రష్మిక కోసం విజయ్ చేసిన ఫస్ట్ ట్వీట్ ఏంటో తెలుసా? | Vijay Devarakonda First Tweet About Rashmika | Sakshi
Sakshi News home page

Rashmika: మీ బరువు బాధ్యత నాదే మేడమ్.. పాత ట్వీట్ వైరల్

Mar 4 2026 4:43 PM | Updated on Mar 4 2026 4:48 PM

Vijay Devarakonda First Tweet About Rashmika

డెస్టినీ(విధి) అనే మాట అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడదే విజయ్ దేవరకొండ-రష్మికని ఒక్కటి చేసింది. అప్పుడెప్పుడో సినిమా నటులుగా మొదలైన వీళ్ల ప్రయాణం.. ఇప్పుడు భార్యభర్తలుగా మారేందుకు కారణమైంది. ఈ సందర్భంగా వీళ్ల గురించి చాలా విషయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దానికి తోడు పెళ్లి ఫొటోలు, సొంతూరిలో విజయ్ సత్యనారాయణ వ్రతం చేయడం, ఊరి వాళ్లందరికీ భోజనాలు పెట్టించడం లాంటి విషయాలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు రష్మిక గురించి విజయ్ చేసిన తొలి ట్వీట్ కూడా బయటకొచ్చింది.

(ఇదీ చదవండి: కొత్త కోడలొచ్చింది.. మంచిగా చూసుకోండి: విజయ్‌ దేవరకొండ)

తెలంగాణకు చెందిన విజయ్ దేవరకొండ.. సహాయ నటుడిగా పలు సినిమాలు చేసి పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి తదితర చిత్రాలతో హీరోగా మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. 'గీతగోవిందం' అయితే విజయ్‌ని ఫ్యామిలీ ఆడియెన్స్‌కి దగ్గర చేసింది. ఇందులో రష్మిక హీరోయిన్. ఈ మూవీలోనే విజయ్-రష్మిక కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది. అదే సినిమాకు చాలా ప్లస్ అయింది కూడా. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగానే రష్మిక పాత్ర గురించి 2018 జూన్ 23న ట్వీట్ చేసిన విజయ్.. ఇప్పుడు దాన్ని నిజం చేశాడు.

'నా కాళ్లు తిమ్మిరి ఎక్కినా నడుము నొప్పి లేచినా మీ బరువు బాధ్యత ఎప్పుడు నాదే మేడమ్' అని సదరు ట్వీట్‌లో విజయ్ దేవరకొండ రాసుకొచ్చాడు. ఇక్కడున్నది సినిమాలో రష్మిక పాత్ర గురించే కావొచ్చు. కానీ ఆరేళ్ల తర్వాత తన ట్వీట్ నిజమవుతుంది, రష్మిక తన భార్య అవుతుందని విజయ్ కూడా ఊహించి ఉండడు. విధి వీళ్లిద్దరిని కలిపింది. ఈ క్రమంలోనే విజయ్ చేసిన పాత ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement