ఉదయ్‌పూర్‌లో పెళ్లి | Vijay Deverakonda - Rashmika Mandanna are set to get married on February 26 in Udaipur | Sakshi
Sakshi News home page

ఉదయ్‌పూర్‌లో పెళ్లి

Feb 6 2026 12:04 AM | Updated on Feb 6 2026 12:04 AM

Vijay Deverakonda - Rashmika Mandanna are set to get married on February 26 in Udaipur

26న విజయ్‌–రష్మికల వివాహం

గత ఏడాది అక్టోబరులో విజయ్‌ దేవరకొండ – రష్మికా మందన్నాల నిశ్చితార్థం జరిగినప్పట్నుంచి వీరి వివాహ తేదీ ఎప్పుడు? అనే విషయంపై చర్చ మొదలైంది. ఈ నెల 26న ఈ ప్రేమికులు... భార్యాభర్తలు కానున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ వీరి పెళ్లికి వేదిక కానుంది. ఇంకా 20 రోజులే ఉన్నందున ఇటు విజయ్‌ అటు రష్మిక కుటుంబ సభ్యులు జోరుగా పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.

ఇరువైపు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది. అలాగే హైదరాబాద్‌లో మార్చి 4న సినీ, రాజకీయ ప్రముఖులు, ఇతర సన్నిహితుల కోసం గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇక గతంలో ‘గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాల్లో విజయ్‌–రష్మిక జంటగా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా వీరి కాంబినేషన్‌లో మూడో సినిమాగా ‘రణబాలి’ రూపొందుతోంది. ఈ చిత్రం సెప్టెంబరు 11న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement