
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర (Vishwambhara Movie). బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యే డైరెక్టర్ సినిమా కథ కూడా బయటపెట్టేశాడు. 'మనకు తెలిసినవి 14 లోకాలే.. ఈ పద్నాలుగు లోకాలకు పైనున్న లోకమే సత్యలోకం. విశ్వంభర కోసం వీటన్నింటినీ దాటుకుని పైకి వెళ్లాం. ఆ లోకంలో ఉండే హీరోయిన్‌ను హీరో వెతుక్కుంటూ వెళ్లి ఆమెను భూమి మీదకు ఎలా తీసుకొచ్చాడు? అన్నదే సినిమా కథ' అని చెప్పాడు.
తెలుగులో తొలిసారి..
సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. బ్యాలెన్స్ ఉన్న స్పెషల్ సాంగ్ కూడా రెండు రోజుల క్రితమే పూర్తి చేశారు. ఈ పాటలో బుల్లితెర సీరియల్స్‌లో విలనిజం పండించిన మౌనీ రాయ్‌ను సెలక్ట్ చేశారు. ఈమె చిరుతో కలిసి తొలిసారి చిందేసింది. అంతేకాదు, టాలీవుడ్‌లో ఆమె నటించడం కూడా ఇదే మొదటిసారి! ఈ పాటకు గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ అందించాడు. అయితే ఆమె ఈ సినిమాకు ఎంత డబ్బు తీసుకుందన్న చర్చ మొదలైంది.

నిమిషానికి లక్షల్లో..
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం.. మౌనీ రాయ్ నాలుగైదు నిమిషాల పాటకుగానూ రూ.50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మౌనీ రాయ్.. నాగిణి సీరియల్‌తోనే చాలామందికి పరిచయం. ఈ పాటలో కూడా ఆమె నాగిణిగా కనిపించనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇదెంతవరకు నిజమన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
విశ్వంభర ఆలస్యం?
నిజానికి ఈ పాట కోసం మొదట బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌ను సంప్రదించారట! కానీ, ఆమె రూ.8 కోట్లు డిమాండ్ చేయడంతో తనను పక్కన పెట్టేశారని తెలుస్తోంది. విశ్వంభర చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ వీఎఫ్‌ఎక్స్ పనుల వల్ల సినిమా మరింత వాయిదా పడే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.
చదవండి: 10 ఏళ్లుగా డిప్రెషన్.. చనిపోతానని నాన్న ఎప్పుడో చెప్పాడు