హృతిక్‌ రోషన్‌ 'ఫైటర్‌' సినిమాపై పబ్లిక్‌ టాక్‌ | Sakshi
Sakshi News home page

Fighter Twitter Riview: హృతిక్‌ రోషన్‌ 'ఫైటర్‌'తో హిట్‌ కొట్టాడా.. పబ్లిక్‌ టాక్‌ ఏంటి?

Published Thu, Jan 25 2024 9:04 AM

Hrithik Roshan Fighter Movie Twitter Review - Sakshi

బాలీవుడ్‌ కథానాయకుడు హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం ఫైటర్‌.దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. భారీ యాక్షన్‌ చిత్రాన్ని  సిద్దార్థ్‌ ఆనంద్‌ డైరెక్ట్‌ చేశాడు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్‌ యాక్షన్‌ చిత్రంగా దీన్ని రూపొందించారు.

ఫైటర్‌ చిత్రంపై బాలీవుడ్‌ క్రిటిక్‌ తరణ్‌ ఆదర్శ్‌ తన ఎక్స్‌ పేజీలో ట్వీట్‌ చేశారు. సినిమా చాలా బాగుందని ఆయన తెలపారు. ఫైటర్‌ సినిమాను చాలా బ్రిలియంట్‌గా తెరకెక్కించాడని ఆయన తెలిపారు. ఈ సినిమాను మిస్‌ చేసేకోవద్దని ఆయన చెప్పారు. సోషల్‌మీడియాలో ఫైటర్‌ సినిమాకు 4.5 రేటింగ్‌ ఇచ్చారు.సినిమాకు అంతగా బజ్‌ లేకపోడంతో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ పెద్దగా లేవని ఆయన తెలిపారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్‌ చిత్రం ద్వారా హ్యట్రిక్ కొట్టారు. ఈ చిత్రంలో భారీ యాక్షన్‌ సీన్స్‌తో పాటు డ్రామా, ఎమోషన్స్, దేశభక్తి అన్నీ ఉన్నాయని తెలిపారు. సినిమా కింగ్‌ సైజ్‌ బ్లాక్‌ బస్టర్‌ అని పేర్కొన్నారు.

హృతిక్ రోషన్ 'ఫైటర్' సినిమాలో షో టాపర్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు తరణ్‌ ఆదర్శ్‌. దీపికా పదుకోన్‌తో ఆయన కెమిస్ట్రీ సూపర్‌ అంటూ పేర్కొన్నారు. అనిల్ కపూర్ ఎప్పటిలా అద్భుతంగా నటించారని చెప్పారు. సెకండాఫ్ ఫైటర్‌ చిత్రానికి మరింత బలాన్ని ఇస్తుందని తెలిపారు. ఇందులో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించే డైలాగ్స్‌ ఉన్నట్లు చెప్పారు.

హృతిక్ రోషన్ భారీ హిట్‌ కొట్టాడని మాస్‌ కా బాప్‌ అంటూ ఈ చిత్రంలోని బీజీఎమ్‌ సూపర్‌ అని నెటిజన్లు తెలుపుతున్నారు. ఫైటర్‌ సినిమా మెగా బ్లాక్‌ బస్టర్‌ అని ఈ చిత్రంలోని గ్రాఫిక్స్‌, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్‌ పనితీరు చాలా బాగుందని ఒక నెటిజన్‌ తెలిపాడు.

దేశభక్తి ఉన్న ఇలాంటి ఏరియాల్ యాక్షన్‌ను ఇంతవరకు చూడలేదని ఒక నెటిజన్‌ తెలిపాడు. హృతిక్ రోషన్ ఫైటర్‌ చిత్రంతో తానేంటో నిరూపించుకున్నాడు. దీపికా పదుకొణె తన కెరీర్‌లో ఈ చిత్రం బెస్ట్‌గా ఉంటుంది. అనిల్ కపూర్ ఫైటర్‌ సినిమాకు ఆత్మలాంటివాడు. హృతిక్ రోషన్‌కు భారీ కలెక్షన్స్‌ తెచ్చిపెట్టే సినిమా అని నెటిజన్లు తెలుపుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement