శీతల గాలులతో సిటీ గజగజ వణుకుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్ ప్రభావంతో చలి తీవ్రత పెరిగింది.
ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అత్యల్పంగా నమోదయ్యాయి. ఉదయం నుంచీ రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంది.
రాజేంద్రనగర్, హయత్‌నగర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, కుషాయిగూడ, బంజారాహిల్స్ ప్రాంతాల్లో చలి ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఉదయం 8 గంటల సమయంలో ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల లోపే నమోదు కావడంతో రోడ్లపై జనం రద్దీ బాగా తగ్గింది. మధ్యాహ్నం సైతం ఇదే పరిస్థితి నెలకొంది.


