‘టైం, ప్లేస్‌ మీరే చెప్పండి’.. సీజేపీతో చర్చలకు కేంద్రం | Centre Appeal To cjp Protest For Talks | Sakshi
Sakshi News home page

‘టైం, ప్లేస్‌ మీరే చెప్పండి’.. సీజేపీతో చర్చలకు కేంద్రం

Jul 23 2026 3:24 PM | Updated on Jul 23 2026 4:13 PM

Centre Appeal To cjp Protest For Talks

సాక్షి,న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి కేంద్రం సీజేపీని చర్చలు ఆహ్వానించింది. మీ ఇష్టం. టైం, ప్లేస్‌ ఎక్కడో మీరే  చెప్పండి అన్ని సమస్యల్ని చర్చించేందుకు సిద్ధమని తెలిపింది. 

నీట్‌ పేపర్‌ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన తక్షణ రాజీనామా, నీట్‌ పేపర్‌ లీకేజీతో ఆత్మహత్య చేసుకున్న నీట్‌ అభ్యర్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, చలో సంసద్‌లో పాల్గొన్న వారిపై పోలీసులు నమోదు చేసిన కేసుల ఉపసహరణపై కాక్రోచ్‌ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఈ క్రమంలో కాక్రోచ్‌ పార్టీ నేతలతో చర్చించేందుకు కేంద్రం మంత్రి జితేంద్ర సింగ్‌ ఆహ్వానం పంపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం నుంచి సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు నాలుగు సార్లు ప్రతిపాదనలు పంపాం. అన్నీ సమస్యలపై కేంద్రం వారితో చర్చించేందుకు సిద్ధంగా ఉంది. చర్చలు జరిపేందుకు సమయం, ప్లేస్‌ వాళ్లం ఇష్టం.

ఈ చర్చల్లో నాతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సైతం పాల్గొంటారు. ఈ చర్చలు జేపీ నడ్డా ఇల్లు, కార్యాలయంలో జరిపితే బాగుంటుందని అనుకుంటున్నాం. దీనికి సంబంధించి మాకు ఎలాంటి అహంభావం లేదు. చర్చల ద్వారా సమస్యల్ని క్రమంగా పరిష్కారం దిశగా అడుగులు వేయొచ్చు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న నిరంతర చర్యల్లో ఇది ఒక భాగం. చర్చల్లో పాల్గొనాల్సిందిగా సీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నాను’అని పేర్కొన్నారు. 

చర్చలు జరిపేందుకు కేంద్రం పంపుతున్న ఆహ్వానాలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే స్పందించారు. మాతో చర్చలు జరపాలని అనుకుంటే కేంద్రమే మా వద్దకు రావాలి. మా డిమాండ్స్‌కు కట్టుబడాలి. అయితే, జంతర్‌మంతర్‌లో కేంద్రం మాతో చర్చలు జరపాలి. ఆ విషయంలో వెనక్కితగ్గబోమన్నారు. ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా చేయాలనేది మా ప్రధాన డిమాండ్‌ అని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్‌ రాంకా స్పష్టం చేశారు.  

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ భారీ సంఖ్యలో విద్యార్థులు పార్లమెంట్‌ మార్చికి పిలుపునిచ్చిన తరుణంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇవాళ ప్రధాని మోదీ పేపర్‌ లీకేజీలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పేపర్‌ లీకేజీ కేసులపై సత్వరమే విచారణ, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఫాస్ట్రాక్‌ కోర్టులను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement