
దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.51.50 తగ్గించాయి. కొత్త ధరలు రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగిస్తాయి. ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచే ఈ ధరలు అమల్లోకి వస్తాయి. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు ప్రాంతాల వారీగా కింది విధంగా ఉన్నాయి.
ఢిల్లీ: రూ.1,580
కోల్‌కతా: రూ.1,683
ముంబై: రూ.1,531
చెన్నై: రూ.1,737.5
2025 ఏప్రిల్-జులై మధ్య 19 కిలోల ఎల్‌పీజీ ధరలు ఢిల్లీలో రూ.138, కోల్‌కతాలో రూ.144, ముంబైలో రూ.139, చెన్నైలో రూ.141.5 తగ్గాయి. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర ఏప్రిల్ 8, 2025న రూ.50 పెరిగినప్పటి నుంచి మార్పు చేయలేదు. ప్రస్తుత ధరలు ఢిల్లీలో రూ.853, కోల్‌కతాలో రూ.879, ముంబైలో రూ.852.50, చెన్నైలో రూ.868.50గా ఉంది.
ఇదీ చదవండి: మరో బీమా సంస్థ సూపర్ టాపప్ ప్లాన్.. తీసుకోవచ్చా?