సీజేపీపై వివాదాస్పద పోస్ట్‌ : ఎవరీ ఇన్‌స్టా స్టార్‌ సోనియా | Deleted Cockroach Post : Instagram Star Was The Officer In CJP Firestorm | Sakshi
Sakshi News home page

సీజేపీపై వివాదాస్పద పోస్ట్‌ : ఎవరీ ఇన్‌స్టా స్టార్‌ సోనియా

Jul 23 2026 3:42 PM | Updated on Jul 23 2026 5:13 PM

Deleted Cockroach Post : Instagram Star Was The Officer In CJP Firestorm

నీట్ (NEET) పేపర్ లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో రక్షణ విధులు నిర్వహించిన RAF (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) అసిస్టెంట్ కమాండెంట్ సోనియా సెహ్రావత్ సోషల్‌ మీడియా పోస్ట్‌పై వివాదం రేగింది.ప్రభుత్వ అధికారులు సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధనలను ఆమె ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

హర్యానాకు చెందిన ఈ అధికారిణికి ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఫ్యాషన్, ఫిట్‌నెస్, ఆధ్యాత్మికత , బైక్ రైడింగ్‌కు సంబంధించిన అనేక గ్లామరస్ రీల్స్, పోస్టుల ద్వారా ఆమె నెట్టింట సందడి చేస్తూ ఉంటారు. ఇన్‌స్టా స్టార్‌ గా ఎప్పుడూ వైరల్ అవుతుంటారు. 

తాజాగా సీజేపీ ఆందోళనపై ఒక చనిపోయిన బొద్దింక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ "తమను తాము బాగుచేసుకోలేని వారు, దేశాన్ని బాగు చేయాలనుకుంటున్నారు" అని క్యాప్షన్‌ ఇవ్వడం ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ పోస్ట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఆమె దానిని తొలగించారు. CJP స్పందిస్తూ, పోలీసుల హింసను సమర్థిస్తూ నిరసనకారులను బొద్దింకలతో పోల్చడం దారుణం. అయినా బొద్దింకలు ఎప్పటికీ చనిపోవు  అంటూ ఎక్స్‌   వేదికగా సీజేపీ కౌంటర్ ఇచ్చింది.

ఇదీ చదవండి: రూ. 20 లక్షలు ఖర్చు పెళ్లికి అవసరమా? నెట్టింట తీవ్ర చర్చ

సోషల్‌ మీడియా పోస్ట్‌ ద్వారా సర్వీస్ నిబంధనల ఉల్లంఘించారని  నిపుణులు పేర్కొన్నారు. అంతేకాదు యూనిఫామ్ ఉన్న ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా వాడకూడదనే నియమం ఉన్నప్పటికీ, ఆమె తన '3star_Sonia' అకౌంట్‌లో యూనిఫామ్ ఫోటోనే ఉంచడం గమనార్హం.  అయితే సీజేపీ నిరసనల్లో తనకు గాయాలయ్యాయని సోనియా మీడియాకు  తెలిపారు. విద్యార్థుల మధ్యలో కొందరు అల్లరి మూకలు, వ్యతిరేక శక్తులు చొరబడి తమపై రాళ్లు, గాజు సీసాలు, చెప్పులు విసిరారని, మహిళలను కాపాడే ప్రయత్నంలో తన చేతికి దెబ్బతగిలి కట్టు పడిందని ఆమె పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: డ్రగ్స్‌ కేసు పెడతా.. జీవితాలను నాశనం చేస్తా : పోలీస్‌ బెదిరింపు వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement