ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉత్కంఠగా మారాయి. గత రాత్రి జరిగిన ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే స్పందిస్తూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ నిరసనలను ఉద్దేశపూర్వకంగా హింసాత్మకంగా మార్చేందుకు బీజేపీకి చెందిన వ్యక్తులు చొరబడ్డారని ఆయన ఆరోపించారు.
తాజాగా అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడుతూ.. ‘కొందరు బయటి వ్యక్తులు మా నిరసనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి చెందిన వ్యక్తులు మా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వారి వల్లే హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సీజేపీకి చెడ్డపేరు తీసుకురావడమే వారి లక్ష్యం. కొందరు సివిల్ డ్రెస్సుల్లో వచ్చి విద్యార్థులపై దాడులు చేస్తున్నారు. జంతర్ మంతర్ ఎప్పుడూ ప్రజాస్వామ్య నిరసనలకు అందుబాటులో ఉండే ప్రదేశమే’ అని వ్యాఖ్యానించారు.
#WATCH | Delhi: Founding President of Cockroach Janta Party, Abhijeet Dipke says, "I have already spoken about the lathi charge. It was very brutal, and we will take the police officers who carried it out to court, and today is the 34th day of our protest. Sonam Sir's hunger… pic.twitter.com/LuZgdavsIr
— ANI (@ANI) July 23, 2026
అలాగే, నిరసనల సందర్భంగా పోలీసులు చేపట్టిన లాఠీచార్జ్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లాఠీచార్జ్ అత్యంత దారుణంగా జరిగింది. ఈ చర్యకు బాధ్యులైన పోలీసు అధికారులపై కోర్టును ఆశ్రయిస్తాం. మా ఉద్యమానికి ఇవాళ 34వ రోజు. మా డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు.
లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ కొనసాగిస్తున్న నిరాహార దీక్షపై కూడా దీప్కే స్పందించారు. ‘వాంగ్‌చుక్ సర్ నిరాహార దీక్షకు ఇవాళ 26వ రోజు. ఆయన ఆరోగ్యం మాకు ఆందోళన కలిగిస్తోంది. ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లకూడదని భావిస్తున్నాం. అందుకే దీక్ష విరమించాలని కోరుతున్నాం. అయినప్పటికీ మా డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం మాత్రం కొనసాగుతుంది’ అని తెలిపారు.
Jantar Mantar: men in civvies walking the street with sticks. Students ask who they are. No answer. Riot police standing nearby.
Police? Another agency? Someone private? That’s not a detail you shrug off. This needs a real investigation, not silence. pic.twitter.com/GX8vEnehdt— Dilip Ray 🇮🇳 (@dilipray) July 21, 2026
Sarthak Goswami covering a protest near New Delhi Railway Station. Video shows Delhi Police pushing and handling him in the crowd — arm yanked, phones out, total chaos. pic.twitter.com/Bw3feKQwij
— Dilip Ray 🇮🇳 (@dilipray) July 22, 2026


