అప్పట్లో రూ.9 లక్షలకు ఎకరం అమ్మాను.. ఇప్పుడు రూ.100 కోట్లు | Actor Sivaji Reveals About His Real Estate Business In Latest Interview, Check More Details About His Personal Life | Sakshi
Sakshi News home page

Sivaji: రూ.1800 కోట్లు నష్టపోయిన శివాజీ.. ఏం చెప్పాడంటే?

Mar 4 2026 1:24 PM | Updated on Mar 4 2026 3:42 PM

Actor Sivaji About His Real Estate Business Latest Interview

పదిహేను ఇరవైళ్ల క్రితం హీరో, విలన్, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ.. తర్వాత చాన్నాళ్ల పాటు తెరపై కనిపించలేదు. రాజకీయాలు, బిజినెస్ అంటూ వ్యక్తిగత విషయాల్లో బిజీ అయిపోయాడు. ఎప్పుడైతే బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాడో మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చాడు. 'కోర్ట్' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. తాను గతంలో చేసిన రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి చెబుతూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు.

(ఇదీ చదవండి: ఆ సినిమాలో ఛాన్స్.. వెరైటీ బూతులతో నన్ను తిట్టారు)

'నేను సినిమాలకు దూరమైన తర్వాత జీవనాధారం కోసం స్థలాలు కొని అమ్మడం చేసేవాడిని. అలా యాదగిరిగుట్టలో రూ.70 వేలకు కొని ఒక్కొ ఎకరం రూ.9 లక్షలకు విక్రయించాను. తర్వాత ఆ స్థలం ధర చాలా పెరిగిపోయింది. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోనూ 18 ఎకరాలు కొని తక్కువ లాభానికి అమ్మేశాను. అక్కడ ఇప్పుడు ఒక్కో ఎకరం రూ.100 కోట్లు పలుకుతోంది. అంటే రూ.1800 కోట్లు. ఒక్క ఎకరం అయినా ఉంచుకోవాల్సింది అని నన్ను నేను తిట్టుకుంటూ ఉంటాను' అని శివాజీ అన్నాడు.

రియల్ ఎస్టేట్ రంగంలో భూములు కొని అమ్మేయడం మామూలే అని, ఇప్పటి రేట్లు చూసి నష్టపోయామని అనుకోవడానికి వీల్లేదని కూడా శివాజీ చెప్పుకొచ్చాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన సినిమా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'.. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. ఇందులో శివాజీకి జోడీగా లయ నటించింది. బాలనటుడు రోహన్ మరో కీలక పాత్ర చేశాడు. సుధీర్ శ్రీరామ్ దర్శకుడు.

(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?)

Advertisement
 
Advertisement
Advertisement