనులు ఏంటి ?కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది.ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు?ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను -
చూసేందుకు సాధారణంగానే..!
కాస్త పొగరుబోతు నటిగా ముద్ర వేసుకున్న నటి నిత్యామీనన్. అది ఈమెలోని నటనా ప్రతిభ నుంచి వచ్చింది కావచ్చు. ఈమెను పొట్టి, బొద్దు అమ్మాయి అని కూడా అంటారు. అయితే వాటిని అస్సలు పట్టించుకోదు. అందుకే ఈ మలయాళ భామ తెలుగు, తమిళం భాషల్లోనూ కథానాయకిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. తిరుచ్చిట్రఫలం అనే తమిళ చిత్రంలోని నటనకుగానూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ అవార్డుల పట్టికలో ఉత్తమ నటి అవార్డుకు నిత్యామీనన్ పేరు చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆమె తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ ‘‘చాలా సంతోషంగా ఉంది. ఇది నేను గెలుచుకున్న తొలి జాతీయ అవార్డు. చూడడానికి సాధారణంగా ఉన్నా, నటన వెనుక ఉన్న శ్రమ సాధారణం కాదని అర్థం చేసుకున్న జాతీయ అవార్డుల కమిటీకి ధన్యవాదాలు. ఉత్తమ నటన అనేది బరువు తగ్గడమో, పెరగడమో, సహజ సిద్ధమైన శరీరాకృతిని మార్చుకోవడంలోనే ఉండదు. అవంతా నటనలో ఒక భాగం మాత్రమే కానీ అవే నటన కాదు. దీన్ని నిరూపించడానికే నేను ప్రయతి్నస్తున్నాను. ఈ అవార్డు నాకు, దర్శకుడు భారతీరాజా, ప్రకాశ్‌రాజ్,ధను‹Ùకు చెందుతుంది. ఎందుకంటే ఒక చిత్రంలో నటుడికి సరిసమానంగా నటికీ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నేను ఇంతకు ముందెప్పుడూ నటించలేదు. అది తిరుచ్చిట్రంఫలం చిత్రంలో జరిగింది. మరో విషయం ఏమిటంటే నిజాల కంటే వదంతులు అధికంగా ప్రచారం అవుతుంటాయి. ఒక రంగంలో ఎదగడం చాలా కష్టం’’ అని నిత్యామీనన్ పేర్కొన్నారు. కాగా తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డును ప్రకటించిన విషయం ముందుగా ధనుష్ ఫోన్ చేసి చెప్పారన్నారు. ఆయన ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడంతో విషయం ఏమిటని అడిగానన్నారు. అప్పుడు ఆయన ఈ అవార్డు గురించి వివరించారని నిత్యామీనన్ చెప్పారు. -
‘ఎక్స్’ అధికారుల అరెస్టు తప్పదు!
‘ఎక్స్’(ట్విటర్) ప్లాట్‌ఫామ్ నుంచి కంటెంట్‌ను తొలగించకపోతే తమ అధికారులను అరెస్ట్ చేస్తామని బెదిరింపులు వచ్చినట్లు ఎక్స్ ప్రకటించింది. బ్రెజిల్లో చట్టపరమైన ఆదేశాలు పాటించకపోతే అరెస్ట్‌లు తప్పవని ఎక్స్ అధికారులను అక్కడి అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఉన్న అలెగ్జాండ్రే డి మోరిస్ బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.ఇదీ చదవండి: ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ విస్తరణపై చర్చలుసామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, వెంటనే ఆ సమాచారాన్ని తొలగించాలని గతంలో బ్రెజిల్ న్యాయస్థానం తెలిపింది. స్థానికంగా ఎక్స్‌లో కొందరి ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల ఆయా ఖాతాలను ‘ఎక్స్’ తిరిగి యాక్టివేట్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సైతం తొలగించకుండా న్యాయస్థానం ఆదేశాలు పాటించలేదనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో బ్రెజిల్ న్యాయస్థానం ఆదేశాలు పాటించకపోతే అరెస్ట్‌లు తప్పవని ఎక్స్ అధికారులను న్యాయమూర్తి మోరిస్ బెదిరిస్తున్నట్లు ప్రకటనలు వెలిశాయి. అయితే దీనిపై బ్రెజిల్ న్యాయస్థానం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. -
రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
రామ్ పోతినేని- పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీని 2021లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ముంబయి భామ కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్‌కు సిద్ధమైన ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్తో పాటు ఇండియాలోనూ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి.ఇవాళ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రంపై నెటిజన్స్ ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమా అద్భుతంగా ఉందని.. ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ ఎక్సలెంట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. రామ్ మాస్ యాక్షన్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దీంతో ఉదయం నుంచే థియేటర్ల పండుగ వాతావరణం నెలకొంది. డబుల్ ఇస్మార్ట్‌కు హిట్ టాక్ రావడంతో రామ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. #DoubleISMART Super hit...My fav director puri sir is back...Positives Puri sir dialogues, Amma sentiment,mani Sharma music vere level, big plus Ram energy #DoubleismartonAug15th #DoubleISMARTCelebrations pic.twitter.com/xGwnAKPCAX— Srinu Nattu vidyam (@srinu18_srinu) August 14, 2024 Nandyal EMS mass crowd House full's everywhere 🔥🥵Ustaad @ramsayz ❤️🔥🥳#RAmPOthineni #DoubleISMART#DoubleismartRAmPAgepic.twitter.com/4CkXFS3zhF— DoubleISMART🔱 CITYZEN⚽️ (@Ismart_Cityzen) August 15, 2024 Just now completed ☑️ Congratulations #PuriJagannadh sir🎉Good Movie 👍2nd half >> 1st half Climax 💥💥💥#ManiSharma bgm and songs💥💥#DoubleISMART #RAmPOthineni pic.twitter.com/QJwUGJQbtt— JA$HU’NTR’ (@Jashu_Chowdary9) August 14, 2024 BLOCK BUSTER 💥💥🤟#DoubleISMART #BlockbusterDoubleISMART pic.twitter.com/s2GkDuAAId— RAm POthineni Trends (@RAPOFanTrends) August 15, 2024 -
నటుడి ట్విటర్ ఖాతా హ్యాక్.. ఫ్యాన్స్‌కు హెచ్చరిక!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ సోషల్ మీడియా ఖాతా ఎక్స్(ట్విటర్ అకౌంట్) హ్యాకింగ్ గురైంది. ఈ విషయాన్ని నటుడు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన ఖాతా నుంచి ఏదైనా పోస్టులు వస్తే స్పందించవద్దని తెలిపారు. తన అభిమానులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాగా.. అర్జున్ రాంపాల్ చివరిసారిగా 'క్రాక్' చిత్రంలో నటించాడు. ప్రస్తుతం సంజయ్ దత్, రణవీర్ సింగ్‌లతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ఆదిత్య ధర్ హెల్మ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బీ62 బ్యానర్లపై జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్, ఆదిత్య ధర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Arjun Rampal (@rampal72) -
ప్రధానిపై సభాహక్కుల తీర్మానం
న్యూఢిల్లీ: విపక్షనేత రాహుల్ గాందీపై లోక్‌సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం మరో మలుపు తీసుకుంది. అనురాగ్ వ్యాఖ్యల్లో స్పీకర్ తొలగించిన భాగాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ’ఎక్స్‘లో షేర్ చేశారని, ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చారు. సభా నియమావళి రూల్–222 కింద ప్రధానిపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానానికి నోటీసు ఇస్తున్నట్లు చన్నీ తెలిపారు. మంగళవారం అనురాగ్ ఠూకూర్ లోక్‌సభలో మాట్లాడుతూ.. తమ కులమేమిటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని రాహుల్‌ను ఉద్దేశించి అన్నారు. దీనిపై విపక్ష సభ్యుల అభ్యంతరంతో స్పీకర్ స్థానంలో ఉన్న జగదంబికా పాల్ (కాంగ్రెస్ ఎంపీ) అనురాగ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. ‘నిబంధనల ప్రకారం రికార్డుల నుంచి తొలిగించిన వ్యాఖ్యలను ప్రచురించడం సభాహక్కుల ఉల్లంఘనే. సుప్రీంకోర్టు కూడా దీన్నే ధృవకరించింది’ అని చన్నీ తెలిపారు. ‘ అయితే అనురాగ్ తమ కులమేమిటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని అన్నపుడు ఎవరి పేరునూ తీసుకోలేదని, ఈ వ్యాఖ్యను రికార్డుల నుంచి తొలగించలేదని, దీని ఆధారంగా చన్నీ ఇచ్చే నోటీసు పరిగణనకు రాకపోవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్‌లో అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని మొత్తం షేర్ చేస్తూ.. ‘తప్పకుండా వినాల్సినది. వాస్తవాలు, హాస్యం మేలు కలయిక. ఇండియా కూటమి నీచ రాజకీయాలను ఎండగట్టింది’ అని కితాబిచ్చారు. అనురాగ్ వ్యాఖ్యలపై బుధవారం కూడా లోక్‌సభలో తీవ్ర దుమారం రేగింది. -
ట్వీట్ దుమారం..ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం
ఢిల్లీ : ప్రధాని మోదీకి వ్యతిరేకంగా లోక్‌సభలో సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. నిన్న అనురాగ్ ఠాగూర్ ప్రసంగాన్ని మోదీ ప్రశంసించారు. అంతేకాదు అందరు వినాల్సిన ప్రసంగం అంటూ మోదీ ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది.లోక్‌సభ సమావేశాలపై ప్రధాన సమస్యలపై అధికార, విపక్షాల మధ్యవాగ్వాదం చోటు చేసుకుంది. మరీ ముఖ్యంగా కులగణనపై కాంగ్రెస్‌తో పాటు రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ విరుచుకు పడ్డారు.ఈ సందర్భంగా సభలో ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అంతే ధీటుగా రాహుల్ గాంధీ బదులిచ్చారు. వెనుకబడిన వర్గాల కోసం పోరాడే వారికి అవమానాలు తప్పవని అన్నారు. ఇలాంటి అవమానాలు ఎన్ని ఎదురైన తన పోరాటం ఆగదని వ్యాఖ్యానించారు. కులగణన బిల్లును లోక్‌సభలో అమోదింప జేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ తరుణంలో లోక్‌సభలో అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగంపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. విపక్షనేత రాహుల్ గాంధీకి కౌంటర్ ఇవ్వడాన్ని ప్రశంసిస్తూ.. ఠాకూర్ ప్రసంగాన్ని తప్పకుండా వినాలని అన్నారు.‘యువనేత అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగాన్ని తప్పకుండా వినాలి. వాస్తవాలు, హాస్యచతురతతో కూడిన ఆయన ప్రసంగం ఇండియా కూటమి దుర్మార్గపు రాజకీయాల్ని బహిర్ఘతం చేసింది’అని ట్విటర్లో పోస్ట్ చేశారు మోదీ. అయితే మోదీ ట్వీట్‌పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మోదీకి వ్యతిరేకంగా సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని తీర్మానించింది. STORY | Congress MP Charanjit Singh Channi submits notice to move privilege motion against PM for sharing expunged remarksREAD: https://t.co/0o8feagLlN pic.twitter.com/hNtsFKSWN8— Press Trust of India (@PTI_News) July 31, 2024మోదీపై ప్రివిలేజ్ మోషన్కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ప్రధాని ట్వీట్ చేయడం,వాటిని ప్రచారం చేయడం సభను ధిక్కరించారని పేర్కొంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. -
ఇదేరా ప్రేమంటే...! వైరల్ వీడియో
సిరిసంపద, ఈడూజోడు అన్నీఉన్నా కలిసి కాపురం చేయలేని జంటలెన్నో. కలసి ఉన్నా, సఖ్యత, ప్రేమ లేని సంసారాలు మరెన్నో నిత్యం మన కళ్ల ముందు కనబడుతూనే ఉంటాయి. అలాగే ఒకరికొకరు తోడు నీడగా, ప్రేమకు, ఆప్యాయతకు ప్రతిరూపంగా నలుగురికీ ఆదర్శంగా నిలిచే జంటలు కూడా చాలా ఉన్నాయి. తాజాగా అన్యోన్య దాంపత్యానికి, భార్యభర్తల అనుబంధానికి నిదర్శనంగా నిలిచిన ఒక జంట వీడియో నెటిజనులను ఆకర్షిస్తోంది. వినోద్మెహతా అనే ఎక్స్ యూజర్ ‘ఇదీ జీవితం.. ఈ ప్రేమ ఇలాగే ఉండాలి’ అంటూ షేర్చేసిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది. భార్య, భర్త, వారికొక బిడ్డ అందమైన ఫ్యామిలీ. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భర్తకు రెండు చేతులూ (కుడి చేయి మోచేతి కిందనించి లేదు) లేవు. ఇద్దరూ కలిసి ఒక హోటల్‌కు వెళ్లారు. బిడ్డను ఒడిలో పెట్టుకుని కూచుని ఉన్న భార్య మరో చేతితో అతనికి చపాతీ తినిపించింది. మరో విశేషం ఏమిటంటే..సగం కుడిచేత్తోనే చపాతిని గుండ్రంగా ఒడుపుగా చుట్టి కూరలో ముంచి భార్యకు తినిపించాడు. ఇది చూసిన నెటిజన్లు లవ్లీ, బ్యూటిఫుల్ అంటూ కమెంట్ చేశారు. డబ్బుకు పేదలే గానీ, ప్రేమకు కాదు, ఇదే కదా ప్రేమంటే అంటూ ఈ జంటపై ప్రశంసలు కురిపించారు. -
Raayan X Review: ధనుష్ 'రాయన్' ట్విటర్ రివ్యూ
తమిళ హీరో ధనుష్ మైల్ స్టోన్ మూవీ 'రాయన్'.ఇతడే దర్శకత్వం వహించిన, హీరోగా నటించాడు. సందీప్ కిషన్, కాళీదాస్ జయరాం, దుసరా విజయన్, అపర్ణ బాలమురళి, ప్రకాశ్ రాజ్, సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రలు చేశారు. తాజాగా ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? చూసిన వాళ్లు ట్విటర్లో టాక్ ఏంటి?ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, సెకండాఫ్ మరింత బాగుందని అంటున్నారు. అలానే ధనుష్ ఎంట్రీ అదిరిపోయిందని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్యాంగ్ సూపర్ గా ఉందని అంటున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందని, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని చెప్పుకొచ్చారు. పూర్తి రివ్యూ ఏంటనేది మరికాసేపట్లో వచ్చేస్తుంది.#Raayan - ARR Bhai is the second hero of the movie🥶🫶Sema BGM, especially the flashback portions🤌🔥🔥 pic.twitter.com/y8Nl2Q7wiU— AmuthaBharathi (@CinemaWithAB) July 26, 2024#Raayan First Half REPORT -Raayan - Raw & Rustic One 🔥💥 . @dhanushkraja 's Transformation 🥵🔥 screen presence ... Fireyyyy One ! #Dhanush 's Direction 🏆🙏🙏 Top Notch ... Literally Witnessed an another Vetrimaran Here 🔥 Casting & their Performance - Perfect 💥… pic.twitter.com/shheQ4m4ir— Let's X OTT GLOBAL (@LetsXOtt) July 26, 2024#Raayan interval 💥💥💥💥💥💥#dhanush naaaaaaaaaaaa 💥💥💥💥💥💥💥💥💥💥💥 Watha edra Dragon Template ah omalae #RaayanFDFS pic.twitter.com/TAUiUjcsPG— Tonystark👊🏽 (@Tonystark2409) July 26, 2024#Raayan First half - ABOVE AVERAGE to GOOD🤝- Takes some to set the phase & establish the characters & the story gears up in the midway of the movie 🔥- A Usual Revenge drama but shies out well with the treatment of Director #Dhanush👌- Goosebumps Interval Portion🔪🥵- ARR… pic.twitter.com/XE9v9Lc0Fv— AmuthaBharathi (@CinemaWithAB) July 26, 2024Simple and neat title card with terrific BGM..#Raayan pic.twitter.com/5zt02u4Hhg— R Vasanth (@rvasanth92) July 26, 2024 -
‘పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్!‘..కేటీఆర్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్ : పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు..!గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్..!వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్..!డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన...దోకేబాజ్ బడ్జెట్..!విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతోఏమార్చిన డొల్ల బడ్జెట్..!రైతులకు…— KTR (@KTRBRS) July 25, 2024 అయితే ఈ బడ్జెట్‌పై కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు..!గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్..! వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్ అని మండిపడ్డారు. డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన...దోకేబాజ్ బడ్జెట్..! విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతో ఏమార్చిన డొల్ల బడ్జెట్ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ట్వీట్లో కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే..రైతులకు కత్తిరింపులు. అన్నదాతలకు సున్నం..! ఆడబిడ్డలకు అన్యాయం.. మహాలక్ష్ములకు మహామోసం..! అవ్వాతాతలకు..దివ్యాంగులకు..నిరుపేదలకు...నిస్సహాయులకు మొండిచేయి..! పెన్షన్ల పెంపు మాటెత్తలేదు..! దళితులకు దగా..గిరిజనులకు మోసం. అంబేద్కర్ అభయహస్తం ఊసులేదు..శూన్యహస్తమే మిగిలింది..! బడుగు..బలహీన వర్గాలకు భరోసాలేదు..వృత్తి కులాలపై కత్తికట్టారు..! మైనార్టీలకు ఇచ్చిన మాటలన్నీ..నీటి మూటలైనయ్..! నిరుద్యోగుల ఆశలపై నీళ్లు..4 వేల భృతి జాడా పత్తా లేదు..! విద్యార్థులపై కూడా వివక్షే..5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేదు..! హైదరాబాద్ అభివృధిపై శ్రద్ధలేదు..మహానగర మౌలిక వసతులకు నిధుల్లేవ్..! నేతన్నకు చేయూత లేదు..ఆటో అన్నలను అండదండ లేదు..ఆత్మహత్యపాలైన కుటుంబాలకు ఆదుకోవాలన్న మానవీయ కోణమేలేదు..! మొత్తంగా ..పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్..! అంటూ ట్వీట్లో తెలిపారు. -
ట్రెండ్ సెట్టర్.. 100M క్రాస్..
-
ప్రపంచంలోనే ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు వీరికే (ఫొటోలు)
-
విమానంలో మహిళ పట్ల జిందాల్ స్టీల్ సీఈవో పైత్యం : స్పందించిన సంస్థ
జిందాల్ గ్రూప్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు విమానంలో తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ కోలకతాకు చెందిన ఒక మహిళ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో శుక్రవారం ఒక పోస్ట్ పెట్టింది. దీంతో జిందాల్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ నవీన్ జిందాల్ స్పందించారు. నిందితుడైన ఉద్యోగిపై "కఠినమైన చర్యలు" తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోల్‌కతా నుంచి అబుదాబీ వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు బాధితురాలు వెల్లడించింది. ఆమె అందించిన వివరాల ప్రకారం కోల్‌కతా నుంచి బోస్టన్‌కు అబుదాబీకి ఎతిహాద్ ఎయిర్వేస్కు చెందిన ట్రాన్సిట్ విమానంలో బయలుదేరింది. విమానంలో ఆమె పక్కన కూర్చున్న 65 ఏళ్ల వ్యక్తి తాను జిందాల్ స్టీల్ సీఈఓ దినేష్ కుమార్ సరయోగిని తాను పరిచయం చేసుకున్నాడు. కుటుంబం, నేపథ్యంలో అంటూ మెల్లిగా మాటలు కలిపాడు. తాను ఒమన్‌లో నివసిస్తున్నానని, కానీ తరచూ ప్రయాణిస్తుంటా అని చెప్పాడు. తన కొడుకులు పెళ్లిళ్లు అయ్యి, అమెరికాలో స్థిరపడ్డారు అంటూ కబుర్లు చెప్పాడు. ఇక ఆ తరువాత అతగాడి అసలు రూపాన్ని చూపించడం మొదలు పెట్టాడు. ఆమెను అసభ్య చిత్రాలు చూడమని బలవంతం చేశాడు ఈ షాక్ నుంచి తేరుకునే లోపలే శరీరం చుట్టూ చేతులేసి అసభ్యకరంగా తాకాడు. దీంతో అక్కడినుంచి తప్పించుకుని వాష్‌రూమ్‌కి పారిపోయి విమానంలోని సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. విమానం అబుదాబీలో దిగే సమయానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అయితే తనకు బోస్టన్‌కు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవుతుందనే భయంతో లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వలేకపోయానని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. మరోవైపు నిందితుడిపై అబుదాబి పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.అయితే తనలాంటి పరిస్థితి మరి ఏ మహిళకు రాకూడదనే ఉద్దేశంతో సోషల్‌మీడియా వేదికగా బహిరంగంగా వెల్లడిస్తున్నట్టు తెలిపింది. దీనిపై స్పందించిన జిందాల్ గ్రూప్ చైర్మన్ ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి వాటిని కంపెనీ అస్సలు సహించదని స్పష్టం చేశారు. -
హృదయాల్ని కదిలిస్తున్న చిన్నారి : వైరల్ వీడియో
సాధారణంగా కన్నబిడ్డల్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ అంధులైన తల్లిదండ్రులను అన్నీ తానై చూసుకుంటోంది ఓ చిన్నారి. అమ్మా, నాన్న చేయి పట్టుకుని అడుగులు నేర్చుకునే వయసులోనే తల్లిదండ్రులను చేయి పట్టుకొని భద్రంగా తీసుకెళుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట ఆకర్షణీయంగా నిలిచింది.In a touching emotional scene, a child is helping his blind parents at an age when they have to teach him to walk. pic.twitter.com/zVVSXHexlx— Akanksha Parmar (@iAkankshaP) July 18, 2024ఆకాంక్ష పర్మార్ అనే యూజర్ ఎక్స్‌లో ఈ ఈ వీడియోను షేర్ చేశారు. ‘ఇదీ సంస్కారం అంటే’ అంటూ నెటిజన్లు ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. హృదయాన్ని కదిలిస్తోంది అంటూ చాలామంది ఎమోషనల్ అయ్యారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే ఇలాంటి వారికోసం ప్రభుత్వం పూనుకొని ఏదైనా చర్యలు తీసుకోవాలని మరికొంతమంది సూచించారు. -
‘అర్థం కాకపోతే మళ్ళీ వినండి’.. లోకేష్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
సాక్షి, తాడేపల్లి: ‘‘నేను మీడియా ప్రతినిధులను ఎన్నడూ దూషించలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తులు గురించి మాత్రమే మాట్లాడాను. నా మాటలను తప్పుదారి పట్టించవద్దు.. అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్ళీ వినండి’’ అంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్(ట్విటర్) వేదికగా మంత్రి నారా లోకేష్‌పై మండిపడ్డారు.‘‘మంచి, మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేను నేర్పిస్తాను. మీ భాష ఏమిటో మీకు తెలియాలంటే గత ఇరవై నెలల మీ వీడియోలు మీరే చూసుకోండి. పెద్దల సభ సభ్యుడితో మాట్లాడే తీరు ఇదేనా?’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.Sri @naralokesh, నేను మీడియా ప్రతినిధులను ఎన్నడూ దూషించలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తులు గురించి మాత్రమే మాట్లాడాను, నా మాటలను తప్పుదారి పట్టించవద్దు, అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్ళీ వినండి. మంచి, మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేను నేర్పిస్తాను.…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 17, 2024 ‘‘అధికారం ఇస్తే 24 గంటల్లో న్యాయం అన్నారు.. సుగాలి ప్రీతి ఏమైంది? చిత్తూరు జిల్లా మైనర్ బాలిక హత్య కేసు ఏమైంది?’’ అంటూ మంత్రి నారా లోకేష్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. ‘‘మీరు రాష్ట్రంలో రావణకాష్టాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ.. కుల వివక్షతతో మా పార్టీ కార్యకర్తల్ని వారి కుటుంబాల్ని గ్రామాల నుంచి వెళ్లగొట్టి హింసిస్తూ దాని దృష్టి మళ్లించడానికి ఎందుకీ యాతన?’’ అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.Sri @naralokesh, అధికారం ఇస్తే 24 గంటల్లో న్యాయం అన్నారు, సుగాలి ప్రీతి ఏమైంది? చిత్తూరు జిల్లా మైనర్ బాలిక హత్య కేసు ఏమైంది? మీరు రాష్ట్రంలో రావణకాష్టాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ, కుల వివక్షతతో మా పార్టీ కార్యకర్తల్ని వారి కుటుంబాల్ని గ్రామాల నుంచి వెళ్లగొట్టి హింసిస్తూ దాని…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 17, 2024 -
ఎక్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ రికార్డు
-
‘ఎక్స్’లో మోదీ ఫాలోయర్లు 10 కోట్లు..!
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ వేదికలపై ఎల్లప్పుడూ చురుగ్గా ఉండే ప్రధాని మోదీ మరో మైలురాయిని అధిగమించారు. ‘ఎక్స్’హ్యాండిల్లో ప్రధాని మోదీ ఫాలోయర్ల సంఖ్య ఆదివారం రికార్డు స్థాయిలో 10 కోట్లను దాటిపోయింది. గత మూడేళ్లలో అదనంగా 3 కోట్ల మంది ఫాలోయర్లు నమోదవడంతో మోదీ ఈ ఘనత సాధించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అత్యధిక ఫాలోయర్లు కలిగిన ప్రపంచ నేతల్లో ఒకరిగా ఆయనకు ఇప్పటికే పేరుంది. దేశంలో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు 2.75 కోట్ల మంది, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి 2.64 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ప్రపంచ నేతల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు 3.81 కోట్ల మంది, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌కు 2.15 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. క్రీడాకారుల్లో క్రికెటర్ విరాట్ కోహ్లీకి 6.41 కోట్ల మంది, ఫుట్‌బాల్ క్రీడాకారుడు నెయ్‌మార్‌కు 6.36 కోట్లు, అమెరికా బాస్కెట్ బాల్ క్రీడాకారుడు లెబ్రాన్ జేమ్స్‌కు 5.29 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారని ‘ఎక్స్’అధికారి ఒకరు వివరించారు. అమెరికాకు చెందిన సెలెబ్రిటీ టేలర్ స్విఫ్ట్‌కు 9.53 కోట్లు, లేడీ గాగాకు 8.31 కోట్లు, కిమ్ కర్దాషియన్‌కు 7.52 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నట్లు తెలిపారు. -
ప్రధాని మోదీ రికార్డు.. 10 కోట్లకు చేరిన ‘ఎక్స్’ ఫాలోవర్లు
న్యూఢిల్లీ: ఎక్స్(ట్విటర్)లో ఫాలోవర్ల సంఖ్య విషయంలో ప్రధాని మోదీ కొత్త రికార్డు నెలకొల్పారు.‘ఎక్స్’లో ఆయన ఫాలోవర్ల సంఖ్య ఆదివారం (జులై 14) 100 మిలియన్ల మార్కు (10 కోట్లు)ను దాటారు.దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు దాటడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.‘ఎక్స్‌లో ఉండటం, ఈ వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు, నిర్మాణాత్మక విమర్శలు లభిస్తుండటం సంతోషంగా ఉంది’ అని మోదీ పోస్ట్ చేశారు.A hundred million on @X! Happy to be on this vibrant medium and cherish the discussion, debate, insights, people’s blessings, constructive criticism and more. Looking forward to an equally engaging time in the future as well. pic.twitter.com/Gcl16wsSM5— Narendra Modi (@narendramodi) July 14, 2024 2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ ట్విటర్ లో ఖాతా ప్రారంభించారు. 2010కే ఆయన లక్ష మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. మరో ఏడాదికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరింది. 2020 జులై 19 నాటికి 6 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా గడిచిన నాలుగేళ్లలో 4 కోట్ల మంది ఫాలోవర్లు పెరిగారు.ప్రపంచ నేతల్లో ఎవరికీ దక్కని రికార్డు..ప్రస్తుత ప్రపంచ నేతల్లో ఎవరికీ ప్రధాని మోదీ స్థాయిలో ఫాలోయింగ్ లేదు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ‘ఎక్స్’లో 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మన దేశంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను 27.5 మిలియన్ల మంది, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 26.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. -
1.9 లక్షల 'ఎక్స్' అకౌంట్స్ నిషేధం!.. కారణం ఇదే
బిలినీయర్ ఇలాన్ మస్క్ (Elon Musk) ఆధీనంలోని ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విటర్) మే 26 నుంచి జూన్ 15 మధ్య భారతదేశంలో ఏకంగా 194053 ఖాతాలను నిషేధించినట్లు పేర్కొంది. కంపెనీ నియమాలను పాటించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.కొత్త ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ తన ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా ఖాతాలను తొలగించింది. వచ్చిన మొత్తం ఫిర్యాదులలో 12570 భారతదేశం నుంచి వచ్చినట్లు సమాచారం. ఇందులో సెన్సిటివ్ అడల్ట్ కంటెంట్, వేధింపులు వంటి వాటికి సంబంధించినవి మాత్రమే కాకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.మస్క్.. ఎక్స్ ప్లాట్‌ఫామ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఫోటోను ఇతరులకు కనిపించకుండా కూడా చేసింది. ఇది యూజర్ గోప్యతను మెరుగుపరుస్తుంది. రూల్స్ అతిక్రమించిన వారి అకౌంట్స్ ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల 194053 ఖాతాలను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. -
టాలీవుడ్ క్రేజీ మూవీ.. అనౌన్స్మెంట్తోనే అదరగొడుతోంది!
సత్యం రాజేశ్, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొలిమేర-2. గతేడాది రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్లో తెరకెక్కించారు. పొలిమేర బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇప్పటికే ఈ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అయితే ఇప్పటికే పార్ట్-3 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పొలిమేర-3ని అధికారికంగా ప్రకటించారు. అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్లో నందిపాటి వంశీ నిర్మిస్తున్నారు. దీంతో పాటు పొలిమేర-3 గ్లింప్స్ రిలీజ్ చేశారు. పొలిమేర-3 అనౌన్స్ చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. ట్విటర్లో ఇండియా వ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ విషయాన్ని పొలిమేర-3 లోడింగ్ అంటూ మేకర్స్ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. The Much Awaited #Polimera3 Announcement Crosses Borders💥"#Polimera3Loading.." Trending at the Top in India on @X ❤️🔥Journey begins!🤩A @DrAnilViswanath FilmProduced by @connect2vamsi - #VamsiNandipatiCo-Produced by #BhogendraGupta⭐️ing @Satyamrajesh2… pic.twitter.com/MAUaItl2tF— GSK Media (@GskMedia_PR) July 10, 2024Let's BEGIN the SHOW❤️🔥Get Ready for the Spine-Chilling #Polimera3, next part of #Polimera Franchise🤩#Polimera3Loading..A @DrAnilViswanath FilmProduced by @connect2vamsi - #VamsiNandipatiCo-Produced by #BhogendraGupta⭐️ing @Satyamrajesh2 #DrKamakshiBhaskarla… pic.twitter.com/iLCJE0tYkZ— GSK Media (@GskMedia_PR) July 10, 2024 -
అస్సాంలో రాహుల్.. కాంగ్రెస్, బీజేపీ ట్వీట్ వార్
గువహతి: లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ సోమవారం ఉయదం (జులై 8) అస్సాంలో పర్యటించారు. సిల్చార్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. అస్సాం నుంచి రాహుల్‌గాంధీ మణిపూర్‌కు పర్యటనకు బయల్దేరారు. ఈ సీజన్లో వచ్చిన వరదలకు అస్సాంలో కొన్ని లక్షల మంది ప్రభావితమయ్యారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం..నాన్ బయాలజికల్ ప్రధాని సోమవారం ఉదయం మాస్కో వెళ్లారని ఎక్స్(ట్విటర్)లో జైరాంరమేష్ ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ మాత్రం అస్సాంలో వరద బాధితులను పరామర్శిస్తున్నారన్నారు. మణిపూర్‌లో రాహుల్ పర్యటించడం ఇది మూడోసారని తెలిపారు. మరోపక్క బీజేపీ ఐటీ అమిత్ మాలవ్య జైరాంరమేష్ ట్వీట్‌పై స్పందించారు. అసలు మణిపూర్‌లో జాతుల మధ్య వైరానికి కాంగ్రెస్సే కారణమన్నారు. రాహుల్‌గాంధీది ట్రాజెడీ టూరిజం అని విమర్శించారు. -
'దయచేసి ఎవరు సీరియస్‌గా తీసుకోవద్దు'.. విశ్వక్ సేన్ విజ్ఞప్తి!
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్. గోదావరి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం విశ్వక్ లైలా చిత్రంలో నటించనున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అంతే కాకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ తన కెరీర్లో తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించనున్నారు. అయితే తాజాగా విశ్వక్ సేన్ సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్విటర్లో పోస్ట్ చేశారు.తాజా పోస్ట్‌లో విశ్వక్ సేన్ రాస్తూ..'అందరికీ హాయ్.. నేను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. అయితే నా ఇన్‌స్టాగ్రామ్‌కు చిన్న విరామం మాత్రమే. మీరు ఎవరు చింతించాల్సిన పనిలేదు. ట్విట్టర్ ఖాతాను నా టీమ్ నిర్వహిస్తుంది. నా ఇన్స్టాగ్రామ్ డీయాక్టివేషన్ గురించి ఒత్తిడికి గురికావద్దని' సూచించారు.అంతేకాకుండా.. 'ఇటీవల నా సోషల్ మీడియా ఖాతా డియాక్టివేషన్ కారణంగా అందరూ మేసేజులు పెడుతున్నారు. అంతా బాగానే ఉందా అని. ఇది చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా నా వ్యక్తిగత జీవితాన్ని నిర్వచించదు. సోషల్ మీడియాను కొంత వరకు మాత్రమే సీరియస్‌గా తీసుకోవాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. మీ అందరికీ ధన్యవాదాలు!' అంటూ పోస్ట్ చేశారు. అయితే విశ్వక్ సేన్ నిర్ణయంపై ఫ్యాన్స్ నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. Hey everyone, just a heads up—I posted a story about starting a social media detox. It's a small break from Instagram, nothing to worry about. Try being productive during this time! My team mostly manages my Twitter, so don't stress over my Instagram deactivation. Lately, I've…— VishwakSen (@VishwakSenActor) July 5, 2024 -
మస్క్‌కు పోటీగా ఎగసి.. అంతలోనే మూతపడిన ఇండియన్ యాప్
ఇలాన్ మస్క్ ఆధీనంలోని ట్విటర్ (ప్రస్తుతం ‘ఎక్స్’)కు పోటీగా వచ్చిన భారతీయ స్టార్టప్ ‘కూ’ (Koo) మూతపడింది. పలు పెద్ద ఇంటర్నెట్ కంపెనీలు, సమ్మేళనాలు, మీడియా హౌస్‌లతో కొనుగోలు చర్చలు విఫలం కావడంతో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు యాప్ వ్యవస్థాపకులు తెలిపారు.నాలుగు సంవత్సరాల క్రితం 2020లో అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిదవత్కా ‘కూ’ను ప్రారంభించారు. భారత్‌లో యూఎస్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన అనేక కంపెనీలలో ‘కూ’ ఒకటి. స్థానిక భాషలలో వినియోగదారులకు సేవలు అందిస్తోంది.‘కూ’ వ్యవస్థాపకులు రాధాకృష్ణ, బిదవత్కా బుధవారం లింక్డ్ఇన్ పోస్ట్‌లో వివరాలు వెల్లడించారు. "పలు పెద్ద ఇంటర్నెట్ కంపెనీలు, సమ్మేళనాలు, మీడియా హౌస్‌లతో" కొనుగోలు చర్చలు విఫలమైన తర్వాత ‘కూ’ను మూసివేస్తున్నట్లు తెలిపారు. కాగా బెంగుళూరుకు చెందిన న్యూస్, కంటెంట్ అగ్రిగేటర్ డైలీహంట్ ద్వారా ‘కూ’ని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు ఫిబ్రవరిలో టెక్ క్రంచ్ నివేదిక పేర్కొంది.‘కూ’కు ఒకానొకప్పుడు దాదాపు కోటి మంది మంత్లీ యాక్టివ్ యూజర్లు, 21 లక్షల మంది డైలీ యాక్టివ్ యూజర్లు ఉండేవారు. ప్రభుత్వంతో కలిసి ట్విటర్ కంటెంట్‌పై ఆంక్షలు తీసుకొచ్చినప్పుడు ఆ సంస్థపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 2022లో ‘కూ’కు ఆదరణ విపరీతంగా పెరిగింది. ఆ సమయంలోనే ఈ ఇండియన్ యాప్ 50 మిలియన్ యూజర్ల మార్కును దాటింది.మరియు రోగి మూలధనం" అవసరమని రాధాకృష్ణ పేర్కొన్నారు. -
వైరల్ వీడియో: అంబానీ ఇంట్లో పెళ్లి అంటే మజాకా?
-
‘ఎక్స్’ లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్ కొందరికే...???
బిలినీయర్, టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ (Elon Musk) ఎక్స్ (ట్విటర్) కొనుగోలు చేసినప్పటి నుంచి సంచలన మార్పులు తీసుకువచ్చారు. ఇప్పుడు ప్రీమియం సబ్స్క్రైబర్లను పెంచుకోవడంలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాన్ని కంపెనీ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.రాబోయే రోజుల్లో ప్రీమియం సబ్స్క్రైబర్లు మాత్రమే 'ఎక్స్'లో లైవ్ స్ట్రీమ్ (క్రియేట్ లైవ్ వీడియో స్ట్రీమ్) చేయగలరు. ఇందులో ఎక్స్ ఇంటిగ్రేషన్‌తో ఎన్కోడర్ నుంచి లైవ్ కూడా ఉంటుంది. ఈ లైవ్ కొనసాగించడానికి యూజర్లు ప్రీమియంకు అప్‌గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కంపెనీ దీనికి సంబంధించి ఓ ప్రకటన వెల్లడించినప్పటికీ.. ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే విషయాని వెల్లడించలేదు. ఎక్స్ బేసిక్ ప్రీమియం చార్జీలు 215 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి.⏩Starting soon, only Premium subscribers will be able to livestream (create live video streams) on X. This includes going live from an encoder with X integration. Upgrade to Premium to continue going live. https://t.co/4uy4Ju0cmU— Live (@Live) June 21, 2024 -
భారత్‌లోనూ EVMలు కాకుండా బ్యాలెట్‌నే వాడాలి: వైఎస్ జగన్
-
‘‘మోదీ కా పరివార్ తొలగించండి’’
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో పేర్ల వెనుకాల ఉన్న ‘మోదీ కా పరివార్’ను తొలగించాల్సిందిగా ప్రధాని మోదీ ఎక్స్(ట్విటర్) వేదికగా మంగళవారం(జూన్11) విజ్ఞప్తి చేశారు.‘ఎన్నికల సమయంలో నా మీద అభిమానానికి గుర్తుగా సోషల్ మీడియా ఖాతాల్లో మోదీ కా పరివార్ చేర్చారు. ఇది నాకు చాలా శక్తినిచ్చింది. ఈ శక్తితోనే వరుసగా మూడోసారి ఎన్డీఏ విజయం సాధించింది. మనమంతా ఒకే కుటుంబం అనే సందేశాన్ని చాటిచెప్పినందుకు ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు. ఇప్పుడు ఆ నినాదాన్ని తొలగించండి. ఇది లేకున్నా కుటుంబంగా మన బంధం మాత్రం చెక్కు చెదరదు’అని మోదీ ట్వీట్లో తెలిపారు. -
టీడీపీ దాడులపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని, గవర్నర్ వెంటనే జోక్యం చేసుకొని పచ్చ మూకల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అరాచకాలను తీవ్రంగా ఖండించారు. దాడులను అడ్డుకోవాలని గురువారం ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా గవర్నర్‌కు విజ్ఞప్తి చేయడంతో పాటు, పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది.ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. ఐదేళ్లు పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలి. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం’ అని పేర్కొన్నారు. -
'దయచేసి అది నమ్మొద్దు'.. ఫ్యాన్స్‌ను కోరిన స్టార్ హీరో భార్య
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాదికి పొంగల్ కానుకగా రిలీజ్ కానుంది. దీంతో పాటు విడాయమర్చి అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం ఏడాది చివర్లో థియేటర్లలోకి రానుంది.అయితే అజిత్ నటి షాలినిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2000లో అజిత్ కుమార్- షాలిని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా షాలిని పేరుతో నకిలీ ట్విటర్ ఖాతా బయటపడింది. ఈ విషయాన్ని షాలిని అజిత్ కుమార్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. 'ప్రతి ఒక్కరికీ నా మనవి.. ఇది నా అఫీషియల్ ట్విటర్ అకౌంట్ కాదు.. దయచేసి ఎవరూ కూడా నమ్మి ఫాలో అవ్వొద్దు. ధన్యవాదాలు' అంటూ అభిమానులను కోరింది. షాలిని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
ఉద్యోగులు ఇంటికెళ్లాక.. మస్క్ గురించి ఆసక్తికర విషయం!
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు, టెస్లా, స్పేస్ ఎక్స్‌ల బిగ్ బాస్ ఎలాన్ మస్క్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆటోమొబైల్, అంతరిక్షం, అంతర్జాలం (ఇంటర్నెట్, సోషల్ మీడియా) రంగాల్లో విజయవంతమైన కంపెనీలను ఆయన నడుపుతున్నారు.అయితే ఎలాన్ మస్క్ గురించి తాజాగా ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ యూజర్ మస్క్ శ్రద్ధగా పనిచేస్తున్న త్రోబ్యాక్ ఫోటోను పంచుకున్నాడు. "జిప్2 (మస్క్ స్థాపించిన సాఫ్ట్వేర్ కంపెనీ)లో పనిచేసే ఇంజనీర్లు ఇళ్లకు వెళ్లగానే వారు రాసిన కోడ్‌ను తిరిగి రాసేవాడు. అలా వారానికి 120 గంటలు పనిచేసేవాడు. ఒక సీఈఓలా ఉండాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు" అని రాసుకొచ్చారు. నిజమే..ఎక్స్ యూజర్ తన గురించి పెట్టిన పోస్టుపై ఎలాన్ మస్క్ స్పందించారు. 'నిజమే' అంటూ ఆ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ పోస్ట్‌కు 2.3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. విపరీతంగా కామెంట్లు, రీ పోస్టులు, లైక్‌లతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. Elon Musk used to rewrite code of engineers working at Zip2 after they went home, and used to work 120 hours a week. He never really wanted to be a CEO. pic.twitter.com/fQOyNRM0QD— DogeDesigner (@cb_doge) May 30, 2024 -
కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరీక పోకడనా?: కేటీఆర్ కౌంటర్
KTR | హైదరాబాద్ : ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది అని కేటీఆర్ విమర్శించారు.సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణ ఉండదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కౌంటర్ ఇచ్చారు. అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణ, చార్మినార్ రాచరీక పోకడ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ అనేవి రాచరికపు గుర్తులు కాదని, వెయ్యేళ్ల సాంస్కృతి వైభవానికి చిహ్నాలు అని పేర్కొన్నారు.ఈ మేరకు ట్విటర్లో కేటీఆర్ స్పందిస్తూ..‘ ముఖ్యమంత్రి గారు..ఇదేం రెండునాల్కల వైఖరి..!ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన..!!మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం..!చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు..!!అవి రాచరికపు గుర్తులు కాదు..!వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు..!!వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు..!!!జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా ?“కాకతీయ” కళాప్రభల కాంతిరేఖ రామప్పగోల్కొండ నవాబుల గొప్ప వెలుగే.. “చార్మినార్”అధికారిక గీతంలో కీర్తించి..!!అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..??చార్మినార్ అంటే.. ఒక కట్టడం కాదు..విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ కు ఐకాన్కాకతీయ కళాతోరణం అంటే.. ఒక నిర్మాణం కాదు..సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం..తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి.. వీటిని తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమే..!నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే..!!మీ కాంగ్రెస్ పాలిస్తున్న... కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికరపు గుర్తులున్నాయి.. మరి వాటిని కూడా తొలగిస్తారా చెప్పండి..??భారత జాతీయ చిహ్నంలోనూ.. అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలున్నాయి..జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉంది..వాటి సంగతేంటో సమాధానం ఇవ్వండి..??కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా ?ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా ?ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు..రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా..?గత పదేళ్లుగా.. ప్రభుత్వ అధికారిక చిహ్నంపై.. యావత్ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది.. సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకమూ ఉంది..రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో.. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించంపౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా... మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తాం..!తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం..!!’ అని పేర్కొన్నారు. -
ముందు మీ దేశం సంగతి చూసుకోండి: కేజ్రీవాల్ స్ట్రాంగ్ రిప్లై
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు, భారత్‌లో ప్రస్తుత రాజకీయాలపై జోక్యం చేసుకున్న పాకిస్థాన్ మాజీ మంత్రికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటు రిప్లై ఇచ్చారు. మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ దేశం సంగతి మీరు చూసుకోండని చురకంటించారు. మీ సపోర్ట్ ఏమీ అవసరం లేదని తిప్పికొట్టారు. లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌లో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో శనివారం(మే25) కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం ఓటు వేసిన ఫొటోను తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. కేజ్రీవాల్ చేసిన ఈ పోస్ట్‌ను పాకిస్థాన్ మాజీ మంత్రి, ఎంపీ చౌధరి ఫహద్ హుస్సేన్ రీపోస్ట్ చేశారు.ద్వేషం, అతివాద భావజాలంపై శాంతి, సామరస్యం విజయం సాధించాలని కామెంట్‌ను జత చేశారు. ఇండియా ఎలక్షన్స్ అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టారు. చౌధరి కామెంట్లకు అరవింద్ కేజ్రీవాల్ తిరిగి వెంటనే స్పందించారు.‘చౌధరి సాహిబ్ మా దేశంలో సమస్యలను నేను, నా దేశ ప్రజలు పరిష్కరించుకోగలం. ఇందుకు మీ సలహాలు మాకు అక్కర్లేదు. అసలే మీ దేశం పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ముందు ఆ పని చూడండి. భారత్‌లో ఎన్నికలు పూర్తిగా మా అంతర్గత వ్యవహారం. మీ జోక్యాన్ని మా దేశం ఏమాత్రం సహించదు’అని కేజ్రీవాల్ పోస్ట్ చేశారు. -
Viral Video: భళీ..భళీరా..భళీ
-
ట్విటర్ రీ బ్రాండింగ్‌పై మస్క్ ట్వీట్
ట్విటర్ పూర్తిగా ఎక్స్.కామ్‌గా రీబ్రాండ్ అయ్యింది. ఎక్స్.కామ్‌లో పలు కార్యకలాపాలు ట్విటర్ పేరు మీదే జరిగేవి. అయితే ఇప్పుడు పూర్తి ఎక్స్.కామ్ నుంచే జరుగుతున్నాయని ఆ సంస్థ అధినేత ఎలోన్ మస్క్ శుక్రవారం తెలిపారు.ఎలోన్ మస్క్ 2022 చివరిలో 44 బిలియన్ల డాలర్లు వెచ్చించి ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల అనంతరం గత ఏడాది జులైలో ట్విటర్‌ను ఎక్స్. కామ్‌గా రీ బ్రాండ్ చేస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. అయితే నిన్నటి వరకు ట్విటర్ లోగో, బ్రాండింగ్ మారింది. కానీ డొమైన్ పేరు ట్విటర్‌గా కొనసాగుతూ వచ్చింది. తాజాగా ట్విటర్.కామ్ డొమైన్ స్థానంలో ఇప్పుడు ఎక్స్.కామ్ వచ్చి చేరినట్లు మస్క్ ట్వీట్లో పేర్కొన్నారు. పోస్ట్ పోస్ట్ చేయడం, లైక్ చేయడం, బుక్‌మార్క్ చేయడం లేదా రీట్వీట్ చేసేందుకు గాను యూజర్లు కొద్ది మొత్తంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుందని గత నెలలో మస్క్ ప్రకటించారు. ఆ మొత్తం సబ్స్క్రిప్షన్ ఏడాదికి రూ.100లోపు ఉంటుందని అంచనా. ప్రస్తుతానికి ఈ సబ్స్క్రిప్షన్ పద్దతి న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో పరీక్షిస్తున్నారు. త్వరలో దీనిని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేసేందుకు మస్క్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2,500 కంటే ఎక్కువమంది ఫాలోవర్స్ కలిగి ఉన్న యూజర్ అకౌంట్లు ఎక్స్.కామ్‌లో ప్రీమియం ఫీచర్లను ఉచితంగా అందిస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. 5000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న అకౌంట్లకు ప్రీమియం ప్లస్ ఉచితంగా లభిస్తుంది అని మస్క్ ట్వీట్లో పేర్కొన్నారు. -
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎటాక్...పారిపోయిన నాగబాబు
-
సోషల్ మీడియాలోకి కేసీఆర్ ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఎక్స్( ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ తెరిచారు. అయితే ఇంతకాలం కేసీఆర్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఉద్యమ కాలం నాటి తన ఫొటోను కేసీఆర్ జత చేశారు.బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం అని కోరుతూ కేసీఆర్ రెండో ట్వీట్ చేశారు.కాగా ప్రస్తుతం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి.. ఆయా నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్.. ఇకపై ఈ రెండు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలను ఈ ఖాతాల్లో కేసీఆర్ పంచుకోనున్నారు. నేడు నాగర్కర్నూల్కుశనివారం ఉదయం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సి వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సాయంత్రం నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతుగా రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. -
కొత్త యూజర్లు ఫీజు చెల్లించాల్సిందే.. ఎందుకంటే..
ప్రపంచ దిగ్గజ టెక్ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్(ట్విటర్)’ నకిలీ ఖాతాల నియంత్రణకు, అనవసర బాట్స్‌ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోనుంది. అందులో భాగంగా కొత్త వినియోగదారులకు కొద్ది మొత్తంలో రుసుము విధించనున్నట్లు తెలిసింది. ఎక్స్ ఫ్లాట్‌ఫామ్‌లో కొత్తగా నమోదవుతున్న వినియోగదార్లు ఇకపై లైక్, పోస్ట్, బుక్‌మార్క్, రిప్లయ్ కోసం తక్కువ మొత్తంలో వార్షిక రుసుము చెల్లించాల్సి రావొచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ఇతరుల ఖాతాలను ఫాలో అవ్వడం, ఎక్స్‌లో పోస్ట్‌లు చూడడం వంటివాటికి ఎలాంటి ఛార్జీలు ఉండవని చెప్పాయి. నకిలీ ఖాతాలు, బాట్స్ నియంత్రణకు ఇదొక్కటే మార్గమని కంపెనీ యోచిస్తున్నట్లు తెలిసింది. కొత్త వినియోగదార్లు మూడు నెలల తర్వాత ఎక్స్‌లోని అన్ని సదుపాయాలను ఉచితంగా పొందొచ్చని ఎక్స్ అధినేత ఎలొన్ మస్క్ తెలిపారు. కొత్త నిబంధనలు ఎంపిక చేసిన ప్రాంతాల్లోనా లేదంటే ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఎక్స్ ధ్రువీకరణ చేసుకోని కొత్త వినియోగదార్లకు తమ ఖాతాపై ‘ప్రత్యేక ఫీచర్లు కావాలంటే కొంత రుసుము చెల్లించాలనే’ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. దానిక్లిక్ చేసి పేమెంట్ పూర్తి చేసి ప్రీమియం సదుపాయాలు వినియోగించుకోవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఎన్నికలపర్వం ముగిస్తే భారం తప్పదా.? గతేడాది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో చర్చ సందర్భంగా ఎలొన్‌మస్క్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లోని బాట్‌ను నియంత్రించడానికి కొద్దిమొత్తంగా రుసుము చెల్లించాల్సి రావొచ్చని చెప్పారు. ఈనేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొత్త వినియోగదారులకు రుసుము విధించే విధానాన్ని న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్నారు. అయితే ఎక్స్‌లో ఏమేరకు బాట్లను కట్టడిచేశారనే విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. SPECULATION: X might be expanding its policy to charge new users before they reply/like/bookmark a post https://t.co/odqeyeiHBx pic.twitter.com/EU71qlwQ0D — X Daily News (@xDaily) April 15, 2024 -
ఇండియాలో 2.12 లక్షల మందికి షాకిచ్చిన ఎలాన్ మస్క్!
ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్ కార్ప్' (ట్విటర్) భారత్‌లోని 2 లక్షల మందికి పైగా యూజర్లకు పైగా షాకిచ్చింది. పిల్లలపై లైంగిక దాడులు, అశ్లీలతను, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్ కట్టడిలో భాగంగా ఒక నెల వ్యవధిలో ఏకంగా 2,12,627 ఖాతాలను నిషేధించింది. ఫిబ్రవరి 26 నుండి మార్చి 25 వరకు భారతీయ సైబర్‌స్పేస్‌లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేసినందుకు 1,235 ఖాతాలను కూడా తొలగించినట్లు ఈ సోషల్ మీడియా దిగ్గజం వెల్లడించింది. 2021 కొత్త ఐటీ నిబంధనలకు కట్టుబడి ఎక్స్ కార్ప్ తన నెలవారీ నివేదికలో ఈ చర్యలను వెల్లడించింది. మొత్తంగా ఈ రిపోర్టింగ్ సైకిల్లో దేశవ్యాప్తంగా 213,862 ఖాతాలపై ఎక్స్ నిషేధం విధించింది. ఎక్స్ కార్ప్ ప్రకారం, ఫిబ్రవరి 26 నుండి మార్చి 25 వరకు భారతీయ వినియోగదారుల నుండి 5,158 ఫిర్యాదులు అందాయి. తమ గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం ద్వారా వీటిదని కంపెనీ పరిష్కరించింది. అంతేకాకుండా, ఖాతా సస్పెన్షన్లకు వ్యతిరేకంగా అప్పీళ్లకు సంబంధించిన 86 ఫిర్యాదులను కంపెనీ ప్రాసెస్ చేసింది. -
అరే బాప్రే.. నన్ను హంతకుణ్ని చేయకండి...! బుజ్జోడి వైరల్ వీడియో
అపుడే పుట్టిన బుజ్జాయిలు భలే ముద్దుగా ఉంటారు. బుజ్జి బుజ్జి..లేలేత కాళ్లు చేతులతో..ముట్టుకుంటే కంది పోతారేమో అన్నంత సుకుమారంగా ఉంటారు. అపుడే విరిసిన పింక్ గులాబీల్లా, మెరిసిపోయే కళ్లతో మిటుకు మిటుకు చూస్తూ ఉంటారు. ‘‘ఎవర్రా మీరంతా.. నేను ఏ లోకంలోకి వచ్చాను’’ అన్నటు చూస్తూ ఉంటారు కదా. ఇంకొంతమంది ఉంటారు గడుగ్గాయుల్లాగా...డాక్టర్, నర్సుల డ్రెస్ గట్టిగా పట్టేసుకుంటారు. ఇంకొంతమందేమో అమ్మ స్పర్శ తగలగానే ఏడుపు మానేసి ముద్దుగా బజ్జుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలోని శిశువు ఆసుపత్రి బెడ్ మీద ఉన్న కత్తెరను గట్టిగా పట్టుకుని వదలనే వదలడు. బొడ్డు పేగు కోసిన తరువాత ఆ కత్తెరను సిబ్బంది ఎంత ప్రయత్నించినా విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని ఉన్న వీడియో వైరల్‌గా మారింది. ట్విటర్లో ఇది ఇప్పటివరకు 25 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. Born braveheart! ❤️😂pic.twitter.com/Pam7maI7Ix — Figen (@TheFigen_) April 8, 2024 -
గోల్డెన్ స్నేక్.. డైరెక్టుగా దుబాయ్ నుంచి..!
అతిపెద్ద పామును చూశాం.. రెండు తలల పామును చూశాం. అత్యంత విషపూరితమైన పాముల గురించి చాలా కథనాలు విన్నాం. తాజాగా బంగారు రంగు పాము ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎక్స్(ట్విటర్) యూజర్ సంతోష్ ఈ గోల్డెన్ స్నేక్ వీడియోని ఏప్రిల్ ఒకటో తేదీన షేర్ చేశారు. గోల్డెన్ స్నేక్ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ వీడియో ఇప్పటికే 23 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. బంగారురంగులో ఓ ఆరు అడుగుల పాము రోడ్డు దాటుతున్నట్టుగా వీడియో ఈ పోస్ట్‌లో ఉన్నాయి. పామును చూసిన స్థానికులు ఆశ్చర్యపోతూ రికార్డు చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు. బంగారు వర్ణంలో ధగ ధగ లాడుతూ అలా రోడ్డు అవతల ఉన్న గడ్డిలోకి జారిపోయింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ముఖ్యంగా బంగారం ధర రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో ఎన్ని తులాలుంటుంది, దుబాయ్ నుంచి డైరెక్ట్‌గా వచ్చేసినట్టుంది అంటూన్న కామెంట్స్ మాత్రం చాలా స్పెషల్‌గా నిలిచాయి. అది ఎల్లో స్నేక్ అనీ అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటని మరొకరు వ్యాఖ్యానించారు. Golden snake 🐍 pic.twitter.com/kYnJ52gCEa — Shanthosh (@shanthosh) April 4, 2024 -
IPL 2024: క్రికెట్ అభిమానులకు ఆర్టీసి ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్..
ఐపీఎల్-2024 సందర్భంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు (05-04-2024) సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ని వీక్షించడానికి భారీగా అభిమానులు వెళ్లనున్నారు. దీంతో స్టేడియం పరసర ప్రంతాల్లో సాధారణ ప్రయాణీకులకు ఎదురయ్యే ఇబ్బందులను గురించి ట్విట్టర్ లో ఆర్టీసి ఎండీ సజ్జనార్ "ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండి. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి #TSRTC నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని వీక్షించాలని #TSRTC యాజమాన్యం కోరుతోందని తెలిపారు". క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి!? ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా… pic.twitter.com/FxQT9joKAl — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 5, 2024 -
నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబూ.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రబాబు తీరును ఎక్స్ వేదికగా సీఎం జగన్ ఎండగట్టారు. ‘‘జగన్ ఒక టిప్పర్ డ్రైవర్‌కి సీటిచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడు. అంతటితో ఆగలేదు, వేలిముద్రగాడంటూ వీరాంజనేయులుని అవమానించాడు. నువ్వు కోట్లకి కోట్లు డబ్బులు ఉన్న పెత్తందారులకి టికెట్లు ఇచ్చావు చంద్రబాబు. నేను ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేస్తున్నా. నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబూ’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. జగన్ ఒక టిప్పర్ డ్రైవర్‌కి సీటిచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడు. అంతటితో ఆగలేదు, వేలిముద్రగాడంటూ వీరాంజనేయులుని అవమానించాడు. నువ్వు కోట్లకి కోట్లు డబ్బులు ఉన్న పెత్తందారులకి టికెట్లు ఇచ్చావు చంద్రబాబు. నేను ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేస్తున్నా. నాకు, నీకు… pic.twitter.com/Mo1DD2MRHG — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 8వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా చిన్న సింగమలలో ఆటో, టిప్పర్ డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. "ఒక టిప్పర్ డ్రైవర్‌కు సీటు ఇచ్చానని చంద్రబాబు అవహేళన చేశారు. టిప్పర్ డ్రైవర్‌ను చట్ట సభలో కూర్చోబెట్టేందుకే ఎమ్మెల్యేగా నిలబెడుతున్నా. ఒక టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇస్తే తప్పేంటి?. ఏం తప్పు చేశానని టీడీపీ ఇవాళ నన్ను అవహేళన చేస్తోందని" సీఎం జగన్ నిలదీశారు. "వీరాంజనేయులు(శింగనమల నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి) ఎంఏ ఎకనామిక్స్ చదివాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా వీరాంజనేయులు బాధపడలేదు. ఉపాధి కోసం వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే టీడీపీలో కోట్ల రూపాయలు ఉన్నవారికే చంద్రబాబు సీట్లు ఇస్తున్నారని" ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించారు. -
ఎవరీ కొత్త హవాలా కొలంబస్?
గత సంవత్సరం బ్రెజిల్ అధ్యక్షునిగా లూల డసిల్వా ఎన్నిక య్యారు. ఆయనకు ట్విట్టర్ వేదికగా వైసీపీ నాయకుడు విజయ సాయిరెడ్డి అభినందనలు తెలియజేశారట! యెల్లో మీడియాఎంతో కష్టపడి శోధించి ఈ విషయాన్ని కనిపెట్టింది. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం కోటయ్య చౌదరి కంపెనీకి ఓ కంటెయినర్ పార్సెల్ వచ్చింది. ఇంటర్‌పోల్ సమాచారంతో ఆ కంటెయినర్‌ను తనిఖీ చేసిన సీబీఐ అధికారులు జరిపిన మాదక ద్రవ్యాల పరీక్షలో ‘పాజిటివ్’ ఫలితాలొచ్చాయి. ఆ విషయాన్ని వారు విడుదల చేసిన ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. కోటయ్య చౌదరి కంపెనీకి (సంధ్యా ఎక్స్‌పోర్ట్స్) రొయ్యలు, చేపలకు సంబంధించిన ఎగుమతుల వ్యాపారం ఉన్నది. రొయ్య విత్తనాన్ని పొదిగే హేచరీ కూడా ఉన్నది. త్వరలో రొయ్యల దాణాను తయారు చేసే మరో కేంద్రాన్ని కూడా తెరవ బోతున్నారు. ఆ దాణా తయారీలో ఉపయోగించడానికి పొడి చేసిన యీస్ట్‌ను తెప్పించుకోవడానికి సంధ్య కంపెనీ బ్రెజిల్లో ఆర్డర్ పెట్టింది. ఈ పదార్థాన్ని చైనా నుంచీ, యూరప్ నుంచీ కూడా దిగుమతి చేసుకోవచ్చు. బ్రెజిల్‌తో పోలిస్తే దూరాభారం కూడా తక్కువ. కానీ బ్రెజిల్‌నే ఎంపిక చేసుకోవడం వెనుక ఆకంపెనీకి తనదైన ప్రత్యేక కారణం ఉండవచ్చు. ‘యీస్ట్’ అనే మాటకు తెలుగు అర్థం కోసం వెతికితే మన నిఘంటువుల్లో సంతృప్తికరమైన సమాధానాలు దొరకలేదు. మధు శిలీంధ్రం, పులియబెట్టినది అనే అర్థాలున్నాయి. పూర్వం మన వంటిళ్లలో అన్నం వార్చే రోజుల్లో కలి, గంజి ఉండేవి. కలో గంజో తాగి బతకాలని సామెత. అందులోని కలిని యీస్ట్గా పరిగణిస్తాము. రకరకాల అవసరాలకు యీస్ట్‌ను ఉపయోగించడం తెలిసిందే. బ్రూవరీలు, వైనరీలు, బేకరీల్లో ప్రధానంగా వాడుతారు. ఆక్వా దాణా కోసం కూడా వాడుతారట. కోటయ్య చౌదరి కంపెనీ తెప్పించిన పొడి యీస్ట్ డబ్బాల్లో డ్రగ్స్ బయటపడ్డాయనే వార్త లోకానికి ఇంకా తెలియకముందే లోకేశ్‌బాబుకు తెలిసిపోయింది. ‘ఎక్స్’ వేదికగా ఆయన ఉలిక్కి పడ్డారు. వైజాగ్‌ను నాశనం చేసేందుకు వైసీపీ వాళ్లు తెప్పించా రని ఆరోపణలు చేశారు. చినబాబు ఉలికిపాటు సరిపోలేదని చంద్రబాబు కూడా మరోసారి గట్టిగా ఉలిక్కిపడ్డారు. తెల్లారి లేచేసరికి ‘ఈనాడు’ పత్రిక మరింత గట్టిగా ఉలిక్కి పడింది. దాంతోపాటు మిగతా యెల్లో మీడియా కూడా! ఈ డ్రగ్స్ సరఫరా వెనుక కచ్చితంగా వైసీపీ హస్తం ఉందని వారు ఏకగ్రీవంగా తీర్మానించి పారేశారు. నెమ్మదిగా అసలు విష యాలు బయటకు రావడం మొదలైంది. కోటయ్య కంపెనీ చుట్టూ అల్లుకున్న తెలుగుదేశం, బీజేపీ నేతల బాంధవ్యాలు బయటపడ్డాయి. సామాజిక బాంధవ్యాలే కాదు, వ్యాపార భాగస్వామ్యాలు కూడా వెల్లడి కావడం మొదలైంది. దాంతో మన యెల్లో మీడియా ఉలికిపాటులోంచి తత్తరపాటులోకి మారింది. ఆ తత్తరపాటులోంచి వచ్చిందే లూల డసిల్వాకు విజయసాయిరెడ్డి అభినందనలు చెప్పారనే మోకాలు – బోడి గుండు సంబంధిత ఆరోపణ. విజయ సాయిరెడ్డి అభినందనలు ట్విట్టర్లో చెప్పారు కనుక కృతజ్ఞతగా బ్రెజిల్ అధ్యక్షుడు దగ్గరుండి డ్రగ్స్‌ను షిప్లో లోడ్ చేయించి ఉంటారని మన జనాల్ని నమ్మించాలనే వెధవా యిత్వం యెల్లో మీడియాలో కనిపించింది. సూర్యుడిపై ఉమ్మేయజూసే మూర్ఖత్వమంటే ఇదే! లూయీ ఇనాసియో లూల డసిల్వా ఒక కార్మికోద్యమనేతగా తన ప్రజా జీవితాన్ని ఆరంభించిన వ్యక్తి. ఒకనాటి చిలీ అధ్యక్షుడు డాక్టర్ సాల్వెడార్ అలెండీ, వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ల వరుసలోని లాటిన్ అమెరికా వామపక్ష యోధుడు. మొదటిసారి అధ్య క్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన అమలుచేసిన బొల్సా ఫామి లియా (పేద కుటుంబాలకు ఆర్థిక సాయం), ఫోమ్ జీరో (ఆకలి నిర్మూలన) పథకాలు కోట్లాది మంది బ్రెజిలియన్లను దారిద్య్రం నుంచి విముక్తం చేశాయి. కోట్లాది పేద కుటుంబాల పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాయి. అమెరికా ఖండంలో అగ్రరాజ్య ప్రయోజనాలకు కంట్లో నలుసుగా డసిల్వా మారాడు కనుక ఆయన అధికారం నుంచి దూరం కావలసి వచ్చింది. అవినీతి ఆరోపణలు మోపి మూడేళ్ల పాటు జైల్లో నిర్బంధించారు. ఆరోపణలన్నీ శుద్ధ అభాండాలేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఆయన్ను జైలు నుంచి విడుదల చేసింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్షునిగా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సకల దేశాధి నేతలు, లక్షలాది మంది రాజకీయ ప్రముఖులు, కోట్లాదిమంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అందులో విజయ సాయిరెడ్డి ట్వీట్ ఒకటి. ఒక ప్రముఖ దేశానికి అధ్యక్షునిగా, జి–20 దేశాల కూటమికి ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న వ్యక్తిపైనే బురద చల్లడానికి వెనుకాడలేదంటే యెల్లో మీడియా బరితెగింపు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నారా అండ్ సన్స్‌తో పాటు యెల్లో మీడియా కూడా ఈ విషయంలో అతిగా స్పందించింది. రాజకీయ ప్రత్యర్థుల తలకు చుట్టడానికి వారు వేగిరిపడ్డారు. సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు ఉగ్గబట్టలేకపోయారో తెలియదు. వారి తొందర పాటుకు తగినట్టుగానే కంపెనీ బాంధవ్యాలు, భాగస్వామ్యాలు తెలుగుదేశం కుటుంబాలనే వేలెత్తి చూపుతున్నాయి. విచారణ పూర్తయితే గానీ జరిగిందేమిటనే సంగతి నిర్ధారణ కాదు. అయితే కొత్త రాజకీయ పొత్తుల నేపథ్యంలో దర్యాప్తు సంస్థపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని విశ్వసించవచ్చునా అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ ప్రశ్నతో పాటు మరికొన్ని సందేహాలకు కూడా సమాధానాలు రావలసి ఉన్నది. దాణా ఉత్పత్తి ప్రారంభం కాకముందే సంధ్యా సంస్థ 25 వేల కిలోల యీస్ట్‌కు ఎందుకు ఇండెంట్ పెట్టింది? యీస్ట్ దిగుమతికి ప్రత్యామ్నాయాలు అందు బాటులో ఉండగా అది బ్రెజిల్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నది? బ్రెజిల్ నుంచి బయల్దేరిన ఓడ విశాఖ రావడానికి ఎక్కువ సమయం తీసుకున్నదన్న పాయింట్‌ను సీబీఐ ముందు కంపెనీ ప్రతినిధులు ఎందుకు నొక్కి చెబుతున్నారు? మధ్యలో తమకు తెలియకుండా ఎవరో ఈ డ్రగ్స్‌ను బాక్సుల్లో పెట్టిఉంటారని బుకాయించడం కోసమా? అలా మధ్యలో దూర్చడం సాంకేతికంగా సాధ్యమవుతుందా? విచారణ తర్వాత డ్రగ్స్‌ను తెప్పించడం వెనుక బాధ్యత సంధ్య కంపెనీదే అని తేలితే ఆకంపెనీ ఎందుకు ఆ పని చేసినట్టు? స్వయంగా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగిందా? లేక ఎవరైనా కమీషన్ మీద ఈ పని అప్పగించారా? రెగ్యులర్‌గా దిగుమతులు చేసుకునే కంపెనీలతో డ్రగ్స్ వ్యాపారులు కమీషన్ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నది. కానీ, సంధ్యా కంపెనీ దాణా ఉత్పత్తిని ఇంకా ప్రారంభించనే లేదు. అటువంటి ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తు న్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆక్వా అథారిటీకి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వనేలేదు. అప్పుడే యీస్ట్ దిగుమతికి ఎందుకు తొందరపడినట్టు? డ్రగ్స్ వ్యాపారంలో ఉన్న వారు కాకుండా మరేదో బలమైన శక్తి ప్రోద్భలం మేరకే ఈ కంపెనీ యీస్ట్ దిగుమతికి ఆర్డర్ చేసిందా? బ్రెజిల్ నుంచే దిగుమతి చేసు కోవాలని ఆ శక్తి నిర్దేశించిందా? తెలుగుదేశం, జనసేనలకు బీజేపీతో పొత్తు కుదురుతుందనే నమ్మకం కలిగిన తర్వాత బ్రెజిల్లో బయల్దేరిన ఓడ... పొత్తుకు తుదిరూపం వచ్చిన తర్వాతనే విశాఖ తీరం చేరుకోవడం కాకతాళీయమేనా? డ్రగ్స్ సరఫరా, పంపిణీ వ్యాపారులతో ఒప్పందాలు చేసుకోవడం మనీ లాండరింగ్‌లో కొత్త పద్ధతిగా మారిందా? ఒకేసారి వందలు, వేలకోట్ల రూపాయలను చేతులు మార్చ డంలో సంప్రదాయ హవాలా పద్ధతుల కన్నా ఇది మెరుగైన పద్ధతిగా భావిస్తున్నారా? ఎందుకంటే ఇండియాలో డ్రగ్స్ దందా టర్నోవర్ లక్ష కోట్లు దాటిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022 జూన్ నుంచి 2023 జూలై 15 వరకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్రాల బృందాలు కలిసి సుమారు 12 వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యా లను ధ్వంసం చేశాయి. ఇంతకు కనీసం పది రెట్లు ఎక్కువ వినిమయం దేశంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్‌కు ఇదో మార్గంగా పరిగణిస్తూ ఉండవచ్చు. అయితే బలమైన నెట్వర్క్ కలిగి ఉన్నవారే ఈ పద్ధతిని అనుసరించే అవకాశం ఉన్నది. బ్రెజిల్ సరిహద్దు దేశాల్లో కొలంబియా ఒకటి. ప్రపంచంలో అతిపెద్ద మాదక ద్రవ్యాల సరఫరా కేంద్రం ఆ దేశం. అయితే కొలంబియా నుంచి రవాణా అయ్యే సరుకుల కన్సైన్మెంట్లపై దాదాపు అన్ని దేశాల్లో నిఘా తీవ్రంగా ఉంటుంది. నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. కనుక కొలంబియా డ్రగ్ లార్డ్స్ పక్క దేశాల నుంచి సరుకుల రవాణాలో డ్రగ్స్‌ను కలిపి పంపుతారు. లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్ సహజంగానే వారి ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటుంది. అమెజాన్ అడవులు రెండు దేశాల సరిహద్దులను కలిపేస్తుండటంతో డ్రగ్స్‌ను బ్రెజిల్ రేవుల దాకా చేర్చడం వారికి సులువు. అమెరికా,ఇండియాల మధ్య ప్రైవేట్ ఆర్థిక సంబంధాలు చాలా ఎక్కువ. విరాళాల దందాలూ ఎక్కువే. ‘ఏపీ జన్మభూమి’ పేరుతో తెలుగుదేశం అభిమానులు ఓ కొత్త సంస్థను ప్రారంభించి పెద్ద ఎత్తున విరాళాలు వసూలు చేయడం ఈ మధ్య వివాదాస్పదంగా మారింది. వసూలు చేసిన విరాళాలకు సరైన లెక్కలు లేవని విరాళాలిచ్చినవారు వాపోతున్నారు. ఇదేకాకుండా ఎన్ని కల పేరుతోనూ విరాళాలు సేకరించడం ఇక్కడ మామూలే. టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరం నుంచి కొలంబియా తీరం 1500 మైళ్ల దూరమే! మనీలాండరింగ్ కోసం మాదక ద్రవ్యాల రూట్‌ను ఎంచు కోవడం నిజమేనని నిర్ధారణ అయితే దేశం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు కంపెనీ చెబుతున్న విషయాలు అనుమానాలను రేకెత్తి స్తున్నాయి. జనవరి 14న బయల్దేరిన కంటెయినర్ చాలా ఆలస్యంగా చేరిందని కంపెనీ ప్రతినిధి కూనం హరికృష్ణ వివరణ ఇచ్చారు. అంటే మధ్యలో ఎవరో ఈ పనిచేసి ఉండొచ్చని బుకా యించడానికి వీలుగా ఆయన ఈ పాయింట్‌ను ముందుకు తోస్తున్నారు. సంధ్యా కంపెనీ బ్రెజిల్ సంస్థ నుంచి పొడి యీస్ట్‌ను ఖరీదు చేసింది. దాన్ని ఆ సంస్థ కంటైనర్‌లో పెట్టి, సీల్ వేసి ఓడలోకి ఎక్కిస్తుంది. ఈ కంటెయినర్ ఎన్ని దేశాలు తిరిగివచ్చినా ఎవరికీ కంటెయినర్ తెరిచే అవకాశం ఉండదు. ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీ కంటెయినర్ సీల్ నెంబర్లను ఇంపోర్ట్ చేసుకునే కంపెనీకి పంపిస్తుంది. ఈ నెంబర్లు చూపెడితేనే ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీ సరుకును క్లెయిమ్ చేసుకోగలుగు తుంది. ఇది ప్రొటోకాల్. అందుకే సీబీఐ వారు తమంత తాము కంటెయినర్‌ను తెరవలేదు. కంపెనీ ప్రతినిధులను పిలిపించు కొని వారి సమక్షంలోనే తెరిపించారు. కనుక మధ్యలో ఎవరో డ్రగ్స్‌ను సరుకులో కలిపేయడం అబద్ధం. అనుమానాస్పద శాంపుల్స్‌ను పరీక్షకు పంపించారు. అవి మాదకద్రవ్యాలుగా రుజువై బాధ్యులను శిక్షించగలిగితే పెనుప్రమాదాన్ని నివారించి నట్లవుతుంది. రాజకీయ ఒత్తిళ్లు పైచేయి సాధిస్తే భవిత అంధ కారమవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఈజీ మనీ, క్రేజీ బోయ్: ఈ వీడియో చూస్తే మీకు పిచ్చెక్కుద్ది!
ఉన్న అవకాశాల్ని క్యాష్ చేసుకోవడం, సులువుగా డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. చాలా స్మార్ట్‌గా ఉండాలి. దీనికి సంబంధించి తాజాగా ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అనే దూకుడు సినిమా డైలాగును నూటికి నూరుపాళ్లు నిజం అంటారు మీరు ఈ వీడియో చూస్తే.. ది ఇన్స్టిగేటర్ అనే ట్విటర్ అకౌంట్ షేర్ చేసిన దాని ప్రకారం రోడ్డు మధ్యలో నిర్మించిన డివైడర్ని దాటడానికి నిచ్చెన ఏర్పాటు చేసి ప్రయాణికులను రోడ్డు దాటిస్తున్నాడు. ఆగండాగండి.. ఇదేదో పుణ్యానికి చేస్తున్నాడనుకోరు. ఇందుకోసం చార్జ్ కూడా వసూలు చేస్తున్నాడు మనోడు. ‘‘డబ్బు సంపాదించే అవకాశాన్ని అస్సలు వదులు కోరు కొంతమంది’’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ అయిన వీడియో ఇపుడు నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. పలు నగరాల్లో డివైడర్ కష్టాలను తలుచుకుంటూ తెగ కనెక్ట్ అయిపోతున్నారు. ఐడియా అదిరింది గురూ, ఇది బిజనెస్ అంటే, స్మార్ట్ ఐడియా ఇలా పలు కమెంట్లు సందడి చేస్తున్నాయి. Some people don't miss the opportunity to make money 😅😂 pic.twitter.com/Jg6hFmvobk — The Instigator (@Am_Blujay) March 19, 2024 -
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌కు ఇజ్రాయెల్ కౌంటర్
గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దళాలు జరిపిన మారణకాండకు ప్రతికారంగా ఆ దేశం.. గాజాపై దాడులు చేస్తోంది. కాల్పుల విరమణ చేసి.. పాలస్తీనా ప్రజలకు మానవతా సాయం అందిచాలని ఆమెరికాతో పాటు పలు దేశాలు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. కొన్ని దేశాలు ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తున్నాయి. అయితే తాజాగా ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ కలిగిన ప్రజలను ఈ జాబితాలోని దేశాలు.. తమ దేశంలోకి అనుమతించవని వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. ఆ జాబితాలో అల్జేరియా, బంగ్లాదేశ్, బ్రూనై, ఇరాన్, ఇరాక్, కువైట్, లెబనాన్, లిబియా, పాకిస్తాన్ దేశాలు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ చట్టాల ప్రకారం.. లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్, ఇరాన్ దేశాలు శత్రు దేశాలు జాబితాలో ఉన్నాయి. ఈ అయితే ఈ దేశాలకు ఇజ్రాయెల్ పౌరులు.. వెళ్లాలంటే ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందే. అయితే మధ్యప్రాచ్య దేశాల్లో ఇజ్రాయెల్‌కు వీసా ఫ్రీ దేశంగా కేవలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఉండటం గమనార్హం. We’re good pic.twitter.com/GmiwEzZGck — Israel ישראל 🇮🇱 (@Israel) March 14, 2024 అయితే దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ పౌరులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశంలో ఓ రాష్ట్ర అధికారిక ట్విటర్ హ్యాండిల్ కౌంటర్ ఇచ్చింది. ‘మేం బాగున్నాం’ అని ‘ఎక్స్’లో రీట్వీట్ చేసింది. ఇక..2024 నాటికి ప్ఇజ్రాయెల్ దేశం రపంచంలో 171 దేశాల్లో వీసా రహిత లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్‌ను కలిగి ఉంది. అదేవిధంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇజ్రాయెల్ పాస్‌పోర్టు 20వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ కలిగిన పౌరులు చాలా యురోపీయన్ దేశాలుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా వెళ్తారు. అదేవిధంగా లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు కూడా ఇజ్రాయెల్ ప్రజలు తమ పాస్‌పోర్టు ద్వారా సందర్శిస్తారు. ఇదీ చదవండి: స్వలింగ వివాహం చేసుకున్న విదేశాంగ మంత్రి! -
Prabhas: అరుదైన రికార్డ్
హీరో ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్థాయిలోనే కాదు.. పాన్ వరల్డ్ రేంజ్లో అభిమానులను అలరిస్తున్నారాయన. రేర్ కాంబినేషన్స్, రికార్డ్ స్థాయి బాక్సాఫీస్ నంబర్స్, భారీ పాన్ వరల్డ్ మూవీ లైనప్స్... ఇలా అన్ని అంశాల్లో ఎన్నో రికార్డులు, ఘనత సాధించిన ప్రభాస్ తాజాగా మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. తాజాగా ఎక్స్ (ట్విట్టర్) టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియా లిస్టులో నిలిచిన ఏకైక హీరోగా రికార్డ్ సాధించారు ప్రభాస్. ట్విట్టర్ ఇండియా విడుదల చేసిన ఈ జాబితాలో ఎంటర్టైన్మెంట్ విభాగంలో టాప్ 10 మోస్ట్ యూజ్డ్ హ్యాష్ ట్యాగ్స్‌లో ప్రభాస్ మాత్రమే చోటు దక్కించుకున్నారు. తమ అభిమాన హీరో సాధించిన ఈ క్రెడిట్‌తో ఫుల్ ఖుషీ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం మే 9న విడుదల కానుంది. అలాగే మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ సినిమాలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు ప్రభాస్. మంచు విష్ణు టైటిల్ రోల్లో రూ΄÷ందుతున్న ‘కన్నప్ప’లో కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్ 2’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలషూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. -
ప్రభాస్ రేంజే వేరు.. అందుకు ఇదే నిదర్శనం..
స్టార్ హీరోలు ఎందరున్నా తాను ప్రత్యేకమని ఎన్నో రికార్డులు, ఘనతల ద్వారా నిరూపించుకుంటున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. రేర్ కాంబినేషన్స్, రికార్డు స్థాయి బాక్సాఫీస్ నెంబర్స్, పాన్ వరల్డ్ మూవీ లైనప్స్...ఇలా ఏ అంశంలో చూసినా రేసులో ఆయనెప్పుడూ మిగతా స్టార్స్ అందుకోలేనంత దూరంలోనే ఉంటాడు. అందుకే ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్‌ను దాటి పాన్ ఇండియా స్థాయికి చేరుకుని చాలాకాలమవుతోంది. మరోసారి తన క్రేజ్ ఎలాంటిదో చూపించే సంఘటనే ఇది! తాజాగా ఎక్స్(ట్విట్టర్)లో టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియాలో లిస్టులోనూ ఆయన చోటు దక్కించుకున్నాడు. ఎక్స్(ట్విట్టర్) టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియా జాబితాలో నిలిచిన ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచాడు. ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో టాప్ 10 మోస్ట్ యూజ్డ్ హ్యాష్ ట్యాగ్స్‌లో ప్రభాస్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. ట్విటర్ ఇండియా ఈ జాబితాను రిలీజ్ చేసింది. ఇది ప్రభాస్ స్టార్ డమ్‌కు ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. ప్రభాస్ సాధించిన ఈ క్రెడిట్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అభిమానుల సంతోషాలను రెట్టింపు చేసేందుకు కల్కి 2898 ఎడి, రాజా సాబ్ వంటి పెద్ద చిత్రాలతో త్వరలో సందడి చేయనున్నాడు. చదవండి: OTT: 36 దేశాల్లో ట్రెండ్ అవుతున్న ఇండియన్ సిరీస్.. స్ట్రీమింగ్ అక్కడే! -
మీరో ‘గీతాంజలి’ కావద్దు
గీతాంజలి.. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన వివాహిత, ఇద్దరు బిడ్డల తల్లి. ట్రోలింగ్‌కు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విషయం మీరందరూ చదివే ఉంటారు. ఆ తర్వాత కూడా ఆమెపై ట్రోలింగ్ ఆగలేదు. రాజకీయపార్టీలు తమ తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఆమె మరణాన్ని రకరకాలుగా వక్రీకరించే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. మరెవ్వరూ గీతాంజలిలా కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సొరచేపలతో జాగ్రత్త... ఇంటర్నెట్ అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఇందులో విలువైన ఆణిముత్యాలు ఉన్నట్లే, అమాంతం మింగేసే సొరచేపలు కూడా ఉంటాయి. ముత్యాలకోసం తీవ్రంగా అన్వేషించాలి. సొరచేపలు మాత్రం మీకేమాత్రం సంబంధం లేకుండానే మింగేస్తాయి. ట్రోలింగ్ చేసేవారు కూడా సొరచేపల్లా విపరీతమైన ఆకలితో ఉంటారు.. గుర్తింపుకోసం ఆకలి. ఆ గుర్తింపుకోసం ఎలాంటి పోస్టులు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు. వారిలో మానవత్వం ఉండదు. తమ పోస్టులు వైరల్ అవ్వాలన్న కోరిక తప్ప, తన పోస్టుల వల్ల బాధపడే వ్యక్తుల పట్ల సహానుభూతి ఉండదు. ఇంకా చెప్పాలంటే బాధపడుతుంటే చూసి ఆనందించే శాడిజం ఉంటుంది. అలాంటి సొరచేపల బారిన పడకుండా ఎవరికి వారే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రెండువైపులా పదునున్న కత్తి... సోషల్ మీడియా రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. సక్రమంగా వినియోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. వక్రమార్గంలో వినియోగిస్తే ప్రాణాలు తీయవచ్చు. మనకు తెలిసిన వ్యక్తిని ఒక మాట అనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. వారు బాధపడతారేమోనని సున్నితంగా చెప్పేందుకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే వారు మనల్ని కలిసే అవకాశం ఉంది కాబట్టి. కానీ సోషల్ మీడియాలో ఎవరూ ఎవరికీ ప్రత్యక్షంగా తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ముక్కూమొహం చూపించాల్సిన అవసరం లేదు. వివరాలు తెలియకుండా, రహస్యంగా ఉంటూ ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది. అందుకే ట్రోలర్స్‌లో సహానుభూతి కనిపించదు. వికృతమైన పోస్టులు పెడుతుంటారు. అసభ్య పదజాలంతో దూషిస్తుంటారు. వాటిని తట్టుకోవడం అందరికీ సులభం కాదు. గీతాంజలి లాంటి సున్నిత మనస్కులకు అసలే కాదు. చదవండి: టీడీపీ– జనసేన సైకోమూకలపై జనం కన్నెర్ర మరేం చెయ్యాలి? ►ఈత తెలిసినవారే సముద్రంలో అడుగుపెట్టాలి. అలాగే మాటల బాణాల నుంచి తప్పించుకోవడం తెలిసినవారే సోషల్ మీడియాలో అడుగుపెట్టాలి. చిన్న చిన్న విమర్శలకు కూడా విపరీతంగా బాధపడే సున్నిత మనస్తత్వం ఉన్నవారు ఈ వైపు చూడకపోవడమే మంచిది. ►మనం రాసే రాతలు, పెట్టే ఫొటోలు వీలైనంత వరకూ వివాదాస్పదం కానివిగా చూసుకోవాలి. అయినా ఒక్కోసారి మనం ఊహించని కోణాలను మనకు అంటగట్టి విమర్శిస్తుంటారు. వాటిని పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి. ►మీరు ఊహించని రీతిలో విమర్శలు వస్తున్నప్పుడు, మీపై ట్రోలింగ్ నడుస్తున్నప్పుడు కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. చూసి బాధపడటం కంటే, చూడకుండా ప్రశాంతంగా ఉండటం మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది. ►సోషల్ మీడియా వల్ల కొందరు పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించుకుంటున్న మాట వాస్తవమే. వారి ఉద్దేశాలు స్పష్టం. వారు విమర్శలను పట్టించుకోరు. కానీ సామాన్యుల ఉద్దేశం.. కేవలం టైమ్ పాస్ లేదా కొంచెం గ్నానం సంపాదించుకోవడం. అందువల్ల సోషల్ మీడియా లైకులు, షేర్ల గురించి ఆందోళన చెందకుండా, ఆరాటపడకుండా ఉండటం నేర్చుకోవాలి. ►ఆన్లైన్ స్నేహాల వల్ల మోసపోయిన వార్తలు నిత్యం పత్రికల్లో చదువుతుంటాం, టీవీల్లో చూస్తుంటాం. అందువల్ల ఆన్లైన్ స్నేహాలను సీరియస్ గా తీసుకోకపోవడం, పరిధులు తెలుసుకుని మసలుకోవడం మంచిది. ►ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మీ ప్రమేయం లేకుండా మీపై ట్రోలింగ్ మొదలైనప్పుడు.. వెంటనే కుటుంబ సభ్యుల, స్నేహితుల మద్దతు తీసుకోండి. ఆయా అకౌంట్లపై రిపోర్ట్ కొట్టించండి. అవసరమనుకుంటే పోలీస్ కంప్లయింట్ ఇవ్వండి. ►ట్రోలింగ్ వల్ల మీలో ఆందోళన పెరుగుతుంటే, కుంగిపోతుంటే... ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ ను కలవండి. మీ ఆందోళన తగ్గేందుకు, ఆనందాన్ని తిరిగి తెచ్చుకునేందుకు సహాయపడతాడు. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
తమ దగ్గర ఉన్నదే...
మనసంతా అసూయతో నిండి ఉన్నవారు ఎవరిలోను గొప్పతనాన్ని అంగీకరించ లేరు. ఎవరి గురించి అయినా గొప్పవారు అని అనగానే వెంటనే ఏదో ఒక లోపం వారిలో వెతికి, ఆ ఒక్కదాని వల్ల వారు పనికిరాని వారు అని నిర్ధారించేస్తారు. మానవమాత్రులకి ఏదో ఒక చిన్న లోపం, దోషం కాకపోవచ్చు, ఉండే ఉంటుంది. సద్గుణాలని ఎన్ని ఉన్నా పక్కకి పెట్టి, ఆ చిన్న బలహీనతనే పతాక శీర్షికగా చేస్తారు. ‘‘అయ్యా! మీనుండి సహాయం పొందిన వారే మిమ్మలని గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. మీరు వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడరేమి?’’ అని ప్రశ్నించిన వారికి ఒక మహానుభావుడు ఇట్లా సమాధానం చెప్పారు. ‘‘ఎవరైనా తమ దగ్గర ఉన్న దానిని మాత్రమే ఇవ్వగలరు కదా! నా దగ్గర ఉన్న దానిని నేను పంచుతున్నాను. వారి దగ్గర ఉన్న దానిని వారు వెలిగక్కుతున్నారు.’’ నిజమే కదా! తమ వద్ద లేని దానిని ఎవరైనా ఎట్లా ఇవ్వగలరు? గుండెల నిండా ప్రేమ, సానుభూతి, ఆప్యాయత, దయ మొదలైనవి ఉన్న వారు వాటినే వ్యక్తీకరించ గలుగుతారు. ద్వేషం, పగ, అసూయ ఉన్న వారు వాటినే ప్రకటించగలుగుతారు. మాటలలో వ్యక్తమయ్యే భావాలే మనిషి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియ చేస్తాయి. వాస్తవాన్ని గ్రహించటానికి అటువంటివారి మాటలని వడగట్టవలసి ఉంటుంది. వాటికి వెంటనే ప్రతిస్పందించకుండా ఉండాలి. వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఒక పాత్రలో దేనినైనా నింపుతూ ఉంటే నిండగానే అది పొంగి పొరలుతూ ఉంటుంది. అదేవిధంగా గుండె అనే పాత్రలో ఏది నిండితే అదే వెలుపలికి ఉబికి వస్తుంది. దానిని తట్టుకోగలగటం కష్టమైన పనే అని చెప్పవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రేమని కూడా తట్టుకోటం కష్టం. అవతలి వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పాయసంలో పడ్డ ఈగ లాగా గిజగిజ లాడ వలసి వస్తుంది. కొంచెం ఇబ్బందిగా మొహమాటంగా అనిపించినా ప్రమోదమే కాని, ప్రమాదం ఏమీ ఉండదు. అదే ద్వేషమైతే చెప్పనవసరం లేదు. వాతావరణాన్ని కలుషితం చేయటమే కాదు, కొన్నిమారులు ప్రమాదాలు కూడా తెచ్చి పెడుతుంది. ఇటువంటి వారు సమాజంలో కోకొల్లలుగా కనపడుతూనే ఉంటారు. ఎందుకు ఎదుటివారి మీద విషం కక్కుతారో తెలియదు. ఎవరు బాగున్నా వీరికి నిద్రపట్టదు. ఏదో ఒక వంకర మాట అనవలసినదే. ఒకప్పుడు మాటలకే పరిమితం అయిన ఈ వ్యవహారం తరువాత అచ్చులో కనపడేది. ఇప్పుడు ఎలెక్ట్రానిక్ మీడియా వేదిక అయింది. ఇక వాట్సప్, ట్విటర్ వంటి వాటిలో విచ్చలవిడిగా విషబీజాలు వెదజల్లటం చూస్తున్నాం. అసలు బాధాకరమైన విషయం ఏమంటే వీటికే ఆదరణ ఎక్కువగా ఉంటోంది. దీనికి కారణం ఆకర్షణ ఒక్కటే కాదు, ఎందుకు ఆ విధంగా చెప్పారో తెలుసుకుందామనే కుతూహలం కూడా అని కొంతమంది విశ్లేషణ. స్పష్టంగా తెలుస్తూనే ఉందిగా – వారి మనస్సులన్నీ ప్రతికూల భావనలతో నిండి ఉన్నాయని! ఎవరికైనా ఇవ్వాలనుకుంటే, తన దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా! ఉద్దేశం ఉంటే సరి పోదు. శక్తి ఉండాలి, సంపద కూడా ఉండాలి. అది కూడా ఎంత ఇచ్చినా తనకి తక్కువ కాదు అన్నంత నిండుగా ఉంటేనే సాధ్యం. అది ధనం కావచ్చు, విద్య కావచ్చు. వస్తుసంపద కావచ్చు, ప్రేమాభిమానాలు కావచ్చు. మంచివే పెంచుకుందాం. పంచుకుందాం. ఈ రోజు మనతో ఎవరి గురించి అయినా చెడుగా చెపుతున్నారు అంటే, రేపు మన గురించి ఎంతమందితో ఏం చెపుతారో! ఇది గుర్తించి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇట్లా చెప్పేవారికి కాస్త సృజనాత్మకత కూడా ఉంటుంది. ఎదుటివారు నమ్మే విధంగా చక్కని కల్పనలు చేయగలరు. బట్టతలకి మోకాలికి ముడి పెట్టగలరు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
తెలంగాణ సోయిలేనోడు సీఎం కావడం మన ఖర్మ: రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్‌కు తెలంగాణ ‘ఆత్మ’ లేదని, తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదని విమర్శించారు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవంపై మోదీ సాక్షిగా రేవంత్ దాడి చేశారని మండిపడ్డారు. అసలు తెలంగాణ సోయిలేనోడు సీఎం కావడం మన ఖర్మ అని దుయ్యబట్టారు. తెలంగాణ ఆత్మ గౌరవం విలువ తెల్వనోడు సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యమని ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు చేశారు. ‘అసలు “గోల్ మాల్ గుజరాత్ మోడల్” కు.. గొల్డెన్ తెలంగాణ మోడల్”తో పోలికెక్కడిదని ప్రశ్నించారు.ఘనమైన “గంగా జెమునా తెహజీబ్ మోడల్” కన్నా.. మతం పేరిట చిచ్చు పెట్టే “గోద్రా అల్లర్ల మోడల్” నీకు నచ్చిందా. అని నిలదీశారు. నిన్న మొన్నటి దాకా గుజరాత్ మోడల్‌పై నిప్పులు చెరిగిన రేవంత్.. ఇవాళ ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే.. ఆయన గురించి గొప్పలు మాట్లాడుతున్నారు. ఇదేం నీతి.. ఇదేం రీతి.. రేవంత్ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. చదవండి: కేంద్రం అడిగిన నిధులు ఇవ్వకపోతే ఉతికి ఆరేస్తా: సీఎం రేవంత్ ‘తెలంగాణ మోడల్ అంటే.. “సమున్నత సంక్షేమ నమూనా”“సమగ్ర అభివృద్ధికి చిరునామా” అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్. యావత్ దేశానికే నచ్చిన మోడల్. బుడిబుడి అడుగుల వయసులో బుల్లెటు వేగంతో దూసుకెళ్లిన సమగ్ర, సమ్మిళిత, సమీకృత మోడల్. దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించ పరుస్తావా..? నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన? నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా..?? నాడు తెలంగాణ “ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావ్..” నేడు “తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావ్..” నిన్ను చరిత్ర క్షమించదు. నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎత్తింది.. బీఆర్ఎస్ కానీ.. నేడు పాతాళంలో పాతిపెట్టేస్తోంది.. కాంగ్రెస్’ అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ కు తెలంగాణ “ఆత్మ”లేదు. తెలంగాణపై “గౌరవం” అంతకన్నా లేదు. అందుకే తెలంగాణ “ఆత్మగౌరవం”పై మోడీ సాక్షిగా... రేవంత్ దాడి అసలు తెలంగాణ సోయి లేనోడు.. సీఎం కావడం మన ఖర్మ.. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం అసలు “గోల్ మాల్ గుజరాత్ మోడల్”… — KTR (@KTRBRS) March 6, 2024 -
Elon Musk: ఎక్స్ మెయిల్ వచ్చేస్తోంది !
వాషింగ్టన్: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ పేరును ‘ఎక్స్’గా మార్చిన దాని నూతన యజమాని, కుబేరుడు ఎలాన్ మస్క్ అదే పేరుతో ఒక ఈమెయిల్‌ను తీసుకురానున్నారు. ‘ఎక్స్ మెయిల్’ త్వరలో రాబోతోందని ఆయన స్వయంగా ప్రకటించారు. ఈమెయిల్ సేవల ముఖచిత్రం మారబోతోందని వ్యాఖ్యానించారు. అయితే సొంత ఎక్స్‌మెయిల్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారు, అందులోని ప్రత్యేకతలు ఏంటి అనే వివరాలను ఇంకా వెల్లడించలేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు నెటిజన్లు అందరూ వాడే గూగుల్ వారి జీమెయిల్ త్వరలో తన సేవలను నిలిపివేయనుందన్న పుకార్ల నడుమ ఎక్స్‌మెయిల్ అరంగేట్రం చేయనుండటం గమనార్హం. జీమెయిల్ 2024 ఆగస్ట్ ఒకటో తేదీన కనుమరుగుకానుందంటూ ‘ఎక్స్’లో ఒక వార్త ప్రత్యక్షమై విస్తృత చర్చకు తెరలేపింది. గూగుల్ పంపిన ఒక ఈమెయిల్లో ‘త్వరలో జీమెయిల్ అస్తమించబోతోంది’ అంటూ ఒక సందేశం ఉందని ఆ వార్తలోని సారాంశం. దీనిపై జీమెయిల్ మాతృసంస్థ గూగుల్ స్పందించింది. ‘అవన్నీ శుద్ధ అబద్ధాలు. ఇన్నాళ్లూ బేసిక్ హెచ్‌టీఎంఎల్ వ్యూ ఫార్మాట్లో జీమెయిల్ సేవలు అందించాం. ఆ సేవలను ఈ ఏడాది నిలిపివేసి త్వరలోనే ‘స్టాండర్డ్’ వ్యూలో జీమెయిల్ సేవలను అధునాతనంగా అందిస్తాం’ అని గూగుల్ స్పష్టతనిచి్చంది. దీంతో జీమెయిల్ యూజర్లంతా ఊపిరి పీల్చుకున్నారు. కొత్తగా రాబోయే ఎక్స్‌మెయిల్ ఏమేరకు జీమెయిల్‌కు పోటీ ఇవ్వగలదో చూడాలి మరి. త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని ‘ఎక్స్’ ఇంజనీరింగ్, సెక్యూరిటీ టీమ్ సీనియర్ సభ్యుడు న్యాట్ మెక్గ్రేడీ వెల్లడించారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే
న్యూఢిల్లీ: ఉధృతంగా కొనసాగుతున్న రైతుల ఉద్యమ సంబంధ ‘ఎక్స్’ఖాతాలను స్తంభింపజేయాలంటూ ‘ఎక్స్’ సంస్థకు మోదీ సర్కార్ నుంచి ఆదేశాలు రావడంపై కాంగ్రెస్ కన్నెర్రజేసింది. భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తూ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. రైతుల ఉద్యమంతో సంబంధం ఉన్న దేశంలో 177 సామాజికమాధ్యమాల ఖాతాలను తాత్కాలికంగా నిలిపేయాలంటూ ‘ఎక్స్’కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది. కేంద్ర హోం శాఖ సిఫార్సుమేరకు ఈ ఆదేశాలొచ్చాయి. దీనిపై తొలుత ‘ఎక్స్’ స్పందించింది. ‘‘ పెనాల్టీలు, జరిమానాలు, నిర్బంధాలకు వీలయ్యేలా 177 ఖాతాలను బ్లాక్ చేస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులొచ్చాయి. తప్పని పరిస్థితుల్లో ఆ ఆదేశాలను పాటించాం. కానీ ఇలా భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం సబబు కాదు. ఈ అంశంలో పారదర్శకత కోసం ఆయా ఉత్తర్వుల కాపీలను బహిర్గతంచేయాల్సింది. అయితే చట్టంలోని నిబంధనల కారణంగా మేం ఆ పనిచేయలేకపోతున్నాం. పారదర్శకత లేనంత కాలం, బహిర్గతం చేయనంతకాలం ఈ వ్యవస్థలో జవాబుదారీతనం లేనట్లే’’ అని ‘ఎక్స్’ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ బృందం ఒక ప్రకటన విడుదలచేసింది. -
భారత ప్రభుత్వంపై మస్క్ కంపెనీ వ్యతిరేక స్వరం
తమ ప్లాట్‌ఫామ్‌లోని కొన్ని ఖాతాలు, పోస్ట్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలను తాము పాటిస్తాం కానీ, వారి చర్యలతో ఏకీభవించబోమని ప్రకటించింది. అయితే కంపెనీ ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ‘ఎక్స్’కు సంబంధించిన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ హ్యాండిల్లో ఈ మేరకు పోస్ట్‌లో వివరాలను కంపెనీ వెల్లడించింది. భారత ప్రభుత్వ చర్యలతో తాము ఏకీభవించడం లేదని, భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ పోస్ట్‌లను తొలగించడం సరికాదని అభిప్రాయపడింది. అయితే భారత ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని తెలిపింది. "ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భారత్‌లో మాత్రమే ఈ ఖాతాలు, పోస్ట్‌లను నిలిపివేస్తాం. అయినప్పటికీ మేము ఈ చర్యలతో విభేదిస్తున్నాం. ఈ పోస్ట్‌లకు భావప్రకటనా స్వేచ్ఛను కొనసాగిస్తున్నాం" అని పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉందని ‘ఎక్స్’ తెలిపింది. ప్రభావిత యూజర్లకు కూడా ఈ చర్యల నోటీసును అందించినట్లు పేర్కొంది. గత ఏడాది జూన్‌లో నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ‘ఎక్స్’ వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. భారత ప్రభుత్వ ఆదేశాలను పాటించనందుకు కంపెనీకి హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని హైకోర్టు సమర్థించిందని, దేశ చట్టాన్ని కంపెనీ తప్పక పాటించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. -
పాక్‌లో 24 గంటల పాటు‘ఎక్స్’ బంద్.. ‘నెట్ బ్లాక్స్’ వెల్లడి!
ఇటీవలే పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యం కావడంతో ఆరోపణలు, ప్రత్యారోపణలు వినిపించాయి. పలు పార్టీలు ఇవి రిగ్గింగ్ ఫలితాలని ఆరోపణలు చేశాయి. మరోవైపు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ‘ఎక్స్’ ను పాకిస్తాన్లో 24 గంటల పాటు నిలిపి వేశారనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది. పాకిస్తాన్లో స్థానిక అధికారులు ఎన్నికల్లో అవకతవకలు బయటపడకుండా ఉండేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ను 24 గంటలు నిలిపివేశారని ఇంటర్నెట్ మానిటర్ నెట్‌బ్లాక్స్ ఆరోపించింది. తొలిసారిగా ‘ఎక్స్’పై ఇంత కాలం నిషేధం కొనసాగినట్లు నెట్బ్లాక్స్పేర్కొంది. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్, ప్రధాన న్యాయమూర్తి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని పాకిస్తాన్‌లోని రావల్పిండి మాజీ కమిషనర్ లియాఖత్ అలీ చత్తా ఆరోపించారు. ఈ నేపధ్యంలో వారు ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు ‘నెట్బ్లాక్’ దేశవ్యాప్తంగా ‘ఎక్స్’కు ఎదురైన అంతరాయాలను నివేదించింది. పలువురు వీపీఎన్ల సాయంతో తప్ప ‘ఎక్స్’ని యాక్సెస్ చేయలేకపోయారని డిజిటల్ హక్కుల పోరాట న్యాయవాద వేదిక ‘బోలో భీ’ డైరెక్టర్ ఉసామా ఖిల్జీ తెలిపారు. పలువురు వినియోగదారులు ‘ఎక్స్’ను వినియోగించలేకపోతున్నామంటూ ఫిర్యాదులు చేశారని తెలిపారు. అయితే దీనిపై టెలికాం అథారిటీ లేదా ఐటి మంత్రి నుండి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదని ఉసామా ఖిల్జీ పేర్కొన్నారు. ⚠ Update: Metrics show that X/Twitter has now been restricted in #Pakistan for 24 hours, the latest and longest in a series of nation-scale internet censorship measures imposed by authorities as reports of election fraud emerge 📉 https://t.co/XAsM39sBb5 pic.twitter.com/ZKIhINj3Pc — NetBlocks (@netblocks) February 18, 2024 -
ట్రెండింగ్‌లో ‘సిద్ధం’
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం నిర్వహించిన ‘సిద్ధం’ సభ సోషల్ మీడియా (సామాజిక మధ్యమాలు)లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఎక్స్(ట్విట్టర్)లో దేశంలోనే మొదటి స్థానంలో ‘సిద్ధం’ హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ అయింది. సిద్ధం సభ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వైఎస్సార్సీపీ అభిమానులు భారీ ఎత్తున ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టులు చేశారు. జనసంద్రాన్ని తలపిస్తున్న ‘సిద్ధం’ సభా ప్రాంగణం, సభకు హాజరైన ప్రజలు సీఎం వైఎస్ జగన్‌కు నీరాజనాలు పలుకుతున్న జనం ఫొటోలతో సామాజిక మాధ్యమాలు నిండిపోయాయి. వైఎస్ జగన్ ఎగైన్, ఎండ్ ఆఫ్ టీడీపీ హ్యాష్‌ట్యాగ్‌లతోనూ ‘సిద్ధం’ సభ విశేషాలను ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూ అభిమానులు హోరెత్తించారు. తద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఉన్న క్రేజ్ గురించి మరోమారు దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది. -
ఇది సీఎం జగన్ చరిష్మా.. ట్రెండింగ్‌లో ‘సిద్ధం’
సాక్షి, అనంతపురం: సోషల్ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్‌లో నిలిచింది. ఎక్స్(ట్విట్టర్)లో దేశంలోనే మొదటిస్థానంలో సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సిద్ధం అప్డేట్స్ను వైఎస్సార్సీపీ అభిమానులు భారీగా షేర్ చేస్తున్నారు. ‘సిద్ధం’ సభా ప్రాంగణం ఫొటోలతో ఫేస్బుక్, ట్విట్టర్ నిండిపోయింది. ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి గత నెల 27న భీమిలి వేదికగా శంఖం పూరించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే నేడు రాయలసీమలోని రాప్తాడులో ఏపీలోనే కనివిని ఎరుగని రీతిలో సిద్ధం సభ జరిగింది. రాప్తాడు సభ సముద్రాన్ని తలపించింది. సభకు లాక్షలాదిగా సీఎం జగన్ సైన్యం తరలివచ్చింది. సీఎం జగన్ ప్రసంగం సింహనాదంలా కొనసాగింది. ఎంతమంది జత కట్టినా.. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజలతోనే తన పొత్తు అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజలే స్టార్ క్యాంపెనర్లుగా సీఎం జగన్ ప్రకటించారు. లబ్ధిదారులే తనకు ఓటు వేయిస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ పంచ్‌లు -
పుల్వామా అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (ఫిబ్రవరి 14) నివాళులర్పించారు. ‘పుల్వామాలో అమరులైన వీరులకు నివాళులు అర్పిస్తున్నాను’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశం కోసం వారు చేసిన సేవలు, త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. I pay homage to the brave heroes who were martyred in Pulwama. Their service and sacrifice for our nation will always be remembered. — Narendra Modi (@narendramodi) February 14, 2024 జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి జరిగి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. పుల్వామా ఉగ్రదాడి 2019, ఫిబ్రవరి 14న జరిగింది. భారత్‌పై జరిగిన భారీ తీవ్రవాద దాడుల్లో ఇదొకటి. ఆ చీకటి రోజున ఉగ్రవాదులు 200 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదుల దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు అమరులయ్యారు. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు. ఆరోజు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లో 78 వాహనాలు ఉండగా, వాటిలో 2500 మందికి పైగా సైనికులు ప్రయాణిస్తున్నారు. -
Elon Musk: మూడు లక్షల కోట్లు తగలెట్టేశాడు
అపర కుబేరుడు ఎలోన్ మస్క్ 21 ఏళ్ల కుర్రాడిపై ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం ఏకంగా రూ.3.50లక్షల కోట్లు తగలేశాడు. ఇప్పుడు ఇదే ప్రపంచ టెక్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. మస్క్ 2022లో ‘వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’. ట్విటర్ (ఇప్పుడు ఎక్స్.కామ్‌గా మారింది) ను కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి ఎలోన్ మస్క్ చెబుతున్న మాటలివి. అత్యంత ప్రభావంతమైన సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విటర్లో దీనిపై నియంత్రణ ఉండటం సరికాదన్నది ఆయన అభిప్రాయం. అందుకే ట్విటర్ కొనుగోలు ఒప్పందం పూర్తయిన తర్వాత తొలి సందేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. వాక్ స్వాతంత్ర్యం కాదు.. 21 ఏళ్ల కుర్రాడిపై అయితే మస్క్ ట్విటర్ కొనుగోలు చేయడానికి వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కాదని, 21 ఏళ్ల కుర్రాడిపై ఆగ్రహంతో తీసుకున్న నిర్ణయం అంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వినడానికి వింతగా ఉన్నా.. అక్షరాల ఇదే నిజం అంటూ అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్ జర్నలిస్ట్ కర్ట్ వాగ్నెర్ (Kurt Wagner) పలు సంచలన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఆయనే స్వయంగా ఓ పుస్తకాన్ని రాశారు. ‘బ్యాటిల్ ఫర్ ద బర్డ్’ బుక్‌లో ట్విటర్ కొనుగోలుకు ముందు అప్పటి సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు, ఎలోన్ మస్క్ ఏం జరిగిందో కులంకషంగా వివరించారు. అది 2022 జనవరి నెల. ఆ నెలలో స్పేస్ఎక్స్, టెస్లా కంపెనీలతో యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ‘ఎలోన్ జెట్’ అనే ట్విటర్ అకౌంట్‌ను బ్లాక్ చేయాలని అప్పటి ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను కోరారు. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇదే విషయాన్ని బ్యాటిల్ ఫర్ ద బర్డ్‌లో ప్రస్తావించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక సైతం పేర్కొంది. ఎలోన్ జెట్ అకౌంట్ ఎవరిది ఎలోన్ జెట్ ట్విటర్ అకౌంట్ 19 ఏళ్ల కుర్రాడు జాక్ స్వీనీ (Jack Sweeney)ది. అప్పట్లో జాక్ స్వీనీ తన టెక్నాలజీలో తనకున్న అపారమైన తెలివితేటలతో ఎలోన్ మస్క్‌ను బయపెట్టాడు. తన సొంత నైపుణ్యంతో విమానాల కదలికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ఓ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాడు. అలా ప్రైవేటు వ్యక్తుల విమానాలు ఎప్పుడు.. ఎక్కడ.. ఉన్నాయో ఇట్టే చెప్పేస్తున్నాడు. అందుకోసం ట్విటర్‌ను వేదికగా చేసుకున్నాడు. స్వీనీ ట్రాక్ చేస్తున్న విమానాల్లో ఎలోన్ మస్క్‌తో పాటు ఇతర ప్రముఖులు సైతం ఉన్నారు. 3లక్షలు వద్దు 37లక్షలు కావాలి ఇదే విషయం తెలుసుకున్న మస్క్.. స్వీనీని ట్విటర్లోనే (ఆ ట్వీట్‌ను కింద ఫోటోలో చూడొచ్చు) సంప్రదించారు. తన విమానాల్ని ట్రాక్ చేయడం ఆపాలని కోరారు. స్వీనీ విమానాల్ని ట్రాక్ చేయడం వల్లే తాను ఎంత నష్టపోతున్నానో వివరించారు మస్క్. అందుకు 5,000 (రూ.3.75 లక్షలు) డాలర్లు ఇస్తానని ఆఫర్ చేశారు. కానీ, స్వీనీ అందుకు నిరాకరించాడు. తనకు 50,000 డాలర్లు (దాదాపు రూ.37.55 లక్షలు) కావాలని డిమాండ్ చేశాడు. ఈ మొత్తంతో తాను స్కూల్ ఫీజు చెల్లించడంతో పాటు టెస్లా కారు కొనుక్కుంటానని తెలిపాడు. ‘బ్యాటిల్ ఫర్ ది బర్డ్’ ఈ ఘటన తర్వాత జరిగిన పరిణామాలపై ఈ నెల 20న విడుదల కానున్న బ్యాటిల్ ఫర్ ది బర్డ్‌లో “మస్క్ తన ప్రైవేట్ విమానాన్ని ట్రాక్ చేస్తున్న ట్విటర్ ఖాతాను తొలగించమని అగర్వాల్‌కు విజ్ఞప్తి చేశారు. అగర్వాల్ మస్క్ అభ్యర్థనను తిరస్కరించారు. ఇలా కొద్దిసేపటికే మస్క్ ట్విటర్ షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభించారని కర్ట్ వాగ్నెర్ హైలెట్ చేశారు. 2022 అక్టోబర్‌లో ఎలోన్ మస్క్ ట్విటర్‌ని 44 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేశారు. అనంతరం ట్విటర్లో సిబ్బంది తొలగించారు. సగం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించడమే కాకుండా, పలువురు జర్నలిస్టులతో పాటు జాక్ స్వీనీ ట్విటర్ అకౌంట్ ఎలోన్ జెట్‌ను సస్పెండ్ చేశారు. మస్క్ ట్విటర్‌ను ఎప్పుడు కొనుగోలు చేశారు? ►ఎలోన్ మస్క్ ఏప్రిల్ 14,2022 ఒక్క షేరును 54.20 చొప్పున మొత్తం షేర్లను 44 బిలియన్ డాలర్లకు అంటే (సుమారు రూ.3.50లక్షల కోట్లు) ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటన ►ఏప్రిల్ 25న ట్విటర్ సైతం తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్‌ను మస్క్‌కు అమ్ముతున్నట్లు ధృవీకరించింది. ►మస్క్- ట్విటర్ మధ్య ఫేక్ ట్విటర్ అకౌంట్లపై వివాదం నెలకొంది. పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం జులై 8న మస్క్ మరో ప్రకటన చేశారు. ట్విటర్‌ను కొనుగోలు చేయడం లేదని, ఫేక్ అకౌంట్లకు సంబంధించి తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వడంలో ట్విటర్ విఫలమైందన్న ఆరోపణలతో ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు వెల్లడించారు. ►ఎట్టకేలకు మస్క్-ట్విటర్ మధ్య కొనుగోలు ఒప్పందం పూర్తయింది. 3.50లక్షల కోట్లు వెచ్చించిన ఈ అపరకుబేరుడు ట్విటర్ బాస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ట్విటర్‌ను ఎక్స్.కామ్‌గా మార్చారు. ఇప్పుడు దానిని ఎవ్రిథింగ్ యాప్‌గా మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు మస్క్. -
హృతిక్ రోషన్ 'ఫైటర్' సినిమాపై పబ్లిక్ టాక్
బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం ఫైటర్.దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. భారీ యాక్షన్ చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఫైటర్ చిత్రంపై బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు. సినిమా చాలా బాగుందని ఆయన తెలపారు. ఫైటర్ సినిమాను చాలా బ్రిలియంట్‌గా తెరకెక్కించాడని ఆయన తెలిపారు. ఈ సినిమాను మిస్ చేసేకోవద్దని ఆయన చెప్పారు. సోషల్‌మీడియాలో ఫైటర్ సినిమాకు 4.5 రేటింగ్ ఇచ్చారు.సినిమాకు అంతగా బజ్ లేకపోడంతో అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా లేవని ఆయన తెలిపారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ చిత్రం ద్వారా హ్యట్రిక్ కొట్టారు. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు డ్రామా, ఎమోషన్స్, దేశభక్తి అన్నీ ఉన్నాయని తెలిపారు. సినిమా కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అని పేర్కొన్నారు. హృతిక్ రోషన్ 'ఫైటర్' సినిమాలో షో టాపర్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు తరణ్ ఆదర్శ్. దీపికా పదుకోన్‌తో ఆయన కెమిస్ట్రీ సూపర్ అంటూ పేర్కొన్నారు. అనిల్ కపూర్ ఎప్పటిలా అద్భుతంగా నటించారని చెప్పారు. సెకండాఫ్ ఫైటర్ చిత్రానికి మరింత బలాన్ని ఇస్తుందని తెలిపారు. ఇందులో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించే డైలాగ్స్ ఉన్నట్లు చెప్పారు. హృతిక్ రోషన్ భారీ హిట్ కొట్టాడని మాస్ కా బాప్ అంటూ ఈ చిత్రంలోని బీజీఎమ్ సూపర్ అని నెటిజన్లు తెలుపుతున్నారు. ఫైటర్ సినిమా మెగా బ్లాక్ బస్టర్ అని ఈ చిత్రంలోని గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ పనితీరు చాలా బాగుందని ఒక నెటిజన్ తెలిపాడు. దేశభక్తి ఉన్న ఇలాంటి ఏరియాల్ యాక్షన్‌ను ఇంతవరకు చూడలేదని ఒక నెటిజన్ తెలిపాడు. హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రంతో తానేంటో నిరూపించుకున్నాడు. దీపికా పదుకొణె తన కెరీర్లో ఈ చిత్రం బెస్ట్‌గా ఉంటుంది. అనిల్ కపూర్ ఫైటర్ సినిమాకు ఆత్మలాంటివాడు. హృతిక్ రోషన్‌కు భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టే సినిమా అని నెటిజన్లు తెలుపుతున్నారు. #OneWordReview...#Fighter: BRILLIANT. Rating: ⭐️⭐️⭐️⭐️½#War. #Pathaan. Now #Fighter. Director #SiddharthAnand scores a hat-trick… Aerial combat, drama, emotions and patriotism, #Fighter is a KING-SIZED ENTERTAINER, with #HrithikRoshan’s bravura act as the topping… JUST DON’T… pic.twitter.com/t9fmssfw2P — taran adarsh (@taran_adarsh) January 24, 2024 Baap Level Entry of #HrithikRoshan BGM + Greek God Screen Present is Totally Goosebumps, Goosebumps. MASS KA BAAP 🔥🔥🔥#FighterReview #Fighter #HrithikRoshan𓃵 pic.twitter.com/n92lKNlG1L — AMIR ANSARI (@amirans934) January 25, 2024 #FighterReview - ⭐⭐⭐⭐⭐ Lots of Action, VFX is Top Level, and Storytelling is Masterclass, best movie of #HrithikRoshan𓃵 Career. A MUST WATCH 🔥🔥🔥#HrithikRoshan #Fighter pic.twitter.com/Grl1RTPriE — FMOVIES 🎥 (@FMovie82325) January 24, 2024 EXCLUSIVE 🚨🚨🚨 #Fighter Public Review Action Sequences are never seen before Once in a lifetime experience for Everyone #SiddharthAnand #HrithikRoshan#FighterReview#FighterOn25thJan #FighterFirstDayFirstShowpic.twitter.com/txIAHM8tcM — The Unrealistic Guy (@Guy_Unrealistic) January 25, 2024 FIGHTER RECEIVED EXCELLENT RESPONSE IN AUSTRALIA AND NEW ZEALAND 🔥🔥 People Call it Dhamaka of Entertainment and Patriotism 🇮🇳🇮🇳#FighterFirstDayFirstShow #FighterReview #Fighter https://t.co/dFow4B2YG1 — Anand Abhirup 📌 🧡 🦩 (@SanskariGuruji) January 25, 2024 #Fighter is a MASTERPIECE and a MEGA BLOCKBUSTER Film filled with a lot of Action, Drama, emotions and full-on patriotism. From Hrithik performance to the direction Everything was so good about the movie. This will take the Box office by storm. Rating - 5/5 #FighterReview pic.twitter.com/RG1w74ZvN5 — Renjeev Chithranjan (@RenjeevC) January 25, 2024 #FighterReview 1st half done: It’s okay so far those who have seen top gun but built up is nice.#HrithikRoshan𓃵 entry will have whistles and that arrogance is just amazing Hrithik and #DeepikaPadukone has better chemistry on screen than promos. — MeerajRules (@meerajrules) January 25, 2024 -
‘క్లిక్ చేస్తే ఖల్లాస్’.. ప్రపంచంలోనే భారీ డేటా చోరీ!
ఇంటర్నెట్ యూజర్లకు, అమెరికాతో పాటు పలు దేశాల ప్రభుత్వాలకు సైబర్ నేరస్తులు షాకిచ్చారు. అమెరికా ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన డేటాను చోరీ చేశారు. దీంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 26 బిలియన్ల యూజర్ల డేటా చోరీకి గురైనట్లు డిస్కవరీ, సైబర్ న్యూస్ సంస్థలకు చెందిన రీసెర్చర్లు నిర్ధారించారు. సైబర్ నేరస్తులు సేకరించిన డేటా మొత్తం ‘మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్’ అనే అన్ సెక్యూర్ పేజీలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా లీకైన ఈ డేటాను చైనా మెసేజింగ్ జెయింట్ టెన్సెంట్, వైబో, అడోబ్, కాన్వా, లింక్డిన్, ఎక్స్.కామ్, టెలిగ్రాం ద్వారా సేకరించినట్లు తమ పరిశోధనల్లో గుర్తించినట్లు రీసెర్చర్లు అన్నారు. ఇక యూజర్ల డేటాతో పాటు అమెరికా, ప్రపంచంలోని ఆయా దేశాల ప్రభుత్వ డేటా సైతం సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లినట్లు తేల్చారు. డేటాతో ఏం చేస్తారంటే? ఇక సైబర్ నేరస్తులు( థ్రెట్ యాక్టర్స్) తస్కరించిన డేటాను ఉపయోగించి భారీ మొత్తంలో సైబర్ దాడులు, యూజర్ల బ్యాంక్ అకౌంట్లతో పాటు ఇతర వ్యక్తిగత సమాచారం, ఫిషింగ్ స్కామ్స్, కొన్ని సంస్థల్ని లేదంటే, కంప్యూటర్లను లక్ష్యంగా చేసుకుని వాటిపై సైబర్ దాడులు చేసేందుకు వీలుగా ఉపయోగిస్తారని రీసెర్చర్లు వెల్లడించారు. ఆ ధీమా వద్దు అయితే, డేటా చోరీతో సైబర్ నేరగాళ్లు ఏమి చేస్తారులే’ అనే ధీమాతో కాకుండా దొంగిలించిన డేటాతో ఏం చేయొచ్చు? ఒకవేళ వినియోగిస్తే వాటి పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఈఎస్ఈటీ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్మూర్ అన్నారు. ఫోన్, మెయిల్స్, వాట్సాప్ ఆడియోకాల్స్ తో పాటు ఇతర అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దని, అలాంటి లింక్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. గతాన్ని గుర్తు చేసిన రీసెర్చర్లు ఈ సందర్భంగా ఇదే తరహాలో సైబర్ నేరస్తులు 2019లో వెరిఫికేషన్.ఐఓ తయారు చేసిన ఎలాంటి భద్రత లేని డేటాబేస్ నుంచి దాదాపు వన్ బిలియన్ రికార్డులు డేటా లీకైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో, ఇదే అతిపెద్ద, అత్యంత హానికరమైన లీకేజీల్లో ఒకటిగా పేరొందింది. ఈ డేటా చౌర్యం మైస్పేస్ (360 మిలియన్లు), ట్విటర్ (281 మిలియన్లు), లింక్డిన్ (251 మిలియన్లు), అడల్ట్ఫ్రెండ్ఫైండర్ (220 మిలియన్లు) వంటి సోషల్ నెట్ వర్క్ యూజర్లదని డిస్కవరీ, సైబర్ న్యూస్ రీసెర్చర్లు స్పష్టం చేశారు. -
అర్జున్ రెడ్డి స్టైల్లో కేటీఆర్.. అదిరిన కొత్త లుక్..
కేటీఆర్ ఎప్పుడూ నీట్ షేవ్‌తో డీసెంట్ లుక్‌లోనే కనిపిస్తూ ఉంటారు. హెయిర్ స్టయిల్ ఎప్పుడూ సింపుల్‌గా ఉంటుంది. మీసాలు, గడ్డం కూడా పెంచుకోరు. మరి అలాంటి లీడర్ అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండలా కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. క్లాస్ లుక్ నుంచి మాస్ లుక్కు మారిన కేటీఆర్ చిత్రాన్ని చూస్తారా? ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వాడకం ఎక్కువ అవ్వడంతో ప్రతి రంగంలోనూ మార్పులు జరుగుతున్నాయి. ఏఐసాయంతో ఇష్టమైన నాయకుల ఫోటోలు, వీడియోలు ఎడిట్ చేసి వారిని కొత్త లుక్స్‌తో పరిచయం చేస్తున్నారు. తాజాగా కేటీఆర్ అభిమాని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫోటను ఏఐ టెక్నాలజీ ద్వారా కొత్త లుక్‌లో రూపొందించారు. పొడవాటి జట్టు, గడ్డం, మీసంతో ఎడిట్ చేసి కేటీఆర్‌కు పంపించాడు. ఆ ఫొటో కేటీఆర్‌కు బాగా నచ్చడంతో దాన్ని తన అధికారిక ఎక్స్‌లో (ట్విటర్)షేర్ చేశారు. ‘బీఆర్ఎస్ పార్టీని అమితంగా ప్రేమించే ఓ వీరాభిమాని ఎడిట్ చేసి పంపిన నా ఫొటోను ట్వీట్ చేస్తున్నా’ అనే క్యాప్షన్ ఇస్తూ కేటీఆర్ ఆ ఫొటోను షేర్ చేశారు. దాని కింద ‘నేను నా జుట్టు, గడ్డం పెంచుకుంటే’ అని ఓ ట్యాగ్‌లైన్ రాశారు. దాన్ని నవ్వుతున్న ఎమోజీని ఆడ్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రేవంత్ రెడ్డి ఫోకస్ మారితేనే మంచిది! Tweeting a digitally edited pic sent by an admirer of the Party If only I could grow my hair and beard 😁 pic.twitter.com/foqNr7GjV2 — KTR (@KTRBRS) January 21, 2024 -
విడిపోయిన సానియా–షోయబ్
కరాచీ/న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌ల 14 ఏళ్ల వివాహ బంధానికి విడాకుల కార్డు పడింది. ఇది జరిగి చాన్నాళ్లే అయినా... సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతున్నా... ఇరు వర్గాల నుంచి అధికారికంగా ‘అవును... కాదు’ అనే మాట రాలేదు! ఎలాంటి స్పష్టత లేదు. కానీ షోయబ్ ముచ్చటగా మూడోసారి ఓ ఇంటివాడు కావడంతోనే ఇద్దరి వైవాహిక బంధం ముక్కలైనట్లు అధికారికంగా... ఆలస్యంగా తెలిసింది. పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్న షోయబ్ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో ఫొటోల్ని పంచుకున్నాడు. 41 ఏళ్ల ఈ పాక్ క్రికెటర్‌కు ఇది మూడో పెళ్లి. హైదరాబాదీ అమ్మాయి అయేషా సిద్ధిఖికు తలాక్ ఇచ్చాకే సానియా మీర్జాను 2010 ఏప్రిల్ 12న హైదరాబాద్ వేదికగా షోయబ్ మాలిక్ రెండో వివాహం చేసుకున్నాడు. నటి సనా జావేద్కేమో ఇది రెండో పెళ్లి. ఆమె 2020లో పాకిస్తాన్ సినీ గాయకుడు, రచయిత ఉమైర్ జైస్వాల్‌ను వివాహమాడింది. అయితే వీరిద్దరి బంధం 2023లో ముగిసింది. తాజాగా సోషల్ మీడియా ‘ఎక్స్’లో షోయబ్ మాలిక్–సనా జావేద్‌ల పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతోనే బయటి ప్రపంచానికి సానియా–షోయబ్‌ల పెళ్లి పెటాకులైనట్లు తెలిసింది. అంతవరకు గుసగుసలే వినిపించేవి! ఇక ఈ విషయాన్ని టెన్నిస్ స్టార్ కుటుంబ వర్గాలు ధ్రువీకరించక తప్పలేదు. ‘అవును... వాళ్లిద్దరు విడిపోయారు. ఇది ‘తలాక్’ కాదు... ‘ఖులా’ ప్రకారం వారి బంధం రద్దయింది. ఇంతకుమించి చెప్పడానికి మా దగ్గరేమీ లేదు’ అని కుటుంబ వర్గాలు తెలిపాయి. గత ఏడాది అక్టోబర్‌లో తనయుడు ఇజ్హన్ ఐదో పుట్టిన రోజు వేడుకలకు షోయబ్ హాజరయ్యాడు. అయితే ఈ వేడుకల ఫొటోలను షోయబ్, సానియా వేర్వేరుగా తమ సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకున్నారు. అప్పుడు నిశ్చి తార్థం... ఇప్పుడు వివాహం! 37 ఏళ్ల సానియాకు తన ప్రొఫెషనల్ కెరీర్లో ఒడిదొడుకులు ఎదురైనట్లే వ్యక్తిగత జీవితంలోనూ ఎదురయ్యాయి. ముందుగా కుటుంబ మిత్రులైన సొహ్రాబ్తో సానియాకు నిశ్చి తార్థం కూడా ఘనంగానే జరిగింది. కానీ కొన్ని నెలల వ్యవధిలోనే పెళ్లిదాకా రాకుండానే ఆ బంధం ముగిసింది. అనంతరం పాకిస్తానీ మాజీ కెపె్టన్ షోయబ్ మాలిక్‌ను వివాహమాడింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఇజ్హాన్ ఉన్నాడు. ప్రస్తుతం తల్లి సానియా దగ్గరే ఇజ్హాన్ పెరుగుతున్నాడు. తన 20 ఏళ్ల అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్లో సానియా మొత్తం 43 డబుల్స్ టైటిళ్లు సాధించింది. ఇందులో మూడు మహిళల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, మూడు మిక్స్డ్ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇది తలాక్ కాదు... ఖులా! సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2010 ఏప్రిల్ 12న టెన్నిస్ స్టార్ సానియా, పాకిస్తాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ వివాహం అంగరంగ వైభవంగా హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో జరిగింది. ఈ బంధం 12 ఏళ్ల పాటు 2022 వరకు సజావుగానే సాగింది. ఇరువురు తమ కెరీర్‌ను కొనసాగిస్తూనే దుబాయ్‌లో కాపురం పెట్టారు. అన్యోన్యంగా సాగిన వీరి కాపురం రెండేళ్ల క్రితం బీటలు వారింది. కెరీర్‌కు రిటైర్మెంట్ పలికి వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయిస్తున్న సమయంలో పొరపొచ్చలు రావడంతో సానియా మీర్జా నుంచే విడాకుల ప్రతిపాదన వచ్చింది. ఇస్లాం చట్ట ప్రకారం దీన్ని ‘ఖులా’ అంటారు. వివాహ బంధం నుంచి భార్య ఏకపక్షంగా విడిపోవాలనుకుంటే ‘ఖులా’తో రద్దు చేసుకోవచ్చు. దీనికి భర్త నుంచి భరణం, ఇతరత్రా లాంఛనాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు. తలాక్ అనేది భర్త రద్దు చేసుకునే విడాకుల ప్రక్రియ. కొంతకాలంగా ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉండటంతో 2022లోనే వివాహరద్దు తంతు వివాదాస్పదం కాకుండా జరిగిపోయిందని సమాచారం. -
Viral Video: తెలుసుకోకుండా ఎక్కితే అలాగే ఉంటుంది మరి
-
Viral Video: ఆడుదామా.. ఆట.?
-
Viral Video: అష్టాచమ్మా ఆడుతుంటే పామే వచ్చింది
-
Prasanth Varma: 'హనుమాన్' మూవీతో హిట్ కొట్టాడు.. ఇంతలోనే దర్శకుడికి షాక్!
సంక్రాంతి తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో అల్టిమేట్‌గా 'హను-మాన్' చిత్రం విజేతగా నిలిచింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో మూవీ టీమ్ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మకు చిన్న షాక్ తగిలింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. 'హనుమాన్' సినిమా విషయంలో హీరో తేజకి ప్రశంసలు దక్కుతున్నప్పటికీ.. ఓవరాల్‌గా మాత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ బాగా హైలైట్ అయ్యాడు. ఎందుకంటే రిలీజ్ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన బలంగా నిలబడి హిట్ కొట్టాడు. అక్కడే అందరి మనసులు గెలిచేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా గదతో ఉన్న ఓ ఫొటోని సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్‌గా మార్చాడు. దీంతో చిన్న సమస్య వచ్చింది. (ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?) ట్విట్టర్ ప్రస్తుతం 'ఎక్స్'గా మారిపోయింది. ఇప్పుడు ప్రొఫైల్ పిక్ లేదంటే పేరు మార్చిన సరే బ్లూ టిక్ పోతోంది. అలా ఇప్పుడు ప్రశాంత్ వర్మ టిక్ కూడా పోయింది. ఈ క్రమంలోనే అతడి చేస్తున్న పోస్టులు ఒరిజినల్ అకౌంట్ నుంచి చేస్తున్నాడా? ఫేక్ అకౌంట్ నుంచే చేస్తున్నాడా అనేది అభిమానులకు అర్థం కావట్లేదు. అందుకే త్వరగా బ్లూ టిక్ మళ్లీ తెచ్చుకో అని కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే రీసెంట్గా కొందరు నెటిజన్స్.. కావాలనే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా పేర్లతో నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేసి పిచ్చిపిచ్చి ట్వీట్స్ చేశారు. తద్వారా వీరిద్దరినీ బ్యాడ్ చేయాలనేది వాళ్ల ఉద్దేశం. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ట్విట్టర్ అకౌంట్ బ్లూ టిక్ పోవడంతో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశముందని నెటిజన్స్ అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: కన్నడలో సూపర్ హిట్.. ఓటీటీలో తెలుగు వెర్షన్.. రిలీజ్ అప్పుడేనా?) #NewProfilePic pic.twitter.com/ONa2TNCv3s — Prasanth Varma (@PrasanthVarma) January 17, 2024 -
Saindhav Twitter Review: సైంధవ్ ట్విటర్ రివ్యూ!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైంధవ్. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది. వెంకటేశ్ 75వ మూవీకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈరోజే థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే చాలా చోట్ల స్క్రీన్స్‌పై సైంధవ్ అలరిస్తోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రంపై ట్విటర్ వేదికగా అభిమానులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ట్రైలర్ చూడగానే ఫుల్ యాక్షన్ మూవీ సగటు ప్రేక్షకునికి అర్థమైపోయింది. ప్రతి సీన్లో బుల్లెట్ల వర్షం కురిపించారు వెంకీమామ. తాజాగా రిలీజ్ కాగా.. నెటిజన్స్ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ సూపర్‌గా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. యాక్షన్ సీన్స్‌లో ముఖ్యంగా వెంకీమామ ఇరగదీశాడని ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు. సెంటిమెంట్స్ సీన్స్ కూడా హార్ట్‌కు టచ్ చేస్తాయని చెబుతున్నారు. ప్రతి సీన్ గూస్బంప్స్ తెప్పిస్తోందని.. ఇంటర్వెల్ ట్విస్ట్ వేరే లెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ⭐⭐⭐/5 Venky mawa before movies tho compare chesthey better story Mainly fights , sankranti Paisa vasool#saindhavreview #Saindhav #venkatesh #Venky75 pic.twitter.com/BSJU3YLBXB — #Gunturkaaram (@renutv9) January 12, 2024 #Saindhav saidhev day... postive talk premieres shows🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/aUDtYnrGEo — venkyarjunnaidu (@DukkaNaidu65634) January 13, 2024 Positive reviews Venky mama done & dusted 💥❤️🩹#SaindhavOnJan13th #Saindhav #Venkatesh pic.twitter.com/o4y5Xd7v6f — Bharath (@Bharath_9180) January 13, 2024 #SaindhavReview - ⭐⭐⭐⭐⭐ It's a best movie of #Venkatesh , Lot's of Action, lot of Twist and Turn and Interval is literally mind-blowing. Goosebump 🔥🔥🔥#Saindhav #Venky75 pic.twitter.com/yDMPAMu7no — AMIR ANSARI (@amirans934) January 12, 2024


