నాకంటూ పెద్దగా ఆస్తుల్లేవ్‌.. అద్దింట్లో ఉంటున్నా: వరలక్ష్మి | Actress Varalakshmi Sarathkumar about Her Properties | Sakshi
Sakshi News home page

పెళ్లికి రూ.800 కోట్ల ఖర్చుపై రియాక్షన్‌.. వాళ్లందరికీ బంగారు నాణెం!

Mar 4 2026 8:06 PM | Updated on Mar 4 2026 8:15 PM

Actress Varalakshmi Sarathkumar about Her Properties

ఇప్పటివరకు హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేసిన వరలక్ష్మి శరత్‌కుమార్‌ సరస్వతి చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూ హాజరైన వరలక్ష్మి అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది.

రాజకీయాల్లోకి వస్తా..
నాకంటూ పెద్ద ప్రాపర్టీలు ఏం లేవు. ప్రస్తుతం అద్దె ఇంట్లోనే ఉన్నాను. నా సంపాదనతో నాకంటూ ఒక కారు కొనుక్కున్నాను. అలాగే ఒక చిన్న ఇల్లు కొన్నానంతే! భారీగా ఆస్తులుంటే ఇక్కడెందుకు ఉంటాను? ఇకపోతే నాకు రాజకీయాలంటే ఇష్టం. యువత రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా భవిష్యత్తులో తమిళనాడులో లేదా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.

పెళ్లికి రూ.800 కోట్ల ఖర్చు
సరస్వతి సినిమా విషయానికి వస్తే.. షూటింగ్‌ అయిపోయాక చిత్రయూనిట్‌ అందరికీ ఒక బంగారు నాణెం బహుమతిగా ఇచ్చాను. కాగా నన్ను తమిళ చిత్రపరిశ్రమ సరిగ్గా వాడుకోలేదు. నాలుగైదు సినిమాలు మినహా తర్వాత అక్కడ ఎవరూ నా టాలెంట్‌ను పట్టించుకోలేదు అని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. తనపై వచ్చిన ఓ ఆసక్తికర రూమర్‌ గురించి చెప్తూ.. నా పెళ్లికి రూ.800 కోట్ల ఖర్చయిందని సోషల్‌ మీడియాలో రాశారు. అది చూసి బాగా నవ్వుకున్నాను. నా దగ్గర అంత డబ్బుంటే నేనెందుకు ఇక్కడుంటాను? అని వరలక్ష్మి నవ్వేసింది.

చదవండి: ఒంటరితనం భరించలేకున్నా.. తోడు కావాలి: నటి

Advertisement
 
Advertisement
Advertisement