ఓటీటీలో దూసుకెళ్తోన్న ఓజీ హీరోయిన్‌ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Priyanka Mohan Latest Movie Made in Korea top Trending in Ott | Sakshi
Sakshi News home page

Priyanka Mohan: టాప్‌ ప్లేస్‌లో ఓజీ హీరోయిన్‌ మూవీ.. టాలీవుడ్ నిర్మాత ప్రశంసలు

Mar 15 2026 7:08 PM | Updated on Mar 15 2026 7:08 PM

Priyanka Mohan Latest Movie Made in Korea top Trending in Ott

ఓజీ హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మేడ్‌ ఇన్‌ కొరియా. ఆర్‌.ఏ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది.  తన కోరికతో కొరియా వెళ్లిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు.

ప్రస్తుతం ఈ మూవీపై పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కోలీవుడ్ ప్రమఖులు ముఖ్యంగా ప్రియాంక మోహన్‌ నటనను కొనియాడుతున్నారు. తాజాగా ఈ చిత్రంపై టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం ట్వీట్ చేశారు. మనసుకు నచ్చే అద్భుతమైన కథనం, దృశ్యాలు, ప్రియాంక మోహన్ పాత్రలోని అమాయకత్వం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. ప్రియాంక మోహన్‌ చాలా అద్భుతంగా నటించారని అన్నారు. డైరెక్టర్‌తో పాటు చిత్రబృందానికి అభినందనలు చెబుతూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

నంబర్‌వన్‌గా ట్రెండింగ్..

ఈనెల 12న స్ట్రీమింగ్‌ వచ్చేసిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమాల జాబితాలో నంబర్‌వన్‌గా ట్రెండ్ ‍అవుతోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement