నా కొడుకు భారీగా ఖర్చు పెట్టిస్తున్నాడా? ఏదీ బిల్లు తీసుకురా.. | Suniel Shetty Slams Rumours That Linking Sanki Delay To Ahan Shetty Entourage, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Suniel Shetty: మీ తప్పు కప్పిపుచ్చుకునేందుకు నా కొడుకుపై దుష్ప్రచారం

Feb 6 2026 11:48 AM | Updated on Feb 6 2026 12:17 PM

Suniel Shetty Slams Rumours That Linking Sanki delay to Ahan Shetty Entourage

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమారుడు అహాన్‌ శెట్టి, హీరోయిన్‌ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం "సంకీ". సాజిద్‌ నజియావాలా నిర్మించిన ఈ సినిమా 2025లో రిలీజ్‌ అవ్వాల్సింది. కానీ, ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. దీనికి హీరో అహాన్‌ శెట్టియే కారణమంటూ రూమర్స్‌ మొదలయ్యాయి. అతడి మితిమీరిన ఖర్చుపై అసహనం వ్యక్తం చేసిన నిర్మాత సినిమాను అర్ధాంతరంగా ఆపేశాడని ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్‌ను సునీల్‌ శెట్టి ఖండించాడు. 

బిల్లు చూపించండి
ఆయన మాట్లాడుతూ.. నా కొడుక్కి అతడి పరిమితులేంటో తెలుసు. దాన్ని దాటి ఎప్పుడూ ఖర్చు చేయడదు. ఇదంతా ఉట్టి ప్రచారమే.. ఒకవేళ అహాన్‌ భారీగా ఖర్చు చేస్తున్నాడంటే నిర్మాత అందుకు సంబంధించిన బిల్లును తీసుకురమ్మనండి. దాని సంగతేంటో నేనూ చూస్తాను. వారి బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి అవతలివారిపై నిందలు వేయడం సమంజసం కాదు. ఇది మంచిది కాదు. బయటకు వెళ్లినప్పుడు అహాన్‌ చాలా జాగ్రత్తగా ఉంటాడు. 

ఇంటి నుంచే భోజనం
నేను సెట్‌కు వెళ్లినప్పుడు కూడా నా భోజనం, నీళ్లు నేనే తెచ్చుకుంటాను. నా సిబ్బందిని సెట్‌లో పెట్టిన ఆహారమే తినమని చెప్తాను. ఒకవేళ బయటి నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకుంటానంటే ఆ బిల్లు నేనే కడతాను, నిర్మాత కాదు! నా సిబ్బందే కాదు అహాన్‌ స్టాఫ్‌ (మేకప్‌ ఆర్టిస్ట్‌, హెయిర్‌ స్టయిలిస్ట్‌, ఇతరత్రా) కూడా ఇదే పాటిస్తారు. వాడు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చాడు. అలాంటివాడిపై కావాలనే ఇలాంటి నిందలేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అహాన్‌ శెట్టి 2021లో వచ్చిన తడప్‌ సినిమాతో నటుడిగా కెరీర్‌ ఆరంభించాడు. అతడు నటించిన రెండో చిత్రమే సంకీ. కానీ ఇది మధ్యలోనే ఆగిపోయింది. అహాన్‌ చివరగా బోర్డర్‌ 2 సినిమాలో నటించాడు.

Advertisement
 
Advertisement
Advertisement