వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం శ్రీ చిదంబరంగారు.ఈ మూవీకి వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిహారిక ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్‌తో పాటు నటులపై కొనియాడారు. మరి ముఖ్యంగా నిర్మాతలను ఉద్దేశించి మాట్లాడారు. సినిమా నిర్మించడం అనేది అంత సులభం కాదని అన్నారు. కమిటీ కుర్రోళ్లు లాంటి సినిమా నా వీపు మీద వేసుకున్నందుకు.. ఒక నిర్మాతకు ఉండే స్ట్రెస్ ఎలాంటిదో నాకు కూడా తెలుసన్నారు. మీలాంటి వాళ్లు ఇండస్ట్రీలోకి వస్తేనే సినిమా ఊపిరి తీసుకుంటుందని నా నమ్మకమని అన్నారు. ఎవరికైనా సరే మొదటి సినిమా ఫీలింగ్ అనేది లైఫ్‌లో ఎప్పటికీ రాదని మూవీ టీమ్‌ను ఉద్దేశించి మాట్లాడారు.
కమిటీ కుర్రాళ్లు నా వీపు మీద వేసుకున్నందుకు.. నాకు తెలుసు ఆ స్ట్రెస్ ఎలా ఉంటుంది అనేది#VamsiTummala #SandhyaVasishta #Gopinath #VinayRatnam pic.twitter.com/86RQYx2iTc
— Filmy Focus (@FilmyFocus) February 4, 2026


