యుద్ధ ఉద్రిక్తత.. నిత్యావసరాలు, గ్యాస్‌పై కేంద్ర కీలక ప్రకటన | Centre Makes Key Announcement on Essential Commodities and Gas | Sakshi
Sakshi News home page

యుద్ధ ఉద్రిక్తత.. నిత్యావసరాలు, గ్యాస్‌పై కేంద్ర కీలక ప్రకటన

Apr 6 2026 5:32 PM | Updated on Apr 6 2026 6:58 PM

Centre Makes Key Announcement on Essential Commodities and Gas

పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. ప్రస్తుతం దేశంలో బఫర్‌ స్టాక్స్ తగినంతగా ఉన్నయని తెలిపింది. ప్రజలకు రోజువారి అవసరాలకు సంబంధించిన నిత్యావసర ధరల్లో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు లేవని తెలిపింది. గోధుమ, బియ్యం, ఉల్లి, టమాట, ఆలు ధరలు స్థిరంగా ఉన్నాయని వాటి ధరల్లో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది.

అదేవిధంగా దేశంలో ప్రస్తుతం ఎల్‌పీజీ కొరత తీవ్రతరమైన నేపథ్యంలో గ్యాస్‌ నిల్వలపై కీలక ప్రకటన చేసింది. ఎల్‌పీజీ సరఫరా తగిన మోతాదులో ఉందని రిఫైనరీలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని పేర్కొంది. గ్యాస్‌ కొరతపై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముడిచమురు సరఫరా సైతం తగినంతగా ఉందని తెలిపింది.

కాగా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గల్ఫ్ దేశాలతో ఫోన్‌లో దౌత్య చర్చలు జరిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. అదే విధంగా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీతోనూ మాట్లాడారు. 

Advertisement
 
Advertisement
Advertisement