అడ్జస్ట్‌మెంట్‌ తప్పదు.. అమ్మతో చెప్పేసరికి!: స్పైడర్‌ నటి | Assi actor Kani Kusruti Once Quit Acting, Reason is Inside | Sakshi
Sakshi News home page

కోరిక తీర్చాలని వేధింపులు.. సినిమాలు మానేసిన నటి!

Feb 6 2026 1:02 PM | Updated on Feb 6 2026 1:11 PM

Assi actor Kani Kusruti Once Quit Acting, Reason is Inside

మలయాళ నటి కని కుస్రుతి సొంత భాషతో పాటు తమిళ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్‌ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో స్పైడర్‌ మూవీలో విలన్‌ తల్లిగా యాక్ట్‌ చేసింది. తాజాగా ఈ నటి అస్సి అనే హిందీలో సినిమా యాక్ట్‌ చేసింది. ఇందులో అత్యాచార బాధితురాలిగా కనిపించనుంది. ఈ మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.

అంత ఈజీ కాదు
అయితే కుస్రుతి ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలనుకుంది. గతంలో ఈ విషయం గురించి కని మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీలో మంచి యాక్టర్‌ అవ్వాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. తీరా ఇక్కడికి వచ్చాక అదంత ఈజీ కాదని తెలుసుకున్నాను. కొందరు దర్శకనిర్మాతలు లైంగిక వాంఛలు తీర్చితే అవకాశాలిస్తామన్నారు. ఓపక్క అడ్జస్ట్‌ అవమని ఒత్తిళ్లు, మరోపక్క నటిగా పరిమితులు విధించేవారు. 

అమ్మతోనూ అదేమాట
కొందరైతే నేరుగా మా అమ్మతో మాట్లాడారు. ఫలానా సినిమాలో మీ కూతురు కనిపించాలంటే తను అడ్జస్ట్‌ అవ్వాల్సిందే అన్నారు. ఇవన్నీ భరించలేకపోయాను. ఈ ఇండస్ట్రీలో బతకడం కష్టమని వెనక్కు వచ్చేశాను. థియేటర్‌ డ్రామాలు చేసుకుంటూ పోయాను. కానీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా మళ్లీ సినిమాల్లోకి రావాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది.

సినిమా
కని కుస్రుతి  సినిమాల విషయానికి వస్తే.. 2003లో అన్యర్‌ మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. బిర్యానీ, కేరళ కేఫ్‌, గర్ల్స్‌ విల్‌ బి గర్ల్స్‌, ఆల్‌ వి ఇమాజిన్‌ ఆజ్‌ లైట్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది. కిల్లర్‌ సూప్‌, పోచర్‌, నాగేంద్రాస్‌ హనీమూన్‌ వెబ్‌ సిరీస్‌లలోనూ యాక్ట్‌ చేసింది.

చదవండి: నా కొడుకు దుబారా ఖర్చు చేస్తున్నాడా? బిల్లు చూపించు: సునీల్‌ శెట్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement