గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి | Ventarnar Nepali Actor Sunil Thapa Passed Away | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ‘మిరాయ్‌’ నటుడు మృతి

Feb 7 2026 4:20 PM | Updated on Feb 7 2026 4:27 PM

Ventarnar Nepali Actor Sunil Thapa Passed Away

నేపాల్‌ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సునీల్ థాపా (68) కన్నుమూశారు. శనివారం(ఫిబ్రవరి 7) ఉదయం గుండెపోటుకి గురికావడంతో వెంటనే ఖాట్మండ్‌లోని థాపాతలిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. ఉదయం 7.44 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

నేపాల్‌లోని డాంగ్‌లో జన్మించిన సునీల్ థాపా, సుమారు 40 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగారు. నేపాలీ, బాలీవుడ్‌, భోజ్‌పూరితో పాటు మొత్తం పలు భాషల్లో 300లకు పైగా సినిమాల్లో నటించాడు. సునీల్ థాపా మరణం పట్ల నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి సుశీల కార్కీతో పాటు ‘మిరాయ్‌’ చిత్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ’ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటించింది. 

Advertisement
 
Advertisement
Advertisement