breaking news
Central Government
-
సర్‌తో 7.8 కోట్ల ఓట్లు గల్లంతు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ముసుగులో కేంద్ర ప్రభుత్వం భారీ కుట్రకు తెరతీసిందని కాంగ్రెస్ ఆరోపించింది. కోట్ల మంది అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాల నుంచి అధికారులు అక్రమంగా తొలగిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. ‘‘కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లోనే ఈ తతంగం నడుస్తోంది. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. కానీ ఇప్పుడు అది షా ప్రోద్భలంతో జరుగుతున్న ఓట్ల తొలగింపు(షా ఇన్స్టిగేటెడ్ రిమూవల్–ఎస్ఐఆర్) ప్రక్రియగా తయారైంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఎస్ఐఆర్ తొలి రెండు దశల్లోనే ఏకంగా 7.8 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందున్న మొత్తం ఓటర్లలో ఇది దాదాపు 13 శాతానికి సమానం. మూడో దశలోనూ భారీ ఎత్తున ఓట్ల గల్లంతు జరుగుతోంది. మూడో దశలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 36.06 కోట్ల మంది ఓటర్లను పరిశీలించగా, అందులో ఇప్పటికే 6.18 కోట్ల మంది పేర్లను తొలగించారు. ఓటరు జాబితాలో పేర్లను కొనసాగించుకోవాలంటే అదనపు పత్రాలు సమరి్పంచాలంటూ మరో 5.43 కోట్ల మందికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. సరైన సమయంలో ఈ పత్రాలు సమరి్పంచకపోతే ఈ 15 శాతం మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యే ప్రమాదముంది’’ అని జైరాం ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గోప్యత ‘‘ఈ ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా లోపించింది. కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో తొలగింపు ప్రమాదం ఉన్న ఓటర్ల జాబితాలను ప్రజలకు అందుబాటులో ఉంచగా, ఢిల్లీలో ప్రజల ఒత్తిడి మేరకు సెపె్టంబర్ 19న విడుదల చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ జాబితాలను కనీసం బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచారు’’ అని దుయ్యబట్టారు. వివిధ రాష్ట్రాల్లో ఓట్లు కోల్పోయిన, తొలగింపు ప్రమాదం ఉన్న ఓటర్ల గణాంకాలను జైరాం రమేశ్ వెల్లడించారు. ఈ జాబితాలో ఢిల్లీ 53.73 శాతం ఓట్ల తొలగింపు ముప్పుతో తొలి స్థానంలో ఉండగా, చండీగఢ్ 52.58 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో ఏకంగా 48.90 శాతం మంది పేర్లు గల్లంతవడమో, నోటీసులు అందుకోవడమో జరిగి జాబితాలో మూడో స్థానంలో ఉందని వెల్లడించారు. జార్ఖండ్‌లో 39.57 శాతం, హరియాణాలో 37.5 శాతం, ఉత్తరాఖండ్‌లో 35.71 శాతం, మేఘాలయలో 35.36 శాతం, మహారాష్ట్రలో 33.88 శాతం ఓట్లకు గండం పొంచి ఉందని వివరించారు. కర్ణాటకలో 27.6 శాతం, ఒడిశాలో 23.67 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 21.17 శాతం, పంజాబ్‌లో 15.23 శాతం మేర ఓటర్లు జాబితా నుంచి గల్లంతయ్యే ప్రమాదంలో ఉన్నారని ఆరోపించారు. అద్వానీకి సర్ నోటీసు కేంద్ర మంత్రి జైశంకర్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు కూడా న్యూఢిల్లీ: ఢిల్లీలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వేలో పలువురు ప్రముఖులకు సైతం నోటీసులు జారీ అయ్యాయి. బీజేపీ దిగ్గజ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి సైతం ఎస్ఐఆర్ నోటీస్ వచి్చంది. సర్ కింద అందజేసిన ధ్రువీకరణ పత్రాల్లో వ్యత్యాసాలున్నాయని, మరిన్ని ఆధారాలను సమర్పించాలని అధికారులు వారిని కోరారు. 98 ఏళ్ల అద్వానీతోపాటు ఆయన కుమార్తె ప్రతిభ, కోడలు గీతికలకూ ఈ నోటీసులు అందాయి. 2002 నాటి సర్ ఓటరు జాబితాలో వీరి పేర్లు లేవని పేర్కొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధూ, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, ఆయన భార్య క్యోకో, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, మాజీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్స్‌లర్ జగదీశ్ కుమార్, మాజీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా, సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పండే, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాలకు సైతం ఎస్ఐఆర్ నోటీసులు వచ్చాయి. సిసోడియా, భార్య సీమ, కుమారుడు మీర్కూ నోటీసులందాయి. తల్లిదండ్రుల పేర్లలో వ్యత్యాసాలున్నాయంటూ మీర్‌కు పంపిన నోటీసులో పేర్కొన్నారు. సిసోడియా భార్య సీమకు పంపిన నోటీసులో ధ్రువీకరణ పత్రాలతో ఆమె పేరు సరిపోలడం లేదని పేర్కొన్నారు. ఢిల్లీలో నోటీస్‌లు అందుకున్న వాళ్ల పేర్లన్నీ ఢిల్లీ శాసనసభ పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఆర్మీ చీఫ్‌కు సైతం.. భారత ఆర్మీ మాజీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, ఆయన భార్యకు సైతం ఎస్ఐఆర్ నోటీసులు వచ్చాయి. మంత్రి ఎస్. జైశంకర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ దేశాయ్, ఆయన కుటుంబసభ్యులకు, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌కూ ఈసీ అధికారులు ఎస్ఐఆర్ నోటీసులు అందజేశారు. -
ఘాటెక్కిన ఉల్లి! భగ్గుమంటున్న ధర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. దేశవ్యాప్తంగా సరఫరా తగ్గుదల నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. హైదరాబాద్‌లో జూలైలో కిలో రూ. 20 పలికిన ఉల్లి.. ప్రస్తుతం రూ. 60కి చేరింది. ఇక తెల్ల ఉల్లి కిలో రూ. 100 మార్కుకు చేరుకుంది. మంచిర్యాలలో నెల రోజుల వ్యవధిలో రూ. 30 నుంచి రూ. 70కి పెరిగింది. మలక్‌పేటలోని హోల్‌సేల్ మార్కెట్ అయిన గంజ్ మార్కెట్లో క్వింటాల్ ఉల్లి రూ. 5,200 నుంచి రూ. 5,500 దాకా పలుకుతోంది. మలక్‌పేట మార్కెట్‌కు గతేడాది ఆగస్టులో 2,54,120 క్వింటాళ్ల ఉల్లి వస్తే ఈ ఏడాది 1,99,686 క్వింటాళ్లే వచ్చాయి. రోజూ 25 వేల బస్తాలకు బదులు 15 వేల బస్తాలే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉల్లిపాయల సగటు రిటైల్ ధర సెప్టెంబర్ 16న కిలోకు రూ. 53.84గా నమోదైంది. గతేడాది అదే రోజున కిలో ధర రూ. 27.71గానే ఉండేది. అంటే ఏడాది వ్యవధిలో ఉల్లి సగటు చిల్లర ధర దాదాపు 94 శాతం పెరిగింది. తగిన వర్షాల్లేక.. ఈ ఖరీఫ్ సీజన్లో దేశంలోని ప్రధాన ఉల్లి సాగు ప్రాంతాలైన మహారాష్ట్రలోని నాసిక్, ఏపీలోని కర్నూలుతోపాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల దిగుబడి తగ్గింది. దీనికితోడు గత రబీ సీజన్లో అధిక తేమ వల్ల నిల్వ ఉంచిన పంట సైతం దెబ్బతిన్నది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సరఫరా తగ్గిపోవడంతో ధరలు పెరిగిపోయాయి. మరోవైపు ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ సరఫరాను 19 నగరాలకు విస్తరించింది. ఉత్పత్తి ప్రాంతాల నుంచి ప్రధాన వినియోగ కేంద్రాలకు ఉల్లిని తరలించేందుకు రైల్వే ర్యాక్‌లు, కాండా ఎక్స్‌ప్రెస్, 30కిపైగా ట్రక్కులను వినియోగిస్తోంది. నాసిక్ నుంచి పంపిన రైలు ర్యాక్‌ల ద్వారా ఢిల్లీ, చెన్నై తదితర ప్రాంతాలకు ఇప్పటికే చేరింది. అలాగే ఎన్సీసీఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాలు, మొబైల్ వ్యాన్ల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ. 35కే విక్రయిస్తోంది. కానీ బఫర్ స్టాక్ నుంచి సరఫరా చేసిన ఉల్లి.. ప్రతి మార్కెట్‌కు సమానంగా చేరకపోవడం సమస్యగా మారింది. అందుకే సాధారణ వినియోగదారులు బహిరంగ మార్కెట్లలో ఉల్లిని దాదాపు రెండింతల ధరకు కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. కొత్త ఖరీఫ్ పంట మార్కెట్లోకి పూర్తి స్థాయిలో వచ్చే వరకు (మరో నెల రోజులపాటు) ఉల్లి ధరల మంట తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
మెటాకు సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతలు వర్తిస్తాయి
న్యూఢిల్లీ: మెటాను కేవలం ఒక మధ్యవర్తి సంస్థగా (ఇంటర్మీడియరీ) పరిగణించడానికి లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏయే కంటెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి, ఏది కనిపించేలా చూడాలనేది మెటా తమ అల్గోరిథంల ద్వారా నిర్ణయిస్తుందని పేర్కొన్నాయి. కాబట్టి, దాన్ని సేవలు అందించే సంస్థగానే పరిగణించాల్సి వస్తుందని, సర్వీస్ ప్రొవైడర్లకు నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నీ మెటాకి కూడా వర్తిస్తాయని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. నిర్దిష్ట చట్టాల నుంచి దానికి మినహాయింపులేమీ ఉండవని పేర్కొన్నాయి. అయితే, ఈ అంశంపై కోర్టు నిర్ణయమే అంతిమం అని వివరించాయి. పిల్లల వేధింపుల కంటెంట్ గురించి సమాచారాన్ని ఇప్పటివరకు అమెరికన్ నియంత్రణ సంస్థలకు మాత్రమే తెలియజేస్తూ వచి్చన మెటా తాజాగా భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నిర్వహించే పోర్టల్‌కి కూడా తెలియజేసేందుకు అంగీకరించిందని వివరించాయి. -
క్యాబ్ అగ్రిగేటర్లకు చెక్..!
న్యూఢిల్లీ: ‘కెప్టెన్ రూ. 60 చార్జీకి ఒప్పుకోవడం లేదు.. మరో రూ.10, రూ.20, లేదా రూ.30 పెంచి బుకింగ్ ట్రై చేయండి’.. ‘రేటు పెంచితే రైడ్ బుక్ అయ్యే అవకాశాలు మెరుగవుతాయి’.. అంటూ ర్యాపిడో సహా వివిధ అగ్రిగేటర్ యాప్‌లలో క్యాబ్ లేదా బైక్ బుక్ చేసుకునేవారికి పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సమస్యలపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం.. రైడ్ బుక్ చేసుకోవడానికి ముందే అనుసరిస్తున్న ఇలాంటి ముందస్తు టిప్ ఆప్షన్‌ను నిలిపివేయాలని క్యాబ్ అగ్రిగేటర్లను బుధవారం ఆదేశించింది. ఈ విధానం తప్పుదోవ పట్టించేలా, అన్యాయంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినియోగదారుల వ్యవçహారాల కార్యదర్శి నిధి ఖరే పేర్కొన్నారు. క్యాబ్, బైక్ డ్రైవర్లకు ముందస్తు టిప్ ఆప్షన్‌ను అందించడంతో పాటు రకరకాల అక్రమ వ్యాపార విధానాలకు సంబంధించి బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ర్యాపిడోపై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) రూ. 10 లక్షల జరిమానా విధించిన మర్నాడే కేంద్రం తాజా ఆదేశాలు వెలువడటం గమనార్హం. ఈ విషయంలో క్యాబ్ అగ్రిగేటర్లపై జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వచ్చాయని.. దీంతో ఉబెర్, ఓలా వ్యాపార విధానాలను కూడా సీసీపీఏ నిశితంగా పరిశీలిస్తోందని, ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు ఖరే చెప్పారు. ముందుగానే ఎంతో కొంత టిప్ ఇవ్వకపోతే రైడ్ బుక్ కావడం లేదంటూ వినియోగదారుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తడంతోనే, దీనిపై లోతుగా విచారణ జరిపి, నిలిపివేత ఆదేశాలిచ్చామని ఆమె వివరించారు. సీసీపీఏకు కూడా ఖరే సారథ్యం వహిస్తున్నారు. టిప్ అనేది పూర్తిగా స్వచ్ఛందమైన విషయమని, వినియోగదారులు తమకు సేవలు నచ్చితే రైడ్ పూర్తయ్యాక ఇచ్చే విధంగా వారి విచక్షణకే వదిలేయాలని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. -
అంకుర్ నుంచి ఫాల్కే వరకు...
ఆయన కళ్లల్లో ఒక తెలియని తీక్షణత ఉంటుంది... ఆయన నటనలో అతిశయోక్తులు లేని సహజత్వం ఉట్టిపడుతుంది. కమర్షియల్ సినిమాల్లో నవ్వులు పూయించాలన్నా, క్లాసిక్ ఆర్ట్ సినిమాల్లో గుండెల్ని పిండేసే అభినయం పండించాలన్నా అది కేవలం ఆయనకే సాధ్యం. ఆయనే కన్నడ చలనచిత్ర అరుదైన నవరత్నం,భారతీయ సినీ యవనికపై ఐదు దశాబ్దాలుగా వెలుగుతున్న నటుడు అనంత్ నాగ్. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ ప్రకటించడం దక్షిణ భారతానికి దక్కిన మరో సమున్నత గౌరవం.శ్యామ్ బెనగళ్ తెలంగాణ ప్రాంతపు కథతో సినిమా మొదలెట్టాడు. అనంత్ నాగ్, షబానా ఆజ్మీలు ముఖ్యపాత్రలు. దానికి వర్కింగ్ టైటిల్‌గా ‘సీడ్లింగ్’ (మొలక) అని పేరు పెట్టుకున్నాడు. కాని తీస్తున్నది హిందీలో. మంచి టైటిల్ ఏం పెట్టాలో తోచడం లేదు. సీడ్లింగ్కు సరిపోలిన టైటిల్ చెప్పిన వారికి వెయ్యి రూపాయల నజరానా ప్రకటించాడు. అనంత్ నాగ్ ఆయనతో ఒకరోజు బెరుగ్గానే చెప్పాడు... ‘సార్ సీడ్లింగ్కు సరైన హిందీ మాట అంకుర్’... భారతీయ సినిమాలో ‘అంకుర్’ ఎంత పెద్ద ప్రభావపూరిత సినిమాయో ఆ సినిమాలో నటించిన అనంత్ నాగ్ కాలక్రమంలో అంతే ప్రభావపూరిత నటుడిగా అవతరించాడు. నట మహావృక్షమై దాదాసాహెబ్ ఫాల్కే వరకూ ఎదిగాడు. అనంత్ నాగ్‌కు మొదటి నుంచి పాత్రే ముఖ్యం. ‘అంకుర్’లో లీడ్ రోల్లో నటించిన అనంత్ నాగ్ ఆ వెంటనే ‘నిశాంత్’కు వచ్చేసరికి పనికిమాలిన పోరంబోకు పాత్రలో కనిపిస్తాడు. భూస్వామి కొడుకుగా అకృత్యాలు చేసే పాత్ర అది. ఆ తర్వాత బెనగళ్ తీసిన ‘మంథన్’లో గ్రామీణ అమ్మాయిని వల్లో వేసుకునే పాత్ర. ఇవన్నీ అందరూ అంగీకరించేవి కావు. 1978లో శ్యామ్ బెనగళ్ తీసిన ‘అనుగ్రహం’లో వాణిశ్రీ భర్తగా దారీ తెన్నూ లేని పాత్రలో నటించాడు. ఆ సమయంలోనే కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమలేఖలు’లో విలన్‌గా నటించాడు. ‘ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి’... జయసుధతో డ్యూయెట్ పాడాడు. అనంత్ నాగ్, గిరీష్ కర్నాడ్ ఇద్దరూ ఒకే సాంస్కృతిక మూలాల నుంచి వచ్చారు. అనంత్ నాగ్ మొదటి కన్నడ నాటకం గిరీష్ కర్నాడ్ రాసిన క్లాసిక్ ‘యయాతి’. ముంబైలో ఈ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు యయాతికి తన యవ్వనం ఇచ్చి వృద్ధుడిగా మారే కొడుకు పాత్రలో అనంత్ నాగ్ అద్భుతంగా నటించాడు. ఆ నటనను చూసి ముగ్ధుడైన గిరీష్ కర్నాడ్, ప్రముఖ దర్శకుడు జి.వి. అయ్యర్‌కు సిఫార్సు చేస్తే అనంత్ నాగ్‌కు లభించిన మొదటి కన్నడ సినిమా ‘సంకల్ప’ (1973). హిందీలో ఎంత బిజీగా ఉన్నా అనంత్ నాగ్ తన మాతృ పరిశ్రమ శాండల్‌వుడ్‌ను వదల్లేదు. వైవిధ్యమైన పాత్రలతో ఐదుసార్లు కర్ణాటక రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డును, ఆరుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకోవడం కన్నడ సినిమాపై ఆయనకున్న అపారమైన ప్రభావానికి నిదర్శనం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అద్భుత నటిగా పేరు తెచ్చుకున్న లక్ష్మి (‘మిథునం’ ఫేమ్), అనంత్ నాగ్ల కాంబినేషన్ సౌత్ సినిమాలోనే అత్యంత విజయవంతమైన జోడీగా నిలిచింది. కన్నడలో వీరిద్దరూ కలిసి నటించిన ‘చందనద గొంబె’ వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. స్క్రీన్ వెలుపల కూడా వీరు మంచి స్నేహితులు. దూరదర్శన్ లో సంచలనం సృష్టించిన ‘మాల్గుడి డేస్’ (1987) క్లాసిక్ సిరీస్ మేకింగ్, ప్రొడక్షన్ పనుల్లో తమ్ముడు శంకర్ నాగ్‌కు అనంత్ నాగ్ వెన్నెముకగా నిలిచాడు. నేటి తరం ప్రేక్షకులకు ఆయన ‘కెజీఎఫ్ చాప్టర్1’ లోని కథ చెప్పే జర్నలిస్ట్ పాత్రతో పూనకాలు తెప్పించాడు. అలాగే నితిన్ నటించిన ‘భీష్మ’ చిత్రంలో ఆర్గానిక్ ఫార్మింగ్ కంపెనీ హెడ్‌గా, ‘గోధి బన్న సాధారణ మైకట్టు’లో అల్జీమర్స్ పేషెంట్‌గా చూపిన నట విశ్వరూపం నేటి యూత్‌ని ఫిదా చేసింది. అనంత్ నాగ్ సమాజం పట్ల అవగాహన ఉన్న మేధావి. రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడు. జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో కర్ణాటక క్యాబినెట్ మంత్రిగా (బెంగళూరు నగర అభివృద్ధి శాఖ) కూడా ఆయన సేవలందించాడు. వెండితెరపై ఎందరో హీరోయిన్లతో రొమాన్స్ పండించి చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న అనంత్ నాగ్‌ది రియల్ లైఫ్‌లోనూ లవ్ మ్యారేజే. తన సహ నటి గాయత్రిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు అదితి అనే కుమార్తె ఉంది. లైమ్‌లైట్‌కు, వెండితెరకు దూరంగా పెరిగిన అదితి పెళ్లి చేసుకుని, భర్త వివేక్‌తో కలిసి బెంగళూరులోనే సెటిల్ అయ్యారు. ‘సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, అది సమాజానికి అద్దం పట్టే మాధ్యమం’ అని నమ్మిన అతికొద్ది మంది నటుల్లో అనంత్ నాగ్ ఒకరు. 1973లో థియేటర్ ఆర్టిస్ట్‌గా మొదలైన ఆయన ప్రయాణం, ఇవాళ భారతీయ సినిమా అత్యున్నత శిఖరమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ వద్దకు చేరింది. ఏనాడూ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన పర్సనల్ లైఫ్‌ను ఎంతో హుందాగా నడిపించిన అనంత్ నాగ్ ఎగరేసిన నట బావుటా రాబోయే తరాల నటులకు చుక్కాని. అనంత్ నాగ్ పూర్తి పేరు అనంత్ నాగర్కట్టె. తండ్రి సదానంద్, తల్లి ఆనంది. వీరిది కొంకణ కుటుంబం. అనంత్ నాగ్ బాల్యమంతా సంస్కృత భజనల, భక్తి పాటల మధ్య సాగింది. ఉడుపిలో 7వ తరగతి పూర్తయ్యాక తండ్రి అనంత్ నాగ్ని బాంబేకి చదువుకోవడానికి పంపాడు. అయితే అక్కడి ఇంగ్లిష్ మీడియంతో అనంత్ నాగ్ అవస్థ పడి పదితో చదువు ఆపేశాడు. కొన్నాళ్లు యూనియన్ బ్యాంక్‌లో టెంపరరీ ఉద్యోగం చేశాడు. ఆ సమయంలోనే బాంబేలోని ప్రభాకర్ ముదూర్, వెంకట్రావు తలేగేరి, సత్యదేవ్ దూబె వంటి నాటకరంగ దిగ్గజాలు ఆయన్ను గుర్తించి నాటకాల్లో అవకాశం ఇచ్చారు. అనంత్ నాగ్ వేసిన మొదటి పాత్ర చైతన్య మహాప్రభు పాత్ర. ఆ నాటకం సూపర్ హిట్ అవ్వడంతో దాదాపు 8 ఏళ్ల పాటు కొంకణి, కన్నడ, మరాఠీ, హిందీ నాటకాల్లో స్టేజ్ ఆర్టిస్ట్‌గా రాటుదేలాడు.– కె -
ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. EPFO వేతన పరిమితి భారీగా పెంపు
-
UPI ఛార్జీలపై రేవంత్ ఫైర్ కేంద్రానికి కీలక విజ్ఞప్తి
-
EPFOపై కేంద్రం కీలక నిర్ణయం.. ప్రైవేటు ఉద్యోగులకు భారీ శుభవార్త!
సాక్షి,న్యూఢిల్లీ: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఉద్యోగ పెన్షన్ పథకం కింద తప్పనిసరిగా అమలు చేయాల్సిన వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు రూ.15వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ.25వేలకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు దశాబ్ద కాలంగా (సెప్టెంబర్ 2014 నుండి) ఈ పరిమితి రూ.15వేల వద్దే నిలిచిపోగా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న వేతనాల ఆధారంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇంతవరకు ప్రాథమిక వేతనం రూ.15వేల వరకు ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఈపీఎఫ్, ఈపీఎస్ పరిధిలోకి రావడం తప్పనిసరిగా ఉండేది. తాజా పెంపుతో బేసిక్ వేతనం రూ.15వేల నుండి రూ.25వేలకు మధ్య ఉన్న ఉద్యోగులు కూడా ఈ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ పరిధిలోకి వస్తారు. దీనివల్ల ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న మరింత మంది ఉద్యోగులకు సామాజిక భద్రత లభిస్తుంది.ఉద్యోగులపై ప్రభావం రూ. 15,000 కంటే ఎక్కువ వేతనం ఉండి ఇప్పటివరకు పీఎఫ్ మినహాయింపు తీసుకోని కొత్త ఉద్యోగులకు, ఇకపై ప్రతి నెలా పీఎఫ్ కింద కొంత మొత్తం కట్ అవుతుంది. దీనివల్ల వారి చేతికి అందే జీతం కొంత తగ్గినప్పటికీ,భవిష్యత్తు కోసం వారి పదవీ విరమణ నిధి పటిష్టంగా మారుతుంది.పెరిగే పెన్షన్ ప్రయోజనాలు ఈపీఎస్ పెన్షన్ లెక్కింపులో పరిగణించే గరిష్ట వేతన పరిమితి పెరగడం వల్ల, ఉద్యోగ విరమణ తర్వాత లభించే పెన్షన్ మొత్తం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.యజమానులపై భారం కంపెనీలు, యాజమాన్యాలు తమ ఉద్యోగుల తరఫున పీఎఫ్,పెన్షన్‌కు చెల్లించాల్సిన వాటా ఎక్కువ మంది ఉద్యోగులకు వర్తిస్తుంది. దీనివల్ల కంపెనీల జీతాల నిర్వహణ వ్యయం పెరుగుతుంది. గతంలో చివరిసారిగా 2014 సెప్టెంబర్‌లో ఈ వేతన పరిమితిని రూ. 15,000కు పెంచారు. ఈ తాజా నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పెద్ద ఊరట లభించనుంది.ఇదీ చదవండి : ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? -
ఇకపై UPI చెల్లింపులపై ఛార్జీల మోత..!
-
యూపీఐపై వడ్డన!
సాక్షి, హైదరాబాద్: దేశంలో దాదాపు ఆరేళ్లుగా కొనసాగుతున్న పూర్తి ఉచిత యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) చెల్లింపుల సేవలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. యూపీఐ చెల్లింపులపై చార్జీల విధానాన్ని పునఃప్రవేశపెట్టాలంటూ గూగుల్ పే, అమెజాన్ పే, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, జియో పేమెంట్స్ బ్యాంక్ సహా మరికొన్ని సంస్థలు సభ్యులుగా ఉన్న పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెచ్చిన ఒత్తిడితోపాటు ఏటా రూ. 40 లక్షలకుపైగా టర్నోవర్ ఉండే వ్యాపారులపై చార్జీలు విధించాలన్న ఆర్బీఐ, బ్యాంకుల సూచనను పరిగణనలోకి తీసుకుంది. వ్యక్తుల నుంచి వ్యాపారులకు రూ. 2 వేలకుపైగా జరిగే యూపీఐ చెల్లింపుల లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. అలాగే రూ. 75 వేలకన్నా ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ను గరిష్టంగా రూ. 300గా ఖరారు చేసినట్లు తెలిపింది. అయితే రూ. 2 వేలలోపు వ్యక్తుల నుంచి వ్యాపారులకు జరిపే యూపీఐ చెల్లింపులతోపాటు వ్యక్తుల నుంచి వ్యక్తుల మధ్య జరిగే యూపీఏ లావాదేవీలు, చిరు వ్యాపారులకు ఎలాంటి ఎండీఆర్ చార్జీ వర్తించదని స్పష్టం చేసింది. అక్టోబర్ 15 నుంచి నూతన విధానం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్పీసీఐ) సంయుక్తంగా నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఎండీఆర్ రుసుము రూపంలో ఏటా పేమెంట్స్ పరిశ్రమకు రూ. 16,000 కోట్లు వస్తాయని అంచనా. వినియోగదారులు చార్జీ చెల్లించక్కర్లేదు.. ‘యూపీఏ ద్వారా చేసే చెల్లింపులపై వినియోగదారులు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యాపారుల చెల్లింపుల వ్యవస్థలో ఎండీఆర్ ఒక రకమైన చార్జీ. ఇది యూపీఐ చెల్లింపులు జరిపే వినియోగదారులపై విధించే చార్జీ కాదు. వ్యక్తులు ఎప్పటిలాగే ఎలాంటి పరిమితులు, కోటాలు లేకుండా పూర్తి ఉచితంగా యూపీఐ లావాదేవీలు కొనసాగించవచ్చు’ అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఎండీఆర్‌ను కస్టమర్ల నుంచి వసూలు చేయరాదని.. వ్యాపారులే భరించాలని స్పష్టం చేసింది. అలాగే ఎండీఆర్ చార్జీల భారాన్ని వ్యాపారులు వినియోగదారులపై మోపకుండా చూడాలని బ్యాంకులను ఆదేశించింది. అదే సమయంలో యూపీఐ యాప్‌ల ప్రొవైడర్లు ప్లాట్‌ఫాం ఫీజులు లేదా హిడెన్ చార్జీలు వసూలు చేయడాన్ని నిషేధించింది. కీలక రంగాలకు యూపీఐ చెల్లింపులపై.. అయితే రైల్వే టికెట్ల బుకింగ్, టెలికం రీచార్జీలు, బీమా ప్రీమియం చెల్లింపులు, పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపుకోవడం వంటి వాటికి వ్యక్తులు రూ. 2 వేలకుపైగా జరిపే యూపీఐ చెల్లింపులపై ఒక్కో లావాదేవీకి రూ. 5 చొప్పున ఎండీఆర్ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే రూ. 2 వేలకు మించిన విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, పైప్డ్ గ్యాస్ బిల్లులపై జరిపే యూపీఏ చెల్లింపులతోపాటు రూ. 2 వేలకు మించిన స్కూలు ట్యూషన్ ఫీజు, యూనివర్సిటీ ఫీజు చెల్లింపులపైనా ఒక్కో లావాదేవీపై రూ. 5 చొప్పున ఎండీఆర్ ఉంటుందని పేర్కొంది. అయితే రూ. 2 వేలకన్నా తక్కువగా ఉండే బిల్లులు, ఫీజులపై మాత్రం ఎలాంటి టీడీఆర్ ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మరోవైపు మ్యూచువల్ ఫండ్లు, సెక్యూరిటీల చెల్లింపులు, స్టాక్‌బ్రోకర్లు, డీలర్ల ద్వారా జరిపే చెల్లింపులపై 0.02 శాతం టీడీఆర్ వర్తిస్తుందని తెలిపింది. అయితే వ్యక్తుల ఖాతా నుంచి వ్యాపారుల ఖాతాకు నేరుగా జరిగే యూపీఐ చెల్లింపులకు మాత్రమే ఎండీఆర్ వర్తిస్తుందని.. యుటిలిటీ బిల్లులు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, పునరావృత పెట్టుబడులకు సంబంధించి అమలయ్యే యూపీఐ మ్యాండేట్లు లేదా ఆటోపే విధానాలకు ఎండీఆర్ ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఎందుకీ చార్జీ? మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ద్వారా వసూలయ్యే మొత్తంలో కొంత యూపీఐ లావాదేవీల సేవలు అందిస్తున్న బ్యాంకులు, యాప్‌లకు పంచుతామని ఎన్పీసీఐ తెలిపింది. అలాగే మిగిలిన మొత్తాన్ని దేశంలో మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల ఊతానికి, నూతన ఆవిష్కరణాలు, సైబర్ సెక్యూరిటీ, కస్టమర్ సర్వీస్ రంగాలకు ఉపయోగిస్తామని వివరించింది. అలాగే టైర్–3 పట్టణాలు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ–కాశ్మీర్, లద్దాఖ్‌లలో డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ఆర్థిక రాయితీలు ఇవ్వడానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది. కొత్త వ్యాపారులను డిజిటల్ పరిధిలోకి తీసుకురావడానికి ఈ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించనుంది. దేశంలో 2021లో కోవిడ్ వ్యాప్తి వేళ యూపీఐ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఎండీఆర్ చార్జీని తొలగించిన కేంద్ర ప్రభుత్వం.. దీనివల్ల బ్యాంకులు, పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లకు అయ్యే వ్యయాన్ని బడ్జెట్ కేటాయింపుల ద్వారా భరిస్తూ వచ్చింది. అయితే యూపీఏ సేవల నిర్వహణ, సర్వర్ల బ్యాండ్‌విడ్త్ వ్యయం, బ్యాంకుల సాంకేతిక సహాయ ఖర్చులు ఏటా సుమారు రూ. 20 వేల కోట్లను చేరడంతో తమ బడ్జెట్ కేటాయింపుల ద్వారానే ఆ మొత్తాన్ని భర్తీ చేయలేమని కేంద్రం చెబుతోంది. యూపీఐని నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకారం ఆగస్టులో దేశవ్యాప్తంగా రూ.29,82,356 కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయి. అలాగే లావాదేవీల సంఖ్య 2,451 కోట్లు దాటింది. లావాదేవీల వాటా ఇలా.. – ఆగస్టులో నమోదైన యూపీఐ లావాదేవీల సంఖ్యలో 63 శాతం వాటా వ్యాపారులకు చేసిన చెల్లింపులదే. – వ్యాపారులకు చేసిన మొత్తం చెల్లింపుల్లో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీల వాటా 67 శాతం. అంటే వ్యాపార రంగంలో జరిగే మెజారిటీ నగదు చలామణి పెద్ద మొత్తాల్లోనే సాగుతోంది. – సంఖ్య పరంగా చూస్తే రూ.2,000 పైబడిన లావాదేవీలు కేవలం 4 శాతం మాత్రమే. కానీ విలువ పరంగా అవి 67 శాతం ఉండటం వల్ల ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లు, బట్టలు, బంగారు ఆభరణాలు, విమాన/రైలు టికెట్లు, హోటల్ బిల్లుల వంటి పెద్ద చెల్లింపులపై ఈ అదనపు భారం పడనుంది. – వ్యాపారులు ఈ ఎండీఆర్ భారాన్ని తాము భరించలేక వినియోగదారులపైకి నెట్టేసే ప్రమాదం ఉంది. దీనివల్ల పెద్ద కొనుగోళ్లు చేసేటప్పుడు ప్రజలు యూపీఐని పక్కనపెట్టి మళ్లీ నగదు వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. – నెలవారీ వ్యాపార టర్నోవర్ రూ.1 లక్ష లోపు ఉన్న చిన్న చిన్న దుకాణదారులకు ఈ రుసుము నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు. – ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు పంపే వ్యక్తిగత నగదు బదిలీల విషయానికి వస్తే మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో దీని వాటా అత్యధికంగా 70 శాతం. – పర్సన్–టు–పర్సన్ విభాగంలో జరిగిన మొత్తం లావాదేవీల విలువలో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన బదిలీల వాటా ఏకంగా 85 శాతం నమోదైంది. – సంఖ్య పరంగా ఇవి 18 శాతం మాత్రమే అయినప్పటికీ, విలువలో 85 శాతం కలిగి ఉండటం గమనార్హం. మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్): మనం ఏదైనా దుకాణానికి వెళ్లి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ పద్ధతిలో డబ్బులు చెల్లించినప్పుడు.. ఆ సేవను అందించినందుకు బ్యాంకులు, చెల్లింపు కంపెనీలు వ్యాపారి నుండి వసూలు చేసే రుసుము. – డిజిటల్ చెల్లింపు చేసినప్పుడు ఆ డబ్బు వినియోగదారుడి ఖాతా నుండి వ్యాపారి ఖాతాకు సురక్షితంగా చేరాలి. దీనికోసం పని చేసే బ్యాంకులు, కార్డు కంపెనీలు, యాప్‌లు తమ సాఫ్ట్వేర్, భద్రతను నిర్వహించడానికి ఈ ఛార్జీని తీసుకుంటాయి. – నిబంధనల ప్రకారం ఈ భారాన్ని వ్యాపారస్తులే భరించాలి. వినియోగదారులు కాదు. ఉదాహరణకు ఈ రుసుము 1 శాతం ఉందనుకుందాం. దుకాణంలో మీరు రూ.3,000 చెల్లిస్తే వ్యాపారికి రూ.2,700 మాత్రమే అందుతాయి. ఛార్జీల కింద రూ.30 కట్ అవుతుంది. – వ్యాపారస్తులు తమ లాభాలు తగ్గిపోకుండా ఉండటానికి ఈ భారాన్ని వస్తువుల ధరలు పెంచి చివరికి వినియోగదారుల పైకే నెట్టేసే ప్రమాదం ఉంది. -
కేంద్రం ఆగ్రహం.. భారత్‌లో కార్యకలాపాలపై మెటా కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యల నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను నేరుగా పోలీసులకు సమాచారం అందించేందుకు అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.దేశంలో సోషల్ మీడియా సంస్థలు కార్యకలాపాలు నిర్వహించాలంటే చిన్నారుల ఆన్లైన్ భద్రత ప్రాథమిక సూత్రమని, ఇందులో ఎలాంటి రాజీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్‌లలో చిన్నారుల లైంగిక వేధింపులు, దోపిడీకి సంబంధించిన కంటెంట్, ప్రకటనలు వస్తున్నట్లు వార్తలు రావడంతో కేంద్రం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఉక్కుపాదం మోపుతోంది.చిన్నారుల భద్రతకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసుల వివరాలను ఇకపై భారతీయ చట్ట అమలు సంస్థలకు అందించేందుకు మెటా అంగీకరించింది. ఆన్లైన్లో పిల్లల భద్రత అనేది ఏ సోషల్ మీడియా సంస్థకైనా అత్యంత ప్రాథమిక, అనివార్యమైన సూత్రమని ప్రభుత్వం తేల్చిచెప్పింది.ప్లాట్‌ఫామ్‌లలో హానికరమైన సమాచారాన్ని ముందస్తుగా గుర్తించి, ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు తీసుకోని సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికలను పిల్లలకు పూర్తిగా సురక్షితంగా మార్చే దిశగా మెటా తీసుకున్న ఈ నిర్ణయం ఒక కీలకమైన తొలి అడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా పిల్లల భద్రత కోసం ముందస్తు రక్షణ చర్యలు చేపట్టేలా ప్రభుత్వం నిరంతరం చర్చలు జరుపుతోంది. -
బ్రిక్స్ అతిథులకు ‘దేశీ’ విందు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే దేశాధినేతలకు, విశిష్ట అతిథులకు భారతీయ సంప్రదాయ వంటకాలను వడ్డించేందుకు కేంద్ర ప్రభుత్వం, నగరంలోని హోటళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల అభిరుచులకు అనుగుణంగా ఆహార మెనూను రూపొందించాయి. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ దేశీ, విదేశీ రుచుల కలయికతో వంటకాలను సిద్ధం చేస్తున్నాయి. సిరిధాన్యాలతో వంటకాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్న సిరిధాన్యాలతో (బాజ్రా, జొన్న, రాగి) కూడిన వంటకాలకు మెనూలో ప్రత్యేక స్థానం కల్పించారు. రాగి దోశ, బాజ్రా ఉప్మా, మిల్లెట్ పొంగల్‌తో పాటు సీజనల్ పండ్లు, కొబ్బరి నీళ్లు, తాజా మజ్జిగను అల్పాహారంగా అందించనున్నారు. మధ్యాహ్న భోజనంలో గుజరాతీ, రాజస్తానీ, దక్షిణ భారతీయ థాలీలను ఏర్పాటు చేశారు. కశ్మీరీ పులావ్, దక్కనీ తడ్కా, హైదరాబాదీ వెజ్, నాన్‌వెజ్ బిర్యానీ, సౌత్ ఇండియన్ సాంబార్ ఈ మెనూలో ఉన్నాయి. విదేశీ ప్రతినిధుల డైట్‌ను దృష్టిలో ఉంచుకుని నూనె, మసాలాలు లేని కస్టమైజ్డ్ కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్ కోసం లైవ్ కుకింగ్ కౌంటర్లు కూడా అందుబాటులో ఉంచారు. జైశంకర్ ఆధ్వర్యంలో ‘దేశ్ కీ థాలీ’ బ్రిక్స్ సదస్సు జరుగునన్న ‘భారత్ మండపం’లో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విదేశీ ప్రతినిధులకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాలకు చెందిన నలభీములు ‘దేశ్ కీ థాలీ’ని సిద్ధం చేయబోతున్నారు. దేశాధినేతల కోసం లక్నోవీ కబాబ్, తందూరీ వంటకాలు, స్లో కుక్డ్ గ్రేవీ వంటకాలను ప్రత్యేకంగా వడ్డిస్తారు. వారి మతపరమైన ప్రాధాన్యతలు, వ్యక్తిగత అభిరుచులను దృష్టిలో పెట్టుకొని శాకాహార, మాంసాహార వంటకాల తయారీ కోసం వేర్వేరు సెక్షన్లు, ప్రత్యేక కిచెన్లను ఏర్పాటు చేశారు. ల్యాబ్‌లో ఆహార పదార్థాల పరీక్షలు బ్రిక్స్ సదస్సులో అతిథులకు వడ్డించే ఆహారం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడడం లేదు. ఆహార నాణ్యత, పరిశుభ్రతపై భారత ఆహార భద్రత, నాణ్యాతా ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) పకడ్బందీ చర్యలు చేపట్టింది. హోటళ్లలో వంటలకు వాడే ముడిసరుకులు, సుగంధ ద్రవ్యాలు, బేకరీ ఉత్పత్తులను క్రమం తప్పకుండా ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారు. అతిథులకు వడ్డించే ముందు ఆహార నాణ్యతను తనిఖీ చేయడానికి ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, మైక్రోబయాలజిస్టులను నియమించారు. ఐదు నక్షత్రాల హోటళ్లలో బస సదస్సుకు హాజరవుతున్న అతిథుల బస కోసం ఢిల్లీలోని ల్యుటియెన్స్లో ఉన్న తాజ్‌మహల్ హోటల్, తాజ్ ప్యాలెస్, ఐటీసీ మౌర్య, ద లీలా ప్యాలెస్, ద ఒబెరాయ్, షాంగ్రిలా, ద లలిత్ తదితర ఫైవ్ స్టార్ హోటళ్లలో వీవీఐపీ బ్లాక్‌లను కేటాయించారు. రష్యా, చైనా, యూఏఈ, దక్షిణాఫ్రికా తదితర దేశాల ప్రభుత్వ, వ్యాపార ప్రతినిధులకు ద లలిత్ హోటల్లో బస కల్పించారు. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్‌్ట, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా దేశాల అగ్రనేతలు, దౌత్యవేత్తలకు ఐటీసీ మౌర్య, తాజ్‌మహల్, ద లీలా ప్యాలెస్ హోటళ్లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. -
రహదారులు ఇలాగేనా ఉండేది?
రాయ్‌బరేలీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో పర్యటించారు. అమేథీ ఎంపీ కిషోరీ లాల్ శర్మతో కలిసి కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించేందుకు జరిగిన ఈ సమావేశానికి ఉత్తరప్రదేశ్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి మనోజ్ కుమార్ పాండే, ఉద్యానవన శాఖ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయ్‌బరేలీలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) కింద నిర్మించిన రహదారుల దుస్థితిని రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గుంతలమయమైన రోడ్ల ఫోటోలను ప్రదర్శించారు. వాటి నిర్మాణానికి బాధ్యత వహించిన ఏజెన్సీల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏ రోడ్డుకు ఏ సంస్థ బాధ్యత వహిస్తుందో తెలిపే రికార్డులను నిర్వహించాలని పేర్కొన్నారు. దెబ్బన్న రోడ్లను మరమ్మతు చేస్తామని చేపడతామని పీఎంజీఎస్‌వై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హామీ ఇచి్చనట్లు దిశా కమిటీ నామినేటెడ్ సభ్యుడు ఉమేష్ బహదూర్ సింగ్ చెప్పారు. జిల్లాలోని రోడ్ల పరిస్థితిని స్వయంగా పరిశీలించి, ఫోటోల రూపంలో సాక్ష్యాలను సమరి్పంచిన తర్వాతే ఈ సమస్యను రాహుల్ గాంధీ లేవనెత్తారని వెల్లడించారు. దిశా సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. రాహుల్‌పై మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించడం కంటే వాటిలో లోపాలను వెతకడానికే ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తప్పుపట్టారు. -
ఉల్లిపాయలు కిలో రూ. 35
న్యూఢిల్లీ: దేశంలో ఉల్లిపాయల కొరత నానాటికీ పెరిగిపోతోంది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాయితీ అమ్మకాల్లో భాగంగా 17 నగరాల్లో సుమారు 4,000 టన్నుల బఫర్ స్టాక్ ఉల్లిపాయలను విక్రయించినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే ఆదివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్సీసీఎఫ్, నాఫెడ్ ద్వారా 2026 సంవత్సరం కోసం బఫర్ స్టాక్ కింద 1.21 లక్షల టన్నుల ఉల్లిపాయలను నిల్వ చేసింది. కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో ఉల్లిపాయలను కిలోకు రూ.35 చొప్పున రాయితీ ధరకు ప్రభుత్వం విక్రయిస్తోంది. కాందా ఎక్స్‌ప్రెస్ ద్వారా భారీ సరుకు ఇప్పటికే ఢిల్లీ, చెన్నై నగరాలకు చేరుకుందని, రాబోయే రోజుల్లో గౌహతికి తరలించేందుకు మూడో రైలును చేస్తున్నామని నిధి ఖరే చెప్పారు. రాయితీపై ఉల్లిపాయల విక్రయాలతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించిందని, బయటి మార్కెట్లో ధరలు స్వల్పంగా తగ్గాయని అన్నారు. సెపె్టంబర్ 5న ఢిల్లీలో కిలో ఉల్లిపాయల చిల్లర ధర రూ.58, ముంబైలో రూ.53, చెన్నైలో రూ.63, రాంచీలో రూ.40గా ఉండగా, సగటు టోకు ధర కిలోకు రూ.42.79గా నమోదైంది. కొత్త ఖరీఫ్ ఉల్లి పంట పరిస్థితి ఆశాజనకంగా ఉందని అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ రెండో వారం నుంచి ఈ పంట మార్కెట్‌కు వస్తుందని, తద్వారా సరఫరాపై ఒత్తిడి తగ్గి, ధరల విషయంలో మరింత ఉపశమనం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. -
ఇస్రోలో ఏం జరుగుతోంది?.. కేంద్రంపై ఉద్యోగుల ఆగ్రహం
ఆరు ఏళ్ల క్రితం అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు కేంద్రం తలుపులు తెరిచింది. ఇప్పుడు అదే నిర్ణయం ఇస్రోలో కొత్త చర్చకు తెరతీసింది. రాకెట్ల తయారీ, ఉపగ్రహాల నిర్మాణం, లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణ వంటి కీలక బాధ్యతలు క్రమంగా ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు బదిలీ కానున్నాయన్న వార్తల నేపథ్యంలో.. ఇస్రోకు చెందిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు తొలిసారి సమష్టిగా గళం విప్పాయి. అసలు కేంద్ర ప్రభుత్వ విధానం ఏంటి? ఇస్రో భవిష్యత్ పాత్ర ఏమిటి? తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలతో ఇస్రో ఛైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి వి. నారాయణన్‌కు లేఖ రాశాయి. ప్రైవేటీకరణ విధానం, ఇస్రో భవిష్యత్ పాత్ర, ప్రస్తుత ఉద్యోగుల పరిస్థితి, భవిష్యత్ నియామకాలపై అధికారిక వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి.సెప్టెంబర్ 4న ఇస్రో ఛైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి నారాయణన్‌కు ఉద్యోగ సంఘాలు లేఖ రాశాయి. ఇటీవల ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) ఛైర్మన్ పవన్ కుమార్ గోయెంకా చేసిన వ్యాఖ్యలను వారు ప్రస్తావించారు. భవిష్యత్‌లో ఇస్రో స్వయంగా లాంచ్ వెహికల్స్ తయారు చేయదని.. వాటి తయారీ మొత్తం ప్రైవేటు రంగం లేదా ప్రభుత్వ రంగ సంస్థల చేతుల్లోకి వెళ్తుందని గోయెంకా పేర్కొన్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ మార్పు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV)తో ప్రారంభమైందని.. భవిష్యత్‌లో PSLV, LVM3 వంటి కీలక రాకెట్ల తయారీకి కూడా విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి.ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందా?లాంచ్ వెహికల్స్ తయారీ, సాధారణ ఉపగ్రహాల ఉత్పత్తిని ఇస్రో నుంచి బయటకు తరలించడం, కులశేఖరపట్నంలో ప్రతిపాదిత స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ వంటి కొత్త మౌలిక వసతులను ప్రైవేటు సంస్థలకు తెరవడంపై కూడా ఉద్యోగ సంఘాలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఇప్పటికే ఇస్రోకు చెందిన దాదాపు 120 సాంకేతికతలను ప్రైవేటు రంగానికి బదిలీ చేసినట్లు లేఖలో పేర్కొన్నాయి. ఈ పరిణామాలపై అధికారిక విధాన పత్రం లేకపోవడం ఉద్యోగుల్లో, వారి కుటుంబాల్లో ఆందోళనకు కారణమవుతోందని సంఘాలు తెలిపాయి. ఇస్రోలో అంతర్గత పనులు తగ్గిపోతే ఉద్యోగుల సంఖ్యపై కోత పడే అవకాశం ఉందని, ప్రమోషన్లు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కూడా దెబ్బతినవచ్చని పేర్కొన్నాయి.‘ఇది కేవలం తయారీ కాంట్రాక్ట్ కాదు’లాంచ్ వెహికల్ డిజైన్, తయారీ, ఇంటిగ్రేషన్, పరీక్షలు, ప్రయోగాలు.. ఇవి కేవలం తయారీ కాంట్రాక్టులు కాదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఇవే ఇస్రోకు ఉన్న ప్రధాన సాంకేతిక సామర్థ్యం, దశాబ్దాలుగా ఏర్పడిన సంస్థాగత అనుభవం, వ్యూహాత్మక సామర్థ్యమని పేర్కొన్నాయి. అయితే ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి తాము వ్యతిరేకం కాదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. NSIL ద్వారా నిర్ణీత విధానంలో వాణిజ్య కార్యకలాపాలు, ప్రైవేటు భాగస్వామ్యాన్ని స్వాగతిస్తామని తెలిపాయి. అయితే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం, ఇస్రో సొంత తయారీ సామర్థ్యాన్ని పూర్తిగా తొలగించడం మధ్య స్పష్టమైన గీత ఉండాలని డిమాండ్ చేశాయి.నారాయణన్‌కు కీలక ప్రశ్నలుఇదే ఇప్పుడు ఉద్యోగ సంఘాల ప్రధాన ఆందోళన. రాకెట్ డిజైన్ చేయడం మాత్రమే కాదు.. దాని తయారీ, అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, పరీక్షలు, ప్రయోగం వరకు మొత్తం ప్రక్రియలో ఇస్రోకు దశాబ్దాల అనుభవం ఉంది. ఈ పనులు బయటకు వెళ్లిపోతే ఇస్రో కేవలం పరిశోధన, డిజైన్ సంస్థగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గోయెంకా వ్యాఖ్యలు నిజంగా కేంద్ర ప్రభుత్వ విధానమేనా? లేక వ్యక్తిగత అభిప్రాయమా? PSLV, LVM3, SSLVతో పాటు భవిష్యత్ లాంచ్ వెహికల్స్ డిజైన్, అభివృద్ధి, తయారీ, ఇంటిగ్రేషన్, పరీక్షలు, ప్రయోగ బాధ్యతలు ఇస్రో వద్దే కొనసాగుతాయా? అనే అంశాలపై అధికారిక స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. మొత్తంగా, అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని విస్తరించే కేంద్రం విధానంపై ఇస్రో ఉద్యోగుల్లోనే ప్రశ్నలు తలెత్తడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కేంద్రం విధానం ఏంటి?కేంద్రం తీసుకున్న దిశ మాత్రం స్పష్టంగానే కనిపిస్తోంది. 2023 స్పేస్ పాలసీ ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు మరింత పెద్ద పాత్ర కల్పించింది. NSIL వాణిజ్యీకరణ, పరిశ్రమ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తుండగా.. IN-SPACe ప్రైవేటు సంస్థలకు అనుమతులు, ప్రోత్సాహం, పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. 2025-26లో IN-SPACe, NSIL, ISRO కలిసి 100 టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఒప్పందాలు పూర్తి చేశాయని కేంద్రం తెలిపింది. SSLV టెక్నాలజీని HALకు బదిలీ చేయడం ఇందులో అత్యంత కీలకమైన ఉదాహరణగా నిలిచింది. PSLV, LVM3 టెక్నాలజీ బదిలీకి కూడా ప్రక్రియ మొదలైంది. అయితే ఇస్రో పూర్తిగా రాకెట్ల తయారీ నుంచి వైదొలగుతుందా? అన్న అంశంపై ఇప్పటివరకు ఉద్యోగ సంఘాలు కోరుతున్న స్థాయిలో స్పష్టమైన అధికారిక వివరణ వెలువడలేదనే అంశమే ప్రస్తుత వివాదానికి కేంద్రంగా ఉంది.ఇదీ చదవండి: గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి మృతి -
జీఎస్టీ 2.0తో వృద్ధికి కొత్త ఇంధనం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జీఎస్టీ 2.0’ పన్ను సంస్కరణలు ఆటోమొబైల్ రంగంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థలోని పలు రంగాలకు నూతన ఉత్తేజాన్నిచ్చాయని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం వంటి అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ సంస్కరణలు అవసరమైన రక్షణగా నిలిచాయన్నారు. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో వాటాదారులను ఉద్దేశించి భార్గవ మాట్లాడారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అద్భుతమైన పనితీరు కనబరుస్తోంది. జీఎస్టీ వసూళ్లు మునుపెన్నడూ లేనంత గరిష్ట స్థాయిలో ఉన్నాయి. ఇరాన్ సమస్యలు, పశ్చిమాసియా యుద్ధం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ఈ పురోగతి కొనసాగుతోంది. జీఎస్టీ సంస్కరణలు లేకపోతే ఈ క్లిష్ట పరిస్థితుల్లో సంస్థ ఈ స్థాయిలో రాణించేది కాదు’’ అని అన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో దేశీయ కార్ల మార్కెట్‌కు కూడా గణనీయమైన ప్రయోజనం కలుగుతుందన్నారు. గత అయిదేళ్లతో పోలిస్తే రాబోయే రోజుల్లో చిన్న కార్ల మార్కెట్ వాటా మరింత వేగంగా పెరుగుతుందని అంచనా వేశారు. గత సెపె్టంబరులో జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత కార్ల డిమాండ్‌పై మారుతీ సుజుకీ తన అంచనాలను పునఃపరిశీలిస్తోందని భార్గవ తెలిపారు. 2031 నాటికి 63 లక్షలకు కార్ల మార్కెట్ భారత కార్ల మార్కెట్ 2031 నాటికి 61 లక్షల నుంచి 63 లక్షల యూనిట్లకు చేరే అవకాశం ఉందని భార్గవ అంచనా వేశారు. ఈ వృద్ధికి అనుగుణంగా కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం చేపడుతున్న విస్తరణ ప్రాజెక్టులు పూర్తయితే మారుతీ సుజుకీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2026–27 నాటికి 29 లక్షల యూనిట్లకు, 2030–31 నాటికి 36.5 లక్షల యూనిట్లకు చేరుతుందని వివరించారు. హరియాణాలోని ఖర్ఖోడా ప్లాంట్‌లో రెండు ఉత్పత్తి లైన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని, మూడో లైన్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. గుజరాత్‌లోని హన్సల్పూర్ ప్లాంట్‌లో 2.5 లక్షల యూనిట్ల సామర్థ్యం గల నాలుగో లైన్‌ను ప్రారంభించడంతో అక్కడ మొత్తం సామర్థ్యం 10 లక్షల యూనిట్లకు పెరిగిందన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సుజుకీకి అతిపెద్ద ప్లాంట్ అని పేర్కొన్నారు. గుజరాత్‌లోని సానంద్‌లో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని భార్గవ తెలిపారు. అక్కడ మొత్తం 10 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం సుమారు రూ.35,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించామని చెప్పారు. సంస్కరణలు జాతీయ కర్తవ్యం దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం, పోటీతత్వాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను విస్తరించే సంస్కరణలను అన్ని రాజకీయ పారీ్టలు జాతీయ కర్తవ్యంగా భావించాలని భార్గవ కోరారు. సంపద సృష్టి లేకుండా మరింత సుసంపన్న సమాజాన్ని నిర్మించడం, ఆర్థికంగా బలమైన భారత్‌ను తీర్చిదిద్దడం అసాధ్యం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, వ్యాపారం నిర్వహణను సులభతరం చేయాలని సూచించారు. టెక్నాలజీ వినియోగాన్ని పెంచడం వల్ల అవినీతి, జాప్యం తగ్గుతాయని అన్నారు. ప్రభుత్వాలు ప్రైవేట్ రంగంపై నమ్మకం ఉంచడంతో పాటు పోటీ శక్తిని ప్రోత్సహించాలని సూచించారు. ‘‘ఆర్థిక బలం ఉంటేనే ప్రపంచంలో భారత్ బలంగా ఉంటుంది’’ అని భార్గవ పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు విస్తరించే కొద్దీ సంపద సృష్టి, ప్రభుత్వ ఆదాయాలు, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు. -
5 లక్షలకు 36 వేల వడ్డీ! పోస్టాఫీస్ లో అదిరిపోయే స్కీమ్
-
డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యానికి చేరువలో..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2026–27) బడ్జెట్ లక్ష్యానికి అనుగుణంగా డిజిన్వెస్ట్‌మెంట్, ఆస్తుల మానిటైజేషన్ సాగుతోంది. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే రూ. 80,000 కోట్ల సమీకరణ టార్గెట్‌లో 78 శాతాన్ని(రూ. 62,124 కోట్లు) ప్రభుత్వం సాధించింది. దీనిలో భాగంగా 9 పీఎస్‌యూలలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 55,757 కోట్లు సమకూర్చుకుంది. వీటిలో ఎల్ఐసీ, ఇంధన రంగ దిగ్గజం కోల్ ఇండియా ఉన్నాయి.వీటితోపాటు ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్స్ కార్పొరేషన్ వ్యూహాత్మక విక్రయం, ఎస్‌యూయూటీఐ నుంచి రెమిటెన్సులు సైతం జాబితాలో చేరాయి. ప్రధానంగా ఎల్ఐసీలో 6.5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 31,515 కోట్లు లభించాయి. కోల్ ఇండియాలో 2 శాతం వాటా అమ్మకంతో మరో రూ. 5,542 కోట్లు సమీకరించింది. ఎన్‌హెచ్‌పీసీలో 6 శాతానికిపైగా వాటా అమ్మడంతో రూ. 4,357 కోట్లు జమయ్యాయి. తాజాగా హింద్ కాపర్ ఈ వారం మొదట్లో మైనింగ్ రంగ పీఎస్‌యూ హిందుస్తాన్ కాపర్‌లో ఓఎఫ్ఎస్ ద్వారా ప్రభుత్వం 6 శాతం వాటా విక్రయించిన విషయం విదితమే. దీంతో రూ. 3,041 కోట్లు సమకూరాయి. ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్ఎల్సీ ఇండియా, జీఐసీ, ఐఆర్ఎఫ్సీ, కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో వాటాలు విక్రయించింది. ఇని్వట్ ఆస్తుల మానిటైజేషన్ ద్వారా రూ. 6,367 కోట్లు లభించగా.. డిజిన్వెస్ట్‌మెంట్, ఆస్తుల మానిటైజేషన్ ద్వారా ప్రభుత్వం మొత్తం రూ. 62,124 కోట్లు సమీకరించింది. ఇది బడ్జెట్ లక్ష్యం రూ. 80,000 కోట్లలో 78 శాతంకావడం గమనార్హం! ఇప్పటికే ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటా విక్రయ అంశాన్ని చేపట్టింది. ఈ ఏడాది మొదట్లో ఈ సన్నాహాలు విఫలమైనప్పటికీ దుబాయ్ కంపెనీ ఎమిరేట్స్ ఎన్డీబీ, ప్రేమ్‌వత్సా సంస్థ ఫెయిర్‌ఫాక్స్ హోల్డింగ్స్ సవరించిన బిడ్స్ దాఖలు చేశాయి. -
ఉల్లి ధరల కట్టడికి రంగంలోకి కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. బఫర్ నిల్వ ల్లోని ఉల్లిని మార్కెట్లోకి విడుదల చేస్తూ ఢిల్లీలో కిలో రూ.35కే రాయితీపై విక్రయాలను ప్రారంభించింది. త్వరలో మరిన్ని నగరాలకు ఈ పథకాన్ని విస్తరించేందుకు రంగం సిద్ధం చేసింది. అక్రమంగా నిల్వ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అకాల వర్షాలు.. పాడైన నిల్వలు.. దేశంలో ఉల్లి దిగుబడి పుష్కలంగా ఉంది. దేశీయ అవసరాలకు మించిన ఉత్పత్తి ఉన్నప్పటికీ ధరల పెరుగుదలకు ప్రధానంగా అకాల వర్షాలు, నిల్వ ఉంచిన ఉల్లి కుళ్లిపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి. 2025–26లో దేశంలో 307.37 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి జరిగింది. దేశీయంగా ఏడాదికి 204 లక్షల టన్నుల ఉల్లి అవసరమవుతుంది. సాధారణ పరిస్థితుల్లో ఈ ఉత్పత్తి దేశీయ డిమాండ్‌ను సులభంగా తీర్చగలిగేది. కానీ ఈసారి రబీ పంట కోత సమయంలో కురిసిన అకాల వర్షాలు ఉల్లి డిమాండ్ లెక్కలను మార్చేశాయి. మార్చి, ఏప్రిల్‌లో కురిసిన భారీ వర్షాలతో పొలాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో తేమశాతం పెరిగి నిల్వ చేసిన ఉల్లిలో ఫంగస్ ఏర్పడి కుళ్లిపోవడం ప్రారంభమైంది. సాధారణంగా ఏటా ఉల్లి ఉత్పత్తిలో 25 శాతం వరకు నష్టం జరుగుతుంది. ఈ ఏడాది వర్షాలు, అధిక తేమ కారణంగా ఈ నష్టం 35–40 శాతానికి పెరిగినట్లు అంచనా. అంటే, 110 నుంచి 120 లక్షల టన్నుల ఉల్లి కుళ్లిపోయినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో మార్కెట్లకు చేరుతున్న నాణ్యమైన ఉల్లి పరిమాణం తగ్గింది. ఇదే ధరల పెరుగుదలకు కారణమైంది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.70 వరకు చేరింది. రాజధానిలో సంచార విక్రయ కేంద్రాలు ధరల కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం ఎన్సీసీఎఫ్, నాఫెడ్ ఆధ్వర్యంలో మొబైల్ వాహనాలు, రిటైల్ కేంద్రాల ద్వారా రాయితీ ఉల్లిని విక్రయిస్తున్నారు. ఢిల్లీలో 40 ఎన్సీసీఎఫ్ మొబైల్ వాహనాలు, 50 నాఫెడ్ మొ బైల్ వాహనాలు, వాటి రిటైల్ కేంద్రాలతో పాటు కేంద్రీయ భండార్ దుకాణాల్లోనూ ఉల్లిని అందుబాటుకి తెచ్చారు. త్వరలో లక్నో, పటా్న, అమృత్సర్, కోల్‌కతా, చండీగఢ్ తదితర నగరాలకు రాయితీపై ఉల్లిని విక్రయించనున్నారు. దేశంలోని ప్రధాన వినియోగ కేంద్రాలకు రైలు, రోడ్డు మార్గాల్లో ఉల్లిని తరలించనున్నారు. ఇదే సమయంలో ఉల్లిని అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించడం, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ధరల పెరుగుదల కోసం ఉల్లిని దాచిపెట్టే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పండుగల సమయంలో సరఫరాకు ఇబ్బంది లేకుండా బఫర్ నిల్వలను అవసరమైన మేరకు విడుదల చేస్తామని వెల్లడించింది. -
షుగర్ రేటు వింటే బీపీ
దేశంలో చక్కెర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. చెరకు పంట నష్టం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశీయంగా ఉత్పత్తి అంచనాలు తగ్గడం, పండుగల సీజన్ నేపథ్యంలో డిమాండ్ భారీగా ఎగబాకడంతో ధరలు దూసుకెళ్తున్నాయి. నెల రోజుల్లోనే 30 % ఎగసిన రిటైల్ రేటు ప్రస్తుతం సగటున కేజీ రూ. 63 స్థాయికి చేరింది. దీంతో సరఫరా పెంచి ధరలను అదుపులో ఉంచేందుకు దశాబ్దకాలం తర్వాత కేంద్రం తొలిసారి దిగుమతులకు తలుపులు తెరిచింది. అక్రమ నిల్వలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగింది. మరోవైపు చక్కెర కొరతకు ప్రభుత్వ ఇథనాల్ పాలసీ కూడా కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సాక్షి, బిజినెస్ డెస్క్: చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారత్.. దాదాపు పదేళ్ల తర్వాత దిగుమతుల బాట పట్టింది. సరఫరా తగ్గడంతోపాటు పండుగలు,వివాహాల సీజన్ దగ్గరపడుతుండటంతో చక్కెరకు డిమాండ్ జోరందుకుంది. ఇళ్లలో వినియోగంతోపాటు స్వీట్లు, బేకరీలు, పానీయాలు, ఇతర ఆహార ఉత్పత్తుల తయారీలోనూ చక్కెర అవసరం పెరుగుతోంది. దీంతో రిటైల్‌గా కిలో చక్కెర ధర జూలై 20న రూ. 48 స్థాయిలో ఉండగా తాజాగా రూ. 63 (దేశవ్యాప్త సగటు)కు చేరింది. అంటే ఒక్క నెలలోనే దాదాపు 30 శాతం పెరిగింది. ఏడాదిలో దాదాపు 35 శాతం జంప్ చేసింది. కొందరు వ్యాపారులు, ఉత్పత్తిదారులు నిల్వలు పెంచుకోవడం కూడా సరఫరాపై ప్రభావం చూపుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలను అదుపులో ఉంచడంతోపాటు మార్కెట్లో సరఫరా కొరతకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు తెరతీసింది. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. మిగులు నుంచి కొరతలోకి... భారత్ సాధారణంగా ఏడాదికి 3.2–3.4 కోట్ల టన్నుల చక్కెరను ఉత్పత్తి చేస్తుంది. దేశీయంగా వినియోగం 2.8–2.9 కోట్ల టన్నుల వరకు ఉంటుంది. అంటే పంట బాగా పండితే నికరంగా మిగులు ఉంటుంది. ఎగుమతులు, కొంత ఇథనాల్‌కు మళ్లింపు ద్వారా దీన్ని పరిశ్రమ మేనేజ్ చేస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారింది. పంచదార ఉత్పత్తి అంచనాలు తొలుత 3.43 కోట్ల టన్నులుగా ఉండగా తాజాగా ప్రభుత్వం దాన్ని 3.06 కోట్ల టన్నులకు కుదించింది. దీంతో దేశీ వినియోగం కోసం సరిపడా సరఫరా ఉన్నప్పటికీ అదనంగా అందుబాటులో ఉండే నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. తక్కువ దేశీయ ఉత్పత్తి, పెరిగిన సీజనల్ డిమాండ్‌తోపాటు అకాల వర్షాలు, పంట తెగుళ్ల కారణంగా చెరకు పంట దెబ్బతినడం, అంతర్జాతీయంగా సరఫరా తగ్గడం వంటి అంశాలు కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. నిల్వలపై కేంద్రం నిఘా కొందరు వ్యాపారులు, ఫ్యాక్టరీలు చక్కెరను అవసరానికి మించి నిల్వ చేస్తున్నాయన్న సమాచారం నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా చక్కెర డీలర్లకు 400 టన్నుల నిల్వ పరిమితి విధించింది. దీన్ని 200 టన్నులకు తగ్గించాలని కూడా ఐఎస్ఎంఏ డిమాండ్ చేస్తోంది. బల్క్ వినియోగదారులు (పానియాలు, చాక్లెట్లు, స్వీట్లు–బేకరీ తయారీ తదితర సంస్థలు) 15 రోజుల అవసరానికి మించి నిల్వ చేసుకోకుండా సెప్టెంబర్ 1 నుంచి నియంత్రణలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా నిఘా పెంచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చక్కెర ఫాక్టరీల్లో నిల్వల తనిఖీపై దృష్టిపెట్టారు. ముందస్తు క్రషింగ్... చక్కెర దిగుమతులతోపాటు దేశీయ ఉత్పత్తిని త్వరగా మార్కెట్లోకి తీసుకురావడంపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. సాధారణంగా ప్రారంభమయ్యే సమయం కంటే ముందే అక్టోబర్ 15 నుంచి చెరకు క్రషింగ్ ప్రారంభించాలని రాష్ట్రాలు, చక్కెర కర్మాగారాలకు సూచించింది. ముందస్తు క్రషింగ్ వల్ల అక్టోబర్‌లో చక్కెర ఉత్పత్తి సాధారణంగా ఉండే 3–4 లక్షల టన్నుల నుంచి 10 లక్షల టన్నులకుపైగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంతర్జాతీయంగానూ ధరలు పైపైకి దేశీయ ఉత్పత్తి తగ్గడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కూడా చక్కెర సరఫరా తగ్గుముఖం పట్టింది. 2026–27లో ప్రపంచవ్యాప్తంగా 33 లక్షల టన్నుల మేర చక్కెర కొరత ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. కాగా, అంతర్జాతీయంగా చక్కెర ధర జూన్ 30న టన్నుకు 474 డాలర్ల నుంచి ఆగస్టు 20 నాటికి 552 డాలర్లకు పెరిగింది. అంటే రెండు నెలల్లోనే 16 శాతానికిపైగా ఎగసింది. ఈ నేపథ్యంలో భారత్ దిగుమతులకు తెరతీయడం వల్ల దేశీయంగా సరఫరా పెరిగినా.. అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరగడం వల్ల, రూపాయి క్షీణత కారణంగా దిగుమతులు భారంగా మారొచ్చనేది మార్కెట్ వర్గాల మాట. ఇథనాల్‌కు మళ్లింపు ప్రభావం? చక్కెరను ఇథనాల్ తయారీకి మళ్లించడం వల్లే ప్రస్తుత కొరత ఏర్పడిందన్న విమర్శలు జోరందుకున్నాయి. భారతీయ చక్కెర, బయో ఇందన తయారీదారుల సంఘం (ఐఎస్ఎంఏ) 2025–26 సీజన్ (అక్టోబర్–సెప్టెంబర్)లో నికరంగా చక్కెర ఉత్పత్తి 2.9 కోట్ల టన్నులుగా లెక్కగట్టింది. దీనికి ప్రధానంగా 31 లక్షల టన్నుల చక్కెరకు సమానమైన ఫీడ్‌స్టాక్ ఇథనాల్ కోసం మళ్లిస్తున్నట్లు వెల్లడించింది. దేశీయంగా చెరకు పంటలో ఇది 10 శాతంగా అంచనా. అయితే దేశీయంగా చక్కెర కొరత లేదని రానున్న రోజుల్లో రిటైల్ ధరలు దిగొస్తాయని ఐఎస్ఎంఏ పేర్కొంది. మరోవైపు కేంద్రం ఇథనాల్‌పై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తోంది. ఇథనాల్ కోసం చక్కెర (చెరకు రసం, సిరప్, మొలాసిస్) మళ్లింపు వాటా 2022–23లో సుమారు 12 శాతం ఉండగా 2025–26లో అది 9 శాతానికి తగ్గినట్లు చెబుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం దేశంలో తయారయ్యే ఇథనాల్‌లో దాదాపు మూడొంతుల ఫీడ్‌స్టాక్ ధాన్యాల నుంచి ముఖ్యంగా మొక్కజొన్న నుంచి వస్తోందని స్పష్టం చేసింది. ప్రస్తుత చక్కెర ధరల పెరుగుదల ఇథనాల్ తయారీ కోసం చక్కెరను మళ్లించడం వల్ల కాదనేది కేంద్రం వాదన. దేశంలో చక్కెర నిల్వలేమీ అడుగంటలేదని.. ఉత్పత్తి తగ్గడంతోపాటు పండుగల ముందు పెరిగిన డిమాండ్‌తో సాధారణంగా ఉండే అదనపు నిల్వలు తగ్గిపోవడమే ప్రస్తుత సమస్యకు ప్రధాన కారణమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
తెలంగాణకు అవమానం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం.. వ్యక్తిగా రేవంత్‌రెడ్డికి అనుమతి నిరాకరించడం కాదు.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం, తిరస్కరణ. దీనికి కారణం గుజరాత్ ఆధిపత్యం. దేశ ప్రధాని మోదీ ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు తప్ప భారత ప్రధాని అన్న విషయ విజ్ఞానంతో వ్యవహరించడం లేదు. ఇది తెలంగాణకు జరిగిన అవమానం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి రేవంత్ సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘సీఎం హోదాలో అభివృద్ధి కోసం చేసే పర్యటనను అడ్డుకుని తెలంగాణ పట్ల కేంద్రం స్పష్టమైన వివక్ష ప్రదర్శించింది. ఈ అంశాన్ని మా నాయకులు రాహుల్ గాం«దీ, మల్లికార్జున ఖర్గే, ఇతర నాయకులంతా పార్లమెంటులో లేవనెత్తుతారు. ఇది ఆషామాషిగా తీసుకునే విషయం కాదు’ అని సీఎం మండిపడ్డారు. ‘తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంతో వెళ్తున్నామని గతంలో నేను, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు విదేశాలకు వెళ్లేటప్పుడు పెట్టిన విధానంలోనే దరఖాస్తు పెట్టాం. రాజకీయ కోణంలో అనుమతిని తిరస్కరిస్తున్నట్టు విదేశాంగ శాఖ జవాబు ఇచ్చింది. రాజకీయ కారణం ఏమిటని మోదీని ప్రశ్నిస్తున్నా. మీరు (మోదీ) ఎన్నో దేశాల పర్యటనకు వెళ్లారు. మీ సొంత రాష్ట్రం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆగస్టు 17 నుంచి 24 వరకు 8 రోజుల పాటు అమెరికా, కెనడాలో పర్యటించి వైబ్రెంట్ గుజరాత్ అనే పాలసీని ప్రమోట్ చేయడానికి, రోడ్ షోలు చేసి, పెట్టుబడులు పెట్టాలని కోరడానికి అనుమతిచ్చారు. అదే తెలంగాణ రైజింగ్–2047 పాలసీలో భాగంగా విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసం సీఎంగా అమెరికా పర్యటనకు వెళ్తానంటే నిరాకరిస్తారు. ఇంగ్లండ్, అమెరికా రెండింటికీ ఒకే విధానం, ఒకే అంశాలతో విదేశీ పర్యటన తలపెట్టాను. నిజంగా నా విదేశీ పర్యటనలో విషయం లేదనకుంటే ఇంగ్లండ్‌కు అనుమతి ఎందుకు ఇచ్చారు? అమెరికా పర్యటనకు ఎందుకు తిరస్కరించారు?’ అని రేవంత్ కేంద్రంపై మండిపడ్డారు. మోదీకి బానిసలుగా ఉంటారా? ‘అమెరికా పర్యటనకు అనుమతి తిరస్కరిస్తూ కేంద్రం రాజకీయ కారణాలను అపాదించడాన్ని తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండించాలి. గుజరాత్‌ను సమర్థించి మోదీ, గుజరాత్ చేతుల్లో కట్టుబానిసలుగా బతకదలుచుకున్నారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటదలుచుకున్నారా? అని బీజేపీ తెలంగాణ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నా. తెలంగాణకు పెట్టుబడులు వస్తే గుజరాత్‌కు పోవేమో, గుజరాత్ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందనే కుట్రతో నా పర్యటనను అడ్డుకున్నారు. దీనిపై నేను స్పందించి విదేశీ వేదికపై నుంచి మాట్లాడి ఉంటే.. చూసినవా, దేశ ద్రోహి, విదేశాల్లో భారత దేశ గౌరవానికి భంగం కలిగించిండు అని విమర్శిస్తారనే ఇక్కడికి వచ్చాక ఖండిస్తున్నం. కేంద్రం తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం’ అని సీఎం అన్నారు. లక్ష్యాన్ని ఆపలేరు.. ‘ఇంగ్లండ్‌లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లే వారు ఒక బృందాన్ని హైదరాబాద్‌కు పంపించి ఇక్కడ తమ క్యాంపస్ ప్రారంభించడానికి పరిస్థితులను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్తే ఎంసీఆర్హెచ్ఆర్డీలో స్వల్పకాలిక కోర్సులు, భారత్ ఫ్యూచర్ సిటీలో ఆక్స్ఫర్డ్ క్యాంపస్ ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబద్‌లో తమ క్యాంపస్ ఏర్పాటుకు అంగీకరించారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో మాట్లాడితే షార్ట్ టర్మ్ కోర్సులను ఎంసీఆర్హెచ్ఆర్డీలో ప్రారంభిస్తామన్నారు. అమెరికాలో సైతం బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్, ఎంఐటీ క్యాంపస్, నార్త్ ఈస్టర్న్ క్యాంపస్, వర్జీనియా టెక్ యూనివర్సిటీ వెళ్లాల్సి ఉండే. సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా ఐవీ లీగ్‌లోని టాప్ –10 వర్సిటీలను తెలంగాణకు తీసుకురావాలన్నది నా లక్ష్యం. మీరు నా పర్యటనను అడ్డుకున్నారు.. కానీ నా లక్ష్యాన్ని ఆపలేరు. అందుకే అధికారులను అమెరికాకు పంపించా. ఆక్స్‌ఫర్డ్‌తో అధికారులు ఒప్పందం చేసుకోబోతున్నరు. ఇతర వర్సిటీల ముందు మన ప్రతిపాదనలు ముందుపెట్టబోతున్నారు’ అని సీఎం పేర్కొన్నారు. ప్రధానికి తెలియకుండా జరగలేదు... ‘మేం దరఖాస్తులో వివరాలు ఇవ్వలేదని బీజేపీ నేతలు తప్పుదోవ పట్టించారు. ఏ అధికారిక పర్యటనను అయినా భారత రాయబార కార్యాలయ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తారు. విమానాశ్రయంలో మేము దిగే నాటి నుంచి మళ్లీ తిరిగి వెళ్లే వరకు భారత రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తుంది. ఇది చాటుమాటుగా పర్యటన కాదు. గతంలో విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఈ విషయాలన్నీ తెలుసు. తెలంగాణ సీఎం పర్యటనకు అనుమతిని సమీక్షించకుండా, ప్రధాని దృష్టిలో లేకుండా తిరస్కరించడం జరుగుతుందా? తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారిని శిక్షిస్తామని ప్రపంచానికి సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్, మెట్రో రైలు ఇతర విషయాల్లో తెలంగాణకు సహకరించడం లేదు’ అని రేవంత్ మండిపడ్డారు. అనుమతి నిరాకరణపై విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బీజేపీలో చేరాలని ఎద్దేవాచేశారు. మోదీ అన్ని దేశాలు తిరగొచ్చు.. ‘న్యూయార్క్ మేయర్ మమ్దానీ అసాంఘిక శక్తి కాదు. మేయర్, అమెరికా ఉపాధ్యక్షుడి అపాయింట్మెంట్ అధికారికంగా ఖరారు కాకుంటే ఏ కార్యక్రమం జరగదు. మమ్దానీ ఏమైనా మన గల్లీలో ఉన్న కౌన్సిలరా? పోతాపోతా ఇంట్లోకి వెళ్లికూర్చుని మాట్లాడడానికి? కేటీఆర్ అమెరికా, హరీశ్ లండన్ వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. నాకు అమెరికా నుంచి ఆహ్వానం ఉంది. హార్వర్డ్‌లో విద్యార్థిగా చదివా. గతంలో మోదీపై తీవ్రమైన ఆరోపణలున్నాయని అమెరికాకు రానీయలేదు. మోదీ ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రయాణం చేయొచ్చు.. ఆయన చంద్రమండలం కూడా ప్రయాణం చేసేటట్టు ఉండు’ అని సీఎం పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి జన్మలో సీఎం కాగలడా? ‘కిషన్‌రెడ్డి ఎప్పుడు సీఎం అయ్యారు? ఆయన జన్మలో సీఎం కాగలరా? దేశంలో పీఎం, సీఎం, డీఎంలకు ఇతరులతో వేరే హోదా కలిగి ఉంటారు. కిషన్‌రెడ్డి ఏ హోదాలో అనుమతి కోరితే ఆయనకు అనుమతి నిరాకరించారో నాకు తెలియదు. సీఎంగా నేను విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసం వెళ్తే మార్గమధ్యంలో తిరిగి రమ్మని చెప్పడంలో మతలబు ఏమిటి? ప్రొఫెసర్లు మాయా టుడోర్, దేవ్‌జీ యూకేలో ఉన్నారు. అనుమతి ఇచ్చారుగా? ఇందిరా హయాంలో 1975–76 మధ్య ఎమర్జెన్సీ కాలంలో, ఆ తర్వాత 2014లో మోదీ పీఎం అయ్యాక దేశంలో ప్రజాస్వామ్యం క్షీణించిందని మాయా ఓ జర్నల్‌కు వ్యాసం రాశారు. 56 ఇంచీల ఛాతీ అని చెప్పుకునే మీరు ఇతర దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉంటే ఈ అభిప్రాయాన్ని ఎందుకు మార్చలేరు? మోదీ ప్రధాని అయ్యాక పాకిస్తాన్‌కు ఎవరిని అడిగి వెళ్లారు? మీరు పాక్ వెళ్లి వారి ప్రధానిని అలింగనం చేసుకుని బిర్యానీ తినవచ్చు. అధికార పర్యటనకు సీఎం వెళ్లలేడు? అందుకే ఆమె ప్రజాస్వామ్యం క్షీణిస్తుందని రాశారు. నేనూ ఏకీభవిస్తున్నా. ఇది నియంతృత్వ నిర్ణయం’ అని సీఎం రేవంత్ అన్నారు. -
8 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ జాబ్స్?
ఢిల్లీ: ప్రస్తుతం దేశాన్ని పీడిస్తున్న సమస్యలలో నిరుద్యోగం ప్రధానమైనది. ఏళ్ల తరబడి పెద్ద పెద్ద చదువులు చదివినా దానికి సరిపడా ఉద్యోగం దొరకక యువతంతా ఉద్యోగాల కోసం తల్లడిల్లిపోతున్నారు. పెద్దచదువులు చదివినా దాని సరిపడా ఉద్యోగం దొరకక చిన్నా చితక జాబ్‌తో సరిపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అందింది. దేశంలో కేవలం కేంద్ర ప్రభుత్వంలోనే ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలున్నట్లు కేంద్రం తెలిపింది.నీమచ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఉద్యోగాల ఖాళీలపై ఆర్టీఐ దాఖలు చేశారు. దానికి బదులిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని పే రీసెర్చ్ యూనిట్ 2024 మార్చి 1 నాటి గణాంకాలను వివరాలను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సివిలియన్ ఉద్యోగాల్లో ఏకంగా 8,23,656 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. ఈ లెక్కల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు PSUలను మినహాయించుకొని ఈ లెక్కలు ప్రకటించింది. ఇందులో అత్యధిక ఖాళీలు రక్షణ మంత్రిత్వ శాఖ సివిలియన్ విభాగంలో ఉన్నాయి. మొత్తం 5,56,248 పోస్టులు మంజూరై ఉండగా కేవలం 3,14,005 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 2,42,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది మొత్తం మంజూరైన పోస్టుల్లో దాదాపు 43.5 శాతం. అయితే ఈ సంఖ్యలు సైన్యం, నేవీ, వైమానిక దళంలోని ఉద్యోగాలకు సంబంధించినవి కావని, కేవలం రక్షణ శాఖ సివిలియన్ ఉద్యోగాలకే సంబంధించినవని అధికారులు స్పష్టం చేశారు.రైల్వేలోదేశంలో అతిపెద్ద ప్రభుత్వ ఉద్యోగ సంస్థల్లో ఒకటైన రైల్వేల్లోనూ భారీగా ఖాళీలు ఉన్నాయి. రైల్వేల్లో 14,79,701 పోస్టులు మంజూరై ఉండగా 12,39,576 మంది మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారు. దీంతో 2,40,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైల్వేల్లోని ఖాళీలే ఆర్టీఐ ద్వారా వెల్లడైన మొత్తం ఖాళీల్లో దాదాపు 30 శాతం కావడం గమనార్హం. హోం మంత్రిత్వ శాఖఅంతర్గత భద్రత, పరిపాలనలో కీలకమైన కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో 1,10,885 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ శాఖలో మొత్తం 11,18,233 పోస్టులు మంజూరై ఉండగా 10,07,348 మంది మాత్రమే పనిచేస్తున్నారు. రక్షణ శాఖ సివిలియన్ విభాగం, రైల్వేలు, హోం శాఖలను కలిపితే దాదాపు 5.93 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం ఖాళీల్లో దాదాపు మూడొంతులు ఈ మూడు ప్రధాన సంస్థల్లోనే ఉన్నాయి.పోస్టల్డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్‌లో 2,53,124 పోస్టులకు గాను 1,91,578 మంది పనిచేస్తున్నారు. దీంతో 61,546 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో 1,79,374 పోస్టులు మంజూరై ఉండగా 1,09,712 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. దీంతో 69,662 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది మంజూరైన పోస్టుల్లో దాదాపు 39 శాతం కావడం విశేషం.వ్యవసాయంవ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లోనూ సిబ్బంది కొరత కనిపిస్తోంది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో 5,420 పోస్టులకు గాను 3,565 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 1,855 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖలో 2,393 పోస్టులకు గాను కేవలం 1,015 మంది పనిచేస్తుండగా 1,378 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే ఈ శాఖలో దాదాపు 58 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.పర్యావరణ శాఖపర్యావరణ శాఖలోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో 5,127 పోస్టులకు గాను 3,170 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 1,957 పోస్టులు, అంటే దాదాపు 38 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలో 6,302 పోస్టులకు గాను 3,684 మంది మాత్రమే పనిచేస్తుండగా 2,618 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఆరోగ్య రంగంఆరోగ్య రంగంలోనూ ఖాళీలు ఉన్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 27,427 పోస్టులకు గాను 25,845 మంది పనిచేస్తున్నారు. దీంతో 1,582 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరోగ్య పరిశోధన శాఖలో 62 పోస్టులకు గాను కేవలం 28 మంది మాత్రమే పనిచేస్తుండగా 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయుష్ శాఖలో 432 పోస్టులకు గాను 199 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 233 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దేశంలోని శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన కీలక శాఖల్లోనూ ఖాళీలు ఉన్నాయి. అణుశక్తి శాఖలో 37,250 పోస్టులకు గాను 27,016 మంది మాత్రమే పనిచేస్తుండగా 10,234 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతరిక్ష శాఖలో 19,200 పోస్టులకు గాను 15,074 మంది పనిచేస్తున్నారు. దీంతో 4,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో కూడా 1,681 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దేశ అత్యున్నత పరిపాలనా కార్యాలయాల్లోనూ ఖాళీలు ఉండటం గమనార్హం. రాష్ట్రపతి సచివాలయంలో 803 పోస్టులు మంజూరై ఉండగా 516 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 287 పోస్టులు, అంటే 35.74 శాతం ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రధానమంత్రి కార్యాలయంలో (PMO) 441 పోస్టులకు గాను 315 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 126 పోస్టులు, అంటే 28.57 శాతం ఖాళీగా ఉన్నాయి.ఈ భారీ ఖాళీలపై ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పెరుగుతున్న సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపడేందుకు ఈ ఖాళీలను అత్యంత ప్రాధాన్యతతో, మిషన్ మోడ్‌లో భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
గూర్ఖాల గుర్తింపు సమస్యకు పరిష్కారం
సిలిగురి: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండలు, పరిసర ప్రాంతాల్లోని గూర్ఖా గుర్తింపు సమస్యకు రాజ్యాంగం పరిధిలో శాశ్వత రాజకీయ పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఒక ఒప్పందాన్ని రూపొందించి, విధివిధానాలను ఖరారు చేయడానికి కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేయనుందని అధికారులు తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో గూర్ఖా నాయకులు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, వివిధ రాజకీయ పార్టిల ప్రతినిధులతో శనివారం డార్జిలింగ్‌లో కీలక త్రైపాక్షిక సమావేశం జరిగింది. బెంగాల్‌లోని కొండ ప్రాంతాల ప్రజలకు సంబంధించిన సమస్యలతోపాటు కమిటీ ఏర్పాటుపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. డార్జిలింగ్ ప్రాంతంలో గూర్ఖా వర్గం ప్రజల అధిక సంఖ్యలో ఉన్నారు. వారికి ప్రత్యేకమైన భాషా, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. తమ జాతికి రాజకీయ గుర్తింపు, స్వయంప్రతిపత్తి, రక్షణ కల్పించాలని గూర్ఖాలు సుదీర్ఘకాలంగా పోరాటం సాగిస్తున్నారు. గూర్ఖాలకు ప్రత్యేక గుర్తింపు అంశానికి శాశ్వత రాజకీయ పరిష్కారం చూపడంతోపాటు వారి డిమాండ్లను అమిత్ షా పరిగణనలోకి తీసుకున్నారని కేంద్ర హోంశాఖ శాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. తుది ఒప్పందానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడానికి మాజీ ఉప జాతీయ భద్రతా సలహాదారు, ప్రస్తుత మధ్యవర్తి అయిన పంకజ్‌కుమార్ సింగ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టంచేసింది. గూర్ఖాల ఇతర డిమాండ్లన్నింటినీ సానుభూతితో పరిశీలిస్తానని అమిత్ షా హామీ ఇచ్చారని తెలియజేసింది. 2023 నుంచి 2025 వరకు డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన విశ్రాంత ఐపీఎస్ అధికారి, మాజీ బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్‌ను 2025 అక్టోబర్‌లో డార్జిలింగ్ కొండ ప్రాంతాల ప్రజల సమస్యల సమస్యల కోసం కేంద్ర హోంశాఖ శాఖ మధ్యవర్తిగా నియమించింది. -
ఈ జలుబు మందులు బ్యాన్.. నిషేధించిన కేంద్రం
చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్ఫెనిరామైన్ మేలేట్ (Chlorpheniramine Maleate), ఫినైలెఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ (Phenylephrine Hydrochloride) కలిగిన అన్ని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందులను నాలుగేళ్లలోపు పిల్లలకు వినియోగించకుండా కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ రెండు పదార్థాలతో కూడిన మందుల తయారీ, విక్రయం, పంపిణీపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది.ఇక ప్యాక్‌పై హెచ్చరిక తప్పనిసరితాజా ఆదేశాల ప్రకారం.. ఈ కాంబినేషన్‌తో కూడిన మందుల తయారీదారులు లేబుల్, ప్యాకేజీ ఇన్సర్ట్, ప్రచార సామగ్రిపై ‘నాలుగేళ్లలోపు పిల్లలకు ఈ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్‌ను ఉపయోగించకూడదు’ అనే హెచ్చరికను స్పష్టంగా ముద్రించాలి. ఈ నోటిఫికేషన్ అధికారిక గెజిట్‌లో ప్రచురితమైన తేదీ నుంచే అమల్లోకి వస్తుంది.2025లోనే తొలిసారి ఆంక్షలుఈ నిర్ణయం పూర్తిగా కొత్తదేమీ కాదు. 2025 ఏప్రిల్ 15న కేంద్రం ఇదే క్లోర్ఫెనిరామైన్ మేలేట్–ఫినైలెఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్‌పై ఆంక్షలు విధించింది. నిపుణుల కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (DTAB) సిఫార్సుల మేరకు నాలుగేళ్లలోపు పిల్లల్లో వీటి వినియోగం వల్ల ప్రమాదాలు ఉండొచ్చని, సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది.తాజా చర్య ద్వారా గత ఆంక్షల పరిధిని మరింత స్పష్టం చేస్తూ ఈ రెండు పదార్థాలు కలిగిన అన్ని సంబంధిత ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఫార్ములాలకు నాలుగేళ్లలోపు పిల్లల విషయంలో ఇదే నిషేధం/వినియోగ పరిమితిని వర్తింపజేశారు.జలుబు, ముక్కుదిబ్బడకు ఉపయోగించే కాంబినేషన్క్లోర్ఫెనిరామైన్ మేలేట్ అనేది యాంటీహిస్టమైన్ కాగా, ఫినైలెఫ్రైన్ ముక్కులోని రక్తనాళాల వాపును తగ్గించేందుకు ఉపయోగించే డీకంజెస్టెంట్. ఈ రెండింటినీ కలిపిన మందులను సాధారణంగా జలుబు, ముక్కు కారడం, ముక్కుదిబ్బడ వంటి లక్షణాల ఉపశమనానికి ఉపయోగిస్తారు. అయితే చిన్నారుల్లో ఇలాంటి కాంబినేషన్ మందులను ఉపయోగించే విషయంలో వయస్సు, మోతాదు, వైద్యుడి సూచనలను అత్యంత జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంది.నిపుణుల సిఫార్సుల ఆధారంగా నిర్ణయంఈ కాంబినేషన్ వల్ల నాలుగేళ్లలోపు పిల్లలకు సంభావ్య ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఉండవచ్చని నిపుణుల కమిటీ, DTAB అభిప్రాయపడటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పిల్లలకు అందుబాటులో ఉన్న సురక్షితమైన ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ ఆంక్షలను డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940లోని సెక్షన్ 26A కింద ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం అమలు చేస్తోంది.ఇదీ చదవండి: భారీగా పెరిగిన చక్కెర ధరలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం -
రేవంత్ ఒక్కడే కాదు.. కేంద్రం ‘నో’ చెప్పిన సీఎంలు వీరే!
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి అమెరికా వెళ్లేందుకు కేంద్రం రాజకీయ క్లియరెన్స్ నిరాకరించింది. దీనిపై పెద్ద పొలిటికల్ చర్చే నడుస్తోంది. అయితే, విదేశీ పర్యటనకు కేంద్రం నుంచి అనుమతి రాకపోవడం రేవంత్‌కు మాత్రమే ఎదురైన పరిణామం కాదు. గతంలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా పలువురు సీఎంల విదేశీ పర్యటనలకు కూడా కేంద్రం అనుమతి నిరాకరించిన సందర్భాలున్నాయి. దీంతో ఇప్పుడు రేవంత్ టూర్ వ్యవహారంతో పాటు ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు రాజకీయ క్లియరెన్స్ ఎందుకు అవసరం? కేంద్రం ఎప్పుడు నో చెబుతుంది? గతంలో ఎవరెవరి పర్యటనలు ఆగిపోయాయి? అనే చర్చ మొదలైంది.తాజాగా రేవంత్‌రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటన కోసం బయలుదేరారు. ‘తెలంగాణ రైజింగ్’ కార్యక్రమంలో భాగంగా పెట్టుబడులు, విద్యా సంస్థల భాగస్వామ్యాలు, తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి విద్యా అవకాశాలను తీసుకురావడమే పర్యటన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్ పర్యటనకు కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ.. అమెరికా పర్యటనకు మాత్రం రాజకీయ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు 23న ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలను రాజకీయ క్లియరెన్స్ ఇచ్చే ముందు MEA పరిశీలిస్తుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. పర్యటనలో ప్రతిపాదించిన కార్యక్రమాలు సీఎం పదవికి, పర్యటన ఉద్దేశానికి తగినవిగా ఉండాలి అని చెప్పారు. రేవంత్ అమెరికా పర్యటనకు సంబంధించిన ప్రతిపాదిత కార్యక్రమం ఆ ప్రమాణాలకు సరిపోలలేదని, అందుకే క్లియరెన్స్ నిరాకరించినట్లు వెల్లడించారు. రేవంత్‌రెడ్డి మాత్రం ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, దేశ నిర్మాణం వంటి అంశాలను రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా చూడాలని ఆయన అన్నారు. అమెరికా పర్యటనలో జరగాల్సిన కార్యక్రమాలను తన బృందం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఆయన లేకుండానే తెలంగాణ ప్రతినిధి బృందం అమెరికా వెళ్లి కొన్ని ప్రతిపాదిత ఒప్పందాలు, భాగస్వామ్యాలపై ముందుకు వెళ్లనుంది.పలువురు సీఎంలకు ఇలానే.. 👉గతంలో పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి కూడా విదేశీ పర్యటన విషయంలో కేంద్రం నుంచి అనుమతి రాలేదు. 2021లో రోమ్‌లో నిర్వహించిన వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్‌కు వెళ్లాలని ఆమె భావించారు. అయితే ఆ కార్యక్రమం ముఖ్యమంత్రి హోదాకు తగిన స్థాయిలో లేదని పేర్కొంటూ MEA అనుమతి నిరాకరించింది. దీంతో టీఎంసీ తీవ్రంగా స్పందించింది. అంతకుముందు చికాగో పర్యటన విషయంలోనూ మమతకు అనుమతి రాలేదని నివేదికలు ఉన్నాయి.👉ఇక ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్నారు. 2019లో డెన్మార్క్‌లో జరిగే C40 క్లైమేట్ సమ్మిట్‌కు వెళ్లేందుకు ఆయన అనుమతి కోరగా.. ఆ కార్యక్రమం నగర మేయర్ల కోసం ఉద్దేశించినదని, సీఎం స్థాయికి సరిపోదని MEA అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2022లో సింగపూర్ పర్యటనకు కూడా ఆయనకు అనుమతి లభించలేదు.👉పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విషయంలోనూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2026 ఫిబ్రవరిలో రాష్ట్ర పరిశ్రమల మంత్రి సహా ప్రతినిధి బృందంతో యూకే, ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లాలని ఆయన భావించారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆ పర్యటనను రూపొందించినప్పటికీ MEA రాజకీయ క్లియరెన్స్ నిరాకరించింది. 2024లో పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లి భారత హాకీ జట్టును ప్రోత్సహించాలన్న మాన్ ప్రయత్నానికీ అనుమతి రాలేదు. అయితే 2025లో జపాన్, దక్షిణ కొరియా పర్యటనకు మాత్రం ఆయనకు అనుమతి లభించింది.👉కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2025లో సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్ పర్యటనకు ఆయనకు రాజకీయ క్లియరెన్స్ రాలేదు. అంతకుముందు 2023లో సౌదీ అరేబియాలో జరగాల్సిన కార్యక్రమానికి కూడా అనుమతి సమస్య తలెత్తింది.👉ఇది కేవలం ఇటీవలి కాలానికి సంబంధించిన వ్యవహారం కూడా కాదు. యూపీఏ హయాంలోనూ అప్పటి అసోం సీఎం తరుణ్ గొగోయ్ అమెరికా పర్యటనకు, జార్ఖండ్ సీఎం అర్జున్ ముండా థాయ్‌లాండ్ పర్యటనకు రాజకీయ క్లియరెన్స్ నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి.అసలు పొలిటికల్ క్లియరెన్స్ అంటే?ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారికంగా విదేశాలకు వెళ్లేటప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. విదేశాంగ శాఖ పర్యటన ఉద్దేశం, కార్యక్రమాల స్వభావం, వెళ్లే దేశం, సంబంధిత అంశాలు తదితరాలను పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాజకీయ క్లియరెన్స్ ఇస్తుంది. ఈ అనుమతి లేకుండా అధికారిక విదేశీ పర్యటనకు వెళ్లడం సాధ్యం కాదు. అయితే రేవంత్ విషయంలో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. బ్రిటన్‌కు అనుమతి ఇచ్చి, అమెరికాకు మాత్రం ఎందుకు నిరాకరించారు? అన్నదే. దీనిపై MEA స్పష్టంగా చెప్పిన కారణం మాత్రం అమెరికా పర్యటనలోని ప్రతిపాదిత కార్యక్రమం సీఎం హోదాకు, పర్యటన ఉద్దేశానికి తగినది కాదన్నదే. రేవంత్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్యాల కోసం చేపట్టిన కార్యక్రమంగా చెబుతోంది. కేంద్రం మాత్రం అనుమతి విషయంలో ప్రోటోకాల్, రాజకీయ క్లియరెన్స్ నిబంధనలనే ముందుకు తెస్తోంది.ఇదిలా ఉండగా.. రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఈ పర్యటన కోసం కోర్టు నుంచి కూడా అనుమతి పొందారు. క్యాష్-ఫర్-ఓట్ కేసులో విదేశీ పర్యటనకు సంబంధించిన షరతులను ఏసీబీ కోర్టు సడలించింది. అయితే ఆ అనుమతి కేంద్రం నుంచి అవసరమైన రాజకీయ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అందుకే ఇప్పుడు ఈ వ్యవహారం కేవలం రేవంత్ అమెరికా టూర్ రద్దు అంశంగా మాత్రమే కాకుండా.. కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారిక విదేశీ పర్యటనల విషయంలో ఉన్న వ్యవస్థపై కూడా చర్చకు దారితీసింది. -
వివేక్ సింగ్ చౌహాన్‌కు రాష్ట్రపతి శౌర్య పతకం
న్యూఢిల్లీ: 2003లో ఒక ఆపరేషన్ సందర్భంగా ఇద్దరు బందిపోట్లను కాల్చి చంపిన మాజీ పోలీసు అధికారి వివేక్ సింగ్ చౌహాన్‌కు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ప్రదానం చేయడానికి ఆమోదం లభించిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. చౌహాన్‌కు అవార్డు ప్రదానం చేయాలన్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాన్ని కేంద్రం పాటించకపోవడంపై సుప్రీంకోర్టు గత నెలలో అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం స్పందించింది. చౌహాన్‌కు రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. 2003 జూన్ 24 నాటి ఆపరేషన్‌కు గాను చౌహాన్‌కు రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ఇవ్వడానికి రాష్ట్రపతి ఆమోదించారని, ఈ అవార్డును త్వరలో గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రకటిస్తారని పేర్కొన్నారు. చౌహాన్ తరఫున హాజరైన న్యాయవాది మాట్లాడుతూ.. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ధిక్కార చర్యలను ఉపసంహరించుకుంటామని సుప్రీంకోర్టుకు తెలిపారు. 2003లో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని ఘటిగావ్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఉన్న చౌహాన్, ఒక గ్రామంలో బందిపోట్లు ఉన్నారనే నిఘా సమాచారం అందడంతో వారిపై ఆపరేషన్ చేపట్టారు. ఎన్కౌంటర్లో ఇద్దరు బందిపోట్లు హతమవ్వగా, చౌహాన్ గాయపడ్డారు. అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు ఆయనకు పదోన్నతి ఇవ్వాలని, అలాగే రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ప్రదానం చేయాలని పలువురు ప్రముఖులు సిఫార్సులు చేశారు. కేంద్రం అందుకు సముఖత వ్యక్తంచేయలేదు. దీంతో మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 2018లో హైకోర్టు, అవార్డు కోసం చౌహాన్ పేరును కేంద్రానికి పంపాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2019లో ఆయన పేరును సిఫార్సు చేసింది. కానీ, కేంద్ర హోంశాఖ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. అనంతరం సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలయ్యింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రాన్ని వివరణ కోరింది. చౌహాన్‌కు రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ప్రదానం చేయడానికి అనుమతి లభించడంతో ఈ వివాదానికి ఇక తెరపడినట్లే. -
సీఎం టూర్‌కు కేంద్రం నో
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం నో చెప్పింది. రాజకీయ కారణాలతో అనుమతిని నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆయన పర్యటన నిబంధనలకు అనుగుణంగా లేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. అమెరికా, యూకే పర్యటనలకు విధివిధానాలు, ప్రొటోకాల్ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 16న కేంద్రం అనుమతి కోరారు. అయితే యూకే పర్యటనకు అనుమతిచ్చిన విదేశాంగశాఖ.. అమెరికా పర్యటనకు మాత్రం నిరాకరించింది. ‘ముఖ్యమంత్రులు లేదా ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనల కోసం రాజకీయ అనుమతులు ఇచ్చేందుకు విదేశాంగ శాఖ ఆయా పర్యటనలను ఎప్పటికప్పుడు మదింపు చేస్తుంది. అలాంటి వారి విదేశీ పర్యటనలు ఆయా రాజ్యాంగబద్ధ పదవులకు, పర్యటన ఉద్దేశాలకు అనుగుణంగా ఉండాలి. కానీ తెలంగాణ సీఎం అమెరికా పర్యటన అందుకు అనుగుణంగా లేదు.అందుకే సీఎం పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. అయితే సీఎం యూకే పర్యటనకు మాత్రం అనుమతి ఇచ్చాం’అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గతంలో ఢిల్లీ సీఎంగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ విదేశీ పర్యటనలకు సైతం విదేశాంగ శాఖ రాజకీయ అనుమతులు నిరాకరించడం గమనార్హం. కేంద్రం రాజకీయ అనుమతుల నిరాకరణ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు.అయితే తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందాన్ని అమెరికా వెళ్లాలని.. ఇది వరకే అక్కడి సంస్థలతో సంప్రదింపులు జరిపినందున హార్వర్డ్ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకోవాలని సీఎం ఆదేశించారు. ఆయన మాత్రం ఈ నెల 23న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) ఏర్పాటు చేయనున్న ముఖాముఖి కార్యక్రమాన్ని షెడ్యూల్లో చేర్చడం వల్లే ఆయన పర్యటనకు కేంద్రం అనుమతించలేదని సమాచారం. కేంద్రం నిర్ణయంపై సీఎం విస్మయం.. తెలంగాణ అభివృద్ధి, విద్యారంగ పురోగతికి, వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పడే తన అమెరికా పర్యటనకు రాజకీయ కారణాలతో కేంద్రం అనుమతి నిరాకరించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్రం నిర్ణయాన్ని గౌరవిస్తూ లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. ‘ఈ పర్యటన ఉద్దేశం ఒక్కటే. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలను భారత్‌కు, తెలంగాణకు, హైదరాబాద్‌కు తీసుకురావడం. అత్యుత్తమ ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలను, ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల నుంచి విద్య, నైపుణ్యాలు, శిక్షణ పొందాలన్న మన యువత ఆకాంక్షలకు ఇవి సమాధానంగా నిలిచేవి. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయంలో అందరూ రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని నేను ఎప్పుడూ విశ్వసిస్తాను’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతా.. ‘హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి హెచ్‌సీయూ, జేఎన్టీయూ తదితర విశ్వవిద్యాలయాల ఏర్పాటు హైదరాబాద్‌ను అత్యుత్తమ మానవ వనరుల కేంద్రంగా మార్చింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్... ప్రపంచానికి నాయకత్వం వహించగలమని నిరూపించింది. అక్కడి నుంచి ప్రపంచంలోని గొప్ప టెక్ నాయకుల్లో కొందరు రూపుదిద్దుకున్నారు. ఐఐటీ, ఐఎస్బీ, ఐఐఐటీ, నల్సార్ వంటి సంస్థల ఏర్పాటుతో హైదరాబాద్ అగ్రశ్రేణి సంస్థలు, వాటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆకర్షించగలిగింది.ఇప్పుడు ప్రపంచంలోని ప్రఖ్యాత విద్య, నైపుణ్య సంస్థలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చి 21వ శతాబ్దపు మన ప్రగతి ప్రయాణానికి శక్తినిస్తాం. హైదరాబాద్‌ను ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నది నా సంకల్పం, ప్రయత్నం. ఒక సాధారణ భారతీయుడు హైదరాబాద్‌లోనే హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ లేదా ఎంఐటీ, ఎల్బీఎస్, ఎల్ఎస్ఈ వంటి ప్రపంచస్థాయి సంస్థల నుంచి విద్య, సర్టీఫికేషన్ పొందగలగాలి. ఎందుకంటే చాలా మంది నాయకులు తమ పిల్లలను విదేశాలకు పంపాలని కోరుకున్నారు. కానీ నేను ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలను భారత్‌కు తీసుకురావాలని అభిలషిస్తున్నాను’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. -
త్వరలో కొత్త గవర్నర్లు?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సహా ఐదారు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వ కసరత్తు చేస్తోంది. త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను దృష్టిలోఉంచుకుని విపక్ష పారీ్టలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మరింత ‘క్రియాశీలకంగా’వ్యవహరించాలనే ఉద్దేశంతో మోదీ సర్కార్ ఈ క్రతువుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, కర్ణాటక గవర్నర్లు అత్యధిక కాలం పదవిలో ఉన్నారు. ఆనందీబెన్ పటేల్ 2018లో ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులైనప్పటికీ ఆమె లోక్‌భవన్‌లోనే కొనసాగుతున్నారు. మరుసటి సంవత్సరమే ఆమెకు ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. 2021లో ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా పూర్తి బాధ్యతలు తీసుకున్న ఆమె ఇప్పటికీ అక్కడే కొనసాగుతున్నారు. అయితే, రానున్న అసెంబ్లీ ఎన్నికల కోణంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ మార్పు ఖాయమని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొత్త గవర్నర్‌గా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం కల్పించవచ్చనే వాదనలు ఉన్నాయి. కర్ణాటక గవర్నర్‌ను మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కర్ణాటక గవర్నర్‌గా 2021 జూలై 11న బాధ్యతలు స్వీకరించిన థావర్‌చంద్ గెహ్లాట్ ఇప్పటికీ అక్కడే కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో మరింత క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వర్తించే వారికి అవకాశం కల్పించవచ్చనే చర్చ నడుస్తోంది. సినీనటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వం అధికారంలో ఉన్న తమిళనాడుకు మళ్లీ ఆర్ఎన్ రవి మాదిరిగానే అత్యంత కఠినంగా వ్యవహరించే వ్యక్తినే గవర్నర్‌గా నియమించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
సోషల్ మీడియాలో మంత్రుల పనితీరు ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ: సభలు, దంచికొట్టే ప్రసంగాల కాలం నుంచి రాజకీయాలు, రాజకీయ చర్చలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికలపైకి మారుతున్నాయి. యువతతో పార్టీ, ప్రభుత్వ సంబంధాలను బలోపేతం చేసుకోవాలంటే సోషల్ మీడియానే అత్యంత ప్రధానమని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా వేదికల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధాని సహా కేంద్ర మంత్రులందరూ ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ‘ఎక్స్’అనే 4 ప్రధాన వేదికల ద్వారా ప్రజలతో మమేకం కావాలని, ఎల్లప్పుడూ అప్డేట్స్ ఇస్తూ సోషల్‌మీడియాలో క్రియాశీలకంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు సోషల్ మీడియా మాధ్యమాల్లో కేంద్ర మంత్రుల పనితీరు, క్రియాశీలత ఎలా ఉందనే దానిపై ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒక అధ్యయనం చేయించింది. నివేదికను సిద్ధం చేసింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ ఈ నివేదికలను సీల్డ్ కవర్లలో మంత్రులకు వ్యక్తిగతంగా అందజేశారు. సమగ్ర విశ్లేషణతో తుది నివేదిక.. ఈ రిపోర్టులో మే 1 నుంచి ఆగస్టు 15 వరకు మంత్రులు సోషల్ మీడియాలోని నాలుగు వేదికలపై చూపిన క్రియాశీలతను సమగ్రంగా విశ్లేషించారు. మంత్రులు పెట్టిన పోస్టులు, వివిధ అంశాలపై వారి వైఖరి, కామెంట్లు, స్పందనలను ఇందులో లెక్కగట్టారు. తోటి మంత్రులతో పోలిస్తే, అలాగే ప్రతిపక్ష నేతలతో పోలిస్తే సదరు మంత్రి ఏ స్థాయిలో యాక్టివ్‌గా ఉన్నారు? అనే దానికి సంబంధించిన నిష్పాక్షికమైన, పోల్చదగిన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయం రూపొందించినట్లు సమాచారం. ఆధునిక ప్రచార సాధనాలపై ప్రధాని దిశానిర్దేశం.. ఈ రిపోర్టును మంత్రులంతా తీవ్రంగా, బాధ్యతగా తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించినట్లు తెలిసింది. ఆధునిక సమాచార వ్యవస్థలైన ఈ సోషల్ మీడియా వేదికలు ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నాయో మంత్రులకు ప్రధాని మరోసారి సుదీర్ఘంగా వివరించారు. ఈ డిజిటల్ వేదికలను సమర్థవంతంగా వాడుకోవాలన్నారు. సోషల్ మీడియా ప్రచారంతోపాటు, యాక్టివ్‌గా ఉండటంలోనూ ప్రధాని మోదీ స్వయంగా ఆదర్శంగా నిలిచారు. పీఎంఓ రూపొందించిన ఈ ‘పర్ఫార్మెన్స్ రిపోర్ట్’ర్యాంకింగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అందరికంటే ముందు వరుసలో నిలిచి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారని తెలిసింది. -
మూడు వారాల్లో అఫిడవిట్
న్యూఢిల్లీ: పరీక్షల నిర్వహణకు ఏర్పాటైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పనితీరును సంస్కరించేందుకు చేసిన మార్పులేమిటో మూడువారాల్లోగా తెలియజేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాధాకృష్ణన్, నందన్ నీలేకని కమిటీ సిఫారసుల అమలుకు తీసుకున్న చర్యలను తెలపాలని జస్టిస్ పీఎస్ నరసింహ, ఆలోక్ అరాధేల ధర్మాసనం ఆదేశించింది. ప్రవేశ పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు ఎన్టీఏలో సంస్కరణలను వ్యవస్థీకరించాలని, సాంకేతిక పరిజ్ఞానపరమైన మార్పులూ చేపట్టాలని అభిప్రాయపడింది. నీట్ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ ఏడుగురు సభ్యులతో కూడిన రాధాకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పరీక్షల నిర్వహణ, డేటా సెక్యూరిటీ నియమ నిబంధనలు, ఎన్టీయే వ్యవస్థాగత నిర్మాణం, పనితీరులపై సలహాలివ్వాలని కమిటీని కోరింది. దీంతోపాటే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్ పోటీ పరీక్షల్లో వ్యవస్థాగతమైన మార్పులు సిఫారసు చేసేందుకు ఏర్పాటైంది. ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) తరఫున న్యాయవాది తన్వీ దూబే, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ‘‘ఎన్టీయేలో సమస్య వ్యవస్థాగతమైందని రాధాకృష్ణన్ కమిటీ సరిగ్గానే గుర్తించిందని, దీన్ని సక్రమంగా అమలు చేసేలా చేయడం కీలకమని, కాగితంపై అన్నీ బాగున్నా, ఒక పరీక్ష జరిగాక రెండో పరీక్ష నాటికి పరిస్థితి మారిపోతోంది’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎన్టీఏకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది, సాంకేతిక సామర్థ్యాలు సమకూర్చాలని, ఏఐ, బ్లాక్‌చెయిన్ వంటి అధునాతన సాంకేతికతల ద్వారా పరీక్షల భద్రత, పారదర్శకతను బలోపేతం చేసేలా కమిటీ సిఫారసులు చేసినట్లు తెలిసిందని కోర్టు పేర్కొంది. ‘‘కమిటీ సిఫారసుల అమలు తీసుకున్న చర్యలు, వివరాలతో కార్యదర్శి అఫిడ విట్ దాఖలు చేయాలి. ఏ విషయం ఎంత సమ యంలోగా పూర్తవుతుందో సూచించే టైమ్‌లైన్‌తో మూడు వారాల్లో సమర్పించాలి’’ అని తెలిపింది. ‘ఫూల్ప్రూఫ్’ విధానం: కేంద్రంనీట్ పరీక్షల్లో తీసుకొస్తున్న సంస్కరణలు ఫూల్ప్రూఫ్ అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి నివేదించారు. ముద్రణ నుంచి విద్యార్థులకు అందే వరకూ ప్రశ్న పత్రాల విషయంలో అన్ని భద్రత చర్యలు తీసుకున్నామని వివరించారు. క్వశ్చన్ బ్యాంకు తయారీలో పలువురు మాడరేటర్లను నియమించామని, తయారయ్యే ప్రశ్న పత్రంలో ఏ ప్రశ్న వస్తుందో వారికి తెలియదని చెప్పారు. సీసీటీవీ, సీఐఎస్ఎఫ్ పర్యవేక్షణలో ముద్రణ, పోలీసు బందోబస్తు, జీపీఎస్ ట్రాకింగ్‌తో రవాణా చేపడతామని, బ్యాంకు స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తామని తెలిపారు. పరీక్ష రోజున అధికారులు, విద్యార్థుల సమక్షంలో సీలు తెరవడం, వీడియోగ్రఫీ వంటి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అయితే ఈ చర్యలన్నీ రాధాకృష్ణన్ కమిటీ పరిశీలించినవేనని, కాగితాలపై కాకుండా సక్రమంగా అమలు చేయడం ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది. -
తెలుగోళ్లకు అవార్డుల పంట.. జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించిన కేంద్రం
-
కులగణన తేల్చేదేమిటి?
జన గణనలో కుల గణన కూడా చేర్చాలన్న డిమాండ్‌ను నిరుడు ఏప్రిల్‌లో కేంద్రం అంగీకరించగా, అందుకు అనుసరించబోయే విధానంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. పౌరులనుంచి రాబట్టే సమాచారానికి సంబంధించిన 40 ప్రశ్నల్లో కులం కూడా ఒకటిగా ఉండబోతోందని కేంద్రం నోటిఫికేషన్ వెల్లడించింది. అయితే దీనివల్ల ఏ మేరకు ప్రయోజం ఉంటుందన్న సందేహం తలెత్తుతుంది. వివిధ కులాల పేర్లు ఇచ్చి దాన్లో దేనికి చెందుతారో తెలపాలని పౌరుల్ని అడిగితే నిర్దిష్టమైన డేటా వెల్లడవుతుంది. అందుకు బదులుగా వారు చెప్పిన కుల వివరాలు నమోదు చేయటం వల్ల ప్రయోజనం ఉంటుందా? 2011లో యూపీఏ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల గణన అంటూ దేశవ్యాప్తంగా ఒక సర్వే చేసింది. ఎన్నడో 1931లో వలస పాలకుల హయాం తర్వాత దేశంలో కులాలను గణించటం అదే మొదటిసారని అందరూ సంతోషించారు. కానీ ఆ గణనవల్ల ఏ ప్రయోజనమూ కలగలేదు. పౌరులు చెప్పిన వివరాల తర్వాత కులాలు, ఉపకులాలు, అక్షరక్రమంలో తేడాలు తదితరాల ఆధారంగా దాదాపు 46 లక్షల 73 వేల రకాలు నమోదయ్యాయి. కులాలవారీగా వాటిని వర్గీకరించటానికి 2015లో అప్పటి నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియా నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. తీరా కులాల పేర్లలో ఉన్న అనేక వ్యత్యాసాల కారణంగా అయోమయం ఏర్పడి, ఆ డేటాను అధికారికంగా విడుదల చేయలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తగలదన్న సందేహం చాలామందిలో ఉంది. ఏ కులానికి చెందుతారన్నది తెలియజేసేలా జాబితా రూపొందించి ప్రశ్నించటంవల్ల సమాధానం సులభమవుతుంది. అర్థవంతమైన డేటా లభిస్తుంది. ఒక రాష్ట్రంలో ఉన్న కులం వేరే రాష్ట్రంలో ఉండదు. అలాగే ఒకచోట బీసీగా పరిగణించే కులం మరోచోట ఎస్సీగానో, ఎస్టీగానో ఉండే అవకాశం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కులాల సేకరణకు అనువైన పద్ధతుల్ని ఎంచుకోవాలి. పార్లమెంటులో ఇందుకు సంబంధించి లోతైన చర్చ జరిగివున్నా, రాష్ట్రాలవారీగా సమావేశాలు నిర్వహించి, ఆ యా ప్రాంతాల్లో ఉండే కులాలు, వర్గాల గురించిన జాబితా ఖరారుచేసివున్నా జాతీయ స్థాయిలో ఏ కులాలు ఏ కేటగిరీ కిందకు వస్తాయో, తీసుకురావాలో ఒక అంచనా వచ్చేది. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో మన దేశం కులం నిర్వహించే పాత్ర తక్కువేమీ కాదు.అణగారిన కులాలు స్వాతంత్య్రానంతరం విద్యావకాశాలను అందుకోవటం, ఉన్నతోద్యోగాలు సాధించటంవంటివి సాధ్యమయ్యాయి. ఆ మేరకు చైతన్యం పెరిగి జనాభా దామాషా ప్రాతిపదికన అవకాశాలు దక్కటంలేదన్న అసంతృప్తి ఎక్కువైంది. కులగణన డిమాండ్ వెనక ఈ నేపథ్యం ఉంది. దానికి తగిన డేటా లభించేలా ఈ కుల గణన ఉండొద్దా? ఇప్పుడు పౌరులు అందజేసిన వివరాల ఆధారంగా ఎన్యూమరేటర్లు వర్గీకరించుకుని అయిందనిపిస్తారు. అప్పుడది విశ్వసించదగ్గ డేటా అవుతుందా? తమకు అన్యాయం జరిగిందనీ, తమ కుల జనాభాను తగ్గించి చూపారనీ ఆరోపణలు వెల్లువెత్తే అవకాశం కూడా లేదా?ఆ సంగతి అటుంచి ఇతర ప్రశ్నలు గమనిస్తే ఇప్పుడు సేకరిస్తున్నది జనాభా లెక్కలా, పౌర నమోదు చిట్టానా అన్న సందేహం రాకమానదు. 2011 నాటి జనగణనలో 29 ప్రశ్నలుంటే అవి ఈసారి 40కి చేరుకున్నాయి. వీటిలో తల్లిదండ్రుల పేర్లు, వివరాలతో పాటు ఆధార్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, మొబైల్ ఫోన్ నంబర్ వగైరాలున్నాయి. ఈ వివరాల వెల్లడి వ్యక్తిగత గోప్యతకు మంచిదేనా? ఇప్పటికే వివిధ విభాగాలవద్ద ఈ వివరాలుంటాయి. మళ్లీ అవసరమా? 2020 ఏప్రిల్‌నుంచి మొదలుకావాల్సిన జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) ప్రక్రియకు కూడా ఈ మాదిరి ప్రశ్నలే ఉన్నాయి. అది జాతీయ పౌర నమోదు చిట్టా(ఎన్ఆర్సీ) కోసమేనని విపక్షాలు ఆరోపించాయి కూడా. అయితే కోవిడ్ అవరోధం కారణంగా అది మూలనబడటంతో వివాదం సద్దుమణిగింది. హిమపాతం అధికంగా ఉండే జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనగణనలో కీలకమైన ఈ రెండో దశ సోమవారం లాంఛనంగా మొదలైంది. అందుకే కేంద్రం పారదర్శకంగా వ్యవహరించి అన్ని అంశాలూ తేటతెల్లం చేయాలి. ఈ రాష్ట్రాల్లో ఎదురయ్యే సమస్యల ఆధారంగా తగిన సవరణలు తెస్తే వేరే రాష్ట్రాల్లో ఫిబ్రవరిలో మొదలయ్యే జనగణన నాటికి ఒక సమగ్రత ఏర్పడుతుంది. -
సీఎం విజయ్‌కు జైకొట్టిన అన్నామలై.. ఇక TVKలోకేనా?
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చకు తెరలేచింది. మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ పాలనపై అన్నామలై సానుకూలంగా స్పందించడం ఇప్పుడు కొత్త ఊహాగానాలకు తెరతీసింది.విజయ్ ప్రభుత్వం ఇంకా కొత్తదేనని, దానికి కనీసం ఒక సంవత్సరం సమయం ఇవ్వాలని అన్నామలై అన్నారు. తొలి 100 రోజుల్లో ప్రభుత్వంలో కొత్త ఉత్సాహం కనిపించిందని, అవినీతిని ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం నిజాయితీగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్రస్తుతం విజయ్‌కు నా మద్దతు ఉందని చేశారు.అన్నామలై వ్యాఖ్యలు ఇక్కడితో ఆగలేదు. బీజేపీ నిర్ణయాలు మరింతగా ఢిల్లీ కేంద్రీకృతమవుతున్నాయని, రాష్ట్ర స్థాయి నాయకులకు మరింత స్వేచ్ఛ, అధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ అభివృద్ధి విషయంలోనూ గుజరాత్ కేంద్రీకృత మోడల్ మారాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.ఒకవైపు బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు.. మరోవైపు విజయ్‌కు బహిరంగ మద్దతు ఇవ్వడం తమిళనాడు రాజకీయాల్లో చర్చకు దారితీసింది. దీంతో అన్నామలై తదుపరి రాజకీయ అడుగు ఏంటి? విజయ్ నేతృత్వంలోని టీవీకే వైపు ఆయన అడుగులు వేస్తారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.అయితే ఇప్పటివరకు అన్నామలై టీవీకేలో చేరుతున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇది ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో ఏర్పడిన రాజకీయ ఊహాగానంగానే చూడాలి. విజయ్‌కు అన్నామలై మద్దతు ప్రకటించడం, అదే సమయంలో బీజేపీ నిర్ణయాలపై విమర్శలు చేయడం.. తమిళనాడు రాజకీయాల్లో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
సెన్సస్–2027 ప్రశ్నావళి మీ కులం ఏమిటి?
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారత్‌లో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఇందుకు సంబంధించిన 40 ప్రశ్నలను అధికారికంగా నోటిఫై చేసింది. మొట్టమొదటిసారి కులంతోపాటు కోవిడ్ టీకా వేయించుకున్న ప్రదేశం వివరాలను కూడా సేకరించనున్నారు. జమ్మూ కశ్మీర్, లడాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని మంచుతో కూడిన ప్రాంతాల్లో వచ్చే సెపె్టంబరు ఒకటవ తేదీ నుంచే పాపులేషన్ ఎన్యూమరేషన్ దశ మొదలవుతుందని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు స్పష్టం చేసింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ సారి జనాభా లెక్కల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ లేదా ఇతర కులాల వివరాలు తెలుసుకోనున్నారు. ప్రజలు తమంతట తామే వివరాలు సమరి్పంచేందుకు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ఆగస్టు 17 నుంచి 31 వరకు అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జనాభా లెక్కింపు (పీఈ) వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. తాజా జనాభా లెక్కల్లో భాగంగా తొలిసారి కులం వివరాలు సేకరిస్తున్నప్పటికీ అడిగే ప్రశ్నల్లో కులాల జాబితా ఏదీ ఉండే అవకాశం లేదు. ప్రజలు ఇచ్చే సమాధానాన్ని నేరుగా నమోదు చేస్తారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. గత ఏడాది ఏప్రిల్ 30న కులాల వారీ జనాభా వివరాలు సేకరించాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ సమావేశం తీర్మానించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న సెన్సస్–2027కు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇళ్ల జాబితా, లెక్కల సేకరణ కోసం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపారు. ఎన్యూమరేటర్లు అన్ని రకాల ఇళ్లు, నిర్మాణాల వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంలోనే అధికారులు ఒక్కో ఇల్లు/భవనాన్ని సందర్శించి మౌలిక సదుపాయాలకు సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. పదేళ్లకు ఒకసారి జరిపే జనాభా లెక్కలు వాస్తవానికి 2021లోనే మొదలు కావాల్సి ఉన్నా అప్పట్లో కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం సెన్సస్–2027 కోసం రూ.11,718 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ ఉద్దేశాలపై అనుమానాలు: కాంగ్రెస్ జనాభా లెక్కల్లో భాగంగా కులాల వివరాలు కూడా సేకరించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆక్షేపణ తెలిపింది. కులాల జాబితా ఆధారంగా కాకుండా స్పందనలను మాత్రమే నమోదు చేయడం అనుమానాలు రేకెత్తిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఎక్స్ వేదికగా విమర్శించారు. ఈ అంశంపై అధికార పక్షం ఏ రాజకీయ పారీ్టతోనూ చర్చించలేదని ఆరోపించింది. బిహార్, తెలంగాణల్లో మాదిరిగానే సిద్ధంగా ఉన్న కులాల జాబితా సాయంతో జనాభా లెక్కలు నిర్వహిస్తారని ఆశించామని అందుకు భిన్నంగా జరుగుతూండటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా గత ఏడాది ప్రధాని మోదీకి రాసిన లేఖలో తెలంగాణ మోడల్‌ను అనుసరించాలని, అన్ని రాజకీయ పారీ్టలతో చర్చించాలని కోరారని, ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదని విమర్శించారు. ఇవీ ప్రశ్నలు.. → వ్యక్తిగత, జనాభా వివరాలు వ్యక్తి పేరు ఇంటి యజమాని స్త్రీ లేదా పురుషుడు? పుట్టిన తేదీ, వయసు (పూర్తయిన సంవత్సరాల్లో) ప్రస్తుత వైవాహిక స్థితి వివాహమై ఎంత సమయం? (పూర్తయిన సంవత్సరాల్లో) భార్య/భర్త పేరు జాతీయత (ప్రకటించిన విధంగా) మతం షెడ్యూల్డ్ కులం (ఎస్సీ)/షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ)/కులం తండ్రి వివరాలు తల్లి వివరాలు వైకల్యం స్థితి (ఏదైనా ఉంటే) మాతృభాష, తెలిసిన ఇతర భాషలు→ విద్య అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత స్థితి విద్యాసంస్థలో హాజరు (ప్రస్తుత స్థితి) సాధించిన అత్యున్నత విద్యా స్థాయి విద్యా శాఖ/విభాగం→ ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలు గత ఏడాదిలో ఏ సమయంలోనైనా పనిచేశారా ఆర్థిక కార్యకలాపాల వర్గం వృత్తి పరిశ్రమ/వ్యాపారం/సేవల స్వభావం కారి్మక వర్గం ఆర్థికేతర కార్యకలాపం (మార్జినల్, సెమీ మార్జినల్, నాన్‌వర్కింగ్) పని కోసం చూస్తున్నారా?/అందుబాటులో ఉన్నారా (మార్జినల్, సెమీ మార్జినల్, నాన్‌వర్కింగ్) పని చేసే చోటికి ప్రయాణం అవసరమా?→ వలసలు, నివాసం పుట్టిన స్థలం చివరి నివాస ప్రదేశం వలసకు కారణం ప్రస్తుత గ్రామం/పట్టణంలో ఉన్న కాలం శాశ్వత నివాస చిరునామా→ సంతాన సాఫల్యం, కుటుంబం (మహిళలకు) ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల సంఖ్య ఇప్పటి వరకు పుట్టిన మొత్తం పిల్లల సంఖ్య (వివాహిత, వితంతువు, విడాకులు తీసుకున్న, వేరుపడిన మహిళలకు) గత ఏడాదిలో జని్మంచిన శిశువుల సంఖ్య (వివాహిత మహిళలకు మాత్రమే)→ ఆరోగ్యం, గుర్తింపు కోవిడ్–19 టీకా వేయించుకున్న ప్రదేశం మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య మొబైల్ నంబర్ (ఉంటే) ఆధార్ నంబర్ (ఉంటే) ఓటర్ ఐడీ నంబర్ (ఉంటే) పాస్‌పోర్ట్ నంబర్ (భారత పాస్‌పోర్ట్ ఉంటే), డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా? -
జేపీసీ పరిశీలనకు ఎఫ్సీఆర్ఏ బిల్లు
న్యూఢిల్లీ: విదేశీ విరాళాలపై నియంత్రణ కోసం ఉద్దేశించిన వివాదాస్పద ‘ఫారిన్ కంట్రిబ్యూషన్(రెగ్యులేషన్) సవరణ బిల్లు–2026’ను 31 మంది సభ్యులతో కూడిన ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం పార్లమెంట్ ఉభయ సభల్లో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంత రాయ్ లోక్‌సభలో ఈ తీర్మానాన్ని సభలో ప్రవేవపెట్టారు. బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సభలో నినాదాలతో హోరెత్తించాయి. జేపీసీలో 21 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. లోక్‌సభ సభ్యులను స్పీకర్ ఓం బిర్లా నామినేట్ చేస్తారు. రాజ్యసభ సభ్యులను చైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ నామినేట్ చేయబోతున్నారు. 2026లో పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి వారంలోని చివరి రోజు నాటికి లోక్‌సభకు నివేదికను సమర్పించాలని జేసీపీ కమిటీకి గడువు నిర్దేశించారు. బిల్లు వెనుక దురుద్దేశం లేదు: రిజిజు ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనారిటీకు సంబంధించిన సంస్థలను లక్ష్యంగా చేసుకునేలా బిల్లు ఉందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. సదుద్దేశంతో సమాజానికి సేవలు అందిస్తున్న సంస్థలపై విదేశీ నిధుల నియంత్రణ పేరుతో ఒత్తిడి పెంచుతున్నారని విమర్శించారు. విదేశాల నుంచి విరాళాలు పొందుతున్న సంస్థల విషయంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మైనారిటీ సంస్థలను టార్గెట్ చేయడం సరైంది కాదన్నారు. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నిజంగా విదేశీ నిధుల పారదర్శకతే లక్ష్యమైతే, అన్ని సంస్థలకు ఒకే విధమైన నిబంధనలు ఉండాలని తేల్చిచెప్పారు. కేసీ వేణుగోపాల్ ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. ఈ బిల్లు ఏ మతం, వర్గం లేదా సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి కాదని స్పష్టం చేశారు. విదేశీ నిధుల దురి్వనియోగాన్ని అరికట్టడం, దేశ భద్రతను కాపాడటం, విదేశీ విరాళాల్లో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. బిల్లులో మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్న ఏదైనా నిర్దిష్ట నిబంధనను చూపించాలని విపక్షాలకు సవాలు విసిరారు. ఈ బిల్లు వెనుక ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ టి.ఆర్.బాలు మాట్లాడారు. విదేశీ నిధుల నియంత్రణ పేరుతో సామాజిక సంస్థల కార్యకలాపాలపై నిఘా పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విపక్షాల నిరసనల మధ్య బిల్లును జేపీసీకి పంపే తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టారు. మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందింది. ఈ సవరణ బిల్లును సంయుక్త కమిటీకి పంపే తీర్మానాన్ని రాజ్యసభ సైతం ఆమోదించింది. సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించారు. గనులు, ఖనిజాల సవరణ బిల్లు గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టాన్ని సవరించే బిల్లును లోక్‌సభలో ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించారు. గనులు, ఖనిజాలకు సంబంధించిన నిబంధనలను సవరించాలని ఈ బిల్లు సూచిస్తోంది. దీనిద్వారా ఖనిజ హక్కులపై అదనపు పన్ను విధించకుండా రాష్ట్రాలను నియంత్రించడానికి వీలవుతుంది. గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) చట్టం కింద నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఖనిజ నిల్వలు కలిగిన భూముల నియంత్రణను కూడా ఈ బిల్లు ద్వారా కేంద్రం తన పరిధిలోకి తీసుకోనుంది. ‘కేరళం’బిల్లుకు ఆమోదముద్ర కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు కేంద్రం తీసుకొచి్చన కేరళ(పేరు మార్పు) బిల్లు–2026 పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందింది. మంగళవారం లోక్‌సభలో, బుధవారం రాజ్యసభలో ఆమోదించారు. -
ఎయిర్పోర్ట్ ఆపరేటర్ల ఎయిర్‌లైన్స్ నిర్వహణపై నో బ్యాన్
న్యూఢిల్లీ: విమానాశ్రయాల ఆపరేటర్లు.. విమానయాన సంస్థలను నడపకూడదంటూ పాలసీలపరంగా ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంలో నడిచే ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించిన ఒప్పందాల్లో మాత్రం కొన్ని పరిమితులు ఉన్నాయని పేర్కొంది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మహోల్ సోమవారం రాజ్యసభకి ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఎయిర్‌పోర్ట్స్ ఆపరేటర్లు .. విమానయాన సంస్థల్లో గణనీయంగా వాటాలు తీసుకోకుండా లేదా వాటిని నడపకుండా ప్రస్తుతం ఏవైనా నిబంధనలు ఉంటే, వాటిని సడలించాలనే యోచనేదైనా ప్రభుత్వానికి ఉందా అని సీపీఐ(ఎం) సభ్యుడు జాన్ బ్రిటాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఎనిమిది విమానాశ్రయాలను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్.. ఎయిర్‌లైన్ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని ఆసక్తిగా ఉందని వార్తలు వచి్చన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. తమకు ఎయిర్‌లైన్ వ్యాపారంలోకి ప్రవేశించే యోచనేదీ లేదని అదానీ గ్రూప్ ఇప్పటికే స్పష్టం చేసింది. -
ఫేక్ఆట కట్టించే లా
ఒకప్పుడు సెలబ్రిటీల చుట్టూ మాత్రమే తిరిగిన ‘డీప్‌ఫేక్’ విష సర్పం... ఇప్పుడు సామాన్యుల జీవితాల్లోకి కూడా వచ్చింది. స్విచ్ వేసి లైట్ వెలిగించినంత తేలిగ్గా ‘మాయా సాంకేతికత’ అందుబాటులోకి వచ్చింది. డీప్‌ఫేక్ దెబ్బకు...పచ్చని సంసారాల్లో చిచ్చు రేగుతుంది. పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. ఒక్కటా... రెండా... ఎన్నో ఎన్నెన్నో! ఏ.ఐ. టెక్నాలజీ సృష్టించిన డీప్‌ఫేక్, హానికరమైన సింథటిక్ కంటెంట్‌కు మరింత పకడ్బందీగా అడ్డుకట్ట వేయడానికి కేంద్రప్రభుత్వం నడుం బిగించింది. డీప్‌ఫేక్ డిటెన్షన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. పదమూడు ఏఐ రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెలిపింది...డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ఎలక్ట్రానిక్స్–ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ మెటా, ఎక్స్‌లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను దృష్టిలో పెట్టుకొని కఠినమైన నియమాలను రూ΄÷ందించింది. ‘ఏఐ వాడకం పెరగడం వల్ల నకిలీ ఫొటోలు, వీడియోలు, ఆడియోలను సృష్టించడం సులువైంది. వీటిని సైబర్ నేరాలకు కూడా ఉపయోగిస్తున్నారు. డీప్‌ఫేక్‌లకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఉన్న చట్టాలను పటిష్టం చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియటరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్–2021)ని సవరించింది’ అంటున్నారు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్.వేగంగా చర్యలు తీసుకోవచ్చుచట్టవిరుద్ధమైన ఏఐ కంటెంట్‌పై ఇకపై ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు వేగంగా చర్యలు తీసుకోవచ్చు. గతంలో ఉన్న 36 గంటల గడువుకు బదులుగా, మూడు గంటల లోపే తొలగించాలి. చట్ట విరుద్ధమైన ఏఐ కంటెంట్‌ను గుర్తించడానికి, ఆటోమేటెడ్ సాధనాలతో సహా తగిన సాంకేతిక చర్యలను అమలు చేయాలని ప్రభుత్వం సోషల్ మీడియా కంపెనీలను కోరింది. సవరించిన నిబంధనల ప్రకారం ఏఐ ద్వారా రూ΄÷ందించిన కంటెంట్‌ను స్పష్టంగా లేబుల్ చేయాలి. సింథటిక్ కంటెంట్‌ను మరింత సులభంగా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. డీప్‌ఫేక్‌ల ద్వారా ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశాలను తగ్గిస్తుంది.‘సాక్ష్య’ సహకారంతో...నియంత్రణా పరమైన మార్పులతో ΄ాటు డీప్‌ఫేక్ డిటెన్షన్ టెక్నాలజీని మెరుగుపరచడానికి విద్యాసంస్థలలో పదమూడు ‘రెస్పాన్సిబుల్ ఏఐ’ ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం ఆమోదించింది. ఐఐటీ, జో«ద్‌పూర్, ఐఐటీ, మద్రాస్ అభివృద్ధి చేస్తున్న మల్టీ– ఏజెంట్ డీప్‌ఫేక్ డిటెక్షన్ ఫ్రేమ్‌వర్క్ ‘సాక్ష్య’ ఈ కార్యక్రమాలలో కీలకమైనది. మరొక ప్రాజెక్ట్...ఏఐ విశ్లేషక్. నకిలీ ఆడియో, వీడియోలను గుర్తించడానికి దీన్ని రూ΄÷ందించారు. మీడియాఫైళ్లను విశ్లేషించడానికి, వాటిని తారుమారు చేశారా అనేది తెలుసుకోవడానికి ‘ఏఐ విశ్లేషక్’ ఉపయోగపడుతుంది. ఐఐటీ, ఖరగ్‌పూర్ రియల్–టైమ్ వాయిస్ డీప్‌ఫేక్ డిటెన్షన్ సిస్టమ్‌పై పనిచేస్తోంది. ఏఐ సృష్టించిన మాటలను ఇది గుర్తించగలదు. తద్వారా వాయిస్ స్కామ్‌లు, ఆర్థిక మోసాలు జరగకుండా నిరోధించవచ్చు.యూట్యూబ్ లైక్ డిటెక్షన్ఏఐ–ఆధారిత పోలికను గుర్తించే ్రపోగ్రామ్‌కు 18 ఏళ్లు పైబడిన యూజర్లు అందరికీ యాక్సెస్ విస్తరిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. దీంతో తమ పోలికతో ఏఐ ద్వారా సృష్టించబడిన డీప్‌ఫేక్‌లపై చర్య తీసుకోవచ్చు. యూట్యూబ్‌లోని లైక్ డిటెక్షన్ టూల్ అనేది పోలికలను కనిపెడుతుంది. ఒకవేళ ఈ టూల్ పోలిక కనుగొంటే, ఎవరి పోలిక అయితే గుర్తించబడిందో ఆ యూజర్‌కు ఒక హెచ్చరిక(అలర్ట్) పంపబడుతుంది. దీంతో ఆ కంటెంట్‌ను తొలగించమని యూట్యూబ్‌ను అభ్యర్థించే అవకాశం బాధితులకు దొరుకుతుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఏఐ ద్వారా సృష్టించబడిన చాలా డీప్‌ఫేక్‌లు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ సామాన్యులకు సంబంధించి కూడా ఇది ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో వారికి లైక్ డిటెక్షన్ టూల్ ఉపయోగపడుతుంది.ఎలా గుర్తించవచ్చు?డీప్‌ఫేక్ కొత్తగా వచ్చిన రోజుల్లో ఆ సాంకేతికత పరిపూర్ణంగా ఉండేది కాదు. తారుమారు చేసినట్లు స్పష్టమైన సంకేతాలు చూపించేది. వీడియోలలో కనిపించే వ్యక్తులు అసహజంగా కనురెప్పలు ఆర్పడం లాంటివి అందులో ఒకటి. తరువాత రోజుల్లో టెక్నాలజీ మెరుపడడంతో డీప్‌ఫేక్‌లను గుర్తించడం కష్టమైంది. అయినప్పటికీ కొన్ని సంకేతాలతో వాటిని గుర్తించవచ్చు అంటున్నారు నిపుణులు...→ సహజత్వం లోపించిన డీప్‌ఫేక్ ఫొటోలు ఎలక్ట్రానిక్ మెరుపును కలిగి ఉంటాయి → చిత్రంలోని వ్యక్తి స్పష్టమైన ఫోకస్లో ఉంటాడు. బ్యాక్‌గ్రౌండ్‌లోని అంశాలు వాస్తవికంగా అనిపించవు → సాధారణ డీప్‌ఫేక్ పద్ధతులలో ముఖాలను మార్చడం ఫేస్–స్వాపింగ్) ఒకటి. ముఖం అంచులను నిశితంగా చూడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖంలోని చర్మపు రంగు శరీరంలోని మిగిలిన భాగంతో సరిపోలుతుందా? ముఖం అంచులు స్పష్టంగా ఉన్నాయా లేదా చూడాలి → వీడియోలో ఉన్న వ్యక్తి పెదాల కదలికలు ఆడియోతో ఖచ్చితంగా సరిపోలుతున్నాయా... లేదా అనేది చూడాలి → పళ్లు సహజంగా ఉన్నాయా... అసహజంగా ఉన్నాయా అనేది పరిశీలించాలి. సైబర్ సెక్యూరిటీ కంపెనీ నార్టన్ ప్రకారం ఒక్కోపంటిని సృష్టించేంత అధునాతనమైన అల్గారిథమ్‌లు ఇంకా అభివృద్ధి చెందలేదు → ఫొటోలు లేదా వీడియోలు మార్ఫింగ్ చేయబడ్డాయా లేదా అనేది తెలుసుకోవడానికి మైక్రోసాఫ్ట్ ఒక అథంటికేటర్ టూల్‌ను అభివృద్ధి చేసింది. చిప్ మేకర్ ఇంటెల్ ‘ఫేక్క్యాచర్’ ఫొటో లేదా వీడియో నిజమైనదా కాదా అని తెలుసుకోవడానికి, పిక్సెళ్ళను విశ్లేషించడానికి అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. -
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
-
ఐటీ చట్టానికి సవరణలు!
న్యూఢిల్లీ: అక్రమ కృత్రిమ మేధ(ఏఐ) కంటెంట్, డీప్‌ఫేక్‌ల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. వీటి ప్రకారం ఇకపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఇతర వేదికలు అక్రమ ఏఐ కంటెంట్‌ను ప్రభుత్వం లేదా కోర్టు నుంచి ఆదేశాలు అందిన మూడు గంటల్లోపు తొలగించాల్సి ఉంటుంది. గతంలో ఈ గడువు 24 గంటలుగా ఉండేది. అలాగే కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన చిత్రాలు, వీడియోలు, ఆడియో, టెక్స్ట్లపై స్పష్టమైన లేబుల్ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్ ఎక్కడి నుంచి వచి్చందో తెలుసుకునేందుకు వీలు కల్పించే మెటాడేటాను కూడా జోడించాలి. ఏఐ ఆధారిత నకిలీ వీడియోలు, ఆడియోలు, వ్యక్తుల నకలు చేయడం (ఇంపర్సనేషన్), పిల్లల శోషణ, ఆమోదం లేని చిత్రాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఐటీ చట్టాన్ని సవరించనున్నారు. దీంతోపాటే ఫిర్యాదుల పరిష్కారానికి ఉన్న గడువును 72 గంటల నుంచి 36 గంటలకు తగ్గించారు. నగ్నత్వం, ఇతరుల నకలు వంటి ఫిర్యాదులకు ఈ సమయం రెండంటే రెండే గంటలు. గతంలో ఇది 24 గంటలుగా ఉండేది. -
ఉచిత చెల్లింపులకు 'చెల్లు'!
సాక్షి బిజినెస్ డెస్క్: పల్లె నుంచి పట్నం వరకు దాదాపు అన్ని నగదు లావాదేవీలు ఇప్పుడు డిజిటల్ పద్ధతిలోనే జరుగుతున్నాయి. అది రూపాయి అయినా వేల రూపాయలైనా సరే..స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. చిటికెలో చెల్లింపు జరిగిపోతోంది. అదీ ఎలాంటి చార్జీ లేకుండా..పూర్తి ఉచితంగా. కానీ ఇప్పుడా పరిస్థితి మారనుంది. డిజిటల్ పద్ధతిలో సులువుగా చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పిస్తున్న యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విధానం ఇకపై ఆర్థికంగా భారం కానుంది. ఇప్పటివరకు ఉచితంగా కొనసాగుతున్న ఈ సర్వీసు మీద భవిష్యత్తులో చార్జీలు విధించబోయే పరిస్థితి రానుంది. యూపీఐ చెల్లింపులపై ఫీజులు విధించడానికి బ్యాంకులు, పేమెంట్ సిస్టం ప్రొవైడర్స్‌ని అనుమతించేలా ప్రభుత్వానికి అధికారమిచ్చే చట్ట సవరణను లోక్‌సభ ఆమోదించింది. రూపే డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులపైనా చార్జీలు విధించడానికి ఇది మార్గం సుగమం చేయనుంది. యూపీఐ వ్యవస్థ నిర్వహణ భారం తడిసి మోపెడవుతోందని, చార్జీలు వసూలు చేసుకునేందుకు వీలు కల్పించాలంటూ బ్యాంకులు, పేమెంట్ ప్రాసెసర్లు చాన్నాళ్లుగా గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో కేంద్రం ఆ మేరకు చర్యలు చేపట్టింది. అందరినీ డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించే లక్ష్యంతో ముందుగా యూపీఐ ఉచితమనే తాయిలం చూపించిన ప్రభుత్వం..దాదాపుగా దేశమంతా దానికి అలవాటు పడ్డాక ప్లేటు ఫిరాయించిందని, యూపీఐని కూడా ఆదాయ వనరుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యల వల్ల మళ్లీ ప్రజలు నగదు లావాదేవీల వైపు మళ్లే పరిస్థితి తలెత్తుతుందని.. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద గతంలోలా క్యూ లైన్లు కనిపించినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు. వీటిపై ఎండీఆర్ ఇకపై జీరో కాదు.. ప్రస్తుతం చెల్లింపుల సంబంధ ఆర్థిక లావాదేవీల కోసం ప్రాథమికంగా బ్యాంకులు, పేమెంట్ ప్రాసెసర్ల నెట్‌వర్క్‌లను ఉపయోగించుకున్నందుకు గాను వ్యాపార వర్గాలు ఆయా సంస్థలకు చెల్లించాల్సిన చార్జీలను మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)గా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఇంటర్చేంజ్ ఫీజు, ప్రాసెసింగ్ చార్జీలు, నెట్వర్క్ ఫీజులు, పన్నుల్లాంటివి ఉంటాయి. క్రెడిట్, డెబిట్ కార్డులను జారీ చేసే బ్యాంకులకు చెల్లించేది ఇంటర్చేంజ్ ఫీజు, రేజర్‌పే, పేయూలాంటి పేమెంట్ ప్రాసెసర్ లేదా గేట్‌వేలకు కట్టేవి ప్రాసెసింగ్ చార్జీలు. వీసా, మాస్టర్‌కార్డ్ ఎన్పీసీఐలాంటి పేమెంట్ నెట్‌వర్క్‌లకు వెళ్లేది నెట్వర్క్ ఫీజు. అంతిమంగా ఈ సర్వీసులపై జీఎస్టీ కింద ప్రభుత్వానికి ట్యాక్సులు వెళ్తాయి. అయితే దేశీయ పేమెంట్ గేట్‌వేని, డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 2020 నుంచి యూపీఐ, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై ఎలాంటి ఎండీఆర్ అయినా జీరో చేస్తూ కేంద్రం చట్టం చేసింది. ఈ నేపథ్యంలో రూపే, యూపీఐ మినహా ఇతర వ్యవస్థల్లో యధావిధిగా 0.4 శాతం నుంచి 4.5 శాతం వరకు (కార్డును బట్టి) ఎండీఆర్ చార్జీలు కొనసాగుతున్నాయి. కాగా తాజా చట్ట సవరణలో యూపీఐ, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై ‘ఎండీఆర్ జీరో’ను తొలగించి దీనిపై నిర్ణయాధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టారు. ప్రభుత్వం ఇకపై ఎప్పటికప్పుడు విడుదల చేసే నోటిఫికేషన్ల ద్వారా యూపీఐ, రూపే లావాదేవీలకు సంబంధించిన చార్జీలను నిర్ణయించనుంది. ఇప్పుడు యూపీఐ భారాన్ని ఎవరు మోస్తున్నారంటే .. యూపీఐ లావాదేవీల వ్యయాల భారంలో కొంత భాగాన్ని బ్యాంకులు, పేమెంట్ ప్రాసెసర్లు భరిస్తుండగా, మిగతాదంతా ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తోందని, ఇదంతా పన్ను చెల్లింపుదారుల సొమ్మేనని నిపుణులు చెబుతున్నారు. ఈ భారం ఏటా దాదాపు రూ. 20 వేల కోట్లు ఉంటుందని అంచనా. వాస్తవానికి తక్కువ విలువ చేసే లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో రూ.2 వేల లోపు విలువ ఉండే లావాదేవీలపై బ్యాంకులకు సబ్సిడీ ఇచ్చేలా 2021 డిసెంబర్లో ప్రభుత్వం స్కీమును ప్రవేశపెట్టింది. 2021–22లో ఇలా రూ.1,389 కోట్ల సబ్సిడీ ఇవ్వగా, 2023–24 నాటికి ఇది ఏకంగా రూ.3,631 కోట్లకు పెరిగింది. దీంతో క్రమంగా ఈ భారాన్ని తగ్గించుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. 2026–27 బడ్జెట్లో ఇందుకోసం రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించడం ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇతరత్రా ఎల్రక్టానిక్ పేమెంట్స్ విధానాల్లో ఎండీఆర్ చార్జీలను పరిస్థితులను బట్టి కొందరు వ్యాపారులు తామే చెల్లిస్తుండగా మరికొందరు ఆ భారాన్ని కస్టమర్లకే బదలాయిస్తున్నారు. అమెరికాను సంతృప్తి పరిచేందుకేనా..? ఇన్నాళ్లూ ఉచితంగా ఇస్తూ వచ్చిన సర్వీసులపై చార్జీల భారాన్ని మోపాలనే ఆలోచన వెనుక ప్రత్యేక కారణాలున్నాయనే వాదనలు విని్పస్తున్నాయి. యూపీఐని ఆర్థికంగా నిలబెట్టాలంటే చార్జీలను విధించడం ఒక్కటే మార్గమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. అసలు ప్రజలకు బదలాయించాల్సిన అవసరమే లేకుండా ఈ భారాన్ని భరించేందుకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఆర్థిక సామర్థ్యాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. 2025–26లో ఆర్బీఐ ఏకంగా రూ.2.86 లక్షల కోట్ల మిగులు నిధులను ప్రభుత్వానికి బదలాయించింది. కీలకమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను నిలబెట్టేందుకు ఇందులో చాలా తక్కువ మొత్తాన్ని వెచ్చించినా సరిపోతుంది అని వారంటున్నారు. మరోవైపు దీని వెనుక అమెరికా ఒత్తిళ్లు కూడా ఉన్నాయనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. యూపీఐ, రూపే వ్యవస్థలను ఉచితంగా అందించడం ద్వారా వీసా, మాస్టర్కార్డ్లాంటి తమ పేమెంట్ ప్లాట్‌ఫాంలకు భారత్ పొగ పెడుతోందంటూ 2026 యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ నివేదికలో అమెరికా ఆరోపించింది. ఈ నేపథ్యంలో చట్ట సవరణ జరగడంతో..ఇది అమెరికాను సంతృప్తి పరిచేందుకేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న మొత్తాలకు వర్తించకపోవచ్చు..! యూపీఐ పేమెంట్లపై చార్జీల వడ్డనకు రంగం సిద్ధమవుతున్నప్పటికీ, అన్ని చెల్లింపులపైనా చార్జీల భారం పడకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రూ.2 వరకు చెల్లింపులపై మినహాయింపు ఉండొచ్చని చెబుతున్నాయి. రూ.50 కోట్ల పైబడి టర్నోవర్ ఉండే పెద్ద వ్యాపారులకు సంబంధించిన యూపీఐ లావాదేవీలపై 0.3–0.6 శాతం వరకు చార్జీలు విధించవచ్చని పేర్కొన్నాయి. ప్రస్తుతం చిన్న వ్యాపారులకు చేసే రూ.2 వేల వరకు మొత్తాలకు మాత్రమే ప్రభుత్వం ఇన్సెంటివ్ స్కీము కింద సబ్సిడీనిస్తోంది. ఆర్థిక శాఖ డేటా ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో వ్యాపారులకు కస్టమర్లు చెల్లించిన రూ.2 వేలకు పైబడిన లావాదేవీల పరిమాణం కేవలం 4 శాతంగానే ఉంది. లోకల్ సర్కిల్స్ అనే ఆన్లైన్ ప్లాట్‌ఫాం ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం రూ.3 వేలకు పైబడే యూపీఐ పేమెంట్ల మీద చార్జీలను కస్టమర్ల నుంచే వ్యాపారులు వసూలు చేస్తే తాము యూపీఐని వాడటం మానేస్తామంటూ దాదాపు 98 శాతం మంది చెప్పారట. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ ఊహగానాలేనని, వాస్తవ చార్జీలు.. భవిష్యత్తులో చట్ట సవరణ పూర్తిస్థాయిలో ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారా మాత్రమే వెల్లడవుతాయని బ్యాంకర్లు చెబుతున్నారు. యూపీఐ లావాదేవీలు, విలువ కథా కమామిషు – 2016 ఏప్రిల్‌లో యూపీఐ ఆవిష్కరణ – 2016–17లో 2 కోట్ల లావాదేవీలు, విలువ సుమారు రూ.7 వేల కోట్లకు పరిమితం – పదేళ్లలో 12 వేల రెట్లు పెరిగిన లావాదేవీలు, 4 వేల రెట్లు పెరిగిన విలువ – 2025–26లో 24 వేల కోట్ల యూపీఐ లావాదేవీలు, విలువ రూ.314 లక్షల కోట్లు – యూపీఐ లావాదేవీల్లో రూ.2 వేలకు పైగా ఉండే చెల్లింపులు 4 శాతమే – 2021–22 నుంచి 2024–25 వరకు ఇన్సెంటివ్ స్కీము కింద కేంద్రం ఇచ్చిన మొత్తం రూ. 8,730 కోట్లు -
మెటాకు కేంద్రం సీరియస్ వార్నింగ్
-
మెటా గ్లోబల్ టీమ్‌కు ప్రభుత్వం సమన్లు
న్యూఢిల్లీ: ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్‌మీడియా సంస్థల మాతృసంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం తాఖీదులు జారీ చేసింది. చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ నిర్వహణలో లోపాలు ఒకానొక ప్రముఖ ఖాతాపై తప్పుడు చర్య వంటి అంశాలపై వివరణ ఇచ్చేందుకు మెటా గ్లోబల్ టీమ్‌తో నేడు, రేపు సమావేశం కానున్నట్లు కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ మంగళవారం తెలిపారు. ఏఐ4భారత్ సిద్ధం చేసిన స్వతంత్ర ఏఐ మోడళ్ల పరీక్ష ప్లాట్‌ఫామ్ ఆవిష్కరణ సందర్భంగా ఐఐటీ మద్రాస్‌లో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో కృష్ణన్ విలేకరులతో మాట్లాడారు.సాంకేతికత విషయంలో అగ్రగామిగా ఉన్న మెటా ఇలాంటి తప్పులు జరక్కుండా చూసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ చట్టాల గురించి మెటా లాంటి ప్లాట్‌ఫామ్స్‌కు సరైన అవగాహన ఉండాలని, వాటి అమలు తీరు ఎలా ఉండాలో కూడా తెలిసి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆగస్టు ఐదు, ఆరు తేదీల్లో మెటా గ్లోబల్ టీమ్, ఉన్నతాధికారి జోయెల్ కప్లాన్ భారత్‌లోనే ఉంటారని అంచనా. మెటా గ్లోబల్ టీమ్‌తో సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ జెన్–జీని ఉద్దేశిస్తూ చేసిన ఒక రీల్ ఫేస్బుక్లో కొద్దిసేపు బ్లాక్ అయ్యింది. కొంత సమయం తరువాత రీల్ పోస్ట్ అయినప్పటికీ కేంద్రం మెటా సంస్థ ఉన్నతాధికారులను ప్రధాని కార్యాలయానికి పిలిపించి వివరణ కోరింది. సాంకేతిక పరమైన సమస్యతోనే ఈ పొరబాటు దొర్లినట్టు వివరణ ఇచ్చిన మెటా అందుకు క్షమాపణలు కోరింది. అయితే కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ వివరణతో సంతృప్తి చెందలేదు. ఇన్‌స్టా గ్రామ్ ప్రకటనల్లో కొన్నింటిలో పిల్లల లైంగిక శోషణ, పోర్నోగ్రఫీ కనిపిస్తోందన్న ఆరోపణలు మెటాపై ఉన్నాయి. ఈ అంశంపై మెటా ఇప్పటికే ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం మెటాకు ఇప్పటికే నోటీసు జారీ చేసిందని, ఏ చర్యలు తీసుకున్నారో తెలుసుకునేందుకు ఆగస్టు ఐదునాటి సమావేశం ఉపయోగపడుతుందని కృష్ణన్ చెబుతున్నారు.దీంతోపాటు ఇతర అంశాలు చర్చకు వస్తాయని చెప్పారు. కృత్రిమంగా తయారైన సమాచారం విషయంపైనా చర్చ జరుగుతుందన్నారు. వీటితోపాటే ధ్రువీకరించిన ఖాతాల నుంచి కంటెంట్‌ను ఏకపక్షంగా తొలగించడం వంటి అంశాలపై కూడా మెటా అధికారులతో మాట్లాడతామని కృష్ణన్ మీడియాతో చెప్పారు. మెటాలో కొన్ని అంశాలు అవి పనిచేయాల్సిన విధంగా ఎందుకు చేయడం లేదో వారితోనే మాట్లాడి సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోవాలని తాము భావిస్తున్నట్లు కృష్ణన్ వెల్లడించారు. -
రేషన్ షాపుల వద్ద జనం పోటెత్తారు!
బంజారాహిల్స్: కేంద్ర ప్రభుత్వం పేద, బలహీన వర్గాలు ఇబ్బందులు పడకుండా గతంలో అత్యధిక వర్షాలు, తీవ్ర వేసవి పరిస్థితుల దృష్ట్యా మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేసింది. తాజాగా ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలకు సంబంధించి రేషన్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నది. వేసవి కాలంలో ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేశారు. జూలై 1 నుంచి నెల వారి రేషన్ పంపిణీ ప్రారంభించారు. కరువు పరిస్థితులు నెలకొన్న క్రమంలో మరోసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. 22 రోజులు షాపులు ఓపెన్.. ఖైరతాబాద్ రేషనింగ్ సర్కిల్–7 పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సనత్‌నగర్ నియోజక వర్గాల పరిధిలో ఉన్న సోమాజిగూడ, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఫిలింనగర్, శ్రీనగర్ కాలనీ, కృష్ణానగర్, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ, కారి్మకనగర్, వెంగల్రావునగర్, రాజీవ్‌నగర్, ఎర్రగడ్డ, బోరబండ, అమీర్‌పేట, సనత్‌నగర్, బల్కంపేట డివిజన్ల పరిధిలో ఉన్న 81 రేషన్ దుకాణాల పరిధిలో మూడు నెలల కోటా పంపిణీ చేస్తున్నారు. ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంచి బియ్యం పంపిణీ చేసేవారు. అయితే మూడు నెలల కోటా పంపిణీ సందర్భంగా ఆగస్టులో 22 రోజులు షాపులు తెరిచి ఉంచాలని పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సరిపడా బియ్యాన్ని షాపుల్లో సిద్ధంగా ఉంచారు. రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా జరిగే విధంగా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజూ ఆయా రేషన్ షాపులను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. -
ముస్లింలలో బహుభార్యత్వంపై మీ స్పందనేమిటి?
న్యూఢిల్లీ: ముస్లింలలో బహుభార్యత్వాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తన వైఖరి ఏమిటో చెప్పాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహిళ హక్కుల కార్యకర్తలు జాకియా సోమన్, నూర్జహాన్ సాఫియా నియాజ్ తదితరులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారణకు చేపట్టిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌ను ఇతర పెండింగ్ కేసులకు జతచేసింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 82 ప్రకారం రెండో వివాహం చేసుకున్న వారు శిక్షార్హులని, ఇది అందరికీ వర్తిస్తుందని, ముస్లిం పర్సనల్ లా బోర్డుకు ఈ విషయంలో ఏవైనా మినహాయింపులు ఉన్నా వాటిని తొలగించిందని పిటిషనర్లు వాదించారు. ఈ కారణంగా కేంద్రం బహుభార్యత్వాన్ని రద్దు చేసేలా కేంద్రం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మతాలకు అతీతంగా అందరికీ ఇది వర్తించేలా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా... ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ, భద్రతలకు సంబంధించి అనేక మార్గదర్శకాలను కోరిన పిటిష నర్లు ముస్లింల వివాహాలు, విడాకులు రెండింటినీ తప్పనిసరిగా రిజిస్టర్ చేసేలా కూడా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. బహుభార్యత్వం కేసులను వేగంగా పరిష్కరించాలని, మొదటి భార్య, పిల్లలకు అత్తవారి ఇంటిపై హక్కు కల్పించాలని కోరారు. షరియత్ చట్టానికి సవాలు... పిటిషనర్లు 1937 నాటి ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్ లోని సెక్షన్ రెండును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ సెక్షన్ ముస్లింలలో బహు భార్యత్వం ఆమోదయోగ్యం చేస్తుంది. అయితే ఈ సెక్షన్ కారణంగా భారత న్యాయ సంహితలోని సెక్షన్ 82 కింద రెండో వివాహానికి సంబంధించి మహిళలందరికీ లభిస్తున్న రక్షణ ముస్లిం మహిళలకు మాత్రం దక్కకుండా పోతోందని, న్యాయపరమైన ఈ అంతరాన్ని సవరించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రియా మైనీ వాదించారు. బహుభార్యత్వం సహజంగానే వివక్షపూరితమైందని, ఆర్టికల్ 14, 15, 21లకు విరుద్ధమని వాదించారు. ‘‘ముస్లిం పర్సనల్ లా లోని సెక్షన్ 2 ఇతర సామాజిక వర్గాలన్నింటిలో నేరంగా పరిగణించే విషయానికి మతపరమైన రక్షణ కల్పిస్తోంది. ఇది న్యాయసూత్రమైన ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా పరీక్షకు నిలబడదు. బహుభార్యత్వం మహిళలు, పిల్లలపై చెరిగిపోని ముద్ర వేస్తుంది. గౌరవ మర్యాదలతో బతికేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుకు ఇది విరుద్ధం’’అని పిటిషన్లో వివరించారు. మతస్వేచ్ఛ రాజ్యాంగ నైతికతపై ఆధారపడి ఉంటుందని ఆర్టికల్ 25 చెబుతుందని, పితృస్వామిక సంప్రదాయల కంటే స్త్రీ, పురుష సమానత్వానికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. -
ఫేస్బుక్ వివాదం.. కేంద్రం యాక్షన్!
భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఫేస్బుక్ పోస్ట్‌ను కొంతసేపు పరిమితం చేసిన ఘటన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థపై మరింత దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంపై.. మెటా గ్లోబల్ బృందాన్ని భారత్‌కు పిలిపించి.. సంస్థ విధానాలు, కంటెంట్ నియంత్రణ వ్యవస్థలపై వివరణ కోరాలని నిర్ణయించింది.మెటా ప్రతినిధులను ముఖ్యంగా అల్గారిథమ్‌లు ఎలా పనిచేస్తాయి?, వినియోగదారులకు ఏ కంటెంట్ చూపించాలి?, అనే నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, కంటెంట్ మోడరేషన్లో ఏమైనా పక్షపాతం ఉందా?, అనే అంశాలపై ప్రశ్నించనున్నారు. అంతే కాకుండా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రజా శాంతి, సమాజంపై చూపించే ప్రభావం గురించి కూడా చర్చ జరగనుంది. దీంతో.. మెటా గ్లోబల్ బృందం వచ్చే వారం మధ్యలో భారత్‌కు వచ్చే అవకాశం ఉందని, అనంతరం పార్లమెంటరీ కమిటీ ముందు కూడా హాజరుకానుందని సమాచారం.సోషల్ మీడియా సంస్థలు భారతదేశంలో పనిచేస్తున్నప్పుడు.. దేశ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి షేర్ చేసిన ఒక ఫేస్బుక్ పోస్టును తాత్కాలికంగా పరిమితం చేసింది. ఈ పోస్టులో పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఘటన సాంకేతిక లోపం వల్ల జరిగిందని మెటా వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ వివరణపై కేంద్రం సంతృప్తి చెందలేదని సమాచారం.ఈ పరిణామాల తర్వాత ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖుల ఖాతాల నుంచి వచ్చే పోస్టులపై మరింత పర్యవేక్షణ ఉంటుందని మెటా తెలిపింది. ముఖ్యమైన ఖాతాల కంటెంట్‌ను సీనియర్ అధికారులు పలు స్థాయిల్లో పరిశీలించే విధంగా అదనపు భద్రతా చర్యలు తీసుకున్నట్లు కంపెనీ కేంద్రానికి వివరించింది.ఇదే సమయంలో.. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ చేసిన చిత్రాలు, ఏఐ ద్వారా రూపొందించిన తప్పుడు పోస్టులు ప్రచారం చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు కొన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై కేసులు నమోదు చేశారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చట్టవిరుద్ధమైన లేదా హానికరమైన కంటెంట్‌ను నియంత్రించడంలో సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. సోషల్ మీడియా అధిక వినియోగం పిల్లలు, పెద్దల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ
ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP) కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి సమర్థించింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగిన సమయంలో ఇథనాల్ కలపకపోయి ఉంటే ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.125కు చేరే అవకాశం ఉండేదని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇథనాల్‌ను ముందుగా నిర్ణయించిన ధరలకు దేశీయంగా కొనుగోలు చేయడం వల్ల అంతర్జాతీయ ముడిచమురు ధరల ప్రభావం కొంతమేర తగ్గిందని తెలిపింది.ఎఫ్‌సీఐ బియ్యంపై ఆరోపణలు తప్పుదోవ పట్టించేవిఇథనాల్ తయారీ కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) బియ్యాన్ని తక్కువ ధరకు డిస్టిలరీలకు విక్రయించడం వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతోందన్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆహార భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS), జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA), సంక్షేమ పథకాలు, తప్పనిసరి బఫర్ నిల్వల అవసరాలు పూర్తయిన తర్వాత మాత్రమే మిగులు ధాన్యాన్ని ఇతర అవసరాలకు మళ్లిస్తామని తెలిపింది.ఎఫ్‌సీఐ నుంచి ఇథనాల్ తయారీకి ఉపయోగిస్తున్నది ఆహార భద్రతకు అవసరమైన బియ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది. ఆహార, ప్రజా పంపిణీ శాఖ గుర్తించిన మిగులు నిల్వలు, దెబ్బతిన్న ధాన్యం, మానవ వినియోగానికి పనికిరాని విరిగిన బియ్యం వంటి వాటినే వినియోగిస్తున్నట్లు వివరించింది.బియ్యానికి ప్రత్యేక రాయితీ లేదుఇథనాల్ తయారీదారులకు ఎఫ్‌సీఐ బియ్యాన్ని ప్రత్యేకంగా తక్కువ ధరకు అందిస్తున్నారన్న వాదనను కూడా మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల వ్యవస్థలో ఇథనాల్ ఉత్పత్తికి అనుమతించిన పలు ఫీడ్స్టాక్స్లో ఎఫ్‌సీఐ బియ్యం కూడా ఒకటేనని పేర్కొంది.2025-26 ఇథనాల్ సరఫరా సంవత్సరానికి వివిధ ముడి పదార్థాల నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌కు కేంద్రం నిర్ణయించిన కొనుగోలు ధరల్లో మొక్కజొన్నకు లీటరుకు రూ.71.86, చెరకు రసం/సిరప్‌కు రూ.65.61, దెబ్బతిన్న ఆహార ధాన్యాలకు రూ.64, బి-హెవీ మొలాసిస్‌కు రూ.60.73, ఎఫ్‌సీఐ బియ్యానికి రూ.60.32, సి-హెవీ మొలాసిస్‌కు రూ.57.97గా ఉన్నాయి.2025-26లో ఇథనాల్ ఉత్పత్తిలో ఎఫ్‌సీఐ బియ్యం వాటా 24.64 శాతానికి చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. రెండేళ్ల క్రితం ఇది కేవలం 0.02 శాతమేనని పేర్కొంది. ఆహార భద్రత అవసరాలకు మించి దేశంలో మిగులు ధాన్య నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది.20 శాతానికి చేరిన ఇథనాల్ మిశ్రమందేశంలో పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే స్థాయి గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. 2013-14లో 1.5 శాతం కంటే తక్కువగా ఉన్న బ్లెండింగ్ 2025-26లో 20 శాతానికి చేరింది. దీంతో 2030 నాటికి 20 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని భారత్ ఐదేళ్లు ముందుగానే సాధించింది. ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం కూడా 2014లోని సుమారు 421 కోట్ల లీటర్ల నుంచి 2026 నాటికి దాదాపు 2,000 కోట్ల లీటర్లకు పెరిగింది.ఇథనాల్ మిశ్రమం ద్వారా 2014-15 నుంచి మే 2026 వరకు రూ.1.90 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసినట్లు కేంద్రం చెబుతోంది. అలాగే 310 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ముడిచమురు దిగుమతులకు ప్రత్యామ్నాయం లభించిందని, దాదాపు 930 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించగలిగామని పేర్కొంది. రైతులకు అదనంగా రూ.1.60 లక్షల కోట్లకు పైగా ఆదాయం లభించినట్లు తెలిపింది.ఇకపై 20 శాతానికి మించి పెంచుతారా?ప్రస్తుతం పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి మించి పెంచే నిర్ణయం ఏదీ తీసుకోలేదని కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది. భవిష్యత్తులో అధిక మిశ్రమంపై నిర్ణయం తీసుకునే ముందు శాస్త్రీయ, సాంకేతిక అధ్యయనాలు నిర్వహించి, వాహన తయారీ సంస్థలు, చమురు మార్కెటింగ్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు సహా సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతామని తెలిపింది.అదే సమయంలో E85ను ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల కోసం మాత్రమే ప్రవేశపెట్టామని, అది దేశవ్యాప్తంగా సాధారణ పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి మించి పెంచినట్లు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
‘లీకేజీ’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలను అరికట్టడానికి, దోషులకు కఠిన శిక్ష విధించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’ రాజ్యసభలో ఆమోదం పొందింది. బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును కేంద్ర సహాయం మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై సభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేయగా, మూజువాణి ఓటుతో బిల్లుపై ఆమోదముద్ర వేశారు. ఉభయ సభల ఆమోదం పొందడంతో బిల్లు ఇక రాష్ట్రపతి వద్దకు వెళ్లనుంది. రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారనుంది. పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలను సహించే ప్రసక్తే లేదని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తేల్చిచెప్పారు. నిజాయతీగా కష్టపడి చదివే విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు రాజ్యసభలో ప్రకటించారు. ఈ బిల్లు ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం–2024కు కొనసాగింపు అని ఆయన చెప్పారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టడానికి దేశంలోనే మొట్టమొదటిగా 2024లో చట్టం తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. ప్రస్తుత సవరణ ఒక ముందడుగు అని అభివర్ణించారు. పరీక్షల వ్యవస్థలో మెరిట్, పారదర్శకత, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ విద్యార్థులు, యువత ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. 2024 నాటి చట్టాన్ని మరింత కఠినతరం, సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో, ఇటీవలి అనుభవాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సవరణలను తీసుకొచ్చినట్లు జితేంద్ర సింగ్ తెలియజేశారు. పరీక్షల్లో సంస్కరణలపై నిర్మాణాత్మక సూచనలను స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. యువతను శాంతింపజేయడానికే బిల్లు: ఖర్గే నీట్ పేపర్ లీక్‌పై ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసుల దమనకాండకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే బాధ్యుడని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రజలు ఏదో ఒకరోజు ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఖర్గే మాట్లాడారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పేపర్ లీక్‌పై వారిద్దరూ ఎందుకు నోరుమెదపడం లేదని నిలదీశారు. విద్యార్థులపై లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, విద్యార్థులను కొడుతున్న సాధారణ దుస్తుల్లోని వ్యక్తులు ఎవరు అనే ప్రశ్నలకు హోంమంత్రి సమాధానం చెప్పలేకపోతే, రాజీనామా చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీని ఎలా అరికడతారో చెప్పకుండా కేవలం యువతను శాంతింపజేయడానికే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని విమర్శించారు. అధిక జరిమానాలు, కఠినమైన శిక్షలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల వంటి చర్యలు ఎలాంటి మార్పు తీసుకురావని తేల్చిచెప్పారు. పరీక్షలను నిర్వహించే సంస్థలు, పరీక్షల విధానంలో సమగ్ర సంస్కరణలు చేపట్టకపోతే పేపర్ లీకేజీలు జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినందుకు యువతకు ఖర్గే అభినందనలు తెలియజేశారు. యువత పోరాటం, పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగానే ప్రభుత్వం చివరికి తలవంచిందని అన్నారు. -
అధికారులకు షాక్.. కేంద్రం కొత్త రూల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ వాహనాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఒక అధికారి.. ఒక అధికారిక కారు’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ నిబంధనలను వెల్లడించింది. దీనిపై కేంద్ర వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇకపై అదనపు బాధ్యతల పేరుతో సీనియర్ అధికారులకు మరో ప్రభుత్వ వాహనం కేటాయించకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే అధికారిక కారుకు అర్హత ఉన్న ఓ అధికారి.. మరో మంత్రిత్వ శాఖ, విభాగం, ప్రభుత్వ రంగ సంస్థ (PSU) లేదంటే స్వయం ప్రతిపత్తి సంస్థకు అదనపు బాధ్యతలు నిర్వహించినా.. ప్రత్యేకంగా మరో వాహనం ఇవ్వకూడదని పేర్కొంది. అలాంటి అధికారులు తమకు ఇప్పటికే కేటాయించిన అధికారిక వాహనాన్నే అన్ని విధుల కోసం ఉపయోగించుకోవాలని ఆదేశించింది. అధికారిక కార్ల దుర్వినియోగాన్ని అరికట్టడం, అనవసర ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా ఈ రూల్ తెచ్చినట్లు చెబుతోంది.కఠిన ఆంక్షలు ఇలా.. కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు లేదంటే ఇతర అర్ధ ప్రభుత్వ సంస్థలకు చెందిన వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంపై కూడా ఆంక్షలు విధించింది. కేవలం అధికారిక విధులు, అనుమతించిన పర్యటనల సమయంలో మాత్రమే వాటిని ఉపయోగించాలని స్పష్టం చేసింది. వినియోగంలో లేని లేదా అదనపు వాహనాలను సురక్షితంగా భద్రపరచాలని అన్ని శాఖలకు సూచించింది.ప్రజాధనం ఆదా చేయడమే లక్ష్యంప్రభుత్వ వాహనాల నిర్వహణలో పారదర్శకత పెంచడం, అనవసర వ్యయాలను నియంత్రించడం, ప్రజాధనాన్ని సమర్థంగా వినియోగించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని కేంద్రం తెలిపింది. ఒకే అధికారి వద్ద పలు వాహనాలు ఉండటం వల్ల జరిగే దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడంతో పాటు.. ప్రభుత్వ వనరుల వినియోగాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొంది.2022 మార్గదర్శకాలకు కొనసాగింపుప్రభుత్వ వాహనాల వినియోగంపై కేంద్రం 2022 సెప్టెంబర్‌లో సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. వివిధ శాఖల్లో అమల్లో ఉన్న నిబంధనలను ఒకే విధానంలోకి తీసుకొచ్చింది. తాజా ఉత్తర్వులతో ఆ మార్గదర్శకాలను మరోసారి పునరుద్ఘాటించిన కేంద్రం.. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.వాహనాల నిర్వహణలో మారనున్న విధానంఇక ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే.. ఈ నిబంధన వారికి నేరుగా వర్తించదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు వాహన సదుపాయాలు వారి హోదా, సంబంధిత నిబంధనల ప్రకారం కొనసాగుతాయి. తాజా ఉత్తర్వులు మాత్రం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ అధికారుల వాహన వినియోగానికే వర్తిస్తాయి. కొత్త నిబంధనలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక వాహనాల కేటాయింపు, వినియోగ విధానం మరింత కట్టుదిట్టం కానుంది. -
కేసులు ఎత్తివేయకపోతే తీవ్ర పరిణామాలు.. కేంద్రానికి CJP మరో వార్నింగ్
-
ఏపీలో భారీగా మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలలు
సాక్షి,అమరావతి: ఏపీలో ప్రభుత్వ విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా యుడైస్ (UDISE+) నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. రాష్ట్రంలో గడిచిన రెండేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో పాఠశాలలు మూతపడటంతో పాటు, లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరమయ్యారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్రంగా నిర్వీర్యమవుతోందనే ఆరోపణలకు బలం చేకూరుస్తూ కేంద్ర విద్యాశాఖ ఈ అధికారిక గణాంకాలను బయటపెట్టింది.యుడైస్ నివేదిక ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన రెండేళ్లలో మొత్తం 972 పాఠశాలలు పూర్తిగా మూతపడ్డాయి. ఇందులో 778 ప్రభుత్వ పాఠశాలలు కాగా, 194 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఇందులో సింహభాగం.. అంటే ఏకంగా 644 పాఠశాలలు కేవలం గత ఒక్క ఏడాది కాలంలోనే మూతపడటం గమనార్హం. గతంలో 45,000 గా ఉన్న ప్రభుత్వ బడుల సంఖ్య ఇప్పుడు 44,222 కి పడిపోయింది. గతంలో 991గా ఉన్న ఎయిడెడ్ విద్యాసంస్థల సంఖ్య ప్రస్తుతం 797కి క్షీణించింది. పాఠశాలల మూతతో పాటు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు ఊహించని స్థాయిలో పడిపోయింది. 2023-24 విద్యాసంవత్సరం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 40,50,116 మంది విద్యార్థులు చదువుతుండగా.. 2025-26 నాటికి ఆ సంఖ్య ఏకంగా 34.93 లక్షలకు తగ్గిపోయింది. అంటే గడిచిన రెండేళ్లలోనే 5.86 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి వెళ్లిపోయారు.'నాడు-నేడు', 'మధ్యాహ్న భోజనం' నిర్వీర్యమే కారణమా?గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల రూపురేఖలను మార్చడానికి ప్రవేశపెట్టిన ‘నాడు-నేడు’ మౌలిక వసతుల కల్పన కార్యక్రమం, విద్యార్థులకు పౌష్టికాహారం అందించే ‘మధ్యాహ్న భోజన పథకం’ ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పూర్తిగా నిర్వీర్యమయ్యాయని విద్యా రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. బడుల్లో కనీస మౌలిక సదుపాయాల లేమి, ఉపాధ్యాయుల కొరత, విద్యా ప్రమాణాలు పడిపోవడం వల్లే పేద తల్లిదండ్రులు సైతం అప్పులు చేసైనా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్న ప్రచారాల వెనుక ఉన్న అసలు బండారాన్ని కేంద్ర ప్రభుత్వ నివేదికే క్షేత్రస్థాయి గణాంకాలతో సహా బహిర్గతం చేయడం గమనార్హం -
ఒకే ఏడాదిలో 13 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నాగేంద్రసాయి రికార్డు
సాధించాలనే బలమైన సంకల్పం, పట్టుదలే పెట్టుబడిగా శ్రమిస్తే సొంతం కాని విజయం లేదని నిరూపించాడు వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరానికి చెందిన యువకుడు లొమడ నాగేంద్రసాయి. తన తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని, పట్టువిడవని విక్రమార్కుడిలా పోరాడి ఏకంగా ఒకే సంవత్సరంలో 13 కేంద్ర ప్రభుత్వ కొలువులు కైవసం చేసుకుని నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు. విద్యాభ్యాసంలో టాప్ కడప నగరంలోని రాజారెడ్డి వీధికి చెందిన అశ్వనికుమార్ (ఏపీఎస్ఆర్టీసీ పదవీ విరమణ పర్సనల్ ఆఫీసర్), రాజరాజేశ్వరి (పెండ్లిమర్రి జెడ్పీ హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్)ల కుమారుడైన నాగేంద్రసాయి ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే చదువులో ప్రతిభ కనబరిచాడు. కడప భారతి స్కూల్లో 1 నుంచి 7వ తరగతి, విద్యాధరి స్కూల్లో 8 నుంచి 10వ తరగతి (10వ తరగతిలో 9.7 జీపీఏ) చదివాడు. హైదరాబాద్ ఎన్ఆర్ఐ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసి 974 మార్కులు సాధించాడు. ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకుతో పశ్చిమ బెంగాల్ లోని ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు (బీటెక్ + ఎంటెక్) పూర్తి చేశాడు. సాఫ్ట్‌వేర్‌పై కరోనా దెబ్బ.. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా.. నాగేంద్రసాయి చదువు ముగిసే సమయానికే ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించింది. ఆ తరుణంలో ఐటీ రంగం సంక్షోభంలో పడి, పలు కంపెనీలు చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను కొలువుల నుంచి తొలగించాయి. ఎంతోమంది నిరుద్యోగులుగా మారడం కళ్లారా చూసిన సాయి.. ప్రైవేటు ఉద్యోగాల్లో భద్రత ఉండదని గ్రహించాడు. తన తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో, వారి బాటలోనే నడవాలనే బలమైన బీజం అతని మనసులో నాటుకుంది. కరోనా తగ్గుముఖం పట్టే వరకు ఇంట్లోనే ఉండి స్వయంగా ప్రిపరేషన్ సాగించాడు. తొలి ఓటమి నేర్పన పాఠం మొదటిసారి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష రాసినప్పుడు కేవలం ఒకే ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేయడం, నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల స్కోర్ తగ్గడంతో తృటిలో ప్రభుత్వ కొలువును మిస్ చేసుకున్నాడు. ఈ తొలి ఓటమికి ఏమాత్రం కుంగిపోకుండా, తన లోపాలను సరిదిద్దుకుని మరింత పట్టుదలతో తదుపరి పరీక్షలకు సిద్ధమయ్యాడు. 2025లో కొలువుల జాతర ఆ తర్వాత 2025లో హైదరాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో చేరుకుని.. నోటిఫికేషన్ పడిన ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటూ కఠిన ప్రిపరేషన్ సాగించాడు. ఒక్కసారి లోపాలు తెలుసుకున్న నాగేంద్రసాయి, ఆ తర్వాత జరిగిన పరీక్షల్లో విశ్వరూపం ప్రదర్శించి ఒకే ఏడాదిలో వరుసగా 13 కేంద్ర ప్రభుత్వ కొలువులను సాధించి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం నాగేంద్రసాయి తాను సాధించిన ఉద్యోగాలలో అత్యుత్తమమైన దాన్ని ఎంచుకుని, తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లాలో ఎంప్లాయిస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్లో బ్రాంచ్ మేనేజర్ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కడప జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలిపిన నాగేంద్రసాయి ప్రతిభపై పలువురు విద్యావంతులు, ఉన్నతాధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒకే ఏడాదిలో సాధించిన 13 కేంద్ర ప్రభుత్వ కొలువులు ఇవే: ఎయిమ్స్ : సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ఎయిమ్స్ , అప్పర్ డివిజనల్ క్లర్క్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అప్పర్ డివిజనల్ క్లర్క్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్–2స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సర్వేయర్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, అసిస్టెంట్ కమ్యూనికేషన్ ఆఫీసర్ ఆఫ్ సెలక్షన్ కమిషన్ , అప్పర్ డివిజనల్ క్లర్క్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, టెలికాం అసిస్టెంట్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, ఫ్యూమిగేషన్ అసిస్టెంట్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, సరై్వలెన్స్ అసిస్టెంట్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, ఫీల్డ్‌మెన్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, అసిస్టెంట్ అడ్మిని్రస్టేటర్ అండ్ హెచ్ఆర్ సెలక్షన్ కమిషన్, అసిస్టెంట్ విలేజ్ ఇండస్ట్రీ అడ్మినిస్ట్రేటర్.8నిరాశ పడొద్దు.. ఓపికతో శ్రమిస్తే కొలువు మీదే! ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే నైపుణ్యంతో పాటు ఎంతో ఓపిక, సహనం అవసరం. మొదటి ప్రయత్నంలోనే విజయం రాలేదని ఏమాత్రం కుంగిపోకూడదు. ఓటమిని ఒక పాఠంగా మార్చుకుని, పట్టుదలతో మళ్లీ మళ్లీ ప్రయతి్నంచాలి. అప్పుడే లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా 10 నుంచి 12 గంటల పాటు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. కేవలం చదవడం మాత్రమే కాదు, అన్ని సబ్జెక్టులపై సంపూర్ణమైన అవగాహన, పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కుటుంబం, ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి లభించే మానసిక మద్దతు, ప్రోత్సాహం ఎంతో కీలకం. – లొమడ నాగేంద్రసాయి -
రేపు లోక్‌సభ ముందుకు పేపర్ లీకేజీల నివారణ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని సిద్ధం చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తదితర పరీక్షల నిర్వహణ సంస్థల ప్రతిష్టను, పబ్లిక్ పరీక్షల వ్యవస్థలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’ను తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రతిపాదించిన ఈ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన బిల్లు ప్రతులను ఇప్పటికే సభ్యుల పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. పేపర్ లీకేజీలకు సంబంధించిన 2024 నాటి చట్టానికి కీలక సవరణలు చేస్తూ ఈ బిల్లు రూపొందించారు. ముసాయిదా బిల్లులో నేరస్తులకు విధించే జరిమానాలు, జైలు శిక్షల కాలాన్ని భారీగా పెంచారు. దర్యాప్తు, న్యాయ విచారణలో జాప్యాన్ని నివారించేందుకు స్పష్టమైన గడువులను చట్టంలో చేర్చారు. పెరిగిన శిక్షలు, జరిమానాలు పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు విధించే శిక్షలను సెక్షన్ 10 (1) కింద మరింత కఠినతరం చేశారు. గతంలో 3 నుంచి 5 ఏళ్లుగా ఉన్న జైలు శిక్షను కనిష్టంగా 5 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్లకు పెంచారు. నిందితులకు విధించే జరిమానాను రూ.10 లక్షల నుంచి ఏకంగా రూ.50 లక్షలకు సవరించారు. పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన సరీ్వస్ ప్రొవైడర్లు అక్రమాలకు పాల్పడితే విధించే జరిమానాను రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచారు. పబ్లిక్ పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి ఆయా సంస్థలను తప్పించే కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పొడిగించారు. అక్రమాల్లో సరీ్వస్ ప్రొవైడర్ సంస్థకు చెందిన డైరెక్టర్లు, ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలితే సెక్షన్ 10(3) కింద వారికి విధించే కనీస జైలు శిక్షను 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచారు. వీరికి విధించే జరిమానాను రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు సవరించారు. పరీక్షల నిర్వహణ సంస్థ, సరీ్వస్ ప్రొవైడర్ తదితర సంస్థలు వ్యవస్థీకత నేరానికి పాల్పడితే చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం కనీసం 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. గతంలో ఉన్న 5 ఏళ్ల కనిష్ట శిక్షను తాజా బిల్లులో 7 ఏళ్లకు పెంచారు. ఈ తరహా నేరాలకు విధించే జరిమానాను రూ.కోటి నుంచి గరిష్టంగా రూ.10 కోట్లకు పెంచారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్‌తో దర్యాప్తు కేసుల దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్)ను ఏర్పాటు చేసేందుకు కొత్తగా సెక్షన్ 12(2)లో నిబంధన చేర్చారు. కేంద్రం ఈ ఎస్టీఎఫ్‌ను ఏర్పాటు చేస్తే దర్యాప్తు బాధ్యతను పూర్తిగా ఆ బృందమే నిర్వహిస్తుంది. కొత్తగా చేర్చిన సెక్షన్ 12ఏ ప్రకారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నాటి నుంచి లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ, ఎస్టీఎఫ్లకు కేసును అప్పగించిన తేదీ నుంచి కచ్చితంగా రెండు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలి. కేసులను త్వరితగతిన విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంప్రదింపులతో సెషన్స్ కోర్టు స్థాయిలో ’స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు’లను ఏర్పాటు చేయాలి. ఈ కోర్టుల్లో సాక్షుల విచారణను వాయిదాలు వేయకుండా ప్రతిరోజూ కొనసాగించాలి. చార్జిïÙట్ దాఖలు చేసిన తేదీ నుంచి మూడు నెలల్లోపు విచారణ ముగించి తీర్పు వెలువరించాలి. చట్టం అమల్లోకి వచ్చేనాటికి పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేస్తారు. ఆ కేసులను స్వీకరించిన తేదీ నుంచి మూడు నెలల్లోపు తీర్పు ఇవ్వాలి. కేసుల వాదనల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తాయి. హైకోర్టులోనే అప్పీళ్లు కొత్తగా చేర్చిన సెక్షన్ 12ఆ ప్రకారం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పులు, ఆదేశాలపై కేవలం హైకోర్టులోనే అప్పీల్ చేసుకోవాలి. ఇతర ఏ కింది స్థాయి కోర్టుకూ అప్పీల్, రివిజన్ అధికారాలు ఉండవు. ఈ అప్పీళ్లను హైకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తుంది. అప్పీల్ స్వీకరించిన తేదీ నుంచి మూడు నెలల్లోపు పరిష్కరించాలి. కింది కోర్టు తీర్పు వెలువడిన 30 రోజుల్లోపు అప్పీల్ దాఖలు చేసుకోవాలి. సరైన కారణాలు ఉంటే గరిష్టంగా 90 రోజుల వరకు హైకోర్టు అప్పీల్‌ను అనుమతిస్తుంది. 90 రోజుల తర్వాత ఎలాంటి అప్పీళ్లను స్వీకరించరు. బెయిల్ మంజూరు, తిరస్కరణ ఆదేశాలపై నేరుగా హైకోర్టులోనే అప్పీల్ చేసుకోవాలి. -
ప్రజా ఉద్యమాలకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వాలు
ప్రజా ఉద్యమాలు.. ప్రభుత్వాల నిర్ణయాలను మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన జన్ లోక్‌పాల్ ఉద్యమం నుంచి, నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రత కోసం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలు, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల ఏడాదికిపైగా సాగిన చారిత్రాత్మక పోరాటం వరకు.. ప్రజల ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వాలు దిగొచ్చాయి. తాజాగా.. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై దేశవ్యాప్తంగా ఉద్ధృతమవుతున్న నిరసనలు మరోసారి ప్రజా ఉద్యమాల శక్తిపై చర్చకు తెరలేపుతున్నాయి.👉2011లో అన్నా హజారే చేపట్టిన ఉద్యమం జన్ లోక్ పాల్ బిల్లు అవినీతి వ్యతిరేక పోరాట చేశారు. రామ్ లీలా మైదానంలో 13 రోజుల పాటు నిరవధిక నిరహార దీక్ష చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తలొగ్గి జన్ లోక్ పాల్ బిల్లు తీసుకోచ్చింది.👉2012 డిసెంబర్ 15 ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక ఆత్యాచార ఘటన దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. దేశవ్యాప్తంగా ఆందోళన తర్వాత ప్రభుత్వం దిగివచ్చి నిర్భయ చట్టాన్ని తీసుకోచ్చింది👉కేంద్ర ప్రభుత్వం 2020లో తెచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఏడాది పాటు సాగిన ఈ చారిత్రాత్మక పోరాటానికి తలొగ్గి, నవంబర్ 2021లో కేంద్ర ప్రభుత్వం ఆ మూడు చట్టాలను అధికారికంగా రద్దు చేసింది.👉నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విద్యావ్యవస్థలో పారదర్శకత, బాధ్యత కోరుతూ జంతర్ మంతర్ వేదికగా నిరసనలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం తలొగ్గడంతో చివరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసింది. -
NTAలో 47 మందిపై క్రిమినల్ చర్యలు... BJP సీరియస్ యాక్షన్
-
నా నిజాయితీని నిరూపించాలా? విమర్శలకు వాంగ్ చుక్ ఘాటు రియాక్షన్
-
ప్రశ్నపత్రాల లీకేజీ దోషులకు పదేళ్ల జైలుశిక్ష.. పది కోట్ల రూపాయల జరిమానా... ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
-
ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందే.. రాజీ ప్రసక్తే లేదు!
సాక్షి, న్యూఢిల్లీ: నీట్–యూజీ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తేల్చిచెప్పింది. ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని పునరుద్ఘాటించింది. ఈ నెల 20న నిరసన సందర్భంగా విద్యార్థులపై క్రూరంగా దాడి చేసినందుకు కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా క్షమాపణ చెప్పాలని స్పష్టంచేసింది. పేపర్ లీక్, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, సీజేపీ ప్రతినిధుల మధ్య శుక్రవారం ఢిల్లీలో రెండో విడత చర్చలు జరిగాయి. కేంద్రం తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్, సీజేపీ తరఫున పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా పాల్గొన్నారు. తాజా పరిణామాలపై సుమారు రెండు గంటల పాటు చర్చించారు. మూడు ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రులకు అందజేశారు. ప్రస్తుతం సీజేపీ పోరాటం మొత్తం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం చుట్టే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన రాజీనామా చేసే దాకా విడిచిపెట్టబోమని ఆ పార్టీ పదేపదే చెబుతోంది. ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ మేరకు స్పష్టమైన సంకేతాలిస్తోంది. ప్రధాన్ రాజీనామా చేయడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు డిమాండ్లకు కేంద్రం అంగీకారం! కేంద్ర మంత్రులతో సమావేశం అనంతరం సీజేపీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తమ మూడు డిమాండ్లలో రెండింటికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి శనివారం మధ్యాహ్నం వరకు గడువు ఇస్తున్నట్లు వెల్లడించారు. గడువులోగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే తమఆందోళనను మరింత ఉధృతం చేస్తామని తేల్చిచెప్పారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని ఆపబోమని పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌కు ఉద్వాసన పలుకుతారని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, సీజేపీ డిమాండ్లలో రెండింటికి తాము అంగీకరించినట్లు కేంద్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం తర్వాత కేంద్రం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు మరోసారి చర్చలు: నడ్డా సీజేపీ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వంతో అంతర్గతంగా చర్చిస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. వారితో శనివారం మధ్యాహ్నం మరోసారి సమావేశం కానున్నట్లు వెల్లడించారు. శుక్రవారం నాటి భేటీ అనంతరం జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. సీజేపీ ప్రతినిధులు మూడు ప్రధాన డిమాండ్లతోపాటు పరీక్షల కోసం ఐదు సంస్కరణలు సూచించారని వెల్లడించారు. అంతర్గతంగా చర్చించి.. తీసుకున్న నిర్ణయాలను శనివారం మధ్యాహ్నం జరిగే మూడో విడత భేటీలో వారికి తెలియజేస్తామని పేర్కొన్నారు. సీజేపీ ప్రధాన డిమాండ్లు → దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలి. ఈ డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. → పేపర్ లీకేజీ, పరీక్షల రద్దు తదితర పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే రూ.కోటి చొప్పున ఆర్థిక పరిహారం చెల్లించాలి. → న్యాయమైన హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే బేషరతుగా కొట్టివేయాలి. -
NTAపై కేంద్రం కీలక ప్రకటన.. 47మందిని తొలగిస్తూ ఉత్తర్వులు
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విద్యాశాఖలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్టీఏ నుంచి 47మందిని తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పనితీరుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, పలు విద్యార్థి సంఘాలు ఢిల్లీలో ఆందోళనలను ఉధృతం చేసిన నేపథ్యంలో ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది.పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సంస్కరణల కోసం పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో ఎన్టీఏ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో జేఈఈ , నీట్ సహా సుమారు 20 జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. -
మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు.. CJP అభిజిత్ సంచలన కామెంట్స్
-
CJPతో కేంద్రం చర్చలు
-
‘ఎగుమతుల’ ఈ–కామర్స్‌లోకి ఎఫ్‌డీఐలకు ఓకే
న్యూఢిల్లీ: రిటైల్ అమ్మకాల కోసం కాకుండా ఎగుమతులకు మాత్రమే ఉద్దేశించిన ఇన్వెŠంటరీ ఆధారిత ఈ–కామర్స్ సంస్థల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. చిన్న రిటైలర్ల వ్యాపారం దెబ్బతినకుండా ఎగుమతులను పెంచుకునేందుకు ఇది సహాయపడనుంది. ఈ కంపెనీలు భారత్‌లో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేయాల్సి ఉంటుంది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఇది కూడా అమల్లోకి వస్తుందని పేర్కొంది. ప్రస్తుత ఎఫ్‌డీఐ విధానం ప్రకారం బీ2బీ బిజినెస్ ఈ–కామర్స్, మార్కెట్‌ప్లేస్ మోడల్స్‌లో మాత్రమే విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉంది. బీ2సీ (బిజినెస్ టు కన్జూమర్) ఈ–కామర్స్, ఆన్లైన్ రిటైలరు తానే స్వయంగా నిల్వ చేసుకుని వినియోగదారులకు నేరుగా విక్రయించే ఈ–కామర్స్ మోడల్స్‌లోకి ఎఫ్‌డీఐలకు అనుమతి లేదు. భారత్ నుంచి ఈ–కామర్స్ ఎగుమతులు 2 బిలియన్ డాలర్లుగా ఉండగా, చైనావి ఏకంగా 350 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఈ–కామర్స్ వ్యాపారం 800 బిలియన్ డాలర్లుగా ఉండగా 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. 4 -
‘టైం, ప్లేస్ మీరే చెప్పండి’.. సీజేపీతో చర్చలకు కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి కేంద్రం సీజేపీని చర్చలు ఆహ్వానించింది. మీ ఇష్టం. టైం, ప్లేస్ ఎక్కడో మీరే చెప్పండి అన్ని సమస్యల్ని చర్చించేందుకు సిద్ధమని తెలిపింది. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన తక్షణ రాజీనామా, నీట్ పేపర్ లీకేజీతో ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, చలో సంసద్‌లో పాల్గొన్న వారిపై పోలీసులు నమోదు చేసిన కేసుల ఉపసహరణపై కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి.ఈ క్రమంలో కాక్రోచ్ పార్టీ నేతలతో చర్చించేందుకు కేంద్రం మంత్రి జితేంద్ర సింగ్ ఆహ్వానం పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం నుంచి సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు నాలుగు సార్లు ప్రతిపాదనలు పంపాం. అన్నీ సమస్యలపై కేంద్రం వారితో చర్చించేందుకు సిద్ధంగా ఉంది. చర్చలు జరిపేందుకు సమయం, ప్లేస్ వాళ్లం ఇష్టం.ఈ చర్చల్లో నాతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సైతం పాల్గొంటారు. ఈ చర్చలు జేపీ నడ్డా ఇల్లు, కార్యాలయంలో జరిపితే బాగుంటుందని అనుకుంటున్నాం. దీనికి సంబంధించి మాకు ఎలాంటి అహంభావం లేదు. చర్చల ద్వారా సమస్యల్ని క్రమంగా పరిష్కారం దిశగా అడుగులు వేయొచ్చు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న నిరంతర చర్యల్లో ఇది ఒక భాగం. చర్చల్లో పాల్గొనాల్సిందిగా సీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నాను’అని పేర్కొన్నారు. చర్చలు జరిపేందుకు కేంద్రం పంపుతున్న ఆహ్వానాలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. మాతో చర్చలు జరపాలని అనుకుంటే కేంద్రమే మా వద్దకు రావాలి. మా డిమాండ్స్‌కు కట్టుబడాలి. అయితే, జంతర్‌మంతర్‌లో కేంద్రం మాతో చర్చలు జరపాలి. ఆ విషయంలో వెనక్కితగ్గబోమన్నారు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలనేది మా ప్రధాన డిమాండ్ అని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో విద్యార్థులు పార్లమెంట్ మార్చికి పిలుపునిచ్చిన తరుణంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇవాళ ప్రధాని మోదీ పేపర్ లీకేజీలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పేపర్ లీకేజీ కేసులపై సత్వరమే విచారణ, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఫాస్ట్రాక్ కోర్టులను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. #WATCH | Delhi | On updated proposal for talks with Cockroach Janta Party, Union Minister Dr Jitendra Singh says, "The govt has sent four formal proposals for discussions with their representatives since last afternoon...This is a standing invitation to all our youth friends that… pic.twitter.com/PAQ6PbeNIa— ANI (@ANI) July 23, 2026 -
Wangchuk: నిరాహార దీక్ష విరమిస్తా.. కానీ డిమాండ్లు నెరవేర్చాలి
-
రిటైర్డ్ జడ్జీల సదుపాయాల్లో ఏకరూపకత ఉండాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హైకోర్టుల విశ్రాంత న్యాయమూర్తులకు కల్పించే సదుపాయాలన్నీ ఒకే తరహాలో ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం రెండు వారాల్లోగా ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జీలకు కల్పిస్తున్న భద్రత, ఇతర సదుపాయాలపై దాఖలైన పిటిషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం విచారించింది. పదవీ విరమణ తర్వాత జడ్జీలకు అందుతున్న వసతులు రాష్ట్రానికో తీరుగా ఉండటంపై ఈ సందర్భంగా ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాలు భద్రత నిమిత్తం ఇస్తున్న ఆర్థిక సాయం ఏమాత్రం సరిపోదని అభిప్రాయపడింది. ‘రూ.45 వేల నుంచి రూ.50 వేలతో ప్రస్తుత పరిస్థితుల్లో డ్రైవర్, సెక్యూరిటీ ఆఫీసర్‌ను నియమించుకోవడం సాధ్యమేనా?‘అని సీజేఐ సూర్యకాంత్ ప్రశ్నించారు. వసతి, వైద్య ఖర్చులు, డ్రైవర్, వంట మనుషులు, టెలిఫోన్ వంటి కనీస సదుపాయాల్లో హెచ్చుతగ్గులు ఉండటానికి వీల్లేదని, ఏ రాష్ట్రంలో సేవలందించారన్న దానితో సంబంధం లేకుండా దేశమంతటా ఒకే విధానం ఉండాలని స్పష్టం చేశారు. ఒక వేళ కేంద్రం స్పందించకుంటే తామే స్వయంగా కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సానుకూలంగా స్పందించిన కేంద్రం ధర్మాసనం సూచనపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. కమిటీని ఏర్పాటు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హామీ ఇచ్చారు. ఇది కచ్చితంగా పరిష్కరించాల్సిన సమస్యేనని, న్యాయస్థానం వ్యక్తం చేసిన ఆందోళనను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపడతామన్నారు. ఈ అంశంపై రెండు వారాల్లోగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, మూడు నెలల్లోగా సిఫార్సులతో కూడిన నివేదికను కేంద్రంతో పాటు సుప్రీంకోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. -
‘అపార్’ తల్లిదండ్రుల ఇష్టం
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘అపార్’(ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) ఐడీల నమోదుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకానికి సమ్మతిని నిరాకరించేందుకు, తప్పుకునేందుకు తల్లిదండ్రులకు అవకాశం కల్పించేలా సవరణలు చేపట్టాలంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)కి మార్గదర్శకాలు జారీ చేస్తామంది. నూతన విద్యా విధానం–2020 ప్రకారం కేంద్రం ప్రారంభించిన అపార్ పథకం కింద విద్యార్థుల కోసం ఒక ప్రత్యేకమైన, జీవితకాల 12–అంకెల ’స్టూడెంట్ ఐడీ’ రూపొందిస్తారు. ఇది విద్యార్థుల అన్ని విద్యాపరమైన రికార్డులకు ఒక డిజిటల్ పాస్‌పోర్ట్‌లా పనిచేస్తుంది. ఇందులో మార్కుల జాబితాలు, డిగ్రీ సరి్టఫికెట్లు, ఇతర విజయాల వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. బలవంతం, రాజ్యాంగ విరుద్ధం... అపార్ ఐడీల నమోదు స్వచ్ఛందమేనని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఆచరణలో దీనిని ఆధార్‌తో అనుసంధానించి విద్యార్థులను బలవంతం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తూ.. బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులకు అపార్ ఐడీని తప్పనిసరి చేస్తున్నారని తెలిపారు. పరోక్షంగా విద్యార్థులను ఆధార్ కోసం బలవంత పెడుతున్నారన్నారు. కేవలం ఆధార్, అపార్ ఐడీలు లేవన్న కారణంతో విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోవడం విద్యాహక్కు చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధమని వాదించారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం–2023 నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని తెలిపారు. కేంద్రం కూడా అభ్యంతరం తెలపలేదు. అపార్ సమ్మతి పత్రంలో ‘ఆప్ట్ –అవుట్’ఆప్షన్ స్పష్టంగా ఉండాలంటూ ఒడిశా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ఈ సందర్భంగా సమరి్థంచింది. ఆ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలపలేదని గుర్తు చేసింది. అదే తీర్పును దేశవ్యాప్తంగా అమలు చేసేలా సీబీఎస్ఈకి మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపింది. డేటా ప్రొటెక్షన్, సమ్మతి వంటి అంశాలపై అభ్యంతరాలను కూడా పరిశీలించాలని కోరుతామంది. ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందంగానే ఉండాలని, సమ్మతి పత్రాల్లో తల్లిదండ్రులకు తిరస్కరించే అవకాశాన్ని తప్పనిసరిగా కల్పించాలని తేల్చిచెప్పింది. విద్యార్థుల డేటా గోప్యత, తదితర అభ్యంతరాలపై సమగ్ర పరిశీలన జరపాలని సీబీఎస్ఈని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.ప్రతి దాన్నీ అనుమానించొద్దు...దేశంలో జరిగే ప్రతీ పరిణామాన్ని అనుమానపు దృష్టితో చూడొద్దని సుప్రీంకోర్టు హితవు పలికింది. విద్యార్థుల విద్యా ప్రణాళిక, రికార్డుల నిర్వహణ కోసం ఒకే విశిష్ట గుర్తింపు తీసుకురావడం మంచి పరిణామమేనని, దీనిని స్వాగతించాలని అభిప్రాయపడింది. దేశంలో డేటా భద్రతా చట్టం అమలులో ఉందని, ఎవరూ దానిని ఉల్లంఘించడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. అయితే, సేకరించిన విద్యార్థుల డేటాను ఏ ఉద్దేశం కోసం తీసుకున్నారో, ఆ విద్యా సంబంధిత అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. -
LPG గ్యాస్‌కు చెక్?.. కేంద్రం మాస్టర్ ప్లాన్!
భారతదేశంలో ఇథనాల్ వినియోగం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. త్వరలోనే ఇథనాల్‌ను వంట గ్యాస్ మాదిరిగా ఉపయోగించుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.భారత్ ఎల్పీజీ వంటగ్యాస్ మీద ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బహుశా ఈ ఏడాది చివరి నాటికి అన్నీ సిద్దమవుతాయని నిపుణులు చెబుతున్నారు.ఇథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల నుంచి తయారయ్యే పరిశుభ్రమైన, పునరుత్పాదక ఇంధనం. ఇప్పటివరకు దీనిని పెట్రోల్‌లో కలిపి వాహనాల్లో వినియోగిస్తున్నారు. ఇకపై అదే ఇథనాల్‌ను ప్రత్యేక స్టవ్‌ల ద్వారా ఇంట్లో వంట చేయడానికి ఉపయోగించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఇథనాల్ స్టవ్‌లు కొనుగోలు చేసే వారికి సబ్సిడీ ఇవ్వడానికి కూడా కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇథనాల్ సులభంగా అందుబాటులో ఉండేలా సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికోసం.. భవిష్యత్తులో పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేక ఇథనాల్ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. వినియోగదారులు పెట్రోల్ బంకుల నుంచే ఇథనాల్ కొనుగోలు చేయవచ్చన్నమాట.ప్రస్తుతం భారత్‌లో ఇథనాల్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అయితే అందులో పెద్ద మొత్తంలో వినియోగించకుండా మిగిలిపోతోంది. ఇలా మిగిలిన ఇథనాల్ ఇంధనాన్ని వంట గ్యాస్ కోసం ఉపయోగిస్తే రైతులకు, పరిశ్రమలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: హైడ్రోజన్ రైలుపై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన రైల్వే! -
అవార్డుల నవ కళ
దేశంలో ప్రతిష్ఠాత్మక సినీ పురస్కారాలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను ప్రకటించిన ఈ పురస్కారాల్లో ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘ఆర్టికల్ 370’ ఉత్తమ చిత్రంగా నిలిచి, స్వర్ణ కమలం సాధించింది. మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి (భ్రమయుగం), బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్) ఉత్తమ నటులుగా రజత కమలం పురస్కారాలకు ఎంపికయ్యారు. ‘ఆర్టికల్ 370’ చిత్రంలో నటనకు యామీ గౌతమ్ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు. తమిళ చిత్రం ‘అమరన్’ని తెరకెక్కించిన రాజ్‌కుమార్ పెరియస్వామిని ఉత్తమ దర్శకుడి పురస్కారం వరించింది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో తెలుగు సినిమా సత్తా చాటుకుంది. ‘కల్కి 2898 ఎ.డి., పుష్ప–2, లక్కీ భాస్కర్, కమిటీ కుర్రోళ్లు, 35–చిన్న కథ కాదు’ చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టాయి. ప్రముఖ మలయాళ దర్శకుడు జయరాజ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన ఫీచర్ ఫిల్మ్స్ జ్యూరీ సెంట్రల్ ప్యానెల్ ఈ అవార్డుల విజేతలను ఎంపిక చేసింది.జాతీయ అవార్డుల్లో పలు తెలుగుæచిత్రాలు కీలక పురస్కారాలను అందుకున్నాయి. మొత్తం తొమ్మిది అవార్డులు దక్కాయి. పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898 ఎ.డి.’ ఉత్తమ ప్రజాదరణ పొందిన (హోల్సమ్ ఎంటర్టైన్మెంట్) చిత్రంగా నిలిచి, స్వర్ణ కమలాన్ని సాధించింది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ సింగిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇదే సినిమాకు పని చేసిన నితిన్ జిహాని చౌదరిని బెస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్ అవార్డు వరించింది. అలాగే ‘పుష్ప 2–ది రూల్’ చిత్రదర్శకుడు బండ్రెడ్డి సుకుమార్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే రచయితగా పురస్కారం పొందారు. ఇదే చిత్రానికి దీపాలి నూర్, శీతల్ శర్మలను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్స్ అవార్డు వరించింది. ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి వెంకీ అట్లూరి ఉత్తమ డైలాగ్ రైటర్‌గా జాతీయ పురస్కారం కైవసం చేసుకున్నారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఈ సినిమాకు మేకప్ అందించిన పి. రవికుమార్‌కు బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు లభించింది. అదే విధంగా నంద కిశోర్ ఈమని దర్శకత్వం వహించిన ‘35–చిన్న కథ కాదు’ ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది. ఇందులో నటించిన అరుణ్ దేవ్ పోతుల ఉత్తమ బాల నటుడి అవార్డుకు ఎంపికయ్యాడు.సంగీతం, సాంకేతిక విభాగాలు... ‘ఆర్టికల్ 370’ చిత్రానికి శాశ్వత్ సచ్దేవ్ ఉత్తమ సంగీత దర్శకుడిగా, ‘అమరన్’ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పురస్కారాలు సాధించారు. మరాఠీ చిత్రం ‘ఘరత్ గణపతి’లోని పాటకు అభయ్ జోధ్‌పుర్కర్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా, మలయాళ చిత్రం ‘ఏఆర్ఎం’ పాటకు వైకోమ్ విజయలక్ష్మి ఉత్తమ గాయనిగా నిలిచారు. ‘మైదాన్’ (హిందీ) చిత్రంలో పాటకు మనోజ్ ముంతాషిర్కు బెస్ట్ లిరిక్స్ అవార్డు లభించింది. ‘స్త్రీ 2’ సినిమాకు విజయ్ గంగూలీ ఉత్తమ నృత్యదర్శకుడిగా ఎంపికయ్యారు. ‘మహారాజ’ సినిమాకు అనల్ అరసు బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ (యాక్షన్) అవార్డు సాధించారు. ‘భ్రమయుగం’ చిత్రానికి షెహనాద్ జలాల్ ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా, ‘అమరన్’ చిత్రానికి ఆర్. కలైవానన్ బెస్ట్ ఎడిటర్‌గా, ‘భూల్ భులయ్యా 3’ చిత్రానికి మానస్ చౌదరి బెస్ట్ సౌండ్ డిజైనర్‌గా అవార్డులు పొందారు. ప్రాంతీయ భాషల్లో ఉత్తమ చిత్రాలు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం ప్రకటించిన ఉత్తమ ప్రాంతీయ చిత్రాల జాబితాలో హిందీ చిత్రం ‘శ్రీకాంత్’, తెలుగు ‘కమిటీ కుర్రోళ్లు’ తమిళ ‘రాయన్’, మలయాళ ‘ఫెమినిచీ ఫాతిమా’, కన్నడ ‘మిథ్య’ చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. బెంగాలీ ‘చలచిత్ర ఎఖోన్’, ఒడియా ‘లహరి’, గుజరాతీ ‘మారన్’, మరాఠీ ‘ముక్కం పోస్ట్ బొంబిల్వాడి’, అస్సామీ ‘జుయ్ ఫూల్’ ఆయా భాషల్లో ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. నాన్–ఫీచర్ ఫిల్మ్స్, సినిమా రచనలు...నాన్–ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో మరాఠీ, ఆంగ్ల భాషల్లో రూపొందిన ‘భంగార్’ ఉత్తమ చిత్రంగా స్వర్ణ కమలం గెలుచుకుంది. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ – ఏక్తా కా ప్రతీక్’ (హిందీ) చిత్రానికి ఆనంద్ ఎల్. రాయ్ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. పర్యావరణ విలువల నాన్‌ఫీచర్ చిత్రంగా ‘పి΄్లాంట్రీ: ఏ టేల్ ఆఫ్ ఎకో ఫెమినిజం’ ఎంపికైంది. ‘ఎన్డీయే’ (హిందీ) చిత్రానికి మన్వీర్ జస్రోటియా ఉత్తమ ఎడిటర్‌గా పురస్కారం సాధించారు. రచనల విభాగంలో కన్నడ పుస్తకం ‘నానిరువు దేనిమగాగి నాదిరువుదే ననగాగి’ కెంచనూరు ప్రదీప్ కుమార్ శెట్టికి బెస్ట్ బుక్ ఆన్ సినిమా అవార్డు దక్కింది. సంజీవ్ శ్రీవాస్తవ ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్‌గా ఎంపికయ్యారు. నాన్–ఫీచర్ ఫిల్మ్స్ జ్యూరీ చైర్‌పర్సన్‌గా అసీమ్ సిన్హా, బెస్ట్ రైటింగ్ ఆన్ సినిమా జ్యూరీ చైర్‌పర్సన్‌గా ఎ. చంద్రశేఖర్ వ్యవహరించారు. ప్రధాన విభాగాల విజేతలు ఉత్తమ సహాయ నటుడుసంజయ్ మిశ్రా (భక్షక్ – హిందీ).ఉత్తమ సహాయ నటిసచన నమిదాస్ (మహారాజ – తమిళం)రూపశ్రీ వర్కాడి (మిథ్య – కన్నడ).ఉత్తమ తొలి చిత్రదర్శకుడు: రణదీప్ హుడా (స్వాతంత్య్ర వీర్ సావర్కర్ – హిందీ).ఉత్తమ సామాజిక, పర్యావరణ విలువల చిత్రం: ‘కెప్టెన్ మిల్లర్’ (తమిళం). ఇందులో నటనకు గాను ధనుష్‌కు ప్రత్యేక ప్రశంస దక్కింది.‘కల్కి 1’లో 30 శాతమే చూశారు! నాగీ (నాగ్ అశ్విన్) ఈ కథ చెప్పినప్పుడే ఒక అసాధారణమైన, అద్భుతమైన సినిమా అనిపించింది. నేను చేసిన హిందీ సినిమా ‘తుంబాడ్’ లైట్ బడ్జెట్. కానీ ‘కల్కి’ భారీ బడ్జెట్. నన్ను నమ్మి, ఈ సినిమాకి తీసుకున్నారు నాగీ. ఒక దశలో ఈ కథ మొత్తం ఒక్క సినిమాలోనే సరిపోతుందా? అనిపించింది. చివరికి రెండు భాగాలుగా మారింది. కాశీ, శంబాల, కురుక్షేత్ర, కాంప్లెక్స్... ఇలా ఈ సినిమా కోసం చాలా సెట్స్ వేశాం. పేపర్ వర్క్ బాగా చేయడంతో సెట్స్ రూపొందించడం సులువైంది. ఇక సినిమాలో ప్రభాస్ వాడిన బుజ్జి (కారు)కి చాలా ఎఫర్ట్ పెట్టాం. ఈ కారుకి వాడిన టైర్లు లాంటివి నిజంగా లేవు. కొత్తగా తయారు చేశాం. ఈ కారు తయారు చేయడానికి దాదాపు 200 డిజైన్లు అనుకున్నాం. ఎందుకంటే సినిమాలో అది కారు మాత్రమే కాదు... ‘సపోర్టింగ్ క్యారెక్టర్’. అలాగే ఈ మూవీలో వాడిన ఇతర వాహనాలు, ఆయుధాలు... ఇవన్నీ కూడా ‘ఇండియన్ లుక్’లో కనిపించడం చాలా ముఖ్యం. అందుకే చాలా కసరత్తులు చేశాం. సినిమా షూటింగ్ ఆరంభించక ముందు దాదాపు ఏడాదిన్నర వర్క్ చేశాం. ప్రతిదీ ఊహించుకుని చేయడమే కాబట్టి ప్రతి రోజూ సవాల్‌గా అనిపించేది. నాగీని ప్రత్యేకంగా ప్రశంసించాల్సిందే. అలాగే టెక్నికల్ టీమ్ హార్డ్ వర్క్ చాలా ఉంది. ఇలాంటి సినిమాలు చేసినప్పుడు ‘పర్ఫెక్షన్’ మీద మాత్రమే ధ్యాస ఉంటుంది... అవార్డుల గురించి ఆలోచించం. కానీ మనసు పెట్టి చేసే ఏ పనికైనా అవార్డులు వస్తాయి. మా ‘కల్కి’కి వచ్చిన అవార్డులు అందుకు ఓ నిదర్శనం. ‘కల్కి 2898 ఎ.డి.’లో మీరు చూసింది 30 శాతం మాత్రమే. రెండో భాగం మరిన్ని సెట్స్‌తో, మరింత లార్జ్స్కేల్తో ఉంటుంది.– ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహాన్ చౌదరిభవిష్యత్లో భూమి మీదున్న వనరులన్నీ కనుమరుగైపోయి పవిత్ర కాశీ నగరం ఎడారిలా మారిపోతుంది. సుప్రీం యాస్కిన్ అనే క్రూరుడు కాంప్లెక్స్ పేరిట ఓ ఆకాశ నగరాన్ని నిర్మించుకుని, అందులో సకల సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటాడు. జనంలో ఒకడైన భైరవ ఎలాగైనా కాంప్లెక్స్‌లోకి వెళ్లాలని ఆశపడతాడు. కాంప్లెక్స్‌లో సుమతి అనే అమ్మాయికి కల్కి అవతారం బిడ్డగా పుడతాడని తెలుసుకున్న అశ్వత్థామ ఆమెను రక్షించాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో భైరవ కాంప్లెక్స్‌లోకి వెళ్లాడా లేదా? సుమతి ఎవరు? సుప్రీం యాస్కిన్ తన లక్ష్యం కోసం ఏం చేశాడన్నది ‘కల్కి 2898 ఎ.డి’ కథ. భవిష్యత్తుని ఊహించి, అత్యున్నత సాంకేతిక విలువలతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విజువల్ వండర్ని తెరకెక్కించారు. అశ్వినీదత్ నిర్మించారు. – ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం (కల్కి 2898 ఎ.డి.)పనిమీద నిబద్ధత,నిజాయతీ ఉండాలి మేకప్ ఆర్టిస్ట్‌గా 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నేను అందుకున్న తొలి జాతీయ అవార్డు ఇది. మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉంది. నిర్మాత నిహారికగారితో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేశ్‌గారి ప్రోత్సాహంతో ఇదంతా జరిగింది. నేను అవార్డుకి ఎంపిక అయినట్లు ముందు నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పారు. వెంటనే నిహారికగారు కూడా విషయాన్ని చెప్పి, హ్యాపీ మూమెంట్‌ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆఫీసుకి రమ్మన్నారు. నేనెప్పుడూ అవార్డుల గురించి ఆలోచించలేదు. పింక్ ఎలిఫెంట్లోని తొలి సినిమా కాబట్టి జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాలని నాకున్న అనుభవంతో జాగ్రత్తగా పని చేశాను. ఆ పని, ఆ నిజాయతీ ఈ రోజు నాకు అవార్డు తెచ్చిపెట్టింది. నాకు అవార్డు రావడంతో మా కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉన్నారు. పని మీద నిబద్ధత, నిజాయతీ.. ఈ రెండూ ఉంటే ఆటోమేటిక్‌గా అవార్డులనేవి వస్తాయని నమ్ముతాను. – ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ పి. రవికుమార్పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో జాతరను సజావుగా చేయాలని గ్రామస్తులు కొందరు యువకులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. జాతర తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి, గెలవాలని అదే గ్రామంలోని రెండు వర్గాలు తీర్మానిస్తాయి. అయితే రాజకీయాల కారణంగా కమిటీలోని యువకుల మధ్య కుల వివక్ష వల్ల మనస్పర్థలు వచ్చి విడిపోతారు. కొంతకాలం తర్వాత విడిపోయిన ఆ స్నేహితులు మళ్లీ ఎలా కలిశారన్న భావోద్వేగ కథాంశంతో దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. – ప్రాంతీయ ఉత్తమ చిత్రం (కమిటీ కుర్రోళ్లు)ఆర్టికల్ 370 రద్దు అమలుకు కొద్ది రోజుల ముందు కశ్మీర్ లోయలో సంఘర్షణలు, అక్కడి పరిస్థితులు, ఉగ్రవాదం తదితర అంశాలను డీల్ చేసేందుకు అసైన్ చేయబడ్డ ఫీల్డ్ ఆఫీసర్ జూనీ హక్సర్, అలాగే ఈ పరిస్థితులను పరిశీలించే పీఎంఓ సెక్రటరీ రాజేశ్వరి స్వామినాథన్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? శాంతి భద్రతలను ఎలా కాపాడారన్నది ‘ఆర్టికల్ 370’ చిత్రకథ. జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు సాధించిన ఈ చిత్రానికి ఆదిత్య సుహాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎన్ఐఎ ఏజెంట్ జూనీ హక్సర్ పాత్రలో ఒదిగిపోయిన యామీ గౌతమ్ జాతీయ ఉత్తమ నటి అవార్డు సాధించారు. – జాతీయ ఉత్తమ చిత్రం (ఆర్టికల్ 370)ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది ఈరోజు ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ‘లక్కీ భాస్కర్’ సినిమాకి బెస్ట్ స్క్రీన్‌ప్లే డైలాగ్ రైటర్‌గా నేను ఎంపికయ్యాను. ఇందుకు నేను నిజంగా చాలామందికి ధన్యవాదాలు చెప్పాలి. ముఖ్యంగా నాతో కలిసి పని చేసిన టీమ్‌కి. నన్ను నమ్మిన నిర్మాత నాగవంశీగారికి, హీరో దుల్కర్ సల్మాన్గారికి, హీరోయిన్ మీనాక్షీ చౌదరి, నటులు సాయికుమార్, రాంకీగార్లకు థ్యాంక్స్. అలాగే ఈ మూవీకి అద్భుతమైన సంగీతం ఇచ్చిన జీవీ ప్రకాశ్కుమార్కి, నాకు ఇష్టమైన ఎడిటర్ నవీన్ నూలికి ధన్యవాదాలు. టీమ్ అంతా మా సినిమా విజయానికి దోహదపడ్డారు. నేను రాసిన డైలాగ్స్‌కి కూడా ఇంత మంచి పేరు వచ్చిందంటే నటీనటుల వల్లే. వాళ్లు అద్భుతంగా చెప్పడం, నటించడం వల్లే ఈరోజు నేను ఈ అవార్డుకి ఎంపికయ్యాను.. వీళ్లందరికీ నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. అలాగే ఈ అవార్డుకి నన్ను ఎంపిక చేసిన జాతీయ అవార్డు కమిటీ జ్యూరీకి కూడా థ్యాంక్స్. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. – ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)మన తెలుగు తేజం, ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత అయిన శ్రీకాంత్ బొల్లా జీవితంపై వచ్చిన చిత్రం ‘శ్రీకాంత్’. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ని రాజ్‌కుమార్ రావ్ పోషించారు. పుట్టుకతోనే కంటి చూపు లేకపోవడంతో శ్రీకాంత్ బాల్యంలో పడిన ఇబ్బందులు, చదువు కోసం పడ్డ అవస్థలు, ఆపై అంధత్వాన్ని జయించి, వ్యాపారవేత్తగా ఎదిగిన తీరుపై తీసిన స్ఫూర్తిదాయకమైన చిత్రం ఈ ‘శ్రీకాంత్’. – ఉత్తమ హిందీ చిత్రం (శ్రీకాంత్)ఆంధ్రా టు అమెరికాఈ ‘శ్రీకాంత్’ చిత్రానికి స్ఫూర్తిగా నిలిచిన శ్రీకాంత్ బొల్లా గురించి చెప్పాలంటే... శ్రీకాంత్ బొల్లా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం. పుట్టుకతోనే అంధుడు. అయితే అతని తల్లిదండ్రులు కొడుకును పట్టుదలతో చదివించారు. ఆరేళ్ల వయసులో ప్రతి రోజూ కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ స్కూలుకు వెళ్లేవాడు శ్రీకాంత్. ఎనిమిదేళ్ల వయసులో అంధ విద్యార్థులు చదువుకునే బోర్డింగ్ స్కూలులో సీటు లభించింది. దీంతో హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాడు. ఇంజనీర్ కావాలన్నది తన కల. అది జరగాలంటే సైన్స్, మ్యాథ్స్ చదవాలి. కానీ, ఆ సబ్జెక్టులు తీసుకోవడానికి ఆయనకు అర్హత లేదంటూ స్కూల్ యాజమాన్యం అభ్యంతరం చెప్పింది. ఈ విషయంపై కోర్టుకెక్కి, అనుమతి సాధించారు. ఇంటర్మీడియట్ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో శ్రీకాంత్ బొల్లా ఇంజినీరింగ్ చదవాలనుకున్నా... అంధుడైన కారణంగా అడ్మిషన్ దక్కలేదు. దీంతో అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నారు. సీటు దక్కించుకుని, ఎంఐటీలో మేనేజ్మెంట్ సైన్స్‌లో ఆయన గ్రాడ్యుయేట్ అయ్యారు. జాబ్ వచ్చినా ఇండియాలోనే పని చేయాలనుకున్నారు. 2012లో హైదరాబాద్ చేరుకుని, ‘బొల్లాంట్ ఇండస్ట్రీస్’ స్థాపించారు. ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేసే ఈ కంపెనీ తాటి ఆకులతో పర్యావరణ అనుకూల ఉత్పత్తులను రూపొందిస్తు్తంది. ఇందులో ఎక్కువమంది వికలాంగులే పని చేస్తున్నారు. – ఆచార్య శరత్చంద్ర, సాక్షి, న్యూఢిల్లీ -
వందేమాతర గీతానికి రక్షణలు
న్యూఢిల్లీ: ఈ నెల 20వ తేదీ నుంచి మొదలయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. జాతీయ గీతం వందేమాతరంతో సమానమైన చట్టబద్ధమైన రక్షణలు కల్పించే బిల్లుతోపాటు, ప్రభుత్వేతర సంస్థల(ఎన్జీవో)లు అందుకునే విదేశీ విరాళాలను దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు ఉపయోగించడాన్ని నిరోధించేందుకు ఉద్దేశించిన విదేశీ విరాళాల(నియంత్రణ) సవరణ(ఎఫ్సీఆర్ఏ) బిల్లు–2026 ఇందులో ప్రముఖంగా ఉన్నాయి. జనన, మరణాల ఆలస్య నమోదు విధానాన్ని మరింత కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్లు, అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ)లను రద్దు చేసి వాటి స్థానంలో ఒకే రకమైన ఏకీకృత నియంత్రణ కమిషన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఉన్నత విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించేందుకు ఉద్దేశించిన కీలకమైన బిల్లును కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు గురువారం లోక్‌సభ సెక్రటేరియట్ ఒక బులెటిన్ విడుదల చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల ద్వారా విదేశీ పెట్టుబడిదారులకు లభించే వడ్డీ ఆదాయం, మూలధన లాభాలపై ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు గతంలో తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఆదాయ పన్ను (సవరణ) బిల్లును ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. -
ఎలక్ట్రానిక్స్ తయారీకి రూ.1.90 లక్షల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని గ్లోబల్ ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్ల తయారీ హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రెండు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మొబైల్ ఫోన్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్(ఎంపీఎంఎస్), సెమికాన్ 2.0 పేరిట మొత్తం రూ.1,90,000 కోట్ల బడ్జెట్‌తో నూతన విధానాలకు పచ్చజెండా ఊపింది. వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్ తర్వాత మీడియాకు తెలిపారు. ఎంపీఎంఎస్ కింద దేశీయ విడిభాగాల కొనుగోలు, స్థానిక బ్రాండ్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించింది. దేశంలో తయారైన మొబైల్ ఫోన్ల విక్రయాలపై 2.25 శాతం నుంచి 5 శాతం వరకు ప్రోత్సాహకం ఇస్తారు. కీలకమైన విడిభాగాలు, సబ్–అసెంబ్లీలను స్థానికంగానే కొనుగోలు చేస్తే అదనంగా 1.5 శాతం ఇన్సెంటివ్ లభిస్తుంది. ప్రొడక్ట్ డిజైన్, పరిశోధన–అభివృద్ధి రంగాల్లో పేటెంట్లను సృష్టించే బ్రాండ్లకు మరో 3 శాతం ప్రోత్సాహకం అందజేస్తారు. రూ. 1,27,500 కోట్లతో ‘సెమికాన్ 2.0’ భారత్‌ను అంతర్జాతీయ సెమీకండక్టర్ పటంలో నిలబెట్టడానికి రూ.1,27,500 కోట్ల బడ్జెట్‌తో ‘సెమికాన్ 2.0’ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సెమీకండక్టర్ల డిజైన్, తయారీ కోసం సమగ్రమైన ఆవరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఆరు కీలక అంశాలతో ఈ విధానాన్ని రూపొందించారు. చిప్ డిజైన్, యంత్రాలు–ముడిసరుకు, ఫ్యాబ్‌ల ఏర్పాటు, ఏటీఎంపీ (అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్) విభాగాలను ఇందులో చేర్చారు. 2028 కల్లా తొలి ఫ్యాబ్ దేశంలో మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్ 2028 నాటికి వాణిజ్యపరంగా ప్రారంభం కానుంది. సిలికాన్ ఫ్యాబ్‌లు, కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు, డిస్ప్లే ఫ్యాబ్‌ల ఏర్పాటుకు అంతర్జాతీయ తయారీదారులను ఆకర్షించేలా వ్యూహరచన చేశారు. స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈల నుంచి వచి్చన 24 సెమీకండక్టర్ డిజైన్ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. చిప్‌ల అభివృద్ధిలో నిమగ్నమైన 105 స్టార్టప్‌లకు ఎల్రక్టానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ వినియోగించుకునే అవకాశం కల్పించారు. వారణాసికి రూ.25 వేల కోట్లతో రహదారులు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కోసం దాదాపు రూ.25,500 కోట్ల వ్యయంతో రెండు రహదారి ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వారణాసిలో వాహనాల రద్దీని తగ్గించడానికి వరుణా నది వెంబడి ఎన్‌హెచ్–31తోపాటు నగరంలో రింగ్ రోడ్‌ను కలిపే 43.21 కిలోమీటర్ల అనుసంధాన మార్గాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్, ఫ్లైఓవర్లు, లూప్స్, ర్యాంప్‌లు, సర్వీసు రోడ్లు ఉంటాయి. ఎన్‌హెచ్–31, కాశీ రైల్వే స్టేషన్ మధ్య, వారణాసి రింగ్ రోడ్, వారణాసి విమానాశ్రయం, కాశీ రైల్వే స్టేషన్, వారణాసి సిటీ రైల్వే స్టేషన్, వారణాసి జంక్షన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, రామ్‌నగర్ పోర్ట్, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, వారణాసి ఘాట్లు, చందౌలి తదితర ప్రాంతాల మధ్య అనుసంధానం మరింత సులభతరం కానుంది. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం: మోదీ సెమీకండక్టర్ల రూపకల్పన, తయారీ, ఆవిష్కరణలకు భారత్‌ను గ్లోబల్ సెంటర్‌గా తీర్చిదిద్దాల ని ప్రభుత్వం సంకల్పించినట్లు ప్రధాని మోదీ బుధవారం పేర్కొన్నారు. రూ.1,90,000 కోట్లతో మొబైల్ ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్, సెమికాన్ 2.0 ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని వెల్లడించారు.మొబైల్స్ తయారీకి రూ.62,500 కోట్లు దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని భారీగా పెంచేందుకు ఉద్దేశించిన ‘ఎంపీఎంఎస్’పథకానికి కేంద్రం రూ.62,500 కోట్లు కేటాయించింది. గతంలో అమలైన పీఎల్ఐ–ఎల్ఎస్ఈఎం పథకం గడువు 2026 మార్చి 31తో ముగియడంతో దాని స్థానంలో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఇది 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030–31 వరకు ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఈ ఐదేళ్లలో రూ.39 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఉత్పత్తి జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనివల్ల ఎగుమతులు గణనీయంగా పెరగడమే కాకుండా ఎల్రక్టానిక్స్ రంగంలో 60 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. యూరియా రంగంలో కొత్త విధానం ‘నిపు–2026’ దేశంలో యూరియా ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా ఎరువుల శాఖ ప్రతిపాదించిన ‘జాతీయ యూరియా పెట్టుబడుల విధానం(నిపు)–2026’కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశంలో నూతనంగా గ్యాస్ ఆధారిత యూరియా తయారీ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఇటీవల ఎరువుల శాఖకు కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి పలు సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నూతన పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక విధానం అవసరమని గుర్తించిన ప్రభుత్వం నిపు–2026ను అమల్లోకి తెచి్చంది. పాత విధానంతో పోలిస్తే ఈ కొత్త విధానం కింద ఏర్పాటయ్యే ప్రతి ప్లాంట్‌కు సుమారు రూ.250 కోట్లకు పైగా ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఇకపై ఏర్పాటు చేయబోయే కొత్త యూరియా తయారీ యూనిట్లన్నీ ఈ విధానం పరిధిలోకే వస్తాయి. దేశంలో 26.94 మిలియన్ టన్నుల స్థాపిత సామర్థ్యంతో 33 యూరియా తయారీ యూనిట్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కోటి∙టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 9 కొత్త గ్యాస్ ఆధారిత ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
సమానత్వం పేరిట ఆహారంలో కోత
ఆహార భద్రతా చట్టానికి సవరణలు చేయటానికి కేంద్రప్రభుత్వం పూనుకుంది. ఏదైనా ఆహార భద్రతా చట్టంలో మార్పును పరీక్షించడానికి ఒక సులభమైన కొలమానం ఉంది. ఆ పథకం ఎవరి కోసం రూపొందిందో ఆ వ్యక్తిని – అంటే గాంధీజీ చెప్పిన ‘అంత్యోదయ’, వరుసలో చిట్టచివరి మనిషిని – తీసుకోవడం; ఈ సవరణ తర్వాత అతడికి ఎక్కువ ఆహారం అందుతుందా, తక్కువా అని అడగడం. జాతీయ ఆహార భద్రతా (సవరణ) బిల్లు, 2026కు ఈ పరీక్ష పెడితే వచ్చే జవాబు స్పష్టం: ప్రతి కుటుంబానికీ తక్కువే. ఒంటరిగా ఉండే వితంతువుకు మరీ తక్కువ. ఈ చట్టం ఆమెనూ, ఆమెలాంటి వాళ్లనూ రక్షించడానికి రూపొందినది కావడమే ఇక్కడ గమనార్హం.పెద్ద కుటుంబాల మాటేమిటి?‘అంత్యోదయ అన్న యోజన’ (ఏఏవై) కింద కుటుంబానికి నెలకు 35 కిలోల ధాన్యం ఇచ్చే హక్కును ఈ బిల్లు తీసేసి, ఒక్కొక్కరికి 7 కిలోల చొప్పున ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కుటుంబానికి గరిష్ఠంగా 35 కిలోల పరిమితిని విధిస్తోంది. దీన్ని ‘అసమానతలను తొలగించడం’గా ప్రభుత్వం చెబుతోంది. కానీ లెక్క చూస్తే నిజం బయటపడుతుంది: ఒంటరి వ్యక్తికి 35 నుంచి 7 కిలోలకు (80% కోత) తగ్గుతుంది. ఇద్దరికి 14 కిలోలకు, ముగ్గురికి 21కి, నలుగురికి 28కి పడిపోతుంది. ఐదుగురి కుటుంబం మాత్రమే సరిగ్గా 35 కిలోలు తీసుకుంటుంది. ఆరు, ఏడు, ఎనిమిది మంది ఉన్న కుటుంబాలు 35 కిలోల పరిమితి వల్ల ఉన్న చోటే ఉండిపోతాయి. ఏ ఒక్క ‘ఏఏవై’ కుటుంబానికీ ఒక్క కిలో అదనంగా రాదు. ‘లాభం’ అనే గడి పూర్తిగా ఖాళీ. 7 కిలోలు పోషకాహార ప్రమాణమే అయితే, ఎనిమిది మంది కుటుంబానికి 56 కిలోలు కావాలి. కానీ పరిమితి వాళ్లకు 35 మాత్రమే ఇస్తుంది. అంటే తలసరి 4.4 కిలోలు. సాధారణ ప్రాధాన్య కుటుంబం కంటే కూడా తక్కువ. ఈ పోషకాహార సూత్రం కోత పెట్టే చోట పని చేస్తుంది, హక్కు పెంచాల్సిన చోట మాత్రం మౌనంగా ఉంటుంది. ఒకే వైపు పనిచేసే సూత్రం కాదు – అది సమానత్వం ముసుగులో ఒక పొదుపు లక్ష్యం మాత్రమే.ఒంటరివాళ్లు ఏం కావాలి?చిన్న కుటుంబాలపైనే ఈ పథకాన్ని కేంద్రీ కరించారు. ఏఏవైలో చిన్న కుటుంబం అనేది యాదృచ్ఛికం కాదు, అదే దాని రూపకల్పన. 2000 సంవత్సరం నుంచి ఏఏవై రాష్ట్రాలకు స్పష్టంగా చెప్పింది: ఆసరా లేని వితంతువులు, ఒంటరి మహిళలు, మంచానపడ్డ రోగులు, వికలాంగులు, ఆధారం లేని వృద్ధులు, ఆదిమ తెగలు,ఒంటరిగా బతికే నిరుపేదలను గుర్తించండి అని! దారిద్య్రం మన దేశంలో ఒకరిద్దరుగానే ఉంటుంది. అందుకే 35 కిలోల ఫ్లాట్ హక్కు పొరపాటు కాదు, అది తలసరి లెక్కకు కుదించ లేని ఒక గుర్తింపు. ఒంటరి నిరుపేదకు ఆ రేషన్ కేవలం ఆహారం కాదు; పింఛను అందని నెలకు అది ఆసరా, ఇంట్లో ఏ ఆపదనైనా తట్టుకోగల ఏకైక ఆస్తి. రేషన్ దుకాణంలో ఒంటరి కార్డుపై వేలి ముద్ర ఎవరిదో చూసిన వారికి తెలుసు. అది చాలావరకు ఏ దిక్కూ లేని ఒక ముసలి స్త్రీది. ఆమె 35 కిలోలు ఇప్పుడు 7 కిలోలు అవుతాయి. చట్టం చరిత్రలోనే విధించిన అతిపెద్ద కోత ఇది.పైగా ఇదంతా ఎప్పుడు జరుగుతోంది? ఎఫ్‌సీఐ గోదాముల్లో దాదాపు 604 లక్షల టన్నుల ధాన్యం– బఫర్ ప్రమాణానికి దాదాపు మూడు రెట్లు– పేరుకుపోయి ఉన్నప్పుడు. అదే సమయంలో రైతులు వరి, గోధుమ, కంది, పెసర కనీస మద్దతు ధర కంటే తక్కు వకే అమ్ముకుంటున్నారు. మిగులుపై కూర్చొని, రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, అత్యంత పేద కుటుంబాల రేషన్ నుంచి ఏటా 22–25 లక్షల టన్నులు తీసేయడం – ఇది కొరత వల్ల కాదు, పొదుపు పేరుతో జరుగుతున్న మార్పు. సేకరణ దగ్గర రైతును,పంపిణీ దగ్గర పేదను నొక్కి, మధ్యలో మిగిలిన దాన్ని ‘పొదుపు’ అని పిలవడం– ఇది మనం మళ్లీ మళ్లీ చూస్తున్న నమూనా. ఇది చట్టం చరిత్రలో మొదటిసారిగా ఒక హక్కును తగ్గించే సవరణ. ఆర్టికల్ 21 కింద ఆహార హక్కును ఒకసారి కల్పించాక దాన్ని వెనక్కి తీసుకోవడం రాజ్యాంగపరంగా ప్రశ్నార్థకం. పైగా ఇంత కీలకమైన మార్పును – ఈమెయిల్ ద్వారా, ఇంగ్లిష్‌లో మాత్రమే, కొద్ది రోజుల గడువుతో సంప్రదింపులకు పెట్టడం ప్రభుత్వం తన శాసన సంప్ర దింపుల విధానాన్నే ఉల్లంఘించడం! అసలు పరిష్కారంప్రభుత్వం చెప్పే సమస్య నిజమైనదే అయితే, పరిష్కారం చాలా సులభం. ఒక అంత్యోదయ అన్న యోజన కుటుంబానికి హక్కు ఒక్కొక్కరికి 7 కిలోలు, లేదా కుటుంబానికి 35 కిలోలు– వీటిలో ఏది ఎక్కువ అయితే అది నిర్ణయించవచ్చు. చిన్న కుటుంబాలు తమ రక్షణను నిలబెట్టుకుంటాయి; పెద్ద కుటుంబాలకు– ఆరుగురికి 42 కిలోలు, ఎనిమిది మందికి 56 కిలోలు వస్తాయి. బిల్లు ఉదహరించే ఐసీఎంఆర్ పోషణ ప్రమాణానికి తగిన వాటా దొరుకుతుంది. దీనికి కావాల్సిన అదనపు ధాన్యం నేటి మిగులు ముందు నామమాత్రమే. పైగా అది గోదాముల ఒత్తిడిని తగ్గించి, కనీస మద్దతు ధర కంటే తక్కువకు పడిపోయిన మార్కెట్లో సేక రణకు ఊతమిస్తుంది. ఎవరూ నష్టపోరు, అందరూ లాభపడతారు. కానీ ప్రభుత్వం మాత్రం పేదలే ఎక్కువ నష్టపోయే సూత్రాన్ని ఎంచుకుంది. మిగిలిన ధాన్యాన్ని ఇథనాల్ పరిశ్రమలకు సబ్సిడీతో అందించే బదులు ఆకలితో ఉన్నవాళ్లకి అందిస్తే మంచిది కదా!అలా అని ఇప్పుడు ఉన్న చట్టంలో సమస్యలు లేవని కాదు. నిజానికి చట్టానికి సంస్కరణలు అవసరమే– కానీ ఈ దిశలో కాదు. అసలైన సవరణ ఐదు ప్రశ్నలను ఎదుర్కోవాలి. మొదటిది, జనాభాలో ఒక శాతం ప్రకారం కాక నిజంగా అవసరమున్నవారిని క్షేత్రస్థాయిలో గుర్తించి చేర్చడం. రెండోది, బియ్యం, గోధుమలకే పరిమితం కాకుండా పప్పులు, చిరుధాన్యాలు, నూనెను రేషన్ బుట్టలో చేర్చడం. మూడోది, ప్రజాపంపీణీ వ్యవస్థ ఆహారం తినడానికి సురక్షితంగా ఉండేలా ప్రమాణాలు, పరీక్షలు, తిరస్కరించే హక్కు కల్పించడం. నాలుగోది, రైతును తక్కువ ధరతో ముంచి చౌక ఆహారానికి రాయితీ ఇవ్వడం ఆపి, గిట్టుబాటు ధర (సీ2+50%)ను ఆహార భద్రత నిజ ఖర్చుగా గుర్తించడం. ఐదోది, మిగతా నాలుగింటినీ సాధ్యం చేసేది– వ్యవస్థను వికేంద్రీకరించి, జిల్లాను ప్రాతిపదికగా చేసి, స్థానిక ఎఫ్పీఓలకు సేకరణ, నిల్వ,పంపిణీ బాధ్యతలను అప్పగించడం. ఈ బిల్లును ఇప్పటికీ వెనక్కి తీసుకోవచ్చు. దాని వెనుక ఉన్న శక్తిని, చట్టం దశాబ్దంగా ఎదురుచూస్తున్న నిజమైన సంస్కరణ వైపు మళ్లించడమే మెరుగైన మార్గం. అలా కాక, సమానత్వం ముసు గులో చేసేది కేవలం కోత మాత్రమే!డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
విమాన చార్జీల నియంత్రణకు నిబంధనలేంటి?
న్యూఢిల్లీ: విమాన చార్జీల నియంత్రణకు రూపొందించిన నిబంధనల వివరాలను రెండు వారాల్లోగా అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. ఆ నిబంధనలను ఇప్పటికే పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటికీ, సీల్డు కవర్లోనే తమకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థలు విమాన టికెట్ల ధరలు, ఇతర అదనపు రుసుములను అనూహ్యంగా పెంచేయకుండా నియంత్రించేందుకు మార్గదర్శకాలను రూపొందించాలంటూ సామాజిక కార్యకర్త లక్ష్మీనారాయణన్ వేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణను ఆగస్ట్ 3వ తేదీకి వాయిదావేసింది. -
ఆల్కహాల్ శాతం ఎక్కువుండే ఔషధాలపై ఇకపై కఠిన నిబంధనలు
సాక్షి, న్యూఢిల్లీ: అధిక శాతం ఆల్కహాల్ కలిగిన ఔషధాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన డ్రగ్స్ రూల్స్–1945కు కీలక సవరణలు చేసింది. దీని ప్రకారం, ఇప్పటి వరకు షెడ్యూల్–కె కింద లైసెన్స్ మినహాయింపు పొందుతున్న కొన్ని ఆల్కహాల్ ఆధారిత ఔషధాలపై ఇకపై కఠిన నియంత్రణలు అమలు కానున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం 12 శాతం కంటే ఎక్కువ ఇౖథెల్ ఆల్కహాల్ ఉండి, 30 మిల్లీలీటర్లకు మించిన పరిమాణంలో విక్రయించే అన్ని ఔషధాలకు లైసెన్స్ తప్పనిసరి చేసింది. అంతేకాదు, ఈ మందులను షెడ్యూల్–హెచ్1 పరిధిలోకి తీసుకురావడంతో రిజిస్టర్డ్ వైద్యుడు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే విక్రయించాల్సి ఉంటుంది. ఔషధ విక్రేతలు విక్రయ వివరాలను నిర్దిష్ట రిజిస్టర్లలో నమోదు చేసి భద్రపరచాల్సి ఉంటుందని అందులో తెలిపింది. ఆ మినహాయింపులకు చెల్లుచీటి ఇప్పటివరకు షెడ్యూల్–కె కింద టింక్చర్ ఆఫ్ కార్డమమ్, టింక్చర్ ఆఫ్ జింజర్‌తో పాటు మరికొన్ని అరోమాటిక్ ఔషధాలకు లైసెన్స్ మినహాయింపు ఉండేది. అయితే వీటిలో కొన్ని తయారీల్లో 80 నుంచి 90 శాతం వరకు ఇౖథెల్ ఆల్కహాల్ ఉండటంతో వాటిని మత్తు కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం దృష్టికి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో మినహాయింపును ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సవరణలతో ఇటువంటి ఔషధాల తయారీ, నిల్వ, పంపిణీ, విక్రయం పూర్తిగా నియంత్రిత ఔషధ సరఫరా వ్యవస్థలోకి రానుంది. ప్రతిపాదిత సవరణ ప్రకారం, కేవలం ఏలకులు, అల్లం, ఇతర మసాలా దినుసులు ఉన్నాయనే కారణంతో 12 శాతం కంటే ఎక్కువ ఇౖథెల్ ఆల్కహాల్ కలిగిన ఔషధ తయారీ దారులు ఇకపై షెడ్యూల్–కె’ కింద మినహాయింపు కోరేందుకు వీలుండదు. పలు సంప్రదాయ వైద్య విధానాల్లో ఆల్కహాల్ పరిమితులను ఇప్పటికే నిర్దేశించామని, ఈ విషయంలో ఒకే విధమైన నియంత్రణ విధానాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపింది. మత్తు కోసం అక్రమ వినియోగం, అక్రమ మళ్లింపులకు గణనీయంగా అడ్డుకట్ట పడుతుందని పేర్కొంది. అదే సమయంలో నిజంగా వైద్య అవసరాల కోసం ఈ మందులు వినియోగించే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఔషధాల హేతుబద్ధమైన వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం, ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ సవరణల ప్రధాన ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది. -
రామాలయ ట్రస్ట్‌లో ‘సంఘ్’ మార్క్!
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. ఇటీవల ట్రస్ట్ వ్యవహారాలపై వస్తు న్న అవకతవకల ఆరోపణలు, పలువురు కీలక వ్యక్తులు, నిర్వాహకుల రాజీనామాల నేపథ్యంలో నష్టనివారణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. భక్తుల్లో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకు ట్రస్ట్‌ను పూర్తిగా పునర్వ్యవస్థీకరించే యోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. నష్ట నివారణకు చర్యలు ట్రస్ట్ అంతర్గత వ్యవహారాలు, నిధుల నిర్వహణపై వస్తున్న విమర్శల కారణంగా ఆలయ ప్రతిష్టకు మరింత భంగం వాటిల్లరాదని కేంద్రం భావిస్తోంది. అందుకే, వివాదాస్పద నేతలను పక్కనబెట్టి, క్లీన్ ఇమేజ్ ఉన్న వారితో బోర్డును ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ), విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), భజరంగ్ దళ్‌లకు చెందిన కీలక నేతలకు కొత్త ట్రస్ట్‌లో సముచిత స్థానం కల్పించబోతున్నారనే వార్తలు రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నమ్మకమైన, గట్టి పట్టున్న నాయకులను రంగంలోకి దించడం ద్వారా ట్రస్ట్‌ను మళ్లీ గాడిలో పెట్టవచ్చని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ముగ్గురి పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలంటున్నాయి. వీరు..ఆర్ఎస్ఎస్ మాజీ ప్రాంతీయ సంఘ్‌చాలక్ అయిన అజయ్ కుమార్ నంది. ఈయనకు సంఘ్ పరివార్‌తో పాటు క్షేత్రస్థాయిలో మంచి పట్టుంది. విశ్వహిందూ పరిషత్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న భజరంగ్ లాల్ బాగ్డా. ఈయనకు కూడా కొత్త బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది. భజరంగ్ దళ్ జాతీయ కనీ్వనర్‌గా ఉన్న నీరజ్ దౌనేరియా. ఈయన పేరు కూడా ట్రస్ట్ సభ్యత్వ రేసులో బలంగా వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన? ట్రస్ట్‌లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడంతో పాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి స్థానంలో ఈ కొత్త ముఖాలను తీసుకురావడం ద్వారా వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టవచ్చని కేంద్రం భావిస్తోంది. ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నేతల చేరికతో రామాలయ నిర్వహణ మరింత పారదర్శకంగా మారుతుందని అనుకూల వర్గాలు చెప్తుండగా, దీనిపై అధికారిక ముద్ర పడటమే తరువాయి అని హస్తిన వర్గాలు అంటున్నాయి. -
నిధులు లేక.. సమస్యలు తీరక..
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మేజర్ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన రూ.63 లక్షలు నిల్వ ఉన్నాయి. కానీ మురుగునీటి కాలువ నిర్మించేందుకు అనుమతులు లభించడం లేదు. జిల్లా పంచాయతీ అధికారులు నిధులను కేవలం సిబ్బంది వేతనాలకు మాత్రమే వాడుకోవాలని ఆదేశాలు ఇచ్చారని సర్పంచ్ మట్టా వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిబంధనతో గ్రామంలో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు నిధులు వినియోగించుకోలేకపోతున్నామని తెలిపారు.సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో కొత్త పాలకమండళ్లు ఏర్పడి ఆరు నెలలు దాటినా పంచాయతీలను సమస్యలు పట్టి పీడిస్తూనే ఉన్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల మందగించడం, రాష్ట్రం నుంచి అందాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు సకాలంలో విడుదల కాకపోవడం, గత పాలకవర్గాల కాలానికి సంబంధించి సుమారు రూ.500 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు పేరుకు పోవడంతో..పల్లెల్లో పాలన కష్టంగా మారుతోంది. నిధుల కొరతతో అత్యవసరమైన పనులూ చేపట్టలేని పరిస్థితి ఉంది. ప్రజారోగ్యానికి కీలకమైన పారిశుధ్యం, ఇతరత్రా రోజువారీ పనులు కుంటుపడుతున్నాయి. ఇక గ్రామాల్లో అభివృద్ధి పనులు, పారిశుధ్య కార్మీకుల వేతనాలు తదితరాలకు అవసరమైన కేంద్ర–రాష్ట్ర నిధులు సైతం సకాలంలో విడుదల కావడం లేదు. వివిధ జిల్లాల్లోని గ్రామ పంచాయతీల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను ‘సాక్షి’బృందం పరిశీలించినప్పుడు అనేక సమస్యలు దృష్టికి వచ్చాయి. అర్జంట్ పనులూ అంతే.. కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి ఐదేళ్ల కాలానికి రూ.9,968 కోట్లు కేటాయించింది. అయితే ఈ నిధులు దశల వారీగా విడుదల అవుతున్నాయి. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక నిధి కింద మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు ప్రకటించారు. ఇకపై పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీ ఖాతాలో కాకుండా, నేరుగా పంచాయతీల సొంత బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇవేమీ అమల్లోకి రాకపోవడంతో పంచాయతీల్లో రోజువారీ నిర్వహణ మృగ్యంగా మారుతోంది. బిల్లులు చెల్లించలేని దుస్థితి గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, సర్పంచులు, సొంత జేబుల నుంచి ఖర్చు చేసిన పంచాయతీ కార్యదర్శులకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. చాలాచోట్ల చెత్త సేకరణ వాహనాలకు డీజిల్, వీధి దీపాలకు సంబంధించిన కరెంటు బిల్లులు కట్టలేని దుస్థితి ఉంది. మురుగు కాల్వలు శుభ్రం చేయకపోవడం, పాత కాల్వలు పూడిక తీయకపోవడంతో మురుగు నిలిచిపోతోంది. తడి, పొడి చెత్తను వేరుచేయడం ఆగిపోయింది. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నా యి. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల తాగునీటి సరఫరా మోటార్లకు మరమ్మతులు లేకపోవడంతో మూలనపడ్డాయి. చాలా చోట్ల ‘వైకుంఠ ధామాలు’నిర్మాణాలు పూర్తయినా, కొన్నిచోట్ల సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల నిర్వహణకు సరైన నిధులు లేకపోవడంతో కొన్నిచోట్ల మొక్కలు ఎండిపోతు న్నాయి. గ్రామీణ క్రీడా ప్రాంగణాల్లో చాలాచోట్ల కలుపు మొక్కలు పెరిగిపోయాయి. క్రీడా పరికరాలు తుప్పు పట్టి కన్పిస్తున్నాయి. జీతాలు, పథకాలకు నిధుల మళ్లింపు! కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా గ్రామ పంచాయతీలకు ’టైడ్’ (నిర్దిష్ట పనులకు) ’అన్‌టైడ్’ (స్థానిక అవసరాలకు) నిధులను కేటాయిస్తోంది. అయితే గతంలో, ఇటీవలి కాలంలోనూ ఈ నిధులను విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల జీతాలు, ఇతర సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని ప్రతిపక్షాలు, సర్పంచ్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. డంపింగ్ యార్డుకు చేరని చెత్త లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన డంపింగ్ యార్డులు కొన్నిచోట్ల నిరుపయోగంగా ఉంటున్నాయి. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కాట్రపల్లి గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో పంట చేల మధ్యలో చెత్త డంపింగ్ యార్డు నిర్మించారు. కానీ డంపింగ్ యార్డుకు వెళ్లడానికి సరైన దారి ఏర్పాటు చేయలేదు. దీంతో గ్రామంలోని చెత్తను డంపింగ్ యార్డుకు తరలించలేకపోతున్నారు. నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలో గత ప్రభుత్వ హయాంలో యువత కోసం 37 గ్రామాలకు గాను 35 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. మండలంలోని లోతుకుంటలో క్రీడా ప్రాంగణం బోర్డుకే పరిమితం అయ్యింది.నిలిచిన నిధులు... పెండింగ్‌లో గ్రాంట్లు15వ ఆర్థిక సంఘం కింద కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన సుమారు రూ. 1,090 కోట్ల బకాయిలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు విడుదల చేయాల్సిన వాటా (మ్యాచింగ్ గ్రాంట్లు) దాదాపు రూ. 2,979 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2026 మే లో కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం కింద రాబోయే ఐదేళ్ల కాలానికి (2026–31) గ్రామీణ స్థానిక సంస్థల కోసం రూ.9,968 కోట్లను కేటాయించింది. 2026–27 నుంచి వచ్చే ఈ నిధులలో 80% నేరుగా గ్రామ పంచాయతీలకు, 10% మండల పరిషత్తులకు, 10% జిల్లా పరిషత్తులకు దక్కనున్నాయి. ఈ నిధులు ఏటా జూన్, అక్టోబర్ నెలల్లో రెండు విడతలుగా విడుదల కావాల్సి ఉంది. అయితే కేంద్రం విధించిన కఠినమైన నిబంధనలతో నిధులు డ్రా చేసుకోవడం సవాలుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతో. ఈ సంవత్సరంలో 16వ ఆర్థిక సంఘం మొదటి విడత నిధులను కేంద్రం ఒక్కపైసా విడుదల చేయలేదు. రెండేళ్లుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపకపోవడంతో 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు రూ.233.40 కోట్లు నిలిచిపోయాయి. కాగా 16వ ఆర్థిక సంఘం నిధులను కేవలం మౌలిక వసతులు, తాగునీరు, పారిశుధ్యానికి మాత్రమే వాడాలనే నిబంధన విధించారు. ఉద్యోగుల వేతనాలకు లేదా పెన్షన్లకు ఉపయోగించకూడదు. -
పుంజుకున్న నైరుతి..
న్యూఢిల్లీ: జూలై మొదటి వారంలో దేశవ్యాప్తంగా అంచనాలకు మించి భారీ వర్షాలు నమోదు కావడంతో ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. తాజా వర్షాలతో లోటు కాస్తా 12 శాతానికి తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రుతుపవనాల పురోగతి, ఎల్–నినో పరిస్థితులపై ప్రధానమంత్రి ప్రధాన సలహాదారు పి.కె.మిశ్రా మంగళవారం విస్తృత సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, తాగునీరు, పారిశుద్ధ్యం, వాణిజ్య వ్యవహారాలు, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ, జలవనరుల శాఖల అధికారులు పాల్గొన్న ఈ సమీక్ష సమావేశంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) జూన్, జూలై నెలల్లో దేశవ్యాప్తంగా రుతుపవనాల పరిస్థితి, ప్రభావాల గురించి వివరించింది. గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మహారాష్ట్రల్లో రుతుపవనాల రాక సాధారణం కంటే పది రోజులు ఆలస్యమైనప్పటికీ జూలై ఏడవ తేదీ వరకూ 30 శాతం వర్షం అధికంగా పడిందని, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అయితే.. ఎల్–నినో పరిస్థితులు అన్నిసార్లూ వార్షభావానికి కారణం కాదని స్పష్టం చేసింది. పరిస్థితిని నిత్యం గమనిస్తూ ఉన్నామని తెలిపింది.ఖరీఫ్ సీజన్లో ఎల్ నినో పరిస్థితులను తట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసు కున్నారో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి వివరించారు. రాష్ట్రాలతోపాటు పంటలు, వాతావరణ శాఖలతో వారం వారం సమావేశాలు నిర్వహిస్తున్నామని, వర్షపా తం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, వ్యవ సాయ పనులు, మార్కెట్ ధోరణలు, పంటలను ఆశిస్తున్న చీడపీడల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలి పారు. సమస్యాత్మకం కాగల 262 జిల్లాల్లో ప్రత్యామ్నాయ ప్రణాళికలను అందుబా టులో ఉంచామని చెప్పారు. ఎల్–నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రామాణిక పద్ధతులు కొన్నింటిని సిద్ధం చేసిందని వివరించారు. అనానుకూల వాతావరణాన్ని తట్టుకోగల విత్తన వెరైటీలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పాడిపశువులకు దాణ లభ్యతను పరిశీలిస్తున్నామని పశు సంవర్ధక శాఖ అధికారులు తెలపగా.. రిజర్వాయర్లు, భూగర్భ జలాల పరిస్థితిని నిత్యం గమనిస్తున్నామని జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. వడగాడ్పుల వంటి పరిస్థితులు ఏర్పడితే ఏం చేయాలన్నదానిపై సూచనలను సిద్ధం చేశామని ఆరోగ్య శాఖ వివరించింది. బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, ఖరీఫ్, రబీ సీజన్లకు తగినన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయని వాణిజ్య వ్యవహారాలు, ఎరువుల శాఖ తెలిపింది. వికసిత్ భారత్ పథకం కింద జూలై ఒకటవ తేదీ కింద చేపట్టిన పనులను గ్రామీణాభివృద్ధి శాఖ వివరించింది. -
ఇంట్లో బంగారం ఉందా.. ఈ స్కీమ్‌తో భారీ లాభం!
భారతదేశంలో బంగారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మన దేశ ప్రజలు బంగారాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా.. భవిష్యత్తు కోసం భద్రమైన పెట్టుబడిగా కూడా భావిస్తారు. కాబట్టి ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. అయితే.. ఇళ్లలోని బంగారం, దేశ ఆర్థిక వ్యవస్థలో ఉపయోగపడకుండా అలాగే ఉండిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (Gold Monetisation Scheme)ను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కొత్త రూపంలో తీసుకురావాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశ్యం.. ప్రజలు తమ ఇళ్లలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగించేలా చేయడం. బంగారం డిపాజిట్ చేసిన వారికి ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లించేది. గడువు పూర్తయిన తర్వాత వారు బంగారం రూపంలో గానీ, దానికి సమానమైన నగదు రూపంలో గానీ తిరిగి పొందే అవకాశం ఉండేది. అయితే ఈ స్కీమ్ అనుకున్నంత సక్సెస్ కాలేదు.ఈ పథకం ఎందుకు విఫలమైంది?దాదాపు పది సంవత్సరాల కాలంలో ఈ పథకం ద్వారా కేవలం 38 టన్నుల బంగారం మాత్రమే సేకరించారు. కానీ భారతీయుల వద్ద సుమారు 25,000 టన్నుల బంగారం ఉందని అంచనా. దీన్నిబట్టి చూస్తే.. ఈ పథకం ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదని తెలుస్తోంది.➤భారతీయ కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి వచ్చిన లేదా భావోద్వేగ విలువ కలిగిన నగలను డిపాజిట్ చేయడానికి ఆసక్తి చూపలేదు.➤పన్ను సంబంధిత విచారణలు వస్తాయనే భయం ప్రజల్లో ఉంది.➤బ్యాంకులకు ఈ పథకం ద్వారా పెద్దగా లాభం లేకపోవడంతో వారు దీనిని ప్రోత్సహించలేదు.➤ప్రభుత్వం వడ్డీతో పాటు బంగారం ధర పెరిగితే ఆ అదనపు మొత్తాన్ని కూడా చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగింది.కొత్త మార్పులు ఏమిటి?గోల్డ్ మానిటైజేషన్ స్కీములో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ముఖ్యమైన మార్పు ఏమిటంటే, దేశవ్యాప్తంగా ఉన్న జ్యువెలర్లు (బంగారు నగల వ్యాపారులు) కూడా కలెక్షన్ పార్ట్నర్లుగా పనిచేసే అవకాశం కల్పించడం.అంటే.. ఇప్పటి వరకు బంగారాన్ని కేవలం బ్యాంకుల ద్వారానే మాత్రమే డిపాజిట్ చేయాల్సి వచ్చేది. ఇకపై ప్రజలు తమకు దగ్గరలో ఉన్న విశ్వసనీయ జ్యువెలర్ల వద్ద కూడా బంగారాన్ని ఇచ్చే అవకాశం ఉండవచ్చు. దీనివల్ల ప్రజలకు సౌకర్యం పెరుగుతుంది, అలాగే మరింత బంగారం ఈ పథకంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు➤ఇళ్లలో ఉపయోగం లేకుండా ఉన్న బంగారం దేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది.➤విదేశాల నుంచి బంగారం దిగుమతుల అవసరం తగ్గుతుంది.➤డాలర్లపై భారతదేశం ఆధారపడటం తగ్గుతుంది.➤రూపాయి విలువ బలపడే అవకాశం ఉంటుంది.➤దేశంలో బంగారం ఆధారిత వ్యాపారాలు మరింత పారదర్శకంగా మారతాయి.➤దిగుమతులు తగ్గడం వల్ల, బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది.ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం.. భారతీయుల వద్ద ఉన్న బంగారంలో కేవలం 5 శాతం మాత్రమే ఈ పథకం ద్వారా సమీకరించినా, సుమారు 1,250 టన్నుల బంగారం లేదా 80-90 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తి దేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది. ఇది దాదాపు రెండేళ్ల పాటు బంగారం దిగుమతుల అవసరాన్ని తగ్గించే స్థాయిలో ఉంటుంది.ప్రధానమంత్రి పిలుపుఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను ఒక సంవత్సరం పాటు కొత్త బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని కోరారు. దీనివల్ల దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
జీ రామ్ జీపై సుప్రీంకు..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన వీబీ–జీ రామ్ జీ (వికసిత్ భారత్– గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవికా మిషన్–గ్రామీణ్)చట్టం–2026ను జూలై 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉపాధి హామీ కూలీలకు పని కల్పించే విషయంలో గత్యంతరం లేక నోటిఫికేషన్ జారీకి ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ చట్టంలో విధించిన నిబంధనలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. పార్లమెంటులోనూ కేంద్రం తీరును నిలదీయాలని తీర్మానించింది. గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమై వీబీ–జీ రామ్ జీని రాష్ట్రంలో అమలు చేసే అంశంపై విస్తృతంగా చర్చించింది. సమావేశం అనంతరం సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహచర మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. కొత్త చట్టంపై ఇతర రాష్ట్రాలూ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయని తెలిపారు. టిమ్స్ ఆస్పత్రులకు 6,278 పోస్టులు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. సనత్‌నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆస్పత్రులతోపాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులు మంజూరు చేసింది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు, 4,235 ఔట్ సోర్సింగ్ పోస్టులకు అనుమతించారు. ఈ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇక్కడ అందించే వైద్య సేవలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎల్ఓసీలు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రూ.7345 కోట్లతో మూసీ తొలి దశ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా ఫేజ్–1 పనులకు మంత్రివర్గం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తొలి దశలో 21 కి.మీ. పొడవునా అభివృద్ధి చేసేందుకు రూ.7,345.12 కోట్ల విలువైన పనుల మంజూరుకు ఆమోదం తెలిపింది. హిమాయత్ సాగర్ నుంచి ఈసా... ఉస్మాన్ సాగర్ నుంచి మూసా ప్రవాహాలు ప్రారంభమయ్యే చోటు నుంచి బాఫNఘాట్ వరకు ఈ పనులు చేపడతారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పనులు... నిర్వహణ కోసం నూతనంగా 147 పోస్టుల మంజూరుతోపాటు ఇతర శాఖల నుంచి అవసరమైన సిబ్బంది డిప్యూటేషన్‌కు ఆమోదం తెలిపారు. త్వరలో ఫేజ్–1 పనులకు టెండర్లు పిలవనున్నారు. ఉపాధ్యాయులకూ అల్పహారం, లంచ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అందించే అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అందించాలని నిర్ణయించారు. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించే సంకల్పంతోపాటు జవాబుదారీతనం పెంచే ఆలోచనలో భాగంగా రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి ఈ పథకం వర్తింపజేయనున్నారు. = వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంట గ్రామంలో నిత్యావసర వస్తువుల గోదాముల నిర్మాణానికి 50 ఎకరాలను, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కాలపహాడ్ గ్రామంలో 10 ఎకరాలను రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు మార్కెట్ ధర ప్రకారం కేటాయించేందుకు ఆమోదం. = జవహర్ నవోదయ విద్యాలయాలకు రెండు చోట్ల ప్రభుత్వం స్థలం కేటాయించింది. మహబూబ్‌నగర్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19.12 ఎకరాల ప్రభుత్వ భూమిని కేబినెట్ కేటాయించింది. జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మరికొన్ని సంస్థలకు భూములు కేటాయించారు. ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం తెచ్చిన వీబీ–జీ రామ్‌జీ చట్టంలోని నిబంధనలపై మంత్రివర్గం తీవ్రంగా నిరసన తెలిపింది. కూలీలకు ఉపాధి భరోసా కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయొద్దని జనవరిలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయంపై చర్చించింది. మరోసారి తమ నిరసనను కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించింది. వీబీ–జీ రామ్ జీ చట్టం అమలు విషయంలో ఇతర రాష్ట్రాలు ఏ నిర్ణయం తీసుకున్నాయో.. కొత్త చట్టంలో తెచ్చిన మార్పులతో రాష్ట్ర ప్రభుత్వానికి, కూలీలకు ఎలా నష్టం జరుగుతుంది తదితర అంశాలపై అధ్యయనం జరిపి మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై మంత్రివర్గం క్షుణ్ణంగా పరిశీలన జరిపింది. సమాఖ్య స్ఫూర్తి విధానానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపేలా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఉపసంఘం పేర్కొంది. ఇతర రాష్ట్రాలన్నీ కొత్త చట్టానికి ఆమోదం తెలిపాయా? లేదా? అని మంత్రివర్గం ప్రశ్నించగా, అన్ని రాష్ట్రాలూ కొత్త చట్టం అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. -
నీట్, జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో భారీ మార్పులు?!.. కేంద్రం కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో, ఇకపై అడ్మిషన్ల మెరిట్ జాబితాలో క్లాస్ 12 బోర్డు పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ కల్పించాలని కేంద్ర విద్యాశాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇటీవలి కాలంలో పరీక్షల నిర్వహణలో ఎదురైన పేపర్ లీకేజీలు, మూల్యాంకన లోపాలు వంటి తీవ్రమైన వివాదాల నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న పరీక్షా విధానంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం ఎంట్రన్స్ పరీక్షల మార్కులే కాకుండా, బోర్డు పరీక్షల మార్కులకు కూడా సమాన ప్రాధాన్యత లభిస్తుంది. ఎంట్రన్స్ పరీక్షల సిలబస్‌ను పాఠశాల పాఠ్యప్రణాళికకు అనుగుణంగా మార్చడం ద్వారా విద్యార్థులు కోచింగ్ సెంటర్లపై ఆధారపడటాన్ని తగ్గిస్తారు. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. పేపర్ లీకేజీల రిస్క్‌ను పూర్తిగా తగ్గించడానికి, క్రమంగా అడాప్టివ్ ఆన్ డిమాండ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షల వైపు మళ్లనున్నారు.ప్రస్తుత విధానం ప్రకారం, మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తిగా నీట్, జేఈఈ ఎంట్రన్స్ స్కోర్లపైనే ఆధారపడి జరుగుతోంది. బోర్డు పరీక్షలు కేవలం అర్హత సాధించడానికి మాత్రమే పరిమితమయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడానికి,అనధికారిక విద్యాసంస్థల వ్యాప్తిని, కోచింగ్ సంస్కృతిని అరికట్టడానికి విద్యాశాఖ నియమించిన తొమ్మిది మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ ఈ కీలక సిఫార్సులను సిద్ధం చేసింది. ఈ కమిటీ తన తుది నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది. -
అలర్ట్.. వాట్సాప్ కొత్త ఫీచర్ పై కేంద్రం అప్రమత్తం
-
ఎవరు దేశ పౌరులు?
పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన దేశ పౌరసత్వం ఉన్నట్టు కాదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అది కేవలం ప్రయాణానికి సంబంధించిన పత్రమని చెప్పింది. ఇది దేశ ప్రజల్లో అలజడి, ఆందోళనలను రేపింది. దేశ పౌరుడిగా నిరూపించుకోవాలంటే, మరింకేమి పత్రాలు కావాలని ప్రజలు అడుగుతున్నారు.మన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 5–11, ఎవరు దేశ పౌరులో నిర్వచించాయి. రాజ్యాంగం అమలు నాటికి ఎవరు భారత పౌరులో, దేశ విభజన వలన ప్రభావితమైనవారికి కొన్ని షరతులకు లోబడి ఈ దేశ పౌరసత్వం పొందే అర్హతను నిర్వచించింది. భారత పార్ల మెంటుకు దేశ పౌరసత్వంపై చట్టం చేయడానికి ఆర్టికల్ 11 అధికార మిచ్చింది. ఆర్టికల్ 5 ప్రకారం, భారత్‌లో జన్మించినవారు లేక దేశంలో వారి తల్లిదండ్రులు జన్మించినా ఈ దేశ పౌరులే అని తెలిపింది.ఎవరు దేశ పౌరసత్వానికి అర్హులు అన్నది పౌరసత్వ చట్టం– 1955 నిర్దేశించింది. పౌరసత్వ చట్టంలోని 3, 4, 5, 6 సెక్షన్లు పౌర సత్వం ఏ విధంగా లభిస్తుందో నిర్వచించాయి. సెక్షన్ 3 ప్రకారం 1950 జనవరి 26 తరవాత, 1987 మధ్యన భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తికీ; 1987 జూలై 1 తరువాత భారతదేశంలో జన్మించి నవారి తల్లితండ్రులిద్దరూ భారతీయ పౌరులు అయితే లేక తల్లితండ్రుల్లో ఒకరు భారతీయ పౌరులు, మరొకరు అక్రమంగా భారత దేశానికి వలస రాకుంటే వారికీ భారత పౌరసత్వం లభిస్తుంది. సెక్షన్ 4 ప్రకారం, భారతదేశంలో జన్మించకున్నా, తల్లి, తండ్రి ఈ దేశ పౌరులైతే వారికీ పౌరసత్వం లభిస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థి తుల్లో, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, న్యాచుర లైజేషన్ ద్వారా కూడా సెక్షన్ 5, 6 ప్రకారం పౌరసత్వం లభిస్తుంది.పాస్‌పోర్ట్‌కు ఎవరు అర్హులు? పాస్‌పోర్ట్ చట్టం–1967లో పాస్‌పోర్ట్ పొందడానికి ఎవరు అర్హులో పేర్కొనలేదు. అయితే, ఈ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం, పాస్‌పోర్ట్ అధికారి, పాస్‌పోర్ట్ కోసం పెట్టుకున్న దరఖాస్తును కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా తిరస్కరించాలి. దానిలో మొట్టమొద టిగా పేర్కొన్న కారణం, దరఖాస్తుదారు భారత పౌరుడు కాక పోవడం. అంటే చట్ట ప్రకారం భారత పౌరుడు కానివారికి భారత దేశ పాస్‌పోర్ట్ పొందే అర్హత లేదు.మరెందుకు భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదని చెప్తూ బాంబే హైకోర్టు తీర్పును ఉటంకిస్తున్నది? ‘మోతిమియా రహిమియా వర్సెస్ భారత ప్రభుత్వం’ కేసులో తాము భారతదేశంలోనే జన్మించామనీ, దానికి రుజువుగా పాస్‌పోర్ట్‌ను కోర్టులో సాక్ష్యంగా చూపి తమను భారత దేశం నుంచి పంపకుండా ఆదేశాలివ్వాలనీ కోరారు. బాంబే హైకోర్టు వారి వాదనను తోసిపుచ్చుతూ, ‘కేవలం వారిచ్చిన సమాచారంపై ఆధారపడి పాస్‌పోర్ట్‌ను ప్రభుత్వం ఇచ్చింది. కానీ వారుగానీ, వారి తల్లితండ్రులుగానీ ఈ దేశంలోనే జన్మించారని ఎలాంటి ఆధారం చూపలేదు’ అని పేర్కొంది.చట్టం ప్రకారం పాస్‌పోర్ట్ అధికారి, తప్పనిసరిగా దరఖాస్తు దారులు భారత పౌరులని నిర్ధారించుకున్న తరవాతనే పాస్‌పోర్ట్ ఇవ్వడానికి ఆమోదించాలి. పైన చెప్పినట్టుగా, ఎవరు భారత పౌరులో రాజ్యాంగం, పౌరసత్వ చట్టం–1955లో పొందుపరచ బడింది. ఒకవేళ, ఎవరైనా తప్పుడు సమాచారంతో పాస్‌పోర్ట్ పొందినా, సెక్షన్ 10 ప్రకారం దాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వా నికి ఉంది. కాబట్టి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చిన బాంబే హైకోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం ఉటంకించి పాస్‌పోర్ట్ దేశ పౌర సత్వానికి రుజువు కాదని చెప్పడం రాజ్యాంగాన్నీ, చట్టాన్నీ వక్రీకరించడమే.అంటే, కేవలం దరఖాస్తుదారులు ఇచ్చిన సమాచారం ప్రకారం పాస్‌పోర్టులు ఆమోదిస్తూ, దేశ భద్రతను పణంగా పెడుతు న్నారని భావించాలా? అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ... పాస్‌పోర్ట్ దేశ పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం. కాబట్టి, ప్రజలను ఈ విధంగా ప్రభుత్వమే తికమకపెట్టడం దారుణం. గతంలో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్ వంటివి కూడా పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రాలు కావని న్యాయస్థానాలు చెప్పాయి. మరి ఏ పత్రం దేశ పౌర సత్వానికి రుజువో కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – కె.ఎస్. హరీశ్ కుమార్, ఏజీఎం (లా) రిటైర్డ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
మాటలు కోటలు... మారని చర్యలు
నేల అంటే కేవలం మట్టి కాదు. అది జీవం. అది చరిత్ర. అది రైతు జీవనా ధారం. ఈ సత్యాన్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన భారత్ సాయిల్ హెల్త్ పాలసీ– ‘స్వచ్ఛ మిట్టి, సమృద్ధ కిసాన్, సశక్త భారత్’ చదివినప్పుడు మనసులో ద్వైదీభావాలు ఏక కాలంలో కలుగుతాయి. ఒకవైపు ఆశ, మరోవైపు ఆందోళన. మాటలు బాగున్నాయి. కానీ చర్యలకు దారేది?నేల ఏం చెప్తోందంటే...2015లో ప్రారంభమైన సాయిల్ హెల్త్ కార్డ్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా కార్డులు పంపిణీ చేశారు. ఈ గణాంకాలు చిన్న విషయం కాదు. కానీ ఆ కార్డుల్లో వచ్చిన డేటా మనల్నీ, మన వ్యవసాయ పద్ధతులనీ, ప్రభుత్వ విధానాల్నీ కదిలించాల్సింది. కానీ అది జరగలేదు. 89% నేలల్లో నత్రజని లోపం ఉంది. 80% నేలల్లో భాస్వరం తగ్గింది. 49% నేలల్లో జింక్ కరవైంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు సగటున 2.5% ఉన్న సేంద్రియ కార్బన్ నేడు 0.3%కి పడిపోయింది. ఇది నేల చనిపోతున్న పరిస్థితులకు సంకేతం. అయినా పంటల సరళి, వ్యవసాయ పద్ధతులు మారలేదు. యూరియా వాడకం పెరుగుతూనే ఉంది. ఎరువుల సబ్సిడీ కొనసాగుతూనే ఉంది. నేల చెప్పింది వినే తత్వం లేకుండా పోయింది.ఇది డేటా వైఫల్యం కాదు, డేటా నుండి నేర్చుకోవటానికి నిరా కరించిన వ్యవస్థ వైఫల్యం. డేటా మాత్రమే మంచి నిర్ణయాలకు దారితీయదు. ఆ డేటాను అర్థం చేసుకునే జ్ఞానం, దానిపై చర్యలు తీసుకోవాలనే సంకల్పం కూడా అవసరం. కార్డు చేతికిచ్చారు, కానీ దాన్ని అమలుచేసే వ్యవస్థ మారలేదు. డీలర్లు అదే యూరియా అమ్ముతూనే ఉన్నారు. రుణం తీసుకోవాలంటే ఎరువులు కొనాల్సిందే. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా స్థానాలు, సలహా ఇచ్చే విస్తరణ సేవలు అదే పాత పాట పాడుతున్నాయి. ఎక్కువేస్తే ఎక్కువ దిగుబడి భ్రమతెలంగాణాలో హెక్టారుకు 297 కిలోల ఎరువులు వేస్తున్నారు. జాతీయ సగటుకు రెట్టింపు కంటే ఎక్కువ. అయినా ఆ నేలల్లో సేంద్రియ కార్బన్ 0.3 నుంచి 0.8% మాత్రమే ఉంది. 90% నేలలు పోషకాల లోపంతో అల్లాడుతున్నాయి. పంటల దిగుబడి తగ్గి పోతోంది. ఎరువులు పెంచినా, ఎక్కువ మోతాదులో వేసినా దిగు బడి పెరగకుండా తగ్గుతోందని కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్‌లో హెక్టారుకు 277 కిలోల ఎరువులు వాడతారు. పంజాబ్ కంటే కూడా ఎక్కువ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో వరి సాగు ప్రాంతాల్లో మూడు–నాలుగు పోషకాల ఏకకాలిక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ వైరుధ్యం ఇదే. నీటి పారుదల పెరిగింది, ఎరువుల వాడకం పెరిగింది, అయినా దిగుబడులు పెరగలేదు, రైతు రుణభారం తగ్గలేదు, భూములు పాడయ్యాయి.అసలు సమస్య ఎరువుల పరిమాణం కాదు – ఏకపంట వ్యవ సాయం. వరి–వరి లేకపోతే పత్తి. ఏకపంట వ్యవసాయం ఒకే నేల పొరలోని పోషకాలను పంట కాలం తర్వాత పంట కాలం పీల్చేస్తుంది. పంట వైవిధ్యం లేదు. సేంద్రియ పదార్థం తిరిగి నేలకు చేరడం లేదు. దానిపైన ఎక్కువ రసాయనిక ఎరువులు వాడబట్టి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు నాశనమవుతాయి. అవి లేకుండా, ఎంత ఎరువు వేసినా పంటకు అందడం లేదు. అది వృథాగా నీళ్లల్లో కరిగి బయటకు పోతుంది. భూగర్భ జలాలు కలుషితమవుతాయి.‘వెనుకబడ్డ’ రాష్ట్రాలు ఎందుకు ముందున్నాయి?నాగాలాండ్, మిజోరం వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు 5 కిలోల కంటే తక్కువ ఎరువులు వాడతారు. అయినా వాటి నేల ఆరోగ్యం పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల కంటే మెరుగ్గా ఉంది. ఈ నేలలు ‘వెనుకబడ్డవి’ కావు. అవి ఇంకా బతికి ఉన్నాయి. కానీ సాయిల్ హెల్త్ పాలసీ ప్రకటిస్తున్న పీఎం–ప్రణామ్, కార్బన్ క్రెడిట్స్ వంటి పథకాలన్నీ ఎరువులు తగ్గించిన రైతుకు సహకారం అందించే విధానాలు. కానీ ఎప్పుడూ ఎరువులు వాడని, భూమిని కాపాడుకొంటున్న నాగాలాండ్ రైతుకు ఏమి దక్కుతుంది? తగ్గించడానికి అతడి దగ్గర పాత బేస్‌లైన్(ఆధార రేఖ) లేదు కాబట్టి ఏ పథకమూ వర్తించదు. ఈ సాధనాలు చెడ్డ స్థాయి నుండి బయట పడేవారికి బహుమానం ఇస్తాయి; ఆ చెడ్డ స్థాయికి అసలు ఎప్పుడూ వెళ్లని వారికి ఏమీ అందదు. ఇది తీవ్రమైన వైరుధ్యం. పరివర్తన ఆర్థిక వ్యవస్థ వేరు,సంరక్షణ ఆర్థిక వ్యవస్థ వేరు. మంచి నేలలు ఉన్న చోట వాటిని కాపాడే విధానం కావాలి. మారమని ప్రోత్సాహం కాదు. లేకుంటే మార్కెట్ శక్తులు ఆ నేలలను కూడా రసాయన సాగులోకి లాగుతాయి. భారత్ సాయిల్ హెల్త్ పాలసీ పరివర్తన, సంరక్షణ – ఈ రెండు రకాల ఆర్థిక వ్యవస్థలను నిర్మించాలి. మాటలు మారితే చర్యలూ మారాలి!కొత్త పాలసీలో మంచి భావనలున్నాయి. నేలను జాతీయ సంపదగా గుర్తించడం, జీవ సూచికలను పర్యవేక్షించడం, రైతులను నేల సంరక్షకులుగా గౌరవించడం. కానీ ఈ పాలసీ నిజంగా అమలు కావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు.ఎరువుల సబ్సిడీ విధానంలో సంస్కరణలు జరగాలి. రసాయనిక ఎరువులకుగాక నేల సంరక్షణకూ, నేల ఆరోగ్యం కాపాడటానికీ సబ్సిడీలు ఇవ్వాలి. వరి–గోధుమ ఆధిపత్యాన్ని తగ్గించాలి. పప్పు ధాన్యాలు, నూనెగింజలకు మద్దతు ధరలు, కొనుగోలు హామీలు ఇవ్వాలి. రైతు సంస్థలు, ఎఫ్‌పీఓ(ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనై జేషన్)లు కేవలం అమలు యంత్రాంగంగా కాకుండా, జవాబుదారీ తనంలో భాగం కావాలి. పీజీఎస్ (పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్) ధ్రువీకరణ వ్యవస్థలు పాలసీలో భాగం కావాలి. డేటా తయారు చేయడం సులభం. డాష్‌బోర్డులు పెట్టడం ఇంకా సులభం. కానీ డేటా చెప్పింది వినాలంటే, వ్యవస్థ మారాలనే సంకల్పం కావాలి. ఆ సంకల్పమే ఇప్పుడు లేనిది. నేల పరీక్ష చేయించాం. నేల ఏం చెప్తుందో తెలుసు. ఇక మనం ఏం చేస్తామో చూడాలి.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త ‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్టే!.. బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి,ఢిల్లీ: రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక బిల్లును తీసుకురానుంది. అదే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ కొత్త చట్టం ప్రకారం.. ఏదైనా తీవ్రమైన క్రిమినల్ లేదా అవినీతి కేసులో అరెస్టయి, వరుసగా 30 రోజులకు మించి జైల్లో ఉంటే సదరు ప్రజాప్రతినిధి తన పదవిని కోల్పోతారు.రాజకీయాల్లో అవినీతిని అరికట్టేందుకు తెస్తున్న ఈ చట్టం.. దేశ ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ వర్తిస్తుంది. ఈ బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) ఈ సమావేశాల ప్రారంభంలోనే తన నివేదికను సభకు సమర్పించనుంది. జేపీసీ నివేదికను పరిశీలించిన తర్వాత, ఈ బిల్లును ఆమోదం కోసం ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తెస్తుంది. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో, ఇది చట్టంగా మారాలంటే పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం అవుతుందిపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ప్రారంభమై ఆగస్టు 21 వరకు జరగనున్నాయి.కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సమావేశాలకు సంబంధించిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కారణంగా ఆగస్టు 13, 14 తేదీల్లో సభకు సెలవు ఉంటుంది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు పలు కీలక బిల్లులు ఈ సమావేశాల్లోనే చర్చకు రానున్నాయి. -
నిధులిస్తారా లేక నీళ్లు నములుతారా?
దేశంలోని కోట్లాది గ్రామీణ పేదలకు గత రెండు దశాబ్దాలుగా కనీస జీవన భద్రతగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీనరేగా)ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, జూలై 1 నుండి ‘వీబీ జీ రామ్ జీ’ని అమల్లోకి తేవడానికి సంబంధించిన నిబంధనలను రూపొందించింది. 55కు పైగా ప్రధాన క్లాజులు, రూల్స్, వందలాది ఉప నిబంధనలు, కొత్త పరిపాలనా నిర్మాణాలతో రూపొందించిన ఈ వ్యవస్థ ఉపాధి హామీని బలోపేతం చేయడానికి కాదు; దాని హక్కు ఆధారిత స్వభావాన్ని పూర్తిగా బలహీనపరచడానికే ఉద్దేశించబడింది. ఉపాధి హామీ కాదు, నిరుద్యోగ హామీ ఇది. చెట్టును నరికి నీడ ఇస్తామని చెప్పడం ఎంత మోసమో, ‘ఎంజీనరేగా’ను నిర్వీర్యం చేసి 125 రోజుల ఉపాధి హామీ ఇస్తామని చెప్పడం అంతే మోసం. లెక్కలు చెప్పే నిజాలుకేంద్ర ప్రభుత్వం 100 రోజుల బదులు 125 రోజుల ఉపాధి హామీ ఇస్తున్నామని ప్రచారం చేస్తోంది. కానీ ఏ ఉపాధి పథకం అయినా హామీలపై కాదు, నిధులపై నిలబడుతుంది. ఇక్కడే మొదటి వైరుధ్యం కనిపిస్తుంది. 125 రోజుల ఉపాధి కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో కొత్త పథకానికి కేవలం రూ. 95,000 కోట్లను మాత్రమే కేటాయించింది. ఈ కేటాయింపు 125 రోజుల ఉపాధికి ఏమాత్రం సరిపోదని రాష్ట్రాలవారీ పని దినాల గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత సంవత్సరం కేరళలో సగటు పనిదినాలు 57.81, తెలంగాణలో 50.24, తమిళనాడులో 48.54, పశ్చిమ బెంగాల్లో 44.12, ఆంధ్రప్రదేశ్‌లో 42.35 మాత్రమే ఉన్నాయి. బిహార్‌లో 30.94, ఉత్తరప్రదేశ్‌లో 27.50, మధ్యప్రదేశ్‌లో 25.66, మహారాష్ట్రలో 14.40, హరియాణాలో 13.78 రోజులకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం 15 నుంచి 50 రోజుల పని కూడా పూర్తిగా ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం 95 వేల కోట్లతో ఒక్కసారిగా 125 రోజుల ఉపాధి ఎలా కల్పిస్తుంది?ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మినహాయించి 17 ప్రధాన రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే 7 కోట్ల 69 లక్షల 65 వేల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కార్మికులకు 125 రోజుల ఉపాధి హామీని అమలు చేయడానికి మొత్తం రూ. 3.61 లక్షల కోట్ల వ్యయం అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కేటాయింపు ఈ రాష్ట్రాలకు 85,605 కోట్లు మాత్రమే. రాష్ట్రాల 40 శాతం వాటా 57,071 కోట్లు కలిపినా మొత్తం అందుబాటులో ఉండే నిధులు 1.43 లక్షల కోట్లే. ఈ నిధులతో సంవత్సరంలో సగటున 48.5 పని దినాలే ఇవ్వగలరు. కేంద్రం కేటాయించిన నిధులు తప్ప అదనంగా పైసా నిధులు ఇవ్వబోమని రూల్స్‌లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అంటే, ఈ లోటును భర్తీ చేయడానికి రాష్ట్రాలే అదనంగా 2.18 లక్షల కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. అంటే 30 శాతం వాటా కేంద్రం, 70 శాతం వాటా రాష్ట్రాలు ఖర్చు చేయాలి. తెలుగు రాష్ట్రాల తీరుఆంధ్రప్రదేశ్లో 54.99 లక్షల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. కేంద్రం ప్రతిపాదిందిన 7,707 కోట్లతో ఒక్కో కార్డుకు సగటున 71 పనిదినాలు మాత్రమే కల్పించవచ్చు. 125 రోజుల ఉపాధి కల్పించాలంటే 22,746 కోట్లు అవసరం కాగా, రాష్ట్రంపై 15,039 కోట్ల అదనపు భారం పడుతుంది. తెలంగాణలో 30.99 లక్షల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. కేంద్రం కేటాయించిన 3,825 కోట్లతో ఒక్కో కార్డుకు సగటున 62 పనిదినాలు మాత్రమే కల్పించవచ్చు. 125 రోజుల ఉపాధికి 12,819 కోట్లు అవసరం కాగా, రాష్ట్రంపై 8,993 కోట్ల అదనపు భారం పడు తుంది. ఈ లెక్కలు ఒక స్పష్టమైన రాజకీయ సత్యాన్ని బయటపెడు తున్నాయి. హామీ కేంద్రానిది, ప్రచారం కేంద్రానిది, ఖర్చు రాష్ట్రా లది. నియంత్రణ మోదీ గారిది, విఫలమైతే నింద రాష్ట్రాలది. ‘పెళ్లి పెద్దలు చేసుకున్నారు – కట్నం మాత్రం రాష్ట్రాలు పెట్టాలి’ అన్న ట్టుగా ఈ వ్యవస్థ రూపొందుతోంది. ఇక్కడ ఒక పాత సామెత గుర్తుకు వస్తుంది: ‘ఎద్దు ఇస్తానని చెప్పి తాడు చేతిలో పెట్టినట్టు’. రాష్ట్ర ప్రభుత్వలు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం సాధ్యమా? అంతిమంగా నష్టపోయేది ఉపాధి కార్మికులే. పేరు కాదు, తత్వమే మారింది!డ్రాఫ్ట్ రూల్స్‌లోని రూల్ 3 చెల్లింపులు, బ్యాంకు మరియు పోస్టాఫీస్ ఖాతాల ద్వారా వేతనాల చెల్లింపును ప్రస్తావిస్తుంది. కానీ కార్మికుడి హక్కుల రక్షణపై స్పష్టత కనిపించదు. వేతనాలు ఆలస్య మైతే బాధ్యత ఎవరిది? నిరుద్యోగభృతి చెల్లించకపోతే బాధ్యులపై చర్య ఏమిటి? వంటి ప్రశ్నలకు రూల్స్‌లో స్పష్టమైన సమాధానం లేదు. కార్మికుడి హక్కు కేంద్ర బిందువుగా ఉండాల్సిన చోట పరిపా లనా ప్రక్రియ కేంద్ర బిందువుగా మారుతోంది. అత్యంత ప్రమాదకరమైన మార్పు రూల్ 4లో కనిపిస్తుంది. రూల్ 4(2)లోని నార్మటివ్ అలోకేషన్ విధానం ఎంజీ నరేగా అసలు తత్వాన్నే మార్చేస్తోంది. ఎంజీనరేగా ప్రాథమిక సూత్రం ‘పని అడిగితే పని ఇవ్వాలి.’ పని డిమాండ్ ఉంటే ప్రభుత్వం నిధులు సమకూర్చాలి. కానీ కొత్త విధానం పని హక్కును బడ్జెట్ పరిమితికి కట్టిపడేస్తోంది. అంటే ఇప్పుడు నిధులు ఉంటేనే పని. హక్కు నుండి కోటాకు మార్పు. చట్టబద్ధ హామీ నుండి బడ్జెట్ పరిమితికి మార్పు. పౌరుని హక్కు నుండి అధికారుల విచక్షణకు మార్పు. ‘బావి ఎండి పోయాక మోటారు పెంచినట్టు’ 125 రోజుల హామీ ఉంది.ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగించా రన్న ప్రశ్నకూ సమాధానం దొరుకుతుంది. గాంధీ పేరు గ్రామ స్వరాజ్యం, వికేంద్రీకరణ, గ్రామసభల పాత్ర వంటి భావనలకు ప్రతీక. కానీ కొత్త వ్యవస్థలో గ్రామ సభలు బలహీనపడుతున్నాయి. అందుకే ‘ముందు బోర్డు మార్చారు – ఇప్పుడు భవనం కూల్చేస్తున్నారు.’ ఇది పేరు మార్పు కాదు. తత్వ మార్పు. డ్రాఫ్ట్ రూల్స్‌లోని డిజిటల్ నిబంధనలు కూడా ఇదే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ–కేవైసీ, ఫేస్ అథెంటికేషన్, ఎన్ఎంఎన్ఎస్, ఆధార్ అథెంటికేషన్ వంటి విధానాలను ఆధునికీకరణ పేరుతో ప్రవేశపెడుతున్నారు. కానీ గ్రామీణ పేద కార్మికుల అను భవం వేరే కథ చెబుతోంది. నెట్వర్క్ లేకపోతే పని లేదు. వేలి ముద్ర పడకపోతే వేతనం లేదు. అంటే పని హక్కు కార్మికుడి చేతిలో లేదు. సాంకేతిక వ్యవస్థల చేతిలో ఉంది.ఎంజీనరేగా గ్రామీణ కార్మికుడికి కనీస భద్రతను ఇస్తుంది. వేతనాలపై ఒక కనీస ప్రమాణాన్ని సృష్టిస్తుంది. ఆకలి, నిరుద్యో గాన్ని కొంతమేర నియంత్రిస్తుంది. అందుకే దేశంలోని వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, వ్యవసాయ, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు విశాల ఐక్య వేదికలను నిర్మించి ఈ దాడిని తిప్పికొట్టాలి. వీబీ జీ రామ్ జీని ఉపసంహరించాలి. 200 రోజుల చట్టబద్ధ ఉపాధి హామీ కల్పించాలి. పూర్తి కేంద్ర నిధులు విడుదల చేయాలి. గ్రామ సభలు, పంచాయతీల అధికారాలను బలోపేతం చేయాలి.బి. వెంకట్వ్యాసకర్త అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి -
అంబులెన్స్ సేవలకు కొత్త మార్గదర్శకాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అంబులెన్స్ సేవల (ఎన్ఏఎస్)–2026 మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంబులెన్స్ సేవలను ఒకే ప్రమాణాలతో నిర్వహించేందుకు తొలిసారిగా సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సోమవారం ఢిల్లీలో జరిగిన 16వ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ సమావేశంలో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన ఆవిష్కరించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సకాలంలో, సురక్షితమైన, నాణ్యమైన వైద్య రవాణా సేవలు అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని మంత్రి నడ్డా పేర్కొన్నారు. సమన్వయం కోసం ఐసీడీసీలు మార్గదర్శకాల ప్రకారం అన్ని అంబులెన్స్‌లు తప్పనిసరిగా ‘ఏఐఎస్–125’ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అంబులెన్స్‌ల వర్గీకరణ, జనాభా ఆధారంగా వాహనాల కేటాయింపు, సిబ్బంది నియామకాలు, అత్యవసర వైద్య సాంకేతిక నిపుణులకు శిక్షణ, అవసరమైన పరికరాలు, మందులు, వాహనాల నిర్వహణ, నాణ్యత నియంత్రణ, పనితీరు పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వంటి అంశాలకు స్పష్టమైన ప్రమాణాలను ఇందులో నిర్దేశించారు. అత్యవసర సేవల సమన్వయం కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ డిస్పాచ్ సెంటర్లు (ఐసీడీసీలు) ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి సూచించారు. జీపీఎస్ ఆధారిత అంబులెన్స్ ట్రాకింగ్, డిజిటల్ కాల్ మేనేజ్మెంట్, రియల్‌టైమ్ పర్యవేక్షణ వ్యవస్థలను అమలు చేయడంతో పాటు, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అంబులెన్స్ సేవలను ఏకీకృత అత్యవసర హెల్ప్‌లైన్ 112తో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే జీఐఎస్ సాంకేతికత ఆధారంగా ఆసుపత్రులు, రెఫరల్ కేంద్రాలు, ప్రమాద ప్రాంతాలు, అంబులెన్స్ స్టేషన్ల మ్యాపింగ్ చేపట్టి సమీపంలోని తగిన ఆసుపత్రికి రోగులను వేగంగా తరలించే విధంగా సేవలను బలోపేతం చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా అత్యవసర వైద్య సేవలు సమానంగా అందేలా శాస్త్రీయ ప్రణాళికతో అంబులెన్స్‌లను మోహరించాలని సూచించారు. -
భారత్‌కు వస్తున్నారా?.. అయితే ఇది తప్పనిసరి
ఢిల్లీ: భారత్‌కు వచ్చే విదేశీ ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎయిర్ సువిధ 2.0లో హెల్త్ డిక్లరేషన్ తప్పనిసరి చేసింది. ప్రయాణానికి 24 గంటల ముందే వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు 21 రోజుల ట్రావెల్ హిస్టరీ, ఆరోగ్య వివరాలు ఇవ్వాలి. ఇమ్మిగ్రేషన్ కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది.అంతర్జాతీయ ప్రయాణికుల కోసం భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (DIAL) భాగస్వామ్యంతో 'ఎయిర్ సువిధ 2.0 పోర్టల్‌ను కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా ఉంచేందుకు ఈ కాంటాక్ట్‌లెస్ హెల్త్ సెల్ఫ్-డిక్లరేషన్ పోర్టల్‌ను ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. ఇకపై భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరూ ఈ ఫామ్‌ను సమర్పించడం తప్పనిసరి.ఫామ్‌ను ఇలా నింపండి..భారతదేశానికి చేరుకోవడానికి ముందే ఈ ఎయిర్ సువిధ ఫామ్‌ను ఆన్లైన్లో పూర్తి చేయాలి. ఫామ్‌లో నమోదు చేసే వివరాలు మీ ఒరిజినల్ ప్రయాణ పత్రాలతో (పాస్‌పోర్ట్, టికెట్) సరిపోలాలి. విమానాశ్రయంలో వెరిఫికేషన్ కోసం అక్నాలెడ్జ్మెంట్ కాపీని తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.స్టెప్ 1: వ్యక్తిగత, ప్రయాణ వివరాలుమీ పాస్‌పోర్ట్ వివరాలు, జాతీయత గత 21 రోజుల్లో మీరు ప్రయాణించిన దేశాల వివరాలను నమోదు చేయాలి. ముఖ్యంగా ఎబోలా ప్రభావిత దేశాలను సందర్శించారా అనే విషయాన్ని పేర్కొనాలి. వీటితో పాటు మీ ఫ్లైట్ నంబర్, ఇండియాలో మీరు దిగే మొదటి విమానాశ్రయం పేరు, మరియు ట్రాన్సిట్ (కనెక్టింగ్) దేశాల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి.స్టెప్ 2: వివరాలు, వెరిఫికేషన్భారతదేశంలోని మీ నివాస చిరునామా లేదా విదేశీ బస వివరాలు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని నమోదు చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్/ఈమెయిల్‌కు వచ్చే OTP ద్వారా వివరాలను వెరిఫై చేయాలి.స్టెప్ 3: ఆరోగ్య సమాచారం మీరు గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల్లో పర్యటించినట్లు లేదా అక్కడ ఎవరికైనా ఈ వ్యాధి సోకినట్లు డిక్లేర్ చేస్తే మాత్రమే ఈ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఏవైనా లక్షణాలు ఉన్నాయా అనే హెల్త్ సమాచారాన్ని ఖచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది.స్టెప్ 4: రివ్యూ, సబ్మిట్మీరు ఇచ్చిన వివరాలన్నీ చట్టబద్ధంగా సరైనవేనని నిర్ధారించుకుంటూ, మీ వ్యక్తిగత, ఆరోగ్య సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి అంగీకరిస్తూ చెక్‌బాక్స్‌పై టిక్ చేయాలి. అనంతరం ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.ఫామ్ సబ్మిట్ చేసిన అనంతరం..ఫామ్ విజయవంతంగా సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్, అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. అలాగే మీ మెయిల్‌కు కూడా కన్ఫర్మేషన్ వస్తుంది. ప్రయాణికులు ఈ అక్నాలెడ్జ్మెంట్ను డిజిటల్ రూపంలో ప్రింట్ తీసుకుని విమానాశ్రయంలోని హెల్త్ డెస్క్ వద్ద చూపించాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన వివరాల ఆధారంగా ఎయిర్పోర్ట్ పోర్ట్ హెల్త్ ఆఫీసర్ మీకు అవసరమైతే అదనపు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. -
ఆపరేషన్ సిందూర్ వీరుడిగా మురళి నాయక్ కు గుర్తింపు
-
ఖరీఫ్.. బహుపరాక్!
వాన కోసం..వర్షాలు కురవాలని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రం, ఎల్కతుర్తి మండలం సూరారం, కోతులనడుమ, ఆరెపల్లి, కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లిలో శుక్రవారం మహిళలు, గ్రామస్తులు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. డప్పుచప్పుళ్లు, మంగళవాయిద్యాల నడుమ మహిళలు బోనాలు, నీటిబిందెలతో ఊరేగింపుగా తరలివెళ్లారు. గ్రామదేవతలు పోచమ్మ తల్లి, రేణుకాఎల్లమ్మ తల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.– ఎల్కతుర్తి/భీమదేవరపల్లి/కమలాపూర్సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలో వరి సాగు అధికంగా ఉండే జిల్లాల్లో ముందస్తు కార్యాచరణ చేపట్టాలని సూచించింది. గతంలో ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపిన సంవత్సరాల్లో నమోదైన దిగుబడి నష్టాలను విశ్లేషించిన భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) అన్ని రాష్ట్రాలకు జిల్లాల వారీ కంటింజెన్సీ ప్రణాళికలను సిద్ధం చేసింది. మరోవైపు హైదరాబాద్‌లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ (క్రిడా) కూడా ఇప్పటికే తెలంగాణ సహా వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలతో సమీక్షలు నిర్వహిస్తూ రైతులు అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై మార్గదర్శకాలు జారీ చేస్తోంది. గత కరువుల ఆధారంగా విశ్లేషణ ఎల్‌నినో ప్రభావంతో గతంలో ఎక్కువ నష్టం చవిచూసిన జిల్లాలను గుర్తించేందుకు ఐసీఏఆర్ 2002, 2004, 2009 సంవత్సరాల వ్యవసాయ ఉత్పత్తి గణాంకాలను పరిశీలించింది. ఈ మూడేళ్లలో దేశంలో తీవ్రమైన వర్షాభావం నమోదైంది. తెలంగాణలోనూ కరువు ప్రభావం అధికంగా కనిపించింది. సాధారణంతో పోలిస్తే 2002లో 19%, 2004లో 13%, 2009లో 23% లోటు వర్షపాతం నమోదైంది. ఈ ప్రభావంతో 2002లో ఖరీఫ్ ఆహార ధాన్యాల ఉత్పత్తి 22 శాతానికి పైగా తగ్గగా, 2004, 2009లో సుమారు 12 శాతం చొప్పున తగ్గింది. ఈ అధ్యయనం ఆధారంగానే కేంద్రం ముందస్తు కార్యాచరణ సూచనలు జారీ చేసింది. వరి అధికంగా ఉత్పత్తి చేసే జిల్లాల్లో.. దేశంలో ప్రధాన వరి ఉత్పత్తి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ముఖ్యంగా కాళేశ్వరం, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ వంటి సాగునీటి వనరులు పెరిగినా, వర్షాభావ పరిస్థితులు ఎదురైతే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటిపోతాయి. వర్షాలు ఆలస్యమవడం లేదా మధ్యలో దీర్ఘకాల విరామం ఏర్పడితే, అవసరమైన సమయంలో నీరందక వరి పొలాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల కింద ఉండే చివరి ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం రోజుల్లో సైతం నీరు అందక పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు ఉత్తర తెలంగాణలో వరి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని ఐసీఏఆర్ హెచ్చరించింది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగుతో పాటు పశ్చిమ తెలంగాణ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట వంటి ప్రధాన వరి జిల్లాలపై అధిక ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు తేల్చింది. క్రిడా.. కీలక సూచనలు హైదరాబాద్‌లోని క్రిడా రూపొందించిన కంటింజెన్సీ ప్రణాళికల్లో రైతులు అనుసరించాల్సిన పలు కీలక సూచనలు ఉన్నాయి. వర్షాలు ఆలస్యమైతే స్వల్పకాలిక వరి రకాలను ఎంపిక చేయడం, అవసరమైతే మొక్కజొన్న స్థానంలో జొన్న, సజ్జలు, పెసర, మినుములు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం, పుషి్పంచే దశలో రక్షణ నీటి తడులు ఇవ్వడం, ఆకులపై పోషక ద్రావణాలు పిచికారీ చేయడం ఇందులో ఉన్నాయి. గ్రామస్థాయిలో విత్తన నిల్వలు, ఎరువులు ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోవాలని, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి 24 వరకు సాధారణంతో పోలిస్తే సుమారు 42 శాతం వర్షలోటు నమోదైంది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో కేవలం 21 శాతం ప్రాంతాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితి కొనసాగితే ఖరీఫ్ సాగుపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. -
జి రామ్ జి కేటాయింపులు..
విబి–జి రామ్ జి (వికసిత్ భారత్– గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్– గ్రామీణ్) పథకం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.95,692 కోట్ల ప్రతిపాదిత కేటాయింపులను ప్రకటించింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్, ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ పొందాయి. -
కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు.. లిస్టులో ఆర్బీఐ మాజీ గవర్నర్?
సాక్షి, ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే భారీ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జూన్ 28 (ఆదివారం) లేదా జూన్ 29 (సోమవారం) మంత్రివర్గ విస్తరణ, శాఖల పునర్విభజన జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి భవన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.వివరాల ప్రకారం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన తేదీలపై చర్చించినట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సమాచారం అధికారికంగా ధృవీకరించబడలేదు. కాగా, ఈసారి యువత, ముఖ్యంగా జెన్-జీ (Gen Z) ఆశయాలకు అనుగుణంగా కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలనే ఆలోచనలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పనితీరు ఆధారంగా కొంతమంది సీనియర్ మంత్రులను తప్పించి, కొత్త ముఖాలకు అవకాశం కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.మాజీ ఆర్బీఐ గవర్నర్ చాన్స్.. ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు కేంద్ర కేబినెట్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే ప్రస్తుతం ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్‌ను విద్యాశాఖకు మార్చి, ఆర్థిక శాఖకు కొత్త నాయకత్వాన్ని తీసుకురావచ్చని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురిలను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అలాగే, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్‌కు మళ్లీ కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం కొనసాగుతోంది.ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా ప్రాధాన్యం పెంచే దిశగా కసరత్తు జరుగుతోందని సమాచారం. ముఖ్యంగా శివసేన (షిండే వర్గం) నుంచి ఎంపీ శ్రీకాంత్ షిండేకు కేబినెట్ మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే అరుణ్ గోవిల్, విష్ణుదత్ శర్మ, జనార్ధన్ సింగ్ సిగ్రీవాల్ పేర్లు కూడా కొత్త మంత్రుల జాబితాలో బలంగా వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరిని తప్పించే అవకాశం ఉందని, పంజాబ్‌లో రవ్నీత్ సింగ్ బిట్టూ స్థానంలో బీజేపీ నేత తరుణ్ చుగ్‌కు అవకాశం ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది.నితీశ్‌కు అవకాశం.. ఇదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక స్థానం కల్పించే అంశంపైనా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై కూడా అధికారిక స్పష్టత లేదు. ఇక కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ వద్ద ఉన్న ఆరోగ్య శాఖ సహాయ మంత్రి బాధ్యతలను మార్చి, ఆయుష్ శాఖను మాత్రమే కొనసాగించే అవకాశం ఉందని, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వద్ద ఉన్న విద్యుత్ శాఖను మరో మంత్రికి అప్పగించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా, పనితీరు సరిగా లేదనే అభిప్రాయంతో అరడజను మంది కేంద్ర సహాయ మంత్రులను (MoS) మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు కూడా ఉన్నాయని ఢిల్లీ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
పాస్ పోర్ట్ పౌరసత్వం కాదు.. కేంద్రం కీలక ప్రకటన
-
ఇంతకీ...పౌరసత్వానికి గుర్తింపు కార్డు ఏది?
సాక్షి, న్యూఢిల్లీ: భారతప్రభుత్వం జారీచేసిన పాస్‌పోర్ట్ ఉన్నంతమాత్రాన భారతీయ పౌరులు కాబోరని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణతో దుమారం రేగుతోంది. పారసత్వానికి ప్రాతిపదిక కానప్పుడు పాస్‌పోర్ట్ జారీకి అంతటి సంక్లిష్టమైన ప్రక్రియ, పోలీస్ వెరిఫికేషన్ వంటి సుదీర్ఘ వడబోత ప్రక్రియలు ఎందుకు అని తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 14వ ‘పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా గురువారం కేంద్ర విదేశాంగ శాఖ ఇచ్చిన వివరణతో ఈ వివాదం మొదలైంది. ‘‘పాస్‌పోర్ట్ అనేది భారతీయ పౌరసత్వానికి ఏ రకంగానూ గుర్తింపు కాబోదు. కేవలం అంతర్జాతీయ ప్రయాణాలకు వీలు కల్పిస్తూ జారీచేసిన అనుమతి పత్రంగానే పాస్‌పోర్ట్‌ను చూడాలి’’అని కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వ వర్గాలు గురువారం దీనిపై స్పందించాయి. ‘‘పౌరసత్వం నిర్ధారణకు పాస్‌పోర్ట్‌ను ప్రామాణికంగా తీసుకోకూడదు అనే నిర్ణయం నిన్న మొన్న తీసుకున్నది కాదు. మోదీ ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో తీసుకున్నది అసలే కాదు. పాస్‌పోర్ట్ చట్టం, 1967లోని సెక్షన్ ప్రకారం పౌరులుకాని వ్యక్తులకూ పాస్‌పోర్ట్‌లు జారీ చేయవచ్చు. గతంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఏరకంగా చూసినా పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వానికి ఒక రుజువుగా ప్రభుత్వం ఏనాడూ పరిగణించలేదు. ఇప్పటికే పాస్‌పోర్ట్ సంపాదించినంత మాత్రాన వాళ్లకు పౌరసత్వం వచ్చేసిందని భావించకూడదు. పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వానికి రుజువు కాదు అని 2013లో బాంబే హైకోర్టు సైతం గతంలో పలు తీర్పుల్లో స్పష్టంచేసింది’’అని ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఈ వివరణపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ వివరణపై పలువురు ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు. ‘‘భారతీయ పౌరసత్వానికి ఇప్పుడు ఏకైక రుజువు హిందువుగా ఉండటం లేదా బీజేపీ ఓటర్ కావడం మాత్రమే కావచ్చు’’అని అన్నారు. రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ సైతం ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు. ‘‘మరి పౌరత్వానికి ఏ పత్రం రుజువు?’. బూత్ లెవల్ అధికారి(బీఎల్ఓ) నా పౌరసత్వంపై అనుమానాలు వ్యక్తం చేసి నా ఓటు హక్కును కాలరాస్తారేమో’’అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వివరణ అసంబద్ధంగా ఉందని బాలీవుడ్లో ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ విమర్శించారు. ‘‘ప్రభుత్వం చెబుతున్నదంతా నిజమా? అంటే కొందరు వ్యక్తులకు వాళ్లు భారతీయులు అని పూర్తిగా నిర్ధారించుకోకుండానే విదేశాంగ శాఖ పాస్‌పోర్ట్‌లు జారీచేస్తోందా? ఇది నిజంగా అసంబద్ధమైన విషయం’’అని అన్నారు. ఆధార్, ఓటరు కార్డు, పాస్‌పోర్టు ఇవేవీ పౌరసత్వానికి గుర్తింపు కాకపోతే మరి అసలైన గుర్తింపు ఏమిటని నెటిజన్లు కేంద్రప్రభుత్వాన్ని నిలదీశారు. అన్నింటికీ ఆధార్ కార్డును ప్రామాణికం చేసినప్పుడు పౌరసత్వానికి ఎందుకు చేయడం లేదని వాళ్లు ప్రశ్నించారు. గతంలోనూ ప్రభుత్వ వివరణ జనన ధ్రువీకరణ, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పౌరసత్వాన్ని రుజువు చేసే అధికారిక పత్రాలుగా గుర్తిస్తామని గతేడాది కేంద్రం స్పష్టం చేసింది. జనన, మరణ ధ్రువీకరణ చట్టం– 1969 ప్రకారం నిర్ధేశిత అధికారులు మాత్రమే జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలి. ఒక వ్యక్తి నిర్దేశిత రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో నివసించారని నివాస ధ్రువీకరణ పత్రాలు నిర్ధారిస్తాయి. ఇవి మాత్రమే వాళ్లు భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని రుజువు చేస్తాయి. ఈ పత్రాలు లేని వారు తమ పౌరసత్వ నిర్ధారణకు సంబంధిత మున్సిపల్ లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆశ్రయించాల్సి ఉంటుంది కేంద్రం గతంలో స్పష్టంచేయడం తెల్సిందే. ‘‘కేంద్రం ప్రభుత్వం జారీ చేసే ఆధార్ కార్డు సైతం పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం కాదు. ఒక గుర్తింపు పత్రం మాత్రమే’’అని ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే సంబంధ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టంచేయడం తెల్సిందే. 2019 డిసెంబరు 20వ తేదీన కేంద్రప్రభుత్వ విభాగమైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ).. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ), సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ)లకు సంబంధించిన పౌరుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తిచేస్తూ పలు ప్రశ్నలు, వాటికి సమాధానాలను ప్రచురించింది. వీటి ప్రకారం ‘‘పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతానికి సంబంధించిన ఏ పత్రాన్నైనా ఇచ్చి పౌరసత్వాన్ని రుజువు చేసుకోవచ్చు. అయితే ఏ ఏ పత్రాలను అనుమతిస్తారన్న విషయంపై ఆయా శాఖలు నిర్ణయం తీసుకుంటాయి. వ్యక్తుల పౌరసత్వం అనేది 2009 నాటి ‘ద సిటిజన్‌షిప్ రూల్స్’ప్రకారం నిర్ణయిస్తారు. ఈ నిబంధనలు పౌరసత్వ చట్టం, 1955 ఆధారంగా ఉంటాయి.మరి ఈ ఐదింటి సంగతేంటి? అన్ని విద్యా, నివాస ధ్రువీకరణ పత్రా ల జిరాక్స్‌లను జతచేసి, తప్పుల్లేకుండా పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారాలను నింపి పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల వద్ద సంక్లిష్టమైన, సుదీర్ఘ ప్రక్రియను పూర్తిచేసి పోలీస్ వెరిఫికేషన్ సైతం విజయవంతంగా అయిపోయాక సాధించిన పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వ నిరూపణకు అక్కరకు రాదు అని ప్రభుత్వం ఇచ్చిన వివరణపై నెటిజన్లు ప్రభుత్వానికి పలు సూటి ప్రశ్నలు సంధించారు. ఇక్కడి నుంచి వెళ్లిన వ్యక్తులను విదేశీ పోలీసులు, అధికారులు ప్రశ్నించినప్పుడు అక్కరకొచ్చే ఏకైక ధ్రువీకరణ పాస్‌పోర్ట్. అలాంటి పాస్‌పోర్ట్ స్వదేశంలో ఎందుకు జాతీయతకు రుజువుగా పనికిరాదు? అని నిలదీశారు.పౌరసమాజం సంధించిన ఐదుపశ్నలు 1. విదేశీ పౌరసత్వం తీసుకుంటే భారత పాస్‌పోర్ట్ ఎందుకు వెనక్కి ఇచ్చేయాలి? పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం భారతీయులు ద్వంద్వ పౌరసత్వం కల్గిఉండటానికి వీల్లేదు. భారతీయ పౌరులు విదేశీ పౌరసత్వం తీసుకుంటే భారత పాస్‌పోర్ట్‌ను వెంటనే ప్రభుత్వానికి ఇవ్వాలనే నిబంధన ఉంది. ఇవ్వకపోతే పాస్‌పోర్ట్ చట్టం,1967 ప్రకారం శిక్షిస్తారు. పాస్‌పోర్ట్ అనేది కేవలం ప్రయాణపత్రం అయినప్పుడు వెంటనే తిరిగి స్వాధీనంచేయాల్సిన అవసరం ఏంటి? పాస్‌పోర్ట్ అనేది స్వదేశస్తులకు మాత్రమే జారీచేస్తాం అని పాస్‌పోర్ట్ మాన్యువల్‌లో స్పష్టంగా రాసి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇది పౌరసత్వాన్ని ఎందుకు రుజువుచేయదు?2.పోలీస్ వెరిఫికేషన్‌తో పనేంటి? కేవలం ప్రయాణాల కోసమే పాస్‌పోర్ట్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు ప్రయాణాలు చేసే వ్యక్తుల వ్యక్తిగత విషయాలు పోలీసులకు ఎందుకు? ఫలానా వాళ్లకు పాస్‌పోర్ట్ ఇవ్వొచ్చు అని పోలీసులు ఎలా నిర్ధారిస్తారు? వ్యక్తుల నేరచరిత్రకు, సాధారణ ప్రయాణాలకు ఏ రకంగా సంబంధం ఉంది? విదేశీయులకు పాస్‌పోర్ట్ జారీచేసినప్పుడు స్వదేశీయులకు పాస్‌పోర్ట్ జారీచేయడానికి ఎందుకంత కష్టతరమైన పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియను అవలంభిస్తున్నారు? పదేపదే దరఖాస్తులు తిరస్కరిస్తూ పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పుకోవాల్సిన అవసరమేంటి?3. విదేశీయులకు భారత పాస్‌పోర్ట్ ఎందుకు? పాస్‌పోర్ట్ చట్టం, 1967లోని 20వ సెక్షన్ ప్రకారం ప్రత్యేక సందర్భాల్లో గతంలో భారతీయులుకాని వాళ్లకూ పాస్‌పోర్ట్‌లు జారీ అయినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇంత వరకు ఎంత మందికి అలా పాస్‌పోర్ట్‌లు జారీచేశారు? భారతీయులుకాని వాళ్లకు పాస్‌పోర్ట్‌లు ఇచ్చినప్పుడు ఏ ప్రాతిపదికన వాళ్లను అర్హులుగా నిర్ధారించారు? అని సీనియర్ పాత్రికేయుడు వీర్ సంఘ్వీ ప్రశ్నించారు.4. పాస్‌పోర్ట్ మాది అని ప్రభుత్వం ఎందుకంటోంది? ఆధార్, పాన్‌కార్డ్ జారీ చేసినప్పుడు ఇవి మీవే అని ప్రభుత్వం చెబుతోంది. కేవలం పాస్‌పోర్ట్ మాత్రం మాది అని కేంద్రప్రభుత్వం చెప్పడంలో ఆంతర్యమేంటి? ఒకరి పేరిట జారీఅయిన పాస్‌పోర్ట్ ప్రత్యేక పరిస్థితుల్లో రద్దు అయినా, నిషేధానికి గురైనా, ఉపసంహరించుకున్నా అది పూర్తిగా ప్రభుత్వానికే చెందుతుంది అని నిబంధనల్లో రాశారు. పాస్‌పోర్ట్ అనేది కేవలం ప్రయాణపత్రం అయినప్పుడు దానికి ప్రభుత్వం ఎందుకంత ప్రాధాన్యత ఇస్తోంది? ఓవైపు భారత్‌కు ఈ పాస్‌పోర్ట్ అంతర్జాతీయంగా ప్రాతినిథ్యం వహిస్తుందంటూ మరోవైపు దీనిని కేవలం ప్రయాణ డాక్యుమెంట్‌గా పేర్కొనడం ఎందుకు?5. మరి పౌరసత్వ రుజువేంటి? పౌరసత్వాన్ని ఆధార్‌తో రుజువుచేసుకోలేమని సుప్రీంకోర్టు చెబుతోంది. పాస్‌పోర్ట్ అందుకు అర్హమైంది కాదు అని ప్రభుత్వం అంటోంది. మరి ఏ పత్రంతో పౌరసత్వాన్ని నిరూపించుకోవాలి?పౌరసత్వ చట్టం 1955ఏం చెబుతోంది? 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పౌరసత్వ పరిధిని మరింత విస్తృతం చేస్తూ 1955లో ఒక చట్టం చేశారు. ఇది పౌరసత్వ చట్టం 1955గా అమల్లోకి వచ్చింది. భారత పౌరసత్వాన్ని పొందడానికి, రద్దు చేయడానికి షరతులను ఈ చట్టంలో ప్రస్తావించారు. ఐదు విధానాల ద్వారా భారత పౌరసత్వం ప్రసాదించడంపై చట్టంలో స్పష్టమైన వివరణ ఉంది. ‘‘పుట్టుకతో పౌరసత్వం పొందొచ్చు. వంశపారంపర్యంగా వస్తుంది. రిజిస్ట్రేషన్ ద్వారా సాధ్యమే. దీర్ఘకాలం ఇక్కడే ఉంటే దరఖాస్తు చేసుకుని తద్వారా (నేచురలైజేషన్) పొందవచ్చు. ఏదైనా భూభాగం కొత్తగా భారత్‌లో విలీనమైతే ఆ భూభాగంలోని వ్యక్తులకూ భారతపౌరసత్వం వస్తుంది’’అని చట్టం చెబుతోంది. భారత పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 3 పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని గుర్తిస్తుంది. దీని ప్రకారం దేశంలో పుట్టిన వ్యక్తి చట్టబద్ధంగా భారతీయ పౌరుడిగా పరిగణిస్తారు. అయితే ఆ వ్యక్తి.. 1950 జనవరి 26వ తేదీ, 1986 జూలై ఒకటి తేదీల మధ్యలో జన్మించిన వారై ఉండాలి. లేదా 1987 జూలై 1 నుంచి పౌరసత్వ సవరణ చట్టం 2003 అమల్లోకి రాకముందు పుట్టిన వారు లేదా తల్లిదండ్రుల్లో ఒకరు భారతీయులై ఉండాలి. పౌరసత్వ సవరణ చట్టం 2003 అమల్లోకి వచ్చిన రోజున లేదా ఆ తర్వాత భారత్‌లో జన్మించిన వ్యక్తులు, తల్లిదండ్రులు ఇద్దరు లేదా ఒకరు భారతీయ పౌరులైనా అయి ఉండాలి. అయితే రెండో వారు అక్రమంగా వలస వచ్చినవారై ఉండకూడదు అని పౌరసత్వ చట్టం చెబుతోంది. -
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం భారీ ఊరట
దేశంలోని బల్క్, కమర్షియల్ ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా వాణిజ్య గ్యాస్ సరఫరాపై విధించిన అన్ని రకాల తాత్కాలిక ఆంక్షలను కేంద్రం తక్షణమే ఎత్తివేసింది.ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ ఆసియా సంక్షోభానికి ముందు దేశంలో ఏ స్థాయిలో సరఫరా ఉండేదో, ఆ పాత నిబంధనలనే పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ ద్వారా స్పష్టం చేశారు. బల్క్ గ్యాస్ సరఫరా 50 శాతానికి పెంపు ప్యాక్డ్ సిలిండర్లతో పాటు, సంక్షోభం ప్రారంభమైన సమయంలో పూర్తిగా నిలిపివేసిన ‘బల్క్ ఎల్పీజీ’ సరఫరాపై కూడా కేంద్రం సడలింపులు ఇచ్చింది.పాత వినియోగంతో పోలిస్తే పరిశ్రమలకు 50 శాతం మేర బల్క్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని చమురు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, స్టీల్ వంటి భారీ ఇంధన ఆధారిత పరిశ్రమలకు గ్యాస్ కొరత తీరనుంది. -
మాదక ద్రవ్యాలపై కన్నెర్ర
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంలో భాగంగా కేంద్ర ప్రభు త్వం మరిన్ని కఠిన చర్యలకు శ్రీకారం చుడుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈనెల 26న ఢిల్లీలో నార్కో–కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్సీఓఆర్డీ) 10వ అత్యున్నత స్థాయి సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) నిర్వహిస్తున్న ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 44 మంత్రిత్వ శాఖలు, విభాగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, మాదకద్రవ్య నియంత్రణ సంస్థలకు చెందిన 108 మంది ప్రతినిధులు ప్రత్యక్షంగా, వర్చువల్ విధానంలో పాల్గొంటారు. విజన్ డాక్యుమెంట్ విడుదలఎన్సీఓఆర్డీ సమావేశ సందర్భంగా అమిత్ షా ‘నార్కోటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ 2026–2029’ను విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, మాదకద్రవ్య నిరోధక సంస్థలు, ఇతర భాగస్వాములతో విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ పత్రాన్ని రూపొందించారు. మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు, సరఫరా నియంత్రణ, వ్యసన బాధితులకు పునరావాసం వంటి అంశాలకు సంబంధించిన సమగ్ర కార్యా చరణ ప్రణాళికను ఇందులో పొందుపరిచారు. ముఖ్యంగా సింథటిక్ డ్రగ్స్, డార్క్‌నెట్ ద్వారా జరిగే అక్రమ రవాణా, యువతను మాదకద్ర వ్యాలకు దూరంగా ఉంచడం, చికిత్సా, పునరా వాస కేంద్రాల విస్తరణ వంటి అంశాలపై వచ్చే మూడు సంవత్సరాలకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. దేశవ్యాప్తంగా విధాన రూపకల్పన, అమలు, సంస్థాగత బలోపేతానికి ఈ విజన్ డాక్యుమెంట్ మార్గదర్శకంగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా అమిత్ షా ‘ఎన్సీబీ వార్షిక నివేదిక–2025’ను కూడా విడుదల చేయనున్నారు. అలాగే జమ్మూ, గౌహతిలో నూతనంగా నిర్మించిన ఎన్సీబీ జోనల్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. రూ.6 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసందేశవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనకు చేపట్టిన ప్రత్యే క ‘ఆన్లైన్ డ్రగ్ డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్’ను కూడా కేంద్ర హోంమంత్రి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 2,09,500 కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేయనున్నాయి. వీటి అంచనా విలువ 6 వేల కోట్లు అని ప్రభుత్వం తెలిపింది. దేశంలో మాద కద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై ఎన్సీఓఆర్డీ సమావేశంలో సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు, డ్రగ్స్ నియంత్రణ అమలు సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, రాబోయే మూడు సంవత్సరాల కార్యాచరణపై చర్చ జరగనుంది. -
ఇరాన్‌కు వెళ్లొద్దు.. భారత ప్రభుత్వం అడ్వైజరీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌కు సంబంధించిన ప్రయాణ హెచ్చరికలను భారత ప్రభుత్వం మరోసారి సవరించింది. ప్రస్తుతం ఇరాన్లో భద్రతా పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ, భారతీయులు అత్యవసరం కాని ప్రయాణాలను మానుకోవాలని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన తాజా ట్రావెల్ అడ్వైజరీలో ఇరాన్లో పరిస్థితులు గతంతో పోలిస్తే కొంత స్థిరపడుతున్నాయని పేర్కొంది. అయినప్పటికీ భద్రతా పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదని, ఎలాంటి ఆకస్మిక పరిణామాలనైనా తోసిపుచ్చలేమని హెచ్చరించింది. ఇరాన్‌లోని భద్రతా పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాం. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు అత్యవసర ప్రయాణాలు చేయవద్దు. అందువల్ల భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరిగిన ఘర్షణలు, వైమానిక దాడులు, క్షిపణి దాడులు పశ్చిమాసియా ప్రాంతాన్ని తీవ్ర ఉద్రిక్తతల్లోకి నెట్టాయి. ఈ పరిస్థితుల్లో జూన్ 8న భారత ప్రభుత్వం అత్యవసర సూచనలు జారీ చేస్తూ భారతీయులు ఇరాన్‌కు వెళ్లవద్దని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా దేశం విడిచి రావాలని సూచించింది. అయితే తాజా సమీక్షలో పరిస్థితులు కొంత మెరుగుపడినట్లు గుర్తించిన భారత రాయబార కార్యాలయం, గత హెచ్చరికలను పూర్తిగా ఎత్తివేయకుండా జాగ్రత్తతో కూడిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. Advisory issued by Indian Embassy in Tehran:Embassy of India, Tehran, has been closely monitoring the prevailing security situation in the Islamic Republic of Iran. In light of recent positive developments and the improvement in the overall situation, the Embassy wishes to… pic.twitter.com/XkBnyyw8Uq— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 24, 2026ఇరాన్లో ప్రస్తుతం నివసిస్తున్న భారతీయులు స్థానిక భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని, రాయబార కార్యాలయంతో నిరంతర సంబంధాలు కొనసాగించాలని కోరింది. అత్యవసర సహాయం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. కాగా, ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు మరియు ఇతర పౌరుల భద్రతపై భారత ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతోందని అధికారులు తెలిపారు. పరిస్థితుల్లో ఏవైనా మార్పులు చోటుచేసుకుంటే వెంటనే కొత్త సూచనలు జారీ చేస్తామని వెల్లడించారు. -
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు బ్రేక్?
సాక్షి,హైదరాబాద్: మెట్రో రైలు విస్తరణ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. మెట్రో రైల్ విస్తరణపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విధానానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. ఈ తాజా ఒప్పందం ప్రకారం.. ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం చేసే బాధ్యతను ఎస్బీఐ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయించాయి. అయితే, ఈ కొత్త పరిణామంతో గతంలో చర్చల్లో ఉన్న ఐఎఫ్ఆర్సీ రుణం (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్)సీన్ నుంచి పూర్తిగా మాయమవ్వడం గమనార్హం.కేంద్ర ప్రతిపాదనల ప్రకారం మెట్రో ఫేజ్-1కు సంబంధించి మళ్లీ కొత్తగా విలువ నిర్ధారణ (వాల్యుయేషన్) ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ వాల్యుయేషన్ పూర్తయిన తర్వాతే, ప్రాజెక్ట్ స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, తగిన ఆర్థిక సంస్థ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాతే మెట్రో ఫేజ్-2 విస్తరణ, దానికి అయ్యే నిర్మాణ వ్యయం,నిధుల సేకరణ అంశాలపై క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహిస్తారు.ఈ ఎస్బీఐ కన్సల్టెన్సీ అధ్యయన ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రం నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారిని నియమించనున్నారు. వీరిద్దరూ సమన్వయం చేసుకుంటూ కన్సల్టెన్సీకి అవసరమైన వివరాలను అందిస్తారు. ఈ సంస్థ ఇచ్చే తుది నివేదిక ఆధారంగానే హైదరాబాద్ మెట్రో విస్తరణపై భవిష్యత్తు కార్యచరణను ఖరారు చేయనున్నారు. కేంద్రం తెచ్చిన ఈ కొత్త విధానం వల్ల మెట్రో విస్తరణ ప్రక్రియ మళ్లీ మొదటికి రావడమే కాకుండా, పనుల్లో మరింత ఆలస్యం జరిగేలా కనిపిస్తోంది.ఈ ఎస్బీఐ కన్సల్టెన్సీ తన అధ్యయనాన్ని పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందనే గడువుపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టత లేదు. దీంతో మెట్రో ఫేజ్-2 విస్తరణ పనులు ఎప్పుడు పట్టాలెక్కుతాయనే దానిపై సందిగ్ధత నెలకొంది. -
నేడే నీట్ రీఎగ్జామ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో వైద్యవిద్య ప్రవేశాల భవిష్యత్‌ను నిర్ణయించే నీట్–యూజీ 2026 రీ ఎగ్జామ్ ఆదివారం జరగనుంది. గత నెల 3వ తేదీన నిర్వహించిన పరీక్ష.. పేపర్ లీక్, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రద్దు కావడంతో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నేడు నీట్ రీఎగ్జామ్ నిర్వహిస్తోంది. తెలంగాణలో సుమారు 73 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పెన్–పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని 551 నగరాల్లోని 5,440 కేంద్రాలతోపాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ లీక్‌తో రద్దు... ఎన్టీఏపై విమర్శల వెల్లువ గత నెల 3న జరిగిన నీట్‌కు ముందు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. జీవశాస్త్రం, రసాయన శాస్త్రానికి చెందిన అనేక ప్రశ్నలు ముందుగానే సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టినట్టు ఆరోపణలు రావడంతో పరీక్ష సమగ్రత దెబ్బతిన్నదని ఎన్టీఏ నిర్ధారించింది. దీంతో పరీక్షను పూర్తిగా రద్దు చేసి రీఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఎన్టీఏ పరీక్షల నిర్వహణ విధానంపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఈసారి ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు చేపట్టింది. ప్రశ్నపత్రాల తయారీలో పాల్గొనే నిపుణులను రహస్య ప్రదేశాలకు తరలించి డిజిటల్ కమ్యూనికేషన్‌పై పూర్తిగా ఆంక్షలు విధించారు. ప్రశ్నల బ్యాంకును విస్తరించడం, ప్రశ్నపత్ర రూపకల్పనలో ఎక్కువ మంది నిపుణులను భాగస్వామ్యం చేయడం, గోప్యతా నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేశాం : ఎన్టీఏ నీట్ రీఎగ్జామ్ అత్యంత పారదర్శకంగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం వెల్లడించింది. 95,000లకు పైగా పరీక్ష గదుల్లో మొత్తం 1,38,560 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. లైవ్ ఫీడ్లను జాతీయ, ఆయా రాష్ట్ర స్థాయిలో వర్చువల్‌గా పర్యవేక్షిస్తారు. ఎల్రక్టానిక్ అక్రమాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 51,311 జామర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష గదికి ఇద్దరు ఇన్విజిలేటర్లు ఉంటారు. అభ్యర్థుల తనిఖీకి 38,795 మంది సిబ్బందిని, బయోమెట్రిక్ వెరిఫికేషన్‌కు 48,448 మందిని రంగంలోకి దించారు. ఈసారి బయోమెట్రిక్ సిబ్బందిని రెట్టింపు చేయడమే కాకుండా ఫేస్ అథెంటికేషన్ సదుపాయాన్ని కూడా కల్పించారు. సాంకేతిక సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి కేంద్రంలో ఒక సెంటర్ సిస్టమ్స్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారు. పరీక్షా కేంద్రాల్లో సుమారు 6,700 మంది అబ్జర్వర్లు విధుల్లో ఉండగా, 100 మందికి పైగా వర్చువల్ అబ్జర్వర్లు కేంద్ర కార్యాలయం నుంచి నిరంతరం లైవ్ సీసీటీవీ ఫుటేజీని పర్యవేక్షిస్తారు. ఈ ఫుటేజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్‌తో విశ్లేíÙంచి, ఎక్కడైనా తేడాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు, విద్యుత్ బ్యాకప్, వైద్య సదుపాయాలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్ రీ ఎగ్జామ్‌కు ముందు శనివారం దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్ నిర్వహించారు. రాష్ట్రంలో కూడా ఎంపిక చేసిన అన్ని పరీక్ష కేంద్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో భద్రతా వ్యవస్థలు, ప్రశ్నపత్రాల రవాణా, అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియలను పరీక్షించారు. ప్రశ్నపత్రాల భద్రత కోసం జిల్లా యంత్రాంగాలు, పోలీసు బలగాలు, ఎస్కార్ట్ బృందాలు కలిపి రెండు లక్షల మందికి పైగా సిబ్బందిని రంగంలోకి దించారు. పేపర్ లీకేజీలకు సోషల్ మీడియా వేదికలు ఉపయోగించారనే ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. నీట్ రీ ఎగ్జామ్ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఎన్టీఏ ఖండిస్తూ, విద్యార్థులు వదంతులను నమ్మొద్దని సూచించింది. అనుమానాస్పద సమాచారం, నకిలీ పేపర్లపై ఫిర్యాదులకు ప్రత్యేక పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే నీట్ రీ ఎగ్జామ్ ఎన్టీఏ విశ్వసనీయత, దేశంలోని అత్యంత కీలక ప్రవేశ పరీక్షల పారదర్శకతకు అగ్నిపరీక్షగా మారింది. -
టెలిగ్రామ్‌పై నిషేధం సబబే
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ రీ–ఎగ్జామ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. పేపర్ లీకేజీలను నివారించేందుకు జూన్ 22 వరకు యాప్‌ను బ్యాన్ చేస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ టెలిగ్రామ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. జస్టిస్ తేజస్ కరియా సారథ్యంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. టెలిగ్రామ్ యాప్‌లోని సాంకేతిక ఫీచర్ల ద్వారా ఆటోమేటెడ్ బాట్ అకౌంట్లను సష్టించి, ఒకేసారి పెద్ద ఎత్తున సమాచారాన్ని బదిలీ చేసే అవకాశం ఉందన్నారు. ఒక బాట్‌ను బ్లాక్ చేస్తే, దానంతటదే మరో బాట్‌కు సమాచారం బదిలీ అయ్యే (మిర్రర్ ఛానల్) వ్యవస్థ ఇందులో ఉందని వివరించారు. 21న జరిగే నీట్ రీ–ఎగ్జామినేషన్ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ), కేంద్ర ఉన్నత విద్యా శాఖ సిఫార్సుల మేరకే తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు వివరించారు. అయితే, నీట్‌కు సంబంధించి చట్టవిరుద్ధంగా ఉన్న 900 పైగా లింకులను ఏఐ సాంకేతికత ద్వారా ఇప్పటికే తొలగించామని టెలిగ్రామ్ వాదించింది. కొందరు చేసిన తప్పులకు 15 కోట్లకు పైగా ఉన్న సాధారణ యూజర్లను శిక్షించడం వారి హక్కులను హరించడమేనని పేర్కొంది. కేవలం ఒక వర్గానికి చెందిన అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారనే కారణంతో, ఏ సంబంధం లేని 15 కోట్ల మంది సాధారణ యూజర్ల యాప్ వినియోగాన్ని ఎలా నిరోధిస్తారని ఈ సందర్భంగా ధర్మాసనం కేంద్రాన్ని మౌఖికంగా ప్రశ్నించింది. వాదనల అనంతరం టెలిగ్రామ్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ తేజస్ కరియా తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఒక సామాజిక మాధ్యమ వేదికను బ్లాక్ చేసే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు. జరగబోయే నష్టాన్ని నివారించేందుకు కేంద్రం అనుసరించిన విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఉద్యోగులకు కేంద్రం గిఫ్ట్.. క్షణాల్లో PF డబ్బులు విత్ డ్రా
-
ఆ కేంద్రమంత్రి ఎవరో చెప్పండి.. సీఎంకి కిషన్‌రెడ్డి సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. తనపై ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఏనాడూ చేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను తాను అడ్డుకుంటున్నట్టుగా చెప్పిన కేంద్రమంత్రి ఎవరో చెప్పాలని సవాల్ విసిరారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కిషన్‌రెడ్డి ఆపమంటే కేంద్రం ఆపదు ‘మెట్రో ఫేజ్–2 విషయంలో 50:50 నిష్పత్తిలో ముందుకెళ్లేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ కూడా ఈ విషయం రేవంత్‌రెడ్డికి తెలిపారు. మెట్రో ఫేజ్–1కు కేంద్ర ప్రభుత్వం రూ.1,250 కోట్లు అందించింది. ప్రధాని మోదీ స్వయంగా ఆ ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలోని ఇతర నగరాలకు సహకరించినట్లే హైదరాబాద్‌కు కూడా సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం సహకరిస్తుంది. అంతేకానీ కిషన్‌రెడ్డి ఆపమంటే ప్రాజెక్టులు ఆపే సంస్కృతి కేంద్రంలో లేదు. తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకు చిత్తశుద్ధి ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ లేదా రేవంత్‌రెడ్డి సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు. నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటా..’అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డి ఆపారనడం సీఎంకు తగదు ‘మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఐఆర్ఎఫ్సీతో రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 కోట్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిధుల మంజూరును నేను ఆపాననడంలో కూడా వాస్తవం లేదు. దీనిపై కేంద్ర మంత్రి ఖట్టర్‌తో మాట్లాడా. మెట్రోకు వచ్చే ఆదాయం నుంచి ముందుగా ఐఆర్ఎఫ్సీ రుణాలను చెల్లించాలని కేంద్రం కోరుతోంది. కానీ ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదని ఖట్టర్ చెప్పారు. నిజానికి దేశవ్యాప్తంగా ఏ మెట్రో ప్రాజెక్టులోనూ అప్పులను ముందే చెల్లించరు. ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే నిర్వహణ ఖర్చులు పోను మిగిలిన ఆదాయంతో రుణాలు చెల్లించేలా చూస్తేనే మెట్రో మనుగడ సాగిస్తుందని నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఆయన అంగీకరించలేదు. సాంకేతిక, ఆర్థిక అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప, నిధులు ఇవ్వొద్దని కిషన్‌రెడ్డి చెప్పారని ఆరోపించడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదు..’అని కేంద్రమంత్రి ధ్వజమెత్తారు. కేంద్రం నిధుల వెల్లువ.. తెలంగాణ అభివృద్ధికి ఏ వివక్ష లేకుండా కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందని కిషన్‌రెడ్డి వివరించారు. ‘రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.1.75 లక్షల కోట్లు వెచ్చించారు. – రాష్ట్రానికి ఇటీవల 50 ఏళ్ల కాలపరిమితితో రూ.11 వేల కోట్ల వడ్డీ లేని రుణాన్ని కేంద్రం అందించింది. – మూసీ పునరుజ్జీవనం కోసం ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.4,100 కోట్ల రుణం ఇప్పించింది. – జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ద్వారా గత 12 ఏళ్లలో రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల రుణాలు అందాయి. – ఈ ఏడాది రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం కేంద్రం రూ.34 వేల కోట్లను కేటాయించింది. – గతంలో కేసీఆర్ ప్రభుత్వం భూసేకరణకు సహకరించకపోయినా, కేంద్ర నిధులతోనే ఎంఎంటీఎస్ ఫేజ్–2 పూర్తి చేశారు. – కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ ఇండ్రస్టియల్ కారిడార్‌తో పాటు 42 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి..’అని తెలిపారు. నాడు కేసీఆర్.. నేడు రేవంత్ కాలయాపన గతంలో మెట్రో ఫేజ్–1 అలైన్మెంట్ మార్పు పేరుతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు ఏళ్లు కాలయాపన చేశారని, నేడు రేవంత్‌రెడ్డి కూడా ఫేజ్–2 విషయంలో అదే తీరుతో వ్యవహరిస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. మెట్రో ఫేజ్–1 రుణాల విషయం, ఫేజ్–2 ప్రాజెక్టు, ఎన్ఓసీ సాధించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా.. ఆయనతో పాటు వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి సమస్యను పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. -
టెలిగ్రామ్‌పై 22 వరకు ఆంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ– 2026 రీ–ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ కుట్రలను, తప్పుడుసమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై జూన్ 22 వరకు తాత్కాలిక నిషేధం విధించింది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ), కేంద్ర విద్యా శాఖ చేసిన సిఫార్సుల మేరకు ఎల ్రక్టానిక్స్, ఐటీ శాఖ ఈ మేర కు చర్యలను ప్రకటించింది. ఐటీ చట్టం –2000 లోని సెక్షన్ 69ఏ కింద టెలిగ్రామ్ యాక్సెస్‌పై పరిమిత కాలం పాటు ఈ ఆంక్షలు అమలవుతాయి. ఈనెల 21న నీట్ రీ–ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో, పరీక్ష మరుసటి రోజు జూన్ 22 వరకు ఇవి అమల్లో ఉంటాయి. అలాగే, అప్పటికే పోస్ట్ చేసిన మెసేజ్‌లను ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని సైతం జూన్ 30 వరకు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష పూర్తయిన తర్వాత తప్పుడు ఆధారాలతో పేపర్ లీకైనట్లు వచ్చే పుకార్లకు చెక్ పెట్టేందుకే ఈ ఫీచర్‌ను డిసేబుల్ చేసినట్లు ఎన్టీఏ చీఫ్ అభిషేక్ సింగ్ తెలిపారు.పేపర్ లీక్ అయ్యిందంటూ వస్తున్న వార్తల కారణంగా ఈ చర్య తీసుకోలేదని, ఆన్లైన్లో వస్తున్న నకిలీ మెసేజీలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్టీఏ చీఫ్ అభిషేక్ సింగ్ స్పష్టం చేశారు. -
దగ్గు మందు విక్రయాలకు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: దగ్గు మందు సహా పలురకాల సిరప్‌ల నాణ్యత, రోగుల ఆరోగ్య భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలను ప్రకటించింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇలాంటి సిరప్‌లను ఇకపై విక్రయించరాదంటూ కఠిన నిబంధనలను తీసుకు వచ్చింది. ఇందుకు గాను డ్రగ్స్ రూల్స్–1945లో కీలక సవరణలు చేసింది. ఇకపై లైసెన్సు కలిగిన ఔషధ దుకాణాల్లోనే సిరప్‌లను విక్రయించాలంటూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. షెడ్యూల్– కె జాబితాలోని దగ్గు సిరప్ తదితర మందులను ఇప్పటివరకు కొన్ని నిబంధనల నుంచి మినహాయింపు కల్పిస్తూ వెయ్యి లోపు జనాభా ఉన్న గ్రామాల్లోని దుకాణాల్లో విక్రయించేందుకు అనుమతి ఉండేది. తాజాగా, సిరప్ అనే పదాన్ని ఈ మినహాయింపు జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. దీంతో దగ్గు మందులకు ఇకపై మినహాయింపు వర్తించదు. చిన్న గ్రామాల్లోని దగ్గు మందుల విక్రయదారులు, పంపిణీదారులు కూడా ఇకపై ’డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్–1940 నిబంధనలను విధిగా పాటించాలి. దీని ప్రకారం, లైసెన్స్ పొందిన మెడికల్ షాపులు మాత్రమే వీటిని విక్రయించాల్సి ఉంటుంది. సిరప్ రూపంలో ఉండే మందులపై నియంత్రణ పర్యవేక్షణను మరింత కఠినం చేసేందుకు, ప్రజారోగ్య, భద్రతా అవసరాలకు అనుగుణంగా ఈ సవరణ చేసినట్లు పేర్కొంది. -
జిత్తులమారి లెక్కలు.. కూటమి అవినీతి బయటపెట్టిన కేంద్రం
-
జస్ట్ ఒక్క గవర్నమెంట్ జాబ్ కొడితే చాలు అనుకున్నా..! కానీ..
కొందరు సక్సెస్‌కి చిరునామాగా ఉంటారు. చాలామంది ఎంచుకున్న దాంట్లో సక్సెస్ అందుకోవడానికే నానా తంటాలు పడతూ ఉంటే..రాసిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వడం అంటే..మాటలు కాదుకదా..!. అంత అంకితభావంతో, అంతలా ప్రిపేరవ్వడం నిజంగా మాటలు కాదు కదా..!. కానీ ఈ అమ్మాయ్ అలాంటి ఘనతనే సాధించింది.ఆ అమ్మాయే రాయ్‌పూర్‌కి చెందిన చారు పాండే. భారతదేశంలో ప్రభుత్వ నియామకానికి సంబంధించిన ఎన్నో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో ఉత్తీర్ణత సాధించలేక అభ్యర్థులు ఎంతలా ఇబ్బంది పడతుంటారో తెలిసిందే. అలాంటిది..అంత కఠినతరమైన ప్రభుత్వ నియమాక పరీక్షలన్నీ సులభంగా చేధించేసిందామె ఆమె. ఒకటి, రెండు కాదు ఏకంగా 19 సెంట్రల్ గవర్నెమెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వడం విశేషం. జస్ట్ 23 ఏళ్ల వయసుకే ఈ ఘనతను సాధించిన అమ్మాయిగా రికార్డు సృష్టించి..వార్తల్లో నిలిచింది. ఆమె రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలు, ఎస్బీఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ వంటి అనేక పరీక్షల్లో రాసింది. ఆమె చేసిన నిరంతర ప్రయత్నాలు చివరకు ఫలించి ఏకంగా 19 కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి దారితీసింది. ఈ మేరకు చారు పాండే మాట్లాడుతూ..19 కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినందుకు తన కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. నిజం చెప్పాలంటే ఇన్ని పరీక్షలు రాస్తానని అస్సలు అనుకోలేదని చెబుతోంది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా సంపాదించగలిగితే చాలు అనుకున్నా..కానీ ఏకంగా ఇన్ని పరీక్షల్లో విజయవంతమయ్యా అంటూ సంతోషంగా చెప్పుకొచ్చింది. తన గణిత నేపథ్యం కారణంగా తన పేరెంట్స్ టీచర్ లేదా లెక్చరర్ రంగంలోకి వెళ్లాలని ఆశించారు. ఈ నేపథ్యంలోనే ఇలా పోటీ పరీక్షలపై దృష్టి పెట్టానని చెప్పుకొచ్చింది. అయితే నెటిజన్లు కొందరు ఆమె పట్టుదలపి, కృషిని ప్రశంసించగా, మరికొందరు ఇన్ని రాసిందంటే..ఆమెకు ఎందులోనూ సరైన అభిరుచి లేదు..పైగా ఆ రంగంలోని వాళ్ల రిజర్వేషన్ ఈమె కారణంగా కోల్పోతేందంటూ మండిపడుతూ పోస్టులు పెట్టారు.#WATCH | Raipur, Chhattisgarh: Charu Pandey, starting her journey at 23 with the dream of a government job, has inspired lakhs of young aspirants by clearing 19 competitive exams, says, "... My family is very happy with this achievement of mine. I am receiving an award for… pic.twitter.com/Zo21tNMxPs— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 12, 2026 (చదవండి: కలలు కల్లలైనా..అతడు చూపిన చొరవకు సెల్యూట్!) -
టీవీ చానళ్లలో అర గంట, రేడియోలో గంట
న్యూఢిల్లీ: టీవీ, రేడియో ప్రసార సేవల కోసం ఒకే నియంత్రణ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ద్వారా జాతీయ, సామాజిక ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కార్యక్రమాలను ప్రసారం చేయాల్సిన బాధ్యత టీవీ చానళ్ల నుంచి రేడియో సేవలకు కూడా విస్తరించింది. ఈ మేరకు ‘టెలికమ్యూనికేషన్స్(టీవీ, రేడియో, సంబంధిత సేవలు) రూల్స్–2026’ముసాయిదాను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం బహిర్గతం చేసింది. టీవీ చానళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య జాతీయ, సామాజిక సంబంధిత అంశాలపై కనీసం 30 నిమిషాల పాటు కార్యక్రమాలను ప్రసారం చేయాల్సి ఉండగా, రేడియో స్టేషన్లు ప్రతిరోజూ ఒక గంట సమయాన్ని దీనికి కేటాయించాల్సి ఉంటుందని ముసాయిదాలో స్పష్టంచేసింది. నాలుగేళ్ల క్రితం విడుదల చేసిన ‘భారతదేశంలో టెలివిజన్ చానళ్ల అప్లింకింగ్, డౌన్‌లింకింగ్ మార్గదర్శకాలు–2022’ప్రకారం.. టీవీలో ఇటువంటి కంటెంట్‌ను ప్రసారం చేయడం తప్పనిసరి చేసినప్పటికీ, సమయాన్ని కచ్చితంగా పేర్కొనలేదు. దానిపై స్పష్టత ఇస్తూ ముసాయిదా రూపొందించారు. అలాగే, ఎఫ్ఎం పాలసీ మూడో దశ ప్రకారం.. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు అనుగుణంగా ప్రతిరోజూ ఒక గంట పాటు ప్రజాప్రయోజన ప్రకటనలను ప్రసారం చేయాల్సిన బాధ్యత ప్రైవేట్ రేడియో స్టేషన్లపై ఉంది. ప్రజా ప్రయోజన ప్రకటనల గురించి కేంద్రం స్పష్టమైననిర్వచనాన్ని ఈ ముసాయిదాలో ఇచ్చింది. ప్రతి అధీకృత ప్రైవేట్ రేడియో సర్వీసు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే విధంగా, జాతీయ ప్రాముఖ్యత, సామాజిక ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలను రోజుకు కనీసం ఒక గంట పాటు ప్రసారం చేయాలి అని వెల్లడించింది. అంతేకాకుండా, ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం.. టీవీ చానళ్లు ప్రజా సేవా కార్యక్రమాలను ప్రసారం చేయొచ్చు. ఇకపై దీనిని తప్పనిసరి చేస్తూ ముసాయిదాలో నిబంధన చేర్చారు. విద్య, అక్షరాస్యత వ్యాప్తి; వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి; ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం; శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం; మహిళా సంక్షేమం; సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం; పర్యావరణ, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ; జాతీయ సమైక్యతలను ముసాయిదాలో కూడా కొనసాగించారు. నిబంధనలను పాటించడం సాధ్యం కాని కొన్ని వర్గాలకు మినహాయింపు ఉంటుందని ఆ ముసాయిదా పేర్కొంది. దీనిపై సలహాలు సూచనలు ఇవ్వాలని, అభ్యంతరాల ఉంటే తెలియజేయాలని ప్రజలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కోరింది. -
వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్ బంకులకు కేంద్రం కొత్త ఆదేశాలు
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా, నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ మళ్లింపులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ‘మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ (టెంపరరీ రెగ్యులేషన్ ఆఫ్ సప్లై త్రూ రిటైల్ అవుట్‌లెట్స్) ఆర్డర్–2026’ను జారీ చేసింది.కొత్త నిబంధనల ప్రకారం వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు ఇకపై సాధారణ రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేయరాదు. వారు తమ అవసరాలను సొంత వినియోగ పంపుల ద్వారానే తీర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే పెట్రోల్ బంకులు డీజిల్‌ను కేవలం వాహనాల ట్యాంకుల్లో లేదా PESO (Petroleum and Explosives Safety Organisation) అనుమతించిన కంటైనర్లలో మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అలాగే, ఒక వినియోగదారుడు లేదా ఒక వాహనానికి రోజుకు 200 లీటర్లకు మించి డీజిల్ విక్రయించరాదని కేంద్రం స్పష్టం చేసింది. కొనుగోలు చేసిన డీజిల్‌ను తిరిగి విక్రయించడం కూడా పూర్తిగా నిషేధించింది.ఈ ఆంక్షలు ప్రారంభ దశలో గరిష్ఠంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటాయి. పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం మరో ఉత్తర్వు ద్వారా ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది. నిబంధనల అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాలు ప్రత్యేక నిఘా పెట్టాలని కేంద్రం ఆదేశించింది. నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ కొనుగోళ్లు, ఇంధన మళ్లింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిత్యవసర వస్తువుల చట్టం–1955 (Essential Commodities Act, 1955) కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. -
కేంద్ర నివేదికతో చంద్రబాబు అవినీతి బట్టబయలు..!
-
భారత్‌లోనే చౌకగా వంటగ్యాస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లోనే వంటగ్యాస్(ఎల్పీజీ) ధరలు ∙తక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతోపాటు పొరుగు దేశాల కంటే మన దగ్గరే గ్యాస్ సిలిండర్ ధర చాలా చౌకగా ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు ఫిబ్రవరి నుండి జూన్ నాటికి సుమారు 46 శాతం పెరిగాయి. దీంతో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ సరఫరా వ్యయం రూ.1,600 దాటింది. అయినప్పటికీ అంతర్జాతీయ ధరల భారాన్ని సామాన్య వినియోగదారులపై మోపకుండా తామే భరిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ కోసం సాధారణ వినియోగదారుడు రూ.942 చెల్లిస్తుండగా, ప్రభుత్వం ప్రతి సిలిండర్‌పై దాదాపు రూ.700 నష్టాన్ని భరిస్తున్నట్లు పేర్కొంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాలు గతేడాది రూ.60,000 కోట్లకు చేరగా, రూ.30,000 కోట్ల పరిహారం చెల్లించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) కింద దేశంలో 10.58 కోట్లకు పైగా వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి మొదటి నాలుగు సిలిండర్లపై ఒక్కో సిలిండర్‌కు రూ.300 చొప్పున (ఏడాదికి రూ.1,200) చెల్లిస్తోంది. దీనివల్ల ఉజ్వల వినియోగదారులకు సిలిండర్ కేవలం రూ.642కే లభిస్తోంది. ఇది అంతర్జాతీయ మార్కెట్ ధర కంటే దాదాపు 60 శాతం తక్కువ అని కేంద్రం పేర్కొంది. దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని 32 టీఎంటీల నుండి 52 టీఎంటీలకు 60 శాతం పైగా) పెంచింది. అల్జీరియా వంటి ప్రత్యామ్నాయ దేశాల నుండి ఎల్పీజీని దిగుమతి చేసుకుని దేశంలో ఎక్కడా వంటగ్యాస్ కొరత రాకుండా చర్యలు తీసుకున్నట్లు కేంద్రం గుర్తుచేసింది. -
మళ్లీ వంటింట్లో మంట.. మరోసారి పెరిగిన గ్యాస్ ధరలు
-
సాగుకు ఊతం.. రైతుకు భరోసా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గడచిన పుష్కర కాలంలో దేశ వ్యవసాయ రంగం రూపురేఖలు మారిపోయాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేవలం రాయితీలు, సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా.. సాగును లాభసాటిగా మార్చే దిశగా కేంద్ర విధానాలు అమలయ్యాయని పేర్కొంది. బడ్జెట్ కేటాయింపుల పెంపు నుంచి మొదలుపెట్టి కనీస మద్దతు ధరల (ఎంఎస్పీ) సవరణ, మౌలిక వసతుల కల్పన, డిజిటల్ టెక్నాలజీ జోడింపు వరకు ప్రతి అడుగూ ఉత్పాదకతను పెంచేలా పడ్డాయని.... ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం రికార్డులు సృష్టిస్తోందని కేంద్రం తెలిపింది. 2014 నుంచి 2026 వరకు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వచ్చిన మార్పులు, సాధించిన ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సమగ్ర నివేదిక విడుదల చేసింది. రెట్టింపైన వ్యవసాయ ఆదాయం గత పన్నెండేళ్లలో సాగు రంగానికి నిరంతర విధానపరమైన మద్దతు లభించింది. దీంతో మొత్తం స్థూల విలువ ఆధారిత (జీవీఏ)లో ఈ రంగం వాటా 18 శాతానికి చేరింది. 2014–15లో రూ.20.9 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ జీవీఏ.. 2023–24 నాటికి ఏకంగా రూ.48.7 లక్షల కోట్లకు పెరిగింది. పంటల విభాగం జీవీఏ సైతం రూ.12.92 లక్షల కోట్ల నుంచి రూ.26.52 లక్షల కోట్లకు చేరింది. 2013–14లో కేవలం రూ.27,663 కోట్లుగా ఉన్న వ్యవసాయ శాఖ బడ్జెట్ 2026–27 నాటికి రూ.1.40 లక్షల కోట్లకు చేరడం ఈ రంగం ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. సిరులు పండిస్తున్న నేలఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం సరికొత్త రికార్డులు నమోదు చేసింది. 2013–14లో 26.50 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి కాగా, 2024–25 నాటికి ఈ రికార్డు 35.77 కోట్ల టన్నులకు చేరింది. వరి ఉత్పత్తి 42 శాతం పెరిగి 15.01 కోట్ల టన్నులకు చేరుకోగా, ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ నిలిచింది. గోధుమలు 11.79 కోట్ల టన్నులు, మొక్కజొన్న 4.34 కోట్ల టన్నులు, నూనెగింజలు 4.29 కోట్ల టన్నుల మేర ఉత్పత్తి సాధించాయి. ఉద్యానవన రంగం సైతం 36.90 కోట్ల టన్నుల ఉత్పత్తితో వ్యవసాయ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. గిట్టుబాటుకు గ్యారెంటీపంటల ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం అదనంగా ఉండేలా ఎంఎస్పీని నిర్ణయిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2014–2026 మధ్య కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రభుత్వ సేకరణ 76 శాతం పెరిగి 122.92 కోట్ల టన్నులకు చేరింది. ఈ పుష్కర కాలంలో రైతులకు దక్కిన ఎంఎస్పీ విలువ రూ.26.32 లక్షల కోట్లు. 2014–15తో పోలిస్తే 2026–27 సీజన్‌కు రాగుల మద్దతు ధర అత్యధికంగా 236 శాతం పెరిగింది. వరి (సాధారణ రకం) మద్దతు ధర రూ.1,360 నుంచి రూ.2,441కి చేరింది. పత్తి రూ.3,750 నుంచి రూ.8,267కి చేరగా.. పప్పుదినుసులు, నూనె గింజల ధరల్లోనూ భారీ పెరుగుదల నమోదైంది.పెరిగిన రుణ లభ్యత రైతులకు సకాలంలో రుణాలు అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డుల (కేసీసీ) ఖాతాలను 7.81 కోట్లకు పెంచారు. వ్యవసాయ రంగానికి సంస్థాగత రుణాలు 2013–14లో రూ.7.30 లక్షల కోట్లు ఉండగా, 2024–25 నాటికి ఈ మొత్తం రూ.28.67 లక్షల కోట్లకు చేరింది. ఫార్మ్ గేట్ వద్ద మౌలిక వసతుల కల్పనకు ఏఐఎఫ్ (వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి) కింద రూ.84,202 కోట్ల రుణాలను మంజూరు చేశారు. ఈ–నామ్ వేదికగా 1,656 మార్కెట్లను అనుసంధానించారు. మట్టి నాణ్యతను ధ్రువీకరించేందుకు ఇప్పటివరకు 26 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులను జారీ చేశారు. పీఎం కుసుమ్ ద్వారా 21.77 లక్షల మంది రైతులకు సౌర పంపుసెట్లను అందించారు.లాభసాటిగా అనుబంధ రంగాలు సాంకేతికత జోడింపుతో వ్యవసాయం ఆధునికతను సంతరించుకుంటోంది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద 7.63 కోట్ల మంది రైతులకు ప్రత్యేక ఐడీలు సృష్టించారు. 23.5 కోట్ల పంట భూములను డిజిటైజ్ చేశారు. నమో డ్రోన్ దీదీ కింద వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయంతో పాటు పాడి, మత్స్య రంగాలు రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారాయి. పాల ఉత్పత్తి 2024–25 నాటికి 247.87 మిలియన్ టన్నులకు చేరింది. మత్స్య సంపద ఉత్పత్తి 19.78 మిలియన్ టన్నులకు చేరుకుంది. వ్యవసాయ, ప్రొసెస్డ్ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగి 51.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక పేర్కొంది. పెట్టుబడికి సాయం.. పంటకు రక్షణ.. రైతులకు పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఏటా రూ.6,000 చొప్పున అందిస్తున్నారు. ఇప్పటివరకు 22 విడతల్లో 9.44 కోట్ల కుటుంబాలకు రూ.4.28 లక్షల కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులను ఆదుకునేందుకు పీఎం ఫసల్ బీమా యోజన అండగా నిలుస్తోంది. ఏటా 4 కోట్ల మంది రైతులు పంటల బీమా చేయించుకుంటున్నారు. 2016 నుంచి డిసెంబర్ 2025 వరకు 24.31 కోట్ల మంది రైతులకు రూ.1.96 లక్షల కోట్ల మేర పరిహారం మంజూరైంది. -
రక్షణ కోసం కాదు.. ఆ ఒక్కరి కోసమే
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. రక్షణ అవసరాలు, షిప్పింగ్ కోసమంటూ కేంద్రం చెబుతున్నదంతా వంటి అబద్ధమన్నారు. దేశంలోనే అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంలో పర్యావరణానికి తీవ్రంగా హానికలిగిస్తూ హోటళ్లు, క్యాసినోలు నిర్మించుకోవడానికి.. కేవలం ఒకే ఒక్క వ్యాపారవేత్తకు ప్రయోజనం చేకూర్చడానికే ఈ ప్రాజెక్ట్ తెచ్చారని ఆయన ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళం వినిపించాలని, ‘వుయ్ చూజ్ గ్రీన్ ఓవర్ గ్రీడ్’అనే పిటిషన్‌పై సంతకం చేయాలని ప్రజలను రాహుల్ కోరారు. ఏప్రిల్‌లో అండమాన్ నికోబార్ దీవుల సందర్శనకు వెళ్లిన సందర్భంగా చిత్రించిన 15 నిమిషాల వీడియోను ఆయన ఎక్స్‌లో విడుదల చేశారు. ‘మోదీ మీకు చూపించకూడదని అనుకుంటున్నది ఇదే’అనే శీర్షికతో ఉన్న వీడియోలో.. రాహుల్ గాంధీ సముద్రపు నీళ్లలోకి వెళ్లడం, అక్కడి స్థానికులతో, గిరిజన ప్రతినిధులతో మాట్లాడటంఉన్నాయి. ‘ఇక్కడున్న వేలాది చెట్లను నరికేసి, వాటిని అక్రమంగా తరలించి, కోట్ల డాలర్లు సంపాదించడమే వీరి ప్లాన్. ఆ డబ్బుతో మీ హోటళ్లు, మీ క్యాసినోలు, మీ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడమే ఇక్కడ జరుగుతున్న అసలు తంతు. అదే వీరి ప్లాన్’అని ఆ వీడియోలో పేర్కొన్నారు. ‘ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా దేశంలోని యువతను ప్రతి ఒక్కరినీ ఓ ప్రశ్న అడుగుతున్నా.. మీకు ఎలాంటి భారత్ కావాలనుకుంటున్నారు? కేసినోల కోసం సతత హరిత అరణ్యాలను నేలమట్టం చేసిన, మ్యాపుల్లోంచి పగడపు దీవులు లేకుండా చేసిన, గిరిజన ప్రజలను వారి భూముల నుంచి తొలగించిన, మనం పీల్చే గాలిని విషతుల్యం చేసిన భారతదేశాన్నా లేక మన సహజ సంస్కృతిని కాపాడుకుని, మన గిరిజన వర్గాలను సంరక్షించుకునే, అభివృద్ధితో కలిసి ఉండే ప్రకృతినా’అని ఆయన ప్రశ్నించారు. -
ఆకాంక్షది మోదీ మార్కు వ్యవస్థీకృత హత్య
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ అభ్యర్థిని బలవన్మరణంపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేపదే జరుగుతున్న ప్రతిష్టాత్మక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతాలతో విద్యార్థుల భవిష్యత్ కలలు చెదిరిపోతున్నాయని రాహుల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నపత్రాలు లీకేజీలు, నీట్ పరీక్ష నిర్వహణలో అసమర్థ వార్తలతో తీవ్రంగా కలతచెంది మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాకు చెందిన ఆకాంక్ష చతుర్వేది అనే అభ్యరి్థని నాగ్‌పుర్‌లో బలవన్మరణానికి పాల్పడినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఆత్మహత్య ఘటనపై రాహుల్ గురువారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఆకాంక్ష వైద్యవిద్య పూర్తిచేసి డాక్టర్‌గా రాణించి, సమాజానికి సేవ చేయాలని ఎంతో ఆశపడింది. ఆమె తండ్రి ఓ సాధారణ రైతు. కుమార్తె కలను నిజం చేయడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.3,00,000 అప్పు తీసుకున్నారు. నాగ్‌పుర్‌లో ఆమె కోచింగ్ క్లాస్‌లకు వెళ్లడానికి వీలుగా తండ్రి వంటమనిషిగా ఉద్యోగం చేశారు. ఓ తండ్రిగా ఆయన చేయగలిగినదంతా చేశారు, కానీ నీట్ పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దయింది. దానిని తట్టుకోలేక ఆకాంక్ష బలవన్మరణానికి పాల్పడింది. ఆకాంక్ష మరణం కేవలం బలవన్మరణం కాదు. అది ప్రధాని మోదీ హయాంలో అవినీతి, చిన్నాభిన్నమైన విద్యావ్యవస్థ ఇచ్చిన బహుమతి. ఇక ధర్మేంద్ర ప్రధాన్. ఆయన ఇప్పటికీ అదే కురీ్చలో ఉన్నారు. అవే పాత కమిటీలు, బదిలీలు, విచారణలు. సంస్కరణలు లేవు. న్యాయమూ లేదు. మోదీజీ.. అధికార పీఠం శాశ్వతం కాదు. అది వస్తుంటుంది, పోతుంటుంది’’అని రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. -
నిధుల 'బాట'.. ఖర్చుపై కొట్లాట
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల (ఎన్ హెచ్–63), జగిత్యాల–కరీంనగర్ (ఎన్‌హెచ్–563) జాతీయ రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించే భారీ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తం 190.76 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఈ రహదారుల విస్తరణ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.7,597.16 కోట్లను కేటాయించింది. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల మీదుగా వెళ్లే ఈ రహదారుల విస్తరణతో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రద్దీని నివారించేందుకు ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్తగా బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు. అంక్సాపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట, మంచిర్యాల, పోతారం, గంగాధర తదితర ప్రాంతాల్లో బైపాస్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఓపెన్ టోలింగ్ విధానం(టోల్‌బూత్‌ల వద్ద వాహనాలు ఆగకుండా, నేరుగా హైవే వేగంతో ప్రయాణించడానికి అనుమతించే ఆధునిక ఎలక్ట్రానిక్ వ్యవస్థ)తో వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ నాలుగు లేన్ల మార్గాన్ని డిజైన్ చేశారు. రహదారుల విస్తరణ పూర్తయితే ఆర్మూర్ నుంచి మంచిర్యాల మధ్య సుమారు గంటన్నర ప్రయాణ సమయం ఆదా కానుంది. జగిత్యాల నుంచి కరీంనగర్ మధ్య 45 నిమిషాల ప్రయాణ సమయం కలసిరానుంది. ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలకు సురక్షితమైన, వేగవంతమైన కనెక్టివిటీ లభించనుంది.సాక్షి, హైదరాబాద్: భూసేకరణ ఖర్చు అంటేనే రాష్ట్ర ప్రభుత్వం బెంబేలెత్తాల్సి వస్తోంది. భూసేకరణ ప్రక్రియే చాలా క్లిష్టమైంది కావటంతో దాన్ని కొలిక్కి తేవటం పెద్ద సవాలుగా ఉంటే, దాని వ్యయాన్ని భరించాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం–రైల్వే మధ్య రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు వివాదం నెలకొంటోంది. రీజినల్ రింగురోడ్డుకు అనుసంధానంగా రింగు రైలు ప్రాజెక్టును చేపట్టాలని రైల్వే శాఖ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మతించటంతో ఆ ప్రాజెక్టు ముందడుగేసింది. ఇక్కడే ఇప్పుడు పేచీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. భూసేకరణకు సంబంధించి ఇప్పుడు కసరత్తు ప్రారంభించాల్సి ఉంది. దీంతో భూసేకరణ బాధ్యత మీదంటే మీదే అన్నది తెరమీదకు వస్తోంది. రీజినల్ రింగురోడ్డును ఆనుకొని రైల్వే లైన్ నిర్మించాలన్నది ఆలోచన. ఇప్పటికే రీజినల్ రింగురోడ్డుకు 100 మీటర్ల వెడల్పుతో ఉత్తర భాగానికి అలైన్మెంట్ ఖరారైంది. దక్షిణ భాగానికి ఇంకా కొలిక్కి రాలేదు. ఉత్తర భాగానికి అనుమతి ఇచ్చే సమయంలో, ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా రోడ్డును 90 మీటర్ల వెడల్పునకే పరిమితం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ మిగిలిన 10 మీటర్ల వెడల్పు భాగానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని సూచించింది. అప్పుడు ఆ పది మీటర్ల వెడల్పు భాగానికి పూర్తి భూసేకరణ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. దీంతో దీన్ని తీసుకోవాలా వద్దా అని తటపటాయిస్తున్న తరుణంలో, రింగు రైలు భూసేకరణ అంశం తెరమీదకు వచ్చింది. రింగురైలుకు అవసరమైన 35 మీటర్లు/ 40 మీటర్ల వెడల్పుతో ఉండే అలైన్మెంట్ భూసేకరణ వ్యయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని రైల్వే శాఖ పేర్కొంటోంది. అలా కాదు, మొత్తం భూసేకరణ వ్యయాన్ని రైల్వేనే భరించాలని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ నెలాఖరుకు డీపీఆర్ సిద్ధమవుతున్నందున, దీనిపై ఓ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం–రైల్వే మధ్య పేచీకి కారణమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ‘రింగు’కు ఆనుకునా.. దూరంగానా..రీజినల్ రింగురోడ్డును ఆనుకునే రింగు రైలు ప్రాజెక్టుకు భూసేకరణ చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం–ఎన్హెచ్ఏఐ–రైల్వే సంయుక్త సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించారు. కానీ, ఇప్పుడు దానిమీద మళ్లీ పునరాలోచించాలని భావిస్తున్నారు. రింగురోడ్డు మలుపులు–రైల్వే లైను మలుపులు–గ్రేడియంట్లో చాలా తేడా ఉంటుంది. రైల్వేలైన్ క్రాసింగ్ రెండు కి.మీ. ముందునుంచే మొదలవుతుంది. దీంతో రోడ్డు–రైలు లైను మధ్య సమన్వయం సాధ్యం కాదు. సాంకేతికంగా సమస్యలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో దూరదూరంగానే నిర్మించాల్సి ఉంటుందన్న నిపుణుల సూచన మేరకు అలైన్మెంట్లో మార్పుచేర్పుల అంశాన్ని పరిశీలిస్తున్నారు. పక్కపక్కనే నిర్మించినా, దూరంగా నిర్మించినా, భూసేకరణ అనేది పెద్ద సవాల్‌గా మారనుంది. ఇప్పటికే రింగురోడ్డుకు భూములు ఇచ్చిన రైతులు మళ్లీ రింగురైలుకు భూములు ఇచ్చేందుకు ససేమిరా అనే అవకాశమే ఎక్కువగా ఉంది. యాదాద్రి తదితర ప్రాంతాల్లో జాతీయ రహదారి విస్తరణకు, ఇతర సాగునీటి ప్రాజెక్టు కాలువలకు ఇప్పటికే రెండుమూడు పర్యాయాలు భూములు ఇచ్చిన రైతులు, రీజినల్ రింగురోడ్డుకు ఇచ్చేందుకు ససేమిరా అని కోర్టుల్లో కేసులు వేశారు. ఆయా ప్రాంతాల్లో మళ్లీ రింగురైలుకు భూములు ఇచ్చేందుకు వారు సహకరించే వీలు లేదు. ఇటు రోడ్డు–అటు రైల్వే లైను మధ్యలో ఉండే భూములకు విలువ తగ్గిపోతుంది. దీన్ని కూడా ఆయా రైతులు వ్యతిరేకించే అవకాశముంది. వెరసి ఈ ప్రాజెక్టు విషయంలో తీవ్ర అయోమయం నెలకొంది. -
జమిలి ఎన్నికలకు 2 దశల వ్యూహం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఒకే దేశం–ఒకే ఎన్నికలు విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సురక్షిత మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని భారీగా కుదించడం లేదా పదేపదే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తకుండా సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) రెండు దశల విధానంపై కసరత్తు చేస్తోంది. 2029, 2034 సంవత్సరాల్లో రెండు విడతలుగా దీన్ని అమలు చేసి, దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం సుగమంచేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2029లో తొలిసారి.. 2034 నాటికి పూర్తిస్థాయిలో.. జమిలీ ఎన్నికల చట్రంలోకి అన్ని రాష్ట్రాలను తీసుకురావడానికి రెండు దశలవారీగా ముందుకు సాగడం అత్యంత ఆచరణాత్మకమని జేపీసీ భావిస్తోంది. తొలి దశలో భాగంగా 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటే సుమారు 20 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 2029 నుంచి ఉమ్మడి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి, 2034 నాటికి దేశమంతటా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రాల పదవీకాలంపై ప్రభావం 20 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఆయా రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలంపై పడే ప్రభావంపై అంచనాలు రూపొందించారు. 2028లో ఎన్నికల చక్రం ఉన్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి ఐదు నెలల నుంచి ఏడాది పాటు పెంచాలని భావిస్తున్నారు. 2029 ఎన్నికల చక్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల కాలపరిమితిలో ఎలాంటి మార్పు ఉండదు. 2030–31లో ఎన్నికలు జరగాల్సిన బిహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పశి్చమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి ఒకటి నుంచి రెండేళ్లు తగ్గే ఆస్కారం ఉంది. రాజ్యాంగంలో వెసులుబాటు జమిలి ఎన్నికలను దశలవారీగా అమలు చేయడానికి రాజ్యాంగపరమైన అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలపరిమితి ముగియకముందే ఎన్నికలు నిర్వహించవచ్చని, కొన్నింటిలో కాలపరిమితిని పొడిగించే వెసులుబాటు ఉందని నిపుణులు పేర్కొన్నారు. గతంలోనూ ప్రత్యేక పరిస్థితుల్లో లోక్‌సభ, అసెంబ్లీల కాలపరిమితిలో మార్పులు జరిగాయని గుర్తుచేశారు. ఇంతటి భారీ మార్పునకు చట్టపరమైన నిబంధనలతో పాటు రాజకీ య ఏకాభిప్రాయం అవసరమని అభిప్రాయపడ్డారు. 1967 వరకు ఒకేసారి పోలింగ్.. దేశంలో 1952 నుంచి 1967 వరకు నాలుగుసార్లు లోక్‌సభకు, మెజారిటీ శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1967 తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడం మొదలైంది. 1968–69 మధ్య అనేక అసెంబ్లీలు రద్దు కాగా, 1970లో లోక్‌సభ కాలపరిమితి ముగియకముందే రద్దయింది. దీంతో జమిలీ ఎన్నికల తంతుకు తొలిసారిగా బ్రేక్ పడింది. 1971లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరగడంతో రాష్ట్రాల్లో ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరగడం ప్రారంభమైంది. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు, రాష్ట్రపతి పాలన, ముందస్తు ఎన్నికల కారణంగా ఈ అంతరం మరింత పెరిగింది. జమిలిపై వాదోపవాదనలు జమిలి ఎన్నికల విధానంపై అనుకూల, ప్రతికూల వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధి పనులు ప్రభావితం కాకుండా ఉంటాయని జమిలీ ఎన్నికలను సమరి్థంచేవారు వాదిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో పరిపాలనా యంత్రాంగం వెచ్చించే భారీ సమయం, ఖర్చు ఆదా అవుతాయని వారు పేర్కొంటున్నారు. శాసనసభల కాలపరిమితిని తగ్గించడం లేదా పెంచడం వల్ల ప్రజా తీర్పు, సమాఖ్య నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందన్నది జమిలి ఎన్నికలను వ్యతిరేకించేవాళ్లు వాదిస్తున్నారు. జాతీయ స్థాయి ప్రభంజనంలో స్థానిక, ప్రాంతీయ సమస్యలు మరుగున పడిపోయే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7 దేశాల విధానాలపై కోవింద్ ప్యానెల్ అధ్యయనం జమిలి ఎన్నికలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన 2023 సెపె్టంబర్ 2న ప్యానెల్ ఏర్పాటైంది. ఈ కమిటీ నివేదిక తయారు చేయడానికి ముందు ఏడు దేశాల ఎన్నికల ప్రక్రియలను అధ్య యనం చేసింది. నిపుణులతో చర్చలు, 191 రోజుల పరిశోధనల అనంతరం కోవింద్ కమిటీ తన నివేదికను మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది. ప్రస్తుతం ఈ నివేదికను అధ్యయనం చేస్తున్న జేపీసీ తన నివేదికను 2026 వర్షాకాల సమావేశాల చివరి వారం మొదటి రోజు నాటికి సమర్పించాల్సి ఉంటుంది. నివేదిక అందిన తర్వాత పార్లమెంటులో తదుపరి చర్చ, ఓటింగ్ జరుగుతాయి. -
జూన్ 15 డెడ్‌లైన్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జూన్ 15 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లు, మొక్కజొన్నలు, పొద్దుతిరుగుడు పంటలు కొనకపోతే కేంద్రంతో యుద్ధం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో 67 లక్షల క్వింటాళ్ల వడ్లను సేకరించామని, ఇంకా 15 లక్షల క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉందని, వాటన్నింటినీ సేకరిస్తామని, మొత్తం 75 లక్షల క్వింటాళ్ల వడ్లు కొంటామన్నారు. సోమవారం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి పంచాయతీ కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్లను రేవంత్ ప్రారంభించారు. మొదటి విడతలో పూర్తయిన లక్ష ఇందిరమ్మ ఇళ్ల పైలాన్‌ను ఆవిష్కరించారు. రెబ్బెన మండలం కొండపల్లి శివారు కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. సోమవారం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక సభలో మాట్లాడారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి ప్రల్హాద్ జోషీ పంజాబ్, హరియాణాకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. జూన్ 15లోపు ధాన్యం సేకరణ పూర్తవుతుందని, అన్ని పంటలను మద్దతు ధరతో కొనాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ ఆఫీసు ముందు ధాన్యాన్ని పోస్తామని హెచ్చరించారు. కేంద్రంతో యుద్ధమే ప్రకటిస్తామన్నారు. తెలంగాణ రైతుల పక్షాన పోరాటం చేసి మీ సంగతి తేలుస్తామని హెచ్చరించారు. కిషన్‌రెడ్డి తెలంగాణలో తిరగడానికి సమస్య అవుతుందన్నారు. సత్రంలో పెట్టే ఉచిత భోజనానికి నెల్లూరి పెద్దారెడ్డి సిఫారసు తీరుగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారని, కేంద్రం కొనుగోలు చేసేలా ఆయన బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు భూ సేకరణకు 1500 ఎకరాలు కోసం చర్చిద్దామని లేఖ రాస్తే కిషన్‌రెడ్డి నుంచి ఇప్పటికీ స్పందన లేదన్నారు. బస్సుయాత్ర పేరుతో బీజేపీ నాయకులు రైతుల వద్దకు వెళ్లడం కాదని దుయ్యబట్టారు. ఎవరినీ లెక్కచేయను నాలుగు కోట్ల ప్రజల ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతాంగం హక్కులు, సమస్యలే ముఖ్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వారి కోసం ఎవరినీ లెక్కచేయని స్పష్టం చేశారు. ఏదైనా నేను మొదట పరిష్కారం చేసుకోవాలని చూస్తానని, అలా కాకపోతే పంచాయతీ పెట్టుకోవడానికి సిద్ధమేనని హెచ్చరించారు. తెలంగాణ అంటే ఎందుకు అంత చిన్నచూపని ప్రశ్నించారు. మహారాష్ట్ర సీఎంను ఒప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించకపోగా, మీ ఆలోచన ఏంటని ప్రశ్నించారు. ప్రాణహితపై బరాజ్ కట్టి ఎల్లంపల్లి గ్రావిటీతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతాంగానికి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీరుతామని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్లను విడిచిపెట్టి, కాళేశ్వరం కడితే కూళేశ్వరంగా మారిందన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ అంతర్రాష్ట్ర నదీ జలాలు పరిష్కారం చేసుకోవాలని చెబుతున్నారని, అయితే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహకరించడం లేదన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలిపి లక్షలాది మందికి అన్యాయం చేశారని చెప్పారు. తాము మనుషులు, ఊళ్లను అడగం లేదని, కేవలం భూమి అడుగుతున్నామని చెప్పారు. రెండో విడత రెండన్నర లక్షల ఇళ్లు రాష్ట్రంలో మొదటి విడత 4.50 లక్షల ఇళ్లకు అదనంగా గూడేలకు 21వేలు అదనంగా ఇచ్చాం. లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలు చేస్తున్నాం. ఇంకా ఇళ్లు రాని వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రెండో విడతలో అందరికీ ఇళ్లు వచ్చేలా 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 15 నాటికి మరో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. గతంలో ఇల్లు వచ్చిన వారికి భాగస్వామ్యం చేసి అందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. పేదవారి ఆత్మగౌరవాన్ని పెంచే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి తీరుతామన్నారు. గిరిజనులు తమకు ఆత్మగౌరవంగా బతికేందుకు ఇళ్లు ఇవ్వాలని కోరారని చెప్పారు. అంతకుముందు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, వివేక్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, ప్రేమ్‌సాగర్‌రావు, పాల్వాయి హరీశ్‌బాబు, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, వంశీక్రిష్ణ, ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ కె.హరిత, హౌసింగ్ శాఖ అధికారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని కెరమెరి మండలం కొఠారి గ్రామపంచాయతీ కొత్తగూడలో లబ్ధిదారులు సిడాం కన్నిబాయి, ఆత్రం పోచుబాయి, టేకం పగ్గబాయి ఇందిరమ్మ ఇళ్లను సర్పంచ్ మడావి శంతాబాయితో కలిసి ప్రారంభించారు. కాసేపు నేలపైనే కూర్చుని లబ్ధిదారులతో ముచ్చటించారు. ఈ పర్యటనలో ఆరు సబ్స్టేషన్లు, రెబ్బెన మండలం నంబాలలో 2 మెగావాట్ల సోలార్‌ప్లాంట్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో మొత్తం రూ.112.14కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గుడిసెలు లేని ఆదిలాబాద్‌ను చేస్తాం గుడిసెలు లేని ఆదిలాబాద్‌ను చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది వరకు అవసరమైన ప్రతీ ఒక్కరికి ఇంటిని మంజూరు చేస్తామన్నారు. ఇందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా అధికారులతో వివరాలు తీసుకుని ఇవ్వాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో అర్ధంతరంగా ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో వివక్ష లేని పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెలు ఉన్న చోట్ల కూడా ఇందిరమ్మ ఇళ్ల వివరాలు ఇవ్వాలని సిర్పూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలను కోరారు. ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీ లేదని, మంచిర్యాలలో ఏర్పాటు చేయాలని, ఆసిఫాబాద్ జిల్లా మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుపెట్టాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కోరారు. మీ పిల్లల్ని చదివిస్తామని మాటివ్వండి.. ‘ఉచిత విద్యుత్, బస్సు, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు సౌకర్యాలన్నీ కల్పిస్తాం. కానీ ప్రతిఫలంగా నేను మీ నుంచి ఆశిస్తున్నది ఒక్కటేనని అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆదివాసీ మహిళల్ని అడిగారు. ‘మీరు ఒక పూట ఉపవాసం ఉన్నా సరే మీ పిల్లలను మాత్రం చదివించాలని కోరుతున్నా.. చదివిస్తామని మాట ఇవ్వండి అని ఆదివాసీ మహిళలను కోరారు. చదువు ఒక్కటే మార్పు తెస్తుందన్నారు. కొత్తగూడలో 25 ఇళ్లు పూర్తికాగా వాటిని పరిశీలించారు. -
LPG కస్టమర్లకు బిగ్ షాక్.. వాళ్లకు గ్యాస్ కనెక్షన్స్ బంద్.. ఇవే కొత్త రూల్స్!
-
ప్రశ్నిస్తే అవమానిస్తున్నారు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ఓఎస్ఎం వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఇటీవల కొందరు విద్యార్థులతో సంభాషించిన వీడియోను ఆదివారం ఆయన షేర్ చేశారు. ‘వీరంతా సీబీఎస్ఈలో అవకతవకలపై మోదీ ప్రభుత్వాన్ని చాలా చిన్న ప్రశ్నలు మాత్రమే అడిగారు. ప్రశ్నిస్తే వీళ్లను అవమానిస్తున్నారు. సమాధానాలకు బదులు వీళ్లకు అవమానాలే ఎదురయ్యాయి. దేశ వ్యతిరేకులంటూ వారిపై ముద్ర వేశారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఈ దేశద్రోహులతో ఎంతో ఆసక్తికర సంభాషణ జరగింది. వీరికి ఎంతో చక్కటి భవిష్యత్తుంది’ అని అన్నారు. ఇటీవల సీబీఎస్ఈ అప్లోడ్ చేసిన 12వ తరగతి ఆన్సర్ షీట్ తమది కాదంటూ వేదాంత్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు. అనంతరం మరికొందరు విద్యార్థులూ తమకూ ఇతరుల ప్రశ్నపత్రాలు ఇచ్చారంటూ ఆన్లైన్లో ప్రకటించడం తీవ్ర కలకలం రేగిన విషయం తెల్సిందే. -
చేను రాష్ట్రానిది చట్టం కేంద్రానిది!
భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లో వ్యవసాయం స్పష్టంగా రాష్ట్ర జాబితాలో ఉంది. జాబితా–2 లోని 14వ నమోదు (ఎంట్రీ) ప్రకారం వ్యవసాయం, వ్యవసాయ విద్య, పరిశోధన, పంట రక్షణ.. ఇవన్నీ రాష్ట్రాల ప్రత్యేక అధికారం. 18వ నమోదులో భూమి, కౌలు, బదిలీ, వ్యవసాయ రుణాలు ఉన్నాయి. 28వ నమోదులో మార్కెట్లు, సంతలు ఉన్నాయి. వ్యవసాయం స్థానికమైనది. నేలలు, వర్షాలు, పంటల చక్రాలు, కౌలు విధానాలు, విత్తన సంస్కృతులు రాష్ట్రాల మధ్యే కాదు, జిల్లాల మధ్య కూడా మారతాయి అని రాజ్యాంగ నిర్మాతలకూ తెలుసు.కేంద్రీకృత వ్యవసాయ విధానం వ్యవసాయ శాస్త్రపరంగా అసంబద్ధం. అందుకే వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉంది. స్వాతంత్య్రానంతరం ఎనిమిది దశాబ్దాలు గడిచిన తరువాత కూడా వరి కనీస మద్దతు ధర, పప్పుధాన్యాల దిగుమతి సుంకం, పురుగుమందుల రిజిస్ట్రేషన్, జీఎం పంటల అనుమతి, ఎరువుల సబ్సిడీ నిర్మాణం, పంటల బీమా రూపకల్పన, రైతు డేటాబేస్ ఫార్మాట్, మట్టి, కార్బన్ క్రెడిట్ ప్రోటో కాల్లు, రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్లను కేంద్ర ప్రాధాన్యతలకు పరిమితం చేసే కేంద్ర పథకాల షరతులు... వీటన్నింటినీ నిర్ణయిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే! రాష్ట్రాలు కేవలం ఆ పథకాల అమలు సంస్థలుగా మిగిలిపోయాయి. కేంద్ర మార్గదర్శకాల ద్వారా, కేంద్ర గుర్తింపుతో పథకాలను అమలు చేస్తూ, కృషి భవన్, వాణిజ్య భవన్లలో తీసుకున్న నిర్ణయాల పర్యావరణ భారాన్ని రాష్ట్రాలు మోస్తున్నాయి.ఇరవై ఏళ్లుగా మొలకెత్తని విత్తన బిల్లు!వ్యవసాయాన్ని రాష్ట్ర జాబితాలో ఉంచిన అసలు ఏర్పాటు నిశ్శబ్దంగా క్రమేణా శూన్యమైపోయింది. వాణిజ్య అధికారాలు, ఉమ్మడి జాబితా నమోదులు, నిత్యావసర వస్తువుల చట్టం, ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాల కింద అంతర్జాతీయ నిబద్ధతలు, జీఎస్టీ ద్వారా ఆర్థిక కేంద్రీకరణ, షరతులతో కూడిన కేంద్ర పథకాల విస్త రణ... ఇవన్నీ కలిసి రాజ్యాంగ సవరణ లేకుండానే జరిగిపోయాయి. క్షేత్రస్థాయి పరిశీలన ఈ సమస్యను స్పష్టంగా చూపిస్తుంది. 2003–04లో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున పత్తి పంట నాశనమైంది. నాణ్యత లేని బి.టి. హైబ్రిడ్లపై కాయతొలుచు పురుగు దాడి, నకిలీ విత్తనాలు అమ్మిన అవినీతి డీలర్లు, వాతావరణ ఒత్తిడి... వీటన్నిటి కారణంగా అప్పుల్లో ఉన్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో విత్తన నాణ్యత పరీక్ష, కంపెనీల జవాబుదారీతనం, రైతుల పరిహారం కోసం విత్తన నష్ట పరిహార చట్టం ముసాయిదాను తయారు చేసింది. అయితే ఆ ముసాయిదాపై కేంద్ర ప్రభుత్వ స్పందన ఆశ్చర్యకరంగా ఉంది. జాతీయ విత్తన బిల్లు సిద్ధంగా ఉందనీ, రాష్ట్ర చట్టం గందరగోళం సృష్టిస్తుందనీ కేంద్ర అధికారులు వాదించారు. రాష్ట్రాన్ని ఆగమని కోరారు. 2004 విత్తన బిల్లు దాదాపు రెండు దశాబ్దాలుగా పార్లమెంటులో మూలుగుతూ ఉంది. ఈ మధ్య లోని కాలంలో రైతులకు అనేక సమస్యలు ఎదురైనా వాటికి ఎలాంటి చట్టపరమైన పరిష్కారమూ లభించ లేదు.పురుగుమందుల విషయంలో మరింత దారుణమైన అసమ తుల్యత ఉంది. 1968 క్రిమిసంహారక చట్టం సెక్షన్ 27 ప్రకారం, ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకర పురుగుమందు అమ్మకాన్ని నిషేధించ గలిగేది గరిష్ఠంగా 90 రోజులు (మొదట 60 రోజులు, తర్వాత 30 రోజులు) మాత్రమే. అంటే తన ప్రజలను ప్రమాదకర రసాయనం నుండి కాపాడుకోవడానికి ఒక రాష్ట్రానికి అందుబాటులో ఉన్న చట్టపరమైన అవకాశం 90 రోజులు మాత్రమే. ఆసుపత్రి అడ్మిషన్లు, దీర్ఘకాలిక నాడీ వ్యాధులు, విషం తాగి ఆత్మహత్యలు వీటన్నిటినీ భరించే రాష్ట్రానికి స్వయంగా నిర్ణయం తీసుకునే వెలుసుబాటు లేదు. ఉదా: కేరళ 2001లో ఎండోసల్ఫా¯Œ ను నిషేధించింది. కేంద్రం దానిని జాతీయ స్థాయిలో నిషేధించడానికి దాదాపు పదేళ్లు పట్టింది. నియంత్రణలకు రాష్ట్రాల సమ్మతి ఏదీ?తెలంగాణలో వరి సాగును పరిశీలించండి. దాదాపు 40 లక్షల హెక్టార్లలో, ఎక్కువగా బోర్వెల్ నీటిపై ఆధారపడి, రాష్ట్రం ఇచ్చే ఉచిత విద్యుత్‌తో పంపింగ్ చేసే భూగర్భ జలంతో ఇది సాగుతోంది. వరి సాగుకు ప్రోత్సాహం ఇచ్చే కనీస మద్దతు ధరపై రాష్ట్రా నికి అధికారం లేదు. ఎరువుల సబ్సిడీపై అధికారమూ పరిమితమే. చిరుధాన్యాలను ప్రోత్సహించేలా ‘సేకరణ’ విధానాన్ని మార్చలేదు. వాణిజ్యంలో రాజ్యాంగ వైరుధ్యం మరింత పదునుగా కని పిస్తుంది. వ్యవసాయం రాష్ట్ర అంశం. వ్యవసాయ వాణిజ్యం కేంద్ర అంశం. అంటే ఉల్లి సాగును మహారాష్ట్ర నియంత్రిస్తుంది. ఉల్లి ఎగుమతిని వాణిజ్య భవన్ నియంత్రిస్తుంది. 2007–08, 2010, 2019, మళ్లీ 2023లో దేశీయ ధరల ఒత్తిడికి స్పందనగా, ఎగుమతి మార్కెట్‌ను ఆశించి పంటలు వేసిన రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే కేంద్రం బియ్యం, గోధుమపై హఠాత్తుగా ఎగుమతి నిషే ధాలను విధించింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు పరిస్థితిని మరింత జటిలం చేశాయి. ‘ఏషియన్’ దేశాలు, జపాన్, కొరియాలతో ద్వైపాక్షిక ఒప్పందం.. వీటిల్లో ఏ ఒక్కదానిపైనా రాష్ట్రాల అధికారిక భాగస్వామ్యంతో చర్చ జరగలేదు.మరి పరిష్కారం? మొదట, వ్యవసాయ సమాఖ్య కమిషన్ ఏర్పాటు చేయాలి. సర్కారియా (1988), పుంఛీ (2010) కమిషన్లు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై దృష్టి పెట్టినా, ప్రత్యేకించి వ్యవసాయంపై పెట్టలేదు. అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యంతో, రాజ్యాంగ సవ రణలు, చట్టపరమైన మార్పులు, ఆర్థిక పునర్నిర్మాణం... వీటిని సిఫార్సు చేయగల అధికారంతో ఈ కమిషన్ ఉండాలి. రెండవది, నిర్దిష్ట చట్టపరమైన స్పష్టతలు కావాలి. నిత్యావసర వస్తువుల చట్టంలో సవరణ, ఎగుమతి, నిల్వ నియంత్రణలు విధించే ముందు రాష్ట్ర సమ్మతి తప్పనిసరి. హానికర పురుగుమందులను శాశ్వతంగా నిషేధించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలి.గిట్టుబాటు కాని పంటలకు బోనస్మూడవది, పర్యావరణ అనుకూల వ్యవసాయం వైపు ఆర్థిక వికేంద్రీకరణ. జీడీపీలో దాదాపు 1.7 శాతం ఉన్న ఎరువుల సబ్సి డీని (ప్రస్తుతం దాదాపు పూర్తిగా తయారీదారులకు చెల్లిస్తున్న దానిని) క్రమంగా ‘రైతువారీ పర్యావరణ పరివర్తన చెల్లింపు’గా మార్చాలి. స్థానిక ప్రాధాన్యతల ప్రకారం రాష్ట్రాలు దీనిని వినియో గించుకోవాలి. మార్కెట్ దొరకని పంటలకు సేకరణ, గిట్టుబాటు కాని పంటలకు బోనస్ ఇచ్చే పద్ధతి కావాలి. భూగర్భ జలాలను కాపాడే, మట్టి కార్బన్‌ను నిల్వ చేసే, సంప్రదాయ విత్తనాల్ని రక్షించే రాష్ట్రాలకు పర్యావరణ ఆర్థిక బదిలీలు అందించాలి.నాల్గవది, ప్రాంతీయ ఆహార వ్యవస్థల ప్రణాళిక. భారత వ్యవ సాయ వైవిధ్యానికి ఒకే జాతీయ ఆహార విధానం కాదు, ప్రతిప్రాంత వ్యవసాయ పర్యావరణం, ఆహార సంస్కృతి, ఆర్థిక నిర్మాణానికి అనుగుణంగా రూపొందించిన ప్రాంతీయ ఆహార వ్యవస్థ ప్రణాళికల సమాఖ్య సరైనది. తూర్పు కనుమల చిరుధాన్య ప్రాంతం, ఇండో–గంగా మైదానం, పశ్చిమ కనుమల సుగంధ ద్రవ్య ప్రాంతం, ఈశాన్య పోడు వ్యవసాయ ప్రాంతం, పశ్చిమ భారత పప్పుల ప్రాంతం, దక్షిణ ద్వీపకల్ప నీటిపారుదల వరి బెల్ట్... ప్రతిదీ ఒక ప్రత్యేక వ్యవసాయ పర్యావరణ మండలం. ఏక రూప పంటల విధానం రుద్దడం కాకుండా, ప్రాంతీయ ఆహార వ్యవస్థల కలయికగా జాతీయ ఆహార భద్రతను నిర్మించవచ్చు.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
‘కాక్రోచ్ జనతా పార్టీ’ అకౌంట్ బ్లాక్.. హైకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అకౌంట్‌ను బ్లాక్ చేయడంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాక్రోచ్ జనతా పార్టీని సోషల్ మీడియాలో బ్లాక్ చేయడంపై 'X' (ట్విట్టర్)కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బ్లాకింగ్ ఉత్తర్వులపై పునఃసమీక్ష జరపాలని ఐటీ శాఖ 'రివ్యూ కమిటీ'కి హైకోర్టు ఆదేశించింది.అయితే, అంతకుముందు.. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తమ పార్టీ ఖాతాలను బ్లాక్ చేయడాన్ని సవాల్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ స్థాపకుడు అభిజిత్ దీప్కే (Abhijit Deepke) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జాతీయ భద్రత పేరిట వ్యంగ్య (Satirical) అకౌంట్‌ను బ్లాక్ చేయడంపై అభిజీత్ విమర్శలు గుప్పించారు. స్వేచ్ఛగా రాజకీయ అభిప్రాయాలను పంచుకునే హక్కును కాలరాస్తూ తమ అకౌంట్లను నిలిపివేశారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి కీలక నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.అయితే, ఈ వివాదానికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి పిటిషనర్‌కు కీలక సూచన చేశారు. సమాచార సాంకేతిక (IT) చట్టం ప్రకారం దేశంలో ఇలాంటి డిజిటల్ నిలిపివేతలపై అభ్యంతరాలను పరిశీలించడానికి ఓ స్పెషల్ రివ్యూ కమిటీ ఉందని గుర్తుచేసింది. నేరుగా కోర్టు ద్వారా కాకుండా, ఐటీ చట్టం పరిధిలోని ఆ రివ్యూ కమిటీ ముందుకు ఈ విషయాన్ని తీసుకెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది. #DelhiHighCourt on Friday issued notice on a plea by #AbhijitDipke-founder of '#CockroachJanataParty' challenging the blocking of the party's X account, while directing Review Committee of Ministry of Electronics and Information Technology to examine the Dipke's case granting him… pic.twitter.com/JflYEepD4x— Kashmir Crown (@kashmircrownews) May 29, 2026 -
జీరో కమిషన్, స్థిరమైన చార్జీలు.. భాగ్యనగరంలోకి ‘భారత్ ట్యాక్సీ’
సాక్షి, హైదరాబాద్: దేశంలో యాప్ ఆధారిత క్యాబ్/ఆటో సర్వీసు రంగాన్ని గుప్పిట్లో పెట్టుకున్న కార్పొరేట్ గుత్తాధిపత్యానికి తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మొట్టమొదటి సహకార రవాణా వ్యవస్థ ‘భారత్ ట్యాక్సీ’త్వరలో హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఓలా, ఉబర్, రాపిడో సంస్థలు ఈ రంగంలో ఉన్న విషయం తెలిసిందే. కాగా వీటిల్లో లక్షలాది మంది డ్రైవర్లు సభ్యులుగా ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో మారిన ఆయా సంస్థల విధానాలతో విసిగిపోయిన డ్రైవర్లు, భారత్ ట్యాక్సీ సేవలు వీలైనంత త్వరగా ప్రారంభించాలని తాజాగా సంస్థ నిర్వాహకులను కోరారు. ఈ నేపథ్యంలో వచ్చే ఐదారు నెలల్లో హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించేలా సన్నాహాలు కొనసాగుతున్నాయి. భారత్ ట్యాక్సీకి అధికారికంగా స్వాగతం పలికేందుకు డ్రైవర్ల సంఘం వేదికను సిద్ధం చేస్తోంది. డ్రైవర్లలో అసంతృప్తి హైదరాబాద్‌లో యాప్ ఆధారిత క్యాబ్ సేవలు విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. యాప్ ద్వారా బుకింగ్ సులభంగా ఉండటం, బుక్ చేసిన కొద్ది నిమిషాలకే ట్యాక్సీ అందుబాటులోకి వస్తుండటంతో ప్రయాణికులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం నగరంలో 1.40 లక్షల క్యాబులుండగా, లక్ష వరకు ఈ యాప్ ఆధారిత అగ్రిగేటర్లతో భాగస్వామ్యమయ్యాయి. దాదాపు లక్షన్నర ఆటోల్లో 90 వేలు వీటితో అనుసంధానమయ్యాయి. దీన్ని ఆసరా చేసుకుని నిర్వాహక సంస్థలు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకపోవటంతో చార్జీల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పీక్ అవర్ అని, వర్షం కురుస్తుండటంతో క్యాబ్‌ల కొరత ఉందని, ట్రాఫిక్ జామ్ ఉందని, డ్రైవర్ రావటానికి నిరాకరిస్తున్నాడని... రకరకాల సాకులుతో అప్పటికప్పుడు చార్జీ పెంచేస్తున్నాయి. డ్రైవర్ల నుంచి కమీషన్ కింద ఏకంగా 40 శాతం వరకు తీసేసుకుంటున్నాయి. నగర ట్రాఫిక్‌లో, అననుకూల వాతావరణంలో కష్టపడుతూ వాహనం నడిపే డ్రైవర్లకు 60 శాతమే దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలపై క్యాబ్ డ్రైవర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఈ సమయంలో భారత్ ట్యాక్సీ రానుండటం డ్రైవర్లతో పాటు నగర ప్రజలకు ఊరటనిస్తుందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో.. కేంద్ర గృహ నిర్మాణ, సహకార శాఖల ఆధ్వర్యంలో భారత్ ట్యాక్సీ వ్యవస్థ రూపుదిద్దుకుంది. సహకార స్పూర్తితో ‘సారథి హీ మాలిక్ (నడిపేవాడే యజమాని)‘నినాదంతో ఇది ఏర్పాటైంది. ’సహకార్ సే సమృద్ధి’(సహకారం ద్వారా సంపద) అన్న ట్యాగ్‌లైన్‌తో ఆరునెలల క్రితం మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద ఈ వ్యవస్థ రిజిస్టర్ అయింది. అమూల్, ఇఫ్కో, నాబార్డ్ , క్రిబ్కో తదితర సహకార సంస్థల భాగస్వామ్యంతో ’సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్’దీనిని రూపొందించింది. రెండు నెలలు పైలట్ ప్రాజెక్టుగా పరిశీలించి గత ఫిబ్రవరిలో ఢిల్లీలో అధికారికంగా ప్రారంభించారు. తొలుత ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, ఘాజియాబాద్లతో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్, సోమనాథ్, ద్వారకలలో ప్రారంభించారు. ప్రస్తుతం రెండున్నర లక్షల మందికి పైగా డ్రైవర్లు సభ్యులుగా చేరారు. త్వరలో హైదరాబాద్‌తో పాటు ముంబై, బెంగుళూరు, చెన్నై, కోల్‌కతాలలో ప్రారంభించాలని నిర్ణయించారు. తొలుత ముంబైలో ప్రారంభం కానుండగా..హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్లు ఇక్కడ కూడా త్వరగా ప్రారంభించాలని ఒత్తిడి తెస్తుండటం విశేషం. ఎదురుచూపులు ఎందుకంటే.. – భారత్ టాక్సీ ’జీరో కమీషన్’విధానంలో నడుస్తుంది. ప్రయాణికులు చెల్లించే మొత్తం నేరుగా డ్రైవర్ బ్యాంక్ ఖాతాకే వెళ్తుంది. సంస్థ నిర్వహణ కోసం కేవలం రోజువారీ లేదా నెలవారీ స్వల్ప సభ్యత్వ రుసుము మాత్రమే డ్రైవర్లు చెల్లించాల్సి ఉంటుంది. – ట్రాఫిక్ రద్దీ, పండగలు, క్యాబ్‌ల కొరత, వర్షం, పీక్ అవర్స్... ఇలా కారణాలు చెప్తూ అధిక మొత్తం చార్జీ వసూలు ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన స్థిరమైన, పారదర్శక చార్జీలు మాత్రమే ఉంటాయి. ప్రైవేట్ సంస్థల చార్జీలతో పోలిస్తే 30 – 50 శాతం తక్కువగా ఉండనున్నాయి. – ప్రతి డ్రైవర్‌కు రూ.5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, రూ.5 లక్షల కుటుంబ ఆరోగ్య బీమా ఉంటుంది. రిటైర్మెంట్ సేవింగ్స్ ప్లాన్‌ను కూడా ఈ సంస్థ అందిస్తోంది. – మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా మహిళా డ్రైవర్లతో కూడిన ట్యాక్సీ, బైక్ సర్వీసులను ప్రవేశపెట్టారు. మహిళా ప్రయాణికులు మహిళా డ్రైవర్లనే ఎంచుకునే వెసులుబాటు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయటంతో... రాష్ట్రంలో సొంతంగా టాక్సీ/ఆటో యాప్‌ను అభివృద్ధి చేయనున్నట్టు రెండున్నరేళ్ల క్రితం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత చేతులెత్తేసింది. ప్రైవేటు అగ్రిగేటర్ల ఒత్తిడికి తలొగ్గి సొంత యాప్ హామీని గాలికొదిలేసిందని క్యాబ్ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. సొంత యాప్ సంగతి పక్కనపెడితే, కనీసం క్యాబ్ ధరల నియంత్రించలేని దుస్థితి ఉంది. ఇలావుండగా..గత వారం రోజుల్లో రెండు పర్యాయాలు డీజిల్, పెట్రోలు ధరలు పెంచటంతో తమ చార్జీలు కూడా పెంచాలని క్యాబ్/ఆడో డ్రైవర్లు అగ్రిగేటర్లను కోరుతున్నారు. అయితే మూడు అగ్రిగేట్ సంస్థలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నందున చార్జీల పెంపునకు అంగీకరించడం లేదు. దేని చార్జీ తక్కువుంటే ప్రయాణికులు అటువైపు మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణం. -
క్యూర్లో వాటర్ పూర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుండెకాయగా పరిగణించే కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో భూగర్భ జలాలు అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంతోపాటు శివారు ప్రాంతాలు భారీ భవనాలు, సీసీ రోడ్లతో పూర్తిగా కాంక్రీట్ జంగిల్‌గా తయారు కావడం.. చెరువులు, నాలాలు కబ్జాకు గురికావడంతో చుక్క వర్షపు నీరు సైతం ఇంకడానికి జానెడు నేల మిగలలేదు. దీనికితోడు రాతి పొరలతో నిండిన దక్కన్ పీఠభూమి కావడంతో వర్షపు నీరు ఇంకడానికి అవకాశమూ లేదు. దీంతో హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో భూగర్భ జలాల రీచార్జ్ పరిమాణంతో పోల్చితే వాటి వినియోగం మించిపోయింది. ⇒ హైదరాబాద్ జిల్లాలోనే అత్యంత దుర్భర పరిస్థితిలో భూగర్భ జలాలు పడిపోయాయి. జిల్లాలో 16 మండలాలుండగా, 8 మండలాల్లో (50 శాతం) విచ్చలవిడి (ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్)గా భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. అంటే, ఒక ఏడాది రీచార్జ్ అయిన భూగర్భ జలాలతో పోల్చితే ఎక్కువ భూగర్భ జలాలను హైదరాబాద్ జిల్లాలో తోడేస్తున్నారు. చార్మినార్, అంబర్పేట్, గోల్కొండ, ఆసిఫ్‌నగర్, సైదాబాద్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, హిమాయత్‌నగర్ మండలాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. మరో 7 మండలాల్లో (43.75%) క్రిటికల్ స్థాయిలో భూగర్భ జలాలు వాడుతుండగా, వీటిలో మారేడ్‌పల్లి, బండ్లగూడ, బహదూర్çపుర, ముషీరాబాద్, నాంపల్లి, షేక్‌పేట్, సికింద్రాబాద్ మండలాలున్నాయి. ఒక్క తిరుమలగిరి మండలం (6.25 శాతం)లో సెమీ క్రిటికల్ స్థాయిల్లో భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలోని ఒక్క మండల పరిధిలో కూడా భూగర్భ జలాలు సురక్షితంగా లేవు. కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని కేంద్ర భూగర్భ జలమండలి రూపొందించిన భూగర్భ జల వనరుల మదింపు నివేదిక–2025లో ఈ అంశాలను వెల్లడించింది. ⇒ మేడ్చల్–మల్కాజ్‌గిరిలోని 15 మండలాల్లో 4 మండలాలు (26.67 శాతం) భూగర్భ జలాలను ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ చేస్తున్నాయి. వీటిలో బాలానగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి మండలాలున్నాయి. జిల్లాలోని మరో 3 మండలాల్లో (20 శాతం) క్రిటికల్ స్థాయిలో భూగర్భ జలాల వాడకం ఉంది. వీటిలో మూడుచింతలపల్లి, కీసర, బాచుపల్లి ఉన్నాయి. అల్వాల్, మేడ్చల్, ఘట్కేసర్ మండలాల్లో (20 శాతం) సెమీ క్రిటికల్ స్థాయిలో వాడకం ఉంది. జిల్లాలోని మిగిలిన 5 మండలాల్లో (33.33 శాతం) సురక్షిత స్థాయిల్లో భూగర్భ జలాల వాడకం ఉంది. ⇒ రంగారెడ్డిలో 27 మండలాలుండగా, 4 మండలాలైన చౌదరిగూడ, హయాత్‌నగర్, శేరిలింగంపల్లి, సరూర్‌నగర్(14.81 శాతం)లో భూగర్భ జలాలను ఓవర్ ఎక్స్ప్లయిటెడ్ చేస్తున్నారు. మరో 9 మండలాలైన ఆమనగల్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, కొందుర్గు, తలకొండపల్లి, కొత్తూరు, మొయినాబాద్, కందుకూరు, రాజేంద్రనగర్ (33.33 శాతం)లో సెమీ క్రిటికల్ స్థాయిలో వినియోగం ఉంది. ఈ జిల్లాల్లోని మిగిలిన 14 మండలాల్లో (51.85 శాతం) సురక్షిత స్థాయిల్లో భూగర్భ జలాలను వాడుతున్నారు. ⇒ ప్యూర్, రేర్ రీజియన్ల పరిధిలోని ఇక ఇతర జిల్లాలు పరిశీలిస్తే ఆదిలాబాద్ అర్బన్, ఖమ్మంలోని రఘునాథపాలెం, నల్లగొండలోని మునుగోడు, నిజామాబాద్ దక్షిణ, సంగారెడ్డిలోని పటాన్చెరు, యాదాద్రి భువనగిరిలోని ఆత్మకూరు–ఎం, నారాయణపూర్ మండలాల్లో భూగర్భ జలాల ఓవర్ ఎక్సప్లయిటేషన్ జరుగుతోంది. 774 టీఎంసీల జలాలు రీచార్జ్ రాష్ట్రంలో 2025 సంవత్సరంలో వర్షాకాలంలో వర్షాలతో 259.2 టీఎంసీలు, ఇతర వనరులతో 382.81 టీఎంసీలు, వర్షాకాలం తర్వాత వర్షాలతో 32.48 టీఎంసీలు, ఇతర వనరులతో 233.07 టీఎంసీలు కలిపి మొత్తం 774.45 టీఎంసీల భూగర్భ జలాలు వృద్ధి అయ్యాయి. అందులో సహజ కారణాలతో 73.8 టీఎంసీలు వృథాగా ప్రవహించగా, మిగిలిన 700.64 టీఎంసీలు వాడుకోవడానికి లభ్యతలోకి ఉన్నాయి. ఇక సాగునీటికి 292.4 టీఎంసీలు, పరిశ్రమలు 14.12 టీఎంసీలు, గృహాలు 20.83 టీఎంసీలు కలిపి మొత్తం 327.01 టీఎంసీల (46.69 శాతం)ను 2025లో రాష్ట్రం వాడుకుంది. భవిష్యత్ అవసరాలకు 376.8 టీఎంసీల భూగర్భజలాల నిల్వలు మిగిలాయి. 2024తో పోలి్చతే 2025లో భూగర్భ జలాల రిచార్జ్ 720.41 టీఎంసీల నుంచి 774.45 టీఎంసీలకు పెరిగింది. 76 మండలాల్లో సురక్షితమే.. రాష్ట్రంలోని 620 మండలాల్లో భూగర్భ జలాల రీచార్జ్ వినియోగంపై మదింపు జరపగా, 23 మండలాల్లో (3.71 శాతం) ఓవర్ ఎక్స్ప్లయిటేషన్, 19 మండలాల్లో(3.06%) క్రిటికల్, 105 మండలాల్లో (16.94శాతం) సెమీ క్రిటికల్, 473 మండలాల్లో (76.29 శాతం) సురక్షితంగా భూగర్భ జలాలున్నట్టు నిర్థారించారు. స్థానికంగా భూగర్భ జలాల రీచార్జ్‌తో పోల్చితే వినియోగ స్థాయి ఆధారంగా ఓవర్ ఎక్స్ప్లయిటేషన్, క్రిటికల్, సెమీ క్రిటికల్, సేఫ్ అనే నాలుగు కేటగిరీలుగా ప్రాంతాలను కేంద్ర భూగర్భ జలమండలి విభజించింది. ఆ వివరాలను పట్టికలో చూడొచ్చు.. -
‘భవ్య’ పారిశ్రామిక పార్కులకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: దేశీయ తయారీ (ఉత్పాదక) రంగానికి ఊతమివ్వడం, ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక వసతులను అభివృద్ధి చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూ.33,660 కోట్లతో చేపట్టిన ‘భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన’ (భవ్య) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. తొలి దశలో 50 ‘ప్లగ్ అండ్ ప్లే’ ఇండ్రస్టియల్ పార్కుల ఏర్పాటుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నాలుగు నెలల వ్యవధిలో ప్రతిపాదనలు ఆహా్వనిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ పథకానికి సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీ ఆధారిత ‘ఛాలెంజ్ మోడ్’ విధానంలో తొలి రెండు నెలల్లో 20, తదుపరి రెండు నెలల్లో మరో 30 పార్కులను ఎంపిక చేస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27) నుంచి ఆరేళ్ల కాలవ్యవధిలో పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో దేశవ్యాప్తంగా మొత్తం 100 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నారు. 100–1000 ఎకరాల విస్తీర్ణంలో (కొండ ప్రాంత రాష్ట్రాల్లో అయితే 25 ఎకరాలు) ఏర్పాటు చేసే గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టులకు మౌలిక వసతుల కల్పన కోసం ఎకరానికి గరిష్టంగా రూ.1 కోటి వరకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుంది. అదే ప్రైవేట్ భాగస్వామ్యంతో కూడిన ప్రాజెక్టులకైతే ఎకరానికి రూ.50 లక్షల వరకు సాయం అందుతుంది. భూమి, నీరు, విద్యుత్ లభ్యతతో పాటు మల్టీమోడల్ కనెక్టివిటీ, డిజిటల్ సింగిల్ విండో క్లియరెన్స్ వంటి సదుపాయాల ఆధారంగానే రాష్ట్రాల ప్రతిపాదనలను పరిశీలిస్తారు. క్లస్టర్ ఆధారిత అభివృద్ధితో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు, గ్లోబల్ ఇన్వెస్టర్లకు ‘రెడీ–టు–యూస్’ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ అందుబాటులోకి రానుండగా, ఈ పథకం ద్వారా దేశంలో 15 లక్షల ప్రత్యక్ష ఉద్యోగావకాశాలు లభించనున్నాయని కేంద్రం అంచనా వేస్తోంది.రూపాయి విలువపై ప్రభుత్వం జోక్యం చేసుకోదు: పీయూష్ గోయల్ ఫారెక్స్ (విదేశీ మారి్పడి) రేట్ల నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతమాత్రం జోక్యం చేసుకోదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రూపాయి విలువ అనేది అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ శక్తులు, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో డాలర్‌తో పోలిస్తే రూపాయి గణనీయంగా బలపడిందని, ఇవన్నీ మార్కెట్ ఆధారిత మార్పులేనని వివరించారు. ఎగుమతుల ప్రోత్సాహం, దిగుమతులపై ఆధారాధారపడటాన్ని తగ్గించడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు), ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలు దేశ పారిశ్రామికీకరణకు ఎంతగానో దోహదపడతాయని గోయల్ పేర్కొన్నారు. -
ఆర్బీఐ డివిడెండ్ బొనాంజా
ముంబై: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో ద్రవ్య ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న కేంద్ర సర్కారుకు ఆర్బీఐ తీపి కబురు చెప్పింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2025–26) రికార్డు స్థాయిలో భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. 2024–25 సంవత్సరానికి రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్‌ను అందించగా, 2025–26 సంవత్సరానికి 6.7 శాతం పెంచి రూ.2,86,588 కోట్లను ఇవ్వనుంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో సరఫరాలకు ఆటంకాలు ఏర్పడి, దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు భారంగా మారి, రూపాయి బలహీనపడిన తరుణంలో ఆర్బీఐ డివిడెండ్ ప్రభుత్వానికి ఊరటనివ్వనుంది. ఏటా ఆర్బీఐ తన మిగులు నిల్వల నుంచి ప్రభుత్వానికి డివిడెండ్‌ను ప్రకటిస్తుండడం తెలిసిందే. బడ్జెలో కేంద్ర సర్కారు పేర్కొన్న పన్నేతర ఆదాయం లక్ష్యంలో ఒక్క ఆర్బీఐ డివిడెండే ఈ ఏడాది 91 శాతంగా ఉండనుంది. అంతర్జాతీయంగా, దేశీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులను, రిస్క్ లను విశ్లేషించిన అనంతరం ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు డివిడెండ్‌పై నిర్ణయం తీసుకున్నారు. రూ.91.97 లక్షల కోట్లకు బ్యాలెన్స్ షీట్: రిస్క్ లకు, చట్టబద్ధమైన ఖాతాలకు కేటాయింపులు చేయడానికి ముందు ఆర్బీఐ నికర ఆదాయం 2025–26లో రూ.3.96 లక్షల కోట్లకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.3.13 లక్షల కోట్లుగా ఉంది. బ్యాలెన్స్ షీటు 20.61% పెరిగి రూ.91,97,121 కోట్లకు చేరింది. ‘ఆకస్మిక రిస్క్‌లను ఎదుర్కొనే నిధి’ (సీఆర్బీ) కోసం బ్యాలెన్స్ షీటులో 4.5–7.5% మధ్య కేటాయింపులు నిర్వహించేందుకు సవరించిన ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్ వీలు కల్పిస్తుందని ఆర్బీఐ తెలిపింది. దీంతో 2024–25లో సీఆర్బీకి 7.5%గా ఉన్న కేటాయింపులు 2025–26లో 6.5%కి తగ్గాయి. ఆర్బీఐ ప్రకటించిన రూ.2.87 లక్షల కోట్ల డివిడెండ్ ఈ ఏడాది ప్రభుత్వానికి ఊరటనిస్తుందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ఫలితంగా ప్రస్తుత సవాళ్లను ఇది పూర్తిగా భర్తీ చేయలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. -
కేంద్ర ప్రభుత్వానికి రూ.2.87 లక్షల కోట్లు..
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఈ చమురు వేడి తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఊరటనిచ్చే వార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.2.86,588.46 కోట్ల మిగులు నిధులను (డివిడెండ్) బదిలీ చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అందుకున్న రూ.2.7 లక్షల కోట్ల డివిడెండ్ కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ నిధుల బదిలీకి బోర్డు ఆమోదం తెలిపింది.అంచనాల కంటే స్వల్పంగా తక్కువ..బ్లూమ్‌బెర్గ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థలు ఈసారి ఆర్బీఐ దాదాపు రూ.3 లక్షల కోట్ల (31.2 బిలియన్ డాలర్లు) రికార్డు స్థాయి మిగులును ప్రభుత్వానికి బదిలీ చేయవచ్చని అంచనా వేశాయి. అయితే, ప్రస్తుత బదిలీ ఆ అంచనాల కంటే స్వల్పంగా తక్కువగా నమోదైంది.ఆదాయంలో భారీ వృద్ధిమే 22న ఆర్బీఐ విడుదల చేసిన అధికారిక మీడియా ప్రకటన ప్రకారం.. కేంద్ర బ్యాంక్ స్థూల ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 26.42% పెరిగింది. రిస్క్ నిబంధనలకు ముందు ఆర్బీఐ ఖర్చులు 27.60% పెరిగాయి. రిస్క్ ప్రొవిజన్, చట్టబద్ధమైన నిధులకు బదిలీ చేయకముందు ఆర్బీఐ నికర ఆదాయం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.3,13,455.77 కోట్లు ఉండగా.. 2026 ఆర్థిక సంవత్సరంలో అది రూ.3,95,972.10 కోట్లకు చేరింది. మార్చి 31, 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ పరిమాణం 20.61% వృద్ధితో రూ.91,97,121.08 కోట్లకు చేరుకుంది.రిస్క్ బఫర్ పెంపుప్రభుత్వానికి బదిలీ చేసే డివిడెండ్‌ను పెంచినప్పటికీ, భవిష్యత్తు సవాళ్లను తట్టుకునేందుకు ఆర్బీఐ తన 'కంటింజెంట్ రిస్క్ బఫర్' (ఆకస్మిక ప్రమాదాల నిధి) పరిమాణాన్ని భారీగా పెంచింది. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యవసర నిధి కింద రూ.1,09,379.64 కోట్ల బదిలీకి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మునుపటి సంవత్సరంలో ఈ కేటాయింపు కేవలం రూ.44,861.70 కోట్లుగా మాత్రమే ఉండటం విశేషం.ప్రస్తుతం దేశంలో ఇంధన ధరల పెరుగుదల వల్ల దిగుమతి బిల్లులు భారంగా మారాయి. దీనికి తోడు కరెంట్ ఖాతా లోటు (CAD) పెరగడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) నిధులను ఉపసంహరించుకోవడం వంటి అంశాలు దేశ ఆర్థిక స్థితిపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆర్బీఐ నుంచి అందుతున్న ఈ భారీ డివిడెండ్.. కేంద్ర ప్రభుత్వానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బలమైన రక్షణ కవచంలా (బఫర్‌గా) ఉపయోగపడనుంది.ఆర్బీఐకి ఈ ఆదాయం ఎలా వస్తుంది?సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం తన వివిధ రకాల పెట్టుబడులు, విదేశీ మారక నిల్వల (Forex Reserves) నిర్వహణ, కరెన్సీ నోట్ల ముద్రణ ద్వారా వచ్చే ఆదాయం నుండి తన ఖర్చులు, రిస్క్ నిధులను మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. ఈ నిధులు ప్రభుత్వ బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి, సంక్షేమ కార్యక్రమాలకు ఎంతో కీలకంగా ఉంటున్నాయి. -
అవన్నీ అసత్య కథనాలు: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని దేవాలయాల బంగారు నిల్వలకు బదులుగా ప్రభుత్వం బంగారం బాండ్లు జారీ చేయనుందని, ఆ నిల్వలను నగదుగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ వార్తలు పూర్తిగా అసత్యాలని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుల చేసింది.ఆలయాల బంగారాన్ని నగదుగా మార్చేందుకు సంబంధించి ఎలాంటి పథకాన్ని ప్రవేశపెట్టే యోచన ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. అలాగే, ఆలయ గోపురాలు, తలుపులపై ఉండే బంగారు పూతను ‘భారత వ్యూహాత్మక బంగారు నిల్వ’గా పరిగణిస్తారనే ప్రచారంలోనూ ఎలాంటి నిజం లేదని పేర్కొంది. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని, వాటిని షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. అధికారికంగా ధ్రువీకరించని సమాచారాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తూ ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు, గందరగోళం సృష్టించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి కేవలం అధికారిక ప్రకటనలు, ప్రభుత్వ వెబ్సైట్లలోని సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని స్పష్టం చేసింది. -
'బుల్లెట్ స్పీడ్' పనులతోనే..
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి బుల్లెట్ రైలు మరో రెండేళ్లలో ముంబై–అహ్మదాబాద్ కారిడార్‌పై పరుగులు తీయనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మరో ఏడు కారిడార్లలో మూడు కారిడార్లు హైదరాబాద్‌తో అనుసంధానం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాటిలో ముంబై (పుణే తొలిదశ) కారిడార్ డీపీఆర్ తాజాగా సిద్ధమవగా మిగతా రెండు కారిడార్ల డీపీఆర్‌లు కూడా ఈ ఏడాదే పూర్తి కానున్నాయి. దీంతో ఈ నాలుగు నగరాల మధ్య విమానయానానికి ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రానుందన్న సంబురం అందరిలో కనిపిస్తోంది. కానీ బుల్లెట్ రైలు ఎక్కి ఆ సంబరాన్ని అనుభవించాలంటే మాత్రం కనీసం 2038 వరకు ఎదురుచూడాల్సి రానుంది! అహ్మదాబాద్–ముంబై ప్రాజెక్టు అనుభవాలు ఇవే... దేశానికి తొలి బుల్లెట్ రైలును పరిచయం చేయబోతున్న అహ్మదాబాద్–ముంబై (508 కి.మీ) కారిడార్ పనులు 2017లో ప్రారంభమయ్యాయి. బుల్లెట్ వేగంతో పనులు పూర్తి చేసి ఆరేడేళ్లలో రైలును పట్టాలెక్కించాలని భావించారు. కానీ భూసేకరణకే ఆరేళ్ల కాలం కరిగిపోయింది. మధ్యలో కోవిడ్ కష్టకాలం కూడా జాప్యాన్ని పెంచింది. అయితే ఎట్టకేలకు వచ్చే ఏడాది సూరత్ సెక్షన్లో 100 కి.మీ. నిడివిలో బుల్లెట్ రైలు పరుగుపెట్టనుంది. కానీ మొత్తం ప్రాజెక్టు పూర్తి కావడానికి 2029 వరకు సమయం పట్టనుంది. ఈ కారిడార్‌తో పోలిస్తే హైదరాబాద్‌తో అనుసంధానమయ్యే మూడు రూట్ల నిడివి ఎక్కువే. దీంతో పనులు పూర్తయ్యేందుకు 15 ఏళ్ల సమయం పట్టొచ్చని హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ అంచనా వేస్తోంది. అయితే కనీసం ఒక ప్రాజెక్టునైనా వేగంగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది. ఎక్కువ సమయం దేనికంటే? బుల్లెట్ రైలు కారిడార్ స్టాండర్డ్ గేజ్‌లో ఉంటుంది. ఎలివేటెడ్ వయాడక్ట్‌తో కలుపుకొని దీని వెడల్పు 17.5 మీటర్ల వెడల్పు. అంటే ఒక కి.మీ. కారిడార్ నిర్మాణానికి 1.75 హెక్టార్ల భూమి అవసరం. స్టేషన్ భవనాలు, డిపోలు, సొరంగాల నిర్మాణం లాంటివి కలుపుకొంటే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్–పుణే–ముంబై కారిడార్ కోసం 2 వేల హెక్టార్లు అవసరమవుతుందని అంచనా. ఇందులో తెలంగాణ పరిధిలో 280 హెక్టార్లు అవసరమవుతుంది. బెంగళూరు కారిడార్ కోసం 1,850 హెక్టార్లు, చెన్నై కారిడార్ కోసం 2,330 హెక్టార్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఇందులో 80 శాతం భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉండటంతో పరిహారంపై నిర్వాసితుల అభ్యంతరాలు, కోర్టు కేసులు పరిష్కారమై కార్పొరేషన్ చేతికి భూమి లభించేందుకు కనీసం 4–5 ఏళ్ల సమయం పడుతుందని హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ భావిస్తోంది. ఎలివేటెడ్ నిర్మాణాలు కావడంతో.. బుల్లెట్ రైలు కారిడార్లు ఎలివేటెడ్ పద్ధతిలో రూపొందుతాయి. ఎలివేటెడ్ వయాడక్డ్ ఎత్తు 10 మీటర్ల నుంచి 15 మీటర్ల మేర ఉంటుంది. అహ్మదాబాద్ ప్రాజెక్టులో సబర్మతి నదిని క్రాస్ చేసే చోట దాని ఎత్తు గరిష్టంగా 35 మీటర్లుగా ఉంది. అంటే ఫ్లైఓవర్ నిర్మించిన తరహాలో ఉంటుంది. అందుకే వాటి నిర్మాణానికి చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే బుల్లెట్ రైళ్ల గరిష్ట వేగం 400 కి.మీ.. ఆపరేషనల్ వేగం గంటకు 320–350 కి.మీ.గా ఉండనుంది. అంత వేగంతో సాఫీగా రైళ్లు ప్రయాణించాలంటే కారిడార్‌లో మలుపులు తక్కువగా ఉండాలి. ఎదురుగా నది, గుట్ట అడ్డొస్తే తప్పించే వీలుండదు. అందుకే కారిడార్ మార్గంలో సొరంగాల నిర్మాణం నిడివి కూడా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్–ముంబై కారిడార్‌లో వికారాబాద్ సమీపంలో ఏకబిగిన 4.5 కి.మీ. సొరంగ మార్గం ఉండనుంది. అలాగే పుణే దాటాక వచ్చే పశ్చిమ కనుమల ఖండాలా ఘాట్ ప్రాంతంలో అత్యంత సంక్లిష్టమైన 13 సొరంగాలు (మొత్తం 24 కి.మీ. నిడివి) నిర్మించాల్సి రానుంది. ముంబై పరిసరాల్లో సుమారు 35 కి.మీ. మేర భూగర్భ ట్రాక్ ఉండనుంది. బెంగళూరు శివార్లలోనూ వాటి అసవరం ఏర్పడనుంది. తమిళనాడు సరిహద్దుల్లో (మింజూర్ పరిసరాల్లో) సుమారు 11.6 కి.మీ పొడవైన సొరంగం, ఏపీలోని కొన్ని కొండ ప్రాంతాల్లో సొరంగాలు నిర్మించాల్సి రానుంది. నిడివి–అంచనా వ్యయం హైస్పీడ్ రైలు మార్గాల నిర్మాణానికి ఒక్కో కిలోమీటర్ ట్రాక్‌కు దాదాపు రూ. 250 కోట్ల నుంచి రూ. 300 కోట్ల వరకు ఖర్చవుతుందని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేర్కొంటోంది. ఈ లెక్కన మూడు కారిడార్ల అంచనాలు ఇలా ఉన్నాయి. 1) హైదరాబాద్–పుణె–ముంబై కారిడార్ మొత్తం నిడివి: సుమారు 671 కి.మీ. నిర్మాణ వ్యయం (అంచనా): సుమారు రూ. 1.60 లక్షల కోట్ల నుంచి రూ. 1.80 లక్షల కోట్ల వరకు. ఈ మార్గంలో పశి్చమ కనుమల (ఘాట్ రోడ్లు) గుండా సొరంగాలు నిర్మించాల్సి రావడం వల్ల మిగిలిన రూట్లతో పోలిస్తే కిలోమీటర్‌కు అయ్యే ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. 2) హైదరాబాద్–బెంగళూరు కారిడార్ మొత్తం నిడివి: దాదాపు 618 కి.మీ. నిర్మాణ వ్యయం (అంచనా): రూ. 1.50 లక్షల కోట్ల నుంచి రూ. 1.65 లక్షల కోట్లు వరకు 3) హైదరాబాద్–విజయవాడ–చెన్నై కారిడార్ మొత్తం నిడివి: దాదాపు 744 కి.మీ. నిర్మాణ వ్యయం (అంచనా): దాదాపు రూ. 1.85 లక్షల కోట్ల నుంచి రూ. 2.10 లక్షల కోట్ల వరకు ముంబై–అహ్మదాబాద్ ప్రాజెక్టుకు 2016లో అంచనా వ్యయం రూ. 1.09 లక్షల కోట్లుకాగా ప్రస్తుతం దాన్ని రూ. 1.85 లక్షల కోట్లకు సవరించారు. ఈ లెక్కన మన మూడు ప్రాజెక్టులు మరో 10–15 ఏళ్లతో కూడుకున్నవి కావడంతో ఖర్చు భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
వాహనదారులకు కేంద్రం షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
కేంద్రం మరో షాక్.. సీఎన్జీ ధరల పెంపు
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో బిగ్ షాకిచ్చింది. సీఎన్జీ ధరలను మరోసారి పెంచింది. తాజాగా కిలో సీఎన్జీ ధరను రూపాయి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, రెండు రోజుల క్రితమే పెట్రో ధరల పెంపు సందర్బంగా సీఎన్జీ కూడా రూ.2 పెంచిన సంగతి తెలిసిందే. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే సీఎన్జీ ధరను కేంద్రం రెండుసార్లు పెంచడంతో వాహనదారులు మండిపడుతున్నారు. తాజా పెంపుతో సీఎన్జీపై మొత్తంగా మూడు రూపాయాలను పెంచినట్టు అయ్యింది. తాజాగా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.80.09కి చేరింది. ముంబైలో రూ. 84.09కి చేరింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో రూ. 88.70కి పెరిగింది. ఇక, హైదరాబాద్‌లో రూ.100కు చేరుకుంది.CNG rates have been increased by Re 1 from today. In Delhi, per KG CNG will cost Rs 80.09. In Noida-Ghaziabad, per KG CNG will cost Rs 88.70. This is the second increase in prices in 2 Days. Earlier on 15th May, CNG prices were increased to Rs 2/KG.— ANI (@ANI) May 17, 2026ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలో సీఎన్జీ గ్యాస్ కొరత 6 నెలల నుంచి తీవ్రంగా వేధిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తుతున్న డ్రైవర్లు సీఎన్ గ్యాస్ నయమని భావిస్తే.. ఇప్పుడు ఈ ధర కూడా సెంచరీకి చేరుకుంది. పెట్రోల్,డీజిల్‌తో పోలిస్తే సీఎన్జీ అధికమైలేజీతో పాటు కాలుష్య రహితం కావడంతో చాలా మంది వాహనాలను సీఎన్జీకి అనుగుణంగా ఇంధన ట్యాంకులను మార్చుకున్నారు. మరోవైపు సీఎన్జీ ఇంధన కొరతతో నో స్టాక్ బోర్డులు బంకుల్లో దర్శనమిస్తున్నాయి. దీంతో ఆటో డ్రైవర్లు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇంధన కొరత సమస్యను పరిష్కరించాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. -
తమిళనాడు సీఎం విజయ్ ఆగ్రహం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరల పెరుగుదలపై తీవ్రంగా స్పందించారు. పెరుగుదలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పెట్రో ధరల పెంపు పేదలు, మధ్యతరగతి ప్రజల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.చెన్నైలో శుక్రవారం జరిగిన సమావేశంలో సీఎం విజయ్ మాట్లాడుతూ.. ‘పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 పెంచడం అన్యాయం. మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను తగ్గించకుండా లాభాల రూపంలో లబ్ధి పొందుతున్నాయి. నిరు పేదలు, మధ్య తరగతి వర్గం ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, ఇతర చిన్నచిన్న వాహనాలపై ఆధారపడుతున్నారు. ధరల పెరుగుదల వారి నెలవారీ ఆదాయంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బ్యాంకు రుణాలతో వాహనాలు కొనుగోలు చేసి టాక్సీలు లేదా అద్దె వాహనాలుగా నడిపే వారు మరింత ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వల్ల అద్దె ధరలు పెరగడం, అవసరమైన వస్తువుల ధరలు పెరగడం, కొనుగోలు శక్తి తగ్గిపోవడం జరుగుతుందని గుర్తు చేశారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమలపై ప్రభావంమైక్రో,చిన్న పరిశ్రమలు (MSEs) కూడా ఇంధన ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయన్న సీఎం విజయ్ తద్వారా దేశీయ మార్కెట్ విక్రయాలు, ఎగుమతులు మందగించే ప్రమాదం ఉందని చెప్పారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలమన్నారు.కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి, ఇంధన ధరల పెరుగుదల తక్షణమే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2022 ఏప్రిల్ నుండి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, 2024 మార్చిలో లోక్‌సభ ఎన్నికల ముందు ఒక్కసారి రూ.2 తగ్గించారని, ఇప్పుడు పెరుగుదల అన్యాయమని ఆయన అన్నారు. 2022 ఏప్రిల్‌లో చివరిసారి ధరలు పెరిగాయి. ఆ తర్వాత 2024 మార్చిలో ఎన్నికల ముందు ఒక్కసారి తగ్గించారు. ఇప్పుడు మళ్లీ పెట్రో ధరలు పెంచడం ప్రజలకు భారమని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ஒன்றிய அரசின் பொதுத்துறை எண்ணெய் நிறுவனங்கள் பெட்ரோலியப் பொருட்களின் விலையை இன்று (15.05.2026) உயர்த்தியுள்ளது தொடர்பாக மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்களின் அறிக்கை#CMJosephVijay pic.twitter.com/FZIcuTHdCQ— CMOTamilNadu (@CMOTamilnadu) May 15, 2026 -
గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్రం సానుకూలం
-
పెట్రో ధరల పెంపు.. కేంద్రం తొలి స్పందన ఇదే..
ఢిల్లీ: దేశంలో పెట్రో రేట్ల పెంపుపై కేంద్రంగా తొలిసారిగా స్పందించింది. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిరణ్ రిజుజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా, ద్రవ్యోల్భణం పెరగకుండా చమురు సంస్థలు ఇన్నాళ్లూ భారాన్ని మోశాయి. అన్ని దేశాల కంటే భారత్‌లోనే పెట్రో రేట్లు తక్కువగా పెరిగాయని చెప్పుకొచ్చారు.కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ఎక్స్ వేదికగా స్పందిస్తూ..‘పశ్చిమాసియా పరిణామాలతో చమురు ధరలు పెరిగినా భారత్ మాత్రం ప్రజలపై భారం మోపలేదు. మిగతా దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను 20-100 శాతం పెంచాయి. కానీ, భారత్‌లో మాత్రం పెట్రోల్‌పై 3.2 శాతం, డీజిల్‌పై 3.4 శాతం పెరిగింది. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా, ద్రవ్యోల్భణం పెరగకుండా చమురు సంస్థలు ఇన్నాళ్లూ భారాన్ని మోశాయి. ఇది బాధ్యతతో కూడిన పరిపాలన. ఇది ప్రజలకు ప్రాధాన్యతనిచ్చే నాయకత్వం. నాయకత్వంలో, భారతదేశం ఆర్థిక స్థిరత్వాన్ని, ప్రజా సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూనే ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.As the world battled rising fuel costs after the West Asia conflict, India stood apart. While several countries witnessed petrol & diesel hikes ranging from 20% to nearly 100%, India limited the increase to just +3.2% for petrol & +3.4% for diesel.Even as Brent crude crossed… pic.twitter.com/nbyiBbhhC9— Kiren Rijiju (@KirenRijiju) May 15, 2026ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా వాహనదారులకు ఊహించినట్లే ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కసారిగా రూ.3పైగా పెంచాయి. ఈ పెంపు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పటికే భారంగా ఉన్న ఇంధన ధరలు మరింత పెరిగి ప్రజల జేబులకు మంటలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. పెంపు వెనుక కారణాలు.. 2022 ఏప్రిల్ నుంచి(ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంలోనూ) పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు మారలేదు. పైగా లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటరుకు రూ.2 చొప్పున తగ్గించాయి. అయితే పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం కారణంగా ఆ పరిస్థితి ఒక్కసారిగా మారింది.భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు రూ.1,600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. కానీ.. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది. -
పసిడిపై పన్ను పిడుగు
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న బంగారం దిగుమతులు, విదేశీ మారకద్రవ్యంపై తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.బంగారం కొనుగోళ్లను ఏడాదిపాటు వాయిదా వేసుకోవాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన రెండు రోజులకే ఈ దిశగా కఠిన చర్యలకు దిగింది. తగ్గిపోతున్న రూపాయి విలువను కాపాడేందుకు, అవసరం లేని దిగుమతులను కట్టడి చేసేందుకు పసిడి, వెండిపై దిగుమతుల సుంకాన్ని కేంద్రం గణనీయంగా పెంచింది. ఇప్పటి వరకు 6 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతం చేసింది. ప్లాటినంపై కస్టమ్స్ సుంకాన్ని 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచింది. బుధవారం నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. ఆభరణాలు, వాటి విడిభాగాలు, కాయిన్లు, కడ్డీలు సహా భౌతిక రూపంలోని దిగుమతులు అన్నింటికీ ఈ సుంకాలు వర్తిస్తాయి. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత ఎగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకీ చర్యలు..? ⇒ కస్టమ్స్ డ్యూటీ పెంచడానికి అంతర్జాతీయంగా నెలకొన్న తీవ్ర ప్రతికూల పరిస్థితులను ప్రభుత్వం కార ణంగా పేర్కొంది. అంతర్జాతీయ సంక్షోభాల్లో అవసరంలేని దిగుమతులను నియంత్రించడం స్థూల ఆర్థిక స్థిరత్వానికి సాయం చేస్తుందని అధికారుల వాదన. ⇒ డాలర్‌తో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టమైన 95.75 స్థాయికి పడిపోయింది. 2025 డిసెంబర్లో 90 స్థాయిలో ఉంటే, ఐదు నెలల్లోనే 6% పతనమైంది. దీంతో దిగుమతులకు మరిన్ని రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాది క్రితం రూపాయి విలువ 84.2 స్థాయిలో ఉండడం గమనార్హం. ⇒ పశ్చిమాసియాలో ఘర్షణలతో సరఫరా సమస్యలు ఏర్పడి, అంతర్జాతీయంగా ముడి చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. భారత్‌కు ప్రధాన సరఫరా మార్గమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సరఫరా తగ్గిపోయింది. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ 108 డాలర్లకు చేరింది. యుద్ధానికి ముందు ఈ ధర 70 డాలర్లలోపే ఉండడం గమనార్హం. దీంతో ఎరువుల ధరలూ భారీగా ఎగిశాయి. ⇒ భారీ ధరలపై ముడి చమురు, ఎరువులు, బంగారం దిగుమతుల కోసం డాలర్ల అవసరం అనూహ్యంగా పెరిగింది. దీంతో రూపాయి విలువ బక్కచిక్కిపోతోంది. ఫలితంగా విలువైన విదేశీ మారకం నిల్వలు తరిగిపోతున్నాయి. ఫిబ్రవరి 27 నాటికి 728.49 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారకం నిల్వలు మే 1 నాటికి 690 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. కరెంట్ ఖాతా లోటు విస్తరించే రిస్క్ ఏర్పడింది. ⇒ ఆయిల్ అండ్ గ్యాస్ తర్వాత దిగుమతి చేసుకుంటున్న రెండో అత్యంత విలువైన కమోడిటీ పసిడే. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి అయిన ముడి చము రు, ఎరువులు, వంట నూనెలు, పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులకే ప్రాధాన్యం ఇస్తూ, అంత అవసరం లేని బంగారం, వెండి ఇతర విలువైన లోహాల డిమాండ్‌ను తగ్గించాలన్నది కేంద్ర సర్కారు యోచన. ⇒ ప్రపంచంలో చైనా తర్వాత భారతే పసిడిని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. ఇది ఏటా 700–800 టన్నుల మధ్య ఉంటోంది. 2025–26లో విలువైన లోహాల దిగుమతుల విలువ అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024–25)తో పోల్చి చూస్తే 26.7% పెరిగి 102.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో పసిడి దిగుమతులే 71.98 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. పరిమాణం పరంగా మాత్రం 4.75% తగ్గి 721.03 టన్నులుగా ఉంది. ధరలు పెరిగినప్పటికీ ప్రజల కొనుగోళ్ల విలువ తగ్గలేదని ఈ డేటాతో స్పష్టమవుతోంది. ⇒ తాజా సుంకాల పెంపుతో దిగుమతులు (పరిణామం పరంగా) 10–15% తగ్గొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నా యి. గతంలో సుంకాలు పెంచిన సందర్భాల్లోనే దిగుమతులు తగ్గడం గమనార్హం. ⇒ అధిక సుంకాలతో పసిడి అక్రమ రవాణా పెరిగే ప్రమాదమూ ఉంటుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయెలరీ కౌన్సిల్ హెచ్చరించింది. ⇒ పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత ఆర్బీఐ సహా అన్ని సెంట్రల్ బ్యాంక్‌లు విదేశీ మారకం ఆస్తుల్లో బంగారానికి వెయిటేజీని పెంచడం విశేషం. ఆర్బీఐ వద్ద 880 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఇక గృహాల్లో అయితే 30,000 టన్నులు (5 ట్రిలియన్ డాలర్ల విలువ) ఉండొచ్చని అంచనా.సుంకాలు ఇలా.. బంగారం, వెండిపై 5 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10 శాతానికి చేరింది. ఒక శాతంగా ఉన్న వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి సెస్సు (ఏఐడీసీ)ను 5 శాతానికి పెంచారు. మొత్తం కలసి 15 శాతానికి చేరింది. ఇక విక్రయాలపై 3 శాతం జీఎస్టీ కూడా కలుపుకుంటే పసిడి, వెండిపై స్థూల పన్ను భారం ఇంతకుముందున్న 9.18 శాతం నుంచి 18.45 శాతానికి పెరిగింది. ప్లాటినంపై 6.4 శాతం నుంచి 15.4 శాతానికి కస్టమ్స్ సుంకం పెరగ్గా, దీనికి 3 శాతం జీఎస్టీ జోడిస్తే మొత్తం పన్ను 18.86 శాతానికి చేరినట్టయింది. ధరలు పెరిగిపోవడంతో మే నెల రిటైల్ ద్రవ్యోల్బణంపై ఈ ప్రభావం పడనుంది. అసలు పూర్తి ప్రభావం జూన్ నెల డేటాలో కనిపించనుంది. ఇప్పటికే ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణం పెరుగుదలలో బంగారం, వెండి ధరల పాత్ర ఉండడం గమనించొచ్చు. ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయెలరీ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే స్పందిస్తూ.. 10 గ్రాముల బంగారంపై పన్నుల భారం రూ.27,000కు చేరుకున్నట్టు (జీఎస్టీ కూడా కలసి) చెప్పారు. భారం ఎంతంటే..⇒ దిగుమతి పసిడి/వెండి విలువ (ఇన్వాయిస్ ధర, బీమా, రవాణా చార్జీ) రూ.1,00,000 ⇒ దీనిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10%= రూ.10,000 ⇒ సర్‌చార్జీ/ఏఐడీసీ బేసిక్ డ్యూటీ 5% = రూ.5,000 ⇒ మొత్తం = 1,15,000 ⇒ దీనిపై 3 శాతం జీఎస్టీ = రూ.3,450 ⇒ పన్ను అనంతరం మొత్తం విలువ రూ.1,18,450 -
మీ ఇంట్లో ఉన్న బంగారానికి వడ్డీ.. మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్?
న్యూఢిల్లీ: పసిడి ప్రియులకు కేంద్రం శుభవార్త. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా త్వరలో కేంద్రం కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీని అందుబాటులోకి తేనుంది. తద్వారా ఇంట్లో ఉన్న బంగారంతో వడ్డీ వచ్చేలా ప్రతిపాదించనుంది. వినియోగదారులు వారి వద్ద ఉన్న కనీసం 10 గ్రాముల బంగారం ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రేటు సుమారు 2శాతం నుంచి 2.5శాతం వరకు పొందవచ్చు. భారతీయుల వద్ద సుమారు 30,000 టన్నుల బంగారం నిల్వగా ఉందని అంచనా. దీన్ని వెలికితీసేందుకు ప్రధాని మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. రూపాయి విలువను బలోపేతం చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.మోదీ ప్రభుత్వం తీసుకురానున్న ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో డిపాజిట్ చేసిన బంగారంపై వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది. సుమారు 2,000 టన్నుల బంగారం డిపాజిట్ అయితే, మూడేళ్ల వరకు దిగుమతుల అవసరం ఉండదని అంచనా. గోల్డ్ పాలసీలో కీలక మార్పులకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. ఈ కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది. -
కార్మికుల కోసం కొత్త స్కీమ్ ప్రతి నెల రూ 1 లక్ష వరకు పెన్షన్
-
బంగారం రేటు మరింత పెరగబోతుంది..
-
కేంద్రం బిగ్ షాక్.. సుంకాలు డబుల్.. భారీగా పెరగనున్న ధరలు
-
పెట్రోల్ రేట్ల పెంపు తప్పదా?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) రోజుకు రూ.1,600–1,700 కోట్ల చొప్పున నష్టపోతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత నుంచి 10 వారాల్లో వీటి నష్టం రూ.లక్ష కోట్లకుపైనే ఉంటుందని అంచనా. అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగిపోయినప్పటికీ.. దేశీయంగా వాటి ధరలను సవరించకుండా ఓఎంసీలు (బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్) విక్రయిస్తుండడంతో వాటిపై మోయలేనంత భారం పడుతోంది. ఒకవైపు అధిక ధరలు కొనుగోలు చేసి, తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని కొంత మేర తగ్గించడం తెలిసిందే. తద్వారా నెలకు రూ. 14,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోంది. లేదంటే ఓఎంసీలపై ఈ నష్టం మరింతగా ఉండేది. అయితే, ఇలా ఎంత కాలం పాటు అవి ఈ స్థాయిలో భారాన్ని మోస్తాయన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోలియం ఉత్పత్తుల విక్రయ ధరలను పెంచొచ్చన్న వార్తలు వినిపించాయి. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. కానీ, పరిస్థితి చూస్తుంటే ఎంతో కొంత ధరలు పెంచక తప్పనిసరి అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిత్యం వేల కోట్ల నష్టం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో జపాన్, యూకే తదితర దేశాల్లో పెట్రోల్ ధరలను 30 శాతం వరకు పెంచడం గమనార్హం. అయినప్పటికీ సామాన్యులపై ధరల భారం పడరాదన్న కేంద్రం విధానం మేరకు.. ఇక్కడ ఓఎంసీలు గతం నుంచి ఉన్న ధరలకే ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. గ్యాస్ ధరలను అవి కొంత వరకు సవరించినప్పటికీ.. వాటి కొనుగోలు కంటే వసూలు తక్కువగానే ఉంది. ఫలితంగా ఈ సంస్థలకు రోజుకు సుమారు రూ. 1,600 నుండి 1,700 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఓఎంసీలు సొంత ఆదాయంతోనే ముడి చమురు కొనుగోలు, శుద్ధి చేపడుతుంటాయి. రోజురోజుకూ నష్టాలు పెరుగుతుండడంతో ముడి చమురు కొనుగోలు కోసం అవి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధరల పెంపు అనివార్యమని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఎంత మేరకు పెంచాలి, ఎప్పుడు పెంచాలి? అనేది ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందంటున్నారు. -
బడుల పగ్గాలు పేరెంట్స్‌కే!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 15 లక్షల ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, బడ్జెట్ బాధ్యతలను ఇకపై నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకే అప్పగించనుంది. బడులను కేవలం ప్రభుత్వ సంస్థలుగానే కాకుండా సామాజిక ఆస్తులుగా అభివృద్ధి చేయడమే ఈ విధానం లక్ష్యం. జాతీయ విద్యా విధానం(ఈఎన్సీ)–2020, విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ)–2009 ఆధారంగా విద్యాశాఖ రూపొందించిన కొత్త మార్గదర్శకాలు మే 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. చెక్‌బుక్ పవర్ కొత్తగా తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు చెక్‌బుక్ పవర్. ఇకపై ప్రధానోపాధ్యాయుడు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) అధ్యక్షుడు (తల్లిదండ్రుల్లో ఒకరు) పేరిట స్కూలుకు ఉమ్మడి బ్యాంకు ఖాతా ఉంటుంది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా నిధులను వాడటం సాధ్యం కాదు. పాఠశాలలో రూ.30 లక్షల లోపు నిర్మాణ పనులను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) అనుమతి లేకుండానే ఎస్ఎంసీలు నేరుగా చేపట్టవచ్చు. ప్రైవేట్ కంపెనీల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను సేకరించేందుకు కూడా అనుమతి కల్పించారు. ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే నిధుల వినియోగంలో పారదర్శకత సాధించేందుకు ప్రభుత్వ ఆడిట్‌తో పాటు వార్షిక సోషల్ ఆడిట్‌ను తప్పనిసరి చేశారు. స్కూల్‌కు వచ్చే ప్రతి పైసా ఖర్చుల వివరాలను పబ్లిక్ నోటీస్ బోర్డుపై బహిరంగంగా ప్రదర్శించాలి. జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తూ, ఏవైనా అవకతవకలు జరిగితే పోలీస్, ఆరోగ్య శాఖలతో కలిసి నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఎస్ఎంసీకి ఇచ్చారు.కమిటీ స్వరూపం ఇదీ → 75% తల్లిదండ్రులే: కమిటీలోని మొత్తం సభ్యులలో మూడు వంతుల మంది విద్యార్థుల తల్లిదండ్రులే ఉంటారు. → 50% మహిళలు: కమిటీలో సగం మంది సభ్యులు తప్పనిసరిగా మహిళలే అయి ఉండాలి.→ 25% ఇతర సభ్యులు: పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక కౌన్సిలర్ లేదా పంచాయతీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, స్థానిక విద్యావేత్తలు మిగతా పావు శాతం ఉంటారు. → పదవీకాలం: ఈ కమిటీని రెండేళ్ల కాలవ్యవధికి ఎన్నుకుంటారు. ప్రతి నెలా విధిగా ఒకసారి సమావేశమవ్వాలి. -
మెట్రో ఫేజ్–2కు ఆమోదం తెలపండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏడు కారిడార్లతో కూడిన మెట్రో ఫేజ్–2 సమగ్ర ప్రణాళికను రూపొందించి ఇప్పటికే డీపీఆర్‌ను సమర్పించినట్లు తెలిపారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సీఎం సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2, ఫేజ్–3పై చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫేజ్–2, ఫేజ్–3 విస్తరణ సజావుగా సాగాలనే ఉద్దేశంతో మెట్రో ఫేజ్–1ను ఎల్అండ్టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ను ప్రభుత్వం స్వా«దీనం చేసుకుందని వివరించారు. ఈ నేపథ్యంలో ఫేజ్–2ను భారత ప్రభుత్వం – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆర్జీఐ ఎయిర్పోర్ట్ – భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను మెట్రో ఫేజ్–3గా చేపట్టాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను కూడా ఇప్పటికే సమర్పించామని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కె.శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డి, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (పట్టణ రవాణా) ఎన్వీఎస్ రెడ్డి, ఢిల్లీ తెలంగాణ భవన్ ప్రత్యేకాధికారి సంజయ్‌కుమార్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కేరళలో మోదీ, అమిత్‌షాలను ఓడించాం: సీఎం – వాళ్లకు ఒక్క సీటే దక్కింది తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కేరళలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఓడించామని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు స్పందించారు. ‘కేరళలో కాంగ్రెస్ విజయం సాధించింది. అక్కడ రాహుల్, ప్రియాంకా గాం«దీ, మల్లికార్జున ఖర్గేలు నరేంద్ర మోదీ, అమిత్‌షాలను ఓడించారు. వాళ్లకు అక్కడ ఒక్క స్థానం మాత్రమే దక్కింది. అదీ వాళ్ల పనితీరు..’అంటూ ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. -
హోటల్లో తినాలంటే ఇక వాతలే
-
పోలవరం పనులపై కేంద్రం అసంతృప్తి
-
త్వరలోనే పెట్రో బాదుడు..పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 5 రూపాయల దాకా పెంపు... వంట గ్యాస్ సిలిండర్‌పై మరో 50 రూపాయలు
-
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
-
పెట్రోల్ ధర రూ.10, డీజిల్ ధర రూ.12.50 పెరిగిందా?
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిందనే కథనాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఆ కథనాల్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఖండించింది. దేశంలో ఇంధన ధరలు పెరగలేదని, స్థిరంగా ఉన్నట్లు పేర్కొంది.కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పెట్రోల్ ధరలను రూ.10, డీజిల్ ధరలను రూ.12.50 పెంచినట్లు సోషల్ మీడియా పోస్టులు వైరల్‌గా మారాయి. ఇంధన ధరల పెంపుపై వస్తున్న వదంతులను భారత ప్రభుత్వం బుధవారం ఖండించింది. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన అధికారిక ఉత్తర్వు అంటూ ప్రచారంలో ఉన్న ఓ పత్రాన్ని ట్వీట్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో షేర్ చేసింది. ఆ పత్రం ‘నకిలీ’దని ప్రకటించింది. వదంతులను నమ్మొద్దని కోరింది. ఇంధన ధరలు పెరిగాయంటూ సర్క్యూలేట్ అవుతున్న పత్రాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ చెక్ చేసింది. అది ఫేక్ న్యూస్ అని తేల్చింది. భారత ప్రభుత్వం అటువంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదు’అని పేర్కొంది.🚨FAKE NEWS!An order circulating on social media claims to be issued by the Ministry of Petroleum and Natural Gas, stating that petrol and diesel prices have been increased by ₹10 and ₹12.50, respectively.#PIBFactCheck:❌ This order is #FAKE .✅ The Government of India… pic.twitter.com/tMmJa0Y4qA— PIB Fact Check (@PIBFactCheck) April 29, 2026 -
ఏపీలో ఇంధన సంక్షోభం.. కూటమి సర్కార్‌ను తప్పుబట్టిన కేంద్రం
సాక్షి,అమరావతి: ఏపీలో పెట్రోల్ సంక్షోభానికి కూటమి ప్రభుత్వం మరింత ఆజ్యం పోసింది. నాలుగు రోజుల క్రితం ఆయిల్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా బల్క్ డీజిల్‌ను రిటైల్ బంకుల నుంచి సరఫరా చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. మొత్తం 2 కోట్ల 75 లక్షల 66 వేల లీటర్ల డీజిల్‌ను సరఫరా చేయాలని నిర్ణయించింది.దీంతో కూటమి సర్కార్ చర్యలతో పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై ఏపీ సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాలను కేంద్ర పెట్రోలియం శాఖ తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కేంద్రం లేఖ రాసింది. ఇది పెట్రోలియం నియమాలు, నిత్యావసర వస్తువుల చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది. -
వాహనదారులకు అలెర్ట్.. పెట్రోల్‌కి గుడ్‌బై?
ఢిల్లీ: వాహనదారులకు అలెర్ట్. పశ్చిమాసియా యుద్ధం కారణంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలో కేంద్రం పెట్రోల్‌లో ఇథనాల్ కలిపి అమ్మకాలు నిర్వహించేలా డ్రాఫ్ట్ బిల్లు (ప్రతిపాదిత చట్టం) సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, ఆ డ్రాఫ్ట్ బిల్లులో గతంలో చెప్పినట్లుగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి అమ్మకాలు నిర్వహించేలా కాకుండా.. 85శాతం ఇథనాల్.. 15శాతం పెట్రోల్ మాత్రమే వాహనాల్లో వినియోగించేలా కేంద్రం ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. భారత్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 90శాతం విదేశాల నుంచి ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. రానున్న రోజుల్లో చమురు దిగుమతులు తగ్గించుకునేలా ప్రయత్నాలు ప్రారంభించిందిఇదే అంశంపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు సంబంధం ఉన్న సీనియర్ ప్రభుత్వ అధికారులు జాతీయ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ప్రభుత్వం ఇథనాల్ 85 (ఈ85) అంశాన్ని డ్రాఫ్ట్ రూపంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. అంతేకాదు ఇథనాల్ 85పై ఇటు ప్రభుత్వంలో అటు మార్కెట్లో సైతం ఏకాభిప్రాయం ఉంది ప్రాథమిక పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ85 కోసం ఇంజన్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో విడుదలయ్యేందుకు రెండేళ్ల సమయం పడుతుందని అంచనా. మరో అధికారి మాట్లాడుతూ..ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు సైతం 15శాతం పెట్రోల్,85శాతం ఇథనాలు కలిపి అమ్మకాలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న డ్రాఫ్ట్ బిల్లుపై అంగీకారం తెలిపాయని,త్వరలో అధికారిక ప్రకటన చేస్తాయన్న ఆయన.. ‘మార్కెట్ ఏకాభిప్రాయం ఇప్పటికే కుదిరింది. ఈ85 కోసం వాహనాల ప్రాథమిక పరీక్షలు కూడా పూర్తయ్యాయి’అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఈ20 పెట్రోల్‌కు భిన్నంగా, ఈ85ను ఒక ప్రత్యేక ఇంధన గ్రేడ్‌గా ప్రవేశపెట్టనున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ20 వేరియంట్లో ఇథనాల్ మిశ్రమాన్ని 27శాతం వరకు కలపవచ్చు. ఇంధన సంక్షోభం మధ్య కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశానికి కీలక మలుపు కానుంది. పెట్రోల్‌పై ఆధారాన్ని తగ్గించి, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు మద్దతు లభించనుంది. పర్యావరణానికి ప్రయోజనం కలిగించడమే కాకుండా, చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే అవకాశం ఉంది. అయితే, కొత్త ఇంజిన్లు, మౌలిక సదుపాయాలు, వినియోగదారుల అవగాహన వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఈ85 ప్రవేశం భారత ఇంధన రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. -
SBI ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం కీలక ప్రకటన!
-
డీఏ పెంపు.. కేంద్ర ఉద్యోగులకు ఇక మరింత జీతం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నిరీక్షణకు తెరపడింది. ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (DA)ను 2 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా పెంపుతో డీఏ ప్రస్తుతం ఉన్న 58 శాతం నుండి 60 శాతానికి చేరుకుంది.గత అక్టోబర్‌లో ప్రభుత్వం డీఏను 55% నుండి 58 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం జూలై 1, 2025 నుండి అమలులోకి వచ్చింది. ఇప్పుడు ప్రకటించిన అదనపు 2 శాతం పెంపుతో కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.జీతం ఎంత పెరుగుతుందంటే?ఈ పెంపు వల్ల నెలవారీ వేతనంలో మార్పులను ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిస్తే.. ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం (Basic Pay) రూ.50,000 అనుకుందాం. పాత రేటు (58%) ప్రకారం డీఏ రూ.29,000. కొత్త రేటు (60%) ప్రకారం డీఏ రూ.30,000. అంటే, ప్రతి నెలా నేరుగా రూ.1,000 అదనంగా లభిస్తుంది. దీనితో పాటు జనవరి నుండి రావాల్సిన బకాయిలు (Arrears) కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి.8వ వేతన సంఘానికి డిమాండ్లుఒకవైపు డీఏ పెరుగుతున్నప్పటికీ, ఉద్యోగ సంఘాలు 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుపై ఒత్తిడి పెంచుతున్నాయి. నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ 3.83 ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను డిమాండ్ చేస్తోంది. ఇదే గనుక అమలైతే కనీస వేతనం రూ.18,000 నుండి ఏకంగా రూ.69,000కు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత డీఏ పెంపు వల్ల సుమారు 1.19 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. -
జనగణన పూర్తి కాకుండానే డీలిమిటేషన్ బిల్లు.. దక్షిణాదికి జరిగే నష్టం ఇదే!
-
లోక్‌సభలో గట్టెక్కని మహిళా బిల్లు... అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు... మూడింట రెండొంతుల మెజారిటీ సాధనలో మోదీ సర్కారు విఫలం
-
కేంద్ర ఉద్యోగులకి జాక్ పాట్ కనీస వేతనం 69 వేలకు పెంపు


