'పుష్ప' సినిమా ఫేమ్ డాలి ధనంజయ నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా! అతడికి డాలి పిక్చర్స్ అని ఓ బ్యానర్ ఉంది. ఆ బ్యానర్ కింద తెరకెక్కిన తాజా చిత్రం జేసీ. ద యూనివర్సిటీ అన్నది ఉపశీర్షిక. సూర్య ప్రఖ్యాత్, భావన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కన్నడ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 6న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రీమియర్స్‌లో వాచీ గిఫ్ట్
అయితే ఒకరోజు ముందు ప్రీమియర్స్ వేశారు. ఈ సందర్భంగా అందరినోటా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో డాలి ధనంజయ సంతోషపడిపోయాడు. దీంతో థియేటర్‌లోనే సూర్య ప్రఖ్యాత్‌ను హత్తుకుని అతడిపై ముద్దుల వర్షం కురిపించాడు. అంతేకాదు, వెంటనే తన చేతికున్న వాచీని అతడికి బహుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సినిమా
డాలి ధనంజయ (Daali Dhananjaya) విషయానికి వస్తే.. ఈయన చివరగా తమిళంలో పరాశక్తి సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం కన్నడలో నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఈయన అప్పుడప్పుడు వార్తాపత్రికల్లో కథనాలు కూడా రాస్తుంటాడు.


