ఓజీ హీరోయిన్‌ ఓటీటీ మూవీ.. ఎమోషనల్‌గా ట్రైలర్‌ | OTT: Priyanka Mohan Made in Korea Movie Trailer Released | Sakshi
Sakshi News home page

'మేడ్‌ ఇన్‌ కొరియా' ట్రైలర్‌: తెలిసినవాళ్లే బాధపెడతారు!

Mar 4 2026 9:11 PM | Updated on Mar 4 2026 9:11 PM

OTT: Priyanka Mohan Made in Korea Movie Trailer Released

మొబైల్‌ ఫోన్‌ వినియోగం పెరిగాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చింది. అలాగే ఓటీటీలు వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ అంతా ఎంచక్కా ఉన్నచోటునే చూసే అవకాశం లభించింది. అలా చాలామంది కొరియన్‌ సినిమాలు, సిరీస్‌లకు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా కొందరమ్మాయిలైతే బానిసలైపోయారు!

ఓటీటీ సినిమా
దీంతో ఈ కొరియన్‌ కాన్సెప్ట్‌తో ఓ మూవీ తీశారు. ఓజీ హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మేడ్‌ ఇన్‌ కొరియా. ఆర్‌.ఏ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్‌ వదిలారు. అందులో ఓ అమ్మాయికి చిన్నప్పటినుంచి కొరియా అంటే చాలా ఇష్టం. కనీసం ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలన్నది తన కోరిక. అనుకున్నట్లుగా పెద్దయ్యాక ఎలాగోలా కొరియా వెళ్తుంది. కానీ అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.  అదే ట్రైలర్‌లో చూపించారు.

మనసు చెప్పేది వినండి
మనకు నచ్చిన పనిచేయడం కోసం ఎంతదూరమైనా వెళ్లొచ్చు. నీవల్ల కాదు అంటారు. తెలియనివారు మనపై ప్రేమ చూపిస్తారు.. బాగా తెలిసినవారు మనల్ని బాధపెడతారు. ఎంత ఏడ్చినా, ఎంత నవ్వినా.. మనల్ని చీరప్‌ చేసి మేమున్నామంటూ మనకోసం నలుగురు వస్తారు. ఈ అనుభవాల్ని మీకు ఎదురవ్వాలంటే మీ మనసు చెప్పేది వినండి అని హీరోయిన్‌ చెప్పే డైలాగ్‌ బాగుంది. మేడ్‌ ఇన్‌ కొరియా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 12న విడుదల కానుంది.

 

చదవండి: ఆస్తుల్లేవ్‌.. అద్దె ఇంట్లో ఉంటున్నా: వరలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement