హీరో అంటే కేవలం హీరోయిజమే కాదు: ఆనంద్‌ దేవరకొండ | Sri Chidambaram Garu Pre-Release Event | Sakshi
Sakshi News home page

హీరో అంటే కేవలం హీరోయిజమే కాదు: ఆనంద్‌ దేవరకొండ

Feb 6 2026 12:39 AM | Updated on Feb 6 2026 12:39 AM

Sri Chidambaram Garu Pre-Release Event

వంశీ, కీరవాణి, ఆనంద్, సంధ్య

‘‘నటీనటులకు తొలి సినిమా ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అలాగే యూనిట్‌ కష్టం కూడా తెలుసు. అందుకే ‘శ్రీ చిదంబరంగారు’ ఈవెంట్‌కి వచ్చాను. ఈ మూవీ టీజర్‌ ఎంతో నచ్చింది. హీరో అంటే కేవలం హీరోయిజమే కాదు. జనాలకు నమ్మకం కూడా ఇవ్వాలి. ఈ సినిమా ఇంటెన్షన్‌ అదే. ఈ మూవీలో హీరో  పాత్ర చేయడం చాలా కష్టం. కానీ, వంశీని చూశాక ఎంతో కన్విన్సింగ్‌గా అనిపించింది.

ఇలాంటి సినిమాలను మన ప్రేక్షకులు ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని హీరో ఆనంద్‌ దేవరకొండ తెలిపారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం ‘శ్రీ చిదంబరంగారు’. వినయ్‌ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గో పాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ మూవీని వంశీ నంది పాటి నేడు విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, ఆనంద్‌ దేవరకొండ, నిర్మాత, నటి నిహారిక కొణిదెల అతిథులుగా హాజరై, ‘శ్రీ చిదంబరం గారు’ సక్సెస్‌ అవ్వాలని ఆకాంక్షించారు. వంశీ నంది పాటి మాట్లాడుతూ– ‘‘ఇన్‌సెక్యూరిటీని దాటి జీవితంలో ఎలా ఎదగాలి అనేది ఈ చిత్రకథ. అన్నీ కోల్పోయాం అనుకునేవాళ్లకు స్ఫూర్తి, ధైర్యం నింపే సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘హీరో కావాలనే నా కల ‘శ్రీ చిదంబరంగారు’తో నెరవేరింది’’ అన్నారు వంశీ తుమ్మల.

Advertisement
 
Advertisement
Advertisement