30 ఏళ్ల క్రితం పేపర్ లీక్‌పై పోరు, ఎముకలు విరిగాయ్‌ : ఈయన్ని గుర్తు పట్టారా? | do you know Education Minister Dharmendra Pradhan attacked as an ABVP student activist | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల క్రితం పేపర్ లీక్‌పై పోరు, ఎముకలు విరిగాయ్‌ : ఈయన్ని గుర్తు పట్టారా?

Jul 22 2026 5:47 PM | Updated on Jul 22 2026 6:22 PM

do you know Education Minister Dharmendra Pradhan attacked as an ABVP student activist

నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ, విద్యార్థుల ఆత్మహత్యలకు నైతికబాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద సీజేపీ చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దాష్టీకంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు విద్యార్థకు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ విద్యావేత్త సోనం వాంగ్‌చుక్‌ తన నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. 1997 పేపర్ లీక్ నిరసనలో పాల్గొన్న విద్యార్థినేత నుంచి కేంద్ర మంత్రి పదవి వరకు  ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్థానం  గురించి తెలుసుకుందాం.

మాజీ ప్రధాని, దివంగత  అటల్ బిహారీ వాజ్‌పేయీ (1996లో 16 రోజుల ప్రభుత్వం) తర్వాత, విద్యార్థి ఉద్యమాల ద్వారా వచ్చి విద్యాశాఖను చేపట్టిన కొద్దిమంది నాయకుల్లో ధర్మేంద్ర ప్రధాన్ ఒకరు. ఈ శాఖను 'విద్యా మంత్రిత్వ శాఖ'గా పేరు మార్చిన కొద్ది నెలలకే ఆయన  ఈ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఏబీవీపీ నాయకుడిగా ఉన్నప్పటి రోజుల నుంచి  ఆసక్తికర విషయాలు, ఆయన సహచరులు పంచుకున్నారు.

ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్‌ కారు కావాలి

 

విద్యార్థి ఉద్యమాలు - పోరాటాలు
ప్రధాన్ 1983లో ABVP లో చేరి, 1994 నుండి 1997 మధ్య రెండుసార్లు జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఉత్పల్ యూనివర్సిటీలో ఎమ్.ఏ (ఆంత్రోపాలజీ) చదివే రోజుల్లోనే ఎన్నో ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ,భువనేశ్వర్‌లోని RMD డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ రౌత్ కొన్ని అనుభవాలను  పంచకున్నారు.  ఒడిశాలో పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా సచివాలయం ముందు 1,500 మంది విద్యార్థులతో  శాంతియుతంగా ఆందోళన చేపట్టినప్పుడు, పోలీసులు చేసిన లాఠీఛార్జీలో ఆయనకు తీవ్ర గాయాలై, ఎముకలు విరిగాయని తెలిపారు.

అలాగే యూనివర్సిటీ ఎన్నికల్లో ఆయన గెలుపు ఖాయమని తెలిసిన అధికార పార్టీ (జనతా దళ్)  కార్యకర్తలు  ఆయనపై దారుణంగా దాడి చేశారు. ఆ దాడి నుంచి ఆయన ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతమని ఆయన జూనియర్ ప్రశాంత్ రౌత్ గుర్తుచేసుకున్నారు.

మూడు పెన్నులు ముద్దుపేరు'ముకూ' (Muku)
బీజేపీ అధికార ప్రతినిధి సుదీప్త్ కుమార్ రే తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన్ ఎప్పుడూ తన వద్ద ఎరుపు, నీలం, నలుపు రంగుల పెన్నులను ఉంచుకునేవారు. డాక్యుమెంట్లను కూలంకషంగా విశ్లేషించి మార్క్ చేయడానికి వీటిని వాడేవారు. అందుకే ఆయన్ను ఒడిశాలోని తన స్నేహితులు, సహచరులు ఆయన్ను ప్రేమగా 'ముకూ' అని పిలుస్తారట.

ఒకసారి డెంగ్యూ, సెరిబ్రల్ మలేరియాతో ఆసుపత్రిలో క్రిటికల్ కండిషన్‌లో ఉన్నప్పుడు కూడా, తనకు కాపలాగా ఉంటూ చలికి వణుకుతున్న తన జూనియర్‌కు రాత్రి వేళ తన దుప్పటిని కప్పి తన ఉదారతను చాటుకున్నారు.అలాగే ప్రధాన్ ప్రతి ఏటా జరిగే ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్రలో ఎలా పాల్గొనేవారో, ఆ దూరాన్ని నడిచి వెళ్లాలని ఎప్పుడూ పట్టుబట్టేవారని  కూడా గుర్తుచేసుకున్నారు.

ఇదీ చదవండి: ఫీఫా ట్రోఫీ నెత్తుకున్న యువరాణి, ఎవరీ మనోహరి : ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌

విద్యాశాఖ కంటే ముందు ఆయన పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో పెట్రోల్ ధరల పెరుగుదలపై స్పందిస్తూ కరోనా సమయంలో దేశానికి నిధుల అవసరం ఎక్కువగా ఉందని, భారత్‌ను 'భారత్‌ను గ్యాస్‌లెస్ ఎకానమీ'గా మార్చే పెద్ద ప్రణాళికలో ఇది భాగమని, భవిష్యత్తులో పరిస్థితులు మెరుగుపడతాయని ఆయన తెలిపినట్లు సుదీప్త్ కుమార్ పేర్కొన్నారు. ప్రధాన్‌ తల్లిదండ్రులు  తండ్రి మాజీ కేంద్ర మంత్రి దేబేంద్ర ప్రధాన్,  తల్లి బసంత మంజరి ప్రధాన్‌. మంత్రి భార్య మృదుల ప్రధాన్ కూడా చాలా కాలం పాటు ఏబీవీపీలో  పనిచేశారు. పెళ్లి తర్వాత  దూరంగా ఉన్నారు. 

ఇదీ చదవండి: వందే భారత్‌లో నాన్న ఫస్ట్‌ రైడ్‌... ఓ పుత్రుడి ఎమోషనల్‌ స్టోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement