breaking news
Sumathi Shatakam Movie
-
రియల్ హీరోలను సత్కరించిన అర్జున్.. గిఫ్ట్‌గా రూ.లక్ష
ప్రముఖ నటుడు అర్జున్ దర్శకత్వం వహించిన కొత్త మూవీ ‘సీతాపయనం’ ఈ నెల 14న విడుదల కానుంది. ఆయన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముగ్గురు సామాజిక కార్యకర్తలను ఆహ్వానించడంతో పాటు సన్మానించారు. ఎంతోమందికి సాయపడుతున్న రియల్ హీరోలు మీరే అంటూ అర్జున్ వారిని గౌరవించారు. డాక్టర్ ప్రకాశ్ ఆమ్టే, ట్యాంక్‌బండ్ శివ, దుశ్చర్ల సత్యనారాయణలను వేదికపై పిలిచి సత్కరించారు. ఆపై ఒక్కొక్కరికి రూ.లక్ష కానుకగా ఇచ్చ తన మంచి మనుసు చూపించారు.డాక్టర్ మందాకిని ఆమ్టే మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వైద్యురాలు, సామాజిక కార్యకర్త. ఆమె భర్త డాక్టర్ ప్రకాష్ ఆమ్టేతో కలిసి, గడ్చిరోలిలోని హేమల్కసాలో మాడియా గోండ్ ఆదివాసీల కోసం లోక్ బిరాదరి ప్రకల్పం (Lok Biradari Prakalp) ద్వారా వైద్య, విద్యా సేవలను అందిస్తున్నారు. గాయపడిన, నిరాశ్రయమైన వన్యప్రాణుల సంరక్షణ చేపట్టారు. 2008లో ఈ సేవలకు గానూ ఆమెకు రామన్ మెగసెసే అవార్డు లభించగా ఆమె భర్త ప్రకాష్ ఆమ్టే సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో ఆయనకు పద్మశ్రీ అవార్డును అందించింది.ట్యాంక్ బండ్ శివ అనడం కంటే శవాల శివ అనగానే హైదరాబాద్‌లో ఇట్టే గుర్తుపడుతారు. తన తొమ్మిదేళ్ల వయసులోనే హుస్సేన్ సాగర్‌లో పడిపోయిన ఒకరిని కాపాడి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అప్పటి నుచి వందలాది మందిని ప్రాణాలతో రక్షించాడు. నిత్యం హుస్సేన్ సాగర్ చుట్టూ తిరుగుతూ వేలాది శవాలను బయటకు తీశారు. ఆపై వారికి తోచిన సాయం కూడా చేస్తారు.సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన పర్యావరణ పరిరక్షణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ గురించి తెలుగు రాష్ట్రాల వారకి సుపరిచయమే.. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన 70ఎకరాల్లో అడవినే సృష్టించి ఆశ్చర్యపరిచారు. అందులో దాదాపు 5 కోట్ల మొక్కలు నాటారు. గవర్నర్ ప్రతిభా పురస్కారం కూడా ఆయన అందుకున్నారు. -
ఇండస్ట్రీకి కొత్త హీరో దొరికాడు.. బిగ్ బాస్‌లో లాగా, సినిమాలో కూడా...
-
‘సుమతీ శతకం’ మూవీ రివ్యూ
బిగ్‌బాస్ షో తర్వాత బుల్లితెర హీరో అమర్దీప్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పలు టీవీ షోలతో పాటు సినిమా చాన్స్‌లు కూడా వస్తున్నాయి. బుల్లితెరపై ఓ మార్క్ వేసిన అమర్ దీప్ ఇప్పుడు హీరోగా ‘సుమతీ శతకం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..తూర్పు గోదావరి జిల్లాలోని వైకుంఠపురం గ్రామానికి చెందిన కృష్ణ (అమర్ దీప్)కి పెళ్లిపై చాలా ఆశలు ఉంటాయి. ఊర్లోనే ఉంటూ కిరాణ కొట్టు నడుపుతుండడంతో అతనికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. ఊర్లో జరిగే జాతరలో అందరి సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకుంటానంటూ నాన్నమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టలేకపోతోన్నందుకు కృష్ణ బాధపడుతుంటాడు. అలాంటి సమయంలో పక్క గ్రామానికి అంగన్వాడీ టీచర్‌గా వచ్చిన సుమతి(శైలి చౌదరి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. మరి కిరాణం కొట్టు నడిపే కృష్ణతో సుమతీ ఎలా ప్రేమలో పడింది? పెళ్లికి ఆమె పెట్టిన కండీషన్ ఏంటి? చివరకు కృష్ణ పెళ్లి జరిగిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఈ విలేజ్ లవ్‌స్టోరీకి భక్తి, సందేశాత్మక అంశాలు మేళవించి కమర్షియల్ పంథాలో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఎంఎం నాయుడు. ప్రారంభంలో కాస్త కథ ట్రాక్ తప్పినట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్‌కి కథలో లీనమయ్యేలా ప్రేక్షకుడ్ని కట్టి పడేస్తారు. అయితే ఇందులో ట్విస్ట్స్ పెద్దగా లేకపోవడం, ఊహకందేలా సాగడం, విలనిజం కూడా గట్టిగా పండకపోవడంతో ఈ సినిమాకు మైనస్.అయితే ఎమోషనల్ సన్నివేశాలతో ఆ లోపాలను కొంతమేర కప్పిపుచ్చారు.పెళ్లి చుట్టూ రాసుకున్న కథ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, ఎమోషన్ ఇలా అన్నింటినీ సమపాళ్లలో చూపించారు. కానీ ముందుగా చెప్పినట్లుగా ఊహకందేలా కథనం సాగడంతో కథనం రక్తి కట్టించదు. సరదాగా, సాఫీగా సాగే గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మక కథలు ఇష్టపడే ప్రేక్షకులను ఈ చిత్రం నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే.. కృష్ణ పాత్రకు అమర్దీప్ న్యాయం చేశాడు. పల్లెటూరి యువకుడిగా కృష్ణ పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ శైలి చౌదరి నటన పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఊరి ప్రెసిడెంట్‌గా మహేష్ విట్టా, హీరో స్నేహితుడిగా టేస్టీ తేజ కొన్ని సీన్లలో నవ్వులు పూయించారు. మిగతా ఆర్టిస్టులు తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కెమెరా వర్క్ బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని ఎంతో అందంగా చూపించారు. ఈ చిత్రంలోని చాలా విజువల్స్ బాగుంటాయి. రూరల్ బ్యాక్‌డ్రాప్‌ను సినిమాటోగ్రాఫర్ ఎస్ హాలేష్ బాగా క్యాప్చర్ చేశారు. సుభాష్ ఆనంద్ ఇచ్చిన పాటల్లో పల్లెటూరి ఫీల్ వచ్చింది. నిర్మాత సాయి సుధాకర్ కొమ్మాలపాటి ఖర్చు విషయంలో రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. రేటింగ్: 2.75/3 -
'నన్ను ఛీ కొట్టిన సందర్భాలే ఎక్కువ'.. బిగ్‌బాస్ అమర్దీప్
బిగ్‌బాస్ అమర్దీప్, సైలీ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎమ్ఎమ్ నాయుడు దర్శకత్వం వహించరు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.ఈ ఈవెంట్లో పాల్గొన్న హీరో అమర్ దీప్ తన కెరీర్ గురించి మాట్లాడారు. ఒక యూట్యూబర్‌గా తన జీవితం ప్రారంభించానని తెలిపారు. దాదాపు 13 ఏళ్ల పాటు అక్కడక్కడ చిన్న సినిమాలు చేస్తూ వచ్చానని వెల్లడించారు. ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు నన్ను ఛీ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. ఇవన్నీ చెప్పి నాపై సంపతీ క్రియేట్ చేయాలనే ఉద్దేశం లేదన్నారు. నా కష్టమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని అమర్దీప్ వెల్లడించారు. కాగా.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు.అవకాశాల కోసం తిరుగుతూ ఛీ కొట్టించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.. ఇదేదో సింపతీ కోసం చెప్పడం లేదు#AmardeepChowdary #SaylimChaudhari #SumathiSathakam pic.twitter.com/WmxM6pwUdO— Filmy Focus (@FilmyFocus) February 5, 2026 -
'ఒక్క ఛాన్స్ ప్లీజ్'.. అనుకున్నంత ఈజీ కాదు!
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే పదుల సంఖ్యలో హీరోలున్నారు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు వస్తూనే ఉన్నారు. ఈ వారం కూడా తెలుగు బిగ్‌బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా పరిచయమవుతున్న 'సుమతీ శతకం' అనే మూవీ విడుదలకు సిద్ధమైంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని వేడుకుంటున్న అమర్దీప్.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడు? అసలు ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? గతంలో బిగ్‌బాస్ నుంచి వచ్చి హీరోలు అయినవాళ్లు ఎక్కడున్నారు?ఇండస్ట్రీలో హీరోగా నిలబడటం అంత సులభం కాదు. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో ఫేమ్ తెచ్చుకుంటున్న సొహైల్, సన్నీ లాంటి వాళ్లు.. ఆ క్రేజ్ నిజమనుకుని హీరోలుగా పలు మూవీస్ చేశారు. కాకపోతే రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ మూవీసే చేయడంతో అవి సక్సెస్ కాలేదు. దీంతో కొన్నాళ్లకే ఇండస్ట్రీని పూర్తిగా వదిలేశారు. అమర్దీప్ కూడా కొన్నిరోజుల క్రితం ఇదే చెప్పాడు. బిగ్‌బాస్ ఓట్లు దేనికీ పనికిరావు అని అన్నాడు. కానీ ఇండస్ట్రీలో పరిస్థితులు కొత్త హీరోలకు కలిసొచ్చేలా ఉన్నాయా అంటే లేవనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)ఎందుకంటే పాన్ ఇండియా కల్చర్ విపరీతంగా పెరిగిపోయిన తర్వాత తెలుగు ఆడియెన్స్.. చిన్న సినిమాలని అందులోనూ రొటీన్ కమర్షియల్ చిత్రాలు చూసేందుకు మునుపటిలా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అమర్దీప్ 'సుమతీ శతకం' ట్రైలర్ చూస్తుంటే ఇది కూడా సాధారణ సినిమాలానే అనిపిస్తుంది. దానికితోడు ఈ వారం దాదాపు 10 వరకు మూవీస్, థియేటర్లలోకి రానున్నాయి. వీటన్నింటిని దాటుకుని అమర్దీప్ చిత్రానికి ప్రేక్షకులు వస్తారా అనేది చూడాలి.అలానే రీసెంట్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన అమర్దీప్.. 'ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్.. నేనేంటో చూపిస్తా. ఇది హిట్ కాకపోతే మరెప్పుడు ఇలా ఒక్క ఛాన్స్ అని అడగను. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. సుమతీ శతకం చూస్తారు. నేనేంటో మీకు తెలుస్తుంది' అని అన్నాడు. మరి ఈ మాట మీద ఎంతవరకు నిలబడతాడో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?) -
'ఆల్రెడీ హీరోలున్నారు కదా.. నువ్వెందుకురా అనుకోవచ్చు'
బిగ్‌బాస్ అమర్దీప్, సైలీ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎమ్ఎమ్ నాయుడు దర్శకత్వం వహించరు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ నిర్మించారు. ఇటీవలే ఈ మూవీ నుంచి 'నా కుట్టీ కుట్టీ సుమతీ.. నా చిట్టీ చిట్టీ సుమతీ' అంటూ సాగే లవ్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అమర్దీప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చానని అన్నారు. అనంతపురం నుంచి వచ్చిన వ్యక్తిని.. రామ అనే పేరుతో మీ అందరికీ పరిచయమే.. అందుకే నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చారు. ఆల్రెడీ హీరోలున్నారు కదా.. నువ్వెందుకురా అని మీరందరూ అనుకోవచ్చు.. కానీ దీనికి నా దగ్గర సమాధానం ఉందన్నారు. ఇది రేపొద్దున కాదు అంటే.. అప్పుడు నన్ను మీరు ట్రోల్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అన్నారు. కానీ మీకు ఆ అవకాశం ఇవ్వకుండా చేశానని తెలిపారు. ఈ మూవీ కోసం ప్రాణం పెట్టి చేశానని అమర్దీప్ చౌదరి పేర్కొన్నారు. కాగా.. ఈ సినిమా మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు. "హీరోలున్నారు కదా.. నువ్వెందుకురా అనుకోవచ్చు"'నేను ఎందుకురా' అనేదానికి ఇందులో ఫుల్ సమాధానం ఉంది!!"రేప్పొద్దున కాదు ఇది లేదు అంటే అప్పుడు మాట్లాడండి బ్రదర్స్.. అప్పుడు ట్రోల్ చేయండి సిస్టర్స్"- #Amardeep గారు #SumathiSathakam pic.twitter.com/hxka7yk0CH— Mega Abhimani (@megaabhimani3) January 29, 2026 -
బిగ్‌బాస్ అమర్దీప్ సుమతీ శతకం.. ట్రైలర్ వచ్చేసింది
బిగ్‌బాస్ అమర్దీప్, సైలీ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎమ్ఎమ్ నాయుడు దర్శకత్వం వహించరు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ నిర్మించారు. ఇటీవలే ఈ మూవీ నుంచి 'నా కుట్టీ కుట్టీ సుమతీ.. నా చిట్టీ చిట్టీ సుమతీ' అంటూ సాగే లవ్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్కూల్ టీచర్లో ప్రేమాయణం నడిపించిన యువకుడి స్టోరీలా ట్రైలర్లో కనిపిస్తోంది. కాగా.. ఈ సినిమా మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు. -
మిడిల్ క్లాస్ కుర్రాడు
అమర్దీప్, సైలీ జంటగా నటించిన చిత్రం ‘సుమతీ శతకం’. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో ఎమ్ఎమ్ నాయుడు దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.ఈ సినిమా నుంచి అమర్ దీప్ ఫస్ట్‌లుక్‌పోస్టర్ విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిలా అమర్దీప్ కనిపిస్తారు. దసరాకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే లక్ష్యంతో ఉన్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
బిగ్‌బాస్ ఫేం అమర్దీప్ కొత్త సినిమా షురూ
బిగ్‌బాస్ షోతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నటుడు అమర్దీప్ చౌదరి కొత్త సినిమా ‘సుమతీ శతకం’ ఘనంగా ప్రారంభమైంది. సన్నీ లియోన్ నటించిన ‘మందిర’ చిత్రంతో విజయం సాధించిన విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో, కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఎం.ఎం. నాయుడు దర్శకుడిగా తొలి అడుగు వేస్తున్నారు. ఈ చిత్రంలో అమర్దీప్ చౌదరి, సైలీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా అమరావతిలోని వైకుంటపురం విలేజ్ టెంపుల్లో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తం కార్యక్రమంలో చిత్ర తారాగణం, సిబ్బందితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టగా, వెన్నా సాంబశివారెడ్డి కెమెరా స్విచాన్ చేశారు.‘సుమతీ శతకం’ కథను బండారు నాయుడు అందించగా, సుభాష్ ఆనంద్ సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రఫీని హాల్‌స్వామి, ఎడిటింగ్‌ను సురేష్ విన్నకోట నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని నిర్మాతలు ప్రకటించారు.


