బిగ్‌బాస్ అమర్‌దీప్, సైలీ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎమ్‌ఎమ్ నాయుడు దర్శకత్వం వహించరు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ నిర్మించారు. ఇటీవలే ఈ మూవీ నుంచి 'నా కుట్టీ కుట్టీ సుమతీ.. నా చిట్టీ చిట్టీ సుమతీ' అంటూ సాగే లవ్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్కూల్ టీచర్‌లో ప్రేమాయణం నడిపించిన యువకుడి స్టోరీలా ట్రైలర్‌లో కనిపిస్తోంది. కాగా.. ఈ సినిమా మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు.


