'నన్ను ఛీ కొట్టిన సందర్భాలే ఎక్కువ'.. బిగ్‌బాస్ అమర్‌దీప్ | Bigg boss Amardeep Chowdary comments about His Career srtuggles | Sakshi
Sakshi News home page

Amardeep Chowdary: 'నా కెరీర్‌లో ఛీ కొట్టిన సందర్భాలే ఎక్కువ'.. బిగ్‌బాస్ అమర్‌దీప్

Feb 5 2026 4:21 PM | Updated on Feb 5 2026 4:59 PM

Bigg boss Amardeep Chowdary comments about His Career srtuggles

బిగ్‌బాస్‌ అమర్‌దీప్, సైలీ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎమ్‌ఎమ్‌ నాయుడు దర్శకత్వం వహించరు. కొమ్మాలపాటి శ్రీధర్‌ సమర్పణలో సాయి సుధాకర్‌  నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మైత్రీ మూవీస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ప్రెస్‌ మీట్ ‍నిర్వహించారు మేకర్స్.

ఈ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో అమర్ దీప్ తన కెరీర్ గురించి మాట్లాడారు. ఒక యూట్యూబర్‌గా తన జీవితం ప్రారంభించానని తెలిపారు. దాదాపు 13 ఏళ్ల పాటు అక్కడక్కడ చిన్న సినిమాలు చేస్తూ వచ్చానని వెల్లడించారు. ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు నన్ను ఛీ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. ఇవన్నీ చెప్పి నాపై సంపతీ క్రియేట్‌ చేయాలనే ఉద్దేశం లేదన్నారు. నా కష్టమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని అమర్‌దీప్‌ వెల్లడించారు. కాగా.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement