పాక్‌కు ఉబర్ డ్రైవర్ ఫోన్‌.. వైరల్‌ చేసిన భారత మహిళ | Woman in Uber cab Claims his cab Driver Talking with Pakistani | Sakshi
Sakshi News home page

పాక్‌కు ఉబర్ డ్రైవర్ ఫోన్‌.. వైరల్‌ చేసిన భారత మహిళ

Jul 23 2026 10:52 AM | Updated on Jul 23 2026 11:06 AM

Woman in Uber cab Claims his cab Driver Talking with Pakistani

న్యూఢిల్లీ: ఉబర్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ..  డ్రైవర్ ఫోన్‌లో పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తితో మాట్లాడుతుండటాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన స్వాతి గోయల్ శర్మ ఇటీవల ఉబర్ క్యాబ్‌లో ప్రయాణించారు. ఆ సమయంలో క్యాబ్ డ్రైవర్ ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతుండగా ఆమె గమనించారు. ‘మీరు పాకిస్థాన్ నుంచా?’ అని డ్రైవర్ అంటుండటంతో ఆమె అప్రమత్తమయ్యారు. వెంటనే తన ఫోన్ తీసి ఆ సంభాషణను దాదాపు 51 సెకన్ల పాటు వీడియో రికార్డు చేశారు.

రైడ్ ముగిసిన తర్వాత మహిళ ఆ డ్రైవర్‌ను నిలదీయగా.. తాను ‘ట్రూమీట్’ అనే మొబైల్ యాప్‌లోని ఓ గ్రూప్‌లో సభ్యుడిగా ఉన్నానని, అందులో చాలా మంది పాకిస్థానీలు కూడా ఉన్నారని డ్రైవర్ సమాధానమిచ్చాడు. ఆ యాప్‌లో భారతీయులను మతపరమైన చర్చల్లోకి లాగుతుంటారని, హిందూ ఆచారాలపై అనవసరమైన ప్రశ్నలు అడుగుతుంటారని డ్రైవర్ వివరించినట్లు స్వాతి తెలిపారు.
 

ఈ తరహా చాటింగ్ యాప్‌ల ద్వారా ఉగ్రవాద సంస్థలు ప్రజలను ‍ప్రభావితం చేసే అవకాశం ఉందని స్వాతి ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా ఏజెన్సీలు  ఇలాంటి వాటిపై నిఘా వేయాలని, ఇలాంటి విదేశీ యాప్‌ల పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు, వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఏఐతో భారీ సంక్షోభం: జర్నలిస్ట్ రాబర్ట్ పెస్టన్ భవిష్యవాణి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement