ఒక్కమాటతో తారక్‌పై గౌరవం రెట్టింపు: పూజా బేడీ | Pooja Bedi Praises Jr NTR, Because of This Reason | Sakshi
Sakshi News home page

తారక్‌లా ఇండస్ట్రీలో ఎవరూ ఉండరు.. జూనియర్‌ ఎన్టీఆర్‌పై ప్రశంసలు

Feb 6 2026 2:39 PM | Updated on Feb 6 2026 2:46 PM

Pooja Bedi Praises Jr NTR, Because of This Reason

ప్రముఖ బాలీవుడ్‌ నటి పూజా బేడీ చాలా తక్కువ సినిమాలే చేసింది. వాటిలో చిట్టెమ్మ మొగుడు (1993), శక్తి (2011) అని రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. అయితే చాలాకాలం తర్వాత మళ్లీ తెలుగు తెరపై సందడి చేసింది. చంద్రహాస్‌ హీరోగా నటించిన బరాబర్‌ ప్రేమిస్తా మూవీలో పూజా బేడీ కీలక పాత్రలో నటించింది. ఇటీవల ఈ సినిమా ఈవెంట్‌లో ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించింది పూజా బేడీ. 

నెగెటివ్‌ పాత్ర
ఆమె మాట్లాడుతూ.. శక్తి సినిమా నేను సోనూసూద్‌కు భార్యగా నటించాను. నాది ప్రతికూల ఛాయలున్న పాత్ర. ఓ సీన్‌లో హీరో నాతో ఫైట్‌ చేయాల్సి ఉంటుంది. అందుకు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒప్పుకోలేదు. ఆడవారితో ఫైట్‌ చేయలేనని నిరాకరించారు. అప్పుడు ఆయనపై గౌరవం మరింత పెరిగింది. ఇప్పుడున్న సినీప్రపంచంలో ఇలాంటి విలువలు పాటించేవాళ్లు చాలా అరుదు అని తెలిపింది.

తారక్‌ సినిమా
జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయానికి వస్తే ఆయన చివరగా వార్‌ 2లో కనిపించాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పాన్‌ ఇండియా మూవీ బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం తారక్‌.. ప్రశాంత్‌ నీల్‌తో డ్రాగన్‌ మూవీ చేస్తున్నాడు. అలాగే దేవర 2 సినిమా కూడా లైన్‌లో ఉంది.

చదవండి: అడ్జస్ట్‌ అవ్వాల్సిందే.. అమ్మతో అనేసరికి: నటి

Advertisement
 
Advertisement
Advertisement