Sampradayini Suppini Suddapoosani
-
ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
నోరు జారిన కారణంగా రీసెంట్ టైంలో పలు వివాదాల్లో ఇరుక్కున్న నటుడు శివాజీ.. గతేడాది 'కోర్ట్' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ కాస్త బిజీగానే ఉన్నాడు. లేటెస్ట్గా ఈయన ఓ చిత్రాన్ని నిర్మించి అందులో లీడ్ రోల్ చేశారు. లయ జంటగా నటించింది. ఈ సినిమా ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులో రానుంది?(ఇదీ చదవండి: విషాదం.. సముద్రంలో పడిపోయి హీరో కన్నుమూత)సుధీర్ శ్రీరామ్ దర్శకుడిగా శివాజీ-లయ జంటగా నటించిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాని తొలుత ఓటీటీ కోసమే తీశారు. కానీ ఏమైందో ఏమో ఈ నెల 6న థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ శుక్రవారం(ఏప్రిల్ 03) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' విషయానికొస్తే.. శ్రీరామ్ (శివాజీ) పంచాయతీ కార్యదర్శి. హర్స్‌లీ హిల్స్‌లో భార్య ఉత్తర(లయ), కొడుకు బిట్టు(రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. దీపావళి నాడు వీళ్ల ఇంటికి ఎస్సై విక్రమ్ వాసుదేవ్(ప్రిన్స్) వస్తాడు. ఇతడికి ఆడవాళ్ల పిచ్చి. శ్రీరామ్ ఇంట్లో లేడని తెలిసి ఉత్తరపై బలత్కారం చేయబోతాడు. అనుకోని విధంగా బిట్టు చేతిలో ఎస్సై హత్యకు గురవుతాడు. తర్వాత ఏమైంది? హత్య కేసు నుంచి శ్రీరామ్ తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ప్రేమిస్తే' ఆడిషన్‌కు గ్రీజు పూసుకుని వెళ్లా..) -
'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ.. ప్రేక్షకులు సుద్దపూసలు కాదు
టాలీవుడ్ నటుడు శివాజీ సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. గతేడాది కోర్ట్, దండోరా సినిమాలతో విజయాలందుకున్న ఆయన తాజాగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రంతో మార్చి 6న థియేటర్స్‌లోకి వచ్చారు. దర్శకుడు సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ మూవీలో లయ, అలీ, ప్రిన్స్, ధన్‌రాజ్, రిక్కీ, బబ్లూ, రోహన్, షాబుద్దీన్, చిత్రం శ్రీను, కమల్, చమ్మక్‌చంద్ర, ఇమ్మానుయేల్ తదితరులు నటించారు. ఈ మూవీకి నిర్మాత శివాజీ కావడం విశేషం. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేశారు.కథేంటి..?శ్రీరామ్ (శివాజి) సచివాలయ కార్యదర్శిగా పనిచేస్తూ.. చాలా నిజాయితీపరుడని పేరు తెచ్చుకుంటాడు. ఎలాంటి ప్రలోభాలకు లొంగిపోకుండా తన ఉద్యోగ ధర్మాన్ని పాటించే వ్యక్తిత్వం. భార్య ఉత్తర (లయ), కుమారుడు మిక్కీ (రోహన్) వీరిద్దరూ ఒకేరకమైన మనస్థత్వంతో ఉంటారు. వారిలో అమాయకత్వంతో పాటు అతి తెలివి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎవరైనా వాళ్ల జోలికెళితే ఏం చేస్తారో వారికే తెలియదు. ఇలా వారి పాత్రలన్నీ టైటిల్‌కు తగ్గట్లే ఉంటాయి. ఆ కాలనీలోనే వారి ఫ్యామిలీ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎంతో సరదాగా వెళ్తున్న వారి జీవితంలోకి ఎస్ఐ విక్రమ్ (ప్రిన్స్) వస్తాడు. అతనికి అమ్మాయిల పిచ్చి ఉంటుంది. ఒకరోజు శ్రీరామ్‌తో గొడవ అవుతుంది. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యేకు సంబంధించిన ఒక ల్యాండ్ సెటిల్మెంట్ ఫైల్‌ను శ్రీరామ్ (శివాజి) అడ్డుకుంటాడు. అయితే, ఒకరోజు శ్రీరామ్ లేని సమయంలో ఉత్తరను చూసిన ఎస్ఐ ఇంట్లోకి వెళ్తాడు. ఈ నేపథ్యంలో అనుకోకుండా ఆ ఇంట్లో ఒక నేరం జరుగుతుంది. దాని నుంచి బయటపడేందుకు హీరో ఏం చేశాడు అనేది పూర్తి సినిమా. శ్రీరామ్ ఇంటికి ఎస్ఐ ఎందుకు వెళ్లాడు..? అక్కడ ఎలాంటి నేరం జరిగింది..? దాని నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి హీరో ఎంత దూరం వెళ్తాడు..? ఇందులో ఎమ్మెల్యే పాత్ర ఏంటి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..?‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కథలో ఎక్కువగా దృశ్యం మూవీ సీన్లు గుర్తుకొస్తాయి. కానీ, ఆ మూవీలో ఉన్నంత సీరియస్ ఇందులో కనిపించదు. కథలో కావాల్సినంత విషయంతో పాటు ప్రేక్షకులను థ్రిల్ చేసేలా తెరకెక్కించే అవకాశం ఉంది. కానీ, కథ నడపడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. కథలో ఓవర్ ట్విస్ట్‌లు ఉంటాయి. కానీ, అవన్నీ ప్రేక్షకుడికి చిరాకు పుట్టిస్తాయి. ఇందులో (శ్రీరామ్) పాత్ర సాంప్రదాయంగా ఉంటే... ఇంకొకరు( ఉత్తర) సుప్పనాతితనంతో ఉంటారు. ఇంకొకరేమో (మిక్కీ) సుద్దపూసలా కనిపించే దొంగ. ఇలా ప్రతి పాత్ర గమ్మత్తుగా ఉంటుంది. అయితే, వారు ఇచ్చే ట్విస్ట్లే కొంపముంచాయ్. తన ఇంట్లో జరిగిన ఒక నేరం నుంచి బయటపడేందుకు శివాజీ అమలు చేసే ప్లాన్స్ కొన్ని పర్వాలేదనిపిస్తాయి. అయితే, హీరో సమస్యలో పడిన ప్రతిసారీ ఆయనకి అనుకూలంగా ఏదోఒకటి జరగడంతో ప్రేక్షకుడికి చిరాకు పుట్టిస్తుంది. ఆపై చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ పాత్ర తికమకగా మరీ తెలివితక్కువగా ఉంటుంది. తన సీన్స్ వచ్చిన ప్రతిసారి ఎప్పుడు అయిపోతుందా అని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అమాయకత్వంతో లయ అదరగొట్టేసింది. ఫస్టాఫ్ కాస్త మెప్పించినప్పటికీ.. ఇంటర్వెల్ తర్వాత ఆశించినంత రేంజ్ కథలో విషయం కనిపించదు. కథ ప్రారంభంలో వేసిన చిక్కుముళ్లు సరైన క్రమంలో తొలగించకుంటే ప్రేక్షకుడిని మెప్పించడం కాస్త కష్టమైన పనే అవుతుంది. ప్రేక్షకుడి తెలివికి పరీక్ష పెట్టాలి.., కానీ ఇక్కడ సహనానికి అగ్నిపరీక్ష దర్శకుడు పెట్టాడనిపిస్తుంది.ఒక మంత్రి కోసం ఎమ్మెల్యే (శరత్ లోహితాస్య) పంపిన గిఫ్ట్ చుట్టూ కాస్త స్టోరీ తిరుగుతుంది. ఇందులో హీరో పాత్రకు పెద్దగా బలం కనిపించదు. సినిమా అంతా గిఫ్ట్ కోసం వెతకమని కేకలు పెట్టే ఎమ్మెల్యే చివర్లో కూడా ఆ గిఫ్ట్‌లో ఏముందో చెప్పడు. ఈ మధ్య ఓటీటీలు వచ్చాకు ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు చూసిచూసి ప్రేక్షకులు రాటుదేలి పోయారు. ఓటీటీలు శాసిస్తున్న కాలంలో వాళ్లని సుద్దపూసలనుకుంటే సినిమాకే నష్టం. క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా పెద్దగా మెప్పించలేదు. ఆలీ ఎపిసోడ్ కాస్త పర్వాలేదు. గుడ్‌న్యూస్ అంటూ లయ చేసిన సీన్ మెప్పిస్తుంది. శవం ఎపిసోడ్‌ను దర్శకుడు తను అనుకూలంగా మార్చుకున్నాడు ఏమో అనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే..?దాదాపు 20ఏళ్ల తర్వాత లయ, శివాజీ కలిసి చేసిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ మూవీకి ప్రధాన బలం లయ, శివాజీల నటన మాత్రమే. రోహన్ పాత్ర పెద్దగా కనెక్ట్ అవదు. ప్రిన్స్ ఎస్ఐగా కనిపించింది కొద్దిసేపు అయినప్పటికీ మెప్పించాడు. ఆ తర్వాత ఆలీ, ధన్‌రాజ్, శరత్ లోహితాస్య, చమ్మక్‌చంద్ర, ఇమ్మానుయేల్ వారి పరిధిమేరకు మెప్పించారు. సినిమాకు సంగీతం, కెమెరామెన్ పనితీరు మరోక బలం అయ్యాయి. బడ్జెట్ పరంగా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓటీటీలోనే విడుదల చేసింటే మరింత పేరు వచ్చేదేమో.. -
అప్పట్లో రూ.9 లక్షలకు ఎకరం అమ్మాను.. ఇప్పుడు రూ.100 కోట్లు
పదిహేను ఇరవైళ్ల క్రితం హీరో, విలన్, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ.. తర్వాత చాన్నాళ్ల పాటు తెరపై కనిపించలేదు. రాజకీయాలు, బిజినెస్ అంటూ వ్యక్తిగత విషయాల్లో బిజీ అయిపోయాడు. ఎప్పుడైతే బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాడో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చాడు. 'కోర్ట్' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. తాను గతంలో చేసిన రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి చెబుతూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: ఆ సినిమాలో ఛాన్స్.. వెరైటీ బూతులతో నన్ను తిట్టారు)'నేను సినిమాలకు దూరమైన తర్వాత జీవనాధారం కోసం స్థలాలు కొని అమ్మడం చేసేవాడిని. అలా యాదగిరిగుట్టలో రూ.70 వేలకు కొని ఒక్కొ ఎకరం రూ.9 లక్షలకు విక్రయించాను. తర్వాత ఆ స్థలం ధర చాలా పెరిగిపోయింది. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోనూ 18 ఎకరాలు కొని తక్కువ లాభానికి అమ్మేశాను. అక్కడ ఇప్పుడు ఒక్కో ఎకరం రూ.100 కోట్లు పలుకుతోంది. అంటే రూ.1800 కోట్లు. ఒక్క ఎకరం అయినా ఉంచుకోవాల్సింది అని నన్ను నేను తిట్టుకుంటూ ఉంటాను' అని శివాజీ అన్నాడు.రియల్ ఎస్టేట్ రంగంలో భూములు కొని అమ్మేయడం మామూలే అని, ఇప్పటి రేట్లు చూసి నష్టపోయామని అనుకోవడానికి వీల్లేదని కూడా శివాజీ చెప్పుకొచ్చాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన సినిమా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'.. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. ఇందులో శివాజీకి జోడీగా లయ నటించింది. బాలనటుడు రోహన్ మరో కీలక పాత్ర చేశాడు. సుధీర్ శ్రీరామ్ దర్శకుడు.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?) -
‘సాంప్రదాయని సుప్పినీ శుద్ధపూసనీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
టాలీవుడ్లో నటి లయపై నిర్మాత వ్యాఖ్యల దుమారం
లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి సక్సెస్ఫుల్ చిత్రాల నిర్మాత వంశీ నందిపాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.టాలీవుడ్ సీనియర్ నటీనటులు శివాజీ, లయ జంటగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ తరుణంలో చిత్రయూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్మీట్లో నటి లయ గురించి మాట్లాడుతూ వంశీ నందిపాటి..‘నందులను పందుల్లా పెంచింది’అని వ్యాఖ్యానించారు.ఈ మాటలు అక్కడే ఉన్నవారిని ఆశ్చర్యానికి గురి చేయగా, సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటి గురించి ఇలాంటి పదజాలం ఉపయోగించడం నిర్మాతకు తగదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకమైన నంది అవార్డుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆగ్రహానికి కారణమయ్యాయి. తెలుగు సినీ పరిశ్రమలో అత్యున్నత గౌరవంగా భావించే నంది అవార్డులను తక్కువ చేసి మాట్లాడడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ అవార్డులు తెలుగు సినిమా ప్రతిష్టకు ప్రతీకగా నిలుస్తాయని, వాటిని అవమానించేలా వ్యాఖ్యానించడం సరైనది కాదని సినీ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు.వంశీ నందిపాటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, ఆయనపై విమర్శలు మరింత పెరుగుతున్నాయి. కొందరు ఆయనను బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, కొంతమంది మాత్రం ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వంశీ ఉద్దేశం అంతకంటే వేరుగా ఉండవచ్చని అంటున్నారు.


