LPG
-
భారత్‌కు చేరుకున్న మరో ఎల్పీజీ నౌక
కాండ్లా : పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధన సరఫరాపై ఆందోళన నెలకొన్న వేళ పెద్దమొత్తంలో ఎల్పీజీ సరకుతో మరో నౌక భారత్‌కు చేరుకుంది. 20వేల మెట్రిక్ టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ)తో మార్షల్ ఐలాండ్ జెండాతో ఉన్న ట్యాంకర్ హార్మూజ్ జలసంధిని దాటి శనివారం గుజరాత్‌లోని కాండ్లా నౌకాశ్రయానికి చేరుకుంది. ఖతర్ నుంచి బయలుదేరిన ఈ నౌక మే 13వ తేదీన హార్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. 46,427 టన్నుల ఎల్పీజీతో నిండిన మరో నౌక ‘సన్‌షైన్’ గురువారం హార్మూజ్‌ను దాటిందని, సోమవారం నాటికి న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. కాగా,హార్మూజ్ జలసంధిలో భారతీయ నౌకలపై దాడులు, నావికా సిబ్బందిని ప్రమాదంలో పడేయడంపై ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి ప్రత్యేక సమావేశంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. -
హార్మూజ్‌ను దాటిన 2 భారతీయ నౌకలు
న్యూఢిల్లీ: హార్మూజ్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతున్నా ఎల్పీజీ సరకుతో వస్తున్న రెండు సరకురవాణా నౌకలు విజయవంతంగా జలసంధిని దాటాయి. ‘సైమీ’ఎల్పీజీ ట్యాంకర్ మే 13వ తేదీన హార్మూజ్‌ను దాటగా ఎన్వీ సన్‌షైన్ అనే మరో ఎల్పీజీ నౌక గురువారం దాటింది. ఈ రెండు నౌకలతో కలిపి గత రెండు నెలల్లో హార్మూజ్‌ను దాటి భారతీయ నౌకల సంఖ్య 13కు పెరిగింది.యూఏఈలోని రువాయిస్ రిఫైనరీ నుంచి బయల్దేరిన సైమీ నౌకలో దాదాపు 20,000 టన్నుల ఎల్పీజీ నిల్వలున్నాయి. ఇది మే 16వ తేదీకల్లా గుజరాత్‌లోని కాండ్లా నౌకాశ్రయానికి చేరుకునే ఆస్కారముంది. ఎన్వీ సన్‌షైన్ నౌకలో ఏకంగా 46,427 టన్నుల ఎల్పీజీ ఉంది. ఇది మే 18వ తేదీకల్లా న్యూ మంగళూరు పోర్ట్‌కు చేరుకునే అవకాశముందని కేంద్ర పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్ శాఖ అదనపు కార్యదర్శి ముకేశ్ మంగళ్ తెలిపారు. ఈ రెండు నౌకలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్‌కు రప్పిస్తోంది. ఆగని దాడుల పరంపర.. కొన్ని నౌకలు విజయవంతంగా హార్మూజ్‌ను దాటుతున్నా మరి కొన్నింటిపై దాడులు కొనసాగుతున్నాయి. గతంలో రెండు నౌకలపై దాడి జరగ్గా ఇప్పుడు మరో నౌకపై మెరుపుదాడి చేశారు. దీంతో సోమాలియా నుంచి షార్జాకు వెళ్తున్న భారతీయ జెండాతో ఉన్న సంప్రదాయక సరకు రవాణా నౌక ‘హాజీ అలీ’యాత్ర విషాదంగా ముగిసింది. బుధవారం తెల్లవారుజామున ఒమన్ ప్రాదేశిక సముద్రజలాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఈ నౌకపై దాడి జరిగింది. ‘‘57 మీటర్ల పొడవు, 14 మీటర్ల వెడల్పున్న ఈ నౌక ప్రధాన భాగం చెక్కతో నిర్మించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో నౌక తీవ్రంగా దెబ్బతిని సముద్రజలాల్లో మునిగిపోయింది. ఈలోపు విషయం తెల్సుకుని ఒమన్ తీరగస్తీ దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. నౌకలోని 14 మంది సిబ్బందిని కాపాడాయి. నావికులందరినీ త్వరలోనే భారత్‌కు తరలిస్తాం. నౌకపై ఎవరు దాడి చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. స్వేచ్ఛా వాణిజ్యాన్ని అడ్డుకుంటూ వాణిజ్య నౌకలపై దాడి, నావికులకు ప్రాణహాని కల్గించే ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదనీయంకాదు’’అని అదనపు కార్యదర్శి ముకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
"భారత్ పేరుతో అమెరికా కొత్తనాటకం"
అమెరికా అవకాశ వాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ దేశానికి అవసరం ఉంటే ఉగ్రవాద నాయకులను కూడా ప్రపంచ శాంతి దూతలను చేస్తోంది. అదే వారితో పనైపోతే ఈడ్చితంతుంది. ఇది ఆ దేశం యెుక్క నైజం.. తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశారు.ఇరాన్‌తో యుద్ధం ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తేలా చేసిన యుఎస్ఏ ఇప్పుడు.. అంతర్జాతీయ సరఫరా గొలుసులను, ముఖ్యంగా భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల వంట అవసరాలకు కీలకమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) రవాణాను రక్షించడం కోసం ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి మానవతా సాయం పేరుతో కొత్తనాటకానికి తెర తీసింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఈ విషయమై మాట్లాడుతూ.. హర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలకు దారి చూపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన "ప్రాజెక్ట్ ఫ్రీడమ్" ప్రణాళిక ఒక "మానవతా ప్రయత్నం" అంతర్జాతీయ సరఫరా గొలుసులను, ముఖ్యంగా భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల వంట అవసరాలకు కీలకమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) రవాణాను రక్షించడమే దీని లక్ష్యం అని ఆయన అన్నారు.గత నెలలో జరిగిన ప్రపంచ బ్యాంకు సదస్సులో పేద మరియు అత్యంత బలహీనమైన దేశాలు తన వద్దకు వచ్చి, హర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య రవాణాను పునరుద్ధరించాలని అమెరికాను కోరాయని అందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. "ఇది ఒక మానవతా ప్రయత్నం. ఇందులో కేవలం ఇంధనం మాత్రమే కాదు, ఎరువులు, ఆహార రవాణా మరియు భారతదేశంలోని బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు వంట కోసం ఉపయోగించే LPG కూడా ఉన్నాయి," అని ఆయన అన్నారు.చైనాపై ఆరోపణలుకాగా ఈ నేపథ్యంలోనే బెన్సెంట్ చైనాను విమర్శించారు."ఇరాన్‌కు చైనా ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద ప్రోత్సాహక దేశం. చైనా వారి ఇంధనంలో 90 శాతాన్ని కొనుగోలు చేస్తూ, ఆ ఉగ్రవాద దేశానికి నిధులు సమకూరుస్తోంది," అని ఆయన ఆరోపించారు. వచ్చే వారం ట్రంప్ మరియు జిన్‌పింగ్‌ల భేటీ జరగనున్న నేపథ్యంలో, ఈ విషయంలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఆయన కోరారు.ఇరాన్ దగ్గర సత్తా లేదుయుద్ధంలో ఇరాన్ తన పోరాట పటిమను కోల్పోయిందని, అమెరికా దళాలకు వ్యతిరేకంగా ఇరాన్ చేస్తున్న ప్రకటనలన్నీ కేవలం 'ప్రచారమే అన్నారు. ఇరాన్ నాయకత్వం దేశవ్యాప్తంగా బంకర్లలో దాక్కుంది, అసలేం జరుగుతుందో వారికి తెలియడం లేదని .ఇరాన్ నౌకాదళం ఇప్పుడు ఒక నౌకాదళంలా లేదు, అది కేవలం "సముద్రపు దొంగల ముఠా"గా మారిందన్నారు. వారు అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను అడ్డుకోవాలని చూస్తున్నారని అమెరికా దాన్ని అడ్డుకుంటుందని తెలిపారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. సైనికులకు జీతాలు అందకపోతే వారు పోరాడలేరని ఆయన వ్యాఖ్యానించారు. -
గ్యాస్ కష్టాలకు చెక్.. 52 ఏళ్ల మహిళ అద్భుత ఆవిష్కరణ
పశ్చిమాసియా(ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా)యుద్ధం, ఆర్థిక ఉద్రిక్తతల కారణంగా భారతదేశంలో గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇటివల కాలంలో గ్యాస్ సిలిండర్లు కొరతగా మారటం, ధరల పెరుగుదలతో వంటగదుల్లో కష్టాలను సృష్టిస్తోంది. చాలా రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్లు కొరత అనేక రంగాలను దెబ్బతీస్తోంది. వంటగ్యాస్ లేకపోవడంతో సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో కొందరు ఈ ఎల్పీజీ గ్యాస్ కష్టాల రాకమునుపే సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని చేసిన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ 52 ఏళ్ల మహిళ రూపొందించిన పొయ్యి. ఎవరామె..?, ఆమెకు ఇదెలా సాధ్యమైందంటే..ఒడిశాకు చెందిన 52 ఏళ్ల సుభ్రా రాణి మొహంతి ఆవిష్కరణ ఎల్పీజీ గ్యాస్ కష్టాలకు ఊరటగానూ సామాన్యుడి పాలిటి వరంగానూ మారింది. ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలోని తారదాపడ గ్రామానికి చెందిన సుభ్రా రాణి మొహంతి 2018లో వంట ఖర్చులు తగ్గేలా, గ్రామీణ మహిళలు, అట్టడగు వర్గాల కుటుంబాలకు మద్దతిచ్చేలా తక్కువ ఖర్చుతో బయోమాస్ వంటపొయ్యిని రూపొందించారామె. పొగరహితమైన, సులభంగా తీసుకెళ్లగలిగే ఈ పొయ్యికి ఆమె 'రాకెట్ చుల్హా' అని పేరు పెట్టారు. కొబ్బరి పీచు, కట్టెలు, రంపపు పొట్టు వంటి స్థానికంగా లభించే పదార్థాలతో రూపొందించారు. తక్కువ ఖర్చుతో కూడుకున్నది మాత్రమే కాకుండా ఇంధన వినియోగాన్ని దాదాపు 50 శాతం తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా, సాంప్రదాయ కట్టెల ఆధారిత పొయ్యిలతో పోలిస్తే దీని నుండి వెలువడే పొగ చాలా తక్కువగా ఉంటుంది. సుమారు దశాబ్దం క్రితం గుజరాత్‌లోని బరోడాకు చెందిన ఒక శాస్త్రవేత్త నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందిన తర్వాత, మొహంతి తన సంస్థ ఎస్ఎస్ అసోసియేట్స్ ద్వారా తన నివాసంలోనే బయోమాస్ పొయ్యిల తయారీని ప్రారంభించారు. ఈ యూనిట్ సహజ డ్రాఫ్ట్ (రాకెట్-రకం), ఫోర్స్డ్ డ్రాఫ్ట్ వంటి వంట పొయ్యిలు రెండింటినీ ఉత్పత్తి చేస్తున్నారామె.సహజ డ్రాఫ్ట్ పొయ్యి కింద నుండి గాలిని తీసుకుంటుంది, ఇది బయోమాస్‌కు ఆక్సిజన్‌ను అందించి, దాదాపు పూర్తి దహనాన్ని నిర్ధారిస్తుంది. దీని ఫలితంగా సాంప్రదాయ పొయ్యిలతో పోలిస్తే వంటచెరుకులో 50 శాతం ఆదా, వంట సమయం 50 శాతం తగ్గడమేగాక మారు 70 శాతం మాత్రమే తక్కువ పొగ వస్తుంది. ఇది ఉపయోగించడానికి సులభమైనది, కంటి చికాకు, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుందని అని మొహంతి చెబుతున్నారు.ఫోర్స్డ్ డ్రాఫ్ట్ పొయ్యి, దహన గదిలోకి గాలిని సరఫరా చేయడానికి బ్లోయర్‌ను ఉపయోగిస్తుంది, ఇది సమర్థవంతమైన దహనాన్ని నిర్ధారిస్తుంది. ఇది ఎల్‌పిజితో పోలిస్తే సుమారు 90 శాతం తక్కువ పొగను ఉత్పత్తి చేస్తుంది, 60 శాతం వరకు ఇంధనాన్ని, వంట సమయాన్ని ఆదా చేస్తుంది.ఆమె భర్త సత్యబ్రత్ మొహంతి ఈ పొయ్యిల మార్కెటింగ్‌లో ఆమెకు సహకరిస్తారు. కలహండి జిల్లాలోని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ITDA) పాఠశాలలు, వసతి గృహాల వినియోగం కోసం ఈ పొయ్యిలను సేకరించింది. అంతేగాదు ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలతో పాటు మరో 18 రాష్ట్రాల్లో, అలాగే నైజీరియా, దక్షిణాఫ్రికా, కెనడా వంటి విదేశాల్లో కూడా ఈ స్టవ్‌లను విక్రయిస్తున్నామని ఆ దంపతులు తెలిపారు. ఈ కృషికి గాను, సుభ్రారాణి మొహంతికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శిక్షా సమ్మాన్‌తో సత్కారం, అనేక ప్రశంసలు, అవార్డులు, గౌరవాలను అందుకున్నారు కూడా. ప్రస్తుతం సుభ్రా రాణి ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ పొయ్యిల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో (SHGs) కలిసి పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by MY Bhubaneswar (@mybhubaneswar) (చదవండి: Dementia: వంట చేయడంలో ఇంత మహత్తు ఉందా..? దెబ్బకు మతిమరుపు..) -
ఎల్పీజీ మార్పులు.. మే 1 నుంచి కొత్త రూల్స్
దేశంలో ఎల్పీజీ (LPG) గ్యాస్ వినియోగదారులకు సంబంధించి మే 1వ తేదీ నుంచి కొత్త మార్పులు రానున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందన్న వార్తలు వినియోగదారులను కలవరపెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం నేరుగా ఇంధన ధరలపై పడుతోంది. ధరల పెంపుతో పాటు, మే నెల నుంచి గ్యాస్ బుకింగ్, డెలివరీ నిబంధనల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.ఆకాశాన్నంటుతున్న ధరలుఅమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ధరల భారాన్ని వినియోగదారులపై గత నెలలోనే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరపై సుమారు రూ. 60పెరిగింది. ఇక కమర్షియల్ వినియోగదారులపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఏప్రిల్ 2026 నాటికి ఏకంగా రూ. 196 పెరిగింది. మే 1వ తేదీన చమురు సంస్థలు నిర్వహించే నెలవారీ సమీక్షలో ధరలు మరోసారి సవరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.కొత్త బుకింగ్ నిబంధనలు ఇవే!కేవలం ధరలే కాకుండా, సిలిండర్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తోంది.బుకింగ్ గ్యాప్: నగరాల్లో నివసించే వారు ఒక బుకింగ్‌కు, మరో బుకింగ్‌కు మధ్య కనీసం 25 రోజుల విరామం పాటించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులుగా నిర్ణయించారు.OTP తప్పనిసరి: గ్యాస్ డెలివరీ సమయంలో ఓటీపీ (OTP) ఆధారిత ప్రామాణీకరణ ఇకపై శాశ్వతం కానుంది. సిలిండర్ల మళ్లింపును అరికట్టేందుకు ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నారు.ఆన్లైన్ బుకింగ్: ప్రస్తుతం 98% బుకింగ్‌లు ఆన్లైన్ ద్వారానే జరుగుతుండగా, మే నెల నుంచి డెలివరీ వ్యవస్థను మరింత డిజిటలైజ్ చేయనున్నారు.ఆధార్ ఈ-కేవైసీ ఎవరికి అవసరం?గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈ-కేవైసీపై (e-KYC) సామాన్యుల్లో ఉన్న గందరగోళానికి అధికారులు స్పష్టత ఇచ్చారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఆర్థిక సంవత్సరంలో ఏడు రీఫిల్స్ పూర్తయ్యాక, ఎనిమిదో సిలిండర్ నుండి సబ్సిడీ పొందాలంటే ఈ ప్రామాణీకరణ అవసరం. ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసిన సాధారణ వినియోగదారులు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. -
ఇంటింటా ఇండక్షన్ స్టవ్.. ప్రభుత్వం కీలక ఆలోచన!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో వంటగ్యాస్ సరఫరాపై నీలినీడలు కమ్ముకోవడంతో, దేశీయంగా ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్‌ల వినియోగాన్ని ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇండక్షన్ స్టవ్‌ల తయారీ పెంపుతో పాటు ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో.. ఓడల రవాణాకు ఆటంకం ఏర్పడి గ్యాస్ సరఫరా తగ్గడం తెలిసిందే. దీంతో ప్రజలు తాత్కాలికంగా ఇండక్షన్ స్టవ్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. కీలక మార్పులు.. ఇండక్షన్ స్టవ్‌ల తయారీలో వినియోగించే కీలక విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. అలాగే, ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీని 5%కి తగ్గించాలని సిఫారసు చేసింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 21 మధ్య 467 సీఎన్జీ, బయో గ్యాస్ స్టేషన్ల ఏర్పాటుకు దరఖాస్తులు రాగా, వెంటనే పరిష్కరించారు. ఇందులో 157 స్టేషన్లకు తుది లైసెన్సులు సైతం మంజూరయ్యాయి. ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు రాత్రి వేళల్లో కూడా పనిచేసేలా ఏప్రిల్ 2న కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. దీనివల్ల ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. -
వంట గ్యాస్ సంక్షోభం : రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్లైన్ల ప్లాన్
ఇరాన్ వార్ నేపథ్యంలో నెలకొన్న వంట గ్యాస్ సరఫరా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశం వంటగ్యాస్ (LPG) రవాణాను మరింత సురక్షితంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు, రిఫైనరీలు, ఓడరేవులను బాట్లింగ్ ప్లాంట్లతో అను సంధానించేలా నాలుగు పైప్లైన్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇంధన రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) సుమారు రూ. 12,500 కోట్ల అంచనా పెట్టుబడితో, సుమారు 2500కిలో మీటర్లు నాలుగు పైప్లైన్ల బిడ్ ప్రతిపాదనలకోసం బిడ్డింగ్ ప్రక్రియను ముగించే పనిలో ఉంది. నాలుగు ప్రధాన మార్గాలు ఏవంటేచెర్లపల్లి – నాగ్‌పూర్ పైప్లైన్శిఖ్రాపూర్ – హుబ్లీ – గోవా పైప్లైన్పారాదీప్ – రాయ్‌పూర్ పైప్లైన్ఝాన్సీ – సీతార్గంజ్ పైప్లైన్ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యంప్రస్తుతం ఎల్పీజీని ట్యాంకర్ల ద్వారా రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పైప్లైన్ల ద్వారా రవాణా చేయడం వల్ల ప్రమాదాల ముప్పు తగ్గుతుంది. రిఫైనరీలు మరియు ఓడరేవులను నేరుగా బాట్లింగ్ ప్లాంట్లతో అనుసంధానించడం ద్వారా గ్యాస్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూడవచ్చు. అవసరమైన సమయంలో ఈ పైప్లైన్లు స్టోరేజ్ యూనిట్లుగా కూడా పనిచేస్తాయి. రోడ్డు రవాణా తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి, పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇదీ చదవండి: ఒకప్పుడు స్టార్ లీడర్.. చివరికి భార్యను హత్య చేసి, ఆత్మహత్యపశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా, భారత్ ఎల్పీజీ దిగుమతుల కోసం అమెరికా, ఆస్ట్రేలియా వైపు చూస్తోంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దేశీయంగా బలమైన పైప్‌లైన్ వ్యవస్థ ఉండటం వల్ల పంపిణీ ఖర్చులను కొంతవరకు నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.మొత్తం 9 ఎల్పీజీ పైప్‌లైన్ ప్రాజెక్టులను గుర్తించగా, ప్రస్తుతం ఈ నాలుగు ప్రధాన ప్రాజెక్టులపై PNGRB దృష్టి సారించింది. ఇది భారతదేశ ఇంధన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుందని అంచనాఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
గ్యాస్ లేదా.. అయితే నో వర్రీస్.. మార్కెట్లోకి డీజీల్ స్టవ్ వచ్చేసింది
-
గ్యాస్ కొరత తీవ్రం.. కొత్త కనెక్షన్ల జారీ నిలిపివేత!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పరిణామాలు సామాన్యుల వంటగదిలో అగ్గి రాజేస్తున్నాయి. ఎల్పీజీ దిగుమతుల్లో నెలకొన్న అనిశ్చితి నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు గ్యాస్ కొరత, రీఫిల్ బుకింగ్ గడువు పెంపు ప్రభావం కొత్త కనెక్షన్ల డిమాండ్‌ను ఒక్కసారిగా పెంచేసింది. అయితే చమురు సంస్థలు డొమెస్టిక్ కనెక్షన్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త కనెక్షన్ల జారీపై అప్రకటిత నిషేధాన్ని విధించాయి. ఎల్పీజీ దిగుమతుల్లో సుమారు 90 శాతం హర్మూజ్ జలసంధి మార్గం ద్వారానే రావాలి. కానీ, ప్రస్తుత యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఆ మార్గంలో నౌకల రాకపోకలు స్తంభించాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 10,611 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని కేవలం పాత వినియోగదారులకు ప్రాధాన్యం ఇచ్చి సర్దుబాటు చేయాలని చమురు సంస్థలు నిర్ణయించాయి. కొత్త కనెక్షన్లు ఇవ్వడం వల్ల డిమాండ్ మరింత పెరిగి నిల్వలు సరిపోక సిస్టమ్ ‘కొలాప్స్’అయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నాయి. కొత్త కనెక్షన్ల అప్లికేషన్ల ప్రక్రియను ఏజెన్సీలస్థాయిలో నిలిపేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కుటుంబాల్లో ‘గ్యాస్’గుబులు గతంలో సిలిండర్ బుక్ చేసిన 15 రోజులకు మరో బుకింగ్‌కు వెసులుబాటు ఉండగా, ప్రస్తుతం అర్బన్‌లో 25 రోజులకు, రూరల్ ప్రాంతాల్లో 45 రోజులకు పెరిగింది. బుక్ చేసిన తర్వాత డెలివరీకి మరో 10 నుంచి 15 రోజులు పడుతోంది. ఉమ్మడి కుటుంబాల్లో ఒక్క కనెక్షన్ సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో ఇంట్లోని ఇతర సభ్యుల పేర్ల మీద కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేస్తున్నారు. కొత్తగా విడిపోయిన చిన్న కుటుంబాలు, విద్యార్థులు, వలస కారి్మకుల నుంచి కూడా దరఖాస్తుల తాకిడి సాధారణం కంటే మూడు రెట్లు పెరగడం కొత్త కనెక్షన్ల నిలుపుదలకు ప్రధాన కారణమైంది. సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా నెలకు 40 వేల దరఖాస్తులు వస్తుండగా, ప్రస్తుతం కేవలం పది రోజుల్లోనే ఆ సంఖ్య దాటిపోయినట్లు తెలుస్తోంది.డబుల్ సిలిండర్ కోసం క్యూ సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులు ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సిలిండర్ ఖాళీ అయితే నెలరోజుల వరకు కొత్తది వచ్చే పరిస్థితి లేకపోవడంతో రెండో సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇవి సాధారణంగా వచ్చే దరఖాస్తులు కంటే ఐదింతలు దాటాయి. అయితే, నిల్వల కొరత సాకుతో వీటిని కూడా ఏజెన్సీలు పెండింగ్‌లో పెడుతున్నాయి. -
21 నెలల కనిష్ఠానికి ఎల్పీజీ వినియోగం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును అతలాకుతలం చేస్తున్న వేళ, భారత ఇంధన రంగంలో విరుద్ధమైన ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకవైపు యుద్ధ భయాలతో రవాణా ఇంధనాలైన పెట్రోల్, డీజిల్‌కు విపరీతమైన గిరాకీ పెరగ్గా, మరోవైపు వంట గ్యాస్ వినియోగం గత 21 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) విడుదల చేసిన తాత్కాలిక గణాంకాలు ఈ ఆసక్తికర అంశాలను వెల్లడించాయి.ఎల్పీజీ వినియోగంలో భారీ క్షీణతమార్చి 2026లో దేశీయ ఎల్పీజీ వినియోగం గణనీయంగా తగ్గింది. గత నెలతో పోలిస్తే 16 శాతం, గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 13 శాతం క్షీణత నమోదైంది. మార్చిలో మొత్తం వినియోగం 2.38 మిలియన్ టన్నుల వద్ద నిలిచింది. జూన్ 2024 తర్వాత ఎల్పీజీ వినియోగంలో ఇంతటి భారీ పతనం నమోదు కావడం ఇదే తొలిసారి.దిగుమతులపై హార్మూజ్ ప్రభావంభారతదేశం తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో సుమారు 90 శాతం దిగుమతులు వ్యూహాత్మకమైన హార్మూజ్ జలసంధి గుండానే సాగుతుంటాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ సంక్షోభం ఈ జలసంధి ద్వారా రవాణాను ప్రభావితం చేయడంతో ఫిబ్రవరిలో 2 మిలియన్ టన్నులుగా ఉన్న దిగుమతులు మార్చి నాటికి 1.1 మిలియన్ టన్నులకు పడిపోయాయి.పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్సరఫరాలో అంతరాయాలు కలగవచ్చనే భయంతో వినియోగదారులు ముందు జాగ్రత్తగా ఇంధన కేంద్రాలకు క్యూ కట్టడం వల్ల రవాణా ఇంధనాల వినియోగం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరింది.ఇంధనంమర్చి నెల వినియోగంవృద్ధి (నెలవారీ)వృద్ధి (వార్షిక)డీజిల్8.73 MT (రికార్డు)14%8%పెట్రోల్3.78 MT (రికార్డు)12%8% వార్షిక ధోరణి ఆశాజనకంమార్చి నెలలో ఎల్పీజీ వినియోగంలో క్షీణత కనిపించినప్పటికీ 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం వినియోగం మాత్రం ఆశాజనకంగానే ఉంది. గతేడాది కంటే 6 శాతం వృద్ధి చెంది 33.21 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత నమోదైన అత్యధిక వార్షిక వృద్ధి కావడం విశేషం.ప్రభుత్వ భరోసా - ప్రత్యామ్నాయ మార్గాలుప్రస్తుత అస్థిరతపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ దేశంలో ఇంధన నిల్వలు తగినంతగా ఉన్నాయని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. దేశీయ ఎల్పీజీ వినియోగంలో 90 శాతంపైగా ఉన్న గృహ అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీపై భారాన్ని తగ్గించేందుకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్లను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. మార్చిలోనే 3 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వగా ఏప్రిల్ చివరి నాటికి మరో 6 నుంచి 7 లక్షల మంది కొత్త వినియోగదారులను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్! -
యుద్ధ కొరతలకు కిం కర్తవ్యం?
ఇరాన్ యుద్ధం భారత్ శక్తి, ఆహార భద్రతలలో డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నది. ఆర్థిక కోణంలోనే కాకుండా సైనిక భద్రతా కోణంలో కూడా ఇరాన్ యుద్ధం భారత్‌కు గుణపాఠాలు నేర్పుతున్నది. సాధారణంగా యుద్ధంలో పాల్గొంటున్న దేశాలపై యుద్ధ ప్రభావం ఉంటుంది. కానీ, ప్రపంచీకరణ నేపథ్యంలో అది ప్రపంచవ్యాప్తంగా కన్పిస్తున్నది. మన దేశ ముడి చమురు దిగుమతులలో సుమారు 40 శాతం, ఎల్ఎన్జీ దిగుమతులలో 50 శాతం, ఎల్పీజీ దిగుమతులలో సుమారుగా 80–90 శాతం హార్మూజ్ జల సంధి నుండే రావాలి. ముడిచమురును మనం రష్యా, యూఎస్ఏ, బ్రెజిల్, మెక్సికో మొదలగు దేశాల నుండి అదనంగా కొనటం ద్వారా పూరించుకోగలుగుతున్నాము. సుమారుగా 40 దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాము. కానీ ఎల్పీజీ (వంటగ్యాస్) దిగుమతులు ప్రధానంగా ఖతర్ నుండి హార్మూజ్ జలసంధి ద్వారానే రావాలి. యుద్ధం ప్రారంభం కావడా నికి ముందు బ్యారెల్‌కి 72 డాలర్లుగా ఉన్న ముడి చమురు ధర ఒక దశలో 120 డాలర్లకు చేరుకొంది. కాల్పుల విరమణ వార్తలు చమురు ధరలకు కాస్త ఉపశమనం కలుగజేస్తున్నాయి. బ్యారెల్‌కు ప్రతి 10 డాలర్ల పెరుగుదల వలన సుమారుగా 15–16 బిలియన్ డాలర్లు చమురు దిగుమతికి అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. సౌదీ, యూఏఈ, ఖతర్ దేశాల చమురు క్షేత్రాలు, చమురుశుద్ధి కేంద్రాలకు నష్టం వాటిల్లటంతో, యుద్ధం ముగిసిన తరువాత కూడా చమురు ధరలు తగ్గకపోవచ్చు. చమురు, తత్సంబంధ ఉత్పత్తుల లభ్యతలో సమస్యలు ఉండవచ్చు.ఎరువుల ఉత్పత్తికి దెబ్బఇరాన్ యుద్ధం నేపథ్యంలో చర్చ ఎక్కువగా ముడిచమురు, ఎల్పీజీ మీదనే కేంద్రీకృతమయింది. ఇంతకంటే పెనుముప్పు దాగున్నది. ఎరువుల తయారీకి కావలసిన సహజ వాయువు, ఎల్ఎన్జీ, అమోనియా, ఫాస్పారిక్ ఆమ్లం, గంధకం, పొటాష్ వంటి ముడిసరుకుల కొరకు మనం గల్ఫ్ దేశాల మీద ఆధారపడు తున్నాము. బొగ్గు ఆధారిత ఎరువుల ఉత్పత్తిని గత రెండు దశా బ్దాలుగా సహజవాయువు/ఎల్ఎన్జీ ఆధారంగా మార్చివేశాం. ఎల్ఎన్జీ విషయంలో సుమారుగా 50 శాతం దిగుమతులపై ఆధార పడుతున్నాము. ఖతర్ నుండి ఎల్ఎన్జీ; యూఏఈ, ఒమన్‌ల నుండి ఎల్ఎన్జీ/సహజవాయువు దిగుమతి చేసుకుంటున్నాము. యూరియా, డీఏపీ, ఎన్పీకే ఎరువుల తయారీకి వాడే అమో నియాను సౌదీ, ఖతర్, ఒమన్, యూఏఈ నుండి దిగుమతి చేసు కుంటున్నాము. సింగిల్ సూపర్ ఫాస్పేట్ (ఎస్ఎస్పీ) తయారీకి వాడే గంధకం ప్రధానంగా సౌదీ, యూఏఈ, ఖతర్, కువైట్ల నుండి దిగుమతి అవుతున్నది. ఎమ్ఓపీ (మ్యురేట్ ఆఫ్ పొటాష్)లో వాడే పొటాష్ దిగుమతిలో 42 శాతం సౌదీ నుండి వస్తున్నది. ఒమన్ నుండి సుమారుగా 26 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కూడా దిగుమతి చేసుకుంటున్నాము. యుద్ధం వలన ఎరువుల ముడిసర కుల దిగుమతికి ఇబ్బంది ఏర్పడటమే కాకుండా ధరలు కూడా పెద్ద మొత్తంలో పెరిగాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే దేశీయంగా ఎరువుల కొరత ఏర్పడ వచ్చును. రానున్న ఎల్‌నినో వాతావరణ నేపథ్యంలో, ఎరువుల సమస్య అగ్నికి ఆజ్యంలా తోడయితే మన ఆహార భద్రత ప్రమాదంలో పడవచ్చు.ఆర్థిక మాంద్యం తప్పదా?పరోక్షంగాయుద్ధ ప్రభావం, ఫార్మాస్యూటికల్, ప్యాకేజింగ్, నిర్మాణ సామగ్రి, అల్యూమినియం, సెమికండక్టర్ తయారీ రంగా లపై కూడా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బీమా ఖర్చులు పెరగటంతో అంతర్జాతీయ షిప్పింగ్ వ్యయం పెరిగి అన్ని వస్తువుల దిగుమతులు మరింత ప్రియమవుతాయి. కోవిడ్ దెబ్బ నుండి కోలు కొని అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థ తన సత్తా చూపింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి దేశ వార్షిక ఆర్థిక వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. గత దశాబ్దంలో భారతదేశం ద్రవ్యోల్బణాన్ని మంచి నియంత్రణలో ఉంచగలిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్పణం 4 శాతం కిందకు పడిపోయింది. అయితే, దిగుమతుల వ్యయం, ధరల పెరుగుదల వలన బడ్జెట్ లోటు పెరిగిపోతుంది. ఈ పరిస్థితి క్రమంగా ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణానికి దారి తీసే అవకాశాలున్నాయి. గోరు చుట్టుపై రోకలి పోటు అన్నట్టుగా సంవత్సర కాలంగా రూపాయి విలువ వేగంగా పతనమవుతున్నది. పెట్టుబడులు భారత దేశం నుండి తరలిపోతున్నాయి. యుద్ధ అనిశ్చితి నేపథ్యంలో మొదటగా బంగారం, తరువాత డాలర్ (అమెరికన్ మార్కెట్) వైపు పెట్టుబ డులు తరలిపోతున్నాయి. రూపాయి విలువ క్షీణించటంతో దిగుమ తులు ఖరీదవుతున్నాయి. పెరిగిన చమురు ధరల ప్రభావం నుండి సామాన్య పౌరుడిని కాపాడటానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. పెరిగిన ధరల భారాన్ని ప్రభుత్వమే భరిస్తున్నది. చమురు కంపెనీలపై భారాన్ని తగ్గించ టానికి చమురు ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. వాణిజ్య వంట గ్యాస్, విమాన ఇంధనాల ధరలను మాత్రం పెంచారు. యుద్ధం మరో నెల పైన కొనసాగితే చమురు ధరలు బ్యారెల్ 150 డాలర్లకు చేరుకొన్నా ఆశ్చర్యం లేదు. అప్పుడిక పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచక తప్పదు. బహుశా ప్రభుత్వం ఐదు రాష్ట్రాలలో ఎన్ని కలు పూర్తయ్యేవరకు వేచి చూస్తుంది. ఆస్ట్రేలియా, ద.కొరియా, నేపాల్, ఫిలిప్పైన్స్, పాకిస్తాన్, యూఎస్ఏ మొదలగు దేశాలలో ఇంధన ధరలు పెరిగాయి. ఇంధన పొదుపుపై ఆ దేశాలు దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. మన దేశంలో కూడా ఇంధన పొదుపు దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించటం; పనివేళలు, పని దినా లను తగ్గించటం వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. శత్రువులను ఎదుర్కోవాలంటే...మన వంటిల్లు హార్మూజ్ జలసంధికి బందీ అవటం, మన ఎరువుల ఉత్పత్తికి గల్ఫ్ దేశాలపై ఆధారపడటం దేశ శక్తి భద్రత, ఆహార భద్రతలో డొల్లతనాన్ని తెలియజేస్తుంది. ఇంధన శక్తి, ఆహార ఉత్పత్తి దేశ మనుగడను శాసిస్తాయి. ఇలాంటి కీలక రంగాలలో స్వయం సమృద్ధి దిశగా కార్యాచరణ రూపొందించాలి. చమురు, సహజ వాయువుల మీద ఆర్థిక వ్యవస్థ ఆధారపడటాన్ని తగ్గించాలి. బొగ్గు, జల విద్యుచ్ఛక్తి, సౌర శక్తి, పవన శక్తి వంటి శక్తి వనరుల అభివృద్ధి మీద దృష్టిని మరింతగా కేంద్రీకరించాలి. సౌర శక్తి, పవన విద్యుచ్ఛక్తి ప్లాంట్ల నిర్మాణానికి కావలసిన పరికరాలకు చైనామీద ఆధారపడుతున్నాము. కీలక రంగాలలో దిగు మతులపై ఆధారపడకూడదు. ముఖ్యంగా అస్థిర (గల్ఫ్) దేశాల మీద, శత్రు దేశాల (చైనా) మీద అసలు ఆధారపడకూడదన్నది యుద్ధం మనకు నేర్పుతున్న గుణపాఠం. ఇరాన్ యుద్ధంలో విద్యుచ్ఛక్తి కేంద్రాలు, శుద్ధి కేంద్రాలు, పారిశ్రామిక వాడలను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ కేంద్రాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమవటం శత్రువుకు కలిసివస్తుంది. భారతదేశం కూడా చైనా, పాకిస్తాన్లతో ఏకకాలంలో యుద్ధం చేయటానికి సన్నద్ధంగా ఉండాలి. ఇద్దరు శత్రువులు మూకుమ్మడిగా దాడి చేస్తే, మొదటి దెబ్బ మన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్పైన, క్షిపణి కేంద్రాలపైన, యుద్ధయాన స్థావరాలపైన ఉంటుంది. డ్రోన్ల దండులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండవ దశలో మన విద్యుచ్ఛక్తి కేంద్రాలు, చమురుశుద్ధి కర్మాగారాలు దాడికి గురవుతాయి. ప్రాంతీయంగా వీటిని వికేంద్రీ కరించాల్సి ఉంటుంది.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఇక గ్యాస్ సిలెండర్ ధర 4000 రూపాయల పైమాటే
-
యుద్ధ ఉద్రిక్తత.. నిత్యావసరాలు, గ్యాస్‌పై కేంద్ర కీలక ప్రకటన
పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. ప్రస్తుతం దేశంలో బఫర్ స్టాక్స్ తగినంతగా ఉన్నయని తెలిపింది. ప్రజలకు రోజువారి అవసరాలకు సంబంధించిన నిత్యావసర ధరల్లో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు లేవని తెలిపింది. గోధుమ, బియ్యం, ఉల్లి, టమాట, ఆలు ధరలు స్థిరంగా ఉన్నాయని వాటి ధరల్లో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది.అదేవిధంగా దేశంలో ప్రస్తుతం ఎల్పీజీ కొరత తీవ్రతరమైన నేపథ్యంలో గ్యాస్ నిల్వలపై కీలక ప్రకటన చేసింది. ఎల్పీజీ సరఫరా తగిన మోతాదులో ఉందని రిఫైనరీలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని పేర్కొంది. గ్యాస్ కొరతపై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముడిచమురు సరఫరా సైతం తగినంతగా ఉందని తెలిపింది.కాగా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గల్ఫ్ దేశాలతో ఫోన్లో దౌత్య చర్చలు జరిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. అదే విధంగా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీతోనూ మాట్లాడారు. -
హార్మూజ్‌ను దాటిన గ్రీన్ శాన్వీ
న్యూఢిల్లీ: భారత్ దిశగా ఎల్పీజీ నౌకల ప్రయాణపరంపర కొనసాగుతోంది. తాజాగా ఉద్రిక్తమయ హార్మూజ్ జలసంధిని ఎల్పీజీ రవాణా నౌక ‘గ్రీన్ శాన్వి’విజయవంతంగా దాటింది. మరోవైపు మరో ఎల్పీజీ నౌక ఇరాన్ నుంచి బయల్దేరి క్షేమంగా భారత్‌కు చేరుకుంది. ఇది మంగళూరుకు చేరుకుని ఎల్పీజీని దిగుమతిచేస్తోంది. తాజాగా హార్మూజ్‌ను దాటిన గ్రీన్ శాన్వీ నౌక 46,650 టన్నుల ఎల్పీజీని మోసుకొస్తోంది. ఇదే నౌకలో 25 మంది నావికులు సైతం ఉన్నారు. భారతీయ జెండాతో బయల్దేరి విజయవంతంగా హార్మూజ్‌ను దాటిన ఎల్పీజీ నౌకల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. వీటిలో ఏడు శివాలిక్, నందాదేవి, జగ్ లడ్కీ, పైన్ గ్యాస్, జగ్ వసంత్, బీడబ్ల్యూ టీవైఆర్, బీడబ్ల్యూ ఈఎల్ఎం ఇప్పటికే భారత్‌కు చేరుకున్నాయి. గ్రీన్ శాన్వీ మార్గమధ్యంలో ఉంది. ఇరాన్ ప్రభుత్వం తరఫున ఎల్పీజీ నౌక ‘సీ బర్డ్’రాకతో గత ఏడేళ్లలో ఆ దేశం నుంచి భారత్‌కు చేరుకున్న తొలి నౌకగా ఇది గుర్తింపు పొందింది. ఈ నౌకలో 44,000 టన్నుల ఎల్పీజీ ఉంది. ఇన్నాళ్లూ ఇరాన్ దేశ చమురు ఉత్పత్తులపై అమెరికా అంతర్జాతీయ నిషేధం విధించగా అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతం పెరగడంతో తప్పని పరిస్థితుల్లో ఆ ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. చైనా దిశగా ఇరాన్ నౌకపై భారత్ స్పష్టీకరణ ఏడేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ దిశగా వస్తున్న ఇరాన్ చమురు నౌక ‘పింగ్ షున్’హఠాత్తుగా దిశ మార్చుకోవడంలో చెల్లింపుల అంశం అస్సలే లేదని, చెల్లింపుల ఆలస్యం కారణంగానే అది భారత్‌కు రావట్లేదనే వార్తలను కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ఈ మేరకు శనివారం మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టింది. ‘‘అంతర్జాతీయంగా మార్గమధ్యంలో ఇంధన నౌకలు తమ గమ్యస్థానాన్ని మార్చుకోవడం సాధారణం. గిట్టుబాటు, వాణిజ్య వెసులుబాట్లు, నిర్వహణ సౌకర్యాలకు అనుగుణంగా నౌకలు తమ దిశలను మార్చుకుంటాయి. తాజాగా భారత్‌కు ఏడేళ్ల తర్వాత గుజరాత్‌లోని వడినార్‌కు వస్తున్న ముడిచమురు నౌక ‘పింగ్ షున్’హఠాత్తుగా దిశమార్చుకోవడంలో చెల్లింపుల అంశం ఇమిడిలేదు. ఇరాన్‌తో భారత్‌కు ఎలాంటి చెల్లింపుల వివాదాలు లేవు. నౌకల సంబంధ నగదు చెల్లింపులు సవ్యంగా జరుగుతున్నాయి’’అని మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. -
భారత్‌తో మాది వేల ఏళ్ల అనుబంధం: ఇరాన్
ప్రస్తుతం హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతుంది. అయితే భారత్ నౌకలు మాత్రం జలసంధి గుండా ప్రయాణించడానికి ఇరాన్ అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో 7వ ఎల్పీజీ ట్యాంకర్ జలసంధి గుండా భారత్ చేరుకుంది. ఈ సందర్భంగా భారత్ ధన్యవాదాలు తెలుపగా ఇరాన్ దానికి స్పందించింది.చమురు నౌక గుజరాత్ చేరుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ ఈ ట్యాంకర్ ప్రయాణాన్ని భారతీయ దౌత్య విజయంగా అభివర్ణించారు. దీనిపై ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ స్పందించింది. "భారతదేశం, ముఖ్యంగా గుజరాత్, మా ఉమ్మడి చరిత్రలో ఒక మధురమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. శతాబ్దాల క్రితం మా దేశం నుండి వచ్చిన వారిని మీరు సాదరంగా ఆహ్వానించారు. ఈ నాగరికత సంబంధాల ఆధారంగా, మన మధ్య స్నేహం మరియు సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము." అని తెలిపింది.కాగా ఇరాన్ కాన్సులేట్ తన సందేశంలో సింధూ నాగరికతకు చెందిన లోథల్ ఓడరేవును ఉద్దేశించి మాట్లాడింది. సుమారు 4,000 ఏళ్ల క్రితమే సింధు లోయ నాగరికతకు మరియు పర్షియా తీరానికి మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను ఇది గుర్తుచేస్తుంది. కాగా గ్రీన్ సాన్వీ అనే నౌక 46,650 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో హర్ముాజ్ జలసంధిని దాటింది.అయితే హర్మూజ్ జలసంధి విషయమై ఇప్పుడు యుద్ధం మరింత తీవ్రతరం అవుతున్న సంగతి తెలిసిందే. దానిని ఎట్టిపరిస్థితుల్లో తెరవాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేస్తుండగా ఇరాన్ ససేమిరా అంటుంది. దీంతో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఈ జలసంధి గుండా ప్రయాణించడానికి ఇరాన్ కేవలం 5 మిత్ర దేశాలకు భారతదేశం,రష్యా, చైనా, ఇరాక్,పాకిస్థాన్ అనుమతినిచ్చింది. -
ఇండక్షన్ హీటర్లపై కేంద్రం ఫోకస్!
పశ్చిమాసియా సంక్షోభంతో ఎల్పీజీ లభ్యతపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఇండక్షన్ హీటర్లు, వాటికి అనువుగా ఉండే ఇతరత్రా పాత్రల వాడకాన్ని ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఇందుకోసం ఉత్పత్తిని పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉత్పత్తి కంపెనీలతో శుక్రవారం చర్చలు జరిపింది.కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సారథ్యంలో జరిగిన సమావేశంలో విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ లవ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ఇండక్షన్ హీటర్లు, కుక్కర్లలాంటి పాత్రల తయారీని వేగవంతం చేసేందుకు, ఉత్పత్తి పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఇందులో చర్చించినట్లు వివరించారు. ఈ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని, హాట్ కేక్‌ల్లాగా అమ్ముడవుతున్నాయని పేర్కొన్నారు. -
విశాఖ చేరుకున్న మరో భారీ ఎల్పీజీ నౌక..
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ కష్టాల నుంచి స్వల్ప ఊరట లభించింది. మరో భారీ ఎల్పీజీ నౌక.. విశాఖ పోర్టుకు చేరుకుంది. పర్షియన్ గల్ఫ్ నుంచి విశాఖకు వచ్చిన 'పైన్ గ్యాస్' ఎల్పీజీ నౌక.. 47 వేల టన్నుల గ్యాస్ మోసుకొచ్చింది. ఒడిశాలోని దమ్రా పోర్టుకు వెళ్లాల్సిన గ్యాస్ నౌకను విశాఖకు మళ్లించారు. తెలుగు రాష్ట్రాలలో గ్యాస్ డిమాండ్, నిల్వలను దృష్టిలో పెట్టుకుని నౌకను విశాఖకు మళ్లించినట్టు సమాచారం.కాగా, వరుసగా క్రూడాయిల్, వంట గ్యాస్ వెసల్స్ రాకతో విశాఖ పోర్టు కళకళలాడుతోంది. ఐదు రోజుల క్రితం(శుక్రవారం) కూడా భారీ స్థాయిలో ముడిచమురు, ఎల్పీజీ నౌకలు విశాఖ పోర్టుకు చేరుకున్నాయి. రష్యా నుంచి ‘ఎమ్టీ జంబో’ భారీ నౌక 1,36,728 మెట్రిక్ టన్నుల ముడిచమురుతో వచ్చింది. మరోవైపు, దేశీయ అవసరాల నిమిత్తం నెదర్లాండ్స్ నుంచి బీడబ్ల్యూ బిర్చ్ వెసల్ 24,000 మెట్రిక్ టన్నుల భారీ ఎల్పీజీ నౌక వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఎమ్టీ సెంచూరియన్–1 వెసల్‌లో ఉన్న లక్ష టన్నుల ముడి చమురును అన్లోడ్ చేశారు. కాగా, అమెరికా నుంచి మరిన్ని గ్యాస్ నౌకలు విశాఖపట్నం రానున్నట్లు పోర్టు అధికారులు వెల్లడించారు.యుద్ధ సంక్షోభం తరువాత నాలుగు ఎల్పీజీ నౌకలు విశాఖ వచ్చాయని విశాఖపట్నం పోర్ట్ చైర్మన్ అంగముత్తు తెలిపారు. లక్ష టన్నుల గ్యాస్ దిగుమతి చేసుకున్నామని.. మరో 3 గ్యాస్ నౌకలు రానున్నాయని తెలిపారు. 13 క్రూడ్ ఆయిల్ నౌకలు వచ్చాయని.. మరో 4-5 క్రూడ్ ఆయిల్ నౌకలు రానున్నాయని పేర్కొన్నారు. విశాఖ పోర్టు.. ముంబై పోర్టుతో సమానంగా కార్గో హ్యాండిలింగ్ చేస్తుందన్నారు. -
పెట్రోలు మస్త్ ఉంది, డోంట్ వర్రీ : కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో చమురుపై పెరుగుతున్న ఆందోళలు మరింత ఉధృతమవుతున్నాయి. దీంతోచమురు సరఫరాపై ఆందోళన వద్దని కేంద్రం మరోసారి స్ఫష్టం చేసింది. రాబోయే రెండు నెలల పాటు తగినంత సరఫరాను నిర్ధారించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం వెల్లడించింది.‘‘దేశంలో ముడి చమురు నిల్వలు సరిపడా ఉన్నాయి. రాబోయే రెండు నెలల పాటు తగినంత సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది," అని పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ బుధవారం పునరుద్ఘాటించారు. దేశంలోని అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు (Refineries) పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి,పెట్రోల్ బంకుల్లో ఎక్కడా ఇంధన కొరత లేదని ప్రభుత్వం పేర్కొంది. సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది.ఎల్పీజీ సరఫరా కూడా సాధారణంగానే ఉందనీ, దేశం దిగుమతులపై సుమారు 60 శాతం ఆధారపడి ఉందని సుజాత శర్మ అన్నారు. గృహ అవసరాలకు ఎల్పీజీ, అలాగే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) 100 శాతం సహజ వాయువు సరఫరాకు ఢోకా లేదని ఆమె హామీ ఇచ్చారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ, దేశీయ వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి పెరుగుదల లేదు, పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) నష్టాలను ఎదుర్కొంటున్నామని ఆమె తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేస్తూ, దేశీయ మార్కెట్లో ఏటీఎఫ్, డీజిల్ తగినంతగా లభించేలా చూసేందుకు భారత ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని కూడా విధించిందని ఆమె గుర్తుచేశారు. ఇదీ చదవండి: 30 వేల మందిపై వేటు : వణికిపోతున్న ఐటీ ఉద్యోగులుకాగా పశ్చిమ ఆసియా సంఘర్షణల నేపథ్యంలో ఎల్పిజి, ఇంధన కొరతపై ఆందోళన నెలకొంది. దీంతో భారతదేశం వద్ద పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటికే పేర్కొంది. ప్రజలు భయాందోళనలతో కొనుగోళ్లు చేయవద్దని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కోరింది.ఇదీ చదవండి: ఐసీఐసీఐలో భారీ స్కాం : 195 మంది కస్టమర్లు, రూ. 23 కోట్లు -
అయిననూ... పొయ్యి వెలిగించవలే!
యుద్ధం ఆగడం లేదు. మన ఇంటి గ్యాస్ కష్టాలు, ఆందోళనలు ఆగడం లేదు. ఈ సంక్షోభ కాలంలో సామాన్యుల నుంచి శాస్త్రవేత్తల వరకు ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల గురించి ఆలోచిస్తున్నారు. కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. తాజా విషయానికి వస్తే... పుణెలోని సిఎస్ఐఆర్–నేషనల్ కెమికల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా డైమిథైల్ ఈథర్ (డీఎంయీ) ని తయారు చేయడానికి స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేశారు. కార్బన్ డయాక్సైడ్ను వంట ఇంధనమైన డైమిథైల్ ఈథర్‌గా మార్చే సాంకేతికతను బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు...పుణెలోని సిఎస్ఐఆర్–నేషనల్ కెమికల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా డీఎంయీని తయారు చేయడానికి స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇది దేశం ఎల్పీజీ దిగుమతిపై ఆధారపడడాన్ని తగ్గించడంతోపాటు మన దేశ ఇంధన స్వయం సమృద్ధికి ఉపకరిస్తుంది. అంతేకాదు, తక్కువ ఖర్చుతో కూడిన ఉత్ప్రేరకాన్ని (కెటలిస్ట్) ఉపయోగించి మిథనాల్‌ను డైమిథైల్ ఈథర్‌గా మారుస్తుంది. పరిశోధన బృందానికి తిరుమలైస్వామి రాజా నాయకత్వం వహించారు.స్వచ్ఛమైన ఇంధనంసంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే... డైమిథైల్ ఈథర్(డిఎంఈ) చాలా తక్కువ పరిమాణంలో మసి, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్, కణ పదార్థాలను విడుదల చేస్తుంది. అందుకే దీనిని స్వచ్ఛమైన ఇంధనంగా పరిగణిస్తారు. దీంతో పాటు ఇది ఎల్పీజీకి సమానమైన వేడిమిని అందిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వినియోగానికి సంబంధించి ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్’ ఇప్పటికే నియమాలను నిర్దేశించింది.గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం ఎల్పీజీలో 20 శాతం వరకు డిఎంఈని కలపవచ్చు. ఎల్పీజీ మౌలిక సదుపాయాలలో ఎలాంటి మార్పులు చేయకుండానే ఎల్పీజీలో 8 శాతం వరకు డిఎంఈ కలపవచ్చు. వంటగది ఏర్పాట్లు మార్చకుండానే ఈ మిశ్రమ ఇంథనాన్ని ఉపయోగించవచ్చు.ఈ ఇంధనంతో ఎంతో ఆదా!మన దేశం 2024లో దాదాపు 21 మిలియన్ టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకుంది. కేవలం 8 శాతాన్ని డిఎంఈతో భర్తీ చేయడం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు ’9,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. వంట ఇంధనం, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకే కాకుండా ఏరోసోల్ ఉత్పత్తులలో ప్రోపెల్లెంట్గా పనిచేస్తోంది డిఎంఈ. తమ సాంకేతికతను రోజువారీ వినియోగానికి మరింత చేరువ చేయడానికి సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు పేటెంట్ పొందిన ఒక బర్నర్ నమూనాని కూడా రూపొందించారు.ఈ బర్నర్ 100 శాతం ఎల్పీజీ నుండి 100 శాతం డిఎంఈ వరకు, అలాగే ఈ రెండింటి మధ్య ఏ మిశ్రమంతోనైనా ఫ్లెక్సిబుల్ మోడ్‌లో పనిచేయగలదు. దీనికి సంబంధించి బెంగళూరులోని ఎల్పీజీ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన పరిశోధనల ద్వారా రోజుకు 2.5 టన్నుల డిఎంఈ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న ఒక ప్లాంట్‌ను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. రాబోయే ఆరు నుండి తొమ్మిది నెలల్లో దీని ఏర్పాటుకు శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకున్నారు.బలమైన ముందడుగుపర్యావరణ సంరక్షణ, ఇంధన భద్రత మధ్య అంతరాన్ని పూరిస్తూ, స్వావలంబన, స్వచ్ఛమైన ఇంధన ప్రత్యామ్నాయాల దిశగా వేసిన బలమైన ముందడుగుగా ఈ ఆవిష్కరణ నిలవనుంది.‘అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్’ నిధులతో కొన్ని సంవత్సరాల క్రితం మేము మొదలు పెట్టిన ప్రాజెక్ట్ ఇది. కార్బన్డయాక్సైడ్ అనేది గ్రీన్హౌస్ వాయువు. దీనిని నియంత్రించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. అందులో ఒకటి... కార్బన్ కాప్చర్ అండ్ స్టోరేజ్. మేము మరో అడుగు ముందుకు వేసాం. దీనిద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్హౌస్ వాయువులను గణనీయంగా తగ్గించవచ్చు. అలా చేస్తూనే శక్తిని కూడా ఉత్పత్తి చేయవచ్చు’ అంటున్నారు ప్రోఫెసర్ సౌనక్ రాయ్.సీవో2 టు గ్యాస్!కార్బన్ డయాక్సైడ్ (సీవో2)ను స్వచ్ఛంగా మండే వంట ఇంధనమైన డైమిథైల్ ఈథర్‌గా మార్చే విప్లవాత్మక సాంకేతికతను హైదరాబాద్‌లోని బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ప్రోఫెసర్ సౌనక్ రాయ్, ప్రోఫెసర్ సత్యపాల్ సింగ్, ప్రోఫెసర్ బి.ఎం.రెడ్డి ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు.‘మేము ఇప్పటివరకు చేసింది ఒక ప్రయోగశాల–స్థాయి ప్రదర్శన మాత్రమే. తగిన సహాయ సహకారాలతో మేము దీనిని పైలట్ స్థాయికి తీసుకువెళ్లి ఆపై వాణిజ్యీకరణ వైపు వెళ్లగలం. ఇందుకు కొంత సమయం పడుతుంది. మేము ఇప్పటికే ఒక పేటెంట్ కోసం దరఖాస్తు చేశాం. మా రీసెర్చ్ గురించి ఒక సైంటిఫిక్ జర్నల్‌కు తెలియజేశాం’ అని ప్రోఫెసర్ రాయ్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పా రు. -
కొచ్చి చేరుకున్న నౌకలు.. తీరనున్న గ్యాస్ కొరత!
మధ్యప్రాచ్య సంఘర్షణపై నెలకొన్న ఆందోళనల నడుమ.. ఎల్పీజీ, ముడి చమురు నౌకలు కొచ్చికి చేరుకుని వినియోగదారులకు ఉపశమనం కలిగించాయి. ఖతార్ నుంచి ఎల్పీజీని తీసుకువస్తున్న 'అపోలో ఓషన్' ట్యాంకర్ నిన్న మధ్యాహ్నం కొచ్చికి చేరుకుంది. ఈ ట్యాంకర్ 9,086 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువస్తోంది.నిన్న మధ్యాహ్నం కొచ్చికి చేరుకున్న ట్యాంకర్, గ్యాస్‌ను దించిన తర్వాత తిరిగి వెళ్లే అవకాశం ఉంది. ఈ ఎల్పీజీని ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన వివిధ బాట్లింగ్ ప్లాంట్లకు రవాణా చేస్తారు. కమర్షియల్ గ్యాస్ సరఫరాపై తీవ్రమైన ఆంక్షల నేపథ్యంలో, దిగుమతి చేసుకున్న ఎల్పీజీ రాక చమురు కంపెనీలపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.ఇదిలా ఉండగా.. రష్యా ముడి చమురు కూడా కొచ్చికి చేరుకుంది. 'నెవా' అనే చమురు ట్యాంకర్ రష్యాలోని కోస్మినో పోర్ట్ నుండి 1,084.80 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో కొచ్చికి చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే త్వరలోనే మన దేశంలో గ్యాస్ కొరత తగ్గుతుందని తెలుస్తోంది. -
వంటగ్యాస్ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం..
దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను అధిగమించేందుకు మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఇరాన్ వివాదం నేపథ్యంలో ముడి చమురు, ఇంధన సరఫరాలు దెబ్బతినడంతో.. సామాన్యులకు ఉపశమనం కలిగించేలా కిరోసిన్ నిబంధనలను సడలిస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గృహ అవసరాలకు, దీపాల కోసం కిరోసిన్ పంపిణీని వేగవంతం చేసేందుకు పెట్రోలియం భద్రత, లైసెన్సింగ్ నిబంధనల్లో కేంద్రం తాత్కాలిక మార్పులు చేసింది.రాష్ట్రాల్లో తాత్కాలిక పునరుద్ధరణగతంలో కిరోసిన్ రహిత రాష్ట్రాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు దాని సరఫరాను ప్రభుత్వం పునరుద్ధరించింది. ఢిల్లీ, హరియాణా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ సహా మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ (ఎస్కేఓ) అందుబాటులోకి రానుంది.కొత్త నిబంధనల ముఖ్యాంశాలుప్రభుత్వ రంగ చమురు సంస్థలు (ఓఎంసీ) నిర్వహించే ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల ద్వారా కిరోసిన్ విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ప్రభుత్వం గుర్తించిన ప్రతి అవుట్‌లెట్‌లో గరిష్టంగా 5,000 లీటర్ల కిరోసిన్ నిల్వ చేసుకోవచ్చు.ప్రతి జిల్లాకు గరిష్టంగా రెండు సర్వీస్ స్టేషన్లకు మాత్రమే ఈ అనుమతి ఉంటుంది.పెట్రోలియం రూల్స్, 2002 ప్రకారం డీలర్లు, రవాణా వాహనాలకు కొన్ని కఠినమైన లైసెన్సింగ్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.ఈ సడలింపులు తక్షణమే అమల్లోకి వస్తాయి. ఇవి 60 రోజుల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అమల్లో ఉంటాయి.భద్రతలో రాజీ లేదునిబంధనలు సడలించినప్పటికీ భద్రత విషయంలో కేంద్రం కఠినంగా ఉన్నట్లు చెప్పింది. ‘పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) జారీ చేసిన భద్రతా ప్రోటోకాల్‌లు యధావిధిగా వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సూచించిన నిర్దేశిత అవుట్లెట్ల ద్వారా మాత్రమే పంపిణీ జరుగుతుంది. ఈ కిరోసిన్‌ను కేవలం వంట, దీపాల వంటి గృహ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి’ అని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.ఇంధన భద్రతే లక్ష్యంప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ సంక్షోభం దృష్ట్యా గృహాలపై వంటగ్యాస్ భారం పడకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో పీడీఎస్ కింద కిరోసిన్ సరఫరాను నిలిపివేసిన చోట కూడా ప్రస్తుతం ఉన్న రిటైల్ నెట్‌వర్క్‌ను వాడుకుని తక్షణమే సరఫరాను పునరుద్ధరించడం ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్ నజర్! -
భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు
న్యూఢిల్లీ: ఇరాన్ అనుమతితో హార్మూజ్ జలసంధిని దాటిన రెండు ఎల్పీజీ ట్యాంకర్ నౌకలు ‘బీడబ్ల్యూ ఈఎల్ఎం’, ‘బీడబ్ల్యూ టీవైఆర్’వేగంగా భారత్ దిశగా కదులుతున్నాయి. భారతీయ జెండాతో వస్తున్న ఈ నౌకలు శనివారం హార్మూజ్‌ను దాటేసి ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’దిశగా ముందుకెళ్తున్నాయని నౌకల ట్రాకింగ్ సంస్థ శనివారం ప్రకటించిన విషయం తెల్సిందే. ‘బీడబ్ల్యూ టీవైఆర్’నౌక మార్చి 31వ తేదీకల్లా ముంబైకి చేరుకునే అవకాశముంది. ‘బీడబ్ల్యూ ఈఎల్ఎం’నౌక ఏప్రిల్ ఒకటో తేదీన న్యూ మంగళూరు పోర్ట్‌కు చేరుకునే ఆస్కారముందని భారత ప్రభుత్వ వర్గాలు ఆదివారం ప్రకటించాయి.ఈ రెండు నౌకలు 94,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని మోసుకొస్తున్నాయి. ఈ నిల్వలు దేశ ఒక రోజు ఎల్పీజీ అవసరాలను తీరుస్తాయి. ఇప్పటికే నాలుగు భారత ఎల్పీజీ నౌకలు హార్మూజ్‌ను దాటి సురక్షితంగా ఇండియాకు చేరుకున్నాయి. మార్చి 16–17 తేదీల మధ్య ఎంటీ శివాలిక్, ఎంటీ నందాదేవి నౌకలు ఉమ్మడిగా 92,712 టన్నుల ఎల్పీజీని తీసుకొచ్చాయి. మార్చి 26–28 తేదీల మధ్య పైన్ గ్యాస్, జగ్ వసంత్ నౌకలు 92,612 టన్నుల ఎల్పీజీని మోసుకొచ్చాయి.భారత 60 శాతం వంటగ్యాస్ అవసరాలను గల్ఫ్ దేశాలు తీరుస్తున్నాయి. గత ఏడాది భారత్‌లో 3.315 కోట్ల టన్నుల ఎల్పీజీని ప్రజలు వినియోగించారు. హార్మూజ్ గుండా ఇప్పుడు సరకు రవాణా నౌకల రాకపోకలు దాదాపు తగ్గిపోవడంతో భారత అవసరాలను కొంతమేరకు అమెరికా, అర్జెంటీనాలు తీరుస్తున్నాయి. 485 మంది నావికులతో భారతీయ జెండాతో 18 నౌకలు ఇంకా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయి ఉన్నాయని భారత అధికారులు వెల్లడించారు. -
పైప్డ్ గ్యాస్.. దీనిపైనే ఫోకస్
మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన అంతరాయాలు.. దిగుమతి చేసుకునే గ్యాస్‌పై ఆధారపడిన భారత్‌ను కుదిపేసింది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) నుండి అందుబాటులో ఉన్న చోట పైప్డ్ నేచురల్ గ్యాస్‌కు (పీఎన్జీ) మారాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. గృహ వంట గ్యాస్ వినియోగంలో నిర్మాణాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది.పైప్డ్ గ్యాస్ సౌకర్యం ఉన్న గృహాల వారు మూడు నెలల్లో పీఎన్జీకి మారకపోతే ఎల్పీజీ సరఫరాను నిలిపివేయనున్నట్టు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మళ్లేలా ప్రోత్సహించేందుకు గ్యాస్ పంపిణీ సంస్థలు రెంటల్ స్కీమ్, ఈఎంఐ సౌకర్యాలను ఆఫర్ చేస్తున్నాయి. –సాక్షి, స్పెషల్ డెస్క్దిగుమతులపై ఆధారపడకుండా.. పీఎన్జీ నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా కొరతగా ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. పైప్‌లైన్ సౌకర్యం లేని ప్రాంతాలకు ఎల్పీజీ సిలిండర్లను మళ్లించి ఇంధన భద్రతను పెంపొందించాలన్నది ఆలోచన. ప్రస్తుతం పైప్లైన్లు వేసే కంపెనీలు వివిధ అనుమతులు, అధిక ఫీజులు, స్థల సేకరణ సమస్యలు, హౌసింగ్ సొసైటీల నుండి అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. అయితే దేశ ప్రయోజనాల దృష్ట్యా జారీ చేసిన తాజా ఉత్తర్వులతో ఈ అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి. రాష్ట్రానికి ఒకటి కాకుండా దేశవ్యాప్తంగా గ్యాస్ పైప్లైన్ల నిర్మాణం, నిర్వహణ కోసం ఒక చట్టబద్ధమైన కేంద్ర వ్యవస్థ ఏర్పాటు కానుంది.దేశవ్యాప్తంగా 784 జిల్లాల్లో.. గత డిసెంబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా 1.62 కోట్ల మంది పీఎన్జీ కస్టమర్లు ఉన్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 10 వేల మంది వినియోగదార్లు ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారుతున్నారు. మన దేశంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ప్రస్తుతం 784 జిల్లాలకు విస్తరించింది. ఇవి ప్రతి రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలను కవర్ చేస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ వంటి 307 భౌగోళిక ప్రాంతాలుగా (జియోగ్రాఫికల్ ఏరియా) ఈ నెట్వర్క్ పైపుల ద్వారా సహజ వాయువును గృహ వినియోగదార్లకు అందిస్తోంది. రూ.500 కడితే చాలు.. గృహ వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ కావాలంటే వన్ టైమ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కంపెనీని బట్టి ఇది రూ.9 వేల వరకు ఉంది. భవనంలోని కనెక్షన్ల సంఖ్య పెరిగితే ఈ మొత్తం తగ్గుతుంది. కొన్ని కంపెనీలు కనెక్షన్‌ను వాయిదాల పద్ధతిలో కూడా ఇస్తున్నాయి. రెండు నెలలకు (బిల్ సైకిల్) రూ.500 కడితే చాలు. తాత్కాలిక కనెక్షన్ కావాల్సినవారు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. పీఎన్జీ ధర ఒక యూనిట్‌కు (స్టాండర్డ్ క్యూబిక్ మీటర్) ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రూ.51గా ఉంది. నలుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి రెండు నెలలకు సగటున 24 యూనిట్లు ఖర్చు అవుతుందని ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారు. అవసరాల్లో సగం దేశీయంగానే ఉత్పత్తి » దేశ గ్యాస్ అవసరాల్లో సగ భాగం ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. » దేశంలో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువులో కృష్ణా–గోదావరి బేసిన్ వాటా 25%, అస్సాం, త్రిపుర బేసిన్ల వాటా 13%గా ఉంది. మిగిలింది ముంబై, రాజస్తాన్, కాంబే బేసిన్ (గుజరాత్) ఉత్పత్తి చేస్తున్నాయి. » 2024–25లో భారత్ 35,594 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేసింది. అదే సమయంలో 35,720 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) దిగుమతి చేసుకుంది. » భారత్ దిగుమతి చేసుకుంటున్న ఎల్ఎన్జీలో ఖతార్, యూఏఈ వాటా 50% పైమాటే. » మధ్యప్రాచ్యం మీద ఆధారపడడం తగ్గించి యూఎస్, ఆ్రస్టేలియా, రష్యా, మొజాంబిక్ నుంచి పెద్ద ఎత్తున ఎల్ఎన్జీ కొనుగోళ్ల డీల్స్‌కు భారత్ శ్రీకారం చుట్టింది. పీఎన్జీ ఎందుకు ?ఇంధన భద్రత, స్థిరత్వం: కేవలం ఓడల ద్వారా హార్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాల గుండా వచ్చే ఎల్పీజీపై ఆధారపడటం వల్ల అక్కడ ఏదైనా అంతరాయం కలిగితే లక్షలాది మందికి వంట గ్యాస్ అందకుండా పోతుంది. దీనికి భిన్నంగా స్వదేశీ గ్యాస్ నిల్వలు, వివిధ దిగుమతి కేంద్రాలు, ఇతర దేశాల నుండి సరఫరా అయ్యే పైప్‌లైన్ నెట్వర్క్ చాలా సురక్షితమైనది, నమ్మదగినది. తక్కువ ఖర్చు: సిలిండర్లు, లారీలు, బాట్లింగ్ ప్లాంట్లు, డీలర్ల ఖర్చులు అన్నీ కలిసి ఎల్పీజీ ధర నిర్ణయం అవుతుంది. పైప్‌లైన్ ద్వారా గ్యాస్ నేరుగా ఇంటికి చేరడం వల్ల ఈ అదనపు ఖర్చులు తగ్గుతాయి. ఎల్పీజీతో పోలిస్తే పీఎన్జీ వ్యయం 20–30% తక్కువ అని కంపెనీలు చెబుతున్నాయి. సౌకర్యం, భద్రత: వంట మధ్యలో గ్యాస్ అయిపోతుందనే భయం ఉండదు. ప్రమాద భయం లేదు. ఇందులోని మీథేన్ గాలి కంటే తేలిక. సులభంగా గాలిలో కలిసిపోతుంది. స్వచ్ఛమైన ఇంధనం కూడా. రాయితీ భారాన్ని తగ్గించడం: ప్రభుత్వం ఉజ్వల పథకం కింద కోట్లాది కుటుంబాలకు ఎల్పీజీపై సబ్సిడీ ఇస్తోంది. ప్రజలను పీఎన్జీకి మార్చడం ద్వారా ప్రభుత్వంపై పడే ఈ ఆర్థిక భారం క్రమంగా తగ్గుతుంది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)అతిగా చల్లబర్చిన సహజ వాయువు. దీనిని సుమారు మైనస్ 162 డిగ్రీల సెల్సియస్ వద్ద ద్రవ రూపంలోకి మారుస్తారు. తద్వారా దాని పరిమాణం 600 రెట్లు తగ్గుతుంది. దీనివల్ల ట్యాంకర్లలో నింపి సముద్రాల గుండా రవాణా చేయడం సులభం అవుతుంది. ఇది గమ్యస్థానానికి చేరుకున్నాక తిరిగి వేడి చేసి వాయువుగా మార్చి పైప్లైన్ల ద్వారా సరఫరా చేస్తారు.తెలుగు రాష్ట్రాల్లో పీఎన్జీ సేవలు అందిస్తున్న కంపెనీలు.. తెలంగాణ: ఐఓసీఎల్, మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, భాగ్యనగర్ గ్యాస్, టోరెంట్ గ్యాస్, మహారాష్ట్ర నేచురల్ గ్యాస్. ఆంధ్రప్రదేశ్: ఐఓసీఎల్, మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, భాగ్యనగర్ గ్యాస్, గోదావరి గ్యాస్, థింక్ గ్యాస్. -
ఇక ఎల్పీజీ బదులు ఇథనాల్
న్యూఢిల్లీ: దేశీయంగా కుటుంబాలు ఎల్పీజీకి బదులుగా ఇథనాల్‌ను వినియోగించడాన్ని ప్రోత్సహించవలసిందిగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ(ఎఫ్‌ఐపీఐ) కోరుతోంది. వంటకు శుద్ధ ఇంధనంగా ఇథనాల్‌ను వినియోగించేందుకు అనువైన సాంకేతికతను అభివృద్ధి చేయవలసిందిగా ఆలిండియా డిస్టిల్లరీస్ అసోసియేషన్(ఏఐడీఏ)ను కోరింది. ఎల్‌పీజీస్థానే బయోఇంధన వినియోగాన్ని విస్తరించడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని పెట్రోలియం పరిశ్రమ అభిప్రాయపడింది.ఇథనాల్ ఆధారిత వంట స్టవ్‌లపై రీసెర్చ్ కొనసాగుతున్నట్లు ఏఐడీఏ సదస్సు సందర్భంగా ఎఫ్‌ఐపీఐ డైరెక్టర్(డౌన్‌స్ట్రీమ్) ఆర్ఎస్ రవి తెలియజేశారు. ఎల్పీజీ ఎక్విప్మెంట్ రీసెర్చ్ సెంటర్(ఎల్‌ఈఆర్‌సీ) తదితర ఏజెన్సీలు, వివిధ ఐఐటీలు ఇథనాల్ ఆధారిత సమర్థవంత కుకింగ్ స్టవ్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే నమూనా(ప్రొటోటైప్) స్టవ్‌లు సిద్ధంకానున్నట్లు వెల్లడించారు. ఇథనాల్‌తో వంటకు.. వంటకు ఇథనాల్‌ను ఇంధనంగా వినియోగించుకోగలిగే విషయంలో ఐడీఏసహా.. సంస్థ సభ్యులు రెండు విధాలుగా మద్దతివ్వవలసి ఉన్నట్లు రవి పేర్కొన్నారు. ఇథనాల్ వంట స్టవ్‌ల ఉత్పత్తిని పెంచేందుకు తయారీదారులకు సహకరించడంతోపాటు.. కుటుంబాలకు ప్రత్యక్షంగా ఇథనాల్ డెలివరీ అయ్యేందుకు సరఫరాల చైన్‌ను అభివృద్ధి చేయవలసి ఉన్నట్లు వివరించారు. ఇథనాల్ సరఫరాల ద్వారా ప్రస్తుతం చమురు పరిశ్రమకు ఇస్తున్న మద్దతు స్థాయిలోకాకుండా ఇందుకు విభిన్నంగా వ్యవహరించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు.సరఫరా చైన్ అభివృద్ధి, డెలివరీ అంశాలు కీలకమని, దేశీయంగా ఇథనాల్‌ను వంట ఇంధనంగా మార్పుచేసేందుకు ఏఐడీఏ ముందుకురావాలని రవి డిమాండ్ చేశారు. ప్రస్తుతం పెట్రోల్‌లో ఇధనాల్‌ను 20 శాతం మిక్స్(ఈ20) చేస్తున్న సంగతి తెలిసిందే. 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ20 పెట్రోల్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ సైతం జారీ చేసింది.డీజిల్‌లో కలిపేందుకు వీలైన ఏబీఏ ఉత్పత్తిని పెంచడం, ఇథనాల్ టు సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్(ఎస్ఏఎఫ్)కు సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై అభ్యర్థనలతోపాటు.. వంటకు వీలయ్యే ఇథనాల్‌పై ప్రత్యేక దృష్టిపెట్టవలసిందిగా ఏఐడీఏను రవి కోరారు. బయోఇంధన వ్యవస్థలో వంట ఇంధనాన్ని చేర్చడం ద్వారా ఇంధన భద్రతను పెంచుకునేందుకు వీలుంటుందని తెలియజేశారు. ఇందుకు చమురు పరిశ్రమ, డిస్టిల్లరీలు సహకరించుకోవడం ద్వారా దేశీయంగా ఇథనాల్ ఆధారిత వంటకు తెరతీయవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. -
CNG గ్యాస్ కోసం ఆటో డ్రైవర్ల పడిగాపులు
-
2 నెలల దాకా నో టెన్షన్.. దేశంలో 8 లక్షల టన్నుల LPG నిల్వలు
-
60 రోజులకు సరిపడా ముడి చమురు సిద్ధం
దేశంలో ఇంధన సరఫరాపై సాగుతున్న వదంతులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. భారత్‌లో పెట్రోలియం, ఎల్పీజీ సరఫరా పూర్తిగా సురక్షితంగా, నియంత్రణలో ఉందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దేశవ్యాప్తంగా ఎక్కడా కొరత లేదని భరోసా ఇచ్చింది.వదంతులు నమ్మొద్దు..సోషల్ మీడియాలో ఇంధన కొరతపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాల్లోని క్యూలైన్లు, పాత లాక్డౌన్ దృశ్యాలను వాడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని హెచ్చరించింది. ఇటువంటి వార్తలను నమ్మి పౌరులు ఆందోళన చెందవద్దని, ఇంధన నిల్వలు నిండుగా ఉన్నాయని పేర్కొంది.కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురును కంపెనీలు ఇప్పటికే సేకరించాయి. రిటైల్ అవుట్లెట్ల ద్వారా దేశవ్యాప్తంగా 1 లక్షకు పైగా పెట్రోల్ బంకులు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయి. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా నుంచి 8,00,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సరుకు సముద్ర మార్గంలో భారత్‌కు వస్తోంది. భారతీయ రిఫైనరీలు ప్రస్తుతం 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ ఇంధన భద్రతలో పటిష్టంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకప్పుడు కేవలం పశ్చిమాసియాపైనే ఆధారపడిన భారత్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 41కి పైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల హార్మూజ్ జలసంధి వంటి ప్రాంతాల్లో అంతరాయాలు కలిగినా దేశీయ సరఫరాకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని స్పష్టం చేసింది.తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలునిత్యావసర వస్తువుల లభ్యతపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం చట్టరీత్యా నేరమని ప్రభుత్వం హెచ్చరించింది. ఉద్దేశపూర్వకంగా భయాందోళనలు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేసింది. సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని, డీలర్లకు క్రెడిట్ పరిమితులను కూడా పెంచామని, కావున ప్రజలు సంయమనం పాటించాలని కోరింది.విశాఖ తీరానికి ‘ఎంటీ జంబో’ రాక!రష్యా నుంచి సుమారు 1,36,728 మెట్రిక్ టన్నుల ముడి చమురును మోసుకొస్తూ ‘ఎంటీ జంబో’ నౌక నేడు విశాఖ తీరానికి చేరుకుంది. ఈ భారీ కంటైనర్ రాకతో స్థానిక రిఫైనరీలకు ముడి సరుకు లభ్యత పెరగడమే కాకుండా రాబోయే రోజుల్లో ఇంధన సరఫరాలో స్థిరత్వం ఏర్పడనుంది. నిన్న బీడబ్ల్యూ బ్రిచ్ నౌక 24,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ (వంట గ్యాస్)తో విశాఖ పోర్టుకు చేరుకుంది. ఎంటీ పెట్రాయిట్ నౌక కూడా భారీ స్థాయిలో ముడి చమురును తీసుకువచ్చింది. అయితే, ఎంటీ జంబో ద్వారా వచ్చిన లక్షన్నర టన్నుల ముడి చమురును పైప్లైన్ల ద్వారా రిఫైనరీలకు తరలించే అన్లోడింగ్ ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం కానుంది. వంట గ్యాస్ నిల్వలను మరింత పెంచే దిశగా ఈ నెల 30వ తేదీన మరో రెండు ఎల్పీజీ నౌకలు విశాఖ తీరానికి చేరుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం.ఇదీ చదవండి: ఉద్యోగం మారినా.. వయసు పెరిగినా ఇదే దిక్కు! -
అనిశ్చితి వేళ విశాఖకు క్రూడాయిల్, ఎల్పీజీ షిప్‌లు
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో అనిశ్చితి, ఎర్రసముద్రం, గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల షిప్పింగ్ రంగంలో ఆందోళన నెలకొన్న తరుణంలో విశాఖపట్నం పోర్టుకు భారీ ఇంధన నౌకలు చేరుకోవడం సానుకూల పరిణామంగా మారింది. నగరంలోని రిఫైనరీలకు, పరిశ్రమలకు, సామాన్య ప్రజల గృహ అవసరాలకు అవసరమైన ఎల్పీజీ, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఇప్పుడు పుష్కలంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా ఈ నెల 20న గుజరాత్ తీరం నుంచి బయలుదేరిన రెండు కీలక స్వదేశీ ఫ్లాగ్ వెసెల్స్ విశాఖ తీరానికి గురువారం సాయంత్రం చేరుకున్నాయి.ఖతార్‌లోని మెసయ్యద్ పోర్టు నుంచి బయలుదేరి గుజరాత్‌లోని వాడినార్ పోర్టులో లోడింగ్ పూర్తి చేసుకున్న బీడబ్ల్యూ బిర్చ్ అనే భారీ ఎల్పీజీ ట్యాంకర్ విశాఖ వచ్చింది. సుమారు 58,123 టన్నుల సామర్థ్యం గల ఈ నౌక ప్రస్తుతం 11.6 మీటర్ల పూర్తిస్థాయి లోడుతో పోర్టుకు చేరుకుంది. సౌత్ ఏసియా ఎల్పీజీ కావెర్న్ లేదా హెచ్‌పీసీఎల్ టెరి్మనల్ వద్ద అన్లోడింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. అదేవిధంగా రష్యా నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టు మీదుగా బయలుదేరిన ఎంటీ పేట్రియాట్ ఆయిల్ ట్యాంకర్ కూడా విశాఖ పోర్టులోకి ప్రవేశించింది.ఈ నౌకలో సుమారు 46,001 టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు (ప్రధానంగా హై – స్పీడ్ డీజిల్) ఉన్నట్లు సమాచారం. ఈ వెసెల్ విశాఖలోని అవుటర్ హార్బర్ ఆయిల్ టెరి్మనల్ వద్ద బెర్తింగ్ చేయనున్నారు. ఇక్కడ నుంచి పైప్‌లైన్ ద్వారా హెచ్‌పీసీఎల్ లేదా ఐఓసీఎల్ రిఫైనరీ టెరి్మనల్స్కు తరలించనున్నారు. వీటిరాకతో విశాఖతోపాటు ఇతర జిల్లాలకు కొంత కాలంపాటు వంటగ్యాస్, ఇంధన సమస్యలు తలెత్తబోవని భావిస్తున్నారు.న్యూ మంగళూరు పోర్టుకు ఎల్పీజీ నౌకయశ్వంతపుర: ఎల్పీజీతో కూడిన నౌక అపోలో ఓషీన్ గురువారం కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు చేరుకొంది. 16 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఇందులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దానిని అన్లోడ్ చేసి జిల్లాలకు పంపిస్తారు. -
తిరుమల కొండపై గ్యాస్ కష్టాలు మూతబడుతున్న హోటల్స్
-
గ్యాస్ బుకింగ్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం
-
పీఎన్జీకి మారకపోతే ఎల్పీజీ కట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా పరిణామాల వల్ల మన దేశంలో వంట గ్యాస్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) అందుబాటులో ఉన్నచోట వినియోగదారులు తప్పనిసరిగా ఆ కనెక్షన్ తీసుకోవాలని, లేకపోతే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ తొలగిస్తామని తేల్చిచెప్పింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వు జారీ చేసింది. ప్రస్తుత పరిణామాలతోపాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ నెట్‌వర్క్‌ను విస్తరించడం, ఎల్పీజీపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది. గృహ, వాణిజ్య వినియోగదారులు పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువును విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచిస్తోంది. పీఎన్జీ దేశీయంగానే ఉత్పత్తి అవుతోంది. ఇది వైవిధ్యభరితమైన సరఫరా మార్గాల ద్వారా లభించే సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయం. పైప్‌లైన్ ద్వారా వంటగదికి పీఎన్జీని నిరంతరాయంగా సరఫరా చేస్తారు. పీఎన్జీ అనుమతులను వేగవంతం చేయాలని తాజా ఉత్తర్వులో ప్రభుత్వం ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా అనుమతులు ఇవ్వకపోతే ఇచ్చినట్లుగానే భావిస్తారని స్పష్టం చేసింది. -
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సంక్షోభం, కేంద్రం కీలక ప్రకటన
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో నెలకొన్న చమురు సంక్షోభంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్, వంటగ్యాస సరఫరాపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ధరలలో కూడా ఎటువంటి పెరుగుదల లేదని స్పష్టం చేసింది. దేశంలో సరిపడా ఇంధన నిల్వలున్నాయనీ, వదంతులను నమ్మవద్దు అని బుధవారం (మార్చి 25, 2026) పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ (MoPNG) సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ కొరత లేదు, ధరలు పెంచంఏటా సుమారు 26 కోట్ల టన్నుల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం మనకు ఉందనే విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా అన్నారు. గత రెండు రోజులుగా, అనేక ప్రాంతాల్లోని రిటైల్ అవుట్లెట్లు మరియు పెట్రోల్ పంపుల బయట క్యూలు కనిపించాయి. భయాందోళనలతో కొనుగోళ్లు కూడా జరిగాయి. కానీ మన వద్ద తగినంత పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయి. ఏ పెట్రోల్ పంపు వద్ద కూడా కొరత లేదు. పెట్రోల్ పంపులకు సరఫరా టెర్మినళ్లలో కూడా తగినంత పరిమాణంలో ఇంధన నిల్వలున్నాయి. అందువల్ల, వదంతులను నమ్మవద్దు , భయాందోళనలతో కొనుగోళ్లు మానుకోండి అని ఆమె చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి పెరుగుదల ఉండదని కూడా ఆమె స్పష్టం చేశారు. LPG విషయానికి వస్తే, ఏ పంపిణీ కేంద్రం వద్ద కూడా ఎలాంటి కొరత లేదని ఆమె తెలిపారు. ఇప్పటివరకు 26 రాష్ట్రాలకు 22,000 టన్నుల వాణిజ్య ఎల్‌పిజిని కేటాయించారని, గత 25 రోజుల్లో 2.5 లక్షల కొత్త పిఎన్జి కనెక్షన్లు మంజూరు చేశారని ఆమె తెలిపారు. సుమారు 30,005 కిలోల సిలిండర్లు పంపిణీ చేశామని ఆమె చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధన కిరోసిన్‌ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అదనపు కేటాయింపులు చేసిందన్నారు. సుమారు 16 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి కేటాయింపు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అలాగే నల్లబజారు, అక్రమ నిల్వలను అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం వివిధ రాష్ట్రాల్లో సుమారు 2700 దాడులు నిర్వహించి, సుమారు 2000 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్టు సుజాత శర్మ వెల్లడించారు.ఇదీ చదవండి: కోట్లాదిమందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలు #WATCH | Delhi: Sujata Sharma, Joint Secretary (Marketing & Oil Refinery), Ministry of Petroleum & Natural Gas, says, "In the last 25 days, 2.5 lakh new connections (PNG) have been given. Additionally, approximately 2.20 lakh consumers have shifted from LPG to PNG. Additionally,… pic.twitter.com/o3pDx5KbMs— ANI (@ANI) March 25, 2026 -
గ్యాస్ బుకింగ్ టైమ్‌లో మార్పు.. కేంద్రం క్లారిటీ
సోషల్ మీడియాలో ఎల్పీజీ (LPG) రీఫిల్ బుకింగ్‌పై వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందించింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ సమయ పరిమితుల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ వినియోగదారుల ఆందోళనలను పటాపంచలు చేసింది.వైరల్ వార్తల్లో ఏముంది?గడిచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఒకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాక మళ్లీ మరోసారి గ్యాస్ బుక్ చేసుకోవాలంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కనెక్షన్లకు 45 రోజులు, నాన్ పీఎంయూవై సింగిల్ సిలిండర్ కనెక్షన్లకు 25 రోజులు, అదే డబుల్ సిలిండర్ కనెక్షన్‌కు అయితే 35 రోజులు గ్యాప్ తప్పనిసరిగా ఉండేలా మార్పులు చేసినట్లు ప్రచారం జరిగింది.కేంద్రం, ఐవోసీఎల్ వివరణఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేసింది. అటువంటి నిబంధనలేవీ తీసుకురాలేదని, పాత పద్ధతే కొనసాగుతుందని వివరించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. కనెక్షన్లతో సంబంధం లేకుండా ఒకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాక మళ్లీ మరోసారి గ్యాస్ బుక్ చేసుకోవాలంటే పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు వ్యవధి ఉండాలి.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కూడా స్పందిస్తూ, దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసింది. "తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు. గ్యాస్ కొరత ఏర్పడుతుందనే భయంతో అనవసరంగా ముందస్తు బుకింగ్‌లు చేసుకోవాల్సిన అవసరం లేదు." అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.Reports claiming changes in LPG refill booking timelines are incorrect. There is no change in the existing timelines (25 days in urban areas / 45 days in rural areas), and LPG supplies remain adequate across the country. Please rely only on official sources and avoid panic…— Indian Oil Corp Ltd (@IndianOilcl) March 25, 2026 -
గ్యాస్ కొరతకు చెక్.. ఇక 10 కిలోల సిలిండర్లు..!
-
భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..
-
వంటగ్యాస్ కష్టాలకు చెక్.. పెరిగిన ఉత్పత్తి!
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు భారత ఇంధన దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం ద్వారా సామాన్యుడిపై భారం పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.పెరిగిన స్వదేశీ ఉత్పత్తిఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కాకముందు వరకు భారతదేశ అవసరాల్లో స్వదేశీ ఎల్పీజీ ఉత్పత్తి వాటా 40% మాత్రమే ఉండేది. అయితే, ప్రస్తుత అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో దీన్ని 50-60%కి పెంచినట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు.గత కొద్ది రోజులుగా గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న భయంతో వినియోగదారులు అవసరం ఉన్నా, లేకపోయినా బుకింగ్స్ చేశారు. అయితే, ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ నిలకడగా ఉందని, ఎక్కడా సరఫరా నిలిచిపోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో బుకింగ్స్ కూడా సాధారణ స్థితికి చేరుకున్నాయి. ‘మేము నిరంతరం సరఫరాను పర్యవేక్షిస్తున్నాం. దేశవ్యాప్తంగా సిలిండర్ల డెలివరీ సాధారణంగానే సాగుతోంది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని సుజాత శర్మ చెప్పారు.ఇదీ చదవండి: ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు -
ఇంటికొచ్చే గ్యాస్ ఇన్ని రకాలా..?
సామాన్యుడి వంటగదిలో ఎర్రటి గ్యాస్ సిలిండర్ (LPG) కనిపించడం సర్వసాధారణం. కానీ, మారుతున్న కాలంతో పాటు గ్యాస్ వినియోగం తీరు కూడా మారుతోంది. నగరాల్లో వాహనాల కోసం సీఎన్జీ (CNG), ఇళ్లలో పైప్‌లైన్ ద్వారా వచ్చే పీఎన్జీ (PNG).. ఇలా గ్యాస్ రకాలు వినడానికి ఒకేలా ఉన్నా, వాటి ఉపయోగాలు మాత్రం వేరు. భారతదేశ ఇంధన వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ నాలుగు రకాల గ్యాస్‌ల గురించి క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం.వంటగదిలో రారాజు.. ఎల్పీజీకోట్లాది భారతీయ కుటుంబాలకు వంటగదిలో గ్యాస్ అంటే మొదట గుర్తొచ్చేది ఎల్పీజీ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ముడి చమురు శుద్ధి ప్రక్రియలో లభించే ప్రోపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమమే ఇది. గ్యాస్‌ను ద్రవ రూపంలోకి మార్చి సిలిండర్లలో నింపుతారు. దీనిని రవాణా చేయడం సులభం కాబట్టి, మారుమూల గ్రామాల్లో కూడా ఇది అందుబాటులో ఉంది. 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన' వంటి పథకాలతో ఇది ఇప్పుడు ప్రతి ఇంటికీ చేరువైంది.సీఎన్జీ.. వాహనాలకు ‘గ్రీన్’ సిగ్నల్కాలుష్యాన్ని తగ్గించడంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) కీలక పాత్ర పోషిస్తోంది. పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా దీనిని వాహనాల్లో వాడుతున్నారు. ఇది ఇతర ఇంధనాల కంటే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. ప్రస్తుతం నగరాల్లో ఆటోలు, బస్సులు, కార్ల కోసం సీఎన్జీ వాడకం విపరీతంగా పెరిగింది. ఇది సహజ వాయువును అధిక పీడనం వద్ద కంప్రెస్ చేయడం ద్వారా తయారవుతుంది.పీఎన్జీ.. సిలిండర్ల గోల లేని వంట గ్యాస్నగరాల్లో ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండ్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG). ఇంటికి వాటర్ కనెక్షన్ ఉన్నట్టే, భూగర్భ పైప్లైన్ల ద్వారా నేరుగా వంటగదికి గ్యాస్ వస్తుంది. దీని వల్ల సిలిండర్ అయిపోతుందనే భయం ఉండదు. మీరు ఎంత వాడుకుంటే అంతకే మీటర్ రీడింగ్ ప్రకారం బిల్లు చెల్లించవచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా దీనిని ఎక్కువగా వాడుతున్నారు.ఎల్ఎన్జీ.. భారీ పరిశ్రమల ఇంధనంలిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) సాధారణంగా మనం నేరుగా వాడేది కాదు. కానీ ఇది దేశీయ ఇంధన సరఫరా గొలుసులో అత్యంత కీలకమైనది. సహజ వాయువును మైనస్ 162°C వద్ద చల్లబరిచి ద్రవంగా మారుస్తారు. ఇలా చేయడం వల్ల దాని పరిమాణం తగ్గి, ఓడల ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం సులభం అవుతుంది. తీర ప్రాంతాలకు చేరుకున్న ఎల్ఎన్జీని తిరిగి గ్యాస్‌గా మార్చి విద్యుత్ ప్లాంట్లు, భారీ పరిశ్రమలకు పంపిస్తారు. -
భారత్ చేరిన మరో ఎల్పీజీ నౌక
మంగళూరు(కర్ణాటక): పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంతో భారత్‌లో ఎల్పీజీ కష్టాలు పెరగడంతో ఆ సమస్యను తీర్చేందుకు అమెరికా ముందుకొచి్చంది. అమెరికా నుంచి 16,714 మెట్రిక్ టన్నుల ఎలీ్పజీతో బయల్దేరిన సరుకు రవాణా నౌక ‘పైక్సిస్ పయనీర్’ ఆదివారం భారత్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 14వ తేదీన టెక్సాస్ రాష్ట్రంలోని పోర్ట్ ఆఫ్ నెదర్లాండ్ నుంచి బయల్దేరి పయనీర్ నౌక ఆదివారం న్యూ మంగళూరులోని నౌకాశ్రయానికి చేరుకుంది. మంగళూరు రిఫైనరీ, పెట్రో కెమికల్స్ ప్లాంట్ సమీపంలో భారత్ అతిపెద్ద భూగర్భ ఎల్పీజీ నిల్వ కేంద్రాన్ని నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇక్కడ 80 వేల మెట్రిక్ టన్నుల ద్రవరూప పెట్రోలియంగ్యాస్(ఎల్పీజీ)ను భద్రపరచవచ్చు. వ్యూహాత్మక అవసరాలకు ఈ నిల్వలు అక్కరకొస్తాయి. రష్యా చమురు నౌక ఆగమనం మంగళూరు: చైనాకు వెళ్లాల్సిన రష్యా నౌక ఆక్వా టైటాన్ దిశమార్చుకుని మంగళూరుకు చేరుకుంది. చైనాకు బదులుగా భారత్ దిశగా బయల్దేరిన ఏడు నౌకల్లో ఇండియాకు చేరుకున్న తొలి నౌక ఇదే కావడం విశేషం. పశి్చమాసియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా సముద్రమార్గంలో చమురు రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నంకావడంతో తాత్కాలికంగా రష్యా నుంచి భారత్ చమురుకొనేందుకు అమెరికా అనుమతి మంజూరుచేసింది. దీంతో చైనాకు వెళ్లే ముడిచమురు నౌకలను సైతం భారత్ ఆగమేఘాల మీద కొనేసింది. దీంతో చైనాలోని రిజావూ పోర్ట్‌కు వెళ్లాల్సిన ఆ నౌకలు మార్చి నెల భారత్ వైపు దిశమార్చుకున్నాయి. జనవరి చివర్లో బాల్టిక్ సముద్రంలో సరుకు నింపుకున్న ఆక్వా టైటాన్ చివరకు భారత్‌కు చేరుకుంది. మార్చి 25వ తేదీన మరో రష్యా చమురునౌక సూయిజ్‌మ్యాక్స్ జౌజౌ సైతం త్వరలో భారత్‌కు చేరుకోనుంది -
ఎల్పీజీ ఏటీఎం వచ్చేసింది.. ఇక ఎనీ టైమ్ గ్యాస్!
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారతీయ వంటిళ్లపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 60% దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో, సరఫరా గొలుసులో అప్పుడప్పుడు అంతరాయాలు కలుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకుని, డెలివరీ బాయ్ కోసం గంటల తరబడి వేచి చూడటం వినియోగదారులకు పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా భారత్ పెట్రోలియం (BPCL) వినూత్నమైన 'స్మార్ట్ ఎల్పీజీ వెండింగ్ మెషిన్'ను అందుబాటులోకి తెచ్చింది.ఎక్కడంటే..దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం ఇప్పుడు గురుగ్రామ్‌లో ప్రారంభమైంది. గురుగ్రామ్‌లోని సోహ్నా, సెక్టార్ 33లోని సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీలో బీపీసీఎల్ ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. 'భారత్ గ్యాస్ ఇన్‌స్టా ఎల్పీజీ' పేరుతో పిలిచే ఈ ఏటీఎం, సాధారణ నగదు ఏటీఎం తరహాలోనే 24 గంటల పాటు సేవలు అందిస్తుంది. ఫోన్ కాల్స్, బుకింగ్ స్లాట్లతో పనిలేకుండా కేవలం 2-3 నిమిషాల్లోనే నిండు సిలిండర్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.ఏటీఎంలో సిలిండర్ ఎలా పొందాలంటే..ఈ మెషిన్ ద్వారా గ్యాస్ పొందడం అత్యంత సులభం. దీని పనితీరు ఇలా ఉంటుంది..మొబైల్ నంబర్: మెషిన్ స్క్రీన్‌పై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.ఓటీపీ వెరిఫికేషన్: మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మీ గుర్తింపును ధ్రువీకరించుకోవాలి.క్యూఆర్ కోడ్ స్కాన్: మీ ఖాళీ సిలిండర్‌పై ఉన్న క్యూఆర్ (QR) కోడ్ లేదా బార్‌కోడ్‌ను మెషిన్ స్కానర్ ముందు ఉంచాలి. అది చెల్లుబాటు అవుతుందో లేదో మెషిన్ తనిఖీ చేస్తుంది.ఖాళీ సిలిండర్ డిపాజిట్: ధ్రువీకరణ పూర్తయ్యాక, విండో తెరుచుకుంటుంది. అందులో మీ ఖాళీ సిలిండర్‌ను ఉంచాలి. మెషిన్ దాని స్వచ్ఛతను, బరువును స్వయంచాలకంగా తనిఖీ చేసి లోపలికి తీసుకుంటుంది.చెల్లింపు: స్క్రీన్‌పై కనిపించే గ్యాస్ ధరను UPI ద్వారా స్కాన్ చేసి చెల్లించాలి.నిండు సిలిండర్: పేమెంట్ సక్సెస్ అవ్వగానే, పక్కనే ఉన్న డెలివరీ విండో నుండి సీల్ చేసిన నిండు సిలిండర్ బయటకు వస్తుంది.ఏంటీ ఏటీఎం ప్రత్యేకతలు?లైట్ వెయిట్ సిలిండర్లు: ఈ మెషిన్ ద్వారా 10 కిలోల కాంపోజిట్ సిలిండర్లను అందిస్తున్నారు. ఇవి పాత ఇనుప సిలిండర్ల కంటే చాలా తేలికగా ఉంటాయి.స్మార్ట్ అలర్ట్ సిస్టమ్: మెషిన్లో ఒకేసారి 10 సిలిండర్లను లోడ్ చేయవచ్చు. స్టాక్ తగ్గిపోయి, కేవలం రెండు సిలిండర్లు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు, మెషిన్ స్వయంచాలకంగా సమీప గ్యాస్ ఏజెన్సీకి రీఫిల్ కోసం అలర్ట్ పంపిస్తుంది.గ్యాస్ సిలిండర్ల డెలివరీలో పారదర్శకత పెంచడానికి మరియు వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడానికి ఈ 'ఎనీ టైమ్ గ్యాస్' విధానం ఎంతగానో దోహదపడనుంది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. -
గ్యాస్ బ్లాక్ దందా.. 201 సిలిండర్లు, 33 లక్షలు స్వాధీనం
అమెరికా-ఇజ్రాయెల్.. ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో భారత్‌లో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో, పలు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ల దందా కొనసాగుతోంది. తాజాగా యూపీలో బాత్రూమ్లో సిలిండర్లు దాచిన ఘటన, పశువుల పాకలో 200 సిలిండర్లు దాచి పెట్టిన ఘటనలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బాత్రూమ్లో సిలిండర్లు..ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా దాచిపెట్టారనే ఆరోపణ నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బదౌరా మార్కెట్లోని ఒక గృహోపకరణాల దుకాణంలో సోదాలు చేపట్టగా తాళం వేసి ఉన్న బాత్రూమ్ అధికారులకు కనిపించింది. అనుమానంతో గది తలుపును పగలగొట్టి చూడగా అందులో పదుల సంఖ్యలో ఫుల్ సిలిండర్లు, ఖాళీ సిలిండర్లు బయటపడ్డాయి. ఈ ఘటన సమయంలోనే దుకాణం యజమాని మున్నీలాల్ విశ్వకర్మ, అతని కుమారుడు అక్కడి నుంచి పారిపోయారు. అధికారులు రీఫిల్లింగ్ పరికరాలు, పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో, జాన్సా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.#BREAKING : During a late-night raid in Hapur, Uttar Pradesh, local authorities recovered 32 LPG cylinders from a residential property. Officials confirmed that 18 of the cylinders were filled. Further action is being taken in the matter.#LPGSeizure #IllegalLPG… pic.twitter.com/9NR8ZWbcbK— upuknews (@upuknews1) March 13, 2026పశువుల పాకలో 201 సిలిండర్లు..రాజస్థాన్‌లోని పశువుల పాకలో అక్రమంగా నిల్వ ఉంచిన 201 ఎల్పీజీ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోట్‌పుట్లి-బెహ్రోర్ జిల్లాలోని శ్యామ్‌నగర్ ప్రాంతంలో అధికారి శశిశేఖర్ శర్మ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో పశువుల పాకలో అక్రమంగా నిల్వ ఉంచిన 106 ఫుల్ సిలిండర్లు, 95 ఖాళీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, పశువుల పాకకు సమీపంలోనే గుంజన్ గ్యాస్ ఏజెన్సీ పేరుతో ఏ ఏజెన్సీ నడుస్తోంది. సోదాల సమయంలో ఏజెన్సీ యజమాని మదన్ సైని అక్కడే ఉన్నారు. దీంతో, అధికారులు ప్రశ్నించగా.. సరైన పత్రాలు లేకుండానే ఏజెన్సీని నడుపుతున్నట్లు ఆయన అంగీకరించారు. అనంతరం, అధికారులు.. గ్యాస్ సిలిండర్లతో నిండిన ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. కాగా, గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్‌పై రాష్ట్రవ్యాప్తంగా నిఘా ముమ్మరం చేసినట్టు అధికారులు తెలిపారు.610 LPG Cylinders of Indane, Bharat Gas & HP Gas were seized, which were illegally storedThe Crime Branch, Delhi Police busted an illegal LPG cylinder hoarding racket operating from a godown in Mundka, Outer DelhiTo defame govt and to create panic situation these people can… pic.twitter.com/v9oWJBGHAM— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) March 16, 2026గ్యాస్ చోరీ.. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక సిలిండర్ నుండి మరొక సిలిండర్‌కు గ్యాస్‌ను బదిలీ చేస్తున్న వీడియోలు ఆన్లైన్లో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఫరీదాబాద్ అధికారులు ఎల్పీజీ దొంగతనం, అక్రమ రీఫిల్లింగ్, బ్లాక్ మార్కెటింగ్‌పై చర్యలను ముమ్మరం చేశారు. ఈ విషయమై జిల్లా ఆహార మరియు సరఫరాల శాఖ పలు ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్‌పై 7 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్టు చెప్పుకొచ్చారు.ఎల్పీజీ బ్లాక్ మార్కెట్.. 33 లక్షలు స్వాధీనంమహారాష్ట్రలో ఎల్పీజీ బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతోంది. ఇందులో భాగంగా అధికారులు తనిఖీలు చేపట్టగా 2,129 దాడుల్లో రూ.33 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న 1,208 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వలకు సంబంధించి మొత్తం 23 మందిపై కేసులు నమోదు చేయగా, నిత్యావసర వస్తువుల చట్టం, 1955లోని నిబంధనల కింద 18 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎల్పీజీ డెలివరీ, బ్లాక్ మార్కెటింగ్ లేదా నిల్వలకు సంబంధించిన ఫిర్యాదులను తెలియజేయడానికి ప్రభుత్వం 9769919229 అనే వాట్సాప్, హెల్ప్‌లైన్ నంబర్‌ను జారీ చేసింది.330 LPG cylinders seized in Bhiwandi, Maharashtra. Three people booked for illegal storage.#lpggasissue #LpgCrisis #LpgCylinder #Maharashtra pic.twitter.com/3RfIiLTZB8— Sachin (@Sachin1649242) March 17, 2026 -
ఉగాది, రంజాన్ కు బిగ్ షాక్... నో గ్యాస్.. నో ఇండక్షన్..
-
భారత్ ప్రజలకు గుడ్ న్యూస్.. LPG నౌక వచ్చేసింది
-
గ్యాస్ సరఫరాలో ఎగుమతి యూనిట్లకు ప్రాధాన్యం
ఎగుమతి ఆధారిత తయారీ యూనిట్లకు ప్రాధాన్య ప్రాతిపదికన ఎల్పీజీ, సహజ వాయువును కేటాయించాలని భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇంధన కొరత ఏర్పడితే భారతీయ సంస్థలు సకాలంలో ఎగుమతుల లక్ష్యాలను పూర్తి చేయలేవని.. దీంతో అంతర్జాతీయ కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ దేశాల వైపు మళ్లే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా చైనా ప్రయోజనం పొందొచ్చని పేర్కొంది. కనుక ఎగుమతి ఆధారిత తయారీ పరిశ్రమలకు గ్యాస్ సరఫరా కొనసాగేలా చూడడం ఎంతో అవసరమని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రల్హాన్ తెలిపారు.ఈ విషయమై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖలకు లేఖ రాసినట్టు చెప్పారు. ఎగుమతులపై ఆధారపడిన చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) సైతం గ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యం చూపించాలని కోరారు. ఎగుమతిదారులు సమస్యలు ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికన ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత.. పశి్చమాసియాలో సంక్షోభ వాతావరణం నెలకొనడం తెలిసిందే. దీంతో చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి.గ్యాస్ కొరత ఏర్పడడంతో వంటగ్యాస్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. పరిశ్రమలకు ఇప్పటికే 50 శాతానిక పైనే గ్యాస్ కోత విధించడం గమనార్హం. జలంధర్ కేంద్రంగా పనిచేసే హ్యాండ్ ఉపకరణాల తయారీదారులు, ఎగుమతిదారుల సమాఖ్య ప్రెసిడెంట్ అశ్వినీ కుమార్ సైతం ఇదే మాదిరి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తమ ఉత్పత్తి కోసం రోజువారీ 425 కిలోల ఎల్పీజీ, కార్మికుల ఆహార తయారీకి వీలుగా 19 కిలోల వాణిజ్య సిలిండర్ల సరఫరా ఎంతో అవసరమని చెప్పారు.ఇదీ చదవండి: దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు -
గుడ్ న్యూస్.. భారత్‌కు LPG గ్యాస్ నౌక.. గ్యాస్ కొరత ఉండదు..
-
గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌలకు ఎంత డిమాండో!!
ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తీవ్రమైంది. దీంతో ఇండక్షన్ స్టౌలకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే.. ఇండక్షన్ స్టౌల కొరత పెరగడంతో.. ఇప్పటికిప్పుడు వాటిని తయారు చేసే పరిస్థితులు లేవని, చైనా నుంచి ముడిపదార్థాలు దిగుమతి అవ్వడానికి 45 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. ఇండక్షన్ స్టౌల లభ్యత భారీగా తగ్గిపోవడానికి కారణాలేమిటి? వరుస పండగల వేళ.. పౌరుల పరిస్థితి ఏమిటి?500 శాతం డిమాండ్ హిందువులకు నూతన సంవత్సరమైన ఉగాది.. అదేవిధంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకొనే రంజాన్ మరో మూడునాలుగు రోజుల్లో రానున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సరఫరాపై ప్రతికూల ప్రభావం పడడంతో పండుగ పూట పిండివంటలు చేసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎల్పీజీ సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే హాస్టళ్లలో ఆకలికేకలు వినిపిస్తున్నాయి.హోటళ్లలో దోశ, పూరీ, మైసూర్ బజ్జీ వంటి పదార్థాలు అందుబాటులో లేకుండా పోయాయి. కార్పొరేట్ సంస్థలు, ఐటీ సంస్థల్లోని క్యాంటీన్లు కూడా మూతపడ్డాయి. గృహావసరాల సిలిండర్ సరఫరాలో ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. బుక్ చేసిన వారం పది రోజులకు గానీ గ్యాస్ బండ అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అటు ఆన్లైన్లో ఈ-కామర్స్ ప్లాట్ ఫారాల్లో.. ఇటు ఆఫ్‌లైన్‌లో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ షోరూంలలో కూడా ఇండక్షన్ స్టౌల కొరత నెలకొంది. ఇండక్షన్ స్టౌల కోసం ఒక్కసారిగా 500 శాతం దాకా డిమాండ్ పెరిగిందని డీలర్లు చెబుతున్నారు.ఇప్పటికిప్పుడు ఇండక్షన్ స్టౌల ఉత్పత్తిని పెంచొచ్చా?ఇండక్షన్ స్టౌల తయారీలో కీలకమైన ముడి పదార్థాలు చైనా నుంచి వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్పత్తిదారులు ముడిపదార్థాల కోసం ఇప్పటికిప్పుడు ఆర్డరిచ్చినా.. అవి భారత్‌కు చేరడానికి కనీసం 45 రోజుల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్క ఇండక్షన్ స్టౌ అని కాకుండా.. ఎయిర్ ఫ్రయ్యర్లు, ఓటీజీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, సోలార్ కుక్కర్లకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యపట్టణం భోపాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యపట్టణం లఖ్నవూల్లో దాదాపుగా ఇండక్షన్ స్టౌలకు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండక్షన్ స్టౌల కోసం డిమాండ్ బాగా పెరిగింది. ధరలు కూడా పైపైకి వెళ్తున్నాయి. నెల క్రితం వరకు 2,200 రూపాయలకు దొరికే ఇండక్షన్ స్టౌ ధర ఇప్పుడు 3 వేల రూపాయలకు చేరుకుంది. ఫిలిప్స్ కంపెనీకి చెందిన ముంబై బ్రాంచ్ మేనేజర్ వివేక్ గౌర్ కూడా దీనిపై స్పందించారు. ఎల్పీజీ కొరత కారణంగా ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు వెల్లడించారు. డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుందన్నారు. భోపాల్‌లోని ఉషా ఇంటర్నేషనల్ డిప్యూటీ సేల్స్ మేనేజర్ వినీత్ శర్మ కూడా సాక్షితో మాట్లాడుతూ నెలకు సగటున వెయ్యి యూనిట్ల మేర ఇండక్షన్ స్టౌల విక్రయాలు జరిగేవని... ఇప్పుడు రోజుకు 10 వేల యూనిట్ల మేర విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఇప్పటికిప్పుడు ఉత్పత్తిని పెంచడానికి ముడిపదార్థాల అవసరం ఉంటుందని, అందుకు చైనానే మార్గమని చెబుతున్నారు. ముఖ్యంగా ఇండక్షన్ స్టౌ తయారీలో ఉపయోగించే హీట్ ప్లేట్లు చైనా నుంచి వస్తాయి. కంట్రోలింగ్ వ్యవస్థ, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం భారత్ ప్రధానంగా చైనాపైనే ఆధారపడుతోంది. ఇప్పుడు ఆ పదార్థాల కోసం 45 రోజుల పాటు ఎదురుచూడాల్సి ఉంటుంది.ఏయే రంగాలపై ప్రభావం?గ్యాస్ కొరత దాదాపు అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో ఉత్తరాది కార్మికులు ఎక్కువగా పనిచేస్తుంటారు. వీరికి రెగ్యులర్ ఎల్పీజీ కనెక్షన్లు ఉండవు. చిన్న సిలిండర్లతో వంటలు చేసుకుంటారు. సాధారణంగా 650 నుంచి 750 వరకు 5 కేజీల చిన్న సిలిండర్ల రీఫిలంగ్ చార్జీలుంటాయి. గడిచిన 15 రోజులుగా మార్కెట్లో చిన్న సిలిండర్ల రీఫిల్లింగ్ జరగడం లేదు. దీంతో వాళ్లంతా స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా హోటల్ రంగంపై సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. దీని ప్రభావం పర్యాటకరంగంపై పడుతుంది. ఇండక్షన్ స్టౌలు ఇళ్లలో వంటకు సరిపోతాయే తప్ప.. హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో వంటకు పెద్దగా ఉపయోగపడవు.రాబోయే పండుగలపై ఈ ప్రభావం ఎలా ఉండనుంది?ఉగాదికి భక్ష్యాలు చేయడం ప్రత్యేకత. దీంతోపాటు.. కొత్త మామిడికాయలతో చేసే పులిహోర, పంచభక్ష్య పలహారాలను దేవుడికి నివేదన చేయడం తెలుగువారి సంప్రదాయం. అదేవిధంగా రంజాన్ ఈద్ సందర్భంగా షీర్‌కుర్మా, ఇతర వంటకాలు చేయడం ఆనవాయితీ. దీంతో.. గ్యాస్ కొరత, ఇండక్షన్ స్టౌల లభ్యత లేకపోవడం ఈ పండుగలపై తీవ్రంగా కనిపించనుంది. ఉగాది తర్వాత తొమ్మిది రోజులకు.. అంటే మార్చి 27న శ్రీరామ నవమి, ఏప్రిల్ 3న గుడ్‌ఫ్రైడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి.ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి?డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పండుగల నేపథ్యంలో సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రానికి లేఖ రాశారు. జిల్లాల స్థాయిలో గ్యాస్ సరఫరాను స్వయంగా కలెక్టర్లు మానిటర్ చేస్తున్నారు. -
గ్యాస్ కష్టాలకు చెక్.. భారత్ కు LPG గ్యాస్ నౌక
-
గ్యాస్ సిలిండర్ పై కేంద్రం కీలక ప్రకటన రెండున్నర రోజుల్లోనే డెలివరీ
-
గిగ్ కార్మికుల ఆదాయంపై యుద్ధ మేఘాలు!
మిడిల్ఈస్ట్ ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు గిగ్ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయాలు వీధి వ్యాపారుల నుంచి మెట్రో నగరాల ఫుడ్ డెలివరీ బాయ్స్ వరకు అందరినీ రోడ్డున పడేస్తున్నాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లు, క్లౌడ్ కిచెన్లు మూతపడుతుండటంతో.. డెలివరీ ఆర్డర్లు లేక గిగ్ కార్మికుల ఆదాయం సగానికి పడిపోయింది.అడుగంటిన సరఫరా.. ఆకాశన్నంటిన ధరలుఅంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ఎల్పీజీ దిగుమతులు తగ్గడంతో దేశీయంగా వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఇదే అదునుగా భావిస్తున్న అక్రమ వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో ఒక్కో సిలిండర్‌ను సుమారు రూ.4,000 వరకు విక్రయిస్తున్నారని గిగ్, ప్లాట్‌ఫాం సర్వీస్ వర్కర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘ప్రభుత్వం కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్వయంగా స్పందించి ఈ కృత్రిమ కొరతను అరికట్టాలి’ అని యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.తగ్గిన ఆర్డర్లు..రెస్టారెంట్లు, ధాబాలు గ్యాస్ లేక వంటలు చేయలేకపోవడంతో జొమాటో, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఆర్డర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ వ్యవహారంపై ఓ గిగ్ సిబ్బంది స్పందిస్తూ.. ‘గతంలో రోజుకు 30-40 ఆర్డర్లు చేసేవాడిని. ఇప్పుడు 20 కూడా రావడం లేదు. గంటల తరబడి యాప్ వైపు చూస్తూ ఖాళీగా కూర్చుంటున్నాం’ అన్నాడు.ఆర్ధిక సంక్షోభంలో గిగ్ కుటుంబాలుకేవలం డెలివరీ బాయ్స్ మాత్రమే కాదు, క్లౌడ్ కిచెన్లలో పనిచేసే వారు, రోడ్డు పక్కన బండ్లు నడిపేవారు ఈ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్నారు. ఆర్డర్ల పతనం వల్ల ఆదాయం తగ్గడమే కాకుండా, పెరిగిన నిత్యావసరాల ధరలు వారిని కుంగదీస్తున్నాయి. చాలా మంది గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్‌లు లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ పెరిగిన కరెంటు బిల్లులు మరో భారంగా మారుతున్నాయి.ప్రభుత్వ జోక్యం అవసరంగ్యాస్ సరఫరాతోపాటు లక్షలాది మంది కార్మికుల జీవనాధారానికి సంబంధించిన అంశంపై ప్రభుత్వ స్పందించాల్సి ఉంది. సిలిండర్లను అధిక ధరలకు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆదాయం కోల్పోయిన డెలివరీ భాగస్వాములకు కంపెనీలు లేదా ప్రభుత్వం తరఫున ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కొందరు చెబుతున్నారు. మిడిల్ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎల్పీజీ దిగుమతులను వేగవంతం చేయాలి.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం -
గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. కేంద్రం కొత్త ఆదేశాలు
న్యూఢిల్లీ: ఎల్పీజీ,పీఎన్జీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. వినియోగదారుల వద్ద ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలని సూచించింది. రెండో గ్యాస్ కనెక్షన్ ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలని తెలిపింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల్లో గ్యాస్, చమురు,ఎరువుల రంగాలను తీవ్ర సంక్షోభానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు సంక్షోభాన్ని తగ్గించేలా ఆయా రంగాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. తాజాగా భారత్ సైతం ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.గ్యాస్ వినియోగదారులు ఏదైనా ఒక గ్యాస్ కనెక్షన్ వినియోగించుకోవాలి. రెండో గ్యాస్ కనెక్షన్ ఉంటే వెంటనే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎల్పీజీ నియమాలలో మార్పులు చేసింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. పిప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) పాటు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్‌ను తిరిగి సంబంధిత ఏజెన్సీలకు ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయం ఇంధన వినియోగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా, సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక గృహాలు పీఎన్జీ కనెక్షన్‌తో పాటు ఎల్పీజీ కనెక్షన్‌ను కూడా కలిగి ఉన్నాయి. ఇది వినియోగదారులకు సౌకర్యంగా ఉన్నప్పటికీ, సబ్సిడీ లబ్ధి విషయంలో గందరగోళం, దుర్వినియోగం జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఒక గృహానికి ఒకే ఇంధన కనెక్షన్ అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.పీఎన్జీ గ్యాస్ కనెక్షన్ ఉన్న గృహాలు వెంటనే ఎల్పీజీ కనెక్షన్‌ను సమర్పించాలి. ఈ ప్రక్రియను ఆలస్యం చేయకుండా సంబంధిత గ్యాస్ కంపెనీలకు సమాచారం ఇవ్వాలి. ఇకపై సబ్సిడీ లబ్ధి ఒకే కనెక్షన్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారు ఇకపై ఎల్పీజీ సబ్సిడీ పొందలేరు. ఎల్పీజీ కనెక్షన్‌ను సమర్పించిన తర్వాత పీఎన్జీ ద్వారా గ్యాస్ నిరంతర సరఫరా కొనసాగుతుంది. ఇంధన వినియోగంలో పారదర్శకత పెరుగుతుంది. అక్రమ గ్యాస్ కనెక్షన్లు తగ్గనున్నాయి.ఈ నిర్ణయంపై గ్యాస్ వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారు ఎల్పీజీ అవసరం లేదని భావిస్తున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఎల్పీజీ సౌకర్యం లేకపోవడం ఇబ్బందికరమవుతుందని మరికొందరు అంటున్నారు. కాగా, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ (MoPNG), అలాగే పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (PNGRB) ద్వారా విడుదలైన గణాంకాల ఆధారంగా దేశంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కనెక్షన్ 33.2కోట్ల మందికి.. పిప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్1.36కోట్ల మంది వినియోగిస్తున్నారు. -
ప్రపంచంలోనే అధికంగా వంటగ్యాస్ ఉత్పత్తి చేసే దేశం
భారతదేశంలో సగటు సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేసే ప్రధాన అంశాల్లో గ్యాస్ ధర ఒకటి. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు నేరుగా భారతీయులపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నడుస్తున్న ఈ యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది సౌదీ అరేబియా లేదా రష్యా అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తిదారులు అని భావిస్తారు. కానీ అసలు వాస్తవం ఏమిటో.. ప్రపంచంలో ఏ దేశం ఎక్కువగా వంటగ్యాస్ ఉత్పత్తి చేస్తుందో కింద చూద్దాం.గ్యాస్ సరఫరాకు కీలకంగా హార్మూజ్ జలసంధిప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు హార్మూజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా ఈ షిప్పింగ్ కారిడార్‌లో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రవాణా ఖర్చులు పెరగడం, ఇన్సూరెన్స్ ప్రీమియంలు అధికం కావడంతో భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో సిలిండర్ ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి.అమెరికానే నంబర్ వన్చాలామంది సౌదీ అరేబియా లేదా రష్యా అతిపెద్ద ఉత్పత్తిదారులు అని భావిస్తారు, కానీ వాస్తవం వేరు. ప్రస్తుతం అమెరికా ప్రపంచంలోనే అగ్రగామి ఎల్పీజీ ఉత్పత్తిదారుగా అవతరించింది. అమెరికా ఏటా సుమారు 84 మిలియన్ టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేస్తోంది. అంటే ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో దాదాపు 26% వాటా ఒక్క అమెరికాదే.చైనా 32 మిలియన్ టన్నులు, సౌదీ అరేబియా 26 మిలియన్ టన్నులతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రష్యా నాలుగో స్థానంలో ఉంది. కెనడా, ఇరాన్, ఖతార్, యూఏఈలు కూడా ఈ జాబితాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.ఎల్పీజీ అసలు ఎలా తయారవుతుంది?ఎల్పీజీ అంటే ప్రొపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమం. ఇది ప్రధానంగా రెండు మార్గాల్లో లభిస్తుంది. భూమి లోపలి నుంచి సహజ వాయువును వెలికితీసేటప్పుడు ప్రొపేన్, బ్యూటేన్‌లను వేరు చేస్తారు. ఇతర మార్గాల్లో రిఫైనరీల్లో ముడి చమురును పెట్రోల్, డీజిల్‌గా మార్చే ప్రక్రియలో ఎల్పీజీ ఒక ఉప ఉత్పత్తిగా వస్తుంది.భారత్ పరిస్థితి ఏమిటి?భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారుల్లో ఒకటి. ఉజ్వల యోజన వంటి పథకాలతో గ్యాస్ వినియోగం పెరిగినప్పటికీ మన దేశీయ ఉత్పత్తి డిమాండ్‌కు సరిపోవడం లేదు. భారత్ తన అవసరాల కోసం ప్రధానంగా పశ్చిమ ఆసియా దేశాల నుంచి దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు లేదా సరఫరా గొలుసు దెబ్బతిన్నప్పుడు దాని ప్రభావం నేరుగా దేశీయ సిలిండర్ ధరలపై పడుతోంది.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం -
హార్మూజ్‌ను దాటేసిన... రెండు భారత నౌకలు
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల నుంచి ఎల్పీజీ నిల్వలతో వస్తున్న మరో రెండు భారత నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయి. భారీస్థాయిలో ఎల్పీజీ నిల్వలతో భారత్ వైపు బయల్దేరాయి. ‘‘శివాలిక్, నందాదేవి అనే రెండు నౌకలు శనివారం ఉదయం హార్మూజ్‌ను దాటుకుని వచ్చాయి. గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా రేవులకేసి బయల్దేరాయి’’అని నౌకాయాన శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌కుమార్ సిన్హా మీడియాకు తెలిపారు. వాటిలో 92,700 టన్నుల ఎల్పీజీ ఉన్నట్టు వెల్లడించారు. శివాలిక్ సోమవారం ముంద్రాకు, ఆ మర్నాడు నందాదేవి కాండ్లాకు చేరే అవకాశముందన్నారు. హార్మూజ్‌కు పశి్చమాన మరో 22, తూర్పున 4 భారత నౌకలు ఇంకా వెయిటింగ్‌లోనే ఉన్నట్టు ఆయన వివరించారు.వాటిని కూడా సురక్షితంగా దాటించేలా ఇరాన్ వర్గాలతో కేంద్రం ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. పశి్చమాన నిలిచిన 22 నౌకల్లో ఆరింట్లో ఎల్పీజీ, ఒకదాంట్లో ఎల్ఎన్జీ, నాలుగింట్లో చమురు నిల్వలున్నట్టు వివరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎలీ్పజీకి తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో రెండు నౌకల్లో భారీగా నిల్వల రాక ఉపశమనం కల్పించనుంది. టాంజానియాకు గ్యాసోలిన్ నిల్వలు తీసుకెళ్తున్న జగ్ప్రకాశ్ అనే భారత చమురు నౌక శుక్రవారమే హార్మూజ్‌ను దాటడం తెలిసిందే. మన దేశీయ ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దాకా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. వాటిలో 90 శాతం దిగుమతులు గల్ఫ్ దేశాల నుంచే జరుగుతున్నాయి. మార్చి 1 నుంచి హార్మూజ్ మూతపడటంతో గల్ఫ్ నుంచి చమురు, ఎల్పీజీ సరఫరా నిలిచిపోయాయి. మళ్లీ రష్యా నుంచే కొనాలని అడుక్కుంటోంది ఇరాన్ ఎద్దేవాదుబాయ్: రష్యా నుంచి ముడిచమురు కొనొద్దని భారత్‌ను నెలల తరబడి బెదిరించిన అమెరికా ఇప్పుడు గతిలేక భారత్‌ను బతిమిలాడుతోందని ఇరాన్ ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘యుద్ధం మొదలుకాకమునుపేమో రష్యా నుంచి చమురు అస్సలు కొనకూడదని భారత్‌ను అమెరికా బాగా బెదిరించింది. తీరా యుద్ధం మొదలయ్యాక మార్చి ఐదో తేదీన అమెరికా మాటమార్చింది. యుద్ధం దెబ్బకు హార్మూజ్ మూతబడటంతో రష్యాకాకుండా ఇతర దేశాల నుంచి చమురు కొనాలంటే సాధ్యపడట్లేదు. అందుకే మరో 30 రోజుల సడలింపు ఇస్తున్నాం.. రష్యా నుంచి కొనుక్కోండి అని అమెరికా భారత్‌కు అడగకపోయినా గడువు పెంచుతూపోతోంది’’అని అబ్బాస్ వెటకారంగా మాట్లాడారు. -
రష్యా నుంచి పెరిగిన చమురు కొనుగోళ్లు
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఈ నెలలో 50 శాతం పెరిగాయి. రోజువారీ 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేస్తోంది. ఫిబ్రవరిలో ఇది 1.04 మిలియన్ బ్యారెళ్లుగానే ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో చమురు సరఫరాలు నిలిచిపోవడం తెలిసిందే. దీంతో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుకుంది. మన దేశం ప్రతి రోజూ సగటున 5.8 మిలియన్ బ్యారెళ్ల చమురును వినియోగిస్తుంటుంది. ఇందులో 2.5–2.7 మిలియన్ బ్యారెళ్లు హర్మూజ్ జలసంధి నుంచే భారత్‌కు వస్తుంటుంది.అంతేకాదు మన దేశ ఎల్పీజీ అవసరాల్లో 55 శాతం, ఎల్ఎన్జీలో 30 శాతం కూడా ఈ మార్గం నుంచే వస్తుంటుంది. రష్యా నుంచి రోజువారీ 1–1.2 మిలియన్ బ్యారెళ్ల చమురును సమకూర్చుకుంటున్న నేపథ్యంలో హర్మూజ్‌ను మూసివేయడం కారణంగా మనకు ఏర్పడే లోటు 1.6 మిలియన్ బ్యారెళ్లు (రోజువారీ/బీపీడీ)గా ఉంటుందని కెప్లర్ అనలిస్ట్ సుమిత్ రిటోలియా తెలిపారు. ఇక రోజువారీ ఎల్పీజీ వినియోగం ఒక మిలియన్ బీపీడీగా ఉంటే.. ఇందులో 40–45 శాతం దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. మిగిలిన మొత్తాన్ని దిగుమతి చేసుకోవాల్సిందే. ఇందులో 80–90 శాతం హర్మూజ్ జలసంధి నుంచే రావాలి. ఈ మార్గం మూసుకుపోవడంతో దేశీయంగా ఎల్పీజీకి కటకట నెలకొంది. దేశీ సంస్థలు ఉత్పత్తిని 10–20 శాతం పెంచినా సరే, 47–50 శాతం లోటును ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
పశ్చిమాసియా యుద్ధం కారణంగా కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత
-
ఏలూరు జిల్లాలో వినియోగదారులకు గ్యాస్ కష్టాలు... అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?
-
ఏపీలో గ్యాస్ ఉందా, లేదా..? ఏది నిజం
-
ఇంధన కొరత లేదు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ మనదేశంలో ఇంధన కొరత ఎంతమాత్రం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏవియేషన్ టర్బైన్ ఇంధన నిల్వలు సరిపడా ఉన్నట్లు తెలిపారు. ఇంధనం విషయంలో ప్రజలను ఆందోళనకు గురిచేసేలా తప్పుడు ప్రచారం చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. గురువారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇంధన కొరత గురించి ప్రస్తావించారు. దీనిపై హర్దీప్సింగ్ పురి సమాధానం ఇచ్చారు. దేశంలోని 33 కోట్ల కుటుంబాలకు ఎల్పీజీ సరఫరాకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ముఖ్యంగా పేద కటుంబాలకు ఎలాంటి కొరత రానివ్వబోమని ప్రకటించారు.దేశీయ సరఫరా వ్యవస్థను పరిరక్షిస్తామన్నారు. అన్ని రకాల ఇంధనం విషయంలో రిటైల్ ఔట్లెట్ల వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. సప్లై చైన్స్ యథాతథంగా పని చేస్తున్నాయని వెల్లడించారు. అన్ని రాష్ట్రాలకు అదనంగా కిరోసిన్ కేటాయిస్తున్నా మని తెలిపారు. ఇంధన సరఫరాలో సంక్షోభం ఉన్నప్పటికీ మన దగ్గర మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని హర్దీప్సింగ్ పురి స్పష్టంచేశారు.ఎల్పీజీ ఉత్పత్తిని 28% పెంచినట్లు వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలను బట్టి చూస్తే మన దేశంలో ఇంధనం ధరలు తక్కువగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. హార్మూజ్ జలసంధిలో చమురు రవాణా ఆగిపోయినప్పటికీ ఇతర దేశాల నుంచి మనకు ముడి చమురు అందుతూ నే ఉందని గుర్తుచేశారు. 2006–07లో కేవలం 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకున్నామని, ప్రస్తుతం 40 దేశాల నుంచి దిగుమ తి చేసుకుంటున్నామని తెలియజేశారు. మోదీ దౌత్య నీతి వల్లే ముడి చమురు విషయంలో ఆటంకాలు లేకుండాపోయాయని మంత్రి ఉద్ఘాటించారు. -
బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే డీలర్షిప్ రద్దు చేస్తాం
సూర్యాపేట: ఎల్పీజీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే సదరు గ్యాస్ ఏజెన్సీల డీలర్‌షిప్‌లు రద్దు చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరతపై మీడియాతో మాట్లాడారు ఉత్తమ్,. ‘ గ్యాస్ కొరతపై రేపు ఆయిల్ కంపెనీలతో జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తాం. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయిల్ కంపెనీలకు రెఫరెన్స్ చేసి సామాన్య జన జీవనానికి ఇబ్బంది కలగకుండా ఎల్పీజీ గ్యాస్ కోసం మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎల్పీజీ గ్యాస్ విషయంలో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. ఎల్పీజీ డీలర్లు సామాజిక సామాన్య ప్రజానికం వద్ద అక్రమాలకు బ్లాక్ మార్కెట్లకు తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుని డీలర్ షిప్ రద్దు చేస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు. -
సిలిండర్ వెంటనే వస్తుంది... ఇలా సింపుల్‌గా బుక్ చేసుకోండి...
-
ఏపీలో పూర్తిగా మూతపడిన హోటల్స్
-
ఎల్పీజీ కష్టాలకు త్వరలో విముక్తి: మంత్రి సురేష్ గోపి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలవరపెడుతున్న ఎల్పీజీ (వంటగ్యాస్) కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టింది. ‘హోర్ముజ్ జలసంధి’ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరా అవరోధాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలలో గ్యాస్ దిగుమతులను పునరుద్ధరించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు.గురువారం ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. త్వరలోనే గ్యాస్ కొరత సమస్య ఒక కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ బుధవారం పార్లమెంటులో వివరణ ఇచ్చారని సురేష్ గోపి తెలిపారు. జలసంధి వద్ద నెలకొన్న దౌత్యపరమైన సున్నిత అంశాల దృష్ట్యా, అన్ని వివరాలను బహిర్గతం చేయలేమని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వివిధ దేశాధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చల ఫలితంగా కొత్త సరఫరా మార్గాలు తెరుచుకుంటున్నాయని, త్వరలోనే అదనపు నిల్వలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.ఆస్పత్రులు, శ్మశాన వాటికలు వంటి అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశీయంగా పరిస్థితిని చక్కదిద్దేందుకు శాఖా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అయితే అంతర్జాతీయంగా సరఫరాలో తలెత్తే సాంకేతిక అంశాలపై మనకు పూర్తి నియంత్రణ ఉండదని ఆయన స్పష్టం చేశారు. కేరళ సహా పలు రాష్ట్రాల్లో హోటళ్లు మూతపడటం, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సిన పరిస్థితులపై ఆయన విచారం వ్యక్తం చేశారు.గ్యాస్ ధరల నియంత్రణకు సంబంధించి ఇప్పటికే పటిష్టమైన యంత్రాంగం అమల్లో ఉందని, ప్రభుత్వ రంగ సంస్థలైన పెట్రోలియం కంపెనీలే ధరల నిర్ణయాధికారాన్ని కలిగి ఉన్నాయని మంత్రి తెలిపారు. హోర్ముజ్ జలసంధి మన ఇంధన భద్రతకు అత్యంత కీలకమైనప్పటికీ, కేవలం ఇంధనం కోసం యుద్ధానికి వెళ్లడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలనేది భారత విధానమని స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: పార్లమెంట్: ఎల్పీజీ కొరతపై దద్దరిల్లిన ఉభయ సభలు -
భయపడాల్సిన పనిలేదు.. ఎల్పీజీ కొరతపై మోదీ భరోసా
తిరుచిరాపల్లి/కొచ్చి: పశ్చిమాసియా సంక్షోభ ప్రభావంతో కొత్తగా భారత్‌లో వెలుగుచూసిన ఎల్పీజీ కొరతపై జనం భయపడాల్సిన పనిలేదని ప్రధాని మోదీ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎన్నికలు జరగబోతున్న తమిళనాడులో బుధవారం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘పశ్చిమాసియా సంక్షోభంపై తమిళనాడు ప్రజలకు ఒక్కటే చెప్పదల్చుకున్నా. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయి. ఈ సమయంలోనూ భారత్ మొదట్నుంచీ అవలంభిస్తున్న విధానాన్నే నేను నమ్ముతా. ఎలాంటి సంక్షోభకాలంలోనైనా భారతీయుల స్వప్రయోజనాలకే మా ప్రభుత్వం సదా కట్టుబడి ఉంటుంది. ప్రస్తుత కష్టకాలంలో మన విధానం మారదు. ఇప్పుడు ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. పుకార్లకు ఎవరూ ప్రాధాన్యత ఇవ్వొద్దు. ప్రజలను ఒక్కటే కోరుతున్నా. కేవలం సరైన, విశ్వసనీయ సమాచారం మాత్రమే అందరితో పంచుకోండి. కోవిడ్ మహావిలయకాలంలోనూ భారత్ ఎంత పరిణతి చెందిన దేశమో 140 కోట్ల మంది భారతీయులు రుజువుచేశారు. అచ్చం అలాగే ఇప్పుడు ఇంధన సంక్షోభాన్ని మ నం విజయవంతంగా ఎదుర్కొని సమస్య నుంచి గట్టెక్కుతాం’’అని మోదీ వ్యాఖ్యా నించారు. గల్ఫ్ దేశాలు ఆదుకుంటున్నాయి: పశ్చిమాసియా యుద్ధవాతారణంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న భారతీయులకు ఎన్డీఏ ప్రభుత్వంతోపాటు గల్ఫ్ దేశాలు అన్ని రకాలుగా ఆదుకుంటున్నాయని మోదీ ప్రకటించారు. బుధవారం కేరళంలోని కొచ్చిలో ఎన్డీఏ ర్యాలీలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘ఇరాక్‌లో చిక్కుకున్న నర్సులను కావొచ్చు, యెమెన్‌లో ఉగ్రవాదుల చెరలో బందీగా ఉన్న ఫాదర్ టామ్‌ను కావొచ్చు సంక్షోభంలో ఉన్నప్పుడు భారత్ ఏనాడూ తన పౌరులను గాలికి వదిలేయలేదు’ అన్నారుఆందోళన అనవసరంఅవసరాలకు తగినంత ఎల్పీజీపై సరఫరా ఎప్పట్లా 2.5 రోజుల్లోనే రీఫిల్ డెలివరీ: కేంద్రంన్యూఢిల్లీ: ‘‘దేశంలో అవసరాలకు తగినన్ని ఎల్పీజీ నిల్వలున్నాయి. గృహావసరాల డిమాండ్‌ను పూర్తిస్థాయిలో తీర్చడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు’’అని కేంద్రం బుధవారం పేర్కొంది. ఎల్పీజీ సరఫరాపై ఆందోళన అవసరం లేదని పెట్రోలియం, సహజ వాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ స్పష్టం చేశారు. ‘‘ఆందోళనతో రీఫిల్స్ అధిక బుకింగ్, డీలర్ల అక్రమ నిల్వల వంటివి తప్పుడు సమాచార వ్యాప్తికి దారి తీస్తున్నాయి. వాస్తవానికి గృహ వినియోగదారులకు రీఫిల్ సిలిండర్ పశ్చిమాసియా కల్లోలానికి ముందు మాదిరిగానే సగటున 2 నుంచి 2.5 రోజుల్లోనే అందుతోంది’’అని ఆమె మీడియాకు వెల్లడించారు. ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ఉక్కుపాదం మోపాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించామన్నారు. గృహేతర ఎల్పీజీ సరఫరాలో ఆస్పత్రులు, విద్యా సంస్థల వంటి అత్యవసర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. ‘‘భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 90 శాతం హార్మూజ్ జలసంధి గుండానే వస్తోంది’’అని తెలిపారు. ఎల్ఎన్జీ నిల్వలతో కూడిన రెండు నౌకలు త్వరలో భారత్ చేరుకోనున్నట్టు శర్మ వెల్లడించారు. హార్మూజ్ గుండా భారత్‌కు చమురు, సహజ వాయువు, ఎల్పీజీ రవాణా రెండు వారాలుగా తీవ్రంగా ప్రభావితం కావడం తెలిసిందే. రష్యా తదితర దేశాల నుంచి చమురు సరఫరా అవుతున్నా ఎల్పీజీ, ఎల్ఎన్జీ విషయంలో మాత్రం సమస్య నెలకొంది. దాంతో ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా ఎల్పీజీ సరఫరాను పెంచుకోవడంపై కేంద్రం దృష్టి సారించింది. -
ఏపీలో పొంచి ఉన్న వంట గ్యాస్ కొరత
సాక్షి, విజయవాడ: ఏపీలో వంట గ్యాస్ కొరత పొంచి ఉంది. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు నిండుకున్నాయి. ఇక 5 రోజులకు మాత్రమే గ్యాస్ నిల్వలు ఉన్నాయని కలెక్టర్ల సదస్సులో అధికారులు వెల్లడించారు.రాష్ట్రంలో 1.61 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు, 10 లక్షల కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. హెచ్ పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ సహా వివిధ కంపెనీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోంది. రాష్ట్రంలో రోజూ 4 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ డిమాండ్ ఉండగా గ్యాస్ కంపెనీల వద్ద ప్రస్తుతం 21505 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఎల్పీజీ సహా వివిధ ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి మంత్రులతో కమిటీ వేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మంత్రుల కమిటీలో సభ్యులుగా నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ సభ్యులు ఉన్నారు. -
సామాన్యుడికి షాక్.. పెళ్లిళ్లు వాయిదాపడే పరిస్థితి?
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ భారత్‌లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై తీవ్రంగా పడింది. నిన్న బెంగళూరు, విశాఖ, ముంబై నగరాల్లో గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు మూతపడగా.. ఈ రోజు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు సిలిండర్ బండలతో రోడ్డెక్కారు. కొన్ని రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో పెళ్లిళ్లు వాయిదాపడే పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాస్ సరఫరా కష్టాలు మొదలయ్యాయి. అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌తో పాటు.. బిహార్‌లో పోలీసుల బందోబస్తు నడుమ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా జరుగుతోంది. ఈ రాష్ట్రాల్లోని కీలక నగరాల్లో ఒకట్రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక రాజస్థాన్‌లో ఎల్పీజీ బ్లాక్ మార్కెటింగ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాలు డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాపై దృష్టి సారించాయి.రోజురోజుకీ పరిస్థితి తీవ్రంఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో మధ్యప్రదేశ్‌లో ఆ వాతావరణం కనిపిస్తోంది. రాబోయే వారం రోజుల్లో ఒక్క భోపాల్‌లోనే వెయ్యికి పైగా పెళ్లిళ్లు షెడ్యూల్ అయినట్లుగా తెలుస్తోంది. గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం ఉండడంతో.. పెళ్లింట భోజనాలు ఉంటాయా? అనే ఆందోళనలు వధువు, వరుడి తరఫు వారిలో నెలకొంటున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేయడంతో క్యాటరింగ్ నిర్వాహకులు, హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు పెళ్లిళ్ల సీజన్ దాటిపోతోందని, అడ్వాన్సులు తీసుకున్న తమకు నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవిధంగా ఇది అత్యయిక స్థితిని తలపిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.యూపీలో పోలీసుల బందోబస్తు నడుమ..యూపీలో గడిచిన నాలుగైదు రోజులుగా ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌లు పెరిగాయి. బుకింగ్‌ల మధ్య 25 రోజుల గ్యాప్ అనే నిబంధన కొనసాగుతున్నప్పటికీ.. అసాధారణంగా బుకింగ్‌లు పెరుగుతున్నాయని ఎల్పీజీ డీలర్లు చెబుతున్నారు. గోరఖ్‌పూర్, సిద్ధార్థనగర్ ప్రాంతాల్లో పౌరులు ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీల ముందు క్యూకట్టారు. సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల కోసం రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరినట్లు ఇప్పుడు యూపీలో ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం తెల్లవారుజాము 3 గంటల నుంచి ఏజెన్సీల వద్ద క్యూకట్టారు. అయితే.. వారందరికీ సిలిండర్లు సర్దుబాటు అయ్యే పరిస్థితులు కనిపించడం లేదని, టోకెన్లు ఇచ్చి, రాబోయే రోజుల్లో పంపిణీ చేస్తామని డీలర్లు చెబుతున్నారు దుర్గా..బిహార్‌లో బుకింగ్‌ల నిలిపివేత?రెండ్రోజులుగా బిహార్‌లో కమర్షియల్ సిలిండర్ల బుకింగ్‌లను చమురు సంస్థలు నిలిపివేశాయి. దీంతో.. బెంగళూరు మాదిరిగానే హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు బంద్‌కు సిద్ధమవుతున్నారు. డొమెస్టిక్ బుకింగ్‌లు కొనసాగుతున్నప్పటికీ.. బ్లాక్‌మార్కెటింగ్ భయాలు ఉండడంతో ప్రజలే ఏజెన్సీల వద్దకు ఖాళీ సిలిండర్లతో చేరుకుంటున్నారు. దీంతో.. అక్కడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా గోపాల్ గంజ్, ఖగారియా, ఔరంగాబాద్, పట్నా నగరాల్లో తెల్లవారుజాము నుంచే ప్రజలు సిలిండర్ బండ కోసం క్యూలైన్లలో నిలబడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే.. డీలర్లు తమపై దాడులు జరిగే ప్రమాదాలున్నాయనే భావనతో ఏజెన్సీలను తెరవడం లేదు.రాజస్థాన్‌లో బ్లాక్ మార్కెటింగ్?కమర్షియల్ సిలిండర్ ధర 19 వందల రూపాయలదాకా ఉండగా.. ఇప్పుడు రాజస్థాన్‌లో బ్లాక్ మార్కెటర్లు దాన్ని 2,500 నుంచి మూడువేల రూపాయలకు విక్రయిస్తున్నారు. దీనిపై ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ ఓ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, అక్రమార్కుల దందాను వెలుగులోకి తెచ్చింది. పోలీసులు ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించారు. లూథియానా, ఫరీద్కోట్, హోషియార్పూర్, పటియాలా ప్రాంతాల్లో చమురు సంస్థల వెబ్సైట్లు డౌన్ కావడంతో.. కొత్త బుకింగ్‌లు జరగడం లేదని తెలుస్తోంది దుర్గా..కేంద్ర ప్రభుత్వం చర్యలు పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిన్ననే ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో చమురు కంపెనీల తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సరఫరాను ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ మధ్య 25 రోజుల గ్యాప్ ఉండాలనే నిబంధనను నిక్కచ్చిగా అమలు చేస్తోంది. గ్యాస్ డెలివరీ బాయ్స్ దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండేందుకు ఓటీపీ ఆధారిత డెలివరీని అమలు చేస్తోంది. మరోవైపు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. - సాక్షి వెబ్‌డెస్క్ -
గ్యాస్ సిలిండర్లకు ఐఆర్సీటీసీ స్వస్తి?
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారతీయ రైల్వే వంటశాలలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరాన్ వేదికగా సాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసును దెబ్బతీయడంతో దేశంలో ఎల్పీజీ కొరత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు ఆహార కొరత రాకుండా ఉండేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) అత్యవసర మార్గదర్శకాలను జారీ చేసింది.ఐఆర్సీటీసీ తాజాగా వెలువరించిన అధికారిక సర్క్యులర్ ప్రకారం, వెస్ట్ జోన్ పరిధిలోని అన్ని స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లు తక్షణమే ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల్లోకి మారాలని ఆదేశించింది. ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్మెంట్ రూమ్‌లు, జన్ ఆహార్ కేంద్రాల్లో ఇకపై సాంప్రదాయ ఎల్పీజీ సిలిండర్లకు బదులుగా మైక్రోవేవ్ ఓవెన్లు, ఇండక్షన్ స్టవ్‌లు వినియోగించాలని సూచించింది.అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ‘రెడీ-టు-ఈట్’ ఆహార పదార్థాలను తగినంత పరిమాణంలో నిల్వ ఉంచుకోవాలని ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది. ‘ప్రయాణికుల సౌకర్యమే మా ప్రధమ ప్రాధాన్యత. అంతర్జాతీయ పరిణామాల వల్ల భవిష్యత్తులో ఆహార సరఫరాకు ఆటంకం కలగకూడదనే ఈ ముందస్తు చర్యలు తీసుకున్నాం’ అని ఐఆర్సీటీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.సంక్షోభానికి కారణాలుభారతదేశం తన ఎల్పీజీ అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల తలెత్తిన సవాళ్లు కింది విధంగా ఉన్నాయి.ఇరాన్ యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ రవాణా చేసే నౌకల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయంగా వాణిజ్య సిలిండర్ల లభ్యత తగ్గింది.గ్యాస్ సరఫరా నిలిచిపోతే రైల్వే స్టేషన్లలోని అవుట్లెట్లు మూతపడే ప్రమాదం ఉందని నిర్వహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముందుచూపుతో..రైల్వే క్యాటరింగ్ వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలని ఐఆర్సీటీసీ భావిస్తోంది. విద్యుత్ ఆధారిత వంట పద్ధతులు కేవలం గ్యాస్ కొరతను అధిగమించడమే కాకుండా స్టేషన్లలో అగ్ని ప్రమాదాల ముప్పును కూడా తగ్గిస్తాయని కొందరు భావిస్తున్నారు. పరిస్థితిని బట్టి మరిన్ని జోన్లకు ఈ నిబంధనలను వర్తింపజేసే అవకాశం ఉంది. ఎల్పీజీ సరఫరా పునరుద్ధరణపై పెట్రోలియం మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతూనే ప్రయాణికులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాజీ పడబోమని ఐఆర్సీటీసీ భరోసా ఇచ్చింది.ఇదీ చదవండి: ఐటీ కారిడార్ హాస్టళ్లలో ‘గ్యాస్’ కష్టాలు.. -
వంటగ్యాసే ఫస్టు!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు, సహజ వాయువు దిగుమతుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. దేశంలో వంట గ్యాస్ సరఫరా తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గృహ వినియోగానికి ప్రస్తుతం ఇబ్బందులు లేకపోయినా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా తగినంత లేకపోవడంతో ప్రధాన నగరాల్లో హోటళ్లు మూతపడుతున్నాయి. రవాణా రంగానికి అవసరమైన గ్యాస్ సరఫరా నిలిచిపోతోంది.సమస్య పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయువును ప్రాధాన్యతా క్రమంలో సరఫరా చేయాలని ఆదేశించింది. మొదట ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ తయారీకి, తర్వాత ఎరువుల ఉత్పత్తికి, అనంతరం తేయాకు పరిశ్రమ, పారిశ్రామిక వినియోగదారులకు, ఆ తర్వాత సిటీ గ్యాస్ సరఫరాదారులకు సహజ వాయువును సరఫరా చేయాలని పేర్కొంది. ఈ మేరకు సోమవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గ్యాస్‌ను మొదట ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎలీ్పజీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) తయారీకి అందజేయాలని తేలి్చచెప్పింది. పారిశ్రామిక వినియోగదారులకు 80%ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ ఉత్పత్తిలో సహజ వాయువును ముడి సరుకుగా ఉపయోగిస్తారు. ముడి చమురు శుద్ధి ప్రక్రియలో ఒక ఉపఉత్పత్తి ఎల్పీజీ. అలాగే సహజ వాయువును ప్రాసెస్ చేయడం ద్వారా ఎల్పీజీని తయారు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. మొదట ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ తయారీకి ప్రాధాన్యం ఇస్తూ సహజ వాయువును సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆయా రంగాల్లో గత ఆరునెలల సగటు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని అందులో 100 శాతం సరఫరా చేయాలి. ఈ మూడు రంగాల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఎరువుల తయారీ, తేయాకు పరిశ్రమతోపాటు ఇతర పారిశ్రామిక వినియోగానికి గ్యాస్ అందజేయాలి.ఎరువుల తయారీ రంగానికి గత ఆరు నెలల సగటు డిమాండ్‌లో కనీసం 70 శాతం సరఫరా చేయాలి. ఇక తేయాకు పరిశ్రమ, ఉత్పత్తి, పారిశ్రామిక వినియోగదారులకు గత ఆరు నెలల సగటు డిమాండ్‌లో 80 శాతం సహజ వాయువు అందజేయాలి. పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసే సిటీ గ్యాస్ సరఫరాదారులకు(సీజీడీ) ఆరు నెలల సగటు డిమాండ్‌లో 80 శాతం ఇవ్వొచ్చు. దేశీయంగా నిత్యం 191 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు అవసరం. దేశంలో రోజువారీ మొత్తం అవసరాల్లో సగం దేశీయ సహజ వాయువే తీరుస్తోంది. పెట్రోకెమికల్ ప్లాంట్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఈ గ్యాస్‌ను సరఫరా చేయకుండా నియంత్రణ విధించారు. మూసివేత దిశగా హోటళ్లువాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత హోటళ్లు, రెస్టారెంట్లపై పెను ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఆహారశాలలు మూతపడుతున్నాయి. ముంబై, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, ఔరంగాబాద్, నాగపూర్, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే వందలాది హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. రానున్న రెండు రోజుల్లో పరిస్థితి ఇంకా తీవ్రమయ్యే అవకాశాలున్నాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు సాగర్ దర్యానీ మంగళవారం చెప్పారు. పశ్చి మాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోయినట్లు తెలియజేశారు.ఎల్పీజీ ఉత్పత్తి 10% పెంపు దేశంలో ఎల్పీజీ సంక్షోభం లేదని, ఎవరూ ఆందోళన చెందొద్దని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టంచేసింది. తమ ఆదేశాల మేరకు చమురు శుద్ధి కంపెనీలు ఎల్పీజీ ఉత్పత్తిని 10 శాతం పెంచాయని వెల్లడించింది. రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపింది. వంట గ్యాస్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ప్రజలెవరూ నమ్మొద్దని కోరింది. ఎల్పీజీ సరఫరా స్థిరంగా కొనసాగుతున్నట్లు వెల్లడించింది. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా, అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని(ఎస్మా) అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. మన ప్రజలు ఇబ్బంది పడొద్దు⇒ చమురు, గ్యాస్ సరఫరా, ధరల విషయంలో సమన్వయంతో పనిచేయండి ⇒ కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ ఆదేశం న్యూఢిల్లీ: పశ్చి మాసియా సంక్షోభం, తద్వారా దేశంలో చమురు, వంట గ్యాస్ సరఫరాలో ఆటంకాలు ఎదురవుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. పశ్చి మాసియా యుద్దం వల్ల పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, ధరల విషయంలో మన దేశ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులు, హొర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మన వినియోగదారులపై పడకుండా చూడాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అంతేకాకుండా చమురు, వంట గ్యాస్ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ధరలు పెరుగుతున్న తీరుపైనా ప్రధానమంత్రి సమీక్షించారు. పశ్చి మాసియా నుంచి చమురు సరఫరా తగ్గడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రష్యా, అమెరికా, వెనెజువెలా, ఆ్రస్టేలియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపాయి. -
ఇండక్షన్ కుక్కర్లకు భారీ డిమాండ్..
దేశంలో ఎల్పీజీ కొరత ప్రభావంతో ఇండక్షన్ కుక్కర్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఆంక్షలు విధించడంతో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లు అలాగే ఆన్లైన్ వేదికల్లో ఇండక్షన్ కుక్కర్లకు భారీగా డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా గత శనివారం నుంచి అమ్మకాలు, ఎంక్వైరీలు అసాధారణంగా పెరిగినట్లు వెల్లడించారు.ఇంతకు ముందు కొన్ని షోరూమ్ చైన్లు రోజుకు సుమారు 35–40 ఇండక్షన్ కుక్కర్లను మాత్రమే విక్రయించేవి. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 150కు చేరువైందని వ్యాపారులు చెబుతున్నారు.ఇండక్షన్ కుక్కర్లకు పెరుగుతున్న డిమాండ్ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపించింది. ఈ రంగానికి చెందిన కంపెనీల షేర్ ధరలు ఒక్క రోజులో గణనీయంగా పెరిగాయి. బోరోజ్ షేర్లు సుమారు 13 శాతం, బజాజ్ ఎలక్ట్రికల్స్ 7 శాతం, టిటికే ప్రెస్టీజ్ 7 శాతం, హాకిన్స్ 4.8 శాతం లాభపడ్డాయి. బటర్‌ఫ్లై గాంధీమతి అప్లయెన్సెస్ షేర్లు కూడా సుమారు 2 శాతం పెరిగాయి.భారతదేశంలో ఎల్పీజీ వార్షిక వినియోగం సుమారు 31.3 మిలియన్ టన్నులు. ఇందులో 87 శాతం వినియోగం గృహ రంగానిదే. ఎల్పీజీ కొరత, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ ధరలు పెరగడం, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలపై భయాలు ఉండటంతో ఇండక్షన్ కుక్కర్లపై ప్రజలు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా, పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు చర్యలు చేపట్టాయి. దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచడం, అవసరమైన రంగాలకు మాత్రమే సిలిండర్ల సరఫరాను పరిమితం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలకు మాత్రమే ఎల్పీజీ సరఫరా కొనసాగుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా తాత్కాలికంగా నిలిపివేశారు.దేశీయ ఉత్పత్తిని సుమారు 10 శాతం పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఆంక్షలను సడలించే అవకాశముందని కేంద్రం, చమురు కంపెనీలు తెలిపాయి. -
రంగంలోకి రిలయన్స్! ఇక జోరుగా గ్యాస్ ఉత్పత్తి
ప్రపంచ ఇంధన మార్కెట్లలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో దేశీయంగా వంటగ్యాస్ సరఫరా అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న తన రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ సముదాయాల్లో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ఉత్పత్తిని పెంచుతున్నట్లు మంగళవారం వెల్లడించింది.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఇంధన మార్కెట్లు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ కీలక ఇంధనాలకు నిరంతర సరఫరా కొనసాగడం జాతీయ ప్రాధాన్యతగా ఉందని పేర్కొంది.అలాగే కేజీ-డీ6 బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే సహజవాయువును ప్రాధాన్య రంగాలకు మళ్లించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. జాతీయ ఇంధన అవసరాలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.“భారతదేశ ఇంధన భద్రత, కోట్లాది భారతీయ కుటుంబాల సంక్షేమం మా సంస్థకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తూ జాతీయ మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉంటాం. అవసరమైన రంగాలకు ఇంధన సరఫరా నిరంతరం అందేలా చర్యలు కొనసాగిస్తాం” అని కంపెనీ తెలిపింది. అవసరమైన సమయంలో దేశానికి అండగా నిలబడటం రిలయన్స్ బాధ్యతగా భావిస్తుందని కూడా పేర్కొంది. ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల్లో దేశ ఇంధన భద్రతకు మద్దతుగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా దేశంలోని అన్ని రిఫైనరీలు ప్రొపేన్, బ్యూటేన్, ప్రొపైలిన్, బ్యూటెన్స్ వంటి సి3, సి4 స్ట్రీమ్‌లను పూర్తిగా ఎల్పీజీ ఉత్పత్తికి వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అదనంగా ఉత్పత్తి అయ్యే వంటగ్యాస్‌ను దేశీయ వినియోగదారులకు మాత్రమే అందించాలని స్పష్టం చేసింది.ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే నిత్యావసర వస్తువుల చట్టం–1955చ పెట్రోలియం ఉత్పత్తుల (ఉత్పత్తి, నిల్వ, సరఫరా నిర్వహణ) ఆర్డర్–1999 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
వంటగ్యాస్ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. LPG,CNG సంస్థలు పదిశాతం మేర ఉత్పత్తి పెంచాల్సిందిగా కంపెనీలకు ఆదేశించారు. అదేవిధంగా వంటగ్యాస్‌ను బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలుంటాయని సంస్థలకు హెచ్చరించారు. కాగా చమురు కేంద్రాలు ఇదివరకే ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాయని తెలిపారు. దేశంలో చమరు కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌తో చర్చలు జరిపారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ముంబై, బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో హోటళ్లు మూతపడ్డాయి. దీంతో దేశంలో వంటగ్యాస్ లభ్యతపై సందిగ్ధత ఏర్పడింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడడంతో ఇప్పటికే పలు ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరుల తదితర నగరాల్లో హోటళ్లు మూసివేశారు. మావద్ద కొద్ది మేరకే ఎల్పీజీ నిల్వలున్నాయని అవి పూర్తయితే తాము సైతం హోటళ్లు మూసివేయాల్సిందేనని పలు హోటళ్ల యజమాన్యాలు కేంద్రం ముందు గోడు వెళ్లగక్కాయి. అయితే త్వరలో ఈ సంక్షోభం మరిన్ని ప్రాంతాలకు చేరే అవకాశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఉత్తత్తిని పెంచాలని కీలక ఆదేశాలిచ్చింది. -
తీవ్రస్థాయిలో గ్యాస్ కొరత మూతపడుతున్న హోటళ్లు
-
గ్యాస్ కష్టాలు.. మూతపడుతున్న రెస్టారెంట్లు!
అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయం కారణంగా దేశీయంగా వాణిజ్య ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఫలితంగా ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఇప్పటికే ముంబయిలో 20 శాతం హోటళ్లు మూసివేశారు. పరిస్థితి చక్కబడకపోతే మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని హోటళ్లు స్తంభించే ప్రమాదం ఉంది.నగరాల వారీగా క్షేత్రస్థాయి పరిస్థితిదేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఇండియన్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఏహెచ్‌ఏఆర్) అధ్యక్షుడు విజయ్ శెట్టి తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే నగరంలోని 20% హోటళ్లు మూతపడ్డాయి. మరో రెండు రోజుల్లో సరఫరా పునరుద్ధరించకపోతే కనీసం 50% రెస్టారెంట్లు కార్యకలాపాలు నిలిపివేయక తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం ఒక కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,950 పలుకుతుండటం అదనపు భారంగా మారింది.సిలిండర్ల సరఫరా నిలిచిపోతుందనే పుకార్ల మధ్య బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ స్పందించింది. ప్రస్తుతానికి రెస్టారెంట్లు తెరిచే ఉంటాయని, అయితే అనిశ్చితిని తట్టుకోవడానికి పనివేళలు తగ్గించాలని, మెనూలో వంటకాలను పరిమితం చేయాలని సూచించింది.హైదరాబాద్‌లో గ్యాస్ పంపిణీదారులు ఉన్నస్టాక్‌ను రేషనింగ్ పద్ధతిలో విడుదల చేస్తున్నారు. ఇక పంజాబ్‌లో ఎల్పీజీ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల సరఫరాను దాదాపు నిలిపివేశాయి. జైపూర్‌లో వెడ్డింగ్ క్యాటరింగ్ సేవలకు కనీసం 7 రోజుల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది.అసలు కారణం ఏమిటి?భారతదేశం ఏటా 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని వినియోగిస్తుండగా అందులో 62 శాతం దిగుమతుల ద్వారానే వస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మూతపడటంతో సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి రావాల్సిన 85-90 శాతం దిగుమతులు నిలిచిపోయాయి. ప్రభుత్వం అందుబాటులో ఉన్న పరిమిత స్టాక్‌ను గృహ వినియోగానికి, ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర విభాగాలకు మళ్లిస్తుండటంతో వాణిజ్య రంగం తీవ్రంగా నష్టపోతోంది.రంగంలోకి చమురు మంత్రిత్వ శాఖవాణిజ్య ఎల్పీజీ కొరతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన ఈ కమిటీ ఓఎంసీల ద్వారా సరఫరా పునరుద్ధరణను పర్యవేక్షించనుంది.ఆతిథ్య రంగం కేవలం ఆహార అవసరాలనే కాక లక్షలాది మందికి ఉపాధిని కూడా కల్పిస్తోంది. గ్యాస్ సరఫరాలో జాప్యం జరిగితే అది ఆహార ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దిగుమతులను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: డబుల్ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు -
ఎల్పీజీ ఎఫెక్ట్... బెంగళూరులో హోటళ్లు బంద్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో హోటళ్లకు ఎల్పీజీ షాక్ తగిలింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో మంగళవారం నుంచి నగరమంతటా హోటళ్లు మూతబడనున్నాయి. బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సోమవారం ఒక ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది. ‘‘ఎల్పీజీ లేకుండా హోటళ్లను నడపడం అసాధ్యమని అందరికీ తెలుసు.అందుకే మాకిష్టం లేకపోయినా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు’’అని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పి.సి.రావు విలేకరులకు తెలిపారు. కేంద్రం తక్షణం ఈ సమస్యపై దృష్టి పెట్టి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. బెంగళూరుకు చెందిన పలువురు ఎంపీల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. హోటళ్లకు పరిమిత స్థాయిలోనైనా ఎల్పీజీ సరఫరాలు కొనసాగేలా చూడాలని కోరారు. ఎల్పీజీ కొరతపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆందోళన వెలిబుచ్చారు. మరోవైపు చెన్నైలో కూడా బెంగళూరు తరహా పరిస్థితే నెలకొన్నట్టు వార్తలొస్తున్నాయి. -
నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం!
మిడిల్ఈస్ట్ ప్రాంతంలో మారుతున్న యుద్ధ సమీకరణాలు సామాన్యుడి వంటింటిపై ప్రభావం చూపే దశకు చేరాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీని ప్రభావంతో ఎల్పీజీ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడి, వంటగ్యాస్ కొరత పెరిగినట్లు కొందరు భావిస్తున్నారు.వేచి ఉండే సమయం పెంపు.. పెరిగిన ఆందోళనగ్యాస్ రీఫిల్ బుక్ చేసిన వినియోగదారులు మునుపటిలా వెంటనే సిలిండర్ పొందే పరిస్థితి లేదు. సరుకు రవాణాలో ఆలస్యం కారణంగా బుకింగ్ చేసిన తర్వాత డెలివరీ కోసం రెండు నుంచి ఎనిమిది రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో సోమవారం ఉదయం నుంచే డీలర్ల వద్ద బుకింగ్‌లు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా రెండు సిలిండర్లు ఉన్న కుటుంబాలు, స్టాక్ అయిపోతుందనే భయంతో డీలర్ అవుట్లెట్ల వద్ద క్యూ కడుతున్నారు.కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేతహోటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆదివారం నుంచి కమర్షియల్ సిలిండర్ల సరఫరాను డీలర్లు పూర్తిగా నిలిపివేశారు. ‘కనీసం 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్లు అయినా అందుబాటులో ఉన్నాయి. కానీ వాణిజ్య సిలిండర్ల సరఫరా ఆగిపోవడం వల్ల హోటల్స్ తీవ్ర సంక్షోభంలో పడుతున్నాయి’ అని ఒక సబర్బన్ డీలర్ పేర్కొన్నారు. దీనివల్ల హోటల్ యజమానులు బ్లాక్ మార్కెట్లో డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసే ప్రమాదం ఉందని, అది చట్టవిరుద్ధమే కాకుండా అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పెరిగిన ధరలు.. కొత్త నిబంధనలుసంక్షోభం చాలదన్నట్లు ధరల పెరుగుదలతో వినియోగదారుడిపై మరింత భారం మోపినట్లయింది. ఆదివారం నుంచి కమర్షియల్ సిలిండర్ ధర రూ.115, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.60 చొప్పున పెరిగింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఇకపై దేశీయ వినియోగదారులు ఒక సిలిండర్ తీసుకున్న 21 రోజుల తర్వాత మాత్రమే తదుపరి రీఫిల్ బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. గతంలో ఇది 15 రోజులుగా ఉండేది. గతంలో ఉన్న సరళమైన బుకింగ్ సౌకర్యాన్ని ప్రభుత్వం నియంత్రించడం గమనార్హం.క్షేత్రస్థాయిలో భయాందోళనలుముంబయిలోని అంధేరీ వంటి రద్దీ ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచే వినియోగదారులు డీలర్ల కార్యాలయాలకు పరుగులు తీశారు. ‘గ్యాస్ అయిపోకముందే ఒక సిలిండర్ తెచ్చి పెట్టుకోవాలని చూస్తున్నాం. యుద్ధం ఎటు దారితీస్తుందో, సరఫరా ఎప్పుడు ఆగుతుందో తెలియడం లేదు’ అని ఒక స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ‘చైనాతో చేసిన పొరపాటు భారత్‌తో చేయం’ -
ఎల్పీజీ ఉత్పత్తి పెంచండి
న్యూఢిల్లీ: పశి్చమాసియాలో సంక్షోభం నేపథ్యలో దేశీయంగా వంట గ్యాస్ కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కంపెనీలను ఆదేశించింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం(ఎస్మా) ఈ ఆదేశాలు జారీ చేసింది. ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వం రంగ చమురు సంస్థలకు అందజేయాలని పేర్కొంది. పెట్రోకెమికల్స్ తయారీకి ప్రొపేన్, బ్యూటేన్ ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. వాటితో కేవలం ఎల్పీజీని మాత్రమే ఉత్పత్తి చేయాలని తేల్చిచెప్పింది. ఎల్పీజీని దేశీయంగా వంట అవసరాలకు మాత్రమే వాడుకోవాలని వెల్లడించిది. ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. 2024–25లో దేశంలో 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని ఉపయోగించారు. ఇందులో 12.8 మిలియన్ టన్నులను దేశీయంగా ఉత్పత్తి చేయగా, మిగతా గ్యాస్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. దాదాపు 90 శాతం ఎల్పీజీ గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి అవుతోంది. ఇరాన్ సహా పశి్చమాసియాలో యుద్ధం కారణంగా చమురు సహా ఎల్పీజీ దిగుమతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
వాణిజ్య గ్యాస్ ధరల పెంపు
చమురు కంపెనీలు ఫిబ్రవరి 1, ఆదివారం నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.49 మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ రిటైల్ ధర రూ.1,740.50కు చేరుకుంది. అయితే గృహ వినియోగదారులకు ఊరటనిస్తూ 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు.రంగాలపై ప్రభావంగతంలో కమర్షియల్ గ్యాస్ ధరల తగ్గింపుతో ఊపిరి పీల్చుకున్న ఆతిథ్య, క్యాటరింగ్ రంగాలు తాజా పెంపుతో మళ్లీ ప్రభావితమయ్యే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. వంట గ్యాస్ ఖర్చులు పెరగడం వల్ల బయట ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది. వాణిజ్య గ్యాస్‌పై ఆధారపడే టీ స్టాళ్లు, స్వీట్ షాపులపై ఈ ప్రభావం నేరుగా పడుతుంది.ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్‌కు వేళాయె.. -
ఇక అమెరికా నుంచి ఎల్పీజీ గ్యాస్..
భారత్‌కు ఇక అమెరికా నుంచి ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ) దిగుమతి కానుంది. ఈమేరకు భారత ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు యూఎస్ ఉత్పత్తిదారులతో ఒప్పందం కుదుర్చుకున్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.‘ఇది చరిత్రలో తొలిసారి! అతిపెద్ద, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎల్పీజీ మార్కెట్లలో ఒకటైన భారత్ యునైటెడ్ స్టేట్స్కు తెరుచుకుంటోంది. భారత దేశ ప్రజలకు తక్కువ ఖర్చులో సురక్షితమైన ఎల్పీజీ గ్యాస్ సరఫరాలను అందించే ప్రయత్నంలో భాగంగా ఎల్పీజీ సోర్సింగ్ ను వైవిధ్యభరితం చేస్తున్నాం. భారతీయ పీఎస్‌యూ చమురు కంపెనీలు ఒక సంవత్సరానికి దాదాపు 2.2 మిలియన్ టన్నుల ఎల్పీజీ దిగుమతి చేసుకునేలా ఒప్పందాన్ని విజయవంతంగా కుదుర్చుకున్నాయి.’ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా కేంద్ర మంత్రి వెల్లడించారు.ఒప్పందం ప్రకారం.. 2026 సంవత్సరానికి గానూ 2.2 మిలియన్ టన్నుల ఎల్పీజీ భారత ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు అమెరికా ఉత్పత్తిదారుల నుంచి దిగుమతి చేసుకోనున్నాయి. యూఎస్ గల్ఫ్ తీరం నుంచి దిగుమతి చేసుకోనున్న ఈ దిగుమతుల పరిమాణం భారతదేశ మొత్తం వార్షిక ఎల్పీజీ దిగుమతులలో 10 శాతం మేర ఉండనుంది.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) బృందాలు ప్రధాన అమెరికన్ ఉత్పత్తిదారులతో చర్చలు జరపడానికి ఇటీవలి నెలల్లో అమెరికాను సందర్శించాయని, అవి ఇప్పుడు విజయవంతంగా ముగిశాయని ఆయన తెలిపారు. A historic first!One of the largest and the world’s fastest growing LPG market opens up to the United States. In our endeavour to provide secure affordable supplies of LPG to the people of India, we have been diversifying our LPG sourcing. In a significant development,…— Hardeep Singh Puri (@HardeepSPuri) November 17, 2025 -
గీజర్ మృత్యువాయువు
మైసూరు: వేడినీళ్ల కోసం అమర్చుకున్న గ్యాస్ గీజర్ మృత్యుపాశాలుగా మారుతున్నాయి. తరచూ ఎక్కడో ఓ చోట ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గీజర్ నుంచి గ్యాస్ లీకై అక్కాచెల్లెళిద్దరూ ఊపిరాడక మరణించిన దారుణ ఘటన జిల్లాలోని పిరియాపట్టణ తాలూకాలో జరిగింది. మృతులను పిరియాపట్టణలోని బెట్టదపుర నివాసులైన అల్తాఫ్ పాషా రెండో కుమార్తె గుల్బమ్ తాజ్ (23), నాలుగో కుమార్తె సిమ్రాన్ (21)గా గుర్తించారు. వివరాలు.. పిరియాపట్టణలోని జోనిగేరి వీధిలో అల్తాఫ్ పాషా కుటుంబం కొత్తగా బాడుగ ఇంటిలోకి చేరి ప్రార్థనలు చేసి పిండివంటలు చేసుకున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికి.. రాత్రి సుమారు 7 గంటల సమయంలో అక్కాచెల్లెళ్లిద్దరూ స్నానానికి వెళ్లారు. ఈ సమయంలో స్నానాల గదిలోని గ్యాస్ గీజర్‌ను ఆన్ చేయగానే దాని నుంచి విషపూరిత గ్యాస్ లీకైంది. కొంతసేపటికి ఊపిరాడక ఇద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో గది తలుపులు తెరిచి చూడగా కుప్పకూలిపోయి ఉన్నారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల నిశ్చితార్థం కాగా అల్తాఫ్ పాషాకు నలుగురు కుమార్తెలు సంతానం ఉండగా, వారిలో ఇద్దరికి వివాహాలయ్యాయి. గుల్బమ్ తాజ్‌కు ఇటీవల నిశి్చతార్థమైంది. ఘటన సమయంలో కాబోయే భర్త కుటుంబం వారి ఇంటిలోనే ఉంది. ఈ ఘోరంతో కుటుంబీకులు తీవ్రంగా విలపించారు. -
గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. ఎంతంటే..
చమురు మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్ 1, 2025 నుండి ఇంధన ధరలను సవరించాయి. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.15.50 పెరిగింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కిలోలీటరుకు రూ.3,052.50 పెరిగింది. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం ఢిల్లీలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,595.50 ఉంది. ఇది గతంలో రూ.1,580 ఉంది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలలో మార్పు లేదు.కమర్షియల్ ఎల్పీజీ ధరలు (19 కిలోల సిలిండర్)ఢిల్లీ: రూ.1,595.50కోల్‌కతా: రూ.1,700.50ముంబై: రూ.1,547.00చెన్నై: రూ.1,754.50ఏటీఎఫ్ ధరలు (అక్టోబర్ 1, 2025 నుంచి కిలోలీటర్‌కు)ఢిల్లీ: రూ.93,766.02కోల్‌కతా: రూ.96,816.58ముంబయి: రూ.87,714.39చెన్నై: రూ.97,302.14ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్వహిస్తున్న ఇంధన ధరల సాధారణ నెలవారీ సమీక్షలో భాగంగా ఈ సవరణలు జరిగాయి.ఇదీ చదవండి: యూఎస్ బెదిరించినా తగ్గేదేలే -
తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర.. ఏ ప్రాంతంలో ఎంతంటే..
దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.51.50 తగ్గించాయి. కొత్త ధరలు రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగిస్తాయి. ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచే ఈ ధరలు అమల్లోకి వస్తాయి. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రాంతాల వారీగా కింది విధంగా ఉన్నాయి.ఢిల్లీ: రూ.1,580కోల్‌కతా: రూ.1,683ముంబై: రూ.1,531చెన్నై: రూ.1,737.52025 ఏప్రిల్-జులై మధ్య 19 కిలోల ఎల్పీజీ ధరలు ఢిల్లీలో రూ.138, కోల్‌కతాలో రూ.144, ముంబైలో రూ.139, చెన్నైలో రూ.141.5 తగ్గాయి. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర ఏప్రిల్ 8, 2025న రూ.50 పెరిగినప్పటి నుంచి మార్పు చేయలేదు. ప్రస్తుత ధరలు ఢిల్లీలో రూ.853, కోల్‌కతాలో రూ.879, ముంబైలో రూ.852.50, చెన్నైలో రూ.868.50గా ఉంది.ఇదీ చదవండి: మరో బీమా సంస్థ సూపర్ టాపప్ ప్లాన్.. తీసుకోవచ్చా? -
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
రక్షాబంధన్‌కు ముందు ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఊరట కలిగించాయి. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను దేశవ్యాప్తంగా రూ .33.50 తగ్గించాయి. కొత్త రేట్లు ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.కొత్త ధరల ప్రకారం.. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ఇప్పుడు ఢిల్లీలో రూ .1,631.50 కు లభిస్తుంది. ఇంతకుముందు దీని ధర రూ.1,665గా ఉండేది. వాణిజ్య సిలిండర్ల ధరల తగ్గింపుతో క్యాటరింగ్ యూనిట్లు, హోటళ్లు-రెస్టారెంట్లు, ఆహార పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యాపారులకు ఉపశమనం కలుగుతుంది.దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ కొత్త రేట్లుఢిల్లీ: రూ.1,631.50కోల్‌కతా: రూ.1734.50ముంబై: రూ.1582.50చెన్నై: రూ.1789హైదరాబాద్: రూ.1,886.50డొమెస్టిక్ సిలిండర్ ధరలుడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. 14.3 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ఏప్రిల్ 8, 2025 నుండి స్థిరంగా ఉంది. ఇందులో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. గత నాలుగు నెలలుగా ధరలు పెంచలేదు, తగ్గించలేదు. ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.853గా ఉంది. -
సహజ వనరుల లైఫ్‘లైన్’!
‘దేశ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. చమురు కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి. వివిధ మార్గాల ద్వారా ఇంధన సరఫరాలు నిరంతరాయంగా అందుతున్నాయి. హార్ముజ్ మార్గం బందైనా భారత్‌కి ఇబ్బంది లేదు. వేరే మార్గాల్లో భారత్‌కు క్రూడాయిల్ వస్తుంది’ – ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం, హార్ముజ్ మార్గం మూసేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి ఇటీవల చెప్పిన మాటలివి. ఆయన చెప్పింది నిజమే. ఇప్పటికే మనదేశం ప్రపంచంలోనే అతిపొడవైన ఎల్పీజీ పైప్‌లైన్ ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఇలాంటి పైప్లైన్లే ప్రపంచ దేశాలకు చమురు, సహజ వాయువుల వంటి ఇంధనాలు అందిస్తున్న ప్రాణవాయువులు. ఈ పైప్లైన్లు ప్రపంచ దేశాలను చుడుతూ భారీగా విస్తరిస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కిలోమీటర్ల పొడవుతో గ్యాస్ పైప్‌లైన్ అందుబాటులో ఉందో తెలుసా? 14.2 లక్షల కిలోమీటర్లు.అంటే భూమిని 35సార్లు చుట్టొచ్చన్న మాట. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్ జీ) పైప్లైన్ల సామర్థ్యం 5 బిలియన్ (500 కోట్ల) టన్నులు. అలాగే చమురును సరఫరా చేసే పైప్లైన్ల పొడవు 5,04,000 కిలోమీటర్లు.చమురు, సహజ వాయువు.. ప్రపంచాన్ని నడిపిస్తున్న సహజ ఇంధన వనరులు ఇవి. ఆర్థిక వ్యవస్థ రథచక్రాలివి. ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, సమర్థవంతమైన వనరుల పంపిణీకి చమురు, సహజ వాయువు పైప్లైన్లు కీలకమైనవి. ‘అన్నింటా మనం’ అన్నట్టు చమురు, సహజ వాయువు రంగంలో భారత్ సైతం తనదైన ముద్రవేస్తోంది. ప్రపంచంలో అతిపొడవైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) పైప్‌లైన్ ప్రాజెక్టుకు మన దేశం శ్రీకారం చుట్టింది.టాప్–5లో గెయిల్గ్యాస్ సరఫరా కోసం చైనాలో 21.9 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో 17,800 కిలోమీటర్లు, భారత్‌లో 20.7 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో 14,300 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం జరుగుతోంది. ప్రపంచంలో ఇతర అన్ని దేశాల్లో అభివృద్ధి దశలో ఉన్న మొత్తం పైప్‌లైన్ కంటే ఈ రెండు దేశాలు నిర్మిస్తున్నవే అధికం కావడం విశేషం. గ్యాస్ పైప్లైన్స్ను అభివృద్ధి చేస్తున్న టాప్–5 మాతృ సంస్థలు ప్రభుత్వ రంగానికి చెందినవి కావడం విశేషం. రష్యాలో గ్యాస్ప్రామ్, చైనా–పైప్చైనా, భారత్–గెయిల్, నైజీరియా–ఎన్ ఎన్ పీసీ, ఇరాన్ లో చమురు మంత్రిత్వ శాఖ వీటిలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న అత్యంత పొడవైన గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టులు 2,775 కిలోమీటర్ల ఇరాన్–పాకిస్తాన్ పైప్‌లైన్, అలాగే భారత్‌లో 2,655 కిలోమీటర్ల జగదీష్పూర్–హల్దియా–బొకారో–ధమ్రా సహజ వాయువు పైప్‌లైన్. నిర్మాణంలో ఉన్న అతి పొడవైన చమురు పైప్‌లైన్ ప్రాజెక్టుల్లో ఆఫ్రికాలోని చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ యాజమాన్యంలోని 1,950 కిలోమీటర్ల నైజర్–బెనిన్ ఆయిల్ పైప్‌లైన్, భారత్‌లో నుమాలిఘర్ రిఫైనరీ లిమిటెడ్‌కు చెందిన 1.635 కిలోమీటర్ల పారాదీప్ నుమాలిఘర్ క్రూడ్ పైప్‌లైన్ (పీఎన్ సీపీఎల్) టాప్–2లో నిలిచాయి.అగ్రదేశాల సరసన మనమూ..అమెరికాకు చెందిన ప్రముఖ ఇంధన రంగ విశ్లేషణ సంస్థ ‘గ్లోబల్ ఎనర్జీ మానిటర్’ గణాంకాల ప్రకారం అంతర్జాతీయంగా 59,100 కిలోమీటర్ల గ్యాస్ సరఫరా పైప్‌లైన్స్ నిర్మాణంలో ఉన్నాయి. మరో 1,51,300 కిలోమీటర్ల పైప్‌లైన్ ప్రాజెక్టులు ప్రతిపాదన దశలో ఉన్నాయి. వీటన్నింటి అంచనా వ్యయం 533.6 బిలియన్ డాలర్లు. అభివృద్ధి చేస్తున్న పైప్లైన్ల పరంగా చైనా, రష్యా, భారత్, ఆస్ట్రేలియా, యూఎస్ ముందున్నాయి. చమురు సరఫరా కోసం 9,100 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణంలో ఉంది. మరో 21,900 కిలోమీటర్ల ప్రాజెక్టులకు ప్రతిపాదనలు ఉన్నాయి. 2023 మే నాటికి 25.3 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో నిర్మాణంలో ఉన్న మొత్తం చమురు సరఫరా పైప్‌లైన్స్‌లో 49 శాతం ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో విస్తరించాయి. ఈ ప్రాంతాలు 4,400 కిలోమీటర్ల ముడి చమురు సరఫరా పైప్లైన్స్ను నిర్మిస్తున్నాయి. అలాగే 10,800 కిలోమీటర్ల ప్రాజెక్టులు ప్రతిపాదనలో ఉన్నాయి.2,800 కి.మీ. పొడవు!ప్రపంచంలో అతిపొడవైన ఎల్పీజీ పైప్‌లైన్ ప్రాజెక్టును భారత్ చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలైన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ సంయుక్తంగా ఐహెచ్బీఎల్ పేరుతో సంయుక్త భాగస్వామ్య కంపెనీని ఏర్పాటు చేశాయి. ప్రాజెక్టు కోసం 1.3 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నారు. 2,800 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్‌లైన్ ప్రాజెక్టులో గుజరాత్‌లోని కాండ్లను ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌తో అనుసంధానిస్తారు. ఏటా 83 లక్షల టన్నుల ఎల్పీజీని రవాణా చేయగల సామర్థ్యం దీని సొంతం. ఇది దేశ మొత్తం ఎల్పీజీ డిమాండ్‌లో 25 శాతం. -
తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఏప్రిల్ 1, 2025 నుంచి 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.41 తగ్గించాయి. సవరించిన రిటైల్ సేల్ ధర వల్ల ఢిల్లీలో దీని రేటు రూ.1,762గా ఉంది. ఈ తగ్గింపుతో హోటళ్లు, రెస్టారెంట్లతో సహా ఎల్పీజీపై ఆధారపడే వ్యాపారాలకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. అంతర్జాతీయ ముడిచమురు రేట్లలో హెచ్చుతగ్గులు, ఇతర ఆర్థిక అంశాల ప్రభావంతో ఈ ధరలను సవరిస్తుంటారు. కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించినా, గృహాల్లో ఉపయోగించే ఎల్పీజీ ధరలను మాత్రం మార్చలేదు.ధరల హెచ్చుతగ్గులుగత నెలలో మార్చి 1, 2025న ఓఎంసీలు ప్రధాన నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.6 పెంచాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ ఇండేన్ ప్రకారం.. ఫిబ్రవరిలో అంతకుముందు నెలతో పోలిస్తే 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.7 తగ్గించారు. మార్చి నెలలో రూ.1,797 నుంచి రూ.1,803కు పెరిగింది. తాజాగా రూ.41 తగ్గించారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో మార్పులకు అనుగుణంగా ఇంధన ధరల్లో అస్థిరత నెలకొంటుంది.ఇదీ చదవండి: రెండేళ్లలో తొలిసారి ధరలు పెంపునగరాల వారీగా ధరలుఢిల్లీ-రూ.1,762 (రూ.1,803 నుంచి తగ్గింది)కోల్‌కతా-రూ.1,872 (రూ.1,913 నుంచి తగ్గింది)ముంబయి-రూ.1,714.50 (రూ.1,755.50 నుంచి తగ్గింది)చెన్నై-రూ.1,924.50 (రూ.1,965.50 నుంచి తగ్గింది) -
అతి పొడవైన ఎల్పీజీ పైప్‌లైన్ త్వరలోనే ..
ప్రపంచంలోనే అతి పొడవైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ( LPG ) పైప్‌లైన్ భారత్ నిర్మించనుంది. పశ్చిమ తీరంలోని కాండ్లా నుంచి ఉత్తరాన గోరఖ్‌పూర్ వరకు 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 2025 జూన్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. 1.3 బిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ రవాణా ఖర్చులను, ఎల్పీజీ రవాణా సంబంధిత రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించనుంది.8.3 మిలియన్ టన్నుల ఎల్పీజీ రవాణా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ పైప్‌లైన్ ద్వారా ఏటా 8.3 మిలియన్ టన్నుల ఎల్పీజీ రవాణా కానుంది. ఇది భారతదేశ మొత్తం ఎల్పీజీ డిమాండ్‌లో సుమారు 25% ఉంటుంది. ఈ పైప్‌లైన్ అందుబాటులోకి వస్తే ట్రక్కులపై ఆధారపడటం రహదారి రవాణాపై ఒత్తిడి తగ్గిపోతుంది.ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలుఎల్పీజీ పైప్‌లైన్ నిర్మాణం గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను తీసుకువస్తుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీని రవాణా చేయడానికి వందలాది ట్రక్కుల అవసరం లేకుండా పైప్‌లైన్ రవాణా ఖర్చులను తగ్గిస్తుంది. సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్వచ్ఛమైన వంట ఇంధనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ఎల్పీజీకి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో పైప్‌లైన్ నిర్మాణం కీలకం కానుంది.భద్రత, ప్రమాద నివారణపైప్లైన్ అత్యంత ముఖ్యమైన ప్రయోజనాలలో ఒకటి రోడ్డు ప్రమాదాలను తగ్గించడం. రోడ్డు మార్గం ద్వారా ఎల్పీజీ రవాణా ప్రమాదాలతో నిండి ఉంటుంది. ఇది గతంలో అనేక ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసింది. పైప్‌లైన్ సురక్షితమైన, మరింత విశ్వసనీయమైన రవాణా విధానాన్ని అందించడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గిస్తుంది. రోడ్డు భద్రతను పెంపొందించడానికి ఈ పరిణామం ఒక కీలకమైన అడుగు.సవాళ్లు, భవిష్యత్తు అవకాశాలుఆశాజనక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సరఫరా గొలుసు అంతరాయాలతో సహా ఈ ప్రాజెక్ట్ అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఏదేమైనా, పైప్‌లైన్ విజయవంతంగా పూర్తవడం భారతదేశ ఇంధన రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. భవిష్యత్తు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బెంచ్‌మార్క్‌ను ఏర్పరుస్తుంది. -
సామాన్యుడి జేబుకి చిల్లు!: రేపటి నుంచి కొత్త రూల్స్..
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2025-26 బడ్జెట్‌తో అనేక మార్పులు జరగనున్నాయి. అవి మాత్రమే కాకుండా ప్రతి నెలా పలు విభాగాల్లో రూల్స్ మారుతూ ఉంటాయి. గ్యాస్ సిలిండర్ ధరలు, యూపీఐ లావాదేవీలు వంటివాటితో పాటు మారుతి సుజుకి కంపెనీ తన వాహనాల ధరలను కూడా పెంచనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.ఎల్పీజీ సిలిండర్ ధరలుఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన మారుతూ ఉంటాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ల ధరలను అప్డేట్ చేస్తూ ఉంటాయి. సిలిండర్ ధరలలో జరిగే మార్పులు నేరుగా ప్రజలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి రేపు (శనివారం) సిలిండర్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనే విషయం తెలియాల్సి ఉంది.యూపీఐ లావాదేవీలుఫిబ్రవరి 1వ తేదీన యూపీఐ నిబంధలనలకు సమందించిన కీలక మార్పులు రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్దిష్ట UPI లావాదేవీలను బ్లాక్ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్క్యులర్ కూడా విడుదలైంది. కాబట్టి కొత్త రూల్స్ రేపటి నుంచే అమలులోకి రానున్నాయి.తాజా ఆదేశాల ప్రకారం ప్రత్యేక అక్షరాలను(స్పెషల్ క్యారెక్టర్లు) కలిగిన యూపీఐ ఐడీ (@, #, $, %, &, మొదలైనవి)ల ద్వారా చేసే లావాదేవీలను కేంద్ర వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికీ యూపీఐ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.కార్ల ధరలుదిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL), తన వాహన ధరలను గణనీయంగా పెంచనుంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ధరలను పెంచనున్నట్లు.. పెరిగిన ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కంపెనీ ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, ఈకో, ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఎక్స్ఎల్6, ఫ్రాంక్స్, ఇన్విక్టో, జిమ్నీ, గ్రాండ్ విటారా మొదలైన కార్ల ధరలను పెంచనుంది.బ్యాంకింగ్ రూల్స్కోటక్ మహీంద్రా బ్యాంక్ తన సాధారణ సర్వీస్.. చార్జీలలో మార్పులు తీసుకురానుంది. ఈ మార్పుల గురించి తన వినియోగదారులకు తెలియజేసింది. కాబట్టి కొత్త నియమాలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇందులో ఉచిత ఏటీఎమ్ లావాదేవీల పరిమితికి తగ్గించడం.. బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన చార్జీలను పెంచడం వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: అయ్య బాబోయ్.. ఇక బంగారం కొనలేం!ఏటీఎఫ్ ధరలుఫిబ్రవరి 1 నుంచి విమాన ఇంధనం, ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరల్లో మార్పు జరిగే అవకాశం ఉంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన విమాన ఇంధన ధరలను సవరిస్తాయి. కాబట్టి, ఫిబ్రవరి 1వ తేదీన ధరలలో మార్పు జరిగితే, అది నేరుగా విమాన ప్రయాణికులపై ప్రభావం చూపుతుంది. -
జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు ఇవే..
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. ఈ రోజు జనవరి 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా కొన్ని అంశాల్లో మార్పులు అమలు అవుతున్నాయి. ఈపీఎఫ్ఓ, యూఎస్ వీసా, ఎల్పీజీ సిలిండర్ ధరలు, కార్ల ధరలు, రేషన్ కార్డులకు కేవైసీ నమోదు చేయడం వంటి వాటిలో మార్పులు వచ్చాయి. ఈమేరకు ఇప్పటికే ఆయా విభాగాలు ప్రకటనలు విడుదల చేశాయి. అందులో కొన్ని ముఖ్యమైన వాటి వివరాలు తెలుసుకుందాం.ఎల్పీజీ సిలిండర్ ధరలుజనవరి 1, 2025 నుంచి ప్రధాన నగరాల్లో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గాయి. మారిన ధరలు కింది విధంగా ఉన్నాయి.ఢిల్లీ: రూ.1,804 (రూ.14.5 తగ్గింది)ముంబై: రూ.1,756 (రూ.15 తగ్గుదల)కోల్‌కతా: రూ.1,911 (రూ.16 తగ్గింది)చెన్నై: రూ.1,966 (రూ.14.5 తగ్గింది)14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర స్థిరంగా ఢిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50గా ఉంది.కార్ల ధరలుమారుతి సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, బీఎండబ్ల్యూ(BMW) వంటి ప్రధాన ఆటో కంపెనీలు కార్ల ధరలను 3% వరకు పెంచాయి.రేషన్ కార్డులకు ఈ-కేవైసీరేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ(e-KYC) తప్పనిసరి. 2024 డిసెంబర్ 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేయని రేషన్‌కార్డులు రద్దవుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.పెన్షన్ ఉపసంహరణ నిబంధనలుపెన్షనర్లు అదనంగా ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేకుండా ఏదైనా బ్యాంకు నుంచి పెన్షన్‌ను ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్ఓ అనుమతించింది.ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రాసులభంగా పీఎఫ్(PF) ఖాతాలోని నగదును ఉపసంహరించుకోవడానికి ఏటీఎం కార్డు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది.ఇదీ చదవండి: ఏడాది మొదటిరోజు తులం బంగారం ఎంతంటే..యూపీఐ పరిమితి పెంపుయూపీఐ 123పే కింద ఫీచర్ ఫోన్ యూజర్లకు చెల్లింపు పరిమితిని రూ.10,000కు కేంద్రం పెంచింది. ఇది గతంలో రూ.5,000గా ఉండేది. జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది.యూఎస్ వీసా రూల్స్నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా(Visa) దరఖాస్తుదారులు జనవరి 1 నుంచి ఒకసారి ఉచితంగా అపాయింట్మెంట్ను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. -
జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతున్నాయ్!
2024 సంవత్సరానికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. త్వరలో 2025 వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి LPG సిలిండర్ ధరలు, వీసా నిబంధనలు, ఫిక్స్డ్ డిపాజిట్ నియమాలు మాత్రమే కాకుండా కార్ల ధరలలో కూడా మార్పులు జరగనున్నాయి.అమెజాన్ ప్రైమ్జనవరి 1 నుంచే డివైజ్‌ల వాడకంపై అమెజాన్ ప్రైమ్ పరిమితులను విధించనుంది. అంటే కొత్త రూల్స్ ప్రకారం.. ఐదు డివైజ్‌లలో.. ఏ డివైజ్ అన్నదానితో సంబంధం లేకుండా.. ఒకసారికి రెండు టీవీలలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలను చూడవచ్చు. దీనికి సంబంధించిన వివరాలను యూజర్లు ఈమెయిల్స్ ద్వారా అందుకుంటారు. అయితే సెట్టింగ్స్ పేజీలోని మేనేజ్ ఆప్షన్ ద్వారా డివైజ్‌లను సెట్ చేసుకోవచ్చు.ఈ మొబైల్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు2025 జనవరి 1 నుంచి పాత వెర్షన్స్ అయిన.. శాంసంగ్ గెలాక్సీ ఎస్3, గెలాక్సీ ఎస్ 3, గెలాక్సీ ఎస్4 మినీ, హెచ్‌టీసీ వన్ ఎక్స్, వన్ ఎక్స్ ప్లస్, సోనీ ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా టీ, ఎల్జీ ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, మోటో జీ, మోటో ఈ 2014 వంటి వాటిలో వాట్సాప్ పనిచేయదు.కార్ల ధరల పెంపు2025 జనవరి 1 నుంచే కార్ల ధరలు సమంత పెరగనున్నాయి. ఈ జాబితాలో మారుతీ సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, హ్యుందాయ్, మహీంద్రా మొదలైన కంపెనీలు ఉన్నాయి. కార్ల ధరలు 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం.థాయిలాండ్ ఈ-వీసా1 జనవరి 2025 నుంచి ప్రపంచంలోని ఏ దేశం నుంచి అయినా సందర్శకులు అధికారిక థాయిలాండ్ వీసా వెబ్సైట్ ద్వారా ఈ వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. దీంతో థాయిలాండ్ దేశానికి వెళ్లే సందర్శకుల సంఖ్య బాగా పెరుగుతుంది. ఎందుకంటే థాయిలాండ్ వీసా మరింత సులభమైపోతోంది.యూఎస్ వీసా నిబంధనల్లో మార్పులుచదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్లే వ్యక్తులు కొత్త వీసా నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. 2025 జనవరి 1 నుంచి భారతదేశంలోని యూఎస్ ఎంబసీలో.. వీసా అపాయింట్మెంట్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి అనేక మార్పులు చేయనున్నారు. అంతే కాకుండా యూఎస్ 'డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ' కూడా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో పెద్ద మార్పును తీసుకురానున్నట్లు సమాచారం. యూఎస్ వీసా నిబంధనల్లో మార్పుల గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.LPG సిలిండర్ ధరలుచమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన సిలిండర్ ధరల సమాచారాన్ని అప్డేట్ చేస్తాయి. గత 5 నెలలుగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.RBI ఫిక్స్డ్ డిపాజిట్ నియమాలలో మార్పులురిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 జనవరి 1 నుంచి ఎన్బీఎఫ్సీలు & హెచ్ఎఫ్సీల ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన పాలసీని మార్చింది. ఇందులో ప్రజల నుంచి డిపాజిట్లను తీసుకునే నియమాలను మార్చే ప్రక్రియ, లిక్విడ్ ఆస్తులపై ఉంచే శాతం, డిపాజిట్ల బీమాకు సంబంధించిన నియమాలు ఉంటాయి.యూపీఐ 123 పేరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 9న 'యూపీఐ 123 పే' (UPI 123Pay) పరిచయం చేస్తూ.. లావాదేవీల పరిమితులను కూడా రూ.5,000 నుంచి రూ. 10,000లకు పొడిగించింది. ఇది స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?
న్యూఢిల్లీ: దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్ ఒకటిన ఉదయాన్నే వంటగ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. 19 కిలోల గ్యాస్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.48.50 నుంచి రూ.50కి పెరిగింది.ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఇప్పుడు ఢిల్లీలో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 1740 రూపాయలకు చేరింది. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలో కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. గతంలో మాదిరిగానే ఢిల్లీలో రూ.803కే లభ్యం కానుంది.2024, అక్టోబర్ ఒకటి నుండి, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ముంబైలో రూ. 1,692.50, కోల్‌కతాలో రూ. 1,850.50, చెన్నైలో రూ. 1,903కు చేరింది. దీనికిముందు సెప్టెంబర్‌లో కూడా ఎల్పీజీ సిలిండర్ ధర సుమారు రూ.39 పెరిగి రూ.1,691.50కి చేరింది. దీనికి ముందు రూ.1,652.50గా ఉంది. కోల్‌కతాలో మంగళవారం నుంచి 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.48 పెరిగింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల కారణంగా, రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాలలోని ఆహార ధరలు పెరగనున్నాయి.ఇది కూడా చదవండి: 31నే దీపావళి.. తేల్చిచెప్పిన కాశీ పండితులు -
గ్యాస్ నుంచి ఆధార్ వరకు.. వచ్చే నెలలో మార్పులు
ఆగస్ట్ నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రజల ఆర్థిక స్థితిని నేరుగా ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన మార్పులు సెప్టెంబర్ నుండి జరగబోతున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధరల నుండి ఆధార్ అప్డేట్ వరకు రానున్న మార్పులు, కొత్త క్రెడిట్ కార్డ్ నియమాలు మీ బడ్జెట్‌ను ఎలా ప్రభావితం చేస్తాయో ఇక్కడ చూద్దాం..ఎల్పీజీ ధరలుప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన ఎల్పీజీ ధరలను సవరించడం సర్వసాధారణం. ఈ సర్దుబాట్లు వాణిజ్య, డొమెస్టక్ గ్యాస్ సిలిండర్లపై ప్రభావం చూపుతాయి. గత నెలలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.8.50 పెరిగింది. జూలైలో రూ.30 తగ్గింది. మరోసారి సెప్టెంబర్‌లో ఎల్పీజీ సిలిండర్ల ధర మార్పుపై అంచనాలు ఉన్నాయి.సీఎన్జీ, పీఎన్జీ రేట్లుఎల్పీజీ ధరలతో పాటు, చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF), సీఎన్జీ, పీఎన్జీ ధరలను కూడా సవరిస్తాయి. అందువల్ల, ఈ ఇంధనాల ధరల సవరణలు కూడా సెప్టెంబర్ మొదటి రోజున జరుగుతాయి.ఆధార్ కార్డ్ ఉచిత అప్‌డేట్ఆధార్ కార్డ్‌లను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14. ఈ తేదీ తర్వాత, ఆధార్ కార్డ్‌లకు నిర్దిష్ట అప్డేట్లు చేసుకునేందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత ఆధార్ అప్డేట్ల కోసం గతంలో జూన్ 14 వరకే గడువు విధించగా దాన్ని సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.క్రెడిట్ కార్డ్ నియమాలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ యుటిలిటీ లావాదేవీల ద్వారా ఆర్జించే రివార్డ్ పాయింట్లపై సెప్టెంబర్ 1 నుండి పరిమితిని ప్రవేశపెడుతోంది. ఇకపై ఈ లావాదేవీలపై కస్టమర్లు నెలకు గరిష్టంగా 2,000 పాయింట్లను మాత్రమే పొందగలరు. థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా చేసిన విద్యాపరమైన చెల్లింపులకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ లభించవు.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సెప్టెంబర్ 2024 నుండి క్రెడిట్ కార్డ్‌లపై చెల్లించాల్సిన కనీస చెల్లింపును తగ్గిస్తోంది. అలాగే పేమెంట్ విండో 15 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా, యూపీఐ, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో రూపే క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్లు ఇతర చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ల మాదిదే రివార్డ్ పాయింట్స్ అందుకుంటారు.మోసపూరిత కాల్స్ నియమాలుమోసపూరిత కాల్స్, సందేశాలపై సెప్టెంబర్ 1 నుండి కఠినమైన నిబంధనలు ఉండవచ్చు. ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ట్రాయ్ టెలికాం కంపెనీలను ఆదేశించింది. 140 మొబైల్ నంబర్ సిరీస్‌తో ప్రారంభమయ్యే టెలిమార్కెటింగ్ కాల్స్, వాణిజ్య సందేశాలను సెప్టెంబర్ 30 నాటికి బ్లాక్‌చెయిన్ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (DLT) ప్లాట్‌ఫారమ్‌కి మార్చడానికి ట్రాయ్ కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది.డియర్నెస్ అలవెన్స్కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెప్టెంబరులో డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును ప్రకటించనుందని ఊహాగానాలు ఉన్నాయి. ప్రభుత్వం డీఏని 3 శాతం పెంచవచ్చు. అంటే ప్రస్తుతం 50% ఉన్న డీఏ 53 శాతానికి పెరిగే అవకాశం ఉంది. -
ఆగస్టు 1 నుంచి మారుతున్న రూల్స్ ఇవే..
జూలై నెల ముగింపునకు వచ్చేసింది. ఆగస్టు నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెలా ఆర్థిక విషయాలకు సంబంధించిన నియమాలలో మార్పు ఉంటుంది. వచ్చే ఆగస్టు నెలలోనూ పలు నిబంధనలు మారనున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చబోతోంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర కూడా మారనుంది. రానున్న మార్పుల గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం..ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెలా ఒకటో తేదీన నిర్ణయిస్తారు. గత నెలలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించింది. ఈసారి కూడా ప్రభుత్వం సిలిండర్ ధరను తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్క్రెడ్, చెక్, మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఇతర సేవలను ఉపయోగించి చేసే రెంటల్ చెల్లింపులపై లావాదేవీ మొత్తంపై 1% ఛార్జ్ ఉంటుంది. ఇది గరిష్టంగా రూ.3000 ఉంటుంది. రూ.15,000 లోపు ఫ్యూయల్ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీ ఉండదు. అయితే రూ.15,000 కంటే ఎక్కువ లావాదేవీలపై 1% గరిష్టంగా రూ.3000 ఛార్జీ ఉంటుంది.రూ.50,000 లోపు యుటిలిటీ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీ ఉండదు. రూ.50,000 పైబడిన లావాదేవీలకు 1% గరిష్టంగా రూ.3000 ఛార్జీ విధిస్తారు. బీమా లావాదేవీలకు ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఇచ్చారు. కళాశాల లేదా పాఠశాల వెబ్సైట్లు లేదా వారి పీఓఎస్ మెషీన్ల ద్వారా నేరుగా చేసే చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. కానీ క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసే చేస్తే 1% ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.3000 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.ఆలస్య చెల్లింపు ఛార్జీల్లోనూ బ్యాంక్ సవరణలు చేసింది. ఏదైనా ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌లో ఈజీ-ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకుంటే గరిష్టంగా రూ.299 వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీ ఉంటుంది. అర్హత కలిగిన యూపిఐ చెల్లింపులపై టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు 1.5 శాతం, టాటా న్యూ ప్లస్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు 1 శాతం న్యూకాయిన్స్ లభిస్తాయి. -
గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. మంత్రి ప్రకటన
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్లకు త్వరలో క్యూఆర్ కోడ్ ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్ల ట్రాకింగ్ కోసం, ఏజెన్సీల ఇన్వెంటరీ నిర్వహణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. దాంతో పాటు నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా భద్రతా చర్యల నమూనా రూపొందించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘గ్యాస్ సిలిండర్ల క్యూఆర్ కోడ్ ముసాయిదాను గ్యాస్ సిలిండర్ రూల్స్ (జీసీఆర్)లో పొందుపరిచాం. త్వరలో దీనిపై తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. గ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్ల ట్రాకింగ్ కోసం ఈ క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘అమెరికా ఇండిపెండెన్స్ డే’.. జుకర్‌బర్గ్ వినూత్న వేడుకలునివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని మంత్రి పెసో (పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్)ను ఆదేశించారు. ఇందుకోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. డీపీఐఐటీ (పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం) కింద పని చేసే పెసో, 1884 ఎక్స్‌ప్లోజివ్స్ చట్టం, 1934 పెట్రోలియం చట్టం నిబంధనలను నియంత్రించే కీలక బాధ్యతను పర్యవేక్షిస్తుంది. పెసో మంజూరు చేసిన లైసెన్స్‌ల లైసెన్సింగ్ ఫీజులో మహిళా పారిశ్రామికవేత్తలకు 80 శాతం, ఎంఎస్ఎంఈలకు 50 శాతం రాయితీని ప్రకటిస్తున్నట్లు మంత్రి వివరించారు. -
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గాయి. మెట్రో నగరాలు న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై సహా దేశవ్యాప్తంగా 19 కిలోగ్రాముల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బుధవారం ప్రకటించాయి.ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకారం.. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.19 మేర తగ్గింది. సవరించిన ధరలు తక్షణం అమల్లోకి వచ్చాయి. వాణిజ్య సిలిండర్ కొత్త ధరలు ఢిల్లీలో రూ.1,745.50, ముంబైలో రూ.1,698.50, చెన్నైలో రూ.1,911, కోల్‌కతాలో రూ.1,859 గా ఉన్నాయి. -
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇవి సాధ్యం!.. చిదంబరం కీలక వ్యాఖ్యలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తూ కేంద్రం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాము. అయితే తమ పార్టీ అధికారంలోకి వస్తే ధర పెంచబోమని ప్రధాని 'నరేంద్ర మోదీ' హామీ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ అధినేత 'రాహుల్ గాంధీ' దేశానికి ఐదు హామీలు ఇచ్చారు. వాటన్నంటిని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు.. చెన్నైలోని కాంగ్రెస్ రాష్ట్ర సత్యమూర్తి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో చిదంబరం పేర్కొన్నారు. 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి కాంగ్రెస్ చర్య తీసుకుంటుందని చిదంబరం వెల్లడించారు. ప్రశ్నాపత్రం లీక్ వంటి చర్యలను అరికట్టడానికి కూడా కొత్త చట్టం అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇవన్నీ జరగాలంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. గ్యాస్ ధరలను రూ. 100 తగ్గించిన బీజేపీ ప్రభుత్వం.. ఇంధన ధరల తగ్గింపు, యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల రూపాయలను ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని చిదంబరం మండిపడ్డారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 7 వరకు, తమిళనాడుకు రూ. 17,300 కోట్లతో సహా దేశానికి రూ. 5.90 లక్షల కోట్ల ప్రాజెక్టులను ప్రధాని ప్రకటించారు, వీటి ప్రస్తావన నాకు కనిపించలేదని అన్నారు. -
ఎల్పీజీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి?
దేశంలోని దాదాపు ప్రతి ఇంటిలోనూ వంటగ్యాస్ అంటే ఎల్పీజీ కనెక్షన్ ఉంది. గ్రామాల్లో కూడా మట్టి పొయ్యిలకు బదులు గ్యాస్ స్టవ్‌లు వినియోగిస్తున్నారు. అయితే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. ఉజ్వల పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించిన తర్వాత వంటగ్యాస్ వినియోగం మరింతగా పెరిగింది. గత 10 సంవత్సరాలలో ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య 32 కోట్లకు పైగా పెరిగింది. గత ఐదేళ్లలో దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి నాలుగు శాతం పెరిగింది. అయితే వినియోగం 22 శాతం మేరకు పెరిగింది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గ్యాస్‌ను ప్రభుత్వం దిగుమతి చేస్తోంది. గత ఐదేళ్లలో ఎల్పీజీ దిగుమతులు 60 శాతం మేరకు పెరిగాయి. భారతదేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ నుండి గ్యాస్ సరఫరా అవుతోంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అందించిన డేటా ప్రకారం గత కొన్నేళ్లుగా భారత్.. అమెరికా నుంచి కూడా గ్యాస్ దిగుమతి చేసుకుంటోంది. ఇలా ఎల్పీజీ దిగుమతులు పెరిగిన కారణంగానే వాటి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. భారతదేశంలో 90 శాతం ఎల్పీజీ గృహ వినియోగం కోసం ఉపయోగిస్తున్నారు. మిగిలిన మొత్తం పారిశ్రామిక, వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారు. దేశంలో ఎల్పీజీ వినియోగంలో 13 శాతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఇది మహారాష్ట్రలో 12 శాతం మేరకు ఉంది. ఈ విషయంలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. -
బయోమాస్ సేకరణపై ఫోకస్.. ఖర్చు ఎంతంటే..
అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల నిత్యం గ్యాస్ ధరల పెరుగుతున్నాయి. భారత్ విదేశాల నుంచి గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. దాంతో ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతోంది. చేసేదేమిలేక ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపుతోంది. అయితే దిగుమతి చేసుకునే గ్యాస్ స్థానే స్థానికంగా బయోమాస్‌ను సేకరించి దీన్ని తయారుచేసుకోవాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్(ఐబీఏ) సూచించింది. అందుకు అనుగుణంగా బయోమాస్ సేకరణపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఐబీఏ పేర్కొంది. బయోగ్యాస్ ప్లాంట్లకు బయోమాస్‌ను సప్లయ్ చేయడానికి మెషినరీ, ఎక్విప్మెంట్ల కోసం రూ.30 వేలకోట్ల వరకు పెట్టుబడులు అవసరం అవుతాయని ఐబీఏ అంచనా వేసింది. ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) దిగుమతులను తగ్గించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. వరిగడ్డి వంటి అగ్రి వేస్టేజ్‌ను బయోఎనర్జీ ఉత్పత్తికి వాడుకోవాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ చైర్మన్ గౌరవ్ కేడియా అన్నారు. అయితే బయోమాస్‌ను సేకరించడంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. దాన్ని సేకరించడం, స్టోర్ చేయడం, రవాణా వంటి వాటికి అధికమొత్తంలో ఖర్చువుతుందని, దీంతో వరిగడ్డి వంటి అగ్రి వేస్ట్‌ను అమ్మడం కంటే తగలబెట్టడానికే రైతులు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం లాజిస్టిక్స్‌ను మెరుగుపరచడం కంటే వరి గడ్డిని సమర్ధవంతంగా సేకరించగలిగే ఎక్విప్మెంట్లను వాడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇదీ చదవండి: ‘వేర్’వేర్లు..! విభిన్న సాఫ్ట్వేర్లు.. -
గుడ్‌న్యూస్.. వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
కమర్షియల్ వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. అంతర్జాతీయ ధరల పరిస్థితుల్లో సానుకూలతల నేపథ్యంలో దేశంలో చమురు సంస్థలు వాణిజ్య వంటగ్యాస్ ధరను కాస్త తగ్గించాయి. వాణిజ్య వంటగ్యాస్ (LPG) 19 కిలోల సిలిండర్ ధర శుక్రవారం రూ.39.50 తగ్గింది. కమర్షియల్ వంట గ్యాస్ ధర తగ్గింపుతో హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు వీటిని వినియోగించే అనేక వర్గాలకు ఉపశమనం కలిగింది. ధర తగ్గింపు అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,757 ఉంది. అంతకుముందు రూ. 1,796.50 ఉండేది. ఈ మేరకు చమురు సంస్థలు నోటిఫికేషన్లో తెలిపాయి. ఇదీ చదవండి: Gold Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చివరిసారిగా డిసెంబర్ 1న వాణిజ్య ఎల్పీజీ ధరను రూ.21 పెంచాయి. కమర్షియల్ వంట గ్యాస్ 19 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం ముంబైలో రూ. 1,710, కోల్‌కతాలో రూ. 1,868.50, చెన్నైలో రూ. 1,929 లుగా ఉంది. స్థానిక పన్నుల ఆధారంగా వీటి ధరలు రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. కాగా గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 903 ఉంది. -
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. ఎంతంటే..
భారత్‌లోని మెట్రోనగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. అందులో భాగంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.100కు పెంచాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో 19 కిలోల కమర్షియల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి. పెరిగిన ధర నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. తాజా ధరల సవరణతో దిల్లీలో 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,833గా ఉంది. కోల్‌కతాలో రూ.1,943, ముంబైలో రూ.1,785, బెంగళూరులో రూ.1,914.50, చెన్నైలో రూ.1,999.50గా ఉంది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి. అక్టోబర్‌లో వీటి ధరను రూ.209కి పెంచారు. అయితే ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను యథాతథంగా ఉంచాయి. వీటి ధర దిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, బెంగళూరులో రూ.905, చెన్నైలో రూ.918.50 ఉంది. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా ప్రతి నెల మొదటి తేదీన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ వాతావరణాన్ని మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నందున యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు గ్లోబల్ చమురు ధరలు బుధవారం పెరిగాయి. -
మహిళలకు శుభవార్త! గ్యాస్ స్టవ్‌తో పాటు ఫ్రీ సిలిండర్ పొందండిలా..
గత నెలలో రక్షాబంధన్ సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించిన కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు మరో శుభవార్త చెప్పింది. రానున్న మూడు సంవత్సరాల్లో 7.5 మిలియన్ల పేదలకు స్టవ్‌తో పాటు ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందించనున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2016లో ప్రారంభమైన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 2026 నాటికి 75 లక్షల LPG కనెక్షన్లు ఉచితంగా అందివ్వడం జరుగుతుందని కేంద్ర మంత్రి 'అనురాగ్ ఠాకూర్' వెల్లడించారు. ఇందులో స్టవ్ మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా లభిస్తాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువున ఉన్న మహిళలు దీనికి అర్హులు. ఈ పథకం అమలు చేయడానికి ఒక్కొక్క కనెక్షన్‌కు రూ. 2200 చొప్పున మొత్తం రూ. 1650 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 2016లో ఉత్తరప్రదేశ్‌లో 80 మిలియన్ల కుటుంబాలకు వంట గ్యాస్ అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైంది. కాగా 2021 నాటికి 10 మిలియన్ కనెక్షన్ల లక్ష్యాన్ని చేరుకుంది. రానున్న రోజుల్లో కేంద్రం ఈ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకునే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి? తెలిస్తే అవాక్కవుతారు! ఈ పథకానికి అప్లై చేసుకోవడం ఎలా? ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి అర్హులైన వారు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి, అందులో డౌన్లోడ్ ఫారమ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. తరువాత మీకు ఒక ఫారమ్ డౌన్లోడ్ అవుతుంది. అందులో అడిగిన వివరాలను ఫిల్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేసిన తరువాత సమీపంలో ఉన్న గ్యాస్ ఏజన్సీలో సమర్పించాలి. దీనికి అవసరమైన రేషన్ కార్డు, ఫోటో, మొబైల్ నెంబర్ వంటివి కూడా అందించాల్సి ఉంటుంది. సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని కరెక్టుగా ఉంటే.. వెరిఫికేషన్ తరువాత కొత్త కనెక్షన్ పొందుతారు. #WATCH | Delhi: Union Minister Anurag Thakur says, "Two decisions were taken today... The first decision is that more 75 Lakh LPG connections would be given free of cost in the next 3 years till 2026... This is an extension of Ujjwala Yojana... The second decision is that the… pic.twitter.com/H0ShPmTt8M — ANI (@ANI) September 13, 2023 -
వినియోగదారులకు శుభవార్త, తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. నేటి నుంచే అమల్లోకి
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు చమురు సంస్థలు శుభవార్త చెప్పాయి. ఆగస్ట్ నెల ప్రారంభం మొదటి రోజు 19 కేజీల సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.99.75 తగ్గింది. తగ్గిన ధరతో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,680కు లభించనుంది. కానీ డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరల్ని చివరి సారి ఈ ఏడాది జూలై 4న చివరిసారిగా సవరించబడ్డాయి. తాజాగా మరోసారి తగ్గించాయి. దీంతో 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర కోల్‌కతాలో రూ.1,895.50, ముంబైలో రూ.1,733.50, చెన్నైలో రూ.1,945కి అందుబాటులో ఉంది. తగ్గని డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇదిలా ఉండగా, ఇంట్లో వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లు ధరల్ని తగ్గించలేదు. గృహావసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ల ధరలను చివరిసారిగా ఈ ఏడాది మార్చి 1న సవరించారు. సబ్సిడీ లేని 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,103, కోల్‌కతాలో రూ.1,129, ముంబైలో రూ.1,102.50, చెన్నైలో రూ.1,118.50 లభ్యమవుతుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెలా మొదటి తేదీన సవరించబడతాయి. ఏప్రిల్, మే, జూన్లలో ధరలు తగ్గిన తర్వాత జూన్‌లో మొదటిసారిగా ఎల్జీపీ సిలిండర్ రేట్లను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.ఎల్పీజీ సిలిండర్ ధరలను చివరిసారిగా మార్చి 1న సిలిండర్‌కు రూ.50పెంచారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో సిలిండర్‌పై రూ.91.50, మేలో రూ.171.50 చొప్పున తగ్గించారు. జూన్‌లో రూ.83.50 తగ్గింది. -
మళ్ళీ తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. ఈ సారి ఎంతంటే?
LPG Cylinder Price: పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు 'ఎల్పీజీ' (LPG) ధరలు కూడా మారుతూ ఉంటాయి. తాజాగా మరో సారి గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. ఎల్పీజీ కొత్త ధరలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈ రోజు (2023 జూన్ 01) నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు వినియోగదారులకు భారీ ఊరటను కలిగించనున్నాయి. ప్రస్తుతం తగ్గిన గ్యాస్ సిలిండర్ల ధరలు కేవలం కమర్షియల్ గ్యాస్‌కి మాత్రమే వర్తిస్తాయి. కాగా డొమెస్టిక్ గ్యాస్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. (ఇదీ చదవండి: కస్టమర్లకు షాకిచ్చిన ఓలా.. పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు) 14.2 కేజీల గ్యాస్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కావున దీని ధర రూ. 1133 వద్ద స్థిరంగా ఉంది. అదే సమయంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1856.50 వద్ద నుంచి రూ. 1773 కి తగ్గింది. అంటే ఈ ధరలు మునుపటి కంటే రూ. 83 తగ్గినట్లు తెలుస్తోంది. 2023 మే 1న కూడా కమర్షియల్ గ్యాస్ ధరలు ఏకంగా రూ. 171.50 తగ్గాయి. అప్పుడు కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గి, డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో మార్పు లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు కొంత నిరాశ చెందుతున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ఒక్కసారిగా రూ. 171 తగ్గిన గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?
భారతదేశంలో చమురు ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ తరుణంలో ఈ రోజు నుంచి (2023 మే 1) కమర్షియల్ గ్యాస్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ పెట్రోలియం అండ్ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీని ఫలితంగా 19 కేజీల గ్యాస్ సిలిండర్ మీద ఇప్పుడు రూ. 171.50 తగ్గింది. కొత్త ధరలు ఈ రోజు నుంచే అమలులోకి రానున్నాయి. అయితే డొమెస్టిక్ LPG గ్యాస్ ధరలలో ఎటువంటి మార్పులు లేదు. సాధారణంగా కమర్షియల్ సిలిండర్లు హోటల్ వంటి వాణిజ్య వినియోగాలకు మాత్రమే ఉపయోగిస్తారు. కాగా డొమెస్టిక్ సిలిండర్లు కేవలం ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తారు. ధరల తగ్గింపుల తరువాత 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1856.50. అదే సమయంలో కలకత్తాలో దీని ధర రూ. 1960.50కి చేరింది. ముంబై, చెన్నై ప్రాంతాల్లో ఈ ధరలు వరుసగా రూ. 1808 & రూ. 2021కి చేరాయి. నిజానికి డొమెస్టిక్ సిలిండర్ ధరల కంటే కమర్షియల్ గ్యాస్ ధరలు ఎక్కువగా ఉంటాయి. 2022లో ఎల్పీజీ ధరలు నాలుగు సార్లు పెరిగాయి, మూడు సార్లు తగ్గాయి. ఆంటే ఓకే సంవత్సరంలో మొత్తం ఏడు సార్లు ధరలలో మార్పులు జరిగాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గడం నిజంగానే హర్షించదగ్గ విషయం అనే చెప్పాలి. -
ఆటో ఎల్పీజీ కథ ముగిసినట్టే!
న్యూఢిల్లీ: దేశ ఆటోమొబైల్ మార్కెట్ క్రమంగా పర్యావరణ అనుకూల పరిష్కారాల వైపు అడుగులు వేస్తోంది. ఎక్కువ మంది పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్జీ కార్లకు ప్రాధాన్యం ఇస్తుండడంతో.. ఆటోమొబైల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ తర్వాత సీఎన్జీ వాహనాలకే ఎక్కువ డిమాండ్ నెలకొంది. దీంతో ఎల్పీజీ కార్ల విక్రయాలు ఐదేళ్ల కాలంలో (2018–19 నుంచి చూస్తే) 82 శాతం తగ్గిపోయాయి. 2022–23లో కేవలం 23,618 ఎల్పీజీ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కానీ, 2018–19లో 1,28,144 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. కేంద్ర రవాణా శాఖ పరిధిలోని వాహన్ పోర్టల్ గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద 2,22,24,702 యూనిట్ల వాహనాలు అమ్ముడుపోతే, ఇందులో ఎల్పీజీ వాహనాలు కేవలం 0.11 శాతంగా ఉండడం వినియోగదారులు వీటి పట్ల ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అదే సమయంలో సీఎన్జీ వాహన విక్రయాలు ఇందులో 3 శాతంగా ఉంటే, ఎలక్ట్రిక్ వాహనాలు 5 శాతంగా ఉండడం, కస్టమర్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నట్టు తెలియజేస్తోంది. ఎగసి పడిన డిమాండ్ ఎల్పీజీ పుష్కలంగా అందుబాటులో ఉండడమే కాదు, ఎక్కువ ఆక్టేన్ కలిగి, చాలా తక్కువ ఉద్గారాలను విడుదల చేసే ఇంధనం కావడంతో.. ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రత్యామ్నాయ ఇంధనంగా లోగడ భావించారు. దీంతో ఎల్పీజీ కార్లు, ఎల్పీజీ త్రిచక్ర వాహనాలు 2019లో ఎక్కువగా అమ్ముడుపోయాయి. కానీ, దేశంలో ఎల్పీజీ వాహనాల వినియోగం చట్టబద్ధంగా అమల్లోకి వచ్చిం ది మాత్రం 2020 ఏప్రిల్ నుంచి కావడం గమనార్హం. నాలుగు చక్రాల ప్యాసింజర్ వాహనాలకుతోడు, ఎల్పీజీ త్రిచక్ర వాహనాలు (80 శాతానికి పైగా) 2019లో రికార్డు స్థాయి ఎల్పీజీ వాహన అమ్మకాలకు దోహదపడినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కానీ, 2022–23 సంవత్సరంలో ఎల్పీజీ వాహనాల డిమాండ్ 14 శాతానికి పరిమితమైంది. 2018–19లో ఇది 18 శాతంగా ఉంది. 2022–23లో కేవలం 3,495 ఎల్పీజీ నాలుగు చక్రాల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. 2018–19లో ఇలా రిజిస్టర్ అయిన నాలుగు చక్రాల వాహనాలు 23,965 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ‘‘విక్రయానంతరం ప్యాసింజర్ వాహనాలకు ఉన్న డిమాండ్ ఇది. 2018 నుంచి 2020 వరకు ప్యాసింజర్ వాహన విభాగమే ఎల్పీజీకి పెద్ద మద్దతుగా నిలిచింది. నిబంధనలు అనుకూలంగా లేకపోవడం, కిట్ ఆధారిత అనుమతులకు అధిక వ్యయాలు చేయాల్సి రావడం, ప్రతి మూడేళ్లకోసారి తిరిగి సరి్టఫై చేయించుకోవాల్సి రావడం, ఎల్పీజీ మోడళ్లు పెద్దగా అందుబాటులో లేకపోవడం వినియోగదారుల్లో ఆసక్తి ఆవిరైపోవడానికి కారణం’’అని ఇండియన్ ఆటో ఎల్పీజీ కొయిలిషన్ డైరెక్టర్ జనరల్ సుయాష్ గుప్తా వివరించారు. వసతులు కూడా తక్కువే.. 2023 మార్చి నాటికి దేశవ్యాప్తంగా కేవలం 1,177 ఎల్పీజీ స్టేషన్లే ఉన్నాయి. అదే సీఎన్జీ స్టేషన్లు అయితే 4,600 ఉంటే, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు 5,200 ఉన్నాయి. పెట్రోల్ పంపులు 80,000 పైగా ఉన్నాయి. అంటే ఎల్పీజీ విషయంలో సరైన రీఫిల్లింగ్ వసతులు కూడా లేవని తెలుస్తోంది. మరోవైపు ధరలు కూడా అనుకూలంగా లేని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో కిలో ఎల్పీజీ ధర లీటర్‌కు రూ.68కి చేరుకోగా, 2019లో రూ.40 మాత్రమే ఉంది. ఇతర రాష్ట్రాల్లో దీని ధర ఇంకా ఎక్కువే. ‘‘ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం కొరవడడంతో వాహన తయారీదారులు ఎల్పీజీ మోడళ్లను తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. నేడు దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా అయితే ఎల్పీజీ కార్ల తయారీని నిలిపివేసింది. ప్రజలు సీఎన్జీ, ఈవీల పట్ల ఆసక్తి చూపిస్తుండడం దేశంలో ఎల్పీజీ వాహన రంగానికి గొడ్డలి పెట్టుగా మారింది’’అని పరిశ్రమకు చెందిన నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. ఈవీ, సీఎన్జీ వాహనాలను కేంద్రం సబ్సిడీలతో ప్రోత్సాహిస్తుండడాన్ని పరిశ్రమ ప్రస్తావిస్తోంది. -
36 శాతం ‘వంట’ చెరకే! తొలి స్థానంలో మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలివే..
సాక్షి, అమరావతి: దేశంలో 62 శాతం మంది వంట కోసం ఎల్పీజీ (గ్యాస్)ని వినియోగిస్తుండగా 36 శాతం ప్రజలు మాత్రం వంట చెరకునే వాడుతున్నట్లు కేంద్ర పర్యావరణ గణాంకాల నివేదిక వెల్లడించింది. 33.8 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపై ఆధారపడుతుండగా 2.2 శాతం మంది వంట కోసం పిడకలను వినియోగిస్తున్నారు. 1.3 శాతం మంది కిరోసిన్, గోబర్ గ్యాస్, ఎలక్ట్రికల్, బొగ్గుల పొయ్యిపై వంట చేస్తున్నారు. ఇక ఎల్పీజీ వినియోగంలో గ్రామాలకు, పట్టణ ప్రాంతాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కట్టెలు, పొట్టు, పంట అవశేషాలు ఉచితంగా లభిస్తుండటంతోపాటు బూడిదను పంట పొలాలకు ఎరువుగా వాడుతున్నందున వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఇక భగ్గుమంటున్న గ్యాస్ ధరలు కూడా కారణమే. ఈమేరకు కేంద్ర పర్యావరణ నివేదిక 2023ని గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసింది. ♦ గ్రామీణ ప్రాంతాల్లో 49.4 శాతం మంది ఎల్పీజీ వాడుతుండగా 46.7 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపై ఆధార పడుతున్నారు. మూడు శాతం మంది పిడకలు, 0.7 శాతం మంది గోబర్ గ్యాస్, కిరోసిన్, ఎలక్ట్రికల్, బొగ్గుల పొయ్యిలను వాడుతున్నారు. ♦ పట్టణ ప్రాంతాల్లో 89 శాతం మంది వంట కోసం ఎల్పీజీ వాడుతుండగా 6.5 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలను వినియోగిస్తున్నారు. 0.3 శాతం మంది పిడకలు, 2.5 శాతం గోబర్ గ్యాస్, ఎలక్ట్రికల్, కిరోసిన్, బొగ్గుల పొయ్యిలను వాడుతున్నారు. ♦ ఛత్తీస్‌గఢ్ గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 84.2 శాతం మంది వంట కోసం కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపైనే ఆధారపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో 16.3 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపై వంట చేస్తుండగా 81.7 శాతం మంది ఎల్పీజీ వినియోగిస్తున్నారు. -
వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!
గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2023-2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజునే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించింది. ఏప్రిల్ 1న వంట గ్యాస్ ధరలు దాదాపు రూ.92 తగ్గించింది. అయితే రేట్ల తగ్గింపు కేవలం వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రమే. గృహోపయోగానికి వినియోగించే డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి తగ్గింపు లేదు. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం గత నెలలోనే రూ.50 పెంచిన విషయం తెలిసిందే. అలాగే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను రూ.350 పెంచింది. (Jio offer: జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!) సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తుంటాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ రేటు భారతదేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరలను ప్రభావితం చేసే రెండు కీలక అంశాలు. సవరించిన తర్వాత 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ.2,028, కోల్‌కతాలో రూ.2,132, ముంబైలో రూ.1,980, చెన్నైలో రూ.2192.50 చొప్పున ఉంది. కాగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం గృహ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని ప్రకటించింది. ఈ పథకం కింద 9.59 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రతి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పైనా రూ.200 సబ్సిడీ అందిస్తున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గత నెలలో ప్రకటించారు. డొమెస్టిక్ సిలిండర్లు ఏడాదికి 12 మాత్రమే వినియోగించకునేలా కేంద్ర ప్రభుత్వం పరిమితిని విధించింది. -
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!
సామాన్యులకు చమురు కంపెనీలు భారీ షాకిచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్‌పై రూ.350.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక మార్చి 1న పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో వంట గ్యాస్ ధర రూ.1,155 చేరింది. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2119.50కు ఎగబాకింది. కాగా, ఇప్పటికే ఆర్ధిక మాంద్యం భయాలు, పెరిగిపోతున్న వడ్డీ రేట్లు, నిత్యావసర సరకుల పెంపుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుగుతోంది. తాజాగా పెరిగిన గ్యాస్ ధరలతో ఆ భారం మరింత పెరగనుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగిన ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1769 నుంచి రూ.2119.50కి చేరింది. ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1052 నుంచి రూ.1102.5కి పెరిగింది. కోల్‌కతాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1079 నుంచి రూ.1129కి పెరిగింది. చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1068.50 నుంచి రూ.1118.5కి చేరింది. -
పండుగ కానుక: భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్!
దేశంలో నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో పండుగ కానుకగా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట కలిగిస్తూ చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం అంటే అక్టోబర్ 1న, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 25.50 తగ్గింది. బిగ్ రిలీఫ్.. భారీ తగ్గింపు! అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదలతో సహజవాయువు ధరలు రికార్డు స్థాయిలో 40 శాతం పెరిగి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగిన ఒక రోజు తర్వాత, దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు జాతీయ రాజధానిలో కమర్షియల్ ఎల్పీజీ (LPG Cylinder) సిలిండర్ల ధరను ₹ 25.50 తగ్గించాయి. ఈ తాజా ధరల సవరణతో, ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,859.50గా ఉండగా అంతకు ముందు రూ. 1,885 ఉంది. కోల్‌కతాలో, దీని ధర రూ.1959కి తగ్గింది. ముంబైలో ప్రస్తుతం దీని ధర రూ. 1811.50గా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గించడం ఇది ఆరోసారి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ల విషయంలో ఎలాంటి మార్పు లేదు. కాగా సెప్టెంబర్ 1న, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ యూనిట్ ధర ₹ 91.50 తగ్గింది, ఢిల్లీలో ధర ₹ 1,885 నుంచి ₹ 1,976కి తగ్గిన సంగతి తెలిసిందే. చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త సేవలు రాబోతున్నాయ్! -
LPG Cylinder Price: బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్
న్యూఢిల్లీ: ఇప్పటికే నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వారికి కాస్త ఊరట కలిగించేలా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం అంటే ఆగస్టు 1న, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 36 తగ్గింది. నెల వ్యవధిలో రేట్లు తగ్గించడం ఇది రెండోసారి. జూలై 6న 19 కేజీల సిలిండర్‌పై రూ.8.50 తగ్గించారు. ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,976గా ఉండగా అంతకు ముందు రూ. 2,012.50 ఉంది. కోల్‌కతాలో ఈ ధర రూ.2,095.50, ముంబైలో రూ.1,936.50, చెన్నైలో రూ.2,141 ఉంది. కాగా స్థానిక టాక్స్‌ల ఆధారంగా రాష్ట్రానికి రాష్ట్రానికి ఈ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చదవండి: ఇలాంటి పాన్ కార్డు మీకుంటే.. రూ.10,000 పెనాల్టీ! -
హైదరాబాద్: గ్యాస్ ధరల పెంపుపై మంత్రి సబితాఇంద్రారెడ్డి ధర్నా
-
LPG Gas: వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన వంటగ్యాస్ ధర
న్యూఢిల్లీ: దేశంలో వంట గ్యాస్ ధరలు మరోసారి మంటెత్తాయి. అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదలకు అనుగుణంగా దేశీయ వంట గ్యాస్ ధర మంగళవారం సిలిండర్‌కు రూ.50 చొప్పున పెరిగింది. దీంతో 14.2 కిలోల నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.949.50గా ఉంది. గత సంవత్సరం అక్టోబర్ తర్వాత ఎల్పీజీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ముడిసరుకు ధరలు పెరుగుతున్నప్పటికీ అక్టోబర్ ప్రారంభం నుంచి గ్యాస్ ధరలు పెంచలేదు. పెంచిన ధరలతో 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 349 కాగా, 10 కిలోల కాంపోజిట్ బాటిల్ రూ. 669గా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2003.50గా ఉంది. పెరిగిన గ్యాస్ ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. పెంచిన ధరలతో తెలంగాణలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటింది. -
వంటింటిపై ‘గ్యాస్’ బాంబు!
సాక్షి, హైదరాబాద్: నాలుగు నెలల నుంచి స్థిరంగా ఉన్న గృహ వినియోగ గ్యాస్ ధరలు వారం రోజుల్లో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు ఏకంగా రూ.105 మేరకు పెంచాయి. 5 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.27 పెరిగింది. అయితే ప్రస్తుతానికి గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరను మాత్రం పెంచలేదు. అయితే ఉత్తరప్రదేశ్‌తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల చివరి విడత పోలింగ్ ఈనెల 5న ముగియనున్న నేపథ్యంలో.. వచ్చే వారంలో గృహ వినియోగ గ్యాస్ ధర భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం పచ్చజెండా! ఉక్రెయిన్ , రష్యాల మధ్య యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే దేశంలో బల్క్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. తాజాగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్‌తో పాటు వంట గ్యాస్ ధరలను కూడా చమురు సంస్థలు పెంచుకునేందుకు కేంద్రం పచ్చజెండా ఊపినట్లు మార్కెట్ నిపుణులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సిలిండర్ ధర గణనీయంగా పెరిగింది. 19 కిలోల సిలిండర్ ధరను రూ.105 మేర పెంచగా, 5 కిలోల సిలిండర్‌పై రూ. 27 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.2,086 నుంచి రూ.2,191కి పెరిగింది. ఈ సిలిండర్ల ధరల పెంపు భారం పరోక్షంగా సామాన్యులపై కూడా పడనుంది. నాలుగు నెలలుగా పెండింగ్! చమురు ఉత్పత్తుల ధరల పెంపుదల తథ్యం అని తెలిసినప్పటికీ... ఆయిల్ కంపెనీలు ఎంత మేర ధరలను పెంచుతాయనే దానిపై స్పష్టత లేదు. బల్క్ డీజిల్, కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచడం ద్వారా డొమెస్టిక్ గ్యాస్, రిటైల్ ఆయిల్ ధరల పెంపును సైతం ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండా లని కేంద్రం సంకేతాలిచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.952గా ఉంది. ఆదిలాబాద్‌లో రూ.976.50 ఉండగా, ఖమ్మంలో అత్యల్పం గా రూ.939 ఉంది. 2021 అక్టోబర్ 6 నుంచి ఈ డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో మార్పులేదు. తాజా పరిస్థితుల్లో రూ.50కి పైగానే ధర పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
బాబోయ్..మళ్లీ బండ బాదుడు!! రెట్టింపు కానున్న గ్యాస్ ధరలు!
రానున్న రోజుల్లో ఎల్పీజీ గ్యాస్ ధరలు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట స్థాయికి చేరుకోగా..త్వరలో పెరగనున్న వంటగ్యాస్ ధరలు సామాన్యుల పాలిట గుదిబండలా మారనున్నాయి. జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ నుండి వంట గ్యాస్ ధరలు భారీ ఎత్తున పెరగనున్నట్లు తెలుస్తోంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లతో పాటు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా తన కథనాల్లో పేర్కొన్నాయి. సీఎన్జీ, విద్యుత్, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల ప్రధాన కారణం పెరుగుతున్న రవాణా ఖర్చులు, నిర్వహణ ఖర్చులేనని తెలుస్తోంది. దీనికి తోడు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం సామాన్యుల కష్టాలను మరింత పెంచుతుంది. పెరుగుతున్న గ్యాస్ ధరల ప్రభావం, కోవిడ్-19 మహమ్మారి నుండి పుంజుకుంటున్న దేశాల వృద్ధితో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన అవసరాల్ని తీర్చడంలో వైఫల్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం గ్యాస్, పెట్రోలియం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ నాటికి వంటగ్యాస్ ధరలను సవరిస్తే 2.9 డాలర్ల నుంచి 6 - 7 వరకు పెరిగే అవకాశం ఉండనుంది. చదవండి: మరో ప్రమాదం అంచున ఉక్రెయిన్, ఇది రష్యా పనేనా?! -
ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!
అమ్మో ఒకటో తారీఖు..! ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. వచ్చేనెల ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనుండగా పలు రంగాల్లో రానున్న మార్పులను మనం స్వాగతించాల్సి ఉంటుంది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్న బ్యాంకులకు సంబంధించిన కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ► దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్) ఛార్జీలను పెంచనుంది. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో ఐఎంపీఎస్ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ విధించనుంది. ఐఎమ్పిఎస్ లావాదేవీలు చేసేటప్పుడు జీఎస్టీతో పాటు గరిష్టంగా రూ.20 వసూలు చార్జీల రూపంలో చేయనుంది. అక్టోబర్ 2021లో ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని ఆర్బిఐ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన విషయం మనకు తెలిసిందే. ► ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన చెక్ క్లియరెన్స్‌కు సంబంధించిన నియమ & నిబంధనలు మారనున్నాయి. చెక్ చెల్లింపు కోసం వినియోగదారులు సానుకూల చెల్లింపు విధానాన్ని అనుసరించాలి. ప్రస్తుతం ఖాతాదారులు చెక్ జారీ చేసిన తర్వాత ఆ చెక్కుకు సంబంధించిన వివరాలు బ్యాంక్‌కు పంపాల్సి ఉంటుంది. లేకపోతే ఆ చెక్ క్లియర్ అవ్వదు. ఖాతాదారుల భద్రత దృష్ట్యా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు కేవలం రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న చెక్కుల కోసం ఇలాంటి నిబంధనలు మార్చింది. తక్కువ మొత్తంలో చెక్కులు జారీ చేస్తే మాత్రం ఈ మార్పులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చే నెల నుంచి చార్జీల బాదుడు షురూ చేయబోతోంది. ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవడం వల్ల మీ ఇన్స్టాల్మెంట్లు లేదంటే ఈఎంఐ చెల్లింపులు ఫెయిల్ అయితే అప్పుడు బ్యాంక్ రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ.100 చార్జీ వసూలు చేస్తున్నారు. డిమాండ్ డ్రాఫ్ట్‌ను క్యాన్సిల్ చేయాలన్నా రూ.150 చెల్లించుకోవాలి. ► ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మాదిరిగానే వచ్చేనెల ఫిబ్రవరి 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఫిబ్రవరి & మార్చిలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఫిబ్రవరి 1న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం తగ్గిస్తుందా? లేదా అనేది చూడాలి. (చదవండి: బీఎండబ్ల్యూ అనూహ్య నిర్ణయం...! తొమ్మిదేళ్ల ప్రస్థానానికి ఎండ్ కార్డ్..!) -
ఎల్పీజీ ధరల పెంపుతో... భగ్గుమన్న కజకిస్తాన్
మాస్కో: మధ్య ఆసియా దేశమైన కజకిస్తాన్‌లో ఎల్పీజీ గ్యాస్ ధరల్ని భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు చేస్తున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. దేశంలోని అతి పెద్ద నగరమైన అల్మటీలో నిరసనకారులు ప్రభుత్వ భవనాలపై జరిపిన దాడులు రక్తపాతాన్ని సృష్టించాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందగా, 12 మంది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఒక పోలీసు అధికారి తల తెగి రోడ్డుపై పడి ఉండడం భయోత్పాతాన్ని రేపింది. అత్యవసర పరిస్థితుల్ని తోసిరాజని బుధవారం రాత్రికి రాత్రి ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి అధ్యక్ష భవనం, ఇతర ప్రభుత్వ భవనాలను ముట్టడించడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పోలీసు శాఖ పోలీస్ శాఖ తెలిపింది. కజకిస్తాన్ ప్రజలు ఎల్పీజీ గ్యాస్‌ని ఎక్కువగా కార్లలో వినియోగిస్తారు. ఎలక్ట్రానిక్ వాహనాలు వినియోగించాలన్న ఉద్దేశంతో పెట్రో ధరలపై ప్రభుత్వం సబ్సిడీలను ఎత్తేయడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు గత ఆదివారం నుంచి నిరసనలకి దిగారు. పరిస్థితులు చెయ్యి దాటిపోతూ ఉండడంతో టోకయేవ్ రష్యా సాయాన్ని కోరారు. ఆయన అభ్యర్థన మేరకు రష్యా, దాని మిత్ర దేశాలు కజకిస్తాన్‌కు శాంతి బలగాలను పంపించనున్నాయి. -
పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా తగ్గించాలి
బెంగళూరు: పెట్రోల్, డీజిల్ ధరలను ఇంకా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎల్పీజీ ధరలు కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయని, వాటిని కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కేంద్ర సర్కారు లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై 10 రూపాయలు ఎక్సైజ్డ్యూటీ తగ్గించిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ స్పందించారు. శుక్రవారం ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ...‘పెట్రోల్, డీజిల్ ధరలను పెద్దగా ఏం తగ్గించలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్డ్యూటీ రూ.9.48, డీజిల్‌పై రూ.3.56 ఉండేది. ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని మరింత తగ్గించాలి. ఎల్పీజీ రేట్లు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయి. వీటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. ధరలు తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తాం. నవంబర్ 14 నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామ’ని అన్నారు. (చదవండి: పంజాబ్ కాంగ్రెస్: నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక నిర్ణయం) కాగా, గతకొద్ది రోజులుగా వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వినియోగదారులు సతమతవుతున్నారు. చమురు ధరల అనూహ్య పెరుగుదలతో సామాన్యుడి జీవితం భారంగా మారింది. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర సర్కారు స్వల్పంగా ఎక్సైజ్డ్యూటీ తగ్గించి వినియోగదారులకు ఊరట కల్పించింది. అయితే ఇంకాస్త తగ్గించాలని సామాన్యులు కోరుకుంటున్నారు. (వంటనూనె ధరల్ని తగ్గించిన కేంద్రం.. ఎంతంటే?) -
పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర
దేశంలో వంట గ్యాస్ ధరలు మళ్లీ మంటెత్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలతో సిలిండర్ల ధరలు ఆకాశానికి చేరుతున్నాయి. దీంతో వంట గ్యాస్ సిలిండర్ ధర బుధవారం రూ.15 పెరిగింది. ఢిల్లీలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.899.50చేరింది. కాగా సెప్టెంబర్ నెలలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. ఈ నెలలో 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.43 పెరగడం సామాన్యులకు పెను భారంగా మారింది. ఇక తాజాగా పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధరతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం గ్యాస్ ధర రూ.190 పెంచినట్లైంది. చమరు కంపెనీలు రెండు నెలల్లో నాన్ సబ్సిడీ గ్యాస్ సిలీండర్ ధరలు అమాంతం పెంచాయి. ఆగస్ట్ 18న నాన్ సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధర ను రూ.25 పెంచగా..సెప్టెంబర్ నెలలో ఇదే నాన్ సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.25 పెరగడంతో సామాన్యులు లబోదిబో మంటున్నారు. మరింత పెరగనున్న వంట గ్యాస్ ధరలు ఒకవైపు కరోనా..మరో వైపు ఆదాయం లేక సామాన్యుడు అప్పుల ఊబిలో చితికి పోతుంటే పెరుగుతున్న చమురు, గ్యాస్ ధరలు మరింత శాపంగా మారాయి. పెట్రోల్, డీజిల్ వంట నూనెలతో పాటు ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెరగటం.. ఇపుడు గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరగడం మరింత భారం కానుంది. అయితే ఈ పెరుగుతున్న ధరల భారం కొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఓ నివేదిక ప్రకారం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ కుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 2021 నుంచి మార్చి 2022 మధ్య కాలంలో నేచురల్ గ్యాస్ ధర 50 నుంచి 60శాతం పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే గ్యాస్ ధర ఆకాశాన్ని తాకనుంది. చదవండి: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు -
సామాన్యుడికి షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర.. ఏడాదిలో ఐదోసారి
జీడీపీ లెక్కలు బాగానే ఉన్నాయంటూ కేంద్రం శుభవార్త చెప్పిన మరుసటి రోజు సామాన్యుడికి షాక్ తగిలింది. ఎల్పీజీ గ్యాస్ ధరను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి. పెరిగిన ధరతో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.884.50కి చేరుకుంది. రెండు వారాల్లో రెండు సార్లు ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి గ్యాస్ ధరలను చమురు కంపెనీలు సమీక్షిస్తున్నాయి. అందులో భాగంగా మార్కెట్ పరిస్థితులను బట్టి ధరలను స్థిరీకరిస్తున్నాయి. చివరి సారిగా ఆగస్టు 18న గ్యాస్ ధరను రూ. 25 పెంచాయి. రెండు వారాలు తిరిగే సరికి మరోసారి సామాన్యుడి నెత్తిన గ్యాస్ పిడుగు పడింది. దీంతో రెండు వారాల వ్యవధిలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 వరకు పెరిగింది. ఈ ఏడాది పెంపు రూ. 165.50 ఈ ఏడాది ఆరంభంలో రూ.694లుగా ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో, మార్చి, జూన్లలో కూడా ధరలను చమురు కంపెనీలు పెంచాయి. మొత్తంగా ఐదు సార్లు ధర పెరగగా మధ్యలో ఫిబ్రవరి, ఏప్రిల్‌లలో కొద్ది మేరకు ధరలను తగ్గించాయి. మొత్తంగా ఈ ఏడాది 14.2 కేజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.165.50 వరకు ధర పెరిగింది. 2017 నుంచి బాదుడే పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణను 2017లో కేంద్రం ఎత్తివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆధారంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెట్రో ఉత్పత్తి సంస్థలు పెంచేస్తున్నాయి. ఫలితంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. తాజా పెంపుతో దేశంలో 29.11 కోట్ల మంది ఎల్పీజీ కస్టమర్లపై భారం పడనుంది. చదవండి: మిస్డ్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్ -
ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
మీరు ఎక్కువగా బ్యాంకు సంబంధిత లావాదేవీలు చేస్తుంటారా? అయితే, మీకు ఒక ముఖ్య గమనిక. ఆగస్టు 1 నుంచి బ్యాంకుకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల సామాన్యుల మీద ఎక్కవగా భారం పడనుంది. ఏటీఎం లావాదేవీలు, ఎల్పీజీ ధరలు, వేతనాలు, పెన్షన్లు ఇలా చాలా అంశాలకు సంబంధించి కొత్త మార్పులు ఆగస్టు 1 నుంచి చోటు చేసుకొనున్నాయి. సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో కొత్త నిబందనలు అమల్లోకి వస్తుంటాయి. మరి ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఏంటీ? అవి మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయనున్నయో? తెలుసుకోండి. వేతనం, ఈఎమ్ఐ చెల్లింపులు: నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనలలో ఆర్బీఐ మార్పు చేయడం వల్ల సెలవు రోజుల్లో కూడా విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, నీరు, జీతం, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ సంబంధిత లావాదేవీలు సెలవు రోజుల్లో కూడా జరగనున్నాయి. ఈ కొత్త మార్పులు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలు 24ఎక్స్7 అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. ఎన్ఏసీహెచ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) చేత నిర్వహించబడుతుంది. ఎటిఎమ్ క్యాష్ విత్ డ్రా: జూన్ నెలలో ఆర్బీఐ తీసుకొచ్చిన మరో ఆర్డర్ ప్రకారం, ఆగస్టు 1 నుంచి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్(ఏటీఎం) చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్న బ్యాంక్ ఆందోళన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఇంటర్ చేంజ్ ఫీజ్ ను ₹2 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వాడుకలో ఉన్నాయి. ఐపీపీబీ డోర్ స్టెప్ సేవలు ఖరీదు: ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ సేవలకు ఇక నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలను, సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేట్లను ఐపీపీబీ సవరించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలు 01 ఆగస్టు 2021 నుంచి వర్తిస్తాయి. ప్రస్తుతం, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సంబంధించి ఎలాంటి ఛార్జీలు లేవు. ఇక ఆగస్టు 1, 2021 నుంచి ప్రతి కస్టమర్ ఐపీపీబీ డోర్ స్టెప్ అభ్యర్థనకు బ్యాంకింగ్ ఛార్జీల కింద రూ.20 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకే కస్టమర్ ఎక్కువ సార్లు అభ్యర్థనలు చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ తన దేశీయ పొదుపు ఖాతాదారులకు నగదు లావాదేవీలు, ఎటిఎం ఇంటర్ చేంజ్, చెక్ బుక్ ఛార్జీల సవరించిన్నట్లు తెలిపింది. ఈ మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్ సైట్ తెలిపింది. అన్ని నగదు లావాదేవీలపై ఛార్జీల సవరణ వర్తిస్తుంది.ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ఆ తర్వాత లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి.ప్రతి ఆర్థిక లావాదేవీకి బ్యాంకు ₹20, ఆర్థికేతర లావాదేవీకి ₹8.50 వసూలు చేస్తుంది. ఆగస్టు 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచీలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. లక్షకు పైగా జరిపే ప్రతి లావాదేవిపై ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. ఎల్పీజీ ధరలు: ఎల్పీజీ ధరలను గ్యాస్ ఏజెన్సీలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తాయి. జూలై నెల 1 తేదీన ఎల్పీజీ ధరలను రూ. 26 పెంచాయి. మరి ఈ నెల పెరగనున్నాయా? తగ్గనున్నాయా? అనేది ఆగస్టు 1 తేదీన తెలవనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ): 15సీఏ, 15సీబీ ఫామ్స్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విషయంలో పలు సడలింపులు ఇచ్చింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. గతంలో జూలై 15 వరకు ఉన్న చివరి తేదీని ఆగస్ట్ 15కి పొడిగించింది. -
జూలై 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!
డ్రైవింగ్ లైసెన్స్ నుంచి బ్యాంక్ చార్జీల వరకు జూలై 1, 2021 నుంచి అనేక కొత్త మార్పులు చోటు చేసుకొనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రేపటి నుంచి ఛార్జీలు పెంచేందుకు సిద్దమవుతుంది. అలాగే ఎల్పీజీ ధరలో కూడా మార్పులు చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ కొత్త మార్పుల వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎస్బీఐ బీఎస్‌బీడీ జూలై 1 నుంచి ఎస్బీఐ బీఎస్‌బీడీ ఖాతాదారుల జేబుకు చిల్లు పడనుంది. ఒక నెలలో బ్యాంకు శాఖలు, ఏటీఎంల నుంచి కూడా కలిపి నెలకు ఉచితంగా నాలుగుసార్లు మాత్రమే నగదు తీసుకునే వీలుంటుంది. ఆపై ఒక్కో లావాదేవీపై రూ.15 (జీఎస్టీ అదనం) చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఒక ఆర్ధిక సంవత్సరంలో 10 చెక్స్ మాత్రమే ఉచితంగా అందించనున్నారు. అంతకంటే ఎక్కువ 10 లీఫ్ల చెక్ బుక్కు కోసం అయితే రూ. 40, 25 లీఫ్‌లదైతే రూ.75 చార్జీలు ప్లస్ జీఎస్టీ వర్తిస్తుంది. ఇక అత్యవసర చెక్ బుక్ కోసం రూ. 50 (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. ఎల్పీజీ గ్యాస్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) లేదా కిచెన్ గ్యాస్ రేట్లు కూడా జూలై 1 నుండి సవరించనున్నారు. ప్రతి 5 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలను సవరిస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్ జూలై 1 నుంచి కేంద్రం ఏర్పాటు చేస్తున్న కొత్త సిస్టమ్ ప్రకారం, ఇక నుంచి ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కోసం రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్(ఆర్ టీఓ) ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్రం గుర్తించిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలలో డ్రైవింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత వారు ఆ కేంద్రం నుంచే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. ఐఎఫ్ఎఎస్ సీ కోడ్లు కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లో విలీనం అయిన సంగతి తెలిసిందే. అయితే, జులై 1 నుంచి సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు కెనరా బ్యాంక్‌కు చెందిన కొత్త ఐఎఫ్ఎఎస్ సీ కోడ్లు వినియోగించాల్సి ఉంటుంది. ఐఎఫ్ఎఎస్ సీ కోడ్ లను కెనరా బ్యాంక్ వెబ్సైట్ ద్వారా పొందొచ్చు. చెక్కు బుక్కులు చెల్లవు మీరు ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ ఖాతాదారులా? అయితే ఇది మీ కోసమే. ఈ రెండు బ్యాంకులు యూనియన్ బ్యాంకులో విలీనం అయిన కారణంగా పాత చెక్కు బుక్కులు జులై 1 నుంచి చెల్లవ్. కొత్త చెక్కు బుక్కులు యూనియన్ బ్యాంకు శాఖల్లో తీసుకోవాల్సి ఉంటుంది. టీడీఎస్ కొత్త రూల్స్ ఇటీవల కేంద్రం అమల్లోకి తెచ్చిన ఫైనాన్స్ యాక్ట్ 2021 ప్రకారం గత రెండేళ్లలో చెల్లించాల్సిన టీడీఎస్, టీసీఎస్ పన్ను రూ.50,000 కంటే ఎక్కువగా ఉంటే వారి నుంచి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలో అధిక శాతంలో పన్ను వసూలు చేయాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది. ఇది జులై 1 నుంచి అమల్లోకి రానుంది. చదవండి: ఇజ్రాయిల్ తరహా 'ఐరన్ డోమ్'ను భారత్ నిర్మించాలి -
గ్యాస్ షేర్లు గెలాప్!
దేశీయంగా పెరగనున్న గ్యాస్ లభ్యత, పర్యావరణానుకూల శుద్ధ ఇంధనాలకు కనిపిస్తున్న డిమాండ్ తదితర అంశాలు ఎల్ఎన్జీ, సీఎన్జీ, ఎల్పీజీ సంస్థలకు లబ్ధి చేకూర్చనున్నాయి. దేశవ్యాప్తంగా గ్యాస్ రవాణాకు అనువుగా ఏర్పాటవుతున్న మరిన్ని పైప్‌లైన్ నిర్మాణాలు ఇందుకు మద్దతివ్వనున్నాయి. వెరసి భవిష్యత్‌లో గ్యాస్ సంబంధ కంపెనీల షేర్లకు గిరాకీ పెరిగే వీలున్నట్లు స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముంబై: రానున్న కొన్నేళ్లలో పలు పట్టణాలను కలుపుతూ గ్యాస్ రవాణాకు అనువుగా పైప్లైన్లు ఏర్పాటవుతున్నాయి. దీనికితోడు దేశ, విదేశీ మార్కెట్లలో గ్యాస్ లభ్యత పెరగనుంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వాలు పర్యావరణహిత ఇంధనాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. వెరసి ఇకపై అటు గ్యాస్, ఇటు ఇంధన రవాణా కంపెనీలకు డిమాండ్ ఊపందుకోనున్నట్లు విశ్లేషకులు ఊహిస్తున్నారు. రానున్న రెండేళ్లలో అంటే 2023–24కల్లా దేశీయంగా అదనపు గ్యాస్ ఉత్పత్తి గరిష్టంగా రోజుకి 40 మిలియన్ మెట్రిక్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ)కు చేరే వీలున్నట్లు మోతీలా ల్ ఓస్వాల్ రీసెర్చ్ నివేదిక అభిప్రాయపడింది. ఇందుకు కేజీ బేసిన్లో బావుల నుంచి గ్యాస్ ఉత్పాదకత పెరిగే అంచనాలు జత కలిసినట్లు పేర్కొంది. ఆర్ఐఎల్ రెడీ రెండేళ్లలో ప్రైవేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ 28 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే వీలున్నట్లు మోతీలాల్ నివేదిక పేర్కొంది. దీనిలో 12.5 ఎంఎంఎస్‌సీఎండీని వేలం వేయనున్నట్లు తెలియజేసింది. దీనిలో 4.8 ఎంఎంఎస్‌సీఎండీని జామ్‌నగర్ రిఫైనరీలకోసం వినియోగించనున్నట్లు వివరించింది. ఇక మిగిలిన 12 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ ఉత్పత్తి చేసే అవకాశమున్నట్లు నివేదిక పేర్కొంది. రానున్న కాలంలో ప్రధానంగా ఎరువులు, రిఫైనింగ్–పెట్రోకెమికల్స్, సిటీగ్యాస్ పంపిణీ రంగాల నుంచి ఇంధనానికి అధిక డిమాండ్ కనిపించనున్నట్లు అంచనా వేసింది. తాజాగా పెరిగిన జోరు... రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ నివేదిక ప్రకారం దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి గత రెండు నెలల్లో 6 శాతం అంటే 4.6 ఎంఎంఎస్‌సీఎండీ పుంజుకుని ఈ జనవరికల్లా 82.3 ఎంఎంఎస్‌సీఎండీకి చేరింది. ఇందుకు తూర్పుతీర సముద్ర క్షేత్రాల నుంచి 4.4 ఎంఎంఎస్‌సీఎండీ ఉత్పత్తి పెరగడంతో 5.9 ఎంఎంఎస్‌సీఎండీకి గ్యాస్ లభ్యత చేరింది. ఆర్ఐఎల్–బీపీ క్షేత్రాలు ఇందుకు దోహదపడ్డాయి. ఎల్ఎన్జీ ట్రక్కులు పెరగడం ద్వారా రానున్న దశాబ్ద కాలంలో వార్షికంగా మరో 8–10 మిలియన్ మెట్రిక్ టన్నులకు డిమాండ్ జత కలిసే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. గ్యాస్ లభ్యత, వినియోగం పుంజుకోవడం ద్వారా గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ (జీఎస్పీఎల్), గెయిల్ వంటి ఇంధన రవాణా కంపెనీలకు మేలు చేకూరనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. సామర్థ్యం ఇలా... ప్రస్తుతం వార్షికంగా దేశీ ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ సామర్థ్యం 42.5 ఎంఎంటీపీఏగా నమోదైంది. అయితే 2020లో 30 ఎంఎంటీపీఏ మాత్రమే రీగ్యాసిఫికేషన్ జరిగింది. ఇందుకు కొన్ని తాత్కాలిక అవాంతరాలు ఎదురైనట్లు నిపుణులు వెల్లడించారు. కాగా.. మరోవైపు దహేజ్, ధమ్రా, జైగఢ్ తదితర ప్రాంతాలలో ఏర్పాటవుతున్న టెర్మినళ్ల ద్వారా 24 ఎంఎంటీపీఏ అందుబాటులోకి రానుంది. ఇది పెట్రోనెట్ ఎల్ఎన్జీకి దన్నునివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే అంతిమ వినియోగదారులకు గ్యాస్‌ను అందించవలసి ఉన్నట్లు చె ప్పారు. ఇందుకు అనుగుణంగా జీఎస్పీఎల్ కొన్ని కీలక పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రస్తావించారు. వీటిలో దహేజ్–భాధుట్, అంజార్–చోటిల్లా, అంజార్–పలన్‌పూర్‌ను పేర్కొన్నారు. ఈ బాటలో 2021 జూలైకల్లా సిద్ధంకానున్న మెహశానా –భటిండా పైప్‌లైన్ వల్ల గుజరాత్ వెలుపలి గ్యాస్‌ను రవాణా చేసేందుకు వీలుంటుందని చెప్పారు. -
గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.500 డిస్కౌంట్
న్యూఢిల్లీ: గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే మనకు చాలా వరకు పద్ధతులున్నాయి. గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేసి సిలిండర్ బుక్ చేయడం లేదా ఆయిల్ కంపెనీ వెబ్సైట్ లేదా యాప్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. లేదా ఐవీఆర్ఎస్ నెంబర్‌కి కాల్ చేసినా గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది. అలాగే మనకు ఆన్లైన్ లో థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ తో బుక్ చేయడం ద్వారా ఒక్కో సారి క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఇప్పుడు పేటీమ్ లో కూడా ఆఫర్ ఒకటి నడుస్తుంది. మీరు మీ గ్యాస్ సిలిండర్‌ను పేటీమ్ యాప్ లో బుక్ చేసుకుంటే రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు.(చదవండి: మోటోరోలా నుంచి ఫ్లాగ్షిప్ ఫోన్) ఈ ఆఫర్‌ను పేటీమ్ యాప్‌లో భారత్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్, ఇండేన్ గ్యాస్ యూజర్లు ఉపయోగించుకోవచ్చు. కానీ, ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 31 వరకు పేటీమ్ లో మొదటి సారి బుక్ చేసుకున్న వినియోగదారులకు లభిస్తుంది. ఇందుకోసం వినియోగదారులు FIRSTLPG ప్రోమో కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది. మీకు అదృష్టం ఉంటే రూ.500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మీరు పేటీమ్ యాప్ లో "బుక్ ఏ సిలిండర్" క్లిక్ చేసి తర్వాత గ్యాస్ ప్రొవైడర్ పేరు, ఎల్పీజీ ఐడీ, కస్టమర్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. ఒకసారి వివరాలు సరిచూసుకున్న తర్వాత అప్లై ప్రోమో కోడ్ కింద FIRSTLPG ప్రోమో కోడ్ ఉపయోగించి మొదటిసారి సిలిండర్ బుక్ చేస్తే మీకు రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఒక కస్టమర్ ఒక్కసారి మాత్రమే ఈ ప్రోమో కోడ్ వర్తిస్తుంది. -
‘ఎడిటోరియల్స్ బిల్డప్..లోకం నవ్వుతుంది పప్పు’
సాక్షి, అమరావతి : వైఎస్సార్ సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ నాయుకుడు నారా లోకేష్ బాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎల్పీజీ విషయంలో లోకేష్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తప్పుబట్టారు. ఆదివారం ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ లోకేశం.. నేచురల్ గ్యాస్‌కి ఎల్పీజీకి మధ్య తేడా కూడా తెలియదా?.. నేచరుల్ గ్యాస్ వ్యాట్‌లో మార్పులు జరిగితే ఎల్పీజీపై అని దుష్ప్రచారం చేయిస్తావా?.. అసలు ఎల్పీజీపై ట్యాక్స్ రాష్ట్రం పరిధిలోకి వస్తుందా?.. ఇంత అజ్ఞానం పెట్టుకొని మళ్లీ ఎడిటోరియల్స్ రాస్తున్నట్లు బిల్డప్. లోకం నవ్వుతుంది పప్పు’’ అంటూ ఎద్దేవా చేశారు. ( చిట్టీ నాన్నారుని అడుగు చెప్తారు.. ) అంతకు క్రితం ట్వీట్లో.. ’’ చంద్రం..మళ్లీ దళిత రాజకీయం మొదలుపెట్టావా?.. సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన''‘వైఎస్సార్ ఆసరా' నుండి ప్రజల దృష్టి మరల్చడమే మీ కుతంత్రం కదా?.. కానీ మీ కుట్ర విఫలం. ‘వైఎస్సార్ ఆసరా' సఫలం. మళ్లీ వినండి.. మాట నిలబెట్టుకొని తొలి విడతలో రూ.6,792 కోట్లు అక్కచెల్లమ్మల ఖాతాలో జమ చేశారు ముఖ్యమంత్రి జగన్’’ అని పేర్కొన్నారు. -
పెరిగిన వంట గ్యాస్ ధర
సాక్షి, న్యూఢిల్లీ : వంట గ్యాస్ ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం (జూలై1) అమల్లోకి వచ్చేలా మెట్రో నగరాల్లో సిలిండర్‌కు 4.50 రూపాయలకు వరకు పెంచారు. ఎల్పీజీ సిలిండర్ల ధరను వరుసగా రెండవ నెలలోనూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్ పై ఢిల్లీలో ఒక రూపాయి, ముంబైలో 3 రూపాయల 50 పైసలు , కోల్‌కతాలో 4.50 రూపాయలు, చెన్నైలో 4 రూపాయలు, హైదరాబాద్ లో 4.50 రూపాయలు చొప్పున పెరిగింది సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ రేట్లు (14.2 కిలోలు) హైదరాబాద్ : 645.50 రూపాయలు ఢిల్లీ : 594 రూపాయలు కోల్‌కతా : 620.50 రూపాయలు ముంబై : 594 రూపాయలు చెన్నై : 610.50రూపాయలు -
సాధారణ స్థాయికి ఎల్పీజీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: దేశీయంగా, రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలకు ఎలాంటి కొరత లేదంటూ ఇండియన్ ఆయిల్ కంపెనీల ప్రకటనల నేపథ్యంలో డిమాండ్ సాధారణ స్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌లు విపరీతంగా పెరగ్గా, ప్రస్తుతం అవి తగ్గుముఖం పట్టాయి. ఎక్కడా కొరత లేకపోవడం, ఆయిల్ కంపెనీలు సైతం బుకింగ్ చేసిన రెండు, మూడు రోజుల్లోనే సరఫరా చేస్తుండటంతో అటు వినియోగదారులు, ఇటు కంపెనీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. రాష్ట్రంలో గత ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చి 21 నుంచి గ్యాస్ బుకింగ్‌లు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ బుకింగ్‌లు 1.75లక్షల నుంచి 1.85లక్షల వరకు ఉంటుండగా, మార్చి నెలాఖరులో అవి ఏకంగా రోజుకు 3లక్షల వరకు పెరిగాయి. వినియోగదారులు అవసరం లేకున్నా అదనపు బుకింగ్‌లు చేస్తుండటంతో అప్రమత్తమైన ఆయిల్ కంపెనీలు ఒక్కో సిలిండర్ బుకింగ్‌కు మధ్య గడువును 14 రోజులకు పెంచాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌తో పాటే ఎల్పీజీ నిల్వలు సరిపడేంతగా ఉన్నాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. ఎల్పీజీ సిలిండర్ పూర్తిగా అందుబాటులో ఉండటంతో సోమవారం బుకింగ్‌లు కేవలం 1.08లక్షలు మాత్రమే ఉన్నాయని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. -
ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కారణంగా దేశం మొత్తం కష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం శుభవార్తను అందించింది. సబ్సీడియేతర లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ (14.2 కేజీ) ధరను రూ.65 తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ధరలు 55 శాతం మేర పడిపోవడంతో రేట్లు తగ్గించినట్లు ఐఓసీ తెలిపింది. ఈ తగ్గించిన రేట్లు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కానున్నాయి. దీంతో ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ రూ. 744కి లభించనుంది. గత నెలలో ఇది రూ. 805.5 ఉండగా రూ. 61.5 రూపాయలు తగ్గింది. -
సబ్సిడీయేతర వంటగ్యాస్ ధర రూ.53 తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధర పెరిగిందని బెంబేలెత్తుతున్న ప్రజలకు ఊరట లభించింది. సబ్సిడీ లేని వంట గ్యాస్ ధరను ప్రభుత్వం ఆదివారం తగ్గించింది. 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీ, ముంబైల్లో రూ. 53 మేర.. అలాగే 19 కేజీల సిలిండర్ ధర రూ. 84.50 తగ్గిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఆగష్టు 2019 నుంచి ఫిబ్రవరి 2020 వరకు మధ్య ఎల్పీజీ ధర 50 శాతం పెరిగింది. -
కొత్త ఏడాదిలో వంట గ్యాస్ భారం
సాక్షి, ముంబై: కొత్త ఏడాదిలో వంట గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ బండ భారం పడింది. నాన్ సబ్సిడీ ( సబ్సిడీ లేని) వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తాజాగా ప్రకటించాయి. పెరిగిన ధరలు జనవరి 1నుంచే అమల్లోకి వచ్చాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం14.2 కిలోల సిలిండర్ న్యూఢిల్లీలో రూ. 19, ముంబైలో రూ. 19.50, ఇతర ప్రాంతాల్లో రూ. 20 వరకూ భారం పడనుంది. దీంతో వరుసగా ఐదో నెలలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగినట్లయింది. గత ఏడాది ఆగస్టునుంచి ఈ ఐదు నెలల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 140 పెరిగినట్లయింది. తాజా పెంపు తరువాత ప్రస్తుతం న్యూఢిల్లీలో రూ. 684గా ఉన్న సిలిండర్ ధర రూ. 714కు చేరింది. ముంబైలో రూ. 895కు పెరిగింది. ఇక కోల్‌కతాలో రూ. 747, చెన్నైలో రూ. 734గా వుండనుంది పెంచిన ధరలు తక్షణం అమలులోకి వస్తాయని ఐఓసీఎల్ వెల్లడించింది. ఇదే సమయంలో 19 కిలోల బరువుండే కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1,241, ముంబైలో రూ. 1,190గా ఉందని ఇండియన్ ఆయిల్ పేర్కొంది. -
గడువు దాటిన సిలిండర్లతో పొంచి ఉన్న ముప్పు
నిడమర్రు: వంట గ్యాస్ (ఎల్పీజీ)తో వంట చేసుకోవడం ఎంత సులువో సరైన జాగ్రత్తలు పాటించకపోతే అంతే ప్రమాదం పొంచి ఉంటుంది. మీ డీలర్ çసరఫరా చేసిన వంటగ్యాస్ సిలిండర్‌కు ఎక్స్‌పయిరీ తేదీ ఉంటుంది. ఎక్స్‌పయిరీ తేదీ అంటే ఆ సిలిండర్ వినియోగించడానికి గడువు పూర్తయిందని సూచన. గడువు దాటిన తర్వాత మీ ఇంటికి చేరే సిలిండర్లలో లీకేజీలు ఏర్పడవచ్చు, ప్రమాదం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వంట గ్యాస్ సిలిండర్‌ను ఫిల్లింగ్ చేసే మయంలో నిబంధనలు ఏమిటి..?, సిలిండర్ గడువు తీరిందని ఎలా గుర్తించాలి.. తదితర సమాచారం తెలుసుకుందాం.. సిలిండర్‌కు 10 ఏళ్ల గడువు చట్టప్రకారం వంట గ్యాస్ (ఎల్పీజీ )సిలిండర్ అన్ని భద్రతా ప్రమాణాల పరీక్షలు పూర్తి చేసుకున్న కొత్త సిలిండర్ గడువు 10 ఏళ్ల వరకూ ఉంటుంది. సిలిండర్ తయారీలో ప్రత్యేకమైన ఉక్కుతోనూ, సిలిండర్ లోపల సురక్షితమైన కోటింగ్‌తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాన్డర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాల మేరకు తయారు చేస్తుంటారు. చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ ప్లోజిన్స్, బీఐఎస్ అనుమతులు తప్పని సరిగా తీసుకున్నాకే సిలిండర్ అందుబాటులోకి వస్తుంది. ఒకసారి లోపాలు కనిపించిన వాటిని సరిచేసి బీఐఎస్ ధ్రువీకరణ తీసుకున్న సిలిండర్‌లో మరోసారి పరీక్షల సమయంలో లోపాలు కనిపిస్తే తక్షణం దాన్ని తుక్కు కింద పక్కన పెట్టాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ దానిలో గ్యాస్ నింపకూడదు. గడువు తేదీఎలా తెలుసుకోవాలి..? ఫలానా సంవత్సరం, ఫలానా నెలలో సిలిండర్ పరీక్షలకు వెళ్లాల్సి ఉందన్న సంకేతాన్ని సిలిండర్‌పై గుర్తించడం చాలా సులభం. సిలిండర్‌పై ఉన్న మెటల్ ప్లేట్లలో ఒకదానిపై లోపలివైపు ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు మీ ఇంట్లో సిలిండర్‌పై ఏ17 అని ఉందనుకోండి అదే ఎక్స్‌పయిరీ తేదీ అని గుర్తించాలి. 19 అంకె 2019 సంవత్సరాన్ని, అంగ్ల అక్షరం –ఎ మొదటి త్రైమాసికం అని అర్థం. అంటే 2019 మార్చిలోపు ఈ సిలిండర్ గడువు తేదీ ముగుస్తుంది. నెలను ఇలా గుర్తించాలి. ఎ– ( జనవరి నుంచి మార్చి) బి– (ఏప్రిల్ నుంచి జూన్) సి– (జులై నుంచి డిసెంబర్) మూడు నెలల గ్రేస్ పిరియడ్ ప్రతీ సిలిండర్‌పై ఉన్న గడువు తర్వాత మరో మూడు నెలలు గ్రేస్ పిరియడ్ ఉంటుంది. అంటే వినియోగదారుని దగ్గరకు వెళ్లిన సిలిండర్ తిరిగి డీలర్ వద్దకు చేరి అక్కడి నుంచి గ్యాస్ రీఫిల్లింగ్ స్టేషన్‌కు చేరుకునేందుకు వీలుగా ఈ గ్రేస్ పీరియడ్. అంతేగానీ కస్టమర్ వాడుకునేందుకుకాదు. అంటే ఏ–2019 గడువుతో ఉన్న సిలిండర్‌ను మార్చి నెల తర్వాత గ్యాస్ డీలర్ మీకు పంపిస్తే ఎట్టి పరిస్థితిల్లోనూ దీన్ని తీసుకోవద్దు. మరో సిలిండర్ కోరే హక్కు వినియోగదారుడికి ఉంది. కొంత మంది డీలర్లు గడువు తేదీని పెయింట్‌తో మార్చుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. వాటిని గమనించాలి. వినియోగదారుడి హక్కులు ♦ గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యుల పేరిట ఆకనెక్షన్‌ను మార్చుకోవచ్చు. ♦ బుక్ చేసిన ఏడు పనిదినాల్లోపు సిలిండర్‌ను కస్టమర్‌కు అందివ్వాలి ♦ కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే అదే రోజు కనెక్షన్ జారీ చేయాలి. ♦ కొత్తగా కనెక్షన్ తీసుకునే సమయంలో డీలర్ స్టవ్‌ను కూడా తీసుకోవమని అడుగుతుంటాడు. కానీ నిబంధనల ప్రకారం డీలర్ దగ్గరే స్టవ్ తీసుకోవాల్సిన అవసరంలేదు. ♦ వంటగ్యాస్‌ను వాహనాల కోసం వినియోగించడం చట్టరీత్యానేరం. దీనికి బదులు ఆటోగ్యాస్ కోనుగోలు చేసి వాడుకోవాలి. -
ఐఓసీ ఎల్పీజీ ప్రాజెక్ట్‌లో బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు చేరిక
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొ(ఐఓసీ) చేపట్టిన భారీ ఎల్పీజీ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లో బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు కూడా చేతులు కలుపుతున్నాయి. గుజరాత్‌లోని కాండ్లా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వరకూ 2,757 కిమీ ఈ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌ను రూ.9,000 కోట్ల పెట్టుబడులతో ఐఓసీ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో చెరో 25 శాతం వాటా తీసుకోనున్నట్లు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలు వెల్లడించాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ఈ మూడు కంపెనీల జాయింట్‌వెంచర్ కానున్నది. 3 రాష్ట్రాలు...22 ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కాండ్లా వద్ద ఎల్పీజీని దిగుమతి చేసుకుంటారు. పశ్చిమ తీర ప్రాంతంలో కొన్ని రిఫైనరీల నుంచి కూడా ఎల్పీజీని తీసుకుంటారు. ఆ తర్వాత దీనిని అహ్మదాబాద్, ఉజ్జయిని, భోపాల్, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, లక్నోలకు పైప్‌లైన్ ద్వారా సరఫరా చేస్తారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లోని ఈ మూడు కంపెనీలకు చెందిన 22 ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లకు ఈ పైప్‌లైన్‌ను అనుసంధానం చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కారణంగా రోడ్డు రవాణా వ్యయాలు కలసిరావడమే కాకుండా, భద్రత పరంగా కూడా మెరుగైనదని నిపుణులంటున్నారు. ఈ పైప్‌లైన్ ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఎల్పీజీని సరఫరా చేస్తుంది. దేశంలో ఇదే అతి పొడవైన ఎల్పీజీ పైప్‌లైన్ ప్రాజెక్ట్ కానున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శంఖుస్థాపన చేశారు. నాలుగేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని అంచనా. ప్రస్తుతం గెయిల్ కంపెనీ గుజరాత్‌లోని జామ్ నగర్ నుంచి న్యూఢిల్లీ సమీపంలోని లోని వరకూ 1,415 కిమీ. ఎల్పీజీ పైప్‌లైన్‌ను నిర్వహిస్తోంది. ఈ పైప్‌లైన్ ద్వారా ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల ఎల్పీజీని సరఫరా చేస్తోంది. -
సబ్సిడీ సిలిండర్‌పై రూ.5.91 కోత
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు ఎల్పీజీ వినియోగదారులకు మరోసారి ఊరటనిచ్చాయి. సబ్సిడీ ఉన్న సిలిండర్‌పై రూ.5.91, సబ్సిడీలేని సిలిండర్‌పై రూ.120.50 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ధరల తగ్గుదల నేపథ్యంలో ఢిల్లీలో 14.2 కేజీల బరువున్న సబ్సిడీ సిలిండర్ రూ.494.99కు, సబ్సిడీలేని సిలిండర్ రూ.689కు అందుబాటులోకి రానుంది. ఈ తగ్గింపు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధనం ధరల్లో తగ్గుదలతో పాటు రూపాయి మారకం విలువ బలపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. -
త్యాగాలు కాంగ్రెస్‌వి..భోగాలు కేసీఆర్‌వి..
సాక్షి,బొమ్మలరామారం : అమరుల ఆత్మ బలిదానాలు, సోనియాగాంధీ చలువతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తుందని డీసీసీ అధ్యక్షుడు బూఢిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో గురువారం జరిగిన గడపగడపకు కాంగ్రెస్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. షామీర్పేట్ చెరువును రిజర్వాయర్‌గా మార్చి బొమ్మలరామారం మండలానికి సాగు నీరు అందిస్తామన్నారు. కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్ రూం ఇళ్లు సంగతి దేవుడెరుగు బాత్ రూం బిల్లులే రావడం లేదన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని, వారి కుటుంభాలకు ముడెకరాల భూ పంపిణీ చేస్తామని మోసం చేసిన కేసీఆర్ దళిత ద్రోహి అన్నారు. ఆలేరు అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో ఏక కాలంలో వ్యవసాయ రుణాలను మాఫీ చేశారన్నారు. రేషన్ కార్డు గల కుటుంబానికి 6 ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు ప్రతి వ్యక్తికి ఏడు కిలోల సన్నబియ్యం ఇస్తామన్నారు. ఐదు లక్షలవ్యయంతో ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు 3 వేల జీవన భృతి అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మోకు మధుసూదన్ రెడ్డి, కట్టా శ్రీకాంత్‌గౌడ్, మర్రి ఆగం రెడ్డి, రామిడి జంగారెడ్డి, బోగ వెంకటేష్, మాందాల రామస్వామి, బండ వెంకటేష్, మోటే గట్టయ్య, మహదేవుని రాజు, మోటే వెంకటేష్, రాజు నాయక్, గుర్రాల సత్తిరెడ్డి, బోయిన్పల్లి రమేష్, శ్రీరాములు నాయక్, బాసారం బాబు,మోహన్ నాయక్, జూపల్లి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెలు
‘నిప్పురవ్వలు పడి మీ బట్టలు కాలిపోయాయి.. క్షమించండంటూ ఇస్త్రీ వాలాల వేడుకోలు, కరెంటు లేదు బట్టలు ఇస్త్రీ చేయడం కుదరలేదనే సమాధానాలను దుస్తులను ఇస్త్రీకి ఇచ్చినప్పుడు మనం నిత్యం వింటూ ఉంటాం. అయితే ఈ సమస్యలేమీ లేకుండా ఇస్త్రీ వాలాలకు ఓ కొత్త పరిష్కారం దొరికింది. అంతేకాదు బొగ్గులతో ఇస్త్రీ చేయడం వల్ల వచ్చే శ్వాసకోశ సంబంధ వ్యాధులూ దూరం కానున్నాయి. కరెంటు, బొగ్గులతో వాడే ఇస్త్రీ పెట్టెలకు ప్రత్యామ్నాయంగా ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అందుబాటులోకి తెచ్చింది. ఇవి ఇస్త్రీ వాలాలకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. 5 కేజీల సిలిండర్‌ను ఉపయోగించి 1,100 దుస్తులు, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల సిలిండర్‌తో 4,500 దుస్తులు ఇస్త్రీ చేయొచ్చు. అయితే ఇప్పటివరకు ఉపయోగిస్తున్న ఇస్త్రీ పెట్టెల కంటే ఇవి కాస్త ఖరీదైనవి. రూ.2,500 నుంచి రూ.7,000 మధ్య వీటి ధర ఉంటుంది. సాధారణ పెట్టెలు ఆరు కేజీల బరువు ఉంటే ఇవి ఆరున్నర కేజీల బరువు ఉంటాయి. పుణే కేంద్రంగా ఉన్న ఓ కంపెనీ వీటిని సరఫరా చేస్తోంది. ఇప్పటికే కేరళ, మహారాష్ట్రలలో వీటిని వినియోగిస్తున్నారు. సిలిండర్ నుంచి పైప్‌ను గ్యాస్ స్టౌవ్‌కు ఎలా అమరుస్తామో ఇస్త్రీ పెట్టెకు కూడా అలాగే గ్యాస్ పైప్‌ను అమరుస్తారు. ఇస్త్రీ పెట్టె వేడిని నియంత్రించేందుకు రెగ్యులేటర్ ఉంటుంది. ఇస్త్రీ పెట్టె లోపలి భాగంలో ఇంధనం మండినా ఇస్త్రీ చేసే వ్యక్తికి ఎలాంటి ప్రమాదమూ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు తయారీదారులు. -
ఇక ‘కుకింగ్’ సబ్సిడీ..!
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న ఎల్పీజీ సబ్సిడీ స్థానంలో కుకింగ్ సబ్సిడీని ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను నీతి ఆయోగ్ పరిశీలిస్తోంది. పైపుల ద్వారా సహజవాయువును వినియోగించేవారు, వంట కోసం బయో ఇంధనాలను వినియోగించే వారికీ సబ్సిడీ ప్రయోజనాలను విస్తరించాలనే ఆలోచనే ఈ ప్రతిపాదనకు ప్రాతిపదిక అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. వంట కోసం వినియోగించే అన్ని ఇంధనాలకు సబ్సిడీ ప్రయోజనాలు వర్తించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎల్పీజీ వినియోగదారులకే సబ్సిడీ అందుతున్న విషయం తెలిసిందే. ‘‘వంటకు వినియోగించే అన్ని ఇంధనాలకు సబ్సిడీ వర్తించాలి. ఎందుకంటే కొన్ని పట్టణాల్లో పైపుల ద్వారా సహజ వాయువు సరఫరా జరుగుతోంది. అందుకే సబ్సిడీని వారికి కూడా అందించడమే సరైనది’’ అని కుమార్ పేర్కొన్నారు. సబ్సిడీని కేవలం ఎల్పీజీకే పరిమితం చేయడం అన్నది చౌక ఇంధనాలు, గ్రామీణ ప్రాంతాల్లో బయో ఇంధనాలు, పట్టణాల్లో పీఎన్జీ (పైపుల ద్వారా సహజవాయువు) వినియోగాన్ని నిరుత్సాహపరిచే చర్యగా వస్తున్న అభిప్రాయాల నేపథ్యంలో కుమార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. కుకింగ్ సబ్సిడీ ప్రతిపాదన ‘నేషనల్ ఎనర్జీ పాలసీ 2030’ ముసాయిదాతో వెల్లడైంది. గత వారమే దీన్ని ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇది కేబినెట్ పరిశీలనకు వెళ్లనుంది. చైనా–అమెరికా మధ్య వాణిజ్య ఘర్షణలతో ఎదురయ్యే ప్రభావాన్ని తట్టుకునేందుకు సన్నద్ధమైనట్టు తెలిపారు. స్థూల ఆర్థిక అంశాలు పటిష్టంగా ఉన్నాయని, ప్రైవేటు పెట్టుబడులు కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ 7–7.5 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధ్యమేనన్నారు. ఆమర్థ్యసేన్ క్షేత్ర స్థాయికి వెళ్లి చూడాలి... ప్రముఖ ఆర్థిక వేత్త ఆమర్థ్యసేన్ కొంత కాలం పాటు దేశంలో ఉండి మోదీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలను పరిశీలించాలని రాజీవ్ కుమార్ సూచించారు. మోదీ సర్కారు పనితీరును ఆమర్త్యసేన్ తప్పుబట్టిన నేపథ్యంలో కుమార్ ఇలా స్పందించడం గమనార్హం. ‘‘ప్రొఫెసర్ ఆమర్థ్యసేన్ కొంత సమయాన్ని భారత్‌లో వెచ్చించి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరుకుంటున్నాను. ఆ విధమైన ప్రకటనలు చేసే ముందు గడిచిన నాలుగేళ్లలో మోదీ సర్కారు చేపట్టిన పనులను సమీక్షించాలి’’ అని కుమార్ పేర్కొన్నారు. -
ప్రేమ్‌చంద్ కథకు ‘ఉజ్వల’ లింకేమిటో?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తన వినూత్న ఉజ్వల పథకం విజయ ప్రస్థానం గురించి దేశ పేద మహిళల ముందు ప్రస్థావిస్తూ ‘పిట్ట’ కథకు బదులుగా ప్రముఖ హిందీ రచయిత ప్రేమ్‌చంద్ రాసిన ‘ఈద్గా’ చిన్న కథ గురించి వివరంగా చెప్పారు. అందులో హమీద్ అనే చిన్న కుర్రాడు చేగోడీలో, పకోడీలో కొనుక్కోకుండా దాచుకున్న తన జేబు డబ్బును తన నానమ్మ రొట్టెలు కాలుస్తున్నప్పుడు చేతులు కాల్చుకోకుండా ఉండేందుకుగాను పటకారు కొంటాడు. ‘నానమ్మ చేతులు కాల్చుకోకుండా ఓ చిన్న కుర్రవాడు చేసినప్పుడు ఈ దేశ ప్రధానిగా ఉన్న నేను ఈ మహిళలకు ఎందుకు చేయలేను’ అన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ వినూత్న ఉజ్వల పథకమని మోదీ సగర్వంగా చెప్పుకోవడమే కాకుండా ముచ్చటగా మురిసిపోయారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో రెండు దశాబ్దాల క్రితమే పేదలకు సబ్సిడీ ఎల్పీజీ స్కీమ్‌ను అమలు చేశారు. తమిళనాడులో 2007లో అప్పటి డీఎంకే ప్రభుత్వం ఎల్పీజీ కనెక్షన్లను, గ్యాస్ స్టవ్‌లను ఉచితంగా అందజేసింది. కేంద్రంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా పేద మహిళలకు సబ్సిడీలపై ఎల్పీజీ కనెక్షన్లను అందజేసింది. ఈ స్కీమ్లకే మన ప్రధాని నరేంద్ర మోదీ ‘ఉజ్వల’గా పేరు మార్చి అమలు చేశారు. ఉత్తరాదిలో చాలా చోట్ల ఇప్పటికే సిలిండర్లు, గ్యాస్ స్టవ్‌లు అటకెక్కగా, కొన్ని చోట్ల సిలిండర్లు పక్కింటికి, స్టవ్‌లు అంగడికి వెళ్లాయి. ఉచితంగా దొరికే వంట చెరకు బదులుగా నెలకు ఐదారు వందల రూపాయలను గ్యాస్ సిలిండర్‌కు ఎందుకు ఖర్చు చేయాలన్న ఆలోచనే అందుకు కారణం. నరేంద్ర మోదీ మాత్రం తాను ‘ఈద్గా’ కథ నుంచి స్ఫూర్తి పొంది ఉజ్వల పథకాన్ని అమలు చేసినట్లు చెబుతున్నారు. ఈ కథను చదువుతున్నప్పుడు ఎవరైనా హమీద్‌కు తన నానమ్మ అమీనా పట్ల ఉన్న అంతులేని అభిమానాన్ని అనుభూతి పొందుతాము. నరేంద్ర మోదీ ఉజ్వల లబ్ధిదారులతో మాట్లాడిన సంభాషణ వింటే మనకు ఎలాంటి అనుభూతి కలగదు. పైగా అర్థరహితంగా కనిపిస్తుంది. ఒడిశాలోని మయూర్భంజ్ నుంచి సుశ్మిత... ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడుతూ ‘ఇంతకుముందు వర్షాకాలంలో వర్షాలు పడ్డప్పడల్లా పొయ్యిలోకి నీళ్లు వచ్చేటివి. పొయ్యి వెలిగేది కాదు. పిల్లలు పస్తులుండేది. ఇక ఆ బాధ ఉండదని అనుకుంటా!’ అని వ్యాఖ్యానించారు. ‘కొత్త స్టవ్ వచ్చిన సందర్భంగా పిల్లలకు నీవు కొత్త వంటకాలు ఏమైనా చేసి పెడుతున్నావా? లేక అదే కట్టెల పొయ్యి మీద చేసినట్లుగా లావు, లావు రొట్టెలు చేసి పెడుతున్నావా?’ అని మోదీ ప్రశ్నించారు. మయూర్భంజ్ ప్రాంతంలో ఎక్కువగా అన్నమే తింటారని, రొట్టెలు చేసుకోరన్న విషయం మన ప్రియతమ ప్రధానికి తెలియదు పాపం! ‘నీవు ఏం బాగా చేస్తావు? నీ పిల్లలకు ఏది ఎక్కువ ఇష్టం? వారికి ఏది చేసి పెడతావు?’ అని కూడా సుశ్మితాను మోదీ ప్రశ్నించారు. అందుకు ఆమె ‘మ్యాగీ’ అంటూ సమాధానమిచ్చారు. నిజంగా మ్యాగి చేస్తారా? అంటూ మోదీ ఆశ్చర్యపోతూ మనల్నీ ఆశ్చర్యంలో పడేశారు. మోదీ మరో లబ్ధిదారు మీనాతో మాట్లాడుతూ ‘ మీ ఇరుగుపొరుగున ధనవంతులున్నారు. వారికి అందమైన ఇళ్లు ఉన్నాయి. కార్లు ఉన్నాయి. స్కూటర్లూ ఉన్నాయి. అన్నింటికన్నా ముందు గ్యాస్ స్టవ్‌లు ఉన్నాయి. మీకు ఇంతకాలం గ్యాస్ స్టవ్ లేదు.....మాకే గ్యాస్ స్టవ్ ఉందంటూ ఇంతకాలం రొమ్ము విరుచుకుని తిరిగాంగానీ ఇప్పుడు ఈ మోదీ వచ్చి ఓ పేదకు గ్యాస్ స్టవ్ ఇచ్చారు. ఇక మమ్మల్ని చూసి ఔరా! అనే వారే ఉండరని వారంటారుగదా!’ అన్న వ్యాఖ్యల్లో ఎవరికి తోచిన అర్థాలు వారు వెతుక్కోవచ్చు! -
మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర
-
మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర
ఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. సుమారు రూ.4.50 పెరగటంతో ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర రూ.495.69 కాగా, సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.742 అయింది. సరాసరి పెట్రోలియం ధర, ఫారిన్ ఎక్స్ఛేంజ్ రేట్‌ను బట్టి నెలవారీగా పెట్రోలియం మంత్రిత్వశాఖ గ్యాస్ ధరలను నిర్ణయిస్తోంది. ఈ మేరకు గత మే 30వ తేదీ నుంచి నెలకు రూ.4 చొప్పున 19 సార్లు పెరిగి సిలిండర్‌పై రూ.76.51 వరకు చేరుకుంది. దేశంలో సబ్సిడీ వంటగ్యాస్ వినియోగదారులు 18.11 కోట్ల మంది, ప్రధాన్‌మంత్రి ఉజ్వల యోజన కింద ఏడాదిలో ఇచ్చిన మూడు కోట్ల సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లతోపాటు సబ్సిడీయేతర వంటగ్యాస్ వినియోగదారులు 2.66 కోట్ల మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి వినియోగదారుడు 14.2కిలోల గ్యాస్ సిలిండర్లను ఏడాదిలో 12వరకు సబ్సిడీపై వాడుకునే వీలుంటుంది. ఆ తర్వాత వాడుకోవాలంటే మాత్రం సబ్సిడీ వర్తించదు. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ నిబంధనలు కూడా ఉండవు. వంటగ్యాస్‌కు సబ్సిడీయే ఉండదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. -
బండ మళ్లీ బరువెక్కింది..!
-
బండ మళ్లీ బరువెక్కింది..!
సాక్షి, న్యూఢిల్లీ : గృహ అవసరాల కోసం వినియోగించే గ్యాస్‌పై రూ. 1.50, విమాన ఇంధనంపై 6 శాతం ధరలను పెంచుతున్నట్లు ఇంధన దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది. అంతర్జాతీయ ఇంధన ధరల ప్రకారమే ధరల్లో మార్పులు చేస్తున్నట్ల ఐఓసీ తెలిపింది. కొత్తగా పెరిగిన ఇంధన ధరల ప్రకారం ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ఢిల్లీలో కిలో లీటర్‌కు రూ.53,045కు చేరింది. గతంలో ఇది రూ.50,020గా ఉండేది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు దిగివస్తున్నా.. విమాన ఇంధనధరలు పెరగడం వరుసగా ఇది మూడోసారి. ఇక గృహ అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ గ్యాస్ ధర రూ.1.50 పెరిగింది. గ్యాస్‌పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే క్రమంలో గ్యాస్ ధరలను ప్రతినెలా కేంద్రం పెంచుతూ వస్తోంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకూ గ్యాస్ ధరలు.. రూ. 69.50 పెరిగాయి. -
భారీగా పడిపోయిన ఇంధన డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా ఇంధన డిమాండ్ భారీగా పడిపోయింది. 14 ఏళ్లలో అత్యంత కనిష్ట స్థాయిలకు ఈ డిమాండ్ క్షీణించి, ఆగస్టు నెలలో 6.1 శాతాన్ని నమోదుచేసింది. పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించడంతతో, డీజిల్, గ్యాసోలిన్ డిమాండ్ భారీగా క్షీణించింది. దేశంలో వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఆయిల్ కన్జ్యూమర్‌గా పేరున్న భారత్ ఈ ఆగస్టు నెలలో 15.75 మిలియన్ టన్నులను మాత్రమే వినియోగించుకుంది. గతేడాది ఇదే నెలలో 16.78 మిలియన్ టన్నులుగా ఉందని ఆయిల్ మంత్రిత్వశాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ పేర్కొంది. 2003 ఏప్రిల్ నుంచి ఇదే అత్యంత కనిష్ట స్థాయిలు. ఈ ఏడాదిలో ఇంధన డిమాండ్ పడిపోవడం ఇది రెండో సారి. జనవరిలో కూడా వినియోగం 5.9 శాతానికి క్షీణించింది. డీజిల్ డిమాండ్ కూడా 3.7 శాతం పడిపోయి, 5.9 మిలియన్ టన్నులుగా ఉంది. అదేవిధంగా పెట్రోల్ విక్రయం కూడా 0.8 శాతం తక్కువగా 2.19 మిలియన్ టన్నులుగా నమోదైంది. అయితే ఎల్పీజీ అమ్మకాలు మాత్రం 11.8 శాతం పెరిగి 2.06 మిలియన్ టన్నులుగా రికార్డయ్యాయి. కిరోసిన్ వాడకం 41 శాతం పైగా తగ్గింది. -
మళ్లీ పెరిగిన సిలిండర్ ధర
న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారుడిపై మళ్లీ గ్యాస్ ‘బండ’ భారం పడింది. క్రమంగా వంట గ్యాస్ సబ్సిడీ ఎత్తివేసే పథకాన్ని మరింత వేగవంతం చేసిన కంపెనీలు మరోసారి ధరలను సమీక్షించాయి. ప్రతి నెలా ధరల పెంపు నిర్ణయంలో భాగంగా ఎల్పీజీ సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి. శుక్రవారం ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం నాన్-సబ్సిడీ సిలిండర్ ధర రూ.73.5 , సబ్సిడీ సిలిండర్ రూ. 7 ల మేర పెరగనుంది. ఏవియేషన్ టర్భైన్ ఫ్యూయల్ (ఎటీఎఫ్) ను 4శాతం పెంచింది. అలాగే, ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా అమ్మిన కిరోసిన్ ధరను కూడా లీటరుకు 25 పైసలు చొప్పున పెంచింది. దేశంలోని అతి పెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం, దీంతో 14.2 కేజీల ఎల్పీజీ సబ్సిడీ సిలిండర్ 487.18గా ఉండనుంది. నాన్- సబ్సిడీ సిలిండర్ ధర రూ. 597.50 గా ఉండనుంది. అయితే గత సంవత్సరం జూలై నుంచి రూ .2 చొప్పున నెలకొల్పిన పాలసీ అమలులో సబ్సిడైజ్డ్ ఎల్పీజీ రేట్లు సిలిండర్‌కు 68 రూపాయల మేరకు పెరిగాయి. జూన్ నెలలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ .419.18 వద్ద ఉంది. ప్రతి నెల సిలిండర్‌పై 4 రూపాయల చొప్పున పెంచుతూ పూర్తిగా సబ్సిడీనీ ఎత్తివేయాలని ప్రభుత్వానికి చెందిన చమురు కంపెనీలను ప్రభుత్వం కోరింది. చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 31 న లోక్‌సభలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
గ్యాస్ సబ్సిడీపై జీఎస్టీ ‘బండ’
న్యూడిల్లీ: జీఎస్టీ ప్రభావంతో సామాన్యుల నెత్తిన ‘బండ’ పడింది. వస్తు, సేవల పన్ను ప్రభావంతో వంట గ్యాస్‌పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ గణనీయంగా తగ్గనుందని తెలుస్తోంది. వంట గ్యాస్ వినియోగదారులు ఇక నుంచి గ్యాస్ సిలిండర్‌పై ప్రతినెల రూ. 32 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఇకపై రూ.107మాత్రమే సబ్సిడీ రానుందని అఖిల భారత జాతీయ ఎల్పీజీ పంపిణీదారులు ఫెడరేషన్ కార్యదర్శి విపుల్ పురోహిత్ చెప్పారు. ఫలితంగా జూలై నుంచి ప్రతి వంట గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్‌కు 32 రూపాయల వరకు భారం పడనుంది. దీంతోపాటు కొత్త కనెక్షన్లు తీసుకునే వినియోగదారులు రెండు సంవత్సరాల మాండేటరీ ఇన్స్పెక్షన్, ఇన్స్టాలేషన్, అడ్మినిస్ట్రేటివ్ చార్జీలనున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక సెకండ్ సిలిండర్‌కు కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వీటిని 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావడంతో వినియోగదారుల నెత్తిన భారం తప్పేలా కనిపించడం లేదు. జీఎస్టీ ప్రకారం ఎల్పీజీ 5 శాతం పన్ను పరిధిలో ఉంది. గతంలో ఢిల్లీ తదితర కొన్ని రాష్ట్రాలు దీనిపై పన్ను విధించకపోవడంతో వ్యాట్ 2 శాతం నుంచి 4 శాతం మధ్య ఉండేది. ప్రస్తుతం జీఎస్టీ అమలుతో సిలిండర్ ధర రూ.12-15 వరకు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు జీఎస్టీ కారణంగా ప్రభుత్వం ఇచ్చే రాయితీ కూడా తగ్గనుంది. ఇప్పటి వరకు రూ.119.85 పైసలు రాయితీ ఇస్తుండగా జీఎస్టీ తర్వాత బుక్ చేసుకున్న వారి ఖాతాలో రూ.107 మాత్రమే పడనుంది. మొత్తంగా చూసుకుంటే ఒక్కో సిలిండర్‌పై వినియోగదారులకు రూ.32 వరకు జీఎస్టీ బండ పడే అవకాశాలు ఖాయం. రవాణా మరియు లాజిస్టిక్స్ వంటి వేరియబుల్ ఖర్చులు కారణంగా ఇతర రాష్ట్రాలలో ధరలలో చిన్న వ్యత్యాసం ఉండనుంది. -
జీఎస్టీతో వంటగ్యాస్ చౌక!
తగ్గనున్న నిత్యావసర వస్తువుల బడ్జెట్ న్యూఢిల్లీ: వంటగ్యాస్ (ఎల్పీజీ), నోట్ పుస్తకాలు, ఇన్సులిన్, అల్యూమినియం ఫాయిల్స్, అగర్బత్తి ఇలా నిత్యావసర వస్తువుల్లో చాలా వాటి ధరలు జీఎస్టీ అమలు కారణంగా జూలై 1 నుంచి చౌకగా లభించనున్నాయి. ఎందుకంటే వీటిపై ప్రస్తుతమున్న వివిధ రకాల పన్నుల కంటే తక్కువ పన్నునే జీఎస్టీ మండలి ఖరారు చేసింది. ఇలా పన్ను తగ్గే వాటిలో పాలపొడి, పెరుగు, మజ్జిగ, బ్రాండ్ పేరు లేని తేనె, డైరీ ఉత్పత్తులు, జున్ను, మసాలా దినుసులు, టీ, గోధుమలు, బియ్యం, గోధుమ, మైదా పిండి, కొబ్బరి నూనె, పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె, ఆవనూనె, పంచదార, చక్కెరతో చేసిన మిఠాయిలు, పాస్తా, నూడుల్స్, పండ్లు, కూరగాయలు, పచ్చళ్లు, మురబ్బా, కెచప్, సాస్‌లు, ఇన్స్టంట్ ఫుడ్ మిక్స్‌లు, మినరల్ వాటర్, ఐస్, సిమెంట్, బొగ్గు, కిరోసిన్ (పీడీఎస్), పళ్ల పొడి, సబ్బులు, ఎక్స్‌రే ఫిల్మ్, మెడికల్ డయాగ్నస్టిక్ కిట్లు ఉన్నాయి. ప్రస్తుతంతో పోలిస్తే జీఎస్టీలో పన్నులు తగ్గే వాటి వివరాలతో కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. అలాగే, డ్రాయింగ్ పుస్తకాలు, సిల్క్, వూలె న్, కాటన్ వస్త్రాలు, రెడీమేడ్ వస్త్రాలు, రూ.500లోపున్న పాద రక్షలు, హెల్మెట్లు, ఎల్పీజీ స్టవ్, కళ్లద్దాలు, చెంచాలు, ఫోర్క్‌లు కూడా ధరలు తగ్గనున్నాయి. -
నేటి నుంచి ఎల్పీజీ డీలర్ల ఆందోళన
కల్లూరు : ఎల్పీజీ డీలర్లు శనివారం నుంచి ఆందోళన చేయనున్నారని ఫెడరేషన్ ఆప్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సరైన తూకం, కంపెనీ సీల్‌తో సిలిండర్‌ను పంపిణీ చేయాలనే డిమాండ్లను నెరవేర్చాలని ఆందోళన చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 5న నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం, 15న నల్ల బ్యాడ్జిలు ధరించడంతోపాటు ఒక రోజు ఇండెంట్ సప్లయ్‌ను నిలిపివేయడం చేస్తామని తెలిపారు. డిసెంబర్ 1వ తేదీన ఒక రోజు పూర్తి కాలం సమ్మె, డిసెంబర్ 15 నుంచి నిరవధి సమ్మె చేస్తామని పేర్కొన్నారు. -
ఎల్పీజీపై కేంద్రం కాకి లెక్కలను కనిపెట్టిన కాగ్
న్యూఢిల్లీ: దేశంలో వంటగ్యాస్ వినియోగదారుల ఎల్పీజీ సిలిండర్ల కనెక్షన్లకు ఆధార్ కార్డును లింక్ చేయడం ద్వారా డూప్లికేట్ కనెక్షన్లను సమూలంగా నిర్మూలించామని, నగదు బదిలీ స్కీమ్‌ను ప్రవేశ పెట్టడం ద్వారా, సంపన్నులు స్వచ్ఛంగా ఎల్పీజీ సబ్సిడీని వదులు కోవడం స్కీమ్‌ను ప్రోత్సహించడం ద్వారా భారత ఖజానాకు 23 వేల కోట్ల రూపాయల సబ్సిడీ భారాన్ని మిగిల్చామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటూ వస్తోంది. ఈ విషయంలో గతవారం కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) పార్లమెంట్‌కు సమర్పించిన నివేదిక ప్రభుత్వ లెక్కల గారఢీని బట్టబయలు చేసింది. ప్రభుత్వం చెబుతున్న 23వేల కోట్ల రూపాయల సబ్సిడీలో 92 శాతం నిధులు అంతర్జాతీయంగా చమురు నిధులు తగ్గడం వల్ల సమకూరినవేనని తేల్చి చెపింది. కేవలం నగదు బదిలీ స్కీమ్ వల్ల ఎనిమిది శాతం నిధులు, అంటే 1,764 కోట్ల రూపాయలు మాత్రమే సమకూరాయని కాగ్ పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదవిలో తాను రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌పీజీల్లో సబ్సిడీల లీకును అరికట్టడం ద్వారా 15 వేల కోట్ల రూపాయల సబ్సిడీ భారాన్ని తగ్గించగలిగామని చెప్పారు. ఈ సబ్సిడీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 12,700 కోట్ల రూపాయలకు మించదని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమనియన్ గత ఏప్రిల్ నెలలోనే తన మీడియా కాలంలో రాయడం ఇక్కడ గమనార్హం. ఒక్క 2015-16 ఆర్థిక సంవత్సరంలోనే 9,211 కోట్ల రూపాయలను ఆదా చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకుంది. వాస్తవానికి ఆ కాలానికి 4.813 కోట్ల రూపాయలు మాత్రమే ఆదా చేయగలిగిందని కాగ్ నివేదిక వెల్లడించింది. నగదు బదిలీ స్కీమ్ ద్వారా మిగలాల్సిన సబ్సిడీ నిధులు ఎక్కడికి పోతున్నాయి? బోగస్ కనెక్షన్లు పూర్తిగా నిర్మూలించామని ప్రభుత్వం చెబుతున్న మాటలు అబద్ధమా? ఇప్పటికీ కొంత మంది వినియోగదారులు బహుళ గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ కాగ్ తన నివేదికలోనే సమాధానాలు ఇచ్చింది. దేశంలోని సగటు ఎల్పీజీ వినియోగదారుడు గతంలో సగటున ఏడాదికి 6.7 సిలిండర్లను వినియోగించుకోగా, ఇప్పుడు ఏడాదికి దాదాపు 11 సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. (ఏడాదికి సబ్సిడీ సిలిండర్లు 12కు మించి ఇవ్వరనే విషయం తెల్సిందే) అంటే అధనపు సిలిండర్లు పక్కదారి పడుతున్నాయనే అంశం అర్థం అవుతోంది. 2014-15 సంవత్సరంలో 3.34 కోట్లు, 2015-16 సంవత్సరంలో 3.56 కోట్ల బోగస్ ఎల్పీజీ కనెక్షన్లను తొలగించామన్న ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో కూడా పొరపాట్లు ఉన్నాయని కాగ్ పేర్కొంది. వీటిలో బోగస్ కనెక్షన్లు ఇప్పటికీ కొనసాగుతుండడమే కాకుండా ఆధార్ కార్డులేని అర్హులైన వినియోగదారులు కూడా ఉన్నారు. బోగస్ కనెక్షన్లు, బహుళ కనెక్షన్లు పూర్తిగా నిర్మూలించేందుకు ఆధార్ కార్డులను లింక్ చేసినప్పటికీ ఒకే ఆధార్ కార్డు నెంబర్‌పై పలు కనెక్షన్లు ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని కాగ్ పేర్కొంది. ఇలాంటి బోగస్ కనెక్షన్లు దాదాపు 50 శాతం కొనసాగుతుండగా, వారిలో 20 శాతం మంది ఇప్పటికీ సబ్సిడీలు పొందుతున్నారని తెలిపింది. దీనికి కారణం దేశంలోని ఎల్పీజీ వినియోగదారుల డేటా బేస్ సరిగ్గా లేకపోవడమేనని చెప్పింది. నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల కనెక్షన్లు 34 శాతం పెరిగాయంటూ కేంద్రం చెబుతున్న లెక్కలు కరెక్టేనని, వాటిలో మెజారిటీ వినియోగదారులు ఈ కనెక్షన్లను కమర్షియల్ పర్పసే వాడుతున్నారని, దానివల్ల ప్రభుత్వానికి నష్టమే వాటిల్లుతోందని కాగ్ వెల్లడించింది. -
పుష్కర భక్తులకు మిల్లర్ల ఉచిత భోజనం
సాక్షి, అమరావతి : పుష్కరాల్లో భక్తులకు భోజనాలు ఏర్పాటుకు మిల్లర్లు ముందుకు వచ్చారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. గుంటూరులో శనివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. అమరావతిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు రోజుకు 12 వేలమందికి ఐదు కూరలు, రెండు స్వీట్లతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నీరు, విద్యుత్తు, షెడ్డు, వంటగ్యాస్ వంటి సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఇప్పటికే 1.36 లక్షల మందికి భోజనాలు, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు సరఫరాకు దాతలు ముందుకు వచ్చారని తెలిపారు. -
వంటింటికి మహాభాగ్యం!
* లక్ష ఇళ్లకు గ్యాస్ పైప్‌లైన్ * బీజీఎల్ విస్తరణకు కేంద్రం చర్యలు * కేంద్రమంత్రి ప్రకటనతో చిగురించిన ఆశలు సాక్షి, సిటీబ్యూరో: మహానగరానికి పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించే ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఐదేళ్లుగా సా...గుతున్న పనులు.. కేంద్ర పెట్రోలియం మంత్రి ప్రకటనతో ఆశలు చిగురించాయి. వచ్చే రెండేళ్లలో లక్ష ఇళ్లకు, ఐదేళ్లలో రెండున్నర లక్షల ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. ఇందుకోసం నగరానికి పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థను బలోపేతం చేయనుంది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టును సైతం విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే అదనంగా పైప్లైన్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. వంట గ్యాస్‌తో పాటు సీఎన్జీ స్టేషన్లను కూడా పెంచేందుకు చర్యలు చేపట్టింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పైప్‌లైన్ పనులపై బీజీఎల్ ప్రతినిధులతో చర్చించారు. మరోమారు క్షేత్ర స్థాయి పరిశీలన కోసం కేంద్ర మంత్రి నగరానికి రానున్నారు. ఐదేళ్లుగా నత్తనడకనే.. హైదరాబాద్‌లో ఇంటింటికి పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ) అందించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ‘భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్’ (బీజీఎల్) సంస్థ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు పనులు ఐదేళ్లుగా ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి 2011 నవంబర్ 21న సిటీ ప్రాజెక్టుకు బీజీఎల్ శ్రీకారం చుట్టింది. ఐదేళ్లలో 2.66 లక్షల కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్, 50 స్టేషన్ల ద్వారా సీఎన్జీ గ్యాస్ అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొదటి విడతగా 2014 ఏప్రిల్ నాటికి లక్ష కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. అయితే, ఇప్పటికి కేవలం 1140 ఇళ్లకు మాత్రమే సరఫరా చేసింది. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ పీఎన్జీ, సీఎన్జీ విస్తరణ కోసం రూపొందించిన ప్రణాళిక కూడా కాగితాలకే పరిమితమైంది. ఐదేళ్లలో శామీర్‌పేట నుంచి కుత్బుల్లాపూర్ వరకు 33 కిలో మీటర్ల పనులు మాత్రమే జరిగాయి. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లిహిల్స్ ప్రాంతాలకు సైతం పైప్‌లైన్ నిర్మాణ పనులు పడకేశాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడంతో పనుల్లో కదలికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎన్జీ అంతంతే.. భాగ్యనగరాన్ని పూర్తి స్థాయిలో సీఎన్జీ అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ సైతం ఆచరణకు నోచుకోలేదు. శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను నిర్మించి సీఎన్జీని అందుబాటులో తెచ్చినా.. డిమాండ్‌కు తగ్గట్టు గ్రిడ్ నుంచి గ్యాస్ సరఫరా లేదు. వాస్తవంగా నగరంలో ప్రజా రవాణకు వినియోగించే 85 వేల ఆటోలు, 7,500 బస్సులు, 20 వేలకు పైగా టాక్సీలు ఉన్నాయి. వీటికి రోజుకు సగటున 7,62,500 కిలోల (1.067 ఎస్‌సీఎండీ) సీఎన్జీ అవసరం ఉంటుందని బీజీఎల్ అంచనా వేసింది. అందుకు అనుగుణంగా సరఫరా చేయాలని సంస్థ సిద్ధమైంది. ప్రాజెక్టు ప్రారంభించిన తొలిదశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ తదితర డి పోలకు చెందిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే, కొద్ది రోజులు 164 బస్సులకు సరఫరా చేసి, ప్రస్తుతం 110 బస్సులకే పరిమితమైంది. నగరంలో మొత్తం 20 సీఎన్జీ స్టేషన్లు ఉండగా, అందులో ఆర్టీసీకి 3, ప్రయివేటు వాహనాల కోసం 17 ఉన్నాయి. వీటిలో రెండింటిని బీజీఎల్ సంస్థ నిర్వహిస్తోంది. ప్రస్తుతం నగరంలో సీఎన్జీ వాహనాలు 23 వేలకు మించి లేవు. ఢిల్లీలో మాత్రం 10 లక్షల వాహనాలు ఉన్నాయి. నగరంలో సైతం అదే స్థాయిలో విస్తరించేందుకు మరిన్ని సీఎన్జీ బంకులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
ఆ చర్యతో కేంద్రానికి 21,000 కోట్ల మిగులు!
న్యూఢిల్లీ: ఎల్పీజీ సబ్సిడీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ప్రస్తుత విధానం ద్వారా గత రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఖజానాకు రూ. 21,000 కోట్ల మిగులుబాటు నమోదైంది. ఈ విషయాన్ని బుధవారం స్వయంగా ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు. గ్యాస్ సబ్సిడీని నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమచేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2014 నవంబర్‌లో దేశంలో కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించినప్పటకీ 2015 జనవరి నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ విధానం ద్వారా 3.34 కోట్ల నకిలీ లబ్దిదారులకు సబ్సిడీ ఫలాలను అందకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరంలో 14,672 కోట్లు, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 7,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు మిగిలిందని ఢిల్లీలో సబ్సిడీలపై నిర్వహించిన ఓ సదస్సులో మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 2015-16లో సేవింగ్స్ తగ్గడానికి కారణం ప్రపంచ మార్కెట్లో చమురు ధర తక్కువగా ఉంటమేనని ఆయన తెలిపారు. -
18 టన్నుల గ్యాస్‌ను 19 గంటల్లో...
బెర్హంపూర్(ఒడిశా): బోల్తా పడిన ట్యాంకర్ నుంచి హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్‌పీ) సిబ్బంది లిక్వీఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ)ను సురక్షితంగా తరలించారు. ఒడిశాలోని గంజామ్ జిల్లాలోని ఛత్రపుత్ టౌన్ సమీపంలో శనివారం రాత్రి ఎల్పీజీని తరలిస్తున్న ట్యాంకర్ బొల్తా పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. అయితే గ్యాస్ లీక్ అయితే పెను ప్రమాదం సంభవించి ఉండేది. ట్యాంకర్‌లోని గ్యాస్‌ను మరో మూడు ట్యాకర్లలోకి జాగ్రత్తగా పైపుల సహాయంతో తరలించారు. విశాఖపట్నం, జత్నాయికి చెందిన 10 మంది సభ్యులతో కూడిన టీం 18 టన్నుల గ్యాస్‌ను ట్రాన్స్ఫర్ చేసే మిషన్‌ను 19 గంటల్లో విజయవంతంగా పూర్తి చేశారు. పని పూర్తి అవ్వగానే ఎన్‌హెచ్9 హైవేతోపాటూ, కరెంటు సప్లైని కూడా పునరుద్ధరించారు. ప్రమాదం జరిగిన వెంటనే గ్యాస్ లీక్ వల్ల ప్రమాదం సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రహదారులు, కరెంటు సప్లైతోపాటూ దగ్గర్లోని స్కూళ్లు, కాలేజీలను మూసివేసిన విషయం తెలిసిందే. -
రిలయన్స్ ఎల్పీజీ విక్రయ అనుమతులు పొడిగింపు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉత్పత్తి చేసే ద్రవీకృత గ్యాస్ (ఎల్పీజీ)లో 1.2 లక్షల టన్నుల పరిమాణాన్ని ప్రైవేట్ వంట గ్యాస్ మార్కెటింగ్ సంస్థలకు విక్రయించుకునేందుకు ఇచ్చిన అనుమతుల గడువును వచ్చే ఏడాది మార్చి 31 దాకా ప్రభుత్వం పొడిగించింది. ఇందుకు సంబంధించి చమురు శాఖ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఈ గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. అయితే, ప్రస్తుత ఆదేశాలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు పరిగణించవచ్చని చమురు శాఖ పేర్కొంది. దేశీయంగా వంటగ్యాస్‌కి కొరత ఉన్నందున ఎల్పీజీ కంట్రోల్ ఆర్డర్ కింద స్థానికంగా ఉత్పత్తి చేసే వంట గ్యాస్‌ను తప్పనిసరిగా ప్రభుత్వ రంగ రిటైలింగ్ సంస్థలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు మార్కెట్ రేటును ఇవ్వడం లేదంటూ.. సమాంతర మార్కెటింగ్ పథకం (పీఎంఎస్) కింద ప్రైవేట్ కంపెనీలకు ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ ఎల్పీజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విక్రయిస్తోంది. ఈ తరహా రిటైలింగ్‌ను ఆపేయాలంటూ గతేడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశించగా.. దాన్ని ఆర్ఐఎల్ సవాలు చేసింది. -
వెలగని దీపం!
పాలమూరు : దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు దీపం పథకం ద్వారా ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించాలన్న సర్కారులక్ష్యం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. కనెక్షన్లు మంజూరై రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు ఏ ఒక్కరికీ గ్యాస్ అందకపోవడం గమనార్హం. గత ఏప్రిల్‌లో నియోజకవర్గానికి ఐదువేల చొప్పున జిల్లాలోని 14 నియోజకవర్గాలకు 70వేల కనెక్షన్లను ప్రభుత్వం మంజూరుచేసింది. దరఖాస్తులు స్వీకరించి మూడునెలలైనా అర్హుల జాబితా ఇంతవరకు ఖరారుకాలేదు. కలెక్టర్ చైర్మన్‌గా ప్రత్యేకకమిటీ లబ్ధిదారులను ఎంపికచేస్తుంది. మండలస్థాయిలో ఆ బాధ్యతను ఎంపీడీఓలకు కట్టబెట్టారు. గ్రామస్థాయిలో వచ్చిన దరఖాస్తులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలన్న నిబంధనలకు స్వస్తి పలికారు. స్థానిక అధికార పార్టీ నాయకుల సిఫార్సులు, సర్పంచ్ల జాబితా మేరకు ఎంపీడీఓలు లబ్ధిదారుల తుదిజాబితా రూపకల్పనలో జాప్యం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జిల్లా అధికార యంత్రాంగానికి జాబితా చేరలేదు. గ్రామాల నుంచి వచ్చిన వాటిని ఆధార్ ప్రామాణికంగా డేటాఎంట్రీ పూర్తిచేసి జిల్లా పౌరసరఫరాల కార్యాలయానికి పంపించాల్సి ఉంది. జిల్లాలో ఏ మండలంలో కూడా జాబితా రూపకల్పన మొదలుపెట్టకపోగా గ్రామసభల ద్వారా ఎంపికచేసిన జాబితా కూడా చేరలేదని తెలుస్తోంది. కొలిక్కిరాని పంపిణీ ప్రక్రియ జిల్లాలో సమగ్రకుటుంబ సర్వే ప్రకారం 9.85లక్షల కుటుంబాలు ఉన్నాయి. అందులో 5.21లక్షల గ్యాస్కనెక్షన్లు ఉండగా 4.64లక్షల కుటుంబాలకు కనెక్షన్లు లేవని తేలింది. ప్రభుత్వం మంజూరుచేసిన 70వేల కనెక్షన్లకు 1.80లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో మహిళా సంఘాలకు ప్రాధాన్యమిస్తూ 25శాతం ఎస్సీలు, 16శాతం ఎస్టీలు, మైనార్టీలకు గ్యాస్కనెక్షన్ అందించాలని నిర్ణయించారు. సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము ఒక్కో కనెక్షన్‌కు రూ.1600చొప్పున మొత్తం 70వేల కనెక్షన్లకు రూ.11.20కోట్లు అందజేసింది. మే నెలలో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ నిర్ణీత గడువు దాటినా పంపిణీ ఓ కొలిక్కిరాలేదు. లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్కనెక్షన్లు జారీచేసి ఖాళీ సిలిండర్‌తో పాటు రెగ్యులేటర్ ఇస్తారు. నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, గతంలో ప్రభుత్వం నుంచి దీపం పథకం ద్వారా లబ్ధిపొందని వారు, గ్యాస్కనెక్షన్ తీసుకునేందుకు డబ్బు వెచ్చించలేని నిరుపేదలు ఈ పథకానికి అర్హులు. గ్రామసభల ద్వారా ఎంపికచేసిన లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ ఆమోదించి ఆ తరువాత జిల్లా మంత్రికి నివేదించిన తరువాతే కనె క్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం మేల్కోవాల్సి ఉంది. ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మండలస్థాయిలో కొనసాగుతోంది. మండలాల వారీగా తుది జాబితాను జిల్లాకు పంపుతారు. వాటిని జిల్లా కమిటీ ద్వారా స్క్రీనింగ్ చేసి అర్హులకు గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు చర్యలు చేపడతాం. - లక్ష్మినారాయణ, ఇన్చార్జి, డీఎస్ఓ -
త్వరలో బెంగళూరుకు ‘పీఎన్జీ’
బెంగళూరు:ఇంటింటికి పైపు ద్వారా వంటగ్యాస్ (పైప్ న్యాచులర్ గ్యాస్-పీఎన్జీ)ను సరఫరా చేసే పథకానికి త్వరలో బెంగళూరులో శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ వెల్లడించారు. గ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులు కోవడానికి ఉద్దేశించబడిన గివిటప్(ుజజీఠ్ఛిజ్టీఠఞ) కార్యక్రమాన్ని ఆయన బెంగళూరులో శనివారం ప్రారంభించి, మాట్లాడారు. సిలెండర్లలో వంట గ్యా స్ను సరఫరా చేయడంతో పోలిస్తే పీఎన్జీ అత్యంత భద్రతతో కూడుకున్నదే కాక, చౌకైనది కూడా అని పేర్కొన్నారు. పీఎన్జీ అమలుతో బినామీ రూపంలో సబ్సిడీ గ్యాస్‌ను పొందుతున్న వారి ఆటలు సాగవని అన్నారు. బెంగళూరు తర్వాత ఈ విధానాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలకూ విస్తరిస్తామని చెప్పారు. దీని వల్ల ఏడాదికి రూ.3వేల కోట్ల గ్యాస్ సబ్సిడీ నిధులు ఆదా అవుతాయని ఆయన వివరించారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపునకు స్పందించి ఎంతోమంది సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు గివిటప్‌కు మద్దతు పలికారన్నారు. ఒక్క కర్ణాటక నుంచే ఇప్పటి వరకూ 20 వేల మంది మార్కెట్ రేటుకే గ్యాస్‌ను కొనుగోలు చేస్తామని ముందుకు వచ్చారన్నారు. ఇందులో 15 వేల మంది ఒక్క బెంగళూరులో ఉన్నట్లు తెలిపారు. వీరిలో బహుభాషనటి మాలాశ్రీ, దర్శకుడు రాజేంద్రసింగ్ బాబు తదితరులు ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులందరూ గివిటప్‌కు మద్దతు పలుకుతారని తెలిపారు. ఇక రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్గుండూరావ్తోపాటు రోషన్‌బేగ్ తదితర మంత్రులు ఇప్పటికే తాము గివిటప్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం పంపించారని కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు తెలిపారు. కాగా, కర్ణాటకలో మొదటిసారిగా గివిటప్‌కు మద్దతు పలికిన కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ భార్య తేజశ్విని అనంతకుమార్‌ను ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. గివిటప్‌కు మార్గాలు ఇవి... మైక్రోసైట్స్... కడLPG.in, giveitup.in Ððl»Œæ-OòÜr$Ï...www.ebharatgas.com, www.indane.co.in , www.hpgas.com ఆయా గ్యాస్ కంపెనీ వినియోగదారులు తాము ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫోన్ ద్వారా ఎస్ఎమ్మెఎస్ రూపంలో గివిట్ అప్‌లో సభ్యులుగా చేరవచ్చు. {పత్యేక దరఖాస్తు ఫారం కూడా అందుబాటులో ఉంది. -
‘ఉన్నతం‘గా వదులుకునేలా చేయండి
గ్యాస్ సబ్సిడీ వదులుకునేలా ఉన్నతవర్గాల్లో ప్రచారం చేయాలి మరింతమంది పేదలకు అందేలా అవగాహన కల్పించాలి రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియంశాఖ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ‘ఉన్నతవర్గాలూ గ్యాస్ సబ్సిడీ ని వదులుకోండి..జాతి నిర్మాణానికి సహకరించండి’ అనే ప్రచారాన్ని విస్తృతం చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఉన్నతవర్గాలు వదులుకునే సబ్సిడీతో మరింతమంది పేదలకు ఎల్పీజీని అందించే అవకాశం ఉంటుందని, దీనిద్వారా దీర్ఘకాలంలో పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలతో కూడిన లేఖను పంపింది. దేశంలో 36 శాతం కుటుంబాలు ఇప్పటికీ వంటచెరుకు, పిడకలపై ఆధారపడి వంట చేసుకుంటున్నాయని, దీనివల్ల ఇంట్లో పొగచూరడంతో పిల్లలు, మహిళలు కాలుష్యం బారినపడుతున్నారని పేర్కొంది. ప్రతి ఏటా సబ్సిడీ సిలిండర్ ద్వారా రూ.6 వేల రాయితీని ప్రభుత్వం అందిస్తోందని, ఉన్నతవర్గాలు దీన్ని వదులుకునేందుకు ముందుకువస్తే ఆర్థికంగా వెనుకబడిన మరింతమందికి గ్యాస్ సిలిండర్ అందే అవకాశం ఉంటుందని తెలిపింది. ఎల్పీజీ సబ్సిడీని వదులకునే విధానాన్ని సైతం ప్రభుత్వం సరళీకృతం చేసిందని, సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి... లేదా డిస్ట్రిబ్యూటర్లకు తెలిపైనా సబ్సిడీని వదులుకోవచ్చని పేర్కొంది. పొగవచ్చే పొయ్యిలతో వంట చేసుకుంటున్న పేద ప్రజల సంక్షేమం, జాతి నిర్మాణం కోసం ఉన్నతవర్గాలు స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకునేలా ప్రచారం చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. -
ఇంధన సబ్సిడీలకు 22,000 కోట్లు కావాలి..
ఆర్థిక మంత్రిత్వ శాఖకు పెట్రోలియం శాఖ లేఖ న్యూఢిల్లీ: వంటగ్యాస్, కిరోసిన్ సబ్సిడీల కారణంగా వాటిల్లుతున్న ఆదాయ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) ద్వితీయార్ధంలో రూ.22,201 కోట్లు ఇవ్వాల్సిందిగా చమురు శాఖ కోరుతోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లకు సబ్సిడీల భారంపై పరిహారం కింద రూ.17,000 కోట్లను చెల్లించింది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఓఎంసీల ఆదాయ నష్టాల్లో(రూ.51,110 కోట్లు) ఈ మొత్తం మూడో వంతు మాత్రమే. కాగా, ప్రభుత్వరంగ చమురు ఉత్పత్తి(అప్‌స్ట్రీమ్ ఆయిల్) కంపెనీలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా(ఓఐఎల్)లు రూ.31,926 కోట్లను భరించాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర బ్యారెల్ 50 డాలర్ల దిగువకు పడిపోయిన నేపథ్యంలో ద్వితీయార్ధంలో అప్‌స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలు ఓఎంసీలకు ఆదాయ నష్టాల కింద ఎలాంటి చెల్లింపులూ జరపాల్సిన అవసరం లేదని కూడా పెట్రోలియం శాఖ పేర్కొంది. ఆర్థిక శాఖకు రాసిన లేఖలో ఈ వివరాలను తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత 2014-15 ఏడాదిలో ఓఎంసీలకు ఆదాయ నష్టాలు(మార్కెట్ రేటు కంటే తక్కువకు ఇంధనాలను విక్రయించడం కారణంగా) రూ.74,773 కోట్లుగా అంచనా.


