భారత్‌లో నిరసనలపై పాక్‌ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు | Former Pak Cricketer Danish Kaneria Sensational Comments On Jantar Mantar Protests, Remarks Trigger Mixed Reaction On Social Media | Sakshi
Sakshi News home page

భారత్‌లో నిరసనలపై పాక్‌ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

Jul 23 2026 8:27 AM | Updated on Jul 23 2026 10:17 AM

former pak cricketer danish kaneria makes sensational comments on jantar mantar protests and backs narendra modi

భారత్‌లో జరుగుతున్న నిరసనలపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీలో కాక్రోచ్‌ జనతా పార్టీ చేపడుతున్న నిరసనలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా ఇలా అన్నాడు.

"భారత్‌లో జరిగే ప్రతి నిరసనకూ ఒకే రకమైన స్క్రిప్ట్ ఉండటం బాధాకరం. అనేక నిరసనల్లో సమస్యల పరిష్కారం కంటే రాముడిని తిట్టడం, భరతమాతను తిట్టడం, నరేంద్ర మోదీని, ఆయన తల్లిని తిట్టడం, హిందుత్వం, బ్రాహ్మణులపై విమర్శలు చేయడమే ఎక్కువగా కనిపిస్తుంది. చర్చలు లేవు, పరిష్కారాలు లేవు.. నినాదాలు, దూషణలు, గందరగోళమే కనిపిస్తుంది.

అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాకముందే కొందరు రైతులు ఢిల్లీ ముట్టడికి సిద్ధమవుతున్నారు.

ప్రతిపక్ష రాజకీయ వర్గాలు నేపాల్ తరహా పరిస్థితిని సృష్టించగలమనే భ్రమలో ఉన్నాయి. రోజురోజుకు పరిస్థితి మరీ సర్కస్‌లా మారుతుంది. వాస్తవాలను నిర్ధారించుకోకుండా నిరసన తెలపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, దేశం ఎలా పురోగమించగలదు" అంటూ తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చాడు.

దానిష్ కనేరియా చేసిన ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు అతడి అభిప్రాయాలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నారు.

కాగా, పాక్‌ మాజీ లెగ్‌ స్పిన్నర్‌ అయిన కనేరియా గతంలోనూ భారత దేశానికి, ప్రధాని మోదీకి అనుకూలంగా మాట్లాడి వార్తల్లో నిలిచాడు. కనేరియా హిందువు కావడంతో పాక్‌ జట్టులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని గతంలో చాలాసార్లు ప్రస్తావించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement