Made In Korea Movie
-
'ఒత్తిడిలో మెడిసిన్‌లా ఈ సినిమా..' డైరెక్టర్‌పై నాగార్జున ప్రశంసలు
మేడ్ ఇన్ కొరియా మూవీపై టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా డైరెక్టర్ ఆర్ఏ కార్తీక్‌ను అభినందించారు. ఈ స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఈ మూవీని ఇప్పుడే చూశానని.. పూర్తిగా అస్వాదించానంటూ ట్వీట్ చేశారు. ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇలాంటి సినిమా మంచి మెడిసిన్‌గా పనిచేస్తుందని నాగ్ కొనియాడారు. ఈ సినిమాలో మెప్పించిన ప్రియాంక మోహన్‌ను ప్రత్యేకంగా అభినందించారు.కొరియన్ కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఈ మూవీలో ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించింది. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో నంబర్‌వన్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాను ఇప్పటికే టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రశంసించారు. Congratulations to my director @Rakarthik_dir for this uplifting film feel good #MadeinKorea on Netflix!! Totally enjoyed it 😊the right medicine for these stressful times💐 special shout out to @priyankaamohan https://t.co/vV5Kqa3Pdq— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 17, 2026 -
ఓటీటీలో దూసుకెళ్తోన్న ఓజీ హీరోయిన్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. తన కోరికతో కొరియా వెళ్లిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు.ప్రస్తుతం ఈ మూవీపై పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కోలీవుడ్ ప్రమఖులు ముఖ్యంగా ప్రియాంక మోహన్ నటనను కొనియాడుతున్నారు. తాజాగా ఈ చిత్రంపై టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం ట్వీట్ చేశారు. మనసుకు నచ్చే అద్భుతమైన కథనం, దృశ్యాలు, ప్రియాంక మోహన్ పాత్రలోని అమాయకత్వం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. ప్రియాంక మోహన్ చాలా అద్భుతంగా నటించారని అన్నారు. డైరెక్టర్‌తో పాటు చిత్రబృందానికి అభినందనలు చెబుతూ ట్విటర్లో పోస్ట్ చేశారు.నంబర్‌వన్‌గా ట్రెండింగ్..ఈనెల 12న స్ట్రీమింగ్ వచ్చేసిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమాల జాబితాలో నంబర్‌వన్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. #MadeInKorea… Such a Warm, feel-good storytelling with lovely visuals. The small-town innocence of @priyankaamohan’s character stands out.. she delivered a beautiful performance… @Rakarthik_dir keeps it simple and engaging! Congratulations to the entire team 🫶 @NetflixIndia… pic.twitter.com/a3jKrMKep1— Naga Vamsi (@vamsi84) March 15, 2026 -
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్
వచ్చేవారం ఉగాది కానుకగా 'ధురంధర్ 2', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ఈ వారం బాక్సాఫీస్‌ని ఖాళీగానే వదిలేశారు. రావాల్సిన 'బ్యాండ్ మేళం' కూడా వాయిదా పడింది. దీంతో కొత్త మూవీసేం రావట్లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం స్టార్ హీరోలు చేసిన తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి. మొత్తంగా 15 వరకు ఉండటం విశేషం.(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!)ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', విశ్వక్ సేన్ 'ఫంకీ', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు జూటోపియా 2, ద తాజ్ స్టోరీ మూవీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 9 నుంచి 15 వరకు)నెట్ఫ్లిక్స్వన్ పీస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 10మేడిన్ కొరియా (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 12వర్జిన్ రివర్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 12ఫంకీ (తెలుగు సినిమా) - మార్చి 12అమెజాన్ ప్రైమ్ఆస్పిరెంట్స్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మార్చి 13లోకల్ టైమ్స్ (తమిళ సిరీస్) - మార్చి 13హాట్స్టార్రిసార్ట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మార్చి 13ద సొసైటీ సీజన్ 2 (హిందీ రియాలిటీ సిరీస్) - మార్చి 09జూటోపియా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 13ద ఫ్యామిలీ మెక్‌ములెన్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15జీ5పూకీ (తమిళ సినిమా) - మార్చి 13భర్త మహాశయులకు విజ్ఞప్తి (తెలుగు మూవీ) - మార్చి 13అంధ ప్యార్ 2.0 (రియాలిటీ షో) - మార్చి 14లయన్స్ గేట్ ప్లేద తాజ్ స్టోరీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 13ఎమ్ఎక్స్ ప్లేయర్సంకల్ప్ (హిందీ సిరీస్) - మార్చి 11సన్ నెక్స్ట్నాంగళ్ (తమిళ సినిమా) - మార్చి 13ఫ్రైడే (తమిళ మూవీ) - మార్చి 13(ఇదీ చదవండి: నటుడు పార్తిబన్ పరువు తీసేసిన త్రిష.. ట్వీట్ వైరల్) -
ఓజీ హీరోయిన్ ఓటీటీ మూవీ.. ఎమోషనల్‌గా ట్రైలర్
మొబైల్ ఫోన్ వినియోగం పెరిగాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చింది. అలాగే ఓటీటీలు వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ అంతా ఎంచక్కా ఉన్నచోటునే చూసే అవకాశం లభించింది. అలా చాలామంది కొరియన్ సినిమాలు, సిరీస్‌లకు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా కొందరమ్మాయిలైతే బానిసలైపోయారు!ఓటీటీ సినిమాదీంతో ఈ కొరియన్ కాన్సెప్ట్‌తో ఓ మూవీ తీశారు. ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ వదిలారు. అందులో ఓ అమ్మాయికి చిన్నప్పటినుంచి కొరియా అంటే చాలా ఇష్టం. కనీసం ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలన్నది తన కోరిక. అనుకున్నట్లుగా పెద్దయ్యాక ఎలాగోలా కొరియా వెళ్తుంది. కానీ అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అదే ట్రైలర్లో చూపించారు.మనసు చెప్పేది వినండిమనకు నచ్చిన పనిచేయడం కోసం ఎంతదూరమైనా వెళ్లొచ్చు. నీవల్ల కాదు అంటారు. తెలియనివారు మనపై ప్రేమ చూపిస్తారు.. బాగా తెలిసినవారు మనల్ని బాధపెడతారు. ఎంత ఏడ్చినా, ఎంత నవ్వినా.. మనల్ని చీరప్ చేసి మేమున్నామంటూ మనకోసం నలుగురు వస్తారు. ఈ అనుభవాల్ని మీకు ఎదురవ్వాలంటే మీ మనసు చెప్పేది వినండి అని హీరోయిన్ చెప్పే డైలాగ్ బాగుంది. మేడ్ ఇన్ కొరియా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 12న విడుదల కానుంది. చదవండి: ఆస్తుల్లేవ్.. అద్దె ఇంట్లో ఉంటున్నా: వరలక్ష్మి -
'ఓజీ' హీరోయిన్ కొరియన్ కాన్సెప్ట్ మూవీ.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్
ఓటీటీ కల్చర్ పెరిగిన తర్వాత కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేవాళ్లు, ఇష్టపడే వాళ్ల సంఖ్య బాగానే ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు.. వీటిపట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ కొరియన్ కాన్సెప్ట్ మూవీలో 'ఓజీ' ఫేమ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ లీడ్ రోల్ చేసింది. ఇప్పుడీ చిత్ర స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో తీసిన తమిళ సినిమా 'మేడిన్ కొరియా'. దీన్ని ఓటీటీ కోసమే రూపొందించారు. ఆర్ఏ కార్తీక్ దర్శకత్వం వహించాడు. గత నెలలో ఈ చిత్ర గురించి ప్రకటన రాగా ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. వచ్చే నెల 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.చిన్నప్పటి నుంచి కొరియా అంటే ఇష్టం పెంచుకున్న ఓ అమ్మాయి.. పెరిగి పెద్దయిన తర్వాత అనుకున్నట్లే కొరియా వెళ్తుంది. ఆ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది? చివరకు ఏం తెలుసుకుంది అనేదే స్టోరీలా అనిపిస్తుంది. గత నెలలో టీజర్ రిలీజ్ చేశారు. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తే కాన్సెప్ట్‌పై ఇంకాస్త క్లారిటీ రావొచ్చు.ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రానున్నాయి. వాటిలో నవీన్ చంద్ర 'హనీ', అక్యూజ్డ్ అనే డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. అలానే డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, రోస్లిన్ అనే వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇవి కాకుండా మరేవైనా సర్ప్రైజ్ చిత్రాలు కూడా అందుబాటులోకి రావొచ్చేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. 'హాట్‌స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ) -
2026పై నెట్‌ఫ్లిక్స్ దండయాత్ర.. ఇన్ని సినిమాలు, సిరీస్‌లా?
ఇప్పుడు ఓటీటీ జమానా నడుస్తోంది. ఏ సినిమాని థియేటర్లో చూడాలి? దేన్ని ఓటీటీలో చూడాలని ముందే ఫిక్సయిపోతున్నారు. చిన్న మూవీస్‌ని చాలా వరకు ఓటీటీల్లోనే చూసేందుకు బాగా అలవాటు పడిపోయారు. అందుకే తెలుగు చిన్న చిత్రాల పరిస్థితి దారణంగా తయారైంది. మరోవైపు ఆయా ఓటీటీ సంస్థలు కూడా ఒరిజినల్ కంటెంట్‌తో రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే తెలుగులో, తమిళంలో పేరున్న చిత్రాల హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. ఈ ఏడాది దాదాపు 30 వరకు ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్‌లతో రాబోతుంది. ముంబైలో మంగళవారం సాయంత్రం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన ఈ సంస్థ.. 2026లో వచ్చే తమ అప్‌కమింగ్ ప్రాజెక్టుల గురించి బయటపెట్టింది.(ఇదీ చదవండి: మహేశ్‌తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్‌పై క్లారిటీ)ఆనంద్ దేవరకొండ 'తక్షకుడు', సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బు', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' లాంటి సినిమాలతో పాటు చాలానే మూవీస్, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ డబ్బింగ్‌తో రాబోతున్నాయి. హిందీలో మీడియం రేంజ్ స్టార్స్ అందరూ కూడా వీటిలో నటించడం విశేషం. ఇంతకీ ఏ సినిమాలు, సిరీస్‌లు.. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది రాబోతున్నాయంటే?తక్షకుడు (తెలుగు సినిమా) - ఆనంద్ దేవరకొండసూపర్ సుబ్బు (తెలుగు సిరీస్) - సందీప్ కిషన్మేడిన్ కొరియా (తమిళ సినిమా) - ప్రియాంక మోహన్లవ్ (తమిళ సిరీస్) - ఐశ్వర్య లక్ష్మి, అర్జున్ దాస్ఫ్యామిలీ బిజినెస్ (హిందీ సిరీస్) - అనిల్ కపూర్, విజయ్ వర్మహమ్ హిందుస్థానీ (హిందీ సినిమా) - సైఫ్ అలీఖాన్, ప్రతీక్ గాంధీహలో బచ్చోన్ (హిందీ సిరీస్) - వినీత్ కుమార్ సింగ్, గిరిజా ఓక్కొహ్రా సీజన్ 2 (హిందీ సిరీస్) - మోనా సింగ్, బరుణ్ సోబ్తితలాష్: ఏ మదర్స్ సెర్చ్(హిందీ సిరీస్) - పరిణీతి చోప్రాఇక్కా (హిందీ సినిమా) - సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నామిస్ మ్యాచ్డ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - ప్రజక్తా కోలీ, రోహిత్ షరాఫ్ముసాఫిర్ కేఫే (హిందీ సిరీస్) - విక్రాంత్ మస్సే, వేదికా పింటోలస్ట్ స్టోరీస్ 3 (హిందీ సిరీస్) - రాధిక ఆప్టే, కొంకన్ సేన్ శర్మటోస్టర్ (హిందీ మూవీ) - రాజ్ కుమార్ రావ్, సన్యా మల్హోత్రామా బెహన్ (హిందీ సినిమా) - మాధురీ దీక్షిత్, తృప్తి దిమ్రిచుంబక్ (హిందీ సిరీస్) - నీనా గుప్తాద గ్రేట్ ఇండియా కపిల్ షో సీజన్ 5 (కామెడీ షో) - కపిల్ శర్మమామ్లా లీగల్ హై సీజన్ 2 (హిందీ సిరీస్) - రవి కిషన్గాంధారి (హిందీ సినిమా) - తాప్సీ, ఇష్వాక్ సింగ్గ్లోరీ (హిందీ సిరీస్) - దివ్యేందు, పులకిత్ సామ్రాట్గోస్కోర్ పండిట్ (హిందీ సినిమా) - మనోజ్ బాజ్‌పాయ్, శ్రద్ధాదాస్లెగసీ (తమిళ సిరీస్) - మాధవన్, అభిషేక్ బెనర్జీకర్తవ్య (హిందీ సినిమా) - సైఫ్ అలీఖాన్, రషిక దుగల్ఆపరేషన్ సఫేద్ సాగర్ (హిందీ సిరీస్) - సిద్ధార్థ్లాకప్ (రియాలిటీ సిరీస్) - ఏక్తా కపూర్, శోభా కపూర్దిండోరా 2 (హిందీ సిరీస్) - భువన్ బామ్, రోహిత్హే దిల్ సున్ రహా హై (హిందీ సిరీస్) - కపిల్ శర్మదేశీ బ్లింగ్ (హిందీ రియాలిటీ షో) - కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాశ్అక్యూజ్డ్ (హిందీ సిరీస్) -కొంకన్ సేన్ శర్మ, ప్రతిభ రత్న(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్) -
కొత్త తెలుగు సినిమాలు.. డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లే జనాలు వెళ్తూనే ఉన్నారు. కాకపోతే చాలామంది.. ఓటీటీలో రిలీజైన తర్వాతే మొబైల్ లేదా టీవీల్లో కొత్త సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సంస్థలు కూడా కేవలం ఓటీటీల్లో కొన్నింటిని నేరుగా విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు అలానే నెట్‌ఫ్లిక్స్ సంస్థ తమ దానిలో రాబోయే పలు తెలుగు, తమిళ చిత్రాలు, వెబ్ సిరీసుల గురించి అధికారిక ప్రకటన చేసింది.'ఓజీ'తో రీసెంట్గా హిట్ కొట్టిన ప్రియాంక మోహన్ చేసిన తమిళ మూవీ 'మేడ్ ఇన్ కొరియా'. గత కొన్నాళ్ల నుంచి కొరియన్ చిత్రాలు, సిరీస్‌లకు చాలామంది అమ్మాయిలు ఫ్యాన్స్ అయిపోతున్నారు. అలాంటి ఓ అమ్మాయి కొరియా వెళ్లిన తర్వాత ఏం జరిగిందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీసినట్లు కనిపిస్తుంది. ఆర్ఏ కార్తీక దీనికి దర్శకుడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)ఆనంద్ దేవరకొండ, 'లాపతా లేడీస్' ఫేమ్ నితాన్షీ గోయల్ జంటగా నటించిన సినిమా 'తక్షకుడు'. వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు అనే ట్యాగ్ లైన్‌తో రాబోతుంది. పోస్టర్ చూస్తుంటే ఇదో రూరల్ బ్యాక్ డ్రాప్లో జరిగే యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. గతంలో ఆనంద్ దేవరకొండతోనే 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే మూవీ తీసిన వినోద్ అనంతోజు దీనికి దర్శకుడు.సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సిరీస్ 'సూపర్ సుబ్బు'. మిథిలా పాల్కర్, మురళీ శర్మ ఇతర పాత్రలు చేస్తున్నారు. ఓ టీచర్.. పల్లెటూరికి వెళ్లి స్కూల్లో పిల్లలకు సె*క్స్ ఎడ్యుకేషన్ నేర్పించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఫన్నీగా చూపించబోతున్నారు. ఎనిమిది నెలల క్రితం ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రాలన్నీ కూడా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే స్ట్రీమింగ్ కాబోతున్నాయని చెప్పారు. మరి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తారా? వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తారా అనేది చూడాలి.(ఇదీ చదవండి: Bigg Boss 9: ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?)


